ఫైనల్స్‌కు ముందే ప్రైజ్‌ దక్కింది | The prize before the prize to MI coach Jonty Rhodes | Sakshi
Sakshi News home page

ఫైనల్స్‌కు ముందే ప్రైజ్‌ దక్కింది

Published Mon, May 22 2017 10:26 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

ఫైనల్స్‌కు ముందే ప్రైజ్‌ దక్కింది

ఫైనల్స్‌కు ముందే ప్రైజ్‌ దక్కింది

ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-10 ఫైనల్‌ మ్యాచ్‌కు గంటన్నర ముందే ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌కు భారీ బహుమతి దక్కింది‌! పుణెతో తుదిపోరు కోసం ముంబై జట్టును సన్నద్ధం చేస్తున్న సమయంలోనే.. రోడ్స్‌కు శుభవార్త అందింది. ఆదివారం సాయంత్రం సరిగ్గా 6:20కి జాంటీ సతీమణి మెలానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్‌ గెలుపును ముందే ఊహించిన జాంటీ రోడ్స్‌.. 'ప్రైజ్‌కు ముందే ప్రైజ్‌ అందుకున్నా..'నంటూ కొడుకు పుట్టిన విషయాన్ని ప్రపంచానికి షేర్‌ చేశాడు. పనిలోపనిగా కొడుకు పేరు నాథన్‌ జాన్‌ అని కూడా చెప్పేశాడు.

ముంబై(సాంటాక్రజ్‌)లోని సూర్యా హాస్పిటల్‌లో 'పూల్‌బర్త్‌' విధానంలో పురుడుపోసుకుంది మెలానీ. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. నాథన్‌ కంటే ముందు(2013లో) జాంటీ దంపతులకు జన్మించిన పాపకు 'ఇండియా' అని పేరుపెట్టుకున్న సంగతి తెలిసిందే. జాంటీ ఇద్దరు పిల్లలూ ముంబైలోనే పురుడుపోసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement