VIDEO: After defeating Mumbai, Punjab coach Jonty Rhodes - Sakshi
Sakshi News home page

MI VS PBKS: సచిన్ కాళ్లు మొక్కిన జాంటీ రోడ్స్..!

Published Thu, Apr 14 2022 6:45 PM | Last Updated on Thu, Apr 14 2022 7:33 PM

IPL 2022: Jonty Rhodes Touches Sachin Tendulkars Feet To Seek His Blessings After MI VS PBKS Match - Sakshi

Photo Courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రోహిత్‌ సేనను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, ప్రస్తుత సీజన్‌లో వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది.  


కాగా, పంజాబ్‌-ముంబై జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో పంజాబ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్ టెండూల్కర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా పాదాలకు నమస్కారం చేయబోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఆశ్చర్యపోయిన సచిన్‌ వెంటనే తేరుకుని జాంటీని వారించాడు. అనంతరం ఇరువురు ఆత్మీయంగా హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 

సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌ని చూసిన ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వయసులో చిన్నవాడైన సచిన్‌ (48)తో జాంటీ రోడ్స్ (52) అలా ప్రవర్తించడమేంటని కొందరు, క్రికెట్‌ గాడ్‌కు పాదాభివందనం చేస్తే తప్పేమీ లేదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఐపీఎల్‌లో సచిన్‌-జాంటీ రోడ్స్‌ (ఫీల్డింగ్ కోచ్‌)లు గతంలో ముంబై ఇండియన్స్‌కు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. రోడ్స్ 2017 సీజన్‌లో ముంబైను వదిలి పంజాబ్ కింగ్స్ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు.
చదవండి: IPL 2022: ఆ విషయంలో రిషబ్, రోహిత్, కోహ్లి ముగ్గురూ ఒక్కటే..!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement