DFS
-
అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు అడక్కుండానే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,800 కోట్ల మూలధన నిర్వహణ కసరత్తులో భాగంగా అందజేసినట్లు కాగ్ పేర్కొంది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు ఆర్థిక మంత్రిత్వశాఖ కింద బాధ్యతలు నిర్వహించే ఆర్థిక సేవల విభాగం రీక్యాపిటలైజేషన్‌కు ముందు తన స్వంత ప్రామాణిక పద్దతి ప్రకారం సైతం ఎటువంటి కసరత్తూ నిర్వహించేలేదని స్పష్టం చేసింది. 2019–20లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రూ.798 కోట్లు అడిగితే, డీఎఫ్ఎస్ రూ. 831 కోట్లు అందించినట్లు పేర్కొంది. రుణ వృద్ధికి, నియంత్రణ మూలధన అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రీక్యాపిటలైజ్ చేస్తుంది. -
ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది. -
రూపే డిస్కవర్ గ్లోబల్ కార్డులు @ 2.5 కోట్లు
న్యూఢిల్లీ: రూపే డిస్కవర్ గ్లోబల్ కార్డుల సంఖ్య 2.5 కోట్ల మైలురాయిని అధిగమించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేర్కొంది. బ్యాంకులు 2014 నుంచి ఈ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. ఎన్పీసీఐ ఈ రూపే కార్డుల అంతర్జాతీయ ఆమోదాన్ని విస్తరించడానికి డిస్కవర్ పైనాన్షియల్ సర్వీసెస్‌తో (డీఎఫ్ఎస్) భాగస్వామ్యం కుదుర్చుకోవటం తెలిసిందే. 2.5 కోట్ల మంది అంతర్జాతీయంగా 185 దేశాల్లో, 4 కోట్ల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టర్మినల్స్లో, 19 లక్షలకుపైగా ఏటీఎంలలో డిస్కవర్ గ్లోబల్ కార్డులను వినియోగిస్తున్నారని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ) దిలిప్ అస్బె తెలిపారు. కాగా రూపే గ్లోబల్ కార్డు.. గ్లోబల్ క్లాసిక్ డెబిట్ కార్డ్, గ్లోబల్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ప్లాటినం డెబిట్ కార్డ్, ప్లాటినం క్రెడిట్ కార్డ్, సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అనే ఐదు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూపే గ్లోబల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులను 32 బ్యాంకులు ఇష్యూ చేస్తున్నాయి. కాగా ఎన్పీసీఐ భారత్ వెలుపల లావాదేవీల కోసం డిస్కవర్ కార్డులను జారీ చేస్తుంది. రూపే తొలి అంతర్జాతీయ భాగస్వామిగా సింగపూర్! దేశీ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ రూపే కార్డు ప్రమోషన్‌కు సాయమందిస్తామని సింగపూర్ ప్రకటించింది. రూపే కార్డుకు తొలి అంతర్జాతీయ భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌ను పెంచడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. -
వాగ్దానం మాఫీ
రుణాల రద్దు కష్టమని తేల్చి చెప్పిన ప్రభుత్వం రూ.1050 కోట్లు మాఫీ లేనట్టే! 20 శాతం మందికే రీషెడ్యూల్ ఆందోళనలో జిల్లా రైతాంగం ఊహించినట్టే జరిగింది. తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. రుణాల రీషెడ్యూల్‌తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇందులోనూ షరతులు, ఆంక్షలంటూ వీలైనంత తక్కువ మందికి వర్తింప చేయాలని యోచిస్తోంది. విశాఖ రూరల్: రుణమాఫీపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. గతేడాది వరదలు, కరువు మండలాల్లోని రైతులకు మాత్రమే రీషెడ్యూల్ అంటూ ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా రైతులకు అశనిపాతమే. కనీసం 20 శాతం మందికి కూడా రీషెడ్యూల్ అమలుకాదు. ఖరీఫ్ ప్రారంభమై నారుపోతలు పూర్తయ్యాయి.. ఇప్పటికీ కొత్త రుణాలు లేవు. రుణ మాఫీ ఆశతో అన్నదాతలు ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు పనులు ప్రారంభించారు. తీరా ఇప్పుడు రుణాల రద్దు కష్టమని సాక్షాత్తూ సీఎం ప్రకటించడంతోదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. రూ.1050 కోట్లు రుణాలు మాఫీ లేనట్టే! : గత ఖరీఫ్‌లో జిల్లాలో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు అప్పులిచ్చారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1లు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణ మాఫీ జరిగితే అన్ని రకాల రుణాలు కలిపి మొత్తం రూ.1050 కోట్లు రద్దవుతాయని రైతులు భావించారు. 20 శాతం మందికే రీషెడ్యూల్! : జిల్లాలో గతేడాది వర్షాభావం కారణంగా 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. దీని ప్రకారం ఒక్క రైతుకు కూడా రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేదు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అల్పపీడనం, తుపాను కారణంగా భారీగా పంటలు నీటమునిగాయి. జిల్లాలో 34 మండలాల్లో మొత్తంగా 52,426 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వీరికి మాత్రమే రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశముంది. వీరిలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రుణాలు పొంది ఉంటే వారికి కూడా రీషెడ్యూల్ వర్తించదు. అలాగే బంగారంపై రుణాలు పొందిన వారు 50 శాతానికి పైనే ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 20 శాతం మంది రైతులకు కూడా రుణాలు రీషెడ్యూల్ జరిగే అవకాశం కనిపించడం లేదు. రీషెడ్యూలైన రైతులకు కూడా వడ్డీ భారం పడనుంది. కొత్త రుణాలు కష్టమే.. : జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు, రెన్యువల్స్‌గా 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలే దని అధికారులు చెబుతున్నారు. -
ప్రజలను మోసగించడం బాబుకు అలవాటే
పుంగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలను మోసగిం చడం వెన్నతో పెట్టిన విద్య అని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను నూతన ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణస్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరులోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలను నమ్మి ప్రజలందరు ఓట్లు వేసి గెలిపించారన్నారు. కానీ పదవిని చేపట్టి నెలరోజులు గడుస్తున్నా చంద్రబాబునాయుడు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వక, కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు 1994లో ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రెండురూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయలకు పెంచారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు రైతుల అన్నిరకాల రుణాలను, మహిళల డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని ప్రకటించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణ మాఫీపై ప్రజలు తిరగబడుతూ తెలుగుదేశం పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతాంగం వెంటనే స్పందించి రుణమాఫీలపై పోరాటం చేయాలన్నారు. అలా పోరాటం చేసే వారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నూతన ఎంపీపీ నరసింహులు, నూతన వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, లీడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మాజీ ఏఎంసీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ ఆవుల అమరేంద్రతో పాటు నూతన ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
చినుకమ్మా.. రావమ్మా..!
ఆదిలాబాద్/ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వరుణుడి కరుణ కోసం రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. మృగశిరకార్తే(మిరుగు) ప్రవేశించి పది రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అదును దాటుతుండటంతో తల్లడిల్లుతున్నారు. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 200 మిల్లీమీటర్లు. ఈ నెల 16 వరకు 76 మి.మీ. కాగా, ఇప్పటివరకు కేవలం సగటున జిల్లావ్యాప్తంగా 23.2 మి.మీ. వర్షపా తం నమోదైంది. చిరు జల్లులు తప్పితే ఎక్క డా మంచి వర్షాలు పడలేదు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేయడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 202.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 100 శాతం కంటే అధికం. కాగా, వర్షాలు కురుస్తాయనే భరోసాతో కొంత మంది రైతులు విత్తనాలు వేశారు. మరికొంత మంది దుక్కులు దున్ని విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఎండలు 43 డిగ్రీల పైబడి నమోదు అవుతుండటం, వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం కప్పతల్లి ఆడుతున్నారు. ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ ఏడాది 6.15 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 85 శాతం వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. సమయానికి వర్షాలు కురిస్తేనే పంటలు బాగా పండే పరిస్థితి ఉంది. విత్తనాలు.. ఎరువులు.. పత్తి విత్తనాలు (450 గ్రాముల ప్యాకెట్)లు 20 లక్షలు అవసరం కాగా ఇప్పటివరకు 17 లక్షల వరకు జిల్లాకు చేరుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 10 లక్షల వరకు రైతులు కొనుగోలు చేశారు. సోయాబీన్ విత్తనాలు 90 వేల క్వింటాళ్లు అవసరం కాగా 82 వేల క్వింటాళ్లు చేరుకున్నాయి. అందులో 50 వేల క్వింటాళ్లు ఇప్పటివరకు రైతులు కొనుగోలు చేశారు. మరో 32వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నాయి. మిగతా విత్తనాల 400 క్వింటాళ్లు, 10 వేల క్వింటాళ్ల వరి, 400 క్వింటాళ్ల పెసర్లు, 100 క్వింటాళ్ల మినుములు, 300 క్వింటాళ్ల మొక్కజొన్న, 100 క్వింటాళ్ల జొన్నలు, 400 క్వింటాళ్ల సీసం అవసరంగా గుర్తించారు. ఈ విత్తనాల కొనుగోలుకు కొంత సమయం ఉంది. 1,21,435 మెట్రిక్ టన్నుల యూరియా, 83,350 మెట్రిక్ టన్నుల డీఏపీ, 51,963 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 28,478 మెట్రిక్ టన్నుల పొటాష్ మంజూరు ఉంది. రుణ లక్ష్యం రూ.2,228 కోట్లు ఖరీఫ్ ప్రారంభమైనా రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సాగు కోసం ఇప్పుడు రుణాల అవసరం ఉండగా బ్యాంకర్లు మాత్రం రుణమాఫీపై స్పష్టత వచ్చిన తర్వాతనే రుణాలు ఇవ్వడం జరుగుతుందని, లేనిపక్షంలో పాత బకాయిలు కట్టి కొత్త రుణం తీసుకోవాలని మెలిక పెడుతున్నారు. రైతన్న పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. 2013-14లో రూ.1,656 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.1,421 కోట్ల రుణాలు 3,16,542 మంది రైతులకు అందించడం జరిగింది. గ్రామీణ బ్యాంకుల్లో ఏప్రిల్ నెలలోనే రుణాలు ఇవ్వడం మొదలు పెడతారు. అలాంటిది జూన్ నెల సగం వరకు వచ్చినా ఈ ఏడాది ఒక్క రైతు ఒక్క రూపాయి రుణం తీసుకోలేదు. ఖరీఫ్ ప్రారంభంలోనే వార్షిక రుణాలు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం బట్టి రుణ ప్రణాళిక ఖరారు చేసి జిల్లా కలెక్టర్ ఆమోదించేవారు. ఇంత వరకు ప్రణాళిక రూపొందించలేదు. -
రుణ మాఫీపై కౌలు రైతు గంపెడాశ
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై కౌలు రైతులు డోలాయమానంలో పడ్డారు. తమ రుణాలు పోతాయే లేదోననే ప్రశ్న వారిని వేధిస్తోంది. జిల్లాలో పలువురు కౌలు రైతులు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ సమయంతో భూయజమానుల సర్వే నంబర్లను దరఖాస్తులో పేర్కొన్నారు. ఇవే సర్వే నంబర్లుతో భూయజమానులు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ రెండింటిలో ఏ రుణాన్ని రద్దు చేస్తారో అంతుచిక్కక కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో నలుగురు రైతులు గుమిగూడినా రుణమాఫీ పైనే చర్చిస్తున్నారు. ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : అధికారంలోకొస్తే రుణాలు రద్దుచేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీపై కౌలు రైతులు గంపెడాశతో ఉన్నారు. మండలంలోని పలువురు సంయుక్త గ్రూపులుగా (జేఎల్‌జీ) ఏర్పడి వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. మూడేళ్లుగా పంటలు నష్టపోయి చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. బాబు ప్రకటించిన రుణాల రద్దు ప్రకటన వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. మండలంలో 1.64 కోట్ల రుణాలు మండలంలో 2వేల మంది వరకు కౌలు రైతులు 209 గ్రూపులుగా ఏర్పడ్డారు. గతేడాది సార్వా సీజన్లో 1.64 కోట్ల రుణాలు పొందారు. ముదినేపల్లి ఎస్బీఐ నుంచి 32గ్రూపులు రూ. 16లక్షలు, ముదినేపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి నుంచి 39గ్రూపులు రూ. 29లక్షలు, అల్లూరు బ్రాంచి నుంచి 4 గ్రూపులు రూ. 1.8లక్షలు రుణాలు పొందాయి. శ్రీహరిపురం ఆంధ్రాబ్యాంక్ నుంచి 7గ్రూపులు రూ. 10.25లక్షలు, ఇండియన్ బ్యాంక్ పెదగొన్నూరు బ్రాంచి నుంచి 101గ్రూపులు రూ. 90.5లక్షలు, పెదతుమ్మిడి బ్రాంచి నుంచి 9గ్రూపులు రూ. 13.5లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మోటూరు బ్రాంచి నుంచి 17గ్రూపులు రూ. 3లక్షలు పంట రుణాలు పొందాయి. ఇవి కాకుండా 2011, 2012 సంవత్సరాల్లో 73 గ్రూపులు వివిధ బ్యాంకులకు గడువు మీరిన బాకీలు రూ. 35లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆచరణ సాధ్యమేనా? రుణాలు పొందిన కౌలు రైతుల్లో ఎక్కువ మందికి గుర్తింపు కార్డులు లేవు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి వ్యవసాయాధికారుల సిఫారసుతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. వీటిని తిరిగి చెల్లించిన వెంటనే అధికారులు రెన్యువల్ చేస్తున్నారు. రుణాలు పొందే సమయంలో యజమాని భూమి సర్వే నంబర్లను తెలపాలి. వాటిని తనఖాగా ఉంచి యజమాని కూడా పంట రుణం పొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే భూమిపై రెండు పంట రుణాలు ఏవిధంగా రద్దు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కౌలు రైతుల రుణాలకు, భూయజమానికి ఎలాంటి సంబంధం ఉండదు. రద్దు చేసే పక్షంలో యజమానికే ప్రాధాన్యత ఇస్తే కౌలు రైతులు నష్టపోయే ప్రమాదముంది. పరిహారం తంతే! పంటలు నష్టపోయిన సమయంలో ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందిస్తోంది. భూములు కౌలుకు ఇచ్చినప్పటికీ పరిహారం మాత్రం కౌలు రైతులకు దక్కకుండా యజమానులకే అందుతోంది. ఇందుకు అనేక నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నందున అధికారులు సైతం ఏమీ చేయలేక పోతున్నారు. యజమాని దయతలచి కౌలు రైతు పేరును నష్టపోయిన రైతుల జాబితాలో చేర్చేందుకు అంగీకరిస్తేనే పరిహారం వస్తోంది. రుణాల రద్దు సైతం ఇదే విధంగా ఉండే అవకాశం లేకపోలేద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులను ఆదుకోవాలనే పట్టుదల ప్రభుత్వంలో ఉంటేనే తప్ప రుణాల రద్దుతో మేలు జరిగే అవకాశం పెద్దగా ఉండదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. -
ఆశలన్నీ.. రుణమాఫీ పైనే
రైతులను నమ్మించి ఓట్లు దండుకున్న టీడీపీ జిల్లాలో రూ.9,137 కోట్ల పంట రుణ బకాయిలు అన్నదాతల్లో అయోమయం - హామీ అమలుపై సందిగ్ధం రైతు రుణమాఫీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాన హామీ ఇది. ఆ పార్టీ గెలుపులో ఈ హామీ కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో సందేహం లేదు. మరికొద్దిరోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు రైతుల ఆశలన్నీ రుణాల మాఫీపైనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసి చూపిస్తాం.. అంటూ మాట్లాడిన టీడీపీ నాయకులు.. ఫలితాల తర్వాత దాన్ని దాటవేస్తుండటం అన్నదాతలకు ఆందోళన కలిగిస్తోంది. రుణ మాఫీ అమలుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రైతు రుణాల మాఫీ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుంది. దీన్ని విస్తృతస్థాయిలో ప్రచారం చేసింది. రుణమాఫీ చేసి తీరుతామంటూ అన్నదాతలను నమ్మించింది. ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం దక్కించుకుంది. అప్పులు తీర్చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నా.. అన్నదాతల్లో ఏదో మూలన సందేహం వెంటాడుతూనే వచ్చింది. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ వ్యవసాయం, రైతులను పట్టించుకోకుండా.. హైటెక్ ముఖ్యమంత్రిగా వెలుగొందిన చంద్రబాబు రుణమాఫీ చేస్తారా అనే సందేహం ఉన్నా సరే ఓట్లు వేశారు. తీరా ఇప్పుడు చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ రుణమాఫీ హామీని అమలు చేస్తామని ఎక్కడా స్పష్టం చేయడం లేదు. ఇది రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అనుమానాలున్నా సరే టీడీపీని గెలిపించిన అన్నదాతలు రుణమాఫీపై మెండుగా ఆశలు పెట్టుకుని ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. చంద్రబాబు హామీతో అప్పు చెల్లించని రైతులు... గత ఏడాది ఖరీఫ్‌తోపాటు అంతకు ముందు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లాలో దాదాపు రూ.9,137 కోట్ల బకాయిలున్నాయి. ‘అన్నదాతలారా ఎవరూ బ్యాంకులకు అప్పు కట్టకండి. మేం అధికారంలోకి వస్తే రుణాలు చెల్లిస్తాం...’ అంటూ చంద్రబాబునాయుడు పాదయాత్ర సమయంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో దాదాపు జిల్లా రైతులంతా తిరిగి అ్ష్మప్పులు చెల్లించలేదు. తన తొలి సంత కం రుణమాఫీపైనే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆ ఫైలుపై తొలి సంతకం చేస్తారని జిల్లాలోని రైతులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్నదాతల్లో ఆందోళన... ఒక పక్క రుణాలు మాఫీ అవుతాయనే ఆశ.. మరోవైపు బ్యాంకర్ల వద్ద పరువుపోతుందనే భయం.. ఏం చేయాలో పాలుపోక రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చెల్లిద్దామంటే చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం చెల్లిస్తుందా.. అంటే స్పష్టత లేదు. బ్యాంకర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకుంటే రైతు బతుకు అధోగతే. వడ్డీ రాయితీ లేక, లక్షలకు లక్షలు చెల్లించలేక ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఖరీఫ్ రుణాలు ఇచ్చేనా... పంట రుణమాఫీపై ప్రభుత్వం జూన్ 15లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుని బ్యాంకు అధికారులకు మార్గదర్శకాలు ఇస్తే ఖరీఫ్‌లో కొత్త రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని రైతులు ఆశతో ఉన్నారు. రుణమాఫీపై ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వటంతో రైతులు రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొత్త రుణం మంజూరు చేస్తారా, లేదా అనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకు అధికారులు కూడా రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై ఆదేశాలు వస్తే రైతులకు రుణమాఫీ చేయాలా, కొత్త రుణాలు మంజూరు చేయాలా అనే అంశంపై చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేస్తే రైతులకు వెసులుబాటు ఉంటుంది. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుండగా ప్రస్తుత రుణమాఫీ వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే రెండు పంటల్లో నష్టపోయిన రైతులకు కొత్తగా అప్పులు తేవాలంటే తలకు మించిన భారమే. - కూనసాని లకో్ష్మజీ,కొమాళ్లపూడి కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ అయోమయం తొలగించాలి ఖరీఫ్ సాగుకు రైతులు సంసిద్ధులు కావాలంటే ఆర్థిక వెన్నుదన్ను అవసరం. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దు చేస్తారనే నమ్మకంతో బకాయిలు చెల్లించటం లేదు. బ్యాంకర్లు డిమాండ్ చేయటం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే పెట్టుబడి కావాల్సిందే. రుణమాఫీ జరిగి రైతులకు పంట రుణాలు ఇస్తేనే సాగు సజావుగా సాగుతుంది. - కె.సత్యనారాయణ, రైతు, కొమాళ్లపూడి -
రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపు
రుణగ్రస్తులు 8,70,321 మంది బకాయిలు రూ.7693.75 కోట్లు ఖరీఫ్ వచ్చినా కొత్త రుణాలివ్వరా ? సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేయడం, తరువాత కొత్తరుణాలు ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్‌లో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రోహిణి కార్తెలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా ఎండలు తగ్గాయి. వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు ముందుగానే దుక్కులు దున్ని ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. జిల్లాలో వ్యవసాయ రుణ బకాయిలు మార్చి నెలాఖరు వరకు రూ.7693.75 కోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రుణ బకాయిల జాబితాను వారు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షలా 70 వేల 321 మంది చిన్న, సన్నకారు, మధ్య, పెద్ద రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రధాన బ్యాంకుల కింద 478 బ్రాంచీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వ్యాపార బ్యాంకులు 291 కాగా, ప్రైవేటు వ్యాపార బ్యాంకులు 52 ఉన్నాయి. చిత్తూరు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కింద 30 బ్రాంచీలు ఉండగా, సప్తగిరి గ్రామీణ బ్యాంకు కింద 104 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటిలో భూముల పాస్‌పుస్తకాలు తనఖాపెట్టి రైతులు రుణాలు పొందారు. 8,70,321 మంది రైతుల పాస్ పుస్తకాలు ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రైతుల రు ణాలను పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం రుణాల రీషెడ్యూల్ మాత్రం జరుగుతోంది. అంటే తీసుకున్న అప్పును కంతుల వారీగా చెల్లించేందుకు గడువు ఇస్తున్నారు. రుణాలపై వడ్డీ పడుతూనే ఉంది. అటు రుణం, వడ్డీపై వడ్డీ, తరువాత కొత్త రుణాలు తీసుకోవడం కలిసి రైతులకు తడిసి మోపెడైంది. ఒక్కో రైతు లక్షల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. బ్యాంకు అధికారులు ఏమంటున్నారంటే... ఇంతవరకు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉత్తర్వులు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో తీసుకున్న రుణాలు చెల్లించేవారికి ఇప్పుడు కొత్తగా ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే రుణం చెల్లించకుండా, మాఫీ కాకుండా కొత్త రుణాలు ఇవ్వలేమని చెప్పారు.