న్యూఢిల్లీ: రూపే డిస్కవర్ గ్లోబల్ కార్డుల సంఖ్య 2.5 కోట్ల మైలురాయిని అధిగమించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. బ్యాంకులు 2014 నుంచి ఈ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. ఎన్‌పీసీఐ ఈ రూపే కార్డుల అంతర్జాతీయ ఆమోదాన్ని విస్తరించడానికి డిస్కవర్ పైనాన్షియల్ సర్వీసెస్‌తో (డీఎఫ్‌ఎస్) భాగస్వామ్యం కుదుర్చుకోవటం తెలిసిందే. 2.5 కోట్ల మంది అంతర్జాతీయంగా 185 దేశాల్లో, 4 కోట్ల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టర్మినల్స్‌లో, 19 లక్షలకుపైగా ఏటీఎంలలో డిస్కవర్ గ్లోబల్ కార్డులను వినియోగిస్తున్నారని ఎన్‌పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ) దిలిప్ అస్బె తెలిపారు. కాగా రూపే గ్లోబల్ కార్డు.. గ్లోబల్ క్లాసిక్ డెబిట్ కార్డ్, గ్లోబల్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ప్లాటినం డెబిట్ కార్డ్, ప్లాటినం క్రెడిట్ కార్డ్, సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అనే ఐదు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూపే గ్లోబల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులను 32 బ్యాంకులు ఇష్యూ చేస్తున్నాయి. కాగా ఎన్‌పీసీఐ భారత్ వెలుపల లావాదేవీల కోసం డిస్కవర్ కార్డులను జారీ చేస్తుంది.
రూపే తొలి అంతర్జాతీయ భాగస్వామిగా సింగపూర్!
దేశీ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ రూపే కార్డు ప్రమోషన్‌కు సాయమందిస్తామని సింగపూర్ ప్రకటించింది. రూపే కార్డుకు తొలి అంతర్జాతీయ భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌ను పెంచడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు.
రూపే డిస్కవర్ గ్లోబల్ కార్డులు @ 2.5 కోట్లు
Published Thu, Nov 2 2017 12:17 AM | Last Updated on Thu, Nov 2 2017 12:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment