
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మెరుగైన డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్‌ను ప్రతికూల (నెగటివ్) నుండి స్థిరానికి (స్టేబుల్) సవరించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం తెలిపింది.
‘అధిక అమ్మకాలు, గృహ యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడం, మెరుగైన స్థోమత, ఎన్నడూ లేనంత తక్కువ గృహ రుణ వడ్డీ రేటు ఈ సవరణకు కారణం. కోవిడ్ తర్వాత డిమాండ్ వేగంగా పెరగడంతో పూర్తి అయిన ప్రాజెక్టుల ధరను సవరించడానికి ఆస్కారం ఏర్పడింది. నిర్మాణ వ్యయం పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాజెక్టులు పూర్తి చేసే సమయాన్నిబట్టి ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. పూర్తయిన ప్రాజెక్ట్‌లలో ఆరోగ్యకరమైన డిమాండ్ అవకాశాలు, ధరల సౌలభ్యం.. వెరశి నిర్మాణ సంస్థలకు లాభదాయకత కొనసాగించడంలో సహాయపడతాయి.
గృహ రుణాలపై వడ్డీ రేటు ప్రస్తుత స్థాయి నుండి 50–75 బేసిస్ పాయింట్స్ పెరిగినప్పటికీ డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గడం, స్థిర డిమాండ్‌తో కొత్త ప్రాజెక్టులు గణనీయంగా ప్రారంభం అవుతాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం వృద్ధితో 2022–23లో 40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. మెరుగైన డెలివరీ ట్రాక్ రికార్డ్ ఉన్న పెద్ద, ప్రసిద్ధ బిల్డర్ల మార్కెట్ వాటా పెరుగుతూనే ఉంటుంది. అయితే బలహీనమైన రియల్టర్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని ఇక్రా వివరించింది.
చదవండి: భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్
Comments
Please login to add a commentAdd a comment