కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మందసోర్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి 19 షరతులతో అధికారులు అనుమతించారు. జూన్ 6న జరిగే రాహుల్ ర్యాలీకి మల్హర్‌గఢ్ సబ్ డివిజనల్ అధికారి పలు షరతులు విధించారు. రాహుల్ సభలో డీజే సౌండ్ సిస్టమ్ వాడరాదని, మత పరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని లిఖితపూర్వకంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.
ర్యాలీ కోసం ఏర్పాటు చేసే టెంట్ సైజ్ పైనా నియంత్రణ విధించారు. 15 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు మించకుండా వేదిక ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు పార్కింగ్ స్థలం, విద్యుత్, నీరు, అగ్నిమాపక యంత్రాలను సమకూర్చాలని సూచించారు. అగ్నిప్రమాదం, వర్షం, పిడుగుపాటు వంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు సరైన సన్నాహాలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు.
ర్యాలీ సందర్భంగా విధుల్లో పాల్గొనే వారి పేర్లు, మొబైల్ నెంబర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌లో కార్యక్రమానికి ముందుగా అందచేయాలని సూచించారు. పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘిస్తే ర్యాలీకి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో సుప్రీం కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment