Comptroller and Auditor General (CAG)
-
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు!
రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండిపోయారు. గోబెల్స్‌కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పినదానికి మించి అప్పులు చేస్తుండటం కళ్లెదుటే కనిపిస్తుంటే.. అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోవడం.. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం.. కేంద్ర గ్రాంట్లు తగ్గడం.. అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవర పెడుతుంటే, బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్.. రయ్.. అని పరుగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేవో దావోస్‌లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబూ..!సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం వెల్లడించింది. గత ఏడాది (2023) డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది. బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరో పక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది. ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షోభం లేకపోయినా తగ్గిన రాబడికోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాది ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది (2023) డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల దగ్గర డబ్బులేక పోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రూ.6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం రూ.993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది.రాబడి తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది?రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి, ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి.. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా రూ.64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, డిసెంబర్ నాటికే రూ.73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతోందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
అంచనాలకు దూరంగా.. ఆర్థికం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నెలవారీ నివేదిక తేల్చింది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయ, వ్యయాల అంచనాల్లో అంతరం పెరుగుతోందని వెల్లడించింది. పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల కంటే తగ్గుతుంటే... అప్పులు పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.49,225 కోట్లు రుణాలు తీసుకోవాలని బడ్జెట్లో పేర్కొన్నా.. మరో మూడు నెలలు ఉండగానే, డిసెంబర్ చివరి నాటికే ప్రభుత్వం రూ.48,178 కోట్ల రుణాలు తీసేసుకుందని వెల్లడించింది. 2024–25లో రూ.297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేయగా.. 2024 డిసెంబర్ నాటికి వాస్తవ రెవెన్యూ రూ.19,892 కోట్ల మైనస్‌లోకి వెళ్లిందని, ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారమైతే ఇది రూ.6,688.47 కోట్లు లోటు అని పేర్కొంది. డిసెంబర్ నెలకు సంబంధించి కాగ్ గురువారం ఈ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం..9 నెలలు గడిచినా 58.57 శాతమే ఆదాయం...రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు, రుణాలు.. ఇలా అన్ని కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,74,057 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది. ఇందులో డిసెంబర్ చివరి నాటికి వచ్చినది రూ.1,60,518 కోట్లే. అంటే 58.57 శాతం మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో 62.17 శాతం ఆదాయం వచ్చినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత బడ్జెట్లో గ్రాంట్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఆదాయం రూ.21,663 కోట్లుకాగా.. కేంద్రం నుంచి వచ్చింది రూ.4,771.44 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా ఆశించినంతగా లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయంలో తగ్గుదల ఉందని, స్థానిక సంస్థలకు రూ.3,046 కోట్లు బదిలీ చేయడం వల్ల లోటు బాగా ఎక్కువగా కనిపిస్తోందని కాగ్ వెల్లడించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా రూ.18,228 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. డిసెంబర్ చివరి నాటికి వచ్చింది రూ.7,524 కోట్లేనని తెలిపింది. అమ్మకం పన్ను ఆదాయం మాత్రం పెరుగుతోందని వెల్లడించింది. ఇక రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ కింద అంచనా వేసుకున్న ఆదాయంలో ఇప్పటివరకు సగమే వచ్చిందని, పన్నేతర ఆదాయంలోనూ భారీ లోటు ఉందని తెలిపింది. బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.35,208 కోట్లు పన్నేతర ఆదాయం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు సమకూరింది రూ.5,487.88 కోట్లు మాత్రమేనని కాగ్ నివేదికలో పేర్కొంది.మూలధన వ్యయంలోనూ తగ్గుదల..అభివృద్ధి పనులకు సూచికగా పరిగణించే మూలధన వ్యయం కూడా గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2023–24లో డిసెంబర్ నాటికి మూలధన వ్యయం 83.68 శాతం ఉంటే.. 2024–25లో డిసెంబర్ నాటికి ఇది 75.54 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది. మూలధన వ్యయం కింద రూ.33,486 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించగా.. డిసెంబర్ నాటికి రూ.25,295 కోట్లే వ్యయం చేశారని తెలిపింది. -
ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఢిల్లీ రాష్ట్ర పరిధిలో అమలుకోసం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంబంధిత కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికను జాతీయ మీడియా బయటపట్టింది. లీక్ అయిన కాగ్ నివేదికలో పలు విస్మయకర విషయాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఎక్సైజ్ విధానంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని, నిబంధనలకు నీళ్లొదిలేశారని, ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారని కాగ్ నివేదిక పేర్కొంది. తమకు అనుకూలంగా పనిచేసే మ ద్యం విక్రయ సంస్థలకు అయాచిత లబ్ధిచేకూరేలా ఎక్సయిజ్ పాలసీలో మార్పులుచేర్పులు, సవరణ లు చేశారని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయ లై సెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతు లు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది. జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదా యం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది. అయితే కాగ్ నివేదిక ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి: బీజేపీ ఆప్ తెచ్చిన మద్యం విధానం లోపభూయిష్టమని కాగ్ నివేదించిన నేపథ్యంలో శనివారం బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్గేట్’కు సూత్రధారి, ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాలి. 11 ఏళ్ల క్రితం అవినీతిపై సమాధానం చెప్పాలని సోనియాగాందీని పదేపదే డిమాండ్‌చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు’’అని ఠాకూర్ అన్నారు. ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి.. -
పంచాయతీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లలో.. గత ఐదేళ్లలో భారీ వృద్ధి
రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు, రుణాల రూపంలో ఇచ్చే నిధులు 2017–18తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థానిక సంస్థల నిధుల వినియోగంపై కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2017–18లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రూ.151.67 కోట్లు విడుదల చేయగా, 2021–22లో రూ.281.12 కోట్లు ఇచ్చినట్టు కాగ్ తెలిపింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మొత్తం 2017–18లో రూ.1,922.05 కోట్లు అందగా.. 2021–22లో రూ.3,666.30 కోట్లు అందినట్లు పేర్కొంది. – సాక్షి, అమరావతి 14, 15 ఆర్థిక సంఘాల నిధులకు ఎప్పటికప్పుడు యూసీలు ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) అందజేసిందని కాగ్ పేర్కొంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు కేంద్రం 2023 సెప్టెంబర్ నాటికి వివిధ సంవత్సరాల్లో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన 8,124.42 కోట్లు, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు విడుదల చేసిన రూ.3,594.51 కోట్లకు వినియోగ ధ్రువపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినట్లు కాగ్ వివరించింది. 2017–22 మధ్య ఆర్జీఎస్ఏ ద్వారా విడుదల చేసిన రూ.190.27 కోట్లకు కేంద్రానికి యూసీలను సమర్పించారని తెలిపింది. 2016–22 మధ్య రుర్బన్ పథకం కోసం కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన రూ.187 కోట్లలో రూ.45.71 కోట్లకు యూసీలను 2023 సెప్టెంబర్ నాటికి కేంద్రానికి ఇంకా సమర్పించాల్సి ఉందని పేర్కొంది. సామాజిక తనిఖీల్లో ఉల్లంఘనల గుర్తింపు 2021–22లో గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పథకం ద్వారా జరిగిన రూ.వేలకోట్ల పనులకు సంబంధించి నిర్వహించిన సామాజిక కనిఖీల్లో రూ.232.99 కోట్ల విలువైన పనుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు మండలస్థాయి తనిఖీ బహిరంగ సమావేశాల్లో నిర్ధారించినట్లు తెలిపింది. అందులో రూ.89.35 కోట్ల విలువైన పనుల్లో (38.35 శాతం) ఆర్థిక దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలను అధికారులు ఆమోదించారని పేర్కొంది. ఆ ఆమోదం చేసిన మేర మొత్తం 2023 ఆగస్టు నాటికి సంబంధీకుల నుంచి వసూలు కాలేదని కాగ్ తెలిపింది. -
