conditions
-
Supreme Court of India: ఇవేం బెయిల్ షరతులు!
న్యూఢిల్లీ: వైవాహిక విభేదాల కేసుల్లో ముందస్తు బెయిల్ షరతుల విషయంలో కోర్టులు అసాధ్యమైన షరతులు విధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. వరకట్న నిషేధ తదితర చట్టాల కింద ఆరోపణలెదుర్కొంటున్న ఓ వ్యక్తికి పట్నా హైకోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులపై ధర్మాసనం శుక్రవారం విస్మయం వెలిబుచ్చింది. దంపతులు కలిసుండేందుకు ఒప్పుకోవడంతో దిగువ కోర్టు వారిని ఉమ్మడి అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకునే షరతుపై పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు అంగీకరించింది. అయితే, ‘గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, ఆమె శారీరక, ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చుతానని హామీ ఇవ్వండి’ అని షరతు పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ షరతును తొలగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆచరణ సాధ్యం కాని షరతులను ఇవ్వొద్దని కోర్టులకు సూచించింది. గౌరవంగా జీవించే హక్కును గుర్తించాలని, విచారణ న్యాయబద్ధంగా సాగేలా చూడాలని కోరింది. -
తల్లికి 'వంచన'.. తల్లులను నమ్మించి మోసం చేస్తున్న బాబు
-
మంచుకొండల్లో మృత్యుఘోష
శివాజీనగర: హిమాలయ పర్వతాల్లో విహారయాత్రకు వెళ్లిన కన్నడిగులకు చేదు అనుభవం ఎదురైంది. నిత్య జీవితంలో ఒత్తిళ్ల నుంచి దూరంగా పర్వతారోహణకు వెళ్తే పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీలో తెహరి జిల్లా సరిహద్దు భాగాల్లో మంచుకొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్నవారిలో కర్ణాటకకు చెందిన 18 మందితో పాటుగా 22 మంది వర్షం, మంచు, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. వారిలో 5 మంది మృతి చెందగా, పలువురు మిస్సయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ముమ్మరంగా సహాయక చర్యలు మంగళవారం రాత్రి నుంచి అక్కడి ప్రభుత్వం సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. కర్ణాటకకు చెందిన పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. సౌమ్య వివేక్ (37) వినయ్ కృష్ణమూర్తి (47) శివజ్యోతి, సుధాకర్, బీ.ఎన్.నాయుడు (64), సతి గురురాజ్ (40), సీనా (48)తో పాటుగా పలువురిని కాపాడినట్లు తెలిపారు. 9 మంది అదృశ్యం? బెంగళూరుకు చెందిన సుజాత (52), పదిని హెగ్డే (35), చైత్ర (48), సింధు (45) వెంకటేశ్ ప్రసాద్ (55), అనిత (61), ఆశా సుధాకర్ (72), పద్మనాభ్ కేపీఎస్ (50), వినాయక్ (52) అదృశ్యమైనట్లు ఉత్తరాఖండ్ అధికారులు ప్రకటించారు. 13 మంది ఆరోగ్యం విషమంగా ఉండగా వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెల 29 నుంచి ట్రెక్కింగ్ ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ద్వారా వారు హిమాలయాల అధిరోహణకు మే 29వ తేదీన వెళ్లినట్లు తెలిసింది. వారు జూన్ 7వ తేదీన తిరిగి రావాలి. అయితే మార్గమధ్యలో సహస్రతాల్ అనే చోట విపరీతమైన మంచు తుపాను, చలిగాలుల్లో వారు చిక్కుకుపోయారు. ఆ బృందంలో 18 మంది బెంగళూరు వాసులు, ఒకరు పూణెవాసి, ముగ్గురు స్థానిక గైడ్లు ఉన్నారు. మంత్రి కృష్ణభైరేగౌడ బాధితులకు సహాయం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. #TrekkingTragedy 9 #Bengalureans, who were part of a 22-member trekking team, #died following bad weather at Sahastra Tal in #Uttarakhand.#Rescue operations launched 👇#Karnataka’s revenue minister @krishnabgowda rushes to rescue site. pic.twitter.com/dKDNufdjiw— TOI Bengaluru (@TOIBengaluru) June 5, 2024 -
ఈ పేర్లు పిల్లలకు పెడితే జైలుకే?
ఏ ఇంటిలోనైనా పిల్ల లేదా పిల్లవాడు పుడితే... ఏం పేరు పెట్టాలా?.. అని కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు. ఎవరికితోచిన పేరు వారు సూచిస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కలవారు అందరూ రకరకాల పేర్లను చెబుతుంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లల పేర్లకు సంబంధించి అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పేర్లను నిషేధించిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఆయా దేశాల్లో నిషేధించిన పేరు పెట్టినట్లయితే, వారు జైలు శిక్షను కూడా అనుభవించాల్సిరావచ్చు. ‘డైలీ స్టార్’తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లో పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై నిషేధం లేదు. అయితే రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తానేది తప్పకుండా గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేయాలి. పేరు చాలా పొడవుగా ఉండకూడదు. అది రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్‌లో సరిపోయినంతవరకే ఉండాలి. పేరు చాలా పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. అమెరికన్ జనన ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం పిల్లలకు కింగ్, క్వీన్, జీసస్ క్రైస్ట్, III, శాంతా క్లాజ్, మెజెస్టీ, అడాల్ఫ్ హిట్లర్, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఏ దేశంలో ఏ పేరుపై నిషేధం? సెక్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్) లిండా (సౌదీ అరేబియా) స్నేక్ (మలేషియా) ఫ్రైడే (ఇటలీ) ఇస్లాం (చైనా) సారా (మొరాకో) చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్) రోబోకాప్ (మెక్సికో) డెవిల్ (జపాన్) నీలం (ఇటలీ) సున్తీ (మెక్సికో) ఖురాన్ (చైనా) హ్యారియెట్ (ఐస్లాండ్) మంకీ (డెన్మార్క్) థోర్ (పోర్చుగల్) 007 (మలేషియా) గ్రిజ్మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) తాలులా హవాయి (న్యూజిలాండ్) బ్రిడ్జ్(నార్వే) ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ) మెటాలికా (స్వీడన్) ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్) అనల్ (న్యూజిలాండ్) నుటెల్లా (ఫ్రాన్స్) వోల్ఫ్ (స్పెయిన్) టామ్-టామ్ (పోర్చుగల్) కెమిల్లా (ఐస్లాండ్) జుడాస్ (స్విట్జర్లాండ్) డ్యూక్ (ఆస్ట్రేలియా) -
రూ. 129కే అన్లిమిటెడ్ మూమూస్.. కండీషన్స్ అప్లై!
‘మూమూస్’... ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఇష్టమైన చిరుతిండి. ఈ స్నాక్స్‌ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. పైగా మూమూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఆహార ప్రియులు మూమూస్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి.. రూ. 125కే అన్లిమిటెడ్ మూమూస్ ఎక్కడైనా దొరికితే.. ఎవరైనా ఈ ఆఫర్ వదులుకుంటారా? దేశ రాజధాని ఢిల్లీలో లెక్కకు మించిన మూమూస్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల మూమూస్ అందుబాటులో ఉంటాయి. పలువురు దుకాణదారులు కొత్త ప్రయోగాలు చేస్తూ రకరకాల మూమూస్ను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఒక మూమూస్ దుకాణంలో బంపర్ ఆఫర్ నడుస్తోంది. కేవలం రూ. 129కే ఎవరికి నచ్చినన్ని మూమూస్ వారు తినవచ్చు. ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిన దుకాణం ఢిల్లీలోని తిలక్ నగర్ జైలు రోడ్డులో ‘ఎస్జీఎఫ్’ పేరుతో ఉంది. ఈ షాప్ మేనేజర్ దీప్ సింగ్ తాము అపరిమిత మూమూస్ ఆఫర్ అందిస్తున్నామని చెప్పారు. తాము రకరకాల మూమూస్ తయారు చేస్తున్నామని, వారంలోని అన్ని రోజుల్లోనూ ఈ బంపర్ ఆఫర్‌తో మూమూస్ అందిస్తున్నామని తెలిపారు. అయితే ఈ అపరిమిత మూమూస్ ఆఫర్ అందుకోవాలంటే ఒక కండీషన్ ఉన్నదన్నారు. రూ. 129కు ఒక ప్లేట్ మూమూస్ కొనుగోలు చేసి, దానిని తినేశాక నచ్చినన్నిసార్లు ప్లేటును రీఫిల్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేట్‌ను మరొకరితో షేర్ చేసుకోకూడదని, ఒక్క మూమూస్ కూడా వృథా చేయకూడదన్నారు. ఒకవేళ ప్లేట్ మూమూస్ను ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అందుకు విడిగా నగదు చెల్లించాలన్నారు. -
కార్డులు ఎక్కువైతే చిక్కులేనా..?
ఆరాధన (31) ఐటీ ఉద్యోగి. ప్రయాణాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పర్యటనకు సిద్ధమైపోతుంది. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన సందర్భంలో క్రెడిట్ కార్డ్ కంపెనీ సేల్స్ ఉద్యోగి ఆమెకు ఎదురుపడ్డాడు. మంచి ఫీచర్స్‌తో కూడిన క్రెడిట్ కార్డ్ అంటూ.. అందులోని ఉపయోగాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాడు. నిజానికి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్న ఆసక్తి ఆరాధ్యకు ఎంతమాత్రం లేదు. కానీ, ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదని, దేశీయంగా ప్రీమియం ఎకానమీ విమాన టికెట్ల కొనుగోలుపై మూడు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తుందని చెప్పగా, ఆ పాయింట్ ఆమెకు ఎంతో నచి్చంది. దీనికితోడు షాపింగ్ చేసిన ప్రతి సందర్భంలో సాధారణ రివార్డ్ పాయింట్లు వస్తాయని చెప్పాడు. దీంతో అప్లికేషన్‌పై సంతకం చేసి ఇచ్చేసింది. కార్డు చేతికి వచి్చన ఏడాది తర్వాత కానీ, వాస్తవాలు ఆమెకు తెలియలేదు. కార్డ్ కంపెనీ వార్షిక రుసుము అంటూ రూ.3,000 చార్జ్ చేసింది. సేల్స్ ఏజెంట్ చెప్పినట్టు సదరు క్రెడిట్ కార్డ్ జీవిత కాలం ఉచితమేమీ కాదని అర్థమైంది. అప్పుడు కార్డ్ నిబంధనలు, షరతులు చదివిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు ఆ కార్డ్ తన అవసరాలను తీర్చేది కాదని. వార్షిక ఫీజు మినహాయించాలంటే కార్డ్ కంపెనీ పెట్టిన లక్ష్యం మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఆర్థిక సంబంధ నిర్ణయం తీసుకునే ముందు (కొనుగోళ్లు, పెట్టుబడులు) పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఆరాధ్యకు ఎదురైన అనుభవమే నిదర్శనం. తమ అవసరాలకు అనుకూలమైన క్రెడిట్ కార్డ్‌కే పరిమితం కావాలని ఇది సూచిస్తోంది. క్రెడిట్ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు చూసి చాలా మంది ఒకటికి మించిన కార్డులు తీసుకుంటూ ఉంటారు. అసలు ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి..? క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఏం చూడాలి? ఒకటికి మించిన కార్డులు ఉంటే ఎలా నడుచుకోవాలి..? ఈ విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం. ఏ అవసరం కోసం..? కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారు ముందు తమ అవసరాలు ఏంటో తేల్చుకోవాలి. రుణాలకు కొత్త వారు అయి, మంచి క్రెడిట్ స్కోరును నిర్మించుకోవాలని అనుకునే వారు తక్కువ ఫీజుతో కూడిన ప్రాథమిక స్థాయి క్రెడిట్ కార్డ్‌కు పరిమితం కావాలి. అప్పటికే దెబ్బతిన్న క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవాలని అనుకుంటే, అప్పుడు సెక్యూర్డ్ కార్డ్‌ను తీసుకుని వినియోగించుకోవడం సరైనది. ఒకటికి మించి కార్డులు ఉంటే, అప్పుడు అవి తీర్చలేని అవసరాలతో కూడిన కొత్త కార్డ్‌ను తీసుకోవచ్చు. కొన్ని కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌మైల్స్ లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, అన్నీ కలిపి బండిల్‌గా ఇస్తుంటాయి. ఈ రివార్డ్‌లు తమకు ఎంత వరకు ఉపయోగమన్నది ఆలోచించుకోవాలి. తమ అవసరాలకు అనుకూలమంటే తీసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లలో లాంజ్ సేవలను ఉచితంగా అందించే కార్డులు కూడా ఉన్నాయి. విదేశీ లావాదేవీలపై ఫీజుల్లేని, సినిమా టికెట్లపై, రెస్టారెంట్ చెల్లింపులపై అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేసే కార్డుల్లో తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. వినియోగం ముఖ్యం.. కార్డుతో వినియోగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ప్రతి నెలా వినియోగించుకున్నంత మేర పూర్తిగా తిరిగి చెల్లిస్తారా..? లేక బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేస్తారా.? కనీస మొత్తాన్ని చెల్లించి, మిగిలిన బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు తక్కువ వడ్డీ రేటును చార్జ్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. పరిమిత బడ్జెట్‌తో కుటుంబాన్ని నడిపించే వారికి తక్కువ రేటు వసూలు చేసే కార్డ్‌లు అనుకూలం. దీర్ఘకాలంలో వీటితో ఎంతో ఆదా చేసుకోవచ్చు. యూజర్లు కార్డ్‌తో ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్నది విశ్లేíÙంచుకోవాలని మై మనీ మంత్ర మార్కెట్ ప్లేస్ ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. కార్డుల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు. ‘‘తరచూ ప్రయాణించే వారు ఎయిర్‌మైల్స్ లేదా హోటల్ పాయింట్లను ఆఫర్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. కార్డుపై అయ్యే వ్యయాలతో పోలిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉండాలన్నది మర్చిపోవద్దు. ఒకటికి మించిన ప్రయోజనాలు ఆఫర్ చేసే కార్డులకు వార్షిక ఫీజు ఉంటుంది. కనుక ఆయా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేట్టు అయితేనే సదరు కార్డులు తీసుకోవాలి. అప్పుడే వార్షిక ఫీజు చెల్లించడం ప్రయోజనకరంగా అనిపిస్తుంది’’అని రాజ్ ఖోస్లా సూచించారు. ఖర్చులు–ప్రయోజనాలు కార్డు వార్షిక ఫీజు కంటే వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉండాలి. ఏటా ఇంత ఖర్చు చేస్తేనే వార్షిక రుసుము మినహాయింపు అనే షరతు ఉంటే.. మీ వినియోగం అదే స్థాయంలో ఉంటుందా? అన్నది చూసుకోవాలి. కార్డ్‌ను తక్కువగా వినియోగించుకునే వారికి వార్షిక రుసుముతో వచ్చేవి అనుకూలం కాదు. కార్డులు సాధారణంగా వార్షిక రుసుం, యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్), బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఫీజు, విదేశీ లావాదేవీల రుసుంతో వస్తాయి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ అంటే.. ప్రతి నెలా కార్డ్ బిల్లుపై కొంత మొత్తం చెల్లించి, క్యారీ ఫార్వార్డ్ చేసుకునే మిగిలిన బ్యాలన్స్‌పై అమలు చేసే వడ్డీ రేటు. క్రెడిట్ స్కోరు, కార్డు ఏ రకం అన్న దాని ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. కనుక ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించలేని వారికి తక్కువ ఏపీఆర్ ఉండే కార్డు అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం అధిక శాతం మంది కార్డ్ కస్టమర్లు తాము పొందే రివార్డులతో పోలిస్తే కార్డు కంపెనీకి చెల్లించే ఫీజులు, వడ్డీయే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ‘‘కార్డ్ సంస్థ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఫీజుల కంటే మెరుగ్గా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలి. తక్కువ రివార్డులు, అధిక వార్షిక ఫీజుతో కూడిన ప్రాథమిక క్రెడిట్ కార్డ్ ఏమంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో తక్కువ వార్షిక ఫీజుతో లేదా అసలు వార్షిక ఫీజు లేని కార్డులు ఎన్నో ఉన్నాయి’’అని పైసా బజార్ క్రెడిట్ కార్డుల విభాగం హెడ్ రోహిత్ చిబ్బార్ పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారు అంతర్జాతీయ లావాదేవీలకు చార్జ్ వసూలు చేయని కార్డులు తీసుకోవడం లాభదాయకమని సూచించారు. అలాగే, రివార్డుల శాతాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అన్ని రకాల కొనుగోళ్లపై ఫ్లాట్ 2 శాతం చొప్పున రివార్డులు ఆఫర్ చేస్తుంటే, అది మంచి డీల్ అవుతుంది. ఎన్ని కార్డులు..? ఒకరికి ఎన్ని కార్డులు ఉండాలన్న దానికి ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కువ కార్డ్‌లు ఉంటే, వాటితో పాటు రిస్‌్కలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. ‘‘ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, విడిగా ఒక్కో దానిని సరైన రీతిలో వినియోగిస్తూ గరిష్ట స్థాయిలో ఆదా చేసుకోవాలి’’ అని చిబ్బార్ పేర్కొన్నారు. ప్రతి కార్డ్‌కు ఉండే బిల్లింగ్ సైకిల్‌కు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు నెలవారీ నగదు ప్రవాహాలను తెలివిగా వినియోగించుకోవచ్చన్నారు. విడిగా ఒక్కో కార్డ్‌లో వినియోగించకుండా మిగిలిపోయిన లిమిట్, అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. ఒకటికి మించిన కార్డులు కలిగిన వారు, సరైన రీతిలో ఉపయోగించుకోకుండా, ఎక్కువగా వాడేస్తే అది రుణ ఊబిలోకి తీసుకెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లిమిట్‌తో ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం, అన్నింటినీ గరిష్ట పరిమితి మేరకు వినియోగిస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు మంచిది కాదు. ఎందుకంటే అది అధిక రిస్క్‌కు దారితీస్తుంది. సంఖ్యతో సంబంధం లేకుండా తమ అవసరాలకు పక్కాగా నప్పే కార్డ్ ఉండాలన్నది ప్రాథమిక నియమం. ఎక్కువగా ప్రయాణించని వారికి ట్రావెల్ ప్రయోజనాలతో కూడిన క్రెడిట్ కార్డుతో వచ్చేదేమీ ఉండదు. కార్డులు ఎక్కువైతే వార్షికంగా చెల్లించే ఫీజులు, నికరంగా ఒరిగే ప్రయోజనం ఎంతన్న విశ్లేషణ అవసరం. ఎన్ని కార్డులు ఉన్నా, ఎంత వినియోగించుకున్నా, గడువులోపు పూర్తి బిల్లు చెల్లించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అది రుణ పరపతిపై ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. కార్డును సమీక్షించుకోవాలి.. క్రెడిట్ కార్డ్ తీసుకునే సమయంలో చెప్పిన ప్రయోజనాలు ఎప్పటికీ కొనసాగుతాయని అనుకోవద్దు. కార్డ్ సంస్థ ఎప్పుడైనా అందులోని ప్రయోజనాల్లో మార్పులు చేయవచ్చు. ఈ విషయాలను ఈ మెయిల్ రూపంలో తెలియజేస్తాయి. కార్డ్ కంపెనీల నుంచి వచ్చే మెయిల్స్‌ను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఏడాదిలో రెండు సార్లు అయినా, క్రెడిట్ కార్డు నియమ, నిబంధనలు, ప్రయోజనాలను సమీక్షించుకోవాలి. రివార్డ్ పాయింట్లను కూడా రెడీమ్ చేసుకోవాలి. లేదంటే అవి కాలం చెల్లిపోయే ప్రమాదం ఉంటుంది. మారిన నియమ, నిబంధనల ప్రకారం ఇక మీదట సంబంధిత క్రెడిట్ కార్డ్ ప్రయోజనకరం కాదని గుర్తిస్తే, దాన్ని రద్దు చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేసుకుంటే, అది తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకూలతలు ► ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, అప్పుడు ఒక్కో కార్డు వారీ వినియోగించుకునే పరిమితి 50 శాతం మించకుండా చూసుకోవచ్చు. ఇది క్రెడిట్ స్కోర్‌కు అనుకూలం. ►ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతూ, అన్ని బిల్లులను గడువులోపు చెల్లించేట్టు అయితే క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు దారితీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు వేగంగా, ఆకర్షణీయమైన రేటుకు లభిస్తాయి. ►క్రెడిట్ కార్డ్ సంస్థలు ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉన్న వారికి అదనపు లిమిట్ ఆఫర్ చేస్తుంటాయి. అత్యవసరాల్లో ఈ అదనపు పరిమితి ఉపయోగపడుతుంది. మరిన్ని రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందుకోవచ్చు. ప్రతికూలతలు ►ఒకటే కార్డ్ ఉంటే వినియోగ నిష్పత్తి (కార్డ్ యుటిలైజేషన్ రేషియో) గరిష్ట స్థాయిలో ఉంటుంది. ►ఒకటికి మించి కార్డులు ఉంటే ప్రతీ కార్డ్ బిల్లును పరిశీలిస్తూ, గడువులోపు వాటి బిల్లులు చేయడం కొంత అదనపు శ్రమతో కూడినది. కార్డ్‌లు ఎక్కువై, సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే అది స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ►ఒకటికి మించి కార్డ్‌లు ఉంటే, క్రమశిక్షణతో, వివేకంగా వినియోగించుకోకపోతే అది రుణ ఊబిలో చిక్కుకునేందుకు కారణమవుతుంది. ►అవసరం లేకుండా ఎక్కువ కార్డులు నిర్వహిస్తుంటే, వాటికి చెల్లించే ఫీజుల రూపంలో నష్టపోవాల్సి వస్తుంది. -
ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడు నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులకు అదనంగా ఎలాంటి షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎక్కడా బహిరంగ ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయరాదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. అలాగే బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆయన్ను ఆదేశించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులకు అదనంగా తాజా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించకుండా చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సహేతుక ఆంక్షలే.. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స నిమిత్తం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధించిన షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు కేవలం అరోగ్య పరిస్థితి ఆధారంగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తాజా ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడనికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. ‘చంద్రబాబును చూడకుండా ప్రజలను నియంత్రిస్తూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. మధ్యంతర బెయిల్ పిటిషన్లో చంద్రబాబు ఎక్కడా ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరలేదు. మెడికల్ బెయిల్‌కు అదనంగా బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు చంద్రబాబు అనుమతి కోరి ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మా ముందున్న ఆధారాలను పరిశీలించిన తరువాత రాజకీయ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా చంద్రబాబును ఆదేశించేందుకు ఈ కోర్టు సుముఖత చూపుతోంది. ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులను హరించడం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది కోర్టు విధిస్తున్న సహేతుక ఆంక్ష మాత్రమే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో ఈ నెల 31న విధించిన షరతులకు అదనంగా ఈ షరతులు విధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సీఐడీ పిటిషన్
-
మీడియాతో మాట్లాడొద్దు
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మానవతా దృక్పథం, ఆరోగ్య సమస్యల దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించింది. సీఐడీ అనుబంధ పిటిషన్‌పై తీర్పు వెలువడేంత వరకు ఆయన మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. ర్యాలీల్లో పాల్గొనకూడదని, ఈ కేసు గురించి బహిరంగంగా కూడా మాట్లాడవద్దని చంద్రబాబును ఆదేశించింది. చంద్రబాబుకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. మరిన్ని అదనపు షరతులు విధించాలని కోరారు. ఆ షరతులేమిటో లిఖితపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి చెప్పారు. దీంతో సీఐడీ ఓ అనుబంధ పిటిషన్ రూపంలో వాటిని కోర్టు ముందుంచింది. ఈ అనుబంధ పిటిషన్‌పై లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు సుముఖత వ్యక్తం చేయలేదు. అదనపు షరతులకు అంత తొందరేముందని ప్రశ్నించారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వారి వాదనలు విన్న తరువాత నిర్ణయం చెబుతానన్నారు. ఉదయం మద్యం కుంభకోణంలో చంద్రబాబుకు లంచ్‌మోషన్ ఇచ్చి తమకు ఇవ్వకపోవడం ఎంతమాత్రం సరికాదని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. దీంతో న్యాయమూర్తి లంచ్‌మోషన్‌కు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం అతికష్టం మీద సీఐడీ అనుబంధ పిటిషన్ విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానంద, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరులో సుప్రీంకోర్టు నిర్దేశించిన షరతులను చంద్రబాబుకు వర్తింపజేయాలని సుధాకర్‌రెడ్డి కోరారు. రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చంద్రబాబును ఆదేశించాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ముందు మాట్లాడకుండా నిరోధించాలన్నారు. వైద్య చికిత్సకు మాత్రమే పరిమితమయ్యేలా చూడాలన్నారు. కేసుల విషయంలో ఆయనకు, ఇతర నిందితులకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కూడా ఆదేశాలు జారీ చేయాలన్నారు. చంద్రబాబు వెంటే ఉండి, ప్రతి రోజూ ఆయన కార్యకలాపాలను కోర్టుకు నివేదించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలని కోరారు. దీనిపై చంద్రబాబు కౌంటర్ దాఖలు చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. దీనికి సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఎప్పుడో నిర్ణయం వెలువరిస్తామంటే ఎలా అని అన్నారు. చంద్రబాబు బయటకు వచ్చి ర్యాలీలు తీసి రాద్ధాంతం చేసిన తరువాత అదనపు షరతులు విధిస్తే ప్రయోజనం ఉండదన్నారు. అదనపు షరతులు తాము సృష్టించినవి కావన్నారు. మీరు (న్యాయమూర్తి) చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సత్యేంద్రజైన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారని, ఆ తీర్పు లోనే సుప్రీం పలు షరతులను విధించిందని తెలి పారు. ఆ తీర్పు ఆధారంగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు అదే తీర్పులోని షరతు లను కూడా విధించాలన్నారు. తీర్పును మొత్తంగా వర్తింపజేయాలే తప్ప, కొంత భాగాన్ని వర్తింపజేసి, కొంత వదిలేస్తామంటే ఎలా అని అన్నారు. తీర్పులో ఏం రాయాలో మీరు కోర్టును శాసించలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తాను శాసించడం లేదని, తీర్పు పూర్తి పాఠాన్ని వర్తింపజేయాలని మాత్రమే కోరుతున్నానని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ‘అలా అయితే నిన్ననే (సోమవారం) వాదనల సందర్భంగా షరతులు చెప్పి ఉండాల్సింది. నేను అప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేది.’ అని న్యాయమూర్తి అన్నారు. ‘మీరు వారికి అనుకూలంగా తీర్పునిస్తారని ముందే అనుకునేందుకు నేనేమైనా జ్యోతిష్యుడి వద్దకు వెళ్లానా? మీరు ఉత్తర్వులు జారీ చేసిన తరువాతే కదా ఎలాంటి షరతులు విధించారో మాకు తెలిసింది. అలాంటప్పుడు ముందే మేం ఎలా షరతుల గురించి చెప్పగలం’ అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. చిదంబరం కేసులో కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులను నిర్దేశించిందని సుధాకర్‌రెడ్డి వివరించారు. సుప్రీం తీర్పులో ఏ భాగాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నది తన విచక్షణాధికారానికి సంబంధించినదని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీం తీర్పును అందరూ అనుసరించాల్సిందేనని, అలా చేయని పక్షంలో అదనపు షరతుల కోసం తాము దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సుధాకర్‌రెడ్డి కోర్టును కోరారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తానిచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే, సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని న్యాయమూర్తి చెప్పగా.. తాము ఆ పని కచ్చితంగా చేస్తామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. అదనపు షరతుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిందేనని పట్టుబట్టారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, కేసు గురించి కాక మిగిలిన రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ నాయకుడని, ఆయన రాజకీయాల గురించి మాట్లాడకుండా ఎలా ఉండగలరని అడిగారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, కొద్దిసేపటి తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. అనంతరం అదనపు షరతులు విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. సీఐడీ అనుబంధ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
నవంబర్ 28 సాయంత్రం 5 లోపు లొంగిపోవాలి.. లేదంటే..
-
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుంది: న్యాయవాదులు
-
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
నిర్మల్ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ ప్లాట్ ఫాం యాప్‌పై అవగాహన కల్పించారు. ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌పేజీలో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి. ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్ మైక్, బిట్స్‌పిలానీ ప్రొఫెసర్ మోహన్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ ఏఐ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక స్థితిపై.. విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్ అన్నారు. ఈ యాప్ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్ పిలానీ ప్రొఫెసర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
పాలమూరుకు లైన్ క్లియర్!
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి.. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ సాక్షి, హైదరాబాద్: కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం..’’అని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడుగా సాధించిన ఫలితం ఇదని.. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భంగా మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని అభివర్ణించారు. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఈఏసీ) పలు షరతులతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫార్సు చేసింది. గత నెల 24న జరిగిన సమావేశం నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. దీంతో త్వరలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ కానున్నాయి. రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్ల ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించనుంది. ఆ అధికారులపై చర్యలు తీసుకున్నాకే.. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులను చేపట్టినందుకుగాను.. ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందే ఈ చర్యల వివరాలను సమర్పించాలని.. అనుమతులు జారీ చేసే వరకు పనులేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది. రూ.106 కోట్ల జరిమానా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో.. పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను నీటిపారుదల శాఖ ఉల్లంఘించినట్టు నిపుణుల మదింపు కమిటీ గతంలోనే నిర్థారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ క్రమంలో.. పర్యావరణ పునరుద్ధరణకు రూ.72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ.40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ.40.8 కోట్లు కలిపి మొత్తం రూ.153.7 కోట్లతో ఎస్ఓపీ ప్రణాళికలు అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా.. నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ మొత్తానికి ఐదేళ్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించింది. ఇక అనుమతులు లేకుండానే రూ.21,200 కోట్లతో పనులు చేసినందున.. నిబంధనల ప్రకారం అందులో 0.5శాతం (రూ.106 కోట్లు) జరిమానాగా పీసీబీకి చెల్లించాలని ఆదేశించింది. కోర్టు కేసుల చిక్కులు తొలగినట్టే! పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. అయినా పనులు కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానకి రూ.920.85 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలను మాత్రమే తరలించేలా ప్రాజెక్టు పనులకు సుప్రీం నుంచి అనుమతులు పొందింది. కానీ ఏకంగా 120 టీఎంసీల నీటి తరలింపునకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని ధ్రువీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలకు ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖవర్గాలు ఆందోళనలో పడ్డాయి. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరగనుండగా.. ఆలోపే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. నిపుణుల కమిటీ షరతుల్లో ముఖ్యమైనవి పర్యావరణ/సామాజిక నష్టాన్ని నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించాలి. మూడేళ్లలోగా రూ.153.7 కోట్లతో నష్ట నివారణ ప్రణాళిక అమలు పూర్తి చేయాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నష్ట నివారణ చర్యలుండాలి. అన్ని రిజర్వాయర్లకు 500 మీటర్ల దూరం వరకు పెద్దెత్తున మొక్కలు నాటి అందులో కనీసం 90శాతాన్ని సంరక్షించాలి. వాటర్షెడ్ల అభివృద్ధి ప్రణాళిక, వన్యమృగాల సంరక్షణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ఉద్యోగాలు, ఇతర అవకాశాల్లో స్థానిక గ్రామస్తులకు, నిర్వాసితుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎల్రక్టీ్టషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి వృత్తుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లు అందజేయాలి. ప్రభావిత గ్రామాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి. -
స్కిన్ స్పెషలిస్ట్! ఒక్క ఫొటో చాలు.. మరింత స్మార్ట్‌గా గూగుల్ లెన్స్
గూగుల్ లెన్స్ మరింత స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు మీ చర్మం కండీషన్‌ను పరిగట్టేస్తుంది. ఒక్క ఫొటో తీసి పెడితే చాలు స్కిన్ కండీషన్ ఏంటో చెప్పేస్తుంది. మన చర్మానికి ఏదైనా సమస్య ఉండి దాన్ని ఏమని పిలుస్తారో తెలియని సందర్భంలో దానికి సంబంధించిన ఫొటోను గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే ఆ రుగ్మత పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలియజేస్తుంది. అయితే ఇది యూజర్ల సమాచారం కోసం మాత్రమే. దీన్ని వ్యాధి నిర్ధారణగా పరిగణించకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. సమస్య ఏంటో చెప్పేస్తుంది.. శరీర భాగాల్లో చర్మంపై ఎక్కడైనా ఏదైనా సమస్యగా అనిపిస్తే దాన్ని ఫొటో తీసి గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే దానికి సంబంధించిన అలాంటి విజువల్ సమాచారం వస్తుంది. ఉదాహరణకు చర్మంపై దద్దుర్లు, వాపు, వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ సాయంతో తెలుసుకోవచ్చు. మరింత స్మార్ట్‌గా.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ లెన్స్ స్మార్ట్‌గా మారుతోంది. ముందుగా గూగుల్ లెన్స్ యూజర్లకు పేరు తెలియని ఏవైనా సాధారణ వస్తువులను విశ్లేషించడంలో సహాయపడుతుంది. అలాగే వాక్యాలను కూడా అనువదించే సామర్థ్యాన్ని ఇందులో జోడించారు. మనకు తెలియని వాక్యాలను గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా ఫొటో తీసి మనకు కావాల్సిన భాషలోకి వాటిని అనువదించుకోవచ్చు. వీటితోపాటు గూగుల్ మ్యాప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఆర్ శక్తిని జోడిస్తోంది గూగుల్. దీని సాయంతో మన చుట్టూ ఉన్న కొత్త స్థలాలను కనుగొనడానికి, యూజర్లు తమకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటివి శోధించవచ్చని గూగుల్ పేర్కొంది. -
బీమా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
న్యూఢిల్లీ: బీమా ఒప్పందాల్లో అస్పష్టత, షరతులు అసౌకర్యంగా ఉండడం వంటి ఆరు అంశాలను కేంద్ర ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), బీమా కంపెనీల ముందు ప్రస్తావించింది. వెంటనే వీటిని పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న వినియోగదారుల కేసులను తగ్గించాలని బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో కోరింది. కోర్టు బయట పరిష్కారాల విషయమై బీమా కంపెనీల ప్రతినిధులకు అధికారాల్లేకపోవడం, వినియోగదారులతో ఒప్పందంపై సంతకం చేయించుకోవడానికి ముందు పాలసీకి సంంధించి అన్ని డాక్యుమెంట్లను అందించకపోవడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల పేరిట క్లెయిమ్‌లను తిరస్కరించడం, పంట బీమా క్లెయిమ్‌లను కేంద్ర పథకంతో ముడిపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతానికి పైగా బీమా రంగానికి సంబంధించే ఉంటున్నాయనేది వాస్తవం ‘‘ఐఆర్డీఏఐ, ఇతర భాగస్వాముల (బీమా సంస్థలు, టీపీఏలు) వద్ద ఈ అంశాలను ప్రస్తావించాం. బీమా సంస్థలు స్వచ్చందంగా వీటిని పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. అవసరనుకుంటే వీటిని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏఐని కోరతాం’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ అంశాల వల్లే దేశవ్యాప్తంగా బీమాకు సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమ 8 శాతం విస్తరణ రేటును చేరుకోవాలంటే, ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీమా పాలసీ నిబంధనలు, షరతులు సులభతరంగా, స్పష్టంగా, అర్థం చేసుకోతగిన భాషలో ఉంటే ఫిర్యాదులను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోకుండా డాక్యుమెంట్‌పై సంతకం చేయరాదన్న అవగాహనను పాలసీదారుల్లో కాల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
ఉపాధి హామీ అమల్లో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా తెలంగాణ ఉపయోగించుకుంటుందన్న అక్కసు కేంద్రానికి ఉందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మల్లా రెడ్డి విమర్శించారు. అందుకే అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో పీఆర్ మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 8వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధి హామీలో 10.66 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, మళ్లీ పనిదినాలు కావాలని అడిగితే కేంద్రం అనేక షరతులు పెట్టి 11 కోట్ల పనిదినాలు కలి్పంచిందన్నారు. ఎన్ని షరతులు పెట్టినా వాటన్నింటిని పాటి స్తూ కూలీలకు పనిదినాలు కలి్పస్తున్నామన్నారు. 12 కోట్ల పనిదినాలు కలి్పంచే లక్ష్యంతో కేంద్రాన్ని మరిన్ని పనిదినాలు కావాలని కోరినట్లు తెలిపారు. -
నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్లుగా జైలులో గడుపుతున్న ఎల్గార్ పరిషత్–మావో సంబంధాల కేసులో నిందితుడు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రూ.2.4 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. గృహ నిర్బంధంపై 14 షరతులు విధించింది. 70 ఏళ్ల నవ్లఖా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా గృహ నిర్భంధానికి అనుమతిస్తున్నామని తెలిపింది. ఈ ఆదేశాలు తాత్కాలికమని నెల రోజుల తర్వాత సమీక్షిస్తామంటూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. గృహనిర్భంధానికి అనుమతి ఇవ్వాలన్న నవ్లఖా పిటిషన్‌ను గురువారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల సుప్రీం ధర్మాసనం విచారించింది. ‘నిందితుడు 2020 నుంచి కస్టడీలో ఉన్నారు. గతంలో గృహనిర్బంధం దుర్వినియోగం చేసిన ఫిర్యాదులేవీ లేవు. ఈ కేసు మినహా మరో నేరపూరిత ఆరోపణలు లేవు. అందుకే హౌస్అరెస్ట్కు అనుమతినిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీల ఏర్పాటు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నిఘా తదితరాల ఖర్చు మొత్తం నవ్లఖా భరించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులు.. ► పోలీసుల సమక్షంలో వారిచ్చిన ఫోన్ నుంచి రోజుకు 10 నిమిషాలు మాట్లాడొచ్చు. ► సహచరుడి ఇంటర్నెట్లేని ఫోన్ వాడొచ్చు. ఎస్ఎంఎస్లు, కాల్స్‌కు అనుమతి. వాటిని డిలీట్ చేయకూడదు. ముంబై వదిలి వెళ్లొద్దు. ► గరిష్టంగా ఇద్దరు కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి 3 గంటల పాటు సందర్శించొచ్చు. ► కేబుల్ టీవీ చూడొచ్చు. కేసులో సాక్షులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దు. -
ప్రత్యర్థులకు భిన్నంగా ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు పండగ!
సాక్షి, ముంబై: మూన్‌లైటింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తున్నతరుణంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు గిగ్ ఉద్యోగాలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలు విధించింది.ప్రత్యర్థి కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఉద్యోగులకు చక్కటి వెసులుబాటుతోపాటు, కంపెనీలకు తలనొప్పిగా మారిన అట్రిషన్ రేటు కూడా తగ్గుతుందని శ్లేషకులు భావిస్తున్నారు. గురువారం ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఇన్ఫోసిస్ వివరాలను అందించింది. మూన్లైటింగ్ని ప్రస్తావించకపోయినప్పటికీ, గిగ్ వర్క్‌ని చేపట్టాలనుకునే వారు, మేనేజర్, హెచ్ఆర్ ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ, తమకు పోటీగా ఉండకూడదని స్పష్టం చేసింది. తమ కంపెనీ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ‘గిగ్ వర్క్’లను ఏ విధంగా చేసుకోవచ్చో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అంతర్గతంగా వివరించింది. కంపెనీతో సమర్థవంతంగా పని చేసే వారి సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేయకుండా చూసేందుకు తమ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. -
అంతర్జాతీయ సవాళ్లతో భారత్‌కు భయం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్ విషయంలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్‌కు మూడీస్ ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌లో రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’క మార్చింది. తాజాగా మూడీస్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశం క్రెడిట్ ప్రొఫైల్... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్ బేస్ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్ రికవరీకి (కోవిడ్–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం. ► ఎకానమీ, ఫైనాన్షియల్ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నాం. ► అధిక క్యాపిటల్ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి. ► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం. రేటింగ్ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి... భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి. అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్ ప్రొఫైల్‌కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్ రేటింగ్ చర్యకూ దారితీయవచ్చు. – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ -
సంచలన నిర్ణయం తీసుకున్న సమంత.. ఇకపై వాటికి దూరం
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు విజయ్‌తో ఖుషీ, హిందీలో ఓ వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తుంది. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన సామ్ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సమంత తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుందట. ఇకపై చేసే సినిమాల్లో గ్లామర్ రోల్స్, లిప్ లాక్ సమా ఇంటిమేట్ సీన్స్‌కి దూరంగా ఉండాలని ఆమె డిసైడ్ అయ్యిందట. ఈ కండీషన్స్‌కి ఒప్పుకుంటేనే సినిమాలకు సైన్ చేస్తుందట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది. కాగా పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే సైన్ చేసిన సామ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో మాత్రం బోల్డ్ సీన్స్‌లో నటించింది. ఈ కారణంగానే చై, సామ్ మధ్య విబేధాలు తలెత్తి అవి విడాకులకు దారి తీసిందని వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!
ఇల్లు కొనుగోలు అన్నది చాలా మంది విషయంలో అత్యంత ఖరీదైన వ్యవహారం. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు.. ఇంటి కొనుగోలుతో తమకు ఓ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు.. బోలెడు పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా చాలా మార్కెట్లలో ఇళ్ల ధరలు స్తబ్దుగానే ఉన్నాయి. గతేడాది కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇళ్ల ధరలు పెద్దగా పెరిగింది లేదు. సొంతింటి కోసం ప్రణాళిక వేసుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు చాలా కనిష్ట స్థాయిలకు వచ్చేశాయి. పైగా పన్ను ఆదాను కలిపి చూసుకుంటే ఇంటి కొనుగోలు మంచి లాభసాటే అవుతుంది. ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఎన్నిరకాలుగా ఉన్నాయనే వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం.. మొదటి ఇంటి కొనుగోలు.. మొదటి సారి ఇంటిని కొనుగోలు చేస్తున్నట్టయితే.. ఆదాయపన్ను చట్టంలోని మూడు సెక్షన్ల కింద ప్రయోజనాలకు అర్హులు. ఉదాహరణకు రూ.40 లక్షల ఇంటిని 80 శాతం రుణంతో (రూ.36 లక్షలు) కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. 20 ఏళ్ల కాలానికి వడ్డీ రేటు 7 శాతం అనుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.31,000 అవుతుంది. మొదటి ఏడాదిలో రూ.3,72,000 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో రూ.2.77 లక్షలు రుణంపై వడ్డీ కింద జమ అవుతుంది. రూ.95,000 రుణానికి అసలు కింద జమ అవుతుంది. రుణ గ్రహీత వార్షిక ఆదాయం రూ.15 లక్షలు అనుకుంటే ఈ కేసులో.. రూ.95,000 అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల మొత్తంపై పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. కనుక మిగిలిన రూ.55,000ను ఇంటి కొనుగోలు కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలను మొదటి ఏడాది కింద మినహాయింపుగా చూపించుకోవచ్చు. ఇక వడ్డీ భాగం కింద రూ.2.77 లక్షల చెల్లింపుల్లో రూ.2,00,000ను సెక్షన్ 24 కింద చూపించుకోవడం ద్వారా ఆ మొత్తంపై రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. మిగిలిన రూ.77,000ను సెక్షన్ 80ఈఈఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మొదటి ఏడాదిలో రూ.4.27లక్షల మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ప్రిన్సిపల్ (అసలు), వడ్డీ భాగం అన్నది ఏటా మారుతుంటుంది. కనుక పన్ను మినహాయింపుల విషయమై ఏటా ముందే ఓ స్పష్టతకు రావాలి. రెండో ఇంటిపై పెట్టుబడి పెడుతుంటే..? అందరూ మొదటిసారే ఇళ్లను కొనుగోలు చేస్తారని అనుకోవడానికి లేదు. రెండో ఇంటిపైనా ఇన్వెస్ట్ చేసే వారు ఉంటారు. కనుక రెండో ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నట్టయితే.. వడ్డీ చెల్లింపుల భాగాన్ని సెక్షన్ 24(బి) కింద చూపించుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడొక పరిమితి ఉంది. రెండు ఇళ్లకూ కలిపి సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.2లక్షల వడ్డీ చెల్లింపులకే పన్ను మినహాయింపు పొందగలరు. 2019–20 నుంచి రెండో ఇల్లు, సొంతంగా ఉండే ఇంటిపై నోషనల్ రెంట్ ఎత్తి వేశారు. అంటే 2019–20 ముందు వరకు ఒక్క ఇంటినే సొంతానికి వినియోగిస్తున్నట్టు చూపించుకునే అవకాశం ఉండగా.. ఆ తర్వాత నుంచి రెండు ఇళ్లను సైతం సొంత వినియోగం కింద చూపించుకునే అవకాశం కల్పించారు. దీంతో నోషనల్ రెంట్ రూపంలో పన్ను చెల్లించాల్సిన ఇబ్బంది తప్పింది. రెండు ఇళ్లనూ స్వీయ వినియోగానికే కేటాయించుకుంటే.. గరిష్టంగా రూ.2,00,000 వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 (బి) కింద.. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు అసలు చెల్లింపులపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చారనుకుందాం.. అప్పుడు అద్దె ఆదాయం నుంచి 30 శాతాన్ని ప్రామాణిక మినహాయింపు కింద చూపించుకోవచ్చు. అదే సమయంలో ఇంటి అద్దె ఆదాయన్ని కూడా వార్షిక ఆదాయానికి కలిపి చూపిస్తూ.. అదే ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా (పరిమితి లేకుండా) పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇతర ఆదాయ నష్టం రూ.2,00,000 వరకు సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత ఏదైనా మిగులు ఉంటే దాన్ని తదుపరి ఎనిమిది సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చని ఎన్ఏ షా అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అశోక్ షా పేర్కొన్నారు. జాయింట్‌గా ఇంటి కొనుగోలుపై.. భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేస్తే.. వారు విడివిడిగా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు. అయితే, ఇక్కడ పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు స్త్రీ, పురుషులు ఇరువురూ ఆదాయ వనరు కలిగి ఉండడం తప్పనిసరి. అలా కాకుండా.. భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ.. భార్యకు ఎటువంటి ఆదాయ వనరు లేకపోతే.. పన్ను ప్రయోజనాలకు భర్త ఒక్కరే అర్హులవుతారు. పన్ను ప్రయోజనాలను భార్యా, భర్తలు ఇద్దరూ విడిగా క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. వారు ఎంత మేరకు వాటా కలిగి ఉన్నారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇద్దరి ఆదాయాన్ని కలిపితే అర్హత ఎక్కువ లభిస్తుంది. రుణం సాఫీగా మంజూరవుతుంది. మహిళా దరఖాస్తుదారులకు కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లపై గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే, చాలా రాష్ట్రాలలో మహిళా కొనుగోలుదారులకు స్టాంప్‌డ్యూటీ రేటు తక్కువ అమలవుతోంది. ‘‘సెక్షన్ 80సీ కింద గృహ రుణం అసలు చెల్లింపులు రూ.1.50లక్షలు.. సెక్షన్ 24 కింద గృహ రుణంపై వడ్డీ రూ.2,00,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే ఎవరికి వారు గరిష్టంగా ఈ మేరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు’’అని నిస్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో అమిత్గోయంకా తెలిపారు. ఉదాహరణ: ఇప్పుడు ఒక జంట ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేశారని అనుకుందాం. ఇందు కోసం రూ.90,00,000 రుణాన్ని బ్యాంకు నుంచి 7 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల రూపేణా వీరు రూ.3,00,000 చెల్లించారు. ఇలా చూస్తే ఈ జంట మొదటి ఏడాది రూ.5,50,000ను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అలాగే, రూ.2,00,000ను ప్రిన్సిపల్‌గా జమ చేయాలి. ఇటువంటి సందర్భంలో.. వీరు ఎవరికి వారే విడిగా.. సెక్షన్ 24 (బి) కింద గరిష్టంగా రూ.2లక్షలను వడ్డీ రూపంలో మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అద్దెకు ఇస్తే ఈ పరిమితి రూ.2,75,000కు పెరుగుతుంది. సెక్షన్ 80సీ కింద ఎవరికి వారు రూ.1.50 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మహిళ కొనుగోలుదారుగా ఉంటే.. ఆదాయపన్ను చట్టం కింద మహిళలకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాలు ఇంటిపై లేవు. పురుషులతో సమానంగా ఆదాయపన్ను చట్టం కింద పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, కొన్ని రాష్ట్రాలు మహిళలు ఇంటి కొనుగోలుదారులుగా ఉంటే స్టాంప్ డ్యూటీ చార్జీల్లో 1–2 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. రాజస్తాన్‌లో స్టాంప్ డ్యూటీ చార్జీ 8.8 శాతంగా ఉంటే.. మహిళలకు 7.5 శాతమే అమలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయోజనాలు ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. -
జీన్స్, షార్ట్స్ వేస్తే ఊరు దాటాల్సిందే..
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లొని ఖాప్ పంచాయతీ.. వస్త్రధారణపై కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు జీన్స్, పురుషులు షార్ట్స్ వేసుకోవడంపై నిషేధం విధించింది. ఇకపై గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే శిక్షతో పాటు, బహిష్కరణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చార్తవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్సా గ్రామంలో మార్చి 2న జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు ర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ నాయకుడు, కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పూరన్ సింగ్ ప్రకటించారు. మహిళలు సాంప్రదాయ భారతీయ దుస్తులైన చీరలు, ఘాగ్రాలు, సల్వార్-కమీజ్(పంజాబీ డ్రస్) ధరించాలని ఆయన సూచించారు. ప్రజల్లో భారతీయ వస్త్ర సంస్కృతి పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా గ్రామ ప్రజలు సైతం ఈ నిబంధనను అంగీకరించడం విశేషం. కాగా యూపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఖాప్ పంచాయతీ మండిపడింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. చదవండి : (రెండో పెళ్లి చేస్తారా? చావాలా?: 60 ఏళ్ల వ్యక్తి బెదిరింపులు) (మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు) -
కరోనా పడగ నీడ
‘కరోనా’ వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఇంకా ఈ మహమ్మారి తాకిడి నుంచి తేరుకోలేదు. ‘లాక్డౌన్’, ‘అన్‌లాక్’ ప్రక్రియలు ఎలా ఉన్నా, దేశంలో పండుగ పబ్బాల సందడి దాదాపు కనిపించకుండా పోయింది. పండుగల వేళ పిల్లలకు ఆటవిడుపు లేకుండాపోయింది. ఇళ్లకు బంధుమిత్రుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడివాళ్లక్కడే అన్నట్లుగా జనాలు ఒంటరిద్వీపాల్లా బతుకులీడుస్తున్నారు. ‘కరోనా’ మహమ్మారి దెబ్బకు సామాజిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. సహజంగా సంఘజీవులైన మనుషులకు ఈ పరిస్థితి మింగుడుపడనిదిగా ఉంటోంది. మనుషుల సామాజిక, మానసిక పరిస్థితులపై ‘కరోనా’ మహమ్మారి ప్రభావాన్ని గురించి ఒక పరిశీలన... ‘కరోనా’ వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న వార్తలు ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చాయి. మన దేశంలో తొలి కేసు కేరళలో జనవరిలోనే నమోదైంది. ఇది జరిగిన రెండు నెలలకు పరిస్థితి అదుపుతప్పే సూచనలు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఐదు విడతల లాక్డౌన్ తర్వాత జూన్ 8న మొదటి విడత ‘అన్‌లాక్’ ప్రక్రియ ప్రారంభించింది. దేశంలో ‘కరోనా’ కేసులు ఆరు లక్షలు దాటిన తర్వాత జూలై 1న రెండో విడత ‘అన్‌లాక్’ ప్రక్రియ మొదలైంది. కట్టుదిట్టమైన లాక్డౌన్ అమలులో ఉండగానే ప్రధానమైన పండుగల్లో చాలా గడిచిపోయాయి. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, రథయాత్ర వంటి ప్రధానమైన పండుగలన్నీ కళాకాంతులు లేకుండాగానే జరిగిపోయాయి. రేపు రాబోయే రాఖీ పూర్ణిమతో పాటు ఏటా అట్టహాసంగా జరిగే వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు, దీపావళి వంటి పండుగలు కూడా పెద్దగా సందడి లేకుండానే, జనాలు నామమాత్రంగా జరుపుకొనే సూచనలే కనిపిస్తున్నాయి. వచ్చేనెలలో జరగనున్న వినాయక నవరాత్రులకు సంబంధించి పలుచోట్ల ఇప్పటి నుంచే ఆంక్షలు కూడా మొదలయ్యాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా వీధుల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని విగ్రహాల ఎత్తు నాలుగు అడుగులకు మించరాదని, ఇళ్లల్లో పూజించే విగ్రహాల ఎత్తు రెండడుగులకు మించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నవరాత్రులు పూర్తయిన వెంటనే విగ్రహాలను నిమజ్జనం చేయకుండా, వచ్చే ఫిబ్రవరిలో రానున్న ‘మాఘి గణేశ చతుర్థి’ రోజున లేదా వచ్చే ఏడాది వినాయక నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయాలని ఆదేశించింది. వీధుల్లో ఏర్పాటు చేసే బహిరంగ మండపాలకు వచ్చే జనాలు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రుల వేడుకలపై కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పండుగపబ్బాలు, వేడుకలపై ఆంక్షలు వచ్చే ఏడాది వరకు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. ‘కరోనా’ వ్యాక్సిన్ జనాలకు అందుబాటులోకి వచ్చి, మహమ్మారి పరిస్థితులు సద్దుమణిగేంత వరకు జనాలు ధైర్యంగా బహిరంగ వేడుకలు జరుపుకొనే పరిస్థితులు లేవు. పెద్దలు కొంతలో కొంతవరకు ఈ పరిస్థితులకు ఎలాగోలా సర్దుకుపోతున్నా, పిల్లలు మాత్రం నిరాశ చెందుతున్నారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలే కాదు, ఇదివరకటిలా తోటి పిల్లలతో వీధుల్లో ఆడుకునే పరిస్థితులూ లేకపోవడంతో దిగులుతో కుంగిపోతున్నారు. పెరుగుతున్న మానసిక సమస్యలు ‘కరోనా’ వైరస్ ఉధృతి కంటే, దీని పర్యవసానంగా తలెత్తిన లాక్డౌన్, మనుషుల మధ్య భౌతికదూరం, అన్‌లాక్ ప్రక్రియ మొదలయ్యాక మరింతగా పెరుగుతున్న రోగుల సంఖ్య వంటి పరిణామాలు మనుషుల్లో మానసిక సమస్యలను పెంచుతున్నాయి. ఈ మహమ్మారి ఫలితంగా మనుషుల్లో మానసిక సమస్యలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముందే అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడంతో ఇప్పటికే చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇంకొందరు ఉద్యోగాల్లో కొనసాగుతున్నా, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని భయంతో బితుకుబితుకుమంటున్నారు. మహమ్మారి కారణంగా అనుకోకుండా వచ్చిపడ్డ ఆర్థిక సమస్యల నుంచి ఎప్పటికి గట్టెక్కుతామో తెలియని ఆందోళనతో చాలామంది దిగులుతో కుంగిపోతున్నారు. గత ఏడాది చివర్లో చైనాలో పుట్టిన ‘కరోనా’ మహమ్మారి దావానలంలా దేశదేశాలకు వ్యాపించింది. చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన సుమారు నెల్లాళ్ల వ్యవధిలోనే 26.4 కోట్ల మంది మానసిక కుంగుబాటుకు లోనైనట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) మే 14న విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. మన దేశంలో ఇదీ పరిస్థితి మహమ్మారి కాలంలో మన దేశంలో ప్రజల మానసిక పరిస్థితులపై ఒక చిన్న ఉదాహరణ. ‘కారిటాస్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ఏప్రిల్‌లో ఒక హెల్ప్‌లైన్ నంబరును ప్రారంభించింది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు పలువురు ఈ నంబరుకు కాల్ చేశారని, వారిలో ఏడేళ్ల చిన్నారులు మొదలుకొని ఎనభయ్యేళ్లు పైబడిన వృద్ధుల వరకు ఉన్నారని ‘కారిటాస్ ఇండియా’ వెల్లడించింది. ఎక్కువ కాల్స్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారివేనని, అస్సాం, బీహార్ తదితర ప్రాంతాల నుంచి కొద్ది మంది నిత్యావసరాలు, మందులు పంపాలని కూడా ఫోన్ చేసినవారు ఉన్నారని ‘కారిటాస్ ఇండియా’ వాలంటీర్ ఒకరు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమకు కాల్స్ వస్తుంటాయని, కాల్స్ వచ్చిన ప్రాంతాలకు చెందిన తమ ప్రతినిధులను అప్రమత్తం చేసి, ఆందోళనతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటామని వివరించారు. ‘లాక్డౌన్’ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇప్పటి ‘అన్‌లాక్’ ప్రక్రియ కొనసాగుతున్న రోజుల వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య దాదాపు 20 శాతానికి పైగా పెరిగినట్లు ‘ఇండియన్ సైకియాట్రీ సొసైటీ’ (ఐపీఎస్) వెల్లడించింది. అంతేకాదు, ‘కరోనా’ మహమ్మారి ఫలితంగా దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో కుంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిపింది. మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోవడం, జీవన భద్రత కొరవడటం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి సమస్యలు చాలామందిలో మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు కలిగిస్తున్నాయని, అక్కడక్కడా కొద్దిమంది వ్యాధి సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలపై వార్తలు వెలువడుతున్నాయని, దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు కొనసాగితే దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ సౌమిత్రా పథారే చెబుతున్నారు. మన దేశంలో మానసిక సమస్యల తీవ్రత ‘కరోనా’ తాకిడికి ముందు నుంచే ఉంది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘లాన్సెట్’ అధ్యయన నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చేమో గాని, వారిలో సమస్యలేవీ లేవని తోసిపుచ్చలేమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలో దాదాపు 19.73 కోట్ల మంది రకరకాల మానసిక వ్యాధులతో ఉన్నారు. వీరిలో దాదాపు 4.57 కోట్ల మంది డిప్రెషన్తోను, 4.49 కోట్ల మంది యాంగై్జటీ సమస్యలతోను సతమతమవుతున్నారు. ‘కరోనా’ మహమ్మారి తాకిడి కారణంగా ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య మరో ఇరవై శాతానికి పైగా పెరిగినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. దేశంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో కనీసం 15 కోట్ల మందికి సత్వర మానసిక చికిత్స అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్’ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే మన దేశంలోని మెజారిటీ జనాభాకు సరైన మానసిక చికిత్స లభించే అవకాశాలు అందుబాటులో లేవు. నగర, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మానసిక వైద్య నిపుణుల సంఖ్య చాలినంతగా లేదు. మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే చొరవ కూడా మన జనాభాలో చాలామందికి లేదు. రకరకాల భయాలు, అపోహల కారణంగా తమ ఇంట్లో ఎవరికైనా మానసిక సమస్యలు తలెత్తినా, మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లేందుకు వెనుకాడే జనాలే ఎక్కువ. దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం ‘కరోనా’ మహమ్మారి దేశంలోని దాదాపు యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ‘యాక్సెస్ మీడియా ఇంటర్నేషనల్’ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో కొందరు ఊహించని విధంగా ఉపాధి పోగొట్టుకున్నారు. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్నవారే. అకస్మాత్తుగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇళ్లబాట పట్టారు. పగిలిన పాదాలు నెత్తురోడుతున్నా, ప్రత్యామ్నాయమేదీ లేని పరిస్థితుల్లో వందల కొద్ది కిలోమీటర్ల దూరం నడిచారు. చిన్నా చితకా వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. చాలామంది గిరాకీల్లేక వ్యాపారాలను మూసేసుకున్నారు. ‘కరోనా’ దెబ్బకు మూతబడిన వ్యాపారాల్లో చిన్న చిన్న టీస్టాల్స్ మొదలుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ వంటివి కూడా ఉన్నాయి. కొన్ని దుకాణాలను తెరిచినా, ఇదివరకటి స్థాయిలో గిరాకీల్లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిలోనూ చాలామందికి జీతాల్లో కోతలు పడుతుండటంతో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. రవాణా వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని రవాణా సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం మరో ఆరునెలల వరకు ఉన్నచోటును విడిచి ప్రయాణాలకు బయలుదేరేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు. కోరుకుంటే విదేశాలకు విమానాల్లో వెళ్లగలిగే స్థోమత ఉన్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలో సైతం దాదాపు 35 శాతం మంది మరో ఆరునెలల వరకు విమాన ప్రయాణాల జోలికి వెళ్లబోమని కరాఖండిగా చెబుతున్నారు. వీరంతా రూ.12 లక్షలకు పైబడిన వార్షికాదాయం గలవారేనని ‘యాక్సెస్ మీడియా ఇంటర్నేషనల్’ వెల్లడించింది. మెరుగైన ఆదాయం గల సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే, ‘కరోనా’ ధాటికి సామాన్యుల బతుకులు ఇంకెంతలా చితికిపోయాయో ఊహించుకోవాల్సిందే! అధిగమించడం ఎలాగంటే... ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించని పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు తలెత్తే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. తోటి పిల్లలతో కలసి మెలసి ఆడుతూ పాడుతూ గడపడం ద్వారానే పిల్లలు మానవసంబంధాలను మెరుగుపరచుకుంటారు. ఇళ్లల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, ఇంట్లో ఉండే తాత బామ్మలు వంటి వారితో తమ భావాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. మనుషులకు దూరమయ్యే పరిస్థితుల్లో వారు వస్తువులకు దగ్గరవుతారు. టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటి వాటితోనే ఎక్కువగా కాలక్షేపం చేయడం మొదలుపెడతారు. ‘లాక్డౌన్’ పరిస్థితులు ఇంటిల్లిపాదీ ఒకేచోట చేరి కాలం గడిపే పరిస్థితిని తీసుకొచ్చింది. తల్లిదండ్రులు పూర్తిగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’లో మునిగిపోకుండా పిల్లలతో కబుర్లు చెప్పడం, ఆటలాడటం చేస్తున్నట్లయితే, వాళ్లల్లో ఒంటరితనం దూరమవుతుంది. ‘కరోనా’ ఫలితంగా ఉపాధి పోవడం, ఉద్యోగాల్లో అభద్రత వంటి పరిస్థితులు చాలామందిలో మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచుతున్నాయి. ‘కరోనా’ తర్వాత మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. రోగ నిరోధకత పెంచుకునేందుకు పోషకాహారంతో పాటు విటమిన్–సి, విటమిన్–డి మాత్రలు తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటివి చేయడం, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. అప్పటికీ మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు, కుంగుబాటు ఇబ్బందిపెడుతున్నట్లయితే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాల్సిందే. – డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై .. మానసిక వైద్య నిపుణులు, ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్ -
చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో డ్రాగన్ దుశ్చర్య, తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీవాసులు చైనా వస్తువులపై ఏకంగా "యుద్ధం" ప్రకటించారు. ఇంట్లోని ప్రతి చైనా వస్తువును రోడ్డుపైకి విసిరేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ రంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు తుపాకులు, బుల్లెట్లతో ప్రత్యక్షంగా చైనాపై యుద్ధానికి దిగలేకపోయినా వస్తువులు బహిష్కరణ ద్వారా చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. అయితే ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని యుద్ధ నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ డిఫెన్స్ కాలనీకి చెందిన భవ్రీన్ కంధారి విమర్శించారు. (చైనా ఉత్పత్తులపై నిషేధం) మరోవైపు ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన సదర్ బజార్ వ్యాపారులు భిన్నంగా స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణకు సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కొన్ని షరతులతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ శర్మమాట్లాడుతూ, తాము కూడా చైనా ఉత్పత్తుల నిషేధానికి సిద్ధమే. 'హిందీచీనీ బైబై' నినాదానికి తమ మద్దతు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలతోపాటు, అధికారుల దాడులు, ఇతర వేధింపులనుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. (చైనాకు షాక్ : చైనా పరికరాల వాడకం తగ్గించండి!) దాదాపు 70 శాతం ఎలక్ట్రికల్ వస్తువులు చైనానుంచే వస్తాయనీ మరో వ్యాపారి తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతామని వెల్లడించారు. అనేక మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు సంబంధించిన విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతి అవుతాయన్నారు. దాదాపు 40 వేల దుకాణాలను కలిగి ఉన్న సదర్ బజార్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, గడియారాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇలా దాదాపు ప్రతీది చైనానుంచి దిగుమతి అయినవే ఉంటాయన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల బహిష్కరణ, దిగుమతులపై నిషేధం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కాగా దేశీయంగా 7 కోట్ల మంది వ్యాపారులు, 40 వేల ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) చైనా దిగుమతులను బ్యాన్ చేయాలని పిలుపు నిచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి చైనా దిగుమతులు 13 బిలియన్ డాలర్లు తగ్గించాలంటూ ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని కోరింది. ప్రస్తుతం, ప్రతి ఏటా చైనా నుంచి దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విలువ 70 బిలియన్ డాలర్లకు పై మాటే. -
ఆరోగ్య సిబ్బంది బీమా నిబంధనలు ఇవే..
న్యూఢిల్లీ : లాక్డౌన్ సమయంలో దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల, పారా మెడికల్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు రూ. 50 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించింది. తాజాగా ఆదివారం ఇందుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా పేషెంట్లకు నేరుగా సేవలు అందిస్తున్న, వారి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా 22.12 లక్షల మంది పబ్లిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్లకు ఈ బీమా వర్తించనుంది. వారు విధుల నిర్వర్తించే క్రమంలో.. ప్రమాదవశాత్తు కరోనా సోకితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది. మొత్తం 90 రోజుల పాటు ఈ బీమా అమల్లో ఉండనుందని.. దీని కింద రూ. 50 లక్షలు అందజేయనున్నట్టు చెప్పింది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో కరోనా సంబంధింత సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఉద్యోగులు, రాష్ట్రాలు నియమించుకున్న అవుట్ సోర్స్ సిబ్బందితో పాటు పలు విభాగాలకు ఈ బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వీరి సంఖ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలకు లోబడి ఉంటుందని వెల్లడించింది. ఈ బీమా పొందే లబ్ధిదారులు.. ఇతర ఇన్సురెన్స్ పాలసీ చేయించుకుని ఉంటే వాటిని కూడా పొందవచ్చని తెలిపింది. -
స్టార్ ఫార్ములాతో సక్సెస్: నయనతార
చెన్నై : సినిమాలో అవకాశాలు, విజయాలు వంటివేవైనా అల్టిమేట్‌గా సొమ్ము చేసుకోవడమే. ఆ తరువాత పేరు, హోదా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆపై వాటిని నిలుపుకుంటే చాలు. లైష్ హ్యాపీ. నటి నయనతార ఇప్పుడు ఇదే పాలసీని ఫాలో అవుతోందనిపిస్తోంది. ఆరంభం నుంచే ఈ బ్యూటీ లక్కీ అనే చెప్పాలి. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత స్టార్ హీరోలు విజయ్, అజిత్, సూర్య, శింబు, విశాల్ వంటి వారితో జత కట్టింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖి చిత్రంతోనే బాగా పాపులర్ అయ్యింది. అలా స్టార్ హీరోలతో జత కట్టి క్రేజ్‌ను సంపాధించుకున్న నయనతార ఆ తరువాత విజయ్‌సేతుపతి, శివకార్తీకేయన్, ఆరి వంటి అప్ కమింగ్ హీరోలతో నటించింది. అలాంటి చిత్రాల విజయాలను తనకే ఎక్కువగా ఆపాధించుకోవడంతో హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకుంది. సినిమా, వ్యక్తిగత చర్చనీయాంశమైన ప్రేమ, సహజీవనం, వివాదాలు, విడిపోవడాలు వంటి సంఘటనలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటున్న నయనతార ఇప్పుడు సుమారు రూ.5 కోట్లు పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోలను పక్కన పెట్టేసి స్టార్ హీరోలతోనే నటించడం మొదలెట్టింది. ఇందుకో లాజిక్ ఉంది. కుర్రహీరోలతో నటించే చిత్రాల్లో నటించడానికి అవకాశం ఉంటుంది. అందుకు కాల్షీట్స్ అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అదే స్టార్ హీరోల చిత్రాల్లో పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఇటీవల నటించిన తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి, తమిళంలో విజయ్‌తో నటించిన బిగిల్, రజనీకాంత్‌తో జత కట్టిన దర్బార్ చిత్రాలనే తీసుకుంటే వీటిలో నయనతార పాత్ర పరిధి చాలాతక్కువ. పారితోషికం మాత్రం రూ.4 కోట్లకు పైనే అనే ప్రచారం జరుగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే తను ముందుగా కేటాయించిన కాల్షీట్స్ కంటే ఎక్కువ ఇవ్వదు. అదేవిధంగా తను నటించిన చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదం అయితే అందుకు మరికొంత పారితోషికం చెల్లించాలన్న నిబంధనలను విధిస్తోందని సమాచారం. ఇకపోతే షూటింగ్‌కు వచ్చానా, నటించినా అంతటితో తన పని అయిపోయ్యిందని, ఆ చిత్రం ఎలాంటి ప్రమోషన్‌కు రాననీ ముందుగానే ఒప్పందంలో కాస్ పెడుతోంది. మరో విషయం ఇటీవల స్టార్ హీరోలతోనే నటించాలని నిర్ణయించుకుందట. అందుకు కారణం తక్కువ కాల్షీట్స్తో ఎక్కువ పారితోషికం లభించడమే. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. హీరోతో రెండు పాటలో లెగ్ షేక్ చేయడం, మరో నాలుగు సన్నివేశాల్లో కనిపించడం (దర్బార్ చిత్రంలో అంతేగా) వంటివి చేస్తే చాలు. ఇక ఆ చిత్రాల విజయాలు ఎలాగూ తన ఖాతాలోనూ పడతాయి. ఇప్పుడు బిగిల్, దర్బార్ వంటి చిత్రాల విజయాలను తనూ షేర్ చేసుకుంటోంది. అందుకే స్టార్ హీరోల ఫార్ములా అన్ని విధాలుగా బాగుందని నయనతార భావిస్తోందట. ఇక హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలకు ఎలానూ తన ఆధిక్యం ఉంటుంది కాబట్టి ఆ తరహా చిత్రాలకూ ఓకే చెబుతోందట. ప్రస్తుతం అలాంటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. -
పేరు పార్ట్ టైం.. పని ఫుల్ టైం
ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్ట్, వర్క్, వృత్తి విద్య పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి (పీటీఐ) దయనీయంగా ఉంది. పేరుకు పార్ట్ టైం అయినా వారంతా ఫుల్ టైం పనిచేయాల్సి వస్తోంది. కేవలం మధ్యాహ్న వేళల్లో సహపాఠ్య కార్యక్రమాలు బోధన చేయించాలని వీరిని నియమించగా వీరు రోజంతా పని చేయాల్సి వస్తోంది. పాఠశాలల్లోని హెచ్ఎంల ఆదేశాలుతో వీరు పని చేయక తప్పడంలేదు. అరకొర జీతం..ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేయాలంటే తాము ఎలా బతకాలని ఇన్స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - కంచరపాలెం (విశాఖ ఉత్తర) విద్యాహక్కు చట్టం–2009లో భాగంగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సృజనాత్మకత, పనిపట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్, వర్క్, వృత్తి విద్య బోధించడానికి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు (పీటీఐ)ను సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ నియమించాయి. 2012లో ఈ నియామకాలు జరిగాయి. పీటీఐల నియామక సమయంలో పార్ట్‌టైం విధానం అయినా పూర్తికాలం పని చేయించారు. ఈ సమస్యపై 2014లో కొంత మంది పార్ట్‌టైం బోధకులు అప్పటి రాష్ట్ర సంచాలకులుగా ఉన్న వి.ఉషారాణిని సంప్రదించారు. ఆమె ఒక జీవోను విడుదల చేశారు. పార్ట్‌టైం బోధకులతో కేవలం మధ్యాహ్న వేళల్లో మాత్రమే ఒక్క పూట బోధన చేయించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో మరే ఇతర పనులకు గాని, పాఠశాలలో ఇతర సబ్జెక్టుల బోధనకు గాని వినియోగించరాదని జీవోలో స్పష్టంగా సూచించారు. కేవలం పీటీఐలను సహపాఠ్యాంశాల బోధనకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలిచ్చారు. కానీ అది అమలు మాత్రం జరగడం లేదు. హెచ్ఎంల ఒత్తిళ్లు జిల్లా పరిషత్, జీవీఎంసీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పార్ట్‌టైం బోధకులను రోజంతా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఇన్స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి పలుమా ర్లు వీరు తమ గోడును వి ద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లా రు. 2014–15లో విద్యాశాఖా ఇచ్చిన ఉత్తర్వులను చూపించినా హెచ్ఎంలు పట్టించుకోవడంలేదు. పీటీఐలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తికాలం పనిచేయాలని ఆదేశిస్తూ మానసికంగా ఒత్తిడి తెస్తున్నారని ఇన్స్ట్రక్టర్లు ఆరోపిస్తున్నారు. అలా చేయని యడల రీఎంగెజ్మెంటుపైన, డ్యూటీ సర్టిఫికెట్లపై హెచ్ఎంలు సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో కొంత మంది హెచ్ఎంలు మరో అడుగు ముందుకేసి రెండుపూటలా పనిచేస్తేనే..లేకుంటే ఉండనవసరం లేదని బెదిరింపులకు దిగుతున్నారని ఇన్స్ట్రక్టర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యపై ఆ యూనియన్ నాయకులు సంప్రదింపులు జరిపినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. సమస్య ఉన్న పాఠశాలల్లో యూనియన్ నాయకులు పలుమార్లు హెచ్ఎంను కలిసి చెప్పినా వారు వినిపించుకోవడంలేదు. ప్రాజెక్ట్ అధికారిని కలిసి చెబితా వారు నోటి మాట చెప్పి వదిలేస్తున్నారు. హెచ్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వడంలేదు. అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న పీటీఐలు మిగతా సమయంలో మరో చోట పనిచేసుకోవడానికి హెచ్ఎంలు అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. 480 మంది ఇన్స్ట్రక్టర్లు జిల్లాలో 480 మంది పార్ట్‌టైం బోధకులు ఉన్నారు. వీరంతా నెలకు రూ.14వేల వేతనంతో పనిచేస్తున్నారు. చాలీచాలనీ వేతనాలతో పీటీఐలు పని చేయాల్సి వస్తోంది. వీరిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ఉదయం వేళల్లో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేటు కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండడం కనిపిస్తోంది. కటువుగా ప్రవరిస్తున్నారు మేం పాఠశాలలో రోజంతా పనిచేయలేం. అరకొర జీతంతో మేం ఎలా బతకాలి. ప్రభుత్వ విధివిధానాలు సక్రమంగా అమలు చేయడంలో హెచ్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం పనిచేస్తున్నా హెచ్ఎంలు కటువుగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నాం. విద్యాశాఖాధికారులు సరైన నిర్ణయం తీసుకుని పార్ట్‌టైం ఉద్యోగులకు మేలు చేయాలి. – బి.నవీన, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ ఉత్తర్వులివ్వాలి ఆర్ట్,వర్క్ ఇన్స్ట్రక్టర్లకు ఒకపూట పనిచేయాలనే నిబంధన ఉన్నా కొంత మంది హెచ్ఎంలు పూర్తి కాలం పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు పూటల పనిచేయాలని ఉత్తర్వులు వస్తే మేం చేస్తాం. అంతేతప్ప ఇచ్చే జీతం తక్కువ, చేసే పని ఎక్కువ అయితే మేం వేగలేం. దీనిపై స్పష్టత అవసంర. – బి.శంకర్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, పీటీఐల యూనియన్ నాయకుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా పీటీఐలు ఒకపూటే పని చేయాలనే జీవో 2014లో విద్యాశాఖాధికారులు జారీ చేసిన మాట వాస్తవమే. పీటీఐల జీతాలు పెరిగిన తరువాత కొన్ని పాఠశాలలో హెచ్ఎంలు రెండుపూటల పాఠశాలలకు రావాలనే కోరుతున్నారనే సమస్య మా దృష్టికి వచ్చింది. సమస్యను జిల్లా ప్రాజెక్టు అధికారి సలహాతో రాష్ట్ర ఎన్పీడీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అప్పటివరకు పీటీఐలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మాటలకు అనుగుణంగా పనిచేసుకుంటే ఉద్యోగులకు మేలు జరుగుతుంది. – అలుగుబిల్లి శ్రీనివాసరావు, ఎస్ఎస్ఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఆర్వీఎం -
రణవీర్‌కు దీపిక షరతులు..!
ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్ హాట్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొనే ఇప్పటికీ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా దీపికకు సంబంధించిన రణవీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి ముందు రణవీర్‌కు బాలీవుడ్లో ప్లేబాయ్ ఇమేజ్ ఉంది. ఎప్పుడై లేట్ నైట్ పార్ట్సీ, ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేయటం రణవీర్‌కు అలవాటు. అయితే పెళ్లి తరువాత అలాంటివి కుదరదంటూ షరతులు పెట్టిందట దీపిక. తాజాగా పెళ్లి తరువాత దీపిక పెట్టిన షరతులపై రణవీర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. పెళ్లి తరువాత దీపిక తనకు మూడు షరుతలు విధించిందని చెప్పాడు రణవీర్. ఇంటికి వీలైనంత త్వరగా వచ్చేయాలి, ఇంట్లో తినకుండా బయటకు వెళ్లకూడదు, తను ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే కాల్ అంటెండ్ చేయాలి.. అంటూ మూడు కండిషన్స్ దీపిక పెట్టిందని రణవీర్ చెప్పాడు. ఇప్పటికే రణవీర్‌ను దీపిక డామినేట్ చేస్తుందన్న వార్తలు బాలీవుడ్లో జోరుగా షికారు చేస్తున్న సమయంలో రణవీర్ చెప్పిన కండిషన్స్ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. -
ఇదేమి పెళ్లి కానుక!
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్లు ఆయా కుటుంబాల వారికి భారం కాకుండా ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద ఆదుకుంటామంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి పలు షరతులు, పరిమితులు విధిస్తూ ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. ఇంతకుముందు పెళ్లికుమార్తెకు తెల్లరేషన్ కార్డు ఉంటే పెళ్లికానుక వర్తింపజేసేవారు కాగా.. ఇప్పుడు వధూవరులిద్దరికీ తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే పెళ్లి కానుక వర్తిస్తుందని నిబంధన పెట్టడం ఇందుకు నిదర్శనం. దీంతో వధూవరుల్లో ఏ ఒక్కరికి తెల్ల కార్డు లేకపోయినా కానుక రాదన్నమాట. పెళ్లికానుకను పెళ్లికుమార్తె అకౌంట్‌కు జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇందుకోసం పెళ్లికి 15 రోజులు ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టింది. దీన్నిబట్టి పెళ్లయ్యాక పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకుంటే ఉపయోగం ఉండబోదు. అంతేకాదు.. పది రోజుల్లో పెళ్లి కుదుర్చుకుని లగ్నాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. నిబంధనల ప్రకారం 15రోజుల ముందు మాత్రమే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి పెళ్లి పత్రిక కూడా రెడీగా ఉండాలి. అప్పుడే ఈ కానుక వర్తిస్తుంది. దీనినిబట్టి పేద కుటుంబాలలోని వారికి ఆడపిల్లల పెళ్లి పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది స్పష్టమవుతోంది. గతంలో ఎలా ఉండేది... గతంలో దుల్హన్ పథకం కింద ముస్లిం మైనార్టీలకు, గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద గిరిజనులకు ఆర్థిక సాయం అందేది. వీరి పెళ్లికార్యానికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందించేది. ఆ మేరకు గిరిజన వధువు, ముస్లిం వధువు అకౌంట్‌కు డబ్బులు జమయ్యేవి. పెళ్లికుమార్తెకు తెల్ల రేషన్‌కార్డు ఉంటే సరిపోయేది. పైగా పెళ్లికి నెలరోజుల ముందు నుంచి పెళ్లిరోజు వరకు కానీ, పెళ్లయిన రెండు నెలల వరకు ఎప్పుడైనా పెళ్లి కానుకకోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడిది రద్దయ్యింది. మూడు నెలలుగా ‘కానుక’ లేదు ఇదిలా ఉంటే.. పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకునేందుకు జ్ఞానభూమి వెబ్సైట్లో లింక్ ఇవ్వగా.. ఇది మూడు నెలలుగా పనిచేయట్లేదు. దీంతో మూడునెలలుగా పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే వీల్లేకపోయింది. ఫలితంగా ఐదువేల మంది ముస్లింలు పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయారు. ఇక గిరిజనుల్లో దాదాపు పదివేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయారు. ఇక ఎస్సీ, బీసీల్లో సుమారు 25వేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయినట్లు అధికారులే చెబుతుండడం గమనార్హం. మరోవైపు వెబ్సైట్ లోపాల వల్ల దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ సుమారు 25వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెళ్లి కానుక అందలేదని సమాచారం. ఈ విధంగా పేదరికంలో ఉన్న ఆడపిల్లల పెళ్లికోసం ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పెళ్లి కానుక పథకం ప్రభుత్వం పెట్టిన తిరకాసులతో వారికి ఏమాత్రం అందకుండా పోతోంది. -
ఈ కామర్స్ నియంత్రణకు నిబంధనలు
జెనీవా: భారత ఈ కామర్స్ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కామర్స్ రంగం 2020 నాటికి 120 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో జరిగిన మూడో ఇంటర్ గవర్నమెంటల్ నిపుణుల బృందం సమావేశంలో పాశ్వాన్ మాట్లాడారు. అంతర్జాతీయ సరఫరా చైన్ల అవతరణ, వాణిజ్య అడ్డంకులు తగ్గిపోవడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, ఈ కామర్స్ వేగవంతమైన విస్తరణతో కొత్త తరహా అనైతిక వ్యాపార ధోరణులకు ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ కోసం డైరెక్ట్ సెల్లింగ్ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ కామర్స్ రంగానికి నిబంధనలను తీసుకొచ్చే పని జరుగుతోందని చెప్పారు. -
అమెరికావి బందిపోటు షరతులు
ప్యాంగ్యాంగ్: అణు నిరాయుధీకరణ కోసం అమెరికా బందిపోటు మాదిరి షరతులు పెడుతోందని ఉత్తరకొరియా మండిపడింది. చర్చల సందర్భంగా ఆ దేశం వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరమని పేర్కొంది. అయితే, తమ మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయని అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ ఇటీవల సింగపూర్‌లో జరిపిన శిఖరాగ్ర భేటీ అనంతరం పాంపియో గత రెండు రోజుల్లో 8 గంటలపాటు ఉత్తరకొరియా కీలక నేత యోంగ్ చోల్‌తో చర్చించారు. ‘సింగపూర్ సమావేశం స్ఫూర్తిని దెబ్బతీసేలా మైక్ పాంపియో వ్యవహరిస్తున్నారు. అణ్వాయుధాలను వదిలివేసేందుకు ఏకపక్షంగా, బందిపోటు మాదిరి బెదిరిస్తూ అనేక డిమాండ్లను మా ముందుంచారు’ అని చర్చల అనంతరం ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది. -
మా మందు.. మా ఇష్టం..!
వరంగల్ క్రైం: మద్యం మత్తులో నిబంధనలు కొట్టుకుపోతున్నాయి. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల ఎదుట నడిరోడ్డుపై మందుబాబులు వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో పాటు గొడవలకు దిగుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న మద్యం షాపుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సాయంత్రం 6 గంటల దాటితే మద్యం షాపుల ఎదుట నడిరోడ్డు వరకు వాహనాలను పార్కింగ్ చేయడంతో వాహనదారులు, ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటివల హన్మకొండ అమృత జంక్షన్ పరిధిలో అశ్విని బార్లో ఉదయం 7 గంటలకే మద్యం అమ్ముతుంటే స్థానిక ఇన్స్పెక్టర్ సంతప్రావు కేసు నమోదు చేశారు. వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. మందుబాబుల వీరంగం... మద్యంషాపుల ఎదుట మందు బాబుల వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థిలు ఉన్నాయి. ఇటివల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ మద్యం షాపు ఎదుట మందుబాబుల వీరంగం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక్కడ మద్యం బాటిళ్లను కోనుక్కొని పక్కనే ఉన్న డబ్బాల ముందు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. అటువైపు వెళ్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. (ఎన్ఐటీ సమీపంలోని ఓ మద్యం షాపు ఎదుట.. ) ప్రేక్షక పాత్రలో పోలీసులు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేవు. గోపాలస్వామి గుడి సమీంలో ఉన్న మద్యం షాపులు, మిల్స్‌కాలనీ జంక్షన్, స్టేషన్ రోడ్డు, అండర్ బ్రిడ్జి, కాశిబుగ్గ జంక్షన్, హన్మకొండ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, లోకల్ డిపో, వడ్డేపల్లి క్రాస్, ఫాతిమా నుంచి కేయూ రోడ్డులోని వడ్డేపల్లి జంక్షన్, తదితర ప్రాంతాలలో ఉన్న షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు నగరంలో పార్కింగ్ లేని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నిబంధనలకు చెల్లు.. మందుబాబుల జేబుకు చిల్లు
సాక్షి, గుంటూరు: వైన్ షాపుల ముందు ధరల పట్టిక ఉండాలి.. హోలో గ్రామ్ మిషన్ ఏర్పాటు చేయాలి.. హోల్‌సేల్‌గా అమ్మకూడదు.. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించకూడదు.. ఇవన్నీ మద్యం వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు. అయితే, చాలాచోట్ల ఇవి నీటి మీద రాతల్లా మారాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి లాభాలే లక్ష్యంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుగుతున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బార్ కోడింగ్ అమలు, దుకాణాల ముందు సీసీ కెమేరాల ఏర్పాటు, ఆన్లైన్ బిల్లు వంటి నిబంధనలు తప్పనిసరి చేసినా చాలాచోట్ల అమలు అవి రికార్డులకే పరిమితంగా మారాయి. మూన్నాళ్ల ముచ్చటగా హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం మ్యానువల్‌గా మద్యం అమ్మకాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం ఎక్సైజ్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్ అమ్మకాల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. హెడోనిక్ పార్ట్ ఫైండర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా 2015 జులై 1వ తేదీ నుంచి అన్ని వైన్ షాపులు, బార్లలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, అమ్మకాలు పూర్తిగా నమోదు అవుతాయి. అయితే, ఈ విధానం నామమాత్రంగానే అమలవుతోంది. కొన్ని దుకాణాల్లో కంప్యూటర్ కూడా ఉండటం లేదు. హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం సరిగా అమలు కాకపోవడం వల్ల కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. ఈ విధానం సరిగా అమలు జరిగితే ఉదయం 10 గంటల కన్నా ముందు, రాత్రి పది గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరిపితే అధికారులకు వెంటనే సమాచారం తెలిసిపోతుంది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు వినియోగదారులకు కంప్యూటర్ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధనలు అన్ని పాటిస్తే తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానాన్ని పాటించడం లేదు. దీనివల్ల కల్తీ మద్యం బాటిళ్లు పట్టుబడినప్పుడు అవి ఎక్కడి నుంచి తయారై వచ్చాయో గుర్తించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిలువుదోపిడీ ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని బాటిల్స్‌లోనే విక్రయించాలి. కానీ జిల్లాలోని అన్ని దుకాణాల్లో విరుద్ధంగా లూజుగా విక్రయిస్తున్నారు.దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం రాయుళ్లు ఖరీదైన మద్యం సీసాల్లో మధ్య రకం బ్రాండ్లను కలిపి మందుబాబులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బార్లలో ఎమ్మార్పీ రేట్లు వర్తించవన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని యజమానులు సర్వీసు చార్జీల పేరుతో వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. కొన్ని బార్లలో బీర్ బాటిల్ ధర రూ. 110 నుంచి రూ. 170 వరకు విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్, స్థానిక పోలీసు అధికారులు నెలానెలా మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదు. కొద్ది నెలల క్రితం ఎక్సైజ్ శాఖలో లోపాలు ఆసరాగా చేసుకుని సాక్షాత్తు ఆ శాఖ ఉద్యోగే కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లాలో 185 బార్లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 4.25కోట్ల చొప్పున నెలకు రూ. 125 కోట్ల నుంచి 130 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతోంది. రోజురోజుకూ మద్యం విక్రయాలు పెరగడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అ«ధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇస్టానుసారంగా విక్రయాలు కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనండి.. లేకుంటే వెళ్లిపోండనే సమాధానం వస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తెనాలి, రేపల్లె, పల్నాడు ప్రాంతాల్లో గ్రామానికి రెండు లేదా మూడు చొప్పున బెల్టు కొనసాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిలో దాదాపుగా అందరూ అధికారపార్టీకి చెందిన వారు కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం సాహసించలేక పోతున్నారు. మా దృష్టికి వస్తేకఠినంగా వ్యవహరిస్తాం సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే బార్ కోడింగ్ విధానం అమలులో లేదు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం మాదృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాలతో త్వరలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకుంటాం.– శ్రీమన్నారాయణ, ఎక్సైజ్ డీసీ -
రాహుల్ ర్యాలీకి షరతులతో అనుమతి
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మందసోర్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి 19 షరతులతో అధికారులు అనుమతించారు. జూన్ 6న జరిగే రాహుల్ ర్యాలీకి మల్హర్‌గఢ్ సబ్ డివిజనల్ అధికారి పలు షరతులు విధించారు. రాహుల్ సభలో డీజే సౌండ్ సిస్టమ్ వాడరాదని, మత పరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని లిఖితపూర్వకంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ర్యాలీ కోసం ఏర్పాటు చేసే టెంట్ సైజ్ పైనా నియంత్రణ విధించారు. 15 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు మించకుండా వేదిక ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు పార్కింగ్ స్థలం, విద్యుత్, నీరు, అగ్నిమాపక యంత్రాలను సమకూర్చాలని సూచించారు. అగ్నిప్రమాదం, వర్షం, పిడుగుపాటు వంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు సరైన సన్నాహాలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా విధుల్లో పాల్గొనే వారి పేర్లు, మొబైల్ నెంబర్లను స్థానిక పోలీస్ స్టేషన్లో కార్యక్రమానికి ముందుగా అందచేయాలని సూచించారు. పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘిస్తే ర్యాలీకి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో సుప్రీం కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. -
అనుమతి లేకుండా బోట్లు నడిపితే క్రిమినల్ చర్యలు
విజయవాడ: నిబంధనలు పాటించని బోటు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం హెచ్చరించారు. గురువారం ఆయన తీర ప్రాంత పరిధిలో మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ, జలవనరు ల శాఖ పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో వాటర్ సేఫ్టీ, బోట్లు సామర్థ్యంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తీర ప్రాంతాల్లో నడిపే బోట్లకు తప్పనిసరిగా అనుమతులుండాలన్నారు. అనధికారికంగా తిరిగే బోట్లను స్వాధీనం చేసుకుని, యజమానులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బోట్లను ఉదయం నుంచి సాయంత్రం లోపు నిర్ణీత కాల వ్యవధిలోనే నడపాలని, సాయంత్రం 5.30 నిమిషాల తర్వాత, చీకటి వేళల్లో బోట్లను తిప్పరాదన్నారు. బోట్లలో ప్రయాణించే వారు విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు.పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. బోటు నడిపే డ్రైవర్ (సారంగ్)కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్, జలవనరులు, అటవీ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో బోట్లను తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తీరప్రాంతాల మండలాలైన ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, నాగాయలంక, కృత్తివెన్ను, తోట్లవల్లూరు మండలాల పరిధిలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి బోట్లను తనిఖీలు చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కృష్ణా నం.1 విజయవాడ: ఆరోగ్యవంతమైన చిన్నారులు కలి గిన జిల్లాగా కృష్ణా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ బి. లక్ష్మీకాంతం చెప్పారు. గురువారం ఆయన స్త్రీ, శిశు సంక్షేమం, వైద్య శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దాతల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించటం వల్ల వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. -
క‘న్నీటి’ నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: నీట్ నిబంధనలు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. పరీక్ష కేంద్రాల కేటాయింపు నుంచి నిమిషం ఆలస్యం నిబంధన దాకా.. బూట్లు, గడియారాల వంటివాటితోపాటు చెవి కమ్మలు, గాజులు, ఉంగరాలు, కాలిపట్టీలను కూడా అనుమతించకపోవడంతో నానా గందరగోళం నెలకొంది. పరీక్షా కేంద్రాల్లో తనిఖీలతో అభ్యర్థులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది విద్యార్థులను ఆపాద మస్తకం తనిఖీ చేయడంతోపాటు టార్చ్‌లైట్ సహాయంతో చెవుల్లోనూ పరిశీలించారు. ఫుల్ హ్యాండ్ షర్టులు ధరించి వస్తే.. షర్టు చేతులను సగానికి కత్తిరించారు. కనీసం చెమట తుడుచుకునేందుకు వెంట తెచ్చుకున్న చేతి రుమాళ్లను కూడా పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్లనివ్వలేదు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ మెటల్ డిటెక్టర్లను వినియోగించారు. ఉదయం ఏడు నుంచే క్యూ కట్టిన విద్యార్థులు రాష్ట్రంలో 81 పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. మొత్తంగా 50,856 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 30 వేలకుపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. చాలా మంది విద్యార్థులు ఉదయం ఏడు గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. పోలీసుల తోడ్పాటు పరీక్షకు.. హైదరాబాద్‌లో పలు కేంద్రీయ విద్యాలయాల్లో నీట్ పరీక్ష జరిగింది. అయితే పేర్లు ఒకేలా ఉండటంతో చాలామంది విద్యార్థులు పొరపాటున.. ఒకదానికి బదులుగా మరో సెంటర్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక సెంటర్ అదికాదని తెలిసి గాభరాగా మరో సెంటర్‌కు పరుగెత్తారు. ఇలాంటి పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో పోలీసుల సహాయంతో.. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోగలిగారు. హయత్‌నగర్‌కు చెందిన శ్రావ్య 9:20 గంటలకు తిరుమలగిరిలో కేంద్రీయ విద్యాలయానికి చేరుకుంది. కానీ పరీక్ష కేంద్రం అది కాదని.. బొల్లారం కేంద్రీయ విద్యాలయకు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. అప్పటికే పరీక్షా సమయం దగ్గరపడటంతో ఆమె భోరుమంది. అది గమనించిన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌వర్మ,, హరిరామశర్మ.. తమ పెట్రోలింగ్ వాహనంలో శ్రావ్యను కూర్చుండబెట్టుకుని, మిలటరీ అధికారుల అనుమతితో మిలటరీ మార్గం ద్వారా వేగంగా పరీక్ష కేంద్రానికి చేర్చారు. మధ్యలో మరో ఇద్దరు విద్యార్థినులు కూడా బొల్లారం పరీక్ష కేంద్రానికి పరుగులు తీస్తుండటం చూసి.. వారిని సైతం వాహనంలో కూర్చోబెట్టుకుని పరీక్ష సెంటర్‌కు చేర్చారు. పోలీసుల తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు. నిమిషం ఆలస్యంతో ఆశలు ఆవిరి.. కూకట్‌పల్లిలోని డీఏవీ స్కూల్ పరీక్ష కేంద్రానికి ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బోయ తులసి నిమిషం ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రం చిరునామా తెలియక ఆలస్యమైందని ఆమె బతిమాలినా.. అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాంతో కన్నీటితో వెనుదిరిగింది. డిఫెన్స్ లేబొరేటరీ పరీక్ష కేంద్రంలో నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అభ్యర్థి సుజాత, కేపీహెచ్‌బీకాలనీలోని మెరీడియన్ పాఠశాల కేంద్రం వద్దకు ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకున్న గొట్టిముక్కల నాగరచనాదేవి అనే విద్యార్థి, బంజారాహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ కేంద్రంలో పాతిక మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
తనిఖీలతో నీట్ విద్యార్థులకు ఇబ్బందులు
-
బీమా.. జీవితం మొత్తానికి
బీమా అంటే...!! పాలసీ కట్టిన వారు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే సాధనం!!. అంతేనా? నిజానికి ఇప్పటికీ చాలా మందికి బీమా అంటే ఇదే భావన ఉంది. వాస్తవానికి దీని ప్రయోజనాలు అంతకు మించి ఉన్నాయి. ఇది ఎన్నో ఆర్థిక రిస్కుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయలేకపోయినా, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసమైనా, విలువైన ఆస్తులు నష్టపోయినా.. ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పిల్లల చదువులు, ఇల్లు.. లేదా కారు కొనుగోలు లేదా ఆఖరుకు వివాహాలు మొదలైన డబ్బుతో ముడిపడి ఉన్న వాటన్నింటి కోసం ప్లానింగ్ చేసుకునేందుకు బీమా ఉపయోగపడుతుంది. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా? విషయం ఏదైనా సరే అవగాహన చాలా కీలకం. కాబట్టి ఏ బీమా పాలసీని తీసుకోవాలన్నా... ముందుగా మన ఆర్థిక లక్ష్యాలు, అవసరాల గురించి విశ్లేషించుకోవాలి. దేనికి రక్షణ కోరుకుంటున్నాము.. ఎందుకు, ఎంతకాలానికి అన్నదానిపై స్పష్టత ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. వయస్సు, ఆర్థిక పరిస్థితులు, అవసరాలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ కింద పేర్కొన్న పాలసీల్లో అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. టర్మ్ ప్లాన్: పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోనుకాకుండా భద్రత కల్పించేందుకు అత్యంత అనువైన ప్లాన్ ఇది. రుణాలు మొదలైనవి ఎన్ని ఉన్నా... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోతగిన పాలసీ ఇది. ఎండోమెంట్ ప్లాన్: దీర్ఘకాలంలో కొంత పెద్ద మొత్తం పోగు చేయడంతో పాటు కుటుంబానికి బీమా భద్రత ప్రయోజనాలు కూడా కల్పించాలనుకునే వారికి అనువైనవి ఈ ఎండోమెంట్ ప్లాన్స్. ఇటు జీవిత బీమా కవరేజినివ్వడంతో పాటు అటు పొదుపు సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ ఎలాగూ లభిస్తుంది. అలాకాకుండా ఒకవేళ పాలసీ మెచ్యూర్ అయిన పక్షంలో ఏక మొత్తంగా కూడా డబ్బు లభిస్తుంది. యాన్యుటీ ప్లాన్: రిటైర్మెంట్కి అత్యంత అనువైన పాలసీల్లో ఇది ఒకటి. నెలవారీగానీ లేదా మూడు నెలలకోసారి గానీ లేదా ఏడాదికోసారి గానీ నిర్ణీత మొత్తం చేతికందేలా పాలసీదారు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ముందుగానే పెట్టుకున్న నిర్ధిష్ట గడువు తర్వాత ఏకమొత్తంగా డబ్బు వచ్చేలా ఆప్షన్ని కూడా ఎంచుకోవచ్చు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్): ఇటు బీమా భద్రతతో పాటు అటు పెట్టుబడి సాధనంగా కూడా రెండురకాలుగా ఉపయోగపడతాయి యులిప్స్. స్టాక్స్, బాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ నిధులను బీమా కంపెనీ ఇన్వెస్ట్ చేసి, తద్వారా వచ్చే రాబడులను అందిస్తుంది. ఇవి మార్కెట్స్‌తో అనుసంధానమైన పాలసీలు కాబట్టి పెట్టుబడుల విషయంలో రిస్కు సామర్ధ్యం, అవసరాలను బట్టి పాలసీదారు ఇన్వెస్ట్మెంట్ తీరుతెన్నులను నిర్దేశించవచ్చు. ఇక ఇప్పుడు ఏ పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్న తర్వాత.. ప్లాన్ కొనుగోలుకు ముందు పరిశీలించాల్సిన అంశాల గురించి కూడా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాల్లో ఇవి కొన్ని.. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: వచ్చే క్లెయిమ్‌లలో ఎంత శాతం మందికి కంపెనీ చెల్లింపులు జరుపుతోందన్నది కీలకమైన విషయం. దీన్నే క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిగా వ్యవహరిస్తారు. ఏ కంపెనీ నుంచి పాలసీ కొనుగోలు చేసినా.. ముందుగా ఆ సంస్థ తాజా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని పరిశీలించాలి. కవరేజీ: ఎంతకు కవరేజీ తీసుకోవాలన్నది కూడా ముఖ్యమే. వార్షికాదాయాన్ని 10 సంఖ్యతో గుణించడం ద్వారా కావాల్సిన కవరేజీని తెలుసుకోవచ్చనేది ఒక బండగుర్తు. పాలసీ ప్రీమియం: పాలసీ కోసం విడతలవారీగా కంపెనీకి కట్టాల్సిన మొత్తం ఇది. ఎంత ప్రీమియం కట్టాలన్నదానితో పాటు చెల్లించేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ కూడా తెలుసుకోవాలి. ఏకమొత్తంగా కట్టాలా లేదా నెలవారీగా, మూణ్నెల్లకోసారి, ఏడాదికోసారి కట్టాలా అన్న ఆప్షన్స్‌లో ఒకదాన్ని తమ తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంచుకోవచ్చు. ఒకే రకం పాలసీకి వివిధ కంపెనీలు వసూలు చేస్తున్న ప్రీమియంలు, అందిస్తున్న ప్రయోజనాలను ఒకసారి బేరీజు వేసుకోవాలి. అవసరానికి అనుగుణమైన పాలసీ: ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా రూపొందించిన పాలసీని తీసుకోవడం కాకుండా.. తమ తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రైడర్స్‌ని కూడా పొందుపర్చుకునే వెసులుబాటు ఉండేటువంటి పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. బీమా గురించి అంతగా తెలియని పక్షంలో .. ఏజెంటును సంప్రతిస్తే వారు మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, పరిస్థితులను బట్టి అనువైన పాలసీని సూచించే అవకాశం ఉంది. అయితే, ఏదైనా సరే అన్నీ తెలుసుకున్న తర్వాతే పాలసీ కొనుగోలుపై నిర్ణయం తీసుకోండి. మరో విషయం ఏమిటంటే.. పెరిగే వయస్సుతో పాటు ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా బీమా ప్రీమియంలు పెరుగుతాయన్నది గుర్తుంచుకోవాలి. రిస్కు లు, అనిశ్చితి పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తే అవకాశం ఉంది కనుక.. సాధ్యమైనంత ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలను ఒకసారి విశ్లేషించుకుని, తగిన ఆర్థిక ప్రణాళికను సత్వరం సిద్ధం చేసుకోండి. అనిల్ కుమార్ సింగ్ చీఫ్ యాక్చువేరియల్ ఆఫీసర్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ -
షరతులు వర్తిస్తాయి
సాక్షి, సినిమా: హీరోగా అతి వేగంగా దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఈయన హీరోగా తొలి చిత్రం మనంకొత్తిపరవై యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత నటించిన మెరీనా ఓకే అనిపించుకుంది. వరుత్తపడాద వాలిభన్ సంఘం నుంచి శివకార్తికేయన్ కేరీర్ వేగం పుంజుకుంది. ఇటీవల విడుదలైన వేలైక్కారన్ చిత్రం వరకూ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా నటిస్తున్న సీమరాజా చిత్రం నిర్మాణంలో ఉంది. తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శివకార్తికేయన్ చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. అంతే కాదు కండిషన్స్ విధించడానికి వెనుకాడటం లేదు. ఈయన దర్శకుడు ఎం.రాజేశ్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడికొక సెంటిమెంట్ ఉంది. తొలి చిత్రం నుంచి ఒరుకల్ ఒరు కన్నాడీ, బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాలన్నింటిలోనూ టాస్మాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటిది శివకార్తికేయన్ ఒక టీవీకిచ్చిన భేటీలో ఇంతకు ముందు టాస్మాక్ దృశ్యాలు చాలా ఆలోచింపజేశాయని, ఇకపై అలాంటి సన్నివేశాలు గానీ, స్త్రీలను పరిహాసం చేసే అంశాలు గానీ ఉండవని పేర్కొన్నారు. అయితే ఇది దర్శకుడు రాజేశ్‌కు పెట్టే కండిషన్స్గా సినీవర్గాలు భావిస్తున్నారు. అదే విధంగా టాస్మాక్ సన్నివేశాల సెంటిమెంట్ కలిగిఉన్న దర్శకుడు రాజేశ్కిది షాక్ ఇచ్చే విషయమే అవుతుందని అనుకుంటున్నారు. మరి ఆయన శివకార్తికేయన్‌తో చేసే చిత్రాన్ని ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి. -
అసాధారణ సెలవు నిబంధనలు ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు–1933 ప్రకారం సర్వ సాధారణంగా ఉద్యోగులకు ఏ విధమైన ఆర్జిత సెలవు గాని అర్థవేతన సెలవు గానీ లేనిపక్షంలో అసాధారణ సెలవు కోసం అభ్యర్థిస్తారు. అసాధారణ సెలవు(ఎక్సాట్రార్డినరీ లీవ్) మరో విధంగా జీతం లేని సెలవు(లీవ్ ఆన్ లాస్‌ఆఫ్ పే)గా పరిగణిస్తారు. అంటే ఏ ఇతర సెలవు ఉద్యోగికి అర్హత లేనప్పుడు అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. ఈ అసాధారణ సెలవు నిబంధనలు తెలుసుకుందాం. ఇతర సెలవులు ఉన్నప్పుడు కూడా.. ఉద్యోగి లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఆర్జిత సెలవు, అర్థజీతపు సెలవు సదరు ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్నప్పటికీ అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. అసాధారణ సేవల కాలానికి ఎలాంటి జీతభత్యాలు రావు. అసాధారణ సెలవు–ఇంక్రిమెంట్లు ♦ ప్రభుత్వ ఉద్యోగి తన శక్తికి మించి అసహాయ పరిస్థితుల్లో రోగ పీడితుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందిన పక్షంలో గాని, లేక పై చదువులకు గాని, సాంకేతికపరమైన చదువులకు గాని ♦ అసాధారణ సెలవు మంజూరు చేసిన యెడల, అట్టి అసాధారణ సెలవు ఇంక్రిమెంట్లు మంజూరు చేయుటకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణించినపుడు అట్టి కాలాన్ని వార్షిక ఇంక్రిమెంటుకు పరిగణించుటకు వీలు లేదు. ♦ ఉద్యోగి మెడికల్ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అసాధారణ సెలవుపై వెళ్లిన సందర్భాలలో సంబంధిత శాఖాధిపతి అట్టి సెలవు కాలాన్ని 6 నెలలకు మించకుండా వార్షిక ఇంక్రిమెంటు కోసం కలుపుకొనుటకు అనుమతించవచ్చు. అంతకు మించిన కాలానికి ప్రభుత్వ అనుమతి కావాలి. ♦ 2002 జీవో ప్రకారం ఉద్యోగి ప్రత్యేకంగా శాఖాధిపతికి అభ్యర్థన పత్రం సమర్పించనవసరం లేదు. శాఖధిపతి బా«ధ్యత వహించి అవసరమైన చోట ప్రభుత్వ అనుమతి పొంది, అసాధారణ కాలాన్ని ఇంక్రిమెంట్‌కు కలిపి వార్షిక ఇంక్రిమెంటులను విడుదల చేయాలి. అట్టి వివరాలు సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ♦ ఈ సెలవుకు మెడికల్ సర్టిఫికెట్లు ♦ అసాధారణ సెలవు మెడికల్ ధ్రువీకరణ పత్రం ఆధారంగా పొందుటకు, గెజిటెడ్ అధికారులైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులైతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ పొందవచ్చు. ముఖ్య నిబంధనలు.. ♦ ఏ ఉద్యోగి కూడా మొత్తం సర్వీసులో ఇలాంటి సెలవులపై ఐదేళ్లు మించి వెళ్లకూడదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతిపై ఐదేళ్లు మించి వెళ్లవచ్చు.అసాధారణ సెలవు పరిమితులు ♦ సాధారణంగా 3 నెలల వరకూ తీసుకోవచ్చు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసినవారు మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 6 నెలలు వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు తీసుకోవచ్చు. ♦ ఏడాది సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగి క్షయ లేదా కుష్టు వ్యాధికి గురై, ఆస్పత్రులలో చేరినా లేదా ఔట్ పేషెంట్‌గా చికిత్స పొందుతున్న సందర్భంలో సంబంధిత మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా 18 నెలల వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు మంజూరవుతుంది. ♦ క్యాన్సర్, మానసిక వ్యాధులకు గురైన ఉద్యోగులు గుర్తింపు పొందిన వైద్య సంస్థ గాని లేక డాక్టరు జారీచేసిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 12 నెలల వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు ఇస్తారు. ♦ అసాధారణ సెలవు ఇతర సెలవులతో కలపి తీసుకొనవచ్చు. ♦ ఉద్యోగులు విదేశాల్లో ఉద్యోగం చేయుటకు కొన్ని షరతులకు లోబడి ఐదేళ్ల వరకు అసాధారణ సెలవు పొందవచ్చు. ♦ ఉద్యోగులు ఏ క్యాటగిరీకి చెందినవారైనప్పటికీ సాంకేతిక నిపుణులు, సాంకేతిక నిపుణులు గాని, లేక గుమస్తాలు గాని విదేశాల్లో ఉద్యోగం పొందుటకు దరఖాస్తు చేసుకుని వెళ్లుటకు అవకాశం కల్పించారు. ♦ కాని విదేశాలలో ఉద్యోగం అన్వేషించుటకు అసాధారణ సెలవు మంజూరు చేయకూడదు. ♦ ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన తర్వాత ఉద్యోగం చేయుటకు మాత్రమే సెలవు మంజూరు చేయవచ్చు. ♦ అసాధారణ సెలవు ఇంక్రిమెంట్‌కు, జీతభత్యాలకు, సెలవు తదితరాలకు పరిగణించబడదు. ♦ ఉద్యోగి ప్రభుత్వానికి ఏ విధమైన బాకీలు ఉండకూడదు. ఉద్యోగిపై ఏవిధమైన కేసులు న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉండకూడదు. ♦ ఇట్టి అసాధారణ సెలవు పూర్తికాల సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ♦ విదేశాల్లో పనిచేయుటకు ఐదేళ్లలో, ఒక్కసారి గాని లేక విడతల వారీగా గాని అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. -
నిబంధనలు ఉల్లంఘించలేదు
టీ.నగర్: జయలలిత సమాధి ఏర్పాటుచేయడంలో నిబంధనలు ఉల్లంఘించలేదని హై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై హైకోర్టులో సామాజికవేత్త ట్రాఫిక్ రామస్వామి ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ ఆస్తుల కేసులో శిక్షపొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి ప్రభుత్వ ఖర్చుతో మెరీనా స్మారక మండపం ఏర్పాటయిందన్నారు. దీనిపై స్టే విధించాలని కోరారు. మెరైన్ రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘించి తీరం సమీపంలో జయలలిత సమాధి ఏర్పాటయిందన్నారు. ఈ సమాధిని అక్కడి నుంచి తొలగించేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ: ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వం సంజాయిషీ పిటిషన్ దాఖలు చేసింది. మెరైన్ రెగ్యులేటరీ నిబంధనలు రూపొందించక ముందే అన్నా, ఎంజీఆర్ సమాధులు మెరినా తీరంలో ఏర్పాటయ్యాయన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి జయలలిత సమాధి ఏర్పాటుకాలేదని తెలిపారు. తీరం వద్ద రోడ్లకు అతి సమీపంలో సమాధి నిర్మించడం మెరైన్ రెగ్యులేటరీ నిబంధనలకు వ్యతిరేకం కాదన్నారు. ఈ సమాధులను తొలగించడం వీలుకాదని పేర్కొన్నారు. ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ నిరాకరించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. -
జియో ఫోన్ : షరతులు వర్తిస్తాయి!!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ఫోన్ యూజర్లకు హ్యాండ్సెట్ మొత్తాన్ని రిఫండ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఒక షరతు విధించింది. అదేమిటంటే.. సంవత్సర కాలంలో ఆ ఫోన్లో కనీసం రూ.1,500 మొత్తానికి రీచార్జ్ చేయించి ఉండాలి. యూజర్లు తొలి ఏడాది గనక రూ.1,500 పెట్టి రీచార్జ్ చేయించి ఉంటే... ఫోన్‌ను వెనక్కు ఇచ్చి రూ.500 రిఫండ్ పొందొచ్చు. అదే విధంగా రెండో ఏడాది కూడా రీచార్జ్ చేయించి ఉంటే... అప్పుడు ఫోన్ వెనక్కు ఇస్తే రూ.1,000 రిఫండ్ ఇస్తారు. అలాగే మూడో ఏడాది కూడా చేస్తే... అప్పుడు ఫోన్ ఇచ్చేసి రూ.1,500 రిఫండ్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫోన్ రీచార్జ్ విలువ కనీసం రూ.1,500 కచ్చితంగా ఉండాలి. కాగా రిలయన్స్ జియో గత ఆదివారం నుంచి ఫోన్ల డెలివరీ ప్రక్రియను చేపట్టింది. -
సమంత షరతులు
తమిళసినిమా: హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక రేంజ్‌కు ఎదిగిన తరువాత కండిషన్స్ అప్లై చేయడం అన్నది కామన్. నటి సమంత ఇందుకు అతీతం కాదు. మరికొన్ని రోజుల్లో ప్రియుడు నాగచైతన్యతో మూడు ముళ్లు, ఏడడుగులకు సిద్ధమవుతున్న సమంత నటనకు మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. విరామం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో ఎడా పెడా నటించేస్తున్న ఈ చెన్నై చంద్రం ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ కు జంటగా నటిస్తున్నారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రానికి పొన్ రాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెన్ కాశీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న సమంత తొలిరోజునే దర్శకుడిని పిలిచి ఒక కండిషన్ పెట్టారట.ఈ బ్యూటీకి స్కిన్ ఎలర్జీ ఉన్న సంగతి తెలిసిందే. పలుమార్లు చికిత్స చేయించుకున్నా అది పూర్తిగా తగ్గలేదని సమాచారం. ఈ సమస్య వల్లే సమంత దర్శకుడు శంకర్ ఇచ్చిన ఐ చిత్ర ఆవకాశాన్ని జార విడుచుకున్నారు. ఇది జరిగి పోయిన విషయమే అయినా సమంత ఇదే సమస్య కారణంగా తాజాగా నటిస్తున్న చిత్ర దర్శకుడు పొన్ రాంను పిలిచి మండే ఎండల్లో తాను నటించను. అంతకు ముందే తనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించండి. మళ్లీ ఎండ తగ్గు ముఖం పట్టిన తరువాత తాను నటిస్తాను అని షరతులు పెట్టారట. అదే విధంగా తాను నటిస్తున్నప్పుడు తనకు ఎండ తగలకుండా పైన క్లాత్ ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టారట. -
ఆ ఫార్మసీ కాలేజీల్లోనే ప్రవేశాలు
► పీసీఐ, ఏఐసీటీఈ, యూనివర్సిటీల అనుమతులు ఉండాల్సిందే ► నిర్ణయానికి వచ్చిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల నిబంధనలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు పూర్తయింది. వివిధ కాలేజీల్లోని బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సుల్లో కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో చేరేందుకు ఉండాల్సిన విధి విధానాలను కొలిక్కి తెచ్చింది. మూడు రకాల అనుమతులు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని, వాటినే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గుర్తింపు పొంది, రాష్ట్రంలోని వర్సిటీలు అనుబంధ గుర్తింపు జారీ చేసిన కాలేజీ ల్లోనే ప్రవేశాలు చేపట్టనుంది. ఇందుకోసం జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీట్ల విషయంలోనూ నిబంధనలను ఖరా రు చేసినట్లు తెలిసింది. ఏఐసీటీఈ ఒక్కో కాలేజీకి ఇష్టారాజ్యంగా సీట్లకు అనుమతిచ్చింది. కానీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి కాలేజీలో ఒక్కో బ్రాంచీలో 100 సీట్లకు మించి ఉండటానికి వీల్లేదని తెలిపింది. దీంతో ఏఐసీటీఈ ఒక్కో బ్రాంచీలో 100 కు పైగా సీట్లకు అనుమతిచ్చినా, వర్సిటీలు 100కు పైగా సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేసినా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకా రం ఒక్కో కాలేజీ లో 100 సీట్లకు మించి భర్తీ చేయకూడదని, ఒకవేళ ఏఐసీటీఈ కానీ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, యూనివర్సిటీలు కానీ సీట్లను తగ్గిస్తే ఆ తగ్గించిన సీట్లను పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. వాటిలోనే ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
షరతులపై ఉచితంగా గోశాల గిత్తదూడలు
-సోమవారం తొమ్మిది జతలు రైతులకు అందజేత -సరిగా సాకకపోతే దేవస్థానం స్వాధీనం చేసుకునే అవకాశం అన్నవరం :రత్నగిరి దిగువన దేవస్థానం గోశాలలో గల గిత్తదూడలను రైతులకు ఉచితంగా అందచేస్తున్నారు. సోమవారం తొమ్మిది జతల దూడలను వివిద గ్రామాల రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గోశాలలో ఉన్న 12 జతల గిత్త దూడలను తీసుకువెళ్లేందుకు దరఖాస్తులు కోరగా 11 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారని, వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి అందజేశామని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ విధంగా కొన్ని గిత్తదూడలను రైతులకు ఇవ్వగా తిరిగి ఇప్పుడు ఇచ్చామని తెలిపారు. ఏఈఓ సాయిబాబా, గోశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవీ షరతులు.. దూడలను తీసుకువెళ్లే వ్యక్తి చిరునామా తదితర వివరాలతో పాటు దేవస్థానం పెట్టిన షరతులన్నీ పాటిస్తానని స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి దానిని నోటరీ చేయించి దేవస్థానానికి ఇవ్వాలి. దూడలను తీసుకునే రైతులు ఆరు నెలలకొకసారి వాటిని దేవస్థానం అధికారులకు చూపాలి. దూడలను సరిగా చూస్తున్నారో లేదో అని దేవస్థానం సిబ్బందికి అనుమానం వస్తే ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వాటిని సరిగా మేపకపోతే దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. దూడను కబేళాకు తరలించడం వంటివి చేస్తే ‘గోసంరక్షణ చట్టం’ ప్రకారం దేవస్థానం అధికారులు కేసు పెడతారు. ఈ షరతులన్నింటికీ అంగీకరిస్తేనే గిత్త దూడలను అందజేస్తారు. -
షరతులు వర్తిస్తాయి!
‘మేం చెప్పినట్లు చేయాల్సిందే. కాదు కూడదంటే సినిమా వదులుకోవాల్సిందే’... బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చే నటీనటులకు ఇలాంటి కండీషన్స్ ఉంటాయి. స్టార్ అయ్యాక సీన్ రివర్స్ అవుతుంది. సినిమా ఒప్పుకునే ముందు ‘ఇలాంటివి చేయం’ అని వీళ్లే కండీషన్లు పెడతారు. ప్రస్తుతం నయనతార ఆ స్థాయిలోనే ఉన్నారు. ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించేసి, వరుసగా తమిళ సినిమాలు ఒప్పు కుంటున్నారు ఈ మలయాళ బ్యూటీ. అది కూడా తన కండీషన్లకు ఒప్పుకునే దర్శక– నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారామె. ‘సినిమాలో నటిస్తా కానీ, ప్రచార కార్యక్రమాలకు పిలవొద్దు’ అని ఎప్పుడో కండీషన్ పెట్టారు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో ఆమె కనిపించరు. తాజాగా మూడు నిబంధనలు పెట్టారట. వాటికి సమ్మతించినవాళ్లకే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెన్నై టాక్. ఆ మూడు నిబంధనల విషయానికొస్తే.. లిప్ లాక్ సీన్స్‌లో నటించనన్నది మొదటి కండీషన్, స్నానం చేసే సీన్స్‌కి నో అన్నది రెండోది, చిట్టిపొట్టి దుస్తులు వేసుకోనన్నది మూడో కండీషన్. కథ వినే ముందే నయనతార ఈ నిబంధనలను చెప్పేస్తున్నారట. స్టార్ హీరోయిన్ పెట్టే షరతులను కాదంటారా? అందుకే చిత్తం అని దర్శక–నిర్మాతలు అంటున్నారట. -
విత్‌డ్రా పరిమితికి త్వరలో ముగింపు!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతున్న ప్రజానీకానికి కొద్ది రోజుల్లో ఉపశమనం లభించనుంది. నగదు విత్ డ్రాపై ఉన్న ఆంక్షలను త్వరలో సడలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 80శాతం కొత్త కరెన్సీ బ్యాంకులకు వచ్చిన వెంటనే నిబంధనలు సడలించనున్నట్లు తెలుస్తోంది. రీమనీటైజేషన్ పూర్తి కాగానే సహకార బ్యాంకులపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లలో 50శాతం కొత్త కరెన్సీనే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం వీలయినంత త్వరలోనే ఆంక్షలు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
బెట్ట పరిస్థితుల్లో పంటల యాజమాన్యం
జేడీఏ విజయనిర్మల సూచనలు సిరిపురం (వైరా) : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయశాఖ జేడీఏ విజయనిర్మల సిరిపురం గ్రామంలో శనివారం పత్తి, మిరప, కంది తదితర పంటలను పరిశీలించారు. బెట్ట పరిస్థితుల్లో పంటల యజమాన్యం గురించి రైతులకు వివరించారు. lపత్తిలో రసం పీల్చే పురుగు అత్యధికంగా ఉందన్నారు. నివారణ చర్యల్లో భాగంగా కాండం పూత పూయాలని తెలిపారు. పత్తిలో పచ్చదోమ, తామర పురుగు నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 మి.లీ, ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటితో కలిపి ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలన్నారు. lవర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పైర్లపై పొటాషియం నైట్రేట్‌ను లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇలా చేస్తే పంటలకు కొద్దికాలం వరకు ఇబ్బందులుండవన్నారు. రైతులు వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. జేడీఏ వెంట ఏడీఏ శోభన్‌బాబు, ఏఓ ఎన్.అన్నపూర్ణ, ఏఈఓ ఎం. బాలకృష్ణ, సర్పంచ్ రామారావు పాల్గొన్నారు. -
నిబంధనలు.. తూచ్!
ఆర్యూ రిజిస్ట్రార్‌కు ఉర్దూ వర్సిటీ బాధ్యతలు ఇన్చార్జ్ వీసీ నిర్ణయం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జి వీసీ ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని వాటి సారాంశం. రాయలసీమ యూనివర్సిటీ నుంచే డాక్టర్ అబ్దుల్‌హక్ ఉర్దూ యూనివర్సిటీ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ ఇన్చార్జి వీసీగా ఆర్యూ వీసీ వై. నరసింహులును నియమించింది. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ఎవరినీ నియమించలేదు. అయితే ఇన్చార్జి వీసీ ఆర్యూ రిజిస్ట్రార్ అమరనాథ్‌కే ఊర్దూ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ పేరు మీద ప్రకటనలు.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశాలకు పచ్చజెండా ఊపింది. తాత్కాలికంగా ఉస్మానియా డిగ్రీ కళాశాలలో తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌తో పాలన సాగించాలని నిర్ణయించారు. తర్వాత ఏఓను నియమించకపోగా అమర్నాథ్కే అనధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఉర్దూ వర్సిటీ ప్రకటనలు, న్యూస్ బులెటిన్లు రిజిస్ట్రార్ పేరుతో విడుదల అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధం.. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఒక యూనివర్సిటీ అధికారి మరో యూనివర్సిటీకి పని చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ నియామకంలో వీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా తప్పులు దొర్లితే బాధ్యత ఎవరూ వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై వీసీ దష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు రిజిస్ట్రార్ నియామకం కోసం ప్రభుత్వానికి కనీసం నివేదిక కూడా పంపలేదని తెలుస్తోంది. నా పేరుతో ప్రకటనలు ఇవ్వలేను వీసీ పేరుతో ప్రకటనలు విడుదల చేయడానికి వీలు కాదు. తాత్కాలికంగా అమర్నాథ్కే ఇన్చార్జి రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించా. త్వరలోనే ఉర్దూ వర్సిటీకి పూర్తి స్థాయి రిజిస్ట్రార్ వస్తారు. – వై. నరసింహులు, వైస్ ఛాన్స్లర్ -
ఈహెచ్ఎస్ వైద్యం.. కార్డులకే పరిమితం
– ఉద్యోగులకు నగదు పెడితేనే వైద్యం – మళ్లీ తప్పని రీయింబర్స్మెంట్ – జర్నలిస్ట్ హెల్త్‌కార్డుదారులకూ కష్టాలు – ప్రీమియం చెల్లించినా అందని ఉచిత వైద్యం నగదు రహిత వైద్యం ఉద్యోగులకు కలగానే మిగిలిపోతోంది. ఈహెచ్ఎస్ (ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్) వైద్యం అమలు చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పలు రకాల ఆంక్షలు పెడుతోంది. కొన్నిసార్లు అత్యవసర వైద్యానికి సైతం ఈ పథకం వర్తించకపోవడంతో ప్రై వేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అప్పులపాలవుతున్నారు. మరోవైపు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ దీర్ఘకాలిక వ్యాధులకు నిర్వహించే ఓపీ నామమాత్రంగా కొనసాగుతోంది. – కర్నూలు(హాస్పిటల్) జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు జిల్లాలో 20కి పైగా నెట్వర్క్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. వీటితో పాటు దంత, కంటి ఆసుపత్రుల్లోనూ వీరు ఉచితంగా వైద్యసేవలు అందుకునే సౌలభ్యం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులను సైతం జారీ చేసింది. ఈ కార్డును తీసుకెళితే చాలు నగదు రహిత వైద్యం చేస్తారంటూ పేర్కొంది. మొత్తం 1800 రకాల చికిత్సలకు నగదు రహిత వైద్యం అందిస్తామని వివరించింది. ఇదే విధంగా జర్నలిస్ట్ హెల్త్‌కార్డుదారులకూ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు సూపరింటెండెంట్ కేడర్ వరకు నెలకు రూ.120, దీనికి కింది స్థాయి ఉద్యోగుల నుంచి నెలకు రూ.90ల ప్రీమియం వసూలు చేస్తున్నారు. జర్నలిస్ట్ హెల్త్కార్డుదారుల నుంచి సైతం సంవత్సరానికి రూ.1300 వరకు వసూలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ పథకం సరిగ్గా అమలు కావడం లేదు. ప్రధానంగా మెడికల్ కేసులకు పలు ఆంక్షలు పెట్టారు. ఐసీయూలో చేరి చికిత్స పొందే పలు రకాల వ్యాధులను ఈ జాబితాలో చేర్చకపోవడంతో పలువురు ఉద్యోగులు చికిత్సకు నోచుకోవడం లేదు. ఈ కారణంగా వీరు ప్రై వేటు ఆసుపత్రుల్లో వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. దానిని మెడికల్ రీయింబర్స్మెంట్ చేయించుకోవడానికి ఆయా శాఖల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అది కూడా ఉదాహరణకు రూ.1లక్ష వైద్యానికి ఖర్చు చేస్తే అందులో 20 నుంచి 40 శాతం వరకు కోత కోస్తున్నారు. పెద్దాసుపత్రిలో నామమాత్రంగా ఓపీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కింద ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓపీ కొనసాగుతుంది. 25 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. సోమ, గురువారాల్లో న్యూరో, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళ, శుక్రవారాల్లో కార్డియాలజీ, ఎండోక్రై నాలజి, బుధ, శనివారాల్లో పల్మనాలజీ, నెఫ్రాలజీ, కార్డియోథొరాసిక్, సోమవారం నుంచి శనివారం వరకు మెడికల్, ఆర్థోపెడిక్, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులకు చికిత్స చేస్తారు. ఇక్కడ ఆయా విభాగాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి చికిత్స అందించాలి. కానీ కేవలం మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాల నుంచి మాత్రమే వైద్యులు హాజరవుతున్నారు. అది కూడా కొన్నిసార్లు పీజీ వైద్యులు ఓపీలో చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందిన రోగులకు అవసరమైతే వ్యాధి నిర్దారణ పరీక్షలు అక్కడే నిర్వహించాల్సి ఉన్నా సాధారణ రోగుల మాదిరిగానే రెగ్యులర్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అది కూడా మరుసటిరోజు రిపోర్ట్ ఇస్తున్నారు. దీనికితోడు చికిత్సకయ్యే మందులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో లభించేవి మాత్రమే ఇస్తున్నారు. కొన్ని మందులు లేకపోతే బయటకు రాస్తున్నారు. ఈ కారణంగా ఉచిత వైద్యమే గానీ అదనంగా వ్యయ, ప్రయాసలవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. -
భక్తులారా.. ఈ జాగ్రత్తలు పాటించండి..
రాజమండ్రి / ఏలూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద భక్తులు పాటించాల్సిన నియమావళిని రూపొందించారు. పుష్కర యాత్రికులు అప్రమత్తంగా ఉంటూ.. స్నానఘట్టాల వద్ద ఈ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సూచించిన స్నానఘట్టాలలోనే స్నానం చేయాలి పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ముందుగా స్నానం చేసే అవకాశం ఇవ్వాలి క్యూ పద్ధతి పాటించాలి వీలైనంత తక్కువ సమయంలో పుష్కర స్నానం చేసి మిగతా వారికి అవకాశం ఇవ్వండి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించండి హారతి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం పొగతాగడం నిషేధం ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా వాహనాల్లోనే వెళ్లేందుకు ప్రయత్నించడం ఏదైనా సమస్య అనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. భక్తులు కంగారు పడి ఆందోళన కలిగిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని గుర్తించి మసలుకోవాలి స్నాన ఘట్టాల వద్ద భక్తులు వినియోగించే మెటీరియల్ వేసేందుకు ఆరెంజ్ రంగు డస్ట్‌బిన్ లు, పిండ ప్రదానం జరిగే ప్రదేశాల్లో వెదురు డస్ట్ బిన్లలో వ్యర్ధపదార్థాలను పడవేయాలి. -
మందు బాంబులు జాగ్రత్త
ఆదిలాబాద్ క్రైం : మరికొద్ది గంటల్లో 2014కు బైబై చెప్పబోతున్నాం.. కొత్త సంవత్సరాన్ని స్వాగతించనున్నాం.. అయితే.. ఈ నయా జోష్‌లో యువత కొద్దిపాట దుందుడుకు స్వభావాన్ని వీడాలి. లేకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి వచ్చింది. నయా సాల్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పార్టీలు చేసుకునేందుకు.. హంగామా సృష్టించేందుకు అందరూ సిద్ధమవుతున్నా వాటి పట్ల పలు నిబంధనలు పాటించాల్సిందే. పట్టణాలే కాకుండా.. పలె ్లల్లోనూ ఈ నిబంధనలు కొనసాగనున్నాయి. అర్ధరాత్రుల వరకూ తాగి ఊగకుండా తగిన సమయంలో ఇళ్లకు చేరుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. నిబంధనలు గానీ అతిక్రమిస్తే ఇక అంతే..! అవాంఛనీయ ఘటనలపై నిఘా.. జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, భైంసా తదితర పట్టణాలే కాకుండా గ్రామాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు జోష్‌గా జరుపుకుంటుంటారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో పోలీసు లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే హోటళ్లు కూడా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆయా వేడుకల్లో పాల్గొనే వారి జాబితాను తెలియజేయాల్సి ఉంటుంది. వేడుకలు చేసుకోవాలే తప్ప అతిగా ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి విధించారు. ఆ తర్వాత బహిరంగా ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడానికి వీల్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, బార్లపై పోలీసులు ప్రత్యేక దృషి పెట్టారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, మందుబాబుల ఆగడాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. పెట్రోలింగ్, గస్తీ కొనసాగించనున్నారు. రాత్రిళ్లో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఏర్పాటు చేయనున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఒకే చోట బహిరంగ ప్రాంతాల్లో గుంపులుగా ఉండకూడదని పేర్కొంటున్నారు. పోలీసులు ప్రధాన కూడళ్లలో రాత్రి 12 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వాహనాల్లో ఎక్కువ మొత్తంలో మద్యం తరలించకూడదు. పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం.. - తరుణ్ జోషి, ఎస్పీ జిల్లాలో అన్ని పట్టణాల్లో రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఏ హోటళ్లు అనుమతి తీసుకోలేదు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం దుకాణాలు, బార్లు తెరిచి ఉండకూడదు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు ఇవీ.. నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే హోటళ్లు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆయా వేడుకల్లో పాల్గొనే వారి జాబితాను తెలియజేయాలి. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి. ఆ తర్వాత బహిరంగా ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవద్దు. వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఒకే చోట బహిరంగా ప్రాంతాల్లో గుంపులుగా ఉండకూడ దు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు. బహిరంగగా మద్యం సేవించరాదు. అతివేగంగా వాహనాలు నడుపకూడదు. వాహనాల్లో ఎక్కువ మొత్తంలో మద్యం తరలించకూడదు. రాత్రి 10 గంటలకు జిల్లాలోని అన్ని దుకాణాలు.. 11 గంటల వరకు బార్లు మూసివేయాలి. లేకుండా చర్యలు తప్పవు. వేడుకల సమయంలో డీజే, లౌడ్స్పీకర్లకు అనుమతి లేదు. ఎక్సైజ్ అనుమతి లేనిదే హోటళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయించకూడదు. బాణాసంచా కాల్చడం నిషేధం. -
పాదరసంలా నిబంధనలు
సాక్షి, విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అధికారులు విధిస్తున్న నిబంధనలు దేవస్థాన ఆదాయానికి గండి కొట్టేవిగా ఉన్నాయి. పదేపదే తప్పులు చోటుచేసుకుంటున్నా కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై దీర్ఘకాలంగా తిష్టవేసిన నలుగురైదుగురు కాంట్రాక్టర్లు దేవస్థానంలోని లీజెస్ విభాగంలో సిబ్బందికి లంచాలు ఇచ్చి నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు సమాచారం. ఆరునెలల్లో మూడుసార్లు నిబంధన మార్పు ఏడాది పాటు భక్తులు అమ్మవారికి సమర్పించే చీరలు, రవికలు పోగు చేసుకునేందుకు గత జూన్ 30న టెండర్ పిలిచారు. ఇందులో 2012-13 సంవత్సరానికి రెండు కోట్లు టర్నోవర్ చేసిన వారు టెండర్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ టెండర్‌ను రద్దుచేసి అక్టోబర్ 28న మళ్లీ పిలిచారు. ఈ టెండర్లో గత రెండేళ్లకు రూ.2 కోట్లు టర్నోవర్ చేయాలంటూ నిబంధన మార్పు చేశారు. దీన్ని దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల రద్దు చేశారు. సోమవారం తిరిగి టెండర్ పిలిచారు. 2011-12, 2012-13 సంవత్సరాల్లో ఒకొక్క ఏడాది రూ.2 కోట్లు టర్నోవర్ చేసిన అనుభవం ఉండాలంటూ నిబంధన సడలించారు. ఇవి ఇటీవల వరకు పనిచేసిన కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ న్యాయస్థానాలకు వెళ్లి దేవస్థానం పరువు తీస్తున్నా అతనికే ఎందుకు తిరిగి టెండర్ దక్కేలా అధికారులు ప్రయత్నిస్తుండడంలో మరమ్మమేటో. అనుభవం ఎందుకు... భక్తులు సమర్పించిన చీరలు, రవికలు సేకరించే కాంట్రాక్టర్‌కు ఏడాదికి రెండు కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు వ్యాపారం చేసిన అనుభవం కావాలంటూ దేవస్థానం అధికారులు నిబంధన విధించడం విచిత్రంగా ఉంది. కాంట్రాక్టర్ తాను కోట్ చేసిన సొమ్ము ఎగ్గొట్టి పారిపోతాడని అధికారులు భావిస్తే.. మొత్తం సొమ్ముంతా ఒకేసారి కట్టాలనే నిబంధన విధించవచ్చు. లేదా వాయిదాలు ఇస్తే, ఆ గడువు రాకముందే కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి సొమ్ము రాబట్టడం, లేకుంటే టెండర్‌ను రద్దుచేయడం చేయవచ్చు. దేవస్థానంలోని సూపరింటెండెంట్‌తో పాటు కింద స్థాయి సిబ్బంది కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై వాయిదా గడువు మీరినా ఆ సొమ్ము వసూలు చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్ టెండర్ గడువు ముగిసే నాటికి దేవస్థానానికి సొమ్ము ఎగవేసి జారుకుంటున్నారు. సొమ్ము వసూలు చేయని ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం టెండర్ నిబంధనలు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్త వారికి అవకాశం లేదు.... టెండర్ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం లభించడం లేదు. దేవస్థానం విధించిన నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇస్తే ఎక్కువ ధరకు టెండర్ వేసే అవకాశముంది. దీనివల్ల దేవస్థానం ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు వస్తే తమ ఉనికి దెబ్బతింటుందని భయపడిన కాంట్రాక్టర్లు అధికారుల అండతో ని‘బంధనాలు’ బిగిస్తున్నారు. దీనిపై నూతన ఈవో పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. -
షరతులువర్తిస్తాయి
ఎంసెట్ రెండో విడత అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచేందుకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు అనుమతించింది. అయితే ఇందుకు పలు షరతులు విధించింది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని పేర్కొంది. ఇదివరకే అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులుగా తేల్చింది. గత విద్యా సంవత్సరంలో జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు కలిగి, ఈసారి గుర్తింపు నిరాకరణకు గురై.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతి మాత్రం ఉన్న కాలేజీలకే ఈ తీర్పు వర్తిస్తుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. అలాగే తొలి సెమిస్టర్ తరగతులను వచ్చే జనవరి 30 వరకు నిర్వహించేం దుకు సమ్మతించింది. గుర్తింపు రద్దు చేసి ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తమను తొలగించారని, రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతినిచ్చి తమకు న్యాయం చేయాలంటూ 44 కాలేజీలు పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. రెండు రోజులుగా వాదనలు విన్న జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో కూడిన ధర్మాసనం బుధవారం కూడా ఈ కేసును విచారించింది. రెండో విడత అడ్మిషన్లకు అనుమతినిస్తే ఇంతవరకు జరిగిన జాప్యానికి తగినట్లు సిలబస్ పూర్తి చేసేలా తరగతుల షెడ్యూల్ సమర్పించాలని కోర్టు ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం సమర్పించిన షెడ్యూల్‌పై ధర్మాసనం పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పిటిషనర్లు తాజాగా సవరించిన షెడ్యూల్‌ను కోర్టుకు అందజేశారు. ఇదే విషయాన్ని బుధవారం విచారణ మొదలు కాగానే కాలేజీల తరఫు న్యాయవాది ఆర్ దావన్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. తాజాగా రూపొందించిన షెడ్యూలులో నిబంధనలకంటే ఐదు పని గంటలే తక్కువగా ఉన్న కారణంగా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం తీర్పు వెల్లడించారు. 174 కళాశాలలకే కౌన్సెలింగ్ ఈ ఉత్తర్వుల ప్రకారం ‘2014-15 సంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌కు 174 పైచిలుకు కళాశాలలను జే ఎన్టీయూహెచ్, తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. వర్సిటీ చెబుతున్న ప్రకారం ఈ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించలేదు. మౌలిక వసతులు లేవని వర్సిటీ చెబుతోంది. అయితే వీటికి ఈ విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఉంది. అలాగే వీటిని కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు కూడా ఆదేశాలిచ్చినట్లు మా ద ృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు వీలుగా ప్రస్తుత ఉత్తర్వులను జారీచేస్తున్నాం. 2013-14కు అనుబంధ గుర్తింపు కలిగి, 2014-15కు అనుబంధ గుర్తింపు పొందలేక, కేవలం ఏఐసీటీఈ అనుమతి మాత్రమే కలిగి ఉన్న కళాశాలలను.. అంటే తొలి కౌన్సెలింగ్‌లో పాల్గొనని 174 పైచిలుకు కాలేజీలకు ఈ తీర్పు వర్తిస్తుంది. అక్టోబర్ 31న కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేయాలి. నవంబర్ 14 నాటికి ప్రక్రియ పూర్తిచేయాలి. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలి. అలాగే తొలి సెమిస్టర్ తరగతుల బోధనను జనవరి 30 నాటికి పూర్తిచేయాలి. అంటే సుమారు 76 రోజుల సమయం ఉంది. వీటిలో ఆదివారాలు, క్రిస్మస్, డిసెంబర్ 31, జనవరి 1 తేదీలను మినహాయించి.. మిగిలిన రోజుల్లో రోజుకు 8 నుంచి ఎనిమిదిన్నర గంటలు బోధించవ చ్చు. ఈ లెక్కన జనవరి 30 నాటికి 525 గంటలను పూర్తిచేయవచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రిపరేషన్ కోసం సెలవులు ఇవ్వాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు పరీక్షలు నిర్వహించాలి. సెకండ్ సెమిస్టర్ మార్చి 2 నుంచి జూన్ 30 వరకు కొనసాగాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అనుబంధ గుర్తింపు ఇలా.. ‘2014-15కు అనుబంధ గుర్తింపు పొందని కళాశాలలు నవంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు వీలుగా తనిఖీలు చేసుకోవచ్చు. అయితే ఇందుకు యూనివర్సిటీ కాకుండా తెలంగాణలో ఉన్న ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ సంస్థల నిపుణులతో ఏర్పాటుచేసిన ఒక కమిటీని వినియోగించుకోవాలి. (ఆ సంస్థలతో తనిఖీలు చేయించేందుకు వీలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం, వర్సిటీ తరఫు న్యాయవాదులు కోరారు) కళాశాలలు కూడా ఈ తనిఖీలకు సహకరించాలి. తనిఖీలన్నీ పూర్తయ్యాక యూనివర్సిటీ అనుబంధ గుర్తింపునకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించాలి. డిసెంబర్ 31లోగా ఈ నిర్ణయం తీసుకోవాలి. గుర్తింపు నిరాకరిస్తే ఎందుకు నిరాకరించారో కోర్టుకు వర్సిటీ చెప్పాలి. అలాగే గత ఏడాది ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాలి. ఒకవేళ చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోరాదు. మౌలిక వసతులన్నీ ఉండేలా చూడాలి. కానీ 10 కంప్యూటర్లు లేనిచోట 100 కంప్యూటర్లు లేవంటూ రాయకూడదు. కళాశాలలు కూడా వ ర్సిటీ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. అడ్మిషన్లు షరతులపై ఇస్తున్నట్టు విద్యార్థులకు తెలియపరచాలి. ఒకవేళ అనుబంధ గుర్తింపు లభించకపోతే ఫీజును వడ్డీతో సహా వెనక్కిచ్చేందుకు వీలుగా విద్యార్థుల పేరుతో ప్రత్యేక ఖాతా తెరవాలి’ అని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. కేవలం తెలంగాణకే.. ‘ఈ ఉత్తర్వులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తాయి. దీనికి అనుగుణంగా మరే ఇతర రాష్ట్రం కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవకాశం తీసుకోరాదు. అలాగే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కళాశాల మార్చుకునేందుకూ వీలు లేదు. రీ అడ్మిషన్ పొందేందుకు కూడా వీలు లేదు. ఎంసెట్‌లో అర్హత సాధించి అడ్మిషన్ తీసుకోని వారు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75 శాతం ఉండాలి. అలా హాజరు లేని వారిని తదుపరి సెమిస్టర్‌కు అనుమతించకూడదు. తాజా షెడ్యూలును అనుసరిస్తామని కళాశాలలవారీగా ప్రమాణ పత్రం సమర్పించాలి. అనుబంధ గుర్తింపు కోసం ఇచ్చే ప్రమాణ పత్రం, షెడ్యూలు కోసం ఇచ్చే ప్రమాణ పత్రంలో దేనినైనా ఉల్లంఘిస్తే.. తాజా తీర్పును ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తాం. కళాశాలలు తగిన వసతులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నెల గడువు ఇస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘కౌన్సెలింగ్ గడువు పొడిగింపు కేవలం తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుంది. ఇదివరకే అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. రీ అడ్మిషన్‌కు, కళాశాల మార్పునకూ అవకాశం లేదు. గత విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఉండి, ఈసారి గుర్తింపు పొందకుండా.. ఏఐసీటీఈ అనుమతి మాత్రం ఉన్న 174 పైచిలుకు కాలేజీలకు ఈ తీర్పు వర్తిస్తుంది. కోర్టు సూచించిన షరతుల ప్రకారం కౌన్సెలింగ్, తరగతులు నిర్వహించాలి. వసతుల ఏర్పాటుకు నెల గడువిస్తున్నాం. ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ సంస్థల నిపుణులతో కూడిన కమిటీతో తనిఖీలు జరగాలి. చిన్నాచితక కారణాలతో గుర్తింపు రద్దు చేయడం సరికాదు. తనిఖీల తర్వాత అనుబంధ గుర్తింపు రద్దయితే ఆయా కాలేజీల్లోని విద్యార్థుల అడ్మిషన్లు కూడా రద్దవుతాయి. వారి ఫీజులు వడ్డీతో సహా వెనక్కిచ్చేలా ప్రత్యేక ఖాతా నిర్వహించాలి. విద్యార్థులకు ఈ షరతులు ముందే తెలపాలి. తొలి సెమిస్టర్లో 75 శాతం హాజరు లేకపోతే రెండో సెమిస్టర్‌కు అనుమతించకూడదు’ - సుప్రీం తీర్పు సారాంశం న్యాయం మా వెంటే ఉంది రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాలేజీల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. బుధవారం ఉదయం తీర్పు వెలువడిన తర్వాత కాలేజీల ప్రతినిధులు సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘తీర్పు మావైపే వచ్చింది. దేశంలో న్యాయవ్యవస్థ ఎంతో సమర్థంగా ఉన్నందుకు న్యాయమూర్తులకు, మా న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు అన్ని కళాశాలల్లో చేరవచ్చని తీర్పులో చెప్పారు’ అని తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు తిరుమలరావు అన్నారు. తనిఖీల గురించి తామెప్పుడు భయపడలేదని, ఇప్పటికే రెండుసార్లు తనిఖీలు పూర్తయ్యాయని తెలిపారు. ‘చిన్నచిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మా కాలేజీల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నాం. ఏవిధమైన తనిఖీలు నిర్వహించినా ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామన్నారు. 43 మైనార్టీ కళాశాలల్లో కేవలం మూడింటికే అనుమతులిచ్చారని, మిగిలిన వాటికి అనుమతులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ మైనార్టీ కాలేజీల సంఘం ప్రతినిధి కోరారు. ఇదీ షెడ్యూల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: అక్టోబర్ 31, 2014 కౌన్సెలింగ్ ముగింపు: నవంబర్ 14, 2014 తరగతులు ప్రారంభం: నవంబర్ 15, 2014 తొలి సెమిస్టర్ బోధన ముగింపు: జనవరి 30, 2015 పరీక్షలకు ప్రిపరేషన్ సెలవులు: ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు పరీక్షల నిర్వహణ: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు సెకండ్ సెమిస్టర్ ప్రారంభం: మార్చి 2, 2015 తరగతులు, ప్రిపరేషన్ పూర్తి: జూన్ 30, 2015 పరీక్షల నిర్వహణ: జూలై 1 నుంచి 15 వరకు -
ఎలాంటి హింస జరిగినా బెయిల్ రద్దు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు, ఆమె సహచరులు శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు మంజూరుచేసిన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు పలు షరతులు విధించింది. అలాగే, ఫాలీ నారిమన్ వాదనలు వినిపించే సమయంలో కూడా పలు హామీలు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి తెలిపారు. జయలలితకు, ఆమె సహచరులకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలా వద్దా అనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. దాదాపు 35 వేల కాగితాలతో కూడిన కొన్ని పత్రాలను డిసెంబర్ 18వ తేదీలోగా కర్ణాటక హైకోర్టుకు సమర్పించాలని, ఒకవేళ అలా సమర్పించలేకపోతే మాత్రం వెంటనే బెయిల్ రద్దవుతుందని స్వామి చెప్పారు. బెయిల్ కూడా డిసెంబర్ 18 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. కర్ణాటక హైకోర్టు విచారణ మీద ఎలాంటి వాయిదా కోరకూడదు. ఆ తర్వాత కూడా జయకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయం మీద కర్ణాటక హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది. జయలలితకు బెయిల్ మంజూరు అయిన తర్వాత తమిళనాడులో ఎలాంటి హింస జరగబోదని, జడ్జిల గురించి గానీ, వేరే ఎవరి గురించి గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోరని జయ తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది ఫాలీ నారిమన్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. ఎక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటన జరిగినా, తనపై దాడి జరిగిందని సుబ్రమణ్యం స్వామిలాంటి వాళ్లు ఎవరైనా చెప్పినా కూడా వెంటనే బెయిల్ రద్దవుతుందని అన్నారు. జయలలితకు అనారోగ్యంగా ఉందన్న కారణంతోనే బెయిల్ ఇస్తున్నందువల్ల.. డిసెంబర్ 18వ తేదీ వరకు ఆమె ఇల్లు వదిలి వెళ్లకూడదని, అలాగే సందర్శకులను కూడా చూడకూదని కూడా షరతులు విధించారు. -
రుణమాఫీ చేద్దాం కానీ..
-
రుణ మాఫీపై ఆంక్షలు!
-
రుణ మాఫీపై ఆంక్షలు!
ఆర్ధిక భారం తగ్గించుకునే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన మొదటిరోజే వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ నమ్మబలికిన చంద్రబాబు ఆ మేరకు తొలి సంతకం చేయకపోగా.. కమిటీ పేరుతో నెలన్నర సాగదీసి చివరకు పలు ఆంక్షలతో రుణమాఫీని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్క రుణం మాత్రమే మాఫీ చేయాలని, అది కూడా ఒక కుటుంబానికి చెందిన లక్షన్నర వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించిన విధివిధానాల ఖరారు, అందుకు అవసరమైన ఆర్ధిక వనరుల సమీకరణపై కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై చర్చించింది. రుణ మాఫీకి పరిమితులు విధించాలని, ఈ వారంలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూత్రప్రాయంగా నిర్ణరుుంచింది. రాష్ర్టంలో మొత్తం పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రూ.60 వేల కోట్ల మేరకు ఉండగా.. పరిమితులతో దాన్ని రూ.25 వేల కోట్లకు కుదించవచ్చని కమిటీ భావిస్తోంది. వ్యవసాయ టర్మ్ రుణాలు, వాణిజ్య పంటల రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై తీసుకున్న రుణాలు, గతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట రుణాలు వ్యవసాయ టర్మ్ రుణాలుగా మారిన వాటికి మాఫీ అసలుకే వర్తింపజేయరాదని నివేదికలో సూచించనున్నట్టు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. బంగారం కుదవ పెట్టి తీసుకున్న రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ అంగీకరించలేదని భేటీలో పాల్గొన్న ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రీ షెడ్యూల్‌పై మంగళవారం ఆదేశాలు జారీ కావచ్చన్నారు. రైతు రుణ ఖాతాకు ఆధార్ లింక్ చేయండి అన్ని బ్యాంకులకు ఎస్ఎల్బీసీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని లెక్కలేసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రైతుల రుణ ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయాల్సిందిగా అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై వీలైనంతవరకు రుణ భారం తగ్గుతుందని, రైతుల మీద రుణ భారం పెంచడానికి దోహదపడుతుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆధార్ ఉంటేనే రుణ మాఫీ అవుతుందని, లేదంటే కాదని కూడా స్పష్టం చేయాలని బ్యాంకర్లకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు. మాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వండి ఏపీ సర్కారుకు బ్యాంకర్ల కమిటీ లేఖ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పంట రుణాల రైతులే కాకుండా వ్యవసాయ టర్మ్ రుణాలు, వాణిజ్య పంటలకు తీసుకున్న రుణాలను కూడా చెల్లించడం లేదని.. ఆ రుణాల రెన్యువల్‌కు కూడా ముందుకు రావడం లేదని పేర్కొంది. ఫలితంగా ఆయా రుణాలు బకాయిలుగా మారడమే కాకుండా నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ)లు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితుల్లో ఎప్పటివరకు తీసుకున్న రుణాలను, ఏ రంగానికి చెందిన రుణాలను మాఫీ చేస్తారో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ఎస్ఎల్బీసీ కన్వీనర్ సి.దొరస్వామి లేఖ రాశారు. రుణ మాఫీపై పిల్ కొట్టివేత సాక్షి, హైదరాబాద్ : రైతు రుణ మాఫీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రుణ మాఫీపై ప్రభుత్వాలు అధికారికంగా ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోనందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. -
‘అర్ధరాత్రి’పై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతోపాటు కొత్త ఏడాదిని ఘనంగా ఆహ్వానించేందుకు నగరవాసులు ఎన్నో ప్రణాళికలు రూపొందిం చుకుంటున్నారు. వేడుకల కోసం ఇప్పటికే నగరంలోని పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే వేడుకల పేరిట అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే దృష్టి సారించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక నిబంధనలు అమలులోకి తేనున్నారు. ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్‌లో 31 వేడుకల కారణంగా ఎలాంటి ఘర్షణలు, మహిళలపై వేధింపుల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కన్నాట్‌ప్లేస్(సీపీ)లో దాదాపు 50 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ప్రతి హోటల్, రెస్టారెంట్ వద్ద ఒక పోలీస్‌ను అందుబాటులో ఉంచేలా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీపీలో ఆ రాత్రి వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మ్యూజిక్ పూర్తిగా బంద్ చేయాలి. రాత్రి 12.55 గంటల తర్వాత హోటల్లో భోజన విక్రయాలు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. కన్నాట్‌ప్లేస్ ఔటర్ సర్కిల్లో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తారు. ఢిల్లీలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓ నుంచి డీసీపీ స్థాయి వరకు అధికారులు రాత్రి 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు ఏరియా పెట్రోలింగ్ నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్.బస్సీ,స్పెషల్ కమిషనర్(శాంతిభద్రతలు) దీపక్‌మిశ్రా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో పీసీఆర్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది పోలీసులను రోడ్లపై వాహనాల తనిఖీలకు వినియోగించనున్నారు. మద్యం సేవించి మహిళలను వేధించే వారిపై దృష్టి సారించనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రానున్న వారం రోజుల పాటు నగరంలో రాత్రి పూట గస్త్తీని కూడా పెంచుతామన్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న గస్తీ సిబ్బందితో పాటు 15 వేల రిజర్వ్ సిబ్బందిని కూడా రాత్రివేళ గస్తీ విధుల కోసం వీధులలో మోహరిస్తామని తెలిపారు. జనవరి మొదటివారం వరకు నగరంలో రాత్రి పూట గస్తీపై మరింత శ్రద్ధ వహించనున్నామని వెల్లడించారు. -
అయ్యప్పదీక్ష నియమాలలోని అంతరార్థాలు...
రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రోగనిరోధక గుణం గల తులసి, రుద్రాక్షలు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి. ఆహారనియమం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. ఇంద్రియ నిగ్రహానికి ప్రధానకారకమైన కామం పైన అదుపు ఉండటం కోసమే అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. పాదరక్షలు ధరించకపోవడం వల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. అంతేకాదు... పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు ఉంటుంది. మండలం రోజులపాటు ఈ నియమాలన్నీ సరిగ్గా పాటిస్తే మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుంది. అందుకే ఇన్ని నియమాలు. -
ఆదాయం, ఉద్యోగుల వివరాలివ్వొద్దు
ఆర్థిక శాఖకు మినహా ఎవరికైనా ఇస్తే క్రమశిక్షణ చర్యలు అంతర్గత సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, ఉద్యోగుల వివరాల వెల్లడిపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఆదాయం, ఉద్యోగులకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ మినహా ఎవరు అడిగినా ఇవ్వరాదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ అంతర్గత సర్క్యులర్‌ను గురువారం జారీ చేశారు. సర్క్యులర్‌కు విరుద్ధంగా ఎవరు వివరాలిచ్చినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రాం తాల వారీగా ఆదాయ వివరాలు, ఉద్యోగుల వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే సర్క్యులర్ జారీ చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరు అడిగినా ఇవ్వాల్సి ఉంటుంద న్న విషయాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలు చేయాల్సిన శాఖాధిపతే ఆ చట్టం నిబంధనలకు విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సర్వీసు రిజిస్టర్ ఆధారంగా వారి స్వస్థలాల సమాచారాన్ని అంతర్గతంగా సేకరిస్తోంది. సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న స్వస్థలం ఆధారంగా ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలను తయారు చేస్తోంది. ఏ జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తోంది. ఏ జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా సేకరిస్తోంది. ఇవన్నీ కూడా అనధికారికంగానే అంతర్గత సమాచారం పేరుతో ఉన్నతస్థాయి సూచనల మేరకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయ, ఉద్యోగుల వివరాల సమాచారం కావాలంటూ ఎప్పుడు ఆదేశాలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకే అంతర్గతంగా సమాచార సేకరణ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.