IPL-10
-
దానికోసం నేనేమీ ఏడ్వలేదు: హర్భజన్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కకపోవడం తనను ఎంతమాత్రం నిరాశకు గురి చేయలేదని హర్భజన్ సింగ్ తాజాగా స్పష్టం చేశాడు. అయితే తుది పోరులో తనకు అవకాశం దక్కుతుందని తొలుత ఆశించినట్లు భజ్జీ తెలిపాడు. 'ఫైనల్ మ్యాచ్ లో నాకు ముంబై ఇండియన్స్ సెలక్టర్లు చోటు ఇవ్వకపోవడం నాకేమీ బాధ అనిపించలేదు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. నేను జట్టు మనిషిని. కొన్ని సాంకేతికపరమైన అంశాలు ముడిపడి ఉండటంతోనే లెగ్ స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె జట్టులో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉండటం వల్లే నాకు విశ్రాంతి ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబై కోచ్ మహేలా జయవర్ధనే నాకు చెప్పాడు కూడా. నాకు స్థానం దక్కనందుకు ఎటువంటి బాధలేదు. దానికోసం నేనేమీ ఏడ్వలేదు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 'మీరు తుది జట్టులో ఉంటానని భావించారా?'అన్న ప్రశ్నకు భజ్జీ పై విధంగా సమాధానమిచ్చాడు. -
ముంబై ఇండియన్స్ బెస్ట్.. సన్ రైజర్స్ లాస్ట్!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2017 చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను స్వల్ప స్కోరుకే కట్టడిచేసి విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 117 సిక్సర్లు నమోదు చేసి అగ్రస్థానం ఆక్రమించగా, సన్ రైజర్స్ అట్టడుగున నిలిచింది. ఓవరాల్‌గా అన్ని జట్లు కలిపి 705 సిక్సర్లు సాధించాయి. గతేడాది (638) కంటే 67 సిక్సర్లను ఆటగాళ్లు ఈ సీజన్లో రాబట్టారు. ముంబై తర్వాత 92 సిక్సర్లతో గుజరాత్ లయన్స్, 89 సిక్సర్లతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 88 సిక్సర్లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ 87 సిక్సర్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 87 సిక్సర్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు75 సిక్సర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 70 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్‌లు అత్యధికంగా 26 సిక్సర్లతో సంయుక్తంగా తొలిస్థానం దక్కించుకోగా.. యువ సంచలనం రిషబ్ పంత్ 24 సిక్సర్లు, కీరన్ పోలార్డ్ 22 సిక్సర్లు, రాబిన్ ఉతప్ప 21 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!
-
ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!
ఐపీఎల్-10 ఫైనల్ పోరు ముంబై ఇండియన్స్-రైజింగ్ సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠంగా సాగుతోంది. పుణే విజయానికి 4 బంతుల్లో 7పరుగులు కావాలి. మామూలుగా ఇది సాధ్యమే. కానీ సాధ్యాన్ని అసాధ్యంగా మార్చింది ముంబై. ఒక పరుగు తేడాతో ఐపీఎల్-10 విజేతగా నిలిచింది. ఇందుకు కారణం ముంబై టీం పర్ఫార్మెన్స్ కాదట. 4 బంతులు మిగిలివుండగా ముంబై గెలవాలని కళ్లు మూసుకుని స్టేడియంలో ప్రార్థన చేసిన బామ్మట. ఆమె ప్రార్ధనే ముంబైకు మిరాకిల్ విన్ దక్కేలా చేసిందని ట్వీట్లు హోరెత్తాయి. ఆమెకు 'ప్రేయర్ ఆంటీ' అని పేరు పెట్టేశారు ట్వీటరాటీలు. ఈ ట్వీటర్లో వెల్లువలా వస్తున్న ప్రేయర్ ఆంటీ ట్వీట్లను చూసిన బాలీవుడ్ నటుడు అభిషేక్ కూడా రీట్వీట్ చేశారు. ఏమనో తెలుసా?. ఆమె ఎవరో కాదు ముంబై ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ అమ్మ అని. ఆమెను అందరూ ముద్దుగా 'నాని' అని పిలుస్తారు అని చెప్పారు. దీంతో థ్యాంక్స్ నాని మీ వల్లే ముంబై ఇంత ఘనవిజయం సాధించిందని నెటిజన్లు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. -
అతను మ్యాజిక్ చేస్తాడని తెలుసు: సచిన్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఫైనల్లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. ఒకనొక దశలో 71/1 తో పటిష్టంగా కనిపించిన రైజింగ్ పుణెను ముంబై కట్టడి చేసి టైటిల్ ను ఎగురేసుకుపోయింది. ఈ టైటిల్ సాధించడంలో ముంబై ఇండియన్స్ పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా, మిచెల్ జాన్సన్ లు తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి పుణెకు గట్టి షాక్ తగిలింది. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో పుణె 30 పరుగులు చేయాల్సిన తరుణంలో మలింగాకు బంతి ఇచ్చాడు రోహిత్ శర్మ. ఆ ఓవర్లో అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న స్టీవ్ స్మిత్ బంతిని హిట్ చేయడానికి యత్నించినా సఫలం కాలేదు. ఆ ఓవర్ లో మలింగా యార్కర్లతో హడలెత్తించడంతో కేవలం ఏడు పరుగులే వచ్చాయి. దాంతో చివరి రెండు ఓవర్లలో విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. . అయితే మలింగా ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది. గత కొన్నేళ్లుగా మలింగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కీలక ఫైనల్లో మలింగా మ్యాజిక్ చేస్తాడని నేను ముందే బలంగా నమ్మా. ఒక ఓవర్ లో పూర్తిగా పరిస్థితుల్ని మార్చేసి శక్తి మలింగాకు ఉంది. ఆ అంచనాల్ని అందుకుని ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు'అని సచిన్ తెలిపాడు. మరొకవైపు జట్టు విజయంలో కోచ్ మహేలా జయవర్ధనే పాత్రను సచిన్ గుర్తు చేశాడు. ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించిన తరుణంలో జయవర్ధనే ఆటగాళ్లలో ధైర్యం నింపిన తీరు అమోఘం అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకుండా ఉంటే విజయం వరిస్తుందని చెప్పడంతో పాటు ఒకసారి చాంపియన్ ఎప్పుడూ చాంపియన్ అనేది గుర్తించుకుని పోరాడాలంటూ జయవర్దనే ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన విధానం చాలా బాగుందని సచిన్ తెలిపాడు. -
‘యువ’ మెరుపుల్...
ఐపీఎల్–10లో యువ ఆటగాళ్ల హవా ‘యువరాజ్, రైనాలను కలిపి చూస్తే రిషభ్ పంత్. అంతలా నన్ను ఆకట్టుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో అతను ఆడిన తీరు అద్భుతం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ బౌలింగ్ సూపర్. సిరాజ్, థంపి భవిష్యత్ బౌలింగ్‌కు భరోసా కల్పించారు’ యువ కెరటాలపై సచిన్ కామెంట్స్ ఇవి. నిజమే... ఈ బ్యాటింగ్ దిగ్గజం అన్నట్లు ఐపీఎల్–10కు ఈ యువధీరులంతా కొత్త శోభ తెచ్చారు. – సాక్షి క్రీడావిభాగం ♦ భవిష్యత్ ఆశాకిరణాల్లో కచ్చితంగా రిషభ్ పంత్ ఒకడు. 19 ఏళ్ల ఈ ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఈ సీజన్లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా చేజింగ్‌లో అతని ఎదురుదాడి అద్భుతం. తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరుకు చుక్కలు చూపించిన పంత్ (57)... ప్రత్యర్థి జట్టును ఓడించినంత పని చేశాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక గుజరాత్ లయన్స్ పాలిట సింహ స్వప్నంగా మారాడు. సిక్సర్ల జడివానతో పరుగుల వర్షం (56 బంతుల్లో 97; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) కురిపించాడు. ఐపీఎల్–10లో ఇది ఆరో అత్యుత్తమం. ఓవరాల్‌గా 165.61 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. ♦ ముంబై ఇండియన్స్ యువ సంచలనం నితీశ్ రాణా. ఈ 23 ఏళ్ల బ్యాట్స్‌మన్ జట్టు కీలక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. చేజింగ్‌లో విన్నింగ్ పెర్ఫార్మెన్స్కు పెట్టింది పేరు. కోల్‌కతాతో జరిగిన పోరులో భారీ లక్ష్యఛేదనలో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అతని జోరుముందు చక్కని బౌలింగ్ వనరులున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పప్పులూ ఉడకలేదంటే అతిశయోక్తికాదు. అనుభవజ్ఞులైన రోహిత్‌శర్మ, బట్లర్, పొలార్డ్‌లు విఫలమైన చోట వీరోచిత పోరాటం చేశాడు. ముంబైకి వరుస విజయాలందించాడు. గుజరాత్, పంజాబ్‌ల బౌలింగ్‌నూ చీల్చి చెండాడాడు. ఈ సీజన్లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లోనే 30.27 సగటుతో 333 పరుగులు చేశాడు. ♦ రాహుల్ త్రిపాఠి... ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపిన బ్యాటింగ్ సెన్సేషన్. ధోని మార్గదర్శనంలో ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాట్స్‌మన్ వచ్చిన అవకాశాల్ని చక్కగా సద్విని యోగం చేసుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 391 పరుగులు చేసిన రాహుల్ ఈ సీజన్ టాప్–10 స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఓపెనింగ్‌లో విలువైన భాగస్వామ్యాలు జతచేసిన త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు)... కోల్‌కతాపై ఒంటిచేత్తో గెలిపించాడు. స్టోక్స్ సహా స్మిత్, ధోని పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన ఈడెన్ గడ్డపై సిక్సర్ల మోత మోగించాడు. ♦ యార్కర్ల సూపర్ పేసర్ బాసిల్ థంపి. ఈ లీగ్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఆకట్టుకున్న యువ బౌలర్. వికెట్ల పరంగా (11) గొప్ప ప్రదర్శన కాకపోవచ్చు. కానీ అతని బౌలింగ్ తీరు... దూసుకెళ్లే బంతుల్లో పదును... అంత ఆషామాషీ కాదు. అందుకే ఐపీఎల్ జ్యూరీ అతని ప్రదర్శనను గుర్తించింది. ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును అందించింది. గంటకు 140 కి.మీ. స్థిరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించే సహజమైన శైలి అతని సొంతం. అతని షోకు ఒక్క సచినే కాదు... భారత కెప్టెన్ కోహ్లి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కితాబిచ్చారు. ♦ విదేశీ ఆటగాళ్లలో సూపర్ సర్ప్రైజ్ మాత్రం సునీల్ నరైన్‌దే! కోల్‌కతా నైట్‌రైడర్స్ గత టైటిల్ విజయాలకు స్పిన్ మంత్రాన్ని నమ్ముకుంది. కానీ ఈసారి బ్యాట్‌తో అది కూడా... ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నరైన్ ఆల్‌రౌండర్ అవతారమెత్తాడు. అతని దూకుడు ఎలా ఉందంటే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కూడా ఆ వేగాన్ని అందుకోలేకపోయారు. అందుకే ఈ సీజన్లోనే వేగవంతమైన అర్ధసెంచరీ అవార్డు అతని బ్యాట్‌నే వరించింది. ఈ సీజన్లో నరైన్ 172.30 స్ట్రయిక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. మేటి బ్యాట్స్‌మెన్ అయిన డివిలియర్స్ (216), గేల్ (200), యూసుఫ్ పఠాన్ (143), కోరే అండర్సన్ (142)ల కంటే ముందు వరుసలో ఉన్నాడు. అలాగని బౌలింగ్‌లో విఫలం కాలేదు. 6 పరుగుల ఎకానమి రేట్‌తో 10 వికెట్లు కూడా తీశాడు. బెంగళూరుపై నరైన్ 15 బంతుల్లోనే చేసిన అర్ధసెంచరీ ఈ టోర్నీలోనే హైలైట్‌గా నిలిచింది. ♦ వేలంలో అందరి కళ్లు బెన్ స్టోక్స్‌పైనే! అంచనాలకు అనుగుణంగా రూ.14.5 కోట్లతో రైజింగ్ పుణే పంచన చేరిన స్టోక్స్... కొన్ని ఆరంభ మ్యాచ్‌ల్లో తేలిపోయినా... తర్వాత తన విలువేంటో చూపాడు. ఈ సీజన్లో నమోదైన ఐదు సెంచరీల్లో అతనిదీ ఓ శతకముంది. మరో వైపు రూ. 12 కోట్లు పెట్టి బౌలర్ టైమల్ మిల్స్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు జట్టుకు అతను ఏమాత్రం ఉపయోగపడలేదు. ఐదు మ్యాచ్‌లే ఆడిన అతను ఐదు వికెట్లు తీసి నిరాశపరిచాడు. -
'ఆ లోటు పుణె జట్టులో కనబడింది'
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడటం పట్ల రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడమే తుది పోరులో ఓటమి చెందడానికి ప్రధాన కారణంగా విశ్లేషించాడు. 'బెన్ స్టోక్స్ లేని లోటు కనబడింది. ఫైనల్ పోరుకు స్టోక్స్ ఉండి ఉంటే ఫలితం మరొరకంగా ఉండేది. స్టోక్స్ లేకపోవడం వల్ల మేము ఎక్సట్రా బౌలర్ తో బరిలోకి దిగాల్సి వచ్చింది. దాంతో బ్యాటింగ్ విభాగం బలహీనపడింది. ఆ క్రమంలోనే 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాం. ఇక్కడ స్టీవ్ స్మిత్-రహానేల భాగస్వామ్యం తప్పితే, వేరే మంచి భాగస్వామ్యాలు రాలేదు. కీలక సమయాల్లో వరుసగా వికెట్లను కోల్పోతూ ఒత్తిడిలో పడ్డాం. దాంతో ముంబై ఇండియన్స్ కు దాసోహమయ్యాం' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆఖరి పోరులో పుణె పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. కేవలం స్మిత్, రహానేలు తప్పితే మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో టైటిల్ ను అందుకోవాలనుకున్న పుణె ఆశలు తీరలేదు. -
చివరి ఓవర్ లో వ్యూహం అదే..
-
వాషింగ్టన్ సుందర్ కొత్త రికార్డు
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ ఆడిన అత్యంత పిన్నవయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-10లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫైనల్లో పాల్గొనే సమయానికి అతని వయసు 17 సంవత్సరాల 228 రోజులు. తద్వారా అంతకుముందు రవీంద్ర జడేజా పేరిట ఉన్న రికార్డును సుందర్ అధిగమించాడు. 2008లో రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫైనల్ ఆడే సమయానికి అతని వయసు 19 ఏళ్ల 178 రో్జులు. అదే ఇప్పటి వరకూ ఐపీఎల్ ఫైనల్ ఆడిన పిన్నవయస్కుడి రికార్డుగా ఉంది. దాన్ని తాజాగా వాషింగ్టన్ సెందర్ సవరించాడు. గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణె జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. -
చివరి ఓవర్ లో వ్యూహం అదే..
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కేవలం పరుగు తేడాతో రైజింగ్ పుణెను ఓడించి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంచితే, అసలు చివరి ఓవర్ లో తమ వ్యూహం అమలు చేసిన తీరును మ్యాచ్ ముగిసాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 'చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్ ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్‌తో చర్చించా. సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమనే చెప్పా. అతను పేస్ బౌలింగ్ ను ఎలా పేస్ చేస్తాడో మనం అంతకుముందు చూశాం. మరొకవైపు అప్పుడు జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం. అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆపై పుణె పై ఒత్తిడి పెంచి టైటిల్ సాధించాం' అని రోహిత్ పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. కాగా మూడో బంతికి స్మిత్ గాల్లోకి లేపి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది. -
జట్టు గెలిచిన ఆనందంలో టవల్ విప్పేసి..
-
జట్టు గెలిచిన ఆనందంలో టవల్ విప్పేసి..
ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందడంతో ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ ఆనందం కట్టలు తెగింది. అంతే వినూత్నంగా ఆ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు.. తాను చేసిన ఒకింత వింత, వికృత ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి అభిమానులతో పంచుకున్నాడు. ఆదివారం హోరాహారీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పుణెపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించడంతో బట్లర్ ఆనందంలో కట్టుకున్న టవల్‌ను విప్సేసి.. నగ్నంగా గంతులు వేశాడు. సావరియా సినిమాలో రణ్‌బీర్ సింగ్‌ను గుర్తుకుతెచ్చేలా అతను వేసిన నగ్న గంతుల వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు జోస్ బట్లర్ కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అతను ఫైనల్‌కు ముందే ఇంగ్లండ్‌కు వెళ్లిపోయి.. తమ జట్టులో చేరాడు. ఫైనల్లో అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన ఈ ఇంగ్లిష్ వికెట్ కీపర్ తనదైన స్టైల్లో జట్టు ఆనందంలో భాగమయ్యాడు. -
పుణె ఓనర్‌పై ధోని ఫ్యాన్స్ సెటైర్లు..
హైదరాబాద్: ఈ ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పుణె యజమాని సోదరుడు హర్ష గోయంకాకు ధోని అభిమానుల మధ్య ట్వీటర్ వార్ నడుస్తుంది. గతంలో ధోనిపై అవాకు చేవాకులు పేల్చిన హర్షగోయంకాకు ధోని అభిమానులు ట్వీటర్ వేదికగా గట్టిగా బుద్ది చెప్పారు. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో పుణె విజయం ముంగిట చతికిలబడటంతో గోయంకా పై ధోని అభిమానులు విరుచుకు పడ్డారు. విజయం ఖాయం అనుకున్న సంధర్భంలో ముంబై బౌలర్ల అద్భత ప్రదర్శనకు పుణే ఒక్క పరుగు తేడాతో ఓడి టైటిల్ ను దూరం చేసుకుంది. అయితే ఈ ఓటమికి బాద్యుడు గోయంకానే అని ధోని అభిమానులు విమర్శిస్తున్నారు. గోయంకా పై వరుస వ్యంగ్య ట్వీట్లతో విరుచుకు పడుతున్నారు. ఎవరిని కించపరిచేలా మాట్లడవద్దు.. అలా మాట్లడితే ఇలా కర్మ సిద్దాంతం పనిచేస్తుందని ఒకరు.. అడవి రాజు ఏమి చేశాడని మరొకరు.. ఇప్పుడు అడవి రాజు ఎవరో అర్ధమైందా అని వ్యంగ్య ట్వీట్ లతో విరుచుకు పడ్డారు. గతంలో గోయంకా అడవి రాజు ఎవరో తెలిసిందా..అని స్మిత్‌ను పొగడ్తూ ధోనిని కించపరిచేలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. మరొకసారి స్ట్రైక్రేట్లను పోస్ట్ చేస్తూ ధోనిని తక్కువ చేసేలా ట్వీట్ చేశాడు. దీంతో అప్పట్లోనే గోయంకా పై అతని అభిమానులు ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ లతో సమాధానం చెప్పారు. -
ఫైనల్స్‌కు ముందే ప్రైజ్ దక్కింది
ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-10 ఫైనల్ మ్యాచ్‌కు గంటన్నర ముందే ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌కు భారీ బహుమతి దక్కింది! పుణెతో తుదిపోరు కోసం ముంబై జట్టును సన్నద్ధం చేస్తున్న సమయంలోనే.. రోడ్స్‌కు శుభవార్త అందింది. ఆదివారం సాయంత్రం సరిగ్గా 6:20కి జాంటీ సతీమణి మెలానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ గెలుపును ముందే ఊహించిన జాంటీ రోడ్స్.. 'ప్రైజ్‌కు ముందే ప్రైజ్ అందుకున్నా..'నంటూ కొడుకు పుట్టిన విషయాన్ని ప్రపంచానికి షేర్ చేశాడు. పనిలోపనిగా కొడుకు పేరు నాథన్ జాన్ అని కూడా చెప్పేశాడు. ముంబై(సాంటాక్రజ్)లోని సూర్యా హాస్పిటల్లో 'పూల్బర్త్' విధానంలో పురుడుపోసుకుంది మెలానీ. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. నాథన్ కంటే ముందు(2013లో) జాంటీ దంపతులకు జన్మించిన పాపకు 'ఇండియా' అని పేరుపెట్టుకున్న సంగతి తెలిసిందే. జాంటీ ఇద్దరు పిల్లలూ ముంబైలోనే పురుడుపోసుకోవడం గమనార్హం. -
మా వాళ్లతో అదే చెప్పా: రోహిత్ శర్మ
హైదరాబాద్: ఐపీఎల్-10 టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన తమ బౌలర్లపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. తుదిపోరులో తమ టీమ్ అద్భుతంగా ఆడిందని మెచ్చుకున్నాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయని, మ్యాచ్ బాగా జరిగిందని పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించి రోహిత్ సేన టైటిల్ కైవసం చేసుకుంది. ‘క్రికెట్లో ఇది గొప్ప మ్యాచ్. అందరూ ఎంజాయ్ చేసివుంటారని భావిస్తున్నాను. ఈ స్కోరును కాపాడుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ నన్ను అడగలేరు. స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే ముందు మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని సహచర ఆటగాళ్లకు చెప్పాను. చివరి మూడు ఓవర్లు మిగులుండగా బౌలర్లపై నమ్మకం ఉంచాను. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. బౌలర్లు చెప్పినట్టుగానే ఫీల్డింగ్ పెట్టాను. నా నమ్మకాన్ని వారు నిలబెట్టార’ని మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ అన్నాడు. -
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే!
హైదరాబాద్: అతనో మ్యాచ్ ఫినిషర్.. చేజింగ్ ఒత్తిడిలో ఎన్నో విజయాలందించిన అనుభవం.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సందర్భాలెన్నో.. అలాంటి డేంజరేస్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉండగా గెలవడం కష్టమని భావించిందో ఎమో గానీ ముంబై మాత్రం మంచి వ్యూహంతో ఆ బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని.. క్వాలిఫయర్-1 లో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించిన మహేంద్రుడు ఫైనల్ మ్యాచ్ లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. స్వల్ప లక్ష్యాన్ని ఎదుర్కొలేక అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రైజింగ్ పుణె భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఆదివారం ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఒక్క పరుగుతో పుణె పై గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి నుంచి విజయ అవకాశం పుణే వైపు ఉన్న ధోని అవుటవ్వడంతో ఒక్కసారిగా ముంబై పట్టు సాధించింది. అజింక్యా రహానే అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన ధోని స్మిత్ తో ఆచితూచి ఆడాడు. ఇదే పుణే ను కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. కేవలం ఓవర్ కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు. ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం. పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని అవుట్ తో పట్టు సాధించిన ముంబై పుణె కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. -
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన రోహిత్ సేన తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. చివర బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుంది. తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఈ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ గ్యాంగ్ గెలుపు అంచులవరకూ వచ్చి చతికిలబడింది. ఆదివారం ఇక్కడ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. చివరి మ్యాచ్ లో ఆద్యంత ఆకట్టుకున్న ముంబై బౌలర్లు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ముంబై బౌలర్లలో మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురైన పుణె పోరాడి ఓటమి చెందింది. పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(44),స్టీవ్ స్మిత్(51) రాణించినా జట్టుకు విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఉత్కంఠ రేపిన చివరి ఓవర్ చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. మూడో బంతికి స్మిత్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరచడంతో ముంబైకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై మూడంకెల స్కోరుకు చేరగల్గింది. -
పుణె ఫీల్డింగ్ అదుర్స్...
-
పుణె ఫీల్డింగ్ అదుర్స్...
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో టాపార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో కృనాల్ పాండ్యా(47), రోహిత్ శర్మ(24) లు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఫీల్డింగ్ అదుర్స్.. అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పుణె ఫీల్డింగ్ లో అదుర్స్ అనిపించింది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని పుణె ఫీల్డర్లు వదల్లేదు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ సిమన్స్ ను రిటర్న్ క్యాచ్ రూపంలో ఉనద్కత్ అద్భుతంగా అందుకున్నతీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి కింది పడబోయే సమయంలో ఉనద్కత్ మెరుపు వేగంతో ఒడిసి పట్టుకుని శభాష్ అనిపించాడు. ఆ తరువాత అంబటి రాయుడ్ని స్టీవ్ స్మిత్ రనౌట్ చేసిన తీరు అమోఘం. ఈ రెండు ఒక ఎత్తయితే ఆడమ్ జంపా బౌలింగ్ లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద శార్దూల్ ఠాకూర్ అందుకున్న వైనం మ్యాచ్ కే హైలెట్. ఆపై కరణ్ శర్మను శార్దూల్ ఠాకూర్ రనౌట్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక్కడ కరణ్ శర్మ ఇచ్చిన స్లిప్ క్యాచ్ ను ముందు క్రిస్టియన్ వదిలేశాడు. కాగా, అప్పటికే కరణ్ శర్మ క్రీజ్ ను వదిలేసి ముందుకు వెళ్లి పోయాడు. ఆ సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించిన బౌలర్ శార్దూల్ ఠాకూర్.. క్రిస్టియన్ విసిరిన బంతిని చాకచక్యంగా అందుకుని రనౌట్ చేశాడు. ఒకవైపు మైమరించే క్యాచ్‌లు, మరొకవైపు అద్భుతమైన రనౌట్లతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు పుణె ఆటగాళ్లు. -
ఐపీఎల్ విజేత ఎవరో?
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 విజేత ఎవరో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ ల మధ్య తుది సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 3–0తో పుణెదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. పుణె అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణెకు తిరుగుండదు. మరొకవైపు బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. ప్రధానంగా రోహిత్ , అంబటి రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌లపైనే ముంబై బ్యాటింగ్ లో కీలకం. ఇరు జట్లు గత మ్యాచ్ లో ఆడిన తుది జట్టుతోనే బరిలోకి దిగుతున్నాయి. దాంతో ముంబై ఇండియన్స్ జట్టులో హర్భజన్ సింగ్ కు స్థానం దక్కలేదు. ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), పార్ధీవ్ పటేల్, అంబటి రాయుడు, సిమన్స్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, మలింగా పుణె తుది జట్టు: :స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారీ,ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గ్యుసన్, ఆడమ్ జంపా, శార్దూల్ ఠాకూర్, ఉనద్కత్ -
ఐపీఎల్ విజేత ఎవరో?
-
స్టీవ్ స్మిత్.. భావోద్వేగ సందేశం
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్.. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ కు కొద్ది గంటల ముందు భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు నాలుగు నెలల భారత్ పర్యటనలో ఉన్న తనకు ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు మరవలేనివిగా పేర్కొన్నాడు. ' నా సుదీర్ఘ జర్నీ నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ఎత్తు పల్లాలు చవిచూడటమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొంతమంది ప్రజల్ని కూడా కలిశాను. ఈ క్రమంలోనే కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఐపీఎల్ ఆడటం అనేది అదొ గొప్ప అనుభవంగా భావిస్తున్నా. ఐపీఎల్ ఫైనల్ తరువాత కేవలం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉంటా. భారత్ లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. మా జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులకు సైతం కృతజ్ఞతులు. ఈ పర్యటన ఎప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది'అని స్టీవ్ స్మిత్ తన ఇన్‌స్టా గ్రాం అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ తో తొలిసారి పుణె తలపడతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్రను లిఖిస్తారు. మరి టైటిల్ పోరులో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో ఫైనల్ కు చేరి అందరి అంచనాల్ని తలక్రిందులు చేసింది రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఇప్పటికే రెండు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ను తుది సమరంలో ఢీకొట్టడానికి సిద్దమైంది. తమ జట్టు ఫైనల్ వరకూ చేరడానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఎంఎస్ ధోనిల మధ్య సఖ్యత బాగుండటమేనని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ధోని, స్మిత్ లు మంచి సారథులుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. జట్టులో వారి మధ్య సమన్వయం చాలా బాగుంది. ఇదే మా జట్టు ఫైనల్ కు చేరడానికి దోహదం చేసింది. వీరిద్దరూ సీనియర్లు కావడంతో కోచ్ గా నాకు కాస్త భారం తగ్గింది. యువ క్రికెటర్లు వీరి నుంచి ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పదేళ్ల ఐపీఎల్ ను చూస్తే అత్యంత విజయవంతమైన క్రికెటర్ ధోని. ప్రస్తుతం ధోని కోసం మరో ఐపీఎల్ ఫైనల్ ఎదురుచూస్తోంది' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
పుణె సక్సెస్ కు కారణం ఇదే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. అయితే ఆ జట్టు తుది సమరానికి సిద్ధమై మేటి జట్లను సైతం ఔరా అనిపించింది. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఆరంభానికి ముందు పుణె జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి ఆ బాధ్యతల్ని స్టీవ్ స్మిత్ కు అప్పగించింది. దీనిపై అప్పట్లో దుమారం చెలరేగినప్పటికీ, ఆ తరువాత అంతా సర్దుకుంది. ఇక్కడ ధోని కూడా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారనే విషయాన్ని పట్టించుకోకుండా మిస్టర్ కూల్ తరహాలో అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా చేసుకుపోవడంతో జట్టులో ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదు. దీన్ని కాసేపు పక్కకు ఉంచితే, ఈ సీజన్ లో పుణె జట్టు స్వల్ప మార్పుతో బరిలోకి దిగింది. గత సీజన్ పుణె సూపర్ జెయింట్స్ గా వచ్చి నిరాశపరిచిన పుణె.. ఈసారి పుణె సూపర్ జెయింట్ గా పోరుకు సిద్ధమైంది. కేవలం జట్టు పేరులో 'ఎస్' అనే చివరి అక్షరాన్ని తొలగించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇలా పేరు మార్చడానికి న్యూమరాలజీ(సంఖ్యా శాస్త్రం)నే కారణమంటున్నాడు పుణె యజమాని సంజీవ్ గోయంకా. తనకు సంఖ్యాశాస్త్రంపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ, పేరు మార్చి చూస్తే ఏంపోతుంది అనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు పేర్కొన్నాడు. ఇది పుణె జట్టును ఫైనల్ వరకూ చేర్చడంలో సహకరించిందంటూ తెగ ఆనందపడిపోతున్నాడు. -
నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం
హైదరాబాద్: ముంబై ఇండియన్స్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగే ఐపీఎల్–10 ఫైనల్ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉప్పల్ స్టేడియం చుట్టూ, లోపల పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి రాచకొండ పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి బాంబ్, డాగ్ స్క్వాడ్లతో స్టేడియం లోపల, బయట అణువణువూ చెక్ చేశారు. స్టేడియం బయట అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పించారు. 1,800 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. 870 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 88 సీసీ కెమెరాలతో బందోబస్తు నిర్వహించారు. -
ఐపీఎల్ ఫైనల్: ముంబైలో కలవరం!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో తుది అంకానికి రెండుజట్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్, రెండుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ చేరుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణే వరుస విజయాలతో ఫైనల్ చేరగా, ముంబై మాత్రం కొన్ని విషయాలలో ఆందోళన చెందుతుంది. ముంబై ఇండియన్స్‌ను రెండు సెంటిమెంట్లు ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్లో పుణే చేతిలో మూడు పర్యాయాలు ఓడిపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే.. లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడితే లీగ్‌లో రెండో స్థానంలో నిలిచన టీమ్‌ను ఐపీఎల్ కప్ వరిస్తుండటం ముంబైపై ఒత్తిడి పెంచుతుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లకుగానూ 10 మ్యాచ్‌లు నెగ్గి నాలుగింట్లో ఓడగా, రెండు పర్యాయాలు పుణే చేతిలో ఓటమి పాలవడం ఇప్పుడు ముంబై జట్టును కలవరపాటుకు గురిచేస్తుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ తమ చేతిలో ఓడిన ముంబైతో ఫైనల్ మ్యాచ్ కావడం పుణేలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. లీగ్ దశలో 20 పాయింట్లు, 18 పాయింట్లతో పట్టికలో ముంబై, పుణే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌తో సహా ఈ సీజన్లో తలపడిన మూడు పర్యాయాలు పుణే చేతిలో ముంబై ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై నెగ్గి ముంబై ఫైనల్లోకి దూసుకెళ్లినా పుణే అడ్డంకిని అధిగమిస్తేనే వారు మూడోసారి చాంపియన్‌గా అవతరిస్తారు. మరోవైపు ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్) సంప్రదాయం ప్రవేశపెట్టిన 2011 ఏడాది నుంచి ఫైనల్ విజేతల వివరాలను గమనిస్తే ముంబైకి ఫైనల్ ఫీవర్ తప్పదని చెప్పవచ్చు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ (2), ఆర్సీబీ(1) తలపడగా చెన్నై నెగ్గింది. 2013 ఫైనల్లో ముంబై (2), సీఎస్కే(1) ఆడగా ముంబై టైటిల్ సాధించగా, 2014లో పంజాబ్(1)పై కేకేఆర్(2) విజయం సాధించగా, చివరగా 2015లో చెన్నై(1)ని ముంబై(2) ఓడించి సగర్వంగా కప్పును రెండో సారి అందుకుంది. ముంబై నెగ్గిన రెండు సీజన్లలోనూ లీగ్ లో చెన్నై(1)పైనే రెండో స్థానంలో ఉన్న ముంబై(2) గెలుపొందడం గమనార్హం. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ ముంబై ఇండియన్స్ (1) - విజేత ? -
'స్టీవ్ స్మిత్ వల్లే సక్సెస్ అయ్యా'
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్. తొలి నాలుగు మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ ఆ తరువాత జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ 22 వికెట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉనాద్కత్.. ఇందుకు కారణం తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అని పేర్కొన్నాడు. 'స్టీవ్ స్మిత్-ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం నాకు చాలా ఉపయోగపడింది. వారిద్దర వద్ద ఆడటం నాకొక మంచి అనుభవం. ఈ సీజన్ లో ఆఖరి ఓవర్లను ఎక్కువగా వేశా. డెత్ ఓవర్లను వేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కెప్టెన్ నుంచి సహకారం అవసరం. అటువంటి సహకారం నాకు స్మిత్ నుంచి అందింది. నాపై నమ్మకం ఉంచడంతోనే నా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యా. స్టీవ్ స్మిత్ కు బౌలర్లకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. దాంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపడం కూడా తెలుసు'అని ఉనాద్కత్ పేర్కొన్నాడు. -
'తుదిపోరులో సత్తాచాటుతా'
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్ -1లో నిరాశపరిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి తుది పోరులో మాత్రం సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్ లో మెక్లీన్ గన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన త్రిపాఠి.. టైటిల్ పోరులో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వనని అంటున్నాడు. 'నిజానికి అపజయాలే గెలుపుకు సోపానాలు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతా. ఓటుములతో నిరాశ చెందకుండా, మరింత కష్టపడి ముందుకు సాగాలి. ఇప్పటివరకూ నా ఐపీఎల్ ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. అదే స్ఫూర్తితో ఫైనల్లో కూడా రాణిస్తా. దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం నా అదృష్టం. మహేంద్ర సింగ్ ధోని, స్టీవ్ స్మిత్ లాంటి మేటి గాళ్ల సలహాలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి' అని రాహుల్ త్రిపాఠి తెలిపాడు. రేపు(ఆదివారం) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. -
వెయిటర్ నుంచి క్రికెటర్‌గా..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా స్టార్ క్రికెటర్లు అయిన వారు చాలా మందే ఉన్నారు. గల్లీ క్రికెటర్లను సైతం అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన వేదిక ఐపీఎల్ అనడంలో సందేహం లేదు. మరొకవైపు ఆటగాళ్లను రాత్రికి రాత్రే కోటేశ్వరుల్ని చేసే టోర్నమెంట్ కూడా ఇదే. ఎన్ని ఇబ్బందులున్నా క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకోవడానికి ఐపీఎల్ కూడా ఒక కారణం. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రాణించి జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లతో వేలంలో పోటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అనామక క్రికెటర్లకూ ఇక్కడ కొదవ ఉండదు. అదే కోవకి చెందిన ఆటగాడే రాజస్థాన్ లోని ఝున్ ఝున్ అనే గ్రామం నుంచి వచ్చిన కుల్వంత్ ఖేజ్రోలియా. దాదాపు ఏడాది కాలంగా మాత్రమే దేశవాళీ క్రికెట్ ఆడుతున్న కుల్వంత్ ను ఐపీఎల్-10వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన కుల్వంత్ క్రికెటర్ కాకముందు గోవాలోని రెస్టారెంట్లో వెయిటర్ గా పని చేసేవాడు. పేద కుటుంబానికి చెందిన కుల్వంత్ ఒకవైపు వెయిటర్ గా పని చేస్తూనే మరొకవైపు క్రికెట్ ఆడటాన్ని వదులుకోలేదు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రాక్టీస్.. క్రికెట్‌ను కెరీర్‌ను ప్రొఫెషన్ గా మార్చుకోవాలని ఢిల్లీకి రావడానికి అతని స్నేహితుడే కారణం. కుల్వంత్ లో ప్రతిభను ఫ్రెండ్ గుర్తించడంతో అతనికి తొలి అడుగు పడింది. ఇలా ఢిల్లీకి వచ్చిన కుల్వంత్ క్రికెటర్ గా ఎదిగేందుకు అలుపెరగని పోరాటం చేశాడు. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నెట్స్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ వారితోపాటే నెట్స్ లో గడిపేవాడు. అదే కుల్వంత్ వెలుగులోకి రావడానికి దోహదం చేసింది. కుల్వంత్ ను ఒకసారి పరీక్షించాలంటూ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు సందేశం అందింది. దాంతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీకి ఎంపికయ్యాడు. ఢిల్లీ జట్టులో ఒక అదనపు సభ్యుడిగా ఎంపికైన కుల్వంత్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడిన కుల్వంత్ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ఇదే అతను ఐపీఎల్లో అరంగేట్రం చేయడానికి ఉపయోగపడింది. అయితే కుల్వంత్ కు ఇంకా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ సీజన్ ఐపీఎల్లో అతని కనీస ధర రూ.10 లక్షలకు ముంబై వేలంలో దక్కించుకుంది. కేవలం ఏడాది క్రితం మాత్రమే దేశవాళీ అరంగేట్రం చేసిన తనకు ముంబై ఇండియన్స్ తరపున ఆడటం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు. ఐపీఎల్లో దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నట్లు ఇంట్లో చెప్పలేదని కుల్వంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. -
మా పోరాటం సరిపోలేదు: గంభీర్
న్యూఢిల్లీ:ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పట్ల ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబైతో మ్యాచ్ లో తమ పోరాటం సరిపోలేనందువల్లే ఓటమి పాలైనట్లు గంభీర్ తెలిపాడు. తమ సమష్టి వైఫల్యం కారణంగా తుది పోరుకు అర్హత సాధించలేకపోయామన్నాడు. 'కేకేఆర్ మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా జర్నీ చాలా కఠినంగా సాగింది. మా శక్తి వంచన లేకుండా పోరాటం సాగించాం. అయితే కీలక మ్యాచ్ లో చతికిలబడ్డాం. ఇక్కడ మా పోరాటం సరిపోలేదు. దాంతో నిష్క్రమించాల్సి వచ్చింది'అని గంభీర్ ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి పరాజయం చెందింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ -2లో ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. -
అడుగు దూరంలో ధోని..
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తుది పోరుకు అర్హత సాధించడంలో మహేంద్ర సింగ్ ధోని తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్న ధోని.. ప్రస్తుతం తనను తాను నిరూపించుకోవడానికి కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ధోనిని పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని తప్పుబట్టాడు. గతంలో ఆరు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నధోని ఈ సీజన్ ఫైనల్ పోరులో రాణించి కప్ ను జట్టుకు అందిచిన పక్షంలో తనను పూర్తిగా నిరూపించుకున్నట్లు అవుతుందన్నాడు. 'కెప్టెన్ గా ధోని ఎప్పుడూ గెలిచాడు. ప్రస్తుతం ఆటగాడిగా ధోని నిరూపించుకోవాలనే యత్నంలో ఉన్నాడు. కెప్టెన్ గానే కాదు.. ఆటగాడిగా గెలవగలను అని నిరూపించుకునే సమయం ధోని ముందుంది. ఇందుకు కేవలం పాయింట్ దూరంలో మాత్రమే ధోని ఉన్నాడు. అతన్ని రైజింగ్ పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించను. కానీ ధోని-స్టీవ్ స్మిత్ ల మధ్య సంబంధం బాగుండటం జట్టు మంచి విజయాలు సాధించడానికి దోహదం చేసింది.. ఫైనల్లో పుణెనే గెలుస్తుందని అనుకుంటున్నా. తొలి క్వాలిఫయర్ లో ముంబైపై గెలవడం పుణెకు లాభిస్తుంది. పుణె జట్టులో బెన్ స్టోక్స్ లేని లోటును పూడ్చటం కష్టమే. కానీ గత మ్యాచ్ చివరి ఓవర్లలో రాణించిన ధోని మరొకసారి బ్యాట్ ఝుళిపించి పుణె టైటిల్ సాధించడంలో సాయపడతాడని ఆశిస్తున్నా'అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. -
ధోనీపై మళ్లీ తూటాలు: పుణెలో కలకలం
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతోన్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఆర్పీఎస్)లో ఆ జట్టు యజమాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. సంజీవ్ గొయాంకా ఎంఎస్ ధోనీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే సంజీవ్ సోదరుడైన హర్ష్ గొయాంకా ధోనీపై పేల్చిన మాటాల తూటాలు వివాదాస్పదం కావడం, వాటికి బదులుగా ధోనీ భార్య సాక్షి ఇచ్చిన ఘాటు కౌంటర్లు హైలైట్ కావడం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ గొయాంకా.. ధోనీ, స్మిత్, జట్టులోని ఇతర ఆటగాళ్లగురించిన విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఎంఎస్ ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతని మైండ్ సెట్, గెలవాలనే తపన అమోఘం. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతను. అయితే ధోనీ కన్నా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడు ఇంకొకరున్నారు.. అతనే స్టీవ్ స్మిత్! గెలుపు తప్ప మరేదీ వద్దనుకునే యాటిట్యూడ్ స్మిత్‌ది. అందుకే టీమ్‌మేట్స్‌కు ‘12 బంతుల్లో 30 పరుగులు కొట్టు.. లేదా, అవుటై వచ్చెసెయ్..’ లాంటి సూచనలు చేస్తాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల స్మిత్ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లలో పుణె జట్టు సరిగా ఆడలేకపోయింది..’ అంటూ ఎడాపెడా స్మిత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ, జట్టు విజయయాత్రలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదన్నట్లు మాట్లాడారు సంజీవ్ గొయాంకా. హైదరాబాద్‌లో ఆదివారం(మే 21న) జరగనున్న ఫైనల్స్‌లో పుణె జట్టు ముంబైతో తలపడనున్న సంగతి తెలిసిందే. 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుణె జట్టు ప్రస్థానం ఆదివారంతోనే ముగియనుంది. దీనిపైనా గొయాంకా తనదైన శైలిలో స్పందించారు. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికలో లోపాల వల్లే గత ఏడాది పుణె మెరుగ్గా రాణించలేదని గొయాంకా అన్నారు. ఈ సారి స్మిత్ చెప్పినట్లే.. ఇమ్రాన్ తాహిర్, బెన్ స్టోక్స్‌లు రాణించారని, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ ప్లేయర్లు మెరవడం మరింతగా కలిసి వచ్చిన అంశమని గొయాంకా అన్నారు. (ప్రతీకారంతోనే ధోనీ భార్య ఇలా చేసిందా?) -
టైటిల్ పోరుకు ముంబై
-
'ముంబై' చలో హైదరాబాద్
►ఐపీఎల్–10 ఫైనల్లో ముంబై ఇండియన్స్ ►క్వాలిఫయర్–2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం ►రేపు హైదరాబాద్‌లో రైజింగ్ పుణేతో టైటిల్ పోరు ►నాలుగు వికెట్లతో మెరిసిన కరణ్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ముంబై ఇండియన్స్ మరోసారి నిరూపించుకుంది. ఈ సీజన్లో ముచ్చటగా మూడోసారి కేకేఆర్‌పై నెగ్గిన ముంబై ఐపీఎల్–10 ఫైనల్లో అడుగుపెట్టింది. కరణ్ శర్మ మాయాజాలం... బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు విలవిల్లాడిన గంభీర్ సేన కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ సునాయాస లక్ష్యాన్ని కాస్త తడబడుతూనే ముంబై ఛేదించగలిగింది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఓటమి లేకపోవడం విశేషం. ఇక ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే తుదిపోరులో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలర్లు రాజ్యమేలిన ఈ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇషాంక్ జగ్గి (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) మాత్రమే కాస్త పోరాడగలిగారు. కరణ్ శర్మ నాలుగు, బుమ్రా మూడు, జాన్సన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 111 పరుగులు చేసి నెగ్గింది. పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి. కరణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలర్ల ధాటికి విలవిల టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను ముంబై బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఏ దశలోనూ కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. దీంతో ఇదే మైదానంలో పవర్‌ప్లేలో 105 పరుగులతో రికార్డు సృష్టించిన ఈ జట్టు ఈసారి అవమానకర రీతిలో బ్యాటింగ్ చేసింది. తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్న లిన్ (4)ను రెండో ఓవర్లోనే బుమ్రా అవుట్ చేయగా.. నరైన్ (10 బంతుల్లో 10; 1 సిక్స్)ను కరణ్ శర్మ ఐదో ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు. ఇక తదుపరి ఓవర్లో రాబిన్ ఉతప్ప (1)ను బుమ్రా అవుట్ చేయడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా జట్టు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ప్లేలో ఈ సీజన్లో కోల్‌కతాకు ఇదే అత్యల్ప స్కోరు. ఏడో ఓవర్లో కరణ్ శర్మ కెప్టెన్ గంభీర్ (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), గ్రాండ్‌హోమ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో కోల్‌కతా 31 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, ఇషాంక్ జగ్గి జట్టుకు ఆపద్బాంధవ పాత్ర పోషించారు. కృనాల్ వేసిన ఓ ఓవర్లో సిక్స్ బాదిన సూర్యకుమార్ మరుసటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో జగ్గి కూడా రెండు ఫోర్లు బాదినా 15వ ఓవర్లో అతడిని అవుట్ చేసి కరణ్ శర్మ మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఆరో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా 17వ ఓవర్లో జాన్సన్.. చావ్లా (2), కూల్టర్‌నీల్ (6) వికెట్లను తీయగా మరుసటి ఓవర్లో నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌ను బుమ్రా బోల్తా కొట్టించడంతో కోల్‌కతా భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. ఆరంభంలో తడబడినా... లక్ష్యం తక్కువగానే ఉన్నా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ అంత సజావుగా ఏమీ సాగలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు మూడు వికెట్లకు 36 పరుగులు... సునాయాసంగా బ్యాటింగ్ చేయగలదనుకున్న ముంబై టాప్ ఆర్డర్‌ను కోల్‌కతా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పీయూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సిమన్స్ (3) అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఎల్బీగా వెనుదిరగ్గా ఆ తర్వాతి ఓవర్లో ఉమేశ్.. పార్థివ్ (9 బంతుల్లో 14; 3 ఫోర్లు)ను అవుట్ చేసి ఒక్కసారిగా ఆందోళన పెంచాడు. ఆరో ఓవర్లో చావ్లా... రాయుడు (6)ను కూడా అవుట్ చేయడంతో మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఈ స్థితిలో కెప్టెన్ రోహిత్, కృనాల్ నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటుకు లోనుకాకుండా వీరు జాగ్రత్తగా ఆడారు. 9వ ఓవర్ నుంచి క్రమంగా పరుగుల వేగం పెరిగింది. చావ్లా వేసిన ఆ ఓవర్లో కృనాల్ రెండు ఫోర్లు బాది జోరు కనబరిచాడు. అతడి మరుసటి ఓవర్లోనూ తను రెండు ఫోర్లు రాబట్టగా రోహిత్ ఓ సిక్సర్ సంధించడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఓ నిర్లక్ష్యపు షాట్‌కు రోహిత్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పొలార్డ్ (9 నాటౌట్) అండతో కృనాల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టును గట్టెక్కించాడు. -
టైటిల్ పోరుకు ముంబై
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ టైటిల్ పోరుకు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. శుక్రవారం రాత్రి ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. అమీతుమీ పోరులో ఆద్యంతం రాణించిన ముంబై ఇండియన్స్ మరోసారి తమదే పైచేయిగా నిరూపించుకుంది. తొలి క్వాలిఫయర్ లో ముంబై ఓటమి పాలైనప్పటికీ, క్వాలిఫయర్-2లో మాత్రం ఆకట్టుకుని ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కోల్ కతా విసిరిన 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఆదిలోనే సిమన్స్(3),పార్ధీవ్ పటేల్(14), అంబటి రాయుడు(6) వికెట్లను కోల్పోయి తడబడింది. అయితే రోహిత్ శర్మ(26), కృణాల్ పాండ్యా(42 నాటౌట్) లు బాధ్యతాయుతంగా ఆడి గెలుపులో సహకరించారు. తద్వారా ఆదివారం హైదరాబాద్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కీలక మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ లు రాణిస్తారని భావించినా అది జరగలేదు. వీరిద్దరూ ఆది నుంచి ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లిన్(4) భారీ షాట్ కు పోయి తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై నరైన్(10) దూకుడుగా ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఉతప్ప, గంభీర్, గ్రాండ్ హోమ్ లు నిష్ర్రమించడంతో కోల్ కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇషాంక్ జగ్గి- సూర్యకుమార్ యాదవ్ లు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడి 56 పరుగులు జోడించడంతో కోల్ కతా పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే జగ్గి ఏడో ఆరో వికెట్ గా అవుటైన తరువాత కోల్ కతా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ముంబై బౌలింగ్ కు దాసోహమైంది. దాంతో 18.5 ఓవర్లలోనే కోల్ కతా 107 పరుగులకు ఆలౌటైంది. -
'108' కొడితే ఫైనల్‌కు..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రిస్ లిన్ (4), నరైన్(10), గంభీర్(12), రాబిన్ ఉతప్ప(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఇషాంక్ జగ్గి(28), సూర్య కుమార్ యాదవ్(31) కాస్త ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా స్కోరు వంద పరుగులు దాటింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కీలక మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ లు రాణిస్తారని భావించినా అది జరగలేదు. వీరిద్దరూ ఆది నుంచి ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లిన్ భారీ షాట్ కు పోయి తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై నరైన్ దూకుడుగా ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఉతప్ప, గంభీర్, గ్రాండ్ హోమ్ లు నిష్ర్రమించడంతో కోల్ కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇషాంక్ జగ్గి- సూర్యకుమార్ యాదవ్ లు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడి 56 పరుగులు జోడించడంతో కోల్ కతా పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే జగ్గి ఏడో ఆరో వికెట్ గా అవుటైన తరువాత కోల్ కతా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ముంబై బౌలింగ్ కు దాసోహమైంది. దాంతో 18.5 ఓవర్లలోనే కోల్ కతా 107 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు వికెట్లతో కోల్ కతా పతనాన్ని శాసించగా, బూమ్రా మూడు వికెట్లు సాధించగా, మిచెల్ జాన్సన్ కు రెండు వికెట్లు దక్కాయి. -
ముంబైతో కేకేఆర్ అమీతుమీ
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ముందుగానే తుది బెర్తును ఖరారు చేసుకోగా, మరో స్థానం కోసం ముంబై ఇండియన్స్- కోల్ కతా నైట్ రైడర్స్ లు పోటీ పడనున్నాయి. శుక్రవారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఇరు జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ముంబై ఇండియన్స్ తుది జట్టులో మిచెల్ జాన్సన్ వచ్చి చేరాడు. గత మ్యాచ్ లో మెక్లీన్ గన్ గాయపడటంతో అతని స్థానంలో మిచెల్ జాన్సన్ ను వేసుకున్నారు.మరొకవైపు కోల్ కతా నైట్ రైడర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యూసఫ్ పఠాన్ స్థానంలో అంకిత్ రాజ్ పుత్ ను వేసుకోగా, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కాలిన్ డి గ్రాండ్ హోమ్ ను తీసుకున్నారు. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్ కతాపై ముంబై ఇండియన్స్ దే పైచేయి.ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై తమ ఘనచరిత్రను మరోసారి ఆవిష్కృతం చేసి తుది పోరుకు అర్హత సాధించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ కీలక సమరంలో పైచేయి సాధించాలని నైట్‌రైడర్స్ కసితో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గంభీర్ బృందం తమలోని లోపాలను సరిదిద్దుకుని ఎదురుదాడికి దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్) రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఇషాంక్ జగ్గి, సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, అంకిత్ రాజ్ పుత్, కుల్టర్ నీల్, గ్రాండ్ హోమ్ ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), లెండిల్ సిమన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, లసిత్ మలింగా -
దాని గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రను పరిశీలిస్తే కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ అమోఘమైన రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి ఆడిన 20 మ్యాచ్ ల్లో 15 మ్యాచ్ ల్లో ముంబైదే విజయం. ఈ సీజన్ లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైది పైచేయి. దాంతో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ ట్రాక్ రికార్డు గురించి అస్సలు ఆలోచించడం లేదని అంటున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. కేవలం మ్యాచ్ లో విజయం సాధించాలనే ఒకే ఒక్క ఆలోచనతో బరిలోకి దిగుతున్నామన్నాడు. ' ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ పై రెండు సార్లు విజయం సాధించామనే ఆలోచన లేదు. కేవలం ఈ రోజు మ్యాచ్ పైనే మా దృష్టి ఉంది. తమదైన రోజున ఎవరైతే బాగా ఆడతారో వారే గెలుస్తారు. అంతేకానీ పాత రికార్డులు ఇక్కడ పని చేయవు. కాకపోతే కోల్ కతాపై గెలుస్తామనే ధీమాతో ఉన్నాం'అని రోహిత్ పేర్కొన్నాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. రాత్రి గం.8.00ని.లకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు నాకౌట్ పోరుకు సన్నద్ధమయ్యాయి. -
'నా మొదటి వ్యక్తి ధోనినే'
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ కు చేరడంలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సుందర్ మూడు కీలక వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ముంబైకు ఆదిలోనే సుందర్ షాక్ తగలడంతో ఆ జట్టు ఇక తేరుకోలేక ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సుందర్.. మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాడితో కలిసి ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ' గేమ్ జరిగేటప్పుడు నాకు ఏ సందేహం వచ్చినా నేను మొదటి వెళ్లేది ధోని దగ్గరకే. ప్రధానంగా ధోని వద్దకు వెళ్లి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ గురించి అడిగి తెలుసుకునే వాడిని. ఓ దిగ్గజ ఆటగాడితో కలిసి ఆడటం నా అదృష్టం. ఆ తరహా పెద్ద స్టార్ల సరసన ఆడే అవకాశం అందరికీ రాదు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. పుణె జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ల సహకారం మరవలేనిది. నేను పవర్ ప్లే లో బౌలింగ్ చేయడాన్ని ఛాలెంజ్ గా భావిస్తా. గౌతం గంభీర్, శిఖర్ ధావన్ తరహా ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ఒక సవాల్. వారికి బౌలింగ్ చేయడంలో నేను విజయం సాధించానని అనుకుంటున్నా. నేను ఐపీఎల్లో అరంగేట్రం చేసేటప్పుడు రవి చంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగలనని అస్సలు అనుకోలేదు' అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. -
మొత్తం డబ్బులు ఇవ్వలేదు: మెకల్లమ్
కాన్పూర్: తనకు రావాల్సిన మొత్తం సొమ్మును గుజరాత్ లయన్స్ ఇవ్వలేదని అంటున్నాడు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బ్రెండన్ మెకల్లమ్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడేటప్పుడు తనకు రూ. 7.5 కోట్లు వచ్చేదని, ఆ మొత్తాన్ని తాజా ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ నుంచి పొందలేదన్నాడు. తనను అదే మొత్తానికి గుజరాత్ లయన్స్ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మెకల్లమ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లకు ధనాన్ని చెల్లించే వ్యవహారంలో శాలరీ క్యాప్ పేరు చెప్పి తగ్గించి ఇచ్చారని మెకల్లమ్ స్పష్టం చేశాడు. 2016లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు ఐపీఎల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లుపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వాటిపై రెండేళ్లు నిషేధం పడింది. దాంతో ఆ జట్ల స్థానంలో గుజరాత్, పుణెలు వచ్చి చేరాయి. అదే క్రమంలో చెన్నై, రాజస్థాన్ జట్ల ఆటగాళ్లను గుజరాత్, పుణెలు వేలంలో కొనుగోలు చేశాయి. అందులో మెకల్లమ్ ను గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. -
రైజింగ్ పుణె వ్యూహం ఫలించింది..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఐపీఎల్ ఆరంభంలో మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ గా తప్పించి పెద్ద సాహసమే చేసింది పుణె. ఆ జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను నియమించడంతో పాటు ఫ్రాంచైజీ పేరులో కూడా కొద్ది పాటి మార్పు చేసింది. గతేడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ గా బరిలోకి దిగిన ఆ జట్టు.. ప్రస్తుత సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్గా పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉంచితే, టోర్నీ ఆరంభంలో ఆడపా దడపా విజయాలతో వెనుకబడినప్పటికీ, చివరికి వచ్చేసరికి ఫైనల్ కు చేరి భళా అనిపించింది. అయితే పుణె తుది పోరుకు చేరడంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో్ జరిగిన క్వాలిఫయర్ -1లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. . నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు సాధించాడు. దాంతో పాటు 16 పరుగులు మాత్రమే ఇచ్చి పటిష్టమైన ముంబైని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 10 మ్యాచ్ లాడిన సుందర్ ఎనిమిది వికెట్లు తీసి పుణె విజయాల్లో తన వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించాడు. కేవలం ఓ అనామక క్రికెటర్ లా లీగ్ లో కి ప్రవేశించిన సుందర్ ఇప్పుడు స్టార్ బౌలర్ మాదిరి ప్రశంసలు అందుకుంటున్నాడు స్మిత్ వికెట్ పడగొట్టి జట్టులోకి వచ్చాడు.. రైజింగ్ పుణే జట్టుకు గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణే జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. -
కోల్ కతా నెగ్గినా.. షారుక్ ఫీలయ్యారు!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో భాగంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించినా కేకేఆర్ ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నారు. మరికొన్ని నిమిషాలు వర్షం పడితే మ్యాచ్ రద్దయి సన్ రైజర్స్ విజేతగా నిలిచేదని, ముఖ్యమైన ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్) మ్యాచ్‌లకు కచ్చితంగా రిజర్వ్డ్ డే ఉండాలని హీరో అభిప్రాయపడ్డారు. కేకేఆర్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్లే ఆఫ్స్ లాంటి దశలో జరిగే మ్యాచ్‌లు ఏదైనా కారణంగా రద్దయితే రిజర్వ్ డే (మరొక రోజు) ఉండాలని ట్వీట్లో రాసుకొచ్చారు షారుక్. నిన్న మరికాసేపు అలాగే వర్షం పడితే కేకేఆర్ కొంప మునిగేదన్నాడు. ప్లే ఆఫ్స్ జరగాల్సిన తీరుపై షారుక్ మాట్లాడారు. ‘ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్‌ను కేవలం 128 పరుగులకే మా బౌలర్లు కట్టడిచేశారు. వర్షం రాకపోయినా కేకేఆర్ విజయం సాధించేది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ ను దాదాపు మూడు గంటలపాటు నిలిపివేశారు. ఓ దశలో కోల్ కతా జట్టు బ్యాటింగ్ చేయదని, అలాంటి సందర్భంలో లీగ్ దశలో మెరుగైన పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ ను విజేతగా ప్రకటిస్తారని ముంబై ఇండియన్స్‌తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడతుందని కథనాలు రావడం బాధించిందని’ చెప్పుకొచ్చారు. Glad on the winning side tonite. But play offs need to have an extra day in case of an abandoned match. Ami KKR onwards with @GautamGambhir — Shah Rukh Khan (@iamsrk) 17 May 2017 -
20 ఓవర్ల మ్యాచ్ జరగకపోవడం వల్లే..
బెంగళూరు:కోల్ కతా నైట్ రైడర్స్ తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఆట పూర్తిగా జరగకపోవడమేనని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. వర్షం రాకతో మ్యాచ్ పూర్తిగా సాధ్యం కాలేదని, ఒకవేళ ఆట మొత్తం జరిగిన పక్షంలో సన్ రైజర్స్ విజయం సాధించే అవకాశం ఉండేదన్నాడు. కచ్చితంగా 20 ఓవర్ల పాటు ప్రత్యర్థి జట్టు ఆడుంటే అది తమకు లాభించేదన్నాడు. ' ఈ సీజన్ లో బెంగళూరు పిచ్ ను చూడండి. అక్కడ నమోదైనవన్నీ తక్కువ స్కోర్లే. అక్కడ యావరేజ్ స్కోరు దాదాపు 140 గా ఉంది. మేము ముందుగా బ్యాటింగ్ చేసి 128 పరుగులు చేశాం. కానీ మరో 10 పరుగులు చేసి ఉండాల్సింది. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే మేము చేసిన పరుగుల్ని కచ్చితంగా కాపాడుకునే వాళ్లం. మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటం, మ్యాచ్ ఫలితాన్ని ఆరు ఓవర్లకు కుదించటం మా అవకాశాల్ని దెబ్బతీసింది. ఓవరాల్ గా చూస్తే మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది'అని మురళీధరన్ పేర్కొన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో వర్షం పడటం వల్ల కేకేఆర్ విజయలక్ష్యాన్ని 48 పరుగులకు నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని కోల్ కతా 5.2 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ తో కేకేఆర్ తలపడనుంది. -
తడబడిన సన్ రైజర్స్
► కోల్ కతా లక్ష్యం 128 ► మ్యాచ్ కు వర్షం అడ్డంకి బెంగళూరు: కోల్ కతా నైట్ రైడర్స్ తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. కోల్ కతా బౌలర్ల దాటికి 7 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే ధావన్(11) వికెట్ కోల్పోయింది. ముందు నుంచి నెమ్మదిగా ఆడిన సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఏదశలో బ్యాట్ ఝలిపించలేక పోయారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి సన్ రైజర్స్ వికెట్ కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతరువాత కొద్ది వేగం పెంచిన వార్నర్-విలియమ్సన్ జోడి ఎక్కువ సేపు కొనసాగించలేకపోయింది. కౌల్టర్-నిల్ బౌలింగ్ లో విలియమ్సన్(24) క్యాచ్ అవుటవ్వగా, వెంటనే వార్నర్(37) పీయుష్ చావ్లా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ నిలదొక్కుకోలేకపోయారు. కీలక మ్యాచ్ లో యువరాజ్ (9) మరోసారి నిరాశ పర్చాడు. విజయ్ శంకర్(22) వేగంగా ఆడే ప్రయత్నంచేసినా కౌల్టర్-నిల్ మరో సారి దెబ్బకొట్టాడు. అదే ఓవర్లో క్రిస్ జోర్డాన్ డక్ అవుటవ్వడంతో జట్టు 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నమాన్ ఓజా (16) చివరి బంతికి క్యాచ్ అవుటవ్వడంతో కోల్ కతాకు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక కోల్ కతా బౌలర్లలో కౌల్టర్ నిల్ 3 వికెట్లు, ఉమేశ్ యాదవ్ కు 2 వికెట్లు తీయగా, బౌల్ట్, పీయుష్ చావ్లాకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం ప్రారంభమవడంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లతో గ్రౌండ్ ని కప్పేశారు. -
మన హైదరాబాదీ దూరం
బెంగళూరు: బెంగళూరు: గత మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో జట్టును ప్లే ఆఫ్ కు చేర్చిన లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ ఎలిమినేటర్ మ్యాచ్ కు దూరమయ్యాడు. సన్ రైజర్స్ బిపుల్ శర్మను ఎంపిక చేయడంతో సిరాజ్ స్థానం కోల్పోవల్సి వచ్చింది. గత గుజరాత్ లయన్స్ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం హైదరాబాదీ అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఈ ఎలిమినేటర్ రసవత్తరపోరుకు చిన్న స్వామి స్టేడియం వేదికవ్వగా, టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్-2 లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. టైటిల్ నెగ్గాలంటే ఖచ్చితంగా రెండు మ్యాచ్ లు గెలవాల్సిందే. ఇప్పటికే ఇరు జట్లు లీగ్ దశలో రెండు సార్లు తలపడగా చెరో సారి విజయం సాధించాయి. ఇక బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరు జట్లు బలాలు సమంగా ఉన్నాయి. చేతి వ్రేలి గాయంతో మ్యాచ్ కు దూరం అవుతాడని భావించిన యువరాజ్ ఎట్టకేలకు తుది జట్టులోకి వచ్చాడు. అయితే జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కోల్ కతా టీం లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సూర్య కుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నిల్, పీయుష్ చావ్లా, ఇషాంక్ జగ్గి జట్టులోకి రాగా గాయంతో మనీష్ పాండే దూరం అవ్వగా కుల్దీప్ బెంచ్ కు పరిమితం అయ్యాడు. .తుది జట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, లిన్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, గ్రాండ్‌హోమ్, సునీల్ నరైన్, సూర్యకుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నిల్ పీయుష్ చావ్లా, బౌల్ట్, ఉమేశ్ యాదవ్. సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), ధావన్, విజయ్ శంకర్, విలియమ్సన్, యువరాజ్, నమన్ ఓజా, క్రిస్ జోర్డాన్, బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్. -
ఐపీఎల్: ఉప్పొంగిన 'యువ'కెరటాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పది సంవత్సరాలుగా భారత యువ టాలెంట్ కు వేదికైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లకు భవిష్యత్తునిచ్చింది. కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ అవకాశాలను గల్లీ క్రికెటర్లకు సైతం కల్పించింది. ఇలా ప్రతి సీజన్లో ఓ గల్లీ క్రికెటర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యారు. విదేశీ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమంటూ అసాధరణ ప్రతిభ కనబరుస్తున్న యువ కెరటాల ప్రదర్శన పై ఓ లుక్కెద్దాం.. నితీష్ రాణా- ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉందంటే నితీష్ రాణా బ్యాట్ ఝలిపించడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో178 పరుగుల చేజింగ్ లో ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా 29 బంతుల్లో 50 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజారత్ పై 53 పరుగులు, కింగ్స్ పంజాబ్ 198 పరుగుల భారీ లక్ష్య చేదనలో 62 పరుగులు చేసిన రానా జట్టుకు కీలక విజయాల్లో ముఖ్యపాత్ర వహించాడు. 13 మ్యాచ్ లు ఆడిన రాణా మూడు అర్ద సెంచరీలతో 333 పరుగులు చేశాడు. బసీల్ తంపి- గుజరాత్ లయన్స్: గుజరాత్ లయన్స్ పేసర్ బసీల్ తంపి గంటకు140 కీ.మీ వేగంతో బంతిని విసరగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో పరుగుల ఇవ్వకుండా కట్టడిచేయడంలో దిట్ట. యార్కర్లు, స్టో డెలివరీలు వేస్తు ప్రత్యర్ధులను కట్టిడిచేసిన తంపి 12 మ్యాచుల్లో 3/29 ఉత్తమ ప్రదర్శనతో 11 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టు గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయిన తన ప్రతిభను చాటుకున్నాడు. రాహుల్ త్రిపాఠి: రైజింగ్ పుణె ఫైనల్ చేరడంలో త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించాడు. కొన్ని కీలక మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్ తో రాబట్టాడు. ఈ సీజన్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిపాఠి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇక కోల్ కతా తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 98 పరుగులతో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించాడు. 12 మ్యాచ్ లు ఆడిన త్రిపాఠి 2 అర్ధ సెంచరీలతో 388 పరుగులు బాది తన సత్తా చాటాడు. రిషబ్ పంత్, ఢిల్లీ డేర్ డెవిల్స్: ఈ సీజన్లో అసాధారణ ప్రతిభతో అభిమానుల మనసు దోచుకున్న యంగ్ క్రికెటర్ గా పంత్ గుర్తింపు పొందాడు. తన ఆట తీరుతో ఏకంగా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పంత్..వారితో మా ఫ్యూచర్ ధోని రిషబ్ పంతే అనేలా చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటి చేత్తో గెలిపించి దిగ్గజ క్రికెటర్ల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 9 సిక్సర్లు బాది 97 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే పంత్ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపించగా ఢిల్లీ కోచ్ ద్రావిడ్ మాత్రం టీం ఇండియా ఫ్యూచర్ పంతే అని కొనియాడాడు. తండ్రి మరణాంతరం ఐపీఎల్ లో పాల్గొన్న పంత్ బెంగళూరు పై ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయడం అందరి మనసులును కదిలించింది.14 మ్యాచులు ఆడిన పంత్ 366 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్- సన్ రైజర్స్ హైదరాబాద్: కేవలం భారత క్రికెటర్లకే కాకుండా క్రికెట్ ఆడే చిన్నదేశాల ఆటగాళ్లను సైతం వెలుగులోకి తెచ్చింది ఐపీఎల్. ఈ ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. కానీ ఈ సీజన్లో అప్ఘన్ బౌలర్ అసాధరణ ప్రతిభకు క్రికెట్ అభిమానులు దాసోహం అన్నారు. ఐపీఎల్ వేలం అధిక ధర రూ.4 కోట్లు వెచ్చించి ఈ బౌలర్ ను తీసుకోవడం అందరీని ఆశ్చర్య పరిచింది. కానీ సన్ రైజర్స్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాణించాడు రషీద్. 13 మ్యాచులు ఆడిన అప్ఘన్ బౌలర్ 17 వికెట్లు పడగొట్టాడు. -
ధోనిని పొగడ్తలతో ముంచిన స్మిత్
ముంబై: రైజింగ్ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. ధోని ధనాధన్ షాట్ లతో ముంబై ఇండియన్స్ పై రైజింగ్ పుణె 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ధోని 26 బంతుల్లో 40 పరుగులు చేయడంతో జట్టు 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మిత్ మహీ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. వాంఖేడే పిచ్ ను బౌలింగ్ పిచ్ గా పరిగణించామని, దీనికి కావల్సిన పరుగులను చివర్లో మనోజ్, మహీ రాబట్టారన్నాడు. పిచ్ మందకోడిగా ఉందని. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న కూడా మహీ పరుగుల రాబట్టడాని స్మిత్ కొనియాడాడు. అజింక్యా రహానే జట్టుకు శుభారంబాన్ని అందించడం కూడా జట్టు విజయానికి కలిసొచ్చిందని స్మిత్ తెలిపాడు. అయితే పుణె 18 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలింది. మెక్లిన్ గన్ వేసిన19 ఓవర్లో మనోజ్ తివారీ నో బాల్ ను బౌండరీకి బాది, ఆతరువాతి ఫ్రీ హిట్ బంతిని సిక్సర్ గా మలిచాడు. అనంతరం సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ వచ్చిన ధోని సిక్సర్లతో విరుచుకుపడటంతో పుణె ఈ ఓవర్లో 26 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్ చివరి బంతికి మనోజ్ తివారీ రనౌట్ అయినా ముంబై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ధోని రెండు సిక్స్ లు బాదడంతో పుణెకు 15 పరుగులు చేరాయి. -
కొనసాగుతున్న ధోని 'లవ్ ఎఫైర్'
ముంబై: వాంఖెడే మైదానంతో ఎంఎస్ ధోని లవ్ ఎఫైర్ కొనసాగుతోంది. ఈ స్టేడియంలో 'మిస్టర్ కూల్' ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇదే వేదికపై శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువాన్ కులశేఖర బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టీమిండియా వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంతో కీలకపాత్ర పోషించాడు. అప్పటివరకు 8 మ్యాచుల్లో 150 పరుగులు మాత్రమే చేసిన ధోని ఫైనల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి వాంఖేడ్తో తన అనుబంధాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. పుణే సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మొదటి ప్లేఆఫ్ మ్యాచ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోని బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికీ పుణె స్కోరు 89/3గా ఉంది. ధోని ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరుకు పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 5 సిక్సర్లతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్లో ధోని 2 భారీ సిక్సర్లు బాదాడు. 20 పరుగులతో ముంబైను చిత్తు చేయడంతో ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. తుదిపోరులోనూ ధోని చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ఐపీఎల్: హిస్టరీ రిపీట్ అయింది!
