parthasaradi
-
తెలంగాణ ఈసీ పార్థసారధిని కలిసిన బీజేపీ నేతలు
-
‘గ్రేటర్’ వార్ 1న
సాక్షి,హైదరాబాద్ : ‘గ్రేటర్’ పొలిటికల్ వార్‌కు తెరలేచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. 4న ఫలి తాలు ప్రకటించనున్నారు. దుబ్బాకతో రాజు కున్న రాజకీయ వేడి రాష్ట్రంలో రానున్న పక్షం రోజుల్లో పతాకస్థాయికి చేరనుంది. సమయం తక్కువున్నా... రాజకీయపక్షాలు ప్రతిష్టాత్మక సమరానికి సిద్ధమవుతున్నాయి. నగరంలోని 150 డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీ సర్లు బుధవారం ఉదయం ఎక్కడికక్కడ ఎన్నికల నోటిఫికేషన్లు జారీచేస్తారు. బుధవారమే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మంగళవారం ఇక్కడ జీహెచ్ఎంసీఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 1న (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో ఓటర్లు ఇబ్బంది పడకుండా పోలింగ్‌ను ఒక గంట అదనంగా సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 21న పోలింగ్స్టేషన్ల తుది జాబితాను ప్రచురిస్తారు. నవంబర్ 29న సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఎన్నికల కమిషన్ జీహెచ్ఎంసీ షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే నగర పరిధిలో మంగళవారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. పేపర్ బ్యాలెట్ ద్వారానే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుపురంగు బ్యాలెట్‌పేపర్లను ఉపయోగిస్తారు. జీహెచ్ఎంసీ చట్టానికి ఇటీవల చేసిన సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీలు, ప్రభుత్వ సమ్మతితో ఎన్నికల నిర్వహణ చేపట్టామని పార్థసారధి స్పష్టం చేశారు. మేయర్ పదవిని మహిళ (జనరల్)కు రిజర్వు చేశారు. ఈసారి ఈ–ఓటింగ్ లేదు: పార్థసారధి ‘రాష్ట్రంలోని మూడోవంతు జనాభా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నందున జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారమే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తాం. రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహిస్తున్నాం. ఈ విషయంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఈవీఎంలను సంసిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎన్నికల నిబంధనలు, కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. అభ్యర్థులు తమ నామినేషన్లతో ఏయే పత్రాలు జతచేయాలో టీఈ–పోల్ యాప్‌లో చూసి... వాటిని నిర్ణీత ఫార్మాట్లో నింపి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. అయితే నామినేషన్లను మాత్రం స్వయంగా సంబంధిత వార్డుల్లోని రిటర్నింగ్ ఆఫీసర్లకు అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. కోవిడ్ నిబంధనల్లో భాగంగా అభ్యర్థులతో పాటు ముగ్గురు నామినేషన్ దాఖలుచేసేందుకు రావొచ్చు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితి రూ.5 లక్షలు. ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు అభ్యర్థి అందజేయాలి. వివరాలు ఇవ్వకపోతే మూడు సంవత్సరాలు అన్ని రకాల ఎన్నికలకు అనర్హులుగా ప్రకటిస్తాం. మొత్తం 48 వేల మంది పోలింగ్ సిబ్బంది అవసరం అవుతారు. ఒక్కో పోలింగ్స్టేషన్లో నలుగురేసి చొప్పున నియమించడంతో పాటు... కొవిడ్ నేపథ్యంలో రిజర్వ్ కింద 30 శాతం సిబ్బందిని సిద్ధం చేస్తున్నాం. తాము నివసిస్తున్న వార్డుల్లో ఎన్నికల సిబ్బందికి డ్యూటీ వేయం. లైసెన్సు కలిగిన తుపాకులను సమీప పోలీసు స్టేషన్లో డిపాజిట్ చేయాలి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసివేయాలి. ప్రతీ ఓటరుకు కచ్చితంగా పోలింగ్ స్లిప్ అందజేస్తాం. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఓటరు స్లిప్ తీసుకోవచ్చు. రాజకీయ పార్టీలు కూడా సింబల్ లేకుండా ఓటర్ స్లిప్స్ ఇవ్వొచ్చు. 2009లో పోలింగ్ 42.04శాతం మాత్రమే. 2016లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ పెంచేందుకు రెసిడెంట్స్ వేల్ఫేర్ ఆసోసియేషన్స్, ఎన్జీవో సంస్థలు, సెలబ్రిటీలు, ఎలక్షన్వాచ్ సంస్థల సహకారంతో క్యాంపెయిన్ నిర్వహిస్తాం. వయోవృద్దులు, అనారోగ్యంతో ఉన్న వారు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ– ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా అమలుచేయాలని ఎస్ఈసీ భావించింది. అయితే సాఫ్ట్వేర్ అభివృద్ధికి మరోనెల సమయం పట్టేట్లుంది. పైగా దీని నిర్వహణకు చట్టసవరణ కూడా చేయాల్సి ఉండడంతో ఈసారి దీనిని ప్రవేశపెట్టలేకపోతున్నాం. ఫేస్రికగ్నేషన్ టెక్నాలజీని మాత్రం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగిస్తాం. మొత్తం 150 వార్డుల్లోని ఒక్కో పోలింగ్స్టేషన్లో ఈ విధానాన్ని అమలుచేస్తాం. ఎన్నికల సందర్భంగా రూ.50 వేల వరకు నగదును వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతకుమించి నగదు ఉంటే... ఏ అవసరం నిమిత్తం దానిని తీసుకెళుతున్నారో ఆధారాలతో వివరించగలిగితే మినహాయింపులు ఉంటాయి. నామినేషన్ చివరి రోజు వరకు ఫారమ్– ఏ, ఫారమ్– బిలను సమర్పించవచ్చు’అని ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. రూ. 10 వేల సాయం కొనసాగించొచ్చు భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లోని నష్టం జరిగినందున రూ.10 వేల విపత్తు సహాయాన్ని డైరెక్ట్‌గా ఆన్లైన్లో అకౌంట్ ట్రాన్సఫర్ చేస్తే కమిషన్‌కు అభ్యంతరాలుండవని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ విపత్తు సహాయానికి అడ్డుకాదని, అయితే నేరుగా నగదును చేతికి అందించడానికి వీల్లేదని వివరించారు. ఇదీ ఎన్నికల షెడ్యూల్... – బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వో) ఎన్నికల నోటీస్‌లు జారీచేస్తారు. – తమ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఆర్వోలు ప్రదర్శిస్తారు – బుధవారం (18వ తేదీ) నుంచి నామినేషన్ల స్వీకరణ – శుక్రవారం (20వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు – 21న నామినేషన్ల పరిశీలన – 22న 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణ – తర్వాత పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ – డిసెంబర్1న పోలింగ్ (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) – 3న అవసరమైన పక్షంలో రీపోలింగ్ – 4న (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల ప్రకటన రిజర్వేషన్లు ఇలా... మేయర్ పదవి – జనరల్ మహిళ – ఎస్టీలు: రెండుస్థానాలు (ఒకటి మహిళ) – ఎస్సీలు: 10 స్థానాలు (5 మహిళలకు) – బీసీలు 50: (మహిళలకు 25) – జనరల్ మహిళ: 44 స్థానాలు – అన్రిజర్వ్డ్ కేటగిరి: 44 స్థానాలు. – మొత్తం డివిజన్లు : 150 మొత్తం ఓటర్లు : 74,04,286 పురుషులు : 38,56,770 మహిళలు : 35,46,847 ఇతరులు : 669 పోలింగ్ స్టేషన్లు : 9,235 50 వేల మంది పోలీసులు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కోసం సుమారు 50 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మొత్తం మీద సిటీ కమిషనరేట్ పరిధిలో 25 వేలు, సైబరాబాద్ పరిధిలో 15 వేలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 10 వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించనున్నారు. రూట్ మొబైల్పార్టీలు : 356 స్ట్రైకింగ్ ఫోర్స్ : 131 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ : 44 సగం మహిళలకే జీహెచ్ఎంసీలో సగం సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన చట్టం ప్రకారం మొత్తం 150 డివిజన్లలో సగం సీట్లు... 75 మహిళలకు కేటాయించారు. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో (2016) జనరల్ స్థానాల్లో సైతం గెలిచి మొత్తం 79 మంది మహిళలు ప్రాతినిధ్యం వహించారు. పీఠంపై నాలుగో మహిళ జీహెచ్ఎంసీ మేయర్ పదవి మహిళకు రిజర్వు అయింది. జనరల్ మహిళ కాబట్టి కార్పొరేటర్లుగా గెలిచిన మహిళల్లో ఎవరికైనా మేయర్ అయ్యే చాన్స్ ఉంటుంది. గతంలో సైతం మహిళలు హైదరాబాద్ కార్పొరేషన్లో అధ్యక్షపీఠం అధిరోహించారు. రాణి కుముదిని దేవి, సరోజిని పుల్లారెడ్డి, బండ కార్తీకరెడ్డిలు మేయర్లుగా పనిచేశారు. ముందస్తు తొలిసారి జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. గతంలో పాలకమండలి గడువు ముగిశాక, ఏళ్లకేళ్ల తర్వాత మాత్రమే తిరిగి ఎన్నికలు జరిగేవి. కిందటిసారి సైతం స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. 2014లో పాలకమండలి గడువు ముగియడంతో 2016 ఎన్నికలు జరిగే వరకు స్పెషలాఫీసర్ పాలనే నడిచింది. ఈసారి పాలకమండలి గడువుకు రెండున్నర నెలల ముందుగానే ఎన్నికలు జరగనున్నాయి. -
హైదరాబాద్‌లో కూర్చుని కుట్రలు చేస్తున్నారు
-
కృష్ణా మీదుగా తెనాలి వరకు..భారీగా బైక్ ర్యాలీ
విజయవాడ : కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో బీసీ సంగీభావ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాల మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వరకు ఈ సంగీభావ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు వేలసంఖ్యలో బీసీలు తరలివచ్చారు. ఎమ్మెల్యే పార్థసారధి 130 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీకి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి, జోగి రమేష్ , కైలే అనీల్ కుమార్‌లు పాల్గొన్నారు. వీరంకి లాకు వద్ద బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొననున్నారు. బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్సార్ కృషి చేస్తే, నేడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ కల్లబొల్లి మాటలతో బీసీలకు బాబు శఠగోపం పెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్ ) వైఎస్ జగన్ పద్నాలుగు నెలల్లోనే తన మార్కు పాలన చూపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. ఐదేళ్ల టిడిపిలో జనానికి చీకటి చూపిస్తే..ఏడాదిలోనే జగన్ వెలుగులు నింపారని, రాజకీయ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వైఎస్సార్ లేని లోటును తీర్చి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ బకాయిలు పెట్టిపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన చికిత్స అందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అవసాన దశలో ఉన్నాడని, కుట్రలు ,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నాడని ద్వజమెత్తారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా, అవినీతి లేని పాలన అందిస్తున్నామని వెల్లడించారు. (సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ ! ) -
‘పిల్లల కోసం కూడా అంబులెన్స్’
-
వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల్లో అనందం
-
టీడీపీ నేతల అక్రమ మద్యం రవాణా
సాక్షి, కృష్ణా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతుల్ని, మహిళల్ని మోసం చేశారని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇళ్ల స్ధలం పేదవారి కల అన్నారు. ఆ కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు ప్రభుత్వం దశల వారిగా ఇళ్లను కట్టిస్తోందన్నారు. రైతుల కోసం అనేక పధకాలు అమలు చేస్తున్నామని, చెప్పిన దానికంటే ఎక్కువగానే చేస్తున్నామని పార్థసారథి అన్నారు. (‘లోకేశ్ ఆవేదన తాలూకు ఉద్రేకం’) ప్రభుత్వం చేసే సంక్షేమ పధకాల్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. అందుకే ఒక పధకం ప్రకారం ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఒకవైపు దశల వారి మద్యపాన నిషేదం చేస్తుంటే టీడీపీ నేతలు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రఫీ, సురేష్, ఆనంద్ బాబు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తెప్పించి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి మద్యపాన నిషేదం చేయ్యటం ఇష్టం లేదన్నారు. టీడీపీ నేతలు తమ చేతిలో ఉన్న విజయపాల డైరీ వ్యానుల ద్వారా మద్యం అక్రమ రవాణ చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. (‘ఆ వాహనాలు ఎక్కడున్నా.. సీజ్ చేయాలి’) అదేవిధంగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలోనే ఇచ్చిన హమీలను తొంభై ఐదు శాతం పూర్తి చేశామని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదలకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే చంద్రబాబుతోపాటు టీడీపీ పార్టీ కూడా కనుమరుగు అవ్వటం ఖాయమన్నారు. ప్రభుత్వ పధకాలు చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లుతోందని కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. -
ఈబీ,సీబీఐలను రాష్ట్రానికి రానివ్వలేదు
-
టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం
-
టీడీపీ మాజీ మంత్రి డ్రామాలు చేస్తున్నారు
-
టిడిపి నేతలు శవాల మీద రాజకీయం చేస్తున్నారు
-
చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా
-
బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు
-
బీసీ జాతి అభివృద్ధి చెందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు
-
వైఎస్ జగన్ బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు
-
ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
-
ఏం చేసారని బీసీ సభలు నిర్వహిస్తున్నారు?
-
ఒక్కసారైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారా?
-
బీజేపీ,టీడీపీ ఏపీకి అన్యాయం చేశాయి
-
చంద్రబాబు మాయల ఫకీరు
-
వారి అత్మహత్యలకు చంద్రబాబే కారణం
-
టీడీపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
-
చంద్రబాబువి ఊహాజనితమైన ఉపన్యాసాలు
-
నీలం పరిహారం పంపిణీకి సిద్ధం
కూచిపూడి, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం సంభవించిన నీలం తుపాను నష్టపరిహారం బకాయి రూ.3 కోట్లు పంపిణికీ సిద్ధంగా ఉందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆయన మొవ్వ మండలంలోని కారకంపాడులోని స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రూ.13కోట్లు పంటనష్టపరిహారంగా గుర్తించామని అందులో తొలి విడత రూ.10 కోట్లు అప్పట్లోనే విడుదల కాగా మిగిలిన రూ.3కోట్లు వారం రోజుల క్రితం విడుదలయ్యాయని, రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖాధికారులు రైతుల ఖాతాలకు నేరుగా పంపుతారని చెప్పారు. ఈ మేరకు జేడీకి ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. కాగా కారకంపాడు నుంచి నిడుమోలు వరకు డబుల్‌రోడ్డుకు రూ.10.10కోట్లతో అంచనాలు వేయించామన్నారు. దీనికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లను రిటైర్ అయ్యే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే రిటైరయ్యే పోస్టుల్లో మాత్రం ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నా... అది అమలు జరిగే అవకాశాలు లేవన్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, విడివిడిగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తేనే రాష్ట్ర విభజనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్రం విడిపోతేనే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని పేర్కొంటుండటంతో విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని సార థి తేల్చి చెప్పారు.ఆయన అంతకుముందుగా మొవ్వ ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జీ భద్రుతో చర్చించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ అమరేశ్వరరావు, డీఈ ఏ శ్రీనివాసరావుతో శాఖాపరమైన చర్చలు జరిపారు. -
కేసీఆర్‌తో మాకు సంబంధం లేదు: డీకె అరుణ
-
కేసీఆర్‌తో మాకు సంబంధం లేదు: డీకె అరుణ
రాష్ట్ర మంత్రుల మధ్య అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఆసక్తికర సంభాషణలు కొనసాగాయి. అలాంటి సంభాషణే.. తెలంగాణ మంత్రి డీకే అరుణ, సీమాంధ్ర మంత్రి.. పార్థసారథి మధ్య అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. విభజన ప్రక్రియ ఆగుతుందేమో, రాష్ట్రం విడిపోదేమోనని మంత్రి పార్థసారథి.. డీకే అరుణతో వ్యాఖ్యానించగా.. విభజన ప్రక్రియ సజావుగా సాగుతోందని.. రాష్ట్రం విడిపోవడం ఖాయమని.. ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెడతారేమోనన్న పార్థసారధి వ్యాఖ్యలకు స్పందించిన అరుణ.. హైకమాండ్‌కు కిరణ్ విధేయుడని దిగ్విజయ్ చెబుతున్నారని.. ఆయన కొత్త పార్టీ పెట్టరేమోనని జవాబిచ్చారు. కాగా.. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని లేదట కదా అని పార్థసారథి అన్నారు. కేసీఆర్‌తో తమకు సంబంధం లేదని.. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ కాంగ్రెస్ మొదటినుంచీ పోరాడుతోందని అరుణ అన్నారు. ఇది ఇలా ఉండగా.. కిరణ్ కొత్తపార్టీ పెట్టే అవకాశముందని.. మరోమంత్రి టీజీ వెంకటేష్ లాబీల్లో అన్నారు. కిరణ్ కొత్త పార్టీతోపాటు.. వైఎస్ఆర్సీపీ, టీడీపీకి వెళ్లేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. టీజీ మనసులోమాట బయట పెట్టారు. -
పులి‘చింత’ల ఇప్పట్లో తీరేనా!?
=ప్రారంభం మరోసారి వాయిదా =విజయవాడ సభకు సహకరించని కాంగ్రెస్ నేతలు =వచ్చేనెలలో జరుగుతుందని ప్రచారం =తెలంగాణపై జీవోఎం నివేదిక నేపథ్యంలో అదీ అనుమానమే.. సాక్షి, విజయవాడ : కృష్ణాడెల్టా రైతులకు ఇప్పుడప్పుడే పులి‘చింత’ల తీరే పరిస్థితి కనిపించడంలేదు. ఈనెల 30న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని హడావుడి చేసినా..తుపానును సాకుగా చూపి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరించి, విజయవాడలో సభ పెట్టి జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం కిరణ్ ఆర్భాటంగా ప్రకటించినా ఆ పార్టీ నాయకులెవరూ పట్టించుకోలేదు. అందువల్లే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాల నుంచి జన సమీకరణ : సారథి విజయవాడ సభకు నాలుగు జిల్లాల నుంచి జనసమీకరణ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. అయితే వరుస తుపాన్లతో పంటలు దెబ్బతినడం, అప్పటికి లెహర్ తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో జనసమీకరణ సాధ్యం కాదంటూ నగర నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తేల్చిచె ప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలోని నేతల సహకారం కొరవడడం వల్లే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడిందనే విషయం విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలు కూడా ఈ వాయిదా కారణమయ్యాయి. లెహర్ తుపాను వల్లే... లెహర్ తుపాను కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నారని, వచ్చే నెల మొదటివారంలో తేదీ ఖరారు కావచ్చని కృష్ణా డెల్టా సిస్టమ్స్ చీఫ్ ఇంజినీర్ డి. సాంబయ్య ‘సాక్షి’కి తెలిపారు. గుంటూరు జిల్లాలో పైలాన్ ఏర్పాటు చేశామని, పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న గేట్ల ఏర్పాటు కూడా పూర్తి అవుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలో ఏ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందనేది ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు. అయితే జీఓఎం తెలంగాణపై జీవోఎం నివేదిక సిద్ధం చేయడం, వచ్చే నెల నాలుగున కేంద్ర కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీకి రానున్న తరుణంలో పులిచింతల ప్రారంభోత్సవం అనుమానమేనని పలువురు పేర్కొంటున్నారు. -
‘హెలెన్’ నష్టం రూ.1,630కోట్లు
సాక్షి, హైదరాబాద్: హెలెన్ తుపాను వల్ల కోస్తా జిల్లాల్లో రూ.1,630 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ పార్థసారథి తెలిపారు. తుపాను పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. హెలెన్ తుపాను వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఐదు జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని చెప్పారు. 10,003 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రహదారులు, భవనాలు దెబ్బతిని రూ.177 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 1,313 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 24 పడవలు కొట్టుకుపోగా మరో 234 పడవలు దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిచిపోయిన 166 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. -
ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి
రాయచోటి, న్యూస్‌లైన్ : రాయచోటి మోటారు వెహికల్ అధికారి కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కంప్యూటర్ గదితో పాటు అనధికార ఏజెంట్ల వద్ద నుంచి రూ.80,890 స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎంవీఐ కార్యాలయంపై సోమవారం తిరుపతి, కడపకు చెందిన ఏసీబీ సీఐలు పార్థసారధిరెడ్డి, రామకిషోర్, సుధాకర్, లక్ష్మికాంత్రెడ్డితోపాటు సిబ్బంది ఆకస్మికంగా దాడులు చేశారు. ఎంవీఐ మధుసూదన్‌రెడ్డితో పాటు సిబ్బందిని ప్రశ్నించి రికార్డులను సోదా చేశారు. దాడి సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ గదితో పాటు, అనధికార ఏజంట్లు రమణ, సుబ్బారా వు, రాజశేఖర్‌రెడ్డిల వద్ద నుండి Rs 80,890లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ సీఐ పార్థసారధిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకే ఎంవీఐ కార్యాలయంపై దాడులు చేశామన్నారు. దాడులలో కార్యాలయంలోని కంప్యూటర్గదిలో, అనధికార ఏజెంట్ల వద్ద సుమారు రూ.80,890 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ నగదు విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.