న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అడక్కుండానే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,800 కోట్ల మూలధన నిర్వహణ కసరత్తులో భాగంగా అందజేసినట్లు కాగ్ పేర్కొంది.
ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు
ఆర్థిక మంత్రిత్వశాఖ కింద బాధ్యతలు నిర్వహించే ఆర్థిక సేవల విభాగం రీక్యాపిటలైజేషన్‌కు ముందు తన స్వంత ప్రామాణిక పద్దతి ప్రకారం సైతం ఎటువంటి కసరత్తూ నిర్వహించేలేదని స్పష్టం చేసింది. 2019–20లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రూ.798 కోట్లు అడిగితే, డీఎఫ్‌ఎస్ రూ. 831 కోట్లు అందించినట్లు పేర్కొంది. రుణ వృద్ధికి, నియంత్రణ మూలధన అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రీక్యాపిటలైజ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment