ధోనిపై విమర్శలా?: సెహ్వాగ్ | no problem with dhoni batting, says sehwag | Sakshi
Sakshi News home page

ధోనిపై విమర్శలా?: సెహ్వాగ్

Published Sun, Apr 16 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

ధోనిపై విమర్శలా?: సెహ్వాగ్

ధోనిపై విమర్శలా?: సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పుణె ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచాడు. ఏదో కొన్ని మ్యాచ్ ఆధారంగా ధోని ఫామ్ పై అంచనాకు వచ్చి విమర్శలు గుప్పిస్తారా అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. మహీ వంటి స్టార్ క్రికెటర్ ఆటకు ఐపీఎల్ ఎంత మాత్రం ప్రామాణికం కాదనే విషయం విమర్శకులు తెలుసుకుంటే మంచిదన్నాడు. ఈ సందర్భంగా ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ధోని ఆటను సెహ్వాగ్ ప్రస్తావించాడు. ధోని  తిరిగి తన ఫామ్ ను అందిపుచ్చుకుంటాడన్నాడు. అందుకు మరికొంత సమయం అవసరమన్న సెహ్వాగ్... ధోని వచ్చే బ్యాటింగ్ ఆర్డర్ లో పరుగులు చేయడం అంత సులభం కాదన్నాడు.

 

సాధారణంగా  ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే ధోని ఒత్తిడి అధికంగా ఉంటుందన్నాడు. ఆ స్థానాల్లో కుదురుకుని పరుగులు చేయడమంటే అంత తేలిక కాదని విమర్శకులకు చురకలంటించాడు సెహ్వాగ్. ప్రస్తుతం ధోని ఫామ్ కోల్పోయాడని అనడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. త్వరలోనే ధోని సత్తా చాటుకుంటాడని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. అసలు త్వరలో ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ధోని లేని భారత జట్టును ఊహించడం కష్టమని ఈ డాషింగ్ ఆటగాడు పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement