
సాక్షి, అమరావతి: ఏపీ అమూల్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం మరో జిల్లాకు విస్తరించనున్నారు. పశ్చిమ గోదావారి జిల్లాలో పాల సేకరణ నిర్వహించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ నిర్వహించారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 142 గ్రామాల్లో పాల సేకరణ జరగనుంది. పాల సేకరణకు సంబంధించి 15 వేల మంది రైతులను అమూల్ సంస్థ గుర్తించింది. అమూల్ సంస్థ నుంచి పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా అమూల్ సంస్థ నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తుంది
Comments
Please login to add a commentAdd a comment