రూ. 20 కోట్లతో ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రసాయనరహిత, సేంద్రియ ఆహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డెయిరీ ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప ఆర్గానిక్ హైదరాబాద్ మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని జడ్చర్లలో రూ. 20 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈవో శశికుమార్ తెలిపారు. ప్రాథమికంగా రోజుకు 40 వేల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్లాంటు ఆరేడు నెలల్లో అందుబాటులోకి రాగలదని ఆయన చెప్పారు.
షాద్‌నగర్ ఫార్మ్‌లో ప్రస్తుతం 65 మంది రైతులతో కలిసి పని చేస్తుండగా, వచ్చే మూడేళ్లలో దీన్ని 380మందికి పెంచుకోనున్నట్లు, అక్కడ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా నెలకొల్పినట్లు వివరించారు. ఇప్పుడు మూడు క్లస్టర్లు ఉండగా పుణెలో మరొకటి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు శశికుమార్ చెప్పారు. ఇప్పటివరకు సుమారు రూ. 250 కోట్ల పైగా నిధులు సమీకరించగా .. రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 285 కోట్ల ఆదాయం నమోదు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 400 కోట్ల పైగా అంచనా వేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment