
విజయవాడ : కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో బీసీ సంగీభావ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాల మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వరకు ఈ సంగీభావ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు వేలసంఖ్యలో బీసీలు తరలివచ్చారు. ఎమ్మెల్యే పార్థసారధి 130 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీకి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి, జోగి రమేష్ , కైలే అనీల్ కుమార్‌లు పాల్గొన్నారు. వీరంకి లాకు వద్ద బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొననున్నారు. బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్సార్ కృషి చేస్తే, నేడు ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ కల్లబొల్లి మాటలతో బీసీలకు బాబు శఠగోపం పెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్ )
వైఎస్ జగన్ పద్నాలుగు నెలల్లోనే తన మార్కు పాలన చూపించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. ఐదేళ్ల టిడిపిలో జనానికి చీకటి చూపిస్తే..ఏడాదిలోనే జగన్ వెలుగులు నింపారని, రాజకీయ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వైఎస్సార్ లేని లోటును తీర్చి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ బకాయిలు పెట్టిపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన చికిత్స అందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అవసాన దశలో ఉన్నాడని, కుట్రలు ,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నాడని ద్వజమెత్తారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా, అవినీతి లేని పాలన అందిస్తున్నామని వెల్లడించారు. (సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ ! )
Comments
Please login to add a commentAdd a comment