సందీప్ శర్మదే ఆ రికార్డు : సెహ్వాగ్ | Sehwag Applauds Sandeep for Dismissing Kohli, Gayle and ABD | Sakshi
Sakshi News home page

సందీప్ శర్మదే ఆ రికార్డు : సెహ్వాగ్

Published Sat, May 6 2017 5:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

సందీప్ శర్మదే ఆ రికార్డు  : సెహ్వాగ్

సందీప్ శర్మదే ఆ రికార్డు : సెహ్వాగ్

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచి విజయాన్ని అందించిన  కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ పై ఆ జట్టు మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ శుక్రవారం చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరుపై కింగ్స్ పంజాబ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
 
ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ బెంగళూరు కీలక బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ల వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లో ఒకే మ్యాచ్ లో ఈ ముగ్గురిని అవుట్ చేసిన తొలి బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. తొలి ఓవర్లో గేల్ ను డక్ అవుట్ చేయగా, తరువాతి ఓవర్ లో విరాట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన డివిలియర్స్ వరుస బౌండరీలతో దూకుడు గా ఆడాడు. ఇక సందీప్ శర్మ తన మూడో ఓవర్ లో డివిలియర్స్ ను పెవిలియన్ కు పంపించాడు.
 
బెంగళూరు టాప్ ఆర్డర్  కుప్పకూలడంతో పంజాబ్ సునాయసంగా గెలవగలిగింది. ప్రతి విషయంపై ట్వీటర్ లో తన ట్వీట్ లతో  వ్యంగ్యంగా  స్పందించే వీరేంద్ర సేహ్వాగ్ తమ జట్టు బౌలర్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతన్నిపొగడ్తలతో ముంచెత్తాడు. ' గొప్ప ప్రదర్శనతో సందీప్ ఒకే మ్యాచ్ లో కోహ్లీ, గేల్, ఏబీడిలను అవుట్ చేసిన తొలి బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇక అక్సర్ పటేల్ బ్రిలియంట్ అని పంజాబ్ జట్టుకు అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement