Andrew Tye
-
T20 World Cup 2024: అరుదైన క్లబ్లో చేరిన ఆసీస్ బౌలర్
ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా అరుదైన క్లబ్లో చేరాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జంపా.. టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. జంపా ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 28 ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు ఆండ్రూ టై టీ20ల్లో 300 వికెట్ల మార్కును అధిగమించాడు. టై 2014-24 మధ్యలో 332 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టై 15వ స్థానంలో ఉన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 3 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 301 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో (625) అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ (576), సునీల్ నరైన్ (552), ఇమ్రాన్ తాహిర్ (502) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత బౌలర్ చహల్ (354) 11వ స్థానంలో.. పియూశ్ చావ్లా (315) 22, అశ్విన్ (310) 25వ స్థానంలో కొనసాగుతున్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ20 కెరీర్లో 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. తాజామ్యాచ్తో రషీద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు. ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. No player has reached 300 T20 wickets faster than Andrew Tye 👏 pic.twitter.com/DMEpXNHOQB — 7Cricket (@7Cricket) February 4, 2023 చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ GAME OVER. WHAT A GAME.@ScorchersBBL are BBL champions!#BBL12 pic.twitter.com/wfcVqfYpZc — 7Cricket (@7Cricket) February 4, 2023 -
కేఎల్ రాహుల్ జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్..
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానంలో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై తో లక్నో సూపర్ జెయింట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో భాగంగా రూ.7.5కోట్లకు వుడ్‌ను లక్నో కొనుగోలు చేసింది. అయితే వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో వుడ్ గాయపడ్డాడు. దీంతో విండీస్‌తో టెస్టులకు,ఐపీఎల్‌కు వుడ్ దూరమయ్యాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో కోటి రూపాయల కనీస ధరతో టై తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడు పోకుండా మిగిలిపోయాడు. ఇప్పడు అతడిని కనీస ధర కోటి రూపాయలకే లక్నో కొనుగోలు చేసింది. ఇక 2018 లో పంజాబ్ కింగ్స్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) కు ప్రాతినిధ్యం వహించిన టై.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 27 మ్యాచ్‌లు ఆడిన టై.. 40 వికెట్ల పడగొట్టాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ మార్చి 28 న గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! Hope AJ Tye repeat this same performance in his debut match for LSG😉💙 Bowling figure : 4-0-17-5 ER : 4.25#AbApniBaariHai | #IPL2022 #LucknowSuperGiants@LucknowIPL @aj191 pic.twitter.com/npPCjMeLkM — Lucknow Super Giants FC (@LucknowFC) March 23, 2022 Ab apni baari hai, kyuki humari team mein Andrew Tye bhaari hai! #AbApniBaariHai 💪@aj191 📸: Cricket Australia#LucknowSuperGiants #TataIPL #IPL2022 #UttarPradesh #Lucknow #LSG2022 #CricketUpdates #CricketNews pic.twitter.com/KNiL0oyO3m — Lucknow Super Giants (@LucknowIPL) March 23, 2022 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఢిల్లీ క్యాపిటిల్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే నోర్జే స్ధానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టైను తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటిల్స్ యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం. అతడితో పాటు ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్, భారత పేసర్ ఇషాంత్ శర్మ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటకీ డిసీ యాజమాన్యం మాత్రం టై వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 27 మ్యాచ్‌లు ఆడిన టై.. 40 వికెట్ల పడగొట్టాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా టై అద్భుతంగా రాణించాడు. కాగా టై బాల్తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఇక ఐపీల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టు: రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్కోటి, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్ చదవండి: తన చివరి మ్యాచ్ గురించి ముందే చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు.. శ్రీశాంత్ ఆవేదన -
IPL 2022: రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్, దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన అతడు ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. దీంతో రూ. 6.5 కోట్లు వెచ్చించి అతడిని రిటైన్ చేసుకున్న ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక గత సీజన్లో 8 ఇన్నింగ్స్ ఆడి 12 వికెట్లు పడగొట్టిన ఈ స్టార్ బౌలర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్న అంశంపై ఓ లుక్కేద్దాం! 1. లాహిరు కుమార శ్రీలంక పేసర్ లాహిర్ కుమార 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఫ్రాంఛైజీలు అతడి పట్ల ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరఫున 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కుమార.. 23 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టీమిండియాతో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 1, 2, 2 వికెట్లు తీసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌తో ఢిల్లీ నోర్జే స్థానాన్ని భర్తీ చేయవచ్చు. 2. ధవళ్ కులకర్ణి టీమిండియా పేసర్ ధవళ్ కులకర్ణికి ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. 2012 నుంచి ఈ మెగా టోర్నీలో భాగమైన అతడు ఇప్పటి వరకు మొత్తంగా 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. సగటు 28.76. ధవళ్ను కూడా నోర్జేని రీప్లేస్ చేయగల ఆటగాళ్లలో ఒకడిగా భావించవచ్చు. 3. ఇషాంత్ శర్మ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈసారి మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో ఒకడు. గత సీజన్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన ఇషాంత్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం కలిసి వచ్చే అంశం. ఐపీఎల్లో ఇప్పటి వరకు 93 మ్యాచ్‌లు ఆడిన అతడు 73 వికెట్లు పడగొట్టాడు. వేలంలో కనీస ధర 1.5 కోట్లుగా నమోదు చేసుకున్న ఈ అనువభజ్ఞుడైన పేసర్‌ను జట్టులోకి తీసుకుంటే ఢిల్లీకి ఉపయుక్తంగా ఉంటుందనేది విశ్లేషకుల భావన. 4. కేన్ రిచర్డ్సన్ ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్కు నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిచర్డ్సన్ 37 వికెట్లు పడగొట్టాడు. ఇక క్యాష్‌రిచ్ లీగ్ ఐపీఎల్ విషయానికొస్తే... ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడు. కనీస ధర 1.5 కోట్లుగా నమోదు చేసుకున్న రిచర్డ్సన్ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. 5. ఆండ్రూ టై ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ఐపీఎల్ మెగా వేలం-2022లో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఐపీఎల్లో 27 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు పడగొట్టిన ఈ పేసర్.. ఢిల్లీ జట్టులో నోర్జే స్థానాన్ని భర్తీ చేయగలడు. చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని షాక్ తగిలింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై బౌలింగ్ చేసే సమయంలో రెండు బంతులను బ్యాట్స్‌మన్ నడుముపైకి విసిరాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతులు బ్యాట్స్‌మన్ పైకి విసిరితే బీమర్ అని పిలుస్తారు. అయితే బీమర్ అనేది క్రికెట్లో ప్రమాదకరంగా ఉండడంతో దానిని నిషేధించారు. దీంతో ఒక బౌలర్ ఒక ఓవర్లో రెండు కంటే ఎక్కువ బీమర్లు వేస్తే అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధించొచ్చు. ఆండ్రూ టై అదే తప్పు చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్ వేశాడు. మరుసటి బంతిని వైడ్ వేయగా.. ఆ తర్వాత బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్లు టైను అడ్డుకొని బౌలింగ్ వేయకుండా నివారించారు. ప్రస్తుతం ఆండ్రూ టై బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు, జాసన్ సాంగా 46 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొలిన్ మున్రో 64 పరుగులు నాటౌట్‌తో రాణించినప్పటికి మిగిలినవారు విఫలమయ్యారు. Two dangerous no-balls, and he's out. Here's why AJ Tye finished the innings with 1.3 completed overs to his name...@KFCAustralia | #BBL11 pic.twitter.com/nuTs6XF3LI — KFC Big Bash League (@BBL) December 28, 2021 -
రాజస్థాన్ రాయల్స్‌లోకి టీ 20 నెం.1 బౌలర్..
జైపూర్: వచ్చేనెలలో జరిగే ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ కు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ 20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచ్‌లకు తబ్రాజ్ షమ్సీ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బుధవారం ప్రకటించింది. 2017 లో ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా తరఫున తబ్రాజ్ షమ్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. షమ్సీ 39 టీ20 మ్యాచుల్లో 45 వికెట్లు పడగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా ఎదిగాడు. 2016 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తబ్రాజ్ షమ్సీ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కి దూరమైన జోస్ బట్లర్ స్దానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్థాన్ తీసుకుంది. చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. 🪄 Magic. Shamsi. Pink. 💗 The world's No.1 T20I bowler will represent the Royals in UAE. 🇦🇪#IPL2021 | #HallaBol | #RoyalsFamily | @shamsi90 pic.twitter.com/TDGIaW9gNJ — Rajasthan Royals (@rajasthanroyals) August 25, 2021 -
ఇంత ఖర్చుతో ఐపీఎల్ అవసరమా?: రాజస్థాన్ ఆటగాడు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న తరుణంలో ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, ప్రభుత్వాలు, కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాయని, ఇది సమంజసమేనా? అని ఐపీఎల్‌ను వీడిన ఆసీస్ ఆటగాడు ఆండ్రూ టై ప్రశ్నించాడు. ఆసుపత్రుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్-2021 సీజన్‌ను కొనసాగించడం తనకు ఆమోదయోగ్యంగా అనిపించలేదన్నాడు. అయితే ఈ మెగా టోర్నీ నిర్వహణ విషయంలో ఇతరుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, కానీ అందరూ ఒకేలా ఆలోచిస్తారని మాత్రం అనుకోవడం లేదన్నాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆండ్రూ టై లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ఇద్దరు ఆసీస్ ప్లేయర్స్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ కూడా ఇంటిదారి పట్టారు. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రూ టై ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆటగాళ్ల భద్రతా కోణంలో ప్రస్తుతానికి మేమంతా సేఫ్‌గానే ఉన్నాం. ఇది ఇలానే కొనసాగుతుందా? అలాగే భారత్‌లో రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకని కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వాలు వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తున్నాయి.?, మేము ఐపీఎల్ ఆడటం సరైనదేనా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అందుకనే తాను ఐపీఎల్‌ను వీడినట్లు టై తెలిపాడు. క్రీడలతో ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని తనకు తెలుసని, ముఖ్యంగా ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలకు అదెంతో మేలు చేస్తుందనే కోణంలో ఐపీఎల్‌ను కొససాగిస్తూ ఉండవచ్చని, కానీ అంతా ఇదే అభిప్రాయంతో ఉంటారని తాను అనుకోవడం లేదని టై పేర్కొన్నాడు. -
పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి!
మెల్బోర్న్: సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఏప్రిల్ అంటే పెళ్లిళ్ల మాసం. కొద్ది రోజుల క్రితమే క్రికెట్ సీజన్ ముగియడంతో పాటు వాతావరణం మారిపోయి చలిగాలులు పెరగక ముందే పెళ్లి చేసుకునేందుకు వారు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇప్పుడు కోవిడ్–19 కారణంగా ఆ ప్రణాళికలన్నీ తలకిందులవుతున్నాయి. జాతీయ జట్టుకు ఆడుతున్న వారు, బోర్డు కాంట్రాక్ట్ ఉన్నవారిని చూస్తే ఎనిమిది మంది క్రికెటర్లు ఏప్రిల్‌లో పెళ్లికి సిద్ధపడ్డారు. ఆడమ్ జంపా, ఆండ్రూ టై, డార్సీ షార్ట్, స్వెప్సన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. పెళ్లికి కూడా ఐదుగురుకు మించి హాజరు కారాదు. వధూవరులతో పాటు ఇద్దరు సాక్షులు, పెళ్లి