expansion
-
తెలంగాణలో మాజిల్లానిక్ క్లౌడ్ విస్తరణ
హైదరాబాద్: అగ్రగామి టెక్నాలజీ ఆవిష్కర్త మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో (ఎన్ఎస్ఈ) లిస్టయిన నేపథ్యంలో తదుపరి దశ వృద్ధిని వేగవంతంగా సాధించడంపై దృష్టి పెడుతోంది. ఒకవైపు గణనీయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే మరోవైపు ఏఐ ఆధారిత పరివర్తనపై మరింతగా దృష్టి సారిస్తూ ఈ-సర్వైలెన్స్, స్కానలిటిక్స్ లాంటి వీడియో అనలిటిక్స్ సొల్యూషన్స్, డీప్-టెక్ సొల్యూషన్స్ మొదలైన వాటిల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది.అధునాతన డ్రోన్ టెక్నాలజీలో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ, మాజిల్లానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగే, వాణిజ్యావసరాలకు అందుబాటులో ఉన్న, అత్యంత శక్తిమంతమైన కార్గో డ్రోన్ అయిన కార్గోమ్యాక్స్ 200KHCని (CargoMax 200KHC) కూడా ఆవిష్కరించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ తదితర రంగాల కోసం కస్టమైజ్ చేసిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ లాంటి అధునాతన కృత్రిమ మేథ సాంకేతికతల ద్వారా లభించే అవకాశాలు ఈ మార్గదర్శ ప్రణాళికకు కీలకంగా ఉండనున్నాయి. ఇటు ఆర్గానిక్గాను అటు వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా ఇనార్గనిక్గాను వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మాజిల్లానిక్ క్లౌడ్ దృష్టి పెడుతోంది.“సెక్యూరిటీ భవిష్యత్తనేది ఏఐ, సర్వైలెన్స్ కలబోతపై ఆధారపడి ఉంది. తెలంగాణలోని మా కార్యాలయాలు, ముడి డేటాను ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ రంగ క్లయింట్లు తగు నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే మేథోసంపత్తిగా తీర్చిదిద్దే, అధునాతన వీడియో అనలిటిక్స్ సిస్టంలను అభివృద్ధి చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దోహదపడతాయి” అని మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.“తెలంగాణ పురోగామి విధానాలు, ప్రతిభావంతుల లభ్యత కారణంగా మా కార్యకలాపాల విస్తరణకు ఇది అనువైన ప్రాంతంగా ఉంది. మేము స్థానికంగా అభివృద్ధికి దోహదపడుతూనే అటు అంతర్జాతీయ క్లయింట్లకు కూడా సేవలు అందించేందుకు మాకు తోడ్పడుతోంది” అని జోసెఫ్ సుధీర్ తుమ్మ వివరించారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్సీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇంకో ఒకరిద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారిగా ఆశావహుల జాబితాను ఇంఛార్జి మున్షీ.. సిద్ధం చేసింది.ప్రసుత్తం తెలంగాణ కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరుగురికి కేబినెట్లో చోటు లభించాల్సి ఉంది. కేబినెట్ విస్తరణపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు.కాగా, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. -
కూల్చి'వెతలు' లేని హైవే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రోడ్డు విస్తరణ అంటేనే జనం గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్ల వెంట ఇళ్లు ఉన్నవారైతే తమ నివాసాలకు ఎక్కడ ఎ సరు వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు. కానీ, ఒక ఊళ్లో మాత్రం జాతీయ రహదారి విస్తరణ చేపట్టినా ఇళ్ల కూల్చివేసే అవసరం ఏర్పడలేదు. 40 ఏళ్ల క్రితం స్థానిక ప్రజాప్రతినిధులు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమే నేడు వారిని కాపాడింది. ఆ గ్రామమే కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్పేట. హైదరాబాద్ నుంచి మెదక్, ఎల్లారెడ్డి మీదుగా బాన్సువాడ, రుద్రూర్, బోధన్ వరకు రహదారిని ఎన్‌హెచ్–765 డీగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి గోపాల్పేట మీదుగా వెళ్తోంది. విస్తరణలో కొన్ని షెడ్లు, కోకాలు మాత్రమే తొలగించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లేవీ పోవడం లేదు. నాటి సర్పంచ్ ముందుచూపుతోనే..నాగిరెడ్డిపేట గ్రామ పంచాయతీలో నాగిరెడ్డిపేట, గోపాల్ పేట, బంజెర గ్రామాలు ఉండేవి. పంచాయతీ నాగిరెడ్డి పే టలో ఉండగా, మండల కార్యాలయాలన్నీ ప్రధాన రహ దారిపై ఉన్న గోపాల్‌పేటలో ఉంటాయి. అందుకే నాగి రెడ్డిపేట మండల కేంద్రంగా గోపాల్ పేటను వ్యవహరి స్తారు. ఈ మధ్యే గోపాల్పేట, బంజెర గ్రామాలు పంచా యతీలుగా ఏర్పడ్డాయి. 1981లో ఇక్కడ సర్పంచ్‌గా గెలు పొందిన వి.కిషన్‌రెడ్డి 1992 వరకూ పదవిలో కొనసాగా రు. ఆ సమయంలోనే ఈ రోడ్డు ఎప్పటికైనా కీలకంగా మా రుతుందని ఆలోచించిన కిషన్‌రెడ్డి.. గ్రామస్తులతో చర్చించి రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 ఫీట్లు వదలి తేనే అనుమతులు ఇచ్చే పద్ధతి మొదలుపెట్టారు. దీంతో గ్రామ స్తులు రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల అవతలే ఇళ్లు నిర్మించుకున్నారు. అంటే రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉందన్న మాట. ఇప్పుడు రెండు వరుసల జాతీయ రహదారి, ఇరు వైపులా డ్రైనేజీ, సర్వీసు రోడ్లు నిర్మిస్తున్నారు. అయి నా ఇళ్లు కూల్చే అవసరం ఏర్పడలేదు. అక్కడక్కడా చిన్న చిన్న అరుగులు, మెట్లు కొంత భాగం మాత్రమే పోతున్నాయి. వేగంగా రోడ్డు నిర్మాణ పనులుమెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 43 కిలోమీటర్ల రోడ్డుకు రూ.399.01 కోట్లు, దీనికి కొనసాగింపుగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు 51 కిలోమీటర్ల రోడ్డుకు రూ.499.88 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు మొ దలయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. -
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నగర నార్త్ సిటీ వాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మేడ్చల్, శామీర్‌పేట్‌లకు మెట్రో(Metro) పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల కారిడార్.. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్‌కు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డీపీఆర్ తయారీని మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం తెలిపారని మెట్రో ఎండీ మీడియాకు వెల్లడించారు. డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: TSRTC: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు -
‘మహా’ కేబినెట్ విస్తరణ పూర్తి..అలిగిన శివసేన ఎమ్మెల్యే
నాగ్‌పూర్:మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైన పది రోజులకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన 39 మంది నేతలు మంత్రులుగా ఆదివారం(డిసెంబర్15) ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు.సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,డిప్యూటీసీఎంలు ఏక్నాథ్ శిండే,అజిత్ పవార్ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాన్‌కులేతోపాటు రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, గణేశ్ నాయక్, మంగళ్‌ప్రభాత్ లోధా, జయ్‌కుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావే, అశోక్ ఉయికే, ఆశిశ్ శేలార్, శివేంద్రసిన్హ భోసలే, జయ్‌కుమార్ గోరె మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభూరాజ్ దేశాయ్, ఎన్సీపీ నుంచి ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, దత్తాత్రేయ, అధితీ తాత్కరే, మానిక్రావ్ కొకాటే, నరహరి జిర్వాల్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మరోవైపు తనకు కేబినెట్ బెర్తు దక్కలేదని శివసేన ఎమ్మెల్యే, పార్టీ విదర్భ కో ఆర్డినేటర్ నరేంద్ర మోడేకర్ అలిగారు. పార్టీ కో ఆర్టినేటర్ పదవికి రాజీనామా చేశారు. -
250 కొత్త డీలర్‌షిప్‌లు.. ప్యూర్ ఈవీ విస్తరణ ప్రణాళిక
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సుస్థిర రవాణా కోసం వినూత్న పరిష్కారాలను పరిచయం చేస్తూ దేశవ్యాప్తంగా ఉనికిని పెంచుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.లాంగ్-రేంజ్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశవ్యాప్తంగా తమ మొత్తం నెట్‌వర్క్‌ను 320కి పైగా పెంచుకోవాలని యోచిస్తోంది.నూతన ఆవిష్కరణలు, వాహనదారుల భద్రతకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ నిశాంత్ దొంగరి తెలిపారు. నానో పీసీఎం (ఫేజ్ చేంజ్ మెటీరియల్) టెక్నాలజీని బ్యాటరీ సిస్టమ్‌లలో ఉపయోగించిన మొదటి కంపెనీ తమదే అని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాల శాతం తగ్గడమే కాకుండా బ్యాటరీల సామర్థ్యం కూడా పెరిగిందంటున్నారు. -
హ్యుండై విస్తరణ ప్లాన్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది. -
భారత్‌లో రూ.46000 కోట్ల పెట్టుబడి: సింగపూర్ కంపెనీ
ముంబై: అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ మేనేజర్, సింగపూర్‌కు చెందిన ‘క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (సీఎల్ఐ).. భారత్‌లో తన నిర్వహణలోని ఫండ్ (ఎఫ్‌యూఎం) విలువను 2028 నాటికి రెట్టింపు చేసుకోన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎఫ్‌యూఎం 7.4 బిలియన్ సింగపూర్ డాలర్లు (రూ.46,000 కోట్లు)గా ఉంది. 30 ఏళ్ల క్రితం ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం. అప్పటి నుంచి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకుంది.హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో 40 ఐటీ, బిజినెస్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు, డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఐటీ పార్క్‌లు, లాజిస్టిక్స్ పార్క్‌ల వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు.. పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘భారత్ మాకు వ్యూహాత్మక మార్కెట్. మా మొత్తం వ్యాపారంలో కీలక వాటాను ఆక్రమిస్తోంది.అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో గడిచిన ఏడేళ్లలో మా పెట్టుబడులు మూడింతలయ్యాయి. 2024లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ సంస్థలు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లను భారత్‌లో నాణ్యమైన రియల్ అసెట్స్ ఆకర్షిస్తున్నాయి’’అని సీఎల్ఐ గ్రూప్ సీఈవో లీచీ కూన్ తెలిపారు. భారత మార్కెట్లో తమకు ఎంతో అనుభవం కలిగి ఉండడంతో ఈ అవకాశాలను సొంతం చేసుకోగలమని.. తమ నిర్వహణలోని నిధిని 2028 నాటికి 7.4 బిలియన్ డాలర్లకు పెంచుకుంటామని చెప్పారు. -
రేవంత్ రెడ్డి సంచలనం.. మరో 10 జిల్లాలకు హైడ్రా
-
‘మహా’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు హెచ్ఎండీఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో సుమారు 7,200 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ సేవలు విస్తరించి ఉన్నాయి.ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరిగితే ఇది 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళికా విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో శంకర్పల్లి, ఘటకేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి.వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా జోన్లు, ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది. వందల కొద్దీ ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. టీజీబీపాస్ (తెలంగాణ బిల్డింగ్ పరి్మషన్ అండ్ సెల్ఫ్ సరి్టఫికేషన్ సిస్టమ్) ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 4 జోన్లను 8కి పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. నలువైపులా అభివృద్ధి పడమటి హైదరాబాద్‌కు దీటుగా తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా. ఈ క్రమంలో హెచ్ఎండీఏ బాధ్యతలు మరింత పెరగనునున్నాయి. టౌన్íÙప్ల కోసం ప్రణాళికలను రూ పొందించడం, రోడ్డు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. అన్ని వైపులా టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగర అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏలో ప్రణాళికా విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ‘అధికారు లు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది. అప్పు డే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలం..’అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.జోన్ల విస్తరణ ఇలా..ప్రస్తుతం ఉన్న ఘట్కేసర్ జోన్లో మరో కొత్త జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పున విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన.. మొదట 6 వరకు ఆ తర్వాత 8కి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్లో టీజీ బీపాస్ ద్వారానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లే అవుట్లు, భవనాలకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు. ఈ నెలాఖరుతో డీపీఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు. హెచ్ఎండీఏలోని 7 జిల్లాల్లో ఉన్న 70 మండలాలు, సుమారు 1,032 గ్రామాల్లో టీజీబీపాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. -
విస్తరణ బాటలో పోల్‌మోర్ స్టీల్.. ఆనందంలో పోలాండ్ రాయబారి
హైదరాబాద్: పోల్‌మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ రైల్వే కంపెనీలకు కీలకమైన విడిభాగాలు తయారుచేసి ఇచ్చే సంస్థ. ఈ కంపెనీ తెలంగాణలో భారీగా విస్తరించి, దీని ద్వారా ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్దమవుతోంది. మెదక్ జిల్లాలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో ఉన్న ఈ సంస్థ వృద్ధి బాటలో కొనసాగుతోంది. భారతదేశంలో పోలాండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్‌జల్‌స్కి ఈ ప్లాంటును గురువారం సందర్శించారు. ఆయనతో పాటు పోలండ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెక్సాండర్ దండా, పోలాండ్ రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల కౌన్సెలర్ పావెల్ మోక్ర్జైకి, పొల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు కూడా ఉన్నారు. ఈ బృందం ఇప్పుడున్న ప్లాంటుతో పాటు నిర్మాణంలో ఉన్న రెండో ప్లాంటునూ సందర్శించింది. భారతదేశంలో ఒక పోలాండ్ కంపెనీ సాధిస్తున్న వృద్ధిని చూసి రాయబారి డొమ్‌జల్‌స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు పోల్‌మోర్ స్టీల్‌ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న మేకిన్ ఇండియా విధానానికి అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ తన విజయాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. తమ సంస్థ విస్తరణ వ్యూహాల గురించి పోల్‌మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ.. “భారతదేశంలో పలు యూరోపియన్ కంపెనీలు ఉన్నాయి. అదే బాటలో పోల్‌మోర్ స్టీల్ మరింతగా విస్తరించనుందని గర్వంగా చెబుతున్నాం. మరో మూడు ఎకరాల భూమి తీసుకుని 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి కూడా సంపాదించి, అదనంగా మరో వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. అంతే కాకుండా.. పోలాండ్లోని మాతృసంస్థలో కూడా 30 మంది పోల్‌మోర్ స్టీల్ ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లి పనిచేస్తున్నారు. దీనివల్ల మనవాళ్లు యూరప్ వెళ్లి అక్కడ నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు యూరోపియన్ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారుచేయడానికి వీలవుతోంది” అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీలతో పాటు, వివిధ వర్గాల నుంచి అందుతున్న అపార మద్దతు పట్ల సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్లాంటుకు వచ్చి తమను ప్రోత్సహించినందుకు రాయబారికి, కాన్సుల్ జనరల్‌కు, ఆర్థిక కౌన్సెలర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
విజయా డయాగ్నొస్టిక్స్ విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్యపరీక్షల సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్ ఏటా 8–10 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మొత్తం 140 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. తమ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ఫ్యూజిఫిల్్మకి చెందిన అధునాతన ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీవోవో శేషాద్రి వాసన్ ఈ విషయాలు తెలిపారు. క్లోజ్డ్గా ఉండే ఎంఆర్ఐతో పోలిస్తే ఓపెన్‌గా ఉండే అపెర్టో లూసెంట్ మెషీన్.. పేషంట్లలో ఆదుర్దాను తగ్గించగలిగేలా ఉంటుందని ఫ్యూజి ఫిల్మ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్ విభాగం) చందర్ శేఖర్ సిబాల్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లోనూ తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించారు. ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎండీ కోజీ వాడా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మెట్రో రెండోదశకు జైకా నిధులు!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం 35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములా? ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
జార్ఖండ్‌లో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 16న జరగనుంది. కొత్త కేబినెట్లో నాలుగైదు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుందని సమాచారం. కాంగ్రెస్ కోటా నుంచి వచ్చిన నలుగురు మంత్రుల్లో బాదల్ పాత్రలేఖ్, బన్నా గుప్తా, రామేశ్వర్ ఓరాన్ సహా మరో ముగ్గురు మంత్రులను మార్చనున్నారు. జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూషణ్ బడా, దీపికా పాండే, రామచంద్ర సింగ్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారని సమాచారం. మంత్రి పదవికి భూషణ్ బడా, దీపికా పాండే పేర్లు దాదాపు ఖాయమని, రామచంద్ర సింగ్ లేదా ప్రదీప్ యాదవ్ పేర్లపై చర్చ జరగుతోంది. బసంత్ సోరెన్ 2020లో జరిగిన దుమ్కా ఉపఎన్నికల్లో విజయం సాధించి, మొదటిసారి అసెంబ్లీకి చేరుకోగా, అతని పెద్ద కోడలు సీతా సోరెన్ జామా నుండి మూడవసారి ఎన్నికయ్యారు. జేఎంఎంలో హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్, కోడలు సీతా సోరెన్లలో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహిళా కమిషన్ లేదా మరేదైనా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా సోరెన్‌కు మంత్రి హోదా ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. -
విశాఖలో వోల్టాస్ 3వ స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఏసీ కంపెనీ, వోల్టాస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో మూడవ స్టోర్‌ను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలో సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్ సంఖ్య 11కు చేరింది. విశాఖ స్టోర్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రదీప్ బక్షి ప్రారంభించారు. వినియోగదారులకు వినూత్న ఉత్పత్తి శ్రేణిని అందించాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా బక్షి పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను సంస్థ అందిస్తోందని తెలిపారు. -
TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? విస్తరణ ఇప్పటికే ఆలస్యం అయిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి పదవులు ఇవ్వాలో కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేసిందా? ఇంతకీ ఎవరెవరికి రేవంత్ క్యాబినెట్లో బెర్త్‌లు కన్ఫాం అయ్యాయి? పదవుల కోసం పైరవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? అతి త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా, ఈ నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అదిష్టానం సీఎం రేవంత్‌రెడ్డితో మరోసారి చర్చించి నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత క్యాబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు క్యాబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్‌రావు బెర్త్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి వచ్చారు. అందువల్ల మాల కమ్యూనిటీకే చెందిన వివేక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల కాంగ్రెస్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెలమ వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నా.. ఆయనకు పోటీగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఈ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా..ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే సీఎంతో కలుపుకుని నలుగురు రెడ్డి వర్గం మంత్రులున్నారు. రెడ్డి వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నా..సుదర్శన్‌రెడ్డి.. మల్‌రెడ్డిలో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత క్యాబినెట్లో బీసీ సామాజికవర్గాల్లో మున్నూరు కాపు, గౌడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. అందువల్ల ఇతర బీసీ వర్గాల్లో ప్రాబల్యం ఉన్న మరో కులానికి చెందిన నేతకు విస్తరణలో మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురు బీసీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్‌లుగా పదవులు పొందారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్.. రజకవర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీల నుంచి సీతక్కకు ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విస్తరణలో ఎస్టీ లంబాడ నుంచి ఒకరికి అవకాశం దక్కబోతోంది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఒక మైనారిటీకి కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఒక్క మైనారిటీ నేత కూడా లేరు. దీంతో పలువురు మైనారిటీ నేతల పేర్లను కాంగ్రెస్ అదిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరినైనా ఆకర్షించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మాదిగ వర్గం నేతకు పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా తన క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించేలా క్యాబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఆలోచన ఎంత మేరకు అమలవుతుందో చూడాలి. ఇదీచదవండి.. పార్లమెంట్ సన్నాహాలతో బీఆర్ఎస్ శ్రేణుల చైతన్యం -
100 పెట్రోల్ బంకుల ఏర్పాటులో ఐపీఎం
గువాహటి: ఇంధన రిటైల్ స్టార్టప్ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ ప్రకాశ్ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔట్లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్ రిఫైనరీస్‌తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్ పశి్చమ బెంగాల్లో 25 ఔట్లెట్స్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు. -
హైదరాబాద్ చుట్టూ ‘మెట్రో’
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం నలువైపులా మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఐదు కారిడార్లలో మెట్రో విస్తరణకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎండీఏలు సమన్వయంతో హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో దశ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మెట్రో రైల్పై సమీక్షా సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు, అత్యధిక జనాభాకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణం కోసం దారుల్షిఫా నుంచి షాలిబండ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలపగా షాలిబండ వరకే కాకుండా ఫలక్‌నుమా వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ వర్గాలను సంప్రదించాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దీటుగా పాతబస్తీని అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రోడ్డు విస్తరణ, మెట్రోరైల్ ని ర్మాణం అవసరమన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెట్రోరైల్ పొడిగింపు కోసం 103 చోట్ల మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు, స్థానికులతో సంప్రదింపులు జరిపేందుకు తాను సైతం వస్తానని సీఎం పేర్కొన్నారు. పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో... పాతబస్తీ మీదుగానే ఎయిర్‌పోర్టు మెట్రో చేపట్టాలని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం సుమారు రూ. 6,250 కోట్లతో ప్రతిపాదించిన 31 కి.మీ. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గాన్ని నిలిపేయాలన్నారు. ఈ మార్గంలో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ మీదుగా అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రో మూడో దశ విస్తరణ చేపట్టాలన్నారు. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, ఎల్బీనగర్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని సూచించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్–నాగోల్ మధ్య 5కి.మీ. మేర మెట్రో చేపట్టాలని సీఎం చెప్పా రు. ఎయిర్‌పోర్టు మెట్రోపై తక్షణమే ట్రాఫిక్ స్టడీస్‌ను పూర్తి చేసి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని మెట్రోరైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. మెట్రోరైల్ నిర్మాణంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా లక్ష్మీగూడ–జల్పల్లి–మామిడిపల్లి రూట్ ను పరిశీలించాలన్నారు. ఈ మార్గంలో 40 అడుగుల సెంట్రల్ మీడియన్ ఉందని, మెట్రో నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రేవంత్ చెప్పారు. ఈ రూట్‌ను ఎంపిక చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ రూట్లో రవాణా ఆధారిత అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్, సీఎంఓ పర్సనల్ సెక్రటరీ శేషాద్రిని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్‌రెడ్డి, సీఎంఓ సెక్రటరీ షానవాజ్ ఖాసిం, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్.... నగర అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని, ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రోత్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీకి కూడా ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందువల్లే మెట్రో కనెక్టివిటీ అవసరమన్నారు. జేబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ చేపట్టాలని సూచించారు. రెండో దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదించిన 5 కారిడార్లపై వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరికి ముసాయిదా లేఖ పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 40 కి.మీ. మేర మూసీ రివర్‌ఫ్రంట్ ఈస్ట్–వెస్ట్ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సింగి వరకు నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా మూసీ మెట్రో చేపట్టాలన్నారు. సీఎం ప్రతిపాదించిన 5 కారిడార్లు ఇలా... ► మియాపూర్–చందానగర్–బీహెచ్ఈఎల్–పటాన్చెరు (14 కి.మీ.) ► ఎంజీబీఎస్–ఫలక్‌నుమా–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–పీ7 రోడ్డు–ఎయిర్‌పోర్టు (23 కి.మీ.) ► నాగోల్–ఎల్బీనగర్–ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–ఆరాంఘర్–న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కి.మీ.) ► కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షి యల్ డి్రస్టిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుంచి/అమెరికన్ కాన్సులేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బీ రోడ్డు (12 కి.మీ.) ► ఎల్బీనగర్–వనస్థలిపురం–హయత్‌నగర్ (8 కి.మీ.) -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (అన్ని వసతులతో, పని చేయడానికి సిద్ధంగా ఉండే పని ప్రదేశాలు) మార్కెట్ మంచి జోరు మీద ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ 60 శాతం వృద్ధితో రూ.14,000 కోట్లకు చేరుకుంటుందని అప్‌ఫ్లెక్స్ ఇండియా సంస్థ తెలిపింది. అప్‌ఫ్లెక్స్ కూడా ఈ రంగంలోనే సేవలు అందిస్తుంటుంది. ఆపరేటర్లు ఒక్కో డెస్‌్కకు వసూలు చేసే చార్జీ పెరగడం, పోర్ట్‌ఫోలియో విస్తరణ మార్కెట్ పరిమాణం పెరిగేందుకు కారణమవుతాయని అప్‌ఫ్లెక్స్ నివేదిక వివరించింది. ఈ నివేదికను వీవర్క్ ఇండియా సీఈవో కరన్ విర్వాణి వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వార్షిక అద్దె ఆదాయం 2022–23లో రూ.8,903 కోట్లుగా ఉంటే, అది 2023–24లో రూ.14,227 కోట్లకు పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఈ విభాగంలో సేవలు అందించే ఆపరేటర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం చివరికి 10.4 లక్షలుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 12.66 లక్షలకు పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 47 లక్షల చదరపు అడుగుల పరిమాణం నుంచి 57 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తుందని పేర్కొంది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో ఒక్కో డెస్క్ నెలవారీ సగటు అద్దె 9,200 నుంచి 10,400కు.. అలాగే, అక్యుపెన్సీ (డెస్క్‌లు భర్తీ) రేటు 75 శాతం నుంచి 90 శాతానికి మెరుగుపడినట్టు వెల్లడించింది. హైబ్రిడ్ పని విధానాలతో డిమాండ్ ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ గడిచిన కొన్ని సంవత్సరాల్లో గుణాత్మకమైన మార్పును చూసింది. ఇందులో ఫ్లెక్స్ స్పేస్ తన వంతు పాత్ర పోషించింది. హైబ్రిడ్ పని విధానాల అమలు నేపథ్యంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది’’అని విర్వాణీ తెలిపారు. ‘‘కరోనా ముందు 55 పట్టణాల పరిధిలో 1500కు పైగా ప్రదేశాల్లో 400కు పైగా ఆపరేటర్లు పని చేసే వారు. ఇప్పుడు 90 పట్టణాల పరిధిలోని 2,320 ప్రాంతాల్లో 965కు పైగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. దేశంలో ఫ్లెక్సిబుల్ వర్స్‌స్పేస్ దిశగా వస్తున్న మార్పు ఆశాజనకంగా ఉంది’’అని అప్‌ఫ్లెక్స్ ఇండియా సీఈవో ప్రత్యూష్ పాండే వివరించారు. పెద్ద కార్పొరేట్లు, సంస్థల నుంచి హైబ్రిడ్ పని విధానాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఇక మీదట ఈ మార్కెట్ ఇంకా విస్తరిస్తుందని చెప్పారు. ‘‘కార్పొరేట్లు సొంతంగా పెద్ద ప్రదేశాలపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులు ఆఫీస్ పరిష్కారాలను అందించే వారి సేవలను పొందడాన్ని సౌకర్యంగా భావిస్తున్నారు. దీనివల్ల పనిలో సౌకర్యంతోపాటు, వ్యయాలు ఆదా చేసుకునేందుకు వీలు కలుగుతోంది’’అని పాండే వివరించారు. 2023 జూన్ నాటికి దేశ వాణిజ్య ఆఫీస్ లీజింగ్‌లో కోవర్కింగ్ వాటా 19 శాతంగా ఉన్నట్టు అప్‌ఫ్లెక్స్ తెలిపింది. -
విస్తరణ దిశగా ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో 226 శాఖలను అదనంగా జోడించుకుంటామని ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఉన్న మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) రూ.1.55 లక్షల కోట్లను 2026 మార్చి నాటికి రూ.2.70 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి 514 శాఖలు ఉండగా, 2026 మార్చి నాటికి వీటిని 740కు తీసుకెళతామని ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 190 జిల్లాల పరిధిలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.84,887 కోట్లుగా ఉన్న డిపాజిట్లను రూ.1.45 లక్షల కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో రుణాలు రూ.70,209 కోట్లుగా ఉంటే, వీటిని రూ.1.25 లక్షల కోట్లకు విస్తరించాలనే ప్రణాళికలతో ఉంది. ఈ వివరాలను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. మార్చి నాటికి హోల్ సేల్, రిటైల్ రుణాల నిష్పత్తి 46:54గా ఉంటే, దీన్ని 35:65 రేషియోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. -
భారత్‌లో మరో 1.6 బిలియన్ డాలర్లు
ముంబై: ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీ సంస్థ, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తైవాన్‌లోని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలియజేసింది. భారత్‌లోని తమ అనుబంధ సంస్థ హోన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. చైనాకు మాత్రమే పరిమితం కాకుండా కార్యకలాపాలను ఇతర దేశాలకు కూడా మళ్లించే వ్యూహంలో భాగంగా (చైనా ప్లస్ వన్) కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం తరచుగా సమస్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాక్స్‌కాన్ ఇప్పటికే భారత్‌లో దాదాపు 8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. భారత మార్కెట్లో అవకాశాల రీత్యా ఇక్కడ తమ పెట్టుబడులను గతేడాదితో పోలిస్తే మరింతగా పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ యంగ్ లియు ఇటీవలే తెలిపారు. ఐఫోన్ల తయారీలో టాప్.. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు అత్యధికంగా ఐఫోన్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీ సంస్థల్లో ఫాక్స్కాన్ది అగ్రస్థానం. భారత్‌లోనూ పోటీ సంస్థలైన టాటా, పెగాట్రాన్‌కు మించి ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్‌కాన్ ఆదాయంలో దాదాపు సగభాగం ఐఫోన్ల తయారీ ద్వారానే ఉంటోంది. కంపెనీకి భారత్‌లో 40,000 మంది పైగా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 30 ఫ్యాక్టరీలు ఉండగా, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. 2022లో ఫాక్స్‌కాన్ ఆదాయం 216 బిలియన్ డాలర్లు కాగా అందులో భారత విభాగం వాటా 4.6%గా నమోదైంది. అంతక్రితం ఏడాది 2021లో ఇది 2%గా ఉండేది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఎల్రక్టానిక్ పరికరాల తయారీ కోసం మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. అటు కర్ణాటకలో రూ. 8,800 కోట్లతో ఐఫోన్ విడిభాగాల యూనిట్ నెలకొల్పే యోచన కూడా ఉంది. ఇందుకు తుమకూరులోని జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లో స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కొత్తగా ప్రతిపాదించిన 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో కొత్తగా 14,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా. ఇందులో ఫోన్ స్క్రీన్లు, వెలుపలి కవరింగ్‌లు తయారు చేసే అవకాశం ఉంది. సెమీకండక్టర్లపైనా దృష్టి.. భారత్‌లో తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ సైతం పోటీపడుతోంది. ఇందుకోసం ముందుగా వేదాంత సంస్థతో జట్టు కట్టినప్పటికీ, తర్వాత ఆ జాయింట్ వెంచర్ నుంచి పక్కకు తప్పుకుంది. భారతీయ భాగస్వామి అవసరం లేకుండా సొంతంగానే ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి తమ ఫ్యాబ్ యూనిట్ ప్లాన్‌కి ఆమోదం పొందేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. -
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రతిఒక్కరికీ కన్ఫర్మ్డ్ టికెట్!
రద్దీ రైళ్లతో విసిగిపోయిన ప్రయాణికులకు శుభవార్త ఇది. 2027 నాటికల్లా ప్రతి రైలు ప్రయాణికుడికి కన్ఫర్మ్డ్ టికెట్ లభించనుంది. ఈ మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతూ విస్తృత విస్తరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ వార్తా సంస్థ ఎన్డీటీవీ పేర్కొంది. దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల ప్రయాణికులతో రద్దీగా మారిన ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల చిత్రాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఛత్ పండుగ కోసం బిహార్ వెళ్లే రైలు ఎక్కే ప్రయత్నంలో 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ విస్తరణ ప్రణాళికలు చేపట్టనుండటం కోట్లాది మంది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం. కొత్త రైళ్లు, ట్రాక్‌ల నిర్మాణం ఈ విస్తరణ ప్రణాళిక కింద ఏటా 4,000-5,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం రోజుకు 10,748 రైళ్లు నడుస్తుండగా ఈ సంఖ్యను 13,000కు పెంచాలన్న ఈ ప్రణాళిక లక్ష్యంగా తెలుస్తోంది. రాబోయే మూడు నాలుగేళ్లలో 3,000 కొత్త రైళ్లను ట్రాక్‌లపైకి తీసుకురావాలనేది ప్రణాళిక అని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే ఏటా 800 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా ఈ సామర్థ్యాన్ని 1,000 కోట్లకు పెంచాలనేది కూడా విస్తరణ ప్రణాళికలో భాగం. ప్రయాణ సమయం తగ్గింపుపై దృష్టి ఇక రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడంపైనా రైల్వే శాఖ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని ట్రాక్‌ల నిర్మాణం, వేగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనుంది. రైల్వే శాఖ అధ్యయనం ప్రకారం, ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణంలో త్వరణం, వేగాన్ని పెంచితే రెండు గంటల ఇరవై నిమిషాలు ఆదా అవుతాయి. పుష్ అండ్ పుల్ టెక్నిక్ త్వరణం, వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఏటా దాదాపు 225 రైళ్లు తయారవుతుండగా వీటిలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లలో యాక్సిలరేషన్, డీసిలరేషన్ సామర్థ్యం సాధారణ రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. -
అ్రల్టాటెక్ తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ విస్తరణపై మరో సారి దృష్టి పెట్టింది. మూడో దశలో భాగంగా ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా 2.19 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని జత చేసుకోనుంది. వెరసి కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 18.2 కోట్ల టన్నులకు చేరనుంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. వారాంతాన సమావేశమైన బోర్డు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. పాత ప్లాంట్ల విస్తరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటు సమ్మిళితంగా తాజా సామర్థ్య విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుతం కంపెనీ సిమెంట్ తయారీ వార్షిక సామర్థ్యం దాదాపు 13.25 కోట్ల టన్నులుగా ఉంది. సామర్థ్య వినియోగం 75 శాతంగా నమోదవుతోంది. మూడో దశ విస్తరణ పూర్తయితే దక్షిణాదిలో 3.55కోట్ల టన్నులు, తూర్పు ప్రాంతంలో 4.04 కోట్ల టన్నులు, ఉత్తరాదిన 3.62 కోట్ల టన్నులు, పశి్చమాన 3.38 కోట్ల టన్నులు, మధ్య భారతంలో 3.57 కోట్ల టన్ను లు చొప్పున సిమెంట్ తయారీ సామర్థ్యాలను అందుకోనున్నట్లు అల్ట్రాటెక్ వివరించింది. -
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వాహనాల మోడల్స్‌ను, ఉత్పత్తిని పెంచుకోనున్న నేపథ్యంలో 2030–31 నాటికి మూలధన వ్యయం రూ. 1.25 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం 17 మోడల్స్‌ను తయారు చేస్తుండగా వీటిని 28కి విస్తరించాలని భావిస్తోంది. అలాగే 2030–31 నాటికి మొత్తం ఉత్పత్తి సామరŠాధ్యన్ని ఏటా 40 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. ‘గురుగ్రామ్, మానెసర్, గుజరాత్‌లోని ప్రస్తుత ప్లాంట్లలో పెట్టుబడి ప్రణాళికలు యథాప్రకారం కొనసాగుతాయి. 2022–23లో మూలధన వ్యయం రూ. 7,500 కోట్లుగా ఉంది. 2030–31 నాటికి ఈ మొత్తం రూ. 1.25 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చు‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎంఎస్ఐ తెలియజేసింది. ప్రస్తుత ఖర్చులు, ధరల స్వల్ప పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించేందుకు రూ. 45,000 కోట్లు అవసరమవుతాయని కంపెనీ పేర్కొంది. అలాగే, పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలను కూడా పటిష్టపర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. వివిధ ఇంధనాలపై పని చేసే 10–11 కొత్త మోడల్స్‌ను రూపొందించేందుకు మూలధన వ్యయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఉత్పత్తికి కూడా భారీగా నిధులు కావాలని ఎంఎస్ఐ తెలిపింది. అందుకే సుజుకీకి షేర్ల జారీ.. సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ)లో సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)కి ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించే బదులు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడాన్ని ఎంఎస్ఐ సమరి్ధంచుకుంది. ఎస్ఎంసీ వాటాల కోసం రూ. 12,500 కోట్లు చెల్లించడం వల్ల లాభాలు, డివిడెండ్ల చెల్లింపులు మొదలైనవి తగ్గడంతో పాటు నగదు కొరత కూడా ఏర్పడేదని పేర్కొంది. అలా కాకుండా షేర్లను జారీ చేయడం వల్ల చేతిలో మిగిలే నిధులను సేల్స్, సరీ్వస్, స్పేర్ పార్టులపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు వెచి్చంచడం ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు వీలవుతుందని ఎంఎస్ఐ వివరించింది. సోమవారం బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు స్వల్పంగా అర శాతం మేర క్షీణించి రూ. 10,238 వద్ద ముగిసింది. -
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
చిన్న నగరాల్లోకి టెక్ విస్తరణ - కొత్త హబ్‌లుగా 26 సిటీలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా హైదరాబాద్, బెంగళూరు వంటి ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన దేశీ టెక్నాలజీ రంగంలో క్రమంగా వికేంద్రీకరణ జరుగుతోంది. చిన్న నగరాలకూ పరిశ్రమ విస్తరిస్తోంది. చండీగఢ్, నాగ్‌పూర్, కాన్పూర్ వంటి 26 సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11–15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండటం కూడా ఇందుకు కారణం. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కలిసి ’భారత్‌లో వర్ధమాన టెక్నాలజీ హబ్‌లు’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ పరిశ్రమలో 54 లక్షల మంది పైచిలుకు సిబ్బంది ఉండగా .. వీరిలో అత్యధిక శాతం ఉద్యోగులు ఏడు ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, పుణె) ఉంటున్నారు. ‘టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ .. కరోనా మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా చెప్పుకోతగ్గ స్థాయిలో పని వికేంద్రీకరణ జరిగింది‘ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సల్వాన్ తెలిపారు. ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకునే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరింత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెక్నాలజీ హబ్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం పెరుగుతోందని నాస్కామ్ హెడ్ (జీసీసీ, బీపీఎం విభాగం) సుకన్య రాయ్ వివరించారు. వ్యయాల తగ్గుదల.. రాబోయే రోజుల్లో చండీగఢ్, కాన్పూర్, అహ్మదాబాద్, మంగళూరు, నాగ్‌పూర్ వంటి సిటీలు కొత్త తరం టెక్నాలజీ హబ్‌లుగా ఎదగగలవని నివేదిక తెలిపింది. కార్యకలాపాల నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటం, అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) తక్కువగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాలు, విధానాలపరంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలు ఇందుకు సానుకూలంగా ఉండనున్నాయి. ఈ తరహా పలు వర్ధమాన హబ్‌లలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, డబ్ల్యూఎన్ఎస్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి వర్ధమాన నగరాల్లో 7,000 పైచిలుకు అంకుర సంస్థలు డీప్‌టెక్ మొదలుకుని బీపీఎం వరకు వివిధ టెక్ సేవలు అందిస్తున్నాయి. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఈ వర్ధమాన కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నాయి. ఇన్వెస్టర్లు కూ డా ప్రస్తుతం పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోని అంకుర సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది అంకుర సంస్థల్లోకి వచ్చిన నిధుల్లో 13 శాతం వాటా ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టార్టప్‌లకు దక్కడం ఇందుకు నిదర్శనం. -
సెంచురీ మ్యాట్రెసెస్ అంబాసిడర్‌గా పీవీ సింధు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే మూడేళ్లలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ (ఈబీవో) సంఖ్యను 1,000కి చేర్చుకోనున్నట్లు సెంచురీ మ్యాట్రెసెస్ ఈడీ ఉత్తమ్ మలానీ తెలిపారు. ప్రస్తుతం 500 ఉండగా మరో 500 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణలో 100 ఈబీవోలు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 200కు పెంచుకుంటున్నామన్నారు. మరోవైపు, దేశీయంగా మ్యాట్రెస్‌ల మార్కెట్ రూ. 10,000 కోట్లుగా ఉండగా సంఘటిత రంగ వాటా 40శాతం అని, ఇందులో తమకు 10% వాటా ఉందని, దీన్ని మూడేళ్లలో 20 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలానీ ఈ విషయాలు చెప్పారు. ఆదాయాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన స్లీప్ సొల్యూషన్స్ అందిస్తూ సెంచురీ అందరీ నమ్మకాన్ని చూరగొందని సింధు తెలిపారు. -
రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షికోత్పత్తిని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) పాల్గొన్న సందర్భంగా చైర్మన్ ఆర్సీ భార్గవ మంగళవారం ఈ మేరకు ’మారుతీ 3.0’ వెర్షన్ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. తమ సంస్థ 40 ఏళ్లలో వార్షికంగా ఇరవై లక్షల యూనిట్ల తయారీ, అమ్మకాలను సాధించిందని ఆయన చెప్పారు. కంపెనీ ప్రస్థానంలోని మూడో దశలో టర్నోవరును రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్లు, సీఎన్జీ మొదలైన టెక్నాలజీలన్నింటినీ పరిశీలించనున్నట్లు భార్గవ చెప్పారు. 2030–31 నాటికి మరో 20 లక్షల వార్షికోత్పత్తి, 28 మోడల్స్‌ను జోడించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ‘తొలి దశలో మాది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. కోవిడ్ మహమ్మారితో మా రెండో దశ ముగిసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. రాబోయే రోజులు చాలా సవాళ్లతో, చాలా అనిశ్చితితో కూడుకున్నవిగా ఉంటాయి.కొత్తగా ఇరవై లక్షల కార్ల సామర్థ్యాన్ని సాధించేందుకు దాదాపు రూ. 45,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది‘ అని భార్గవ చెప్పారు. మార్కెట్ వాటా మళ్లీ పెంచుకుంటాం.. చిన్న కార్లకు డిమాండ్ మందగించడంతో తగ్గిన తమ మార్కెట్ వాటాను .. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్యూవీ సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా మళ్లీ పెంచుకుంటామని భార్గవ ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. దేశీయంగా విద్యుత్ వాహనాల పరిస్థితుల గురించి కంపెనీ యాజమాన్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. 2024–25 నుంచి 2030–31 మధ్య కాలంలో ఆరు మోడల్స్‌ను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని భార్గవ తెలిపారు. ఇక రూ. 10,000కు చేరువకు షేరు ధర చేరిన నేపథ్యంలో స్టాక్‌ను విభజించే అంశాన్ని బోర్డు ముందు ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ స్కీము పొడిగింపు ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన రూ. 25,938 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. వాస్తవంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఉద్దేశించిన ఈ స్కీము.. తాజా నిర్ణయంతో 2027–28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలను మూడు నెలలకోసారి విడుదల చేయడం, విలువ జోడింపును పరీక్షించే ఏజెన్సీల సంఖ్యను ప్రస్తుతమున్న రెండు నుంచి నాలుగుకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ వర్గాలు కోరాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నుంచి దేశీయంగా తయారైన నిర్దిష్ట అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల అమ్మకాలకు ఈ స్కీము వర్తిస్తుంది. దీని పనితీరును సమీక్షించిన సందర్భంగా మంత్రి తాజా వివరాలు వెల్లడించారు. కొత్త టె క్నాలజీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయ డాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీముకి 95 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
బ్లూడార్ట్ సేవల విస్తరణ
ముంబై: ఎక్స్‌ప్రెస్ ఎయిర్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సేవల్లోని బ్లూడార్ట్ విస్తరణపై దృష్టి సారించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 76 పిన్కోడ్లకు తన కార్యకలాపాలను కొత్తగా విస్తరించినట్టు ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో 15 కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే 15 ఫ్రాంచైజీ కలెక్షన్ సెంటర్లు, 15 ఎక్స్‌ప్రెస్ ఏజెంట్లు, 15 ప్రాంతీయ సరీ్వస్ ప్రొడైడైర్ ఫ్రాంచైజీలను నియమించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రతి పాంతానికీ సేవలు అందించగలమని తెలిపింది. దేశ ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ అంకిత భావానికి ఈ సేవల విస్తరణ నిదర్శనంగా కంపెనీ పేర్కొంది. విజయవాడ, సికింద్రాబాద్, మధురై, భువనేశ్వర్, లుధియానా, కోల్‌కతా తదితర పట్టణాల్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరిచినట్టు తెలిపింది. తాజా విస్తరణతో దేశవ్యాప్తంగా 55వేలకు పైగా ప్రాంతాలకు తమ సేవలు చేరువ అయినట్టు వివరించింది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సేవలు అందించడంపై తమ దృష్టి ఉంటుందని బ్లూడార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి తెలిపారు. -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
రూ.1,600 కోట్లతో ‘మాండలీజ్ చాక్లెట్స్’ విస్తరణ
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ సంస్థ మాండలీజ్ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. శ్రీసిటీలో ఇప్పటికే రూ.2,078 కోట్లతో 133 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు చేసిన మాండలీజ్.. ఆ యూనిట్లోనే రూ.1,600 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విస్తరణ ద్వారా 57 వేల చదరపు మీటర్ల మేర అభివృద్ధి చేయనున్నామని, తద్వారా ఏటా 2.20 లక్షల టన్నుల కోకోను వినియోగించుకునే సామర్థ్యం వస్తుందని మాండలీజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ మానేపల్లి తెలిపారు. కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లు విస్తరణలో భాగంగా కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 400 మంది పనిచేస్తుండగా.. విస్తరణ తర్వాత ఉపాధి లభించే వారి సంఖ్య 973కు చేరనుంది. అలాగే.. ఈ యూనిట్ ద్వారా 18 వేల మంది కోకో రైతులకు ప్రయోజనం లభించనుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడు సంవత్సరాల్లో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ సందర్భంగా వెంకట్ మానేపల్లి మాట్లాడుతూ.. ‘భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా మా వృద్ధికి అనుగుణంగా దేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించటం పట్ల సంతోషంగా ఉన్నాం. కీలకమైన శ్రీ సిటీ తయారీ యూనిట్ కార్యకలాపాలను విస్తరిస్తూ పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో మరిన్ని విజయాలను నమోదు చేస్తాం’ అని పేర్కొన్నారు. మాండలీజ్ శ్రీసిటీ యూనిట్ ద్వారా క్యాడ్బరీ, బార్నొవిటీ, ఓరియో వంటి బ్రాండ్స్‌కు చెందిన చాక్లెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను అందిస్తోంది. -
పీఅండ్‌జీ విస్తరణ బాట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీఅండ్‌జీ) దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా గుజరాత్లో వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీకి కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా దేశీయంగా తొమ్మిదో ప్లాంటుకు తెరతీయనుంది. ఏరియల్, జిల్లెట్, హెడ్ అండ్ షోల్డర్స్, ఓరల్–బి, ప్యాంపర్స్, ప్యాంటీన్, టైడ్, విక్స్, విస్పర్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లు కంపెనీ సొంతం. సణంద్ ప్రాంతంలోని 50,000 చదరపు మీటర్లలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక్కడ గ్లోబల్ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో నుంచి ఉత్పత్తులను రూపొందించనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా డైజెస్టివ్స్ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులను విదేశాలకు ఎగుమతి చేసే కేంద్రంగా వినియోగించనున్నట్లు వివరించింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలకొద్దీ ఉద్యోగాల కల్పనకు వీలున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ కంపెనీ ద్వారా దేశీయంగా ఎఫ్ఎంసీజీ విభాగంలో రెండో పెద్ద పెట్టుబడిగా ఇది నిలవనున్నట్లు పీఅండ్‌జీ ఇండియా సీఈవో ఎల్వీ వైద్యనాథన్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో సమావేశం సందర్భంగా వివరాలు వెల్లడించారు. గతేడాది సెపె్టంబర్లో మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ సైతం దేశీయంగా రూ. 5,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. 2015 నుంచి సణంద్‌లో పీఅండ్‌జీ తయారీ ప్లాంటును నిర్వహిస్తోంది. కొత్త ప్లాంటును అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. -
ఆకాశ ఎయిర్ దూకుడు: 4 బోయింగ్ విమానాలకు సై
న్యూఢిల్లీ: ఆకాశ ఎయిర్.. మరో 4 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలు సన్నాహాల్లో ఉన్నట్లు పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది(2023) చివరికల్లా మూడంకెలలో విమాన కొనుగోలుకి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆర్డర్లు జారీ చేసిన 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లకు జతగా మరో 4 విమానాలకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు తెలియజేసింది.(క్వాంటమ్ ఎనర్జీ విస్తరణ:హైదరాబాద్‌లో మూడో షోరూం) ప్యారిస్‌లో జరుగుతున్న ఎయిర్ షో సందర్భంగా కంపెనీ ఈ అంశాలను వెల్లడించింది. 2023 చివరికల్లా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే లక్ష్యంతో సాగుతున్నట్లు తెలిపింది. తాజాగా కొనుగోలు చేయనున్న విమానాలతో విస్తరణ పటిష్టంకానున్నట్లు వివరించింది. అంతర్జాతీయ విస్తరణ కోసం నాలుగు 737-8 విమానాల కొనుగోలుకి తెరతీసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో మొత్తం 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ తీసుకోనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా వేగవంత విస్తరణలో ఉన్న కంపెనీ అంతర్జాతీయ రూట్లలోనూ సరీ్వసుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. (దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్) -
తెలంగాణలో జియో ట్రూ5జీ సేవల విస్తరణ
హైదరాబాద్: టెలికం దిగ్గజం జియో తాజాగా తెలంగాణలో తమ ట్రూ 5జీ సేవలను మరింతగా విస్తరించింది. ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలు సహా 850 ప్రాంతాల్లో సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ 1జీబీపీఎస్ పైగా వేగంతో అపరిమిత డేటాను వెల్కమ్ ఆఫర్ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో తమ ట్రూ 5జీ సర్వీసులు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
సౌత్‌లో మాస్టర్ ప్లాన్! విస్తరణ బాటలో టాటా కన్జ్యూమర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దక్షిణాది మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారుల చానల్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది. ‘‘దక్షిణ భారత్ అంతటా మేము విస్తరిస్తున్నాం. టీ, కాఫీ, ఉప్పు, మసాలా దినుసులను దక్షిణాది కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని విడుదల చేస్తున్నాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. కాఫీ, టీ ఉత్పత్తుల్లో ఈ సంస్థ దక్షిణాదిన మార్కెట్ వాటా పెంచుకుంటోంది. టీ విభాగంలో చక్రాగోల్డ్, కనన్ దేవాన్ బ్రాండ్ల వాటా క్రమంగా పెరుగుతుండగా.. టాటా కాఫీ గ్రాండ్ నూతన ప్యాకేజింగ్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ‘‘గ్రామీణ మార్కెట్లో అవకాశాలున్నట్టు గుర్తించాం. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారులను నియమించుకుంటున్నాం’’అని వివరించింది. ఇక టాటా సంపన్న్ బ్రాండ్ కింద మసాలా దినుసులను ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రస్తుత విభాగాల్లో అగ్రగామి ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదగడంతోపాటు, కొత్త విభాగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్టు వాటాదారులకు తెలిపింది. 2022–23లో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 15 శాతం పెరిగి, దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ అవుట్లెట్లకు చేరుకుంది. మరిన్ని సంఖ్యలో రిటైల్ స్టోర్లకు సంస్థ ఉత్పత్తులను చేరువ చేయడానికి ఇది సాయపడింది. సంస్థ ఈ కామర్స్ అమ్మకాల చానల్ వేగంగా వృద్ధి చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆధునిక అంగళ్లు ద్వారా అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు -
చిరుధాన్యాల సాగు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్–2 (ఎస్డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్‌లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు. (చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
గ్రామీణ ప్రాంతాలపై పడిన నెస్లే దృష్టి.. అమ్మకాల వృద్ధికి కొత్త వ్యూహాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఈ ఏడాది రెండంకెల విక్రయాలపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ధరలపరమైన ఒత్తిళ్లు నిదానిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ నెట్వర్క్ విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి 20 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. వచ్చే 12 - 18 నెలల్లో 2,000కు పైగా జనాభా ఉన్న 1.2 లక్షల గ్రామాలను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 90వేల గ్రామాల్లో విక్రయాల నెట్వర్క్ ఉంది. నెస్లే హెల్త్‌సైన్స్ కింద ఫార్మసీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.. ‘‘ఎల్‌నినో కారణంగా వర్షాలపై మరీ ప్రతికూల ప్రభావం లేకపోతే తప్ప డిమాండ్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రెండంకెల వృద్ధి దిశగా అడుగులు వేస్తాం. అమ్మకాల్లో తిరిగి వృద్ధిని చూస్తున్నాం. మొదటి త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొస్తే అప్పుడు అమ్మకాల పరిమాణం, విలువ పరంగా మరింత సమతుల్యమైన వృద్ధిని నమోదు చేస్తాం’’అని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. గడిచిన ఆరేడేళ్లుగా కంపెనీ కాంపౌండెడ్‌గా ఏటా 10 - 11 శాతం మేర వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గిస్తారా..? ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దిగొస్తే ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు.. సరైన చర్యలపై దృష్టి పెడతామని నారాయణన్ బదులిచ్చారు. ఇప్పటికైతే ధరలు తగ్గించేటంత సానుకూల స్థితికి చేరుకోలేదన్నారు. రానున్న రోజుల్లో తాము కొనుగోలు చేసే ముడి పదార్థాల ధరలు చెప్పుకోతగ్గంత తగ్గుముఖం పడితే అప్పుడు ఉత్పత్తుల ధరలు, బరువు పరంగా సర్దుబాటు చేస్తామని చెప్పారు. పాల ధరలు భగ్గుమంటున్నాయని చెబుతూ.. ఇదే పరిస్థితి కొనసాగితే పాల ఆధారిత ఉత్పత్తుల ధరల ను సవరించాల్సి రావచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు 25 శాతానికి చేరుకుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కామర్స్ నుంచి 7 శాతం అమ్మకాలు వస్తున్నాయంటూ, ఇవి ఇంకా పెరగొచ్చన్నారు. -
బిజినెస్‌లో స్పీడ్ పెంచిన అలియా భట్!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ బిజినెస్‌లోనూ స్పీడ్ పెంచింది. ఆమె 2020లో ప్రారంభించిన కాన్షియస్ కిడ్స్ దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) విస్తరణ జోరుగా సాగుతోంది. గత ఆరు నెలల్లో ఈ బ్రాండ్ ప్రసూతి దుస్తులు, నర్సింగ్ వేర్, 11 నుంచి 17 ఏళ్ల వారి కోసం టీనేజ్ దుస్తులు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేక దుస్తులతో సహా నాలుగు కొత్త కేటగిరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! తల్లులు, పిల్లల కోసం ప్రత్యేక షాపింగ్ ఆలోచనతో ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ప్రారంభమైందని, ఇప్పుడు తాము ప్రసూతి నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకూ వారికి కావాల్సిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్-ఎ-మమ్మా సీవోవో ఇఫ్ఫాట్ జీవన్ పేర్కొన్నారు. దుస్తులకే పరిమితం కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ యోచిస్తోంది. అందులో భాగంగా పిల్లల సాహస కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు జీవన్ వెల్లడించారు. పుస్తకాలతో పాటు యానిమేటెడ్ సిరీస్‌లు, తల్లులు, పిల్లలకు కావాల్సిన ఇతర ఉత్పత్తలు, ఆటబొమ్మలు కూడా బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని చూస్తోంది. త్వరలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో ప్రారంభిస్తామని, యూఎస్‌లో అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటామని అని జీవన్ చెప్పారు. అంతేకాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆఫ్‌లైన్ మోడల్‌కూ విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తమ ఎక్స్పీరియన్స్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!
సాక్షి ముంబై: ప్రముఖ స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ఆవిష్కరించిన ఆకాశ ఎయిర్ విస్తరణలో దూసుకుపోతోంది. బడ్జెట్‌ధరల్లో విమాన టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయంతో బిగ్ బుల్ లాంచ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆకాశ ఎయిర్ ఇపుడు విస్తరణలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత విమానయాన రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే .ఏడు నెలల్లోనే సంస్థ తనదైన ఘనతను సాదించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఫిబ్రవరి నెలవారీ గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 3 శాతానికి చేరుకుంది. మార్చి చివరి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను చేర్చాలని భావించిన ఎయిర్‌లైన్ సంస్థ ప్రస్తుతం 19 విమానాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయానంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఆగస్టు 4, 2006లో సేవలను ప్రారంభించగా, ఆగస్టు 7, 2022లో ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు అప్పట్లో ఇండిగోలో స్టార్టప్ టీమ్‌లో భాగమై ఆదిత్య ఘోష్ ఇప్పుడు ఆకాశ ఎయిర్‌లో ఉండటం గమనార్హం. ఇండిగో మార్కెట్ వాటా కేవలం 2.6 శాతం. అలాగే ప్రస్తుతం 75కుపైగా దేశీయ గమ్యస్థానలకు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 గమ్యస్థానాలకు తన విమానాలను నడుపుతోంది. 2016 నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్‌సిఎపి) అమలులోకి వచ్చే వరకు, విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా ప్రయాణించడానికి ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కనీసం 20 విమానాలను కలిగి ఉండాలి. మారిన నిబంధన ప్రకారం కార్యకలాపాల వ్యవధిపై ఎలాంటి ఎటువంటి పరిమితులు లేవు. దీని ప్రకారం మార్చి 2023 చివరి నాటికి ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. 2024 చివరి నాటికి మొత్తం శ్రామికశక్తిని 3వేలకు చేరుకోనుంని సంస్థ దాదాపు 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుందని ఇటీవలి ఆకాశ ఎయిర్ వినయ్ దూబే ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మూడు అంకెల ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్’ చేయనున్నట్లు దూబే వెల్లడించారు. ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న 19 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లతో పాటు, అకాశ ఎయిర్ మరో 72 విమానాలతొ విస్తరిస్తోందని, ఏప్రిల్‌లో ప్రారంభించిన తర్వాత 20వ బోయింగ్ 737 మ్యాక్స్ విదేశీ ఫంక్షన్లకు సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్ మరో తొమ్మిది విమానాలతో మొత్తం సంఖ్య 28కి చేరనుంది. అలాగే వేసవి చివరి నాటికి ప్రస్తుత 110 (17 దేశీయ మార్గాలలో) నుండి 150చేరనుందన. ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లక్నోనుంచి గోవా, అహ్మదాబాద్‌లకు డైరెక్ట్ విమానాలను ప్రారంభించింది ఆకాశ ఎయిర్. నిరంతరాయమైన కనెక్టివిటీని అందించే లక్ష్యంతో, చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ఈ రెండు డైరెక్ట్ విమానాలు ఆదివారం లాంచ్ చేసింది. -
భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉడాన్: ఏకంగా ఆరు రెట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో శీతల పానీయాలకు డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో తమ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగాన్నిఆరు రెట్లు విస్తరించు కోవాలని బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్ భావిస్తోంది. ఏడాది వ్యవధిలో 10,000 చిన్న పట్టణాలు, గ్రామాలకు చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగం హెడ్ వినయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం ’ప్రాజెక్ట్ విస్తార్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్, జౌన్పూర్ జిల్లాల్లోసుమారు 3,000 మంది వరకు జనాభా ఉన్న గ్రామీణ మార్కెట్లలో దీన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కి అనుగుణంగా వివిధ బ్రాండ్లకు సంబంధించి పలు చిన్న ప్యాక్‌ల నిల్వలను పెంచుకుంటున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కోకా-కోలా, పెప్సీకో, డాబర్, హెక్టర్ బెవరేజెస్ (పేపర్‌బోట్) వంటి కీలక బ్రాండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. -
పాకిస్తాన్‌కు కొత్త ముప్పు.. దేశంపై పట్టుకు టీటీపీ ప్లాన్.. దాని లక్ష్యాలేంటి ?
ఆర్థికంగా దివాలా తీశామని ఒకవైపు దేశ రక్షణ మంత్రే ప్రకటిస్తున్న పరిస్థితుల్లో తెహ్రిక్–ఇ–తాలిబన్ రూపంలో కొత్త ముప్పుని ఎదుర్కొంటోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తాము బలిపశువుగా మారినందుకు ఎలా అడుగు లు వెయ్యాలో తెలీక బిత్తరపోతోంది. ఎవరీ తెహ్రిక్–ఇ–తాలిబన్లు, వారి లక్ష్యమేంటి ..? 2021, ఆగస్టు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం... పాకిస్తాన్లో సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికానే తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం ఘన విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు. నెల రోజులయ్యేసరికి.. అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో కనీసం 250 దాడులు జరిగాయని పాక్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుఖ్వా(కె.పి)లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఏమిటీ టీటీపీ తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్‌ను టీటీపీ అని పిలుస్తారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల మద్దతుతో వీళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2001లో అమెరికాపై ట్విన్ టవర్స్ దాడి తర్వాత అగ్రరాజ్యం చేసిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి పాకిస్తాన్ అండగా నిలవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీరంతా ఒక గూటి కిందకి చేరారు. పాక్ విధానాలను వ్యతిరేకిస్తూ దక్షిణ వజిరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్ నేతృత్వంలో 2007లో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఏర్పాటైంది. టీటీపీ ప్రస్తుత చీఫ్ నూర్ వలీ మెహసూద్ అఫ్గాన్ నుంచి పాక్‌లో హింసను రాజేస్తున్నాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి.! అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని పాక్ ప్రభుత్వం భావించింది. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్ ఓ పక్కకి వెళ్లిపోతుందని ఆనందపడింది. అయితే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది.డ్యూరాండ్ రేఖపై ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీ తుపాకీలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని పాక్ సర్కార్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనుల్ని పాక్ చేతుల నుంచి విడిపించడమే తమ లక్ష్యమన్నట్టుగా టీటీపీ మారిపోయింది. అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొన్నాళ్లు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా గత ఏడాది నవంబర్‌లో జనరల్ అసీమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించగానే కాల్పుల విరమణను రద్దు చేసింది. అప్పట్నుంచి పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటివి చేయసాగింది. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా తాలిబన్లను అదుపు చేయడానికి దాడులకు దిగుతూ ఉండడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అఫ్గాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాక్‌కు ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని నిట్టూరుస్తోంది. ఈ పరిణామాలన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దివాలా తీశాం: పాక్ రక్షణ మంత్రి ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్ రేపో మాపో దివాలా తీస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ బాంబు లాంటి నిజం చెప్పారు. ఇప్పటికే దేశం దివాలా తీసిందని అన్నారు. ఆదివారం సియాల్కోట్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘పాక్ దివాలా తీస్తుందన్న వార్తలు మీరు వినే ఉంటారు. వాస్తవానికి ఇప్పటికే దేశం దివాలా తీసింది. మనం ప్రస్తుతం దివాలా తీసిన దేశంలో బతుకుతున్నాం’’ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దేశంలో ఆర్థిక సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఏమీ చేయలేదని మనమే ఏదో ఒకటి చెయ్యాలన్నారు. పాకిస్తాన్లో చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని, ఈ దుస్థితికి రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, మన వ్యవస్థలు అన్నీ బాధ్యతవహించాలన్నారు. టీటీపీ లక్ష్యాలేంటి ? పాకిస్తాన్ మిలటరీ విధానాలను తీవ్రంగా వ్యతిరేంచిన ఈ సంస్థ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2021లో అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పాకిస్తాన్‌పై దృష్టి సారించింది. ఇస్లాం విస్తరణ తాలిబన్ల ప్రధాన ధ్యేయంగా మారింది. అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా పాకిస్తాన్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి షరియా చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న తమ వారిని బయటకు తీసుకురావాలని, అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికుల్ని వెనక్కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. పాకిస్తాన్లో ఉగ్ర దాడులకు ఐసిస్ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు చాలు. అఫ్గానిస్తాన్ తరహాలో ఏదో ఒకరోజు తాలిబన్లు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. – తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతర్జాతీయ విపణిలోకి మహిళా స్టార్టప్‌లు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వి హబ్ (వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) అటు గ్రామీణ, ఇటు అంతర్జాతీయ స్థాయికి కార్యకలాపాలు విస్తరించేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది. వి హబ్‌లో పురుడు పోసుకుంటున్న మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఓ వైపు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను వి హబ్ సిద్ధం చేస్తోంది. ఆర్ధిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వాణిజ్యవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చేయూతను అందిస్తోంది. తమ వద్ద ఉన్న వినూత్న ఆలోచనలు, పరిష్కారాలకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను మహిళలు అధిగమించేందుకు అవసరమైన సాయాన్ని వి హబ్ వివిధ రూపాల్లో అందిస్తోంది. మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు మహిళల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలు, సంక్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారం చూపుతూ స్టార్టప్‌ల ద్వారా వాణిజ్యరూపంలో ఊతమిచ్చేందుకు 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వి హబ్ ఏర్పాటు చేసింది. వి హబ్‌లో ప్రస్తుతం మహిళల సారథ్యంలోని 84 స్టార్టప్‌లు ఇంక్యుబేట్ అవుతుండగా, వి హబ్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 914 మహిళా స్టార్టప్‌లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వి హబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్‌లలో ఎక్కువగా నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందినవి కాగా, 25 శాతం చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగాలు, 13 శాతం ఆరోగ్య, లైఫ్‌సైన్సెస్ రంగాలు కాగా మిగతావి ఇతర రంగాలకు చెందినవి. స్టార్టప్‌లు తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు అవసరమైన సాయంతో పాటు సాంకేతిక సాయం అందించే మెంటార్లను (మార్గదర్శకులు) కూడా వి హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ తదితరాల ద్వారా మహిళా స్టార్టప్‌లకు వి హబ్ రూ.83 కోట్ల మేర నిధులు సమకూర్చింది. అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం ఇటు మారుమూల ప్రాంతాల్లో విస్తరణ మహిళా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా మెరుగైన వాణిజ్య అవకాశాలను పొందేందుకు వీలుగా వి హబ్ ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీలతోనూ మహిళా స్టార్టప్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక హైదరాబాద్‌కే కార్యకలాపాలను పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలపైనా వి హబ్ దృష్టి సారించనుంది. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్టార్టప్ సంస్కృతిపై అవగాహన కల్పించాలని వి హబ్ నిర్ణయించింది. మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం రాష్ట్రంలో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా మహిళా వాణిజ్యవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించడం, వారి ఆలోచనలకు స్టార్టప్‌ల ద్వారా వాణిజ్య రూపం ఇవ్వడం, వారికి అవ సరమైన పెట్టుబడి, సాంకేతిక, వాణిజ్య సల హాలు, మార్గదర్శనం ఇవ్వడంలో వి హబ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్టార్టప్‌లు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. – దీప్తి రావుల, సీఈఓ, వి హబ్ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. ఇప్పుడు వాణిజ్యవేత్తను గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన నేను వి హబ్ ప్రోత్సాహంతో వాణిజ్యవేత్తగా మారాను. స్టార్టప్ ద్వారా బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ నెట్వర్క్ తదితరాల్లో ఇక్కడ మార్గదర్శకత్వం లభించింది. ప్రస్తుతం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారం చేస్తున్నా. ఎంబ్రాయిడరీ స్టూడియో నుంచి మొదలైన నా ఆలోచన ప్రస్తుతం ఎంబ్రాయిడరీ మెషీన్ల దాకా విస్తరించింది. ప్రస్తుతం రూ.1.2 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నా వ్యాపారం సాగుతోంది. – భవ్య గుమ్మడి -
సంక్రాంతి తర్వాత స్పీడ్
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాల విస్తరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి తర్వాత కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్కు గుర్తింపు దక్కిన నెల రోజుల్లోపే పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన కేసీఆర్.. జనవరి నెలాఖరులోగా మరో ఆరేడు రాష్ట్రాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత తెలంగాణకు సరిహద్దుగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో బీఆర్ఎస్ శాఖల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఒడిశా, పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లోనూ వీలైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయిం చారు. ప్రత్యేకించి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాంతాలపై పట్టు సాధించేలా కేసీఆర్ ప్రత్యేక వ్యూహానికి పదును పెడుతున్నారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. కర్ణాటకలో ఇప్పటికే చురుగ్గా.. కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయచూర్, కొప్పాల్, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, బీడ్, ఔరంగాబాద్, పర్బనీ, నాగపూర్, చంద్రాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యక లాపాలకు శ్రీకారం చుడుతున్నారు. కర్ణాటకలో కల్లుగీత వృత్తిని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో జేడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మద్దతు ప్రకటించారు. గుల్బర్గాలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘానికి చెందిన పలువురు ముఖ్య నేతలతో కలిసి పాదయాత్ర వాల్‌పోస్టర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి (నారాయణపేట్), భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్) తదితరులు తమకు పొరుగునే ఉన్న కర్ణాటకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడి నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఉన్న పరిచయాలను ఆధారంగా చేసుకుని వ్యక్తిగతంగా భేటీ అవుతూ, చిన్న చిన్న బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ తదితరులు కర్ణాటకలోని గదగ్ ప్రాంతంలో గత నెలలో పర్యటించారు. కిసాన్ జాగృతి వికాస్ సంఘం ప్రతినిధులతో జరిగిన భేటీలో బీఆర్ఎస్ విధానాలను వివరించారు. జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి నేతృత్వంలోని బృందం కూడా చించోలి, సేడం తదితర ప్రాంతాల్లో పర్యటించి బీఆర్ఎస్పై అభిప్రాయాలు సేకరించారు. మహారాష్ట్రలోనూ ముమ్మరం మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలు ముమ్మరం చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మరికొందరు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గంలో పర్యటించారు. త్వరలోనే మహారాష్ట్రలోని షోలాపూర్, పుణె, గుజరాత్‌లోని సూరత్ ప్రాంతాలకు కూడా బీఆర్ఎస్ నాయకులు వెళ్లనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ తదితరులు కూడా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించి వచ్చారు. అధినేతకు ఎప్పటికప్పుడు నివేదికలు తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను పొరుగు రాష్ట్రాల్లో వివరిస్తూనే, మరోవైపు బీఆర్ఎస్ పట్ల వారి అభిప్రాయాలను నేతలు తెలుసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకోవడంతో పాటు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేస్తున్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జాబితాను తయారు చేయడంతో పాటు వారి నేపథ్యాన్ని కూడా ఆరా తీస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తాము పరిశీలించిన విషయాలతో కూడిన నివేదికలను ఎప్పటికప్పుడు రూపొందించి పార్టీ అధినేత కేసీఆర్‌కు అందజేస్తున్నారు. ఇదే తరహాలో పంజాబ్, హరియాణాతో పాటు తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు సమాచారం. -
ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ
ముంబై: బిజినెస్ కన్సల్టెన్సీ సేవల్లోని ‘నెక్ట్స్జి అపెక్స్’ తన ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుకోనున్నట్టు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో ఎఫ్ఎంసీజీ, హెల్త్, ఎఫ్అండ్బీ తదితర విభాగాల్లోకి విస్తరించాలన్న తమ ప్రణాళికల మేరకు అదనపు ఉద్యోగులను తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు 543 మంది ఉద్యోగులు ఉండగా, 2023 మార్చి చివరికి 902కు తీసుకెళ్లనున్నట్టు ప్రకటించింది. అదే విధంగా 2025 మార్చి నాటికి రూ.5,361కి పెంచుకోనున్నట్టు తెలిపింది. ప్రధానంగా తమకు 80 శాతం వ్యాపారం వస్తున్న పట్టణాల నుంచి నియామకాలు ఎక్కువగా ఉంటాయని, తదుపరి 40-50 శాతం ద్వితీయ, తృతీయ పట్టణాల నుంచి తీసుకోనున్నట్టు పేర్కొంది. (హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?) ‘‘70 శాతం మంది ఫీట్ ఆన్ స్ట్రీట్ ఫ్లీట్ నుంచి ఉంటారు. 20 శాతం మంది మధ్యస్థాయి పర్యవేక్షక విభాగాల్లో, 5 శాతం నిర్వహణ స్థాయిలో, 3 శాతం బ్యాక్ ఎండ్, 2 శాతం టాప్ మేనేజ్మెంట్ కోసం ఉద్యోగులను తీసుకుంటాం’’ అని సంస్థ సీఈవో అమర్నాద్ హెలెంబర్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
3 నేషనల్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 12న రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ రోడ్ల పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేయటం ఇదే మొదటిసారి. గతంలో మనోహరా బాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గజ్వేల్ కేంద్రంగా మోదీ శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులకు ఆ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. మెదక్– సిద్దిపేట–ఎల్కతుర్తి మధ్య 134 కి.మీ. నిడివితో విస్తరించే ఎన్‌హెచ్–265 డీజీ పనులు ప్రారంభిస్తారు. రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో విస్తరించే ఈ పనులకు రూ.1461 కోట్లు వ్యయం అంచనా. రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో విస్తరించే బోధన్–బాసర–భైంసా రోడ్డు పనులు ప్రారంభిస్తారు. 56 కి.మీ. నిడివితో ఉండే ఈ రోడ్డు విస్తరణకు రూ.644 కోట్లు ఖర్చు కానున్నాయి. 17 కి.మీ. నిడివితో ఉండే సిరోంచ–మహదేవ్పూర్ సెక్షన్ పరిధిలో ఆత్మకూరు వరకు జరిగే రోడ్డు పనులను కూడా ప్రారంభిస్తారు. పేవ్డ్ షోల్డర్స్‌తో కూడిన ఈ రెండు వరసల రోడ్డు విస్తరణకు రూ.163 కోట్లు వ్యయం కానుంది. -
ఎస్పైర్ హాస్పిటాలిటీ విస్తరణ
ముంబై: ఆతిథ్య రంగ కంపెనీ ఎస్పైర్ హాస్పిటాలిటీ గ్రూప్ విస్తరణ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా రానున్న నాలుగేళ్లలో రూ. 550 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. విస్తరణకుతోడు బిజినెస్‌ల ఆధునీకరణను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో 2023కల్లా 20 హోటళ్లు, 700కుపైగా గదులను జత కలుపుకోవాలని ప్రణాళికలు వేసినట్లు గ్రూప్ సీవోవో అఖిల్ అరోరా వెల్లడించారు. అన్ని బ్రాండ్లనూ కలుపుకుని ప్రస్తుతం 318 గదులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. తాజా పెట్టుబడులను ప్రస్తుత హోటళ్ల ఆధునీకరణ, లీజింగ్ తదితరాలకు సైతం వినియోగించనున్నట్లు వివరించారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్, భిమ్టాల్తోపాటు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హోటళ్లను నిర్వహిస్తోంది. ఉదయ్‌పూర్‌లో తొలిసారి జానా లగ్జరీ ఎస్కేప్స్ పేరుతో హోటల్‌ను ఏర్పాటు చేసింది. -
విస్తరణ బాటలో ఫనాటిక్స్
డిజిటల్ స్పోర్ట్స్ వేదిక ఫనాటిక్స్ విస్తరణ బాట పట్టింది. కొత్తగా వందమందిని రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు పెరుగుతున్న సిబ్బంది తగ్గట్టుగా కార్యాలయాన్ని నాలెడ్జ్ సిటీలో ఉన్న సత్వ భవనంలోకి మార్చింది. కొత్తగా నియమితులవుతున్న వంద మంది ఉద్యోగుల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆన్ లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లు ఉండనున్నారు. డిజిటల్ స్పోర్ట్స్ వేదికైన ఫనాటిక్స్ ఒకే ఒక ఉద్యోగితో 2018లో ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 170 మంది ఉద్యోగులు ఉన్నారను. 2022 చివరి నాటికి హైదరాబాద్‌లో వర్క్‌ఫోర్స్ సంఖ్యను 250కి పెంచుకోవాలని ఫనాటిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: Swiggy Drone Deliveries: స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్ కొడితే చాలు! -
బస్తీమే సవాల్.. ఛాలెంజ్‌గా మారిన ట్రాఫిక్ నియంత్రణ
సాక్షి, గుంటూరు, తెనాలి, నరసరావుపేట: నగర/పట్టణాల్లో జనాభా నానాటికీ పెరుగుతోంది. జీవనం ఉరుకులు పరుగుల మయమవుతోంది. దీనికి అనుగుణంగా వాహనాల వినియోగమూ పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. వాహనాల రద్దీతో నిత్యం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాకపోకల నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే తలకు మించిన భారమే అవుతోంది. గుం‘టూరు కష్టమే’ గుంటూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. సమీపంలోని గ్రామాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు చాలా వరకు నగరంలో కలిసిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు నగర జనాభా 6.76 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా ఉంటుందని అధికారుల అంచనా. నగరంలో మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి సుమారుగా 6,43,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో నగరంలో రద్దీ పెరిగింది. దీనికి తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ జరగకపోవడంతో నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. పరిష్కారం దిశగా ప్రభుత్వం.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణమే శరణ్యమని ప్రభుత్వం గుర్తించింది. శంకర్‌విలాస్ వద్ద బ్రిడ్జి విస్తరణ లేదా కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న గడ్డిపాడు రైల్వేగేట్, శ్యామలానగర్, నెహ్రూనగర్, సంజీవయ్య నగర్, సీతారామ్‌నగర్ రైల్వేగేట్ల వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలు నిర్మించడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలోభాగంగా ఆర్అండ్బీ, జీవీఎంసీ అధికారులు ఇటీవల పరిశీలన చేశారు. నందివెలుగు రోడ్డు రైల్వే వంతెన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు రోడ్ల విస్తరణకూ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రా ప్యారిస్‌లోనూ పాట్లు గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, ఆంధ్రా ప్యారిస్‌గా గుర్తింపు పొందిన తెనాలిలోనూ ట్రాఫిక్ పాట్లు తప్పడం లేదు. ఆక్రమణలతోపాటు రోడ్లపైనా వ్యాపారాల వల్ల ఈ సమస్య జఠిలమవుతోంది. తెనాలి పట్టణ జనాభా రెండు లక్షలకుపైగానే ఉంటుంది. అన్ని రకాల వాహనాలు కలిపి 1.10 లక్షల వరకు ఉంటాయని తెలుస్తోంది. సమీపంలోని వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి రోజూ 40 నుంచి 50 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ జరగలేదు. పార్కింగ్ సమస్య కూడా వేధిస్తోంది. వీధివ్యాపారులకు ప్రత్యేక స్థలం, పార్కింగ్ జోన్ల కేటాయింపు కాగితాలకే పరిమితమైంది. పరిష్కారమార్గం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణమే మార్గం. గతంలో మార్కెట్ వంతెన వద్ద స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సర్వే చేశారు. నెహ్రూ, బోస్, మెయిన్, బుర్రిపాలెం రోడ్లను విస్తరించాలి. మరో కొత్త వంతెన అవసరం ఉంది. కాలువ రోడ్లను విస్తరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. పేటలోనూ ‘నడక’యాతనే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.18 లక్షలు. ఇప్పుడు 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అన్ని రకాల వాహనాలు కలిపి 1,00,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచీ పట్టణానికి నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. దీంతో పట్టణంలోని రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. ఫ్లైఓవర్ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్ నరసరావుపేటలో ప్రస్తుతం రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. జిల్లా కేంద్రమైనందున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ఆవశ్యకత అధికమైంది. దీంతో రెండు ఆర్‌యూబీలు, ఓ ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికీ తీసుకెళ్లారు. మల్లమ్మసెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్‌వరకు ఫ్లైఓవర్ మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. లాల్‌బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ వెనుకగా చిత్రాలయ థియేటర్ ఎదురుగా ఆర్యుబీ నిర్మాణానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చారు. వీటితోపాటు రోడ్ల విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరినట్టే. కిలోమీటర్ మేర బారులు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కోసారి కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. శ్యామలానగర్ రైల్వే గేట్ పడిందంటే అంతే సంగతులు. వెంటనే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను నిర్మించాలి. గడ్డిపాడు రైల్వే గేట్ వల్ల ట్రాఫిక్ ఆగిపోతోంది. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలి. – మాన్నిడి సుధమారుతిబాబు, నల్లపాడు, గుంటూరు పూర్తి స్థాయిలో దృష్టి సారించాం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నిత్యం చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల క్రితం డీఐజీ, ఎస్పీ సమీక్ష చేశారు. ట్రిఫిక్ నియంత్రణపై దృష్టిసారించాం. పలు ప్రాంతాల్లో డివైడర్లు తొలగించాలని జీఎంసీకి ప్రతిపాదలు పంపాం. పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – వీవీ రమణకుమార్, డీఎస్పీ, గుంటూరు సిటీ ట్రాఫిక్ పరిష్కారానికి సమష్టిగా కృషి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తాం. దీనికి ప్రజల సహకారమూ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధాన కూడళ్లలో వన్ వే, ఫ్రీ లెఫ్ట్ వంటివి ఏర్పాటు చేశాం. – జోగి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ, తెనాలి రోడ్లు విస్తరించాలి నరసరావుపేటలో ట్రాఫిక్‌పై పోలీసులు దృష్టిపెట్టాలి. రోడ్లను విస్తరించాలి. వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ కేటాయిస్తే మేలు. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. ఆటోవాలాలను నియంత్రించాలి. – గుదే రామయ్య, బరంపేట, నరసరావుపేట ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మళ్లిస్తాం నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సమష్టిగా కృషి చేస్తున్నాం. ఔటర్ రింగ్‌రోడ్డును ఉపయోగించి ఇకపై వినుకొండ, పల్నాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గుంటూరు వైపు వెళ్లాల్సిన వాహనాలను మళ్లిస్తాం. దీనివల్ల పట్టణంలో రద్దీ తగ్గుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. – సి.విజయభాస్కరరావు , డీఎస్పీ, నరసరావుపేట -
వ్యాపార విస్తరణలో స్నాప్‌డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తమ కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, టెక్నాలజీపరంగా మరిన్ని ఆవిష్కరణలు చేయడం, లాజిస్టింక్స్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికోసం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది. కొత్తగా ఈక్విటీల జారీ, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్, బ్లాక్‌రాక్, టెమాసెక్, ఈబే తదితర సంస్థలు స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 షేర్హోల్డర్లలో 8 మంది మాత్రమే స్వల్ప వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వివరించింది. సంయుక్తంగా 20.28 శాతం వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ కుమార్ బన్సల్ తమ వాటాలను ఐపీవోలో విక్రయించడం లేదని స్నాప్‌డీల్ తెలిపింది. -
అమ్మమ్మాస్ బంపర్ ఆఫర్.. వన్ ప్లస్ వన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మమ్మాస్ బ్రాండ్‌తో ఈజీ టు కుక్ ఉత్పత్తుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ మంగమ్మ ఫుడ్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుతోంది. మార్చిలోగా ఎనిమిది ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్‌లో ఇటువంటివి రెండు కేంద్రాలున్నాయి. 2023 చివరినాటికి 100 స్టోర్ల స్థాయికి చేరతామని మంగమ్మ ఫుడ్స్ కో– ఫౌండర్ ప్రతిమ విశ్వనాథ్ తెలిపారు. ఈ ఏడాదే బెంగళూరు, పుణే నగరాల్లో అడుగుపెడతామని, విస్తరణకు నిధులు సమీకరిస్తామన్నారు. ‘పచ్చళ్లు, తృణధాన్యాలు, స్వీట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి 100 రకాల ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నాం. 10 లక్షల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. మూడవ వార్షికోత్సవం సందర్భంగా యాప్ ద్వారా జరిపే కొనుగోళ్ళకు పలు ఉత్పత్తులపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం. ఇక అన్ని స్టోర్లనూ కంపెనీ సొంతంగా స్థాపిస్తోంది. ఫ్రాంచైజీ విధానానికీ సిద్ధమే. స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసి స్థల యజమానికి కమీషన్ ఇస్తాం. అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 10 శాతం ఉంది’ అని ప్రతిమా విశ్వనాథ్ వివరించారు. -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంపత్సరం ప్రథమార్ధంలో దక్షిణాదియేతర మార్కెట్లలోకి కార్యకలాపాలను గణనీయంగా విస్తరించనున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపా రు. ఇందుకోసం ఫ్రాంచైజీ విధానాన్ని ఎంచుకో వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా 2025 నుంచి ఈ విధానంలో విస్త రించాలని భావించినప్పటికీ గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతక న్నా ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముందుగా 2–3 స్టోర్స్‌తో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాం చైజీ మోడల్లో స్టోర్ ఏర్పాటు వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపా రు. ఇందులో సింహభాగం వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వివరించా రు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాలు, నాలుగు దేశాల్లో 151 సొంత షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో 121 స్టోర్స్ భారత్‌లో ఉన్నాయి. -
అన్ని జిల్లాల్లో అమ్ముదాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ (టీఎస్ హెచ్‌డీసీఎల్) విస్తరణ బాట పడుతోంది. రాష్ట్రంలో హస్తకళలపై ఆధారపడిన వారికి ఉపాధి కల్పించేందుకు గాను కార్యకలాపాల విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వివిధ జిల్లాల్లో తయారయ్యే హస్త కళాకృతులను హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా సహా మొత్తం 10 చోట్ల ‘గోల్కొండ’ బ్రాండ్ పేరుతో ఇప్పటికే విక్రయిస్తున్న ఈ సంస్థ.. అన్ని జిల్లా కేంద్రాల్లో విక్రయ షోరూమ్‌లు ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం ఆయా పట్టణాల్లోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. కరీంనగర్లో షోరూమ్ రెడీ హైదరాబాద్‌లో ముషీరాబాద్, గన్‌ఫౌండ్రీ, సికింద్రాబాద్, బంజారాహిల్స్, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేట, ఢిల్లీ, కోల్‌కతాలో టీఎస్ హెచ్‌డీసీఎల్ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్‌లు పనిచేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గోల్కొండ షోరూమ్ నిర్మాణం తుది దశలో ఉంది. త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో షోరూ మ్ కొనసాగుతుండగా శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరంగల్ పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం నామమాత్ర రుసుముతో కేటాయించింది. ఇక్కడ నిర్మించే షోరూమ్ కేవలం హస్త కళల విక్రయానికే కాకుండా హస్తకళాకారుల సేవా కేంద్రంగా, సంస్కృతి పరిరక్షణ కేంద్రంగా పనిచేయనుంది. 4 చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు నిర్మల్ పెయింటెడ్ ఫర్నిచర్, ఎర్ర చందనం కళాకృతులు, నిర్మల్, చేర్యాల, బాతిక్ పెయింటింగ్స్, బిద్రీ, ఇత్తడి, సిల్వర్ ఫిలిగ్రీ వంటి లోహ కళాకృతులు గోల్కొండ షోరూమ్‌లలో విక్రయిస్తున్నారు. మంగళగిరి, పోచంపల్లి, సిద్దిపేట, గద్వాల చేనేత వస్త్రాలతో పాటు బంజారా ఎంబ్రాయిడరీ, కాటన్ డర్రీస్ వంటి ఉత్పత్తులు, లెదర్, ముత్యాలు, ఆభరణాలు వంటివి కూడా లభిస్తున్నాయి. వీటన్నింటినీ తయారు చేసే హస్తకళాకారులకు అనువైన పని ప్రదేశాల కోసం 4 చోట్ల హస్తకళల అభివృద్ధి సంస్థ కొత్తగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటును ప్రతిపాదించింది. సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో చెక్కబొమ్మలు, కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ, దేవరకొండలో బంజారా ఎంబ్రాయిడరీ, నిర్మల్‌లో నిర్మల్ బొమ్మల తయారీ కోసం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ముషీరాబాద్‌లోని హస్తకళా భవన్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మల్టీ క్రాఫ్ట్స్ కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు గోల్కొండ షోరూమ్‌ల ద్వారా హస్తకళాకృతులను విక్రయిస్తున్న హస్తకళల అభివృద్ది సంస్థ.. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు కొనసాగించాలని నిర్ణయించింది. గతంలో ఈ కామర్స్ సంస్థలు ‘అమెజాన్’, ‘ఫ్లిప్‌కార్ట్’తో ఒప్పందాలు కుదుర్చుకుంది. సొంత ఆన్లైన్ విక్రయ వేదికపై హస్తకళాకృతులు అమ్మకాలు సాగించేందుకు ‘గోల్కొండ షాపింగ్’ పేరిట మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గతేడాది ఏప్రిల్‌లో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కానీ కరోనా వల్ల అశించినంత విక్రయాల్లేవని అధికారులు చెప్తున్నారు. హస్తకళాకృతుల విక్రయం ద్వారా 2020–21లో రూ.16.17 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతేడాది డిసెంబర్ వరకు రూ.36.80 కోట్ల విలువైన కళాకృతులను విక్రయించారు. రాబోయే రెండేళ్లలో టర్నోవర్‌ను రూ. 60 కోట్లకు చేర్చడానికి హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
‘ఎఫ్2’లో కల్ట్ఫిట్కు వాటాలు
న్యూఢిల్లీ: హెల్త్, వెల్నెస్ ప్లాట్‌ఫామ్ కల్ట్‌డాట్‌ఫిట్ తాజాగా ఎఫ్2 ఫన్ అండ్ ఫిట్నెస్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఎఫ్2 ఫన్ అండ్ ఫిట్నెస్ సంస్థ.. భారత్‌లో గోల్డ్స్ జిమ్‌కు మాస్టర్ ఫ్రాంచైజీ పార్ట్నర్గా ఉంది. ప్రస్తుత గోల్డ్స్ జిమ్ సెంటర్ల ఆదాయాలను పెంచేందుకు, ఫ్రాంచైజీలను మరింతగా విస్తరించేందుకు కల్ట్‌డాట్‌ఫిట్ ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లోకి కూడా ఈ సెంటర్లను విస్తరించనుంది. గోల్డ్స్ జిమ్‌తో భాగస్వామ్యం తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టపర్చుకునేందుకు కూడా ఉపయోగపడగలదని కల్ట్‌డాట్‌ఫిట్ హెడ్ (గ్రోత్ అండ్ మార్కెటింగ్ విభాగం) నరేశ్ కృష్ణస్వామి తెలిపారు. భారత్‌లో గోల్డ్స్ జిమ్ తదుపరి వృద్ధికి ఇది దోహదపడగలదని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిఖిల్ కక్కర్ పేర్కొన్నారు. కల్ట్‌డాట్‌ఫిట్ గతేడాది డిసెంబర్లో .. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సారథ్యంలోని ఇన్వెస్టర్ల నుంచి 150 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించింది. జొమాటో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో కల్ట్‌డాట్‌ఫిట్ .. యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) జాబితాలోకి చేరింది. -
ప్యారడైజ్ బిర్యానీ.. ఇక దేశమంతటా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు ఏడు దశాబ్దాల పైగా చరిత్ర గల బిర్యానీ చెయిన్ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్స్ దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 100 రెస్టారెంట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2026–27 నాటికి దీన్ని 500కు పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో గౌతమ్ గుప్తా తెలిపారు. సౌతిండియాలో హైదరాబాద్‌లో 50వ రెస్టారెంట్ ప్రారంభించిన సందర్భంగా సంస్థ సీఈవో గౌతమ్ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో కార్యకలాపాలు ఉండగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విస్తరించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో 200 - 250 రెస్టారెంట్లు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈస్ట్‌లో కోల్‌కతాపై ఫోకస్ చేయనుంది ప్యారడైజ్. తెలుగు రాష్ట్రాల్లో 100 విస్తరణలో భాగంగా త్వరలో దేశవ్యాప్తంగా 450 రెస్టారెంట్లను ప్రారంభించాలని ప్యారడైజ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వందకు పైగా రెస్టారెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పనుంది. దాదాపుగా పాత జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాల్లో రెస్టారెంట్లు వచ్చే ఆస్కారం ఉంది. ఇటీవల వరంగల్ లాంటి టైర్ టూ సిటీలో కూడా రెస్టారెంట్ ప్రారంభించింది ప్యారడైజ్. త్వరలో ఇతర పట్టణాల్లోనూ ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులోకి రానుంది. విదేశాల్లో సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ సినిమా థియేటర్‌కి అనుబంధంగా చిన్న క్యాంటీన్‌గా ప్యారడైజ బిర్యానీ ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా బిర్యానీ బ్రాండ్‌గా ఎదిగింది. త్వరలోనే యూకే, యూఎస్, మిడిల్ ఈస్ట్, సౌత్ఈస్ట్ దేశాల్లోనూ ఫ్రాంచైజీ పద్దతిన రెస్టారెంట్లు ప్రారంభించనుంది. ప్యారడైజ్ ఫుడ్‌కోర్ట్స్ 2027 నాటికి రూ. 2,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి:హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..! -
మౌలాలి రైల్వేస్టేషన్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మౌలాలి రైల్వేస్టేషన్లో మరిన్ని రైళ్ల నిలుపుదలకు అవకాశం లభించింది. పెద్ద ఎత్తున చేపట్టిన రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫామ్‌ల పొడిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రైళ్ల నిర్వహణకు అనుగుణంగా స్టేషన్ అందుబాటులోకి రానుంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం లూప్లైన్ల ఏర్పాటు చేశారు. అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికుల రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి. సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రద్దీ నివారణకు అనుగుణంగా మౌలాలి స్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు సరుకు రవాణా లైన్లను లూప్‌లైన్లుగా మార్పు చేశారు. మరోవైపు రెండు రైల్వే లైన్ల పొడవును విస్తరించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్లో 18 బోగీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగనుంది. (క్లిక్: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం) ఈ సదుపాయంతో మౌలాలి స్టేషన్లో మరిన్ని రైళ్లు నిలిపేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రయాణికుల రైళ్లను నిలిపేందుకు ఇప్పుడు ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లతో పాటు మరొకటి అదనంగా అందుబాటులోకి రానుంది. రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా మెరుగుపడనుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. (క్లిక్: ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా) -
బ్లేడ్ ఇండియా విస్తరణ బాట
ముంబై: హెలికాప్టర్ రవాణా సర్వీసులందించే బ్లేడ్ ఇండియా తాజాగా 5 కొత్త హెచ్125 హెలికాప్టర్లను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా పెరుగుతున్న ఆన్‌డిమాండ్ హెలికాప్టర్ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో జట్టు కట్టినట్లు బ్లేడ్ ఇండియా పేర్కొంది. యూఎస్ కంపెనీ బ్లేడ్ యూఏఎం, హంచ్ వెంచర్స్ గ్రూప్ ఇండియా భాగస్వామ్య పద్ధతిలో బ్లేడ్ ఇండియాను ఏర్పాటు చేశాయి. బ్లేడ్‌కు దేశీ అనుబంధ సంస్థగా 2019లో ప్రారంభమైన కంపెనీ ప్రధానంగా మహారాష్ట్రలో సర్వీసులు అందిస్తోంది. వచ్చే నెల నుంచి కర్ణాటకలోనూ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
రయ్‌రయ్‌మని.. భాగ్యనగరం నుంచి బోయింగ్ విమానాలు..
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుని భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు సుళువుగా సాగేలా మరింతగా విస్తరించనున్నారు. ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి భారీ విమానాలైన బోయింగ్ సర్వీసులు రయ్‌రయ్‌మంటూ రెగ్యులర్‌గా ఎగరనున్నాయి. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 1.20 మంది ప్రయాణిస్తున్నారు. రోజురోజుకి ఈ ఎయిర్‌పోర్టు ద్వారా రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి. కరోనాకి ముందు 2019లో అయితే ఏకంగా 2.10 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టుని ఉపయోగించుకున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల తరహాలో రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి మరింత రద్దీ పెరగబోతుంది. ఇక్కడి నుంచి అమెరికా, యూరప్లకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాలకు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ఏడాదికి 3.4 కోట్ల మంది ఆకాశయానం సాగించే వీలుంది. దీంతో ఆ స్థాయికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టుని భారీగా విస్తరించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎక్కువగా ఉపయోగించే 93 కోడ్ సీ శ్రేణికి చెందిన బోయింగ్ 737, 700, ఏ 320 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అందులో భాగంగా వెస్టర్న్ అప్రాన్‌లో నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల కోసం కొత్తగా 17 కాంటాక్ట్ స్టాండ్లను 57,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వీటితో పాటు ఒక రిమోట్స్టాండ్ రానుంది. ఇక దేశీ విమానాల కోసం ఈస్టర్న్ అప్రాన్‌లో 25,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 17 కమాండ్స్టాండ్లు, నాలుగు రిమోట్ స్టాండ్లు కొత్తగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ని పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత ఒకేసారి 93 కోడ్ సీ శ్రేణికి చెందిన విమానాలను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే అవకాశం కలుగుతుంది. ఇందులో 44 కాంటాక్ట్ స్టాండ్స్ ఉండగా 49 రిమోట్ స్టాండ్స్ ఉండనున్నాయి. విమానాలు నిలిచే సౌకర్యాలు విస్తరించడంతో పాటు ప్రయాణికులు లగేజ్ సులువుగా తీసుకునేందుకు వీలుగా ఓ టన్నెల్ మార్గం కూడా నిర్మించనున్నారు. అంతేకాదు ర్యాపిడ్ ట్యాక్సి ఎగ్జిట్ మార్గాలను సైతం అందుబాటులోకి తేనున్నారు. -
పారిస్ ఎయిర్‌పోర్టుని మరిపించేలా శంషాబాద్‌లో..
తెలంగాణలో ఉన్న జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టుని సర్వహంగులతో ఆధునీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల ఫ్రాన్స్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు, రాయబారులతో కూడిన బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలు, తెలంగాణ ప్రభుత్వం అవంలభిస్తున్న విధానాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే మరో అంశం తెరపైకి వచ్చింది. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల పర్యటన సందర్భంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, హైదరాబాద్ డిప్యూటీ సీఈవో ఆంటోనియో కొంబ్రెజ్ మాట్లాడుతూ.. శంషాబాద్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుని రూ. 6,300 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రతీ ఏడు 34 లక్షల మంది ప్రయాణికుల రద్దీ తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఆధునీకరించబోతున్నట్టు వెల్లడించారు. ఇదే జరిగితే ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న ఓర్లీ ఎయిర్‌పోర్టుకి ధీటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మారుతుంది. ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉంటే మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహం అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే జార్జ్ మోనిన్ సంస్థ హైదరాబాద్‌లో ఉన్న తమ ప్లాంటును రూ. 200 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. ఇదే తరహాలో అనేక కంపెనీలు ఉన్నాయి. వారిని ఆకట్టుకునేలా రాకపోకలకు సంబంధించి శంషాబాద్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయనున్నట్టు వెల్లం్లడించారు. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
Asian Paints: ఏషియన్ పెయింట్స్ విస్తరణ
సాక్షి, అమరావతి: రెండో దశ విస్తరణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ హెడ్ అమిత్ కుమార్‌సింగ్ విజయవాడలో బుధవారం సమావేశమై పలు కీలక అంశాలు చర్చించారు. విశాఖ సమీపంలో తొలి దశలో రూ.1,350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే రెండో దశ విస్తరణ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఏటా 3 లక్షల కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ పూర్తయితే ఈ సామర్థ్యం 5 లక్షల లీటర్లకు చేరుకుంటుంది. అదేవిధంగా మొబైల్ కలర్ అకాడమీ ద్వారా ఏటా 15 వేల నుంచి 17 వేల మందికి పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని, విశాఖ యూనిట్లో ఏటా 75 మంది ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. -
గ్రీన్‌పవర్ దిశగా అడుగులు వేస్తున్న ఐవోసీఎల్..!
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తన రిఫైనరీ కేంద్రాలలో గ్రీన్ పవర్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు రిఫైనరీ కేంద్రాల్లో గ్రీన్ పవర్‌తో ఫ్యూయోల్ ఎక్స్పన్షన్ చేయనుంది. గ్రీన్ పవర్‌ను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని ఐవోసీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 నాటికి సుమారు 500,000 బ్యారెల్ పర్ డేకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ పవర్‌ను ఉపయోగించడంతో కొన్ని భాగాల మానుఫ్యాక్చరింగ్లో డీకార్బోనైజ్ చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మధుర శుద్ధి కర్మాగారంలో 1.6 లక్షల బీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను నిర్మించాలని ఐవోసీఎల్ యోచిస్తోంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రాజస్థాన్‌లో పవన విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉంది. విద్యుద్విశ్లేషణ ద్వారా పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి మథుర శుద్ధి కర్మాగారానికి ఉపయోగించనున్నట్లు పేర్కొంది. సౌర, పవనశక్తి వంటి పునరుత్పాదాకాలను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ వాడకంతో రిఫైనరీలో ఉపయోగించే కార్బన్-ఉద్గార ఇంధనాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిఫైనింగ్,ఇంధన రిటైలింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనుందని తెలిపింది. వచ్చే పదేళ్లలో ఐవోసిఎల్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి వైద్య చెప్పారు. -
భవిష్యత్తు మొత్తం ఈ వాహనాలదే!
ఒకప్పుడు రైలు బండ్లు బొగ్గుతో నడిచేవి, తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చాయి.. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ఇంజన్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇక బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు దాదాపు అన్ని వాహనాలకు పెట్రోలు, డీజిలే ఆధారం. అయితే భవిష్యత్తులో ఇవన్నీ ఎలక్ట్రిక్ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎలా ఉంటుంది. ఈవీలకు సంబంధించి మౌలిక సదుపాయలకు సంబంధించి రాబోతున్న మార్పులపై టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయలు తెలిపారు. అందులో ప్రధాన విషయాలు మీ కోసం.. విస్తరిస్తున్న ఈవీ ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో అడుగు పెట్టాయి. రెండేళ్ల కిందటి నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈవీ టూవీలర్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాదు ఒకప్పుడు ఈవీ వెహికల్స్ ధరలు లక్షకు పైగానే ఉండేవి. ఇప్పుడు వాటి ప్రారంభ ధర రూ. 60,000ల దగ్గరకు వచ్చింది. ధరలే ముఖ్యం మిగిలిన దేశాలతో పోల్చితే భారతీయుల ఆలోచణ ధోరణి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఫీచర్లు, ఆప్షన్లు ఎన్ని ఉన్నా ధర ఎంత అన్నదే ప్రధానం. వస్తువు కొనుగోలులో ధర కీలకంగా మారుతుంది. పది లక్షల రూపాయల లోపు ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాగలిగితే పెను మార్పులు వస్తాయి. ఈవీ కార్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరుగుతాయి. ఆ దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. రాబోయే మూడునాలుగేళ్లలో మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు కూడా ఇదే తరహాలో విభిన్న శ్రేణిల్లో ఈవీ కార్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. టాటావే ఎక్కువ ఈవీ వెహికల్స్‌కి ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్య. ప్రస్తుతం ఈ సమస్యపై మార్కెట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మన దగ్గరున్న పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో టాటావే అధికం. వంద నగరాలతో పాటు జాతీయ రహదారుల వెంట టాటా ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంలో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు తేబోతున్నాం. అంతేకాదు షాపింగ్‌మాల్స్, కాఫీ షాప్స్, పార్కులు... తదితర జనాలు వచ్చి పోయే చోట్ల కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఛార్జింగ్ స్టేషన్లు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి దేశవ్యాప్తంగా 18,000 పెట్రోల్ బంకులలో ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను టాటా పవర్ నిర్మించబోతుంది. వీటికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఇక దేశవ్యాప్తంగా 75 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. మిగిలిన కంపెనీలు కూడా ఇదే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా పబ్లిక్ ప్లేస్‌లలో ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సమస్య రానివ్వం మన దగ్గర పవర్ కట్ సమస్య ఉంది. ముఖ్యంగా రూరల్ ఇండియాలో కరెంటో కోత సర్వసాధారణమైన సమస్య. దీనిపై అవగాహన ఉంది. పవర్ కట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పని తీరుపై ప్రభావం పడకుండా అందుబాటులో కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తాం. పవర్ కట్ వచ్చినా ఛార్జింగ్ స్టేషన్ పని చేసేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం,. - సాక్షి, వెబ్‌డెస్క్ -
40శాతం విస్తరణకు అమెజాన్ కీలక నిర్ణయం
-
అమెజాన్ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కల్పన!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అమెజాన్ తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, అమెజాన్ ఇండియా 11 కొత్త ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ప్రారంభించనుంది. కాగా ప్రస్తుతం ఉన్న 9 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను మరింత విస్తరించనుంది. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, వేర్ హౌస్ సెంటర్లతో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ సిద్ధమైంది. అంతేకాకుండా పదివేల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ.. అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వినియోగదారులకు సేవలనదించడంతో పాటుగా తగినశక్తిని అందించాలనే మా వాగ్ధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో విస్తృత ఎంపిక, వేగవంతమైన డెలివరీతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర, బీహర్, గుజరాత్, అసోం, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. -
మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళన
-
పెట్రోకెమ్, రెన్యూవబుల్స్‌పై గెయిల్ దృష్టి
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, రెన్యూవబుల్స్ విభాగాలలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా చైర్మన్ మనోజ్ జైన్ తాజాగా పేర్కొన్నారు. సహజవాయువు కాకుండా ఇతర విభాగాలలో బిజినెస్‌ను విస్తరించే కొత్త ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ‘2030 వ్యూహాలు’ పేరుతో మెరుగుపరచిన భవిష్యత్ ప్రణాళికలను అనుసరించనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దానికిగాను సరికొత్త ప్రయాణాన్ని సాగించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమలో వస్తున్న మార్పులు, తద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వ్యూహాలు సహకరించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా కొత్త విభాగాలలో విస్తరణ, వృద్ధికి దోహదం చేయగలవని అభిప్రాయపడ్డారు. కంపెనీ దేశీయంగా 70 శాతం గ్యాస్‌ను 13,340 కిలోమీటర్ల పరిధిలో గల ట్రంక్ పైప్‌లైన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేసే సంగతి తెలిసిందే. దేశీయంగా మొత్తం సహజవాయువు అమ్మకాల్లో 55 శాతం వాటా కంపెనీదే. 17.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రూ. 8,800 కోట్లు మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లాలోని ఉసార్‌లోగల ఎల్పీజీ ప్లాంటును పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్‌గా మార్పిడి చేస్తోంది. ఇందుకు రూ. 8,800 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. తద్వారా 2022–23కల్లా 5 లక్షల టన్నుల తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. దీనిలో భాగంగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలీన్‌లకు భవిష్యత్‌లో పెరగనున్న డిమాండును అందుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇక మరోవైపు కంపెనీకి గల 120 మెగావాట్ల పవన, సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను 1 గివావాట్‌కు పెంచుకునే ప్రణాళికలు వేసింది. ఇందుకు రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇతర రంగాలలో విస్తరిస్తున్నప్పటికీ గ్యాస్ బిజినెస్ కీలక విభాగంగా నిలవనున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. వెరసి జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగంగా ప్రాధాన్యతగల సెక్షన్ల ఏర్పాటుకు రూ. 32,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. 7,500 కిలోమీటర్లమేర ఏర్పాటు చేయనున్న లైన్లలో దేశ తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. -
పశ్చిమ గోదావరికి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ విస్తరణ
సాక్షి, అమరావతి: ఏపీ అమూల్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం మరో జిల్లాకు విస్తరించనున్నారు. పశ్చిమ గోదావారి జిల్లాలో పాల సేకరణ నిర్వహించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ నిర్వహించారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 142 గ్రామాల్లో పాల సేకరణ జరగనుంది. పాల సేకరణకు సంబంధించి 15 వేల మంది రైతులను అమూల్ సంస్థ గుర్తించింది. అమూల్ సంస్థ నుంచి పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా అమూల్ సంస్థ నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తుంది -
Vizag Airport: రెక్కలు విచ్చుకున్న విశాఖ విహంగం
ఏపీలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయంగా పౌర విమానాలు రాకపోకలు సాగిస్తుండగా.. మరోవైపు నేవల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగానూ ఎయిర్‌పోర్టు సేవలందిస్తోంది. సేవలు విస్తరించేందుకు సరికొత్త ఆలోచనలు అమలు చేస్తున్న ఎయిర్‌పోర్టు.. మరో ఆరు పార్కింగ్ బేస్‌ల నిర్మాణం పూర్తి చేసింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇండియన్ నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగాలో పౌర విమానయాన సేవలందిస్తోంది. మొత్తం 349.39 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం విస్తరించి ఉంది. దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉంది. సాధారణంగా దాదాపు ప్రతి విమానాశ్రయంలోనూ రన్‌వేకు రెండు వైపుల నుంచి టేకాఫ్, ల్యాండింగ్స్ జరుగుతుంటాయి. కానీ విశాఖలో మాత్రం విమానాశ్రయానికి ఓవైపు పెద్ద కొండ ఉండటం వల్ల ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. 1981లో రోజుకు ఒక విమానం ద్వారా ప్రారంభమైన పౌర సేవలు ప్రస్తుతం సుమారు 70 వరకు చేరుకున్నాయి. అయితే కోవిడ్ కారణంగా కేవలం 14 సర్వీసులు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. భవిష్యత్తులో రాకపోకలు పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టారు. ఏక కాలంలో 16 విమానాల రాకపోకలు బ్రిటిష్ కాలంలో 4 పార్కింగ్ బేస్ ఉండేవి. తరువాత మరో 6 పార్కింగ్ బేస్‌లు నిర్మించారు. గతంలో ఉండే రన్‌వే వినియోగించే అవకాశం లేదు. ఇప్పుడు ఒకే రన్‌వే ఉంది. దాన్ని నేవీతో సంయుక్తంగా వినియోగిస్తున్నారు. రన్‌వేపై వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. నేవీ టవర్ కంట్రోల్ రూమ్‌తో రన్‌వేను అనుసంధానం చేశారు. ఎవరైనా రన్‌వే పైకి వెళ్లాలంటే రక్షణ దళ అనుమతి తప్పనిసరి. యాప్రాన్, హ్యాంగర్స్, టెర్మినల్‌కు రన్‌వేలో ఉన్న విమానంతో అనుసంధానమయ్యేలా ఉండే ట్యాక్సీ వేలు కూడా నేవీ భాగంలోనే ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా మరో కొత్త ట్యాక్సీ ట్రాక్ నిర్మించారు. దీనికితోడు తాజాగా మరో ఆరు పార్కింగ్ బేస్‌ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇవి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే మొత్తం 16 విమానాలు ఏక కాలంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదికగా విశాఖ నిలుస్తోంది. దీనికితోడు రాష్ట్ర కార్యనిర్వాహక రాజ«ధానిగా కొత్త రూపుదాల్చనుంది. దీనికితోడు కొత్త రైల్వే జోన్, పోర్టులు, జలరవాణా, జాతీయ రహదారులు ఇలా విశిష్ట సామర్థ్యమున్న విశాఖకు కాలానుగుణంగా కనెక్టివిటీ పెరగాల్సి ఉంది. అయితే నేవీ ఇచ్చిన స్లాట్స్ ప్రకారం 85 విమానాల కంటే ఎక్కువ నడపలేని పరిస్థితి ఉంది. ఈ స్లాట్ పెరగాలంటే.. లిమిటేషన్ పెంచాలి. అది పెరగాలంటే రన్‌వే హ్యాండ్లింగ్ కెపాసిటీ పెంచాలి, ఆక్యుపేషన్ టైమ్ తగ్గించాలి. రన్‌వే ఎఫిషియన్సీ పెంచాలి. ఇది పెరిగితే ప్రస్తుతం ఉన్న గంటకు 10 రాకపోకల స్లాట్‌లో పాసింజర్ విమానాల సామర్థ్యం 16కి పెరుగుతుంది. రన్‌వే హ్యాండ్లింగ్ పెరిగి, ఆక్యుపేషన్సీ తగ్గి 50 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న 85 విమానాల రాకపోకల కెపాసిటీ 123కు చేరుకుంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలకూ కనెక్టివిటీ ఫ్లైట్స్ పెరుగుతుంది. అప్పుడు ఇతర నగరాలకు రాకపోకలు విస్తరించవచ్చు. డిమాండ్ ఉన్న సమయాల్లో మరిన్ని ఫ్లైట్స్‌కు స్లాట్స్ కేటాయించవచ్చు. ట్యాక్సీ ట్రాక్‌ల పెంచినప్పుడు ల్యాండింగ్ అయ్యే విమానాలు.. వెంట వెంటనే వచ్చి వెళ్లిపోయే అవకాశముంది. దీని వల్ల రన్‌వేపై ఆక్యుపెన్సీ టైమ్ తగ్గుతుంది. దీనివల్ల స్లాట్ సామర్థ్యం మరింత పెరిగి పాసింజర్ ఫ్లైట్స్ పెరగవచ్చు. కొత్త ట్యాక్సీట్రాక్ నిర్మాణం పూర్తి కావడంతో దీనికి మార్గం సుగమమైంది. సమగ్రాభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం.. విశాఖ విమానాశ్రయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. దీనికి సంబంధించిన ప్లాన్స్ సిద్ధమయ్యాయి. కీలక అడుగులకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. వాణిజ్య కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టైర్–2, టైర్–3 టైర్–4 దేశీయ ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ కోసం ఫ్లైట్స్ నడిపేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కోవిడ్ భయం పూర్తిగా తొలగిపోయాక.. అత్యధిక ఫ్లైట్స్ నడిపేందుకు సన్నద్ధమవుతాం. దీనికి తోడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్తో పాటు కార్గో సేవలు విస్తరించేందుకు చెయ్యాల్సిన అభివృద్ధిపై ప్రస్తుతం దృష్టి సారించాం. కొత్తగా నిర్మించిన పార్కింగ్ బేస్‌లు, ట్యాక్సీ ట్రాక్లని త్వరలోనే ప్రారంభిస్తాం. ఎయిర్లెన్స్తో పాటు నేవీ నుంచ తేదీ ఖరారు చేసిన తర్వాత వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. – రాజాకిశోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
భవిష్యత్తులో భారత్ మంచి మార్కెట్ కానుంది: కేఎఫ్‌సీ
న్యూఢిల్లీ: అమెరికా ఆధారిత ఫాస్ట్ ఫుడ్ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ)భారతదేశంలో తమ రెస్టారెంట్ వ్యాపార నెట్‌వర్క్‌ను విస్తరింపజేయాలని ఆలోచిస్తోంది. కరోనావైరస్ కారణంగా తమ వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులను చోటుచేసుకునప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కేఎఫ్‌సీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతందని నమ్ముతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మా బ్రాండ్‌ను విస్తరింపచేయడమే మా ప్రధాన లక్ష్యం. మా కస్టమర్లకు అన్నిరకాల అందుబాటులో ఉంటూ మా బ్రాండ్ విలువను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు. కోవిడ్ రాకముందు కేఎఫ్‌సీకి ఇండియాలో రెస్టారెంట్ల సంఖ్య 450 గా ఉండేది. ప్రస్తుతం130 కి పైగా నగరాల్లో 480 కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. భవిష్యత్తులో కేఎఫ్‌సీ మరింత అందుబాటులోకి రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా కేఎఫ్‌సీకి భారత్ మంచి మార్కెట్ అవుతుందనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు. మహమ్మారి కారణంగా ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చేలా కేఎఫ్‌సీ ఇండియా తన ప్రయత్నాలను వేగవంతం చేసిందని ఆయన అన్నారు. కోవిడ్ ప్రారంభం నుంచి ప్రస్తుతం వరకు చూస్తే మా ఆన్లైన్ వ్యాపారం కనీసం 50 శాతం పెరిగిందని మేము భావిస్తున్నాము. మరోవైపు, కోవిడ్ ప్రభావం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదనే చెప్పాలి. మాల్స్, ఫుడ్ కోర్టులలో మా కస్టమర్ల రాకను కోవిడ్‌కు ముందు పోల్చి చూస్తే ప్రస్తుతం తక్కువగా వస్తున్నారని గమనించాము. తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. కోవిడ్-19 రెండవ వేవ్ గురించి మాట్లాడుతూ సంస్థ గత సంవత్సరం ఎదుర్కున్న పరిస్థితుల నుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకున్నాం. ప్రస్తుతం ఆహార భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్, కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ డెలివరీలు లాంటివి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలిపారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా డైనింగ్ హాళ్లను మళ్లీ తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి వచ్చినా, మా కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకుంటామని మీనన్ అన్నారు. -
ఆరోగ్యశ్రీ విస్తృతం
కరోనాతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు కొన్ని నెలలపాటు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని (కోవిడ్)తో కలిసి ఎలా బతకాలన్న దానిపై అంద రికీ అవగాహన కల్పించాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. అలాగే.. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అన్న వాటిపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలి. 85 శాతం కరోనా కేసులకు ఇంట్లోనే ఉండి వైద్యం పొందవచ్చు. మిగిలిన 15 శాతంలో కూడా కేవలం 4 శాతం కేసులకు మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదని.. అలా జరగకూడదనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పలు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నాడు అరకొర సేవలు.. రూ.680 కోట్లు బకాయిలు ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ మరో అడుగు ముందుకు వేశామని.. దీని పరిధిని విస్తృతంగా పెంచుకుంటూపోతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకంలో కేవలం 1,059 వైద్య సేవలు మాత్రమే అందేవని, అవి కూడా అరకొరగానే ఉండేవని సీఎం వివరించారు. అలాగే, నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.680 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టారని.. తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ చెల్లించేశామన్నారు. ఇంకా ఆయా ఆస్పత్రుల ద్వారా మెరుగైన సేవలందేలా చర్యలు చేపట్టామని వైఎస్ జగన్ చెప్పారు. పేదలు గర్వంగా తలెత్తుకుని చికిత్స చేయించుకుని, సంపూర్ణారోగ్యంతో డిశ్చార్జ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. డాక్టర్లు, ఆసుపత్రులు పేదలను చిన్నచూపు చూడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెల్లింపులన్నీ గ్రీన్ ఛానల్లో అందజేస్తున్నామని సీఎం చెప్పారు. మరిన్ని వైద్య సేవలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో 1,259 వైద్య సేవలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టులో మొత్తం 2,200 రకాల సేవలు అందుతున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ 2,200 సేవలను ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న ఆయన.. నవంబర్ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. అంతేకాక.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం అమలుచేస్తున్నామని.. తొలిసారిగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ కార్డులో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఇప్పటికే 1.38 కోట్ల కార్డులను పంపిణీ చేశామని.. మిగిలిన 4 లక్షల కార్డుల ముద్రణా పూర్తయిందని, వీలైనంత త్వరగా వలంటీర్ల ద్వారా వాటిని అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘నాడు–నేడు’తో ఆస్పత్రులకు కొత్తరూపు ఇక ఆరోగ్యశ్రీలో ఓ పక్క మంచి వైద్యం అందిస్తూనే.. మరోపక్క నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు ఉండగా, కొత్తగా మరో 16 ఏర్పాటుచేస్తున్నామన్నారు. అలాగే.. దాదాపు రూ.16 వేల కోట్ల వ్యయంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు, కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని సీఎం వివరించారు. అన్ని ఆస్పత్రులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. గతంలో కేవలం 230 రకాల మందులు మాత్రమే ఇస్తుండగా, జనవరి నుంచి 510 రకాల మందులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. 13వేల విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు గ్రామ సచివాలయాల పక్కనే అన్ని గ్రామాలలో 13 వేల వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. వాటిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు రోజంతా అందుబాటులో ఉంటారని, అవి రెఫరల్ ఆస్పత్రులుగా పనిచేస్తాయని తెలిపారు. వాటిల్లో 54 రకాల మందులు కూడా ఉంటాయని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇస్తున్నామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఇలాంటి వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్లు ఇస్తున్నామని.. లెప్రసీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, పక్షవాతంతో మంచానికి.. వీల్చైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 65 లక్షల మంది పిల్లలకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పిల్లలకు వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద వైద్య పరీక్షలు చేశామని.. వారిలో 1.58 లక్షల మందికి కళ్లజోళ్లు అవసరమని తేలితే.. 1.29 లక్షల మంది పిల్లలకు వాటిని ఇచ్చామని, మిగిలిన 29 వేల కళ్లజోళ్లు కూడా ఈ నెలాఖరు నాటికి ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు. 2,621 మంది పిల్లలకు ఆపరేషన్లు అవసరమని తేలిందన్న ఆయన.. వారికి కూడా స్కూళ్లు తెరిచాక, సెలవులు వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. ఇది తన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అంశమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కలెక్టర్లకు దిశానిర్దేశం.. ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లు ఆరోగ్యశ్రీ పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఎటువంటి సమస్యలు లేకుండా ఈ పథకం ద్వారా 2,200 వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ నిర్దేశించారు. కరోనాపై ప్రత్యేక డ్రైవ్ రాష్ట్రాల సరిహద్దులు తెరుస్తున్నారని, అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని, అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? అన్న దానిపై ప్రజలందరికీ తెలిసేలా కలెక్టర్లు ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్దేశించారు. అలాగే, తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు.. ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజెస్, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి ఇంకా బాగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున్‌తో పాటు, జిల్లాల నుంచి కలెక్టర్లు పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సలను చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వం హయాంలో 1,059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం ఆ సంఖ్యను భారీగా పెంచింది. ► తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 2,059 చికిత్సలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ► ఆ తర్వాత మరో 54 క్యాన్సర్ చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చారు. తాజాగా 87 చికిత్సలను తెస్తూ జీవో ఇచ్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 2,200కు చేరింది. ఈ చికిత్సలు పశ్చిమగోదావరితో పాటు జూలై 16 నుంచి మరో ఆరు జిల్లాల్లో (విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్) జిల్లాల్లో అమల్లోకి వచ్చాయి. ► తాజాగా అనుమతి ఇచ్చిన 87 చికిత్సల్లో 53 ఇన్‌పేషెంటు చికిత్సలు, 29 స్వల్పకాలిక చికిత్సలు, మరో 5 డే కేర్ (ఔట్‌పేషెంటు తరహా) సేవలు ఉన్నాయి. ► వీటిలో యూరినరీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సర్జరీ, కంటి చికిత్సలు, ఈఎన్టీ సమస్యలు, జనరల్ సర్జరీ వంటివి ఉన్నాయి. ► కనిష్టంగా రూ. 1,000 నుంచి రూ. 45 వేల వరకూ ఈ చికిత్సలకు వ్యయమవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించి ఆరోగ్యశ్రీ సీఈవో నివేదిక ఇచ్చారని, ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. -
త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ..!
-
అరబిందో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: అరబిందో ఫార్మా విస్తరణ ప్రణాళికకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.250 కోట్ల మూలధన వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఉత్పత్తి కేంద్రానికి సోమవారం గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 583.31 టీపీఎం (ఒక నెల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం టన్నులు) భారీ ఔషధాలు, ఇంటర్మీడియట్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ అనంతరం ఇది 1,518.3 టీపీఎంకు చేరుతుందని వివరించింది. ఈ యూనిట్లో 8.85 మెగావాట్ల క్యాపిటివ్ పవర్ ప్లాంటును సైతం నెలకొల్పనుంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యల కోసం రూ.32.77 కోట్లుగా అంచనావేసింది. ప్రాజెక్ట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 120 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనున్నట్లు వెల్లడించింది. -
టీటీడీలో భారీగా పెరిగిన దుబారా ఖర్చు
-
విస్తరణ బాటలో ఐడబ్ల్యూజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కో–వర్కింగ్ స్పేస్ రంగంలో ఉన్న ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) దేశంలో విస్తరణ బాట పట్టింది. ప్రస్తుతం 110 దేశాల్లో 3,300 కో–వర్కింగ్ స్పేస్ స్టేషన్లున్న ఐడబ్ల్యూజీకి మన దేశంలో 16 నగరాల్లో 120 కార్యాలయాలున్నాయి. వచ్చే 36–48 నెలల్లో 240 కార్యాలయాలకు విస్తరించాలని లకి‡్ష్యంచింది. వీటిల్లో ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 కో–వర్కింగ్ కార్యాలయాలున్నాయని.. వీటిని 20కి చేర్చాలన్నది లక్ష్యమని ఐడబ్ల్యూజీ కంట్రీ మేనేజర్ హర్‡్ష లాంబ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నామని.. ఇందులో సింహా భాగం పెట్టుబడులు ఇండియాలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నా రు. హైదరాబాద్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ వెకెన్సీ స్థాయి చాలా తక్కువగా ఉందని.. ఇదే కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్‌కు కారణమని చెప్పారు. వచ్చే నెలలో నగరంలో 60 వేల చదరపుటడుగుల్లో 500 సీటింగ్ సామర్థ్యంతో కో–వర్కింగ్ స్పేస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐడబ్ల్యూజీకి 25 లక్షల కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. మన దేశంతో పాటూ 100కు పైగా కో–వర్కింగ్ స్టేషన్లు జపాన్, చైనా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. -
విస్తరణ బాటలో.. మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో 11వ ఆసుపత్రిని 350 పడకల సామర్థ్యంతో నెలకొల్పింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఈ నెల 24న ఆరంభిస్తారు. అశోక గ్రూప్‌తో కలిసి ఈ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు మ్యాక్స్‌క్యూర్ ఎండీ జి.అనిల్ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మెడికవర్ బ్రాండ్‌తో రానున్న ఈ ఆసుపత్రికి స్థలం, మౌలిక వసతులను అశోక గ్రూప్ సమకూరుస్తోంది. వైద్య పరికరాల ఏర్పాటు, ఆసుపత్రి నిర్వహణను మ్యాక్స్‌క్యూర్ చేపడుతుంది. మరో 1,000 పడకలు.. మ్యాక్స్‌క్యూర్ గ్రూప్‌లో మ్యాక్స్‌క్యూర్, మై క్యూర్, సింహపురి, మెడికవర్ బ్రాండ్లలో హైదరాబాద్, వైజాగ్, కర్నూలు, కరీంనగర్, నిజామాబాద్, నెల్లూరు, సంగారెడ్డిలో ఆసుపత్రులున్నాయి. నాసిక్‌తో కలిపి మొత్తం పడకల సామర్థ్యం 2,000కు చేరుకుంది. ఏడాదిలో మరో 600 పడకలు జతకూడతాయని అనిల్ కృష్ణ చెప్పారు. ‘‘ముంబై, పుణే నగరంతోపాటు కర్ణాటకలోనూ విస్తరిస్తాం. పాత ఆసుపత్రుల కొనుగోలు లేదా కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 2020 నాటికి 3,000 పడకల సామర్థ్యానికి చేరుకుని టాప్–5 వైద్య సంస్థల్లో ఒకటిగా నిలుస్తాం’’ అంటూ భవిష్యత్తును ఆవిష్కరించారు. మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ లో యూరప్‌కు చెందిన దిగ్గజ హెల్త్‌కేర్ సంస్థ మెడికవర్‌కు 42 శాతం వాటా ఉంది. కొత్త ఆసుపత్రులన్నీ మెడికవర్ బ్రాండ్‌తో రానున్నాయి. మూడు ప్రత్యేక సెంటర్లు.. క్యాన్సర్ కేర్‌కు మూడు ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పుతున్నట్టు మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ సీఈవో పి.హరికృష్ణ చెప్పారు. ‘హైదరాబాద్, నెల్లూరు, కర్నూలులో ఇవి వస్తాయి. వీటికి రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. 2018–19లో రూ.600 కోట్లు ఆశిస్తున్నాం. వైద్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 5,800 మంది ఉద్యోగులున్నారు. 2020–21 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది టార్గెట్. ఆ సమయానికి ఉద్యోగుల సంఖ్య 9,000 దాటుతుంది’ అని వివరించారు. -
ఛత్తీస్‌గఢ్‌కు పల్సస్ విస్తరణ
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కంపెనీ పల్సస్ తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు విస్తరించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు భేటి అయిన సందర్భంగా ఈ విషయమై ఇరువురి మధ్యా ఒక అంగీకారం కుదిరినట్లు పల్సస్ తెలియజేసింది. వచ్చే ఏడాది కాలంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్... పల్సస్, ఒమిక్స్ సారథ్యంలో దంతేవాడ, రాజ్‌నందగావ్, రాయ్‌పూర్‌లో రానున్న సెజ్‌లలోని 3 కేంద్రాల్లో 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని శ్రీనుబాబు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని హిందీలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పల్సస్‌కు దేశంలోని 7 సెజ్ యూనిట్లలో కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులున్నారు. ఇంకా యూకే, సింగపూర్, బెల్జియంలలోనూ సేవలందిస్తోంది. -
విస్తరణ బాటలో వాల్‌మార్ట్
లక్నో: ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్... తన స్టోర్లను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో మరో 20 హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సోమవారం లక్నోలో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ ఈ విషయం చెప్పారు. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను పెంచడం ద్వారా ఆన్లైన్ బిజినెస్–టూ–బిజినెస్ (బీటూబీ) కస్టమర్లకు విస్తృత సేవలందించే అవకాశం లభిస్తుందన్నారు. వేగంగా పెరుగుతున్న ఈ–కామర్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘ఈ ఏడాదిలో రెండు, వచ్చే ఏడాదిలో 8, ఆ తరువాత ఏడాదిలో 10 స్టోర్లను ప్రారంభించడం ద్వారా వచ్చే మూడేళ్లలో మరో 20 స్టోర్లను భారత్‌లో ప్రారంభిస్తాం. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో 50 స్టోర్లను ప్రారంభిస్తాం. ’బెస్ట్‌ప్రైస్’ పేరుతో ఇప్పటికే భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాలలో 21 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లున్నాయి. రానున్న కాలంలో 15 స్టోర్ల ఏర్పాటుకు యూపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. తాజా ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ద్వారా 1,500 మందికి ఉద్యోగాలొచ్చాయి. పరోక్షంగా ఎస్ఎంఈ సప్లయర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వాల్‌మార్ట్ ఇండియా వ్యాపారంలో సగం వరకు స్టోర్ రహిత, అవుట్ ఆఫ్ స్టోర్ అమ్మకాల ద్వారా జరుగుతుంది.‘ అని వివరించారు. -
ఎయిర్‌పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ విస్తరణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ.55 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. మరో పది రోజుల్లో పనుల శంకుస్థాపనకు శ్రీకారం జరపాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గోకే పరిమితం చేసి ప్రయాణాలన్నీ భోగాపురం వైపు సాగిస్తారన్న ప్రచారానికి తెరపడినట్లయింది. టెర్మినల్ విస్తరణ ఇలా... విశాఖ విమానాశ్రయంలో ఇప్పటికే వంద కోట్లతో అంతర్జాతీయ టెర్మినల్ భవంతి, 10,030 అడుగుల పొడవున రన్‌వే అభివృద్ధి జరిగింది. మూడు ఏరో బ్రిడ్జిలు, పార్కింగ్ బేస్‌లు విస్తరించింది. ఆరు పార్కింగ్‌బేలు ఇప్పటికే ఉండగా, మరో ఆరు పార్కింగ్ బేలు విమానాలు నిలుపుదలకు ఇటీవల సిద్ధం చేశారు. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో టెర్మినల్ బిల్డింగ్ ఎటూ చాలడం లేదు. లోపల రద్దీ పెరిగిపోయి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటోంది. ఈ తరుణంలో ఇక్కడి టెర్మినల్ బిల్డింగ్‌ను రెండు వైపులా 75 స్క్వేర్ మీటర్ల చొప్పున తూర్పు, పశ్చిమ దిశల్లో పదివేల స్క్వేర్ మీటర్ల విస్తరణ చేపట్టాలని పౌరవిమానయానశాఖ నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు ఖరారు చేసింది. ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే మార్కింగ్‌లు ఇచ్చేశారు. మరో పది రోజుల్లో పనులకు శ్రీకారం జరపాలని ఆశాఖ ఢిల్లీ నుంచి ఆదేశాలిచ్చింది. రన్‌వే మరో 300 అడుగులు విస్తరణ ఇదిలా ఉండగా ఇక్కడి రన్‌వేను మరో 300 అడుగులు విస్తరించడంతో పాటు మరో మూడు లగేజ్ బెల్టులు, మరో మూడు ఏరో బ్రిడ్జిలు ఏర్పాటుకు కూడా ప్రణాళికలు చేసింది. ఇప్పటికే దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, పోర్టుబ్లెయిర్, కొలంబో నుంచి అంతర్జాతీయ విమానాలు ఇక్కడ వాలుతుండగా, ఇంకా ఇక్కడ బోయింగ్ 747, ఎయిర్‌బస్ 340, ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ వంటి విమానాలు ఇక్కడ దించడానికి ఆయా విమాన సంస్ధలు ఉవ్విళ్లూగుతుండడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రేడ్ విమానాశ్రయాలంటే... సాధారణంగా చిన్నపాటి విమానాశ్రయాలను పౌరవిమానయానశాఖ బీ గ్రేడ్‌గా గుర్తిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ప్రయాణికుల రద్దీ 15 లక్షలు దాటితే ఏ గ్రేడ్ విమానాశ్రయంగా గుర్తింపునిస్తుంది. దీని వల్ల విమానాశ్రయం అభివృద్ధి అనూహ్యంగా పెరగడంతో పాటు ప్రపంచస్ధాయి అందాలు, సదుపాయాలూ చేకూరుతాయి. ఆ రకంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాదు తదితర విమానాశ్రయాలు గుర్తింపు పొందాయి. విశాఖ విమానాశ్రయంలో 2015–16లోనే 15లక్షలుదాటి ప్రయాణాలు సాగించిన తరుణంలో కేంద్రం ఆ స్థాయిని అప్పుడే ఇచ్చేసింది. గడచిన ఏడాదిలో 24,09,712 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఇక్కడి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించడం విశేషం. ఇలాంటి తరుణంలో విమానాశ్రయానికి డీజీఎం స్థాయి హోదా కాకుండా ఏ గ్రేడ్ హోదాకి తగ్గట్టు ఇక్కడ సీనియర్ జనరల్ మేనేజర్ హోదా ఉన్న ప్రకాష్‌రెడ్డిని కేంద్రం నియమించింది. -
బైపాస్ గుబులు
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించడంతో ఆ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 60 కిలోమీటర్ల పరిధిని ఒక భాగంగా.. మన్నెగూడ నుంచి మరో భాగంగా విభజించారు. విస్తరణకు మొదటి దశలో రూ.400 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో భాగంగా పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డులో 16 అండర్‌పాస్‌లు, రెండు బైపాస్‌లు, ఒక టోల్‌గేటు ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి భూసేకరణ పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. బైపాస్‌తో భూములు కోల్పోనున్న రైతులు చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్డు నిర్మించేందుకు చేవెళ్ల, కేసారం, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి గ్రామాలకు చెందిన 120 మందికిపైగా రైతులకు సంబంధించిన దాదాపు 90 ఎకరాల పట్టా భూములు కోల్పోతున్నారు. ఇందులో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో భూముల ధరలు ఆకాశాన్నంటినా.. పొలాలను అమ్మకుండా కాపాడుకుంటున్న రైతులు ఇప్పుడు రోడ్డు విస్తరణలో భూములు పోతుండడంతో అయోమయంలో పడ్డారు. తమ బతుకులను అన్యాయం చేసే రోడ్డు తమకొద్దని అంటున్నారు. రోడ్డు విస్తరణలో మొత్తం 60 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 450 ఎకరాల భూమి అవసరం ఉందని అధికారులు గుర్తించారు. స్పష్టత ఇవ్వని అధికారులు నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా భూముల సేకరణకు సంబంధించి రైతులకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందుతుందని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం తమకు పరిహారం వద్దు.. భూమికి బదులు భూమి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధికారులు అంగీకరపత్రాలపై సంతకాలు చేయాలంటూ రైతుల వద్దకు వెళ్తున్నారు. సర్వం కోల్పోతున్నాం.. బైపాస్ రోడ్డులో నా రెండు ఎకరాల భూమి పోతుంది. నాలుగు ఎకరాలు ఉంటే అందులో మధ్య నుంచి రోడ్డు పోవడంతో రెండు ఎకరాలు భూమిపోతుంది. దీంతో ఉన్న రెండు ఎకరాలు రోడ్డుకు ఇరువైపులా మిగులుతుంది. వ్యవసాయ బావి పోతుంది. ఎలా బతకాలి. – గుడిసె రాములు, బాధిత రైతు, చేవెళ్ల చట్ట ప్రకారం భూసేకరణ చట్ట ప్రకారమే భూసేకరణ చేస్తున్నాం. ఇప్పటికే రైతుల వివరాలతో ప్రకటనలు విడుదల చేశాం. చట్ట ప్రకారం రైతులకు పరిహారం వస్తుంది. అది రెండితలా, మూడింతలా అనేది నిబంధనల ప్రకారం ఉంటుంది. అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా పోరాడవచ్చు. – వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, చేవెళ్ల