ఆండ్రూ టై అవుట్
రాజ్ కోట్: ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ తో అబ్బూరపర్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, గుజరాత్ లయన్స్ పేసర్ ఆండ్రూ టై గాయంతో టోర్ని నుంచి నిష్క్రమించాడు. శనివారం ముంబైతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్ లో బౌండరీ ఆపే ప్రయత్నంలో గాయపడ్డ టై మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు. భుజ గాయం తీవ్రం కావడంతో ఐపీఎల్ నుంచి నిష్ర్కమించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ సీజన్ లో ఆడిన ఆరంభ మ్యాచ్ లో టై హ్యాట్రిక్ తో రైజింగ్ పుణే పై 5-17 ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. 6 మ్యాచ్ లు ఆడిన టై 12 వికెట్లు పడగొట్టి బౌరర్ల లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టై నిష్క్రమణతో గుజరాత్ లయన్స్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బ తగిలింది.
'భుజానికి గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. గాయం తీవ్రత గురించి ఇప్పటికి తెలియలేదు. రెండు, మూడు రోజుల్లో మా ఇంటికి వెళ్తాను. నా గాయం మానడానికి చాలా సమయం పడుతుందని అనుకోవడం లేదు. త్వరగా కోలుకుంటానని అని టై గాయంపై స్పందించాడు. ఐపీఎల్ లో గడిపిన క్షణాలు మధురమైనవి, గుజరాత్ అభిమానులు చూపించిన అభిమానం మర్చిపోలేనిదని, ఈ అవకాశం ఇచ్చిన ప్రాంచైజీకి, అభిమానులకు ధన్యవాదాలు అని వచ్చే ఎడాది జరిగే ఐపీఎల్ సీజన్ లో పాల్గొంటానని టై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక టై నిష్క్రమణ మాకు తీరని లోటు, టై త్వరగా కోలుకోవాలని గుజారాత్ లయన్స్ జట్టు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.