capital
-
దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్లైన్ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. -
రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్‌టెక్ నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తాజాగా 6.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలిపింది. వార్షికంగా 3,000 డ్రోన్ల స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యకలాపాలు పటిష్టం చేస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విశ్లావత్ పేర్కొన్నారు.అధునాతన వ్యవసాయ డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు, ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోకి చానల్ పార్ట్నర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ప్రేమ్ వివరించారు. దేశీయంగా కేంద్రం నమోదీదీ పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ కంపెనీల ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ ఏర్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉపాధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: మార్కెట్.. ‘ట్రంపె’ట్!మారుత్ డ్రోన్‌టెక్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2028 నాటికి డీలర్ల సంఖ్యను 500కు పెంచుకోనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. వరద నివారణ పనులుఅమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను విస్తరిస్తామని చెప్పారు. నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు. -
జానీ మంచి కళాకారుడు..!
-
8,352 చ.కి.మీ.లలో సీఆర్డీఏ పరిధి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) 8,352 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం.. అప్పట్లో గుర్తించిన విస్తీర్ణం మేరకు సీఆర్డీఏ పరిధిని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ సమావేశాన్ని నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికే భూమి కేటాయించాలన్నారు. గతంలో భూములు పొందిన వ్యక్తులు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి.. అనే అంశంపైనా చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. దేశంలో టాప్ 10 కళాశాలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన పలు గ్రామాలను తిరిగి రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తాం : మంత్రి నారాయణ రాష్ట్రంలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘సీడ్ క్యాపిటల్‌ను చెన్నై–కలకత్తా హైవేకు అనుసంధానిస్తాం. ఇందుకు ప్రస్తుతం నిర్మిస్తున్న సీడ్ యాకిŠస్స్ రోడ్డుతో పాటు మరో నాలుగు రోడ్లను అభివృద్ధి చేస్తాం. గతంలో రాజధాని మాస్టర్ ప్లాన్‌లో అనుకున్న విధంగా హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి నవ నగరాలు నిర్మిస్తాం’ అని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును సెంట్రల్ డివైడర్ ఉండేలా నాలుగు లేన్లతో నిర్మించేలా వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా మరో నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు వస్తాయన్నారు. 2019కు ముందు రాజధానిలో పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించామని.. ఆయా సంస్థలు వీలైనంత త్వరగా సంస్థలను నెలక్పొలేలా చర్చిస్తామని తెలిపారు.సీఆర్డీయే పరిధిలోకి బాపట్ల, పల్నాడు జిల్లాలురాజధాని ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన కట్టడాల పరిశీలనకు ఐఐటీ హైదరాబాద్ బృందం అమరావతిలో పర్యటించిందని, శనివారం ఐఐటీ మద్రాస్ నిపుణులు ఐకానిక్ భవనాల కట్టడాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. వచ్చే వారంలో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడతామని చెప్పారు. అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా తిరిగి ప్రారంభించేలా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఆర్5 జోన్ అంశం న్యాయస్థానంలో ఉండటంతో న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పుడున్న వారితో పాటు మరో 32 మంది కన్సల్టెంట్స్ను నియమిస్తామని వెల్లడించారు. సీఆర్డీయే పరిధిలోకి కొత్తగా పల్నాడు, బాపట్ల జిల్లాలు కూడా వస్తున్నట్టు మంత్రి వివరించారు. పథకాలు.. ఫలితాలుప్రజలకు కేవలం పథకాలు అందించడమే కాదని, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమం, విద్యుత్ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్యతో చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని మహిళా హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ అందాలి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగు పరచడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తితోపాటు సరఫరా మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్తుకు ప్రాధాన్యత క ల్పించే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పరిస్థితిని వివరించారు. ఇంధన శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఏపీ జెన్కో ఎండీ చక్ర«దర్ బాబు, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి తదితరులు పాల్గొన్నారు. ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలిరాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణను అస్తవ్యస్తంగా మార్చిందని ఆరోపించారు. ధాన్యం సొమ్మును చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేశారని, ఇకపై ఎలాంటి అవరోధాల్లేకుండా ధాన్యం సేకరణ చేయాలని సూచించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోప భూయిష్టంగా సాగిందని ఆరోపించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సిద్ధార్థ్‌జైన్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త మద్యం విధానం సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని, గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీల ఫైళ్లను సీజ్ చేయాలని ఆదేశించారు. -
అమెరికాలో నెతన్యాహు పర్యటన.. క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. అమెరికాలో పర్యటిస్తున్న వేళ నిరసనలు మిన్నంటాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం. వారు ఓడిపోతారు. ఇది జాతుల మధ్య యుద్ధం కాదు. మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం. మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది. అందుకే ఇజ్రాయెల్‌వైపు అమెరికా నిలవాలి. పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ స్నేహదేశాలకు ఇబ్బందికరంగా మారాయి. నా దేశాన్ని రక్షించుకునేందుకు, నా దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెతన్యాహు పసుపు రంగు పిన్ ధరించి హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలకు సంఘీభావం తెలిపాడు.అయితే, సభలో ఆయనకు తొలుత స్పీకర్ మైక్ జాన్సన్‌తోపాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 50 మంది డెమోక్రాట్లు, స్వత్రంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్.. నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సమావేశానికి రాలేదు. కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. A man bravely removed the American flag from being set aflame by pro-Palestinian protestors. The crowd proceeded to yell “chase him.” pic.twitter.com/3QE4zMKYEy— Eyal Yakoby (@EYakoby) July 24, 2024ఇక, అమెరికాలో నెతన్యాహు పర్యటన సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలు తెలిపారు. క్యాపిటల్ హౌస్ వద్ద నెతన్యాహుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెతన్యాహు ఓ క్రిమినల్ అంటూ నినదించారు. మరోవైపు.. వాషింగ్టన్ డీసీలోని వాటర్‌గేట్ హోటల్లో నెతన్యాహు, అతడి భార్య, ప్రతినిధి బృందంతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆ హోటల్ వద్దకు పలువురు పాలస్తీనా మద్దతుదారులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఎరుపు రంగు టీషర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.🚨🇮🇱🇺🇸 Protesters in Washington DC are now BURNING an effigy of Benjamin Netanyahu! pic.twitter.com/0RE8oYYqEm— The Saviour (@stairwayto3dom) July 24, 2024pic.twitter.com/3cOYomr7sj wow pro Palestine anti Americans stormed the capital today. This is why we need trump in the white house so things like this never happen again. Democrats hate us they proved that for 4 years when they helped illegals and Ukraine but never helped us at all— Trump 2024 MAGA 🇺🇲 (@VinnyPhilly) July 23, 2024ఇదే సమయంలో నెతన్యాహుపై కోపంతో వాటర్ గేట్ హోటల్లోని బ్యాంకెట్ టేబుల్, ఇతర అంతస్తుల్లో పాలస్తీనా యూత్ మూమెంట్‌కు చెందిన కొందరు వ్యక్తులు.. పురుగులు, మిడతలు వదిలినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. పురుగులు వదిలిన టేబుల్‌పై ఇజ్రాయెల్, అమెరికా జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Gaza protesters have removed the American flags from Union Station, lit then on fire with a Netanyahu effigy and replaced them with Palestine flags. pic.twitter.com/c8hz90phqL— Andrew Leyden (@PenguinSix) July 24, 2024 The DC Palestinian Youth Movement released maggots and crickets were released throughout the Watergate Hotel where Netanyahu is staying. The protestors also pulled multiple fire alarms throughout the night. This is an utter security failure. pic.twitter.com/3O0XbOvoGx— Eyal Yakoby (@EYakoby) July 24, 2024 -
భూములమ్మి రాజధాని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాల నుంచి ప్రారంభించి ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులోని సీఆర్డీఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దక్షిణాదిలో గోదావరి భారీ జల నిధి లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లివ్వచ్చన్నారు. విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా అమరావతికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రజారాజధానిగా అమరావతి ఐదు కోట్ల మందికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే గర్వంగా పనులు చేసుకోవచ్చన్నారు. రాజధానిని వైఎస్ జగన్ అతలాకుతలం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. రాజధానిపై శ్వేతపత్రం.. రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుంచి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగ్‌ను కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, మంత్రులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపేశారు. రాజధాని ప్రస్తుత పరిస్థితపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది. కన్సార్టియంపైనా విషం చిమ్మారు.. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై బురద జల్లి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్‌లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే గుంటూరు కేంద్రంగా అమరావతిని రాజధానిగా గుర్తించాం. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏ’ అంటే అమరావతి.. ‘పీ’ అంటే పోలవరంగా గుర్తుంటుంది. నదులు అనుసంధానిస్తాం.. ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం లభించింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు. వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.అప్పులెంతో తెలియదు..ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్నిఅణచివేస్తాం. రాజధానిలో నిర్మాణాలను ఉన్మాది బారి నుంచి దేవుడే కాపాడాడు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యకు్తలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలియదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలియదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారుల ప్రవర్తన మార్చుకోవాలి. -
అత్యుత్తమ రాజధానిగా అమరావతి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. వివిధ దశల్లోనే నిలిచిపోయిన భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట..ఇక 2014 నుంచి 2019 వరకు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి చార్జీలు కూడా ప్రజల నుంచి వసూలుచేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్త పన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో టిడ్కో ఇళ్ల పూర్తిపై దృష్టిసారిస్తామని.. అలాగే, అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తామన్నారు. -
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. "14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు.""ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
ముగియనున్న ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని గడువుపై కొమ్మినేని విశ్లేషణ
-
వార్షిక కౌలు జీవో అమలును నిలిపేయండి
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు. వాస్తవానికి సీఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్‌తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్‌లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
AP: ఆ పిటిషన్‌కు అర్హతే లేదన్న ఏజీ
సాక్షి, గుంటూరు: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హతే లేదని.. పైగా పిటిషనర్లు అమరావతిలో భూముల్ని కలిగి ఉన్నారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష కోసం.. కాబోయే పాలనా రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో నెంబర్ 2283 జారీ చేసింది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని కోర్టును పిటిషన్ ద్వారా కోరారు వాళ్లు. అయితే ఇవాళ్టి విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) రూపేనా కోర్టు ముందుకు రావాలే తప్ప రిట్ రూపంలో కాదని ఏజీ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదంటే ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ పిటిషనర్లు కావాలనే రిట్ వేశారు. పైగా పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్నారు (ఫోరమ్ షాపింగ్‌పై పలు తీర్పులను న్యాయస్థానానికి వివరించారాయన.. ). ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు -
ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ
క్రియోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ కంపెనీ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఐనాక్స్ ఇండియా ఐపీవోకింద 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లు, వాటాదారులకు చేరనున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐనాక్స్ ఇండియా క్రియోజెనిక్ ట్యాంకుల తయారీలో కార్యకలాపాలు కలిగి ఉంది. డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల ఇన్స్టాలేషన్, క్రియోజెనిక్ సిస్టమ్స్ ఏర్పాటు తదితర సర్వీసులు అందిస్తోంది. రూ. 200 కోట్ల ఈక్విటీ లగ్జరీ ఫర్నీచర్‌ను రూపొందిస్తున్న స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 91.33 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నా రు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మరో రూ. 40 కోట్లు యాంకర్ స్టోర్లను తెరిచేందుకు వినియోగించనుంది. వీటితోపాటు ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరించేందుకు రూ. 10 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో కొత్త మెషీనరీ, పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 8.2 కోట్లు కేటాయించనుంది. -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్‌లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్‌లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
బోన్‌ఫైర్ వేడుకలు: ఒకేసారి దీపావళి, భోగి పండుగలా జరిగే సంబరం!
ఇంగ్లండ్ ససెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్ పట్టణం ‘బోన్‌ఫైర్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా పేరు పొందింది. ఇక్కడ ఏటా నవంబర్‌లో జరిగే లెవెస్ బోన్‌ఫైర్ వేడుకలు చూస్తే, ఒకేసారి దీపావళి, భోగి పండుగ జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ పండుగను సాధారణంగా నవంబర్ 5న జరుపుకొంటారు. నవంబర్ 5 ఆదివారం వచ్చినట్లయితే, ముందురోజే నవంబర్ 4న జరుపుకొంటారు. ఈ వేడుకల్లో వీథి వీథినా భోగిమంటల్లాంటి చలిమంటల నెగళ్లను ఏర్పాటు చేస్తారు. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా రకరకాల బాణసంచా కాల్పులతో హోరెత్తిస్తారు. సంప్రదాయ వేషధారణలతో కాగడాలు ధరించి ఊరేగింపులు జరుపుతారు. ఈ వేడుకల్లో స్థానిక ఇంగ్లండ్ వాసులతో పాటు, ఇక్కడ స్థిరపడిన ఆఫ్రికన్ జులు తెగ ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు జరుపుకోవడం వెనుక ఒక చారిత్రక సంఘటన ఉంది. గన్‌పౌడర్ కుట్ర భగ్నం ఇంగ్లండ్ రాజు ఒకటో జేమ్స్‌కు వ్యతిరేకంగా 1605 సంవత్సరంలో కొందరు కుట్ర పన్నారు. రాబర్ట్ కేట్స్బీ నాయకత్వంలో కొందరు కేథలిక్ నాయకులు రాజు ఒకటో జేమ్స్‌ను హతమార్చాలనుకున్నారు. రాజు ఒకటో జేమ్స్ ఇతర మతాల పట్ల ఉదారంగా ఉండటం వల్లనే కేథలిక్ నాయకులు అతణ్ణి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజైన నవంబర్ 5న సభ కొలువుదీరిన సమయంలో హౌస్ ఆఫ్ లార్డ్స్‌ను గన్‌పౌడర్‌తో పేల్చివేయాలనుకున్నారు. వీరి కుట్ర గురించి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఒకరికి ముందుగానే ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా సమాచారం అందింది. భద్రతాధికారులకు చెప్పడంతో వారు సునాయాసంగా ఈ కుట్రను భగ్నం చేశారు. గన్‌పౌడర్ కుట్ర భగ్నమైన సందర్భంగా లెవెస్ పట్టణంలో ఏటా ఇలా బోన్‌ఫైర్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..) -
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్‌లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం? -
విశాఖ రాజధానిపై నేడు సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ, ఆయనకు సమర్పించనుంది. -
ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు తరలివచ్చే ప్రక్రియ వేగవంతమవు తోంది. మునిసిపల్, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో కూడిన అధికారుల బృందం వైజాగ్‌లో పర్యటిస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు అవ సరమైన భవనాలు, అధికారుల వసతి కోసం అనువైన స్థలాలను ఈ బృందం పరి లించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి.. అనువుగా ఉంటే ఓకే చేసేందుకు అధికా రుల కమిటీ కసరత్తు మొదలెట్టినట్టు సమా చారం. దీనికనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సోమవారం సమావేశమైన కమిటీ.. ఖాళీ గా ఉన్న భవనాల వివరాలు సేకరించింది. -
పరిపాలన రాజధానిగా విశాఖ వర్ధిల్లాలి అంటూ ప్రత్యేక పూజలు
-
రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ?
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు పాల్పడిన ఘోరాలు విస్తుగొల్పుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయట పెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లాడారు. టీడీపీ సర్కారు రాజధానిపై ఏనాడూ ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వినియోగించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తప్పు చేసి దొరికిపోవడంతో మూటాముల్లె సర్దుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లో చేసినట్లుగానే అమరావతిలోనూ భూముల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రాజధానిపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. 2013 చట్టంలోనే భూసమీకరణకు అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టారని, ప్రభుత్వాలు ఇంత అధర్మంగా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. మిగతావారిని దారి మళ్లించి తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో భూములు కొన్నారని తెలిపారు. తొలుత అతి చౌకగా జిరాయితీ భూములు కొన్నారని, ఆ తర్వాత జీవో 1 విడుదల చేసి అన్ని కేటగిరీల భూములకు భూ సమీకరణ ప్యాకేజీని పేర్కొంటూ అసైన్డ్ భూముల దగ్గర మాత్రం ఖాళీగా వదిలేశారని తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్ జరగదని తెలిసి కూడా వారిని కార్యాలయాలకు రప్పించి రిజిస్ట్రేషన్లను తిరస్కరించేలా చేశారని చెప్పారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ రాదంటూ మూడు మండలాల్లోని అసైన్డ్ రైతులను భయపెట్టి బాబు బృందం దక్కించుకుందన్నారు. ఆ భూములకు లభించే కౌలు, వన్‌టైమ్ బెనిఫిట్‌ను తమకు అందేలా చంద్రబాబు మనుషులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కాలేజీకి సైతం డబ్బులు జమ అయ్యాయని, పేద రైతులను మాయచేసి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు తమ చేతికి వచ్చిన తర్వాత వాటికి జీవో 1 వర్తించదు కాబట్టి ఏడాది తరువాత తాపీగా జీఓ 41 తీసుకువచ్చారని చెప్పారు. అసైన్డ్ రైతులను భయపెట్టేందుకే ఆ జీఓను ఒక సంవత్సరం పాటు ఆపారని తెలిపారు. రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన జీవోను మున్సిపల్ శాఖ ఇచ్చేసింది అసైన్డ్ భూములకు సంబంధించిన జీవోను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్ పరిపాలన శాఖ ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. పేదల భూములను బోగస్ వ్యక్తుల పరం చేయటాన్ని అధికారులంతా వ్యతిరేకించినా గత సర్కారు లెక్కచేయలేదన్నారు. మూడు మండలాల్లో అసైన్డ్ రికార్డులను సైతం మాయం చేశారని తెలిపారు. ప్రస్తుతం భూములు ఎవరి వద్ద ఉన్నాయో వారికే హక్కులు ఇద్దామంటూ తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు తమ మనుషులను ప్రవేశపెట్టారని చెప్పారు. పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా, రెవెన్యూ శాఖకు తెలియకుండా మాజీ మంత్రి నారాయణ ఇవన్నీ చేశారన్నారు. జీవో వచ్చిన 22 రోజుల తర్వాత నాటి సీఎం దీన్ని అంగీకరించారని, చట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో జారీ అయిందన్నారు. ప్రజల క్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున దోపిడీ చేస్తుంటే దాని పట్ల విశ్వాసం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అనుకూలంగా ఇవ్వలేదని ఆయన్ను తీసేశారని, న్యాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ అందరూ వ్యతిరేకించినా దోపిడీని కొనసాగించారని తెలిపారు. ఇంత అడ్డగోలుగా వచ్చిన భూమి ప్లాట్లను కోర్ క్యాపిటల్‌లోని సచివాలయం, గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ ఉన్నచోట ఇచ్చారని, ఇది ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పొట్టగొట్టి గొడవలా? అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు తెలిశాయని, ఇన్ని ఘోరాలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు తాను అవినీతిపరుడిని కాదని ఎలా చెప్పుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా ఇవన్నీ చేశారన్నారు. పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు ఇప్పుడు సీఎం జగన్ 50 వేల మందికి అక్కడే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. రాజధాని రైతుల పొట్ట గొట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తాము రైతులమంటూ గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ఒక ప్రభుత్వం తప్పు చేసి వ్యవస్థపై విశ్వాసాన్ని పోగొడితే మళ్లీ ఆ విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హెరిటేజ్, నారాయణ కోసం ఇన్నర్ ప్లాన్ మార్చారు: ఎమ్మెల్యే పేర్ని నాని రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో తనకు సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టాలో ఇన్నర్ రింగు రోడ్డు ఒకటి. దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. మొదట ఇది మంత్రివర్గ నిర్ణయమని చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా, హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం అలైన్మెంట్ ప్లాన్ మార్చారు. ఐఆర్ఆర్తో తనకేం సంబంధం అంటున్న ఏ–14 నారా లోకే‹శ్ 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. ఆ తీర్మానంపై లోకేష్ సంతకం చేశారు. దళితులు, పేదల నుంచి చంద్రబాబు, నారాయణ అసైన్డ్ భూములను లాక్కున్నారు. కేసులు ఎక్కువ నమోదైన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారు? యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371 కోట్లు టిప్ అని అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు? ఇన్నర్ రింగ్ రోడ్డును అటూ ఇటూ తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే తన కరకట్ట ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని హైకోర్టులో చెప్పారు. బాబుకు సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేనికి అద్దె కింద రూ.27 లక్షలు ఇచ్చామని భువనేశ్వరి చెబుతున్నారు. నిజంగానే అధికారికంగా ఇచ్చి ఉంటే అద్దె ఎందుకు చెల్లించారు? ఐటీ రిటరŠన్స్లో ఈ వివరాలను వెల్లడించారా? రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు ఎందుకు మాట్లాడడం లేదు? రాజధానిపై నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. భూసమీకరణకు ఒప్పుకోని వారిని ఏ–2 నారాయణ, ఏ–14 లోకేష్ బెదిరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. ఎకరం భూమిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారు. అసైన్డ్ రైతులను దగా చేసిన ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. సమగ్ర విచారణ జరగాలి: వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలి. రాజధానిని ప్రకటించకముందే లింగమనేని రమేష్ 355 ఎకరాలను కొనేశారు. పేదలను మోసం చేసి కంతేరు వద్ద భూముల్ని హెరిటేజ్ కొనడం ఏమిటి? ఢిల్లీ కోటను ఢీకొన్న జగన్ కళ్లల్లో భయం చూపిస్తానని లోకే‹శ్ అంటున్నారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్ ఎక్కడ? ఆయనకు ఉన్న 175 మంది సైనికుల్లో ఒకరి చేతుల్లో ఓడిపోయిన లోకే‹శ్ఎక్కడ? మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు: ఆదిమూలపు సురేష్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు. ఇన్నర్ రింగు రోడ్డు అనకొండలా మలుపులు తిరుగుతూ కొందరు వ్యక్తుల పొలాల దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో చేయని మోసం అంటూ ఏదీ లేదు. టెండర్లు పిలవకుండా నచ్చిన వాళ్లకు నామినేషన్ల విధానంలో పనులు అప్పగించారు. ముగ్గురు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ను మార్చారు. గ్రాఫిక్స్‌తో అమరావతిని అంతర్జాతీయ నగరం అని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది అంతర్జాతీయ స్కామ్ అయింది. ఈ స్కామ్‌కి డైరెక్షన్ చంద్రబాబుది అయితే పర్యవేక్షణ లోకేశ్, నాటి మంత్రులు, ఇతరులది. అమరావతిలో దళిత, పేద రైతుల్ని నిలువునా ముంచారు. నవ నగరాలు, ఐకానిక్ బ్రిడ్జి లాంటివన్నీ బూటకం. ఇన్నర్ రింగురోడ్డు గురించి కాగ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ల విధానంలో సుర్బానా, జురాంగ్ కంపెనీలకు ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించి రూ. 28 కోట్లు రూల్స్‌కి విరుద్ధంగా చెల్లించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇన్నర్ రింగు రోడ్డులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న వారు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాలి. ఎస్టీయూపీ అనే కంపెనీకి మాస్టర్‌ప్లాన్ తయారీకి రూ.5 కోట్లు ఇచ్చారు. ఇవి డబ్బులు కాదా? రింగురోడ్డు తుది అలైన్‌మెంట్‌ను లింగమనేని, హెరిటేజ్ భూముల గుండా మార్చారు. హెరిటేజ్ భూములు కాజ, కంతేరు, చినకాకాని వద్ద ఉండడంతో రింగురోడ్డు అటు వెళ్లింది. అలైన్మెంట్ మార్పు చేసి తనకు సహాయం చేసినందుకే లింగమనేని రమేష్ ప్రతిఫలంగా చంద్రబాబుకి కరకట్ట నివాసాన్ని ఇచ్చారు. క్విడ్ప్రోకు ఇది తిరుగులేని ఉదాహరణ. నారాయణ తన వద్ద పనిచేసిన ఉద్యోగి పేరు మీద భూమిని కొని తర్వాత తన పేరిట మార్చుకున్నారు. అడ్డంగా దొరికిన అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో చట్టం ముందు నిలబెడుతున్నాం. చంద్రబాబు, లోకే‹శ్ను చట్ట ప్రకారం శిక్షించాలి. -
అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం గత సర్కారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉండే ప్రదేశాలను వదిలేసి బయటి వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ భూమిని పూలింగ్తో సేకరించడమేనని స్పష్టం చేసింది. ఈమేరకు కాగ్ సమర్పించిన తనిఖీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో ప్రధానంగా అమరావతి విషయంలో టీడీపీ సర్కారు అనుసరించిన విధానాలను, భూ సమీకరణను కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతా అసమగ్రం రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు సార్లు ఆడిట్ నిర్వహించినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు, రాజధాని నగర అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగర అభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు ప్రణాళిక వివరాల్లో సమగ్రత లేదని పేర్కొంది. అమరావతిలో ఏకరీతిలో భూ కేటాయింపుల విధానాన్ని అమలు చేయలేదని, వివిధ ప్రైవేట్ సంస్థలకు ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని కాగ్ నివేదిక ఎండగట్టింది. చేపట్టిన పనులన్నీ 2017 నవంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ప్రారంభించలేదని, దీంతో ఎల్పీఎస్ (ల్యాండ్ పూలింగ్ స్కీమ్) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదని కాగ్ పేర్కొంది. రహదారి పనులతో కూడిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాలను సరైన అంచనా, ప్రాథమిక సర్వే లేకుండా చేపట్టడంతో పనుల పురోగతి దెబ్బ తిందని కాగ్ తెలిపింది. అమరావతి రాజధాని అభివృద్ధిలో నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తప్పుబట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్లపై తగిన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారని కాగ్ పేర్కొంది. ప్రణాళిక లోపం.. వ్యయంపై ప్రభావం స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్‌లు రూ.33,476.23 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాగ్ నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు ఫలితంగా 2019 మే నుంచి కాల పరిమితి లేని ఒప్పందాల ప్యాకేజీలు అనిశ్చితిగా ఉన్నాయని తెలిపింది. గత సర్కారు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల పరిధిలో అనధికారికంగా గ్రీవెన్స్ సెల్ భవన నిర్మాణానికి ఏపీ సీఆర్డీఏ అనుమతి ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగరానికి భూమి వాస్తవ అవసరాలను అంచనా వేసేందుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం రికార్డులను సీఆర్డీఏ అందించలేదని కాగ్ పేర్కొంది. పర్యవసానంగా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేనందున ఎల్పీఎస్ ద్వారా సేకరించిన భూమి అవసరం హేతుబద్ధతను నిర్ధారించలేకపోయినట్లు కాగ్ వెల్లడించింది. దశలవారీ ప్రణాళిక లేకపోవడంతో ప్రాజెక్టుల వ్యయంపై ప్రభావం పడిందని, కార్యాచరణ ప్రణాళికను సూచించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ సిఫార్సులను ఆడిట్‌కు అందుబాటులో ఉంచలేదని కాగ్ తెలిపింది. కేంద్రం వివరణ కోరినా.. టీడీపీ సర్కారు నిర్దిష్ట విధివిధానాలను అనుసరించకుండా కన్సల్టెన్సీ సంస్థలు, కన్సల్టెంట్లను ఎంపిక చేసినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక ప్రక్రియలో ఏపీ సీఆర్డీఏ టెండరింగ్, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధివిధానాలను అనుసరించకుండా మూడు కన్సల్టెన్సీ సంస్ధలకు రూ.28.96 కోట్ల ఒప్పంద విలువతో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. రాజధాని నగరానికి సంబంధించి రూ.1,09,023 కోట్ల అంచనాతో డీపీఆర్‌లు రూపొందించినప్పటికీ వీటిలో రూ.46,400 కోట్ల మేర డీపీఆర్‌లను నీతి ఆయోగ్‌కు సమర్పించలేదని వెలుగులోకి తెచ్చింది. డీపీఆర్‌లు లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరినా గత సర్కారు సమర్పించలేదని కాగ్ తెలిపింది. -
విశాఖలో సీఎంవోకు దశలవారీగా చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారాయన. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి హాజరయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతాం. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. అలాగే.. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ కీలక వ్యాఖ్యలు అంతకుముందు వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. -
ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అలహాబాద్ చరిత్ర ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్‌గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క రోజు రాజధాని మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్ కలిగిన లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్‌కు చేరింది. ఆ సమయంలో ఆయన అలహాబాద్‌లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్‌ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు. ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రలో నిలిచింది. పర్యాటక కేంద్రంగా.. ప్రయాగ్‌రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. చూడవలసిన ప్రదేశాలు మీరు ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? -
నాలెడ్జ్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు.