milk products
-
నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?
రోజువారీ జీవితంలో పాలు పెరుగు లేకుండా పొద్దు గడవదు. చాయ్ రూపంలో లేదా పెరుగు రూపంలోనో పాలను తీసుకోకుండా ఉండలేం. అందులోనూ ఆఫీస్‌కి వెళ్లేవాళ్లకు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అలాగే పెరుగన్నం తినకుండా భోజనం పూర్తి అయ్యిన ఫీల్ రాదు చాలామందికి. అయితే డాక్టర్లు మాత్రం ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే బరువు సులభంగా తగ్గుతారు అంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. అంతేగాదు ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మన ఆరోగ్యంలో గొప్ప మెరుగైన మార్పులు సంభవిస్తాయని అన్నారు. అదేంటి పౌష్టికాహారం అయిన పాలే మానేయాలా? ఏంటిదీ..? ఒక నెల రోజుల పాటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేందుకు సిద్ధపడితే మంచి మెరుగైన ఫలితాలు అందుకోగలరని వైద్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ డైరీ ఫ్రీ ప్రయోగం మంచి సత్ఫతితాలనిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు యశోధ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే డైరీ ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉంటే ఆహారం నుంచి అదనపు సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాయని అన్నారు. ఈ డైట్ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మెరుగ్గా ఉంచుతుందని చెబుతున్నారు. జస్ట్ మూడు వారాల్లోనే దీని ప్రయోజనాలు మన శరీరంలో కనిపించడం మొదలవుతుందని తెలిపారు. అంతేగాదు గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం వంటి రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు. అలాగే ఈ డైరీ ఉత్పత్తులు మన ఆహారంలో తగ్గిచడం ప్రారంభిస్తామో అప్పుడూ వెంటనే మన బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డైట్ ప్రభావం వ్యక్తులు మధ్య వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడూ పోషకలోపాలను భర్తీ చేసేలా సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవడం ముఖ్యం. అదే సమయంలో డైరీ ఉత్పత్తులను తగ్గిస్తే గట్ బ్యాక్టీరియా యాక్టివిటీలో మార్పులు వస్తాయాని, అవి ప్రతికూలం లేదా సానుకూలమైన కావొచ్చు. ఇది వ్యక్తలు ఆరోగ్య స్థితిని బట్టి ఆయా ఫలితాలు రావడం జరగుతుందని చెబుతున్నారు వైద్యులు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగపడి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మెటిమల సమస్య నివారణవవుతుంది. అయితే చర్మం మెరుగుదలకు అవసరమైన పాల ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని హర్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల్లో ఎముకల ఆరోగ్యానికి మూలమైన కాల్షియం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడూ ఆ భర్తీని కాల్షియం, విటమిన్ డీ వంటి ప్రోటీన్ పోషకాలు అందించే బాదం, టోఫు, బ్రోకలీ, అత్తి పండ్లను, పొద్దుతిరుగుడు విత్తనాలతో పొందొచ్చు. ఇక్కడ పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే డైట్ అనుసరించాలనుకుంటే ఆ పాలల్లో ఉండే కాల్షియంని పొందేలా ప్రత్యామ్నాయా ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం. పాల వినియోగంతో ముడిపడే ఉండే రొమ్ము, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్లు వటి వ్యాధులు దరిచేరవని తెలిపారు. అలాగే జీవక్రియ, నిద్ర, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేగాక కొందరూ వ్యక్తులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నవారు కూడా ఉన్నారన్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగపడి పలు విధాల అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతామని పేర్కొన్నారు. ఈ పాల ఉత్పత్తులను తగ్గించిన వెంటనే కొందరిలో శ్లేష్మం తగ్గి శ్వాసకోస సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఫలితాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందని, అందువల్ల ఈ డైట్‌ఫాలో అయ్యేటప్పుడూ డ్రైరీ ప్రోటీన్లకూ దూరంగా ఉండటం వల్ల వచ్చే అసహనాన్ని ఓపిగ్గా ఎదుర్కొంటూ ఫాలో అయితే మంచి ఫలితాలను పొందుతారని వైద్యుల సూచిస్తున్నారు. (చదవండి: -
పండగొస్తుంది.. తియ్యటి వేడుక చేసుకుందాం, చమ్చమ్తో
చమ్‌చమ్ తయారీకి కావలసినవి వెన్నతీయని ఆవుపాలు – నాలుగు కప్పులు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; మైదా – టేబుల్ స్పూను; చక్కెర – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఎనిమిది కప్పులు; యాలకులు – రెండు; నెయ్యి – టీస్పూను; పాలు – పావు కప్పు; క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; పాలపొడి – అరకప్పు; కుంకుమ పువ్వు కలిపిన పాలు – రెండు టేబుల్ స్పూన్లు; చక్కెరపొడి –టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; ట్యూటీఫ్రూటీ –మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ► పాలను చక్కగా కాయాలి..కాచిన పాలల్లో నిమ్మరసం వేసి విరగగొట్టి.. పన్నీర్‌ను వేరు చేసి పక్కనపెట్టుకోవాలి. ► అరగంట తరువాత పన్నీర్ మిశ్రమంలో మైదా వేసి ముద్దలా కలపాలి ∙ముద్దను పొడవాటి రోల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు పంచదారలో ఎనిమిది కప్పులు నీళ్లుపోసి 10 నిమిషాలు మరిగించాలి. ► తరువాత యాలకులు, పన్నీర్ రోల్స్‌ను వేసి పదిహేను నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నెయ్యి, పావు కప్పు పాలు పోసి మరిగించాలి. ► రెండు నిమిషాల తరువాత క్రీమ్ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, పంచదార పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కబడినప్పుడు దించేస్తే కోవా రెడీ. ► ఇప్పుడు సుగర్ సిరప్‌లో ఉడికించిన రోల్స్‌ను బయటకు తీసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చల్లారిన కోవా మిశ్రమాన్ని స్టఫ్చేసి గాటుని మూసేయాలి. ► ఈ రోల్స్‌కు కొబ్బరి తురుము అద్ది, పైన టూటీఫ్రూటీపెట్టాలి ∙ఇలా అన్నీ రోల్స్‌ను చేస్తే చమ్‌చమ్ రెడీ. -
తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ యాంకర్ రాణిస్తున్న రష్మీ తరచూ తన కామెంట్స్ వార్తల్లోకి ఎక్కుతుంది. జంతు ప్రేమికురాలైన ఆమె జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన స్పందిస్తుంది. సోషల్ మీడియా సదరు సంఘటనలకు వ్యతిరేకంగా తన గొంతును వినిపిస్తుంది. ఇటీవల జరిగిన అంబర్పేట్ వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై ఆమె స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. అనంతరం కుక్కలు కూడా మనలాగే ప్రాణులని వాటికి సపరేటు వసతి కల్పించాలంది. దీంతో అంతా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రష్మీ మరో ఘటనపై స్పందించింది. పాల ఉత్పత్తుల కోసం పలు సంస్థలు జంతువులను హింసిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాల ఉత్పత్తుల తయారి విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని ఎవరు వినియోగించద్దోని, పాల ఉత్త్పత్తులను బ్యాన్ చేయాలంటూ రష్మీ వివాదస్పద ట్వీట్ చేసింది. ఇక దీనిపై స్పందించిన ఓ నెటజన్ గతంలో ఆమె ప్రమోట్ చేస్తూ ఒపెన్ చేసిన ఐస్‌క్రిం పార్లర్ ఫొటోలను షేర్ చేసి రష్మీకి చురక అట్టించాడు. ‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఆ తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని కామెంట్స్ చేశాడు. అతడిపై పోస్ట్‌పై రష్మీ స్పందిస్తూ.. ‘‘అవును.. గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను. అయితే అవి తెలుసుకున్నాను. కొన్నాళ్ల నుంచి నేను పాలు తాగడం మానేశా. పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను. అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం కూడా ఆపేశాను’’ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2 — rashmi gautam (@rashmigautam27) March 2, 2023 చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అమిగోస్ ఓటీటీ డేట్ ఫిక్స్? ఎప్పుడు.. ఎక్కడంటే! -
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ..