జరిపించే పాస్టర్ మాత్రమే ఉండాలి. దాంతో భారీగా వివాహం తలపెట్టినవారంతా వాయిదాలు వేసుకుంటున్నారు. మరో ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్లు కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ల పరిస్థితి ఇందుకు భిన్నం. వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థాలు జరుపుకోగా, ఇంకా పెళ్లి తేదీలు నిర్ణయించుకోలేదు. కమిన్స్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. అతను పెళ్లి చేసుకోబోయే బెకీ బోస్టన్ ఇంగ్లండ్‌కు చెందిన అమ్మాయి. ఇప్పుడు కరోనా వల్ల ఇంగ్లండ్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఏ రోజుకారోజు వారి క్షేమ సమాచారం తెలుసుకోవడమే సరిపోతుందని, ఈ సమయంలో ఇంకా పెళ్లెలా జరుగుతుందని కమిన్స్ వాపోయాడు. మరోవైపు కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతుండటంతో కమిన్స్ బాధ రెట్టింపయ్యేలా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విలువకు (రూ. 15.5 కోట్లు) అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పుడు లీగ్ జరగకపోతే ఇంత భారీ మొత్తం అతను కోల్పోయినట్లే. -
ఐపీఎల్: ఆ ఘనత సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్
సాక్షి, పుణె : ఐపీఎల్ అంటేనే రికార్డులకు కేరాఫ్ ఆడ్రస్.. హీరోలు జీరోలవుతారు.. అనామక క్రికెటర్లు కింగ్‌లు అయిన సందర్బాలు కోకొల్లలు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ ఒక చక్కటి వేదిక అని దేశవిదేశీ ఆటగాళ్లు భావిస్తుంటారు. తాజాగా అంతగా గుర్తింపు పొందని ఆస్ట్రేలియా క్రికెటర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఆసీస్ హేమాహేమీలతో సాధ్యం కానిది 31 ఏళ్ల ఆండ్రూ టై సాధించాడు. తాజా సీజన్లో కింగ్స్ పంజాబ్ తరపున ఆడిన టై.. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్న తొలి ఆసీస్ బౌలర్‌గా ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ల జాబితాలో ఆండ్రూ టై(24) రెండో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013) కోనసాగుతున్నాడు. అయితే ఆ సీజన్లో డ్వేన్ బ్వేవో 32 వికెట్లు సాధించి ఆగ్రస్థానంలో ఉండటంతో ఫాల్కనర్ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆండ్రూ టై 24 వికెట్లతో అదరగొట్టినప్పటికీ కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకోలేకపోయింది. ఇంకా చదవండి: ‘టాప్’లేపారు.. కానీ! -
జూలు విదిల్చిన పొలార్డ్.. పంజాబ్‌కు భారీ లక్ష్యం
ముంబై : ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ జూలు విదిల్చాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. ఈ ఆల్‌రౌండర్‌కు తోడుగా కృనాల్ పాండ్యా రాణించడంతో ముంబై, పంజాబ్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. అయితే ఆండ్రూ టై, ఓపెనర్ ఎవిన్ లూయిస్(9)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్.. దాటిగా ఆడాడు. దీంతో 5 ఓవర్లకు ముంబై 50 పరుగులు పూర్తి చేసింది. మరోసారి టై విజృంభించడంతో జోరు మీదున్న ఇషాన్ కిషాన్(20 : 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్(27: 15 బంతుల్లో 3 ఫోర్, 2 సిక్స్‌లు)లు వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో ముంబై ఇండియన్స్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే రోహిత్ శర్మ(6) సైతం పెవిలియన్ చేరాడు. ఆదుకున్న కృనాల్- పొలార్డ్ ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన పోలార్డ్, కృనాల్ పాండ్యాలు ఆచితూచి ఆడుతూ.. ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలిస్తూ.. స్కోర్ బోర్డ్ పరుగెత్తించారు. 65 పరుగులు భాగస్వామ్యం అనంతరం రాజ్‌పుత్ బౌలింగ్‌లో కృనాల్(32: 23 బంతుల్లో,1 ఫోర్,1 సిక్స్) అనవసర షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పోలార్డ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక పొలార్డ్‌కు ఈ సీజన్లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పోలార్డ్ 50( 23బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫించ్‌కు చిక్కాడు. ఆ వెంటనే కటింగ్ (4), హార్దిక్ పాండ్యా(9) సైతం పెవిలియన్ చేరారు. చివర్లో మెక్లీగన్ (11 నాటౌట్), మయాంక్ మార్కండే (7 నాటౌట్)లుగా నిలవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆండ్రూ టై మరోసారి (4/16) చెలరేగగా.. అశ్విన్(2/18), రాజ్‌పుత్, స్టోయినిస్‌లు తలో వికెట్ తీశారు. -