ముంబై: ఐపీఎల్ లో 2011లో క్వాలిఫయర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన జట్టు కచ్చితంగా ఫైనల్‌కు చేరడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం పుణే జట్టు దాన్ని రిపీట్ చేసింది. ఐపీఎల్10 సీజన్లో తుది పోరుకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చేరుకుంది. ఇక్కడి వాంఖేడెలో నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై పుణే నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెగ్గితేనే ఫైనల్ చేరుతుంది. ఆపై ఈ సీజన్లో ఆడిన మూడుసార్లు తమను ఓడించిన పుణేపై ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఉంటుంది. 2017లో ఐపీఎల్-10లోనూ ఇప్పుడు అదే జరిగింది. క్వాలిఫయర్-1లో పటిష్టమైన ముంబయిని కంగు తినిపించిన స్టీవ్ స్మిత్ సేన ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో నెంబర్ వన్ గా ఉన్న జట్లు 2012, 2016 సీజన్లలో ఫైనల్ చేరలేదు. కానీ ప్రతి సీజన్లోనూ రెండో స్థానంలో ఉన్న జట్టు ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే.. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఫైనల్లో టాప్1, 2 జట్లు తలపడితే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న జట్టునే విజయం వరిస్తూ వచ్చింది. 2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. 14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు నెగ్గి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ లు నెగ్గి 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి. నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. గెలిచిన జట్టును క్వాలిఫయర్-2లో మట్టికరిపిస్తేనే ముంబై ఫైనల్ చేరుతుంది. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ (క్వాలిఫయర్-2 విన్నర్) ? -
ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో టీమిండియా క్రికెటర్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ -10లో ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో పుణే ఆటగాడు ధోనీ రికార్డు స్థాయిలో ఏడోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత వహించిన ఏకైక క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఆ జట్టు తరఫున ఏకంగా ఆరుసార్లు ఫైనల్ మ్యాచ్ లో భాగస్వామి అయ్యాడు. కెప్టెన్‌గా రెండుసార్లు చెన్నైకి ఐపీఎల్ కప్ అందించాడు. గత రెండు సీజన్ల నుంచి పుణే జట్టకు ఆడుతున్న ధోనీ ఐపీఎల్-10లో ఫైనల్ ఆడబోతున్న ఆ జట్టులో కీలక ఆటగాడు. నిన్న (మంగళవారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో ధోనీ వీర విహారం చేయడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విలువైన సలహాలిస్తూ, అవసరమైనప్పుడు ఫీల్డింగ్ సెట్ చేస్తూ జట్టు విజయంలో ధోనీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎంఎస్ ధోనీ (26 బంతుల్లో 40 నాటౌట్; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓటమిపాలైంది. మూడు వికెట్లు తీసి పుణే విజయంలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ (3/16)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే
-
‘సుందరం’... సుమధురం
►ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే ►చెలరేగిన సూపర్ జెయింట్ ►20 పరుగులతో ముంబై చిత్తు ►రాణించిన సుందర్, శార్దుల్ ►ఆకట్టుకున్న ధోని, రహానే, తివారి పుణే సూపర్ ఆటతో ఐపీఎల్–10 ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత ఏడాది అవమానకర రీతిలో ఏడో స్థానంలో నిలిచిన జెయింట్ టీమ్ ఈసారి అదరగొట్టే ప్రదర్శనతో టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ప్రత్యర్థి వేదికపై 162 పరుగుల సాధారణ స్కోరు చేసి కూడా జెయింట్ అద్భుత ఆటతీరుతో ఆ స్కోరును కాపాడుకోగలిగింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ముంబై ఇండియన్స్ ఛేదనలో బోర్లా పడింది. ఫలితంగా రెండు మరాఠా జట్ల పోరులో వరుసగా మూడోసారీ పుణేదే పైచేయి అయింది. బ్యాటింగ్‌లో రహానే, తివారి అర్ధ సెంచరీలు... ఆపై తన ఫ్రాంచైజీ యజమానులు మునివేళ్లపై నిలబడి చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉండగా ధోని మెరుపు సిక్సర్ల ప్రదర్శన పుణేను మెరుగైన స్థితిలో నిలిపాయి. అనంతరం 17 ఏళ్లు కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ముగ్గురు ముంబై స్టార్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను పుణే చేతుల్లోకి తెచ్చేశాడు. లీగ్‌లో రెండో ఏడాదే ఫైనల్ చేరి సత్తా చాటిన స్మిత్ సేన, ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధించగా, ముంబైకి రెండో క్వాలిఫయర్ రూపంలో టైటిల్ పోరుకు చేరేందుకు మరో అవకాశం ఉంది. ముంబై: సంచలన ఆటతో పుణే సూపర్ జెయింట్ ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పుణే 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. పార్థివ్ పటేల్ (40 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (3/16), శార్దుల్ ఠాకూర్ (3/37) ప్రత్యర్థి పని పట్టారు. నేడు జరిగే ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచే జట్టుతో ముంబై 19న రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. ఆ రెండు ఓవర్లు... ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి తొలి ఓవర్లోనే డకౌట్... రెండో ఓవర్లో స్మిత్ (1) డగౌట్‌కు... పవర్ ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు కేవలం 33 పరుగులు. ఇలాంటి స్థితిలో రెండు కీలక భాగస్వామ్యాలు పుణేకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి. ముందుగా రహానే, తివారి మూడో వికెట్‌కు 65 బంతుల్లో 80 పరుగులు జోడించగా, ఆ తర్వాత తివారి, ధోని కలిసి నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 73 పరుగులు జత చేశారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో రహానే, తివారి చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో పరుగులు రావడం గగనంగా మారిపోయింది. ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు పూర్తిగా ఆగిపోయాయి. హార్దిక్ వేసిన ఒక ఓవర్లో పుణే 15 పరుగులు రాబట్టినా, ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే, ఐపీఎల్లో 3 వేల పరుగులు కూడా దాటాడు. అయితే చక్కటి బంతితో రహానేను అవుట్ చేసి కరణ్ ఈ జోడీని విడదీశాడు. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ధోని భారీ సిక్సర్ బాదినా... తివారి మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్న సమయంలో ఒక దశలో 32 బంతుల వ్యవధిలో కేవలం ఒక ఫోర్, ఒక సిక్సర్ మాత్రమే వచ్చాయంటే పరిస్థితి అర్థమవుతుంది. 18 ఓవర్లు ముగిసేసరికి పుణే స్కోరు 121 పరుగులు మాత్రమే. అయితే చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు రాబట్టడం విశేషం. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్లలో ధోని 2 భారీ సిక్సర్లు బాదగా, తివారి 6, 4 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ధోని మరో 2 సిక్సర్లు కొట్టడంతో పుణే 15 పరుగులు సాధించింది. పార్థివ్ మినహా... లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఒకవైపు పార్థివ్ దూకుడుగా ఆడగా, మరో ఎండ్‌లో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఉనాద్కట్ ఒక పరుగే ఇవ్వగా... తర్వాతి మూడు ఓవర్లలో పార్థివ్ ఒక్కో సిక్సర్ బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే దురదృష్టకర రీతిలో సిమన్స్ (5) అవుట్ కావడంతో ముంబై పతనం ప్రారంభమైంది. పార్థివ్ కొట్టిన షాట్ బౌలర్ శార్దుల్ చేతికి తగిలి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లను పడేసే సమయంలో సిమన్స్ క్రీజ్ బయటే ఉన్నాడు. తర్వాతి ఓవర్లో సుందర్ ముంబైని పెద్ద దెబ్బ కొట్టాడు. తొలి బంతికి రోహిత్ (1)ను అవుట్ చేసిన అతను, నాలుగో బంతికి అంబటి రాయుడు (0) ఆట ముగించాడు. తన తర్వాతి ఓవర్లోనే పొలార్డ్ (7)ను సుందర్ వెనక్కి పంపించగా, కొద్ది సేపటికి హార్దిక్ (14) కూడా అవుటయ్యాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పార్థివ్ క్రీజ్‌లో ఉండటంతో ముంబై విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే శార్దుల్ వేసిన ఓవర్‌తో ముంబై పూర్తిగా విజయావకాశాలు కోల్పోయింది. భారీ షాట్లు ఆడే క్రమంలో ఈ ఓవర్ మూడో బంతికి కృనాల్ పాండ్యా (15), చివరి బంతికి పార్థివ్ లాంగాఫ్‌లో క్రిస్టియాన్కే క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత ముంబై ఆట నామమాత్రమే అయింది. -
ధోని దూకుడు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అజింక్యా రహానే(56;43 బంతుల్లో 5 ఫోర్లు 1సిక్స్), మనోజ్ తివారీ(58;;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు, మహేంద్ర సింగ్ ధోని(40 నాటౌట్;26 బంతుల్లో 5 సిక్సర్లు) దూకుడు జత కావడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ త్రిపాఠి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(1) కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో పుణె తొమ్మిదిపరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో రహానే -తివారీల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది.ఈ క్రమంలోనే రహానే 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 80 పరుగులు జత చేసిన తరువాత రహానే మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అప్పుడు తివారీకి ధోని జతకలిశాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పుణె రన్ రేట్ తగ్గింది. అయితే ఆఖరి రెండు ఓవర్లలో ధోని బ్యాట్ ఝుళిపించడంతో పుణె స్కోరు బోర్డులో వేగం పెరిగింది. చివరి రెండు ఓవర్లలో ధోని నాలుగు సిక్సర్లు సాధించడం ఇక్కడ విశేషం. దాంతో పుణె నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మలింగా, మెక్లీన్ గన్, కరణ్ శర్మలకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్-10: ఫైనల్ కు చేరేదెవరో?
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత రైజింగ్ పుణెను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ సీజన్ లీగ్ దశలో రైజింగ్ పుణెతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైకి ఓటమి ఎదురైంది. దాంతో అసలు సిసలు సమరంలో పుణెపై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై సిద్ధమైంది. మరొకవైపు ఫైనల్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై ఆశిస్తోంది. అదే సమయంలోముంబైపై తమకున్న సూపర్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ మరోసారి పైచేయి సాధించాలని పుణే భావిస్తోంది. అయితే ప్రారంభంలోకన్నా రెండో దశలో అనూహ్య ఆటతీరుతో చెలరేగుతున్న పుణే... ఇప్పటికే తాహిర్ సేవలను కోల్పోగా తాజాగా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. దీంతో అద్భుత ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే ఆ జట్టు తీవ్రంగా శ్రమించక తప్పదు. పుణే జట్టు ప్లే ఆఫ్ వరకు చేరుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదు. అయితే మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ ఈ జట్టు ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆరితేరుతూ ప్రత్యర్థులను మట్టికరిపించింది. పుణె పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టి ఆ జట్టులో కీలక బౌలర్ గా మారాడు. అతనికి శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ సహకరిస్తున్నారు. ఈ త్రయం మరోసారి ముంబైపై విజృంభించాలని భావిస్తుంది. స్పిన్నర్ జంపా కూడా రాణించడం ఈ జట్టుకు కలిసొచ్చేది. బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, రహానే, ధోని, మనోజ్ తివారి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే క్రమంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.ఒకవేళ తొలి క్వాలిఫయర్ లో ఓడితే 19న బెంగళూరులో జరిగే రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. మరి తుది పోరుకు ముందుగా ఎవరు చేరతారో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
నా తొలి ప్రాధాన్యత అదే: ఏబీ
న్యూఢిల్లీ: తాను జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో ఏ ఒక్క మ్యాచ్ ను వదులుకోవడానికి ఇష్టపడనని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే పలు మ్యాచ్ లను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన డివిలియర్స్ దానిపై తాజాగా స్పందించాడు. 'నా తొలి ప్రాధాన్యత జాతీయ జట్టుకే.ఐపీఎల్లో పలు మ్యాచ్ లను మిస్సయి ఉండవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా తరపున ఒక గేమ్ కూడా మిస్ కావడానికి నా దగ్గర ప్రణాళికలు లేవు. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఎప్పుడూ వదులుకోను. నా ఫామ్ పై ఎటువంటి ఆందోళన లేదు. మీరు ఆశించినా, ఆశించకపోయినా నా ఫామ్ పై బెంగ లేదు. కొన్ని మంచి షాట్లతో ఇన్నింగ్స్ ఆరంభిస్తే, ఫామ్ ను అందుకోవడం కష్టం కాదు. నేను సెంచరీ చేయకపోయినప్పటికీ, బంతిని హిట్ చేయడంలో నాది ఎప్పుడు ఒకటే పద్ధతి'అని డివిలియర్స్ పేర్కొన్నాడు. -
ముంబై ఇండియన్స్ కు ఛాన్స్ లేదా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక కేవలం నాకౌట్ సమరం మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సీజన్ కు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ దశలో నిలిచిన నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ చరిత్ర ఏం చెబుతుంది అనే దానిపై చర్చ మొదలైంది. ప్రధానంగా లీగ్ దశలో టాప్ ప్లేస్‌లో నిలిచిన ముంబై ఇండియన్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లలో గెలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉండగా,ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఆడే అవకాశం ఉంది. ఎలిమినేటర్ రౌండ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-1లో పరాజయం చెందిన జట్టు ఆడుతుంది. దాంతో టాప్ -2లో ఉన్న ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లకు ఇది కచ్చితంగా అదనపు అవకాశంగానే చెప్పొచ్చు. ఇక్కడ 14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు గెలిచి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ ల్లో విజయంతో 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. ప్రధానంగా 2011 లో ప్లే ఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టాక లీగ్ దశలో తొలి స్థానంలో ఉన్న జట్టు ట్రోఫీని గెలిచిన సందర్భాలు లేవు. దాంతో ప్రస్తుతం టాప్ లో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా ట్రోఫీని గెలిచే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ కు ముంబై ఇండియన్స్ చెక్ పెడుతుందో లేదో చూడాలి. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లను పరిశీలిస్తే.. 2011:ఆర్సీబీ(1) వర్సెస్ సీఎస్కే (2)-విజేత సీఎస్కే 2012: కేకేఆర్(2)వర్సెస్ సీఎస్కే(4)-విజేత కేకేఆర్ 2013: సీఎస్కే(1) వర్సెస్ ముంబై ఇండియన్స్(2)- విజేత ముంబై ఇండియన్స్ 2014: కింగ్స్ పంజాబ్(1) వర్సెస్ కేకేఆర్(2) -విజేత కేకేఆర్ 2015:సీఎస్కే(1)వర్సెస్ ముంబై ఇండియన్స్(2)-విజేత ముంబై 2016:ఆర్సీబీ(2) వర్సెస్ ఎస్ఆర్హెచ్(3)- విజేత ఎస్ఆర్హెచ్ -
ఐపీఎల్- ప్లేఆఫ్స్: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
- గాయంతో నెహ్రా ఔట్.. యూవీ ఫిట్‌నెస్‌పై డౌట్స్ - హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్‌పైనే అదనపు భారం.. బెంగళూరు: ప్లేఆఫ్స్ ముంగిట ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురు‘దెబ్బ’! పేస్ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న వెటరన్ బౌలర్ ఆశిశ్ నెహ్రా ఇకపై జట్టుకు దూరం కానున్నాడు. అటు, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫిట్నెస్పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రా నిష్క్రమణను అధికారికంగా ప్రకటించారు. ప్లేఆఫ్ బెర్త్ కోసం గుజరాత్ లయన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ నెహ్రా స్టాండ్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటడం, ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న సంగతి తెలిసిందే. నెహ్రా గైర్హాజరీతో సన్‌రైజర్స్ ఆడబోయే అన్ని ప్లేఆఫ్ మ్యాచ్‌లలో సిరాజ్‌కు స్థానం ఖాయమైనట్లే. అయితే ఈ యువ బౌలర్ అదనపు భారాన్ని సునాయాసంగా మోయగడా? లేదా? లైవ్‌లో చూడాల్సిందే! నేడు యూవీకి పరీక్షలు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా యువీ చిటికెన వేలికి తీవ్రగాయం కావడం, దాంతో గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను ఆడలేకపోవడం తెలిసిందే. బుధవారం యువీ ఫిట్నెస్ పరీక్షల్ని ఎదుర్కొంటాడని, ఫిట్‌గా ఉన్నట్లు తేలితే తుది జట్టులో ఖచ్చితంగా ఆడతాడని కోచ్ టామ్ మూడీ చెప్పారు. ప్లే ఆఫ్స్‌లో భాగంగా హైదరాబాద్ జట్టు.. 17న(బుధవారం) బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. -
దారుణ వైఫల్యాలపై స్పందించిన క్రిస్ గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో అత్యంత దారుణ ప్రదర్శన ఇచ్చిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). గతేడాది ఫైనల్స్ చేరిన జట్టేనా ఇప్పుడు మనం చూస్తున్నది అన్నట్లుగా ఘోరంగా విఫలమై కేవలం మూడు విజయాలతో ఓవరాల్‌గా 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆర్సీబీ దారుణ వైఫల్యంపై ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ ఎట్టకేలకే స్పందించాడు. 'వరుస ఓటములతో పూర్తిగా నిరాశచెందాం. ఈ సీజన్ మాకు పాఠం నేర్పించింది. వైఫల్యాలతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. జట్టులో లోపాలు తెలుసుకున్నా ఆర్సీబీ సమిష్టిగా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఇంకా చెప్పాలంటే బౌలర్లు, బ్యాట్స్మెన్లలో ఏ ఒక్కరూ రాణించకపోవడం ఆర్సీబీని దారుణంగా దెబ్బతీసింది. అలాంటి సమయాలలో సమష్టిగా గేమ్ ప్లాన్ చేసుకుని ఆడాలి. అప్పుడు విజయాల బాట పట్టేవాళ్లం. కానీ ఆర్సీబీ అలా చేయకపోవడంతో చివరికి అట్టడుగున నిలవాల్సి వచ్చింది. వచ్చే సీజన్లో మంచి ప్రదర్శన చేస్తామని' గేల్ ధీమా వ్యక్తం చేశాడు. తమ చివరి మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ పై నెగ్గి విజయంతో సీజన్‌ను ముగించింది ఆర్సీబీ. క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ స్టార్ ప్లేయర్స్ ఉన్న జట్టు ఓ మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసింది. -
సెహ్వాగ్ పరువు తీసిన 'లంబూ'!
మొహాలీ: గతంలో టీమిండియా పేస్ దళాన్ని నడిపించిన బౌలర్ ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకుని మేనేజ్మెంట్ తప్పిదం చేసింది. ఎందుకంటే ఏ జట్టు అతడిపై నమ్మకం ఉంచలేదు. వేలంలో ఎవరూ కొనుగోలు చేయని సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని తీసుకుంది. పంజాబ్ టీమ్ మెంటర్, డైరెక్టర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒత్తిడి తేవడంతోనే ఇషాంత్‌కు చాన్స్ వచ్చింది. లేనిపక్షంలో ఐపీఎల్-10 సీజన్లో ఇషాంత్ (టీమిండియా క్రికెటర్లు పిలిచేపేరు 'లంబూ')ను చూసేవాళ్లం కాదు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ లాంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ పంజాబ్ పేస్ ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇషాంత్ శర్మను సెహ్వాగ్ జట్టులోకి తీసుకున్నాడు. ఇషాంత్‌ను ఎవరైనా కొంటారా అంటూ చిరకాల మిత్రుడు గంభీర్ కామెంట్ చేయగా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇషాంత్‌ను వెనకేసుకొచ్చాడు. అయితే సీజన్లో చెత్త ప్రదర్శన చేసిన బౌలర్లలో ఇషాంత్ ముందు వరసలో ఉంటాడు. సెహ్వాగ్ తనపై ఉంచిన నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీశాడు. ఒక్క మ్యాచ్‌లోనూ రాణించకపోగా.. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతూ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్లో అత్యధిక బంతులు (108) వేసి ఒక్క వికెట్ తీయలేని బౌలర్‌గా అపవాదు మూటకట్టుకున్నాడు. తానాడిన 6 మ్యాచ్‌లలో 18 ఓవర్లు వేసిన ఇషాంత్ ఒక్క వికెట్ పడగొట్టలేదు. కనీసం ఒక రనౌట్‌లోనైనా భాగస్వామి కాలేదు, కనీసం ఒక్క క్యాచైనా పట్టి ఒక బ్యాట్స్‌మెన్ ఔట్ కావడంలోనూ అతడు పాలుపంచుకోలేదు. ప్రస్తుత సీజన్లో తమ చివరి మ్యాచ్‌లో పుణే చేతిలో దారుణ ఓటమితో ఆ జట్టు కథ ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్ కథ ముగిశాక ఇషాంత్ బౌలింగ్‌పై సోషల్ మీడియాతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'మా క్రికెటర్లు ఐపీఎల్లో ఆడతారు'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో తమ దేశ క్రికెటర్లు పాల్గొనకుండా చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎత్తుగడలు వేస్తుందంటూ వచ్చిన వార్తలను మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తాజాగా పేర్కొన్నాడు. అసలు ఐపీఎల్ కు ఆసీస్ క్రికెటర్లను దూరం చేయాలనే భావన తమ దేశ క్రికెట్ బోర్డుకు లేదన్నాడు. ప్రధానంగా ఐపీఎల్ ను అమితంగా ప్రేమించే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను ఆడనివ్వకుండా చేయడానికి సీఏ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నాడు. 'ఐపీఎల్ అనేది ఒక అద్భుతమైన టోర్నమెంట్. క్రికెటర్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా గేమ్ చాలా గొప్పది. డొనాల్డ్ బ్రాడ్ మన్లాంటి దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు తీసుకున్నా గేమ్ ఉంది కదా. ఎవరు వెళుతున్నారు.. ఎవరు ఉంటున్నారు అనేది పెద్ద విషయమే కాదు. వరల్డ్ లో క్రికెట్ అనేది గొప్ప గేమ్. క్రికెట్ ను ప్రేమించే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు ఐపీఎల్లో కచ్చితంగా ఆడతారు' అని క్లార్క్ తెలిపాడు. -
మాది సమష్టి వైఫల్యం:క్రిస్ గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తమ జట్టు పేలవ ప్రదర్శనకు సమష్టిగా వైఫల్యమే కారణమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ కుండ బద్ధలు కొట్టాడు.. ఇక్కడ ఏ ఒక్కర్నో నిందించాల్సిన పని లేదని గేల్ అభిప్రాయపడ్డాడు. 'మా ప్రదర్శన మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అన్ని డిపార్ట్మెంట్ల సమష్టి వైఫల్యమే మా ఘోర ఓటములకు కారణం. మా జట్టులో చాలా అతుకులున్నాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ మా ఓవరాల్ ఆట బాగాలేదు. దాంతోనే ముందుగా టోర్నీ నుంచి బయటకు వచ్చేశాం. కాకపోతే తమ జట్టు కొన్ని సందర్భాల్లో బాగానే ఆడిందని గేల్ పేర్కొన్నాడు.ఇది తమకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. -
టీమిండియా ఆశాకిరణం అతను..
న్యూఢిల్లీ: రాబోవు కాలంలో భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రధాన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నాడు దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్. ఇటీవల కాలంలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్ .. టీమిండియా ఆశాకిరణంగా ద్రవిడ్ అభివర్ణించాడు. భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయంటూ ద్రవిడ్ జోస్యం చెప్పాడు. ఆ కుర్రాడిలో అసాధారణ ప్రతిభ ఉందనడానికి అతను ఏడాది కాలంగా ఆడిన ఇన్నింగ్స్ లే ఉదాహరణగా పేర్కొన్నాడు. తన తండ్రిని కోల్పోయి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న సమయంలో కూడా ఒక టోర్నీకి దూరం కాకూడదనే రిషబ్ పంత్ చూపించిన తెగువ అతని మానసిక బలాన్ని చూపుతుందని ద్రవిడ్ తెలిపాడు. 'ఈ ఏడాది రిషబ్ పంత్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మంచి ఇన్నింగ్స్ లతో సత్తా చాటుకున్నాడు. అతను కచ్చితంగా టీమిండియా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఐపీఎల్ టోర్నీకి ముందు అతను తండ్రి మరణించాడు. అది రిషబ్ కు క్లిష్ట సమయం. తండ్రిని పోగుట్టుకున్న బాధలో కూడా టోర్నమెంట్ కు దూరం కాకూడదనుకున్నాడు. అది అతని మానసిక పరిపక్వతను చూపుతుంది'అని ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సీజన్ లో ఢిల్లీ ఆరు విజయాలతో సరిపెట్టుకోవడంపై ద్రవిడ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఏడాది ఏడు మ్యాచ్ ల్లో గెలిస్తే, ఈ ఏడాది ఆరు మ్యాచ్ ల్లో మాత్రమే గెలుపొందడం నిరాశపరిచిందన్నాడు. కనీసం ఎనిమిది మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే క్రమంలో తాము పోరాడి ఓడిపోయామన్నాడు. చాలా మ్యాచ్ ల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓటమి పాలుకావడం తమ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. -
ఈ ఐపీఎల్‌ను మరచిపోదాం..
