జట్టు గెలిచిన ఆనందంలో టవల్‌ విప్పేసి.. | Jos Buttler Celebrations as Mumbai Indians Win | Sakshi
Sakshi News home page

జట్టు గెలిచిన ఆనందంలో టవల్‌ విప్పేసి..

Published Mon, May 22 2017 12:24 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

జట్టు గెలిచిన ఆనందంలో టవల్‌ విప్పేసి..

జట్టు గెలిచిన ఆనందంలో టవల్‌ విప్పేసి..

ఐపీఎల్‌ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ గెలుపొందడంతో ఆ జట్టు ఆటగాడు జోస్‌ బట్లర్‌ ఆనందం కట్టలు తెగింది. అంతే వినూత్నంగా ఆ సంబరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడమే కాదు.. తాను చేసిన ఒకింత వింత, వికృత ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి అభిమానులతో పంచుకున్నాడు.

ఆదివారం హోరాహారీగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పుణెపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించడంతో బట్లర్‌ ఆనందంలో కట్టుకున్న టవల్‌ను విప్సేసి.. నగ్నంగా గంతులు వేశాడు. సావరియా సినిమాలో రణ్‌బీర్‌ సింగ్‌ను గుర్తుకుతెచ్చేలా అతను వేసిన నగ్న గంతుల వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు జోస్‌ బట్లర్‌ కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అతను ఫైనల్‌కు ముందే ఇంగ్లండ్‌కు వెళ్లిపోయి.. తమ జట్టులో చేరాడు. ఫైనల్‌లో అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఫైనల్‌ మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన ఈ ఇంగ్లిష్‌ వికెట్‌ కీపర్‌ తనదైన స్టైల్‌లో జట్టు ఆనందంలో భాగమయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement