ralley
-
ఆ రెండు దేశానికి రాహు-కేతువులు!
రాజస్తాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా బహిరంగ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం జరిగిన ఈ బహిరంగ ర్యాలీ అమిత్ షా మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న రాహు-కేతువులని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో భారతదేశానికి తలెత్తే కష్టాలన్నింటికీ గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ల వల్లనే వస్తుందని విమర్శలు గుప్పించారు. భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మోదీ.. తాను చెప్పినట్లుగానే చంద్రయాన్‌తో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రునిపై రెపరెపలాడేలా చేశారు. అంతేగాక జీ 20 ఆతిథ్యంతో భారత దౌత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాన మోదీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ. 6 వేలుగా ఉన్నదాన్ని కాస్తా రూ. 12 వేలు చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మిల్లెట్‌ను ఎంఎస్పీకి కొనుగోలు చేస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్లను తమ పార్టీ కేవలం రూ. 450/- లకే అందిచింది. ఇలా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఇదిలా ఉండగా అంతకు మునుపు రాజస్తాన్‌లోని నసీరాబాద్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ..రాహుల్ గాంధీ పదేపదే ఓబీసీ వర్గాల గురించి మాట్లాడుతున్నారు. జవహర్ లాల్ నెహ్రు దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు సుమారు నాలుగు తరాలు గాంధీలు ఓబీసీ వర్గాల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కానీ బీజేపీ జాతీయ వెనుకబడిని తరగతుల కమిషన్(ఎన్సీబీసీ)ని రాజ్యాంగబద్ధంగా మార్చింది. అలాగే తొలి ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చిన ఘనత కూడా మాదే. ఇలాంటివి కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. పైగా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో రాజస్తాన్ ముఖ్యమంతి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత అవినీతి మయ ప్రభుత్వాని చూడలేదంటూ చిరాకుపడ్డారు. ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అవినీతి పరులందరికీ శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేపర్ లీక్‌లు జరగకుండా చూడటమే కాకుండా సుమారు 2.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అంతేగాదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. 2004-14 మధ్య కాలంలో రాజస్తాన్‌కి కేవలం రెండు లక్షల కోట్ల రూపాయాలు తగ్గించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ మోదీ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌కు తొమ్మిదేళ్లలో దాదాపు 6 లక్షల డభైవేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిసాన్ సమ్మాన్ కింద రైతులకు రూ. 12 వేలు వరకు ఇవ్వడమే గాక వైద్య ఖర్చులు దాదాపు 10 లక్షల వరకు భరిస్తామని చెప్పుకొచ్చారు అమిత్ షా. కాగా, రాజస్తాన్‌లో ఈ నెల 25న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ఈసారి 199 స్థానాల్లోనే ఎన్నికలు జరగనుండటం గమనార్హం. (చదవండి: నో డౌట్ గహ్లోత్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం) -
కొత్త జిల్లాలు..మిన్నంటిన సంబరాలు
సాక్షి నెట్వర్క్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు రెట్టింపు అవడంపై వాడవాడలా సంబరాలు మిన్నంటాయి. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు ఉన్నతాధికారుల బాధ్యతల స్వీకారంతో సందడిగా మారాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. వాడవాడలా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల కల నెరవేరినందుకు ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ► విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంతో కొత్త జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త పాలనా యంత్రాంగం కొలువుదీరింది. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో తొలిరోజునే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజెన్సీలోని మండలాల్ని కలుపుతూ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటుచేయడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో హుషారుగా ప్రదర్శనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ► శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌లు సోమవారం ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ► విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం ‘కొత్త’ సందడి కనిపించింది. మన్యం జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు వివిధ విభాగాలను డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణితో పాటు ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, కళావతి, కలెక్టర్, ఎస్పీలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గరివిడి మండలం నుంచి చీపురుపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటుతో ప్రజలు కేరింతలు కొట్టారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా కల నెరవేరడంతో కోనసీమ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలు అందంగా అలంకరించారు. జాతీయ జెండాలు ఎగరవేశారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక కాకినాడ జిల్లా కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా బొమ్మూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నిడదవోలు నుంచి గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వరకు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నూతన జిల్లా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎలీజా, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్ అప్పారావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ► ఉమ్మడి కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా మార్చడంతో మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్లలో సందడి వాతావరణం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా రంజిత్ బాషా, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్‌గా ఢిల్లీరావు బాధ్యతలు స్వీకరించారు. పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ సీఎం జగన్ చిత్రపటానికి పూలతో అభిషేకం చేశారు. ► ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా సభలు నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ ఏసురత్నం, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ► ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సోమవారం జనసంద్రమైంది. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయడంతో పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. ఒంగోలు పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వెంకటాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. సీఎం చిత్రపటానికి కాకాణి క్షీరాభిషేకం చేశారు. ► ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాలతో ర్యాలీ హోరెత్తింది. గడికోట, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్, కలెక్టర్ గిరీషా, జేసీ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు ఊరేగింపుగా పాల్గొన్నారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. ► గత పాలకులు సాధించలేనిది మూడేళ్లలో జగనన్న సాయంతో సాధించామని తిరుపతి జిల్లాలో ఏర్పాటైన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరిందన్నారు. అంతకుముందు.. పార్టీ మహిళా నేత బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. నూతన జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి శంకరనారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పీవీ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ బసంత్‌కుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, బాబా భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టపర్తి వీధులన్నీ సందడిగా మారాయి. మడకశిర, కదిరిలోనూ సంబరాలు చేసుకున్నారు. ► నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్‌బాషా, భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రనాథరెడ్డి, ఎస్పీ రఘువీరారెడ్డి, జేసీ నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు: సీఎం వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తూ ప్రకటన చేయగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక ఘటన అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ, విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: లక్ష మందికి నైపుణ్య శిక్షణ) -
కృష్ణా మీదుగా తెనాలి వరకు..భారీగా బైక్ ర్యాలీ
విజయవాడ : కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో బీసీ సంగీభావ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాల మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వరకు ఈ సంగీభావ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు వేలసంఖ్యలో బీసీలు తరలివచ్చారు. ఎమ్మెల్యే పార్థసారధి 130 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీకి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి, జోగి రమేష్ , కైలే అనీల్ కుమార్‌లు పాల్గొన్నారు. వీరంకి లాకు వద్ద బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొననున్నారు. బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్సార్ కృషి చేస్తే, నేడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ కల్లబొల్లి మాటలతో బీసీలకు బాబు శఠగోపం పెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్ ) వైఎస్ జగన్ పద్నాలుగు నెలల్లోనే తన మార్కు పాలన చూపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. ఐదేళ్ల టిడిపిలో జనానికి చీకటి చూపిస్తే..ఏడాదిలోనే జగన్ వెలుగులు నింపారని, రాజకీయ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వైఎస్సార్ లేని లోటును తీర్చి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ బకాయిలు పెట్టిపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన చికిత్స అందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అవసాన దశలో ఉన్నాడని, కుట్రలు ,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నాడని ద్వజమెత్తారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా, అవినీతి లేని పాలన అందిస్తున్నామని వెల్లడించారు. (సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ ! ) -
అభివృద్ధి వికేంద్రకరణతోనే రాష్ట్రాభివృద్ధి
సాక్షి గుంటూరు : బినామీ రాజధాని వద్దు.. ప్రజా రాజధాని కావాలి అంటూ మందడంలో బహుజన పరిరక్షణ సమితి భారీ ర్యాలీ నిర్వహించింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి వినతి పత్రం సమర్పించారు. అభివృద్ధి వికేంద్రకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలని ప్రధాని అనుకున్నారని, కానీ అమరావతి ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిపోయిందని పేర్కొన్నారు. అమరావతిలో 52వేల మంది పేదలకు ఇళ్లు కేటాయిస్తే టీడీపీ అడ్డుకొని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై దుర్భాషలాడి ఇప్పుడు శిలాఫలకానికి పూజలు చేయడం దారుణమని, అమరావతి పేరుతో బాబు కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి ఆరోపించింది. -
రాహుల్ ర్యాలీకి షరతులతో అనుమతి
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మందసోర్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి 19 షరతులతో అధికారులు అనుమతించారు. జూన్ 6న జరిగే రాహుల్ ర్యాలీకి మల్హర్‌గఢ్ సబ్ డివిజనల్ అధికారి పలు షరతులు విధించారు. రాహుల్ సభలో డీజే సౌండ్ సిస్టమ్ వాడరాదని, మత పరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని లిఖితపూర్వకంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ర్యాలీ కోసం ఏర్పాటు చేసే టెంట్ సైజ్ పైనా నియంత్రణ విధించారు. 15 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు మించకుండా వేదిక ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు పార్కింగ్ స్థలం, విద్యుత్, నీరు, అగ్నిమాపక యంత్రాలను సమకూర్చాలని సూచించారు. అగ్నిప్రమాదం, వర్షం, పిడుగుపాటు వంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు సరైన సన్నాహాలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా విధుల్లో పాల్గొనే వారి పేర్లు, మొబైల్ నెంబర్లను స్థానిక పోలీస్ స్టేషన్లో కార్యక్రమానికి ముందుగా అందచేయాలని సూచించారు. పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘిస్తే ర్యాలీకి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో సుప్రీం కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. -
పౌష్టికాహార సిబ్బంది రోడ్డెక్కారు
సాక్షి, చెన్నై: ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ పౌష్టికాహార సిబ్బంది తమ డిమాండ్ల సాధనకు రోడ్డెక్కారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. ఓ వైపు నిరసనకు దిగినా, మరో వైపు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం సిద్ధంచేసి పెట్టడం విశేషం. రాష్ట్రంలో 68వేల పౌష్టికాహార కేం ద్రాలు, 35వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో రెండు లక్షల యాభై వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఆలనా పాలన, విద్యాబుద్ధులు చూడటం ఈ సిబ్బంది దిన చర్య. పౌష్టికాహార పథకం అమల్లో ఇటీవల మెనూ మార్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. దీంతో సిబ్బందికి అదనపు భారం తప్పలేదు. అలాగే, ఉన్న ఖాళీల రూపంలో మరింత భారాన్ని ఎదుర్కొంటున్నారు. చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న ఈ సిబ్బంది పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తమ విజ్ఞప్తులను తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చివరకు పౌష్టికాహార, అంగన్ వాడీ ఉద్యోగ, సిబ్బంది సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడికి లక్ష్యంగా నిరసనలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వీరు ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం మేల్కొంది. ఎక్కడ పౌష్టికాహార పథకం అమలుకు అడ్డంకులు బయలు దేరుతాయోనన్న ఆందోళనలో పడింది. వీరి ఆందోళనకు బ్రేక్ వేయించడం లక్ష్యంగా హెచ్చరికలను జారీ చేసింది. ఆందోళనలో పాల్గొంటే, చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఈ సమాఖ్య ఉద్యోగ, సిబ్బంది ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముట్టడి యత్నం: పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాల్లోని 40 వేల ఖాళీ పోస్టుల భర్తీ, పౌష్టికాహారం పథకం అమలుకు ప్రత్యేక శాాఖ, వేతనాల పెంపు, పని భారం తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదోన్నతులు, తదితర డిమాండ్లతో ఉదయం పదిన్నర గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. ర్యాలీల రూపంలో మహిళలు కదంతొక్కారు. జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. అయితే, మార్గం మధ్యలోనే వీరిని అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మహిళా పోలీసుల సాయంతో బలవంతంగా అరెస్టు చేశారు. కొన్ని చోట్ల మహిళా పోలీసుల సంఖ్య కంటే, నిరసనలో పాల్గొన్న మహిళల సంఖ్య అధికంగా ఉండడంతో ఇరకాటం తప్పలేదు. చెన్నైలో ఆ సమాఖ్య అధ్యక్షురాలు తమిళరసి నేతృత్వంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో రాజాజీ సాలైలో బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. పలుమార్లు ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించారు. అయితే, నిరసనకారులు ఖాతరు చేయలేదు. చివరకు వారందరినీ అరెస్టు చేసి, సమీపంలోని ఓ కల్యాణ మండపానికి తరలించారు. ఈ సందర్భంగా ఆ సమాఖ్య కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు పళని కుమార్, వరదరాజన్ మీడియాతో మాట్లాడుతూ, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లక్ష్యంగా చేపట్టిన నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వ హెచ్చరికలను పక్కన పెట్టి సుమారు 50 వేల మంది సిబ్బంది కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. సజావుగానే పథకం: సిబ్బంది నిరసన బాట పట్టినా, పౌష్టికాహార పథకానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో , కేంద్రాల నుంచి కొంత మంది సిబ్బంది నిరసనకు వెళ్లినా, మరి కొందరు పథకం ఆగకుండా, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం సజావుగానే అందింది. ఇదే విషయమై వరదరాజన్ పేర్కొంటూ, తమ సిబ్బంది నిరసనకు వచ్చినా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించడం విశేషం. ఇక, తమ హెచ్చరికలను బేఖాతరు చేసి, నిరసనకు వెళ్లిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విధులకు ఎవరెవరు ైగె ర్హాజరు అయ్యారో వారి వివరాల్ని జిల్లా అధికారులు సేకరించేందుకు రెడీ అవుతుండడం గమనార్హం. -
న్యాయవాదులే దాడులు చేయడం సమంజసమేనా?
హైకోర్టులో దాడులను ఖండించిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై తెలంగాణ న్యాయవాదులు భౌతిక దాడులకు దిగారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా దుర్భాషలాడారని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులతో కుమ్మక్కై తమపై దాడికి సహకరించారని ఆరోపించారు. సీమాంధ్ర న్యాయవాదులు నలుగురికి రక్త గాయాలయ్యాయని, ఒకరికి ముఖం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించాల్సిన న్యాయవాదులే భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్యంలోని కనీస హక్కులకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించారు. ఇది ఎంతవరకు సమంజసమో వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి’’ అని ఆయన తెలంగాణ న్యాయవాదులకు హితవు పలికారు. హైకోర్టు వద్ద శుక్రవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలు ఘర్షణకు దారితీశాయి. ప్రివెంటివ్ కస్టడీ కింద దాదాపు 60 మంది సీమాంధ్ర న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా విడుదలైన సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం సాయంత్రం గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మానవహారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు కూడా దాడికి సహకరించారని అన్నారు. శనివారం నాటి ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర న్యాయవాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
కర్నూలులో ‘ జై సమైక్యాంధ్ర’ అన్న లక్ష గొంతుకలు
తాడేపల్లిగూడెంలో నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న అనంతపురంలో న్యాయవాదుల 48 గంటల నిరశన శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులచే హైవే దిగ్బంధం రాజమండ్రిలో 33 మంది మున్సిపల్ కమిషనర్ల సమావేశం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర కోసం 23 వ రోజూ నిరసనలు, ర్యాలీలు, మావనహారాలతో సీమాంధ్ర జనసంద్రమైంది. లక్షల గొంతుకలు జై సమైక్యాంధ్ర అంటూ గళమెత్తి ఘోషించాయి. ఉద్యమంలో ఊపుతీసుకువచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలకు మద్దతుగా అనేకచోట్ల నిరాహారదీక్షలు నిర్వహిం చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు రోడ్లపైకి వచ్చి మానవహారాలు జరిగాయి. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో కర్నూలు రాజ్‌విహార్ సెంటర్లో నిర్వహించిన ‘లక్షగళ ఘోష’ కార్యక్రమం విజయవంతమైంది. నగరం, శివారులకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో లక్ష గొంతుకలతో చేసిన సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. రాజ్‌విహార్ మూడురోడ్ల కూడలి ఎటూ చూసినా జనసంద్రమైంది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి, సమైక్యాంధ్ర జెండాలు చేత బూనారు. విద్యుత్ ఉద్యోగులు కర్నూలు జాతీయరహదారిని రెండు గంటల పాటు దిగ్భందించారు. అనంతపురం కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయ జాక్టో,స్వర్ణకారుల సంఘం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేశారు. న్యాయవాదులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మంత్రులు శైలజానాథ్, రఘువీరా దిష్టిబొమ్మలు, కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా కడప జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు సాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లపైకి చేరి కదం తొక్కారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దీక్ష ను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బంద్‌ను పాటించారు. బద్వేలులో రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ తీయగా, రాయచోటిలో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. చిత్తూరులో ఉన్నతాధికారులు ఉద్యోగులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గాంధీవిగ్రహం వద్ద కోలాటాలు అడగా, మినీలారీ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. వీ కోటలో ఆస్పత్రి సిబ్బంది రోగులకు రోడ్డుపైనే చికిత్సలు చేసి నిరసన తెలిపారు. మదనపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు రోడ్డుపైనే బోధనలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర గురువారం చంద్రగిరికి చేరుకుంది. తిరుపతిలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా కుప్పం లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. విజయవాడకు విశాలాంధ్ర మహాసభ యాత్ర విశాలాంధ్ర మహాసభ బృందం యాత్ర విజయవాడకు చేరిన సందర్భంగా భారీ సభ ఏర్పాటుచేశారు. న్యాయవాదులు, సిబ్బంది గురువారం కూడా కోర్టు గేట్లకు తాళాలు వేసిన నిరసన తెలిపారు. వెఎస్ విజయమ్మ చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మైలవరంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీర్యాలీలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన చేయగా, రేపల్లెలో యోగాసనాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్లలో వైఎస్ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ప్రకాశం జిల్లాలో అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి గెజిటెడ్ అధికారి వరకు అందరూ ఉద్యమ బాట పట్టారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 48 గంటల ఆమరణ దీక్షను విరమించారు. నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గం బోగ్యం వారిపల్లికి చెందిన యువకుల నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థి జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్, గెజి టెడ్ ఆఫీసర్స్‌తోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీ లు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న తాడేపల్లిగూడెంలో వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు నాగళ్లు చేతబూని, ఎడ్లబండ్లతో ప్రదర్శన చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు కుమ్మర్లతో కలసి కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు బుట్టాయిగూడెంలో ఒకరోజు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. చింతలపూడిలో కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్, చిన్నం సురేష్ ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ తప్ప ఇతర ఉద్యోగులంతా రోడ్డెక్కారు. గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో వంటావార్పు, ైబె క్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో వేపగుంటలో బైక్ ర్యాలీ తీశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం వద్ద వైఎస్సార్సీపీ ముస్లిం నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపింది. జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయసంఘం ఆధ్వర్యంలో 11 మండలాల్లో ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజూ కొనసాగింది. శ్రీకాకుళంలో జాతీయ రహదారిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు దిగ్భందించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మానవహారం చేపట్టింది. సీమాంధ్రలోని 33 మునిసిపాలిటీల కమిషనర్లు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రాజమండ్రిలో సమావేశమయ్యారు. కాకినాడలో మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట జేఏసీ దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీలు చైతన్య రాజు, రవికిరణ్ వర్మ సంఘీభావం తెలిపారు. దిండి-చించినాడ వంతెనపై రామరాజులంక గ్రామస్తులు వంటావార్పుతో రాస్తారోకో చేసి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగిం ది. పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీజిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో కొందరికి సోనియా, దిగ్విజయ్ సింగ్, బొత్స,కేసీఆర్ మాస్కులు ధరింపజేసి, వారిని చీపుళ్లు, చేటలతో కొడుతూ రోడ్లపై ఊరేగించారు. సాలూరులో మహిళలు జాతీయ రహదారిపై లలితా సహస్త్రనామ పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి బొబ్బిలిలో నివసిస్తున్న ప్రవీణ్ అనే యువకుడికి... ఇరుప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరతూ పౌర సన్మానం చేశారు. విభజన వేదనతో ఐదుగురు మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్ : విభజన చిచ్చుకు గురువారం ఐదుగురు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కూసం నాగేంద్ర (50) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఉపాధికి విఘాతం కలుగుతుందనే ఆందోళనతో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. లింగపాలెం మండలం కె.గోపవరం పరిధిలోని గణపవారిగూడెంకు చెందిన గద్దే ఆశీర్వాదం (32) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన అరిగెల ప్రసన్న(23) గురువారం పరిటాల సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జై సమైక్యాంధ్ర అంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండల కేంద్రం లోని గేట్కొట్టాలకు చెందిన హైదర్‌వలి (55),ఓడీ చెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన జంబుల గంగిరెడ్డి (50) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా, పెద్దపంజాణి మండలం బొమ్మలకుంటకు చెందిన నడిమింటి ఈశ్వరయ్య (44) శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకోబోగా, ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. విభజన జరిగితే తనకు వికలాంగుల పింఛన్ రాదేమోనన్న బెంగతో చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన కొడమంచిలి శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడూరులో కరెళ్ల సత్యనారాయణ (30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం గుంటూరులోని సంగడికుంట ప్రాంతానికి చెందిన షేక్ అల్లాబక్షు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీక్షా శిబిరం ఎదురుగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ‘జగనన్న బయటకు రావాలి, ప్రజలకు న్యాయం చేయాలి’ అని నినాదాలు చేస్తూ నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అప్రమత్తమై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 26 నుంచి నేతల ఇళ్లకు సేవలు బంద్ మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రకటన తిరుపతి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల ఇళ్లకు తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి సేవలను ఈనెల 26నుంచి నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఉద్యోగులు గురువారం ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. -
తెలంగాణ వర్సెస్ సమైక్యం
హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు సంఘాల ఉద్యోగులు తెలంగాణ, సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఏపీఎన్జీవో పిలుపు మేరకు మంగళవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్లో ఆ సంఘం ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎంహెచ్‌ఎస్‌లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్, వైద్యవిధాన పరిషత్ తదితర కార్యాలయాలలోని తోటి సీమాంధ్ర ఉద్యోగులను నిరసనలో పాల్గొనాలని కోరారు. అనంతరం డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ర్యాలీలు నిర్వహించారు. అదే సమయంలో టీఎన్జీవోలు, టీజీవోలు, ఇతర తెలంగాణ ఉద్యోగులు సద్భావన యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్విహ ంచారు. దీంతో ఇరుసంఘాల ఉద్యోగులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో క్యాంపస్ మార్మోగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఏపీఎన్జీవోల ఉద్యోగులను డీఎంహెచ్ఎస్ నుంచి పంపించి వేశారు. ఇంతలోనే తెలంగాణ ఉద్యోగుల ర్యాలీ వద్దకు టీఎన్జీవోల అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి వచ్చారు. అయితే సుల్తాన్‌బజార్ ఏసీపీ సోమేశ్వరరావు నేతృత్వంలో వారిద్దరినీ అరెస్ట్ చేసి, అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగులు ఒక్కసారిగా స్టేషన్ గేటు వైపు దూసుకురావడంతో పోలీసులు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ఇంతలోనే టీజీఓ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ అక్కడకు చేరుకోవడంతో వారిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి సుల్తాన్‌బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, అరెస్టయినవారిని ఎంతకీ విడిచిపెట్టకపోవడంతో ఆగ్రహించిన టీఎన్జీవోలు, టీజీవోలు సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. అరెస్టయిన వారికి మద్దతుగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఆర్వీ మహేందర్‌కుమార్ తదితరులు ఇన్స్పెక్టర్ ఆనంద్‌ను నిలదీశారు. ఉద్యోగులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించడంతో అక్కడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు. అనంతరం దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టడానికే ప్రభుత్వం, సీమాంధ్ర మంత్రులు, పెట్టుబడిదారులు ఏపీఎన్జీవోలతో సమైక్యాంధ్ర సమ్మెను చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. టీజీవో అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలు అధ్యక్షులు అశోక్‌బాబు తెలంగాణ వారిని కుక్క అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉపేక్షిస్తే .. ఉద్యమిస్తాం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమేనని తెలంగాణ జిల్లాల్లోని ఉద్యోగులు అన్నారు. సీమాంధ్రలో తెలంగాణవాదులను, ఉద్యమ నేతలను కించపరుస్తూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఆరుదశాబ్దాల కల..తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట నీ, దీనిపై ఉపేక్షిస్తే.. మళ్లీ ఉద్యమిస్తమని వారు హెచ్చరించారు. సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. కేంద్ర సంఘం పిలుపు మేరకు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా అన్ని డివిజన్‌స్థాయి కార్యాలయాలతోపాటు కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నిరసనలు తెలిపారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో ధర్నాలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు జరిగారుు. టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ల అరెస్ట్‌కు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కరీంనగర్లో వివిధ శాఖల ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నీటిపారుదలశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎల్ఎండీ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్‌ర్యాలీతో శాంతి ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట, నిర్మల్, మంచిర్యాలలో ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఖమ్మం, నల్లగొండ జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల ఎదుట ధర్నాలు కొనసాగిం చారు. రంగారెడ్డి జిల్లా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు.