platform
-
Student Tribe: స్టూడెంట్ ట్రైబ్..
మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత. ఇటు చదువుకుంటూనే అటు భవిష్యత్ ప్రణాళికల గురించి మార్గ నిర్దేశం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్ ట్రైబ్‘. ఒక స్టార్టప్ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకుపైగా స్టూడెంట్ నెట్‌వర్క్‌తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్ట్రాగామ్‌లో 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్‌కు అనుసంధానం చేస్తోంది. గిగ్ వర్క్ ఇంటరీ్నíÙప్, వలంటీర్, ఫుల్‌టైమ్‌గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్ మెరుగు పర్చుకోవడంతో పాటు సరి్టఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్ వృద్ధికి అంతులేని అవకాశాలను సృష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, డిజైన్ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. టైర్–2, టైర్–3 నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివృద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్స్ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.అవకాశాలకు పుష్పకవిమానం.. నేను 2024లో డిగ్రీ బీకాం పూర్తి చేశాను. డిగ్రీ చేస్తున్న సమయంలోనే స్టూడెంట్ ట్రైబ్‌ను ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించిన యాప్‌లో ఎప్పటికప్పుడు అవసరమైన అవకాశాలు, వర్క్‌షాప్స్ గురించి తెలుసుకున్నాను. ఇందులో భాగంగానే స్టూడెంట్ ట్రైబ్లో అకౌంట్ మేనేజర్‌గా ఫుల్‌టైమ్ జాబ్ పొందాను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ వేదిక పుష్పక విమానంగా సేవలందిస్తోంది. – కీర్తనకార్పొరేట్ స్థాయి నైపుణ్యం విద్యార్థులు చదువుకుంటూనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వేదికను ప్రారంభించాం. వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ యాకథాన్ నిర్వహించాం. ఇందులో ప్రముఖ సినీ తార సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ మధ్యనే అప్ స్కిల్లింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభిన్న నైపుణ్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి నైపుణ్యాలను అందిస్తున్నాం. దీనికోసం వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు, సీఈవోలను ఆహ్వానించి విద్యార్థులకు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఏఐ, బ్లాక్‌చెయిన్ వెబినార్, మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌షాప్ వంటివి నిర్వహించాం. – చరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు. -
త్వరలో ప్రభుత్వ యాప్ స్టోర్..?
భారత ప్రభుత్వం తన పౌరులకు సైబర్ భద్రతను పెంచే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్‌లను ఒకే వేదికపై ఏకీకృతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ప్రభుత్వ మద్దతుతో GOV.in అనే యాప్ స్టోర్‌ను రూపొందించాలని ప్రతిపాదించింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని యాప్‌లకు నెలవు కానుంది.ప్రభుత్వం భావిస్తున్న ప్రతిపాదనలను సులభతరం చేయడానికి గూగుల్, ఆపిల్ సహా ప్రధాన టెక్ కంపెనీలతో పాటు స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ఎంఈఐటీవై సంప్రదించింది. ఈ యాప్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. GOV.in యాప్‌స్టోర్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్(యాపిల్) వంటి ప్లాట్‌ఫామ్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఫోన్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ క్రమంలోనే, వినియోగదారులకు చేరకముందే స్మార్ట్ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ స్టోర్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేయాలని తెలిపింది.ప్రయోజనాలు ఇలా..ఒకవేళ ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ సదుపాయాన్ని తీసుకొస్తే GOV.inయాప్ స్టోర్ దేశంలో డిజిటల్ సేవలను మరింత విస్తరించగలదని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత స్థాయిలో ఉండే ప్రభుత్వ ఆమోదిత యాప్‌లకు మెరుగైన సైబర్ భద్రత అందించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచ టాప్ కంపెనీ యాపిల్ ఇప్పటికే 2021లో రష్యా నిబంధనలకు కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఆమోదించిన యాప్‌స్టోర్‌ను ఇన్స్టాల్ చేయడానికి యాపిల్ అనుమతించింది.ఇదీ చదవండి: ఉపాధికి చేయూత కావాలిసవాళ్లు ఇవే..ఈ ప్రతిపాదనకు టెక్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తమ ఆపరేటింగ్ సిస్టమ్‌తో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల్లోని యాప్‌లపై కఠినమైన నియంత్రణను కలిగి ఉంటాయి. డెవలపర్లు తమ స్టోర్ల ద్వారా ఆర్జించే ఆదాయంపై 30% కమీషన్ వసూలు చేస్తాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న యాప్ స్టోర్ వారి నియంత్రణను, ఆదాయాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిపై ఇంకా కంపెనీలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. -
జొమాటో కస్టమర్లకు భారీ షాక్!
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది. కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్‌ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది. -
రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు
పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఈ సంఘటన జరిగింది.శుక్రవారం ఉదయం రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.#उत्तराखंड : आप स्टेशन पर ट्रेन का इंतजार कर रहे हों और सामने सांप आ जाए तो क्या होगा...। #ऋषिकेश रेलवे स्टेशन का एक वीडियो वायरल है। प्लेटफार्म पर अचानक एक लंबे सांप को रेंगता देख यात्रियों में अफरा-तफरी मच गई। #Uttarakhand #Rishikesh pic.twitter.com/qN3HAGt893— अनुराग शुक्ला/Anurag Shukla 🇮🇳 (@anuraganu83) September 20, 2024 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
వానరాలు నటించిన అచ్చ తెలుగు కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.భాష ఏదైనా భావం ముఖ్యమన్న నానుడి ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాకి సరిగ్గా సరిపోతుంది. ఒకటి రెండు పాత్రల మినహా పూర్తిగా చింపాంజీలు నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి వెస్ బాల్ దర్శకుడు. ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా మునుపటి ఏప్స్ సిరీస్‌కు కొనసాగింపుగా తీసింది. సీజర్ అనే ప్రధాన పాత్రధారి తదనంతరం జరిగే కథ ఇది. సీజర్కు వారసుడిగా ప్రకటించుకుని తనకు తానుప్రాక్సిమస్ సీజర్గా ప్రకటించుకుంటాడు ఓ నాయకుడు. మోవా, అతని సమూహం పై దాడి చేసి బందీలుగా తన రాజ్యానికి తెచ్చుకుంటాడుప్రాక్సిమస్ సీజర్. తన రాజ్యంలో మనుషులకు సంబంధించిన ఓ బంకర్‌ను మందీ మార్బలంతో తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో బంకర్‌కు సంబంధించిన ఓ మనిషితో కలిసిప్రాక్సిమస్ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు మోవా. తరువాత కొన్ని ట్విస్టులతోప్రాక్సిమస్ సీజర్‌ను మోవా ఎలా అంతమొందించాడు అన్నది హాట్ స్టార్ ఓటీటీ వేదిక మీద చూడాలి. కథ పరంగా చూస్తే మనకు పాత తెలుగు సినిమా కథ వాసనలు రావచ్చు. టెక్నాలజీని ఉపయోగించి టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఈగ నుండి డైనాసరస్ వరకు అన్ని జంతువులను మన కథకు తగ్గట్టుగా మలుచుకుంటున్నారు నేటి దర్శకులు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇంతటి సాంకేతికత అందుబాటులోకి రాని 80వ దశకంలోనే ‘మాకు స్వాతంత్య్రం కావాలి’ అన్న పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో పూర్తిగా జంతువుల మీద తీసిన సినిమా అది. నాటి ప్రేక్షకులకు అదో వింత, నేటి ప్రేక్షకులకు ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా అనేది ఓ పెద్ద వండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంతువులలో కూడా మనిషి భావాలు స్పష్టంగా చూపించడం, అలాగే అద్భుతమైన టేకింగ్ విత్ విజువల్ ఫీస్ట్ స్క్రీన్ల్పేతో ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా వర్త్ టూ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?
సినిమాలంటే ఎంటర్టైన్ చేయాలి. చాలామంది ఇలాంటి వాటిని చూడటానికే ఇష్టపడతారు. కొందరు మాత్రం డిఫరెంట్‌గా ఉండేవి లేదంటే డిస్ట్రబ్ చేసే మూవీస్ చూడటానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే ఈ మూవీ. ఎందుకంటే చూసిన తర్వాత ఒళ్లంతా కలిపేయడం గ్యారంటీ. మరి అంతలా డిస్ట్రబ్ చేసిన 'ద ఫ్లాట్‌ఫామ్' మూవీ ఏ ఓటీటీలో ఉంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూసేద్దాం.(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ)కథేంటి?గోరెంగ్ అనే వ్యక్తి ఓ గుహ లాంటి గదిలో నిద్ర లేస్తాడు. అతడితో పాటు త్రిమగాసి అనే వృద్ధుడు అదే గదిలో ఉంటాడు. అసలు అక్కడ ప్రతిరోజూ ఏం జరుగుతుందనేది త్రిమగాసి.. గోరెంగ్కి వివరిస్తాడు. పెద్ద బిల్డింగ్‌లో ఫ్లోర్స్లా ఉండే ఆ గుహలో, గదికి ఇద్దరు చొప్పున మనుషులు ఉంటారని, ప్రతిరోజూ ఒక్కసారే ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ ప్రతి ఫ్లోర్లో రెండు నిమిషాలు ఆగుతుందని, పై ఫ్లోర్స్‌లో ఉండే వాళ్లు మిగిల్చిన ఆహారాన్ని మనం తిని బతకాల్సి ఉంటుందని చెబుతాడు. ఇంతకీ వీళ్లు జైలు లాంటి గుహలో ఎందుకు ఉన్నారు? ఇక్కడ మనుషులు తోటి మనుషుల్ని ఎందుకు చంపి తినాల్సి వచ్చింది? చివరకు గోరెంగ్ బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ప్రపంచంలో రోజూ ఎన్నో లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోతున్నారు. మరోవైపు అవసరానికి మించి తినడమే కాకుండా, ఆహారాన్ని వృథా చేసే వాళ్లు కూడా మన చుట్టూనే చాలామంది ఉన్నారు. ఇలా మనిషి తన విచక్షణ కోల్పోయి ఆహారాన్ని వేస్ట్ చేస్తే.. తిరిగి అది తన ప్రాణాల మీదకే ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే 'ద ఫ్లాట్‌ఫామ్'. ఓటీటీలోనే దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రబింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూసిన తర్వాత మీకు ఆ రేంజులో ఒళ్లు కలిపేస్తుంది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)ఈ సినిమాలో దాదాపు 333 ఫ్లోర్స్‌లో ఇద్దరు చొప్పున ఉంటారు. ప్రతిరోజూ వీళ్లలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్‌ని సున్న ఫ్లోర్‌లోనే తయారు చేసి, అందంగా అమర్చి కిందకు దింపుతుంటారు. కానీ పైపై ఫ్లోర్స్‌లో ఉన్నోళ్లు తమకు అవసరమైనది మాత్రమే తినకుండా పక్కనోళ్ల ఫుడ్ కూడా తినేస్తుంటారు. దీంతో దిగువ ఫ్లోర్స్లోకి ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ వచ్చేసరికి ఆహారం సంగతి అటుంచితే ఎముకల కూడా మిగలవు. దీంతో మనిషిలో జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది. కింద ఫ్లోర్స్‌లోని వ్యక్తులు.. బతకడం కోసం తమ గదిలోనే తోటి మనిషిని చంపేసుకుంటారు. వాళ్ల శరీరంలోని మాంసాన్ని కొద్ది కొద్దిగా తింటూ నెలంతా బతికేస్తుంటారు.ఇలాంటి చోటకు గోరెంగ్ అనే వ్యక్తి స్వచ్ఛందంగానే వస్తాడు. కొన్నిరోజులకు బాగానే ఉంటాడు. కానీ ఆహారం దొరక్కపోయే సరికి రెండుసార్లు తన రూమ్మేట్స్ని చంపి తింటాడు. మరి చివరకు ఈ జైలు లాంటి గుహ నుంచి ఎలా బయటపడ్డాడనేది క్లైమాక్స్. మనలో చాలామందికి ఆహారం విలువ తెలీదు. ఎక్కువైందని అన్నం పారేయడం, అవసరం లేకపోతే ఫుడ్ వేస్ట్ చేయడం చేస్తుంటారు. చాలా మందికి ఇది కూడా దొరక్కే ఆకలితో చనిపోతున్నారు. కాబట్టి ఎంత కావాలో అంతే తినండి, అలానే పక్కనోళ్లకు పెట్టండి అనే కథతో తీసిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.అలానే ఇది అందరూ చూసే సినిమా కాదు. ఎందుకంటే మరీ దారుణమైన సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ మూవీస్ అందులోనూ డిస్ట్రబింగ్ విజువల్స్ ఉండే సినిమాలు చూడాలనుకునేవాళ్లు మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు. పొరపాటున ఫ్యామిలీతో గానీ భోజనం చేసేటప్పుడు గానీ 'ద ఫ్లాట్‌ఫామ్' చూడొద్దు! నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
తగ్గనున్న ప్లాట్ఫారం టిక్కెట్ ధర
భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.ప్లాట్ఫారం టిక్కెట్ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10గా ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ. 9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వే స్టేషన్ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ లోనికి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ప్లాట్ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోనికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.ప్లాట్ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు తదితర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 5శాతం ఉన్న జీఎస్టీ భారం ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. -
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్ మేక్స్ ఎవ్రీ థింగ్ బెటర్. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్ చేయడం నుంచి క్రియేటివ్ పవర్ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్‌ఫామ్‌లలోనే మ్యూజిక్ స్టార్లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్‌గా ఎదిగిన ఆర్టిస్ట్‌లలో జస్లీన్ రాయల్ ఒకరు. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్ బాలీవుడ్ ట్రాక్స్ కంపోజ్ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్ కంపోజింగ్‌లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్ రాయల్.∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్. రకరకాల మ్యూజిక్ జానర్లలో టాలెంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకుంది. కోల్‌కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్ స్టార్’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్ ఛాంప్స్‌లో ఫస్ట్ రన్నర్–అప్‌గా నిలిచింది. ‘స్వీట్ వాయిస్’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్’ పాట 6.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.∗ మల్టీ టాలెంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్‌కు చెందిన మిథాలీ ఠాకూర్ ‘రైజింగ్ స్టార్’ షోతో ఫేమ్ అయింది. భోజ్‌పూరి, క్లాసికల్, ఫోక్ సాంగ్స్‌ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్–అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ లిశా మిశ్రా పాటలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేది. బాలీవుడ్ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్ ఐడల్ జూనియర్‌గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్‌కు చెందిన అనన్య నందా. బాలీవుడ్ పాటల్లోనే కాదుక్లాసికల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్ వాయిస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.∗ బోస్టన్ (యూఎస్)లో పుట్టిన అవంతి నగ్రల్కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్‌నే కెరీర్‌గా చేసుకుంది. మ్యూజిక్‌లో రకరకాల జానర్స్‌ను మిక్స్ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఇందులో తన లైవ్ పర్ఫార్మెన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.∗ ఆర్ అండ్ బీ, హిప్–హాప్, సోల్, పాప్ మ్యూజిక్‌లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్–పాప్ మ్యూజిక్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్ఫుల్, సోల్ వాయిస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్ మ్యూజిషియన్స్ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్–మేడ్ సూపర్స్టార్లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్ మోడల్స్‌గా మారారు. -
పారదర్శక అనుమతుల జారీలో సువిధ పోర్టల్ రికార్డు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు సులభతరంగా, పారదర్శకంగా అందించడానికి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు, అభ్యర్థుల నుంచి 73,379 అభ్యర్థనలు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 60 శాతం (44,626) అభ్యర్థనలకు అనుమతులు ఇవ్వగా 15 శాతం (11,200) అభ్యర్థనలను తిరస్కరించినట్లు తెలిపింది. మిగిలిన అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. సువిధ పోర్టల్ వినియోగంలో 23,239 అభ్యర్థనలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11,976 అభ్యర్థనలు), మధ్యప్రదేశ్ (10,636 అభ్యర్థనలు) ఉన్నాయి. కనిష్టంగా చండీగఢ్‌లో 17 అభ్యర్థనలు, లక్షదీ్వప్‌లో 18, మణిపూర్‌లో 20 అభ్యర్థనలు అందాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడాల్సిన ఆంధ్రప్రదేశ్ నుంచి 1,153 అభ్యర్థనలు వచ్చాయి. ఉచిత, న్యాయమైన, పారదర్శకమైన ప్రజాస్వామ్యం అనే సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి అనుమతి అభ్యర్థనలు స్వీకరించేందుకు, వెంటనే వాటిపై చర్యలు తీసుకునేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకు ఈ పోర్టల్ వీలు కల్పిస్తోంది. ర్యాలీలు నిర్వహించడం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటికి ప్రచారం చేయడం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహనాలు, కరపత్రాలు పంపిణీ వంటి వాటికి అనుమతులు ఇస్తుంది. ఆన్లైన్ ద్వారా అనుమతులు సువిధ పోర్టల్ (https://suvidha.eci.gov. in) ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అనుమతి అభ్యర్థనలను ఆన్లైన్లో సమరి్పంచవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా అభ్యర్థనలు ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్ర విభాగాల నోడల్ అధికారులతో నిర్వహించే పటిష్టమైన ఐటీ ప్లాట్‌ఫాం సహకారంతో దరఖాస్తులను సమర్థంగా ప్రాసెస్ చేయడానికి ఈ పోర్టల్ సహాయకారిగా ఉంటోంది. యాప్ ద్వారా కూడా సువిధ సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారులు తమ అభ్యర్థనల స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారాల్లో అందుబాటులో ఉంది. సువిధ ప్లాట్‌ఫాం ఎన్నికల ప్రక్రియ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, అప్లికేషన్ల రియల్ టైమ్ ట్రాకింగ్, స్టేటస్ అప్డేట్, టైమ్‌స్టాంప్ చేసిన సమర్పణలను ఎంఎస్ఎం ద్వారా తెలియజేయడం ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఇంకా పోర్టల్‌లో లభించే అనుమతి డేటా ఎన్నికల వ్యయాలను పరిశీలించడానికి విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సమగ్రతకు దోహదపడటమేగాక ఎన్నికల సంఘం నిబద్ధతను పునరుద్ఘాటించడానికి సువిధ ప్లాట్‌ఫాం ఎంతో దోహదపడుతుంది. న్యాయమైన, సమర్థమైన, పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయడానికి, అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్థులు అవసరమైన అనుమతులు పొందేందుకు సమాన అవకాశాలు కలి్పంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. -
‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉండనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో రైతులకు పలు సూచనలు చేయనున్నారు. ఇదీ చదవండి: టీవీ-5 సాంబశివరావు బాగోతం.. మరో కేసు నమోదు -
డిజిటల్ వేదికగా ‘కుతుబ్ షాహీ టూంబ్స్’ పరిరక్షణ
సాక్షి, హైదరాబాద్: నగరానికే తలమానికమైన వారసత్వ సంపద ‘కుతుబ్ షాహీ సమాధుల’ను డిజిటల్ వేదికపై పరిరక్షించడంలో ముందుకు సాగుతున్నామని హెగ్జాగోనల్ రియాలిటీ టెక్నాలజీ సీఈఓ పాలో గుగ్లియెలి్మని తెలిపారు. కుతుబ్ షాహీ టూంబ్స్ డేటా–రిచ్ డిజిటల్ ట్విన్ కోసం హెగ్జాగోనల్ ఆధ్వర్యంలో రియాలిటీ టెక్నాలజీ నేపథ్యంలో మంగళవారం కుతుబ్ షాహీ సమాధుల వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలో గుగ్లియెల్మిని మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, అధునాతన డిజిటల్ ఆవిష్కరణలతో చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌ల సంరక్షణకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నగరంలోని గత చరిత్రకు చెందిన అద్భుత ఆనవాళ్లను రక్షించడానికి రియాలిటీ టెక్నాలజీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్–రియాలిటీ వేదిక డేటా– రిచ్ యాక్షన్ డిజిటల్ ట్విన్ను అనుసంధానం చేయడానికి అధునాతన ఏఐ పరిష్కారాలను వర్తింపజేశామని హెగ్జాగోనల్ ఆర్అండ్డీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ మిశ్రా పేర్కొన్నారు. -
కస్టమర్లకు సైలెంట్ షాకిచ్చిన స్విగ్గీ!
ప్రముఖ ఫుడ్ డెలివరీ దగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. స్విగ్గీని వినియోగిస్తూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్‌ఫామ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. తాజాగా ఆ ఛార్జీలను పెంచుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం స్విగ్గీ ఎక్కువ మంది యూజర్ల నుంచి ఆర్డర్‌ను బట్టి రూ.3 ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే, పెరిగిపోతున్న డెలివరీలను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని గడించేందుకు కొత్త వ్యాపార ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా రూ.10 ప్లాట్‌ఫామ్ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే ఆర్డర్ చేసిన తర్వాత బిల్లులో ప్లాటఫామ్ ఛార్జీ రూ.10 చూపిస్తుంది. డిస్కౌంట్ ఇస్తున్నామంటూ రూ.5 మాత్రమే వసూలు చేస్తుంది. రానున్న రోజుల్లో దీనిని పది రూపాయలకు పెంచే యోచనలో ఉందని, కాబట్టే బిల్లులో ఇలా చూపిస్తుందని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా స్విగ్గీ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫ్లాట్‌ఫామ్ ఫీజుల్ని పెంచే ఉద్దేశం లేదన్నారు. కాకపోతే కస్టమర్లను అర్ధం చేసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఇది కూడా ఓ భాగమేనని అన్నారు. జనవరి 1న,జొమాటో వినియోగదారుల నుంచి ప్లాట్‌ఫారమ్ రూ.3 నుండి రూ.4 పెంచిందని ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ కొత్త ఏడాది సందర్భంగా ఎంపిక చేసిన కస్టమర్లకు తాత్కాలికంగా ప్లాట్‌ఫారమ్ ఛార్జీలను కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్‌కు రూ.9 వసూలు చేసింది. స్విగ్గీ గత ఏడాది ఏప్రిల్‌లో ఫ్లాట్ ప్లాట్‌ఫారమ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభించగా జొమాటో ఆగస్టు నుంచి ప్రారంభించింది. రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఆర్డర్‌కు రూ.2 రుసుముతో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్విగ్గీ మరోమారు ప్లాట్‌ఫారమ్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. -
అలా చేయడం తప్పు, అందుకు ఇదే ఒక ఉదాహరణ: రష్మిక
హీరోయిన్ రష్మికా మందన్నా అంటూ మార్ఫింగ్ చేసిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు. నన్ను అభిమానిస్తూ, నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అలాగే ఇలాంటి ఘటనలకు (మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను ఉద్దేశించి) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిలు... అబ్బాయిలు... ఎవరైనా కావొచ్చు. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, దుర్వినియోగం చేయడం అనేవి తప్పు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారీ బ్యూటీ. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. -
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు!
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్ -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
TS Election 2023: పసుపు.. చక్కెర
తుమాటి భద్రారెడ్డి: రైతు ఉద్యమాల వేదికగా పేరున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శాసనసభ ఎన్నికలకు సకల అస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 శాసనసభ స్థానాలు ఉండగా 2014లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన 8 సీట్లు గెలిచింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు హామీతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రైతుల ఆసరాతో అనూహ్యంగా కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు. ఇక ఇప్పుడు నిజాం షుగర్స్ అంశం ప్రధాన ఎజెండాగా రైతుల ఓట్లు మరోసారి కొల్లగొట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. కాంగ్రెస్ సైతం నిజాం షుగర్స్, మంచిప్ప రిజర్వాయర్ ముంపు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, ఆరు హామీలతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అలాగే దళితబంధులో కమీషన్ల వసూళ్లు, డబుల్ ఇళ్ల నిర్మాణంలో విఫలం, కామారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తదితరాలపైనా ప్రచారం చేస్తోంది. ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, పైగా ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతుండడంతో ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత సమీకరణాలు మారనున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ బాల్కొండ బరిలో ముక్కోణపు పోటీ వరుసగా రెండుసార్లు గెలుపొందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డికి టికెట్ వచ్చింది. ఈయనకు గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున 42వేల ఓట్లు దక్కడం గమనార్హం. ఇక బీజేపీ తరపున ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి. బోధన్ బాస్ ఎవరో?.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సుదర్శన్రెడ్డికే టికెట్ ఇచ్చారు. షకీల్‌ను ఓడించాలనే లక్ష్యంతో శరత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. ఆర్మూర్ ఆషామాషీ కాదు ఇప్పటికే రెండుసార్లు గెలవడంతో ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే జీవన్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గడ్డు పరిస్థితి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పొద్దు టూరి వినయ్‌రెడ్డికి టికెట్ ఖరారు అయ్యింది. బీజేపీ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ పార్టీ ఆదేశిస్తే చివరి నిమిషంలో ఎంపీ అర్వింద్ బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అర్వింద్ బరిలో ఉంటే గెలుపు సులువని పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్‌లో నిలిచేది ఎవరు? ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బిగాల గణేశ్‌గుప్తా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో కింగ్‌కి పోటీ ఇచ్చేనా? బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ, బీజేపీ నుంచి∙వెంకటరమణారెడ్డి పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. షబ్బీర్‌అలీ గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్, అక్రమ వెంచర్లు, ధరణి అక్రమాలు, పావలా వడ్డీ బకాయిల ఉద్యమాల్లో పాల్గొన్న వెంకటరమణారెడ్డి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. నిజామాబాద్ రూరల్‌లో సీన్ మారుతుందా? వరుసగా మూడోసారి, మొత్తంగా ఐదోసారి గెలిచి కేబినెట్లో స్థానం సంపాదించేందుకు బాజిరెడ్డి గోవర్దన్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ నుంచి కులాచారి దినేష్‌కు టికెట్ దక్కనుందనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేష్‌రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిప్ప జలాశయం ముంపు అంశం, ధరణి, పోడు భూముల అంశాలు కాంగ్రెస్ ప్రధాన ప్రచార అ్రస్తాలుగా వాడుతోంది. బాన్సువాడ బరిలో గెలుపెవరిది? రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే నమ్మకంతో బరిలో మరోమారు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్ నిలబడితే గెలుపు అవకాశాలుంటాయనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మాల్యాద్రిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఎల్లారెడ్డి.. ఏలేదెవరో? గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి వెళ్లారు. కేసీఆర్ పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్, సుభాష్ రెడ్డి మధ్య టికెట్ పోటీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నడుస్తోంది. జుక్కల్ ఎవరిపరం? సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మూడోసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార, బుచ్చన్న టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్ మధ్య పోటీ నెలకొనగా మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
జీఎస్టీ షోకాజ్ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్ 11
న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్లో డ్రీమ్11 పేర్కొంది. ‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం. గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్టీ రికవరీ కోసం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది. -
స్కీముల పేరుతో స్కామ్‌లు చేసి కోట్లు స్వాహా..
సాక్షి, హైదరాబాద్: స్కీ ముల పేరుతో బీఆర్ ఎస్ నేతలు స్కామ్ లు చేసి లక్ష కోట్లు కాజేశా రని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎన్నికలు వచ్చేసరికి కొత్త కొత్త స్కీమ్‌లంటూ పిట్ట కథ లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షా లను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చే చిన్న దొర.. కుంభకర్ణుడికి అసలైన వారసుడని శుక్రవారం ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై మండిపడ్డారు. 8 ఏళ్లలో ముష్టి 30 వేల ఇండ్లు కట్టిన మీరే దేశానికి ఆదర్శం అయితే.. 5 ఏళ్లలో 42 లక్షల పక్కా ఇండ్లు కట్టించిన వైఎస్సార్ పాలనను ఏమ నాలన్నారు. -
నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస
లోన్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (PTPFC)ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్బీఐ బోర్డ్ మీటింగ్‌లో ప్రదర్శించారు. దీన్ని వీక్షించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అద్భుతమంటూ ప్రశంసించారు. రుణగ్రహీతలు, రుణ సంస్థలను అనుసంధానించి తక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలనుకునేవారికి రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ పీటీపీఎఫ్‌సీని రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్ రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు, ఎంఎస్ఎంఈలకు నాన్-కొలేటరల్ ఆధారిత రుణాలు, హోం లోన్లు, డెయిరీ రుణాలు, వ్యక్తిగత రుణాల మంజూరులో సహాయపడుతుంది. తాజాగా ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశానికి హాజరైన ఆనంద్ మహీంద్రా ఆ విశేషాలను ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పంచుకున్నారు. "కొన్నిసార్లు ముందు వరుసలో సీటు పొందడం గొప్పగా ఉంటుంది. శనివారం (సెప్టెంబర్ 2) ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న మాకు రిజర్వ్ బ్యాంక్ పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (PTPFC) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. ఇది కేవైసీ ప్రక్రియలు, డాక్యుమెంట్లను సమీకృతం చేయడం ద్వారా రుణం మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని రోజుల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. తద్వారా గ్రామీణ కస్టమర్లకు క్రెడిట్ డెలివరీ మెకానిజంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ఓపెన్ ప్లాట్‌ఫారమ్ దీనిని ఉపయోగించాలనుకునే అన్ని బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. భారత్ మళ్లీ డిజిటల్ పోల్ పొజిషన్‌ను తీసుకుంటోంది. అభినందనలు ఆర్బీఐ" అంటూ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు. పీటీపీఎఫ్సీ పైలట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను జత చేశారు. Sometimes, you feel you’ve been privileged to get a front-row seat to a Social & Technological disruption. At the @RBI board meeting in Indore last Saturday, we were given a demonstration of the Reserve Bank’s Public Tech Platform for Frictionless Credit (PTPFC) pilot project.… pic.twitter.com/3QpkT4lNqz — anand mahindra (@anandmahindra) September 4, 2023 -
ఆర్బీఐ ‘పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం’.. లోన్ మంజూరు వేగవంతానికి చర్యలు
ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్ఫామ్లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది. ప్రస్తుతం డిజిటల్‌గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడనుంది. -
స్విగ్గీ బాటలో జొమాటో - ఇకపై కస్టమర్లకు చుక్కలే..
Zomato Platform Fee Rs.2: టమాట ధరలు భారీగా పెరగడంతో నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఉల్లి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జొమాటో ఇకపై ప్రతి ఆర్డర్ మీద రూ. 2 అదనపు ఫీజు వసూలు చేయడానికి సిద్దమైంది. కస్టమర్ బిల్లు ఎంత అనేదానికి సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్ మీద ఇకపై రూ. 2 వసూలు చేయనుంది. ఇప్పటికే ఈ విధానాన్ని స్విగ్గీ అనుసరిస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మంచి ఆదాయం పొందటానికి ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది! ప్రస్తుతానికి జొమాటో ఆర్డర్ మీద ఎటువంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదు. కానీ త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కాగా బ్లింకెట్ వంటి సంస్థలు కూడా ఫ్లాట్‌ఫామ్ ఫీజుని వసూలు చేయలేదు. కాగా రానున్న రోజుల్లో కంపెనీ ఎటువంటి నష్టాలను చవి చూడకూడదని, గత త్రైమాసికంలో పొందిన లాభాల మాదిరిగానే ముందుకు కొనసాగడానికి ఈ ప్రయత్నాలు చేస్తుంది. -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్‌లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్‌లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
meesho మరో అరుదైన రికార్డు
-
ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కేబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు వ్యవహారంలో బీజేపీ పార్టీపై చేసిన విమర్శలకు రాష్ట్ర బీజేపీ నాయకుడు అన్నామలై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సందర్బంగా స్టాలిన్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ప్లాట్ఫారం స్పీకర్ లా మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశం ద్వారా తమ పార్టీకి మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. మాస్ వార్నింగ్.. మనీ లాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ పార్టీని విమర్శిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా ఈడీ వేధింపులకు గురిచేసినంత మాత్రాన మేము భయపడేది లేదు. మాక్కూడా రాజకీయాలు చేయడం తెలుసు. ఇది బెదింపు కాదు.. హెచ్చరిస్తున్నా.. " అంటూ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ మాటలేంటి? అన్నామలై మాట్లాడుతూ.. గౌరవనీయులైన స్టాలిన్ గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలా మాట్లాడటం తగదు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఒక ప్లాట్ ఫారం స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. అదికూడా ఇప్పటివరకు ఐదు పార్టీలు మారి అనేక అక్రమాలకు పాల్పడిన అవినీతిపరుడిని కాపాడటానికి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఒకప్పుడు స్వయంగా మీరే ఈ బాలాజీ అవినీతిపరుడని ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరే ఆయన్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, 8.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అనవసర భయాందోళనలను పక్కనపెట్టి కాస్త విచక్షణతో మాట్లాడమని ఈ సందర్భంగా హితవు పలికారు. ఇది కూడా చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
మెరుపులా వచ్చి కాపాడింది
పశ్చిమబెంగాల్లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్లో... ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు. దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్‌లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఎస్కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది. -
ఫ్లాట్ ఫామ్..ట్రైన్ కు మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ
-
2018మూవీ కి బిగ్ షాక్..
-
సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. (గోద్రెజ్‌కు రూ.2,000 కోట్ల ఆర్డర్లు) సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఇందులోని మరిన్ని అంశాలు.. ♦ ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ♦ లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ♦ కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. (ఇదీ చదవండి: ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా) -
చీరాల: రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కున్న మహిళ
చీరాల అర్బన్: రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. రైల్వే పోలీసులు స్పందించి ఆమె ప్రాణాలు కాపాడారు. శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో ఈ ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా కరేడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ, ఆమె భర్త ఇద్దరూ ఉలవపాడు వెళ్లేందుకు తెనాలిలో విజయవాడ–గూడూరు మెమూ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు చీరాల వచ్చేసరికి మరుగుదొడ్ల కోసం రైలు నుంచి ఆమె కిందకు దిగింది. అనంతరం రైలు కదలడంతో హడావుడిగా కదులుతున్న రైలు ఎక్కింది. ఈ క్రమంలో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఆమె ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడ జీఆర్పీ, ఆరీ్పఎఫ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, నాగార్జున ఇద్దరూ కలిసి తోటి ప్రయాణికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సుమారు 50 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వందే భారత్ రైలుపై రాళ్లదాడి.. -
ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ గిట్‌హబ్ మొత్తం భారతీయ ఇంజనీరింగ్ బృందాన్ని తొలగించనుంది. ఈ మేరకు గిట్‌హబ్ సీఈవో థామస్ దోమ్కే ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఖర్చులను తగ్గించుకొనే క్రమంలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. "పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక" లో భాగంగా తీసుకున్న ఈ చర్యతో కనీసం 100 మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోనున్నారు. అమెరికా తరువాత రెండో అతిపెద్ద డెవలపర్ సెంటర్‌గా ఉన్న భారతీయ టీం మొత్తాన్ని తొలగించడం ఆందోళన రేపింది. అయితే ప్రతి వ్యాపారానికి స్థిరమైన వృద్ధి ముఖ్యమని సీఈవో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వెల్లడించారు. ప్రస్తుతం 100 మిలియన్ల డెవలపర్లున్నారు. రేపటి ప్రపంచానికి డెవలపర్-ఫస్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్‌గా సంస్థ మారాల్సి ఉందన్నారు. తమ కస్టమర్లు GitHubతో వృద్ధి చెందేందుకు, వారి క్లౌడ్ అడాప్షన్ జర్నీని వేగవంతం, సరళీకృతం చేయడంలో సహాయపడటం కొనసాగించాలని సీఈవో తెలిపారు. (ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం) గత నెల ప్రారంభంలో గిట్‌హబ్ ప్రకటించిన విస్తృత క్రమబద్ధీకరణ ప్రయత్నంలో ఈ తొలగింపు భాగం కావచ్చని అంచనా. మార్చితో ముగిసే త్రైమాసికం నాటికి దాదాపు 10శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు ఇంతకుముందే (ఫిబ్రవరిలో) సంస్థ ప్రకటించింది. GitHub slashes engineering team in India https://t.co/8K2toOvzZm by @refsrc — TechCrunch (@TechCrunch) March 28, 2023 (ఇదీ చదవండి: Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!) -
రైల్వే ప్లాట్‌ఫారమ్ టీవీల్లో యాడ్స్‌కు బదులుగా ..
నిర్లక్ష్యమో, కావాలని జరిగిన ఘటనో తెలియదుగానీ.. స్టేషన్లో ప్రయాణికులను బిత్తర పోయేలా చేసింది ఓ ఘటన. అడ్వర్టైజ్మెంట్ల ప్లేస్‌లో మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్రదర్శితమైంది. ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం బీహార్ రాజధాని పాట్నా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న కొందరు ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న టీవీల్లో పో* వీడియో ప్లే కావడంతో ఇబ్బందిపడ్డారు. కొందరు ఆకతాయిలు అరుస్తూ.. ఆ వీడియోను తమ సెల్ఫోన్లతో బంధించారు. ఈలోపు కొందరు ప్రయాణికులు.. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ), ఆర్పీఎఫ్ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేసే ఏజెన్సీకి ఫోన్ చేయడంతో.. వీడియో ఆగిపోయింది. ఇక ఈ ఘటనకు సదరు ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్స్ ఘటనకు కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు మరెప్పుడూ కాంట్రాక్ట్ దక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చారు. అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధించారు. మరోవైపు రైల్వే విభాగం ఈ ఘటనపై విడిగా విచారణ చేపట్టింది. అయితే ప్రత్యేకించి ప్లాట్‌ఫాం నెంబర్ 10పైనే టీవీల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైల్వే అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియో: ఇలాంటి షాపింగ్‌ను మీరు కచ్చితంగా ఊహించి ఉండరు! -
‘లాగి’ ఒక్కటిచ్చాడు.. లేదంటే చచ్చేవాడే! షాకింగ్ వీడియో
సాక్షి,ముంబై: అనాలోచితంగానో, హడావిడిలోనో అనుకోని ప్రమాదంలో పడిపోతూ ఉంటారు చాలామంది. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. అయితే రైల్వే పట్టాలు, రైల్వే క్రాసింగ్‌ల ప్లాట్ఫారంల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్క్ష్య ధోరణి చాలా వరకు కొనసాగుతూనే ఉంది అనడానికి ఉదాహరణ. పట్టాలను దాటుతూ తాత్సారం చేస్తున్న ఒక వ్యక్తికి హెల్ప్ చేసి, సురక్షితంగా పైకి లాగాడు అక్కడున్న ఓ రైల్వే కానిస్టేబుల్. దీంతో లిప్త పాటులో అతనికి ప్రాణా పాయం తప్పింది. ఈ ఉద్వేగంలోనే బాధితుడిని లాగి ఒక్కటిచ్చాడు సదరు పోలీసు.. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి ట్విటర్ తెగ షేర్ అవుతోంది. Sometimes you deserve help and a Slap at the same time ! pic.twitter.com/0L3NE3PTc1 — Vijay Gopal (@VijayGopal_) January 14, 2023 -
రద్దీగా ఉన్న రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి లారీ.. వీడియో వైరల్
లఖ్‌నవూ: రైల్వే స్టేషన్ లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీగా ఉండి కలుపెట్టే సంధు సైతం ఉండని పరిస్థితులు ఉంటాయి. అయితే, అలాంటి ఓ రద్దీ ప్లాట్‌ఫామ్‌పై భారీ ట్రక్కు కనిపించటం అక్కడి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జరిగిన సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ ఆటో రిక్షా ఏవిధంగా అయితే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిందో.. అదే విధంగా ప్లాట్‌ఫామ్‌పై నుంచి లారీని నడపటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు భారీగానే ఉన్నారు. అయితే, ఏ రైల్వే స్టేషన్ అనేది స్పష్టత లేదు కానీ, ప్లాట్‌ఫామ్ నంబర్ 9 అని వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్స్పైకి వాహనాలను తీసుకురావటమేంటని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. #UttarPradesh pic.twitter.com/gsfMhakbZJ — HP Live News (@hplivenews1) December 21, 2022 ఇదీ చదవండి: హ్యాట్సాఫ్ యశోధరా.. ‘ఎంబీబీఎస్’ చదువుతూనే ‘సర్పంచ్’గా ఎన్నిక -
Duvvada Railway Station: శశికళ.. గుండె విలవిల
సాక్షి, తూర్పుగోదావరి: లేకలేక కలిగిన సంతానం ఆ అమ్మాయి. అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలవుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. విధి చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయి ప్రాణాలను హరించింది. అనకాపల్లి జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం గుంటూరు – రాయగడ∙ఎక్స్‌ప్రెస్ దిగుతూ జారి పడి, ప్లాట్‌ఫాం – రైలు బోగీ మధ్య ఇరుక్కుపోయి.. గంటన్నర పాటు అంతులేని బాధ పడిన మెరపల శశికళ (22) విశాఖపట్నంలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. శరీరం నలిగిపోయి అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె మృతి సమాచారం తెలియడంతో అన్నవరం వెలంపేటలో విషాద ఛాయలు అలముకొ న్నాయి. ఈ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి కుమార్తె శశికళ చిన్నప్పటి నుంచీ చదువులో దిట్ట. బొమ్మలేయడంలో కూడా మంచి ప్రతిభ ప్రదర్శించేది. తుని ఆదిత్యలో బీసీఏ చదివింది. గత నెలలో దువ్వాడ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంసీఏ కోర్సులో చేరింది. రోజూ అన్నవరం నుంచి దువ్వాడ వరకూ రైలులో వెళ్లి వచ్చేది. ఇలా తిరగడం ఇబ్బందిగా ఉందని, హాస్టల్లో ఉంటానని ఇంట్లో చెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం బయలుదేరి వెళ్లిన శశికళ దువ్వాడలో ట్రైన్ నుంచి జారి పడిపోయింది. కిందకు దిగే ప్రయత్నంలో రైలు కుదుపునకు బోగీ తలుపు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో శశికళ అదుపు తప్పి పడిపోయిందని సమాచారం. ఆమె మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో బంధువులు విశాఖ బయలుదేరారు. తల్లితండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం శశికళ మృతదేహాన్ని గురువారం రాత్రి అన్నవరం తీసుకువచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసి, పుట్టెడు దుఃఖంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున విలపించారు. శశికళ మృతికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి) -
ఒడిస్సా: ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైల్..
-
‘కేక’ 57 మిలియన్ డాలర్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల (హెచ్ఆర్–టెక్) సంస్థ ’కేక’ తాజాగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 57 మిలియన్ డాలర్లు సమీకరించింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విభాగంలో ప్రారంభ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ యలమంచిలి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి ఉత్పాదనను రూపొందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు విజయ్ వివరించారు. 2016లో ప్రారంభమైన సంస్థ .. 5,500 పైగా చిన్న కంపెనీలకు సర్వీసులు అందిస్తోంది. -
Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత పనై ఉండేది
రైలు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొంతమంది కావాలనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. మరికొందరు అనుకోకుండా రైలు ప్రమాదం బారిన పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. అయితే అదృష్టం బాగుండి మృత్యువును జయించి వీరుడిలా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని భర్తన రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. దీనిని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు. వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు వెళ్లింది. ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా వెళ్తుండటం వల్ల పట్టాలపై పడిన వ్యక్తి ముందుగా కనిపించలేదు. నిమిషం తరువాత ట్రైన్ వెళ్లిపోయాక చూస్తే అతను ఎటు కదలకుండా ప్లాట్‌ఫామ్‌కు అనుకొని కింద ఒకేచోట ఉండిపోయాడు. అంతేగాక అద్భుతంగా అతని ఒంటిపై కనీసం ఒక్క గీత కూడా పడకుండా సురక్షితంగా బయటకొచ్చాడు. రైలు స్టేషన్ దాటిన తర్వాత సదరు వ్యక్తి తనను బతికించినందుకు దేవుడికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలతో బయటపడటంతో అక్కడ గుమిగూడిన వారంతా హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వీడియో ఆధారంగా రైలు వచ్చే కొద్ది క్షణాలముందే వ్యక్తి ట్రాక్‌పై పడినట్లు తెలుస్తోంది. అతని వస్తువులు కూడా పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. Viral Video : Train passed over a man at Bharthana railway station in Etawah as death..., watch breath-taking video pic.twitter.com/eHtn1LcN1A — santosh singh (@SantoshGaharwar) September 6, 2022 -
Local Train: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన రైలు.. ప్రయాణికుల పరుగులు
సబర్బన్ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని బీచ్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ వైపుపైకి దూసుకోచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులందరూ పరుగులు పెట్టారు. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు. Empty rake of suburban train overshot buffer end of the platform at #Chennai Beach Station resulting in an accident, driver jumps to safety. No passenger injured @GMSRailway orders probe into the incident. Video courtesy Wa group #TamilNadu pic.twitter.com/vKnYJDvssQ — Vijay Kumar S (@vijaythehindu) April 24, 2022 ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ మాత్రం గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. -
రష్యాకు ఊహించని ఝలక్..రైల్వేస్టేషన్లో దాడులకు సంబంధించిన ఫోటోల ప్రదర్శన
24 Wae Images Set Up On The Platform: ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక పోరు కొనసాగిస్తునే ఉంది. రష్యా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఉక్రెయిన్ పై బాంబుల మోత మోగిస్తూనే ఉంది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌ని అల్లకల్లోలం చేస్తోంది. దీంతో లక్షలాది మంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్లగా..వేలాది మంది పౌరులు ఈ యుద్ధంలో విగత జీవులుగా మారారు. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఏ విధంగానైనా రష్యా దురాక్రమణకు అడ్డుకట్టే వేసేలా తనదైన శైలిలో శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులతో ఏ విధంగా విరుచుకుపడుతున్నయో వివరించే చిత్రాల ప్రదర్శనను లిథువేనియాలోని రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసింది. లిథువేనియా, ఐరోపా సమాఖ్య, రష్యా ప్రత్యేక ఏర్పాటు ప్రకారం బాల్టిక్ రాష్ట్రం నెలకు 100 రైళ్లను కాలినిన్గ్రాడ్ ఎక్స్క్లేవ్ నుంచి రష్యన్ ప్రయాణీకులను రవాణా చేయడానికి అనుమతిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటీ నుంచి రష్యాకు వ్యతిరేకంగా విమాన ప్రయాణంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ లుథువేనియాలో ఈ రవాణా ఏర్పాటు కొనసాగుతూనే ఉంది. అయితే లిథువేనియన్ రాజధాని విల్నియస్‌లోని రైల్వే స్టేషన్లో ఈయూ ప్రయాణీకులు రైలు నుంచి దిగడానికి అనుమతి ఉంది కానీ రష్యన్ ప్రయాణీకులకు లేదు. ఈ మేరకు రష్యాన్ ప్రయాణికులకు పుతిన్ దురాగతాలు తెలిసేలే ఉక్రెయిన్ అధికారులు యుద్ధానికి సంబంధించిన దాదాపు 24 చిత్రాలను లిథువేనియా రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ట్పారమ్పై ఏర్పాటు చేశారు. పైగా ఆ చిత్రాలను క్యారేజ్ కిటికిల ఎత్తులో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ చిత్రాలలో శాంతియుత దేశంలోని జనాభా పై దాడులు నిర్వహించి గాయపరిచారు, మా ప్రజల స్వేచ్ఛ యుత జీవనానికి భంగం కలిగించారు వంటి సందేశాలు కూడా ఉన్నాయని లిథువేనియన్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ క్లబ్ అధిపతి జోనాస్ స్టాసెలిస్ అన్నారు. నిజానికి ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణను ఖండిస్తూ..రష్యన్ వాసులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇటీవల ఒక రష్యన్ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ వెనుక ఒక జర్నలిస్ట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రావడంతో ఆమెను రష్యా అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు కూడా. ఈ మేరకు పుతిన్‌కి సొంత దేశంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చేలా ఉక్రెయిన్ తనదైన వ్యూహంతో పావులు కదుపుతోంది. (చదవండి: ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్... అదే మా లక్ష్యం!) -
మౌలాలి రైల్వేస్టేషన్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మౌలాలి రైల్వేస్టేషన్లో మరిన్ని రైళ్ల నిలుపుదలకు అవకాశం లభించింది. పెద్ద ఎత్తున చేపట్టిన రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫామ్‌ల పొడిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రైళ్ల నిర్వహణకు అనుగుణంగా స్టేషన్ అందుబాటులోకి రానుంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం లూప్లైన్ల ఏర్పాటు చేశారు. అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికుల రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి. సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రద్దీ నివారణకు అనుగుణంగా మౌలాలి స్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు సరుకు రవాణా లైన్లను లూప్‌లైన్లుగా మార్పు చేశారు. మరోవైపు రెండు రైల్వే లైన్ల పొడవును విస్తరించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్లో 18 బోగీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగనుంది. (క్లిక్: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం) ఈ సదుపాయంతో మౌలాలి స్టేషన్లో మరిన్ని రైళ్లు నిలిపేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రయాణికుల రైళ్లను నిలిపేందుకు ఇప్పుడు ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లతో పాటు మరొకటి అదనంగా అందుబాటులోకి రానుంది. రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా మెరుగుపడనుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. (క్లిక్: ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా) -
గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్లాట్‌ఫామ్‌ల మార్పు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రైల్వే స్టేషన్లో ఒకే చోట ఎక్కువ రద్దీ ఏర్పడకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పక్కపక్క ప్లాట్‌ఫామ్స్‌లోకి ఒకేసారి మూడు, నాలుగు రైళ్లు వచ్చే వేళల్లో కొన్ని రైళ్లను దూరంగా ఉన్న వేరే ప్లాట్‌ఫామ్స్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈనెల 12 (నేటి) నుంచి 21 వరకు మూడు ప్రధాన రైళ్లలో ఈ మార్పులు చేశారు. హైదరాబాద్–విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 1కి బదులు ప్లాట్‌ఫామ్ 10 నుంచి బయల్దేరుతుంది. లింగంపల్లి–కాకినాడ పోర్టు గౌతమి ఎక్స్‌ప్రెస్ కూడా ప్లాట్‌ఫామ్ 1కి బదులు 10 నుంచి బయల్దేరుతుంది. ఇక హజ్రత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెం 10 నుంచి కాకుండా ప్లాట్‌ఫామ్ 1 నుంచి బయల్దేరుతుంది. కాగా, సికింద్రాబాద్ స్టేషన్లో మాస్కులు ధరించని 169 మంది నుంచి రూ.34,100ను పెనాల్టీగా వసూలు చేశారు. ( సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు) -
క్షణం ఆలస్యమై ఉంటే అంతే
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కదులుతున్న రైలు నుండి పట్టాలపై పడబోయిన ప్రయాణికుడిని రైల్వే పోలీస్ చాకచక్యంతో రక్షించిన సంఘటన కారవార రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర రక్షణ శాఖ అధికారి బీఎం దేసాయి (59)ని, కారవార రైల్వే పోలీస్ నరేశ్ రక్షించారు. ఆదివారం దేసాయి ఒకటవ ప్లాట్‌ఫాం మీద ఉన్న లగేజీ తీసుకోవడానికి కదులుతున్న ట్రైన్ నుండి దిగబోతూ కాలుజారి పట్టాలపై పడబోయాడు. అంతలో ఈ దృశ్యాన్ని చూసిన నరేశ్ తక్షణం అప్రమత్తమై దేసాయిని కాపాడాడు. ఈ వీడియోను కొంకణ రైల్వే శాఖ విడుదల చేసి ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
మీ ఫుడ్ ట్రైన్ కాసేపట్లో వస్తుంది
సనత్‌నగర్: దేశ విదేశాల్లోని రైల్వేస్టేషన్ల అనుభూతి కలిగించేలా వినూత్నంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైన్ రెస్టారెంట్ భోజన ప్రియులను కట్టిపడేస్తోంది. పక్క నుంచే రయ్‌మంటూ సాగిపోయే రైళ్లు..కూర్చున్నకాడికి నోరూరించే వంటకాలను రైళ్లు మోసుకొచ్చేస్తున్నాయి. ప్రయాణికులను, సరుకులను రవాణా చేసే రైళ్లను చూసిన సిటీజనులు..ఇప్పుడు బిర్యానీలు, తమకిష్టమైన వంటకాలను తమ చెంతకు తీసుకురావడం చూసి మురిసిపోతున్నారు. కేపీహెచ్‌బీకాలనీ ఎదురుగా పీఎన్ఆర్ కాంప్లెక్స్‌తో పాటు కొంపల్లిలో ప్లాట్‌ఫాం–65 పేరిట ఏర్పాటుచేసిన ట్రైన్ రెస్టారెంట్‌ను నగరవాసుల మదిని దోచేస్తోంది. ఒక్కో రెస్టారెంట్లో ఆరు రైళ్లతో దేశంలోనే అతిపెద్ద ట్రైన్ రెస్టారెంట్‌గా రికార్డు సృష్టించింది కూడా. కిచెన్ నుంచి నేరుగా టేబుల్ మీదకు... ప్లాట్‌ఫాం–65 రెస్టారెంట్లో ఆర్టర్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే కిచెన్ నుంచి నేరుగా వినియోగదారుల టేబుల్ మీదకు వారికిష్టమైన వంటకాలతో రైలు వస్తుంది. ముందుగా బేరర్ వచ్చి తీసుకున్న ఆర్డర్‌ను ట్యాబ్ ఆధారంగా టేబుల్ నెంబర్‌తో సహా వంటకాల లిస్టును ఆన్లైన్లో కిచెన్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా వంటకాలు రైలులో టేబుల్ మీదకు వచ్చేస్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న బేరర్ వాటిని తీసుకుని భోజన ప్రియులకు వడ్డించడమే. తాము కోరిన ఆహారంతో తమ కళ్ల ముందుకు వచ్చే రైళ్లు, అలాగే తింటున్నంతసేపు పక్క నుంచి ఫుడ్‌ను తీసుకువెళ్ళే రైళ్ళను చూస్తూ భోజన ప్రియులు సరికొత్త లోకంలో విహరిస్తున్నారు. ఒక్కో ట్రై న్కు 5–8 కిలోల బరువు కలిగిన ఆహార పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. అత్యధికంగా 250 మీటర్ల దూరం ప్రయాణిస్తూ వంటకాలను తీసుకెళ్తుంది. కువైట్ రాజు సైతం ఫిదా.. కేవలం రెండు నెలల్లోనే ఈ రెస్టారెంట్ ద్వారా రైలు ప్రపంచాన్నే సష్టించారు. ముంబయ్‌కి చెందిన ఓ సాంకేతిక నిపుణుడు సహాయంతో రైల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే చెన్నైకి చెందిన అలగేష్ (మూడుసార్లు గిన్నిస్ రికార్డ్ ఆఫ్ గ్రహీత)చే రైల్వేస్టేషన్ల నమూనాలను తీర్చిదిద్దారు. నగరానికి చెందిన సర్వేష్, వినోద్‌లు దీనిని నెలకొల్పారు. ఇక్కడి ట్రై న్ రెస్టారెంట్ థీమ్‌ను తిలకించిన కువైట్ రాజు అదే సాంకేతిక నిపుణుడిచే ఏకంగా ఓ రోజు పెళ్ళి నిమిత్తం ఇలాంటి రైల్ భోజనాలను ఏర్పాటుచేయించుకున్నాడట. ప్రముఖ పారిశ్రామికవేత్త్త హర్షగోయెంకా సైతం ఇక్కడి ట్రైన్ రెస్టారెంట్‌కు బందీ అయిపోయి ట్విటర్లో పోస్ట్ చేశారు. డ్రెస్ కోడ్‌లోనూ వెరైటీయే... ఇక్కడ పనిచేసే వారి డ్రెస్ కోడ్‌ను చూస్తే వాటికీ రైల్ పరిమళాలనే అద్దారు. సర్వర్స్‌కు రైల్వే కూలీ ధరించే డ్రెస్, ఆర్డర్ తీసుకునే వారికి టీటీ యూనిఫాంనే ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఇక రెస్టారెంట్ పేరు విషయానికొస్తే జాతీయ రహదారి 65, చికెన్ 65కు అనుబంధంగా ఉండేలా ఫ్లాట్‌ఫామ్ 65గా పెట్టారు. అంతా రైల్ వాతావరణమే.. రెస్టారెంట్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి అణువణువూ రైల్‌తో అనుబంధాన్ని పెంచేలా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం వద్ద రైలింజన్, రైలు చిహ్నలను ఏర్పాటుచేశారు. రెస్టారెంట్ నలువైపులా గోడలపై కాచిగూడ, చెన్నై సెంట్రల్, ముంబయ్ సిటీ, పిన్‌ల్యాండ్ రైల్వేస్టేషన్లను మరిపించేలా అచ్చుగుద్దినట్లుగా ఆయా స్టేషన్ల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ప్రతి టేబుల్‌ను అనుసంధానం చేస్తూ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. ఆయా టేబుల్స్‌ను 32 సబ్స్టేషన్లుగా విభజించారు. వీటికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న రైల్వేస్టేషన్ల పేర్లతో బోర్డులు ఏర్పాటుచేశారు. వీటి ఆధారంగా ఫలానా స్టేషన్ వద్ద ఉన్నానంటూ ల్యాండ్‌మార్క్ చెప్పడం ద్వారా తమవారు ఆ స్టేషన్ వద్ద ఉన్న టేబుల్ వద్దకు నేరుగా రావచ్చన్నమాట. అలాగే కూర్చొనే సీట్లు కూడా అచ్చం ఏసీ టైర్ రైలులో ఉండే సీట్లను పోలినవిధంగా ఏర్పాటుచేశారు. రెస్టారెంట్ అంతా పరికించి చూసినవారు రైలు ప్రపంచాన్నే తిలకించేశామన్న భావనకు లోనవుతున్నారు. వినూత్న రెస్టారెంటే కాదు.. వినూత్న వంటకాలు సైతం... రెస్టారెంట్ వినూత్నంగా ఉండడమే కాదు..వంటకాలు సైతం వినూత్నంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. సౌత్, నార్త్ వంటకాలు ఇక్కడ అందిస్తున్నారు. అల్లంకోడి వేపుడు, అల్లంకోడి బిర్యానీ, వెల్లుల్లి కోడి, ఉలవచారు కోడికబాబ్, పచ్చిమిర్చి కోడి కబాబ్..ఇలా కొత్తదనపు వంటకాలను ఇక్కడ వడ్డిస్తుండడం గమనార్హం. నెలకోమారు ఫుట్ ఫెస్టివల్ పేరిట 200 రకాల వంటకాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. పిల్లల మెదడుకు మేత.. ఇక్కడి వంటకాలతో కడుపును నింపుకోవడమే కాదు..భోజన ప్రియుల మెదడుకు సైతం మేతను వేసేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అది కూడా రైల్వే రిలేటెడ్‌గా డిజైన్ చేశారు. సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు కూర్చొన్న సీటు దగ్గర ప్లేటు కింద ఆ రెస్టారెంట్ లోగోతో పేపర్ మ్యాట్ ఉండడం సహజం. కానీ ఇక్కడ అదే పేపర్ మ్యాట్‌లో పిల్లల మెదడుకు పదునుపెట్టే రీతిలో పలు రకాల హింట్‌ను ఇచ్చి రైల్వేస్టేషన్ల పేర్లను కనుక్కోవడం, అలాగే దారి కనుక్కోవడం వంటి వాటిని ప్రింట్ చేసి అందుబాటులో ఉంచడం గమనార్హం. త్వరలో దిల్సుఖ్నగర్, కొండాపూర్‌లలో సైతం.. ప్రస్తుతం కేపీహెచ్‌బీ ఎదురుగా గల పీఎన్ఆర్ కాంప్లెక్స్‌తో పాటు కొంపల్లిలో ట్రైన్ రెస్టారెంట్ సేవలు కొనసాగుతున్నాయి. త్వరలో దిల్సుఖ్నగర్, కొండాపూర్‌లలో సైతం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సిటీవాసులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎక్కడ కొత్తదనం కనిపిస్తుందా? లేక వినోదం, ఉల్లాసంగా ఉండే వాతావరణం ఎక్కడ ఉంటుందా? అని అన్వేషణ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి అభిరుచులకు తగ్గట్టుగా ప్లాట్‌ఫాం 65 ట్రైన్ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాం. ప్రతిదీ రైలుతో అనుబంధంగా ఉండేలా డిజైన్ చేశాం. దేశంలోనే అతిపెద్ద ట్రైన్ రెస్టారెంట్‌గా ఇది నిలుస్తుంది. కస్టమర్లు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్కు లోనవుతున్నారు. వంటకాల విషయంలో కూడా కొత్తవాటిని పరిచయం చేశాం. – సర్వేష్, రెస్టారెంట్ నిర్వాహకుడు -
మేలిమి బంగారం కొనాలనుకుంటున్నారా?
సాక్షి,హైదరాబాద్: డిజిటల్ బ్రోకరేజి సంస్థ అప్‌స్టాక్స్ (ఆర్‌కెఎస్‌వి సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా పిలుస్తారు)తాజాగా ఆన్లైన్ విధానంలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా అప్‌స్టాక్స్ కస్టమర్లు ఇప్పుడు 24 క్యారెట్ల డిజిటల్ బంగారాన్ని, 99.9శాతం స్వచ్ఛత గల మేలిమి బంగారాన్ని ప్రత్యక్ష మార్కెట్ రేట్లకే కొనుగోలు చేయొచ్చని సంస్థ సీఈవో రవి కుమార్ తెలిపారు. కావాలంటే భౌతిక రూపంలో నాణాలు, కడ్డీలుగా మార్చుకోవచ్చని లేదా వాల్ట్‌లో భద్రపర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్‌గా ఉంటాయని రవి కుమార్ తెలిపారు. అత్యంత స్వల్పంగా 0.1 గ్రాము పరిమాణంలో పసిడిని కూడా కూడా దేశవ్యాప్తంగా ఉచిత రవాణా బీమాతో అందించనున్నట్లు ఆయన వివరించారు. -
పన్ను చెల్లింపుదారుల గుర్తింపునకు పోర్టల్
న్యూఢిల్లీ: దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరులకు గౌరవం’’ పేరుతో ఏర్పాటైన ఓ ప్లాట్ఫార్మ్ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రత్యక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలను అమలు చేస్తామని బుధవారం వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రధాని ఆన్లైన్ పద్ధతిలో ప్లాట్ఫార్మ్ను ప్రారంభిస్తారని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొంటాయని ఆ ప్రకటన తెలిపింది. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గత ఏడది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని ఈ ప్రకటనలో వివరించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. -
కోటిన్నర మందికి పాఠాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, రోగ లక్షణాలు మొదలుకుని చికిత్స దాకా క్షేత్రస్థాయిలో అవగాహన అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, మూడో దశకు చేరుకుంటే తలెత్తే పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరిస్తే కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ‘ఈ ప్లాట్పారమ్’ను రూపొందించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్రం, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్‌క్రాస్ సంస్థలకు చెందిన కార్యకర్తలకు ‘ఆన్లైన్ లెర్నింగ్’ విధానంలో పాఠాలు బోధించాలని డీఓపీటీ నిర్ణయించింది. వీరికి ముందస్తు అవగాహన, శిక్షణ ద్వారా అత్యయిక స్థితిని ఎదుర్కోవచ్చని డీఓపీటీ భావిస్తోంది. డీఓపీటీకి చెందిన ‘ఐ గాట్’ వెబ్సైట్లో అంతర్భాగంగా పనిచేసే ‘ఈ ప్లాట్ఫారం’ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి శిక్షణ ఇస్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తించాలి అనే అంశంపై సలహాలు, సూచనలకు సంబంధించిన మాడ్యూల్స్ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో సుమారు లక్ష మందికి ఈ తరహా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
చంపడాలు పరిష్కారం కాదు
సాక్షి, హుజూరాబాద్: సమాజంలో మార్పు వచ్చినప్పుడే దిశ, నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కావని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చంపడాలు, ఉరి శిక్షలు వేయడం పరిష్కారం కాదని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శనివారం జరిగిన మానవ వికాస వేదిక 3వ రాష్ట్ర మహాసభల్లో ఈటల మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కోసం సంఘర్షణ జరగాలని, అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మనిషి మృగంగా మారుతుండటంతోనే దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వినకూడని, చూడకూడని దారుణాలను పత్రికలు, మీడియా ద్వారా వినాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఎప్పుడూ వైరుధ్యాలమయమని, మానవ మనుగడ ఉన్నంత కాలం వైరుధ్యాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో సెల్‌ఫోన్, ఆధునిక టెక్నాలజీ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసమే వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త దేవి, మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ఎస్ మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు జార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తాననుకున్నట్లుంటేనే దేవుడైనా..
నిజాన్ని తెలుసుకోవడం కోసం ఒకడు ఓ జ్ఞాని దగ్గరకు బయలుదేరాడు. అయితే అతనిని ఆ మార్గమధ్యంలో సైతాన్ అడ్డుపడి బయటకు పంపించెయ్యాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ సైతాన్ అనేక అడ్డంకులు కలిగించాడు. రకరకాల కుట్రలు పన్నాడు.మొదటగా ఓ అందమైన అమ్మాయిని అతని ఎదుట ప్రత్యక్షమయ్యేలా చేసాడు సైతాన్. ఆ అమ్మాయి అతనితో వగలు పోతూ తీయగా మాట్లాడింది. తన వెంట రమ్మంది. అయితే కాసేపటికి అతను ఈలోకంలో కొచ్చాడు. తాను దారి తప్పుతున్నట్లు గ్రహించాడు. దాంతో ఆ అమ్మాయిని విడిచిపెట్టి ముందుకు అడుగులేశాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓ రాజు తారసపడ్డాడు. అతనిని ఆపి తన ఆస్థానానికి రావలసిందిగా ఒత్తిడి చేశాడు. ఇది కూడా సైతాన్ పనే అనుకుని అతను రాజు వెంట వెళ్ళకుండా ముందుకు సాగాడు. ఇలా అన్ని అడ్డంకులు అధిగమించి అతను చిట్టచివరికి జ్ఞాని వద్దకు చేరాడు. ఇక లాభం లేదనుకుని చీకట్లో ఓ మూల దాక్కున్నాడు సైతాన్. జ్ఞాని ఓ వేదికపై కూర్చుని ఉండగా నేల మీద శిష్యులందరూ కూర్చున్నారు. తాను ఊహించుకున్న స్థితిలో అక్కడి వాతావరణం లేకపోవడం, జ్ఞాని అతనిని పట్టించుకోనట్టు వ్యవహరించడం, అక్కడున్న ఆయన శిష్యులు కూడా తనని లెక్కచేయకపోవడంతో అతను నిరాశ చెందాడు. దానికితోడు జ్ఞాని మాటలు ఏ మాత్రం గొప్పగా అనిపించలేదు. చాలా మామూలుగా ఉన్నాయి. ఈ జ్ఞాని వద్దకు తాను అనవసరంగా వచ్చానని అనుకున్నాడు. ఆయన వేషధారణ కూడా అతనికి నచ్చలేదు. మరి ఎలాగీయనను అందరూ జ్ఞానిగా భావిస్తున్నారు అని అతను తనలో ప్రశ్నించుకున్నాడు. ఇక్కడున్న శిష్యులే కాదు, ఇరుగుపొరుగు కూడా మూర్ఖులే అని అనుకున్నాడు. అతను అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత గురువు ఓ మూల తదేకంగా చూసారు.‘‘నువ్వు ఇంతగా శ్రమపడాల్సి ఉండక్కర్లేదు. అతను మొదటి నుంచీ నీ మనిషే’’ అని జ్ఞాని నవ్వుతూ సైతాన్‌తో.సత్యాన్వేషకులే కాదు, భగవంతుడి కోసం అన్వేషించేవారు కూడా ఆ దేవుడికున్న కీర్తిప్రతిష్టలు, తనలోని ఆశలు, తనలో చిత్రించుకున్న రూపాలు ఇలా అన్నింటినీ పట్టించుకుని తామనుకున్నట్లు ఉంటేనే దేవుడినైనాసరే ఆరాధించడానికి ముందుకొస్తారు. లేదంటే సాక్షాత్తు ఆ దేవుడే అతని ముందు ప్రత్యక్షమైనా సరే లెక్కచేయరని చెప్పడానికి ఈ కథ ఓ ఉదాహరణ. – యామిజాల జగదీశ్ -
‘డిజిటల్ ప్రచార వేదిక.. ‘అప్డేట్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం, సేవలు దేనికైనా సరే ప్రచారం పకడ్బందీగా లేకపోతే సక్సెస్ కాలేవు. రేడియోల నుంచి మొదలైన ప్రచార సరళి కరపత్రాలు, పేపర్లు, టెలివిజన్ నుంచి సోషల్ మీడియాలోకి విస్తరించింది. ఇంటర్నెట్, మొబైల్ పుణ్యమా అని డిజిటల్ ప్రచారం జోరందుకుంది. నిజం చెప్పాలంటే ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్ వేదికగా ప్రచార ఉత్పత్తులు, సేవలు సక్సెస్ అయ్యే స్థాయికి చేరాయి. ఇలాంటి వేదికనే సరికొత్త వ్యాపారంగా ఎంచుకుంది అప్డేట్స్. మరిన్ని వివరాలు ఫౌండర్ జె. చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.2016 జూలైలో విజయవాడ కేంద్రంగా అప్డేట్స్ను ప్రారంభించాం. టీవీ యాడ్స్‌తో మొదలుపెట్టి డిజిటల్ మీడియాలో ప్రచారానికి విస్తరించాం. సెలబ్రిటీలతో బ్రాండ్స్ ప్రారంభం నుంచి మొదలుపెడితే ప్రొడక్ట్స్ క్యాంపెయిన్, మార్కెటింగ్, క్రియేటివ్ విజువల్స్, యానిమేషన్స్, మోడలింగ్, యాడ్ ఫిల్మ్ తయారీ, రియాలిటీ షోలకు సంబంధించిన ప్రచార సేవలందిస్తాం. సంస్థలతో ఒప్పందాలు ప్రచార రంగంలో అన్ని విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులను నియమించుకుంది. కార్యనిర్వాహకులు, కంటెంట్ రైటర్స్, ఫొటోగ్రాఫర్స్, లిరిసిస్ట్స్ సింగర్స్, మ్యూజిక్ కంపోజర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్, సినీ, టీవీ కళాకారులు, మోడల్స్ తదితర సిబ్బందిని నియమించుకున్నాం. వీరితో పాటు ఆడియో, వీడియో ప్రింటింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ సేవలందించేందుకు ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. సోషల్ మీడియాలో ప్రచారం.. కమర్షియల్, కార్పొరేట్ క్లయింట్స్ ప్రచారం కూడా ఉంటుంది. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్, మెసెంజర్, యూట్యూబ్, యాప్స్ వంటి సోషల్ మీడియాలో యాడ్స్‌ను రూపొందించి ప్రచారం చేస్తాం. ఏడాది ప్యాకేజీ కోసం చార్జీలు కోటి నుంచి 2 కోట్ల మధ్యలో ఉంటాయి. గతేడాది 245 మంది కార్పొరేట్ క్లయింట్లకు డిజిటల్ మార్కెట్ చేశాం. వచ్చే ఏడాదికి దేశవ్యాప్త విస్తరణతో పాటు 1500 క్లయింట్లకు సేవలను చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఎన్నికలకు ప్రత్యేక సేవలు.. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వినూత్న రీతిలో ప్రచారం చేయడానికి సన్నాహాలు చేశాం. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రజా స్పందన పసికట్టడానికి సుశిక్షితులైన, మెరికల్లాంటి యువకులను నమూనా సర్వేల కోసం నియమించుకున్నాం. ఫీడ్‌బ్యాక్‌లను విశ్లేషించడానికి నిష్ణాతులైన వ్యూహకర్తల బృందం ఉంది. ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డిజిటల్ ప్రచార సేవలందిస్తున్నాం. చార్జీలు ఎన్నికల ముందు 25 రోజుల ప్యాకేజీకి రూ.5 లక్షలు – 20 లక్షలుంటుంది. డ్రోన్ ద్వారా ఓటర్ల నాడీ, స్థానిక పనుల తీరుతెన్నులు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో వీడియోలతో సహా చిత్రీకరించి అభ్యర్థికి అందిస్తాం. ప్రచారంలో స్టార్ క్యాంపెయిన్ కోసం సినీ, టీవీ కళాకారులను కూడా అందిస్తాం. రూ.75 కోట్ల టర్నోవర్ లక్ష్యం.. ప్రస్తుతం అప్డేట్స్లో 40 మంది శాశ్వత ఉద్యోగులు, ఫ్రిన్సాలర్స్ 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి రూ.75 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి కార్పొరేట్ క్లయింట్స్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చైతన్య తెలిపారు. -
ప్లాట్‌ఫాం ‘పైకే’ వచ్చెను
రాజోలు: ‘ఫలానా బస్సు ఫలానా ప్లాట్‌ఫాంపైకి వస్తుంది’ అన్న అనౌన్స్మెంట్లు ఆర్టీసీ బస్టాండ్లలో మామూలే. ‘ప్లాట్‌ఫాం పైకి’ అంటే ఆ ప్లాట్‌ఫాంకు సంబంధించి, ‘దిగువన బస్సులు నిలిచే చోటికి ’అనే అర్థం. అయితే రాజోలు బస్టాండ్‌లో ఆదివారం ఓ బస్సు ప్లాట్‌ఫాం పైకే వచ్చేసి, అందరినీ బెంబేలెత్తించింది. ఉదయం 6 గంటల సమయంలో రాజోలు నుంచి అమలాపురం వెళ్లే బస్సును డ్రైవర్ నాలుగో నంబరు ప్లాట్‌ఫాంకు తీసుకువచ్చాడు. బస్సు ఇంజన్ ఆపివేసి, తాళం ఆన్‌చేసి డ్యూటీ చార్టర్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో తాళం ఆన్‌చేసి ఉన్న బస్సు ఇంజన్ స్టార్టయి, ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసింది. గమనించిన కొందరు డ్రైవర్లు బస్సు ఎక్కి ఇంజన్‌ను ఆపి వేశారు. బస్సు పైకి దూసుకొచ్చిన సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరు. బస్సు ముందు భాగం ధ్వంసం కావడంతోపాటు, ప్రయాణికులు కూర్చునే బల్లలు విరిగిపోయాయి. 12 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన టెలివిజన్ పగిలిపోయింది. ఈ సంఘటనపై ఎంక్వయిరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. -
మెరుగైన క్యాన్సర్ చికిత్సకు నానో ప్లాట్ఫార్మ్
క్యాన్సర్‌కు ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్న చికిత్సలు మూడే. శస్త్రచికిత్స ద్వారా కణుతులను తీసేయడం, కీమో, రేడియో థెరపీలను వాడటం. అయితే ఈ మూడింటితోనూ క్యాన్సర్ కణాలు పూర్తిగా నశిస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో ఒరెనాగ్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానోస్థాయి మందులతో క్యాన్సర్ కణాలన్నింటినీ నాశనం చేసే వీలు కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. శస్త్రచికిత్స ద్వారా కణితిని ఎంతమేరకు కత్తిరించాలో సూచించడంతోపాటు మిగిలిన క్యాన్సర్ కణాలన్నింటినీ గమనించేలా చేయగలగడం ఈ ప్లాట్ఫార్మ్ ప్రత్యేకత. నానోస్థాయి కణాలకు ప్రత్యేకమైన రంగులాంటిదాన్ని జోడించి శరీరంలోకి పంపడంతో ఈ ప్లాట్ఫార్మ్ పని మొదలవుతుంది. నానో కణాలు వేడెక్కి నాశనం చేసేస్తాయి. సిలికాన్ నాఫ్తాలోసైమీన్ అనే పదార్థం ద్వారా తయారుచేసే నానో కణాలకు సహజసిద్ధంగా నశించిపోయే పదార్థ కణాలను కలుపుతారు. ఈ కణాలు ఒక్కసారి కణితిని చేరగానే నానోస్థాయి కణాలు వెలుతురును ప్రసారం చేయడం మొదలవుతుంది. అతినీల లోహిత కణాల సాయంతో ఈ వెలుతురును చూడటం ద్వారా కణితి ఉన్న ప్రాంతం ఎంతన్నది శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలుస్తుంది. ఫొటో థెరపీ ద్వారా మిగిలిన కణాలపైకి లేజర్ కాంతిని ప్రసరింపచేస్తే.. అవికాస్తా వేడెక్కి, నశించిపోతాయి. సాధారణ కణాలకు ఏమాత్రం హాని జరక్కుండా ఉండటం ఈ ప్లాట్ఫార్మ్కు ఉన్న మరో ప్రత్యేకత. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త ప్లాట్ఫార్మ్ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
పట్టాలపై రాళ్లు పెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం మహబూబాబాద్ : మానుకోట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌కు ఇరువైపులా ఉన్న డౌన్‌లైన్ పట్టాలపై ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి 10.30 మధ్యలో మతిస్థిమితం లేని వ్యక్తి కంకర రాళ్లు పెట్టాడు. గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ ఎస్సై కె.మధు కథనం ప్రకారం.. బలార్షా నుంచి విజయవాడ వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి మానుకోట రైల్వేస్టేషన్ నుంచి డౌన్‌లైన్‌లో బయల్దేరింది. ఆ రైలుకు మానుకోట రైల్వేస్టేషన్ ఏ క్యాబిన్ సమీపంలో పలు కంకరరాళ్లు తగలగా ప్లాట్‌ఫారమ్ దాటిన తర్వాత కూడా కంకర రాళ్లు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లో డ్రైవర్ రైలును ఆపాడు. రైలును తనిఖీ చేసుకొని వెంటనే మానుకోట రైల్వేస్టేషన్‌కు సమాచారమిచ్చాడు. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే రైలు తిరిగి బయల్దేరింది. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది వెళ్లి పరిశీలించగా ప్లాట్‌ఫామ్‌కు ఏ క్యాబిన్‌కు మధ్య పట్టాలపై కొన్ని కంకరరాళ్లు, రైల్వేస్టేషన్ ఆర్‌యూబీకి మధ్య సుమారు 10 కంకర రాళ్లను పట్టాలపై మతిస్థిమితం లేని వ్యక్తి పెట్టడాన్ని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించి, సోమవారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేకపోవడం, మూగవాడు కావడం వల్ల సరైన సమాధానం రావడం లేదని ఆర్పీఎఫ్ ఎస్సై తెలిపారు. తెలంగాణకు చెందినవాడా లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వాడా అనేది తెలియడం లేదన్నారు. కంకరరాళ్లు పట్టాలపై ఏర్పాటు చేయడం ప్రమాదకరమని ఏ మాత్రం ఎక్కువ రాళ్లు ఉన్నా రైలు చక్రాలు కిందికి దిగేవని, దీంతో ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా రైలుకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ రైల్వే ఇంటర్ లాక్ సిస్టం పనుల కారణంగా కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. దీని వెనుక మరో రైలు రాకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం జరగకుండా చూశారు. -
చదువు కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ వేదిక
ఖమ్మం : చదువు మధ్యలో ఆపేసినవారికి, గృహిణులకు, పదోన్నతుల కోసం ప్రయత్నించే వారికి ఓపెన్ స్కూల్ ఒక మంచి వేదిక అని డీఈఓ నాంపల్లి రాజేష్ అన్నారు. శనివారం తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌స్కూల్ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్ల సమన్వయ సమావేశం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్‌స్కూల్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో జరుగుతున్న పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లను బాగా చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. జిల్లాలో పదో తరగతి, ఇంటర్లో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరబోయే అభ్యర్థులు జిల్లాలోని ముదిగొండ, పాల్వంచ, మధిర అధ్యయన కేంద్రాల్లో కోఆర్డినేటర్లను సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐఓ దస్రూ, మధిర ఉప విద్యాశాఖాధికారి బి.రాములు, ఓపెన్ స్కూల్ స్టేట్ కోఆర్డినేటర్ హిమబిందు, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, జిల్లా కోఆర్డినేటర్ అవధానుల మురళీకృష్ణ, జిల్లాలోని ఓపెన్‌స్కూల్ అధ్యయన కేంద్రాల కోర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఈ-కామర్స్లోకిటాటా గ్రూప్
‘టాటాక్లిక్’ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు ముంబై: టాటా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘టాటాక్లిక్.కామ్’ అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీన్ని టాటా యూనిస్టోర్ నిర్వహించనున్నది. టాటాక్లిక్లో టాటా ఇండస్ట్రీస్ 90 శాతం వాటాను, గ్రూప్ రిటైల్ విభాగం ట్రెంట్ మిగిలిన 10 శాతం వాటాను కలిగింది. ఈ-కామర్స్ మార్కెట్లో తొలిసారిగా ‘ఫిజిటల్’ విధానాన్ని ఆవిష్కరిస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. ఈ విధానంలో ఆన్లైన్లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసి, దాన్ని సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న 530 స్టోర్లలో ఎక్కడైనా తీసుకోవచ్చని వివరించారు. దీని ద్వారా డెలివరీ సమయం ఆదా అవుతుందని, ప్రొడక్ట్ సరిగా లేకపోతే.. రిటర్న్ చేయడం సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. తొలిగా అందుబాటులో 400 బ్రాండ్లు టాటాక్లిక్ ఆన్లైన్ స్టోర్‌లో తొలిగా 400 బ్రాండ్లను అందుబాటులో ఉంచామని టాటాక్లిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశుతోష్ పాండే తెలిపారు. ఇందులోనే 25 ఎక్స్‌క్లూజివ్ ప్రీమియం విదేశీ బ్రాండ్లు (దుస్తులు, ఫుట్‌వేర్స్, ఎలక్ట్రానిక్స్) ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి వాచులు, సన్‌గ్లాసెస్, జువెలరీ ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భవిష్యత్తులో హోమ్ ఫర్నిచర్, బొమ్మలు వంటి విభాగాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. -
ప్లాట్‌ఫామ్ పైనే రైల్వే పోలీసులు
* వసతుల్లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది * పట్టించుకోని రైల్వే అధికారులు నగరంపాలెం (గుంటూరు) : గుంటూరు రైల్వేస్టేషనులో రైల్వే పోలీసులకు సరైన వసతులు లేక ప్లాట్‌ఫామ్‌ల పైనే విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై, రైళ్లలో నేరాల నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం రైల్వే పోలీసులను రైల్వేశాఖకు కేటాయిస్తుంది. వీరికి అవసరమైన పోలీస్ స్టేషన్‌ను రైల్వేశాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గుంటూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌కు సుమారు 30 సంవత్సరాల క్రితం నాలుగు-ఐదు ప్లాట్‌ఫ్లామ్‌ల మధ్యలో, గతంలో బుకింగ్ కౌంటరుగా వినియోగించిన రెండు గదులను కేటాయించారు. ఎస్ఐ స్థాయి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రస్తుతం డివిజన్ ముఖ్య పోలీస్‌స్టేషన్‌గా మారి సిబ్బంది పెరిగినా ప్రస్తుతం అదేప్రాంతంలో సిబ్బంది సర్దుకుంటున్నారు. ఇందులో గుంటూరు, తెనాలికి చెందిన సీఐ కార్యాలయాలు ఒక గదిలో, గుంటూరు స్టేషనుకు సంబంధించిన ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెచ్‌సీలు, 43మంది కానిస్టేబుళ్ల ఆఫీస్రూం, లాకప్‌లు ఒక గదిలో కొనసాగుతున్నాయి. కార్యాలయంలో కనీసం కుర్చోవడానికి కూడా చోటులేకపోవటంతో సిబ్బంది ప్లాట్‌ఫామ్ పైనే చిన్న పార్టిషన్ కట్టుకుని కూర్చుంటున్నారు. ఇక హెల్ప్‌డెస్క్ ప్లాట్‌ఫామ్ పైనే ఏర్పాటుచేశారు. రికార్డు రూం, ఆర్మ్డ్ గది అసలు లేదు. స్టేషన్లో 24 గంటలు విధులు నిర్వహించాల్సి రావడంతో కాసేపు సేదతీరే అవకాశమే లేదని సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌కు కేటాయించిన భవనం గుంటూరు రైల్వే స్టేషను ఏర్పడినప్పుడు నిర్మించినది కావడంతో పది సంత్సరాల క్రితమే పెంకులతో నిర్మించిన కప్పు శిథిలావస్థకు చేరి మట్టి రాలుతోందన్నారు. దీని కోసం సీలింగ్ చేసినా వర్షాకాలంలో పై కప్పు నుంచి నీరు కారి సీలింగ్ పూర్తిగా చెడిపోవడంతో తొలగించివేశారు. స్టేషన్లో రైల్వే శాఖకు చెందిన కార్యాలయాలపై ఉన్న శ్రద్ధలో కనీసం పది శాతం కూడా రైల్వేపోలీస్స్టేషన్పై చూపడం లేదని సిబ్బంది వాపోతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు స్టేషన్‌కు రంగులు వేయడం తప్ప పూర్తిస్థాయి మరమ్మతులు చేసిందిలేదన్నారు. ప్రస్తుత స్థలంలోనైనా రెండు అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందన్నారు. పోలీస్‌స్టేషను మరమ్మతుల కోసం రైల్వే పోలీసులు డివిజన్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు పంపినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తున్న రైల్వే పోలీసుల సమస్యల పరిష్కారం కోసం డివిజస్థాయిలోని రైల్వే ఉన్నతాధికారులు కృషిచేయాల్సిన అవసరం ఉంది. -
‘సిడ్బి స్టార్టప్ మిత్రా’
ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆన్లైన్ స్టార్టప్ ప్లాట్‌ఫామ్ ‘సిడ్బి స్టార్టప్ మిత్రా’ను గురువారం ఆవిష్కరించారు. ఆయన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) నేతృత్వంలో రాష్ట్రపతి భవన్లో జరిగిన ఇన్నోవేషన్స్ ఫెస్టివల్ కార్యక్రమంలో మాట్లాడారు. సామాజిక-ఆర్థికాభివృద్ధిలో ఆవిష్కరణలు కీలకపాత్ర పోషిస్తాయని, వీటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పలు రకాల కార్యక్రమాలను ప్రారంభించిందని, ఇది కూడా ఆ జాబితాలోకి వస్తుంద న్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్లో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసినట్లు సిడ్బి తెలిపింది. ఎంట్రప్రెన్యూర్లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంక్యుబేటర్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వంటి వివిధ భాగస్వాములతో అనుసంధానమై ఉండొచ్చని పేర్కొంది. -
నేటి నుంచి బెంగళూరులో ఇండియా ఉడ్ 2016
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఉడ్ వర్క్ ఎగ్జిబిషన్‌కు బెంగళూరు వేదికయ్యింది. ‘ఇండియా వుడ్ 2016’ పేరుతో ఫిబ్రవరి 25 నుంచి 29 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో చెక్కతో చేసే ఫర్నిచర్, ఇతర గృహోపకరణాల తయారీలో వచ్చిన అత్యాధునిక టెక్నాలజీలను ప్రదర్శించనున్నారు. దేశీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి వివిధ సంస్థలు రూపొందించిన ఫర్నిచర్, యంత్రాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో సుమారు 700కు పైగా కంపెనీలు పాల్గొంటు న్నాయి. అత్యధికం తెలుగురాష్ట్రాలవే కావడం గమనార్హం. -
కన్వెన్షన్ సెంటర్ గా ‘కళాభారతి’
♦ సాంస్కృతిక కార్యక్రమాలు ♦ సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఉండాలి ♦ అధికారులకు సీఎం ఆదేశం ♦ ముఖ్యమంత్రి, సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్లకు కొత్త నివాసాలు ♦ ఐఏఎస్ అధికారులకు అధునాతన క్వార్టర్ల నిర్మాణం ♦ డిజైన్ల ఖరారుకు సీఎస్ సారథ్యంలో ఆరుగురితో కమిటీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిన హైదరాబాద్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఎన్నో సమావేశాలు జరుగుతున్నాయని, అందుకు తగ్గట్లుగా హెచ్ఐసీసీ తరహాలో మరో పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో కళాభారతి కల్చరల్ సెంటర్‌ను నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఈ కళాభారతి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళాభారతిని కన్వెన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నారు. వరుసగా జరుగుతున్న బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న పలు కొత్త నిర్మాణాల అంశం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు అధికారిక నివాసాలు నిర్మించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా అధునాతన క్వార్టర్లు కట్టాలని అధికారులకు చెప్పారు. ఈ నిర్మాణాలకు స్థలం, డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ప్రకటించారు. సీఎస్‌తోపాటు ఆర్అండ్బీ కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఐఅండ్‌పీఆర్ కార్యదర్శి, ఆర్‌అండ్‌బీకి చెందిన ఇద్దరు ఈఎన్సీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సీఎం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి సంబంధించి గ తేడాది నుంచి ఆర్అండ్బీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న సీఎం నివాసం వెనుక ఉన్న పాత ఐఏఎస్ క్వార్టర్లను కూల్చివేసి, అదే స్థలంలో కొత్త నివాసం నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. -
సొంతింటికి వేదిక.. బాచుపల్లి!
♦ శాటిలైట్ టౌన్షిప్, ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి.. ♦ కూతవేటు దూరంలో కేజీ టు పీజీ విద్యా సంస్థలు ♦ నాలుగేళ్లలో 40 శాతం పెరిగిన స్థిరాస్తి ధరలు సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎవరైనా సరే సొంతిల్లు కొనేముందు ప్రధానంగా చూసేవి 4 అంశాలే. అవేంటంటే.. 1. పిల్లల పాఠశాలలకు దగ్గరుందా? 2. అనారోగ్య సమస్యలెదురైతే ఆసుపత్రులున్నాయా? 3. పనిచేసే కార్యాలయాలకు దగ్గరుందా? 4. కుటుంబంతో వెళ్లేందుకు షాపింగ్ కేంద్రాలున్నాయా అనే! .. అయితే సాధారణంగా ఈ వసతులున్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతాయి. కానీ, నేటికీ అందుబాటు ధరల్లో, లగ్జరీ వసతులనందిస్తూ.. సొంతింటి కలను తీరుస్తోంది బాచుపల్లి. పైన చెప్పినట్లు నాలుగంశాలే కాదు.. 6 కి.మీ. దూరంలో మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాలుండటం, 2 కి.మీ. దూరంలో ఓఆర్ఆర్ చేరుకునే వీలుండటం బాచుపల్లి ప్రాంతానికి కలిసొచ్చే అంశాలని చెప్పాలి. సాక్షి, హైదరాబాద్: సూరారం సబ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో బాచుపల్లితో పాటూ సూరారం, బోరంపేట, దుండిగల్, గాగిల్లాపూర్, మల్లంపేట్, నిజాంపేట్, పేట్ బషీరాబాగ్, కుత్బుల్లాపూర్, నందానగర్, నాగులూరు, శంబిపూర్, ప్రగతినగర్, గాజుల రామారం, జీడిమెట్ల ప్రాంతాలొస్తాయి. బాచుపల్లి ప్రాంతం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఎడ్యుకేషన్ హబ్. బాచుపల్లి చుట్టూ 5-10 కి.మీ. పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాల వారికి అనువైన విద్యా సంస్థలున్నాయి. ఓక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గీతాంజలి, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం, నారాయణ, గోకరాజు రంగరాజు, వీఎన్ఆర్, బీవీఆర్ఐటీ వంటి అన్ని రకాల విద్యా సంస్థలున్నాయిక్కడ. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీకి బాచుపల్లిలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు కూడా. ఔటర్ రింగ్ రోడ్డును ఆధారంగా చేసుకుని మరిన్ని విద్యా, వైద్యం, వినోద సంస్థలూ రానున్నాయి. వైద్యం, రవాణాలకూ దగ్గరే.. ప్రస్తుతం బాచుపల్లిలో మల్టీనేషనల్ ఆసుపత్రులు, భారీ షాపింగ్ మాళ్లు పెద్దగా లేవు. వీటి కోసం 6 కి.మీ. దూరంలో ఉన్న నిజాంపేట్, మియాపూర్‌లోని కార్పొరేట్, మల్టీనేషనల్ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే బాచుపల్లి నుంచి నిజాంపేట్‌కు వెళ్లే రోడ్లో 27 ఎకరాల్లో కత్రియా ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుమారు 1,000 పడకలు అందుబాటులో ఉంటాయని సమాచారం. రవాణా సౌకర్యాల విషయానికొస్తే.. దేశంలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ బాచుపల్లికి 3 కి.మీ. దూరంలోనే ఉంటుంది. మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఉంది. ఇందులో 200 డిస్ట్రిక్ట్, 30 సిటీ బస్ బేలుంటాయి. బాచుపల్లి నుంచి 10 కి.మీ. దూరంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంటుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ పూర్తయ్యాక.. దాన్ని బాచుపల్లి వరకూ విస్తరణ చేయాలనేది ప్రభుత్వ యోచన. ప్రస్తుతం బాచుపల్లిలో మంజీరా మంచినీరు సరఫరా అవుతోంది. గోదావరి జలాలు కుత్బుల్లాపూర్ వరకొచ్చాయి. 2-3 ఏళ్లలో బాచుపల్లి కూడా వస్తాయనేది అధికారుల మాట. 35-40 శాతం వృద్ధి: ‘‘ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండటం వల్ల బాచుపల్లిలో స్థిరాస్తి రంగానికి మంచి అవకాశముంది. బాచుపల్లి నుంచి 10 కి.మీ. దూరంలో హైటెక్ సిటీ, 13 కి.మీ. దూరంలో గచ్చిబౌలి ప్రాంతాలున్నాయి. ఎగువ మధ్యతరగతి వారికి లగ్జరీ అపార్ట్మెంట్లు, సంపన్న వర్గాల వారికి విల్లాలు.. ఇలా ఇద్దరికీ అనుకూలమైన ప్రాజెక్ట్లున్నాయిక్కడ. అందుకే నాలుగేళ్లలో ఇక్కడి స్థిరాస్తి ధరలు 35-40 శాతం మేర పెరిగాయని’’ ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు. ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయాలు చూస్తుంటే సమీప భవిష్యత్తులో కేపీహెచ్‌బీ లాగే బాచుపల్లి ప్రాంతం శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. బాచుపల్లిలో స్థిరాస్తి ధరల విషయానికొస్తే.. అపార్ట్మెంట్లో ధర చ.అ.కు రూ.2,800-3,500,స్థలమైతే గజానికి రూ.15-20 వేలు, విల్లా ధరలు రూ.60 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. -
తాకట్టు ప్లాట్‌ఫామ్‌పై రైల్వే స్టేషన్
సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రైవేటుకు అప్పగించే యోచనలో రైల్వే రైల్వే విస్తరణ, అభివృద్ధికి ‘ప్రైవేటు’ రుణాలు అప్పులిచ్చే సంస్థలకు రైల్వేస్టేషన్ల అప్పగింత వాణిజ్య సముదాయాలుగా మార్చాలని నిర్ణయం ఆసక్తి చూపుతున్న సంస్థలతో సంప్రదింపులు దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లకూ ఇదే రూపు సాక్షి, హైదరాబాద్: అదో భారీ వాణిజ్య సముదాయం.. నాలుగైదు అంతస్తుల్లో పెద్ద పెద్ద మాల్స్.. సినిమా థియేటర్లు.. దుకాణాలు.. హోటళ్లు.. పైభాగంలో కొన్ని ప్రైవేటు కార్యాలయాలు.. కానీ భవనం కింది అంతస్తులో మాత్రం హడావుడిగా వెళుతున్న ప్రయాణికులు, ఆ పక్కనే కూ.. అని కూత పెడుతూ వస్తూ పోతూ ఉన్న రైళ్లు.. ఇదీ భవిష్యత్తులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపు. మరి ఇంతలా అభివృద్ధి చేసేది రైల్వేశాఖ కాదు.. బడా ప్రైవేటు సంస్థలు. రైల్వే విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రైవేటు సంస్థల నుంచి రుణాలు తీసుకుని.. తనఖాగా వాటికి రైల్వేస్టేషన్లను అప్పగించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. పనిలోపనిగా కీలకమైన ప్రాంతాల్లో ఉండే రైల్వేస్టేషన్లను భారీ వాణిజ్య సముదాయాలుగా మార్చి ఆదాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... అభివృద్ధి కోసం అప్పు, ఆ అప్పు కింద తనఖాగా రైల్వేస్టేషన్లు. ఇది రైల్వే శాఖ కొత్తగా ఎత్తుకున్న నినాదం. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వేను అభివృద్ధి చేయడం తలకుమించిన పనిగా మారింది. ఒక్క మన రాష్ట్రంలోనే ఇప్పటికిప్పుడు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వేలను అభివృద్ధి చేయాలంటే కావాల్సిన నిధులు రూ. 50వేల కోట్లు. కానీ ఏటా బడ్జెట్లో రైల్వే శాఖ కేటాయిస్తున్న మొత్తం రెండుమూడు వేల కోట్లను మించడం లేదు. తదుపరి బడ్జెట్ వచ్చేసరికి నిధుల అవసరం మరింతగా పెరిగిపోతూనే ఉంది. దీంతో రైల్వే శాఖ చేతులెత్తేయడంతో కేంద్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా భారత రైల్వేలో పెట్టుబడులపై ఆయా దేశాల వ్యాపార దిగ్గజాలతో మాట్లాడుతున్నారు. ఈలోపే దేశీయంగా అప్పులు తెచ్చి అవసరాలు తీర్చుకునే దిశగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగా ఎల్ఐసీ నుంచి దాదాపు రూ.లక్షన్నర కోట్లు రుణం పొందేందుకు ఒప్పందం చేసుకుంది. మరిన్ని బడా ప్రైవేటు సంస్థలతో కూడా చర్చిస్తోంది. రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రధాన రైల్వేస్టేషన్లను తనఖాగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదే సమయంలో దేశంలోని ప్రధానమైన వంద రైల్వేస్టేషన్లను వాణిజ్య సముదాయాలుగా మార్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. అందులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఒకటి. ఏం చేస్తారు? ప్రస్తుతం మన దగ్గర రైల్వేస్టేషన్లు విశాలంగానే ఉన్నాయి. కానీ ఆ భవనాల పైభాగం నిరుపయోగంగా ఉంటోంది. అలా కాకుండా ఆ స్టేషన్ భవనాల స్థలంలో ఎక్కువ అంతస్తులతో భారీ భవన సముదాయాన్ని నిర్మించి, షాపింగ్ మాల్స్, దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని రైల్వేశాఖ లెక్కలు వేసుకుంది. కానీ అలా భారీ భవనాలను సొంతంగా నిర్మించగలిగేటన్ని నిధులు రైల్వే వద్ద లేవు. దీంతో ప్రైవేటు సంస్థలపై దృష్టి సారించింది. వాణిజ్య సముదాయాలుగా మారిస్తే వచ్చే ఆదాయం ఎంతుంటుందనే లెక్కలను బడా సంస్థల ముందు పెట్టబోతోంది. రైల్వే విస్తరణ, అభివృద్ధి పనులకు రుణమిచ్చే సంస్థలకు రైల్వేస్టేషన్లను కట్టబెట్టాలన్న యోచనలో ఉంది. దీనికి ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఆయా రైల్వేస్టేషన్ల ప్రాంగణాన్ని పొందిన సంస్థలు వాటి ప్రణాళిక ప్రకారం వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటాయి. రైల్వే ప్రయాణ ప్రాంగణాలు, రైళ్లు నిలిచే ప్రాంతాలతో వాటికి సంబంధం ఉండదు. అవసరమైతే ప్రయాణికుల ప్రాంగణాలకు ప్రైవేటు సంస్థలే ఆధునిక రూపు ఇస్తాయి. అయితే ఇది ఆయా సంస్థలు-రైల్వే మధ్య కుదిరే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. వచ్చే రైల్వే బడ్జెట్ తర్వాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. మోదీ మోడల్లో... అభివృద్ధి పనులకు ప్రభుత్వ ఆస్తులను వాడుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ప్రత్యేకత ఉంది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఈ తరహా ప్రణాళికలతో ఆయన విజయం సాధించారు. దేశంలోనే తొలిసారిగా వదోదర బస్టాండును అంతర్జాతీయ స్థాయిలో భారీ వాణిజ్య సముదాయంగా మార్చారు. ఆ బస్టాండు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి మాల్గా వెలుగొందుతోంది. ఇదే తరహాలో మరికొన్ని బస్టాండ్లు కూడా రూపు మార్చుకోబోతున్నాయి. ఆ ఫార్ములానే రైల్వేలకు కూడా వర్తింపచేయాలన్న ప్రధాని మోదీ ఆలోచనను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆచరణలో పెట్టబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రత్యేకతలు వయస్సు: 142 ఏళ్లు నిర్మాణం: నిజాం హయాంలో 1874లో దీన్ని నిర్మించారు. తెలంగాణ ప్రాంతంలో తొలి రైల్వేస్టేషన్ ఇదే. మహారాష్ట్రలోని వాడి నుంచి తొలి రైలు ఇక్కడికి వచ్చి మళ్లీ వాడికి ప్రయాణం చేసింది. వ్యవస్థ: ఇక్కడ మొత్తం పది ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. 11 లైన్లు ఏర్పాటయ్యాయి. ఎన్ని రైళ్లు: నిత్యం ఈ రైల్వేస్టేషన్ మీదుగా 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100 ప్యాసింజర్ రైళ్లు, 100 వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు కొనసాగుతుంటాయి. వీటికి సరుకు రవాణా రైళ్లు అదనం. ఆదాయం: నిత్యం ఈ స్టేషన్ ద్వారా రైల్వేకు రూ. కోటీ తొంభై లక్షల ఆదాయం సమకూరుతోంది. -
సోషల్ మీడియా వేదికగా గ్రేటర్ ప్రచారం
-
'క్షణాల్లో నిండు ప్రాణం కాపాడాడు'
ముంబయి: ఓ వ్యక్తి అప్రమత్తత మరో వ్యక్తిని ఎప్పుడూ కాపాడుతుందంటారు. మహారాష్ట్రలో సరిగ్గా అదే విషయం రుజువైంది. విధుల్లో ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉండటంతో ఓ ప్రయాణీకుడి ప్రాణాలుపోకుండా కాపాడాడు. ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోతున్న అతడిని ఎంతో సాహసంతో రక్షించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రకాంత్ రప్దే అనే వ్యక్తి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా కజ్రాత్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సరిగ్గా 2గంటల ప్రాంతంలో రైలు నెంబర్ 16339 సీఎఎస్టీ-నాగర కోయిల్ ఎక్స్ ప్రెస్ రైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1 వద్దకు వచ్చి ఆగింది. అందులో ప్రయాణీస్తున్న పాండా అనే వ్యక్తి స్టేషన్లో పండ్లు కొనుగోలు చేసేందుకు దిగాడు. అనంతరం వాటిని తీసుకొని వస్తుండగా రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. దీంతో అతడు కంగారులో రైలు ఎక్కే ప్రయత్నం చేసి అదుపుతప్పాడు. కాళ్లు జారి ప్లాట్‌పాంకు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. అప్పుడు అక్కడే అప్రమత్తంగా ఉన్న ఆర్పీఎఫ్ అధికారి చంద్రకాంత్ శరవేగంగా స్పందించి అతడి చేతులను అందుకుని అమాంతం బయటకు లాగడంతో స్వల్పగాయాలతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డయి ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
‘స్టేషన్’కు ముందే బ్రేకులు..
సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి ప్లాట్‌ఫామ్‌లు లేక బయటే ఆగిపోతున్న రైళ్లు పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: గంటకు ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో వందల కొద్దీ కిలోమీటర్లు పరుగులు తీసిన రైళ్లకు సైతం ఇక్కడ బ్రేకులు తప్పవు. ప్రయాణికులకు గంటల తరబడి పడిగాపులు తప్పవు. ఏళ్లకు ఏళ్లుగా విస్తరణకు నోచుకోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, అభివృద్ధి చెందని ప్రత్యామ్నాయ రైల్వేస్టేషన్ల ఏర్పాట్లు సగటు ప్రయాణికుల సదుపాయాలకు శాపంగా మారాయి. వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ అన్నారు. భారీ ప్రయాణికుల టర్మినళ్లన్నారు. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి స్టేషన్లను విస్తరిస్తామని గొప్పలు చెప్పారు. ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ఏటా బడ్జెట్‌కు ముందు, వెనుక కాగితాలపై అంకెల గారడీలు చేయడం తప్ప సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధిలో అడుగు ముందుకు పడింది లేదు. అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్రప్రభుత్వం ప్రయాణికుల సదుపాయాలపై శీతకన్ను వేశాయి. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా పురోగమించాలంటే రైల్వే సదుపాయాల అభివృద్ధి అత్యావశ్యం. ఆ దిశగా ప్రభుత్వం పురోగమించవలసి ఉంది. ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఆగాల్సిందే.. విశాఖ, తిరుపతి, ముంబై వంటి ఏ స్టేషన్ నుంచి వచ్చే రైళ్లయినా సరే నగర శివార్లలో బ్రేకులు పడుతాయి. విశాఖ నుంచి వాయువేగంతో దూసుకొచ్చే గరీబ్ ఎక్స్‌ప్రెస్ అయినా సరే చర్లపల్లి- ఘట్కేసర్ మధ్యలో ఆగిపోవాల్సిందే. ఉదయం నగర శివార్లకు చేరుకున్న రైళ్లు 45 నిమిషాల నుంచి గంటన్నర ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంటున్నాయి. ఇటు ముంబై నుంచి వచ్చే రైళ్లకు సైతం లింగంపల్లికి చేరుకోకుండానే బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లలో ఏదో ఒకటి ఖాళీ అయితే తప్ప మరో రైలు వచ్చేందుకు అవకాశం లేదు. ఉదయం 7.45కు చేరుకోవాల్సిన సింహపురి ఎక్స్‌ప్రెస్ తరచు 8.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఉదయం 6.35కే రావలసిన గౌతమి ఎక్స్‌ప్రెస్ 7 దాటితే త ప్ప సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం కాదు. దీంతో గంటల తరబడి రైళ్లలో గడిపి మరికొద్ది సేపట్లో స్టేషన్‌కు చేరుకుంటామనుకునే ప్రయాణికులు నగర శివార్లలో దిగలేక, సకాలంలో స్టేషన్‌కు చేరుకోలేక రైళ్లలోనే బాధలు పడుతున్నారు. 10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్‌లో ప్రతి రోజు 150 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు, ఎంఎంటీఎస్ రైళ్లతో ప్రతి క్షణం రద్దీ ఉంటుంది. సుమారు 1.6 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. స్టేషన్ అభివృద్ధి కోసం 2008లో వరల్డ్‌క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. అంచెలంచెలుగా.... సికింద్రాబాద్ స్టేషన్ ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం. నిజామ్స్ రైల్వే 1874 అక్టోబర్‌లో మొట్టమొదట ఒక్క ప్లాట్‌ఫామ్‌తో దీన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్-వాడి స్టేషన్ల మధ్య మొదట రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అసఫ్‌జాహీల నిర్మాణ శైలిలో కట్టించిన ఈ భవనం సికింద్రాబాద్ లోనే గొప్ప పర్యాటక కేంద్రం. 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ కట్టించే వరకు నిజామ్ రైళ్ల రాకపోకలకు సికింద్రాబాద్ స్టేషన్ ఒక్కటే కీలకంగా నిలిచింది. 1951లో ఇది ఇండియన్ రైల్వేస్‌లో భాగమైంది. మొదట స్టీమ్ ఇంజన్ నడిచే రోజుల్లో ఒకే ఒక్క ప్లాట్ ఫామ్ ఉండేది. ఆ తరువాత 2 ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశారు. దశలవారీగా 4 నుంచి 6 ప్లాట్‌ఫామ్‌లకు స్టేషన్ విస్తరించింది. 1993లో సికింద్రాబాద్ స్టేషన్ ను విద్యుదీకరించారు. 2000 సంవత్సరం నుంచి రైళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2003 నాటికి బోయిగూడ వైపు 10 వ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు రూ.1.6 కోట్ల ఆదాయం వస్తుంది. లక్షలాది మంది ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. స్టేషన్‌పైన పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌లెవల్ కన్స్ట్రక్షన్స్ కట్టించి ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని 2008లోనే ప్రతిపాదించారు. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. విస్తరణకు నోచని మౌలాలి, లింగంపల్లి స్టేషన్లు.. ప్రస్తుతం 2 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న మౌలాలి స్టేషన్లో 4 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసినంత స్థలం ఉంది. కాజీపేట్ జంక్షన్ మీదుగా వచ్చే రైళ్లన్నిటినీ ఇక్కడి నిలిపివేయవచ్చు. పైగా సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, చర్లపల్లి తార్నాక, సీతాఫల్మండి, ఉప్పల్, తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం లభిస్తుంది. అలాగే మల్కాజిగిరి స్టేషన్లో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మరో 3 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసిన స్థలం ఉంది. ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు, అదనపు ట్రాక్‌ల నిర్మాణం వల్ల నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లను ఇక్కడ నిలిపేందుకు అవకాశం ఉంటుంది. లింగంపల్లి స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసి ట్రాక్‌లు పెంచడం వల్ల ముంబయి మీదుగా వచ్చే రైళ్లను అక్కడ నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. పట్టించుకోవడం లేదు.. మల్కాజిగిరి స్టేషన్లో చాలా స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే ప్రధానమైన రైళ్లను ఇక్కడే నిలపొచ్చు. దీనిపై ఇప్పటికే అనేక సార్లు రైల్వేకు విజ్ఞప్తి చేశాము.అయినా పట్టించుకోవడం లేదు. - నూర్, అధ్యక్షుడు, సబర్బన్ ట్రైన్ అండ్ బస్సు కమ్యూటర్స్ అసోసియేషన్ సకాలంలో చేరుకోలేకపోతున్నాం.. చాలా వరకు రైళ్లు మౌలాలి పరిసరాల్లోకి రాగానే ఆగిపోతాయి. గరీబ్థ్ ్రకు అక్కడ హాల్టింగ్ లేదు. కానీ ప్రతి రోజూ ఇక్కడికి రాగానే ఆగిపోతుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. - కృష్ణమూర్తి, ప్రయాణికుడు -
ఆ బాధ నన్నెప్పటికీ వదలదేమో!
అవి నేను జూనియర్ కాలేజీలో చదివే రోజులు... నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే రెండో సంవత్సరం చదువుతోన్న ఓ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చెప్పేద్దామనుకునేంతలో నా స్నేహితురాలు సంధ్య నా దగ్గరకు వచ్చింది. నన్ను ఇష్టపడుతోన్న అబ్బాయికి సంధ్య చుట్టం. అందుకే తన దగ్గర నేను ఆ అబ్బాయి గురించి మాట్లాడేదాన్ని కాదు. కానీ ఆ రోజు తనే నా దగ్గర తన గురించి ప్రస్తావించింది. ‘తను నీకు ప్రపోజ్ చేసిన విషయం నాకు తెలుసు, కానీ ఒప్పుకోవద్దు, తనకు చిన్నప్పుడే పెళ్లయిపోయింది’ అని చెప్పింది. నేను షాకైపోయాను. అలా ఎలా జరిగిందని ప్రశ్నించాను. చిన్నప్పుడే కొన్ని పరిస్థితుల్లో ఆ అబ్బాయికి తన మరదలితో పెళ్లి జరిగిందట. పిల్లలు పెద్దయ్యేవరకూ కావాలని దూరంగా పెట్టారట పెద్దలు... అంటూ జరిగినదంతా చెప్పింది సంధ్య. నాకు మతి పోయింది... విషయం తెలిశాక కూడా అడుగు వేయడం తప్పు కాబట్టి నా మనసులో నుంచి వెంటనే ఆ ఆలోచన తీసేశాను. ఆ రోజు నుంచీ అతడి వైపు చూసేదాన్ని కాదు. అతడు మాట్లాడాలని ప్రయత్నించినా స్పందించేదాన్నీ కాదు. అది తెలిసీ తెలియని వయసు కావడం వల్ల తనని త్వరగానే మర్చిపోయాను. కానీ తను మాత్రం నన్ను మర్చిపోలేదు. దాదాపు నా డిగ్రీ పూర్తయ్యేవరకూ కూడా నా వెంట పడుతూనే ఉండేవాడు. నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉండేవాడు. కానీ ఏ ఒక్కరోజూ నేను తనకి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీ పూర్తవ్వగానే నాన్నగారు చూసిన వ్యక్తితో తాళి కట్టించుకుని, కాపురానికి వెళ్లిపోయాను. ఆ తర్వాత రెండు నెలలకు సంధ్య నుంచి ఫోన్ వచ్చింది. నా గొంతు వినగానే చాలాసేపు ఏడుస్తూనే ఉంది. తర్వాత చెప్పింది... ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని. నివ్వెరపోయాను. నేనేదో అనబోతుండగా ‘క్షమించు రాధా... ఇదంతా నావల్లే జరిగింది’ అంది సంధ్య. అలా ఎందుకందో తెలిశాక నేను మామూలుగా షాకవ్వలేదు. ఆ అబ్బాయికి చిన్నప్పుడు పెళ్లి కాలేదట. అదంతా అబద్ధమట. తనకు అతనంటే ఇష్టమట. అతనికి నేనంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరినీ కలవనివ్వకుండా చేసేందుకే అలా చేశానని చెప్పింది. మౌనంగా ఫోన్ పెట్టేశాను. అపరాధభావం దహించివేసింది. సంధ్య చెప్పిన ఒక్క మాటతో అతన్ని దూరంగా నెట్టేశాను. ఒక్కసారైనా అతడికి మాట్లాడే అవకాశం ఇచ్చివుంటే బాగుండేది. నా మౌనం అతడి మనసును కాల్చేసి ఉంటుంది. నా పెళ్లి అతడి మనసును ముక్కలు చేసుంటుంది. అందుకే ప్రాణాలు తీసుకున్నాడు. పాతికేళ్లు గడచిపోయినా ఈ విషయం నన్ను వేధిస్తూనే ఉంటుంది. అతను నాకు ప్రపోజ్ చేయడం, సంధ్య నాకు ఫోన్ చేయడం గుర్తుకొస్తూ, నన్ను అశాంతికి గురి చేస్తుంటాయి. - లక్ష్మీకళ్యాణి, నూజివీడు -
విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో!
