ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట! | Abhishek Bachchan Reveals The 'Lucky Charm' Behind Mumbai Indians IPL 2017 Triumph | Sakshi
Sakshi News home page

ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!

Published Tue, May 23 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!

ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!

ఐపీఎల్‌-10 ఫైనల్‌ పోరు ముంబై ఇండియన్స్‌-రైజింగ్‌ సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఉత్కంఠంగా సాగుతోంది. పుణే విజయానికి 4 బంతుల్లో 7పరుగులు కావాలి. మామూలుగా ఇది సాధ్యమే. కానీ సాధ్యాన్ని అసాధ్యంగా మార్చింది ముంబై. ఒక పరుగు తేడాతో ఐపీఎల్‌-10 విజేతగా నిలిచింది. ఇందుకు కారణం ముంబై టీం పర్ఫార్మెన్స్‌ కాదట.

4 బంతులు మిగిలివుండగా ముంబై గెలవాలని కళ్లు మూసుకుని స్టేడియంలో ప్రార్థన చేసిన బామ్మట. ఆమె ప్రార్ధనే ముంబైకు మిరాకిల్‌ విన్‌ దక్కేలా చేసిందని ట్వీట్‌లు హోరెత్తాయి. ఆమెకు 'ప్రేయర్‌ ఆంటీ' అని పేరు పెట్టేశారు ట్వీటరాటీలు. ఈ ట్వీటర్‌లో వెల్లువలా వస్తున్న ప్రేయర్‌ ఆంటీ ట్వీట్లను చూసిన బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ కూడా రీట్వీట్‌ చేశారు.

ఏమనో తెలుసా?. ఆమె ఎవరో కాదు ముంబై ఇండియన్స్‌ యజమాని నీతూ అంబానీ అమ్మ అని. ఆమెను అందరూ ముద్దుగా 'నాని' అని పిలుస్తారు అని చెప్పారు. దీంతో థ్యాంక్స్‌ నాని మీ వల్లే ముంబై ఇంత ఘనవిజయం సాధించిందని నెటిజన్లు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement