reality
-
వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు: రియల్టీ దిగ్గజం
చెన్నై: కార్యకలాపాల విస్తరణలో భాగంగా రియల్టీ దిగ్గజం జీ స్క్వేర్ రియల్టర్స్ వచ్చే రెండేళ్లలో రూ. 1,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్న కంపెనీ ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువ్యాప్తంగా రెసిడెన్షియల్ విభాగంలోకి విస్తరించాలని భావిస్తోంది. విల్లాలు, అపార్ట్మెంట్లను కూడా నిర్మించనుంది. ప్లాట్ మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో గృహాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సంస్థ ఎండీ బలరామజయం తెలిపారు. జీ స్క్వేర్ ఇప్పటివరకు 127 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 15,000 మంది పైగా కస్టమర్లకు సేవలు అందించిందని వివరించారు. -
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్‌లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్‌కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
రియల్టీలో భారీగా పెరిగిన పెట్టుబడులు: సీబీఆర్ఈ
2024 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు 8.9 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం 2018లో ఈ పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లు, 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్లు, 2023లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు. రియల్ ఎస్టేట్ ఫండ్ – కమ్ – డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు మొదలైనవి చేసే ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీ పెట్టుబడులుగా వ్యవహరిస్తారు. డేటా ప్రకారం జూన్ త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు కొత్త గరిష్టాలకు ఎగిశాయి. జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో రియల్టీలోకి 2.6 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని సీబీఆర్ఈ చైర్మన్ (భారత్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఇన్వెస్టర్లు (ప్రధానంగా డెవలపర్లు) పెట్టుబడులకు నేతృత్వం వహించారు. ఆఫీస్ లీజింగ్ మార్కెట్ పుంజుకోవడం, గృహాల కొనుగోలు.. ఖర్చు చేసే విషయంలో వినియోగదారుల్లో రిస్కు సామర్థ్యాలు అసాధారణంగా పెరగడం తదితర అంశాలు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రియల్టీలోకి పెట్టుబడులు రావడానికి దోహదపడినట్లు నివేదిక వివరించింది. -
ఏఐ సాంకేతికతో అలా స్వాంతన పొందడం మంచిదేనా..?
ఏఐ సామర్థ్యం ఊహకందని విధంగా పలు రంగాల్లో తన హవా చాటుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మనకెంతో ఇష్టమైన వారు ప్రమాదవశాత్తు దూరమయ్యితే ఆ బాధను దిగమింగడం అంత ఈజీ కాదు. అలాంటి వాటిలో చక్కటి ఉపశమనం కలిగిస్తోంది ఏఐ సాంకేతికత. అలాంటి వాటికి సంబంధించిన ఇటీవల్ల కొన్ని భావోద్వేగ కథలను విన్నాం. అయితే ఇలా సాంకేతికతో స్వాంతన, ఉపశమనం పొందడం ఎంతవరు సరైనది. ఎన్నటికీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గదా..!. దీని కారణంగా వాస్తవికతకు దూరమయ్యే పరిస్థితి ఎదురవ్వుతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..జస్టిన్ హారిసన్ అనే టెక్ వ్యవస్థాపకుడు తన తల్లి ఇంకొద్ది రోజుల్లో దూరమైపోతుందని తెలిసి తల్లిడిల్లిపోతాడు. దీంతో ఆమె గుర్తులు, జ్ఞాపకాలు తనను వీడిపోకుండా ఉండేలా ఏఐ సాంకేతికతో అమ్మ వాయిస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అతడు ఆమె బతికున్న రోజుల్లోనే ఈ పనికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే జస్టిన్ మాత్రం తన ఏఐ సామర్థ్యంతో రూపొందించిన తన తల్లి వాయిస్‌తో స్వాంతన పొందుతుంటాడు. తనతోనే తల్లి ఉందన్న భరోసాతో జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాపకం వచ్చినప్పుడల్లా ఆమె వాయిస్ రికార్డుతో కూడిన ఏఐ సాంకేతికతో తల్లితో మాట్లాడిన అనుభూతిని పొందుతుంటాడు. అంతేగాదు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. ఇది నిజంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఓ వరం అంటూ ఆ సాంకేతికతపై పొగడ్తల వర్షం కురిపించాడు. అయితే మానసిక నిపుణుడు రుచి రుహ్ మాత్రం ప్రారంభ దశలో ఈ సాంకేతికత ఉపశమనంగా అనిపించినా రాను రాను వాస్తవికతలో ఉండేందుకు మెదడు అంగీకరించకపోవచ్చు లేదా ఇష్టపడకపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి దుఃఖం మనిషిని బలవంతుడిగా మారిస్తే..ఈ సాంకేతికతో లభించిన భరోసా..వాస్తవికతకు దూరం చేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతిక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వాళ్లను మాములు మనుషులు చేసేందుకు వినియోగించి ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగ్గా ఉండేలా చెయ్యొచ్చు. కానీ దీనిమీదే ఆధారపడిపోయేలా మాత్రం తయారు కాకూడదని చెబుతున్నారు. చెప్పాలంటే.. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధ కొన్నాళ్లకి తగ్గి సాధారణ మనుషులుగా సహజసిద్దంగానే మారిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం.ఏనాటికైనా అందరూ చనిపోవాల్సిన వాళ్లే అనే సత్యాన్నికి కట్టుబడి ఉండేలా సహజసిద్ధంగా మనసు సిద్ధమవుతుంది. అందువల్లే పూర్వం వాళ్లు ముక్కుపచ్చలారని పసివాళ్లు దూరమైనా..బాధను దిగమింగి మరీ ధైర్యంగా బతుకును సాగించేవారు. సాంకేతికత పుణ్యమా అని ప్రాణాలు అల్పమైపోయాయి. చిన్న బాధను కూడా తట్టుకోలేని సున్నిత మనస్కులుగా, అల్పమైన జీవులుగా మారిపోతున్నాం. సెన్సిటివిటీ కంటే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా మనిషి మారితేనా అన్ని విధాల శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
హైదరాబాద్‌కు ఢోకా లేదు కానీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఇక, రియల్టీ పరుగులే తరువాయి. కాకపోతే, హైదరాబాద్ మార్కెట్ పరిస్థితులు వేరు. రాజకీయ స్థిరత్వం అనేది వినియోగదారులు, పెట్టుబడిదారులకు కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి.మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.మార్కెట్లోకి మూడోతరం..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్‌లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రాలగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్తతరం కస్టమర్లు వస్తున్నారు. వీరికి విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లు కావాలి. అందుకే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్యా, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లల సంపాదన కూడా తోడైంది. గత 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పక్క రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. -
రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మిన గోద్రెజ్.. ధర 157 కోట్లు
గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని విక్రోలిలోని గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు ఆఫీస్ స్పేస్‌లను రూ.157 కోట్లకు విక్రయించింది గోద్రెజ్ వన్ భవనంలోని సౌత్ టవర్లోని ఎనిమిదో అంతస్తులో మొదటి కార్యాలయ స్థలం 24,364 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇదే టవర్లోని తొమ్మిదో అంతస్తులో రెండో కార్యాలయం ఉంది. ఈ రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మింది. కాగా, రెండు కార్యాలయ స్థలాలకు సంబంధించి మొత్తం 75 వెహికల్ పార్కింగ్ స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ బిల్డింగ్ గోద్రెజ్ వన్గోద్రెజ్ వన్ కమర్షియల్ లగ్జరీ టవర్స్. సౌత్ ఉత్తర టవర్‌లో భూమి నుంచి కిందకి రెండు ఫ్లోర్లు ఉండగా.. 11 అంతస్తుల కార్యాలయ స్థలాలు ఉన్నాయి.వేల కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లు బుకింగ్స్సంస్థ రియల్ ఎస్టేట్ విభాగం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,000 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి 10 స్థలాలను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20వేల కోట్ల అమ్మకాల బుకింగ్స్ నిర్వహించేలా.. మరికొన్ని ప్రాంతాల్లో ల్యాండ్స్‌ను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. గోద్రెజ్ ప్రాపర్టీస్ భవిష్యత్‌లో రూ. 21,225 కోట్లతో 10 కొత్త ప్రాజెక్ట్‌లు బుకింగ్స్ అవుతాయని తెలిపింది. -
పెరిగిపోతున్న ప్రాధాన్యత.. దేశంలో 11 షాపింగ్ మాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో కొత్తగా 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొత్తం విస్తీర్ణం 59.48 లక్షల చదరపు అడుగులు అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. భారతీయ మార్కెట్లోకి ప్రవేశం, విస్తరించడం కోసం రిటైలర్ల నుండి బలమైన ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందని వివరించింది. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ విధానాలను మార్చడం, సహాయక వ్యాపార వాతావరణం ఈ వృద్ధికి ఆజ్యం పోసిందని తెలిపింది. ‘ఏడు ప్రధాన నగరాల్లో ఈ మాల్స్ ఏర్పాటయ్యాయి. 2022తో పోలిస్తే గతేడాది కొత్తగా తోడైన రిటైల్ స్పేస్‌లో 72 శాతం వృద్ధి నమోదైంది. 2022లో హైదరాబాద్, పుణే, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కత నగరాల్లో నూతనంగా 34.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనమిది మాల్స్ ప్రారంభం అయ్యాయి’ అని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌లోనే అధికం.. ‘గతేడాది అందుబాటులోకి వచ్చిన మాల్స్‌లో హైదరాబాద్ ఏకంగా మూడు మాల్స్‌ను సొంతం చేసుకుంది. పుణే, చెన్నై రెండు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్ ఒక్కొక్కటి చేజిక్కించుకున్నాయి. కోవిడ్ తదనంతరం ఈ నగరాల్లో ఇంత మొత్తంలో రిటైల్ స్పేస్ తోడవడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ జోరు కొనసాగుతుంది. 2019లో కొత్తగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్–ఏ, బీ–ప్లస్ మాల్స్ తెరుచుకున్నాయి. 2020–22 మధ్య ఏటా సగటున 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్పేస్ తోడైంది. కోవిడ్ తదనంతరం చాలా గ్రేడ్–ఏ మాల్స్ ఖాళీ లేక రిటైలర్లు నాణ్యమైన రిటైల్ స్థలం కొరతను ఎదుర్కొన్నారు’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వివరించింది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో 26 శాతం క్షీణించాయి. వెరసి ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 2.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రభావం చూపినట్లు అనరాక్ క్యాపిటల్ పేర్కొంది. గతేడాది(2022–23) తొలి 9 నెలల్లో దేశ రియల్టీ రంగంలోకి 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. తాజాగా నమోదైన పీఈ పెట్టుబడుల్లో 84 శాతం ఈక్విటీ రూపేణా లభించగా.. రుణాలుగా మిగిలిన నిధులను అందించినట్లు ఫ్లక్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో అనరాక్ తెలియజేసింది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 79 శాతం నుంచి 86 శాతానికి బలపడినట్లు సంస్థ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. ఇదే సమయంలో దేశీ పెట్టుబడుల వాటా 14 శాతం నీరసించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సగానికి తగ్గి 36 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో రియల్టీలో 71.7 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. కారణాలివే.. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు బలహీనపడటంతో రియల్టీలో మొత్తం పీఈ పెట్టుబడులు వెనకడుగు వేసినట్లు అనరాక్ పేర్కొంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అధిక వడ్డీ రేట్ల వాతావరణం కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు మందగించినట్లు వివరించింది. వ్యయభరిత నిధుల కారణంగా రెసిడెన్షియల్ రియల్టీ రుణ విభాగానికి డిమాండ్ తగ్గడంతో దేశీ ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్స్(ఏఐఎఫ్) నుంచి లావాదేవీలు నీరసించినట్లు అగర్వాల్ తెలియజేశారు. రెసిడెన్షియల్ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధిపత్యం నేపథ్యంలో అధిక వ్యయాలతోకూడిన ఏఐఎఫ్ పెట్టుబడులు తగ్గినట్లు వివరించారు. ఈ కాలంలో సగటు టికెట్(రుణ) పరిమాణం 9.1 కోట్ల డాలర్ల నుంచి నామమాత్ర వృద్ధితో 9.5 కోట్ల డాలర్లకు చేరింది. బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ సంయుక్తంగా రెండు భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాయి. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి 1.4 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్‌లో కొనుగోలు చేశాయి. ఈ అంశాలు ఏఐఎఫ్ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయి. -
2023 : హైదరాబాద్‌లో కలిసొచ్చిన రియల్ ఎస్టేట్ రంగం
సాక్షి, హైదరాబాద్: 2023 నగర స్థిరాస్తి రంగానికి బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ క్రమంగా పెరుగుతుంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. 2023 ఆగస్టు–డిసెంబర్ చివరి త్రైమాసికంలో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయని తెలిపింది. 2023లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ. విస్తీర్ణంలో 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే 2022లో 34.49 లక్షల చ.అ. విస్తీర్ణంలో 8 మాల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఏడాది కాలంతో పోలిస్తే షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ 72 శాతం మేర పెరిగింది. సిటీలో మూడు మాల్స్... గతేడాది అత్యధికంగా హైదరాబాద్‌లో మూడు మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. పుణే, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కతాలో ఒక్క మాల్ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ. షాపింగ్ మాల్ స్పేస్ మార్కెట్లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది. నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్లలో అపర్ణా సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్ అండ్ మల్టీఫ్లెక్స్ను నిర్మిస్తుంది. కూకట్‌పల్లిలో 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్ మాల్స్ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి. -
భారత్‌కు క్యూ కడుతున్న సంస్థలు.. గ్లోబుల్ కేపబులిటి సెంటర్ల జోరు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్యకలాపాల సామర్థ్య కేంద్రాలు (జీసీసీలు) భారత్‌లో 2025 నాటికి 1,900కు చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో (కార్యాలయ స్థలం) వీటి వాటా 35–40 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో 1,580 జీసీసీలు ఉన్నట్టు తెలిపింది. బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు వేదికగా ఉండే వాటిని జీసీసీలుగా చెబుతారు. భారత్ ఆకర్షణీయం భారత్ కాకుండా బ్రెజిల్, చైనా, చిలే, చెక్ రిపబ్లిక్, హంగరీ, ఫిలిప్పీన్స్, పోలాండ్ సైతం జీసీసీ కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే, లీజు వ్యయాల పరంగా, నైపుణ్య మానవ వనరుల పరంగా భారత్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ, జీసీసీలకు ప్రాధాన్య కేంద్రంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారత్‌లో జీసీసీల విస్తరణ దూకుడుగా ఉందని, ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ లీజులో వీటి వాటా 38 శాతానికి చేరుకుందని తెలిపింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో జీసీసీల ఆఫీసు లీజు పరిమాణం 9.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ జీసీసీ ఆఫీస్ లీజులో 77 శాతం వాటాను (జనవరి–జూన్ మధ్య) ఆక్రమిస్తున్నట్టు పేర్కొంది. ‘‘జీసీసీలకు భారత్ అత్యంత ప్రాధాన్య కేంద్రంగా మారింది. నైపుణ్య మానవ వనరులు, తక్కువ వ్యయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ మద్దతుకు జీసీసీల వృద్ధి సాక్షీభూతంగా నిలుస్తుంది’’అని సీబీఆర్ఈ భారత్, ఆగ్నేయాసియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణీ పట్టణాల్లోనూ.. చిన్న, మధ్య స్థాయి బహుళజాతి సంస్థలు సైతం క్రమంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటు ద్వారా విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. -
మాల్స్ అదుర్స్.. పుంజుకుంటున్న రిటైల్ రంగం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావం రిటైల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో షాపింగ్ మాల్స్ విలవిల్లాడిపోయాయి. ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి చూశాక ఇక ఆఫ్లైన్లోని రిటైల్ రంగం కోలుకోవడం కష్టమేమో అనిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం నుంచి షాపింగ్ మాల్స్ శరవేగంగా కోలుకున్నాయి. మాల్స్‌లోని రిటైల్ దుకాణాలలో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్‌లలో వీక్షకుల తాకిడి పెరగడంతో మాల్స్ నిర్వాహకులలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ►షాపింగ్ మాల్స్, హైస్ట్రీట్లలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో రిటైల్ లీజులు 137 శాతం పెరిగాయని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. అయితే రిటైల్ మార్కెట్ పరిమాణం ఇంకా పెరగాల్సి ఉందని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రిటైల్ రంగం చాలా వెనకబడి ఉంది. ►ఫ్యాషన్, హోమ్‌వేర్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వంటి రిటైలర్ల డిమాండ్‌ను బట్టి షాపింగ్ మాల్స్‌లో లీజు లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో రిౖ టెల్ లీజులు 17–28 శాతం మేర పెరిగి 55–60 లక్షల చ.అ.లకు చేరుతుందని అంచనా వేసింది. 20 19లో అత్యధికంగా 68 లక్షల చ.అ. లీజు లావాదేవీ లు జరిగాయి. 2021లో 39 లక్షలు, 2022లో 47 లక్షల చ.అ. రిటైల్ లీజు కార్యకలాపాలు పూర్తయ్యాయి. ►హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలలో నిర్మాణం పూర్తికాకముందే లీజులు జరుగుతున్నాయి. గత ఏడాది డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో పూర్తయ్యే దశకు చేరినా లీజు లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే ఈ ఏడాది కొంత సానుకూల వాతావరణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నగరంలో 2.5 లక్షల చ.అ. రిటైల్ స్థల లీజు లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం లక్ష చ.అ. స్థలం మాత్రమే లీజుకు పోయింది. రిటైల్ లీజులలో స్టోర్ల వాటా 33 శాతం ఉండగా.. ఫ్యాషన్, అపరెల్స్ షో రూమ్‌ల వాటా 30 శాతం, ఫుడ్ కోర్టుల వాటా 11 శాతంగా ఉంది. -
న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం
ఛత్రపతి శంభాజీనగర్: న్యాయ వృత్తిలో నిజాయతీ అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే న్యాయ వ్యవస్థ, ఆ వృత్తి రాణిస్థాయి. లేదంటే వాటి పయనం సాగేది స్వీయ వినాశనం వైపే‘ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ నిజాయతీని, నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన లాయర్లు మొదలుకుని న్యాయమూర్తుల దాకా అందరి పైనా ఉంటుందన్నారు. ఆదివారం ముంబైలోని మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీలో కార్యక్రమంలో ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నవిగా అనిపించే విషయాల్లో మనం రాజీ పడ్డప్పుడే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లేది‘ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. -
అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా?
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్‌పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్‌తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్‌ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్‌కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. (చదవడం: ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు. ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్‌షిప్‌ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది ∙ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్‌నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్‌లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్‌ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్‌లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్‌వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
బంపరాఫర్ : డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలుపై 10 లక్షల డిస్కౌంట్!
స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర పండగల సీజన్లో ఆయా ఈ - కామర్స్ కంపెనీలు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అందుకు అనుగుణంగా వినియోగదారులు తక్కువ ధరకే తమకు కావాల్సిన వస్తువులు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. వ్యాపారం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇప్పుడీ ఈ డిస్కౌంట్ ఫార్మలానే రియల్ ఎస్టేట్ కంపెనీలు అప్లయ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రియాలిటీ సంస్థలు కొనుగోలు దారులకు తక్కువ ధరలకే వారు కోరుకున్న ప్లాట్లు, విల్లాలు, వన్ బీహెచ్‌కే, టూబీహెచ్‌కే ఇళ్లను అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ( ఫైల్ ఫోటో ) 👉 ముంబైకి చెందిన డెవలపర్లు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31వరకు అపార్ట్మెంట్లను బుక్ చేసుకునే గృహ కొనుగోలుదారులకు జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్ (బై నవ్ పే లేటర్) 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తున్నారు. జీఎస్టీని సైతం రద్దు చేస్తున్నారు. 👉 జేపీ ఇన్ఫ్రా జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ-పేమెంట్ ప్లాన్, 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తుంది. ఆఫర్లో భాగంగా స్టాంప్ డ్యూటీ, జీఎస్టీని మినహాయించింది. 👉 త్రిధాతు రియాల్టీ అనే సంస్థ 2 బీహెచ్‌కే యూనిట్‌పై రూ. 10 లక్షలు, 3 బీహెచ్‌కే పై 20 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ( ఫైల్ ఫోటో ) 👉ఢిల్లీ-ఎన్సీఆర్లో భూటానీ ఇన్ఫ్రా సొంతింటి కలల్ని నిజం చేసుకునేందుకు వీలుగా ఓ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. పథకంలో కస్టమర్లు కోరుకున్న ధరకే ప్రాపర్టీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు కొనసాగే ఈ స్కీమ్‌లో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన 77 యూనిట్ల కేటాయింపును లక్కీ డ్రా ఆధారంగా నిర్ణయిస్తారు. 👉 పథకం కింద, కొనుగోలుదారులు భూటానీ ఇన్ఫ్రా ప్రాపర్టీని ఎంచుకుంటే ఎంత ధరకి ఆ స్థిరాస్థి కావాలనుకుంటున్నారో అంతకే కోట్ చేయొచ్చు. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ. 2 కోట్లు అయితే కొనుగోలుదారులు తమ బడ్జెట్ ప్రకారం రూ.1.75 కోట్లు లేదా రూ.1.5 కోట్ల ధరను కోట్ చేయవచ్చు. ఈ సందర్భంగా..లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తామని భూటానీ ఇన్ఫ్రా సీఈఓ ఆశిష్ భుటానీ తెలిపారు. ( ఫైల్ ఫోటో ) 👉 గౌర్స్ గ్రూప్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని గౌర్ వరల్డ్ స్మార్ట్‌స్ట్రీట్ ప్రాజెక్ట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ప్రతి బుకింగ్‌పై కారును ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 13 రెండు రోజులు అందుబాటులో ఉంది. అంతేకాదు మూడు సంవత్సరాల పాటు షాపుల నిర్వహణ అంతా ఉచితం 👉 ఘజియాబాద్‌లోని గౌర్ ఏరోసిటీ మాల్లోని షాపుల కోసం కంపెనీ ప్రతి బుకింగ్‌పై ఐఫోన్‌ను అందిస్తోంది. 👉 బెంగళూరులో ప్రావిడెంట్ హౌసింగ్ సంస్థ ప్రస్తుతం ఫ్రీడమ్ ఆన్లైన్ హోమ్ ఫెస్ట్ 4.0ని నిర్వహిస్తోంది, ఇందులో కొనుగోలుదారులు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా హౌసింగ్ యూనిట్‌ను బుక్ చేసుకోవచ్చు. గరిష్ట ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించింది. ఇలా డిస్కౌంట్ ధరలకే వారికి నచ్చిన ప్లాట్లను అందిస్తూ సేల్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు. చదవండి👉 6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె! -
అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
Double Bedroom Flats : 14 ఫ్లోర్లు, 630 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు. ఒక్కో ఫ్లోర్లో 1370 స్క్వైర్ ఫీట్లలో 2 బీహెచ్‌కే నిర్మాణం. ఇప్పుడా ఫ్లాట్లను అమ్మేందుకు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) సిద్ధమైంది. కొనుగోలు దారులకు హోమ్లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా 2బీహెచ్‌కే ఫ్లాట్ ధరలు తక్కువ ధరకే అమ్ముతుండడంతో కొనుగోలు దారులు పెద్ద ఎత్తున అప్లయి చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు ఈస్ట్ కోనదాసపూర్ ప్రాంతంలో బీడీఏ 14 ఫ్లోర్లలో అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టింది.ఈ అపార్ట్మెంట్లలో నిర్మించిన 630 ఫ్లాట్లను అమ్మేందుకు జులై 1 ప్రత్యేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 1370 స్కైర్ ఫీట్లో రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెన్ సౌకర్యాలు ఉన్నాయి. 1370 స్కైర్ ఫీట్లలో 806 స్కైర్ ఫీట్లలో కార్పెట్ ఏరియాను కేటాయించింది. ఒక్కో ఫ్లాట్‌ను ఒక్కో ధరకు అమ్మనుంది. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లయి ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కార్‌పార్కింగ్ కోసం అదనం నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ల గృహ కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌కు ముందు అపార్ట్మెంట్ల జోన్ ఆధారంగా తగిన మొత్తానికి వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని బీడీఏ అధికారులు తెలిపారు. అదనంగా, కేటాయింపుదారులు సంబంధిత కాలానికి విడిగా జీఎస్టీ చెల్లించాలి. అందుబాటులో ఉన్న కవర్డ్ కార్ పార్కింగ్ స్థలం కోసం ప్రతి ఇంటికి అదనంగా రూ .2 లక్షలు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫ్లోర్‌ను బట్టి ధర మారుతుంది ఫ్లాట్ల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు 24 నెలల మెయింటెనెన్స్ మొత్తాన్ని చెల్లించాలని బీడీఏ అధికారులు చెబుతున్నారు. మెయింటెనెన్స్ మొత్తం చెల్లించిన తర్వాత బీడీఏ స్వయంగా ఫ్లాట్లను రిజిస్టర్ చేస్తుంది. ఫ్లోర్ లెవల్‌ను బట్టి రెండు బీహెచ్‌కే అపార్ట్మెంట్ ధర మారుతుంది. మొదటి అంతస్తు ఫ్లాట్ ధర ఎంతంటే? మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు ఫ్లాట్ ధర రూ.48 లక్షలు, ఆరో అంతస్తు ధర రూ.48.24 లక్షలు, ఏడో అంతస్తు ధర రూ.48.72 లక్షలు. ఎనిమిదో అంతస్తు అపార్ట్ మెంట్ ధర రూ.48.96 లక్షలు. తొమ్మిదో అంతస్తు నుంచి 12వ అంతస్తు వరకు రూ.49.2 లక్షల నుంచి రూ.49.92 లక్షల వరకు ధరలు ఉన్నాయి. 13వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ధర సుమారు రూ.50.16 లక్షలు కాగా, 14వ అంతస్తు ధర సుమారు రూ.50.4 లక్షలు. అంతేకాకుండా ఈ భవనంలోని ప్రీమియం ఫ్లాట్ల ధర ఎక్కువగా ఉంటుంది. మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు రూ.50.4 లక్షలు, ఆరో అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు రూ.50.65 లక్షల నుంచి రూ.52.65 లక్షల వరకు ధరలు ఉంటాయని బీడీఏ అధికారులు తెలిపారు. చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, కేంద్ర ప్రభుత్వ రివర్స్ మార్ట్గేజ్ పథకం గురించి తెలుసా? -
స్కిన్ స్పెషలిస్ట్! ఒక్క ఫొటో చాలు.. మరింత స్మార్ట్‌గా గూగుల్ లెన్స్
గూగుల్ లెన్స్ మరింత స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు మీ చర్మం కండీషన్‌ను పరిగట్టేస్తుంది. ఒక్క ఫొటో తీసి పెడితే చాలు స్కిన్ కండీషన్ ఏంటో చెప్పేస్తుంది. మన చర్మానికి ఏదైనా సమస్య ఉండి దాన్ని ఏమని పిలుస్తారో తెలియని సందర్భంలో దానికి సంబంధించిన ఫొటోను గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే ఆ రుగ్మత పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలియజేస్తుంది. అయితే ఇది యూజర్ల సమాచారం కోసం మాత్రమే. దీన్ని వ్యాధి నిర్ధారణగా పరిగణించకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. సమస్య ఏంటో చెప్పేస్తుంది.. శరీర భాగాల్లో చర్మంపై ఎక్కడైనా ఏదైనా సమస్యగా అనిపిస్తే దాన్ని ఫొటో తీసి గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే దానికి సంబంధించిన అలాంటి విజువల్ సమాచారం వస్తుంది. ఉదాహరణకు చర్మంపై దద్దుర్లు, వాపు, వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ సాయంతో తెలుసుకోవచ్చు. మరింత స్మార్ట్‌గా.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ లెన్స్ స్మార్ట్‌గా మారుతోంది. ముందుగా గూగుల్ లెన్స్ యూజర్లకు పేరు తెలియని ఏవైనా సాధారణ వస్తువులను విశ్లేషించడంలో సహాయపడుతుంది. అలాగే వాక్యాలను కూడా అనువదించే సామర్థ్యాన్ని ఇందులో జోడించారు. మనకు తెలియని వాక్యాలను గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా ఫొటో తీసి మనకు కావాల్సిన భాషలోకి వాటిని అనువదించుకోవచ్చు. వీటితోపాటు గూగుల్ మ్యాప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఆర్ శక్తిని జోడిస్తోంది గూగుల్. దీని సాయంతో మన చుట్టూ ఉన్న కొత్త స్థలాలను కనుగొనడానికి, యూజర్లు తమకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటివి శోధించవచ్చని గూగుల్ పేర్కొంది. -
రియల్ ఎస్టేట్ అదరహో.. భారత్‌లో భారీగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత రియల్టీ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2017 నుంచి 2022 మధ్య వీరి నుంచి మొత్తం 26.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.16 లక్షల కోట్లు) వచ్చాయి. అంతకుముందు ఆరేళ్ల కాలంలో (2011–16) వీరు చేసిన పెట్టుబడులతో పోలిస్తే మూడింతలు అధికంగా వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో అమెరికా, కెనడా నుంచే 70 శాతం మేర పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రాధాన్య ఎంపికకగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ రంగంలో ఎన్నో కొత్త విధానాలు, సంస్కరణ చర్యలు చేపట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. పెట్టుబడుల వివరాలు.. ► 2017–22 మధ్య భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి దేశీ (డీఐఐలు), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మొత్తంగా 32.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2011–16 మధ్య ఇవి 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం ఆఫీస్ విభాగంలోకే వెళ్లాయి. ►మొత్తం 32.9 బిలియన్ డాలర్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు 26.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2011–16 మధ్య వచ్చిన 8.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడింతలు అధికమయ్యాయి. ►డీఐఐల పెట్టుబడులు 2017–22 మధ్య 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ►ఎఫ్ఐఐల పెట్టుబడుల్లో యూఎస్ఏ నుంచి వచ్చినవి 11.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2011–16 మధ్య ఇవి 3.7 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ►కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో కెనడా నుంచి వచ్చిన ఎఫ్ఐఐ పెట్టుబడులు కేవలం 0.5 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ►సింగపూర్ నుంచి కూడా మూడు రెట్లకు పైగా పెరిగి 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో ఇవి 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎన్నో అనుకూలతలు అధిక జనాభా అనుకూలతలు, అభివృద్ధికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల బలోపేతం, పోటీ ధరలతో అంతర్జాతీయ సంస్థలకు భారత రియల్ ఎస్టేట్ ప్రాధాన్య మార్కెట్‌గా మారింది. రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు ఇవి చోదకంగా నిలుస్తున్నాయి. బలమైన ఆర్థిక, వ్యాపార మూలాలు సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. దీంతో విదేశీ వ్యూహాత్మక భాగస్వాములు తమ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తున్నారు’’అని కొలియర్స్ ఇండియా చైర్మన్, ఎండీ సాంకే ప్రసాద్ తెలిపారు. భారత్ దీర్ఘకాల నిర్మాణాత్మక సైకిల్లో ఉందని, వచ్చే కొన్నేళ్ల పాటు అవకాశాలు మరింత వృద్ధి చెందుతాయని కొలియర్స్ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్లు) పీయూష్ గుప్తా తెలిపారు. -
పెరిగిపోతున్న హోమ్లోన్లు.. రూ.19.36 లక్షల కోట్లకు చేరిన రుణాలు!
ముంబై: వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ గృహ రుణాలు (రుణ గ్రహీతలు చెల్లించాల్సిన మొత్తం) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.19.36 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై రేట్లు పెరిగాయి. 2022 మార్చి చివరికి గృహ రుణాలు రూ.16.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి చివరికి రూ.14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల్లో 20.6 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 12.6 శాతంతో పోలిస్తే పెరిగింది. కన్జ్యూమర్ రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా, వాహన రుణాలన్నీ పర్సనల్ లోన్ కిందకు వస్తాయి. పరిశ్రమలకు రుణాల మంజూరు 5.7 శాతం పెరిగింది. పెద్ద పరిశ్రమలకు ఇది 3 శాతంగా ఉంది. మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాల మంజూరులో 19.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణ వితరణ 12.3 శాతం పెరిగింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాల మంజూరు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15.4 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంతో పోలిస్తే మంచి పురోగతి కనిపించింది. -
అదరగొట్టిన గోద్రెజ్ ప్రాపర్టీస్.. నికర లాభంలో 58% వృద్ధి
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను అధిగమించింది. హౌసింగ్‌కు నెలకొన్న పటిష్ట డిమాండ్ ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 260 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,523 కోట్ల నుంచి రూ. 1,839 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు ఎన్సీడీలు, బాండ్లు తదితర మార్గాల ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 2,000 కోట్ల సమీకరించేందుకు అనుమతించింది. చేపడుతున్న ప్రాజెక్టులు, పటిష్ట బ్యాలన్స్‌షీట్, హౌసింగ్ రంగ వృద్ధి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లోనూ ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ పిరోజ్షా గోద్రెజ్ అభిప్రాయపడ్డారు. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 571 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 352 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,586 కోట్ల నుంచి రూ. 3,039 కోట్లకు బలపడింది. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 12,232 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ను సాధించింది. 2021–22లో నమోదైన రూ. 7,861 కోట్లతో పోలిస్తే ఇవి 56 శాతం అధికం. నగదు వసూళ్లు 41 శాతం ఎగసి రూ. 8,991 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపరీ్టస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం తగ్గి రూ. 1,323 వద్ద ముగిసింది. -
అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే సామెత తెలుసుగా..అంటే జీవితంలో ఎవరైనా ఈ రెండు పనులు చేయడం అంత వీజీ కాదనేది దాని అర్థం. అపార్ట్మెంట్ కట్టాలన్నా లేక ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. ఇందుకు ఎంతగానో డబ్బు కూడా అవసరమవుతుంది. ధరలను నియంత్రించేందుకు గాను ఆర్బీఐ రెపోరేట్లు.. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. అయినప్పటికీ మిలియనిల్స్ (1980 తర్వాత జన్మించిన వాళ్లు) సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోళ్లు ప్రభావం చూపుతుందా? మిలియనిల్స్ ఏమనుకుంటున్నారు? అన్న అంశంపై ప్రముఖ రియాల్టీ సంస్థ నోబ్రోకర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ - ఎన్సీఆర్ నగరాల నుంచి సుమారు ఇంటి లోన్ తీసుకున్న 2 వేల మంది పాల్గొన్నారు. ♦ ఇక, ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం.. 2022 అక్టోబర్ - డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో వడ్డీ రేట్లు ఆకాన్నంటుతున్నా.. 42 శాతం హోం లోన్ తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ముగిసిన ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2021 సమయంలో ఇళ్ల లోన్ల వృద్ధి 120 శాతం పెరిగింది. ♦ కోవిడ్-19 తెచ్చిన మార్పుల కారణంగా చాలా మందిలో ‘మనకీ ఓ సొంతిల్లు’ ఉంటే బాగుండేదన్న ఆలోచన పెరిగింది. కాబట్టే కోవిడ్-19కి ముందు మిలియనిల్స్ 17శాతం ఉంటే ఇప్పుడు అదికాస్త 27కి పెరిగింది. వారిలో ఎక్కువ మంది 25 - 35 మధ్య వయస్కులే ఉండటం గమనార్హం. ♦ 36 ఏళ్ల వయసు దాటిన తర్వాత గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ‘లేట్ మిలీనియల్స్’ నిలుస్తున్నారు. వీళ్లు సైతం ఇల్లు కొనుగోలు చేసే వారి జాబితాలో ఎక్కువ మంది ఉన్నారని సర్వే హైలెట్ చేసింది. ♦ సొంతింటి కోసం ఎక్కువ మంది కుర్రకారు 10 శాతం డౌన్ పేమెంట్ కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్(ఎన్బీఐఎఫ్సీ) వంటి సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో పర్సనల్ లోన్ తీసుకొని వాటి ద్వారా డౌన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. ♦ 78 శాతం మంది హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం లేదు.. అలా అని తక్కువగా ఉన్నాయని చెప్పడం లేదని తేలింది ♦ రుణాలపై ఇళ్లను కొనుగోలు చేసేవారు ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు.. ఆ భారం వల్ల ఎదుర్కొన్నే కష్ట - నష్టాలను పూర్తిగా అర్ధం చేసుకున్నారు. గత 10-12 ఏండ్ల నుంచి పరిశీలిస్తే గత దశాబ్ధ కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు 6 నుంచి 8 శాతం మధ్యే ఉందని పేర్కొన్నారు. ♦ ‘ఇళ్ల రుణాలు సాధారణంగా 20 ఏండ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. మేము ఈ 20 సంవత్సరాల టెన్యూర్ కాలంలో రెపో రేట్ పెంపు, తదుపరి రేటు తగ్గింపు సాధారణంగా సగటున ఉన్నట్లు స్పష్టమవుతుంది’ అని నోబ్రోకర్ సీఈవో అమిత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ♦ మిలీనియల్స్ కోసం నిర్వహించిన ప్రత్యేక నోబ్రోకర్ అధ్యయనంలో కొవిడ్‌కు ముందు 49 శాతం మంది మిలియనిల్స్ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపితే, ఇప్పుడు దాదాపు 63 శాతం మంది సొంతింటి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారని నో బ్రోకర్ సర్వేలో తేలింది. చదవండి👉 ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
దేశీ రియల్టీలో భారీ పెట్టుబడులు: ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు!
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో(2023-24) దేశీ రియల్టీ రంగంలో 13 బిలియన్ డాలర్ల(రూ. 1,07,081 కోట్లు) వరకూ ఈక్విటీ పెట్టుబడులు లభించవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. గత ఐదేళ్లలో 32 బిలియన్ డాలర్ల(రూ. 2,63,584 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులు రియల్టీలోకి ప్రవహించినట్లు సీబీఆర్ఈ పేర్కొంది. రానున్న రెండేళ్లలో పెట్టుబడులు గరిష్టంగా కార్యాలయ ఆస్తులకు మళ్లవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ అభిప్రాయపడింది. ఏడాదికి 6-7 బిలియన్ డాలర్ల చొప్పున రెండేళ్లలో దేశీ రియల్టీ రంగం 12-13 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకునే వీలున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లతోపాటు రీట్స్ తదితరాలు చేపట్టే ఈక్విటీ పెట్టుబడులపై సీబీఆర్ఈ నివేదిక రూపొందించింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇతర విభాగాలకూ రియల్టీ రంగ ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం ఆఫీస్ ఆస్తుల విభాగంలోకి ప్రవహించనుండగా.. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్, స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ తదుపరి స్థానాల్లో నిలవనున్నాయి. ఇక వీటికి అదనంగా డేటా సెంటర్లకు ప్రధానంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) లభించనున్నాయి. దేశీయంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి వంటి మూలాలు బలంగా ఉన్నట్లు సీబీఆర్ఈ చైర్మన్(ఆసియా, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. వీటికితోడు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్యం రానున్న ఏడాదిలో రియల్టీ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. సరఫరా చైన్ అవసరాల రిస్కులను తగ్గించుకునేందుకు పలు ప్రపంచ కార్పొరేట్లు చైనా+1 వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఉత్పాదక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైతం దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండియాకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. వెరసి రానున్న ఐదారేళ్లలో గ్లోబల్ సప్లై చైన్ రంగంలో ఇండియా మార్కెట్ వాటా బలపడనున్నట్లు అంచనా వేశారు. ఈ సానుకూల అంశాలతో ఆర్థిక వ్యవస్థ వార్షికంగా వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రపంచ సగటును మించుతూ దేశీ రియల్ ఎస్టేట్ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన ) నగరాల ముందంజ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రధానంగా మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాలు రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. 2018లో దేశీ రియల్టీ రంగంలో 5.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు లభించగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ బాటలో 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు దేశీ రియల్టీలో నమోదైనట్లు సీబీఆర్ఈ గణాంకాలు తెలియజేశాయి. (స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) 2018-22 కాలంలో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2018 నుంచి పెట్టుబడుల్లో ఈ నగరాలు 63 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే గత ఐదేళ్లలో నమోదైన 32 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు ఇక్కడికే ప్రవహించాయి. కాగా.. కార్యాలయ ఆస్తులు 13 బిలియన్ డాలర్లతో 40 శాతం వాటాను ఆక్రమించాయి. ఇదేవిధంగా స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకున్నాయి. ఇది ఐదేళ్ల మొత్తం పెట్టుబడుల్లో 39 శాతం వాటాకు సమానం! ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు 2023-24పై ఇండియా రేటింగ్స్ 2022–23లో 8-10 శాతం మేర పెరగొచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చని ఇళ్ల ధరలు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి తటస్థ అంచనాలతో ఉన్నట్టు తెలిపింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022–23లో క్రమబద్ధమైన అప్డ్రెంట్లో ఉంది. టాప్ 8 రియల్ ఎస్టేట్ క్లస్టర్లలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాలు పెరిగినా, మార్ట్గేజ్ రేట్లు పెరిగినా, దేశీయంగా, అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి తగ్గినా అమ్మకాలు పెరగడం ఆశాజనకనం’’అని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్వల్పకాలానికి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపించొచ్చని, మొత్తం మీద నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఒత్తిళ్లను సర్దుబాటు చేసుకోగలదనే అంచనాలను వ్యక్తం చేసింది. డిమాండ్ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపింది. అమ్మకాల ఊపు కొనసాగుతుందని, మొత్తం మీద వార్షికంగా చూస్తే విక్రయాలు 9 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 2022-23లో నిర్మాణ వ్యయాలు 8–10 శాతం మేర పెరిగాయని, దీంతో డెవలపర్లకు నిర్మాణ బడ్జెట్ 5–6 శాతం మేర అధికం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ డెవలపర్లు వచ్చే ఆరేడు నెలలపాటు ధరలు పెంచకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో డిమాండ్ బలపడే వరకు వేచి చూడొచ్చని పేర్కొంది. అందుబాటు ధరలు.. అందుబాటు ధరలు 2021-22లో ఇళ్ల అమ్మకాలను నడిపించినట్టు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ‘‘అయితే ద్రవ్యోల్బణం అమ్మకాల ధరలను పెంచేలా చేశాయి. 2022 మే నుంచి ఆర్బీఐ వరుసగా రెపో రేటు పెంపు 2022- 23లో అందుబాటు ధరల ఇళ్ల విభాగం డిమాండ్‌కు సవాలుగా నిలిచాయి. అంతేకాదు, మధ్య, ప్రీమియం విభాగంలోనూ కొనుగోళ్లను వాయి దా వేయడానికి దారితీశాయి. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని పెద్ద సంస్థలు, మంచి బ్రాండ్ విలువ కలిగినవి, 2023-24లో బలమైన నిర్వహణ పనితీరు చూపిస్తాయి. తద్వారా వాటి మార్కెట్ షేరు పెరగొచ్చు’’అని పేర్కొంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని డెవలపర్లు బలహీన అమ్మకాలు, వసూళ్లు, నిధుల లభ్యత పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు తగ్గిన డిమాండ్?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాది 25–30 శాతం క్షీణించొచ్చని (క్రితం ఏడాదితో పోలిస్తే) కొలియర్స్ ఇండియా, ఫిక్కీ నివేదిక తెలిపింది. ఆఫీస్ స్పేస్ లీజు 35–38 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ‘ఆఫీసు స్పేస్ విభాగంలో వస్తున్న ధోరణులు, అవకాశాలు – 2023’ పేరుతో కొలియర్స్ ఇండియా, ఫిక్కీ ఒక నివేదికను విడుదల చేశాయి. 2022లో స్థూలంగా కార్యాలయాల స్థలాల లీజు పరిమాణం 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో నమోదైన 32.9 మిలియన్ చదరపు అడుగుల లీజు పరిమాణంతో పోలిస్తే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె నగరాలకు సంబంధించిన వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. చదవండి👉 అపార్ట్మెంట్ ప్రారంభ ధర రూ.30 కోట్లు.. రెంట్ నెలకు రూ.10లక్షలు! ద్వితీయ భాగంలో డిమాండ్ ఆర్థిక సమస్యలు నెమ్మదిస్తాయని, మొత్తం మీద స్థలాల లీజుదారుల విశ్వాసాన్ని ఏమంత ప్రభావితం చేయవని ఈ నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరికి లీజు లావాదేవీలు గణనీయంగా పెరగొచ్చని, తాత్కాలికంగా నిలిపివేసిన లీజులపై కార్పొరేట్లు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేసింది. ఒకవేళ నిరాశావహ వాతావరణం ఉంటే, ఆర్థిక సమస్యలు కొనసాగితే డిమాండ్ రకవరీపై ప్రభావం పడుతుందని తెలిపింది. ప్రస్తుతానికి ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనిశ్చితిగా ఉందని, అంతర్జాతీయ అనిశ్చితులు, ఇతర సమస్యలు నెమ్మదిస్తే అప్పుడు డిమాండ్ పుంజుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో బలమైన వ్యాపార మోడళ్లు ఉన్న స్టార్టప్‌లు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు లీజుకు ముందుకు రావచ్చని పేర్కొంది. కరోనా ముందున్న గరిష్ట స్థాయి లీజు స్పేస్ పరిమాణానికి మించి డిమాండ్ తగ్గకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. చదవండి👉 విదేశీయులకు షాకిచ్చిన కెనడా..ఆందోళన -
అపార్ట్మెంట్ ప్రారంభ ధర రూ.30 కోట్లు.. రెంట్ నెలకు రూ.10లక్షలు!
గగనమే హద్దుగా రియల్ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే బెంగళూరులో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం యూబీ సిటీ (ubcity-United Breweries)లో అపార్ట్మెంట్ నిర్మాణాలు నింగిలోని చుక్కలను తాకేలా నిర్మిస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. ఇప్పుడు వాటిని సొంతం చేసుకునేందుకు బిలియనీర్లు పోటీపడుతున్నారు. ఇక్కడ ఒక్కో అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ ధర కోట్లలో ఉంటే రెంట్ లక్షల్లో ఉంది. బెంగళూరులో విలాసవంతమైన జిల్లాగా ప్రసిద్ధి చెందిన యూబీ సిటీలో లగ్జరీ మాల్ (ది కలెక్షన్), విశాలమైన ఆఫీస్ స్పేస్ కార్యాలయాలు, ఓక్వుడ్ సర్వీస్ అపార్ట్మెంట్లు, బిలియనీర్స్ టవర్ (కింగ్‌ఫిషర్ టవర్స్)తో పాటు అన్నీ రంగాలకు చెందిన ఆఫీస్ కార్యకలాపాలు ఇక్కడే జరుగుతున్నాయి. విజయ్ మాల్య తండ్రి విటల్ మాల్య రోడ్డులో విజయ్ మాల్య తండ్రి విటల్ మాల్య రోడ్డులో యూబీ సిటీ, కింగ్ ఫిషర్ ప్లాజా, కాంకోర్డ్, కాన్బెర్రా, కామెట్, కింగ్‌ఫిషర్ టవర్స్ అంటూ 6 బ్లాకుల్లో మొత్తం 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టారు విజయ్ మాల్య. 2004లో ప్రారంభమైన ఇక్కడి నిర్మాణాలు 2008లో పూర్తయ్యాయి. నాటి నుంచి ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతూ బెంగళూరుకు దిక్సూచిలా మారింది. అందుకే కాబోలు అక్కడ నివసించేందుకు బడ బడా వ్యాపార వేత్తలు కోట్లు కుమ్మరించి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తుంటారు. 2014-2016లో ఆ ప్రాంతాన్ని మరింత అభిృద్ది చేసేందుకు మాల్యా ఆధీనంలోని ఓ సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టింది. వెరసీ ఆ ఏరియాలో 8వేల స్కైర్ ఫీట్ అపార్ట్ మెంట్ ధర రూ. 35వేలతో ప్రారంభ విలువ రూ.30 కోట్లకు పైగా పెరిగిందని, సగటు నెలవారీ అద్దె రూ.10 లక్షలుగా ఉందని స్థానిక రియల్టర్స్ చెబుతున్నారు. ప్రముఖుల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఇక బీఎండబ్ల్యూ, ఫోర్సే, హార్లే డేవిడ్సన్ వంటి కంపెనీలకు చెందిన షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి. లూయిస్ విట్టన్, డీజిల్, రోలెక్స్ వంటి లగ్జరీ బ్రాండ్స్ షాప్స్ ఉండడంతో యూబీ సిటీ బెంగళూరు వాసులకు వీకెండ్ గమ్యస్థానంగా మారింది. ఈ అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఫ్లిప్‌కార్ట్ సచిన్ బన్సాల్, మెన్సా బ్రాండ్స్ అనంత్ నారాయణన్, జెరోధా నిఖిల్ కామత్‌లతో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు నివాసం ఉంటున్నారు. -
రియల్టీలో పిరమల్ గ్రూప్ వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పిరమల్ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ పిరమల్ రియల్టీ వచ్చే రెండేళ్లలో రూ.3,500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న నాలుగు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు పిరమల్ రియల్టీ సీఈవో గౌరవ్ సాహ్నే తెలిపారు. ‘ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ప్రస్తుతం 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ములంద్, థానే, మహాలక్ష్మి, బైకులా వద్ద గృహ సముదాయాలు నిర్మితమవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులకుగాను 12,000 యూనిట్ల అపార్ట్మెంట్స్ రానున్నాయి. తొలి 1,000 యూనిట్లు కస్టమర్లకు అందించడం ప్రారంభం అయింది’ అని తెలిపారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ హౌసింగ్ డిమాండ్ బలంగానే ఉందని గౌరవ్ వివరించారు. ఉమ్మడిగా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భూ యజమానులతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నామన్నారు. -
ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గ్రేడ్–ఏ) విభాగంలో బెంగళూరు కొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2022 సెప్టెంబర్ నాటికి 1.06 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసుల్లో ఉన్న సీబీఆర్ఈ ఇండియా ప్రకారం.. షాంఘై, బీజింగ్, సియోల్, టోక్యో, సింగపూర్ వంటి 11 ప్రధాన నగరాలను తలదన్ని బెంగళూరు ముందు వరుసలో నిలిచింది. షాంఘై ఒక కోటి, బీజింగ్ 76 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానాలను అందుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫ్లెక్సిబుల్ ఏ–గ్రేడ్ ఆఫీస్ స్థలంలో భారతదేశం ముందుంది. 12 నగరాలతో కూడిన జాబితాలో 66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఢిల్లీ–ఎన్సీఆర్ అయిదవ స్థానంలో ఉంది. 57 లక్షల చ.అడుగులతో హైదరాబాద్ ఏడవ స్థానం ఆక్రమించింది. ఆసియా పసిఫిక్‌లో ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగంలో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 35 శాతానికి చేరింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే గ్రేడ్–ఏ కార్యాలయ భవనాలలో భారత్, సింగపూర్ అత్యధిక ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్థలం కలిగి ఉన్నాయి. భారత్ అత్యధిక వృద్ధి.. మొత్తం ప్రీమియం ఆఫీస్ స్పేస్‌లో 5.5 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వాటాతో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మహమ్మారి తర్వాత ఫ్లెక్సీ–ఆఫీస్ మార్కెట్లో భారత్ అత్యధిక వృద్ధిని సాధిస్తోంది. ఆసియా పసిఫిక్‌లో ఫ్లెక్సిబుల్ స్థలం 6 శాతం వార్షిక వృద్ధితో 7.6 కోట్ల చ.అడుగులు ఉంది. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే 2022 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధి చెందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం ఫ్లెక్సిబుల్ కేంద్రాల సంఖ్య సుమారు 3,000 ఉంది. ఫ్లెక్సిబుల్ స్థల వినియోగంలో సాంకేతిక కంపెనీలు 36 శాతం, బిజినెస్ సర్వీసులు 28 శాతం కైవసం చేసుకున్నాయి. ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, రిటైల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు స్వల్పకాలిక ఒప్పందాలు, అనువైన నిబంధనలతో సేవలు అందిస్తున్నాయి. దీంతో క్లయింట్లకు వ్యయాలు తగ్గుతున్నాయి’ అని ద్వారక ఆఫీస్ స్పేసెస్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఫ్లెక్సిబుల్ కేంద్రాల్లో కార్యాలయాల నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. -
హైదరాబాద్‌లో ట్రంప్ హౌసింగ్
పుణే: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంపెనీ దేశీయంగా మూడు నుంచి ఐదు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది. ట్రంప్ రియల్టీ కంపెనీ ట్రంప్ ఆర్గనైజేషన్ 2023లో హైఎండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, లూధియానాలలో మూడు నుంచి ఐదు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకు దశాబ్ద కాలంగా కల్పేష్ మెహతా ప్రమోట్ చేసిన ఢిల్లీ కంపెనీ ట్రైబెకా డెవలపర్స్‌తో కొనసాగుతున్న ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని వినియోగించుకోనుంది. ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీల ఏర్పాటుకు ట్రైబెకా రూ. 2,500 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు మెహతా ఇక్కడ జరిగిన ఒక సదస్సు సందర్భంగా వెల్లడించారు. సదస్సుకు ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్‌ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరయ్యారు. ఇద్ద రూ వార్టన్లో కలసి చదువుకోవడం గమనార్హం! 8 ప్రాజెక్టులకు ఓకే రానున్న 12 నెలల కాలంలో రూ. 5,000 కోట్ల విలువైన 7–8 ప్రాజెక్టులు చేపట్టేందుకు సంతకాలు చేసినట్లు మెహతా వెల్లడించారు. వీటిలో సగం నిధులను మూడు ట్రంప్ బ్రాండ్ ప్రాజెక్టులకు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ముంబై, పుణే, ఢిల్లీ ఎన్సీఆర్తోపాటు బెంగళూరు, హైదరాబాద్ వంటి కొత్త నగరాలవైపు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చండీగఢ్, లూధియానాలలో డెవలపర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రైబెకా సీఈవో హర్షవర్ధన్ ప్రసాద్ తెలియజేశారు. ఇప్పటికే నాలుగు దేశీయంగా ఇప్పటికే నాలుగు ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీలు ఏర్పాటయ్యాయి. తద్వారా యూఎస్ వెలుపల ట్రంప్ కంపెనీకి ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. నాలుగు ప్రాజెక్టులు విక్రయానికి వీలైన 2.6 మిలియన్ చదరపు అడుగుల(ఎస్‌క్యూఎఫ్‌టీ) ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో 0.27 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ పంచ్‌శీల్ బిల్డర్స్(పుణే), 0.56 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ మాక్రోటెక్ డెవలపర్స్(ముంబై) దాదాపు విక్రయంకాగా.. 1.36 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ ఎం3ఎం గ్రూప్(గురుగ్రామ్) దాదాపు సిద్ధమైనట్లు మెహతా పేర్కొన్నారు. ఇక మరో 0.42 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ యూనిమార్క్ గ్రూప్(కోల్‌కతా) నిర్మాణంలో ఉన్నట్లు తెలియజేశారు. -
భారత్‌కు ట్రంప్ జూనియర్..రియల్ ఎస్టేట్ రంగంపై కన్ను, వేలకోట్ల పెట్టుబడులు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రియల్ ఎస్టేట్ రంగంలో తన వ్యాపార కార్యాలపాల్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ డిసెంబర్ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ జూనియర్‌కు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ ముంబై ట్రిబెకా డెవలపర్స్ భాగస్వామ్యంతో భారత్‌లో పలు నిర్మాణాలు చేపట్టనుంది. ఇప్పటికే ‘ట్రంప్’ బ్రాండ్ పేరుతో దేశీయంగా లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంది. ఇందుకోసం ట్రిబెకా డెవలపర్స్, లోధా గ్రూప్‌తో జతకట్టింది. ఇక, ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో ఇప్పటివరకు ట్రంప్ టవర్ ఢిల్లీ - ఎన్సీఆర్, ట్రంప్ టవర్స్ కోల్‌కతా, ట్రంప్ టవర్ పూణే, ట్రంప్ టవర్ ముంబై నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రాకపై ట్రిబెకా డెవలపర్స్ ప్రతినిధులు స్పందించారు. తమ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా జూనియర్ భారత్‌కు వస్తున్నట్లు తెలిపారు. భారత పర్యటన నేపథ్యంలో ట్రిబెకా డెవలపర్స్ అధినేత కల్పేష్ మెహత, ట్రంప్ జూనియర్లు వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ట్రంప్ లగ్జరీ ప్రాజెక్ట్‌లు 2014లో ది ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది. తొలిసారిగా ముంబైలో లోథా గ్రూప్‌తో ఇంటి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూణేలో పంచశీల్ రియాల్టీ సంస్థ భాగస్వామ్యంలో లగ్జరీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. కోల్ కతాలో ట్రంప్ టవర్స్ 140 అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను ప్రారంభించింది. 2018లో గురుగ్రామ్, హర్యానాలలో మరో లగ్జరీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. -
సత్యం ఉన్నది ఉన్నట్లుగానే
ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోతే ఉన్న మనకు లేనిపోని నష్టం జరుగుతుంది. మనకు కష్టం కలుగుతుంది. సత్యం లేదా నిజం తెలియకపోవడం వల్లా, లేకపోవడం వల్లా, మనకు ఎంతో హాని జరుగుతుంది, జరుగుతోంది, జరుగుతూ ఉంటుంది... ప్రతి ఒక్కరికీ సత్యం అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ సత్యమే అవసరం అవుతుంది. ఏదో అనుకోవడం, ఏదో అభిప్రాయపడడం ఈ రెండిటినీ వీలైనంత తొందరగా మనం వదిలేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన ఇష్ట, అయిష్టాల్లో సత్యం లేకపోవచ్చు; మనకు నచ్చిన, నచ్చని వాటిల్లో సత్యం లేకపోవచ్చు. కాబట్టి మనం మనల్ని దాటుకుని లేదా మనల్ని మనం మార్చుకుని సత్యంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఆ పని ఎంత తొందరగా జరిగితే మనకు అంత మేలు జరుగుతుంది. క్షేత్ర వాస్తవాన్ని తెలుసుకోగలగడం, ఆపై సత్యాన్ని అవగతం చేసుకోగలగడం మనిషి జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినవి. మనకు ముందు వచ్చిన వాళ్లు చెప్పారు కాబట్టి, మనకు ముందే కొందరు నమ్మారు కాబట్టి, కొందరు చెబుతున్నారు కాబట్టి, కొందరు అనుకుంటున్నారు కాబట్టి, ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాడుకలో ఉన్నాయి కాబట్టి ఉన్నవి సరైనవే అని స్వీకరించే ధోరణి వాంఛనీయం కాదు. అది నాసిరకం పోకడ. అది ఆదర్శనీయమైనది కాదు. ఏదో అనుకోవడం, దేన్నో ఊహించుకోవడం సరైనవి కాకపోవడమే కాదు, అత్యంత హానికరమైనవి కూడా. ఒక రోగి తనకు రోగం ఉంది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే దానికి తగిన వైద్యం చేసుకుని లాభపడడం జరుగుతుంది. ఏ విషయంలో అయినా ఎంత తెలుసుకుంటే అంత లాభం ఉంటుంది. తెలివిడిలోకి వెళ్లేందుకు అభిప్రాయాలవల్ల ఏర్పడ్డ నమ్మకం అడ్డంకిగా ఉంటూనే ఉంటుంది. మనం ఆ అడ్డంకిని వీలైనంత వేగంగా తొలగించుకోవాలి. చలామణిలో ఉన్నవాటిని నమ్మడం మనిషి బలహీనతల్లో బలమైంది. ఆ బలమైన బలహీనత మనిషిని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. మనిషి ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూనే ఉన్నాడు. ‘నమ్మడంపై నాకు నమ్మకం లేదు, తెలుసుకోవడమే నా విధానం’ అని ఓషో ఒక సందర్భం లో అన్నారు. తెలుసుకునే విధానానికి మనం అలవాటుపడాలి.‘ఏది సత్యం?’ ఈ ప్రశ్నకు ‘దేని ప్రభావం మంచి చేస్తుందో అది సత్యం’ అని మనుస్మృతిలోని మాటల్ని ఉటంకిస్తూ బుద్ధుడు తెలియజెప్పాడు. అమెరికా దేశపు తత్త్వవేత్త విలియమ్ జేమ్స్ కూడా ఈ మాటల్ని చెప్పారు. ఒక ప్రయత్నానికి వచ్చిన ప్రభావంవల్ల జరిగిన మంచి సత్యం. మనకు మంచి కావాలి కనుక మనకు సత్యం కావాలి. నమ్మడం, అభిప్రాయపడడం ఇవి అర్థంలేనివి. ఆపై అనర్థదాయకమైనవి. అధ్యయనం చేస్తే కానీ అవగాహన రాదు. ఏది ఉందో, ఏది లేదో, ఏది అవునో, ఏది కాదో మనం తెలుసుకోవాలి. ఇకనైనా, ఇపుడైనా నిజానిజాలను తేల్చుకుందాం. కళ్లు తెరిస్తే కానీ దృశ్యం కనిపించదు. నిద్రలేస్తే కానీ నడక మొదలవదు. మనం నిద్రలేచి నడక మొదలుపెడదాం. ‘నా భావన’, ‘నేనేం అంటానంటే’ అన్న మధ్యతరగతి మాంద్యాన్ని వదిలించుకుందాం; ఉన్న మిథ్యలను విదిలించుకుని ముందుకెళదాం. ప్రయత్నించి సత్యాన్ని సాధిద్దాం; సత్యంతో మనుగడను సాగిద్దాం. ‘సత్యాన్ని అమృతంలా సేవించు’ అని అష్టావక్రగీత చెబుతోంది. సత్యాన్ని సేవించడానికి అలవాటు పడదాం. సత్యం రుచిగా ఉంటుంది. ఆ రుచిని తెలుసుకుందాం. ఆ తరువాత సత్యం రుచికి మాలిమి అయిపోయి జీవితాన్ని మనం రుచికరం చేసుకుందాం. సత్యం జ్ఞానాన్ని ఇస్తుంది. ‘జ్ఞానం స్వేచ్ఛకు ఆధారం’ అని తెలియజెప్పారు ఆదిశంకరాచార్య. సత్యం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా స్వేచ్ఛను పొంది మనం సరిగ్గా, ఉన్నతంగా జీవిద్దాం; జీవితాన్ని విలువైందిగా చేసుకుందాం. అభిప్రాయాలు, అనుకోవడాలు, నమ్మకాలు వీటిని మనలో పేర్చుకుని మనల్ని మనం మోసుకోవడం జీవనం కాదు; వాటివల్ల మనలో మనం కూరుకు పోవడం జీవితం కాకూడదు. ఎరుకను అనుసరిద్దాం; ఎదుగుతూ ఉందాం. – రోచిష్మాన్ -
ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. దేశంలోని మెట్రో సిటీస్‌ను వెనక్కి నెట్టి ముందుకెళుతోంది. అక్కడ ఇక్కడా అని కాకుండా హైదరాబాద్ నలువైపులా వందలాది రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో తన మార్క్‌ను చూపుతోంది. నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. కరోనా తర్వాత బాగా పంజుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే అనువైన సమయంగా కొనుగోలు దారులు భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నగర శివారు ప్రాంతమైన తెల్లాపూర్ ఇప్పుడు రెసిడెన్షియల్ హబ్‌గా అవతరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇళ్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు ఉత్సాహాం చూపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ,రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్ ఏరియా శాటిలైట్ టౌన్‌గా ఉండేది. అయితే ఐటీ రంగం అభివృద్ధి చెందడం, నగరంలోని ఐటీ హబ్, ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉండటంతో అనేక మంది టెక్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడ స్థిరపడేందుకు మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు ఫేస్బుక్, డెలాయిట్, హెచ్ఎస్బీసీ, ఆప్టమ్, క్వాల్కామ్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, నోవార్టిస్ల కార్యాలయాలు తెల్లాపూర్, సమీప ప్రాంతాలలో ఉండడం రియల్ ఎస్టేట్ బూమ్‌కు మరింత ఊతం ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు లింగం పల్లి ఇప్పుడు తెల్లాపూర్ గృహ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నట్లు రియల్టర్లు చెబుతున్నారు. ఇంతకుముందు రియల్టీ బూమ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే నగరంలో ఐటీ రంగం వృద్ధితో ఇది విస్తరించిందని, భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరింత రియాల్టీ అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. చదరపు అడుగు ఎంతంటే ఈ తరుణంలో క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెల్లాపూర్‌లో రియల్ బూమ్‌పై మాట్లాడుతూ... ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్లు చదరపు అడుగుకు సగటున రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1,000 చదరపు అడుగుల నుంచి 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2బీహెచ్‌కే ఇళ్ల ధర దాదాపు రూ. 1.2 కోట్లు ఖర్చవుతుండగా, 3బీహెచ్‌కే రూ. 1.5 కోట్లకు పైగా ధరలకు అమ్ముతున్నట్లు అంచనా వెలసిన ప్రాజెక్ట్‌లు తెల్లాపూర్ ఐటీ పరిసర ప్రాంతాల్లో ఐటీ బూమ్‌తో మై హోమ్, రాజపుష్ప, హానర్ హోమ్స్, రామ్కీ, వెర్టెక్స్ హోమ్స్ వంటి రియాల్టీ డెవలపర్లు ఇప్పటికే అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయి. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాంతంలో మాల్‌ను ఏర్పాటు చేస్తుండగా..మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు బిల్డర్లు ముందుకు వస్తున్నారు. కనెక్టివిటీ బాగుంది తెల్లా పూర్ సమీపంలో మియాపూర్ మెట్రో స్టేషన్, టీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఆ ప్రాంత నివాసితులు తక్కువ సమయంలో నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. మాదాపూర్ నుండి 15 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 30 కి.మీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్న తెల్లాపూర్ నగరంలోని అన్ని ప్రాంతాలకు మంచి రహదారి కనెక్టివిటీని కలిగి ఉంది. ఎంఎంటీఎస్ సౌకర్యం పెరుగుతున్న డిమాండ్ల మధ్య, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ కనెక్టివిటీని అందించాలని యోచిస్తోంది. 10 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వంటి ప్రాంతాలకు లింగంపల్లి ద్వారా చేరుకోవచ్చు, కొల్లూరు ఓఆర్ఆర్ ద్వారా చేరుకోవచ్చు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FoBs) నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న ఎన్ఆర్ఐలు..ఎందుకంటే?
కరోనా కాటుతో స్తబ్ధుగా ఉన్న రియాల్టీ రంగం భారత్‌లో ఊపందుకుందా? పెట్టుబడులు, కొనుగోళ్లు, అమ్మకాలతో హైదరాబాద్ రియాల్టీకి జోష్ వచ్చిందా? హోమ్ లోన్ లపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా.. ఇళ్లు, ప్లాట్ల, ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నా విదేశాల్లో స్థిర పడ్డ భారతీయులు హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారా? ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఎన్ఆర్ఐలు తిరిగి భారత్‌లో స్థిరపడాలని అనుకుంటున్నారా? అంటే అవుననే అంటోంది తాజాగా విడుదలైన ఓ సర్వే. ► సీఐఐ - అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్1 -2022 ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇక్కడ స్థిరాస్తుల్ని సులభంగా కొనుగోలు చేసేలా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో పాటు, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు ఎన్ఆర్ఐలకు, ఓసీఐలకు కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది. ►దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్ఐల మొగ్గు చూపుతున్నారు. ►ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎన్ఆర్ఐలు ఇళ్లను కొనుగోలు చేసే ప్రాంతాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు అగ్రస్థానంలో ఉన్నాయని సీఐఐ - అనరాక్ సర్వే తెలిపింది. ►సర్వేలో పాల్గొన్న కనీసం 60 శాతం మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్, ఢిల్లీ , బెంగళూరులో ఇళ్లను కొనుగోలు చేస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అదే జాబితాలో ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ నాల్గవ స్థానంలో నిలిచింది. ►ఈ ఏడాది ఎన్ఆర్ఐలు ఇళ్లను కొనుగోలు చేసే అత్యంత ఇష్టమైన ప్రాంతంగా హైదరాబాద్ దక్కించుకుంది. 22 శాతం మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీలో 20 శాతం మంది, బెంగళూరులో 18 శాతం మంది మాత్రమే ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. ►2021లో ఇదే కాలంతో పోలిస్తే 2022 మొదటి తొమ్మిది నెలల్లో గృహ నిర్మాణం ఎన్ఆర్ఐలలో డిమాండ్‌లో 15-20 శాతం పెరిగింది. ►అనరాక్ రీసెర్చ్ ప్రకారం, 2022 జనవరి-సెప్టెంబర్ కాలంలో మొదటి ఏడు నగరాల్లో సుమారు 2.73 లక్షల గృహాలు అమ్ముడయ్యాయి. సగటున, ఏ త్రైమాసికంలోనైనా విక్రయించిన ఇళ్లలో 10-15 శాతం ఎన్ఆర్ఐల వాటా ఉంది" అని ఠాకూర్ చెప్పారు. ►ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అనేక దేశాల్లో నెలకొన్న మాంద్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా మంది ఎన్నారైలు ఇప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లాలని చూస్తున్నారని సర్వే పేర్కొంది. వారు రూ. 90 లక్షల నుండి రూ. 1.5 కోట్ల మధ్య ప్రీమియం ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది. ►ఇక ఎన్ఆర్ఐలలో 2బీహెచ్‌కే కంటే 3బీహెచ్‌కే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. సర్వే ప్రకారం, 44 శాతం మంది ఎన్ఆర్ఐలు 3బీహెచ్‌కేలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వారిలో 38 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఈ సందర్భంగా అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ & రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ గృహ రుణ వడ్డీ రేట్లు, ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇల్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ బలంగా ఉందని అన్నారు.యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం ఎన్ఆర్ఐలు భారత్‌లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు. చదవండి👉 ఈ హైవేలో ఎకరం ధర రూ.1.5కోట్లు..! చదవండి👉 : ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
కోవిడ్ ఎఫెక్ట్.. ఆ సేల్స్ భారీగా పెరిగాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్‌లో 88,234 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ అని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, పుణే ఈ జాబితాలో ఉన్నాయి. 2021 జూలై–సెప్టెంబర్‌లో ఈ నగరాల్లో 62,799 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాలు 45 శాతం పెరిగి 93,490 యూనిట్లకు చేరుకుంది. ఇండ్ల అమ్మకాలు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 46 శాతం దూసుకెళ్లి 14,966 యూనిట్లు నమోదైంది. ముంబై 26 శాతం పెరిగి 26,400, బెంగళూరు 48 శాతం వృద్ధితో 12,690, హైదరాబాద్ 73 శాతం అధికమై 11,650, కోల్‌కత 54 శాతం ఎగసి 4,953 యూనిట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు నగరాన్నిబట్టి 1–2 శాతం పెరిగాయి. ట్రెండ్ కొనసాగుతుంది.. ముడి సరుకు వ్యయం ప్రియం కావడం, కోవిడ్ తదనంతరం డిమాండ్ అధికం కావడంతో వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల 4–7 శాతంగా ఉంది. ఏడు నగరాల్లో ఎదురుగాలులు ఉన్నప్పటికీ మూడవ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు, కొత్త లాంచ్‌లు రెండూ ఊపందుకున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ తెలిపారు. ప్రధాన కంపెనీల నుంచి కొత్త గృహాల సరఫరా పెరిగిందన్నారు. కోవిడ్–19 తదనంతరం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న తపన కస్టమర్లలో అధికం అయిందని వివరించారు. పండుగల త్రైమాసికంలోనూ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పారు. ‘పండుగ సీజన్లో విక్రయాల ఊపును కొనసాగించేందుకు డెవలపర్లు లాభదాయక లాంచ్ ఆఫర్లను పరిచయం చేశారు. వీటికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచాల్సి వస్తే మార్కెట్లో కొంత గందరగోళం ఏర్పడవచ్చు’ అని ఆయన తెలిపారు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
మీ ప్రాపర్టీస్‌పై ఎక్కువ ఆదాయం రావాలంటే గుర్తుంచుకోవలసిన విషయాలు!
దేశంలో స్థిరాస్థి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్-19 ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో స్థిరాస్థులైన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులే సురక్షితమైనవని, సమీప భవిష్యత్‌లో అవి పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అందుకే స్థిరాస్థి రేట్లు పెరుగుతున్నా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక వేళ మీరూ ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఆ ప్రాపర్టీస్ మీద పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రిటర్న్ పొందాలని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోండి. తద్వారా భవిష్యత్‌లో ఊహించని దానికంటే ఎక్కువ రిటర్న్ పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లొకేషన్ మీరు ఏ ప్రాంతంలో పెట్టుబుడులు పెడుతున్నారో.. ఆ పెట్టుబడుల నుంచి ఎంత రిటర్న్స్ రావాలో నిర్ణయించేది లొకేషన్ మాత్రమే. అందుకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండి, ఆదాయం పొందాలనుకుంటే అభివృద్ధి అవుతున్న ప్రాంతాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఈ పెట్టుబడి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడికంటే తక్కువగా ఉంటుంది. సౌకర్యం కొనుగోలు దారులు షాపింగ్ క్లాంప్లెక్స్, పార్క్స్,స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాకు చెందిన ప్రాపర్టీల మీద పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. అందుకే మీరు ప్రాపర్టీస్మీద పెట్టుబడులు పెట్టే ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవా అని చూసుకోండి. ఇప్పటికే ఈ సౌకర్యాలు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే భవిష్యత్‌లో పైన పేర్కొన్న సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిసినా పెట్టుబడి పెట్టొచ్చు. ట్రాన్స్ పోర్ట్ ప్రాపర్టీని కొనుగోలు చేసే బయ్యర్స్ పరిగణలోకి తీసుకునే అంశం ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉందా? కనెక్టివిటీ ఆప్షన్ ఉందా? అని చూసుకుంటారు. అదే ఆస్తిపై కొనుగోలుదారుడి ఆసక్తి, దాని విలువ పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లైతే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, బస్టాండ్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి. కమర్షియల్ ఏరియాలు మీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రాపర్టీస్ కమర్షియల్ ఏరియాల్లో ఉంటే మంచిది. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీస్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీస్‌ను లీజ్‌గా ఇవ్వొచ్చు. ఇళ్లైతే రెంట్‌కు ఇవ్వొచ్చు. ఇలా ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఆదాయం గడించవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. -
పుంజుకున్న హైదరాబాద్ రియల్టీ..ఇళ్ల ధరలు ఎంత శాతం పెరిగాయంటే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. హైదరాబాద్ కాకుండా మిగిలిన ఏడు ప్రధాన పట్టణాలను పరిశీలించినట్టయితే.. అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.8 శాతం, బెంగళూరులో 2.5 శాతం, చెన్నైలో 7.7 శాతం, ఢిల్లీలో 3.2 శాతం, కోల్‌కతాలో 2.6 శాతం, ముంబైలో 1.9 శాతం, పుణెలో 0.9 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. సీక్వెన్షియల్‌గా (అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే) చూస్తే.. 50 పట్టణాలతో కూడిన రెసిడెక్స్ ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 2.6 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలో ఉన్న 1.7 శాతంతో పోలిస్తే పుంజుకుంది. అంతేకాదు, 2021 జూన్ నుంచి త్రైమాసికం వారీగా ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపిస్తోందని.. హౌసింగ్ మార్కెట్ కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ట్రాక్ చేసేందుకు ఎన్‌హెచ్‌బీ 2007లో రెసిడెక్స్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. -
దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే!
ముంబై: ముంబై అధిక ఖర్చుతో కూడుకున్న మెట్రోగా, హైదరాబాద్‌ను చౌకగా ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. జీవన వ్యయాలు, నివాసానికి అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ముంబైకి ఈ రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా ఆకర్షణీయంగా ఉన్నట్టు ‘మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’లో తెలిసింది. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంకు 127. ఢిల్లీ 155, చెన్నై 177, బెంగళూరు 178, హైదరాబాద్ 192వ స్థానంలో ఉన్నాయి. పుణె 201, కోల్‌కతా 203 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ పట్టణాల్లో నివాస, జీవన వ్యయాలు చౌకగా ఉన్నాయని ప్రవాసులు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్ అత్యంత ఖర్చుతో కూడుకున్న నగరంగా నిలిచింది. ఆ తర్వాత జ్యురిచ్, జెనీవా, స్విట్జర్లాండ్‌లోని బాసెల్, బెర్న్, ఇజ్రాయెల్ టెల్ అవీవ్, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్, టోక్యో, బీజింగ్ నగరాలు అధిక వ్యయాలతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో మెర్సర్స్ ఈ సర్వే నిర్వహించింది. 200కు పైగా కమోడిటీల ధరలు, ఇళ్లు, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంట్లోని వస్తువులు, వినోదానికి చేసే ఖర్చు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను ర్యాంకుల్లోకి తీసుకుంది. హైదరాబాద్ అనుకూలతలు ప్రముఖ బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముంబైని అత్యంత అనుకూల నగరంగా భావిస్తున్నాయి. అదే సమయంలో తక్కువ వ్యయాలు ఉండే హైదరాబాద్, చెన్నై, పుణె పట్ల కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉండడంతో.. హైదరాబాద్, చెన్నై, పుణె నగరాలు తక్కువ వ్యయాలతో ఆకర్షణీయమైన మెట్రోలుగా సర్వే పేర్కొంది. కోల్‌కతాలో జీవన వ్యయాలు తక్కువగా ఉన్నాయి. పాలు, బ్రెడ్, కూరగాయలు, పండ్లను ధరలను పరిగణనలోకి ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఢిల్లీ, ముంబైలో మాత్రం వీటి ధరలు అధికంగా ఉన్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉంటే, చెన్నై, హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నాయి. సినిమా చూడాలంటే ముంబైలో చాలా ఖర్చు చేయాలి. హైదరాబాద్‌లో సినిమా చూసేందుకు చేసే ఖర్చు తక్కువ. ఇళ్ల ధరలు తక్కువ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోకి హైదరాబాద్, ఇళ్ల ధరల పరంగా చౌకగా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కానీ, జీవన వ్యయాలు, నివాస వ్యయాలు (ఇళ్ల అద్దెలు/ధరలు) కలిపి చూస్తే పుణె, కోల్‌కతా కంటే హైదరాబాద్ వెనుక ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఇళ్ల అద్దెలు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జీవన వ్యయాలు చాలా ఎక్కువ ఖర్చుతో కూడినవిగా సర్వే పేర్కొంది. చదవండి👉 తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్! -
ఇక్కడ అంతగా బాగాలేదు.. మన ఇండియాలో జాగాలు ఉంటే చూడు!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్ఆర్ఐలను భారత మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ ఎన్ఆర్ఐల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మధ్యస్థాయి, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో వారు పెట్టుబడులకు మందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఎన్నో సవాళ్లను విసురుతున్నాయి. కానీ, వృద్ధి పరంగా భారత్ మార్కెట్ సురక్షితమైనది’’అని రియల్ ఎస్టేట్ సంఘం నరెడ్కో వైస్ చైర్మన్, హిరనందాని గ్రూపు ఎండీ అయిన నిరజంన్ హిరనందాని తెలిపారు. 2022లో ఇప్పటి వరకు రూపాయి డాలర్‌తో 5.2 శాతం విలువను కోల్పోయింది. సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా ఎన్ఆర్ఐలకు భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంపద వృద్ధికి మంచి మార్గంగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కల్లోల పరిస్థితుల్లో పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సురక్షితమైనదే కాకుండా, పెట్టుబడుల వృద్ధికి, చక్కని అద్దె ఆదాయానికి వీలు కల్పిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పెట్టుబడుల ప్రక్రియ డిజిటైజేషన్ కావడం వారికి అనుకూలిస్తున్నట్టు పేర్కొన్నాయి. పెరిగిన విచారణలు.. గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల అవకాశాలపై ఎఆర్‌ఐల నుంచి విచారణలు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెద్ద సంస్థలు, సకాలంలో డెలివరీ చేసే ట్రాక్ రికార్డు ఉన్న వాటికి ఎక్కువ విచారణలు వస్తున్నాయి. ‘‘రూపాయి విలువ క్షీణించడం భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలకు లభించిన మంచి అవకాశం. అందుకనే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులకు సంబంధించి విచారణలు వస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ఈస్ట్ నుంచి ఎక్కువ స్పందన వస్తోంది’’అని కే రహేజా కార్ప్ హోమ్స్ సీఈవో రమేశ్ రంగనాథన్ తెలిపారు. భారత జనాభా ఎక్కువగా ఉండే యూఏఈ, సౌదీ అరేబియా దేశాల నుంచి ఎక్కువ మంది పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ‘‘గల్ఫ్‌దేశాల్లోని ఎన్ఆర్ఐల నుంచి మాకు ఎక్కువగా విచారణలు వస్తున్నాయి. సంప్రదాయంగా మాకు ఇది బలమైన మార్కెట్. దీనికి అదనంగా సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి సైతం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మేము నమోదు చేసిన వ్యాపారంలో 30 శాతం ఈ దేశాల్లోని ఎన్ఆర్ఐల నుంచే వచ్చింది. అలాగే, లండన్, మాల్టా నుంచి సైతం పెట్టుబడులు వచ్చాయి’’అని ఇస్ప్రవ గ్రూపు వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిమాన్‌షా తెలిపారు. -
రియల్టీలోకి తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల రాక మార్చి త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తక్కువగా 1.18 బిలియన్ డాలర్ల (రూ.9,086 కోట్లు) పెట్టుబడులు వచ్చినట్టు రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 2021 మొదటి మూడు నెలల్లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు రూ.3.08 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. కార్యాలయం విభాగంలో పీఈ పెట్టుబడులు 732 మిలియన్ డాలర్లకు తగ్గాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కార్యాలయ విభాగంలోకి 2,148 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నివాస విభాగంలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 234 మిలియన్ డాలర్ల నుంచి 73 మిలియన్ డాలర్లకు తగ్గాయి. రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 484 మిలియన్ డాలర్ల నుంచి 253 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. 2021 పూర్తి ఏడాదికి రియల్టీలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 6,199 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కారణం ఇదే..?
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.9,232గా ఉంది. ముంబై తర్వాత చదరపు అడుగు ధర అధికంగా ఉన్నది హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. అదే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య సగటున 11% పెరిగాయి. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లయసెస్ ఫొరాస్ నివేదిక రూపంలో వెల్లడించాయి. డిమాండ్ పెరగడానికితోడు, నిర్మాణరంగంలో వాడే ముడి సరు కుల ధరలకు రెక్కలు రావడం ఇళ్ల ధరలు ప్రియం కావడానికి కారణాలుగా నివేదిక తెలిపింది. ఢిల్లీలో అధికం.. ఢిల్లీ మార్కెట్లో ఇళ్ల ధరలు అంతకుముందు ఏడాది ఇదే మూడు నెలల కాలంతో పోలిస్తే (2021 జనవరి–మార్చి) అత్యధికంగా 11 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,363కు చేరింది. అహ్మదాబాద్‌లో ధరలు 8% పెరిగి చదరపు అడుగుకు రూ.5,721కి చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల ధరలు ఒక్క శాతమే వృద్ధిని చూశాయి. చదరపు అడుగు ధర బెంగళూరులో రూ.7,595, చెన్నైలో రూ.7,017గా ఉండగా, ముంబై ఎంఎంఆర్‌లో రూ. 19,557గా ఉంది. పుణె మార్కెట్లో ధరలు 3% పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,485గా ఉంది. ‘‘చాలా పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరిగింది. రెండేళ్లలో ఇళ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్స్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులే వార్షికంగా ధరలు పెరగడానికి దారితీశాయి. ఫలితంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు కరోనా ముందున్న స్థాయిని దాటేశాయి’’అని ఈ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 4 శాతం ‘‘దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు జనవరి–మార్చి కాలంలో సగటున 4 శాతం పెరిగాయి. దీర్ఘకాలం పాటు మందగమన పరిస్థితుల నుంచి నివాసిత ఇళ్ల మార్కెట్ ఇంకా కోలుకోవాల్సి ఉంది’’అని క్రెడాయ్, కొలియర్స్ నివేదిక తెలియజేసింది. పూర్వపు స్థాయి కంటే ఎక్కువ 2022 జనవరి – మార్చి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందు నాటికంటే ఎక్కువగా ఉన్నట్టు లయసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. కొత్త సరఫరాతో ఇళ్ల యూనిట్ల లభ్యత పెరుగుతుందన్నారు. గృహ రుణాలపై ఇటీవల వడ్డీ రేట్లు పెరిగినా కానీ, ఇళ్ల విక్రయాలు కూడా వృద్ధిని చూపిస్తాయని చెప్పారు. రియల్టీకి మద్దతుగా నిలవాలి.. పెరిగిపోయిన నిర్మాణ వ్యయాలతో రియల్ ఎస్టేట్ రంగంలో గత 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడినట్టు క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం.. ముడి ఇనుము, స్టీల్ ఇంటర్మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడం ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం యూ షేప్‌లో రికవరీ అయ్యేందుకు మద్దతుగా నిలవాలి’ అని ఆయన కోరారు 5–10 శాతం పెరగొచ్చు.. వచ్చే 6–9 నెలల కాలంలో ఇళ్ల ధరలు మరో 5–10 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ అంచనా వేశారు. ‘‘భారత నివాస మార్కెట్ మంచి పనితీరు చూపించడం ఉత్సాహంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత మార్కెట్ అంచనాలను అధిగమిస్తోంది. విశ్వసనీయమైన సంస్థలు ఈ ఏడాది ఎక్కువ విక్రయాలు చూస్తాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారులు డెవలపర్ల మంచి పేరును కూడా చూస్తున్నారు’’ అని నాయర్ చెప్పారు. -
వేగంగా డిమాండ్.. గృహ అమ్మకాలు ఎలా ఉంటాయంటే..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మెరుగైన డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్‌ను ప్రతికూల (నెగటివ్) నుండి స్థిరానికి (స్టేబుల్) సవరించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం తెలిపింది. ‘అధిక అమ్మకాలు, గృహ యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడం, మెరుగైన స్థోమత, ఎన్నడూ లేనంత తక్కువ గృహ రుణ వడ్డీ రేటు ఈ సవరణకు కారణం. కోవిడ్ తర్వాత డిమాండ్ వేగంగా పెరగడంతో పూర్తి అయిన ప్రాజెక్టుల ధరను సవరించడానికి ఆస్కారం ఏర్పడింది. నిర్మాణ వ్యయం పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాజెక్టులు పూర్తి చేసే సమయాన్నిబట్టి ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. పూర్తయిన ప్రాజెక్ట్‌లలో ఆరోగ్యకరమైన డిమాండ్ అవకాశాలు, ధరల సౌలభ్యం.. వెరశి నిర్మాణ సంస్థలకు లాభదాయకత కొనసాగించడంలో సహాయపడతాయి. గృహ రుణాలపై వడ్డీ రేటు ప్రస్తుత స్థాయి నుండి 50–75 బేసిస్ పాయింట్స్ పెరిగినప్పటికీ డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గడం, స్థిర డిమాండ్‌తో కొత్త ప్రాజెక్టులు గణనీయంగా ప్రారంభం అవుతాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం వృద్ధితో 2022–23లో 40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. మెరుగైన డెలివరీ ట్రాక్ రికార్డ్ ఉన్న పెద్ద, ప్రసిద్ధ బిల్డర్ల మార్కెట్ వాటా పెరుగుతూనే ఉంటుంది. అయితే బలహీనమైన రియల్టర్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని ఇక్రా వివరించింది. చదవండి: భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్ -
రియల్టీ:డబ్బులే డబ్బులు...95 శాతం పెట్టుబడులు వాటిలోనే..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశీయ స్థిరాస్తి రంగంలోకి రూ.110 కోట్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. గతేడాది జనవరి–మార్చి కాలంలో ఈ పెట్టుబడులు రూ.50 కోట్లు ఉండగా.. గతేడాది నాల్గో త్రైమాసిక నాటికి రూ.100 కోట్లుగా ఉన్నాయి. త్రైమాసికంతో పోలిస్తే 8.7 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 140.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. కరోనా మూడో దశ తర్వాత ఆర్ధిక వ్యవస్థ స్థిరపడటం, మార్కెట్లో సెంటిమెంట్ బలపడటం వంటివి ఈ పెరుగుదలకు కారణమని ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కొల్లియర్స్ తెలిపింది. అయితే 2022 క్యూ1లోని సంస్థాగత పెట్టుబడులలో 95 శాతం ఆఫీస్, రిటైల్, పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకే వచ్చాయి. గత త్రైమాసికంలో ఆయా విభాగాల పెట్టుబడుల వాటా 83 శాతంగా ఉంది. కానీ, గతేడాది క్యూ1లో మాత్రం ఈ సెక్టార్ల ఇన్వెస్ట్మెంట్స్ వాటా 99 శాతం ఉండటం గమనార్హం. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లలో 70 శాతం పెట్టుబడిదారులు విదేశీయులే ఉన్నారు. 30 శాతం దేశీయ ఇన్వెస్టర్లున్నారు. చదవండి: ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్ -
దేశీ రియల్టీ రంగంలో డీలా పడ్డ పీఈ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ క్యాలండర్ ఏడాది(2022) తొలి త్రైమాసికంలో డీలా పడ్డాయి. ఈ క్యూ1(జనవరి–మార్చి)లో 47 శాతం క్షీణించి 100 కోట్ల(బిలియన్) డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021) ఇదే కాలంలో 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. అయితే గతేడాది క్యూ4(అక్టోబర్–డిసెంబర్)లో 21.8 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. వీటితో(త్రైమాసికవారీగా) పోలిస్తే పీఈ పెట్టుబడులు తాజా క్వార్టర్లో 4.5 రెట్లు జంప్‌చేసినట్లని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ సావిల్స్ ఇండియా పేర్కొంది. ఈ క్యూ1లో వాణిజ్య కార్యాలయాల ఆస్తులు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేసింది. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 70 శాతాన్ని ఆక్రమించడం గమనార్హం! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి లభించిన అత్యధిక శాతం త్రైమాసిక పెట్టుబడుల్లో బెంగళూరులోని కీలక ఆఫీసు ఆస్తులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సావిల్స్ ఇండియా వెల్లడించింది. కాగా.. ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ రియల్టీ రంగ పీఈ పెట్టుబడులు 32 శాతం వెనకడుగు వేసినట్లు గత వారం అనరాక్ నివేదిక పేర్కొన్న విషయం విదితమే. 2020–21లో తరలివచ్చిన 6.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 4.3 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్లు తెలియజేసింది. చదవండి: షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..? -
రియాల్టీ రంగంలో ఈ విభాగానికి భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: దేశంలో కార్యాలయాల వసతి (ఆఫీసు స్పేస్) వృద్ధి అవకాశాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు టాటా రియల్టీ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కంపెనీల నియామకాలు డిమాండ్‌ను నిర్ణయిస్తాయని పేర్కొంది. ఏడు ప్రధాన పట్టణాల్లో ఆఫీసు స్పేస్ లీజింగ్ 2022లో 30 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. 2021లో లీజు పరిమాణం 26 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. చాలా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకాలు తిరిగి మొదలయ్యాయని టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ తెలిపారు. ‘‘కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో వాణిజ్య కార్యకలాపాలు ఇప్పటికే జోరందుకున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడం కూడా పెరగనుంది. ముందస్తు సంకేతాలను గమనిస్తే 2022లో కార్యాలయల వసతి లీజు గతేడాది సంఖ్యను అధిగమిస్తుందని తెలుస్తోంది’’అని దత్ వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
పిల్లల కోసం అదిరిపోయే లగ్జరీ ఇళ్లు..హైదరాబాద్‌లో ఎక్కడో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆర్క్ గ్రూప్ మరో సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడేలా వెంచర్ డిజైన్‌ను రూపొందించింది. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆసుపత్రులు, షాపింగ్ కేంద్రాలకు నిలయంగా ఉన్న బాచుపల్లిలో సంయక్ పేరిట ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 1.9 ఎకరాలలో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రెండు టవర్లు, ఒక్కోటి పదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 160 ఫ్లాట్లుంటాయి. 1,315 నుంచి 1,760 చ.అ. మధ్య 2, 2.5, 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 7,250 చ.అ. విస్తీర్ణంలో నాలుగు అంతస్తులలో క్లబ్‌హౌస్ ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. కామన్ ఏరియాలలో సౌర శక్తితో నడిచే ఉత్పత్తులను వినియోగించాం. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్‌ను ఆదా చేసే లైటెనింగ్ ఫిక్చర్లను అందుబాటులో ఉంచామని’ వివరించారు. సంయక్ ప్రాజెక్ట్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గోల్డ్ రేటింగ్ పొందిందని తెలిపారు. పిల్లలు వైట్ పేపర్లాంటోళ్లు.. అనంతరం సీఈఓ గుమ్మి మేఘన మాట్లాడుతూ.. వైట్ పేపర్‌పై అందమైన కళాకృతులను తీర్చిదిద్దాలంటే అందమైన క్రెయాన్స్ లేదా రంగులు ఉండాలి. అలాగే చిన్నతనం నుంచే పిల్లలలో మానసిక ఎదుగుదలకు అనుమైన సదుపాయాలు, మౌలిక వసతులను కల్పిస్తే అద్బుతాలు సృష్టిస్తారని తెలిపారు. అలాగే చిన్నారుల రక్షణ కోసం అన్ని రకాల సాంకేతిక భద్రతా ఏర్పాట్లుంటాయి. స్విమ్మింగ్ పూల్ అలారం, సేఫ్టీ ఎలక్ట్రిక్ సాకెట్, రౌండ్ కార్నర్ వాల్స్, గేమింగ్ ల్యాండ్ స్కేప్, కిడ్స్ ప్లే సెంటర్, కిడ్స్ అవుట్డోర్ జిమ్, బెడ్రూమ్, బాత్రూమ్లలో సెన్సార్లు, వినైల్ ఫ్లోర్ వంటివి ఏర్పాట్లుంటాయని వివరించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ పిక్చర్స్ వంటి వసతులు కూడా ఉంటాయి. చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
షాకింగ్,హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
కరోనా టైమ్‌లో ఇతర మెట్రోనగరాల కంటే హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు వేగంగా పుంజుకున్నాయి. కానీ ఓ వైపు ఆర్ధిక సంక్షోభం..మరోవైపు భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలు దారులు ఇళ్లను కొనుగోలుకు సుముఖంగా లేరు. దానికి తోడు హైదరాబాద్‌లో చదరపు అడుగు సరాసరీ రూ.6 వేల నుంచి రూ.6,200కు చేరడంతో రియల్ ఎస్టేట్‌లో క్రాష్ తప్పదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రియల్ఎస్టేట్ రారాజుగా వెలిగిన హైదరాబాద్‌లో ఇప్పుడు డౌన్ ఫాల్ మొదలైంది. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాప్ టైగర్.కామ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7శాతం పెరిగినట్లు తెలిపింది. యావరేజ్‌గా రాజధానిలో చదరపు అడుగు సుమారు రూ.6వేలుగా ఉండగా.. ఈ ధరతో ఇండియాలో 8 ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. సేల్స్ పడిపోతున్నాయి హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా పడిపోతున్నట్లు ప్రాప్‌టైగర్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 2022, 92శాతం సప్లయ్ పెరగ్గా..అమ్మకాలు 15శాతం పడిపోయినట్లు తెలిపింది. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా ఆ నివేదిక తెలిపింది. క్యూ1లో ఇలా 2022 ఏడాదికి మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో మొత్తం 14,572 ఇళ్లను నిర్మిస్తే అందులో అమ్ముడు పోయింది కేవలం 6,556 యూనిట్లేనని తెలిపింది. దీంతో చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాల (ఇన్వెంటరీ) సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య రోజురోజుకీ మరింత పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. ఇక గడిచిన 42 నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 73,651యూనిట్లుగా ఉండగా.. 25 నెలల కాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగినట్టు ప్రాప్ టైగర్ పేర్కొంది. చదరపు అడుగు ఎంత దేశంలోని వివిధ నగరాల్లో చదరపు అడుగుకు విలువలను పరిశీలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐటీ , స్టార్టప్, రియల్టీ బూమ్ ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న బెంగళూరులో కంటే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు రోజురోజుకీ పెరిపోతుండడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో చదరపు అడుగు ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో చదరపు అడుగు రూ.9,800 నుంచి రూ.10,000గా ఉంది హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.6వేల నుంచి రూ.6,200వరకు ఉంది చెన్నైలో చదరపు అడుగు రూ.5,700 నుంచి రూ.5,900గా ఉంది బెంగళూరులో చదరపు అడుగు రూ.5,600 నుంచి రూ.5,800గా ఉంది పూణేలో చదరపు అడుగు రూ.5,400 నుంచి రూ.5,600గా ఉంది ఢిల్లీ ఎన్ సీఆర్‌లో చదరపు అడుగు రూ.4,500 నుంచి రూ.4,700గా ఉంది కోల్ కతాలో చదరపు అడుగు రూ.4,300 నుంచి రూ.4,500గా ఉంది అహ్మదాబాద్‌లో చదరపు అడుగు రూ.3,500 నుంచి రూ.3,700గా ఉంది చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే! -
తగ్గేదేలే! ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్న స్థలం జనవరి–మార్చిలో 25 శాతం పెరిగి 1.08 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2021 జనవరి–మార్చితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీసుల కోసం నూతనంగా తోడైన స్థలం 13 శాతం వృద్ధి చెంది 1.19 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. 2022 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 72 శాతం అధికమై 16 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. చెన్నైలో రెండింతలకుపైగా పెరిగి 10 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 5 శాతం దూసుకెళ్లి 35 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్ 37 శాతం అధికమై 23 లక్షలు, పుణే 15 శాతం వృద్ధి చెంది 9 లక్షలు, అహ్మదాబాద్ 2 లక్షల నుంచి 5 లక్షల చదరపు అడుగులకు ఎగసింది. ముంబై 24 శాతం తిరోగమనం చెంది 9 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో కొన్ని త్రైమాసికాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. -
గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇళ్ల విక్రయాలు..! హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..?
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో 78,627 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9 శాతం ఎగిశాయి. ఒక త్రైమాసికంలో ఇంత అత్యధికంగా విక్రయాలు నమోదు కావడం గత నాలుగేళ్లలో ఇదే ప్రథమం. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీంతో వరుసగా మూడో క్వార్టర్లో కూడా కరోనా పూర్వపు త్రైమాసిక సగటు అమ్మకాల పరిమాణాన్ని గణనీయంగా అధిగమించినట్లయిందని నివేదిక వివరించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ నిలకడగా రికవర్ అవుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. ఎకానమీ పటిష్టమవుతుండటం, అలాగే వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక సామర్థ్యాలపై భరోసా పెరుగుతుండటం తదితర అంశాలతో గత కొన్ని త్రైమాసికాలుగా దేశీయంగా కీలక మార్కెట్లలో నివాస గృహాల విక్రయాలు పుంజుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ‘తక్కువ వడ్డీ రేట్లు, అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత, వేతనాల వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డెవలపర్లపై ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోళ్ల లావాదేవీలు పుంజుకునే కొద్దీ క్రమంగా ధరలు పెరగవచ్చని, తద్వారా సిమెంటు.. స్టీల్ వంటి ముడి ఉత్పత్తుల ధరల భారాన్ని అధిగమించేందుకు వారికి కొంత వెసులుబాటు లభించవచ్చని బైజల్ వివరించారు. మరో రెండు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు అనరాక్, ప్రాప్‌టైగర్ కూడా ఇటీవలే రెసిడెన్షియల్ మార్కెట్లకు సంబంధించిన డేటా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనరాక్ నివేదిక ప్రకారం ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తొలి త్రైమాసికంలో 71 శాతం పెరిగి 99,550 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రాప్‌టైగర్ డేటా ప్రకారం ఎనిమిది ప్రధాన నగరాల్లో హౌసింగ్ విక్రయాలు 7 శాతం పెరిగి 70,623 యూనిట్లకు చేరాయి. నైట్ ఫ్రాంక్ నివేదికలో మరిన్ని అంశాలు.. ఢిల్లీ–ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో అమ్మకాలు రెట్టింపై 15,019 యూనిట్లుగా నమోదయ్యాయి. బెంగళూరులో 34 శాతం వృద్ధి చెంది 13,663 గృహాలు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లో విక్రయాలు 35 శాతం పెరిగి 4,105 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం అమ్మకాలు ఒక్క శాతమే పెరిగి 6,993 యూనిట్లకు పరిమితమయ్యాయి. కోల్‌కతాలో కూడా స్వల్పంగా ఒక్క శాతం వృద్ధితో 3,619 గృహాలు అమ్ముడయ్యాయి. ముంబైలో 9 శాతం క్షీణించి 21,548 ఇళ్లు అమ్ముడయ్యాయి. అటు పుణెలోనూ రికార్డు స్థాయిలో 25 శాతం క్షీణించి 10,305 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. ఇక చెన్నైలో 17 శాతం తగ్గి 3,376 యూనిట్లు అమ్ముడయ్యాయి. వివిధ మార్కెట్లలో హౌసింగ్ ధరలు 1–7 శాతం శ్రేణిలో పెరిగాయి. చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం -
దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్‌లో మరోలా.. విచిత్రమైన పరిస్థితి..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది మెట్రోల్లో ఇళ్ల విక్రయాలు 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) సగటున ఏడు శాతం పెరగ్గా.. హైదరాబాద్ మార్కెట్లో 15 శాతం క్షీణించాయి. ఈ మేరకు ప్రాప్ టైగర్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ సహా ఎనిమిది పట్టణాల్లో 2022 జనవరి–మార్చి కాలంలో 70,623 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2021 మొదటి మూడు నెలల్లో విక్రయాలు 66,176 యూనిట్లతో పోలిస్తే సుమారు 7 శాతం అధికం. ► హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 15 శాతం తగ్గి 6,556 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 7,721 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇళ్ల ధరలు హైదరాబాద్‌లో 7 శాతం పెరిగాయి. ► బెంగళూరులో విక్రయాలు 3 శాతం అధికంగా 7,671 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 7,431 యూనిట్లు అమ్ముడు పోవడం గమనార్హం. ► ముంబైలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం పెరిగి 23,361 యూనిట్లుగా ఉన్నాయి. ► చెన్నై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం తగ్గి 3,299 యూనిట్లకు పరిమితమయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్లకు డిమాండ్ 19 శాతం తగ్గింది. 6,556 యూనిట్లు విక్రయమయ్యాయి. ►కోల్‌కతా మార్కెట్లోనూ అమ్మకాలు 15 శాతం క్షీణించి 2,860 యూనిట్లుగా ఉన్నాయి. ►పుణెలో 19 శాతం అధికంగా 16,314 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► అహ్మదాబాద్‌లోనూ ఇళ్ల అమ్మకాలు 18 శాతం పెరిగి 5,549 యూనిట్లుగా ఉన్నాయి. ► ఇళ్ల యూనిట్ల సరఫరా 50 శాతం పెరిగి జనవరి–మార్చి కాలంలో 79,532 యూనిట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఇళ్ల సరఫరా 53,037 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. ► బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు గణనీయంగా పెరిగిపోవడం ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది. అత్యధికంగా చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు సగటున 9 శాతం పెరిగాయి. ►పుణె, అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 8 శాతం పెరగ్గా.. బెంగళూరులో 6 శాతం, కోల్‌కతాలో 5 శాతం, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 4 శాతం వరకు ధరల్లో పెరుగుదల కనిపించింది. హౌసింగ్.. ఆశాకిరణం ‘‘దేశ ఆర్థిక రంగంలో హౌసింగ్ రంగం ఆశాకిరణంగా మరోసారి అవతరించింది. కరోనా కారణంగా మందగించిన ఆర్థిక రంగానికి చేదోడుగా నిలిచింది. రానున్న నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత సాధారణ స్థితికి వస్తే గొప్ప సానుకూల మార్పులను చూడొచ్చు. ఇళ్ల ధరలు కూడా జనవరి–మార్చి త్రైమాసికంలో పుంజుకున్నాయి. ఈ నివేదికలో భాగంగా పరిగణనలోకి తీసుకున్న అన్ని పట్టణాల్లోనూ ధరలు సగటున పెరిగాయి. ఇళ్ల నిర్మాణంలోకి వాడే ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు ఎక్కువ నేపథ్యంగా ఉంది’’ అని ప్రాప్ టైగర్ పేర్కొంది. చదవండి: రెండు కోట్లకుపైగా ఇస్తాం..వారికి బంపరాఫర్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్..! -
కొత్త ఇంటిని కొనుగోలు చేసే వారికి శుభవార్త..! ఇదే సరైన సమయం..!
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2022 సామాన్యులకు నిరాశే మిగిల్చింది. ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు లేక పోవడంతో బడ్జెట్ చాలా మందిని నిరాశ పర్చింది. కాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా నిర్ణయం కొత్తగా ఇంటిని కొనుగోలుచేసే వారికి శుభవార్తను అందించింది. రెపో రేట్లు యథాతథం..! ఆర్బీఐ నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని నివాస గృహాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల సుదీర్ఘ ద్వైమాసిక ఎంపీసీ సమావేశం తర్వాత, కమిటీ రెపో , రివర్స్ రెపో రేట్లను వరుసగా 4 శాతం, 3.35 శాతం గా ఉంచింది. రెపో రేట్ యథాతథంగా ఉండడంతో బ్యాంకులు రుణదాతలకు ఇచ్చే వడ్డీ రేట్లు అలాగే ఉంచే అవకాశం ఉంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు అలాగే..! రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఆర్బీఐ నిర్ణయం గృహనిర్మాణ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. దీంతో కొంత ఇంటిని కొనుగోలుదారులు చేసే వారికి తక్కువ వడ్డీకే రుణాలను పొందుతారు. ప్రస్తుతం చాలా ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అందించే వడ్డీ రేట్లు 6.4-6.9 శాతం మధ్య ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌కు జోష్..! రియల్ ఎస్టేట్ రంగం రికవరీ వైపు రావడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏబీఏ కార్పోరేషన్ డైరెక్టర్, క్రెడాయ్ వెస్ట్రన్ యూపీ ప్రెసిడెంట్ అమిత్ మోడీ అభిప్రాయపడ్డారు. ఆర్బిఐ తీసుకున్న అనుకూల వైఖరి ఆర్థిక వాతావరణాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉన్నందున ఇప్పటికీ కొత్త గృహాలను కొనుగోలు చేయగల గృహ కొనుగోలుదారులకు ఇది సానుకూలంగా ఉంటుందని భారతీయ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ సీఈఓ-రెసిడెన్షియల్, అశ్విందర్ ఆర్. సింగ్ తెలిపారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అభిప్రాయపడ్డారు. చదవండి: లగ్జరీ కార్లను పక్కన పెట్టి కామన్ మ్యాన్ కారుకే ఓటు -
పెట్టుబడికి రియల్టీనే బెటర్
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాలలో ప్రాపర్టీనే అత్యంత సురక్షితమైన, అధిక రాబడి మార్గంగా ఎదిగింది. గతేడాది ఇన్వెస్ట్మెంట్స్ ఎంపికలలో తొలిస్థానంలో స్థిరాస్తి రంగం నిలవగా.. సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో స్టాక్స్, గోల్డ్‌లు నిలిచాయి. అత్యంత క్షీణ స్థితిలో బిట్‌కాయిన్ నిలిచింది. 76 శాతం మంది భారతీయులు రియల్టీనే ఉత్తమ పెట్టుబడి సాధనమనే ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారని నోబ్రోకర్ రియల్ ఎస్టేట్ రిపోర్ట్ తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాలలో 21 వేల మంది కస్టమర్లతో పాటూ, నోబ్రోకర్.కామ్‌లోని 16 మిలియన్ మంది వినియోగదారుల డేటాను విశ్లేషించి నివేదికను రూపొందించింది. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతుండటం, డెవలపర్ల ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా సొంతంగా ఉండేందుకు ఇళ్లు కొనాలని భావించే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 43 శాతం మంది వినియోగదారులు ఈ ఏడాది పెట్టుబడి రీత్యా రెండో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపింది. 84 శాతం మంది కస్టమర్లు సొంతింటి కొనుగోలు కోసం ఇదే సరైన సమయమని భావిస్తున్నారని పేర్కొంది. 80 శాతం మంది పని ప్రదేశాలకు దగ్గర ఇళ్లు ఉండాలని భావిస్తున్నారు. 78 శాతం మంది ప్రధాన నగరంలో కేంద్రీకృతమై ఉండాలనుకుంటున్నారు. నిర్మాణాలు ఆలస్యం అవుతుండటం, నిధుల మళ్లింపు నేపథ్యంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు 78 శాతం కస్టమర్లు భావిస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణ గృహాలకే.. పాక్షిక లాక్డౌన్, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణాలు తగ్గాయి. దీంతో ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. వెకేషన్, లైఫ్ స్టయిల్ కోసం వ్యయం చేస్తుండేవారు. ఈ సొమ్ముతో కొంత ఎక్కువ విస్తీర్ణం ఉండే గృహాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రాపర్టీలను కొనాలని 15 శాతం మంది శోధిస్తున్నారని రిపోర్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 4 శాతం, 2019తో పోలిస్తే 8 శాతం అధికం. అంతక్రితం సంవత్సరం 29 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే కొనుగోళ్లు.. గతేడాది 33 శాతం వృద్ధి రేటు నమోదయింది. 37 శాతం మంది రెండు పడక గదులకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన ఆన్లైన్ వినియోగం.. ఇంటి కొనుగోళ్లలో 73 శాతం, అద్దె గృహాలకు 55 శాతం మంది వాస్తును ఫాలో అవుతున్నారు. కరోనా తర్వాతి నుంచి ప్రాపర్టీ విజిట్స్, ఎంపిక, లావాదేవీలలో ఆన్లైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రాపర్టీ కొనుగోళ్ల కంటే అద్దెల కోసం వీడియో వాక్‌త్రూల వినియోగం పెరిగింది. గది లోపలి పరిమాణం, లే–అవుట్ విస్తీర్ణాలు, ఓవర్ వ్యూల వంటివి అద్దెదారులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని నోబ్రోకర్.కామ్ కో–ఫౌండర్ సౌరభ్ గార్గ్ తెలిపారు. గతేడాది 77 శాతం మంది వీడియో వాక్‌త్రూ ప్రాపర్టీలను వీక్షించారని, దీంతో ఈ విభాగంలో గణనీయమైన వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో 53 శాతం మంది భూ యజమానులు అద్దెలను తగ్గింపు లేదా మాఫీ చేశారు. ఢిల్లీ, పుణే నగరాలలో గరిష్టంగా 58 శాతం అద్దెలను తగ్గించారని తెలిపారు. దీపావళి తర్వాతి నుంచి 46 శాతం మంది అద్దెలను పెంచారని తెలిపారు. నగరంలో రూ.264 కోట్ల బ్రోకరేజ్ ఆదా.. సాధారణంగా ఎవరైనా మనకు ప్రాపర్టీ లావాదేవీలో మధ్యవర్తిత్వం వహిస్తే బ్రోకరేజ్ చార్జీ చెల్లిస్తుంటాం. నోబ్రోకరేజ్ కంపెనీ ఎలాంటి చార్జీ లేకుండా ఉచితంగా సేవలందిస్తుంది. దీంతో గతేడాది దేశవ్యాప్తంగా రూ.2,874 కోట్ల బ్రోకరేజ్ వ్యయం ఆదా అయిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో రూ.787 కోట్లు, ముంబైలో రూ.653 కోట్లు, చెన్నైలో రూ.497 కోట్లు, పుణేలో రూ.424 కోట్లు, హైదరాబాద్‌లో రూ.264 కోట్లు, ఢిల్లీ–ఎన్సీఆర్లో రూ.250 కోట్ల బ్రోకరేజ్‌ను ఆదా చేసింది. -
హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రారంభ దశలో తడబడిన నగర రియల్టీ.. అనంతరం శరవేగంగా కోలుకుంది. వ్యాక్సినేషన్ పెరగడం, ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాల వృద్ధి, అందుబాటు ధరలతో గ్రేటర్లో ప్రతి నెలా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయి. గతేడాది డిసెంబర్లో 3,931 యూనిట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2,340 కోట్లు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే రిజిస్ట్రేషన్ సంఖ్యలో 0.5 శాతం తగ్గాయి కానీ ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే మాత్రం 16 శాతం వృద్ధి రేటు నమోదయింది. 96 శాతం అధికం.. ► గతేడాది నగరంలో రూ.25,330 కోట్ల విలువ చేసే 44,278 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 96 శాతం ఎక్కువ. 2020లో 22,570 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో ఆ తరగతి అఫర్డబుల్ గృహా కొనుగోళ్ల మీద ప్రత్యక్ష ప్రభావం పడింది. ► రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ హౌసింగ్ రిజిస్ట్రేషన్లు 2020లో 30 శాతం జరగగా.. గతేడాది డిసెంబర్ నాటికి 24 శాతానికి క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. 2021 డిసెంబర్‌లోని రిజిస్ట్రేషన్లలో 60 శాతం గృహాలు రూ.25– 50 లక్షల మధ్య ధర ఉన్నవే జరిగాయి. అన్ని కేటగిరీల్లో లగ్జరీ గృహాల రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం. రూ.కోటి పైన ధర ఉన్న గృహాలు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) వెయ్యి నుంచి 2 వేల చ.అ. విస్తీర్ణం లోపు ఇళ్లకే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండాలనే అభిప్రాయం గృహ కొనుగోలుదారుల్లో పెరిగిపోయింది. దీంతో గతంలో కంటే కాస్త ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. గతేడాది డిసెంబర్లో వెయ్యి లోపు చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు 19 శాతం జరగగా.. వెయ్యి నుంచి రూ.2 వేల చ.అ. మధ్య ఉన్నవి 66 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలు 15 శాతం ఉన్నాయి. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు) -
ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! అక్కడేమో..!
కోవిడ్-19 రాకతో రియాల్టీ రంగం పూర్తిగా దెబ్బతింది. వరుస లాక్‌డౌన్స్‌తో ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. కరోనా ఉదృత్తి కాస్త తగ్గడంతో మళ్లీ రియల్ బూమ్ పట్టాలెక్కింది. కరోనా మహమ్మారి భూముల ధరలు, గృహ నిర్మాణ రంగంపై కొంతమేర ప్రభావం చూపాయి. ఇక దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో ఇండ్ల ధరలు భారీగానే పెరిగాయి. కాగా అత్యంత తక్కువ ధరలకే ఇళ్లు వచ్చే నగరాల జాబితాను ప్రముఖ రియాల్టీ సంస్థ నైట్ ఫ్రాంక్ ‘ అఫర్డబిలిటీ ఇండెక్స్-2021’ జాబితాను విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో అగువకే ఇండ్లు..! నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలిచింది. ఈ నగరంలో ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. అయితే ముంబై మహానగరంలో సొంత ఇళ్లును సొంతం చేసుకోవాలంటే భారీగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. నైట్ ఫ్రాంక్ ఆయా నగరాల్లోని గృహ ఈఎంఐ, మొత్తం ఆదాయ నిష్పత్తి దృష్టిలో ఉంచుకొని ఈ జాబితాను విడుదల చేసింది. నివేదికలోని కొన్నిముఖ్యాంశాలు..! 2021లో అహ్మదాబాద్ 20 శాతం, పుణె 24 శాతంతో దేశంలోనే అత్యంత సరసమైన గృహా రంగ మార్కెట్‌గా అవతరించాయి. ముంబైలో మినహా 53 శాతం స్థోమత నిష్పత్తితో భారత్‌లోనే అత్యధిక ధరలు గల నగరంగా నిలిచింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో స్థోమత నిష్పత్తి గరిష్టంగా 2020లో 38 శాతం నుంచి 2021లో 28 శాతానికి మెరుగుపడిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ స్థోమత నిష్పత్తి 29 శాతం, బెంగళూరు 26 శాతం, చెన్నై, కోల్‌కతా 25 శాతంగా నమోదైనాయి. అంటే బెంగళూరు, చెన్నె, కోల్కత్తా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త గృహాల కోసం ఎక్కువ డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు... నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం.... ఈ ఏడాదిలో గృహాల ధరలలో క్షీణత , చాలా కాలంగా వస్తోన్న తక్కువ వడ్డీరేట్లు ఆయా నగరాల్లో కొత్త ఇంటిని సొంతం చేసుకునే వారి స్థోమత గణనీయంగా పెరగడానికి సహాయపడిందని పేర్కొంది. అఫర్డబిలిటీ సూచిక ..! స్థోమత సూచిక అనేది ఒక నిర్దిష్ట నగరంలోని హౌసింగ్ యూనిట్ ఈఎంఐకు నిధులు సమకూర్చడానికి ఒక కుటుంబానికి అవసరమయ్యే ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. కాబట్టి, ఒక నగరం స్థోమత సూచిక స్థాయి 40 శాతం ఉంటే ఆ నగరంలోని కుటుంబాలు ఇంటి కోసం నిధులు సమకూర్చడానికి వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 50 శాతం కంటే ఎక్కువ ఉంటే ఇంటి ధరలు భరించలేనిదిగా పరిగణించబడుతుంది. చదవండి: ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా.. -
ఈ ధర ఇళ్ల కొనుగోలుపైనే జనం అమితాసక్తి
న్యూఢిల్లీ: దేశంలో అధిక శాతం ప్రజలు (35 శాతం) రూ.90 లక్షల్లోపు ఇంటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్లలోపు ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వేలో 34 శాతం మంది చెప్పారు. 2020 ద్వితీయ ఆరు నెలల్లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే 10 శాతం పెరుగుదల కనిపించింది. అంతకుముందు సర్వేలో 27 శాతం మందే అందుబాటు ధరల ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సీఐఐ, ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సంయుక్తంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఆన్లైన్ సర్వే నిర్వహించాయి. 4,965 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారు చెప్పిన అభిప్రాయాలను పరిశీలించినట్టయితే.. ►80 శాతం మంది నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారు. లేదంటే నిర్మాణం పూర్తయ్యే దశలోని వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం 20 శాతం మందే కొత్తగా ఆరంభించిన ప్రాజెక్టుల్లో కొనుగోలుకు సంసిద్ధంగా ఉన్నారు. ► 34 శాతం మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసుకుందామన్న ఆలోచనతో ఉన్నవారు రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల బడ్జెట్లోని వాటి కోసం చూస్తున్నారు. 35 శాతం మంది రూ.45–90 లక్షల పరిధిలోని వాటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ►అందుబాటు ధరల్లోని ఇళ్లకోసం (రూ.45లక్షల్లోపు) చూస్తున్నవారు 27 శాతం మంది ఉన్నారు. ► ధర తర్వాత ఎక్కువగా చూసే అంశం డెవలపర్ విశ్వసనీయత. 77 శాతం మంది విశ్వసనీయమైన డెవలపర్ల నుంచే ఇళ్లను కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ►ఆన్లైన్లో ఇళ్ల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. కరోనాకు ముందు మొత్తం ఇళ్ల కొనుగోలు ప్రక్రియలో 39 శాతం ఆన్లైన్లో కొనసాగగా.. ఇప్పుడు 60 శాతానికి చేరుకుంది. ►ఇళ్ల కోసం అన్వేషణ, డాక్యుమెంటేషన్, న్యాయ సలహాలు, చెల్లింపులు దేశ హౌసింగ్ రంగానికి సానుకూలతలుగా అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి పేర్కొన్నారు. ►వ్యక్తిగత అవసరాల కోసం రెండో ఇంటిని కొనుగోలు చేస్తామని 41 శాతం మంది సర్వేలో చెప్పారు. ►ఎత్తయిన కొండ, పర్వత ప్రాంతాలు 53 శాతం మంది ఎంపికగా ఉన్నాయి. ►బెంగళూరు, పుణె, చెన్నై ఎన్ఆర్ఐల ఎంపికల్లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు ‘‘గృహ రుణాలపై వడ్డీరేట్లు కనిష్టాల్లో ఉండడం ఇళ్ల విక్రయాలు పెరిగేందుకు ప్రధానంగా మద్దతునిస్తున్న అంశం. తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంలో తక్కువ రుణ రేట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని 82 శాతం మంది చెప్పారు’’ అని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఇళ్ల ధరలు పెరుగుతాయ్ పెరుగుతున్న డిమాండ్ వల్ల నివాస భవనాల మార్కెట్ రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధిని చూస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో నిర్మాణ సామగ్రి కోసం వ్యయాలు అధికమవుతున్నందున ఇళ్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నాయి. సీఐఐ అనరాక్ వెబినార్ కార్యక్రమంలో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఈ అభిప్రాయాలను వెల్లడించారు. కరోనా మొదటి, రెండో విడతల తర్వాత ఇళ్ల విక్రయాలు పుంజుకోవడం తమను ఆశ్చర్యపరిచినట్టు చెప్పారు. పెద్ద బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకున్నాయని పేర్కొన్నారు. ఈ వెబినార్‌కు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి మధ్యవర్తిగా వ్యవహరించారు. ‘‘ధరలు పెరగడం తప్పనిసరి. నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయి. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతోపాటు సరఫరా సమస్యలు కూడా కారణమే. డెవలపర్లు చిన్న, పెద్దవారైనా మెరుగైన నిర్వహణ చరిత్ర ఉంటే ఇక ముందూ మెరుగ్గానే కొనసాగొచ్చు. కానీ, పరిశ్రమలో స్థిరీకరణ, వృద్ధిని స్పష్టంగా చూస్తున్నా’’ అని ఒబెరాయ్ రియాలిటీ చైర్మన్, ఎండీ వికాస్ ఓబెరాయ్ తెలిపారు. ఇళ్ల ధరలు వచ్చే ఏడాది కాలంలో 15 శాతం వరకు పెరగొచ్చని శ్రీరామ్ప్రాపర్టీస్ ఎండీ ఎం.మురళి సైతం ఇదే కార్యక్రమంలో భాగంగా చెప్పారు. చదవండి : అడోబ్ అప్డేట్స్ అదుర్స్ -
గృహల కొనుగోళ్లపై రాయితీలు ఎప్పుడు వస్తాయో తెలుసా ..
సాక్షి, హైదరాబాద్: వర్షంలో బయటికి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో. కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షుణ్ణంగా తెలుస్తుంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే చోటు లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది. వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలమే. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసే కొనుగోలుదారులు మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశమయ్యాక కామన్‌గా ఏర్పాటుచేసిన వసతుల్లో లీకేజ్‌లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా్షకాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్‌రూమ్, సీలింగ్, ప్లంబింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్‌ను కోరే వీలుంటుంది. రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, ప్లంబింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండుగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
హైదరాబాద్ రియల్టీ రయ్..రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా కాలంలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్-హెచ్1) నగరంలో 11,974 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 4,782 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 150 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అదేవిధంగా ఈ ఏడాది హెచ్1లో కొత్తగా 16,712 యూ నిట్లు లాంచింగ్ కాగా.. గతేడాది ఇదే సమయంలో 4,422 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 278 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘ఇండియా రియల్ ఎస్టేట్ జనవరి–జూన్ 2021’ రిపోర్ట్ తెలిపింది. గతేడాది హెచ్1లో చదరపు అడుగు ధర సగటున రూ.4,673లుగా ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి ఒక శాతం పెరిగి రూ.4,720లకు చేరింది. ఇక అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది 4,037 యూనిట్లుండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 195 శాతం వృద్ధి చెంది 11,918 గృహాలకు చేరాయి. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థూర్ మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఈ ఏడాది హెచ్1లోను హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల హవానే కొనసాగిందని చెప్పారు. గృహాల విక్రయాలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరల సూచి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించడం ఈ వృద్ధికి కారణమని తెలిపారు. ప్రీమియం గృహాలదే హవా.. ఈ ఏడాది హెచ్1లో అన్ని తరగతుల వారి గృహాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూన్‌లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే గృహాలు రికార్డ్ స్థాయిలో 240 శాతం, రూ.1–2 కోట్ల గృహాలు 158 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ప్రీమియం గృహాలకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది హెచ్1లో డెవలపర్లు ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గుచూపారు. గతేడాది హెచ్1లోని గృహాల లాంచింగ్స్‌లో రూ.1–2 కోట్ల ధర ఉండే యూనిట్లు 1,544 (18 శాతం) ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 4,444లకు (27 శాతం) పెరిగాయి. పశ్చిమ జోన్లోనే ఎక్కువ.. గృహాల విక్రయాలు, లాంచింగ్స్ రెండింట్లోనూ కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగాయి. అమ్మకాలలో 63 శాతం, ప్రారంభాలలో 64 శాతం వాటా వెస్ట్ జోన్ నుంచే ఉన్నాయి. గతేడాది హెచ్1 విక్రయాలలో నార్త్ జోన్ వాటా 16 శాతం ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. అలాగే లాంచింగ్స్‌లో 17 శాతం వాటా నుంచి 20 శాతానికి పెరిగింది. ఈ ఏడాది హెచ్1లో 11,974 గృహాలు విక్రయం కాగా.. ఇందులో బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజగుట్ట వంటి సెంట్రల్ జోన్లో 1,007 గృహాలు, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్ వంటి వెస్ట్ జోన్లో 7,505, ఉప్పల్, మల్కజ్గిరి, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్లో 862, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్ వంటి నార్త్ జోన్లో 2,145, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి సౌత్ జోన్లో 455 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 16,712 యూనిట్లు లాంచింగ్ కాగా.. సెంట్రల్ జోన్లో 933, వెస్ట్‌లో 10,767, ఈస్ట్‌లో 1,115, నార్త్‌లో 3,395, సౌత్జోన్లో 503 యూనిట్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా.. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలలో గృహాల విక్రయాలలో 67 శాతం, లాంచింగ్స్‌లో 71 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది హెచ్1లో 99,416 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో 59,538 గృహాలు సేల్ అయ్యాయి. 2021 హెచ్1లో కొత్తగా 1,03,238 గృహాలు ప్రారంభం కాగా.. గతేడాది ఇదే సమయంలో 60,489 యూనిట్లుగా ఉన్నాయి. -
రియల్టీలో పెట్టుబడుల జోరు
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ2)లో 9 రెట్ల వృద్ధితో 1.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గిడ్డంగుల విభాగంలోకి నిధుల ప్రవాహమే ఈ వృద్ధికి కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తెలిపింది. అంతకుక్రితం ఏడాదిలో ఈ పెట్టుబడులు 155 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అప్డేట్స్ క్యూ2–2021 రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది క్యూ2లో వేర్‌హౌస్ విభాగంలోకి 41 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఈ ఏడాది క్యూ2 నాటికి 743 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇతర విభాగాలలో చూస్తే.. రిటైల్ రంగం 278 మిలియన్ డాలర్లు, ఆఫీస్ స్పేస్ 231 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించాయి. 2020 క్యూ2లో ఆఫీస్ స్పేస్‌లోకి 66 మిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. ఇక నివాస విభాగంలోకి గతేడాది క్యూ2లో 48 మిలియన్ డాలర్లు రాగా.. ఇప్పుడవి 106 మిలియన్ డాలర్లకు పెరిగాయి. పారదర్శకతతో వృద్ధి... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనలలో సడలింపులతో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ (రెరా), బినామీ లావాదేవీల చట్టాలతో గత దశాబ్ధ కాలంగా రియల్టీ పెట్టుబడులు, లావాదేవీలలో పారదర్శకత, వేగం పెరిగాయని జేఎల్ఎల్ కంట్రీ హెడ్ అండ్ సీఈఓ రాధా ధీర్ తెలిపారు. -
లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ గృహాల అద్దెల వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బెంగళూరు, ముంబై, పుణే, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి దేశంలోని ఏ ప్రధాన మెట్రో నగరాలతో పోల్చినా సరే.. 2014 నుంచి 2020 మధ్య నగరంలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంట్లు 26 శాతం పెరిగాయి. ఇదే సమయంలో లగ్జరీ గృహాల ధరలు 12 శాతం వృద్ధి చెందాయని అనరాక్ ప్రాపర్టీ కన్సలెంట్ తెలిపింది. 2014లో హైటెక్ సిటీలో రూ.42 వేలుగా ఉన్న అద్దెలు.. 2020 నాటికి 26 శాతం వృద్ధితో రూ.53 వేలకు పెరిగింది. జూబ్లిహిల్స్‌లో రూ.47 వేల నుంచి 15 శాతం పెరిగి రూ.54 వేలకు చేరింది. ఇక క్యాపిటల్ ప్రైస్‌లు చూస్తే.. 2014లో హైటెక్‌సిటీలో చదరపు అడుగు (చ.అ) ధర రూ.5,088గా ఉండగా.. 2020 నాటికి 12 శాతం పెరిగి రూ.5,675కి చేరింది. జూబ్లిహిల్స్‌లో రూ.6,300 నుంచి 10 శాతం వృద్ధితో రూ.6,950కి పెరిగింది. ఏడు నగరాల్లో ఏటా 3-6 శాతం వృద్ధి.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే లగ్జరీ హోమ్స్ సగటు నెలవారీ అద్దె గత ఆరేళ్లలో 17–26 శాతం, మూలధన విలువ గరిష్టంగా 15 శాతం మేర పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరీ తెలిపారు. టాప్ లగ్జరీ మార్కెట్లలో ప్రతి ఏటా అద్దెలు 3–6 శాతం పెరుగుదలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు. క్యాపిటల్ ప్రైస్లలో మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయన్నారు. కొన్ని సంవత్సరాలలో వార్షిక పెరుగుదల 7 శాతంగా ఉంటే.. 2017లో మాత్రం 5 శాతం ధరలు క్షీణించాయని తెలిపారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో రెరా, జీఎస్టీ వంటి వివిధ నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో సగటు మూలధన ధరలలో 1–3 శాతం పెరుగుదల మాత్రమే నమోదయింది. నగరాల వారీగా చూస్తే.. 2014తో పోలిస్తే 2020లో గుర్గావ్లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్లో లగ్జరీ గృహాల అద్దెలు 18 శాతం, ఇదే కాలంలో ఈ ప్రాంతంలో గృహాల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. బెంగళూరులోని జేపీ నగర్లో అద్దెలు 24 శాతం, ధరలు 8 శాతం, చెన్నైలోని అన్నానగర్‌లో రెంట్స్ 17 శాతం, ప్రాపర్టీ ప్రైస్‌లు 10 శాతం, కోల్‌కత్తాలోని అలీపోర్లో రెంట్స్ 20 శాతం, ధరలు 13 శాతం, ఎంఎంఆర్‌లోని టార్డియోలో కిరాయిలు 23 శాతం, ధరలు 8 శాతం, పుణేలోని ప్రభాత్రోడ్లో అద్దెలు 23 శాతం, లగ్జరీ ప్రాపర్టీ ధరలు 5 శాతం పెరిగాయి. సంస్కరణలు, ఆర్థిక సహాయంతో రియల్టీలో పునరుత్తేజం ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న దేశీయ రియల్టీ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు విధానపరమైన సంస్కరణలు, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అవసరమని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో జరిగిన ‘రియాలిటీ ఆఫ్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్స్’ అనే అంశం మీద జరిగిన వెబినార్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 మహమ్మారి నుంచి రియల్టీ రంగాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్క డెవలపర్, వాటాదారులు భాగస్వామ్యమయ్యారని అయితే ఈ మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని.. సవాళ్లను అధిగమించడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఈ రంగం పూర్తిగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరెడ్కో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నిరంజన్ హిర్నందాని మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత రియల్టీ రంగంలో పెరిగిన లావాదేవీలు, సానుకూల వినియోగదారుల డిమాండ్ నమోదవుతుందని తెలిపారు. దేశీయ ఆర్ధిక వ్యవస్థలో సానుకూల వాతావరణం కనిపిస్తుందన్నారు. ఒకవైపు జీడీపీ ‘వీ’ ఆకారపు రికవరీ అవుతుంటే.. మరోవైపు వాణిజ్య రియల్టీ రంగం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం రిమోట్ లొకేషన్ వంటి విధానాలతో ఆఫీస్ స్పేస్ రియల్టీ రికవరీ ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. ఆగిపోయిన, ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కేటాయించిన స్పెషల్ విండో ఫర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అఫర్డబుల్ అండ్ మిడ్–ఇన్‌కం హౌసింగ్ ప్రాజెక్ట్స్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) నిధుల పరిమాణాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ విధానంలో ఆర్థిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలతో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. చరిత్రాత్మక స్థాయిలో గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలను తగ్గించడం వంటి వాటితో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణుసుద్ కర్నాడ్ అన్నారు. ప్రాపర్టీ ధరలు పెరగకుండా డెవలపర్లు తమ వంతు కృషి చేయాలని.. దీంతో గృహ విభాగానికి మరిన్ని అవకాశాలుంటాయని సూచించారు. రియల్టీ రంగానికి ప్రభుత్వ అవసరం అయిన ప్రతీ చోట నరెడ్కో తమ వంతు పాత్రని పోషిస్తుందని.. ఇదే సమయంలో డిజిటల్ వైపు కూడా రియల్టీ రంగానికి ప్రోత్సహిస్తే వృద్ధి మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలని ఎస్బీఐ రిటైల్ బిజినెస్ డిప్యూటీ ఎండీ సలోని నారాయణ్ అన్నారు. -
వర్క్ ఫ్రం హోమ్.. రియాలిటీ ఇదే
వాషింగ్టన్: కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో నేడు పని సంస్కృతిలో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కేవలం సాఫ్ట్వేర్ కంపెనీల్లో మాత్రమే ఉండేది. కానీ నేడు దాదాపు అన్ని రంగాల్లో ఇంటి నుంచే పని తప్పనిసరి అయ్యింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మగవారికి అదనపు లాభాలుంటాయి. కానీ మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. రెడీ అవ్వడం తప్పుతుంది అంతే. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో వర్క్ ఫ్రం హోం ఎక్స్‌పెక్టెషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్ సైంటిస్ట్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. గ్రెట్చెన్ గోల్డ్‌మాన్ అనే మహిళ శాస్త్రవేత్తగానే కాక పీహెచ్డీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఫెడరల్ క్లైమెట్ చేంజ్ లీడర్షిప్ గురించి మాట్లాడటానికి సీఎన్ఎన్ టీవీలో కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆమె మస్టర్డ్ కలర్ కోటు ధరించి.. డ్రాయింగ్ రూమ్‌లో నిల్చుని మాట్లాడారు. ఆమె వెనక కుటుంబ సభ్యుల ఫోటోలు, చక్కగా అమర్చిన సోఫాలు కనిపించాయి. అయితే ఇదంతా టీవీలో కనిపించిన దృశ్యాలు. (చదవండి: ‘ఇంటి పనే’ ఇద్దాం!) కానీ వాస్తవంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు గోల్డ్‌మాన్. దీంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలన్ని నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి. టేబుల్ మీద చైర్ పెట్టి.. దాని మీద ల్యాప్‌టాప్ పెట్టింది. అన్నింటికి మించి హైలెట్ ఏంటంటే షార్ట్ మీద బ్లెజర్ ధరించింది గోల్డ్‌మాన్. అయితే ఇవన్ని కనిపించకుండా ఆమె ఎలా మ్యానేజ్ చేసింది. కెమరాను ఏ యాంగిల్లో పెట్టింది అనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. నేను నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను అనే క్యాప్షన్‌తో టీవీలో కనిపించిన ఫోటోని.. రియల్ ఇమేజ్‌ని ట్వీట్ చేసింది గోల్డ్‌మాన్. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యారు. (చదవండి: ‘వర్క్ ఫ్రమ్ హోమ్’లో ఆదాయమెంతో తెలుసా..!) Just so I'm being honest. #SciMomJourneys pic.twitter.com/4yZMKtVxwP — Gretchen Goldman, PhD (@GretchenTG) September 15, 2020 -
దశాబ్ద కనిష్టానికి పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో దశాబ్ద కనిష్టానికి పడిపోయాయి. ఈ కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 59,538 మాత్రమేనని ప్రాపర్టీ సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. గతేడాది ఇదే కాలంలోని విక్రయాలతో (1,29,285 యూనిట్లు) పోల్చి చూస్తే 54 శాతం తక్కువ. మార్చి చివర్లో లాక్డౌన్ విధించడంతో డిమాండ్ పతనమైనట్టు ఈ సంస్థ తెలిపింది. ‘‘ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులు భారీ కొనుగోళ్లు అయిన ఇళ్ల వంటి వాటికి దూరంగా ఉన్నారు. కార్మికులు, ముడి పదార్థాల కొరత, రుణ లభ్యత సమస్యలు డెవలపర్ల నుంచి నూతన ప్రాజెక్టుల ప్రారంభంపై ప్రభావం చూపించింది’’ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త రజనిసిన్హా తెలిపారు. ‘ఇండియా రియల్ ఎస్టేట్: హెచ్1 2020’ పేరుతో నివేదికను నైట్‌ఫ్రాంక్ సంస్థ గురువారం విడుదల చేసింది. వివరాలను గమనిస్తే.. ♦ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబై, ఢిల్లీ ఎన్సీఎఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు 27 శాతం తగ్గి 49,905 యూనిట్లుగా ఉన్నాయి. ♦ ఏప్రిల్–జూన్ కాలంలో అమ్మకాలు 84 శాతం పడిపోయాయి. కేవలం 9,632 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ కాలంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్లో అమ్మకాలు సున్నాగానే ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ♦ హైదరాబాద్‌లో జనవరి–జూన్ మధ్య ఇళ్ల విక్రయాలు 42 శాతం తగ్గి 4,782 యూనిట్లుగానే ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయాలు 8,334 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఈ కాలంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 73% తగ్గాయి. అహ్మదాబాద్‌లో 69 శాతం, చెన్నైలో 67 శాతం, బెంగళూరులో 57%, ముంబైలో 45%, పుణెలో 42 శాతం చొప్పున పడిపోయాయి. ♦ జనవరి–జూన్ కాలంలో నూతన ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభం కూడా 46 శాతం వరకు పడిపోయింది. ♦ ఇళ్ల ధరలను పరిశీలిస్తే మొదటి ఆరు నెలల్లో ఢిల్లీ ఎన్సీఆర్, పుణే, చెన్నైలో 5.8% వరకు తగ్గగా.. హైదరాబాద్, బెంగళూరులో 6.9 శాతం, 3.3 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరగడం గమనార్హం. ♦ అమ్ముడుపోయిన ఇళ్లలో 47 శాతం రూ.50 లక్షల్లోపు ధరల శ్రేణిలోనే ఉన్నాయి. ♦ కార్యాలయ స్థలాల లీజు జనవరి–జూన్‌లో 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయి 172 లక్షల చదరపు అడుగులకుపరిమితమైంది. -
రుణం కాకూడదు భారం!
‘మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మన దేశంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు.. రుణం ఇచ్చే ముందు దరఖాస్తు దారుల నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని చెల్లింపుల సామర్థ్యంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ మొత్తాన్ని నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రమణ ప్రతీ నెలా నికరంగా రూ.లక్ష చొప్పున వేతనం పొందుతున్నాడని అనుకుంటే.. అందులో 50 శాతం రూ.50,000 అవుతుంది. అయితే, అప్పటికే రమణ తన కారు కోసం రూ.10,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. దీంతో రమణ వద్ద మిగిలి ఉన్న రుణ చెల్లింపుల సామర్థ్యం రూ.40,000 అవుతుంది. ఈ విధంగా చూస్తే.. 9 శాతం వడ్డీ రేటుపై 15 ఏళ్ల కాలానికి రూ.40 లక్షల గృహ రుణాన్ని రమణ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయంలో 50 శాతానికి ఈఎంఐను ఖరారు చేస్తే.. మిగిలిన 50 శాతం నుంచి మీ ఖర్చులుపోను భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు దాదాపు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో కొన్నింటి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొనుగోళ్లను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఎత్తు పల్లాలను ఎదుర్కొనే వెసులుబాటు కూడా తగ్గిపోతుంది. అందుకే మీకున్న గరిష్ట రుణ అర్హత పరిధిలో ఎంత వరకు రుణం తీసుకుంటే.. నెల నెలా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుందన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవన వ్యయాలు, ప్రస్తుత ఈఎంఐల మొత్తంతోపాటు.. ఇతర లక్ష్యాల కోసం ఆదాయంలో 15–20 శాతం మేర పొదుపును మినహాయించిన తర్వాతే ఈఎంఐపై స్పష్టతకు రావాలి. విలువను పెంచుకునేందుకు.. పెట్టుబడి కోసం, ఆస్తి కొనుగోలు కోసమో రుణం తీసుకుంటుంటే అందులో ‘లాభం’ సూత్రం దాగుండాలి. తీసుకున్న రుణానికి చేస్తున్న ఖర్చులకు మించి ఆదాయం ఇచ్చేది అయితేనే ప్రయోజనం లభిస్తుంది. లేదా కనీసం మీ నికర విలువను పెంచే వాటిపై రుణాన్ని ఖర్చు చేసినా పయ్రోజనం సిద్ధిస్తుంది. మన దేశంలో రిటైల్ రుణాలపై (గృహ రుణం మినహా) వడ్డీ రేట్లు అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయి. ఈ రేట్లకు మించి పెట్టుబడులపై రాబడినిచ్చే సాధానాలు అరుదే. అయితే, తీసుకుంటున్న రుణాన్ని మీ నికర విలువను (నెట్‌వర్త్) తగ్గించేది కాకుండా పెంచేదానిపై ఇన్వెస్ట్ చేయడం మంచి విధానం అవుతుంది. ఇది ఎలా అంటారా..? భూమి కొనుగోలు, ఉన్నత విద్యార్హతల కోసం రుణం తీసుకోవడం. కొనుగోలు చేసిన భూమి విలువ పెరిగినా.. అదనపు విద్యార్హత అధిక ఆదాయానికి దారితీసినా మీ రుణ లక్ష్యం నెరివేరినట్టే. ఇలా కాకుండా రుణం తీసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో చూడముచ్చటగా ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్, స్మార్ట్‌ఫోన్, హోమ్ థియేటర్ సిస్టమ్స్ వంటివి కొనుగోలు చేశారనుకోండి.. కాలం గడుస్తున్న కొద్దీ అవి విలువను కోల్పోతాయి. వీటి వల్ల రెండు విధాలా నష్టం ఎదురవుతుంది. వీటి కోసం రుణం తీసుకోవడం వల్ల వడ్డీ రూపంలో నష్టం ఒకటి అయితే.. కొనుగోలు చేసిన ఈ వస్తువుల విలువ కొంత కాలానికి జీరోకి చేరుకోవడం మరో నష్టం. వినియోగం కోసం లేక వినోద అనుభవం కోసం రుణం తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అర్థం చేసుకోవాలి. కనీసం జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం తగినంత నిధిని సమకూర్చుకునే వరకు అయినా.. ఇటువంటి వినియోగ, వినోద, విలాసాల కోసం రుణానికి దూరంగా ఉండడం ఆరోగ్యకరం. సామర్థ్యాన్ని మించొద్దు.. వేతన జీవులకు ఏటా ఎంతో కొంత ఆదాయం పెరుగుతుండడం సహజం. అయి తే, కచ్చితంగా పెరుగుతుందని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. సమీప కాలంలో ఆదాయం పెరుగుతుందన్న అంచనాతో అధిక ఈఎంఐను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెరిగే వేతనంతో తొందరగా రుణ భారాన్ని తొలగించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఉద్యోగ, వేతన కోతలను చవిచూస్తున్నారు. ఆర్థిక సంక్షోభాల్లోనూ లేదా విడిగా ఆయా కంపెనీలు సంక్షోభాల్లోకి వెళ్లిన సందర్భాల్లో ఉద్యోగులకు రిస్క్ ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా.. ప్రస్తుత చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. మెరుగైన ఆఫర్ రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలకు దిగొస్తున్నాయి. బ్యాంకులు రెపో ఆధారిత రుణాలను 6–7 శా తానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక రుణం తీసుకునే ముందు పలు సంస్థలను సంప్రదించి తక్కువ రేటుకు రుణాన్ని పొందడం వల్ల చెల్లింపుల భారాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు. అధిక ఈఎంఐ రుణం తీసుకునే సమయంలో చాలా మంది ఈఎంఐపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. రుణమిచ్చే సంస్థలు చెల్లింపులు సౌకర్యంగా ఉండేందుకు.. దీర్ఘకాలానికి రుణాన్ని, తక్కువ ఈఎంఐపై ఆఫర్ చేస్తుంటాయి. కానీ, కాల వ్యవధిని (లోన్ టర్మ్) దీర్ఘకాలానికి నిర్ణయించడం వల్ల.. రుణ గ్రహీత కంటే రుణదాతకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ చెల్లింపులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.50,713 అవుతుంది. దీంతో 15 ఏళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.91.28 లక్షలు అవుతుంది. ఒకవేళ రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.44,986 అవుతుంది. కానీ, 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.1.07 కోట్లకు పెరుగుతుంది. 15 ఏళ్ల కాలంలో వడ్డీ రూపంలో చెల్లించేది రూ.41.2 లక్షలు అయితే, 20 ఏళ్ల కాలంలో రూ.57.9 లక్షలుగా ఉంటుంది. కనుక రుణం విషయంలో కాల వ్యవధిని పెంచుకోకుండా, ఈఎంఐ పెంచుకునే విషయమై బ్యాంకుతో సంప్రదింపులు చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ పోతుంటే వాస్తవ ఈఎంఐకి అదనంగా వెసులుబాటు ఉన్నంత మేరకు చెల్లించుకోవడం ఇంకా మంచిది. -
ఇక్కడ ఇళ్లు కొనేది ఉండటానికే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అన్ని రంగాలూ కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. రియల్టీ మరీనూ! ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌కు చెందిన ప్రణీత్ గ్రూప్ రెండు భారీ ప్రాజెక్ట్‌లను ఆరంభించింది. అదే విషయాన్ని గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజును అడిగితే... అందుబాటు ధర, నాణ్యత, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగిన వారికి ఎప్పుడూ విక్రయాలకు ఇబ్బంది ఉండదని చెప్పారు. రియల్టీకి చెందిన పలు అంశాలను సాక్షితో పంచుకున్నారు. అవి.. ►కరోనా నేపథ్యంతో పాత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయటమే కష్టమంటున్నారు కదా? కొంత నిజమే!!. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రా రంభమయ్యాక.. అంతకుముందు జరిగిన అగ్రిమెంట్లు రద్దవుతాయని, కొత్త యూనిట్ల విక్రయాలు జరగవని అందరిలాగే మాకూ సందేహాలొచ్చాయి. కానీ, లాక్డౌన్ ముగిసి అన్నీ తెరుచుకుంటున్న సందర్భంలో పరిస్థితి మా రింది. అందుబాటు ధర, నిర్మాణంలో నాణ్యత, సమయానికి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయగలిగితే కస్టమర్లు ఆదరిస్తారనే నమ్మకం మొదటి నుంచీ ఉంది. ఆ భరోసాతోనే కొత్త ప్రాజెక్టులు ఆరంభించాం. లాక్డౌన్ ముగిశాక ప్రతి వారం 80–100 వాకిన్స్ వస్తున్నాయి. కొన్ని యూనిట్లు విక్రయమయ్యాయి కూడా. ►కరోనాతో కార్మికుల కొరత లేదా? కరోనా పేరు చెప్పి ధరలు పెంచని రంగమంటూ ఏదైనా ఉంటే అది రియల్టీయే. నిజానికి ఇప్పుడున్న ధరలకు విక్రయించినా డెవలపర్లకు లాభమే. ఎందుకంటే 2008–12 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా లేనంతగా ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లు 6 నుంచి 7 శాతానికి దిగివచ్చాయి. తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం మొట్ట మొదట అందేది డెవలపర్లకే. ఇక కరోనా వల్ల కార్మికుల సమస్య పెరిగిందని చెప్పలేం. ఎందుకంటే ఏటా రంజాన్, వర్షాకాలం ప్రారంభంలో ఇతర రాష్ట్రాల కార్మికులు సెలవుల మీద వెళతారు. ఈసారి ఇంకాస్త ముందు వెళ్లారనుకోవాలి. యజమానులు కాస్త చొరవ చూపించి ప్రోత్సాహకాలిస్తే వచ్చే నెల రోజుల్లో వారు తిరిగి తమ పనుల్లోకి వస్తారు. ►అయితే ఖర్చులు పెరగలేదంటారా? కార్మికుల వ్యయం, నిర్మాణ సామగ్రి ధరలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు పెరిగాయన్నది నిజం. మేమైతే కరోనా కంటే ముందున్న ధరలకే విక్రయిస్తున్నాం. దీనికింకో కారణం కూడా ఉంది. అదేంటంటే... వీలైనంత వరకూ హ్యూమన్ టచ్ లేకుండా టెక్నాలజీని వినియోగించడాన్ని కరోనా నేర్పించింది. దీనివల్ల నిర్మాణ వ్యయం కొంత పెరిగినా ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుంది. వృథా తగ్గుతుంది. ►హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఎలా ఉండొచ్చు? దేశంలోని ఇతర మెట్రోలకు, హైదరాబాద్ రియల్టీకి తేడా ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. ఇళ్లు కొనేది అద్దెల కోసమో లేక ధర ఎక్కువ వచ్చినప్పుడు తిరిగి అమ్ముకోవటానికో కాదు. సొంతంగా ఉండేందుకు కొనేవారే ఎక్కువ. వీళ్లకు కావాల్సిందల్లా.. అందుబాటు ధర, నాణ్యత, బిల్డర్ ట్రాక్ రికార్డ్, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అంతే. -
రియల్టీ షేర్ల ర్యాలీ.. గోద్రేజ్ ప్రాపర్టీస్ 11% అప్
ఎన్ఎస్ఈలో నేడు రియల్టీ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. లాక్డౌన్ సడలింపులతో నిర్మాణ రంగ పనులు పుంజుకోవడంతో రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4 శాతం లాభపడి 202.90 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 197.05 పాయింట్ల వద్ద ప్రారభమై ఒక దశలో 205.20 వద్ద గరిష్టాన్ని, 194.65 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన గోద్రేజ్ ప్రాపర్టీస్ దాదాపు 11 శాతం పెరిగి రూ.849.95 వద్ద, ఒబెరాయ్ రియల్టీ 7శాతం పెరిగి రూ.24.45 వద్ద, ఐబీరియల్ ఎస్టేట్ 5శాతం పెరుగుదలతో రూ.46.45 వద్ద, ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ 4.18 శాతం లాభపడి రూ.172 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్రిగేడ్, ఫోనిక్స్, శోభా కంపెనీలు 1-2 శాతం పెరుగదలతో ట్రేడ్ అవుతున్నాయి. సన్‌టెక్ 1శాతం లాభంతో ట్రేడ్ అవుతుంటే డీఎల్ఎఫ్ , మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ కంపెనీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. చిన్న సంస్థలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు, నిల్చిపోయిన రియల్టీ ప్రాజెక్టుల డెడ్‌లైన్ పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం, సంక్షోభంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చడం మొదలైన వరాలు వీటిలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి దిశగా .. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మినహాయింపులనిస్తూ రెండు విడతల్లో లాక్‌డౌన్‌ను మే 17 దాకా కేంద్రం పొడిగించింది. లాక్డౌన్ దెబ్బతో ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని, వినియోగ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ఎకానమీకి ఊతమిచ్చేలా రూ. 20 లక్షల కోట్లతో (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు వరాలు చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు. భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్సీ, ఆర్ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు తీరనున్న నిధుల కష్టాలు.. తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది. పీఎఫ్ భారం తగ్గింది.. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపరంగా ఊరటనిచ్చారు. పీఎఫ్ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు ఆగస్టు దాకా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీనితో 3.67 లక్షల సంస్థలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు రూ. 2,500 కోట్ల మేర నిధుల లభ్యతపరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక, బేసిక్ వేతనంలో తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)కు జమ చేయాల్సిన మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు, ఉద్యోగుల చేతిలో కాస్త నిధులు ఆడేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఇది సుమారు 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పడనుంది. మూడు నెలల వ్యవధిలో రూ. 6,750 కోట్ల మేర లిక్విడిటీపరమైన లబ్ధి చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం యథాప్రకారంగా 12% చందా జమ చేయడం కొనసాగిస్తాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి.. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా నిర్మాణాలు నిల్చిపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నిర్మాణ రంగానికి తోడ్పాటు లభించింది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఊరట కల్పించారు. రైల్వే సహా రహదారి రవాణా శాఖ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొదలైనవన్నీ కూడా నిర్మాణ పనులు, వస్తు.. సేవల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇందుకు సంబంధించి బిల్డర్లు .. రియల్టీ చట్టం రెరాలో ఫోర్స్ మెజూర్ నిబంధనను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రియల్టీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. దీని ప్రకారం.. మార్చి 25తో లేదా ఆ తర్వాత (లాక్డౌన్ అమల్లోకి వచ్చిన రోజు) గడువు ముగిసిపోయే ప్రాజెక్టులన్నింటికీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండా.. రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలల గడువు కూడా ఇవ్వొచ్చు. పన్ను చెల్లింపుదారులపై పెద్ద మనసు వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర అసెస్‌మెంట్స్‌ను దాఖలు చేసేందుకు తేదీలను కూడా పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం.. వివిధ వర్గాలకు సంబంధించి 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును జూలై 31 నుంచి అక్టోబర్ 31, నవంబర్ 30 దాకాను, ట్యాక్స్ ఆడిట్ తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 దాకా పొడిగించారు. ‘వివాద్ సే విశ్వాస్‘ స్కీమును డిసెంబర్ దాకా పొడిగించారు. వివద్ సే విశ్వాస్ పేరుతో కేంద్ర సర్కారు గతంలో ప్రకటించిన పథకం గడువును మరో 6 నెలలు అంటే 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ తాజా నిర్ణయం వెలువడింది. రిఫండ్స్ సత్వరమే దాతృత్వ సంస్థలు, ఎల్ఎల్పీలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్షిప్ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్‌ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రూ.5 లక్షల్లోపు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే రూ.18,000 కోట్ల రిఫండ్స్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మేలు... ఆర్థిక మంత్రి సీతారామన్ నేడు ప్రకటించిన నిర్ణయాలు.. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఎంస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు దీర్ఘకాలం పాటు పరిష్కారాలు చూపుతాయి. లిక్విడిటీని వ్యాపారవేత్తల సాధికారతను పెంచుతాయి. వారి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. – ప్రధాని నరేంద్రమోదీ వృద్ధికి ఊతమిస్తుంది... స్వయం సమృద్ధమైన భారత్‌ను నిర్మించేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు స్థానిక బ్రాండ్స్‌ను నిర్మించేందుకు తోడ్పాటునిస్తాయి – నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి డెవలపర్లకు బూస్ట్... రెరా కింద ప్రాజెక్టు పూర్తి చేసే గడువును పొడిగించడం, కరోనాను ఊహించని విపత్తుగా ప్రకటించడం అన్నవి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కీలకమైన నిర్ణయాలు. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ చిన్న సంస్థలకు తక్షణ శక్తి... ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంఎస్ఎంఈలకు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు, సమస్యల్లో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు వెంటనే పెద్ద ఊరటనిస్తాయి. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ కరోనాను ఎదుర్కొనే వ్యూహం... నేటి సమగ్రమైన నిర్ణయాలు దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి వీలు కల్పిస్తాయి. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యల తీరు చూస్తుంటే మన ప్రభుత్వం భారత్‌ను కరోనా బారి నుంచి బయటపడవేసేందుకు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ దీర్ఘకాల ప్రభావం ఉంటుంది... చాలా ముఖ్యమైన నిర్ణయం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించేది.. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చడం. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 నుంచి ఇది మారలేదు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరెక్టర్ జనరల్ -
తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్ఆర్కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్‌మార్క్ రుణ రేటు–ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది. వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్బీఐ వియ్‌కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది. మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్బీఐ అనుమతి నివ్వడంతో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. -
రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..
ముంబై: నియంత్రణ విధానాలపరమైన ప్రతికూల పరిస్థితులతో రియల్టీ రంగం కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ.. పెట్టుబడులు మాత్రం భారీగానే వస్తున్నాయి. 2019 ప్రథమార్ధంలో 2.7 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 18,900 కోట్లు) వచ్చాయని ప్రాపర్టీల నిర్వహణ సంస్థ వెస్టియాన్ , పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2015–2018 మధ్యకాలంలో రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం 25.7 బిలియన్ డాలర్ల స్థాయిని తాకింది. అదే సానుకూల ధోరణులు 2019 ప్రథమార్ధంలోనూ కొనసాగాయని నివేదిక వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, రహదారులను మెరుగుపర్చడం తదితర చర్యలు చేపడితే ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గడిచిన దశాబ్దకాలంగా రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు .. ముఖ్యంగా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. సంస్థాగత పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం వాటా పీఈ ఇన్వెస్టర్లదే ఉందని..ఇలాంటి అంశాలే రియల్టీ రికవరీపై ఆశల్ని సజీవంగా ఉంచుతున్నాయని వివరించింది. -
హైదరాబాద్ రియల్టీలో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్సాహం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, కార్యాలయాల లావాదేవీల్లో వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ (హెచ్1) మధ్య కాలంలో నగరంలో కొత్త గృహాల లాంచింగ్స్‌లో 47 శాతం, ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా 11వ ఎడిషన్ అర్ధ సంవత్సర నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ మీడియాతో మాట్లాడారు. నివేదికలోని ముఖ్యమైన అంశాలివే.. 5,430 యూనిట్ల అమ్మకం.. 2019 హెచ్1లో నగరంలో కొత్తగా 5,430 గృహాలు ప్రారంభమయ్యాయి. 2018 హెచ్1లో ఇవి 3,706 యూనిట్లుగా ఉన్నాయి. ఫ్లాట్ల లాంచింగ్స్ ఎక్కువగా కూకట్పల్లి, మియాపూర్ వంటి ఉత్తరాది ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ప్రాజెక్ట్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఇక, అమ్మకాల్లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ అర్ధ సంవత్సరంలో నగరంలో 8,334 గృహాలు అమ్ముడుపోగా.. గతేడాది హెచ్1లో ఇవి 8,313 యూనిట్లు. ఈ ఏడాది అమ్మకాల్లో 63 శాతం గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువ. ధరల్లో 9 శాతం వృద్ధి.. నగరంలో సగటు చ.అ. ధరల్లో 9 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది హెచ్1లో చ.అ. సగటున రూ.4,012 కాగా.. ఇప్పుడది రూ.4,373కి పెరిగింది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్1తో పోలిస్తే 67 శాతం తగ్గి ప్రస్తుతం 4,265 యూనిట్లుగా నిలిచాయి. నిర్మాణం పూర్తయిన లేదా తుది దశలో ఉన్న గృహాల కొనుగోళ్లకే నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని, ఆయా గృహాలకు జీఎస్టీ లేకపోవటమే దీనికి కారణం. 38.5 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ నగరంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 38.5 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2018 హెచ్1లో ఇది 26..9 లక్షల చ.అ.లుగా ఉంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాలు 41 శాతం లావాదేవీలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే నగరంలో ఆఫీస్ స్పేస్ ధరలు 11 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం నెలకు చ.అ. ధర సగటున రూ.59 ఉంది. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో కార్యాలయాల ప్రాజెక్ట్‌లు విస్తరిస్తున్నాయి. -
రియల్టీకబర్.కామ్
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలోని తాజా వార్తలు, కథనాలు, ప్రాజెక్ట్‌లు, ట్రెండ్స్ వంటివి ఎప్పటికప్పుడు పాఠకులకు అందించేందుకు రియల్టీకబర్.కామ్ సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థిరాస్తి రంగ సమాచారాన్ని తెలుగులో అందించడమే దీని ప్రత్యేకత అని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ దేశాల్లోని తెలుగు పాఠకులు సులువుగా చదువుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశీయ నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నివేదికలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అన్ని రకాల అంశాలతో కూడిన కథనాలను అందిస్తామని తెలిపారు. -
నాలుగో రోజూ నష్టాలే
ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. జనవరి నెల ద్రవ్యోల్బణ, డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానుండటం(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి)తో మార్కెట్లో అప్రమత్త వాతావారణం నెలకొన్నది. అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, మన స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 241 పాయింట్లు పతనమై 36,154 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 10,831 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ స్టాక్‌సూచీలు నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 821 పాయింట్లు నష్టపోయింది. రియల్టీ, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంక్, వాహన, వినియోగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. లోహ, ఫార్మా, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒక దశలో 70 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 281 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్ 300కు పైగా పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 351 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 65 పాయింట్లు నష్టపోయింది. ‘యాక్సిస్’ ఓఎఫ్‌ఎస్‌కు రూ.8,000 కోట్ల బిడ్లు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. వీరికి కేటాయించిన వాటా 2.56 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబయింది. ఇందులో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 4.56 కోట్ల ఈక్విటీ షేర్లు రిజర్వ్ చేయగా, 11.69 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. విలువ రూ.8,000 కోట్లుగా ఉంది. నియోజెన్ కెమికల్స్ ఐపీఓకు ఓకే స్పెషాల్టీ కెమికల్స్ తయారు చేసే కంపెనీ నియోజెన్ కెమికల్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.70 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)విధానంలో కంపెనీ ప్రమోటర్లు 29 లక్షల షేర్లను విక్రయిస్తారు. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తారు. -
పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు!
రియల్ ఎస్టేట్, లొకేషన్! ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. మరి, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కాబట్టి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి నిర్మాణ సంస్థలు! దీంతో పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో ప్రధాన నగరం నయా ప్రాజెక్ట్‌లతో కొనుగోలుదారులను రా.. రమ్మంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: 30–40 ఏళ్ల నాటి పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలౖకైతే వెయ్యి గజాల వరకు, అంతకంటే ఎక్కువగా.. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, విద్యానగర్, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావ్‌నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 90 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లే. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్ధిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని బేగంపేట్‌లో ‘రామ్ ఎన్క్లేవ్’ పేరిట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్న ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా పాత స్థలాలను రీ–డెవలప్మెంట్కు ఇచ్చేందుకు మరికొన్ని కారణాలున్నాయి. అవేంటంటే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ: రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు అగ్నిమాపక, విమానయాన, పర్యావరణ శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) పెద్దగా అవసరం ఉండదు. పైగా పాత స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటర్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్ స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. ఎవరికేం లాభమంటే? రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లతో స్థల యజమానులకు, నిర్మాణ సంస్థలకు, కొనుగోలుదారులకూ అందరికీ ప్రయోజనకరమే! స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలూ త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం తిరిగొస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. -
సెజ్‌ల చుట్టూ రియల్ జోరు!
పోచారం, ఆదిభట్ల, పోలెపల్లి.. ఈ మూడు నగరానికి ఒక్కో దిక్కునున్న ప్రాంతాలు. కానీ, వీటిని కలిపే కామన్ పాయింట్.. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)! ఐటీ సెజ్‌తో పోచారం, ఏరోస్పేస్ సెజ్‌తో ఆదిభట్ల ప్రాంతాలు ఎలాగైతే అభివృద్ధి చెందాయో ఇప్పుడు ఫార్మా సెజ్‌తో పోలెపల్లిలో రియల్ జోరందుకుంది. తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయానికి సెజ్ చుట్టూ ఉండే ప్రాంతాలు సరైన వేదికలని పరిశ్రమ వర్గాల సూచన. దీంతో సెజ్‌ల చుట్టూ 10 కి.మీ. పరిధి వరకూ స్థిరాస్తి అభివృద్ధి జోరందుకుంది. పారిశ్రామిక, ఐటీ సెజ్‌లు స్థిరాస్తి రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతున్నాయి. ఎస్ఈజెడ్ల చుట్టూ 10 కి.మీ పరిధి లోపు భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్ అభివృద్ధి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలుండే ప్రతి చోటా రియల్ వృద్ధి కచ్చితంగా ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. దీనికితోడు సామాజిక అవసరాలైన విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులైన రహదారులు, విద్యుత్, మంచినీళ్ల వంటి ఏర్పాట్లూ ఉంటే సెజ్‌లు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని సూచించారు. పోచారం, ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ సెజ్లే ఇందుకు ఉదాహరణ. పోలెపల్లి ఫార్మా, పారిశ్రామిక హబ్.. హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారిలో పోలెపల్లి సెజ్ 2,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో హెటిరో, అరబిందో, ఎప్సిలాన్, ఏపీఎల్ హెల్త్‌కేర్, మైలాన్ ల్యాబొరేటరీస్, శిల్పా మెడికేర్, ఆప్టిమస్ జెనిరిక్స్ వంటి బహుళ జాతి ఫార్మా కంపెనీలున్నాయి. సుమారు 65 వేల మంది ఉద్యో గులుంటారని అం చనా. ఈ ప్రాంతంలో ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ, ఎల్ అండ్ టీ నైపుణ్య శిక్షణ కేంద్రం, అశోక్ లేల్యాండ్లూ ఉన్నాయి. దగ్గర్లోనే ఎన్ఆర్ఎస్సీ, డీఎల్ఎఫ్, అమెజాన్, పీ అండ్ జీ, జాన్సన్ అండ్ జాన్సన్‌లు కూడా కొలువుదీరాయి. 10 కి.మీ. దూరంలో బాలానగర్ పారిశ్రామికవాడ ఉండటంతో మొత్తంగా ఈ ప్రాంతమంతా ఫార్మా, పారిశ్రామిక హబ్‌గా అభి వృద్ధి చెందింది. దీంతో ఆయా ప్రాంతంలో స్థలాల ధరలు పెరిగాయి. ‘‘సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ చేతిలో ఉన్న 5–6 లక్షల సొమ్ముతో ముందుగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాతే అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల వైపు వెళుతుంటారని’’ క్రెడాయ్ హైదరా బాద్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి తెలిపారు. పోలెపల్లిలో స్థలాల పెరుగుదలకు కారణమిదే. ప్లాట్లు, విల్లాల హవా.. బెంగళూరు జాతీయ రహదారిలో ప్రధానంగా రాజాపురం, బాలానగర్, షాద్‌నగర్, పోలెపల్లి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ‘‘రెండేళ్ల క్రితం ఉద్దానపురంలో ఎకరం రూ.3.5 లక్షలకు కొనుగోలు చేశాం. ఇప్పుడక్కడ రూ.20 లక్షలకు పైమాటే. ఇక జాతీయ రహదారి వెంబడైతే ఎకరం కోటికి తక్కువ లేదని’’ స్పేస్ విజన్ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. పోలెపల్లిలో ఐటీ పార్క్ ప్రతిపాదన, డ్రైపోర్ట్ వంటి వాటితో వచ్చే ఏడాది కాలంలో 20–40 శాతం ధరలు పెరగడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ స్థలాల ధరలు గజానికి రూ.4 వేల నుంచి ఉన్నాయి. అపార్ట్మెంట్లు చ.అ.కు రూ.2,500 నుంచి చెబుతున్నారు. ఈ ప్రాంతంలో స్పేస్ విజన్, గిరిధారి, దుబాయ్‌కి చెందిన విన్సెంట్ నిర్మాణ సంస్థల వెంచర్లు, ప్రాజెక్ట్‌లున్నాయి. విన్సెంట్ 10 ఎకరాల్లో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. కొత్త సిటీల అభివృద్ధి.. ఇప్పటికే పోలెపల్లి ఫార్మా సెజ్‌గా అభివృద్ధి చెందింది. దీనికితోడు 10 కి.మీ. దూరంలోని జడ్చర్లలో తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్‌ను ప్రతిపాదించింది. మల్టీ లాజిస్టిక్ హబ్ అయిన డ్రై పోర్ట్ కూడా పరిశీలనలో ఉంది. దీంతో పోలెపల్లి నుంచి జడ్చర్ల, బాలానగర్ ప్రాంతాల వరకూ రియల్ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలిశాయి. సెజ్ నుంచి నగరానికి మధ్యలో ఉండే ప్రాంతం మరో కొత్త సిటీగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు చెప్పారు. ఉదాహరణకు ఆదిభట్లలో ఇప్పటికే ఏరోస్పేస్ కంపెనీల కార్యకలాపాలు మొదలయ్యాయి కాబట్టి మరిన్ని ఉద్యోగ అవకాశాలొస్తాయి. దీంతో రోజూ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లొచ్చే బదులు స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. దీంతో ఇన్నాళ్లూ శివారు ప్రాంతం కాస్త కొత్త నగరంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. -
ఇక ఆ ఉత్పత్తులు జీఎస్టీలోకి..
న్యూఢిల్లీ : దేశమంతా ఏక పన్ను విధానం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఈ పన్ను విధానంలోకి మరికొన్ని ఉత్పత్తులను తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ చూస్తోంది. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, రియాల్టీని తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తోందని బిహార్ ఆర్థిక మంత్రి సుశిల్ మోదీ చెప్పారు. ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్, స్టాంప్ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావాలనుకుంటున్నామని ఇండస్ట్రి ఛాంబర్ ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన తెలిపారు. అయితే ఏ సమయం వరకు వీటిని జీఎస్టీలోకి తీసుకొస్తామో చెప్పడం కష్టమన్నారు. చట్టాన్ని సవరణ చేయకుండానే వీటిని కలుపబోతున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పాలనలోకి తీసుకొస్తే, ఇవి అత్యధిక మొత్తంలో పన్ను శ్లాబులోకి వచ్చే అవకాశముంటుంది. అదేవిధంగా రాష్ట్రాలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి సెస్‌ను విధించబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం రెవెన్యూలను పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఆర్జిస్తున్నాయి. జీఎస్టీ పన్ను విధానంలో ఐదు పన్ను శ్లాబులు 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్ విధిస్తున్నారు. వీటిలో అత్యధిక పన్ను శ్లాబుగా ఉన్న 28 శాతాన్ని 25 శాతానికి తగ్గించబోతున్నారు. లేదా 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను ఒకటిగా కలుపబోతున్నారు. -
ఉప్పల్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
♦ ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్ ♦ ప్రారంభ ధర రూ.35 లక్షలు సాక్షి, హైదరాబాద్: ‘‘నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధర, గడువులోగా నిర్మాణం పూర్తి’’ ఇవే మా లక్ష్యమంటోంది శ్రీసాయి హరిహర ఎస్టేట్స్. పాతికేళ్ల రియల్టీ ప్రయాణంలో 50కి పైగా నివాస సముదాయాలను పూర్తి చేసిన ఈ సంస్థ ఉప్పల్‌లో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అందుబాటు ధరలో, ఆధునిక వసతులతో మధ్యతరగతి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమంటున్నారు సంస్థ ఎండీ ఏ యాదవ రెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఉప్పల్‌లోని చెన్నారెడ్డి ఎన్క్లేవ్ సమీపంలో 5.07 ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి పేరిట గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నాం. ఉప్పల్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదే. 7 బ్లాకులు, ఒక్కో బ్లాక్ 2 లెవల్ పార్కింగ్+ ఐదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 390 ఫ్లాట్లు. 1,155–1,200 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,600–1,800 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 2 బీహెచ్‌కే ధర రూ.35 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.50 లక్షలు. మొత్తం స్థలంలో 40 శాతం ఓపెన్ స్పేసే ఉంటుంది. ♦ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 20 నెలల్లో 70 శాతం నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే 155 ఫ్లాట్లు గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. వచ్చే నెలల్లో కొనుగోలుదారులకు అందించనున్నాం. 2019 ఏప్రిల్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. పీఎంఈవై, సీఎల్ఎస్ఎస్ వర్తింపు.. శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్ కొనుగోలుదారులు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఈవై), క్రెడిట్లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) పథకానికి అర్హులు. దీంతో కస్టమర్లు వడ్డీ రాయితీ కూడా పొందే వీలుంటుంది. వసతుల విషయానికొస్తే.. 15 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్‌పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, పవర్ బ్యాకప్, ల్యాడ్ స్కేపింగ్ వంటి వసతులన్నీ ఉంటాయి. విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్నాయ్.. ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పాలంటే.. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి వరంగల్ హైవేలో 2 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకైతే కొదవేలేదు. కి.మీ. పరిధిలోనే బిగ్‌బజార్, డెకత్లాన్, ఏషియన్ సినీస్క్వేర్ షాపింగ్ సంస్థలు, స్పార్క్, ఆదిత్య, అంకుర వంటి ఆసుపత్రులు, గ్లోబల్ ఇండియన్, చైతన్య, ఆరోరా వంటి విద్యా సంస్థలున్నాయి. పోచారంలోని ఐటీ కేంద్రానికి 4 కి.మీ., ఘట్కేసర్ ఔటర్‌రింగ్ రోడ్డు జంక్షన్‌కు 7 కి.మీ. దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. బెస్ట్ అఫడబుల్ హౌజింగ్ అవార్డు ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్‌ను రియల్టీ ఐకాన్స్ 2017 అవార్డుకు ఎంపిక చేసింది. ఈస్ట్ జోన్లో బెస్ట్ అప్‌కమింగ్ అఫడబుల్ హౌజింగ్ విభాగంలో ఈ అవార్డు వరించింది. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. నిర్మాణ రంగంలో 25 ఏళ్ల అనుభవం, నిర్మాణంలో నాణ్యత, గడువులోగా నిర్మాణం, అందుబాటు ధర ఇవే అవార్డు ఎంపికకు కారణాలని శ్రీసాయి హరిహర ఎస్టేట్స్ ప్రై.లి. ఎండీ యాదవ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సర్టిఫికెట్ కోసం కూడా దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. సైబర్సిటీకి బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అవార్డు సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి.ని టైమ్స్ రియల్టీ ఐకాన్స్ 2017 అవార్డు వరించింది. హైటెక్‌సిటీ సమీపంలో నిర్మిస్తున్న రెయిన్బో విస్టాస్–రాక్‌గార్డెన్ ప్రాజెక్ట్‌కు బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అవార్డు దక్కిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 13 టవర్లు, 20 అంతస్తుల్లో ఉంటుంది. -
జియోకి వ్యతిరేకంగా ఏకమైన టెల్కోలు
న్యూడిల్లీ: టెలికాం కంపెనీల మధ్య వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఉచిత ఆఫర్లతో దూసుకువచ్చిన రిలయన్స జియోపై టెలికాం దిగ్గజం కంపెనీలు పలు ఆరోపణలు గుప్పించాయి. జియోకి వ్యతిరేకంగా ఏకమైన దిగ్గజ కంపెనీలు దోపిడీధరలతో జియో కస్టమర్లను మోసం చేస్తోందని ధ్వజమెత్తాయి. ఈ మేరకు ఇంటర్మీడియాలిటీ గ్రూప్ (ఐఎంజీ) ముందు తమ వాదనను వినిపించాయి. శుక్రవారం ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల అధికారుల బృందంతో మాట్లాడిన కంపెనీలు, జియో వాస్తవికతను తప్పుగా చూపించిందన్నారు. దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు రిలయన్స్ జియో అధికారులకు అవాస్తవాలు చెప్పిందని ఆరోపించాయి. తక్కువ ధరకే డేటా సేవలను ఆఫర్ చేసి మార్కెట్ షేరును గెలుచుకోవాలని చూస్తోందంటూ ప్రత్యర్థి జియోపై మండిపడ్డాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్ టెల్ జియో "దోపిడీ ధర" విధానాన్ని స్వీకరించిందని ఆరోపించింది. తద్వారా పరిశ్రమల ఆదాయం, నికర ఆదాయం, క్యాపిటల్స్‌ను తిరిగి రాబట్టడంలో తీవ్రంగా నష్టపోయిందని ఎయిర్టెల్ పేర్కింది. దీన్ని నిరోధించాలని ఐఎంజీని కోరింది. అంతేకాదు, టెలికాం నియంత్రణాధికారి ట్రాయ్ కోర్టులో అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఇంటర్కనెక్షన్ యూసేజ్ ధరలను నియంత్రిచాలని కోరాయి. లేదంటే తమకు "కోలుకోలేని ఆర్థిక నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు జీఎస్టీ పన్ను విధానంపై కూడా కంపెనీలు స్పందించాయి. ఇతర ప్రధాన రంగాల లాగానే, 18 శాతానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని కొనసాగించాలని వోడాఫోన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోరారు. టెలికాం సేవంలపై 5శాతం జీఎస్టీ పన్ను ఉండాలన్న వాదనను ఐడియా కూడా సమర్ధించింది. తద్వారా లైసెన్సింగ్ ఫీజు తగ్గుతుందని పేర్కింది. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని రద్దు చేయడం ద్వారా లైసెన్స్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని ఎయిర్ టెల్ సూచించింది. -
సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు కౌన్సిల్ ఆమోదం
ముంబై: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులో మరో కీలక అంకం ముగిసింది. జీఎస్టీ కౌన్సిల్ 11వ కీలకమైన చట్టాలను ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఈ కౌన్సిల్ శనివారం ముంబై నిర్వహించిన ఉమ్మడి నియంత్రణపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశలో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ముఖ్యంగా సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి చట్టాలకు ఆమోదం లభించింది. ఈ చట్టాలకు సంబంధించి తుది ఆమోదాన్ని తదుపరి సమావేశంలో సాధించనున్నామని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. జీఎస్టీ అమలుకు ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల సాధికారతకు కేంద్రం అంగీకారం తెలపడంతో చిన్న వ్యాపారాలకు భారీ ఊతం లభించింది. పన్ను పరిధులకు సంబంధించిన ఫిట్మెంట్ అంశాలపై తదుపరి సమావేశంలో కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన 26 పాయింట్లకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు అంచెల పన్నుల విధానాన్ని ఆమోదం లభించింది. అలాగే కనీస పన్నురేటు 5 శాతంగా మధ్యస్థంగా 12-18శాతంగాను, అత్యధికంగా 28శాతంగా ఉండనున్నాయి.దీంతో ఇప్పటికే పరోక్ష పన్ను సంస్కరణలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న భిన్నాభిప్రాయాలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) జులైనుంచి అమలు మరింత ఖాయమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను శాఖ ఉద్యోగులకు సమాన అధికారులు ఉండనున్నాయి. వీటిని త్వరలోనే పార్లమెంటు ఆమోదంకోసం ఉంచుతుంది. కౌన్సిల్ తదుపరి సమావేశం మార్చి 16 జరగనుంది. ఈ సమావేశంలో మిగిలిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. కొత్త పరోక్ష పన్నుల చట్టం కింద రూ. 50 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన హోటల్స్ కనీస పన్ను స్లాబ్ 5 శాతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాతిపదికన ఉంటుంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచించినప్పటికీ పన్ను అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరక పోవడంతో జులై 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
కరువు బృందానికి వాస్తవాలు చెప్పండి
అనంతపురం అర్బన్ : జిల్లా కరువుని పరిశీలించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి వాస్తవ నివేదిక ఇవ్వాలని అధికారులను రైతు సంఘం (సీపీఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో వేరుశనగ పంట 6,09,377 హెక్టార్లలో నష్టం జరిగిందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, అయితే కరువు మాడ్యూల్‌ని అమలు చేయడం లేదని తెలిపారు. కరువు నివారణకు నిధులు కేటాయించలేదని తెలియజేశారు. -
అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్..
అమెరికాః కళ్ళజోడు పెట్టుకుంటే చాలు ప్రపంచాన్ని మన ముందుంచే టెక్నాలజీల్లో ఇప్పటివరకూ వర్చువల్ రియాలిటీదే మొదటి స్థానం. దూరంగా ఉన్న అద్భుతాలను కళ్ళముందే ఉన్నట్లుగా తిలకించే అత్యద్భుత పరిజ్ఞానం అది. ఇప్పుడు అనేక సంస్థలు ఈ వర్చువల్ రియాలిటీ పరికరాలను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరో అడుగు ముందుకేసి మరి కాస్త పరిజ్ఞానాన్ని జోడించి మనిషి జీవితంలో భాగమయ్యే ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అమెరికా నేవీ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. ఇది ఓ ఐరన్ మ్యాన్ సామర్థ్యాన్ని అందిస్తుందని యూఎస్ నేవీ చెప్తోంది. నిజ జీవితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కనిపించే దృశ్యాలను చూసి ఆనందించే అవకాశం వర్చువల్ రియాలిటీలో ఉంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మాత్రం కనిపించే దృశ్యాల సారాంశాన్ని, చరిత్రను సైతం తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా నేవీ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. నీటి అడుగు భాగంలో సంచరించేందుకు డైవర్స్ దీన్ని వాడినప్పుడు.. వారికి ఐరన్ మాన్ చిత్రంలా వాస్తవిక సామర్థ్యాన్ని కలిగించేట్లు చేస్తుందని యూఎస్ నేవీ ఇంజనీర్ డెన్నిస్ గ్లఘెర్ చెప్తున్నారు. పనామా సిటీ డివిజన్ లోని నేవల్ సర్ఫేస్ వార్ఫేర్ సెంటర్ లో గల్లఘెర్ సహా 20 మంది బృందం ఈ అభివృద్ధిలోని డైవర్స్ ఆగ్మెంటెడ్ విజన్ డిస్ప్లే కు సంబంధించిన మొదటి దశను పూర్తి చేశారు. ఇందులో పొందుపరిచిన హై రిజల్యూషన్ సిస్టమ్ ద్వారా డైవర్స్ కు సెక్టార్ సోనార్, టెక్ట్స్ మెసేజ్, ఫొటోలు, డయాగ్రమ్ లు, వీడియోలను వాస్తవ కాలంలో సందర్శించే అవకాశం ఇస్తుంది. తాము అభివృద్ధి పరిచిన ఈ సాధనం ద్వారా నీటిలో మునిగిపోయిన ఓడలు, కూలిపోయిన విమానాలు వంటి వాటిని సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుందని, వాటిని వెతికేందుకు వెళ్ళే బృందాలకు ఈ హెల్మెట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని, అత్యంత సహాయ పడుతుందని నేవీ చెప్తోంది. ఈ అక్టోబర్ నాటికి హెల్మెట్ రూప కల్పన పూర్తిచేయడంతోపాటు.. నీటిలో పరీక్షలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు నేవీ తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ లోని అధిక రిజల్యూషన్ సోనార్ ద్వారా సముద్రంలోని, నీటి అడుగు భాగంలో వీడియోలు తీసుకోవడంతోపాటు, అనేక సూక్ష్మ విషయాలను కూడ పరిశీలించ వచ్చునని, ఇది అనేక విధాలుగా డైవర్లకు సహాయ పడుతుందని నేవీ వివరిస్తోంది. -
రోగి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ!
ఫ్రాన్స్ వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని తొలగించేందుకు 3డీ వర్చువల్ గ్లాసెస్ వినియోగించి.. రోగి స్పృహలో ఉండగానే శస్త్ర చికిత్స నిర్వహించారు. కృత్రిమ ప్రపంచాన్ని రోగికి చూపుతూ.. ఆపరేషన్ సమయంలో మెదడులోని భాగాలను సులభంగా పరీక్షించేందుకు అనుమతించే త్రీడీ అద్దాలను వినియోగించారు. రోగి స్పృహలో ఉన్నపుడే శస్త్ర చికిత్స నిర్వహించడంలో భాగంగా వైద్యులు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని ఏంజిర్ ఆస్పత్రిలో నిర్వహించిన చికిత్స విజయవంతమవ్వడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ సమయంలో రోగి కళ్లముందు కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించేందుకు త్రీడీ గ్లాస్ లు వాడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మెదడు పని తీరును ప్రత్యక్షంగా గుర్తించగలిగినట్లు ఏంజెర్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ ఫిలిప్పీ మెనీ తెలిపారు. కణతి కారణంగా రోగి ఇప్పటికే ఓ కన్ను కోల్పోయాడని, అందుకే దృష్టిని రక్షించేందుకు ప్రత్యేకంగా వినియోగించే ఈ కొత్త టెక్నాలజీని అతడి ఆపరేషన్ కు వాడినట్లు వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి క్రమంగా కోలుకుంటున్నాడని, కీమో థెరపీ చేయించుకునే ప్రయత్నంలో కూడ ఉన్నాడని చెప్తున్నారు. స్పృహలో ఉండగా రోగికి ఆపరేషన్ చేయడం అనేది సుమారు పదేళ్లుగా జరుగుతోందని, అయితే వర్చువల్ రియాలిటీ అద్దాల వాడకం శస్త్ర చికిత్స సమయంలో వాడటం ఇదే మొదటిసారి అని డాక్టర్ మెనీ తెలిపారు. ఇలా చేయడంవల్ల రోగికి సంబంధించిన మాట, దృష్టి, కదలికలు చికిత్స సమయంలో స్పష్టంగా తెలుసుకోగలిగే అవకాశం ఉందంటున్నారు. పేషెంట్ కు ప్రత్యేక అనుభూతిని కల్గించడంకోసం కాదని, శస్త్ర చికిత్స సులభమవ్వడంకోసమే ఈ అద్దాలు వాడినట్లు వైద్యులు స్సష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో మెనీ బృందం... భవిష్యత్తులో మెదడు కణతిల ఆపరేషన్ కు ఇదే విధానాన్ని అమల్లోకి తేనున్నారు. త్వరలో పిల్లల చికిత్సలకు కూడ వచ్చువల్ రియాలిటీ గ్లాసెస్ వినియోగించే యోచనలో ఉన్నారు. -
రంగుల కల సాకారం
విశాఖపట్నం: జిల్లాలో ఏషియన్ పెయింట్స్ కర్మాగారం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. జిల్లాలో 110 ఎకరాల్లో రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఆ సంస్థ తమ యూనిట్‌ను స్థాపించనుంది. ఇందుకోసం ఏషియన్ పెయింట్స్ సంస్థకు అచ్యుతాపురం మండలం పూడి సమీపంలో 110 ఎకరాలు కేటాయించేందుకు ఏపీఐఐసీ ముందుకొచ్చింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏషియన్ పెయింట్స్ సంస్థ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. దాంతో కొంతకాలంగా ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్రణాళిక అమలుకు రంగం సిద్ధమైంది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్ 2 విస్తరణలో భాగంగా పూడి గ్రామంలో కొంతభాగాన్ని ఏపీఐఐసీ నాన్ ఎస్‌ఈజెడ్‌గా అభివృద్ధి చేస్తోంది. అందులో 110 ఎకరాలను కాంటినెంటల్ కార్బన్ అనే సంస్థకు గతంలో కేటాయించారు. కానీ ఆ సంస్థ చివరి నిముషంలో వెనక్కి వెళ్లిపోయింది. దాంతో ఆ 110 ఎకరాలను ఏషియన్ పెయింట్స్ సంస్థకు కేటాయించేందుకు ఏపీఐఐసీ గత ఏడాది డిసెంబర్లో ప్రతిపాదించింది. డిసెంబర్లోనే ఆ సంస్థ ప్రతినిధులు పూడి గ్రామంలో పర్యటించిన అన్ని అంశాలను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనకు ఏపీఐఐసీ సమ్మతించడంతో అక్కడ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించారు. రూ. 1,750కోట్ల పెట్టుబడితో... పూడిలో ప్లాంట్ కోసం రూ.1,750కోట్ల పెట్టుబడి పెట్టాలని ఏషియన్ పెయింట్స్ సంస్థ భావిస్తోంది. రోజుకు 4వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును నెలకొల్పాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. దీనివల్ల ప్రత్యక్షంగా 300మందికి, పరోక్షంగా 500మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భూమిని తమకు స్వాధీనం చేసిన ఏడాదిలోగా ప్లాంటు నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ యోచనగా ఉంది. -
చబ్బీ రియాల్టీ!
దీపం ఉండగానే ‘ఇల్లు’ చక్కబెట్టుకోవడమంటే ఇదేనేమో! నేము... ఫేము ఉండగానే... జాగ్రత్త పడుతోంది చబ్బీ బ్యూటీ హన్సిక. తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో ‘బిజీ’గా సంపాదించేస్తున్న ఈ చిన్నది... ముంబైలో ఇటీవలే స్థలం కొందట. అతికూడా... అంతా ఇంతా కాదు... అంతటి మహానగరంలో ఏకంగా ఎకరం కొనేసిందట. సిటీ అవుట్‌స్కర్ట్స్‌లోని వాడా వద్ద ఉందీ ఎకరం. ‘ఎంత కాలంగానో ప్రయత్నిస్తున్నా. చివరకు నేను కోరుకున్నట్టుగా ఓ చక్కని ఆహ్లాదకరమైన ప్లేస్‌లో ప్రాపర్టీ కొన్నా. ఇప్పుడే ఇల్లు కట్టడం లేదు. దానికి కొంత ఫండ్స్ కావాలి. నెమ్మదిగా మొదలు పెడతా’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. అమ్మడి ‘ఫ్యూచర్’ ప్లాన్‌కు ఇండస్ట్రీ అంతా హ్యాట్సాప్ చెబుతోంది. -
భవిష్యత్తు భాగ్యనగరం!
2022 నాటికి హైదరాబాద్ రియల్ అవసరాలపై జేఎల్ఎల్ నివేదిక 1.05 కోట్లకు చేరే నగర జనాభా.. 23 లక్షల ఇళ్ల కొరత 10 మిలియన్ చ.అ. షాపింగ్ మాల్ స్పేస్.. 65 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ అవసరం 3,838 పాఠశాలలు.. 9,100 ఆసుపత్రి పడకలూ అవసరమే 12,600 హెక్టార్లలో పార్కులు, మరో 6 ఆడిటోరియంలు కూడా.. 400 ఏళ్ల క్రితం భాగ్యనగరాన్ని కేవలం 5 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకొనే నిర్మించారు. కానీ, ఇప్పుడది దాదాపు 20 రెట్లు పెరిగింది. అది జనాభా పరంగానైనా.. విస్తీర్ణం పరంగానైనా..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే.. ఇరుకు రోడ్లు, మురికివాడలు, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, చుక్కలు చూపించే ట్రాఫిక్! అలాంటిది 2022 నాటికి భాగ్యనగరాన్ని తలచుకోవాలంటేనే భయమేస్తుంది కదూ!! ఐరోపా మాదిరిగా ఒక క్రమపద్ధతిలో పట్టణీకరణ జరగకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే 2022 నాటికి హైదరాబాద్ జనాభా, అప్పటి గృహ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు వంటి మౌలిక అవసరాలపై అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ అయిన జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్) ఓ నివేది కను రూపొందించింది. నివేదికలోని పలు అంశాలపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది. - సాక్షి, హైదరాబాద్ జనమే జనం... 2014వ సంవత్సరం నాటికి: 86 లక్షలు 2022వ సంవత్సరం నాటికి: 1.05 కోట్లు 1990వ సంవత్సరంలో 42 లక్షలుగా ఉన్న హైదరాబాద్ జనాభా 2014 నాటికి 86 లక్షలకు చేరింది. 2022 సంవత్సరానికి 1.05 కోట్లకు, 2030 నాటికి 1.28 కోట్లుకు చేరుకుంటుందని అంచనా. అయితే జనాభా మాదిరిగా మౌలిక వసతులు, గృహ అవసరాలు మాత్రం వృద్ధి చెందట్లేదు. నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. ఇళ్ల కొరత.. 2014వ సంవత్సరం : 19 లక్షలు 2022వ సంవత్సరం : 23 లక్షలు హైదరాబాద్‌లోని మొత్తం జనాభాలో ఉద్యోగస్తుల జనాభా 45.5 శాతం. వీరిలో సొంతిల్లు ఉన్న వాళ్లు కేవలం 19 లక్షలే. మరోవైపు నగరంలో దాదాపు 1,474 మురికివాడల్లో 25 లక్షల వరకూ జనాభా ఉంది. వీళ్లకు సొంతిల్లు సంగతి దేవుడెరుగు.. కనీసం తాగునీరు, డ్రైనేజీ, మెరుగైన రవాణా వంటి కనీస వసతులే కరువు. అద్దె ఇళ్లు అగ్గిపెట్టెలను తలపిస్తుంటాయి. చక్కటి పట్టణ ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2011 సంవత్సరంలో నగరంలో 16 లక్షలుగా ఉన్న ఇళ్ల కొరత.. 2014 నాటికి 19 లక్షలకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని సమగ్ర గృహ నిర్మాణాన్ని చేపట్టకపోతే 2022 నాటికి 23 లక్షలకు పైగానే చేరుకుంటుందని అంచనా. షాపింగ్ అంటే మోజు.. 2014వ సంవత్సరం: 2 మిలియన్ చ.అ. 2022వ సంవత్సరం: 8-10 మిలియన్ చ.అ. షాపింగ్ అంటే నగరవాసులకు ఎక్కడలేని వ్యామోహం. అందుకే ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా ఇంకా కొత్తగా నిర్మించే మాల్స్ వైపు ఆశగా ఎదురుచూసే వారికిక్కడ కొదవలేదు. ఇప్పటికే నగరంలో హైదరాబాద్ సెంట్రల్, ఇన్నార్బిట్ మాల్, జీవీకే వన్, సిటీ సెంటర్.. ఇలా సుమారు వందకు పైగా పెద్ద మాల్స్ 2 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి 8 నుంచి 10 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా. ఇప్పటికే 5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో వివిధ కంపెనీల షాపింగ్ మాళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి కూడా. ఆఫీస్ స్పేస్‌కూ గిరాకే.. 2014వ సంవత్సరం: 32 మిలియన్ చ.అ. 2022వ సంవత్సరం: 63-65 మిలియన్ చ.అ. స్థానిక రాజకీయాంశం కారణంగా నగరంలో ఆఫీసు స్పేస్ మార్కెట్ కొంతకాలం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. ఆరేడు నెలలుగా పరిస్థితి సానుకూలంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండిట్లోనూ స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడటమే ఇందుకు కారణం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 32 మిలియన్ చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. 2022 నాటికి ఇది 63 నుంచి 65 మిలియన్ చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కార్యాలయాల స్థలం ఏటా 5 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. రాజకీయాంశంతో సంబంధం లేకుండా ప్రజల అవసరాల్ని తీరుస్తాయి కాబట్టే చిల్లర వర్తక సముదాయాలకూ (రిటైల్ స్పేస్) డిమాండ్ పెరుగుతోంది. 2022 నాటికి నగరంలో 8 మిలియన్ చ.అ.ల్లో రిటైల్ స్పేస్ అవసరముంటుంది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గల అతిపెద్ద వీధుల్లో దుకాణాల అద్దెలూ స్వల్పంగా పెరగడానికి ఆస్కారం ఉంది. పార్కులూ అవసరమే.. 2022 నాటికి 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం.నగరవాసులకు అభివృద్ధితో పాటు ఆర్యోగం కూడా అవసరమే. పర్యావరణ సమతూకం ఉండాలంటే 33 శాతం విస్తీర్ణంలో అడవులు అవసరం. మన రాష్ట్రంలో అది 21 శాతం ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సగటు 9.5 శాతమే. అదీ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతా లను కలుపుకుంటేనే. దాన్ని మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 2-3 శాతం మించదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 142 హెక్టార్లలో, రంగారెడ్డిలో 70,295.87 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి పెరిగే నగర జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం ఉంటుంది. స్కూళ్లు, ఆసుపత్రులు కూడా.. 2022 నాటికి నగర జనాభా అవసరాల దృష్ట్యా ఇప్పుడున్న వాటి కంటే రెండింతల సంఖ్యలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆడిటోరియంలు అవసరముంటాయి. 2022 నాటికి సుమారు 10.92 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 9,100 ఆసుపత్రి పడకలు అవసరముంటాయి. అలాగే 54 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 3,838 పాఠశాలలు, 27 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 6 ఆడిటోరియంలు అవసరముంటాయని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు,న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
డీఎల్ఎఫ్కు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: రియల్టీలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తూ... అక్రమ వ్యాపార విధానాలను అనుసరించిందన్న కేసులో ఆ రంగంలో దిగ్గజ సంస్థ డీఎల్ఎఫ్కు అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) గతంలో విధించిన రూ.630 కోట్ల జరిమానాను అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని డీఎల్ఎఫ్ను ఆదేశించింది. మూడు వారాల్లో రూ.50 కోట్లను, మొత్తం డబ్బును మూడు నెలల్లో తన రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. తద్వారా సీఐఐ, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూలింగ్‌పై స్టేకు ససేమిరా అంది. విచారణకు మాత్రం డీఎల్ఎఫ్ అప్పీల్‌ను అడ్మిట్ చేసింది. అప్పీల్ పెండింగ్‌లో ఉండగా రూ.630 కోట్లు డిపాజిట్ చేయాల్సిన డీఎల్ఎఫ్, ఒకవేళ అప్పీల్లో తనకు వ్యతిరేకంగా తీర్పువచ్చే మొత్తం నిధులపై 9 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2011, నవంబర్ 9వ తేదీన సీఐఐ ఈ కేసులో తన ఉత్తర్వులు వెలువరించినప్పటి నుంచి వడ్డీ చెల్లింపు వర్తిస్తుంది. డిపాజిట్‌ను చెల్లించడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని డీఎల్ఎఫ్ కోరినప్పటికీ, దీనిని సుప్రీం తిరస్కరించింది. డీఎల్ఎఫ్ డిపాజిట్ చేసిన మొత్తాన్ని జాతీయ బ్యాంకు ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివరాలు ఇవీ... ఈ కేసులో సుప్రీంలో రెస్పాండెంట్లుగా రెసిడెంట్స్ అసోసియేషన్‌తో పాటు హర్యానా ప్రభుత్వం, హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌యూడీఏ) ఉన్నాయి. గుర్గావ్లోని బెలైరీ ఓనర్స్ అసోసియేషన్ (కొనుగోలుదారుల అసోసియేషన్) 2010 మేలో డీఎల్‌ఎఫ్‌పై ఒక ఫిర్యాదుచేసింది. వ్యాపారంలో గుత్తాధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ, నిబంధనలను సంస్థ పట్టించుకోలేదని కొనుగోలుదారులు పేర్కొన్నారు. అపార్ట్మెంట్స్ కేటాయింపుల్లో పూర్తి ఏకపక్ష ధోరణిని సంస్థ అవలంబించిందనీ, అసమంజస, అర్థంలేని నిబంధనలను విధించిందని బెలైరీ ఓనర్స్ అసోసియేషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇవి కొనుగోలుదారుల హక్కులకు పూర్తిగా విఘాతం కలుగజేసినట్లు అసోసియేషన్ సీఐఐకి విన్నవించింది. 2013-14లో డీఎల్ఎఫ్ ఆదాయం రూ.8,298 కోట్లు. ఈ మొత్తంలో రూ.630 కోట్లు 7.5 శాతానికి సమానం. మెరిట్స్‌పై విశ్వాసం: డీఎల్ఎఫ్ సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసా పాటిస్తామని డీఎల్ఎఫ్ పేర్కొంది. ఈ కేసులో మెరిట్స్ పట్ల తనకు పూర్తి విశ్వాసముందని సైతం పేర్కొంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల కాపీ కోసం ఎదురుచూస్తున్నట్లు బీఎస్ఈకి సమర్పించిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది. నష్టాల్లో కంపెనీ షేరు... సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు బుధవారం భారీ నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోల్చితే 4.44 శాతం (రూ.8.50) దిగజారి, రూ.183.05 వద్ద ముగిసింది.