House Sales
-
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస ఇళ్లకు (లగర్జీ) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. సెపె్టంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లతో పోల్చి చూస్తే 38 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కాస్త మెరుగ్గా 1,560 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. → ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి. → ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు తగ్గిపోయాయి. → పుణెలో రెట్టింపునకు పైగా పెరిగి 810 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి. → కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆధునిక అపార్ట్మెంట్ల వైపు మొగ్గు.. ‘‘ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్ పెరగడం చూస్తున్నాం. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మార్కెట్ మళ్లుతోంది. దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోలి్చతే కీలక వైవిధ్యంగా మారింది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం నివాస అనుభవం, ప్రపంచస్థాయి వసతులు మారిన కొనుగోలుదారుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది. పట్టణాల వారీగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది. బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. చదవండి: ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి. పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మ కాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.పండుగల సీజన్‌తో అమ్మకాలకు ఊతం ‘‘వార్షికంగా చూస్తే సెపె్టంబర్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది’’ అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతుల (స్పేస్) లీజింగ్ సైతం 18% పెరిగింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది పట్టణాలకు సంబంధించిన డేటాను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో 87108 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 82,612 యూనిట్లుగా ఉన్నాయి.స్థూల ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ పట్టణాల్లో 18% పెరిగి 19 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎప్టీ) చేరింది. బహుళజాతి కంపెనీలు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి అధిక డిమాండ్ నెలకొంది. జూలై–సెప్టెంబర్‌లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయన్న అనరాక్, ప్రాప్ ఈక్విటీ సంస్థల అంచనాలకు భిన్నంగా నైట్‌ఫ్రాంక్ గణాంకాలు ఉండడం గమనార్హం. ‘‘2024లో ఇళ్ల మార్కెట్లో సానుకూల ధోరణి నెలకొంది. క్యూ3లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి’’అని నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. రూ.1 కోటికి మించి ధర కలిగిన ప్రీమియం ఇళ్లకు ఏర్పడిన డిమాండ్ అమ్మకాల వృద్ధికి సాయపడుతున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు. అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్టు చెప్పారు. ఇళ్ల లభ్యత, వాటి ధరల పరంగా సవాళ్లు నెలకొన్నట్టు తెలిపారు. జీసీసీల ముఖ్య భూమిక‘‘భారత్‌లో వ్యాపార సంస్థలు, జీసీసీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వృద్ధిలో వీటిదే ప్ర ముఖ పాత్ర. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి ఉంటుందని అంచనా వేస్తున్నాం. 2024 మొత్తం మీద ఆఫీస్ స్థలాల లీజింగ్ 70 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించొచ్చు. నికరంగా 10 మిలియన్ ఎస్ఎఫ్టీ ఎక్కువ. క్రితం ఏడాది కంటే 20% అధికం. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతుండడాన్ని ఈ అసాధారణ వృద్ధి తెలియజేస్తోంది’’అని శిశిర్ బైజాల్ వివరించారు. హైదరాబాద్‌లో 9 శాతం వృద్ధి➤హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 2024 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం పెరిగి 9,114 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం తగ్గి 2.2 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 2.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. ➤ముంబై మార్కెట్లో రికార్డు స్థాయిలో 24,222 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల కంటే 9 శాతం ఎక్కువ. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం 17 శాతం తగ్గిపోయి 2.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ➤బెంగళూరులో 11 శాతం వృద్ధితో 14,604 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇక్కడ రెండున్నర రెట్లు పెరిగి 5.3 మిలియన్ చదరపు అడుగులకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 2.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది.➤పుణెలో ఇళ్ల అమ్మకాలు కేవలం ఒక శాతమే పెరిగి 13,200 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్క డ కార్యాలయ స్థలాల లీజింగ్ 14 శాతం క్షీణించి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.➤అహ్మదాబాద్‌లో 11 శాతం వృద్ధి నమోదైంది. 4,578 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ సైతం 69 శాతం వృద్ధిని నమోదు చేసింది. 0.3 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ➤కోల్‌కతాలోనూ 14 శాతం అధికంగా 4,309 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. స్థూల ఆఫీస్ స్థలాల లీజింగ్ 38 శాతం తక్కువగా 0.18 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.➤ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం తగ్గాయి. 12,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం పెరిగి 3.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది.➤చెన్నైలో 4,105 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాల కంటే 6 శాతం తక్కువ. చెన్నైలో ఆఫీస్ స్పేస్ 35 శాతం వృద్ధితో 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.➤జూలై–సెప్టెంబర్ కాలంలో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో జీసీసీలు తీసుకున్నదే 37 శాతం (7.1 మిలియన్ ఎస్ఎఫ్టీ)గా ఉంది. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలకు ఏమైంది?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 11 శాతం మేర క్షీణించాయి. మొత్తం 1.07 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,20,290 యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 23 శాతం పెరగడం అమ్మకాల క్షీణతకు కారణాలుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16,375 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. » పుణెలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం తక్కువగా 19,050 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. » ఢిల్లీ ఎన్సీఆర్లో అమ్మకాలు 15,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల కంటే 2% తక్కువ. » బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 8 శాతం క్షీణించి 15,025 యూనిట్లుగా ఉన్నాయి. » కోల్‌కతా పట్టణంలో 25 తక్కువగా 3,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. » చెన్నైలో 4,510 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,945 యూనిట్ల కంటే 9% తగ్గాయి. హైదరాబాద్‌లో ధరల పెరుగుదల అధికం ఏడు ప్రముఖ పట్టణాల్లో హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరల పెరుగుదల అధికంగా 32 శాతం మేర నమోదైంది. ‘‘నిర్మాణంలోకి వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరగడం, అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధితో.. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు మొత్తం మీద 23 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.6,800 నుంచి రూ.8,390కు పెరిగింది’’అని అనరాక్ నివేదిక తెలిపింది. పండుగల కాలంలో డిమాండ్ ‘‘అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ ఇళ్ల అమ్మకాలు క్షీణించాయి. టాప్–7 పట్టణాల్లో నూతన ఇళ్ల యూనిట్ల సరఫరా జూలై–సెపె్టంబర్ మధ్య 19 శాతం తగ్గి 93,750 యూనిట్లుగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,16,220 కొత్త యూనిట్ల సరఫరా నమోదైంది. ఆవిష్కరణల కంటే విక్రయాలు ఎక్కువగా ఉండడం.. డిమాండ్–సరఫరా సమీకరణం బలంగా ఉండడాన్ని సూచిస్తోంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధరలకు తోడు, వర్షాకాలం కావడం విక్రయాలు తగ్గడం వెనుక ఉన్న అంశాలుగా పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెపె్టంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 18 శాతం తగ్గి 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,26,848 యూనిట్లుగా ఉన్నాయి. తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ ఎన్సీఆర్లో 22 శాతం, నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాల్లో 4 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. మిగిలిన అన్ని పట్టణాల్లో క్షీణించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు జూలై–సెపె్టంబర్ కాలంలో 26% క్షీణించి 13,355 యూని ట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 17,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → చెన్నై మార్కెట్లో 18 శాతం తక్కువగా 4,634 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. → కోల్‌కతా మార్కెట్లో 23% తక్కువగా 3,590 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → పుణెలోనూ 19% క్షీణించి అమ్మకాలు 21,306 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 10% తగ్గి 20,460 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 22,802 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → ముంబైలో 17 శాతం తక్కువగా 10,966 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కావచ్చు. అదే నవీ ముంబైలో మాత్రం 4 శాతం అధికంగా 7,737 యూనిట్ల అమ్మకాలు జరగొచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 22 శాతం వృద్ధితో 10,263 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు అవుతాయి. సాధారణమే.. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో డిమాండ్ బలంగానే ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో విక్రయాలు కొత్త ఆవిష్కరణల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ, అమ్మకాల్లో స్వల్ప క్షీణత అన్నది చరిత్రాత్మకంగా ఉన్న ధోరణే కానీ, ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదు’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు.. వీటికే ఎక్కువ డిమాండ్
రియల్ ఎస్టేట్ మార్కెట్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో భూముల అమ్మకాలు, ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2024 ఆగష్టులో రూ. 4043 కోట్ల విలువైన గృహాలు హైదరాబాద్‌లో అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన నివేదికలో ప్రస్తావించింది. ఇది అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం ఎక్కువ.ఆగష్టు 2024లో హైదరాబాద్‌లో 6439 ఇళ్ల రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్స్ అంతకు ముందు ఏడాది ఆగష్టు నెల కంటే కూడా ఒక శాతం తక్కువ. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగష్టు నెల వరకు హైదరాబాద్‌లో 54483 (ఎనిమిది నెలల కాలంలో) ఇల్లు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 41 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఆగష్టులో 50 లక్షల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు 67 శాతం. రూ. కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 15 శాతం. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే నెలకంటే కూడా ఎక్కువే అని గణాంకాలు చెబుతున్నాయి. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 14 శాతం తగ్గి రూ.12,296 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి–మార్చి కాలంలో 14,298 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 6 శాతం తగ్గి 1,13,768 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ (ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్) వెల్లడించింది. జనవరి–మార్చి క్వార్టర్లో ఈ నగరాల్లో విక్రయాలు 1,20,642 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ పనితీరుపై ప్రాప్‌టైగర్ ఒక నివేదిక విడుదల చేసింది. ఇక ఈ ఎనిమిది పట్టణాల్లో అమ్మకాలు, క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విక్రయాలు 80,245 యూనిట్లతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి. ‘‘రియల్ ఎస్టేట్ పట్ల వినియోగదారుల్లో సానుకూల ధోరణి నెలకొన్నప్పటికీ, ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్లకు డిమాండ్ మోస్తరుగా ఉండడానికి సాధారణ ఎన్నికలే కారణం. డెవలపర్లు సైతం కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితమే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ సైతం తగ్గింది. కేంద్రంలో నూతన ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్న అంచనాల మధ్య రానున్న త్రైమాసికాల్లో, ముఖ్యంగా పండుగల రోజుల్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాద్వాన్ పేర్కొన్నారు. పట్టణాల వారీగా విక్రయాలు→ అహ్మదాబాద్‌లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం తగ్గి 9,500 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో విక్రయాలు 12,915 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో 13,495 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసిక విక్రయాలు 10,381 యూనిట్లతో పోలిస్తే 30 శాతం పెరిగాయి. → చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,984 యూనిట్లకు చేరాయి. మార్చి క్వార్టర్లో విక్రయాలు 4,427 యూనిట్లుగా ఉన్నాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో 11,065 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. మార్చి త్రైమాసికంతో పోల్చితే 10 శాతం పెరిగాయి. → కోల్‌కతా మార్కెట్లో 3,237 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. జనవరి–మార్చి క్వార్టర్లో విక్రయాలు 3,857 యూనిట్లుగా ఉన్నాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 8 శాతం క్షీణించి 38,266 యూనిట్లకు పరిమితమయ్యాయి. → పుణె మార్కెట్లోనూ 5 శాతం క్షీణతతో 21,925 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → కొత్త ఇళ్ల సరఫరా అంతక్రితం త్రైమాసికంతో పోలి్చతే జూన్ క్వార్టర్లో 1 శాతం తగ్గి 1,01,677 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జూమ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) బలమైన పనితీరు నమోదు చేసిందిజ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 21 శాతం పెరిగి 18,573 యూనిట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతులకు డిమాండ్ 71 శాతం పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–జూన్ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 1.73 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎనిమిది నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 33 శాతం పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండడం బలమైన ఆర్థిక మూలాలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. దీని ఫలితమే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకోవడంగా పేర్కొన్నారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం ఆఫీస్ వసతుల డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపించింది. స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులకు తోడు, ప్రస్తుత వృద్ధి జోరు ఆధారంగా 2024 సంవత్సరం మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు, వాణిజ్య వసతుల లావాదేవీలు బలంగా నమోదవుతాయనే అంచనా వేస్తున్నాం’’అని బైజాల్ వివరించారు. పట్టణాల వారీగా గణాంకాలు.. → ముంబై నగరంలో ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 16 శాతం అధికం. ఇక ఆఫీస్ వసతుల లీజింగ్ పరిమాణం 79 శాతం వృద్ధితో 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లుగా ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. కార్యాలయ స్థలాల లీజింగ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → పుణెలో 24,525 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది 13 శాతం వృద్ధికి సమానం. ఆఫీస్ వసతుల లీజింగ్ 88 శాతం పెరిగి 4.4 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → చెన్నైలో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ వసతులకు డిమాండ్ 33 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. → కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 25 శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజు సైతం 23 శాతం వృద్ధితో 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి. ఆఫీస్ వసతుల లీజింగ్ భారీ వృద్ధితో 1.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.సానుకూల పరిస్థితుల అన్ని ధరల విభాగాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా ఉన్నట్టు గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అధిక వృద్ధికితోడు, మౌలిక వసతుల అభివృద్ధి డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. సొంతిల్లు కలిగి ఉండాలనే అభిలాష, కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు ఈ వృద్ధిని ప్రధానంగా నడిపిస్తున్నాయని ప్రాపర్టీ ఫస్ట్ రియల్టీ వ్యవస్థాపకుడు, సీఈవో భవేష్ కొఠారి అభిప్రాయపడ్డారు. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు
దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అక్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి.2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై.రెసిడెన్షియల్ విక్రయాలు 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్‌కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.పట్టణాల వారీగా.. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. » ఎంఎంఆర్‌లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. » బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. » పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. » చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. » కోల్‌కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఆల్‌టైమ్ గరిష్టానికి డిమాండ్ ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్‌ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు. -
ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్
ముంబై: బలమైన డిమాండ్ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం(ఎంఎంఆర్), పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, కోల్కత్తా నగరాల్లో క్షీణించాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్‌లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్‌కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. -
ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 38 శాతం అధికంగా రూ.4.5 లక్షల కోట్ల మేర ఉంటాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. లగ్జరీ ఇళ్లకు అధిక డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. 2022లో ఏడు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో (సెపె్టంబర్ వరకు) అమ్మకాలు క్రితం ఏడాది మొత్తం అమ్మకాలతో పోల్చి చూసినా, 7 శాతం వృద్ధితో రూ.3,48,776 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది తొమ్మిది నెలల అమ్మకాలు గతేడాది మొత్తం అమ్మకాలను మించి ఉండడం, ఖరీదైన ఇళ్లకు డిమాండ్ పెరగడాన్ని సూచిస్తోంది. ఇళ్ల ధరలు సగటున 8–18 శాతం మధ్య ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది పెరిగాయి. కనుక గతేడాది అమ్మకాలతో కచి్చతంగా పోల్చి చూడలేం’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఏడు పట్టణాల్లో రూ.1,12,976 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోగా, తర్వాతి మూడు నెలల్లో (జూన్ త్రైమాసికం) ఒక శాతం అధికంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్టు చెప్పారు. పండుగల్లో జోరుగా విక్రయాలు పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు ప్రముఖ పట్టణాల్లో బలంగా ఉన్నట్టు అనుజ్ పురి వెల్లడించారు. కనుక మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది చివరికి రూ.4.5 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో ఏడు పట్టణాల్లో 3.49 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ చివరి వరకు చూసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఇళ్లు అమ్మడవుతాయన్నది అంచనాగా ఉంది. 2022 మొత్తం మీద అమ్ముడైన యూనిట్లు 3.65 లక్షలుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 43 శాతం అధికం ► ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు, 43 శాతం పెరిగి రూ.35,802 కోట్లుగా ఉంది. ► పుణెలో 96 శాతం అధికంగా రూ.39,945 కోట్ల విక్రయాలు కొనసాగాయి. ► చెన్నైలో 45 శాతం వృద్ధితో రూ.11,374 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► బెంగళూరు మార్కెట్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.38,517 కోట్లుగా ఉంది. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 41 శాతం పెరిగి రూ.1,63,924 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 29 శాతం వృద్ధితో 50,188 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ► కోల్‌కతాలో అమ్మకాల విలువ 19 శాతం పెరిగి రూ.9,025 కోట్లుగా ఉంది. -
ఇళ్ల అమ్మకాల జోరు.. హైదరాబాద్‌లో భారీ వృద్ధి!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 14,190 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో అమ్మకాలు 10,570 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 34 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదు, ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో అమ్మకాలు 7.690 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు అమ్మకాలు 85 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లోనూ సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 22 శాతం పెరిగి 1,01,200 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ నివేదిక తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో నూతన ఇళ్ల సరఫరా (కొత్త ప్రాజెక్టులు) 17 శాతం పెరిగి 1,23,080 యూనిట్లుగా ఉంది. పట్టణాల వారీగా.. బెంగళూరు మార్కెట్లో 12,590 యూనిట్లు ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చినప్పుడు 60 శాతం, క్రితం త్రైమాసికంతో పోల్చిచూసినప్పుడు 86 శాతం చొప్పున పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 44 శాతం అధికంగా 7,800 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతా మార్కెట్లో 3,620 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇక్కడ 43 % వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్‌లో 31 అధికంగా 10,300 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ముంబై మార్కెట్లో 30,300 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక్కడ 5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. జూన్ త్రైమాసికంతో పోల్చిచూస్తే అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. పుణె మార్కెట్లో 18 శాతం అధికంగా 18,560 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు అమ్మకాలు 12 శాతం క్షీణించి, 3,870 యూనిట్లకు పరిమితమయ్యాయి. సానుకూల సెంటిమెంట్ ‘‘టాప్8 పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. సానుకూల వినియోగ సెంటిమెంట్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తోంది’’అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ తెలిపారు. గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఖర్చు చేసే ఆదాయం పెరగడం, స్థిరమైన వడ్డీ రేట్లు కొనుగోళ్ల సెంటిమెంట్‌కు మద్దతునిచ్చే అంశాలుగా తెలిపారు. -
లగ్జరీ ఇళ్ల అమ్మకాలు డబుల్.. టాప్‌లో హైదరాబాద్!
Luxury housing sales: దేశంలో ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. ఖరీదు ఎక్కువైనా విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల్లో ఈ ధోరణి ఇటీవల మరింత పెరిగింది. ఈ క్రమంలో రూ.4 కోట్లు, అంతకంటే విలువైన లగ్జరీ నివాసాల అమ్మకాలు దాదాపు రెట్టింపైనట్లు రియల్ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ (CBRE South Asia Pvt.Ltd) ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా టాప్ ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 97 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 4,700 లగ్జరీ నివాసాలు అమ్ముడుపోగా ఈ ఏడాది వాటి సంఖ్య దాదాపు రెట్టింపై 9,200లకు చేరింది. మూడు నగరాల్లోనే 90 శాతం ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ అమ్మకాలలో మొదటి మూడు మార్కెట్లుగా ఉద్భవించాయి. మొత్తం టాప్ ఏడు నగరాల్లో జరిగిన అమ్మకాలలో దాదాపు 90 శాతం ఈ మూడు నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో దాదాపు 37 శాతం వాటాతో ఢిల్లీ-ఎన్సీఆర్ టాప్‌లో ఉండగా ముంబయి, హైదరాబాద్, పుణె వరుసగా 35 శాతం, 18 శాతం, 4 శాతం వాటాతో ముందంజలో ఉన్నాయి. ఈ తొమ్మిది నెలల్లో నమోదైన పటిష్టమైన అమ్మకాల ఆధారంగా ఈ పండుగల సీజన్లో హౌసింగ్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ కొత్త రికార్డును నెలకొల్పుతుందని, మొత్తం గృహాల విక్రయాలు 150,000 యూనిట్లను దాటతాయని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. 8,325 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 7,900గా ఉన్నాయి. ఇళ్ల ధరలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో ఇళ్ల విక్రయాలు 12 శాతం పెరిగి 82,612 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసిక అమ్మకాలు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 73,691 యూనిట్లుగానే ఉన్నాయి. పట్టణాల వారీగా అమ్మకాలు ముంబైలో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 4 శాతం పెరిగాయి. 22,308 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 13,981 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 13,619 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13,013 యూనిట్లతో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగాయి. పుణె మార్కెట్లో 20 శాతం వృద్ధితో 13,079 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో 3,870 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. కోల్‌కతాలో అమ్మకాలు 3,772 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 1,843 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 6 శాతం అధికంగా 4,108 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ధరల్లోనూ పెరుగుదల డిమాండ్‌కు అనుగుణంగా వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరల పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అత్యధికంగా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 11% పెరిగాయి. కోల్‌కతాలో 7%, బెంగళూరు, ముంబై మార్కెట్లలో 6% చొప్పున, పుణెలో 5%, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్లో 4%, చెన్నై మార్కెట్లో 3% చొప్పున ధరలు పెరిగాయి. ‘‘డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుండడంతో ఇళ్ల నిల్వలు (అమ్ముడుపోని) గణనీయంగా పెరిగాయి. ఇళ్ల అమ్మకాలు బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. మొత్తం మీద మార్కెట్లో ఆరోగ్యకర పరిస్థితి నెలకొంది’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. -
ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ హై రికార్డ్.. హైదరాబాద్‌లో అత్యధికం
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగి ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేశాయి. స్థిరమైన తనఖా రేటు మధ్య బలమైన డిమాండ్‌తో జూలై-సెప్టెంబర్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు గతేడాది కంటే 36 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1,20,280 యూనిట్లకు చేరుకున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ (Anarock) నివేదిక పేర్కొంది. (ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!) హైదరాబాద్‌లో అత్యధికం అనరాక్ నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత ఏడాది కాలంలో గృహాల విక్రయాలు 88,230 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో ఏడు నగరాల్లో సగటు గృహాల ధరలు ఏటా 11 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో ఏటా జులై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల ధరల సగటు పెరుగుదల అత్యధికంగా 18 శాతం ఉంది. (అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?) ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో త్రైమాసిక విక్రయాలు ఆల్‌టైమ్ హైని తాకినట్లు అనరాక్ హైలైట్ చేసింది. అయితే ఈ నివేదికలో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఫ్లోర్ల విక్రయాలను చేర్చారు. ప్లాట్లు(ఖాళీ స్థలాలు)ను మాత్రం ఇందులో చేర్చలేదు. ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఇలా.. ఢిల్లీ-ఎన్సీఆర్లో గృహాల విక్రయాలు 2023 జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 14,970 యూనిట్ల నుంచి 6 శాతం పెరిగి 15,865 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఈ కాలంలో ఇళ్ల విక్రయాలు అత్యధికంగా 46 శాతం పెరిగి 26,400 యూనిట్ల నుంచి 38,500 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంలో 12,690 యూనిట్ల నుంచి ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 29 శాతం పెరిగి 16,395 యూనిట్లకు చేరుకున్నాయి. పుణెలో ఇళ్ల అమ్మకాలు గరిష్టంగా 63 శాతం పెరిగి 14,080 యూనిట్ల నుంచి 22,885 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 41 శాతం పెరిగి 11,650 యూనిట్ల నుంచి 16,375 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో ఇళ్ల విక్రయాలు 42 శాతం పెరిగి 3,490 యూనిట్ల నుంచి 4,940 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతాలో గృహాల అమ్మకాలు జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో 4,950 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 5,320 యూనిట్లకు చేరుకున్నాయి. -
హైదరాబాద్‌లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాల పరంగా హైదరాబాద్ మార్కెట్ ఈ ఏడాది ప్రధమార్ధంలో మంచి పనితీరు చూపించింది. జనవరి–జూన్ మధ్య అమ్మకాలు 24 శాతం పెరిగాయి. 17,890 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే ఆరు నెలల కాలంలో విక్రయాలు 14,460 యూనిట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఈ వివరాలు విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయి. 1,66,090 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 26 శాతం తగ్గి 7,040 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులోనూ అమ్మకాలు 11 శాతం తగ్గి 14,210 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలో 31 శాతం తగ్గి 4,170 యూనిట్లు అమ్ముడుపోగా, అహ్మదాబాద్‌లో మాత్రం 23 శాతం వృద్ధితో 15,710 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నైలో 2 శాతం పెరిగి 6,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 49,520 యూనిట్ల నుంచి 62,630 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు వృద్ధి చెందాయి. -
ఐదు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 8 శాతం పెరిగాయి. కానీ, విడిగా చూస్తే హైదరాబాద్ సహా ఐదు మార్కెట్లలో అమ్మకాలు పడిపోగా, కేవలం మూడు పట్టణాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో మొత్తంమీద ఎనిమిది మార్కెట్లలో కలసి అమ్మకాలు 8 శాతం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 3 శాతం తగ్గాయి. ఈ వివరాలను ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఈ ఎనిమిది పెద్ద పట్టణాల్లో ఏప్రిల్–జూన్ కాలంలో 80,250 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 74,320 యూనిట్లుగా ఉన్నాయి. ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ ఏప్రిల్–జూన్ 2023’ నివేదికను ప్రాప్‌టైగర్ బుధవారం విడుదల చేసింది. ప్రధానంగా ముంబై, పుణె, అహ్మదాబాద్‌లో ఇళ్ల విక్రయాలు పెరగ్గా, హైదరాబాద్‌తోపాటు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లో తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కొనుగోళ్ల పరంగా బలమైన సానుకూల సెంటిమెంట్‌కు దారితీసిందని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ పేర్కొన్నారు. ప్రాప్‌టైగర్, హసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ ఇవన్నీ కూడా ఆర్‌ఈఏ ఇండియా కిందే ఉన్నాయి. గత రెండేళ్లలో ఇళ్ల అమ్మకాల వృద్ధికి కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఇల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం ఇవన్నీ కారణాలుగా ప్రాప్‌టైగర్ నివేదిక వివరించింది. పట్టణాల వారీగా విక్రయాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 7,680 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 7,910 యూనిట్లతో పోలిస్తే 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లో అమ్మకాలు 17 శాతం పెరిగి 8,450 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో విక్రయాల పరంగా 19 శాతం క్షీణత కనిపించింది. 6,790 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. ► చెన్నైలో అమ్మకాలు 5 శాతం తగ్గి 3,050 యూనిట్లుగా ఉన్నాయి. ► కోల్‌కతాలో 40 శాతం తగ్గి 1,940 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 16 శాతం వృద్ధితో 30,260 యూనిట్లకు చేరాయి. ► పుణెలోనూ 37 శాతం అధికంగా 18,850 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
విదేశీయులకు షాకిచ్చిన కెనడా
స్థిరాస్తుల (ఇళ్లు) కొనుగోళ్లు,అమ్మకాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1,2023 నుంచి రెండేళ్ల పాటు కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు. కోవిడ్ -19 కారణంగా 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పలువురు రాజకీయ నాయకులు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆ కొరత తగ్గించాలని కెనడీయన్లు ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఆ మరసటి ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాట బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీయే ట్రూడో రెండోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి సామాన్యుల వరకు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కొత్త చట్టంతో కెనడాలో ఇల్లు కొనుగోలు చేసే అవకాశం విదేశీయులు కోల్పోనున్నారు. వడ్డీ రేట్ల పెంపు కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (సీఆర్ఈఏ) లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2022లో ఇళ్ల ధరలు యావరేజ్‌గా $800,000 పెరిగాయి. ఆ తర్వాత 13శాతం తగ్గాయి. అదే సమయంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా మార్టిగేజ్ ఇంట్రస్ట్ రేట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి ఇళ్ల ధరలు 38శాతం పెరిగినట్లు నివేదించగా.. అమ్మకానికి ఉన్న గృహాల జాబితా ప్రీకోవిడ్ ముందుకు చేరాయని తెలిపింది. ఆందోళనలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఇళ్ల కొనుగోళ్లపై కెనడా ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయంపై ఆదేశ రియల్ఎస్టేట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం కెనడియన్లు, ప్రత్యేకించి వింటర్ సీజన్లో ఇక్కడ ఉన్న ఇళ్లను అమ్మేసి విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి, లేదంటే విదేశీయులు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటే మెక్సికో, యూఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. చివరిగా::: మోర్టిగేజ్లోన్ అంటే ఓ వ్యక్తికి సొంతంగా ఓ ఇల్లు ఉండి పోషణ నిమిత్తం మోర్టిగేజ్లోన్ పేరిట కొంత మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్‌గా తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు విఫలమైనా, లేదంటే మరణించినా.. మోర్టిగేజ్లోన్లో ఉన్న ఇంటిని బ్యాంక్ అధికారులు వేలంలో అమ్మేస్తారు. ఆక్షన్‌లో వచ్చిన మొత్తంలో ఎంత లోన్ ఇచ్చారో తీసుకొని మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. -
హైదరాబాద్‌లో దుమ్ములేపిన ఇళ్ల అమ్మకాలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది 25,406 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 47,487 యూనిట్ల విక్రయాలు జరిగాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యధికంగా 3,64,900 యూనిట్లు అమ్మడయ్యాయి. గతేడాది (2021)తో పోలిస్తే ఈ ఏడాది ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 54 శాతం పెరిగాయి. 2021లో విక్రయాలు 2,36,500 యూనిట్లుగా ఉన్నాయి. 2014లో నమోదైన 3.43 లక్షల యూనిట్ల అమ్మకాలే ఇప్పటి వరకు గరష్ట రికార్డుగా ఉంటే, ఈ ఏడాది అమ్మకాలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ ధరలు పెరిగిన ఫలితంగా ఇళ్ల ధరలు ఈ ఏడాది 4–7 శాతం వరకు ఎగసినట్టు అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. హైదారాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ముంబై ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. ►ముంబై ఎంఎంఆర్ మార్కెట్లో 1,09,700 యూనిట్ల ఇళ్ల విక్రయాలు జరిగాయి. 2021లో ఇక్కడ అమ్మకాలు 63,712 యూనిట్లుగానే ఉన్నాయి. ►పుణెలో గతేడాదితో పోలిస్తే 59 శాతం అధికంగా 57,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ►బెంగళూరులో 50 శాతం అధికంగా 49,478 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ►చెన్నైలో 29 శాతం పెరిగి 16,097 యూనిట్లు అమ్మడయ్యాయి. ►కోల్‌కతా మార్కెట్లో గతేడాది 13,077 యూనిట్లు అమ్ముడైతే, ఈ ఏడాది 21,220 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ►ఏడు పట్టణాల్లో 3,57,600 యూనిట్ల కొత్త ఇళ్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఉన్న 2,36,700 యూనిట్లతో పోలిస్తే 51 శాతం అధికం. ►ఈ ఏడాది హైదరాబాద్, ఎంఎంఆర్ మార్కెట్లలో కొత్త ప్రాజెక్టుల ఆరంభాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడు పట్టణాలకు గాను ఈ రెండింటి వాటాయే 54 శాతంగా ఉంది. ►అమ్ముడుపోని ఇళ్ల విక్రయాలు డిసెంబర్ త్రైమాసికంలో 1 శాతం తగ్గి 6,30,953 యూనిట్లుగా ఉన్నాయి. ►ప్రధానంగా 2020, 2021లో కరోనా మహమ్మారి కారణంగా ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకున్న వారు కూడా ఈ ఏడాది కొనుగోళ్లకు మొగ్గు చూపడం కలిసొచ్చింది. అద్భుతమైన సంవత్సరం ‘‘నివాస గృహాలకు ఈ ఏడాది అద్భుతంగా ఉంది. ప్రాపర్టీల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ సానుకూల విక్రయాలు నమోదయ్యాయి. 2022 ద్వితీయ ఆరు నెలల్లో ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు పెరగడం అన్నది విక్రయాలపై ప్రభావం పడుతుందని ముందు నుంచి అంచనా నెలకొంది. అయినప్పటికీ డిసెంబర్ క్వార్టర్లో బలంగా 92160 యూనిట్ల విక్రయాలు జరిగాయి’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! -
8 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు..ఎంతంటే?
కోవిడ్-19 కారణంగా ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఇంటి నిర్మాణ ఇన్ పుట్ కాస్ట్ ధరలు పెరగడం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి సగటున ఇళ్ల ధరలు దాదాపు 5 శాతం పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఎనిమిది నగరాల్లోని ప్రైమరీ మార్కెట్లో రెసిడెన్షియల్ ధరలు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 6,600-రూ 6,800గా ఉన్నాయి. కానీ గతేడాది డిసెంబర్ చివరి నాటికి రూ.6,300 - రూ 6,500గా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లోని కీలక మైట్రో మార్కెట్లలో ధరలు అధిక స్థాయిలో పెరిగాయని నివేదిక పేర్కొంది. ►రియల్ ఇన్సైట్ నివేదిక ప్రకారం, పూణే 2021 చివరినాటికి చదరపు అడుగుకు రూ. 5,100-రూ. 5,300 నుండి జూలై-సెప్టెంబర్ 2022లో చదరపు అడుగులకు రూ. 5,500-రూ. 5,700 (చదరపు అడుగులు) తో 7 శాతం పెరిగింది. ► హైదరాబాద్‌లో చదరపు అడుగుల 4శాతం పెరిగి రూ.5900 - 6,100 నుంచి రూ.6,100- రూ.6,300 వరకు పెరిగాయి. ►చెన్నైలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 5,400-రూ 5,600 నుండి రూ. 5,500-రూ 5,700 కి స్వల్పంగా 2 శాతం పెరిగాయి . ►బెంగళూరులో ధరలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 5,900-రూ. 6,100కి చేరుకున్నాయి. ►ఢిల్లీ-ఎన్సీఆర్లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ధరలు చదరపు అడుగుకు రూ.4,400 -రూ. 4,600 నుండి రూ. 4,700- రూ. 4,900కి 5 శాతం పెరిగాయి . ►గృహాల ధరలు 4 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 6,100-రూ. 6,300కి చేరుకున్నాయి. ►కోల్‌కతాలో 3 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 4,400-రూ 4,600కి చేరుకుంది. ►ముంబైలో చదరపు అడుగు 3శాతం పెరిగి రూ. 9,900 రూ. 10,100కి చేరుకుంది. ►గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూలై-ఆగస్టులో మొదటి ఎనిమిది నగరాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం ఉన్నప్పటికీ ఇన్వెంటరీ సగటు ధరలు 3-13 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు.. ఆ నగరాల్లో ఎగబడి కొంటున్నారు!
ప్రజలకు సొంతిళ్లు ఉండాలనేది ఓ కల. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఆ కలను నెరవేర్చకుంటారు. అందుకే మార్కెట్లో ఇళ్లకు విపరీతమైన డిమాండ్. ఈ ఏడాది గృహాల అమ్మకాలు ఆల్ టైమ్ హై నమోదు కానున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక వెల్లడించింది. ఏడు నగరాల్లో రికార్డు స్థాయిలో 3.6 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తోంది. నివేదిక ప్రాకారం.. వడ్డీ రేట్లు, ఇళ్లు ప్రియం అవుతున్నప్పటికీ అన్ని ధరల విభాగాల్లో బలంగా డిమాండ్ ఉండనుంది. ఏడాదిలో ఇళ్ల ధరలు కనీసం 10 శాతం దూసుకెళ్లాయి. గృహ రుణంపై వడ్డీ రేట్లు 6.5 నుంచి 8.5 శాతానికి పెరిగినప్పటికీ ఈ పండుగ నెలలో హౌసింగ్ డిమాండ్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పుణేలో ఇప్పటికే 2022 జనవరి–సెప్టెంబర్ కాలంలో కోవిడ్ ముందస్తు స్థాయిని దాటి 2,72,710 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2019 తొలి తొమ్మిది నెలల్లో 2,61,360 ఇళ్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2014లో అత్యధికంగా 3,42,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇళ్లు 2,64,780 యూనిట్లుగా ఉంది. డిసెంబర్ నాటికి మొత్తం 3.4 లక్షల యూనిట్లను దాటతాయని అంచనా. 2014లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన గృహాలు రికార్డు స్థాయిలో 5.45 లక్షల యూనిట్లు. ‘దేశంలో 2022 రెసిడెన్షియల్ మార్కెట్ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే అన్ని మునుపటి గరిష్టాలను పరిశ్రమ అధిగమించింది. కొనసాగుతున్న పండుగ సీజన్లో బలమైన అమ్మకాలు ఉంటాయి’ అని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. చదవండి: ‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్! -
కోవిడ్ ఎఫెక్ట్.. ఆ సేల్స్ భారీగా పెరిగాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్‌లో 88,234 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ అని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, పుణే ఈ జాబితాలో ఉన్నాయి. 2021 జూలై–సెప్టెంబర్‌లో ఈ నగరాల్లో 62,799 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాలు 45 శాతం పెరిగి 93,490 యూనిట్లకు చేరుకుంది. ఇండ్ల అమ్మకాలు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 46 శాతం దూసుకెళ్లి 14,966 యూనిట్లు నమోదైంది. ముంబై 26 శాతం పెరిగి 26,400, బెంగళూరు 48 శాతం వృద్ధితో 12,690, హైదరాబాద్ 73 శాతం అధికమై 11,650, కోల్‌కత 54 శాతం ఎగసి 4,953 యూనిట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు నగరాన్నిబట్టి 1–2 శాతం పెరిగాయి. ట్రెండ్ కొనసాగుతుంది.. ముడి సరుకు వ్యయం ప్రియం కావడం, కోవిడ్ తదనంతరం డిమాండ్ అధికం కావడంతో వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల 4–7 శాతంగా ఉంది. ఏడు నగరాల్లో ఎదురుగాలులు ఉన్నప్పటికీ మూడవ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు, కొత్త లాంచ్‌లు రెండూ ఊపందుకున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ తెలిపారు. ప్రధాన కంపెనీల నుంచి కొత్త గృహాల సరఫరా పెరిగిందన్నారు. కోవిడ్–19 తదనంతరం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న తపన కస్టమర్లలో అధికం అయిందని వివరించారు. పండుగల త్రైమాసికంలోనూ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పారు. ‘పండుగ సీజన్లో విక్రయాల ఊపును కొనసాగించేందుకు డెవలపర్లు లాభదాయక లాంచ్ ఆఫర్లను పరిచయం చేశారు. వీటికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచాల్సి వస్తే మార్కెట్లో కొంత గందరగోళం ఏర్పడవచ్చు’ అని ఆయన తెలిపారు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు, అసలు కారణం ఇదే!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) 15 శాతం తగ్గాయి. 84,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) ఇళ్ల విక్రయాలు 99,550 యూనిట్లుగా ఉన్నాయి. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల విక్రయాలు 24,569 యూనిట్లతో పోలిస్తే 3.5 రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 11,190 యూనిట్లు ఏప్రిల్–జూన్‌లో హైదరాబాద్ మార్కెట్లో 11,190 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చిలో విక్రయాలు 13,140 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే, జూన్ త్రైమాసికంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం తగ్గి 25,785 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 19 శాతం తక్కువగా 15,340 యూనిట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులో 14 శాతం తగ్గి 11,505 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలో 11 శాతం తగ్గి 12,500 యూనిట్లు, చెన్నైలో 24 శాతం క్షీణించి 3,810 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలోనూ 20 శాతం తక్కువగా 4,800 యూనిట్లు విక్రయమయ్యాయి. కొనుగోలు వ్యయాలు పెరగడం వల్లే.. ‘‘నిర్మాణ వ్యయాలు పెరిగినందున డెవలపర్లు ప్రాపర్టీల రేట్లను పెంచాల్సి వచ్చింది. ఆర్బీఐ రెండు విడతలుగా రేట్ల పెంపుతో గృహ రుణ రేట్లు పైకి ఎగబాకాయి. ఈ రెండు అంశాలతో కొనుగోలు వ్యయం పెరిగిపోయింది. ఇళ్ల విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. చదవండి👉 దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే! -
వేగంగా డిమాండ్.. గృహ అమ్మకాలు ఎలా ఉంటాయంటే..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మెరుగైన డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్‌ను ప్రతికూల (నెగటివ్) నుండి స్థిరానికి (స్టేబుల్) సవరించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం తెలిపింది. ‘అధిక అమ్మకాలు, గృహ యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడం, మెరుగైన స్థోమత, ఎన్నడూ లేనంత తక్కువ గృహ రుణ వడ్డీ రేటు ఈ సవరణకు కారణం. కోవిడ్ తర్వాత డిమాండ్ వేగంగా పెరగడంతో పూర్తి అయిన ప్రాజెక్టుల ధరను సవరించడానికి ఆస్కారం ఏర్పడింది. నిర్మాణ వ్యయం పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాజెక్టులు పూర్తి చేసే సమయాన్నిబట్టి ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. పూర్తయిన ప్రాజెక్ట్‌లలో ఆరోగ్యకరమైన డిమాండ్ అవకాశాలు, ధరల సౌలభ్యం.. వెరశి నిర్మాణ సంస్థలకు లాభదాయకత కొనసాగించడంలో సహాయపడతాయి. గృహ రుణాలపై వడ్డీ రేటు ప్రస్తుత స్థాయి నుండి 50–75 బేసిస్ పాయింట్స్ పెరిగినప్పటికీ డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గడం, స్థిర డిమాండ్‌తో కొత్త ప్రాజెక్టులు గణనీయంగా ప్రారంభం అవుతాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం వృద్ధితో 2022–23లో 40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. మెరుగైన డెలివరీ ట్రాక్ రికార్డ్ ఉన్న పెద్ద, ప్రసిద్ధ బిల్డర్ల మార్కెట్ వాటా పెరుగుతూనే ఉంటుంది. అయితే బలహీనమైన రియల్టర్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని ఇక్రా వివరించింది. చదవండి: భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్