ఆండ్రూ టై విజృంభణ
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై విజృంభించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కీలక వికెట్లను కోల్పోయింది. ఇప్పటికీ రెండు ఓవర్లు మాత్రమే వేసిన టై 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. టై.. తొలి ఓవర్లో ముంబై ఓపెనర్ ఎవిన్ లూయిస్(9)ను క్లీన్ బౌల్డ్ చేయగా.. రెండో ఓవర్లో వరుస బంతుల్లో జోరు మీదున్న ఇషాన్ కిషాన్(20), సూర్యకుమార్ యాదవ్(27)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై ఇండియన్స్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ సీజన్లో 23 వికెట్లతో టై బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
దుఃఖాన్ని దిగమింగుకొని వికెట్లు తీశాడు
జైపూర్ : ఆకస్మాత్తుగా ఏదైనా చెడు వార్త వింటేనే తట్టుకోలేము.. ఇక అది మన కుటుంబ సభ్యుల గురించైతే..ఆ బాధ వర్ణనాతీతం. కానీ కింగ్స్ పంజాబ్ ఆటగాడు, ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై దుఃఖాన్ని దిగమింగుకోని రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు.ఈ మ్యాచ్‌లో ఆడటమే కాదు నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రూ టై నానమ్మ మరణించినట్లు మంగళవారం అతనికి కబురందింది. కానీ ఆటపట్ల శ్రద్దతో ఏ మాత్రం కుంగుబాటుకు లోనుకానీ టై అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన టై తన నానమ్మ మరణించిన విషయాన్ని తెలిపాడు. ‘ మా నానమ్మ ఇక లేరు. ఈ ప్రదర్శనను ఆమెతో నాకుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నాను. ఇది నాకు భావోద్వేగపూరితమైన మ్యాచ్. నా జీవితంలో చాలా కఠినమైన రోజు. నేనెప్పుడు క్రికెట్‌ను ఇష్టపడుతాను. మా జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తారు. కొన్నిసార్లు విఫలం అవుతారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. కొత్త బంతి మాకు అనుకూలించింది.’ అని వ్యాఖ్యానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత గౌతమ్‌ను ఔట్ చేసిన టై చివరి ఓవర్లో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, ఉనద్కత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రాజస్తాన్ 158 పరుగుల సాధారణ లక్ష్యమే నమోదు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ మినహా పంజాబ్ బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో రాజస్తాన్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అదృష్టమంటే ఆండ్రూదే..5 వికెట్లకు 7 కోట్లు!
-
ఐపీఎల్ వేలం: అదృష్టమంటే ఆండ్రూ టైదే!
బెంగళూరు: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టైని అదృష్టం వరించిందనే చెప్పాలి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చెలరేగిపోయిన ఆండ్రూ టై.. ఐపీఎల్-11 వేలంలో రూ. 7. 2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఆండ్రూ టై కనీస ధర రూ. 1 కోటి ఉండగా, అతనికి భారీ మొత్తం చెల్లించి కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. అయితే ఇంగ్లండ్‌తో ఐదో వన్డేలో ఐదు వికెట్లను సాధించిన తర్వాత ఆండ్రూ టై ఐపీఎల్ వేలానికి రావడం విశేషం. దాంతో ఆండ్రూ టై ఐదు వికెట్లకు ఏడు కోట్లు దక్కాయంటూ క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. గత కొంతకాలంగా పెద్దగా ఆకట్టుకోని టై.. ఐపీఎల్ వేలానికి ముందే ఫామ్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించిన టై.. అంతముందు రెండు వన్డేలు ఆడి కనీసం వికెట్ కూడా సాధించలేదు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో చివరి రెండు వన్డేల్లో ఎనిమిది వికెట్లు సాధించడమే అతనికి అత్యధిక మొత్తం పలకడానికి ప్రధాన కారణం. మరొకవైపు గతేడాది రూ. 12 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లిష్ పేసర్ తైమాల్ మిల్స్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2017లో ఆర్సీబీ తరపున మిల్స్ ఆడిన సంగతి తెలిసిందే. -
ఆండ్రూ టై అవుట్
రాజ్ కోట్: ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ తో అబ్బూరపర్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, గుజరాత్ లయన్స్ పేసర్ ఆండ్రూ టై గాయంతో టోర్ని నుంచి నిష్క్రమించాడు. శనివారం ముంబైతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్ లో బౌండరీ ఆపే ప్రయత్నంలో గాయపడ్డ టై మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు. భుజ గాయం తీవ్రం కావడంతో ఐపీఎల్ నుంచి నిష్ర్కమించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ సీజన్ లో ఆడిన ఆరంభ మ్యాచ్ లో టై హ్యాట్రిక్ తో రైజింగ్ పుణే పై 5-17 ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. 6 మ్యాచ్ లు ఆడిన టై 12 వికెట్లు పడగొట్టి బౌరర్ల లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టై నిష్క్రమణతో గుజరాత్ లయన్స్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బ తగిలింది. 'భుజానికి గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. గాయం తీవ్రత గురించి ఇప్పటికి తెలియలేదు. రెండు, మూడు రోజుల్లో మా ఇంటికి వెళ్తాను. నా గాయం మానడానికి చాలా సమయం పడుతుందని అనుకోవడం లేదు. త్వరగా కోలుకుంటానని అని టై గాయంపై స్పందించాడు. ఐపీఎల్ లో గడిపిన క్షణాలు మధురమైనవి, గుజరాత్ అభిమానులు చూపించిన అభిమానం మర్చిపోలేనిదని, ఈ అవకాశం ఇచ్చిన ప్రాంచైజీకి, అభిమానులకు ధన్యవాదాలు అని వచ్చే ఎడాది జరిగే ఐపీఎల్ సీజన్ లో పాల్గొంటానని టై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక టై నిష్క్రమణ మాకు తీరని లోటు, టై త్వరగా కోలుకోవాలని గుజారాత్ లయన్స్ జట్టు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. -
నా ఫస్ట్ లవ్ అదే: హ్యాట్రిక్ హీరో అండ్రూ!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలిమ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించి సత్తా చాటాడు ఆస్ట్రేలియా మీడియం పేసర్ అండ్రూ టై.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 17 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు వరుసగా అంకిత్ శర్మ, మనోజ్ తివారి, శార్దుల్ ఠాకూర్లను అవుట్ చేసి.. అండ్రూ టై హ్యాట్రిక్ సాధించాడు. అతని ధాటికి పుణెపై గుజరాత్ లయన్స్ జట్టు మంచి విజయాన్ని అందుకుంది. అయితే, పొట్టి ఫార్మెట్ టీ-20లలో హ్యాట్రిక్ సాధించినప్పటికీ తనకు టెస్టు క్రికెట్ అంటేనే ఇష్టమని, అదే తన ఫస్ట్ లవ్ అని మ్యాచ్ తర్వాత అండ్రూ టై చెప్పాడు. 'ఇది (టీ20) క్రికెట్లో మంచి ఫార్మెటే. కానీ సంప్రదాయంగా టెస్టు క్రికెట్ ఆడటమే నాకు ఇష్టం. స్లోవర్ బాల్ పిచ్ చాలా బాగా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిచ్‌లు వేటికవే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని ఎలా బౌలింగ్ చేయాలో అంచనా వేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు' అని 30 ఏళ్ల అతను మీడియాతో చెప్పాడు. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను బద్రీ వణికించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బద్రీ ‘హ్యాట్రిక్’ సాధించడంతో ముంబై తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బద్రీ ధాటికి వరుస బంతుల్లో పార్థివ్ (3), మెక్లీనగన్ (0), రోహిత్ (0) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీశ్ రాణా (11)ను కూడా అవుట్ చేసి బద్రీ తన ఖాతాలో నాలుగో వికెట్‌ను వేసుకున్నాడు. విజయంపై బెంగళూరు ఆశలు పెట్టుకున్న ఈ దశలో పొలార్డ్, కృనాల్ పాండ్యా భాగస్వామ్యం ముంబైకి మళ్లీ ఊపిరి పోసింది. వీరిద్దరు ఫోర్లు, సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. పొలార్డ్ అవుటయ్యాక కృనాల్‌కు హార్దిక్ (9 నాటౌట్) అండగా నిలవడంతో ముంబై 7 బంతులు ఉండగానే గెలిచింది.