ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు కొనసాగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఏపీకి చెందిన మొత్తం ఎంపీల మూకుమ్మడి రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేద్దామని పిలుపునిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీతో కలిసి రావడం లేదంటూ మండిపడ్డారు. విజయవాడలో పార్థసారధి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసులపై విచారణ చేపడతానేమోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే హోదా పోరాటంలో బాబు వెనకడుకు వేస్తున్నారని ఆరోపించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా పోరు ఉధృతం చేయాలంటూ చంద్రబాబుకు పార్థసారధి సవాల్ విసిరారు.