సాక్షి, హైదరాబాద్: మౌలాలి రైల్వేస్టేషన్‌లో మరిన్ని రైళ్ల నిలుపుదలకు అవకాశం లభించింది. పెద్ద ఎత్తున చేపట్టిన రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫామ్‌ల పొడిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రైళ్ల నిర్వహణకు అనుగుణంగా స్టేషన్ అందుబాటులోకి రానుంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం లూప్‌లైన్‌ల ఏర్పాటు చేశారు. అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికుల రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి.
సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రద్దీ నివారణకు అనుగుణంగా మౌలాలి స్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు సరుకు రవాణా లైన్‌లను లూప్‌లైన్లుగా మార్పు చేశారు. మరోవైపు రెండు రైల్వే లైన్ల పొడవును విస్తరించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్‌లో 18 బోగీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగనుంది. (క్లిక్: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం)
ఈ సదుపాయంతో మౌలాలి స్టేషన్‌లో మరిన్ని రైళ్లు నిలిపేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రయాణికుల రైళ్లను నిలిపేందుకు ఇప్పుడు ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లతో పాటు మరొకటి అదనంగా అందుబాటులోకి రానుంది. రైల్వేస్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా మెరుగుపడనుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. (క్లిక్: ఐఎస్‌బీ విద్యార్థులకు భలే బొనాంజా)
Comments
Please login to add a commentAdd a comment