Hyderabad Market
-
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో సగటున 7 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో ఇళ్ల ధరలు 7– 57 శాతం మధ్య పెరిగాయని.. అతి తక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్టు ప్రకటించింది. హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,050కు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.6,580గా ఉంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ధరల పెరుగుదల 57 శాతంగా ఉంది. అక్కడ చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధికి కారణమని వివరించింది. ‘‘ఆర్బీఐ గడిచిన 10 పాలసీ సమీక్షల్లో రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించడం ధరలపై మరింత ఒత్తిడికి దారితీసింది. రేట్ల తగ్గింపు లేకపోవడంతో డెవలపర్లు రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు చేయాల్సి వచి్చంది. ఇది ఇళ్ల ధరల అందుబాటుపై ప్రభావం చూపించింది’’అని ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది. ఇతర పట్టణాల్లో ధరల పెరుగుదల.. → బెంగళూరులో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగి చదరపు అడుగు రూ.7,512కు చేరింది. → చెన్నైలో 22 శాతం మేర ధరలు పెరిగాయి. చదరపు అడుగు రూ.7,179కు చేరుకుంది. → కోల్‌కతాలో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.5,844కు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ధరతో పోల్చి చూస్తే 22 శాతం అధికం. → ముంబైలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.12,590గా నమోదైంది. → పుణెలో 18 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,953కు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది. బలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బలాన్ని, వృద్ధి అవకాశాలను తెలియజేస్తున్నట్టు బీపీటీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) హరీందర్ దిల్లాన్ పేర్కొన్నారు. నాణ్యమైన ప్రాపరీ్టలకు అధిక డిమాండ్ నెలకొనడం ఢిల్లీ ఎన్సీఆర్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో ధరల పెరుగుదల అధికంగా ఉండడానికి కారణమని చెప్పారు. దక్షిణాది మార్కెట్లలో కొత్త ఇళ్ల ప్రారం¿ోత్సవాలు తగ్గడం మార్కెట్లో దిద్దుబాటును సూచిస్తున్నట్టు బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేదీ తెలిపారు. -
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెపె్టంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 18 శాతం తగ్గి 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,26,848 యూనిట్లుగా ఉన్నాయి. తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ ఎన్సీఆర్లో 22 శాతం, నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాల్లో 4 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. మిగిలిన అన్ని పట్టణాల్లో క్షీణించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు జూలై–సెపె్టంబర్ కాలంలో 26% క్షీణించి 13,355 యూని ట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 17,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → చెన్నై మార్కెట్లో 18 శాతం తక్కువగా 4,634 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. → కోల్‌కతా మార్కెట్లో 23% తక్కువగా 3,590 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → పుణెలోనూ 19% క్షీణించి అమ్మకాలు 21,306 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 10% తగ్గి 20,460 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 22,802 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → ముంబైలో 17 శాతం తక్కువగా 10,966 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కావచ్చు. అదే నవీ ముంబైలో మాత్రం 4 శాతం అధికంగా 7,737 యూనిట్ల అమ్మకాలు జరగొచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 22 శాతం వృద్ధితో 10,263 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు అవుతాయి. సాధారణమే.. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో డిమాండ్ బలంగానే ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో విక్రయాలు కొత్త ఆవిష్కరణల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ, అమ్మకాల్లో స్వల్ప క్షీణత అన్నది చరిత్రాత్మకంగా ఉన్న ధోరణే కానీ, ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదు’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజు జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మెరుగైన డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 57 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 92 శాతం వృద్ధిని ఇదే కాలంలో నమోదు చేసింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) నుంచి 20.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో బలమైన డిమాండ్ మద్దతుతో 2023 మొత్తం మీద ఆరు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు 16 శాతం వృద్ధితో రూ.58.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. పునరుద్ధరించుకున్న లీజులు, ఆసక్తి వ్యక్తీకరించిన వాటిని స్థూల ఆఫీస్ స్పేస్ లీజులో మినహాయించారు. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజు 58 శాతం పెరిగి 5.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజు పరిమాణం 3.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో నాలుగు రెట్ల వృద్ధితో మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 4.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► ఢిల్లీ ఎన్సీఆర్లో లీజు 61 శాతం పెరిగి 3.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ► ముంబై మార్కెట్లో ఏకంగా 87 శాతం పెరిగి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ► పుణెలో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ రెట్టింపై 2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. డిమాండ్ కొనసాగుతుంది.. ‘‘భారత ఆఫీస్ మార్కెట్ ఆరంభ అనిశి్చతులను అధిగమించడమే కాదు, అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2023లో 58 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజు నమోదైంది. ఇది 2024 సంవత్సరంలో ఆఫీస్ మార్కెట్ ఆశావహంగా ప్రారంభమయ్యేందుకు మార్గం వేసింది. అనూహ్య సంఘటనలు జరిగినా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలించనున్నాయి. దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ కోసం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ హెడ్, ఎండీ అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. 2023లో ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం వాటా 25 శాతానికి తగ్గిందని, ఇది 2020లో 50 శాతంగా ఉన్నట్టు కొలియర్స్‌ఇండియా నివేదిక తెలిపింది. బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ రెట్టింపైందని.. 2020లో వీటి వాటా 10–12 శాతంగా ఉంటే, 2023లో 16–20 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీల నుంచి లీజు డిమాండ్ 26 శాతానికి చేరుకుంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ 24 శాతం పెరిగి 8.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 19 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి. నివేదికలోని అంశాలు ► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్‌లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. ►అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. ►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. ►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. ►కోల్‌కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. ►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది. సానుకూల సెంటిమెంట్ ‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. హౌసింగ్ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు. -
ఆఫీస్ స్పేస్ లీజులో హైదరాబాద్ టాప్
బెంగళూరు: ఆఫీస్ స్పేస్ లీజు (కార్యాలయ వసతి) పరంగా హైదరాబాద్ మార్కెట్ మంచి వృద్ధిని చూపించింది. జూలై–సెపె్టంబర్ కాలంలో స్థూల లీజు పరిమాణం ఏకంగా రెండున్న రెట్లు పెరిగి 2.5 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్ స్పేస్ లీజు ఒక మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు సెపె్టంబర్ త్రైమాసికంలో 2 శాతం వృద్ధితో 13.2 ఎస్‌ఎఫ్‌టీగా నమోదైనట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజు పరిమాణం 12.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. స్థూల లీజు పరిమాణంలో లీజు రెన్యువల్, ఆసక్తి వ్యక్తీకరణపై సంతకం చేసిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నై మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ లీజుకు డిమాండ్ పెరిగినట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు (తాజా) సెపె్టంబర్ క్వార్టర్లో 3.4 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని 4.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలిస్తే తగ్గింది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కట్లోనూ స్థూల లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.2 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది. ► ముంబైలో స్పల్ప వృద్ధితో 1.6 మిలియన్ నుంచి 1.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► చెన్నైలో ఒక మిలియన్ నుంచి 1.4 మిలియన్‌కు, పుణెలో 0.6 మిలియన్ నుంచి ఒక మిలియన్ చదరపు అడుగులకు స్థూల ఆఫీస్ స్పేస్ లీజు వృద్ధి చెందింది. ఇదే ధోరణి కొనసాగొచ్చు.. ‘‘భారత ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెపె్టంబర్) 2022లో మాదిరే ఉంది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉండడం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌కు మద్దతునిచి్చంది. ఇదే ధోరణి చివరి త్రైమాసికంలోనూ (అక్టోబర్–డిసెంబర్) కొనసాగొచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. 2022లో నమోదైన చారిత్రక ఆఫీస్ స్పేస్ లీజు రికార్డు 2023లో అధిగమిస్తుందేమో చూడాలన్నారు. చివరి త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలో డిమాండ్ బలంగా ఉంటుందని కొలియర్స్ ఇండియాకు చెందిన అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. బెంగళూరు దేశ ఆఫీస్ సేŠప్స్ లీజులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్నారు. -
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్‌హెచ్‌బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్‌హెచ్‌బీ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన ఇళ్ల సరఫరా
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతం పెరిగి 99,989 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలోని తొమ్మిది ముఖ్య పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్–జూన్ కాలంలో 1,22,213 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నూతన సరఫరా 1,10,468 యూనిట్లుగానే ఉంది. దీంతో మొత్తం మీద అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. తొమ్మిది పట్టణాల్లో కలిపి అమ్ముడుపోని యూనిట్లు 2 శాతం తగ్గి 5,15,169 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికం చివరికి వీటి సంఖ్య 5,26,914 యూనిట్లుగా ఉంది. ► టైర్–1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా (1,07,179 యూనిట్లు) ఉన్నాయి. మార్చి చివరికి ఉన్న 1,09,511 యూనిట్లతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ► ముంబైలో అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గి 60,911 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి చివరికి ఇవి 62,735 యూనిట్లుగా ఉండడం గమనార్హం. నవీ ముంబైలో మాత్రం 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 26 శాతం తగ్గి 42,133 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► చెన్నైలో వీటి సంఖ్య 18 శాతం తగ్గి 19,900 యూనిట్లుగా ఉంది. ► పుణెలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు జూన్ త్రైమాసికం చివరికి 9 శాతం పెరిగి 75,905 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరు మార్కెట్లోనూ అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 % పెరిగి 52,208 యూనిట్లుగా నమోదైంది. ► కోల్‌కతా పట్టణలో 20 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధరలపై గృహ రుణాల ప్రభావం నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక నివాస గృహాల అందుబాటు ధరలపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి–జూన్ కాలానికి ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాలకు సంబంధించి ‘అఫర్డబులిటీ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఓ సగటు గృహస్థుడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి రేటును నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ తరచూ ట్రాక్ చేస్తుంటుంది. ఓ గృహస్థుడు తన ఇంటి రుణ ఈఎంఐని చెల్లించేందుకు వీలుగా అతడి ఆదాయ నిష్పత్తిని పరిశీలిస్తుంటుంది. 2023లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై గృహ రుణాల రేట్ల ప్రభావం పడినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో అహ్మదాబాద్ అందుబాటు ధరలతో కూడిన ఇళ్ల మార్కెట్‌గా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి 23 శాతంగా ఉంది. ఆ తర్వాత 28 శాతంతో పుణె, కోల్‌కతా, 28 శాతంతో చెన్నై, బెంగళూరు, 30 శాతంతో ఢిల్లీ ఎన్సీఆర్, 31 శాతంతో హైదరాబాద్, 55 శాతంతో ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ ప్రకారరం ఒక పట్టణంలో 40 శాతం నిష్పత్తి ఉందంటే.. ఆ పట్టణంలోని నివాసులు సగటున తమ ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి రుణ ఈఎంఐ కింద చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టు అర్థం. 40 శాతం ఉంటే అందుబాటు ధరలుగా పరిగణిస్తుంది. 50 శాతానికి పైగా రేషియో ఉందంటే ఇళ్ల ధరలు అందుబాటులో లేనట్టుగా భావిస్తుంది. -
హైదరాబాద్‌లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాల పరంగా హైదరాబాద్ మార్కెట్ ఈ ఏడాది ప్రధమార్ధంలో మంచి పనితీరు చూపించింది. జనవరి–జూన్ మధ్య అమ్మకాలు 24 శాతం పెరిగాయి. 17,890 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే ఆరు నెలల కాలంలో విక్రయాలు 14,460 యూనిట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఈ వివరాలు విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయి. 1,66,090 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 26 శాతం తగ్గి 7,040 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులోనూ అమ్మకాలు 11 శాతం తగ్గి 14,210 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలో 31 శాతం తగ్గి 4,170 యూనిట్లు అమ్ముడుపోగా, అహ్మదాబాద్‌లో మాత్రం 23 శాతం వృద్ధితో 15,710 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నైలో 2 శాతం పెరిగి 6,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 49,520 యూనిట్ల నుంచి 62,630 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు వృద్ధి చెందాయి. -
ఐదు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 8 శాతం పెరిగాయి. కానీ, విడిగా చూస్తే హైదరాబాద్ సహా ఐదు మార్కెట్లలో అమ్మకాలు పడిపోగా, కేవలం మూడు పట్టణాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో మొత్తంమీద ఎనిమిది మార్కెట్లలో కలసి అమ్మకాలు 8 శాతం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 3 శాతం తగ్గాయి. ఈ వివరాలను ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఈ ఎనిమిది పెద్ద పట్టణాల్లో ఏప్రిల్–జూన్ కాలంలో 80,250 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 74,320 యూనిట్లుగా ఉన్నాయి. ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ ఏప్రిల్–జూన్ 2023’ నివేదికను ప్రాప్‌టైగర్ బుధవారం విడుదల చేసింది. ప్రధానంగా ముంబై, పుణె, అహ్మదాబాద్‌లో ఇళ్ల విక్రయాలు పెరగ్గా, హైదరాబాద్‌తోపాటు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లో తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కొనుగోళ్ల పరంగా బలమైన సానుకూల సెంటిమెంట్‌కు దారితీసిందని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ పేర్కొన్నారు. ప్రాప్‌టైగర్, హసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ ఇవన్నీ కూడా ఆర్‌ఈఏ ఇండియా కిందే ఉన్నాయి. గత రెండేళ్లలో ఇళ్ల అమ్మకాల వృద్ధికి కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఇల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం ఇవన్నీ కారణాలుగా ప్రాప్‌టైగర్ నివేదిక వివరించింది. పట్టణాల వారీగా విక్రయాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 7,680 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 7,910 యూనిట్లతో పోలిస్తే 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లో అమ్మకాలు 17 శాతం పెరిగి 8,450 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో విక్రయాల పరంగా 19 శాతం క్షీణత కనిపించింది. 6,790 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. ► చెన్నైలో అమ్మకాలు 5 శాతం తగ్గి 3,050 యూనిట్లుగా ఉన్నాయి. ► కోల్‌కతాలో 40 శాతం తగ్గి 1,940 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 16 శాతం వృద్ధితో 30,260 యూనిట్లకు చేరాయి. ► పుణెలోనూ 37 శాతం అధికంగా 18,850 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
హైదరాబాద్ మార్కెట్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం అధికంగా 10,200 యూనిట్లు విక్రయమయ్యాయి. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 6,560గా ఉన్నాయి. ఈ వివరాలను ప్రాపర్టీ పోర్టల్ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగినట్టు, అదే కాలంలో ఇళ్ల సరఫరాలో 86 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. ఎనిమిది పట్టణాల్లోకి ఇళ్ల అమ్మకాల పరంగా ఎక్కువ వృద్ధి హైదరాబాద్ రి యల్టీ మార్కెట్లోనే నమోదు కావడం గమనార్హం. ఎనిమిది పట్టణాల్లో కలిపి జనవరి–మార్చి కాలంలో 85,850 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పట్టణాల్లో అమ్మకాలు 70,630 యూనిట్లుగా ఉన్నాయి. కొత్తగా ఇళ్ల సరఫరా 1,47,780 యూనిట్లుగా ఉంది. గృహ రుణాలపై గతేడాది నుంచి వడ్డీ రేట్లు 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, అమ్మకాలు బలంగానే ఉన్నట్టు పలు ఇతర నివేదికలు సైతం వెల్లడించాయి. ‘‘విక్రయాలు, కొత్త ఇళ్ల సరఫరా పరంగా భారత హౌసింగ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, మరోవైపు దేశీయంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితిని సానుకూలమనే చెప్పుకోవాలి’’అని ప్రాప్‌టైగర్ డాట్ కామ్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల్లోనూ చెప్పుకోతగ్గ వృద్ధి కనిపిస్తుండడం, మార్కెట్లో డిమాండ్ పట్ల డెవలపర్లలో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని ప్రాప్ టైగర్ నివేదిక పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 39 శాతం పెరిగాయి. 32,380 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 23,370 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణె మార్కెట్లో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెంది 18,920 యూనిట్లుగా ఉన్నాయి. ► అహ్మదాబాద్‌లో 31% అధికంగా 7,250 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► చెన్నై మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► బెంగళూరులోనూ 3% అమ్మకాలు తగ్గాయి. 7,440 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► కోల్‌కతా మార్కెట్లో 22 శాతం తక్కువగా 2,230 యూనిట్లు విక్రయమయ్యాయి. -
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది. పట్టణాల వారీగా.. ►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది. ►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది. ►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది. ►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది. ►కోల్‌కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది. ►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది. ►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది. ►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
వరల్డ్‌లో తొలి, ఏకైక అద్భుత టీవీ: మరి ధర సంగతేంటి?
హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీ ప్రపంచంలోనే తొలి, ఏకైక రోలబుల్ టీవీని లాంచ్ చేసింది. ఎల్జీ సిగ్నేచర్ ఓలెడ్-ఆర్ టీవీతో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. భవిష్యత్తులో డిస్ప్లే టెక్నాలజీలో ఇదొక ముందడుగని లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అంతేకాదు హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో విప్లవాత్మకమైన టీవీ ఇది అని ఎల్జీ ప్రకటించింది. కస్టమర్లకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందించే డాల్బీతో టెక్నాలజీతో, 42 అంగుళాల నుంచి 97 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో లాంచ్ చేసింది. ఇది లగ్జరీ టీవీ. అవసరం లేనపుడు ఈ టీవీని బాక్స్‌లో మడిచి పెట్టేయొచ్చు అని ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి చెప్పారు. భారతదేశం అంతటా కనీసం వెయ్యి టీవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రోలబుల్ టీవీ ప్రత్యేకత అంతర్జాతీయంగా ముఖ్య ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఆన్ చేయగానే వెడల్పాటి సౌండ్ సిస్టమ్ నుంచి 65 అంగుళాల టీవీ వెలుపలికి వస్తుంది. ఆఫ్ చేయగానే దానంతట అదే చుట్టుకుంటూ పెట్టెలోకి వెళ్లిపోతుంది. సెల్ఫ్-లైట్ పిక్సెల్ టెక్నాలజీ కారణంగా ఇలా వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
ఉల్లి ‘ఘాటు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధర కొండెక్కుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ. 15 మేర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 42 నుంచి రూ. 45 పలుకుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, కొంతమేర కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది. రాష్ట్రంలో సాధారణ ఉల్లి సాగు విస్తీర్ణం 13,247 హెక్టార్లు కాగా ఈ ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల్లో భారీ తగ్గుదల కారణంగా 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా రాష్ట్ర మార్కెట్లకు మహారాష్ట్రలోని షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి దిగుమతులు ఉంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. మార్కెట్లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్ట్రాల అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా డిమాండ్ పెరగడంతో ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. 2, 3 రోజుల కిందటి వరకు హైదరాబాద్ మార్కెట్లకు క్వింటాల్‌కు రూ. 2 వేల మేర పలికిన ధర మంగళవా రం రూ. 3 వేలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్లకు 4–5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది. దీంతో హోల్‌సేల్ ధరే కిలో రూ. 33కి చేరింది. మరోవైపు కర్నూలు జిల్లాలో సైతం మార్కెట్లోకి ఉల్లి అంతగా రావడం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు అనుకున్నంత జరగకపోవడంతో తెలంగాణకు అవసరమైన సరఫరా లేక ధర పెరుగుతోంది. హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో పది రోజుల కింద కిలో ఉల్లి రూ. 30 మేర ఉండగా ప్రస్తుతం రూ. 42 నుంచి రూ .45కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. 50 వేల టన్నులు నిల్వ ఉంచిన కేంద్రం ఇటీవలి వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగుతాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే 50 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా సేకరించి నిల్వ చేసింది. వచ్చే నెలలో ఉల్లి ధరలు మరింత పెరిగిన పక్షంలో నిల్వచేసిన ఉల్లిని మార్కెట్లోకి అందుబాటు లోకి తెచ్చి ధరను నియంత్రిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారులశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారులు నిల్వలు పెంచకుండా చూడటం, వారిపై నియంత్రణ చర్యలు చేపడితేనే ఉల్లి ధరలకు కళ్లెంపడే అవకాశం ఉంది. లేదంటే మున్ముం దు వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు. -
ఉల్లి..ఫుల్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిఏటా చలికాలంలో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది కొత్త ఉల్లిపంట మార్కెట్లకు పోటెత్తడంతో హోల్‌సేల్ ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ఇక్కడ డిమాండ్‌కు మించి సరుకు చేరింది. ఈ నేపథ్యంలోనే ధరలు భారీగా పడిపోయాయి. గత ఏడాది ఈ సీజన్లో ఉల్లి హోల్‌సేల్ ధరలు కిలో రూ.30 వరకు ఉండగా, ఈ ఏడాది రూ.10 లోపే ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత ఏడాది రిటైల్ మార్కెట్లోకిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉండగా, ఈ ఏడాది రూ.10 నుంచి 15 రూపాయల లోపే ఉన్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో మలక్‌పేట్ మార్కెట్‌కు రోజుకు 34 లారీల ఉల్లి రాగా, ఈ ఏడాది 120 లారీల ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువ పండించడంతో అక్కడ ధరలు పడిపోయాయి. దీంతో నగరానికి దిగుమతులు పెరిగాయి. స్థానిక దిగుమతులూ ఎక్కువే... నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితోనే పూర్తి అవుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు, కర్ణాటక నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువగా మార్కెట్‌కు దిగుమతి అయితే దాన్ని నిలువ చేసుకోవడానికి స్టోరేజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. -
యాక్ట్ ఫైబర్‌నెట్‌తో హుక్ జట్టు
హైదరాబాద్ మార్కెట్లో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) సేవల సంస్థ హుక్ తాజాగా హైదరాబాద్ మార్కెట్‌కు సంబంధించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్‌నెట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద యాక్ట్ ఖాతాదారులు ఒక నెల రోజుల పాటు ఉచితంగా హుక్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చని హుక్ భారత విభాగం ఎండీ సలిల్ కపూర్ బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు. తమ వద్ద పదివేల పైచిలుకు హాలీవుడ్, బాలీవుడ్, ప్రాంతీయ భాషా సినిమాలతో పాటు ది బిగ్ బ్యాంగ్ థియరీ, గోథమ్ తదితర సీరియల్స్, టీవీ షోలూ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియో, ఆడియో కంటెంట్ వాటా సుమారు 30 శాతంగా ఉండగా.. 2018 నాటికి ఇది 89 శాతానికి చేరగలదన్న అంచనాలున్నట్లు సలిల్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉన్న హైదరాబాద్‌తో ప్రారంభించి యాక్ట్‌తో భాగస్వామ్యాన్ని త్వరలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి కూడా విస్తరించనున్నట్లు సలిల్ కపూర్ చెప్పారు. నెలకు రూ. 249 అద్దెతో 5 కనెక్టెడ్ డివైజ్‌లపై సినిమాలు, సీరియల్స్ మొదలైనవి వీక్షించవచ్చని ఆయన చెప్పారు. అఫ్లైన్ డౌన్లోడ్ సదుపాయం కూడా ఉందన్నారు. మరోవైపు, హుక్తో భాగస్వామ్యాన్ని స్వాగతించిన యాక్ట్ గ్రూప్ సీఈవో బాల మల్లాది .. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు అత్యుత్తమ కంటెంట్‌ను తమ కస్టమర్లకు అందించేందుకు ఇటువంటివి దోహదపడగలవని తెలిపారు. -
హైదరాబాద్ మార్కెట్లోకి కిష్కో కిచెన్ వేర్స్
-
ఆడి ఆర్8 వీ10 ప్లస్@రూ. 2.62 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఆర్8 వీ10 ప్లస్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.62 కోట్లు (హైదరాబాద్ ఎక్స్‌షోరూం). రేస్ కార్ అయిన ఆడి ఆర్8 ఎల్ఎంఎస్ మోడల్‌కు చెందిన 50 శాతం విడిభాగాలను వీ10 ప్లస్ తయారీలో వాడారు. 610 హెచ్పీతో 5.2 ఎఫ్ఎస్ఐ క్వాట్రో ఇంజన్‌ను పొందుపరిచారు. 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. 31.24 సెంటీమీటర్ల స్క్రీన్‌తో వర్చువల్ కాక్‌పిట్ అదనపు ఆకర్షణ. వినూత్న టెక్నాలజీ కారణంగా.. రాత్రి వేళ కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు దాటగానే లేజర్ లైట్లు తెరుచుకుని అధిక కాంతిని ఇస్తాయని ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ ఎం. సంఘ్వీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇప్పటికే మూడు బుకింగ్స్ నమోదు అయ్యాయన్నారు. 9 ఏళ్లలో తమ షోరూం ద్వారా మొత్తం 2,700లకుపైగా కార్లు విక్రయించామని చెప్పారు. తమ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 25 శాతమే అయినప్పటికీ, వృద్ధి రేటు ఏకంగా 35 శాతముందని అన్నారు. -
హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’
♦ కల్పతరు గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ♦ సనత్‌నగర్‌లో 5.5 ఎకరాల్లో తొలిదశ ♦ నెలరోజుల్లోగా వివరాలు ప్రకటిస్తాం ♦ కల్పతరు ప్రాజెక్ట్స్ లిస్టింగ్ ఆలోచన లేదు ♦ రియల్ ఎస్టేట్ బిల్లు చాలావరకూ మంచిదే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ‘కల్పతరు’ గ్రూప్... హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ గ్రూప్ రూ.8,100 కోట్ల వార్షిక టర్నోవర్‌తో దేశంతో పాటు విదేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రూప్‌కు చెందిన జేఎంసీ ప్రాజెక్ట్స్, కల్పతరు పవర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయినవి కాగా... శుభమ్ లాజిస్టిక్స్, ప్రాపర్టీ సొల్యూషన్స్, రియల్టీ దిగ్గజం కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంకా లిస్ట్ కాలేదు. ప్రధానంగా ముంబైతో పాటు పుణె, బెంగళూరు వంటి చోట్ల 93 దాకా ప్రీమియం ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న కల్పతరు ప్రాజెక్ట్స్... హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో తొలి ప్రాజెక్టు చేపడుతోంది. వచ్చేనెల్లో దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ... హైదరాబాద్ రియల్టీలోకి వస్తున్నట్లున్నారు? అవును! 2008లో మేం సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వేలం వేసిన 9.5 ఎకరాల స్థలం కొన్నాం. దాన్నిపుడు డెవలప్ చేస్తున్నాం. తొలి దశలో 5.5 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పనులు ఆరంభమయ్యాయి. అక్షయ తృతీయకన్నా ముందే వివరాలు ప్రకటిస్తాం. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మీరు అంచనా వేస్తున్నంత బాగుందా? మార్కెట్లో మరీ బూమ్ ఉందని చెప్పలేం. కాకపోతే విశ్వసనీయత ఉన్న ప్రాజెక్టులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌కు ఉజ్వలమైన భవిష్యత్తుంది. ఈ నమ్మకంతోనే అడుగు పెడుతున్నాం. హైటెక్ సిటీ, ఔటర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను వదిలి సనత్‌నగర్‌లో ఆరంభిస్తున్నారేం? అది నగరానికి మధ్యలో ఉంది. మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ దగ్గర. అలాంటిచోట 10 ఎకరాల స్థలం దొరకటమంటే మాటలు కాదు. మాకు అదృష్టంకొద్దీ దొరికింది. అందుకే ఆరంభిస్తున్నాం. కల్పతరు ప్రాజెక్ట్స్ ప్రీమియం సెగ్మెంట్లోనే ఉంది. హైదరాబాద్‌లోనూ ఇదే పంథా కొనసాగిస్తారా? ముంబైలో మా ప్రాజెక్టులు ప్రీమియంవే. కాదనను. ఇప్పుడైతే ఒకో ఫ్లాట్ కనీస ధర రూ.7-8 కోట్ల నుంచి గరిష్ఠంగా 35 కోట్ల వరకూ ఉంటోంది. కాకపోతే ముంబైలో మేం ప్రాజెక్టులు చేపడుతున్న ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు ఈ ధరను డిమాండ్ చేస్తున్నాయి. అంతేతప్ప హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎందుకనుకోవాలి? అక్కడి పరిస్థితుల బట్టే అక్కడ ప్రాజెక్టులుంటాయి. ఇంకా హైదరాబాద్‌లో మీ గ్రూప్ కార్యకలాపాలేమైనా...? మా గ్రూప్‌కు చెందిన ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎస్‌పీఎల్) సంస్థ వివిధ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను చూస్తుంది. మా ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం దీనిదే. హైదరాబాద్‌లో ఇతరులకు చెందిన కొన్ని కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను కూడా మేం చూస్తున్నాం. కల్పతరు ప్రాజెక్ట్ ఐపీఓ ప్రయత్నాలేమైనా చేస్తోందా? అలాంటిదేమీ లేదు. అసలు ఆ ఆలోచనే లేదు. గ్రూప్ కంపెనీలన్నీ చక్కని దారిలో వెళుతున్నాయి. ఇప్పుడైతే మిగతా కంపెనీల లిస్టింగ్ గురించి ఏ ఆలోచనలూ చేయటం లేదు. రియల్ ఎస్టేట్ బిల్లు బిల్డర్లకు లాభమా? నష్టమా? అది ప్రధానంగా బిల్డర్ల కోసం తెచ్చిన బిల్లు కాదు. కష్టపడి ఇల్లు కొనుక్కునే వారికి భద్రత కలిగించాలని. అందులోని కొన్ని అంశాలు మాకూ నచ్చలేదు. కానీ మొత్తమ్మీద చూస్తే రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఒక నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నమిది. ఎవరు పడితే వారు బోర్డు పెట్టి వినియోగదారుల్ని నమ్మించి మోసం చేసే అవకాశం లేకుండా... కాస్త విశ్వసనీయత, స్తోమత ఉన్నవారినే ఈ రంగంలో నిలిచేలా చేస్తుందీ బిల్లు. హైదరాబాద్‌లో మరిన్ని ప్రాజెక్టులేమైనా చేపడతారా? కచ్చితంగా. ఎందుకంటే గూగుల్, ఉబెర్, అమెజాన్ వంటి దిగ్గజాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న సిటీలో విస్తరించాలని ఎవరైనా అనుకుంటారు. కాకపోతే ఇప్పటికప్పుడు ఎలాంటి ఆలోచనా చేయటం లేదు. -
హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటీఆర్ ''స్నాక్అప్'' స్నాక్స్
హైదరాబాద్: దేశీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అగ్రగామి ఎంటీఆర్ తాజాగా ‘స్నాక్అప్’ స్నాక్స్‌ను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇవి 16 రుచుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కర్నాటక మార్కెట్లో విజయవంతమైన స్నాక్అప్ శ్రేణిని ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రవేశపెడుతున్నామని, ఇక్కడి ప్రజలు కూడా తమ ఉత్పత్తులను ఆదరిస్తారని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. 180 గ్రాముల ప్యాక్ ధర రూ.60గా ఉంటుందని పేర్కొన్నారు. ‘స్నాక్అప్’ స్నాక్స్ దగ్గరిలోని దుకాణాల్లో, ఆధునిక ట్రేడ్ స్టోర్లలోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌పీరియో పికప్
-
బ్లూ బర్డ్ నుంచి ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లు
హైదరాబాద్: బ్లూ బర్డ్ కంపెనీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లను హైదరాబాద్ మార్కెట్లోకి తెచ్చింది. పూర్తిగా హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ప్యూరిఫైయర్లను రూపొందించామని బ్లూ బర్డ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ, వాణిజ్య అవసరాలనుకనుగుణంగా 15 రకాల మోడళ్లను అందిస్తున్నామని బ్లూ బర్డ్ ఎండీ, ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. వీటి ధరలు రూ.16,000 నుంచి రూ.60,000 రేంజ్లో ఉన్నాయని తెలిపారు. అత్యున్నత నాణ్యత గల ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించడమే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వాటర్ ప్యూరిఫైర్లను అందిస్తున్నామని వివరించారు. -
పాలసేకరణలో నంబర్‌వన్ స్థానంపై కేఎంఎఫ్ దృష్టి
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ విస్తరణ దిశగా అడుగులు ♦ హైదరాబాద్‌లో లీటరు రూ. 34కే నందిని స్పెషల్ టోన్డ్ మిల్క్ ♦ హైదరాబాద్‌లో రోజుకు రెండు లక్షల లీటర్ల విక్రయ లక్ష్యం ♦ కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ పి.నాగరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా పాలసేకరణలో మొదటిస్థానం కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టినట్లు కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉన్న కేఎంఎఫ్ రానున్న కాలంలో దేశీయంగా కూడా ఆ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేఎంఎఫ్ చైర్మన్ పి. నాగరాజు తెలిపారు. ఇందుకోసం ఉత్తరాది మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. నెలరోజుల్లో ముంబై, పూణే నగరాలతో పాటు త్వరలో ఢిల్లీ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1.49 కోట్ల లీటర్లను సేకరించడం ద్వారా గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ (అమూ ల్ బ్రాండ్) దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాదిన రోజుకు 72 లక్షల లీటర్ల పాల సమీకరణతో కేఎంఎఫ్ మొదటి స్థానంలో ఉంది. ఈ 72 లక్షల లీటర్ల పాలల్లో కేవలం 52 లక్షల లీటర్లను మాత్రమే పాలు పెరుగు, ఇతర ఉత్పత్తులకు వినియోగించగలుగుతున్నామని, మిగిలిన మొత్తాన్ని పాలపొడికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి నందిని స్పెషల్ టోన్డ్ మిల్క్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. 3.5% వెన్నశాతం ఉన్న లీటరు పాలను కేవ లం రూ. 34కే అందిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి ప్రైవేటు కంపెనీలు అధిక ధరకు విక్రయిస్తున్న హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు కేఎంఎఫ్ ప్రకటించింది. నందిని బ్రాండ్ ప్రవేశంతో అన్ని కంపెనీలు పాల ధరలను గణనీయంగా తగ్గించాయని, ఇప్పుడు స్పెషల్ టోన్డ్ మిల్క్ ధరలను తగ్గించడంతో ఈ విభాగంలో కూడా ధరల యుద్ధం మొదలవుతుందన్న అభిప్రాయాన్ని నాగరాజు వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే ఇక్కడ నందిని బ్రాండ్‌కు మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను విక్రయించే స్థాయికి చేరుకుంటామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నందిని బ్రాండ్ తాజా పాలు రోజుకు 75,000 లీటర్లు విక్రయిస్తుంటే, ధీర్ఘకాలం నిల్వ ఉండే గుడ్‌లైఫ్ బ్రాండ్ పాలు 50,000 లీటర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే ఇక్కడ రూ. 40 కోట్ల వ్యయంతో సొంతంగా రోజుకు 5 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
నగరంలో బడా నిర్మాణాలు!
* గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్పైనే దృష్టి * ప్రెస్టిజ్, పూర్వాంకర సంస్థల ప్రాజెక్ట్‌లు సాక్షి, హైదరాబాద్: నగర స్థిరాస్తి రంగంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్కెట్ ఒక్కసారిగా మెరుగైతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలను ప్రకటించాయి. - తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌కు ఢోకా లేదన్న సంకేతాలను అందించాయనడంలో సందేహం లేదు. రియల్టీ రంగంలో పరిస్థితులు సానుకూలంగా కన్పించినా.. ప్రాజెక్టులను సందర్శించే వారి సంఖ్య పెరుగుతున్నా.. కొన్న వారు మాత్రం తక్కువేనన్నది వాస్తవం. ప్రాంతం, ధర, సదుపాయాలు, నిర్మాణ ప్రగతి మెరుగ్గా ఉన్న ప్రాజెక్టుల్లో విక్రయాలు బాగానే ఉంటున్నాయన్నది బిల్డర్ల మాట. ప్రెస్టిజ్, పూర్వాంకర ప్రాజెక్ట్‌లు.. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ల చుట్టూ గల ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలకు గిరాకీ ఎప్పటికైనా ఉంటుంది. అందుకే బెంగళూరుకు చెందిన ప్రెస్టిజ్ గ్రూప్ కొండాపూర్‌లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రెండు భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. కొండాపూర్‌లో సుమారు 4.96 ఎకరాల్లో 17 అంతస్థుల్లో 349 ఫ్లాట్లను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21.85 ఎకరాల్లో 28-34 అంతస్థుల్లో 2,240 ఫ్లాట్లు గల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. పూర్వాంకర గ్రూప్ కొండాపూర్‌లో పూర్వ సమ్మిట్ పేరుతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. అలాగే నార్సింగిలో పుణేకి చెందిన ఆక్యురేట్ డెవలపర్స్ 6.5 ఎకరాల్లో 722 ఫ్లాట్లు గల నిర్మాణాన్ని జీ+12 అంతస్థుల్లో నిర్మించనుంది. కేవలం క్లబ్‌హౌస్ కోసమే 30 వేల చ.అ. స్థలాన్ని కేటాయించారు. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పసిఫికా సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హిల్ క్రెస్ట్ ప్రాజెక్ట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం నిర్మాణం వచ్చేది 40 ఎకరాల్లో కాగా.. తొలి విడతగా 684 ఫ్లాట్లను నిర్మించాలని ప్రణాళిక. తెలుసుకున్నాకే.. అడుగేయండి! బిల్డరైనా.. జనాలైనా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేముందు మార్కెట్ గురించి, లోకేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక సరైన ప్లానింగ్ తో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ.. నాణ్యమైన, నమ్మకమైన ప్రాజెక్ట్‌లను కట్టాలని’’ సూచిస్తున్నారు రామ్ డెవలపర్స్ ఎండీ రాము వనపర్తి. అప్పుడే మార్కెట్లో నిలబడటమే కాకుండా.. కొనుగోలుదారులూ స్వాగతిస్తారంటున్నారు. అందుకే నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాం. - చిక్కడపల్లిలో 475 గజాల్లో ‘మేఫెయిర్ అవెన్యూస్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందు లో 1,195-1,475 చ.అ. విస్తీర్ణాలుండే 2,3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఎనిమిదొస్తాయి. ధర చ.అ.కు రూ.5,250. - పంజగుట్టలో 550 గజాల్లో ‘రామ్ మిడోస్’ను నిర్మిస్తున్నాం. ఇందులో 8 ఫ్లాటొస్తాయి. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.7 వేలు. ఇదే ప్రాంతంలో 1,050 గజాల్లో ఎలైట్ హాబిటేట్నూ నిర్మిస్తున్నాం. ఇందులో 15 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. - బేగంపేట షాపర్స్‌స్టాప్ వెనక 720 గజాల్లో 8 ఫ్లాట్లుండే ఓ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.6 వేలు. - బెంగళూరులోనూ పలు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నాం. కేఆర్ పురంలో 650 గజాల్లో 20 ఫ్లాట్లుండే ప్రాజెక్ట్, ఆల్సూర్లో 480 గజాల్లో 8 ఫ్లాట్లుండే మరో ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. అలాగే తనిసంద్రలో 155 ఫ్లాట్లుండే ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. -
హైదరాబాద్ మార్కెట్లో కొత్త సి-క్లాస్ బెంజ్!
-
కస్టమైజ్డ్ వాహనాలకు డిమాండ్..
- ఫోర్స్ మోటార్స్ ప్రెసిడెంట్ అశుతోష్ ఖోస్లా - హైదరాబాద్ మార్కెట్లోకి కొత్త మోడల్ బస్‌లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వాహనాల డిజైన్‌ను కస్టమైజ్ చేస్తున్నట్టు ఫోర్స్ మోటార్స్ తెలిపింది. వాహన కంపెనీలకు ఈ-సెల్లింగ్ కొత్త వేదికైందని ఫోర్స్ మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగం సేల్స్, మార్కెటింగ్ ప్రెసిడెంట్ అశుతోష్ ఖోస్లా తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం కొత్త బస్‌లను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫర్నిచర్, ఆహారోత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి విక్రయాల్లో ఉన్న ఆన్లైన్ కంపెనీలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు అవసరమవుతాయని చెప్పారు. కంపెనీ అమ్మకాల్లో ఈ విభాగం వాటా ప్రస్తుతం 5 శాతముందని, నూతన డిజైన్ల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. సైనిక దళాలకు అంబులెన్సులను కంపెనీ ఇప్పటికే సరఫరా చేస్తోంది. సైనికుల ప్రయాణానికి అనువైన వాహనాలనూ డిజైన్ చేయగలమన్నారు. చైల్డ్ బస్ ట్రాకర్.. ఫోర్స్ మోటార్స్ 13 సీట్ల ట్రాక్స్ క్రూయిజర్ నుంచి 26 సీట్ల ట్రావెలర్-26 మోడల్స్ వరకు చైల్డ్ బస్ ట్రాకర్ ఫీచర్‌ను పొందుపరిచింది. విద్యార్థి స్కూల్ వాహనంలో ఎక్కింది మొదలు ఇంటికి చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాక్ చేసి సమాచారాన్ని పాఠశాలకు, ఆపరేటర్‌కు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. నిర్దేశించినట్టు కాకుండా వేరే మార్గంలో బస్ వెళ్లినా అలర్ట్ చేస్తుంది. లైవ్ వీడియో చూసేందుకు కెమెరాలూ ఉంటాయి. ఎక్స్ షోరూంలో వాహనాల ధర రూ.6.34 లక్షల నుంచి ప్రారంభం. కాగా, 9-20 సీట్ల విభాగం వాహనాలు 3 శాతం వృద్ధితో ఏటా దేశంలో 18,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. 22 శాతం వృద్ధితో 61 శాతం వాటాను ఫోర్స్ దక్కించుకుంది. 26 సీట్ల వాహనాలు ఏటా 10 వేలు అమ్ముడవుతున్నాయి. కంపెనీ 61 శాతం వృద్ధితో 12 శాతం వాటా చేజిక్కించుకుంది. 2014-15లో మొత్తం 23,000 యూనిట్ల విక్రయాలు లక్ష్యంగా చేసుకుంది.