కలసి ఉండటం అంటే... కలసి పంచుకోవడం. అది సంతోషమైనా... కష్టమైనా... పని అయినా. కానీ నా పుట్టింట్లో ప్రేమలు పంచుకోవడం చూళ్లేదు. నా మెట్టింట్లో పనులు పంచుకోవడం చూళ్లేదు. అందుకే కలసి వుండి మనసులు విడిపోవడం కంటే, విడిగా ఉండి మనసులు కలుపుకోవడం మంచిదేమో కదా! విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో! కలసి ఉంటే కలదు సుఖం అని చాలా తేలికగా చెప్పేస్తారంతా. కానీ కలసి ఉండటం అంత తేలిక కాదు. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట. మా నాన్న స్కూల్ టీచర్. ప్రేమాభిమానాల విలువ ఎరిగిన వ్యక్తి. తన తమ్ముళ్లను తనే పెంచారు. చదివించారు. జీవితంలో స్థిరపడేలా చేశారు. పెళ్లిళ్లు చేసి, వారి కుటుంబాలను కూడా తనతోనే పెట్టుకున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎంతో గొప్పవన్న భావన ఆయనది. అయితే నాన్న తమ్ముళ్లిద్దరూ నాన్న అంత ఉన్నత మనస్కులు కాదు. వాళ్ల పిల్లల్ని నాన్న మాతో సమానంగా చూసేవారు. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని వేరుగానే చూసేవారు. అది మాకు బాధ అనిపించినా నాన్నతో చెప్పేవాళ్లం కాదు. ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేయడాన్ని ఒప్పుకోరు. బంధాల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. అందుకే నన్ను కూడా ఉమ్మడి కుటుంబానికే కోడల్ని చేశారు. అది నాకు అంతగా ఇష్టం లేకపోయినా నాన్న మాట కాదనలేక సరే అన్నాను. కానీ నా భయమే నిజమయ్యింది. మా అత్తవారింట్లో మా మామగారి తమ్ముడి కుటుంబం కూడా కలిసే ఉంటుంది. మా అత్తగారు కాస్త మెతకే కానీ మా చిన్నత్తగారు మాత్రం అలా కాదు. కోడలంటే కుటుంబాన్ని చక్కబెట్టేది అన్న భావన బలంగా నాటుకుపోయిందామెకి. దాంతో పొద్దున్న వాకిలి ఊడవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ అన్ని పనులూ నేనే చేయాల్సి వచ్చేది.ఆమెకి మగపిల్లలు లేరు. కాబట్టి ఇంటికి కోడళ్లెవ్వరూ రాలేదు. మొదట అడుగు పెట్టింది నేనే. పని చేయడానికి బాధ లేదు. కానీ ఒంట్లో బాలేకపోయినా నేనే చేయాలి అనడం మాత్రం నచ్చేది కాదు. ఏమయినా నాకు ఒకటి అర్థమయింది... కలసి ఉండటం అంటే... కలసి పంచుకోవడం. అది సంతోషమైనా... కష్టమైనా... పని అయినా. కానీ నా పుట్టింట్లో ప్రేమలు పంచుకోవడం చూళ్లేదు. నా మెట్టింట్లో పనులు పంచుకోవడం చూళ్లేదు. అందుకే కలసి వుండి మనసులు విడిపోవడం కంటే, విడిగా ఉండి మనసులు కలుపుకోవడం మంచిదేమో కదా! - సుధ, నరసాపురం -
దర్జాగా.. దౌర్జన్యంగా.. ఏం మగాళ్లండీ వీళ్లు?!
పురుషోత్తములు రైళ్లలో, సిటీ బస్సుల్లో ‘స్త్రీలకు మాత్రమే’ అని ఉన్నచోట ఈ మగాళ్లెలా ధైర్యంగా కూర్చోగలరో ఎప్పటికీ అర్థం కాని విషయం. పైగా దబాయింపు చూపొకటి... ‘లేవం, ఏం చేసుకుంటావో చేస్కో ఫో’ అన్నట్లు! ఎందుకిలా ప్రవర్తిస్తారు వీళ్లు? ఆ... ఆడవాళ్లే కదా అన్న తేలిక భావమా? సంస్కారం లేకపోవడమా? కారణాలు ఏవైనా ఇలాంటి మగాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మహిళాప్రయాణికులతోపాటు, ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్సులూ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ మెట్రో రైళ్లు. వీటిల్లో మొదటి కంపార్ట్మెంట్ పూర్తిగా మహిళలది. మగాళ్లు కూర్చోకూడదు. అయినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ కంపార్ట్మెంట్లలో పట్టుబడిన ‘పురుషోత్తముల’ సంఖ్య 3,500. ఈ సంఖ్య గతేడాది ఇలా లేడీస్ కంపార్ట్మెంట్లలో దర్జాగా కూర్చొని దొరికిపోయినవారి సంఖ్య కన్నా తక్కువేనట. అంటే మగాళ్లలో మార్పు వచ్చిందనా? కాదు కాదు, ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (మెట్రో) నిఘా పెరిగింది. ఈ ఫోర్సు మెల్లగా వస్తుంది. మామూలు దుస్తులలో వస్తుంది. లేడీస్ సీట్లలో కూర్చొని ఉన్న మగాళ్లను మెరుపులా పట్టేస్తుంది. కొందరు ‘తెలియక ఎక్కాం’ అంటారు. కొందరు ‘పెహ్లీ బార్ థా, జానేదో ప్లీజ్’ అంటారు. కొందరు ‘ఐ వాజ్ జస్ట్ చార్జింగ్ మై మొబైల్’ అంటారు. కొందరు ‘సారీ’ చెప్పి స్టేషన్ రాగానే దిగి పోతారు. ఇలాంటివి మినహాయించినా కూడా ఇన్ని వేల మంది దొరకడమే విశేషం. పట్టుకున్న వారిని సెక్యూరిటీ ఫోర్స్ ఊరికే వదిలి పెట్టదు. ఫైన్ వేస్తుంది. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రాలు చేస్తుంటే పోలీసులకు అప్పజెబుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద, ఉమన్ కంపార్ట్మెంట్ లోపల స్త్రీలకు మాత్రమే అని గమనికలు ఉంటాయి. ‘స్త్రీల కంపార్ట్మెంట్లో స్త్రీలనే కూర్చోనివ్వండి’ అనే అనౌన్స్మెంట్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే, మగాళ్లు కనిపిస్తూనే ఉండడం సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘రోజుకి సుమారు 50 మంది మగాళ్లు లేడీస్ కోచ్‌లో మాకు పట్టుబడతారు. వాళ్లను మా సిబ్బంది... స్టేషన్ కంట్రోల్ రూమ్‌కి తరలిస్తారు. అక్కడే వాళ్లు ఫైన్ కూడా కట్టాలి. మహిళలను వేధించడానికే వాళ్లంతా ఆ కోచ్‌లో కూర్చున్నారు అనేందుకు లేదు. కానీ కొందరు అందుకోసమే ఎక్కుతారు. ఏ ఉద్దేశంతో ఎక్కినా, తమ తప్పు ఒప్పుకుని లేచిపోతే పర్వాలేదు కానీ, వాదనకు దిగితే మాత్రం వారికి ఫైన్ తప్పదు’’ అని సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ అరవింద్ రంజన్ అంటారు. ఒక్క ఢిల్లీ మెట్రోలోనే కాదు, మెట్రో వ్యవస్థ ఉన్న ప్రతి నగరంలోనూ, సిటీ బస్సులలోను మహిళా ప్రయాణికులకు మగవాళ్ల బెడద తప్పడం లేదు. అంతదాకా ఎందుకు... మన హైదరాబాద్ సిటీ బస్సులలోనే చూడండి. లేడీస్ సీట్లలో మగాళ్లొచ్చి కూర్చుంటారు. లేవమంటే కోపంగా చూస్తారు. లేదంటే మాట వినిపించుకోనట్లు కిటికీల్లోచి బయటికి చూస్తుంటారు. చాలాసార్లు కండక్టర్ కూడా వాళ్లను లేపలేని అసహాయ స్థితిలో పడిపోవడం కనిపిస్తుంది. టికెట్ చెకింగ్‌కి ఉన్న విధంగా... లేడీస్ సీట్లలో ధీమాగా, దర్జాగా, ధైర్యంగా, దౌర్జన్యంగా కూర్చున్న మగాళ్లను లేపడానికి సిటీ బస్సులలో కూడా సెక్యూరిటీ ఫోర్స్లాంటి మెరుపు దాడులుండాలి. అప్పుడుగానీ లేడీస్ సీట్లు లేడీస్‌కి దక్కవేమో! -
మావారికి మరొకసారి థ్యాంక్స్
వేదిక మా ఊరి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకే ఉంది. దాంతో నా చదువు అక్కడితో ఆగిపోయింది. ఇంట్లో పెద్దమ్మాయిని కావడంతో చదువు పూర్తయిన రెండేళ్లకే రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని అబ్బాయికిచ్చి పెళ్లిచేశారు. నా భర్త డిగ్రీ చదువుకున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాతోటి స్నేహితులంతా వేరే ఊరెళ్లి చదువుకుంటుంటే...నేనేమో ఇలా పెళ్లి చేసుకుని వంటింట్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని చాలా బాధ పడేదాన్ని. నా బాధని అర్థం చేసుకున్న నా భర్త నాతో ప్రయివేటుగా పదోతరగతి చదివించాడు. పరీక్ష రాసి పాసయ్యాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీకి కూడా అప్లయి చేయించాడు. మా అత్తయ్య ‘సంటి పిల్లల తల్లికి చదువేంది...!’ అంటూ నా భర్తని తిట్టేది. ఎవరేమన్నా ఆయన పట్టించుకునేవాడు కాదు. ‘‘ఇంటి పనికి, వంట పనికి...ఎంత సమయమైనా సరిపోదు...చేసేకొద్దీ పని ఉంటనే ఉంటది. త్వరగా పనులు ముగించుకుని పుస్తకాలు ముందరేసుకో...పిల్లలు స్కూలుకెళ్లేలోపు నీ చదువు పూర్తయిపోవాలి. తర్వాత నీ కిష్టమైతే ఉద్యోగం చేద్దువు...లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. నీ స్నేహితులను తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం నీకు లేదు’’ అని నా భర్త చెప్పిన మాటలు నాకు చాలా బలాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసేశాను. ఇప్పుడు నా భర్త ఫ్యానులకు సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ప్రారంభించాడు. అందులో అడ్మినిస్ట్రేషన్ పని బాధ్యతలు నాకు అప్పగిస్తానన్నారు. దానికోసం సిద్ధం అవుతున్నాను. నాతో ఇలాంటి పెద్ద పనేదో చేయించడం కోసమే అనుకుంటాను. గత ఏడాది స్పోకెష్ ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చి పట్టుబట్టి నాతో చదివించారు. చదువుకోవడం, ఉద్యోగం చేయడమంటే నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి, పిల్లలు తర్వాత వాటికోసం సమయం కేటాయించడమంటే ఏ అమ్మాయికైనా కష్టమే. చిత్రమేమిటంటే...నా స్నేహితులు చాలామంది డిగ్రీ పూర్తిచేసి పెళ్లి తర్వాత ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయారు. నేను మాత్రం పెళ్లి తర్వాత ఊహించని మలుపులు చూశాను. దీనంతటికీ కారణం నా భర్తే. ఒక్క చదువనే కాదు...పెళ్లి తర్వాత మహిళ ఎదుగుదలను ప్రోత్సహించాలన్నా...అడ్డుపడాలన్నా... రెండూ భర్త వల్లే సాధ్యమవుతాయి. నా భర్తలాంటివారు చాలా అరుదుగా ఉంటారనడంలో సందేహం లేదు. అందుకే ఈ వేదిక ద్వారా ఆయనకి మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నాను. - శ్రీలత, రంగారెడ్డి జిల్లా -
వేసవిలో వంటగది పరీక్ష!
జాగ్రత్తగా... మరో వారంలో పిల్లలకు పరీక్షలయిపోతాయి.పెద్దవాళ్లకు పరీక్షలు మొదలవుతాయి. పిల్లలకు రోజంతా ఖాళీ. ఓ గడుగ్గాయి గ్యాస్ బర్నర్ తిప్పేసి వెళ్లిపోతాడు. మరో పాపాయి మిక్సీ ఎలా పనిచేస్తుందో గమనించడానికి ఆన్ చేసి చూస్తుంది. వేసవికాలంలో వంటగది ప్రమాదాలు ఎక్కువ. అందుకే చిన్నపిల్లలున్న ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లలు ఆడుకుంటూ ఇంట్లో పరుగులెత్తేటప్పుడు వంటగదిలోకి రానివ్వకూడదు స్టవ్ మీద వంటపాత్రల హ్యాండిల్స్‌ని లోపలి వైపుకు ఉంచాలి, ప్లాట్‌ఫామ్ బయటకు వచ్చేలా పెట్టకూడదు వంట మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే స్టవ్ ఆపేసి వెళ్లాలి గదిలో నీళ్లు, నూనె, వంట పదార్థాలు ఒలికితే వెంటనే తుడవాలి . పిల్లలు ఇంట్లో ఉన్న సమయాల్లో వంట పూర్తవగానే రెగ్యులేటర్ కట్టేయాలి మిక్సీ, గ్రైండర్, ఒవెన్ల వాడకం పూర్తయిన వెంటనే ప్లగ్ నుంచి వేరు చేయాలి .పదేళ్లు నిండిన పిల్లలకు వంటగదిని అలవాటు చేయడానికి ఇదే సరైన సమయం. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులు దుస్తులు వేయకూడదు, ఏప్రాన్ వేయాలి హోల్డర్, చాకు, పీలర్లను సరిగ్గా పట్టుకోవడం, వాడిన వెంటనే ఒకచోట పెట్టడం అలవాటు చేయాలి. ఒవెన్, ఫ్రిజ్ వాడకం చూపించాలి. -
ట్రెయిన్ కదలడంతో అక్కడికక్కడే మృతి
-
చెప్పులు కుట్టుకునే వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అనంతరం రివాల్వర్‌తో కాల్చిచంపారు. భార్యాపిల్లలూ ఎవరూ లేని, ఫుట్‌పాత్‌పైనే నివసించే వృద్ధుడిని కాల్చిచంపడం పలు సందేహాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి ఇది నిదర్శనమనే విమర్శలూ వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... కర్ణాటకలోని బీదర్‌కు చెందిన పట్టనీకార్ అశోక్ (65) బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నివసిస్తున్నాడు. పదేళ్ల కింద అశోక్‌తో గొడవ పడిన భార్య మున్నీ తమ ముగ్గురు పిల్లలతో సహా నిజామాబాద్ వెళ్లిపోయింది. ఆ తరువాత అశోక్ అమీర్‌పేట చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై చిన్న దుకాణం పెట్టుకుని చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన అశోక్ సంపాదనంతా దానికే ఖర్చుచేసేవాడు. రాత్రిపూట ఫుట్‌పాత్ పైనే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అమీర్‌పేట లీలానగర్‌లోని శాంతి శిఖర అపార్ట్మెంట్స్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉన్న తన స్నేహితుడు లక్ష్మణ్‌కు చెందిన చెప్పుల దుకాణం ముందు నిద్రించాడు. అయితే.. తెల్లవారుజామున వాకింగ్‌చేస్తూ బయటకు వచ్చిన అపార్ట్మెంట్ వాసులు.. అశోక్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అశోక్‌ను ఎవరో దుండగులు తుపాకీతో కాల్చినట్లుగా గుర్తించారు. అనంతరం వచ్చిన క్లూస్‌టీమ్ నిపుణులు ‘పాయింట్ 32’ క్యాలిబర్ తూటా ఖాళీ కాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తూటా గాయాన్ని బట్టి అశోక్ కూర్చుని ఉన్న సందర్భంలో వెనుక వైపు నుంచి కాల్చినట్లు నిర్ధారించారు. కాగా.. ఈ హత్య కేసును కొలిక్కి తేవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రివాల్వర్ లెసైన్స్ ఉన్న వారెవరైనా పరీక్షించి చూసేందుకు ఈ పని చేశారా? లేదా అసాంఘిక శక్తులు ఉన్మాదంతో కాల్పులు జరిపాయా? వేరే వ్యక్తిగా పొరబడి అతడిని కాల్చారా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు అశోక్ స్వస్థలం బీదర్ కావడంతో.. అక్కడి నేపథ్యం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పోస్ట్‌మార్టంలో అశోక్ మృతదేహం నుంచి బుల్లెట్‌ను వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.