న్యూఢిల్లీ:తమకు అంతగా కలిసిరాని ఐపీఎల్-10 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు ఎంత తొందరగా మరచిపోతే అంత మంచిదని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఓవరాల్ ఐపీఎల్లో తమపై అత్యంత ప్రభావం చూపిన సీజన్ ఏదైనా ఉందంటే అది ఇదేనని కోహ్లి పేర్కొన్నాడు. ఈ సీజన్ చాయలు ఎక్కడ కనిపించకుండా తదుపరి ఐపీఎల్ కు సిద్ధమవుతామని పేర్కొన్నాడు. 'మా యావత్ జట్టు ప్రదర్శనపై విపరీతమైన ప్రభావం చూపిన ఐపీఎల్ సీజన్ ఇది. ఇది మాకు కచ్చితంగా ఒక గుణపాఠమే. మేము ఎలా విఫమయ్యామో అన్వేషించుకోవడానికి ఈ సీజన్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో పునరుత్తేజంతో సన్నద్ధం కావడానికి కూడా దోహదం చేస్తుంది' అని కోహ్లి పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన తరువాత కోహ్లి మీడియాతో మాట్లాడాడు. దీనిలో భాగంగా యువ పేసర్లు హర్షల్ పటేల్(3/43), అవేష్ ఖాన్(1/23)ల ప్రదర్శనపై కోహ్లి పొగడ్తలు కురిపించాడు. వీరిద్దరూ మనసు దోచుకునే విధంగా ఆడారని కొనియాడాడు. ఈ పిచ్ పై వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం చేయలేని పనిని వీరిద్దరూ సమర్ధవంతంగా నిర్వర్తించారంటూ ప్రశంసించాడు. -
'స్పెయిన్‌లో బీర్లు తాగండి'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10 సీజన్ ను విడిచి ఉన్నపళంగా వచ్చేయమంటూ తమ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్‌లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదేశించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల వరకూ వారిని అనుమతించకుండా వచ్చేయమనడం వెనుక ఈసీబీ ఉద్దేశమేమిటని పీటర్సన్ ప్రశ్నించాడు. ఇంత ఎంత మాత్రం సరైన చర్య కాదని విమర్శించాడు. ఈ సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు బెన్ స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, ముంబై ఇండియన్స్ తరపున జాస్ బట్లర్ ఆడుతున్నాడు. అయితే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సిన క్రమంలో వీరిని వచ్చేయమంటూ ఈసీబీ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఐపీఎల్లో పుణె, ముంబై ఇండియన్స్ లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐపీఎల్లో ప్లే ఆఫ్ కు చేరడంలో వీరి పాత్ర వెలకట్టలేనిదిగా పేర్కొన్న పీటర్సన్.. ఆ ఇద్దరి పరిస్థితి చూస్తే మనస్సును కరిగించేదిగా ఉందన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్లు తిరిగి స్వదేశానికి పయనం కావడంపై సెటైర్లు గుప్పించాడు. ' వారిద్దరూ ఐపీఎల్ ను విడిచి వెళ్లడం చాలా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ప్లే ఆఫ్ దశలో వారిద్దరూ వెళ్లిపోవడం ఒకింత బాధగా ఉంది.. అదే సమయంలో వారి పరిస్థితి చూసి జాలి కూడా వేస్తుంది. ఇక్కడ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడే బదులు స్పెయిన్ కు వెళ్లి బీర్లు తాగండి' అని పీటర్సన్ చమత్కరించాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు సంబంధించి ఇంగ్లండ్ జట్టు స్పెయన్ లో శిక్షణా శిబిరం నిర్వహించనుంది. -
వారివల్లే ఓడాం: సెహ్వాగ్
పుణె: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లపై ఆజట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్, ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం విదేశీ ఆటగాళ్ల బాధ్యారాహిత్యం వల్లే ప్లేఆఫ్ చేరలేకపోయిందని విమర్శించాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్ ఆటతీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. ప్రధాన ఆటగాళ్లలో ఏఒక్కరు సరిగ్గా ఆడలేదు. నలుగురు కీలక ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 12-15 ఓవర్లు వరకు క్రీజులో నిలబడాలి. కానీ ఎవరూ ఆబాధ్యత తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి పిచ్‌లపైనైనా ఆడగల సత్తా ఉండాలి. పిచ్ మందకొడిగా ఉందని చెప్పడం సమంజసం కాదు. జట్టు కోసం కనీసం 20 ఓవర్లైనా నిలవలేరా? జట్టులో ప్రధాన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన మాక్స్వెల్, షాన్ మార్ష్, మోర్గాన్‌లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. వారి ఆటతీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. పరిస్థితులకు అనుగుణంగా 10-12 ఓవర్లు ఆడి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత మార్ష్‌ది. కెప్టెన్‌గా మాక్స్వెల్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. ఈ సీజన్లో రాణించిన ఆమ్లా జట్టుకు దూరం కావడంతో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. -
క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు
-
రైజింగ్ పుణెకు ఎదురుదెబ్బ
పుణె: ఐపీఎల్-10లో ప్లే ఆఫ్ కు చేరి మంచి ఊపుమీద ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పెట్టి మరీ దక్కించుకున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్లే ఆఫ్ కు దూరమవుతున్నాడు. బెన్ స్టోక్స్ ను ఉన్నపళంగా వచ్చేయమంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెచ్చరికలు జారీ చేయడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని కింగ్స్ పంజాబ్ మ్యాచ్ తరువాత పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ప్లే ఆఫ్ కు స్టోక్స్ లేకపోవడం పూడ్చలేని లోటుగా స్మిత్ అభివర్ణించాడు. 'జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో స్టోక్స్ స్వదేశానికి వెళ్లనున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ కు లేకపోవడం పూడ్చలేని లోటు. అయినప్పటికీ మాకున్న అనేక ఆప్షన్లను పరిశీలించి స్టోక్స్ లేని లోటును పూడ్చుకుంటామని ఆశిస్తున్నా. రిజర్వ్ బెంచ్ లో మా జట్టు మెరుగ్గానే ఉంది. దాంతో స్టోక్స్ కు ప్రత్యామ్నాయం వెతుకుతాం' అని స్మిత్ పేర్కొన్నాడు. మరొకవైపు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఇది మాకు చాలా గొప్ప రోజు. మా బౌలర్లు చెలరేగి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు ముగిసే వరకూ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురు కొత్త ఆటగాళ్లకు వెలుగులోకి వచ్చారు. దాంతో మా జట్టు సమతుల్యంగా తయారైంది. రెండో విడత మ్యాచ్ ల్లో మా జట్టు అనేక మంచి విజయాల్ని సొంతం చేసుకుంది' అని జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్ లు ఆడిన స్టోక్స్ 316 పరుగులు నమోదు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 నాటౌట్. ఇక బౌలింగ్ లో 12 వికెట్ల తీసి ఫర్వాలేదనిపించాడు.ప్రస్తుతం అతను స్వదేశానికి పయనం కానుండటంతో పుణెకు ప్లే ఆఫ్ కు ముందు గట్టి ఎదురుదెబ్బగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
డేర్ డెవిల్స్ విజయలక్ష్యం 162
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే విష్ణు వినోద్(3) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్ గేల్- విరాట్ కోహ్లిలు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. గేల్ (48;38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ మిస్సవ్వగా, విరాట్ కోహ్లి(58;45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 66 పరుగుల్ని జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే గేల్ అవుటైన స్వల్ప వ్యవధిలో ట్రావిస్ హెడ్(2)తో పాటు కోహ్లి కూడా నిష్ర్కమించడంతో బెంగళూరు తడబడింది. ఇక చివర్లో పవన్ నేగీ(13 నాటౌట్;5 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, నదీమ్ లు తలో వికెట్ తీశారు. -
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
-
చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?
-
ముంబై ఇండియన్స్ అరుదైన ఫీట్
కోల్ కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో కోల్ కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్కు చేరింది. అయితే ముంబై ఇండియన్స్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. ట్వంటీ 20 క్రికెట్ లో వంద మ్యాచ్ ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా ముంబై అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 176 ట్వంటీ 20 మ్యాచ్ లాడిన ముంబై వంద విజయాలు సాధించగా, 73 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. మరో గేమ్ టైగా ముగియగా, రెండు రద్దయ్యాయి. కాగా, ఐపీఎల్లో మాత్రం ముంబైకు ఇది 89వ విజయం. ఓవరాల్ ఐపీఎల్లో 154 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ 64 మ్యాచ్ ల్లో ఓటమి చెందగా, ఒకటి టైగా ముగిసింది. 2010 నుంచి 2014 వరకూ చాంపియన్స్ లీగ్ లో ముంబై ఇండియన్స్ 11 విజయాల్ని సొంత చేసుకోగా, తొమ్మిది ఓటముల్ని చవిచూసింది. దాంతో మొత్తంగా కలుపుకుని వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా ముంబై సరికొత్త ఘనతను కైవసం చేసుకుంది. -
చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా ఒకే ఒక్క లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, మరో రెండు రోజుల్లో నాకౌట్ పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ లో గెలిచిన పుణె చివరిగా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇదిలా ఉంచితే , ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్-రాయల్ చాలెంజర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు విజయాలు సాధించగా, ఆర్సీబీ మాత్రం రెండు విజయాల్నే తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఐపీఎల్ -10లో ఇదే చివరి లీగ్ కావడంతో గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. మరొకవైపు చివరి లీగ్ లో గెలుపు ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
-
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన రసవత్తర పోరులో పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఆకట్టుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తొమ్మిది వికెట్లతో తేడాతో గెలిచి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ 73 పరుగులోకే ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఇది ఓవరాల్ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ అత్యల్ప స్కోరుగా నమోదైంది. పుణె బౌలర్లు శార్ధుల్ ఠాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కుప్పకూలింది. ఇక ఆపై 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణె భారీ విజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి (28) వికెట్ కోల్పోయినా మిగతా పనిని అజింక్యా రహానే (34 నాటౌట్), స్టీవ్ స్మిత్ (15 నాటౌట్) లు పూర్తి చేశారు. దాంతో ఇంకా 8 ఓవర్లకు మిగిలి ఉండగానే పుణె విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ లోకి ప్రవేశించిన రైజింగ్ పుణె పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. -
క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు
పుణె: ఐపీఎల్-10లో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అద్భుత కీపింగ్ తో అదరగొడుతున్నాడు. గత మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు శ్యామ్యుల్స్ ను రెప్పపాటులో స్టంప్ అవుట్ చేసి ఔరా అనిపించుకున్నధోని, తాజా కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఓ క్యాచ్ ను అద్భుతంగా పట్టి ఆశ్చర్య పరిచాడు.. ఉనద్కత్ వేసిన 13 ఓవర్ నాలుగో బంతికి స్వప్నిల్ సింగ్ స్లిప్ లో ఉన్న క్రిస్టియన్ కు క్యాచ్ ఇవ్వగా బంతి అతని వేళ్లకు తగిలి పైకి లేచింది. వెంటనే అప్రమత్తమైన ధోని బంతిని అందుకున్నాడు. 'నీవు వదిలినా నేను వదలను' అన్నట్లు ధోని పట్టిన క్యాచ్ ను చూసిన వారంతా హతాశులయ్యారు. ఇక బెంగళూరు మ్యాచ్ లో డివిలియర్స్ ను స్టంప్ అవుట్ చేసిన విధానం కూడా కీపింగ్ లో ధోనికి ఎవరూ సాటిలేరని నిరూపించింది. ఇలా ఈ సీజన్ లో అంతగా బ్యాట్ ఝులిపించకపోయినా తన కీపింగ్ తో మాత్రం అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో 100 మంది అవుట్ చేసిన ఘనతను అందుకున్న ధోని వికెట్ల వెనుకాల చిరుతలా కదులుతూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. -
కుప్పకూలిన కింగ్స్ పంజాబ్
► ఆఖరి పోరులో విఫలమైన కింగ్స్ పుణె: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు మధ్య జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 73 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ అర్హత కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. పుణే బౌలర్లు శార్ధుల్ టాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే గప్టిల్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వృధ్దిమాన్ సాహా, షాన్ మార్ష్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా టాకుర్ మార్ష్(10) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేకపోయాడు. దీంతో కింగ్స్ పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా క్రిస్టియన్ అడ్డుపడ్డాడు. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ లో మాక్స్ వెల్, గప్టిల్ డకౌట్ అవ్వగా, అక్సర్(22), సాహా(13), మార్ష్(10), స్వప్నిల్(10) లు మినహా మిగతా అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. దీంతో కింగ్స్ పంజాబ్ 15.5 ఓవర్లకే ఆలౌట్ అయింది. -
ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇది ఇరు జట్లకు చివరి లీగ్ కావడంతో పాటు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్ కావడంతో దీనికి అధిక ప్రాధ్యాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో పుణె గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం పుణె నాకౌట్ కు చేరడం కష్టమే. ప్రస్తుతం రన్ రేట్ ప్రకారం కింగ్స్ పంజాబ్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరే నాల్గో జట్టుగా నిలుస్తుంది. ఇక్కడ ఇరు జట్లకు గెలుపు అనేది ముఖ్యం కావడంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. గత మ్యాచ్ లో ఢిల్లీపై పుణె ఓడిపోవడంతో ఆ జట్టుకు ఇది కీలక మ్యాచ్ గా మారిపోయింది. మరొకవైపు వరుస విజయాలతో కింగ్స్ పంజాబ్ చెలరేగిపోవడంతో పుణెను కలవర పెడుతోంది. కచ్చితంగా గెలవాల్సిన రెండు వరుస మ్యాచ్ ల్లో కింగ్స్ విజయం సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణె తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
-
ధోని రికార్డు బద్దలు కొట్టిన గంభీర్
కోల్‌కతా: ఐపీఎల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ రికార్డుల వేట కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా మరో ఘనత సాధించాడు. ఒక ఫ్రాంచైజీ తరపున కెప్టెన్‌గా ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా ఐపీఎల్లో 3 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోని(2986) పేరిట ఉన్న రికార్డును గౌతీ సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో గంభీర్ 21 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా 3 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్(4088) నాలుగో స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 4540 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి(4360), రోహిత్ శర్మ(4156) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 3977 పరుగులతో డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో నిలిచాడు. -
టైటిల్ రేసులో మనోళ్లు..
-
రాణించిన రాయుడు, తివారీ
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న చివరి లీగ్ మ్యాచులో ముంబై యువ ఆటగాళ్లు సౌరభ్ తివారి, అంబటి రాయుడులు మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ముంబై, కోల్ కతాకు సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సిమన్స్ బౌల్ట్ బౌలింగ్ లో డక్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, సౌరభ్ తివారితో కలిసి ఆచితూచి నెమ్మదిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు 51/1 చేయగలిగింది. ఈ తరుణంలో రోహిత్ శర్మ(27)ను రాజ్ పుత్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన అంబటి రాయుడు, సౌరభ్ తో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 9 ఫోర్లతో 42 బంతుల్లో సౌరభ్ అర్థశతకం సాధించాడు. వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఉమేశ్ వేసిన 17 ఓవర్లో లేని పరుగు ప్రయత్నించిన సౌరభ్ తివారీ రనౌటయ్యాడు. అయినా రాయుడు బ్యాటింగ్ లో వేగం తగ్గకుండా ఆడటంతో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు(63) కుల్దీప్ యాదవ్ వేసిన 19 ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మరుసటి బంతికి స్టంప్ అవుటయ్యాడు. చివరి ఓవర్లో బోల్ట్ 5 పరుగులిచ్చి పోలార్డ్(13) అవుట్ చేయడంతో ముంబై 5 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేయగలిగింది. ఇక కోల్ కతా బౌలర్ల లో బోల్ట్ కు రెండు వికెట్లు పడగా కుల్డీప్ యాదవ్, రాజ్ పుత్ లకు చెరో వికెట్ లభించింది. -
ఐపీఎల్-10 ఫైనల్ రిఫరీ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: ఐపీఎల్-10 సీజన్లో మే 21న హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా భారత మాజీ దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీనాథ్ క్వాలిఫైర్-1, ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక మే 16న జరగబోయే క్వాలిఫైర్-1 మ్యాచ్ కు ఎస్ రవి, శాంషుద్దీన్ లు, ఫైనల్ మ్యాచ్ కు రవి, నిగెల్ లియోంగ్ లను ఫీల్డ్ అంపైర్ లుగా నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఫ్లే ఆఫ్ మ్యాచ్ లకు రిఫరీలుగా శ్రీనాథ్, మనూ నాయర్, చిన్మయా శర్మ లు బాధ్యతలు నిర్వహించనున్నారు. జవగల్ శ్రీనాథ్ భారత్ తరపున 229 వన్డేలు ఆడాడు. భారత తరపున వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ శ్రీనాథ్. 2003 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన భారత్ జట్టులో శ్రీనాథ్ కీలక సభ్యుడు. -
టాస్ నెగ్గిన గంభీర్ సేన
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభమయింది. అయితే కోల్ కతా జట్టులోగాయం తో బాధపడుతున్న క్రిస్ వోక్స్ స్థానంలో ట్రేంట్ బోల్ట్ ను ఎంపిక చేసింది. ఇక ముంబై ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. కోల్ కతాకు ఈ మ్యాచ్ సంక్లిష్టంగా మారింది. ఈ మ్యాచ్ ఓడితే పంజాబ్ మ్యాచ్ ఫలితంపై ఎదురు చూడల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ కోల్ కతా ఈ మ్యాచ్ ఓడి పంజాబ్ పుణే పై గెలిస్తే మూడు జట్లు 16 పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ బెర్త్ ను కైవసం చేసుకోగా, కోల్ కతా సమీపంలో ఉంది. 13 మ్యచుల్లో 9 గెలిచిన ముంబై 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకొనసాగుతుండగా, కోల్‌కతా 8 గెలిచి మూడో స్తానంలో కొనసాగుతుంది. ఇంతకు ముందు ఇరు జట్లు ఒక సారి తలపడగా విజయం ముంబైని వరించింది. కోల్ కతా ఈ మ్యాచ్ లో ఎలాగై నెగ్గి ముంబై పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడం ముంబైని కలవర పెడుతుంది. పంజాబ్ తో అనూహ్యాంగా ఓడిన ఇరు జట్లు ఓటములకు బ్రేక్ వేయాలని భావిస్తున్నాయి. -
టైటిల్ రేసులో మనోళ్లు..
► ప్లే ఆఫ్ లోకి హైదరాబాద్ ► వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన విజయ్ శంకర్ కాన్పుర్: గుజరాత్ లయన్స్ పై 8 వికెట్లతో విజయం సాధించిన సన్ రైజర్స్ సగర్వంగా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ కు ముందు గెలిస్తే ప్లే ఆఫ్ కు లేకపోతే పంజాబ్ మ్యాచ్ ఫలితం పై ఆధారపడే సందిగ్థత నేలకొనగా ఎట్టకేలకు గుజరాత్ పై గెలిచి సత్తా చాటింది. ఈ విజయంతో ఢిఫెండింగ్ ఛాంపియన్ లుగా టైటిల్ రేసులో ఉన్నామని ప్రత్యర్ధులకు హెచ్చరిక జారీ చేసింది. 155 పరుగుల లక్ష్యచేదనకు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్ ధావన్(18) నిరాశ పర్చగా హెన్రీక్స్ (4) కూడా వెంటనే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ తో కెప్టెన్ వార్నర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నంలో నెమ్మదిగా ఆడడంతో సన్ రైజర్స్ పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లుకోల్పోయి 47 పరుగులే చేసింది. అంకిత్ సోని వేసిన పదో ఓవర్ మూడో బంతి వార్నర్ బ్యాట్ కు ఎడ్జ్ అయి కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. వేంటనే కార్తీక్ పెద్దగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ అది రిప్లే లో బ్యాట్ కు ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ లైఫ్ అనంతరం వార్నర్ రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికి యవబ్యాట్స్ మన్ విజయ్ శంకర్ 35 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఇది విజయ్ శంకర్ కు ఐపీఎల్ కెరీర్ లో తొలి అర్ధ సెంచరీ, ఇక 9 ఫోర్ల తో వార్నర్ 69, 9 ఫోర్లతో విజయ్ శంకర్ 63 లతో 133 పరుగుల భాగస్వామ్యం అందించడంతో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. చివరి బంతిని వార్నర్ ఫోర్ కొట్టి సన్ రైజర్స్ ను గెలిపించాడు. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ లయన్స్ యువ బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీయడంతో 154 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాట్స్ మెన్ లో ఇషాన్ కిషాన్(61), డ్వాన్ స్మిత్(54), రవీంద్ర జడేజా (20 నాటౌట్)లు మినహా మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 4 వికెట్ల తో గుజరాత్ పతనాన్ని శాసించిన యువబౌలర్ మహ్మద్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
మన హైదరాబాదీ కుమ్మేశాడు..
► రాణించిన రషీద్ ఖాన్ ► 154 పరుగులకే కుప్ప కూలిన గుజరాత్ కాన్పుర్: సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్ లో మన హైదరాబాద్ యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ దాటికి లయన్స్ తోక ముడిచింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, స్మిత్, రవీంద్ర జడేజా మినహా మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వడంతో లయన్స్ 154 పరుగులకే కుప్పకూలింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.యువ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ 27 బంతుల్లో ఐపీఎల్ కేరిర్ లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయగా మరో ఓపెనర్ డ్వాన్ స్మిత్ కూడా 33 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరి బ్యాటింగ్ దాటికి గుజరాత్ పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 105 పరుగు చేసింది. 7 ఫోర్లు 4 సిక్స్ లతో 54 పరుగులు చేసిన స్మిత్ ను రషీద్ ఖాన్ వికెట్లు ముందు బోల్త కొట్టించడంతో గుజరాత్ వికెట్ల పతనం మొదలైంది. వీరిద్దరు తొలి వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 5 ఫోర్లు, 4 సిక్సర్ లతో 61 పరుగులు చేసిన ఇషాన్ ను, సురేశ్ రైనా (2) లను యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన దినేశ్ కార్తిక్(0), ఆరోన్ ఫించ్(2) లను స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో గుజరాత్123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ లయన్స్ 12 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. తర్వాత బ్యాటింగ్ కు దిగిన జడేజా, ఫాల్కనర్ లు ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన సిరాజ్ మరో సారి దెబ్బ కొట్టాడు. సిరాజ్ వేసిన 16 ఓవర్లో ఫాల్కనర్(8), ప్రదీప్ సంగ్వాన్(0) లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేసి గుజరాత్ పతనాన్ని శాసించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఓక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేదు. పోటాపోటిగా సన్ రైజర్స్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. ఒక వైపు రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో గుజారాత్ 4 బంతుల్లో మిగిలి ఉండాగానే కుప్పకూలింది. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3, భువనేశ్వర్ 2 ,వికెట్లు పడగొట్టగా సిద్దార్థ్ కౌల్ కు ఒక వికెట్ దక్కింది. -
ఎంఎస్ ధోని ‘వంద’నం
న్యూఢిల్లీ: ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వంద మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్‌గా ఖ్యాతికెక్కాడు. ఫిరోషా కోట్లా మైదానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతడీ ల్యాండ్‌మార్క్‌ను చేరుకున్నాడు. జాదవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ పట్టి ధోని ‘వంద’ నం చేశాడు. ఐపీఎల్లో వంద మందిని అవుట్ చేసిన ఘనత ధోని కంటే ముందు దినేష్ కార్తీక్ సాధించాడు. 35 ఏళ్ల ధోని 156 ఐపీఎల్ మ్యాచుల్లో 71 క్యాచులు, 29 స్టంపింగ్స్ చేశాడు. ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ తరపునే 129 మ్యాచులు ఆడాడు. గత సీజన్ నుంచి రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రెండేళ్లు నిషేధం విధించడంతో అతడు టీమ్ మారాల్సివచ్చింది. -
జహీర్‌ఖాన్ ఐపీఎల్ ‘సెంచరీ’
ఢిల్లీ: రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ క్రికెటర్ జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో పదును ఏమాత్రం తగ్గలేదు. 38 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వంద వికెట్లు పడగొట్టి మరోసారి మెరిశాడు. ఫిరోషా కోట్లా మైదానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. అజింక్య రహానేను క్లీన్‌బౌల్డ్ చేసి ఐపీఎల్ వందో వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా, 8వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్లో 10 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. లలిత్ మలింగ(152), అమిత్ మిశ్రా(134), హర్భజన్ సింగ్(127), పియూష్ చావ్లా(123), డ్వేన్ బ్రావొ(122), భువనేశ్వర్ కుమార్(108), ఆశిష్ నెహ్రా(106), వినయ్ కుమార్(101), రవిచంద్రన్ అశ్విన్(100) ఇంతకుముందు ఐపీఎల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నారు. 92 టెస్టులు ఆడిన జహీర్‌ఖాన్ 32.94 సగటుతో 311 వికెట్లు పడగొట్టాడు. 200 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. 17 టి20ల్లో 17 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
-
రైజింగ్ పుణేకు షాక్
-
రైజింగ్ పుణేకు షాక్
⇒ ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం ⇒ మనోజ్ తివారి పోరాటం వృథా లక్ష్యం 169 పరుగులు.. వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌కు ఇది ఏమంత కష్టసాధ్యమైనదేమీ కాదనే అంతా భావించారు. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు మాత్రం చివరి బంతి వరకు పోరాడి ప్రత్యర్థిని కంగుతినిపించారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌లో దర్జాగా చోటు దక్కించుకుందామనుకున్న స్మిత్ బృందం ఇక తమ చివరి మ్యాచ్ వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. న్యూఢిల్లీ: సూపర్ ఫామ్‌లో ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జోరును ఢిల్లీ డేర్‌డెవిల్స్ అడ్డుకుంది. లక్ష్యం భారీగా లేకపోయినా పేసర్లు జహీర్ ఖాన్ (2/25), మొహమ్మద్ షమీ (2/37) అద్భుత బౌలింగ్ కారణంగా పుణే వణికింది. అంతకుముందు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్ (45 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్లన్ శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. ఉనాద్కట్, స్టోక్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడింది. మనోజ్ తివారి (45 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతి వరకు పోరాడాడు. స్మిత్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. కరుణ్ ఒక్కడే... టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆద్యంతం ఓపెనర్ కరుణ్ నాయర్ నడిపించాడు. తొలి మూడు ఓవర్లలోనే సంజూ సామ్సన్ (2), ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (3) అవుట్ కావడంతో 9 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కరుణ్, రిషబ్ పంత్ జోరుతో పరుగుల వేగం పెరిగింది. నాలుగో ఓవర్లో కరుణ్ రెండు ఫోర్లు, రిషబ్ ఓ సిక్స్ బాదగా.. ఐదో ఓవర్లో కరుణ్, ఆరో ఓవర్లో పంత్ మూడేసి ఫోర్లతో రెచ్చిపోవడంతో ఈ రెండు ఓవర్లలోనే 28 పరుగులు వచ్చాయి. అయితే తొమ్మిదో ఓవర్లో జంపా ఈ జోడిని విడదీశాడు. అప్పటికే ఆ ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టిన పంత్‌ను తను అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్లన్ శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 37 బంతుల్లో కరుణ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు వరుస ఓవర్లలో అండర్సన్ (3), కమిన్స్ (11) పెవిలియన్‌కు చేరడంతో జట్టు స్కోరు నెమ్మదించింది. అయితే 18వ ఓవర్లో నాయర్ రెండు ఫోర్లు, మిశ్రా ఓ సిక్స్ బాదడంతో 19 పరుగులు రాగా పుంజుకుంది. ఆ తర్వాత ఓవర్లో నాయర్‌ను స్టోక్స్ అవుట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో షమీ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర స్టోక్స్ అద్భుత రీతిలో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. డీప్ మిడ్వికెట్లో తను బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో బౌండరీ లైన్ దాటేస్తానని భావించి మెరుపువేగంతో బంతిని తిరిగి మైదానంలోకి విసిరాడు. అయితే అది కిందపడేలోపే తను మరోసారి లోనికి వచ్చి అందుకున్నాడు. తివారి ఒంటరి పోరు లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణేకు ప్రారంభంలోనే జహీర్ ఖాన్ షాక్ ఇచ్చాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయని తను ఈసారి తొలి బంతికే రహానేను డకౌట్ చేశాడు. అలాగే దీంతో ఐపీఎల్లో వంద వికెట్లను పూర్తిచేసుకున్నాడు. అయితే నాలుగో ఓవర్లో కెప్టెన్ స్మిత్ 4,6,4తో చెలరేగి 14 పరుగులు రాబట్టాడు. ఐదో ఓవర్లో జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జహీర్ తన మూడో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (7)ని అవుట్ చేశాడు. ఈ సమయంలో స్మిత్‌కు జతగా మనోజ్ తివారి నిలిచాడు. తివారి వరుసగా రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జోరు మీదున్న స్మిత్‌ను తొమ్మిదో ఓవర్లో చక్కని లైన్ అండ్ లెంగ్త్ బంతితో ఎల్బీగా అవుట్ చేశాడు. మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పరుగులకు కట్టడి చేయగలిగారు. అయితే ఫీల్డర్ల వైఫల్యంతో తివారి వరుసగా రెండు ఓవర్లలో ఇచ్చిన క్యాచ్‌లు మిస్ అయ్యాయి. 16వ ఓవర్లో స్టోక్స్‌ను షమీ అవుట్ చేయగా నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ధోని (5) షమీ సూపర్ త్రోకు రనౌట్ కాగా క్రిస్టియాన్ (3) ఎల్బీగా అవుట్ అయి ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్లో 25 పరుగులు రావాల్సి ఉండగా తివారి వరుసగా రెండు సిక్సర్లు, ఆ తర్వాత ఓ ఫోర్ బాదినా ఫలితం లేకపోయింది. -
ఐపీఎల్లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్?
► ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల పాత్ర ? ► ముగ్గురిని అరెస్టు చేసిన కాన్పూర్ పోలీసులు ► రూ.41 లక్షలు స్వాధీనం న్యూఢిల్లీ: ఐపీఎల్ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట. ప్రపంచ దేశాల ఆటగాళ్లు ఒకచొట చేరి ఆడే ఆట. ఇది ప్రపంచంలో క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందిస్తనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఐపీల్‌కు ఓ మచ్చ ఉంది. అది మ్యాచ్ ఫిక్సింగ్. 2013లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆటగాళ్లు ఆరోపణలు ఎదర్కున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్లు ఐపీఎల్ నుంచి తప్పించారు. అయితే తాజాగా మరో ఫిక్సింగ్ ఉదంతం వెలుగుచూసింది. ఐపీఎల్‌పై ఫిక్సింగ్ , చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు గుజరాత్ లయన్స్ ఆటగాళ్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీసీఐ, ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖకు గురువారం సమాచారం అందించిన సమాచారంతో రమేష్ నయన్ షా, రమేష్ కుమార్, వికాష్ కుమార్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖ వీరిని అరెస్టు చేసింది. వీరి వద్ద పోలీసులు నుంచి రూ.41 నగదు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కుమార్ గ్రీన్ పార్క్ స్టేడియంలో హోర్డింగుల కాంట్రాక్టర్. ఇతడు క్రికెట్ బెట్టింగులు పెట్టే అజ్మీర్‌కు చెందిన బంటి పేరుమీద గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఉండే హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆటగాళ్లతో కలిసినట్లు పోలీసులు భావిస్తునారు. ప్రస్తుతం బంటి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల మీద నిఘా ఉందని, వారితో రమేష్ నయన్ షా తరచుగా వారితో కాంటాక్టులో ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇంకా ఇది నిర్ధారణ కాలేదన్నారు. -
చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్
-
సాహోరే... పంజాబ్
-
సాహోరే... పంజాబ్
►చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్ ►ప్లే ఆఫ్ ఆశలు సజీవం ►పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ►సాహా మెరుపు ఇన్నింగ్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గాల్సిన ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ‘కింగ్స్’లా చెలరేగింది. వృద్ధిమాన్ సాహా (93 నాటౌట్) తుదికంటా క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించి పెట్టగా.. ఆ తర్వాత బౌలర్లు పట్టు విడవకుండా ప్రయత్నించి లీగ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించారు. అయితే పొలార్డ్ చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నించి పంజాబ్‌ను వణికించాడు. మ్యాక్స్‌వెల్ సేన ఇక తమ చివరి మ్యాచ్‌లో పుణేపై కచ్చితంగా నెగ్గి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ముంబై: వాంఖెడే మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. 231 పరుగుల లక్ష్యం.. టి20ల్లో ఇది కష్టసాధ్యమైనదే అయినా ముంబై ఇండియన్స్ మాత్రం చివరి బంతి వరకు పోరాడింది. అయితే ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ ఓ భారీ సిక్స్ బాదినా మోహిత్ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. అంతకుముందు వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్ (24 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాహాకు దక్కింది. సాహా, మ్యాక్స్ దూకుడు... ఫామ్‌లో ఉన్న ఆమ్లా లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ లోటు లేకుండా ఓపెనర్లు గప్టిల్, సాహా అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లోనే గప్టిల్ రెండు, సాహా ఓ ఫోర్‌తో జట్టు 13 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓవర్లో సాహా రెచ్చిపోయి మూడు ఫోర్లు బాదడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ దూకుడుకు పంజాబ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన గప్టిల్ మూడో బంతికి వెనుదిరిగాడు. ఇక మ్యాక్స్‌వెల్ రాకతో రన్‌రేట్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కరణ్ శర్మ ఓవర్లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన తను అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్న దశలో బుమ్రా బోల్తా కొట్టించాడు. అప్పటికే జట్టు స్కోరు 11 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులకు చేరింది. ఓవర్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన సాహా 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో మార్‡్ష (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) అవుటైన అనంతరం స్కోరులో కాస్త వేగం తగ్గింది. శుభారంభం అందినా.. లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్లో పార్థివ్ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్లో సిమన్స్ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే సిమన్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పదో ఓవర్లో సిమన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర గప్టిల్ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ (5), నితీశ్ రాణా (12) వరుసగా అవుట్ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సందీప్.. పాండ్యా వికెట్ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది. ఆదివారం వరకు వేచి చూడాలేమో! ►ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలవడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ►నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ►శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోవాలి. ►శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్... పుణే, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదేమో! -
ఫలించిన పంజాబ్ వ్యూహం
► సాహా విజృంభణ.. ముంబైకి భారీ లక్ష్యం ► రాణించిన మాక్స్ వెల్, గప్టిల్, షాన్ మార్ష్ ముంబై: కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ బ్యాట్స్ మెన్ వృద్దిమాన్ సాహా 93 పరుగులతో విజృంభించడంతో పంజాబ్ ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో వైపు ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్ గా ప్రయత్నించిన పంజాబ్ వ్యూహం ఫలించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. ఇక మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహా లు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. వేగంగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, సాహా తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మాక్స్ వెల్ హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్ లు బాదడంతో జట్టుకు 21 పరుగులు చేరాయి. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసిన మాక్స్ వెల్ బూమ్రా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాహా కి తోడుగా మార్ష్ కూడా చెలరేగడంతో 15 ఓవర్లకే పంజాబ్ 173 పరుగులు చేయగలిగింది.ఈ తరుణంలో భారీ షాట్ కుప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారంతా పోటా పోటిగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ 18 ఓవర్లోనే 200 పరుగులకు చేరుకొంది. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధికంగా 230 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్ లకు తలో వికెట్ దక్కింది. -
కింగ్స్ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గురువారం ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత కింగ్స్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన ముంబై ఇండియన్స్ కు ఇది నామమాత్రపు మ్యాచ్ కాగా, కింగ్స్ పంజాబ్ కు మాత్రం కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తేనే నాకౌట్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంటుంది. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం కింగ్స్ పంజాబ్ కు దారులు మూసుకుపోయినట్లే. దాంతో అమీతుమీ తేల్చుకునేందుకు కింగ్స్ పంజాబ్ సన్నద్ధమైంది. చివరిమ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న పంజాబ్ అదేజోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో కంగుతున్న ముంబై తిరిగి విజయాల బాట పట్టాలని కృత నిశ్చయంతో ఉంది. కింగ్స్ పంజాబ్ తుది జట్టు: మ్యాక్స్ వెల్(కెప్టెన్), మనన్ వోహ్రా, మార్టిన్ గప్టిల్, షాన్ మార్ష్, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్, రాహుల్ తెవాతియా, మ్యాట్ హెన్రీ, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మ ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, లెండిల్ సిమన్స్, పార్ధీవ్ పటేల్, నితీశ్ రానా, కీరన్ పొలార్డ్, కరణ్ శర్మ, హర్భజన్ సింగ్, మెక్లీన్గన్, జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా -
ఇంత టాలెంట్ ఉందనుకోలేదు: విలియమ్సన్
ముంబై: ఐపీఎల్-10 సీజన్లో లోకల్ టాలెంట్ వెలుగులోకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ యువ ఆటగాళ్ల టాలెంట్ అధ్భుతమని, ఇక్కడి యువ ఆటగాళ్లలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదని, ఇక్కడికి వచ్చి వారితో నెట్స్ లో ప్రాక్టీస్ చేశాక అర్ధమైందని విలియమ్సన్ తెలిపాడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆడక ముందే బంతిని సునాయసంగా బౌండరీలకు తరలిస్తున్నారని విలియమ్సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. సన్ రైజర్స్ యువ బౌలర్లు సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్ అధ్భుతంగా రాణిస్తున్నారని, జట్టులో దీపక్ హుడా కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడని విలియమ్స్ కొనియాడాడు. ఇక ఢిల్లీ టాప్ ఆర్డర్ లోని యువ బ్యాట్స్ మెన్ ల ఆటను ఆసక్తికరంగా చూస్తున్నానని విలియమ్సన్ పేర్కొన్నాడు. పుణే ఆటగాడు రాహుల్ త్రిపాఠి అసాధారణ ప్రతిభతో రాణిస్తున్నాడని యువ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. ఐపీఎల్ తో భారత్ యువ ఆటగాళ్లతో స్నేహం పెరిగిందని, ఇది ప్రపంచ క్రికెట్ కు మంచిదని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. 2017 అంతర్జాతీయ ఉత్తమ బ్యాట్స్ మెన్ అయిన విలియమ్సన్ ను సన్ రైజర్స్ కొన్నిమ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసినా విలియమ్సన్ అడ్డు చెప్పలేదు. గత ముంబై మ్యాచ్ లో విలియమ్సన్ స్థానంలో అప్ఘాన్ స్పిన్నర్ మహ్మద్ నబీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
ఇక ఐపీఎల్లో ఆసీస్ క్రికెటర్లు ఆడరా?
సిడ్నీ:గత పదేళ్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఈ లీగ్ కు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్ క్రికెటర్లకు పలురకాలైన జాతీయ కాంట్రాక్ట్‌లు అప్పజెప్పి వారిని ఐపీఎల్ కు దూరం చేయాలనేది ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) ఆలోచనగా ఉంది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో దాదాపు రెండు నెలల పాటు దూరంగా ఉండటం ఆ క్రికెట్ బోర్డుకు రుచించడంలేదు. దానిలోభాగంగా కొత్త కాంట్రాక్ట్‌లు, వివిధ రకాల సుదీర్ఘ కాంట్రాక్ట్‌లు పేరుతో వారిని ఐపీఎల్ కు దూరం చేయాలని యోచిస్తోంది. ప్రధానంగా ఆటగాళ్లు తరచు గాయాల బారిన పడటం కూడా సీఏకు మింగుడు పడటం లేదు. దాంతో ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లకు మూడేళ్ల సుదీర్ఘ కాంట్రాక్ట్‌ను అప్పచెప్పాలని చూస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఆసీస్ క్రికెటర్లు ఆయా కాంట్రాక్ట్‌లతో బిజీగా ఉండటమే కాదు.. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా కాస్త ఎక్కువగానే లబ్ది పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హజల్ వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి కీలక ఆటగాళ్లకు ఈ తరహా కాంట్రాక్ట్‌ను కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొంతమంది ఆసీస్ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇదే కేవలం సీఏ పాలక వర్గానికి మాత్రమే లబ్ది చేకూర్చేదిగా ఉందని, ఇందుకు తాము సమ్మతంగా లేమంటూ ఇప్పటికే బోర్డుకు పలువురు క్రికెటర్లు స్సష్టం చేసినట్లు తెలుస్తోంది. -
'ఓవరాల్ గా ఇదే చెత్త ప్రదర్శన'
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో ముందుగానే ఇంటిదారి పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్రదర్శనపై ఆ జట్టు ఆటగాడు షేన్ వాట్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ లీగ్ ప్రారంభమైన తరువాత నుంచి చూస్తే ఇదే తమ అత్యంత చెత్త ప్రదర్శనగా అభివర్ణించాడు. 'ఐపీఎల్లో ఆడటాన్ని ఆస్వాదిస్తాను. ఐపీఎల్లో పెద్దగా ఒత్తిడి ఉండదు. సొంత దేశానికి ఆడుతున్నప్పుడు పరిస్థితులు, ఐపీఎల్లో ఆడుతున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడ స్వేచ్ఛగా ఆడే వీలుంటుంది. అదే దేశం కోసం ఆడేటప్పుడు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇక్కడైతే అంతగా ఒత్తిడి ఉండదనేది నా అభిప్రాయం.ఎవరికి వారు వ్యక్తిగత ప్రదర్శన చేయాలనే భావిస్తారు. ఎల్లప్పుడూ పూర్తిస్థాయి ప్రదర్శన సాధ్యం కాదు. కాకపోతే ఈ ఐపీఎల్లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన చేశాం'అని వాట్సన్ పేర్కొన్నాడు. -
రైనా వద్దకు దూసుకొచ్చాడు..
కాన్పూర్:భారత దేశంలో క్రికెట్ క్రీడపై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. ఇక్కడ క్రికెట్ ను ఒక మతంలా భావిస్తారు. ఒక్కోసారి అభిమానులు తమ అభిమాన ఆటగాడిని కలిసేందుకు ఎటువంటి వెనుకంజ వేయరు. ఆటగాళ్లపై దూసుకొచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదే తరహా దృశ్యం బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్-గుజరాత్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా వద్ద దూసుకొచ్చాడో వీరాభిమాని. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సైతం దాటుకుని మరీ రైనా కలిసేందుకు స్టేడియంలోకి వచ్చేశాడు. దాంతో రైనా ఒక్కసారిగా కంగుతిన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చే లోపే కరాచలనం చేశాడు. అంతటితో ఆగకుండా పెన్-పేపర్ రైనా చేతికిచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడు. అయితే రైనా అతన్ని మందలించడంతో బలవంతగా మైదానాన్ని వీడాడు. గ్రౌండ్ సిబ్బంది అతన్ని పట్టుకుని స్టేడియంలోకి తీసుకెళ్లారు. ఆ క్రమంలో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కల్గింది. సదరు అభిమాని వేసుకున్న జెర్సీపై రైనా అని రాసి ఉంది. -
‘సెంచరీ గురించి ఆలోచించలేదు’
కాన్పూర్: సెంచరీ గురించి ఆలోచించలేదని, మ్యాచ్ గెలవడమే ముఖ్యం అనుకున్నానని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. గుజరాత్ లయన్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో శ్రేయస్ అద్భుతంగా ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. నాలుగు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 57 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. అత్యుత్తమ పోరాట పటిమ కనబరిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఈ సందర్భంగా శ్రేయస్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ నేను ముగిస్తే ఇంకా ఆనందపడేవాడిని. సెంచరీ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలని బ్యాటింగ్‌కు దిగినప్పుడే అనుకున్నా. సెంచరీ ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యం. ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించాను. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకోవడానికి ప్రయత్నిస్తాన’ని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌పై కెప్టెన్ జహీర్ ఖాన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిచి గౌరవప్రదంగా టోర్ని నిష్క్రమిస్తామని చెప్పాడు. గుజరాత్, ఢిల్లీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేదు. -
ఫించ్ మెరుపులు.. ఢిల్లీకి భారీ లక్ష్యం
-
అయ్యో పంత్!
కాన్పుర్: గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ కు వింత అనుభవం ఎదురైంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్రదీప్ సంగ్వన్ శాంసన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చిరావడంతోనే ఫోర్ కొట్టాడు. మరుసటి బంతిని ఆడబోయిన రిషబ్ వింతగా రనౌటై అందరినీ ఆశ్చర్యపర్చాడు. లెగ్ సైడ్ ఆడబోయిన పంత్ బంతి ప్యాడ్ కు తగలడంతో సంగ్వన్ అప్పీల్ చేశాడు. వేంటనే బంతిని అందుకున్న సురేశ్ రైనా వికెట్ల వైపు విసరడంతో నేరుగా తగిలింది. పంత్ క్రీజులో లేక పోవడంతో రనౌట్ గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇది కనురెప్పపాటులో జరగడంతో స్టేడియం అంతా హతాశులయ్యారు. అంపైర్ దర్ఢ్ ఎంపైర్ కి నివేదించినా రిషబ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు. రిషబ్ గుజరాత్ తో జరిగిన గత మ్యాచ్ లో సునామి ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. -
ఫించ్ మెరుపులు.. ఢిల్లీకి భారీ లక్ష్యం
► రాణించిన దినేష్ కార్తీక్ కాన్పుర్: ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అర్ధసెంచరీ చేయడంతో గుజరాత్ నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీకి 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఆదిలోనే ఓపెనర్ డ్వాన్ స్మిత్(8) వికెట్ కోల్పోయింది. లేని పరుగు ప్రయత్నించిన స్మిత్ రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(6) కమిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి నిరాశ పర్చాడు. ఇక గుజరాత్ పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో వైపు వేగంగా ఆడిన ఓపెనర్ ఇషాన్ కిషన్(34) కూడా మిశ్రా బౌలింగ్ లో అనవసరపు షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, ఆరోన్ ఫించ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. బ్రాత్ వైట్ వేసిన 17 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన దినేశ్ కార్తీక్ (40) అండర్సన్ అద్బుత క్యాచ్ కు వెనుదిరిగాడు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 92 పరుగులు జోడించడంతో గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఇదే ఓవర్ మరుసటి బంతిని సిక్స్ కొట్టిన ఫించ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫించ్ జడేజాతో కలిసి చెలరేగాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసిన ఫించ్ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో ఫాల్కనర్, జడేజా ఆచితూచి ఆడడంతో గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కమిన్స్, మిశ్రా, బ్రాత్ వైట్, షమీ లకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
కాన్పుర్: గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య ఇక్కడ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఢిల్లీ జట్టులో రబడా స్ధానంలో బ్రాత్ వైట్ తీసుకోగా గుజరాత్ లయన్స్ ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. నాకౌట్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఇరు జట్లు పరువు కోసం పోరాడుతున్నాయి. పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన గుజరాత్ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని తిరిగి విజయాల బాట పట్టాలని ఢిల్లీ కృతనిశ్చయంతో ఉంది. ఈ సీజన్ లో ఇరుజట్లు ఓసారి తలపడగా ఢిల్లీ పై చేయి సాధించింది. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది. తుది జట్లు ఢిల్లీ డేర్ డెవిల్స్: సంజూ శాంసన్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, అండర్సన్, శ్రేయస్ అయ్యర్, శ్యాముల్స్, బ్రాత్ వైట్, పాట్ కమ్మిన్స్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ,, జహీర్ ఖాన్ ( కెప్టెన్) గుజరాత్ లయన్స్: డ్వాన్ స్మిత్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా( కెప్టెన్), ఫించ్, రవీంద్ర జడేజా, ఫాల్కనర్, దినేశ్ కార్తీక్, బసీల్ తంపి, అంకిత్ సోని, కులకర్ణి, ప్రదీప్ సంగ్వన్. -
అక్సర్ క్యాచ్ తో పంజాబ్ ఆశలు సజీవం
న్యూఢిల్లీ: క్రికెట్ లో క్యాచ్ పట్టడం, జారవిడచడంతో మ్యాచ్ ఫలితాలే మారిపోయే సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో మాత్రం దీని ప్రభావం మరి ఎక్కువ. క్యాచ్ జారవిడిచితే ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక కింగ్స్ పంజాబ్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటిదే ఒకటి జరిగింది. పంజాబ్ ఆటగాడు అక్సర్ పటేల్ అద్భుత క్యాచ్ కు కోల్ కతా తగిన మూల్యం చెల్లించుకుంది. కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్- సునీల్ నరైన్ మంచి శుభారంభం అందించినా కోల్ కతా 14 పరుగుల తేడాతో ఓడింది. దీనికి కారణం అక్సర్ క్యాచ్. రాహుల్ తెవాతియా వేసిన 10 ఓవర్లో అక్సర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. గౌతం గంభీర్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప వచ్చిరావడంతో భారీ షాట్ కు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవడంతో అటుగా ఫీల్డింగ్ చేస్తున్న అక్సర్ పటేల్ పరిగెత్తుకుంటూ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఉతప్ప పరుగులు ఏమి చేయకుండా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇద్దరు ప్రధానమైన బ్యాట్స్ మెన్ లు వెను వెంటనే వెనుదిరిగారు. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న క్రిస్ లిన్ ను సైతం అక్సరే రనౌట్ చేయడంతో పంజాబ్ గెలుపు సుగమమైంది. ఈ ప్రదర్శనతో అక్సర్ మ్యాచ్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవమయ్యాయి. -
మా ఓపెనింగ్ కు జడుసుకుంటున్నారు: లిన్
మొహాలీ: కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనింగ్ జంటను చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయని ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్ గా సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడని లిన్ పేర్కొన్నాడు. మంగళవారం కింగ్స్ పంజాబ్ తో కోల్ కతా 14 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో క్రిస్ లిన్ 52 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో లిన్-నరైన్ లు పరుగుల సునామిని సృష్టించారు. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ కేవలం 15 బంతుల్లో వేగవంతమైన రికార్డు అర్ధసెంచరీ నమోదు చేశాడు. సునీల్ నరైన్ ఓపెనర్ గా రాణించడం, రాబిన్ ఊతప్ప తిరిగి జట్టులో చేరడంతో మా బ్యాటింగ్ లైనప్ బలపడిందని లిన్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్ధులు మా బ్యాటింగ్ బలాన్ని చూసి భయపడుతున్నారని, మేము మా ఆట పట్ల పాజిటివ్ గా ఉన్నామని తెలిపాడు. కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి 8 గెలిచిందని, ఇంకో మ్యాచ్ మిగిలి ఉందని ఇది గెలిచి రెండో స్థానం కైవసం చేసుకుంటామని లిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండు సార్లు చాంపియన్ అయిన కోల్ కతా కు ఇది కష్టమేమి కాదని లిన్ పేర్కొన్నాడు. పంజాబ్ తో ఓడడం నిరాశపరిచిందని, ఓటమికి 6,11 ఓవర్లో బంతులు డాట్ అవ్వడమే కారణమన్నాడు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బాల్స్ వేసారని రెండు వికెట్లు త్వరగా కోల్పోవడం కూడా ఓటమికి కారణమైందని లిన్ వ్యాఖ్యానించాడు. ఒక వేళ ముంబైతో జరిగే మ్యాచ్ లో ఓడితే మేము కాంపిటేషన్ నుంచి తప్పుకున్నట్లేనని, ముంబై పై గొప్ప ప్రదర్శన మా జట్టుకు అవసరమని లిన్ అభిప్రాయపడ్డాడు. -
కేకేఆర్ విజయలక్ష్యం 168
మొహాలి:కోల్ కతా నైట్ రైడర్స్ తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ జట్టులో మ్యాక్స్ వెల్(44;25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పాటు సాహా(38;33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), వోహ్రా(25;16 బంతుల్లో 4 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించడంతో కింగ్స్ పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కింగ్స్ పంజాబ్ కు ఆదిలో శుభారంభం లభించింది. వోహ్రా దాటిగా ఆడి కింగ్స్ స్కోరు ను పరుగులు పెట్టించాడు. కాగా, వోహ్రా అవుటైన తరువాత కింగ్స్ తడబడింది. ఆపై స్వల్ప వ్యవధిలో గప్టిల్, షాన్ మార్ష్ వికెట్లను నష్టపోయింది. కాగా, సాహా-మ్యాక్స్ వెల్ లు ఆదుకోవడంతో కింగ్స్ తిరిగి గాడిలో పడింది. ఓ దశలో మ్యాక్స్ వెల్ సిక్సర్లతో విరుచకుపడటంతో కింగ్స్ స్కోరులో వేగం పెరిగింది. నాల్గో వికెట్ గా మ్యాక్ వెల్ అవుటైన తరువాత సాహా మోస్తరుగా రాణించగా, స్వప్నిల్ సింగ్(2) నిరాశపరిచాడు. కాగా, చివరి ఓవర్లలో రాహుల్ తివాతియా(15 నాటౌట్;8 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 167 పరుగులు చేసింది. -
ఇంకా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు: గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 సీజన్ లో ముందుగానే ఇంటిదారి పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆట తీరుపై అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్. ఈ సీజన్ లో పెద్దగా రాణించని గేల్.. తమ జట్టు వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్నా అభిమానులు మద్దతు తెలుపుతూనే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఈ సీజన్ లో మా ఆట తీరు బాలేదు. అందుకు ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. మేము వరుసగా ఓడిపోతున్నా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అభిమానుల అభిమానం వెలకట్టలేనిది. అసలు ఇంతటి పేలవమైన ఆటను ప్రదర్శించినా ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే'అని గేల్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 13 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 10 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కేవలం రెండు మ్యాచ్ ల్లోనే గెలుపును సొంతం చేసుకోగా, ఒక మ్యాచ్ రద్దయింది. -
గెలిపించని శతకాలు ఇవే..
హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే బౌండరీల మోత. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే బ్యాట్సమన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి లీగ్ లో ఇక సెంచరీ బాదెస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతుగా ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా మ్యాచ్ లు గెలిపించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో సెంచరీలు బాది జట్టును గెలిపించ లేక పోయినా ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం. హషీమ్ ఆమ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2017) ఆమ్లా ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదాడు. కానీ రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పై 60 బంతుల్లో 104 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తో పంజాబ్ ముంబై కి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక గెలుపు కాయం అనుకున్న సందర్భంలో ముంబై కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయసంగా చేదించింది. ఆమ్లా సెంచరీ వృధా అయింది. ఇక మరో సెంచరీ గుజరాత్ లయన్స్ పై మరో సారి 104 పరుగలే నమోదు చేశాడు. ఈ శతకంతో ఒక సీజన్ లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా ఆమ్లా గుర్తింపు పొందాడు. పంజాబ్, ఆమ్లా శతకంతో గుజరాత్ కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా గెలువలేక పోయింది. ఆమ్లా రెండు సెంచరీలు బాదినా రెండు మ్యాచుల్లో జట్టు గెలవకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016) ఐపీఎల్-9 సీజన్లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై రాజ్ కోట్ లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బెంగళూరు 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో ఈ సీజన్ లో సెంచరీ చేసిన జట్టును గెలిపించకపోయినా ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోయాడు. వృద్ధిమాన్ సాహా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2014) ఐపీఎల్-2014 ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సాహా కెరీర్ లో తొలి సెంచరీ చేసినా జట్టు గెలువలేకపోయింది. సాహా 66 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒంటి చేత్తో టైటిల్ అందించాలని భావించిన సాహాకు చివరకు నిరాశే మిగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే(94) చెలరేగడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఇలా ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేక పోయిన ఆటగాడిగా సాహా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్(2011) ఐపీఎల్-2011 సీజన్ లో వాంఖేడ్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అప్పటి టీం కొచ్చి టస్కర్స్ పై 66 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సచిన్ 12 ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగడంతో ముంబై 182 పరుగులు చేసింది. కానీ బ్రెండన్ మెకల్లమ్(81), మహేలా జయవర్ధనే(56) ఆట ముందు ముంబై లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేకపోయిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. యూసఫ్ పఠాన్, రాజస్థాన్ రాయల్స్ (2010) ఐపీఎల్-2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు అంబటి రాయుడు(55), సౌరభ్ తివారీ(53) లు చెలరేగడంతో రాజస్థాన్ కు ముంబై 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన రాజస్థాన్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ నమోదు చేశాడు. యూసఫ్ కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. 173 పరుగుల వద్ద రనౌట్ గా యూసఫ్ వెనుదిరిగాడు. చివర్లో పారాస్ దోగ్రా (41) ప్రయత్నించినా, రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో సెంచరీ వృథా చేసుకున్న బాట్స్ మన్ గా యూసఫ్ నిలిచాడు. ఆండ్రూ సైమండ్స్, డెక్కన్ చార్జెర్స్ (2008) ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై సైమండ్స్ 53 బంతుల్లో 117 పరుగులు బాదడంతో డెక్కన్ చార్జెర్స్ 214 పరుగులు చేసింది. గెలుపు కాయం అనుకున్న తరుణంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ గ్రేమ్ స్మిత్ (71), యూసఫ్ పఠాన్ (61) విజృంభించడంతో డెక్కన్ చార్జెర్స్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డుగా నమోదు అయింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. సెంచరీ వృధా చేసుకున్న ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. -
కింగ్స్ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మంగళవారం రాత్రి కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే కింగ్స్ పంజాబ్ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. ఒకవేళ కాని పక్షంలో కింగ్స్ పంజాబ్ ముందుగానే టోర్నీ నుంచి నిష్ర్రమించాల్సి వస్తుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాకౌట్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌లన్నీ తప్పక నెగ్గాల్సిన ఒత్తిడి నెలకొన్న స్థితిలో మ్యాక్స్‌వెల్‌సేన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖారారు చేసుకున్న కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆశిస్తోంది.ఈ సీజన్లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ , రైజింగ్ పుణెలు దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మిగతా స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు మంచి అవకాశముండగా.. పంజాబ్ పరిస్థితి మాత్రం చావోరేవోలాగా మారింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌సేన ఐదు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. నాకౌట్‌కు చేరుకోవాలంటే పంజాబ్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. -
'కేఎల్ రాహుల్ గైర్హాజరీ భారీ నష్టం చేసింది'
బెంగళూరు:ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవమైన ప్రదర్శనకు సంబంధించిన కారణాలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ విశ్లేషించాడు. ఆర్సీబీ చివరిస్థానంలో నిలవడానికి కెప్టెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ల చెత్త ప్రదర్శన ఒక కారణమైతే, కేఎల్ రాహుల్ గైర్హాజరీ మరొక కారణమన్నాడు. ఒక కీలక ఆటగాడు ఆర్సీబీకి అందుబాటులో లేకుండా పోవడం ఆ జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పాంటింగ్ పేర్కొన్నాడు. 'కేఎల్ రాహుల్ లేకపోవడం ఆర్సీబీకి భారీ నష్టం చేసింది. గతేడాది ఆర్సీబీ ఫైనల్ కు చేరడంలో రాహుల్ పాత్ర వెలకట్టలేనిది. ఈసారి టాపార్డర్ లో రాహుల్ లేకపోవడం ఆర్సీబీ తడబడింది. గడిచిన ఐపీఎల్ ప్రదర్శన ఇక్కడ ప్రస్తుతానికి అనవసరం. అయితే ఐపీఎల్ ఆరంభమయ్యే వరకూ రాహుల్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. కచ్చితంగా రాహుల్ లేకపోవడం ఆర్సీబీ దురదృష్టం'అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. భుజం గాయంతో రాహుల్ ఐపీఎల్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో సిరిస్ లో రాహుల్ భుజానికి గాయమైంది. దాంతో ఐపీఎల్ నుంచి రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.సిరీస్ తర్వాత లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నా అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఐపీఎల్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. -
'కచ్చితమైన ప్రణాళికలతో ఓడించాం'
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ముంబై ఇండియన్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని సాధించడానికి కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడమే కారణమని ఆ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. పటిష్టమైన ముంబై ఇండియన్స్ నిలువరించాలంటే అనవసర తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదనేది తమ వ్యూహంలో భాగమని, దాన్ని సన్ రైజర్స్ ఆటగాళ్లు సరిగ్గా అమలు చేయడంతోనే విజయం సాధ్యమైందన్నాడు. 'ముంబై ఇండియన్స్ చాలా మంచి జట్టు. దాంతో పాటు ఆ జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్ లో ఉన్నారు. దాంతో కచ్చితమైన వ్యూహాలతో బరిలోకి దిగాం. బౌలర్లను పదే పదే మార్చాలని, ఆదిలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలనేది గేమ్ ప్లాన్ లో భాగం. పవర్ ప్లేలో స్పిన్నర్ మొహ్మద్ నబీ చేత బౌలింగ్ చేయించడం కూడా వ్యూహంలో భాగమే. అది సక్సెస్ అయ్యింది. తొలి రెండు, మూడు ఓవర్లే మ్యాచ్ కు కీలకం. అక్కడి కట్టడి చేసి ముందుగా ముంబై ఇండియన్స్ పై పైచేయి సాధించాం. ఆ తరువాత వారిని తిరిగి తేరుకోనీయకుండా ఒత్తిడి తెచ్చాం. ఓవరాల్ గా చెప్పాలంటే కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడంతోనే ముంబైపై విజయం సాధించాం' అని లక్ష్మణ్ తెలిపాడు. -
జహీర్ ఎంతో సహాయం చేశాడు: షమీ
న్యూఢిల్లీ: భారత పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ తో ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే విశ్వాసం వ్యక్తం చేశాడు. బౌలింగ్ లో మెళుకవలు నేర్చుకోవడానికి భారత మాజీ పేసర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ ఎంతగానో సహాయం చేశాడని పేర్కొన్నాడు. జూన్ 1 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫిలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కడంతో మహ్మద్ షమీ మీడియాతో ఉద్వేగానికి లోనయ్యాడు. జహీర్ ఇచ్చిన సూచనలు బెస్ట్ బౌలర్ గా తీర్చిదిద్దాయని షమీ వ్యాఖ్యానించాడు. సాధారణంగా మాజీ క్రికెటర్లతో మాట్లడినప్పుడే విలువైన సూచనలు లభిస్తాయని కానీ జహీర్ తో మాట్లడితే అంత కన్నా ఎక్కువ చిట్కాలు లభించాయని షమీ తెలిపాడు. దేశంలో చాల మంది క్రికెటర్లున్నారని వారందరికీ ఐపీఎల్ చక్కని వేదికా అని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టోర్నమెంట్ లో ఆడే ముందు ఐపీఎల్ లో ఆడిన 8-10 మ్యాచ్ లు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని షమీ పేర్కొన్నాడు. 'దాదాపు రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరమయ్యాను. ఈ రెండు సంవత్సరాలు నా బలం-ఫిట్ నెస్ పై దృష్టి సారించాను. నా బలహీనతలను సరిదిద్దుకున్నాను. దీనికోసం బరువు కూడా తగ్గాను. ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే నమ్మకం ఉంది. నా ప్రతిభ చాటలనే కసి మీద ఉన్నానని' మహ్మద్ షమీ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు. ఇక మహ్మద్ షమీ 2015 లో జరిగిన వరల్డ్ కప్ అనంతరం ఏ అంతర్జాతీయ వన్డే టోర్నమెంట్లో పాల్గొనలేదు. -
ఇంకా మ్యాచ్ ఉండగానే ఏబీ ఇంటికి
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో పేలవమైన ఆట తీరు కనబరిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు నుంచి ఏబీ డివిలియర్స్ ముందుగానే వైదొలుగుతున్నాడు. ఆర్సీబీకి ఇంకా మ్యాచ్ ఉన్నప్పటికీ ఏబీ స్వదేశానికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆర్సీబీ ఆడే మ్యాచ్ కు అంత ప్రాముఖ్యత లేకపోవడంతో ఏబీ తిరిగి స్వదేశానికి చేరనున్నాడు. వరుస మ్యాచ్ లతో తీరిక లేకపోవడంతో ముందుగానే స్వదేశానికి చేరుకుని కుటుంబంతో తగినంత సమయం గడపాలనే ఆలోచనలో భాగంగానే తాను మందుగా ఇంటికి వెళ్లనున్నట్లు డివిలియర్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించాడు.. 'ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమయ్యే క్రమంలో ఐపీఎల్లో ఇంకా మ్యాచ్ ఉండగానే స్వదేశానికి వెళుతున్నా. ముందుగా స్వదేశానికి చేరుకుని కుటుంబంతో తగినంత సమయం గడపాలనుకుంటున్నా. ఈ సీజన్ లో నిరాశపరిచినందుకు క్షమించండి. ఈ తప్పులు గుణపాఠంగా ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది కలుద్దాం'అని డివి పేర్కొన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 13 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు పది మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించగా, ఒక మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఐదు పాయింట్లను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ చివరిస్థానంలో ఉంది. -
అలా ఎవరూ ఊహించలేరు: గంభీర్
కోల్‌కతా: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, తమ టీమ్ సహచరుడు క్రిస్ లిన్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే ‘హార్డెస్ట్ హిట్టర్’ అంటూ పొడిగాడు. బంతిని బలంగా బాదడంలో అతడిని మించినవాడు లేడని ఆకాశానికెత్తేశాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో బంతిని బలంగా కొట్టడంతో క్రిస్ లిన్ అందరికంటే ముందుంటాడు. పునరాగమనం ఇంత ఘనంగా చాటతానని అతడే అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే గాయంతో నెల రోజులు ఆటకు దూరమై బరిలోకి దిగిన వెంటనే నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడడం మామూలు విషయం కాదు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఊహించని రీతిలో అతడు చెలరేగాడు. సునీల్ నరైన్, లిన్ ఇద్దరూ రెండువైపుల హిట్టింగ్ చేశారు. ఇలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆరు ఓవర్లలో 105 పరుగులు చేస్తారని ఎవరూ ఊహించరు. నరైన్ ఓపెనర్‌గా పంపడం మంచి ఫలితాన్ని ఇచ్చింద’ని ఓ ఇంటర్య్వూలో గంభీర్ పేర్కొన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నరైన్, లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నరైన్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, లిన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. -
యువరాజ్ సింగ్‌కు గాయం
హైదరాబాద్: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ గాయపడ్డాడు. ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా యువీ చేతి వేలికి గాయమైంది. రోహిత్ శర్మ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. యువీకి జట్టు ఫిజియో చికిత్స చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగి 9 పరుగులు చేశాడు. అయితే గాయం పెద్దది కాదని, మిగతా మ్యాచుల్లో అతడు ఆడే అవకాశముందని తెలుస్తోంది. 34 ఏళ్ల యువీ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 234 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆదరగొట్టాడు. 41 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. అయితే తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నిన్న ప్రకటించిన భారత జట్టులో యువరాజ్ సింగ్ చోటు సంపాదించాడు. -
కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
హైదరాబాద్: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌పై సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ భారీ విజయం నమోదు చేసింది. ముంబై విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వార్నర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్ శిఖర్ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్), హెన్రిక్స్(44 పరుగులు) సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బౌలర్లలో మలింగ, బుమ్రా, క్లెనగన్లకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ ఆది నుంచి తడబడింది. ముంబై ఓపెనర్ లెండిల్ సిమన్స్(1), నితీశ్ రానా(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరువాత పార్ధీవ్ పటేల్ (23) కూడా కొద్ది వ్యవధిలోనే వికెట్ కోల్పోవడంతో ముంబై 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 60 పరుగులు జత చేయడంతో ముంబై కాస్త కుదుటపడింది. కాగా, హార్దిక్ పాండ్యా(15) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. ఆపై రోహిత్ -పొలార్డ్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా రోహిత్ శర్మ(67;45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటైన తరువాత పొలార్డ్(5), కరణ్ శర్మ(5)లు కూడా నిష్క్రమించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్ సిద్ధార్ధ్ కౌల్ ఆకట్టుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు కీలక వికెట్లను సాధించాడు. -
సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సోమవారం ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 139 పరుగుల సాధారణ లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ ఆది నుంచి తడబడింది. ముంబై ఓపెనర్ లెండిల్ సిమన్స్(1), నితీశ్ రానా(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరువాత పార్ధీవ్ పటేల్ (23) కూడా కొద్ది వ్యవధిలోనే వికెట్ కోల్పోవడంతో ముంబై 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 60 పరుగులు జత చేయడంతో ముంబై కాస్త కుదుటపడింది. కాగా, హార్దిక్ పాండ్యా(15) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. ఆపై రోహిత్ -పొలార్డ్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు.కాగా రోహిత్ శర్మ(67;45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటైన తరువాత పొలార్డ్(5), కరణ్ శర్మ(5)లు కూడా నిష్క్రమించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆకట్టుకున్న సిద్ధార్ధ్ కౌల్ ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా రాణించాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ సిద్ధార్ధ్ కౌల్ ఆకట్టుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు కీలక వికెట్లను సాధించాడు. ఆది నుంచి చక్కటి లైన్ లెంగ్త్ తో బౌలింగ్ వేసిన కౌల్..పార్ధీవ్ పటేల్, నితీశ్ రానా, రోహిత్ శర్మ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పాటు నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతనికి జతగా మొహ్మద నబీకి కూడా మెరిశాడు. నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చిన నబీ వికెట్ ను తీశాడు. -
సన్ రైజర్స్ కు కఠిన పరీక్ష
హైదరాబాద్:సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మ్యాచ్ ద్వారా సొంతగడ్డపై తొలిఓటమి చవిచూసిన సన్ రైజర్స్.. తాజాగా పటిష్టమైన ముంబై ఇండియన్స్ తో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుండగా, ఇప్పటికే నాకౌట్ కు చేరిన ముంబై ఇండియన్స్ మాత్రం మరో విజయంపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లే ఆఫ్స్‌లో చోటే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో తీవ్ర ఒత్తిడిలో వార్నర్‌సేన ఈ మ్యాచ్ ఆడుతోంది. ఈ సీజన్లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఐదింటిలో విజయం సాధించింది. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మ్యాచ్ ద్వారా సొంతగడ్డపై తొలిఓటమి నమోదు చేసింది. పుణే విధించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నా మిగతా ప్లేయర్లు శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, నమన్ ఓజా తదీతరులు విఫలమవడం జట్టు కొంపముంచింది. ఈ క్రమంలో జట్టు మిడిలార్డర్ మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. ఈ సీజన్లో అందరింకంటే ముందుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ఘనత వహించింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన ముంబై తొమ్మిది విజయాలు, రెండు పరాజయాలు నమోదు చేసింది. దీంతో 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
'ఇక్కడ బ్యాట్స్‌మెన్ సక్సెస్ రేటు ఎక్కువ'
మొహాలి: క్రికెటర్లు బ్యాట్స్‌మెన్ గా సక్సెస్ కావడానికి ట్వంటీ 20 ఫార్మాట్ అనేది ఎంతగానో దోహదపడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్, కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. పెద్దగా హిట్టింగ్ చేయని తనలాంటి ఆటగాళ్లకు ట్వంటీ 20 క్రికెట్ అనేది భారీగా పరుగులు చేయడానికి ఉపయోగపడుతుందన్నాడు. దీని ద్వారా కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను కూడా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆమ్లా తెలిపాడు. 'ఇక్కడ సక్సెస్ కావడానికి క్రికెట్ గురించి లోతైన శోధన అవసరం లేదు. ట్వంటీ 20 ఫార్మాట్ క్రికెట్ ద్వారా ప్రతీ బంతిని ఎదుర్కోవడం తెలియాలి. దాదాపు 10 ఏళ్ల ఈ ఫార్మాట్ ను పరిశీలిస్తే అనేక మంది విజయవంతమైన క్రికెటర్లు ఉన్నారు. ఇది బ్యాట్స్‌మెన్ సక్సెస్ ఫార్మాట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు .ఈ ఫార్మాట్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మందికి తొలుత భారీ హిట్టింగ్ అనేది తెలియకపోవచ్చు. ఇక్కడకు వచ్చిన తరువాత దీనికి అలవాటై పరుగులు ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నారు. ఆ రకంగా బ్యాట్స్‌మెన్ సక్సెస్ కు ఐపీఎల్ కానీ, ట్వంటీ 20 క్రికెట్ కానీ ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం. ఇక్కడ బ్యాట్స్‌మెన్ సక్సెస్ రేటు ఎక్కువ' అని ఆమ్లా తెలిపాడు. -
రైజింగ్ పుణెకు డు ప్లెసిస్ దూరం
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ నుంచి ఆ జట్టు స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ వైదొలుగుతున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో కలవనున్న డు ప్లెసిస్.. ఇక పుణె ఆడే చివరి రెండు లీగ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పుణె జట్టుకు ఇక అందుబాటులో ఉండటం లేదని విషయాన్ని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాకు ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ఉన్న నేపథ్యంలో డుప్లెసిస్ మధ్యలోనే ఐపీఎల్ నుంచి నిష్ర్కమించాల్సి వస్తుంది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో రైజింగ్ పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. -
కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా?
బెంగళూరు: ఐపీఎల్ 10లో చెత్త ప్రదర్శన చేసినందుకు క్రికెట్ అభిమానులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి క్షమాపణ చెప్పాడు. అంచనాలకు తగ్గినట్టు ఆడడంలో విఫలమయ్యామని, అభిమానులను నిరాశకు గురి చేశామని పేర్కొన్నాడు. ‘మాపై అంతులేని ప్రేమ కురిపించి వెన్నంటి నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మేము స్థాయికి తగినట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాన’ని కోహ్లి ట్వీట్ చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ఈ సీజన్‌ను త్వరగా మర్చిపోవాలకుంటున్నట్టు చెప్పాడు. ఐపీఎల్-10లో తమకు ఏదీ కలిసి రాలేదని వాపోయాడు. బ్యాటింగ్‌లో రాణిస్తే బౌలింగ్‌లో విఫలమయ్యామని, ఇలా రెండిట్లో డీలా పడ్డామని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి వైదొలగిన కోహ్లి సేన 5 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఈనెల 14న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడనుంది. -
గుజరాత్ లయన్స్ విజయం
-
రప్ఫాడించిన కేకేఆర్..
-
ఆమ్లా శతకం వృథా
►కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు షాక్ ►డ్వేన్ స్మిత్ సూపర్ ఇన్నింగ్స్ ►గుజరాత్ లయన్స్ విజయం మొహాలీ: ప్లే ఆఫ్‌లో చోటు కోసం అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దూకుడుకు గుజరాత్ లయన్స్ బ్రేక్ వేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓపెనర్ డ్వేన్ స్మిత్ (39 బంతుల్లో 74; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈసారి సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీనికి తోడు కీలక సమయాల్లో క్యాచ్‌లను వదిలేయడంతో పంజాబ్ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైనా సేన 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ సీజన్లో రెండో శతకంతో చెలరేగగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. షాన్ మార్‡్ష (43 బంతుల్లో 58; 6 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. అనంతరం గుజరాత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), రైనా (25 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్మిత్ జోరు... 190 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు) 9.2 ఓవర్ల పాటు పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఫామ్‌లో లేని స్మిత్ ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. ఆరో ఓవర్లో చేతుల్లోకి వచ్చిన స్మిత్ క్యాచ్‌ను మార్‡్ష వదిలేయగా తర్వాతి ఓవర్లో భారీ సిక్స్‌తో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఎనిమిదో ఓవర్లో ఇషాన్‌కు లైఫ్ లభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. స్మిత్ దూకుడుకు పదో ఓవర్లోనే జట్టు వంద పరుగులు దాటింది. అయితే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన తను క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగుతున్న రైనా జట్టును విజయంవైపు తీసుకెళుతుండగా 18వ ఓవర్లో సందీప్ శర్మ షాక్ ఇచ్చాడు. రైనాతో పాటు ఫించ్ (2) వికెట్‌ను తీయడంతో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి 13 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే దినేశ్ కార్తీక్ వరుసగా 6,4 బాది ఒత్తిడి తగ్గించాడు. చివరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉండగా రెండు బంతులు ఉండగానే జట్టు నెగ్గింది. ఆమ్లా, మార్ష్ దూకుడు... టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ తొలి ఓవర్లోనే గప్టిల్ (2) వికెట్‌ను కోల్పోయింది. తొలి రెండు ఓవర్లలో జట్టు చేసింది మూడు పరుగులే. ఐదు ఓవర్ల వరకు కూడా కనీసం ఓవర్‌కు ఆరు రన్‌రేట్ కూడా లేకుండా సాగుతున్న వీరి ఇన్నింగ్స్ చివరకు భారీ స్కోరు సాధించిందంటే ఆమ్లా మెరుపులే కారణం. అతనికి మార్‡్ష చక్కటి సహకారం అందించడంతో లయన్స్ బౌలర్లు ఇబ్బందిపడ్డారు. ఆరో ఓవర్లో ఆమ్లా సిక్స్, ఫోర్ బాదడంతో జట్టు పవర్‌ప్లేలో 44 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత రిస్కీ షాట్లకు వెళ్లకుండా ఈ జోడి అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచింది. -
హషీమ్ ఆమ్లా మళ్లీ బాదేశాడు..
మొహాలి: ఈ ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా మరో శతకాన్ని నమోదు చేశాడు. ఆదివారం రాత్రి గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో ఆమ్లా సెంచరీతో అదుర్స్ అనిపించాడు. 60 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆమ్లా శతకం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలో ఆచితూచి ఆడింది. తొలి ఓవర్ ఐదో బంతికి గప్టిల్(2)అవుట్ కావడంతో కింగ్స్ కు ముందుగానే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆమ్లా-షాన్ మార్ష్ ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 125 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. ఈ క్రమంలోనే తొలుత ఆమ్లా హాఫ్ సెంచరీ చేయగా, ఆపై మార్ష్ కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. కాగా, మార్ష్(58;43 బంతుల్లో6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసిన కొద్ది సేపటికి పెవిలియన్ చేరాడు. దాంతో స్కోరు పెంచే బాధ్యతను ఆమ్లాతో కలిసి మ్యాక్స్ వెల్ పంచుకున్నాడు. ఈ జోడి చివరి ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మ్యాక్స్ వెల్ చేసిన 20 పరుగుల్లో రెండు సిక్సర్లు ఉండగా, సిక్సర్ తో ఆమ్లా సెంచరీ సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. -
రప్ఫాడించిన కేకేఆర్..
-
ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్
మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది గుజరాత్ కు నామమాత్రపు కాగా, కింగ్స్ పంజాబ్ కు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం. దాంతో గుజరాత్ పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా, కింగ్స్ పంజాబ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. కింగ్స్ పంజాబ్ తుది జట్టు: మ్యాక్స్ వెల్(కెప్టెన్),హషీమ్ ఆమ్లా, గప్టిల్, షాన్ మార్ష్, సాహా, అక్షర్ పటేల్, గుర్ కీరత్ సింగ్, మోహిత శర్మ, సందీప్ శర్మ, వరుణ్ అరోన్, నటరాజన్ గుజరాత్ తుది జట్టు: సురేశ్ రైనా(కెప్టెన్), డ్వేన్ స్మిత్, ఇషాన్ కిషన్, అరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, ఫాల్కనర్, కులకర్ణి, సంగ్వాన్, బాసిల్ తంపి, అంకిత్ సోని -
రప్ఫాడించిన కేకేఆర్..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ లక్ష్యాలను సైతం సునాయాసంగా ఛేదిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్.. తాజాగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రప్ఫాడించింది. ఆర్సీబీ విసిరిన లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి సాధించిన కోల్ కతా మరోసారి తమ బ్యాటింగ్ లో బలాన్ని చాటుకుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న కోల్ కతా ఓపెనర్ క్రిస్ లిన్(50;22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోగా, మరో ఓపెనర్ సునీల్ నరైన్(54;17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తో చెలరేగి ఆడాడు. ఈ జోడి తొలి వికెట్ కు 105 పరుగులు జోడించడంతో కోల్ కతా విజయం నల్లేరుపై నడకలా సాగింది. వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆపై గ్రాండ్ హోమ్(31), గౌతం గంభీర్(14)లు మిగతా పనిని పూర్తి చేయడంతో ఇంకా 29 బంతులుండగానే కోల్ కతా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరువైంది. రెండు రికార్డులు.. ఈ మ్యాచ్ లో రెండు రికార్డులు నమోదయ్యాయి. ఒకటి సునీల్ నరైన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా, మరొకటి పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రికార్డు. తొలుత అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నరైన్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకం సాధించి ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు.. అంతకుముందు 2014లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా యూసఫ్ పఠాన్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరూ కోల్ కతా ఆటగాళ్లే కావడం ఇక్కడ మరోవిశేషం. ఈ మ్యాచ్ లో నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్ కతా ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోరుగా రికార్డులకెక్కింది. అయితే 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసిన తరువాత నరైన్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
సునీల్ నరైన్ మరో చరిత్ర
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో నరైన్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. తద్వారా యూసఫ్ పఠాన్ సరసన నిలిచాడు. అంతకుముందు 2014లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును కోల్ కతాకు చెందిన నరైన్ చేరుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్ కతా ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోరుగా రికార్డులకెక్కింది. అయితే 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసిన తరువాత నరైన్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
ట్రావిస్ హెడ్ దూకుడు
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మరోసారి 'టాప్' విఫలం.. ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశల్ని కోల్పోయి కనీసం చివరి మ్యాచ్ ల్లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్న ఆర్సీబీ అందుకు తగ్గట్లు ఆడటం లేదు. ప్రధానంగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ లు తీవ్రంగా నిరాశపరుస్తుండంతో ఆర్సీబీ భారీ స్కోర్లు చేయలేకపోతుంది. ఈ మ్యాచ్ లో గేల్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరగా, కోహ్లి ఓ చెత్త షాట్ ఆడి ఎల్బీగా పెవిలియన్ చేరాడు.ఆపై డివిలియర్స్ బౌల్డ్ గా నిష్ర్రమించాడు. దాంతో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు కలిసి చేసిన పరుగులు 15 మాత్రమే కావడంతో ఆర్సీబీకి ఆదిలోనే చుక్కెదురైంది. కాగా, మధ్యలోమన్ దీప్ సింగ్ ఆదుకోవడం, ఆ తరువాత హెడ్ దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరును చేయకల్గింది. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, సునీల్ నరైన్ రెండు వికెట్లు, క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి
బెంగళూరు: కోల్ కోత్ నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఆర్సీబీ 14.1 ఓవర్లలో 100/3 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేయకతప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిచిపోయే సమయానికి మన్ దీప్ సింగ్(48 నాటౌట్), ట్రావిస్ హెడ్(35 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. బెంగళూరు టాపార్డర్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10)లు తీవ్రంగా నిరాశపరిచారు. -
క్రిస్ గేల్ గోల్డెన్ డక్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా ఇక్కడ ఆదివారం నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తోజరుగుతున్న మ్యాచ్ లోరాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. కోల్ కతా పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే గేల్ గోల్డెన్ డకౌటయ్యాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఆర్సీబీ తొలి వికెట్ ను నష్టపోయింది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్ లోసైతం గేల్ డకౌటైన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఇప్పటికే నాకౌట్ పోరు నుంచి నిష్ర్కమించిన ఆర్సీబీకి ఇది నామమాత్రపు మ్యాచ్. మరొకవైపు కోల్ కతా విజయం సాధిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. -
మలింగ ఖాతాలో అరుదైన ఫీట్
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిసి 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 10లో భాగంగా నిన్న (శనివారం) ఢిల్లీ సొంతగడ్డ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మలింగ.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్(3)ను ఔట చేయడంతో ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు మలింగ. మలింగ బంతిని అయ్యర్ షాట్ కొట్టగా ముంబై ప్లేయర్ హర్బజన్ క్యాచ్ పట్టడంతో ముంబై క్రికెటర్ కళ్లల్లో చెప్పలేనంత సంబరం మొదలైంది. ఆ తర్వాత కోరే అండర్సన్ ను ఔట్ చేసి మరో వికెట్ తీశాడు. ఐపీఎల్ లో ఓవరాల్ గా 105 మ్యాచ్ లాడిన మలింగ ఉత్తమ ప్రదర్శన 5/13గా ఉంది. వంద వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో 18.47 సగటుతో అందరికంటే ముందున్నాడు. ఢిల్లీతో మ్యాచ్ లో కరణ్ శర్మ, హర్భజన్లు మూడేసి వికెట్లు తీయగా, మలింగ రెండు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 66 పరుగులకే చాపచుట్టేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. -
ఢిల్లీ గజగజ...
-
సన్ రైజర్స్ కు షాక్
-
ఢిల్లీ గజగజ...
►66 పరుగులకే ఆలౌట్ ►ముంబై ఇండియన్స్ ఘనవిజయం ►చెలరేగిన బౌలర్లు ►సిమన్స్, పొలార్డ్ మెరుపులు తమ చివరి మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈసారి మాత్రం తుస్సుమంది. ముంబై ఇండియన్స్ విధించిన 213 పరుగుల భారీ టార్గెట్‌లో తొలి బంతి నుంచే తడబడిన ఈ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. గుజరాత్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన సామ్సన్, రిషభ్ అసలు పరుగులేమీ చేయకుండానే వెనుదిరగడంతో అత్యంత చెత్త ఆటతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపుగా తెర దించుకున్నట్టయ్యింది. అటు ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ చిగురుటాకులా వణికింది. 213 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఈ జట్టు ఆటగాళ్లు కనీసం పోరాటం చేయకుండానే అవమానకరంగా తోక ముడిచారు. ఫలితంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 146 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం కావడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 212 పరుగులు చేసింది. సిమన్స్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (35 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా... ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరిశాడు. అనంతరం ఢిల్లీ జట్టు 13.4 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. కరణ్ శర్మ, హర్భజన్‌లకు మూడేసి వికెట్లు దక్కగా... మలింగ రెండు వికెట్లు తీశాడు. సిమన్స్, పొలార్డ్ దూకుడు ముంబై జట్టులో బట్లర్ స్థానంలో బరిలోకి దిగిన ఓపెనర్ సిమన్స్ మెరుపు ఆరంభాన్ని అందిస్తే చివరి పది ఓవర్లలో పొలార్డ్ మెరుపులు జట్టుకు భారీ స్కోరును అందించింది. నాలుగో ఓవర్లో సిమన్స్ ఓ సిక్స్, ఫోర్‌తో తన జోరును ఆరంభించగా అటు పార్థివ్ (25; 3 ఫోర్లు) కూడా వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 60 పరుగులకు చేరింది. మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పార్థివ్ స్టంప్ కావడంతో తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 36 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సిమన్స్ అండర్సన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన అనంతరం క్యాచ్ అవుటయ్యాడు. అయితే మూడో స్థానంలో బరిలోకి దిగిన పొలార్డ్ ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా మిశ్రా బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా ... రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టగా... పొలార్డ్ మరో ఫోర్ బాదాడు. దీంతో 23 పరుగులు రావడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. వికెట్లు టపటపా... భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును ముంబై బౌలర్లు కోలుకోనీయకుండా దెబ్బతీశారు. తొలి బంతి నుంచే ప్రారంభమైన ఢిల్లీ పతనం ఏ దశలోనూ ఆగలేదు. మొదటి ఆరు ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ సామ్సన్ను మెక్లీనగన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత శ్రేయస్ (3)ను మలింగ.. రిషభ్ పంత్‌ను బుమ్రా.. కరుణ్ నాయర్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్)ను హర్భజన్ తాము వేసిన తొలి ఓవర్లలోనే పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం వచ్చిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. -
సిమ్మన్స్, పొలార్డ్ మెరుపులు
ఢిల్లీ: గత మ్యాచ్ లో రెండొందల పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరోసారి భారీ సవాల్ ఎదురైంది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లు లెండిల్ సిమ్మన్స్ (66;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్(63 నాటౌట్;35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, పార్ధీవ్ పటేల్(25; 22 బంతుల్లో 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(29 నాటౌట్;14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, పార్దీవ్ పటేల్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి తొలి వికెట్ కు 79 పరుగులు జత చేయడంతో ముంబై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తరువాత సిమ్మన్స్-పొలార్డ్ జోడి కూడా దాటిగా బ్యాటింగ్ చేయడంతో దాదాపు 10 పరుగుల రన్ రేట్ స్కోరు బోర్డుపై నిలిచింది. ఈ క్రమంలోనే సిమ్మన్స్ తొలుత హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, ఆపై పొలార్డ్ కూడా అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటంతో ముంబై రెండొందల మార్కును దాటింది. -
సన్ రైజర్స్ కు షాక్
-
ఉప్పల్ లో ఉనద్కత్ హ్యాట్రిక్
హైదరాబాద్: సన్ రైజర్స్ తో ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రైజింగ్ పుణే పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ హ్యాట్రిక్ దాటికి సన్ రైజర్స్ సొంత మైదానంలో పరాజయం పొందింది. ఈ మ్యాచ్ లో ఉనద్కత్ 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో రైజింగ్ పుణే 12 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై విజయం సాధించింది. ఇక చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు కావల్సి ఉండగా ఉనద్కత్ చక్కటి బంతులతో ముగ్గురు హైదరాబాద్ బ్యాట్స్ మెన్ లు పెవిలియన్ దారి పట్టించాడు. బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లు వరుసగా అవుట్ కావడంతో ఈ సీజన్ లో హ్యాట్రిక్ వికెట్ తీసిన మూడో బౌలర్ గా ఉనద్కత్ రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు శ్యామ్యుల్ బద్రీ ముంబై ఇండియన్స్ పై , ఆండ్రూ టై రైజింగ్ పుణే లపై ఈ సీజన్ లో ఒకే రోజు హ్యాట్రిక్ సాధించారు. ఒకే ఇలా ముగ్గురు బౌలర్లు హ్యాట్రిక్ సాధించడం ఐపీఎల్ చరిత్రలో రెండో సారి. తొలి సీజన్ లో ఎన్తిని, లక్ష్మీపతి బాలజీ, అమిత్ మిశ్రాలు సాధించగా, మళ్లీ పదో సీజన్ లో ముగ్గురు బౌలర్లు సాధించడం విశేషం. -
ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం రాత్రి నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత ముంబైను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఒకవైపు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు చేరగా, మరొకవైపు ఢిల్లీకి ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ఇప్పటివరకూ 10 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ నాలుగు గెలిచింది. దాంతో మిగతా నాలుగు మ్యాచ్ ల్లో నూ విజయం సాధించాల్సి ఉంది. -
సన్ రైజర్స్ కు షాక్
హైదరాబాద్:ఇప్పటివరకూ సొంతమైదానంలో ఓటమి ఎరుగకుండా దూసుకుపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలిసారి షాక్ తగిలింది. ఐపీఎల్-10లో భాగంగా శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పుణె విసిరిన 149 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(40;34 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్), యువరాజ్ సింగ్ (47;43 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) రాణించిన జట్టును గెలిపించలేకపోయారు. వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్ల ఘోరంగా విఫలం కావడంతో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు.ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడంతో సన్ రైజర్స్ పరాజయం పాలైంది. రైజింగ్ పుణె ఆటగాళ్లలో ఉనాద్కత్ ఐదు వికెట్లతో సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇది పుణెకు ఎనిమిదో విజయం కావడంతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరువైంది. అంతకుముందు పుణె ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కో్ల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా అవుట్ కావడంతో పుణె గాడి తప్పినట్లు కనబడింది. కాగా, స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది. అయితే స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది. -
ఐపీఎల్ కు మెకల్లమ్ దూరం
హైదరాబాద్: గుజరాత్ లయన్స్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్, పేసర్ నాధూ సింగ్ లు గాయాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఢిల్లీతో జరిగన గత మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో మెకల్లమ్ టోర్ని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గాయం తీవ్రం కాకుండా మూడు, నాలుగు వారాలు విశ్రాంతి తీసుకురావల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ వెల్లడించాడు. మెకల్లమ్ ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి రెండు అర్ధ సెంచరీలతో 319 పరుగులు చేశాడు. ఇక నాధూ సింగ్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. గత గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూండగా మెకల్లమ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. ఇక రాజ్ కోట్ లో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో నడుము నొప్పితో బాధపడ్డ నాధూ సింగ్ తర్వతా ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడలేదు. -
'కోహ్లి.. నిన్ను నీవు అద్దంలో చూసుకో'
బెంగళూరు:ఐపీఎల్-10 సీజన్ లో పేలవమైన ఆట తీరును కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. గత కొన్ని మ్యాచ్ ల్లో విరాట్ ఆట తీరు చూస్తే చాలా దారుణంగా ఉందంటూ మండిపడ్డ గవాస్కర్.. ఒకసారి అతని ఆటను అద్దంలో చూసుకుంటే మంచిదంటూ హితబోధ చేశాడు. ' బెంగళూరు ఆట కంటే ముందు విరాట్ ఆటను నిశితంగా పరిశీలించుకుంటే మంచిది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఒక చెత్త షాట్ కు అవుటయ్యాడు. అది కచ్చితంగా మంచి షాట్ కాదు. ఈడెన్ గార్డెన్ లో కేకేఆర్ తో ఆడిన షాట్ చూడండి. అది కూడా చెత్త షాట్. కచ్చితమైన క్రికెటింగ్ షాట్లు ఆడటంలో విరాట్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒకసారి విరాట్ ఆటను ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది' అని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. ఒక కెప్టెన్ గా విరాట్ పై ఎంతో బాధ్యత ఉన్నప్పుడు నిర్లక్ష్య పూరిత షాట్లు సమంజసం కాదని చురకలంటించాడు. అతను ఫామ్ లేకపోయినప్పటికీ, కనీసం క్రీజ్ లో ఉండి కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను ఆడే ప్రయత్నమే విరాట్ చేయలేదని గవాస్కర్ దుయ్యబట్టాడు.ఒక మంచి ఆటగాడు చెత్త షాట్లకు అవుతుంటే ఒకసారి ఆటను పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. -
సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 149 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కో్ల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా అవుట్ కావడంతో పుణె గాడి తప్పినట్లు కనబడింది. కాగా, స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది. అయితే స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్ద్ కౌల్ నాలుగు వికెట్లతో రాణించగా, రషిద్ ఖాన్, బిపుల్ శర్మలకు తలో వికెట్ దక్కింది. -
సందీప్ శర్మదే ఆ రికార్డు : సెహ్వాగ్
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచి విజయాన్ని అందించిన కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ పై ఆ జట్టు మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ శుక్రవారం చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరుపై కింగ్స్ పంజాబ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ బెంగళూరు కీలక బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ల వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లో ఒకే మ్యాచ్ లో ఈ ముగ్గురిని అవుట్ చేసిన తొలి బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. తొలి ఓవర్లో గేల్ ను డక్ అవుట్ చేయగా, తరువాతి ఓవర్ లో విరాట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన డివిలియర్స్ వరుస బౌండరీలతో దూకుడు గా ఆడాడు. ఇక సందీప్ శర్మ తన మూడో ఓవర్ లో డివిలియర్స్ ను పెవిలియన్ కు పంపించాడు. బెంగళూరు టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో పంజాబ్ సునాయసంగా గెలవగలిగింది. ప్రతి విషయంపై ట్వీటర్ లో తన ట్వీట్ లతో వ్యంగ్యంగా స్పందించే వీరేంద్ర సేహ్వాగ్ తమ జట్టు బౌలర్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతన్నిపొగడ్తలతో ముంచెత్తాడు. ' గొప్ప ప్రదర్శనతో సందీప్ ఒకే మ్యాచ్ లో కోహ్లీ, గేల్, ఏబీడిలను అవుట్ చేసిన తొలి బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇక అక్సర్ పటేల్ బ్రిలియంట్ అని పంజాబ్ జట్టుకు అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. Great performance by Sandeep to become the 1st man to get all Gayle,Virat,ABD in a match .Axar Patel was brilliant. Congratulations Team ! — Virender Sehwag (@virendersehwag) 5 May 2017 -
సన్ రైజర్స్ జోరు కొనసాగిస్తుందా?
హైదరాబాద్: ఇప్పటివరకూ సొంత మైదానంలో ఓటమి ఎరుగని సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయంపై కన్నేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. సన్ రైజర్స్ జట్టులోకి ఆశిష్ నెహ్రా, బిపుల్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను పటిష్టం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ప్రస్తుతం పుణే 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా... సన్‌రైజర్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీ ఆరంభంలో తడబడినా... కీలక సమయంలో పుంజుకొని పుణే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆ జట్టు ఆడిన చివరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు ఉండటం విశేషం. ఇదే జోరులో మరో గెలుపు కోసం పుణే బరిలోకి దిగుతోంది. మరోవైపు ఉప్పల్‌లో ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ విజయం సాధించి అజేయంగా ఉంది. వరుసగా ఆరో విజయంపై ఆ జట్టు దృష్టి సారించింది. ఫామ్‌లో ఉన్న స్టోక్స్, త్రిపాఠి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి... గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పుణేకు విజయాన్ని అందించారు. మరోసారి త్రిపాఠి శుభారంభం అందించడంతో పాటు... కెప్టెన్ స్మిత్, వికెట్ కీపర్ ధోని బ్యాట్ ఝుళిపిస్తే పుణే భారీ స్కోరు చేయడం ఖాయం. ఇప్పటి వరకు జట్టు గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బౌలర్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. స్పిన్నర్ తాహిర్‌తో పాటు పేసర్ ఉనాద్కట్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తున్నారు. ఢిల్లీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైన సన్‌రైజర్స్ తిరిగి పట్టు బిగించాలని చూస్తోంది. అయితే సొంత వేదికపై విజయపరంపరను కొనసాగించాలనే పట్టుదలతో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఉన్నాడు. కోల్‌కతా మ్యాచ్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించిన వార్నర్‌తో పాటు, శిఖర్ ధావన్, హెన్రిక్స్, కేన్ విలియమ్సన్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టకు కలిసొచ్చే అంశం. యువరాజ్ సింగ్ కూడా కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ సన్ బౌలింగ్ విభాగాన్ని తక్కువ చేయలేం. డెత్ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్ భువనేశ్వర్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తమ విలువేంటో ఇప్పటికే తెలియ జేశారు. వెటరన్ స్టార్ ఆశిష్ నెహ్రాతో పాటు యువ బౌలర్లు సిరాజ్, సిద్ధార్థ్ కౌల్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. రైజింగ్ పుణె తుది జట్టు:స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారి, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉనాద్కత్, ఇమ్రాన్ తాహీర్ సన్ రైజర్స్ తుది జట్టు; డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, యువరాజ్ సింగ్, హెన్రిక్యూస్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ,భువనేశ్వర్, రషిద్ ఖాన్, సిద్ధార్ధ కౌల్, ఆశిష్ నెహ్రా -
బెంగళూరు తీరుమారలే
బెంగళూరు: ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న బెంగళూరు జట్టు పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. శుక్రవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 139 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఆ జట్టు విఫలమైంది. ఓపెనర్ మన్దీప్ సింగ్(40 బంతుల్లో 45) శుభారంభం అందించినా.. మిగిలిన వారు విఫలం కావడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ జట్టులో మన్‌దీప్‌తో పాటు డీవిలియర్స్(10 పరుగులు), నెగి(21 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, ఏఆర్ పాటిల్ చెరో మూడు వికెట్లు సాధించగా.. మ్యాక్స్‌వెల్, ఎమ్ఎమ్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(1), మార్టిన్ గప్టిల్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ 18 పరుగులకే పెవిలియన్ కు చేరడంతో కింగ్స్ పంజాబ్ కష్టాల్లో పడింది. అయితే షాన్ మార్ష్(20;17 బంతుల్లో 3 ఫోర్లు),మనన్ వోహ్రా(25;28 బంతుల్లో 1ఫోర్,1సిక్స్), వృద్ధిమాన్ సాహా(21;25 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించడంతో తిరిగి తేరుకుంది. ఇక చివర్లో అక్షర్ పటేల్(38 నాటౌట్;17 బంతుల్లో3 ఫోర్లు,2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో అంకిత్ చౌదరి, చాహల్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, ఎస్ అరవింద్,షేన్ వాట్సన్, పవన్ నేగీలు తలో వికెట్ తీశారు. -
నా ఆట చూడకపోవడం అదృష్టం!
ఢిల్లీ:రాహుల్ ద్రవిడ్.. మిస్టర్ డిఫెండబుల్, ద వాల్‌గా గుర్తింపు తెచ్చుకుని భారత్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన మాజీ క్రికెటర్. ఇప్పుడు భారత క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ ఓ గురువు. చటేశ్వర పుజారా కావచ్చు లేదా రహానే కావచ్చు...యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇలా చాలామంది ఆటపై ద్రవిడ్ ప్రభావం ఉంది. ప్రస్తుతం టీమిండియా 'ఎ' జట్టుకు కోచ్ గా ఉన్న ద్రవిడ్.. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్ ల పై జోక్ వేసి అందర్నీ ఆకట్టుకున్నాడు ద్రవిడ్. గురువారం గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ 97 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 43 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగి ఆడి ఢిల్లీకి ఘనమైన విజయాన్ని అందించాడు.అతనికి సంజూ శాంసన్(61 పరుగులు) కూడా చక్కటి సహకారం అందివ్వడంతో ఢిల్లీ సునాయసంగా విజయం సాధించింది. అయితే వీరి బ్యాటింగ్ కు ముగ్ధుడైన ద్రవిడ్.. తన బ్యాటింగ్ ను పోల్చుకుంటూ సరదాగా జోక్ వేశాడు. ' గుజరాత్ తో మ్యాచ్ లో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ల ఆట తీరు ఆకట్టుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారిద్దరి ఆట అసాధారణంగా ఉంది. నా బ్యాటింగ్ వీడియోలు చూసే ఇలా ఆడటం నేర్చుకున్నట్లు ఉన్నారు(నవ్వుతూ). నేను ఎప్పుడూ ఇదే తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడిని(నవ్వుతూనే)'అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. అయితే భారీ లక్ష్యాల్ని సైతం సునాయాసం చేసిన రిషబ్ పంత్, సంజూ శాంసన్ లు తన వీడియోలు ఎక్కువగా చూడనందుకు అభినందిస్తున్నానంటూ మళ్లీ ద్రవిడ్ జోక్ పేల్చాడు. 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే వారు కచ్చితంగా తన బ్యాటింగ్ వీడియోలో చూసి ఉండరని ద్రవిడ్ నవ్వులు పూయించాడు. దాంతో పక్కనే ఉన్న రిషబ్ పంత్, శాంసన్ లు సైతం తమ పెదవులపై నవ్వును ఆపుకోలేకుండా ఉండలేకపోయారు.