అభివృద్ధి వికేంద్రకరణతోనే రాష్ట్రాభివృద్ధి | Development Of The State Is Possible Only With Decentralization | Sakshi
Sakshi News home page

బినామీ రాజ‌ధాని వ‌ద్దంటూ భారీ ర్యాలీ

Published Thu, Oct 22 2020 7:46 PM | Last Updated on Thu, Oct 22 2020 7:55 PM

Development Of The State Is Possible Only With Decentralization - Sakshi

సాక్షి గుంటూరు : బినామీ రాజధాని వద్దు.. ప్రజా రాజధాని కావాలి అంటూ మందడంలో బహుజన పరిరక్షణ సమితి భారీ ర్యాలీ నిర్వ‌హించింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్ర‌ధాని  శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి వినతి పత్రం సమర్పించారు. అభివృద్ధి వికేంద్రకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలని ప్రధాని అనుకున్నార‌ని, కానీ  అమరావతి ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిపోయిందని పేర్కొన్నారు. అమరావతిలో 52వేల మంది పేదలకు ఇళ్లు కేటాయిస్తే టీడీపీ అడ్డుకొని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వ్యాఖ్య‌లు చేశారు. ప్రధానిపై దుర్భాషలాడి ఇప్పుడు శిలాఫలకానికి పూజలు చేయడం దారుణమని, అమరావతి పేరుతో బాబు కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి  ఆరోపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement