నిబంధనలు ఉల్లంఘించలేదు | state government clarify on jayalalitha grave | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘించలేదు

Published Tue, Jan 30 2018 8:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:40 PM

state government clarify on jayalalitha grave - Sakshi

జయలలిత సమాధి

టీ.నగర్‌: జయలలిత సమాధి ఏర్పాటుచేయడంలో నిబంధనలు ఉల్లంఘించలేదని హై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై హైకోర్టులో సామాజికవేత్త ట్రాఫిక్‌ రామస్వామి ఇటీవల ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అక్రమ ఆస్తుల కేసులో శిక్షపొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి ప్రభుత్వ ఖర్చుతో మెరీనా స్మారక మండపం ఏర్పాటయిందన్నారు. దీనిపై స్టే విధించాలని కోరారు. మెరైన్‌ రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘించి తీరం సమీపంలో జయలలిత సమాధి ఏర్పాటయిందన్నారు. ఈ సమాధిని అక్కడి నుంచి తొలగించేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ వివరణ: ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వం సంజాయిషీ పిటిషన్‌ దాఖలు చేసింది. మెరైన్‌ రెగ్యులేటరీ నిబంధనలు రూపొందించక ముందే అన్నా, ఎంజీఆర్‌ సమాధులు మెరినా తీరంలో ఏర్పాటయ్యాయన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి జయలలిత సమాధి ఏర్పాటుకాలేదని తెలిపారు. తీరం వద్ద రోడ్లకు అతి సమీపంలో సమాధి నిర్మించడం మెరైన్‌ రెగ్యులేటరీ నిబంధనలకు వ్యతిరేకం కాదన్నారు. ఈ సమాధులను తొలగించడం వీలుకాదని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ రామస్వామి పిటిషన్‌ నిరాకరించాలని కోరారు. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement