దానికోసం నేనేమీ ఏడ్వలేదు: హర్భజన్ | Harbhajan Singh Says He Should Have Been Picked To Play IPL 2017 Final | Sakshi
Sakshi News home page

దానికోసం నేనేమీ ఏడ్వలేదు: హర్భజన్

Published Thu, May 25 2017 12:24 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

దానికోసం నేనేమీ ఏడ్వలేదు: హర్భజన్

దానికోసం నేనేమీ ఏడ్వలేదు: హర్భజన్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కకపోవడం తనను ఎంతమాత్రం నిరాశకు గురి చేయలేదని హర్భజన్ సింగ్ తాజాగా స్పష్టం చేశాడు. అయితే తుది పోరులో తనకు అవకాశం దక్కుతుందని తొలుత ఆశించినట్లు భజ్జీ తెలిపాడు.

'ఫైనల్ మ్యాచ్ లో నాకు ముంబై ఇండియన్స్ సెలక్టర్లు చోటు ఇవ్వకపోవడం నాకేమీ బాధ  అనిపించలేదు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. నేను జట్టు మనిషిని. కొన్ని సాంకేతికపరమైన అంశాలు ముడిపడి ఉండటంతోనే లెగ్ స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె జట్టులో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ ఉండటం వల్లే నాకు విశ్రాంతి ఇచ్చారు.

ఈ విషయాన్ని ముంబై కోచ్ మహేలా జయవర్ధనే నాకు చెప్పాడు కూడా. నాకు స్థానం దక్కనందుకు ఎటువంటి బాధలేదు. దానికోసం నేనేమీ ఏడ్వలేదు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 'మీరు తుది జట్టులో ఉంటానని భావించారా?'అన్న ప్రశ్నకు భజ్జీ పై విధంగా సమాధానమిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement