గూగుల్ లెన్స్ మరింత స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు మీ చర్మం కండీషన్‌ను పరిగట్టేస్తుంది. ఒక్క ఫొటో తీసి పెడితే చాలు స్కిన్ కండీషన్ ఏంటో చెప్పేస్తుంది. మన చర్మానికి ఏదైనా సమస్య ఉండి దాన్ని ఏమని పిలుస్తారో తెలియని సందర్భంలో దానికి సంబంధించిన ఫొటోను గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే ఆ రుగ్మత పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలియజేస్తుంది. అయితే ఇది యూజర్ల సమాచారం కోసం మాత్రమే. దీన్ని వ్యాధి నిర్ధారణగా పరిగణించకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
సమస్య ఏంటో చెప్పేస్తుంది..
శరీర భాగాల్లో చర్మంపై ఎక్కడైనా ఏదైనా సమస్యగా అనిపిస్తే దాన్ని ఫొటో తీసి గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే దానికి సంబంధించిన అలాంటి విజువల్ సమాచారం వస్తుంది. ఉదాహరణకు చర్మంపై దద్దుర్లు, వాపు, వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ సాయంతో తెలుసుకోవచ్చు.
మరింత స్మార్ట్‌గా..
ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ లెన్స్ స్మార్ట్‌గా మారుతోంది. ముందుగా గూగుల్ లెన్స్ యూజర్లకు పేరు తెలియని ఏవైనా సాధారణ వస్తువులను విశ్లేషించడంలో సహాయపడుతుంది. అలాగే వాక్యాలను కూడా అనువదించే సామర్థ్యాన్ని ఇందులో జోడించారు. మనకు తెలియని వాక్యాలను గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా ఫొటో తీసి మనకు కావాల్సిన భాషలోకి వాటిని అనువదించుకోవచ్చు. వీటితోపాటు గూగుల్ మ్యాప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఆర్ శక్తిని జోడిస్తోంది గూగుల్. దీని సాయంతో మన చుట్టూ ఉన్న కొత్త స్థలాలను కనుగొనడానికి, యూజర్లు తమకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌లు, కేఫ్‌లు వంటివి శోధించవచ్చని గూగుల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment