
ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ ఆఫీసు నుంచి వ్యూహాత్మక పెట్టుబడులు అందుకున్నట్లు రియల్టీ సర్వీసుల ప్లాట్‌ఫామ్ ఎస్‌ఐఎల్‌ఏ(సిలా) తాజాగా పేర్కొంది. అయితే ఏమేరకు పెట్టుబడి పెట్టారో మాత్రం వివరాలు వెల్లడించలేదు. 2010లో రుషభ్, సాహిల్ వోరా ఏర్పాటు చేసిన సిలా దేశవ్యాప్తంగా రియల్టీ అడ్వయిజరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థలో నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్‌కు సైతం పెట్టుబడులున్నాయి. దేశీయంగా 20 కోట్ల చదరపు అడుగుల రియల్టీ ఆస్తులను నిర్వహిస్తున్న కంపెనీలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..
కెప్టెన్‌కూల్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో అనేక వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీల జాబితా కింది విధంగా ఉంది.
బ్లూస్మార్ట్ మొబిలిటీ: గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ ఆధారిత కంపెనీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తూ స్థిరమైన రవాణాపై దృష్టి సారించింది.
గరుడ ఏరోస్పేస్: వ్యవసాయం, రక్షణ, పారిశ్రామిక డ్రోన్లలో ప్రత్యేకత కలిగిన చెన్నైకి చెందిన డ్రోన్ టెక్నాలజీ సంస్థ.
ఈమోటోరాడ్: ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించే ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్.
హోమ్ లేన్: బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ అండ్ హోమ్ డెకోర్ కంపెనీ.
ఖాతాబుక్: డిజిటల్ పేమెంట్స్, బుక్ కీపింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్.
కార్స్24: పాత కార్లను కొనడానికి, విక్రయించడానికి ఆన్‌లైన్ సేవలందించే ప్లాట్‌ఫామ్.
షాకా హ్యారీ: ముంబైకి చెందిన మొక్కల ఆధారిత ఆహార సంస్థ.
7ఇంక్ బ్రూస్: ఫుడ్ అండ్ బెవరేజ్ బ్రాండ్.
తగ్‌డా రహో: ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ బ్రాండ్.
రిగి: సోషల్, కంటెంట్ మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్.
Comments
Please login to add a commentAdd a comment