సాక్షి, నల్గొండ: అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంపాదనే ధ్యేయంగా తాగే నీటి నుంచి పాలు, అల్లం తదితర నిత్యావసరాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బీబీనగర్ మండలం హైదరాబాద్ దగ్గరగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ పదార్థాలను మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లతో పాటు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దీంతో బీబీనగర్ మండలం రోజురోజుకు కల్తీకి కేరాఫ్‌గా మారుతోంది. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో కల్తీ పాల తయారీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. గతంలో మండలంలోని బీబీనగర్, జైనపల్లి, కొండమడుగు గ్రామాల్లోని కొందరు అక్రమార్కులు పొలాల్లో చల్లే యూరియా వాడి పాలను కల్తీ చేసేవారు. ఇప్పుడు ఏకంగా మనుషుల శవాలను భద్రపరిచేందుకు వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను కలుపుతుండటాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తాజాగా మండలంలోని మొబైల్ టెస్టింగ్ వ్యాన్‌తో చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. కొండమడుగు గ్రామంలోని ఓ పాల వ్యాపారి తన పాల సేకరణ సెంటర్లో పాలు పగలకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మార్చురీల్లో మృతదేహాలు కుళ్లిపోకుండా వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. దాంతో పాటు పాలల్లో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలిపి అధికంగా పాలను తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదవండి: మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే.. నెమురుగొముల పరిధిలో బయటపడిన కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ (ఫైల్) అల్లం, నీళ్ల బాటిళ్లు సైతం పాల కల్తీతో పాటు కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ సైతం కల్తీ చేసి విక్రయించడాన్ని గతంలో నెమురగొముల గ్రామ పరిధిలో పోలీసులు గుర్తించారు. కుళ్లిపోయిన అల్లం, ఎల్లిగడ్డలను మిషన్లలో వేసి అది పాడవకుండా పేస్ట్‌లో కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. అలాగే బీబీనగర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు విక్రయించే వాటర్ బాటిళ్ల విషయంలో చిరు వ్యాపారులు కల్తీకి పూనుకున్నారు. కిన్లీ, బిస్లరీ స్లిక్కర్లతో కూడిన వాటర్ బాటిళ్లను సేకరించి వాటిలో మామూలు వాటర్‌ను నింపి విక్రయించారు. ఈ విషయాన్ని పోలీసులు గతంలో వెలుగులోకి తెచ్చారు. ఇలా మండలంలో ఒకదాని తర్వాత మరొకటి కల్తీ వ్యాపారం బయటపడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్తీ జరగకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న బాటిళ్లలో మామూలు వాటర్‌ను నింపి అమ్ముతున్న అక్రమార్కులు (ఫైల్) తనిఖీలు ముమ్మరం చేస్తాం గ్రామాల్లో పాల కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ పాలు తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాం. పాలు, ఇతర ఫుడ్ తయారీకి సంబంధించిన విషయాల్లో అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జ్యోతిర్మయి, జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
సామాన్యులకు షాక్.. పాల ధర రూ.2 పెంపు, ఈ ఏడాదిలో ఐదోసారి!
న్యూఢిల్లీ: ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ధరను రూ.2 పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం (డిసెంబర్ 27) నుంచి ఈ పాల ధర పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే, ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్ల ఎంఆర్పీ (MRP)లో ఎటువంటి పెంపు ఉండదని పేర్కొంది. ఈ సంస్థ రెండు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి కాగా, ఏడాది వ్యవధిలో ఇది ఐదోసారి. డెయిరీ ఫుల్క్రీమ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.2 పెంచడంతో రూ.66 చేరకోగా, టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.51 నుంచి రూ.53కి చేరుకుంది. డబుల్ టోన్డ్ పాల ధర లీటరుకు రూ.45 నుంచి రూ.47కి పెరిగింది. అయితే ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా పాల ధరల పెంపు సామాన్యుల గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. పాడి రైతుల నుంచి కంపెనీకి ముడి పాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. కారణం ఏదైన ఈ పాల ధరల పెంపు సామాన్యులకు కొంత భారంగానే మారనున్నాయి. Mother Dairy hikes milk rate by Rs 2/litre effective from tomorrow There is no revision in the MRP of Cow Milk and Token Milk variants. pic.twitter.com/SXoQ8sbqBS — ANI (@ANI) December 26, 2022 చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
హై బీపీ.. హెవీ బ్లడ్ ప్రెషర్.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్‌గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా.., తరచుగా తట్టుకోలేనంత కోపం వచ్చినా, శరీరంలో తేడా అనిపించినా.. కొన్ని జాగ్రతలు తీసుకుంటే మంచిది. సోడియం లెవల్ సాధారణంగా ఒక లీటర్ రక్తంలో 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలంట్స్ మధ్య ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారు రోజువారీ సోడియం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలి, ఇది తప్పకుండా పాటించాల్సిన మొదటి జాగ్రత్త. ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఆ మేరకు అంచనా వేసుకోవాలి. వెంటనే ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. కారంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో సోడియం తగ్గడం వల్ల రక్తపోటు నార్మల్కు వస్తుంది. ఎందుకంటే, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతోపాటు ఉబ్బరం ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరం ఉప్పును బయటకు పంపడానికి అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచుగా శరీరంలో రక్తపోటును ప్రేరేపిస్తుంది. దీంతో అరోగ్య సమస్యలు మొదలువుతాయి. అందుకే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అందువల్ల రక్తపోటును తగ్గించే ఏకైక మార్గం ఆహారంలో ఉప్పును తగ్గించడమే. రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే ఆహార పదార్థాలు ఇవి. అరటిపండ్లు ఇవి పొటాషియానికి గొప్ప మూలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేస్తుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అరటిపండ్లను తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. నేరుగా తినవచ్చు లేదా బనానా షేక్, స్మూతీని తయారు చేసుకోని తిన్నా ఫరావాలేదు. మెగ్నీషియం కోసం బియ్యం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం, వోట్స్ లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 500 మిల్లీగ్రామ్ నుంచి 1,000 మిల్లీగ్రామ్ వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాల ఉత్పత్తులు తాజా లేదా ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం తగ్గితే హృదయనాళ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో కాల్షియం పొందేందుకు శరీరం ఇతర వనరుల కోసం వెతకడం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, మజ్జిగ వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని ఉండేలా చూసుకుంటే, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి సోడియం పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. లెవల్స్‌లో తేడా ఉంటే డాక్టర్‌ను కలిసి ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ధ్యానం, యోగా లేదా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Thyroid Cancer: థైరాయిడ్ క్యాన్సర్.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే -
ట్విటర్లో ‘పన్నీర్ బటర్ మసాలా’ నడుస్తోంది.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు!
