న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాల పరంగా హైదరాబాద్ మార్కెట్ ఈ ఏడాది ప్రధమార్ధంలో మంచి పనితీరు చూపించింది. జనవరి–జూన్ మధ్య అమ్మకాలు 24 శాతం పెరిగాయి. 17,890 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే ఆరు నెలల కాలంలో విక్రయాలు 14,460 యూనిట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఈ వివరాలు విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయి.
1,66,090 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 26 శాతం తగ్గి 7,040 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులోనూ అమ్మకాలు 11 శాతం తగ్గి 14,210 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలో 31 శాతం తగ్గి 4,170 యూనిట్లు అమ్ముడుపోగా, అహ్మదాబాద్‌లో మాత్రం 23 శాతం వృద్ధితో 15,710 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నైలో 2 శాతం పెరిగి 6,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 49,520 యూనిట్ల నుంచి 62,630 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు
వృద్ధి చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment