hikes up
-
హైదరాబాద్‌లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాల పరంగా హైదరాబాద్ మార్కెట్ ఈ ఏడాది ప్రధమార్ధంలో మంచి పనితీరు చూపించింది. జనవరి–జూన్ మధ్య అమ్మకాలు 24 శాతం పెరిగాయి. 17,890 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే ఆరు నెలల కాలంలో విక్రయాలు 14,460 యూనిట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఈ వివరాలు విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయి. 1,66,090 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 26 శాతం తగ్గి 7,040 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులోనూ అమ్మకాలు 11 శాతం తగ్గి 14,210 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలో 31 శాతం తగ్గి 4,170 యూనిట్లు అమ్ముడుపోగా, అహ్మదాబాద్‌లో మాత్రం 23 శాతం వృద్ధితో 15,710 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నైలో 2 శాతం పెరిగి 6,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 49,520 యూనిట్ల నుంచి 62,630 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు వృద్ధి చెందాయి. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
టెల్కోల ఆదాయానికి బూస్ట్
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు యూజర్లపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్రమంగా పెరగనుంది. కరోనా వైరస్ కాలంలో పెరిగిన డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు (మార్కెట్ ఆధారితమైనది కావొచ్చు లేదా నియంత్రణ సంస్థపరమైన చర్యల ఆధారితమైనదైనా కావొచ్చు) తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఏఆర్పీయూల పెరుగుదల తప్పనిసరిగా ఉండవచ్చని, ఫలితంగా 2024–25 నాటికి పరిశ్రమ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 2,60,000 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. భవిష్యత్ పెట్టుబడుల అవసరాలను బట్టి చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టెల్కోల ఏఆర్పీయూ రూ. 230–250 స్థాయికి చేరాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.ఇక ఆధిపత్యమంతా రెండు కంపెనీలదే కాకుండా చూసేందుకు వొడాఫోన్ ఐడియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంస్థ ఏఆర్పీయూ రూ. 190–200 దాకా ఉండాల్సి వస్తుందని పేర్కొంది. కొత్త చోదకాలు..: ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్న ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్), ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ వంటి వ్యాపార విభాగాలు భవిష్యత్‌లో వృద్ధికి కొత్త చోదకాలుగా మారగలవని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది. ఈ రెండు విభాగాల్లో జియో వాటా 5–10 శాతం స్థాయిలోనే ఉండటంతో అది చౌక పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో జియో యూజర్ల సంఖ్య పెరగడం కొనసాగుతుందని వివరించింది. వొడాఫోన్ ఐడియా యూజర్లను కొల్లగొట్టడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50% మార్కెట్ వాటా లక్ష్యాన్ని సాధించవచ్చని, ఎయిర్టెల్ మాత్రం తన 30% వాటాను రక్షించుకోగలదని నివేదిక అభిప్రాయపడింది. -
ముడిచమురు @ 75 డాలర్లు
లండన్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు మంటలు మొదలయ్యాయి. గురువారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌క్రూడ్ ధర 75 డాలర్ల పైన ఆరునెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఇరాన్‌పై ఆంక్షలతో చమురు సరఫరా అతలాకుతలం అవుతుందన్న ఆందోళనలు చమురు ధరల్లో కాక పెంచాయి. గురువారం ఇంట్రాడేలో బ్రెంట్ క్రూడ్ 75.60 డాలర్లను తాకింది. గత అక్టోబర్ తర్వాత ఈ స్థాయి చూడడం ఇదే తొలిసారి. మరోవైపు డబ్లు్యటీఐ క్రూడ్ సైతం ఆరునెలల గరిష్టం 66.16 డాలర్లను చేరింది. ఇరాన్‌పై గతంలోనే ఆంక్షలు విధించిన అమెరికా అప్పట్లో ఎనిమిది దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజాగా ఈ మినహాయింపును కొనసాగించేది లేదని యూఎస్ స్పష్టం చేసింది. మే2తో మినహాయింపుల గడువు ముగియనుంది. ఇరాన్ సరఫరా కొరతను దృష్టిలో ఉంచుకొని ఒపెక్ తన ఉత్పత్తి కోతలను తగ్గించుకుంటుందా, లేక కొనసాగిస్తుందా? అని నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు చమురు ఉత్పత్తి పెంచే ఆలోచనేమీ లేదని ఒపెక్ పెద్దన్న సౌదీ బుధవారం ప్రకటించింది. ఆంక్షల ప్రభావం ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా చమురు ఇన్వెంటరీల్లో మంచి పెరుగుదలే నమోదవుతోందని, అందువల్ల ఇప్పుడే ఉత్పత్తి కోతను తగ్గించాలని అనుకోవడం లేదని సౌదీ ఎనర్జీ మంత్రి ఖలీద్ అల్‌ఫలీహ్ చెప్పారు. ఒపెక్, రష్యాలు తీసుకున్న ఉత్పత్తి కోత నిర్ణయాలే ఈ ఏడాది చమురు ధరల్లో రికవరీకి కారణం. ప్రస్తుతం ఇరాన్, వెనుజులా, లిబియాల్లో ఉత్పత్తి, సరఫరా సంక్షోభంలో పడినందున ఒపెక్ కోతలు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలకు రెక్కలు వస్తాయని అంచనా. ఆంక్షలు అక్రమం యూఎస్ తమపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ అధిపతి ఆయతుల్లా ఖొమైనీ డిమాండ్ చేశారు. తమ చమురు సరఫరాపై ఆంక్షల విధింపు అక్రమమని, ఇందుకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ ఎంత కావాలంటే అంత, ఎవరికి కావాలంటే వాళ్లకి చమురు సరఫరా చేయగలదన్నారు. 2015లో ఇరాన్‌తో ప్రపంచ అగ్రదేశాలు కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆంక్షలను విధించారు. అయితే ముందస్తు ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షల నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే మినహాయింపులు పొందిన ఎనిమిది దేశాల్లో ఐదు దేశాలు(గ్రీస్, ఇటలీ, జపాన్, సౌత్‌కొరియా, తైవాన్) ఇరాన్ చమురు దిగుమతులను సాధ్యమైనంతవరకు తగ్గించుకున్నాయి. చైనా, ఇండియాలు మాత్రం మినహాయింపుల కొనసాగింపు కోసం చివరి వరకు యత్నించాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా రష్యా నుంచి పొలండ్, జర్మనీకి జరిగే చమురు సరఫరా సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం కూడా ముడిచమురు డిమాండ్ పెరిగేందుకు కారణమైంది. ఈ పరుగు తాత్కాలికమేనా? ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బ్రెంట్‌ధర దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందన్న ఆందోళనలు పెరిగిపోతున్న తరుణాన, బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందగమన ప్రభావంతో మార్కెట్లో చమురు నిల్వలు పెరిగిపోతున్నాయని, సరఫరా ఎక్కడా దెబ్బతినలేదని యూఎస్ ప్రత్యేక ప్రతినిధి బ్రైన్‌హుక్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి రష్యా, సౌదీ, ఇరాక్‌లు తగ్గించిన ఉత్పత్తి ఇరాన్ చమురు సరఫరాకు దాదాపు సమానమని ఎనర్జీ కన్సెల్టెన్సీ రైస్టాడ్‌ఎనర్జీ వెల్లడించింది. ఈ దేశాలు కోతలను ఆపేస్తే చమురు సరఫరా యథాత«థంగా ఉంటుందని, అందువల్ల ధరలు విపరీతంగా పెరగకపోవచ్చని పేర్కొంది. యూఎస్ షేల్ గ్యాస్ ఉత్పత్తి బలంగా పెరుగుతున్నది, దీంతో ప్రపంచంలో సౌదీ, రష్యాలను తోసిరాజని అమెరికా చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందని, అందువల్ల ఈ ఏడాది చమురు ధరల్లో డౌన్‌ట్రెండ్ ఉండొచ్చని క్యాపిటల్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఇందుకు తగ్గట్లే సౌత్‌కొరియా ఎకానమీ తొలి త్రైమాసికంలో అనూహ్యంగా తరుగుదల నమోదు చేసింది. చైనా సైతం మందగమన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మందగమన భయాలతో పలు దేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు సహా పలు చర్యలను ప్రకటిస్తున్నాయి. -
మళ్లీ పెరగనున్న పాల ధర
హైదరాబాద్: పాల ధర మళ్లీ పెరగనుంది.డిమాండ్‌కు తగ్గట్టుగా పాల సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టోన్డ్ మిల్క్ ధర రెండు రూపాయలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. 10-15 రోజుల్లో ఈ సవరణ పూర్తి చేయాలని కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టోన్డ్ పాల ధర లీటరుకు రూ.42 ఉండగా విజయ బ్రాండ్ మాత్రమే రూ.41కు విక్రయిస్తోంది. ప్రైవేటు రంగంలోని హెరిటేజ్, జెర్సీ బ్రాండ్లు తాజాగా హోల్ మిల్క్ ధరను రూ.2 పెంచడంతో లీటరు రూ.56కు చేరింది. జెర్సీ టోన్డ్ ప్రీమియం ధర రూ.42 నుంచి రూ.44కు చేరింది. టోన్డ్ మిల్క్ ధరను కూడా ఈ కంపెనీలు పెంచుతాయని డీలర్లు చెబుతున్నారు. పాల కొరత, దాణా సమస్యలు దేశంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పాల సరఫరా లేదు. ప్రస్తుతం పాల కొరత 20 శాతం దాకా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ స్థాయిలోనే కొరత ఏర్పడిందని నల్గొండ-రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చైర్మన్ జి.జితేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అముల్, నందిని రాకతో తెలుగు రాష్ట్రాల్లో పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ కంపెనీలు తక్కువ ధరకు విక్రయించడంతో ఇతర కంపెనీలు ధర తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని కంపెనీల ధర ఒకేలా ఉంది. మరోసారి ధర సవరించాల్సి వస్తోంది. పాల కొరతకు తోడు దాణా ఖర్చులు అధికంగా ఉండడం కూడా ఇందుకు కారణం. విజయ డెయిరీ రైతులకు లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోంది. నార్ముల్‌కు కూడా దీనిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం అని వివరించారు. ఇక దాణా విషయానికి వస్తే క్వింటాలు దాణా ధర 2014లో రూ.1,600 పలికింది. ఇప్పుడు రూ.2,100 ఉంది. జనవరి-ఫిబ్రవరిలో ఇది రూ.2,500 దాకా వెళ్లింది. అవసరానికి తగ్గట్టుగా గడ్డి కూడా దొరకడం లేదు. దాణా ధరలు పెరగడం భారంగా ఉందని మహబూబ్‌నగర్ సమీపంలోని చుక్మాపూర్ పాడి రైతు రామకృష్ణారెడ్డి తెలిపారు. నాణ్యతనుబట్టి లీటరుకు రూ.33 దాకా రైతుకు వస్తున్నా ఖర్చులు పెరగడంతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోందని చెప్పారు. వర్షాలు ప్రారంభమైతేగానీ గడ్డి లభ్యత సాధ్యం కాదని జితేందర్‌రెడ్డి తెలిపారు.