పాలతో ఏ వంటకం చేసిన రుచి అదిరిపోతుంది. అందుకే పాల ఉత్పత్తులతో చేసే ఏ వ్యాపారమైన మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే మార్కెట్లో కూడా వాటికి గిరాకీ బాగానే ఉంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా లాక్డౌన్, ధరల పెరుగుదల వంటి కారణలతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు తగ్గు ముఖంపట్టాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు మునుపటి పరిస్థితుల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా సవరించిన జీఎస్టీతో ప్రజలకు షాకిచ్చిందనే చెప్పాలి. ఈ సారి జీఎస్టీ స్లాబ్‌లో పాల ఉత్పత్తులను చేర్చడంతో వ్యాపారులకు షాక్, ప్రజలపై మరింత భారం పడనుంది. గత నెలలో జరిగిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు మరికొన్ని వస్తువుల స్లాబ్‌ను పెంచారు. సవరించిన ధరలు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు ఇకపై మునుపటి కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ జీఎస్టీ విధింపులపై ట్విటర్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. పన్నీర్ పై 5 శాతం, బటర్‌పై 12 శాతం, మసాలాపై 5 శాతం విధించారు. ఈ క్రమంలో నెటిజన్లు కేంద్రం పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ట్విట్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో #PaneerButterMasala ( పన్నీర్ బటర్ మసాలా) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెటిజన్లు కేంద్రాన్ని విమర్శిస్తూనే ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు. GST on Paneer butter masala after this GST mathmatics Exam comes new Calculation 🤣😃😂 Keep Solve pic.twitter.com/74DPCjaa58 — A. AHMAD (@ASGARAHMAD84) July 20, 2022 Paneer Butter Masala at Middle Class Homes After New GST slabs. pic.twitter.com/mfFzw5TziA — Garima Kaushik (@Garimakaushikk) July 20, 2022 Paneer Butter Masala is trending. Me in hostel : pic.twitter.com/oZHOTjhRDC — Varsha saandilyae (@saandilyae) July 20, 2022 -
Health Tips: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే!
Calcium Deficiency- Symptoms- Problems -Solutions: కాల్షియం అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి కీలక శరీర విధులకు కాల్షియం చాలా అవసరం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు, నరాల సంకోచ, వ్యాకోచాలకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా, అస్థిపంజర పనితీరుకు కాల్షియం నిదర్శనం. అయితే కొందరిలో కొన్ని కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది. ఇలా కాల్షియం లోపించడాన్నే వైద్యపరిభాషలో ‘హైపోకాల్సీమియా’అని అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోకపోతే ‘ఆస్టియో పేనియా’ అనే ఎముకలు సన్నబడిపోయే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు (రికెట్స్, ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని నివారించుకోవచ్చు. కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు ►వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు ►కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం ►బద్ధకం, తీవ్రమైన అలసట ►బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు ►దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం ►తికమకగా అనిపించడం ►ఆకలి లేకపోవడం. దీర్ఘకాలిక కాల్షియం లోపం అనేక ఇతర శరీర భాగాలను బాధించవచ్చు. అందువల్ల మనకు పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్ష చేయించుకుని, లోపం ఉందని నిర్ధారణ అయితే తగిన మందులు వాడటం ఉత్తమం. లేదంటే ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవడం అవసరం. కాల్షియం లోప నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు ►పాలు, పాల ఉత్పత్తులు: జున్ను, రసమలై, పెరుగు, పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి యోగర్ట్ అనే పదార్థం, పనీర్ ►కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు ►కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్ ►సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు ►ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ►కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి కాబట్టి కాల్షియం లోపం లేకుండా చూసుకోవడం అత్యవసరం. చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
పాల ఉత్పత్తిలో భారత్ టాప్: ప్రధాని మోదీ
బనస్కాంత (గుజరాత్): భారత్ ఏటా 8.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పాలను ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచంలో పాల ఉత్పత్తి దేశాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. దేశ పాల ఉత్పత్తి టర్నోవర్ వరి, గోధుమల కన్నా అధికమన్నారు. డైరీ రంగంలో చిన్నరైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. బనాస్ డైరీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్న రైతుల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సహకార ఉద్యమ విజయవంతానికి బనాస్ డైరీ ఉదాహరణగా అభివర్ణించారు. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. చదవండి: (లీటర్ పెట్రోల్ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెరిగి..) -
మార్కెట్లోకి అమూల్ తాజా పాలు, పెరుగు ఉత్పత్తులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విస్తృత శ్రేణిలో పాలు, పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్ లిమిటెడ్) గురువారం అమూల్ తాజా పాలు, పెరుగును ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు.ఎ ఉత్పత్తులను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాల సహకార సంఘాలు ఏర్పాటైనట్లు చెప్పారు. అమూల్ పాల కర్మాగారాన్ని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేశారని, అక్కడ అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపారు. అమూల్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ మనోరంజన్ పాణి మాట్లాడుతూ.. దేశంలో అతి పెద్ద ఆహార సంస్థ అయిన అమూల్ రైతు సహకార ఉద్యమ శక్తికి మహోన్నతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సీనియర్ జనరల్ మేనేజర్ రాజన్ జంబునాథన్ మాట్లాడుతూ అమూల్ పాలు, పెరుగు ఉత్పత్తులు విజయవాడ మార్కెట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. -
పాడి రైతులకు అమూల్య్ సహకారం
సాక్షి, అమరావతి: దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికిన ‘అమూల్’(ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) ఏపీలో పాడి పరిశ్రమాభివృద్ధికి సహకారం అందిస్తోంది. 75 ఏళ్ల క్రితం గుజరాత్లో ఎలాంటి పరిస్థితుల్లో అమూల్ ఆవిర్భవించిందో ఇప్పుడు ఏపీలోనూ అదే వాతావరణంలో తాము అడుగు పెట్టినట్లు చెబుతోంది. ‘అమూల్ సహకార సంస్థ కావడంతో రైతులే దాని యజమానులు. లాభాల్లో వాటాలు పంచడం సహకార సంస్థల లక్ష్యం. గ్రామీణ మహిళలు ఆత్మ గౌరవంతో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.వేలల్లో ఆదాయాన్ని ఆర్జించే మార్గం చూపడం ద్వారా సాధికారత దిశగా అమూల్ కృషి చేస్తోంది. ‘డైనమిక్ సీఎం’ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని, గుజరాత్ కంటే వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తామని అమూల్ మేనేజింగ్ డెరెక్టర్ ఆర్ఎస్ సోథి చెప్పారు. రాష్ట్రంలో అమూల్ కార్యకలాపాలపై ‘సాక్షి’ ప్రతినిధికి ఆయన ప్రత్యేకంగా ఇంటరŠూయ్వ ఇచ్చారు. + రాష్ట్రంలోకి అమూల్ అడుగుపెట్టి ఏడాది కావస్తోంది. ఏపీలో అమూల్ అనుభవాలను వివరిస్తారా? – గుజరాత్లో 75 ఏళ్ల క్రితం ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారి సంక్షేమం కోసం అమూల్ సహకార సంస్థ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో పాడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్న విషయాన్ని గమనించారు. పాలకు కనీసం మంచినీటి బాటిల్ ధర కూడా దక్కడం లేదన్న విషయాన్ని గుర్తించి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఆయన ఆహ్వానం మేరకు రాష్ట్రంలో అమూల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 250 గ్రామాల్లో కార్యకలాపాలు ప్రారంభించాం. ఏడాదిలో ఏడు జిల్లాల్లో 859 గ్రామాలకు విస్తరించాం. చిత్తూరు కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. + పాడి పరిశ్రమ విషయంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏవైనా తేడాలను గమనించారా? – పాల ఉత్పత్తిలో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రోజుకు నాలుగు కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 2.5 కోట్లు మిగులు పాలు ఉంటున్నాయి. 20 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉండగా 80 శాతం అసంఘటిత రంగంగా ఉంది. ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయి. గుజరాత్‌లా ఆంధ్రప్రదేశ్‌లో వెన్న శాతం అధికంగా ఉండే పాలనిచ్చే గేదెలు అత్యధికంగా ఉన్నాయి. ఇది డెయిరీ రంగంలో వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తుంది. + అమూల్ రాకతో ఏపీలో పాడి రైతులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరింది? – అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు. పూర్తిగా రైతులకు చెందినది. అమూల్ 36 లక్షల మంది రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,000 మంది పాడి రైతులు భాగస్వాములు అయ్యారు. దేశంలో రైతులంతా కష్టపడే తత్వం కలిగినవారే. కానీ ప్రైవేట్ డెయిరీల చేతుల్లో మోసపోతున్నారు. మేం పాలను సేకరించి విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలను వారికే ఇస్తాం. మేం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టకముందు పాడి రైతులకు లీటరుకు రూ.30–31 మాత్రమే లభించేది. మా రాకతో సేకరణ ధర ఏడాదిలో లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పెరిగింది. ఇప్పుడు రైతులు లీటరుకు రూ.39 నుంచి రూ.40 వరకు పొందుతున్నారు. అమూల్ వెన్న శాతం ఆధారంగా రైతులకు చెల్లిస్తుంది. దీనివల్ల కొన్ని చోట్ల లీటరుకు రూ.70 వరకు పొందే అవకాశం లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలు చాలావరకు లీటరుకు ఒక ధరను నిర్ధారించి కొనుగోలు చేస్తాయి. + మహిళా సాధికారికత విషయంలో అమూల్ ఎలా భాగస్వామి అవుతోంది? – మహిళా సాధికారతకు డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలన్నది ఆయన లక్ష్యం. అందుకే పాడి రైతుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటివద్దే ఉంటూ ఒక గేదె, ఆవును పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. మూడు ఆవులు లేదా గేదెలను కొనుగోలు చేసి పాలు విక్రయించడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు నెలకు రూ.12,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనివల్ల మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో పలు ప్రయోజనాలు చేకూరతాయి. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ మహిళల నెలవారీ సంపాదన రూ.20,000కి పెంచడమే అమూల్ లక్ష్యం. గుజరాత్లో నిరక్ష్యరాస్య మహిళలు కేవలం పాలు అమ్మడం ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. + రాష్ట్రంలో అమూల్ విస్తరణ కార్యక్రమాలు ఏమిటి? – రెండు జిల్లాలతో ప్రారంభించి ఏడు జిల్లాలకు విస్తరించాం. త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించనున్నాం. రాష్ట్రంలో 50 నుంచి 60 శాతం గ్రామాలకు అమూల్ చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం ఏడు జిలాల్ల నుంచి రోజూ లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. దీన్ని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల లీటర్లకు చేర్చాలన్నది లక్ష్యం. ఏపీలో సేకరించిన పాలను పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాం. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చుకుంటున్నాం. + రాష్ట్రంలో పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లాంటి ఆలోచనలు ఉన్నాయా? – ఇంకా వేగంగా పాల సేకరణను విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో నెమ్మదిగా విస్తరిస్తున్నాం. నెల రోజుల్లో రాష్ట్రంలో మూడు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. మదనపల్లి, విజయవాడ, విశాఖపట్నంలో ఇవి ఏర్పాటవుతాయి. దీంతో లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం అమూల్‌కు ఈ నెలాఖరులోగా లభిస్తుంది. రానున్న కాలంలో దీన్ని మూడు నుంచి ఐదు లక్షల లీటర్లకు పెంచుతాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మదనపల్లిలో ప్రభుత్వ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను లీజుకు తీసుకుంటుండగా విజయవాడ, విశాఖలో థర్డ్ పార్టీ ప్లాంట్లు నెలకొల్పుతున్నాం. విద్యార్థులకు ఫ్లేవర్డ్ మిల్క్, అంగన్వాడీలకు బాలామృతం సరఫరా కాంట్రాక్టు అమూల్‌కు లభించింది. ఇందుకోసం రూ.100 కోట్లతో త్వరలోనే సొంతంగా తయారీ యూనిట్ నెలకొల్పుతాం. కొద్ది నెలల్లోనే పశుదాణా తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్నది అమూల్ లక్ష్యం. -
పా‘పాల’ పుట్ట హెరిటేజ్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) పేరిట హెరిటేజ్ డెయిరీ పాడి రైతులకు కుచ్చుటోపీ పెడుతోంది. చిత్తూరు జిల్లాలోని 9 హెరిటేజ్ డెయిరీల నుంచి రోజూ 1.41 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణ సమయంలో ల్యాక్టోమీటరుతో వెన్న, కొవ్వు శాతాలను గుర్తించి ధర నిర్ణయిస్తారు. ఎస్ఎన్ఎఫ్ 7.69 శాతం, ఫ్యాట్ 0.75 శాతం ఉన్న పాలకు లీటరు రూ.17.97 మాత్రమే చెల్లిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చాలా హెరిటేజ్ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తూ రైతులను నిలువు దగా చేస్తున్నారు. కానీ ఇదే ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఉన్న లీటరు పాలకు పక్కనే గొల్లపల్లిలో శివశక్తి డెయిరీలో, రొంపిచర్ల క్రాస్ శ్రీజ డెయిరీలో, మదనపల్లి అమూల్ డెయిరీ పాల కేంద్రంలో రూ.25 నుంచి రూ.27 వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన హెరిటేజ్‌కు మిగిలిన డెయిరీలకు రైతులు చెల్లించే సేకరణ ధరల్లో ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు. (చదవండి: రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికెళ్లం: హైకోర్టు ) వెన్నశాతం పెరిగినా రైతుకిచ్చే ధర తక్కువే హెరిటేజ్ పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ 7.79 శాతం, ఫ్యాట్ 4.19 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.18.09 ఇస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ 8.06 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.23.52 చెల్లిస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ 8.08 శాతం ఉంటే రూ.27.97 చెల్లిస్తున్నారు. కానీ ఇవే శాతం ప్రకారం ఉంటే అమూల్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు లీటరు రూ.33.24 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రైతులకు దగా.. వినియోగదారులకు వంచన వాస్తవానికి పాలల్లో నిర్దేశించిన మేరకు ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయకూడదు. కానీ హెరిటేజ్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ పాలు తగిన నాణ్యతతో లేకున్నా కొనుగోలు చేసి వాటితో పాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. బాలకృష్ణను పిండేసింది...! చిత్తూరు జిల్లాలో పాడి రైతు బాలకృష్ణకు హెరిటేజ్ చెల్లించిన ధర లీటర్‌కు రూ.17.97. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం బెల్లంవారి పల్లెలోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో ఆయనకు 20 రోజుల పాటు దాదాపు ఇలాగే చెల్లించారు. ఓసారి అయితే రూ.16.65 మాత్రమే ఇచ్చారు. ఆయనొక్కరే కాదు.. భాస్కర్, వి.గంగిరెడ్డి, పసుపులేటి రాణి, హరినాథ్, నాగమ్మ, కిరణ్ తదితర పాడి రైతులందరికీ జనవరిలో ఇదే మాదిరిగా బిల్లులు చెల్లించారు. అక్కడే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రాల్లో దారుణాలు ఇవీ.. (చదవండి: సానుకూలంగా చర్చలు) -
ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!
ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్లాంట్లలో తయారవుతున్న బేవరేజెస్‌ని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. ఇకపై వాటిని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఫుడ్ సేఫ్టీ కి ఫిర్యాదులు మార్కెట్లో సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో నిజానికి డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు. కానీ మార్కెటింగ్ చేసేప్పుడు మాత్రం మిల్క్ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై డెయిరీ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ మిల్క్ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్ అమ్ముతున్న ఆయా కంపెనీలపై కన్నెర్ర చేసింది. 15 రోజుల్లోగా మార్చేయండి మిల్క్ ప్రొడక్టుల పేరుతో మార్కెట్లో బేవరేజ్పై ‘మిల్క్ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే ఆన్లైన్లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు అందాయి. గడువు పెంచండి ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని కానీ ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు అంటున్నాయి. తమకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి. స్పష్టత కావాలి ఫ్యాక్టరీలో తయరయ్యే వస్తువులకు మిల్క్ ప్రొడక్టులు పేర్కొనడం వల్ల తమకు నష్టం వస్తోందని డెయిరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ బేవరేజేస్ మార్కెట్ దేశంలో విస్తరిస్తోందని, ఇప్పుడే ‘ మిల్క్ ప్రొడక్ట్ ’ విషయంలో స్పష్టత తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే అంచనాతో డెయిరీలో కఠినంగా వ్యవహారించాయి. మనదేశంలో మిల్క్ ప్రొడక్టుల పేరుతో అమ్ముడవుతున్న బేవరేజేస్ మార్కెట్ విలువ రూ. 185 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. చదవండి: ‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో! -
పశ్చిమ గోదావరికి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ విస్తరణ
సాక్షి, అమరావతి: ఏపీ అమూల్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం మరో జిల్లాకు విస్తరించనున్నారు. పశ్చిమ గోదావారి జిల్లాలో పాల సేకరణ నిర్వహించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ నిర్వహించారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 142 గ్రామాల్లో పాల సేకరణ జరగనుంది. పాల సేకరణకు సంబంధించి 15 వేల మంది రైతులను అమూల్ సంస్థ గుర్తించింది. అమూల్ సంస్థ నుంచి పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా అమూల్ సంస్థ నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తుంది -
నష్టాల పాలు!
సాక్షి, సిటీబ్యూరో: అన్ని వయసులవారికీ పౌష్టికాహారం పాలు. గ్రేటర్‌కు వీటి సరఫరా సమృద్ధిగా ఉన్నా.. డిమాండ్ అంతంతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం పలు సహకార, ప్రైవేట్ పాల డెయిరీలకు నష్టాలనే మిగిలిస్తోంది. సాధారణ రోజుల్లో మహానగరానికి నిత్యం వివిధ డెయిరీలకు సంబంధించి సుమారు 30 లక్షల లీటర్ల పాల వినియోగం ఉండేది. లాక్డౌన్ అనంతరం డిమాండ్ అనూహ్యంగా పడిపోయింది. సకల వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాలు స్తంభించడంతో మెజారిటీ సిటీజన్లు పల్లెబాట పట్టడం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, టీస్టాళ్లు మూతపడడం, పాల ప్యాకెట్లు ఇంటింటికీ సరఫరా చేసే డెలివరీ బాయ్స్ అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ సుమారు 10 లక్షల లీటర్ల మేర తగ్గిందని.. దీంతో సిటీకి అన్ని డెయిరీలు విక్రయించే పాలను కలిపినా వాస్తవ సరఫరా 20 లక్షల లీటర్లు మించడం లేదని పలు డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం గృహ వినియోగానికి సంబంధించిన పాల వినియోగంలో సుమారు 20 శాతం.. వాణిజ్య విభాగమైన హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లకు సరఫరా చేసే మొత్తంలో సుమారు 50 శాతం కోత పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తగ్గిన డిమాండ్ ఇలా.. కోటికిపైగా జనాభా ఉన్న గ్రేటర్ నగరానికి నిత్యం సుమారు 57 సహకార, ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలకు చెందిన పాలు గతంలో సుమారు 30 లక్షలు.. ఇప్పుడు 20 లక్షల లీటర్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగంలో 20 శాతం.. వాణిజ్య విభాగంలో 50 శాతం వినియోగం తగ్గడం గమనార్హం. సాధారణంగా అన్ని వ్యవస్థీకృత డెయిరీలు విక్రయంచే పాలు 60 శాతం జనాభాకు సరఫరా అవుతున్నాయి. మరో 40 శాతం మందికి పాల విక్రయాలు ఇంటింటికీ స్కూటర్‌పై తిరిగి పాలను విక్రయించే వారు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి మిల్క్ వెండర్స్‌కు డిమాండ్, సరఫరాలో పెద్దగా కోత పడలేదు. ప్రధానంగా డెయిరీ పాలపైనే లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మెజారిటీ సిటీజన్లు సొంత గ్రామాలకు వెళ్లడం, హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాళ్లు, ఫంక్షన్ హాళ్లు మూతపడడం, డెలివరీ బాయ్స్ విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో డిమాండ్ తగ్గింది. పాల ఉత్పత్తులకు గిరాకీ అంతంతే.. పాలతో తయారయ్యే ఉత్పత్తులు పెరుగు, పన్నీర్, లస్సీ, స్వీట్స్ దూద్‌పేడా, ఐస్‌క్రీమ్స్, వెన్న తదితర ఉత్పత్తులకు కూడా డిమాండ్ అనూహ్యంగా పడిపోయిందని పలు డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు. నగరంలో వివాహాది శుభకార్యాలు వాయిదాపడడం, ప్రజలు ఇంటి వంటకే ప్రాధాన్యమివ్వడం, బయటి నుంచి తిను బండారాలు కొనుగోలు చేసి తెచ్చుకునేందుకు విముఖత చూపడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వల్లభ డెయిరీ నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ అంతగా లేకపోవడంతో పలు డెయిరీలు పాల పౌడర్, వెన్న తయారీ చేసే సంస్థలకు మిగిలిన పాలను సరఫరా చేస్తున్నాయన్నారు. పలు సహకార, ప్రైవేటు డెయిరీలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం పలు ప్రధాన డెయిరీలు విక్రయిస్తున్న పాలు.. లీటర్లలో (రోజువారీగా) గమనిక: సాధారణ రోజుల్లో ప్రస్తుతం విక్రయిస్తున్న పాలకంటే గృహ వినియోగంలో 20 శాతం, వాణిజ్య విభాగంలో 50 శాతం అధికంగా పాలను విక్రయించేవారు. -
కోవా.. కావాలామ్మా!
ప్రకృతి అందాలకు నిలయం కోనసీమ. రుచికరమైన పాలకోవాకు కండ్రిగ పాలకోవా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. విదేశాల్లో స్థిరపడిన స్థానికులు, స్థానికేతరులు పనిగట్టుకుని కండ్రిగ వచ్చి పాలకోవాను తీసుకు వెళ్తుంటారు. కోవాలోని మాధుర్యాన్ని ఈ గ్రామం మొత్తం భారత దేశానికి పంచుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉంది కండ్రిగ గ్రామం. అక్కడ ఆదిలక్ష్మీస్వీట్ (పాలకోవా) స్టాల్, అటుగా వెళుతున్నవారిని తన దగ్గరకు తియ్యగా రప్పించుకుంటుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సుమారు 30 ఏళ్ల క్రితం సూరవరపు సుబ్బారావు.. కొత్తపేట – అమలాపురం రోడ్డు కండ్రిగ రేవు దగ్గర చిన్న కాఫీ హోటల్ ప్రారంభించారు. 20 ఏళ్ల క్రితం ఆయన కుమారుడు సూరవరపు వీరరాఘవులు హోటల్ని మరింత అభివృద్ధి చేయ టం కోసం పాలకోవా తయారీ ప్రారంభించారు. అంతే.. వీరి జీవితాలలో మాధుర్యం వచ్చి చేరింది. వ్యాపా రం పెరగటంతో, విశాలమైన స్థలంలో ఆదిలక్ష్మి స్వీట్స్ అండ్ టీ స్టాల్ ప్రారంభించిన కొద్దికాలానికే పాలకోవా వ్యాపారమూ చెందింది. పాలకోవా పాకం ఊక పొయ్యి మీదే... గ్యాస్ స్టౌ, స్టీమ్ విధానం ఉన్నా ఇక్కడ మాత్రం ఊక పొయ్యి మీదే పాలకోవా తయారుచేయటం ప్రారంభించారు. నాలుగు బట్టీలతో రెండు ఊక పొయ్యిలు పెట్టి, ఎంత వేగంగా పాలకోవా తయారుచేస్తున్నా, ఇలా ప్లేటులోకి తీస్తుండగానే, అలా ఎగరేసుకుపోతున్నారు పాలకోవా ప్రియులు. ప్రొప్రయిటర్ పెద్ద కాపు కుటుంబ సభ్యులు పదహారు మందితో పాటు మరో పది మంది కలిసి, రోజుకు సుమారు 100 కేజీల కోవా తయారుచేస్తున్నారు. పాలకోవా ముద్ద తయారీ... ఊక పొయ్యి మీద ఇత్తడి గంగా ళాలు పెట్టి, పాలు పోసి మీగడ కట్టకుండా గరిటె తిప్పుతూ, సుమారు గంట సేపు మరగకాగి ముద్దలా అవుతున్న సమయంలో పంచదార (20 లీటర్లు పాలకు, మూడు కేజీల పంచదార) వేసి, పాలు, పంచదార పాకాన్ని గరిటెతో విరామం లేకుండా, దగ్గర పడేవరకు కలిపి, నెయ్యి పూసిన పళ్లెంలో పోస్తారు. గట్టిపడేవరకు గరిటెతో బాగా కలుపుతారు. ఇలా గట్టి పడటం కోసం ప్రస్తుతం ఒకరకమైన గ్రైండర్ వాడుతున్నారు. గ్రైండర్లో వేసిన అరగంటకు ముద్దలా మారిపోతుంది. ఆ మిశ్రమాన్ని బిళ్లలుగా తయారుచేసి ప్యాకింగ్ చేస్తారు. ఇలా ఈ పాలు కోవాగా మారి కవర్లలోకి వెళ్లడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. అయితేనేం, కోవా తిన్నవారు ఇచ్చే తియ్యటి మాటలు వారి జీవితమంతా వారి మనసులో పదిలంగా నిలుస్తున్నాయి. – జగతా రాంబాబు, సాక్షి, కొత్తపేట,తూ.గో. జిల్లా నాణ్యమైన పాలతోనే కోవా చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి గేదె పాలు సేకరిస్తాం. ఇందులో ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా, కోవా కోసమే ఉపయోగిస్తాం. 500 లీటర్లు పాలకు సుమారు 100 కేజీలు కోవా తయారవుతుంది. గ్యాస్, స్టీమ్ పొయ్యిలు అందుబాటులోకి వచ్చినా వాటిపై కోవా వండితే ఇంత రుచి రాదు. ఊక పొయ్యి మీద వండితేనే ఘుమఘుమలాడుతూ ఇంత తియ్యగా వస్తుంది. అందుకే ఊక పొయ్యి బట్టీల మీదే కోవా తయారుచేస్తున్నాం. ఇలా వేడివేడిగా ఉండగానే, అలా చల్లగా కొనేస్తుంటారు. 25 గ్రాములు, 50 గ్రాములు చొప్పున కోవా బిళ్లలను తయారుచేస్తాం. – సూరవరపు సుబ్బారావు, నిర్వాహకుడు -
పొరుగు పాలు రుచెక్కువ!
సాక్షి, హైదరాబాద్ : అంగన్వాడీల్లోని లబ్ధిదారులకు అత్యుత్తమ పౌష్టికాహారం కింద పాలను అందిస్తున్న ప్రభుత్వం, పంపిణీ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హాకా (హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేట్ అసోసియేషన్ లిమిటెడ్)కు అప్పగించింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం తెలంగాణ విజయ డెయిరీ (తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పంపిణీ చేసే పాల బ్రాండు) పాలను హాకా కొనుగోలు చేసి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలకు చేరవేయాలి. తెలంగాణ విజయ పాలు ఆశించిన మేర సరఫరా చేయని పక్షంలో స్థానిక కంపెనీలను ప్రోత్సహించే క్రమంలో ఇక్కడి డెయిరీలకు ప్రాధాన్యత ఇవ్వొచ్చని సూచించింది. కానీ స్థానిక ప్రోత్సాహం సంగతి అటుంచితే పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీ నుంచి ఎక్కువ ధర వెచ్చించి ‘హాకా’పాలను కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం)ల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం ఈ కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నారు. మొత్తంగా 16.96 లక్షల మంది చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో 17.04 లక్షల ప్యాకెట్లను హాకా సరఫరా చేసింది. ఇందులో కేవలం 1.19 లక్షల ప్యాకెట్లు తెలంగాణ విజయ పంపిణీ చేయగా... మిగతావి కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ సరఫరా చేసింది. రెండు లక్షలలోపే ఆర్డర్లు... తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రోజుకు సగటున 3 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ఇందులో టెట్రా ప్యాక్ రూపంలో నెలకు సగటున 10 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసే వీలున్నప్పటికీ ప్రస్తుతం 7 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విజయ పాలకు కేవలం 2లక్షల వరకే ఆర్డర్లు పెడుతున్న హాకా... మిగతా కోటా అంతా నందిని డెయిరీకే ఇస్తోంది. ఒకవైపు ఎక్కువ ధర చెల్లించడంతో పాటు, పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీని ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నందిని పాల కొనుగోలుతో ప్రభుత్వ ఖజానాపై భారం పడడంతో పాటు పొరుగు రైతులను ప్రోత్సహించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నందిని డెయిరీ ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇస్తుండడంతో ఆ పాలవైపే హాకా మొగ్గు చూపుతుందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ విజయ బ్రాండు క్షేత్రస్థాయిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కరీంనగర్ డెయిరీ ద్వారా ముల్కనూరు పాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తి దారుల సంఘం సరఫరా చేసే ‘నార్ముల్’పాలకు కూడా మంచి పేరే ఉంది. విజయ డెయిరీకి డిమాండ్‌కు సరిపడా పాలను సరఫరా చేసే సామర్థ్యం లేకుంటే స్థానిక ప్రోత్సాహం కింద ముల్కనూరు, నార్ముల్ పాలు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కొందరు రైతులు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అది ప్రభు త్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
విజయ పాలు..లీటరు రూ.44
సాక్షి, హైదరాబాద్ : విజయ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. ప్రస్తుతం విజయ పాలు లీటరుకు రూ.42 వంతున విక్రయిస్తుండగా... ఇకపై రూ.44కు విక్రయించాలని నిర్ణయించింది. పాలసేకరణ ధరలు పెరగడంతో పాల సరఫరా ధర పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్) ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. స్టాండడైజ్ పాలు, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు పెంచినట్లు ప్రకటించింది. పాల ధరలను తగ్గించాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పెంచిన విజయ పాల ధరను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారాన్ని, అలాగే తల్లి పాలకు దూరమైన పిల్లలు ఆధారపడే పాల ధరను పెంచితే పేద, మధ్యతరగతి పిల్లలు పాలకు దూరమవుతారన్నారు. -
పాల ఉత్పత్తులతో సమస్య లేదు!
పాలు ఆరోగ్యానికి మంచిది కావని మీకు ఇటీవలి కాలంలో ఎవరైనా చెప్పారా? వాళ్ల మాటల్లో నిజం లేదని అంటున్నారు హార్వర్డ్, టఫ్ట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెజబ్బులతోపాటు, మధుమేహానికి, పాలకు సంబంధం లేదని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వీరు చెబుతున్నారు. ఆహారంలో పాల ఉత్పత్తులను భాగంగా చేసుకున్న దాదాపు మూడు వేల మందిపై తాము అధ్యయనం చేశామని.. వీరికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలిందని ఓ శాస్త్రవేత్త తెలిపారు. అలాగే సుమారు రెండు లక్షల మందిని దశాబ్దాల పాటు పరిశీలించిన తరువాత తాము పాలతో గుండెజబ్బుల సమస్య ఎక్కువ కాదన్న అంచనాకు వచ్చామని వివరించారు. పాల ఉత్పత్తులతో అందే కొవ్వులకు బదులు మొక్కలతో లభించే కొవ్వులు, గింజలను వాడినప్పుడు గుండెజబ్బుల ప్రమాదం ఇంకో 24 శాతం తగ్గిందని వీరు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మాంస ఉత్పత్తులతో సమస్య ఆరు శాతం వరకూ ఎక్కువ కావడం. మొక్కల ద్వారా లభించే కొవ్వులు, పాలతో వచ్చే వెన్నలోని కొవ్వులను పోల్చి చూసినప్పుడు మొదటి రకం కొవ్వులు ఆరోగ్యకరంగా ఉంటే.. రెండో రకం కొవ్వులను మితంగా వాడితే పెద్ద ప్రమాదమేమీ లేదని ఇంకో అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తమ్మీద చూస్తే ఏ రకమైన కొవ్వులనైనా మితంగా వాడటం మేలని అర్థమవుతుంది. -
ఇక నుంచి పతంజలి పాలు.. నీళ్లు
న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్ స్లోర్లకు గట్టి పోటీ ఇస్తున్న బాబా రామ్‌దేవ్ తన పతంజలి నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించింది. సమర్థ భారత్.. స్వస్థ భారత్ మిషన్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి వీలున్న కూరగాయాలు, సోలార్ ఉత్పత్తులు, డ్రింకింగ్ వాటర్, పశువుల మేతకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు బాబా రాందేవ్ తన ట్విటర్లో ప్రకటించారు. అంతేకాక 2020 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 1000 కోట్ల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకోస్తున్నట్లు బాబా రామ్‌దేవ్ తెలిపారు. దీని ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు. हर बूँद में शुद्धता ! Quench your thirst with Patanjali Divya Jal ! pic.twitter.com/SJDQI8o81S — Swami Ramdev (@yogrishiramdev) September 13, 2018 అంతేకాక తన స్టోర్ల ద్వారా నిత్యం 10లక్షల లీటర్ల పాల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్‌దేవ్ తెలిపారు. పాలతో పాటు, పన్నీర్, పెరుగు లాంటి ఇతర పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నట్లు ప్రకటించారు. పాడి పరిశ్రమ రైతులను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇతర సంస్థలు విక్రయించే పాలకన్నా 2 రూపాయలు తక్కువకే పాలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. అలాగే ‘దివ్య జల్’ పేరుతో తీసుకోస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ 250 ఎమ్ఎల్, 500 ఎమ్ఎల్, 1 లీటరు, 2 లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్ల ప్యాక్ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హరిద్వార్ ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలను నిర్వహిస్తున్న పతంజలి దేశవ్యాప్తంగా 56వేల రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. -
చైనా పాల దిగుమతులపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా నుంచి చాక్లెట్లు, పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై విధించిన నిషేధాన్ని మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 23 వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకూ నిషేధం గడువును పొడిగించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్స్ తయారీలో ఉపయోగించే విషపూరిత మెలామిన్ అనే రసాయనం చైనా నుంచి వచ్చే పాల ఉత్పత్తుల్లో ఉన్నాయనే అభ్యంతరాల నేపథ్యంలో వీటిని నిషేధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోకున్నా, ముందు జాగ్రత్త చర్యగా నిషేధం విధించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు, వినిమయదారుగా ఉంది. భారత్‌లో ఏటా 15 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తవుతాయి. దేశంలో అత్యధికంగా యూపీలో పాల ఉత్పత్తి సాగుతుండగా, తర్వాతి స్ధానాల్లో రాజస్థాన్, గుజరాత్‌లు నిలిచాయి. -
అప్రతిష్ట‘పాలు’
♦ పాడిపరిశ్రమ శాఖ మంత్రి నోటికి తాళం ♦ పాలలో కల్తీ మాటలపై నిషేధం ♦ రాజేంద్రబాలాజీపై రూ.3 కోట్ల నష్టపరిహార పిటిషన్ ఆవిన్ పాలు అమ్ముకునేందుకు ప్రయివేటు పాలపై కల్తీ ఆరోపణల బురద చల్లిన రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ నోటికి తాళం పడింది. ఆధారాలు లేని ఆరోపణలు తగదంటూ మద్రాసు హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రయివేటు పాలు కల్తీమయమంటూ ఇక మాట్లేందుకు వీలులేదని కోర్టు సోమవారం నిషేధాజ్ఞలు జారీచేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రయివేటు డెయిరీల పాల ఉ త్పత్తులపై ఆరోపణలు చేసిన మంత్రి కి నోటీసు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. పాలు కల్తీమయం అంటూ సంచనలనం సృష్టించిన రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మూడు డెయిరీలో కోర్టుకెక్కాయి. హాట్సన్ ఆగ్రో, దొడ్ల డెయిరీ, విజయ డెయిరీ యాజమాన్యాలు మద్రాసు హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ప్రయివేటు పాల కంపె నీదారులు బ్లీచింగ్, ప్రమాదకర రసాయనాలను కలిపిన పాలను సరఫరా చేస్తున్నారంటూ మంత్రి రాజేంద్ర బా లాజీ నిరాధార ఆరోపణలు చే స్తున్నా రు. అంతర్గతంగా దురుద్దేశ్యంతో చేస్తున్న ఆరోపణలు పాల వినియోగదారుల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. అంతేగాక మా కంపెనీల ఉత్పత్తుల గురించి తప్పుడు సమాచారం ప్రజలకు చేరుతోంది. ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న పాలను పరీక్షించకుండానే ఆరోపణలు చేస్తున్నారు. మా ఉత్పత్తులు కల్తీ లేని శుద్ధికరమైనవని ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లే స్పష్టం చేశాయి. కాబట్టి మా కంపెనీ ఉత్పత్తులపై నిరాధార ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలి. ప్రతిష్టాకరమైన మా కంపెనీలను అప్రతిష్టపాలు చేసిన మంత్రి రాజేంద్రబాలాజీ తలా రూ.1 కోటి చెప్పున నష్టపరిహా రం చెల్లించేలా ఆదేశించాలి’’అని పిటిషన్లో కోరాయి. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తయిన అనంతరం న్యాయమూర్తి కార్తికేయన్ మంత్రి తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ, పిటిషన్‌దారుల కంపెనీలు ఉత్పత్తి చేసే పాలు, పాల ఉత్పత్తుల గురించి ఆధారాలు లేకుండా మంత్రి వ్యాఖ్యానాలు చేయడానికి వీల్లేదని ఆదేశించా రు. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంలటూ మంత్రికి నోటీసు జారీచేయాల్సిందిగా కోర్టును ఆదేశించారు. పాల ఉత్పత్తిదారుల హర్షం అవాకులు చెవాకులు పేలుతున్న మంత్రి రాజేంద్రబాలాజీ నోటికి కోర్టు తాళం వేయడాన్ని స్వాగతిస్తున్నామని తమిళనాడు పాల ఉత్పత్తిదారులు, కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఏ పొన్నుస్వామి అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ల్యాబ్ పరీక్షలో అవి కల్తీ పాలు అని తేలితే కంపెనీకి సీలు వేసి క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో తప్పులేదని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువైన పాలను ప్రజలు పదే పదే సేవిస్తుంటారని, ఈ పరిస్థితిలో వినియోగదారులను భయపెట్టేలా ప్రకటనల చేయడం సమంజసం కాదని అన్నారు. పాలు కల్తీ జరగకుండా ముఖ్యమంత్రి ఎడపాడి ఇప్పటికైనా ఒక చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ పాలు, ప్రయివేటు పాలు అనే తేడా చూడకుండా ప్యాకెట్ల తయారీకి ముందే పరీక్షలు జరపాలని ఆయన కోరారు. పాల కల్తీ పరీక్షలకు ఐదుగురితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని పొన్నుస్వామి సూచించారు. -
దూడల పెంపకంతో నాలుగింతల ఆదాయం
సకాలంలో వ్యాధులు గుర్తిస్తే ప్రయోజనం గుడ్లవల్లేరు(గుడివాడ) :గ్రామాల్లో వ్యవసాయం తరువాత పాడి పశువుల పెంపకం ప్రధానం ఉంది. అయితే పెంపకంతో మెలకువలతో ఆదాయం పెందవచ్చు. అందులో దూడల పెంపకంతో అనతి కాలంలోనే పాడిరైతు నాలుగింతల ఆదాయం సంపాదించుకోవచ్చు. పశువుల పెంపకంలో ఆవులు, గేదెల పెంపకంతో పాటు లేగ దూడల పెంపకం పాడి రైతులకు ఎంతో లాభదాయకమే. నాణ్యమైన దాణా అందిస్తూ క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు వేయిస్తే మేలు జాతి దూడల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నష్టం తప్పదు. దూడలకు సోకే వ్యాధులు, నివారణ చర్యలపై గుడ్లవల్లేరు వెటర్నరీ మండల వైద్యాధికారి డాక్టర్ కె.అభిలాష్ ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి. అజీర్తితో తెల్ల విరేచనాలు... మోతాదుకు మించి పాలు తాగించటం వలన అజీర్తి చేసిన దూడలు తెల్లగా పారతాయి. సూక్ష్మజీవులు, నట్టల వలన కూడా దూడల్లో విరేచనాలు అవుతాయి. ఈ సమయంలో పాల మోతాదును తగ్గించాలి. గ్లూకోజ్, ఉప్పు, నీరు కలిపిన మిశ్రమాన్ని తాగించి ఆ తర్వాత పశు వైద్యుల్ని సంప్రదించాలి.రక్షణ లేకపోతే న్యూమోనియా...దూడలకు రాత్రి సమయంలో సరైన రక్షణ లేక తగిలే గాలుల వలన న్యూమోనియా వస్తుంది. అలాంటి గాలులు తగలకుండా వాటికి గృహవసతి కల్పించాలి. ఈ వ్యాధి వచ్చిన దూడల్లో జ్వరం వస్తుంది. శ్వాస పీల్చడం కష్టతరమవుతుంది. వ్యాధి ముదిరితే చనిపోయే అవకాశం ఉంది. వ్యాధి వచ్చిందని తెలిస్తే వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించాలి. నట్టలతో ఎదుగుదలకు అవరోధం...నట్టల వ్యాధి సోకితే దూడను ఎదగనివ్వదు. దూడల్లో ఈ వ్యాధి బుడద సాధారణమే. దూడల్లో ఈ వ్యాధి ఉంటే తరచూ విరేచనాలు అవుతాయి. వెంట్రుకలు బిరుసుగా ఉంటాయి. కడుపు కిందకు జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. దూడలకు సకాలంలో నట్టల నివారణ మందులు తాగించాలి. 8–10రోజుల వయసులో మొదటి, ఆ తర్వాత నెలకో సారి చొప్పున నాలుగు నెలల వరకూ క్రమం తప్పకుండా మందులు తాగించాలి. కాక్సిడియోసిస్తో రక్త విరేచనాలు... ఈ వ్యాధి సోకడం వలన దూడలు రక్త విరేచనాలతో బాధ పడతాయి. 15రోజులకు ఒకసారి పశువుల కొట్టంలో సున్నం చల్లితే కాక్సిడియాసిస్ వ్యాధి రాకుండా నివారించవచ్చు. దూడలకు మరిన్ని సమస్యలు... గేదె దూడలకు మూడు నెలల దాటిన తర్వాత నెలకో సారి ఏడాది వరకు దాని శరీరంపై వెంట్రుకలు కత్తిరించి పేలు, గోమార్లు రాకుండా కాపాడుకోవాలి. దూడలకు 6–8 వారాల వయసులో మొదటి సారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దూడలకు 6నెలల వయసులో జబ్బ వాపు, గొంతు వాపు, బ్రూసెల్లోసిస్ వంటి అంటువ్యాధులు ప్రబలకుండా టీకాలు వేయించాలి. పరిశుభ్రత లోపిస్తే బొడ్డు వ్యాధి... దూడ పుట్టినపుడు దాని బొడ్డును శుభ్రమైన బ్లేడు లేదా కత్తెరతో రెండు అంగుళాల పొడవు ఉంచి కత్తిరించి టింక్చర్ ఆయోడిన్ అద్దాలి. అలా చేయకపోతే సూక్ష్మజీవులు ప్రవేశించి బొడ్డువాపు కలిగే ప్రమాదం ఉంది. బొడ్డువాపు వ్యాధి వచ్చినపుడు ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యంతో మల బద్ధకానికి చెక్... దూడల్లో మల బద్ధకం సాధారణంగా కనిపిస్తుంది. దూడలకు జున్ను పాలు తగినవన్ని తాగిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు. దూడ తాగే పాలలో కోడిగుడ్డు సొన, ఇం గువ, బెల్లం కలిపి రెండు రోజుల పాటు తాగిస్తే మల బద్ధకం తగ్గుముఖం పడుతుంది. లేదా ఎనిమా ఇప్పించాలి. వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్ ఇదే... గొంతువాపు నిర్మూలనకు ఐదో నెలలో, రెండో సారి ఏడాదికి ఒకసారి మే, జూన్ ల్లో టీకా వేయించాలి. జబ్బ వాపు నివారణకు 7వ నెలలో, రెండో సారి ఏడాదికి ఒకసారి మే, జూన్ నెలల్లో వేయించటం ఉత్తమం. రొమ్ము రోగానికి 6వ నెలలో, రెండో సారి ఏడాదికి ఒకసారి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వేయించాలి. ఈసుడు రోగానికి 4–6నెలల్లో, రెండో సారి ఏడాదికి ఒకసారి ఎప్పుడైనా వేయించటం ఉత్తమం. థైలేరియాసిస్కు 4నెలల తర్వాత, రెండో సారి ఏడాదికి ఒకసారి ఎప్పుడైనా వేయించవచ్చు. గాలికుంటుకు 2 నెలల వయసులో, రెండో సారి ఏడాదికి ఒకసారి మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వేయించటం ఉత్తమం. -
పాల కల్తీ చేస్తే యావజ్జీవం!
న్యూఢిల్లీ: పాలు, పాల ఉత్పత్తుల కల్తీపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీని నివారించేందుకు కఠిన చర్యలతో పాటు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో సవరణలు చేయాలని, శిక్షార్హమైన నేరంగా మార్చాలని సూచించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు చేశాయని, పాల కల్తీకి పాల్పడితే జరిమానా, జరిమానా లేకుండా జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు చేశాయంటూ విచారణ సందర్భంగా కోర్టు ఉదహరించింది. -
తెలుగు రాష్ట్రాల్లో మరో పాల ఉత్పత్తుల సంస్థ