నిబంధనలకు లోబడే గత సర్కారు అప్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని, గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కుండబద్ధలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌ను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 2023–24లో మార్కెట్ నుంచి రూ.68,414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారెంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడే ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీ అప్పులను కూడా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నారంటూ గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. బడ్జెట్, కాగ్ నివేదిక సాక్షిగా..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గత సర్కారు హయాంలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. నిన్న బడ్జెట్ సాక్షిగా.. నేడు కాగ్ నివేదిక ద్వారా వైఎస్సార్సీపీ హయాంలో అప్పులకు సంబంధించి ఎల్లో మీడియా, చంద్రబాబు అండ్‌కో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనేనని తేలిపోయింది. 2023–24 నాటికి ప్రజా రుణం రూ.4,86,151 కోట్లుగా ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. 2023–24 నాటికి ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా చేసిన రుణాలు రూ.1,54,797 కోట్లు మాత్రమేనని కాగ్ వెల్లడించింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు 2023–24లో జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువకే 2.68 శాతానికే పరిమితం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యలోటు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా స్వల్పంగా పెరిగి 4.35 శాతానికి చేరిందని కాగ్ పేర్కొంది. -
జగన్ హయాంలో జనహిత పాలన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో సామాజిక రంగం వ్యయం భారీగా పెరిగిందని కాగ్ (కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఆర్థి క నివేదికను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. సామాజికరంగ వ్యయంతో పాటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీ ద్వారా గ్రాంట్ రూపంలో ఇచ్చిన వివరాలతోపాటు స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గడచిన ఐదేళ్లలో గ్రాంటు రూపంలో ఇచ్చిన మొత్తం ఎలా పెరిగిందనే వివరాలను.. ఐదేళ్లలో పన్ను ఆదాయం పెరుగుదలను కాగ్ వివరించింది. సామాజిక రంగంలో (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) 2022–23లో రూ.88,647 కోట్లు వ్యయం చేయగా 2023–24లో రూ.97,396 కోట్లు వ్యయం చేసినట్టు కాగ్ స్పష్టం చేసింది. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరంలో వేతనాల తరువాత అత్యధిక వ్యయం డీబీటీ ద్వారా గ్రాంటుగా ఇచ్చినట్టు వెల్లడించింది. అలాగే రాష్ట్ర సొంత పన్నులు, కేంద్ర పన్నుల వాటా రాబడి 2019–20లో రూ.85,843 కోట్లు ఉండగా.. 2023–24 నాటికి రూ.1,31,633 కోట్లకు పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. అలాగే స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గ్రాంటు రూపంలో 2019–20లో రూ.59,915 కోట్లు ఇవ్వగా.. 2023–24 నాటికి ఆ గ్రాంట్ మొత్తం రూ.91,248 కోట్లకు పెరిగినట్టు వివరించింది. -
పన్ను ఆదాయం 35 శాతమే
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్ర పన్ను ఆదాయం ఆపసో పాలు పడుతోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5నెలల తర్వాత కూడా బడ్జెట్ అంచనాల్లో కేవలం 35.11% మాత్రమే పన్ను రాబడులు వచ్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.64 లక్షల కోట్లు పన్ను ఆదా యం కింద వస్తుందని రాష్ట్ర ప్రభు త్వం అంచనా వేయగా, ఆగస్టు 31 నాటికి కేవలం రూ.57వేల కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది ఐదు నెలల పన్ను ఆదాయంతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ కావడం గమనార్హం. ఇందులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకపు పన్ను ద్వారానే రూ.33,987 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన మేర రాకపోవడం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం కలగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పట్టిక ఇబ్బందులు పడుతోందని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన గణాంకాలు చెబుతు న్నాయి. పన్ను ఆదాయం రాని కారణంగా అప్పులు కూడా భారీగానే చేయాల్సి వచ్చిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. తొలి అర్థ సంవత్సరంలో ఐదు నెలలు ముగిసేసరికి సుమారు రూ.30వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సేకరించగా, అందులో రూ.10వేల కోట్లకు పైనే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే కట్టాల్సి వచ్చింది. ఇక, ఈ ఏడాది మూల ధనవ్యయం కింద రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఐదు నెలల్లో కేవలం రూ. 8,327కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం. ఇక, ప్రధాన ఖర్చుల్లో రెవెన్యూ పద్దు కింద రూ.35వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ.18,152 కోట్లు, పింఛన్లకు రూ.7,165 కోట్లు, వివిధ రకాల ప్రభుత్వ సబ్సిడీల కింద రూ.5,396 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. -
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్‌స్కామ్‌కు పాల్పడి షెల్‌కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్‌ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్‌లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్‌కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు -
‘కాళేశ్వరం’పై సిట్టింగ్ జడ్జి కోసం మరోసారి లేఖ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణ నిర్వహించేందుకు సిట్టింగ్ జడ్జి సేవలను కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మరోసారి కోరతామని పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరామని, అయితే జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇవ్వలేమని, విశ్రాంత న్యాయమూర్తిని అందుకు కేటాయిస్తామని హైకోర్టు నుంచి జవాబు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాల్సిందిగా మరోసారి లేఖ రాస్తామని వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తామని స్పష్టంగా పేర్కొన్నామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపిస్తామంటే అడ్డు చెప్పబోమని పేర్కొన్నారు. విచారణ జరిపించ దలుచుకుంటే కేంద్రానికి సీబీఐయే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో కూడా జరిపించేందుకు అవకాశం ఉందన్నారు. అయితే ఈ విభాగాలతో కేంద్రం విచారణ జరిపిస్తే మాత్రం బీఆర్ఎస్–బీజేపీ ఒక్కటవుతాయనే అనుమానం కూడా తమకుందన్నారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమున్నా కాళేశ్వరంపై ప్రాజెక్టుపై విచారణ జరిపించే ఉండేవారని, అందుకోసం విచారణకు సిట్టింగ్ జడ్జిని కూడా ఇచ్చి ఉండేవాళ్లని చెప్పారు. గతంలోనూ వివిధ అంశాలపై పలు సందర్భాల్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగిన ఉదంతాలున్నాయని, అందువల్ల సిట్టింగ్ జడ్జిని ఎప్పుడూ విచారణకు ఇవ్వలేదనే వాదనలు అవాస్తవమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదిలా ఉంటే... బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంపై కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదికలోని అంశాలపైనా తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని శ్రీధర్‌బాబు చెప్పారు. కేఆర్ఎంబీ చర్చంటే.. బీఆర్ఎస్ సభ్యులు పారిపోయారు కృష్ణానది యాజమాన్య బోర్డు అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ సభ్యులు పారిపోయారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్‌కు శాసనసభకు రావడానికి ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. సభలో ఏయే పార్టీలు ఎంతెంత సమయమంటే.. 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభ నిర్వహించామని, 59 మంది సభ్యులు సభలో మాట్లాడారని, 64 మంది సభ్యులు జీరో అవర్‌లో మాట్లాడారని, 2 తీర్మానాలను పాస్ చేశామని, 3 బిల్లులకు ఆమోదం తెలిపామని శ్రీధర్‌బాబు వివరించారు. సభ్యులందరూ సవివరంగా మాట్లాడే అవకాశం కల్పించామని, పార్టీల వారీగా కాంగ్రెస్‌కు 8 గంటల 43 నిమిషాలు, బీఆర్ఎస్కు 8 గంటల 41 నిమిషాలు, బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎంకు 5 గంటలు, సీపీఐకి 2 గంటల 55 నిమిషాలు అవకాశం ఇచ్చామని చెప్పారు. కాగా, కౌన్సిల్ 11 గంటల 5 నిమిషాల పాటు జరిగిందని శ్రీధర్‌బాబు చెప్పారు. -
ఆ అప్పులు.. అంటగట్టినవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్’ నివేదిక కుండబద్ధలు కొట్టింది. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయంటూ ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నివేదిక స్పష్టం చేసింది. 2022–23 అకౌంట్స్‌పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించింది. కార్పొరేషన్ల అప్పులను దాచేస్తున్నారని, కాగ్‌కు కూడా చెప్పడం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడించింది. 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, మార్కెట్ రుణాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్థిక సంస్ధల నుంచి గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పుల పూర్తి వివరాలను కాగ్ స్పష్టంగా వెల్లడించింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలు, లక్ష్యాలను ప్రభుత్వం పక్కాగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు, ద్రవ్య, రెవెన్యూ లోటు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ బయట అప్పులను సైతం ఎటువంటి దాపరికం లేకుండా కాగ్ అకౌంట్స్‌లో స్పష్టం చేసింది. 2018–19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది (2019 మే నాటికి టీడీపీ సర్కారు సొంత ప్రచారం కోసం మరో రూ.14 వేల కోట్లు అప్పు చేసింది). ఆ రూ.14 వేల అప్పులను మినహాయించి చూసినా సరే 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు రూ.4,23,942 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,66,330 కోట్లు మాత్రమేనని, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2022–23 నాటికి బడ్జెట్లో అప్పులతో పాటు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీల ద్వారా గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు మొత్తం కలిపి రూ.5,62,817 కోట్లు మాత్రమేనని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించినా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అనధికార అప్పులంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. -
వెలిగొండను తొలిచిన తొండ!
సాక్షి, అమరావతి: ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్ కొండంత అవినీతికి పాల్పడిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కడిగి పారేసింది. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం, ధరల వ్యత్యాసం (జీవో 22తో అదనంగా రూ.630.57 కోట్ల చెల్లింపు) రూపంలో కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఎండగట్టింది. నాడు అవినీతి.. నేడు ఆదా వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తున్నారనే సాకుతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కట్టబెట్టడం ద్వారా రూ.117.97 కోట్ల మేర లబ్ధి చేకూర్చారని తూర్పారబట్టింది. ఇక రెండో సొరంగంలో రూ.421.29 కోట్ల విలువైన 8.097 కి.మీ. పనులను ఈపీసీ విధానంలో చేస్తున్న పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి ఎల్ఎస్ ఓపెన్ పద్ధతిలో రూ.470.78 కోట్లకు పెంచి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా రూ.49.49 కోట్లను దోచిపెట్టారు. ఈ పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.61.67 కోట్లను మిగిల్చిందని కాగ్ పేర్కొంది. వెలిగొండలో 2017–18 నుంచి 2020–21 మధ్య జరిగిన పనులు, చెల్లింపులపై కాగ్ తనిఖీలు నిర్వహించి రూపొందించిన నివేదికను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30 రోజుల్లో 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. శ్రీశైలం నుంచి 160.64 క్యూసెక్కులు తరలించే సామర్థ్యంతో మొదటి సొరంగం, 322.68 క్యూమెక్కులు తరలించే సామర్థ్యంతో రెండో సొరంగం, వాటి నుంచి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమలసాగర్‌కు తరలించేలా ఫీడర్ ఛానల్, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ ఏర్పాటు పనులను ఆరు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు. ♦ 2014 నాటికే నల్లమలసాగర్, ఫీడర్ ఛానల్, సొరంగాలు సహా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ తక్షణమే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందిస్తామంటూ ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచుకుంది. ♦ మొదటి, రెండో సొరంగాల్లో రూ.29.35 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తొలగించి వాటి వ్యయాన్ని రూ.95.44 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్టర్‌కు 2017 ఆగస్టులో టీడీపీ సర్కార్ అప్పగించింది. దీని ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.66.09 కోట్లను అప్పనంగా దోచిపెట్టింది. ♦ మొదటి, రెండో సొరంగంలో ఈపీసీ విధానంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారనే నెపంతో వారిపై వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు లబ్ధి, ఖజానాపై భారం పడిందే కానీ పనుల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. -
సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమం పథకాలపై ఇతర రాష్ట్రాలు కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టంచేసింది. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటారు. ఇక కాగ్‌తో పాటు ఆర్బీఐ కూడా సామాజిక రంగ వ్యయాన్ని కొలమానంగా విశ్లేషిస్తాయి. ఈ రంగంపై మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత సామాజిక రంగ కేటాయింపుల్లో గుజరాత్ 42.83 శాతంతో రెండో స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. మరోవైపు.. ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో.. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా.. తెలంగాణ తన బడ్జెట్ కేటాయింపుల్లో 60.86 శాతం ఖర్చుపెట్టి మొదటి స్థానంలో నిలిచింది. -
చంద్రబాబు సర్కారు నిర్వాకం.. భూకేటాయింపుల్లో బరితెగింపు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూముల కేటాయింపులకు సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తప్పుబట్టింది. చట్టం ముందు అందరూ సమానమేననే ప్రాథమిక హక్కును నాటి ప్రభుత్వం కాలరాసిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. భూముల కేటాయింపుల కోసం ఏకరీతి ధరల విధానాన్ని రూపొందించడంలో చంద్రబాబు ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్లు తేల్చిచెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలకు భూములను అత్యధిక ధరకు కేటాయించారని.. అలాగే ప్రైవేట్ సంస్థలకు అతితక్కువ ధరకు కేటాయించినట్లు కాగ్ ఆ నివేదికలో పేర్కొంది. మంత్రివర్గ సూచనలూ బేఖాతరు.. ఇక రాజధాని అమరావతిలో ఫ్రీ హోల్డింగ్ ప్రాతిపదికన టీడీపీ సర్కారు 63 కేటాయింపులు చేసిందని, ఇందులో ఆరు కేటాయింపులను కాగ్ తనిఖీ చేయగా ప్రభుత్వం ఏకరీతి ధరలను ఆమోదించలేదని పేర్కొంది. భూ కేటాయింపుల్లో ఏకరీతి లేనప్పుడు ఏకపక్ష, విచక్షణతో కూడిన ధరలకు అవకాశముందని కాగ్ వ్యాఖ్యానించింది. మంత్రివర్గ ఉప సంఘం సూచించిన ధరలను కూడా పక్కనపెట్టి ఒక విధానం అంటూ లేకుండా కొన్ని సంస్థలకు ఒక ధర, మరికొన్ని సంస్థలకు మరో ధరకు భూములను కేటాయించినట్లు కాగ్ వివరించింది. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒక ధర, ప్రైవేట్ ఆరోగ్య సంస్థలకు ఇంకో ధర, బ్యాంకులకు మరో ధరకు భూములు కేటయించినట్లు తెలిపింది. -
అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే
-
అమరావతితో ఆంధ్రప్రదేశ్‌పై భారీ ఆర్థిక భారం.. ‘కాగ్’ నివేదిక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూలధన వ్యయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు మూల ధన వ్యయంపై కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టమైంది. బడ్జెట్లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే 47.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళం రాష్ట్రానికి చెందిన తొలి నాలుగు నెలల మూల ధన వ్యయం గణాంకాలను కాగ్ పేర్కొంది కేరళం బడ్జెట్లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 28.19 శాతమే వ్యయం చేసినట్లు కాగ్ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏపీ మూల ధన వ్యయం రూ.14,844.99 కోట్లు అని, ఇది బడ్జెట్లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో 47.79 శాతంగా ఉందని తెలిపింది. ఈ నాలుగు నెలల్లో కేరళం మూల ధన వ్యయం రూ.4,117.87 కోట్లు అని, ఇది బడ్జెట్ కేటాయింపుల్లో 28.19 శాతం అని వెల్లడించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన జూలై నెల మూల ధన వ్యయం గణాంకాలను కాగ్ ఇంకా విడుదల చేయలేదు. కాగా, ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి మే వరకు) కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు బడ్జెట్లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర వ్యయం చేశాయనే వివరాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్రంతో పాటు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు చేయనంత మూల ధన వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి త్రైమాసికంలోనే చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. తొలి త్రైమాసికంలో కేంద్రం కంటే ఎక్కువ వ్యయం కేంద్ర ప్రభుత్వం ఈ ఆ ర్థిక ఏడాది బడ్జెట్లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో 27.8 శాతం వ్యయం చేయగా, ఆంధ్రప్రదేశ్ 40.8 శాతం వ్యయం చేసినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. తొలి త్రైమాసికంలో ఇంత పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం మూల ధన వ్యయం చేయడం స్వాగత సంకేతమని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. తొలి త్రైమాసికంలో మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల సరాసరి చూస్తే మూల ధన వ్యయం బడ్జెట్ కేటాయింపుల్లో 12.7 శాతంగా ఉంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు రంగాల్లో ఆస్తుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులను చేపట్టిన విషయం తెలిసిందే. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరో పక్క ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మూలధన వ్యయంలో గత ప్రభుత్వం కన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా పట్టించుకోకుండా కేవలం అప్పులంటూ దు్రష్పచారం చేస్తుండటం గమనార్హం. -
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ–గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్(కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వ్యాఖ్యానించింది. ఒక్కో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా వాస్తవ ఖర్చు రూ.250.77 కోట్లకు పెరిగిందని తెలిపింది. అయితే, భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈ 48వ నంబర్ జాతీయ రహదారిని 14 లేన్లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే, 8 లేన్ల ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు గాను తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఇవ్వడమే నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని వివరించింది. ఈ కారణం సహేతుకంగా లేదని కాగ్ పేర్కొంది. కేవలం ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని తెలిపింది. ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన హైవేల నిర్మాణంలో కేటాయింపుల కంటే 58% అధికంగా ఖర్చు చేశారని వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇక, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. CAG exposed the scam of 6741 crores in building of Dwarka Expressway. If TV media raise these issues & debate on this, BJP will fall like a pack of cards ♠️ pic.twitter.com/81ohaACopW — Baijuu Nambiar CFP®✋ (@baijunambiar) August 14, 2023 ఇది కూడా చదవండి: బీజేపీతో పొత్తుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు -
AP: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే.. ♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది. ♦ ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది. ♦ 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది. ♦ అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది. ..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. -
అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు అడక్కుండానే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,800 కోట్ల మూలధన నిర్వహణ కసరత్తులో భాగంగా అందజేసినట్లు కాగ్ పేర్కొంది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు ఆర్థిక మంత్రిత్వశాఖ కింద బాధ్యతలు నిర్వహించే ఆర్థిక సేవల విభాగం రీక్యాపిటలైజేషన్‌కు ముందు తన స్వంత ప్రామాణిక పద్దతి ప్రకారం సైతం ఎటువంటి కసరత్తూ నిర్వహించేలేదని స్పష్టం చేసింది. 2019–20లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రూ.798 కోట్లు అడిగితే, డీఎఫ్ఎస్ రూ. 831 కోట్లు అందించినట్లు పేర్కొంది. రుణ వృద్ధికి, నియంత్రణ మూలధన అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రీక్యాపిటలైజ్ చేస్తుంది. -
సామాజిక సేవలపై.. పెరిగిన మూలధన, రెవెన్యూ వ్యయం
సాక్షి, అమరావతి : 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవలపై మూల ధన వ్యయంతో పాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. 2021–22కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. సామాజిక సేవలపై 2021–22లో 42.45 శాతం వ్యయం చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా విద్య, ఆరోగ్య.. కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పోషణ, క్రీడలు, కళలకు రూ.66,371 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. సామాజిక సేవలపై సాధారణ రాష్ట్రాల సగటు వ్యయం కన్నా ఏపీలో ఎక్కువగా ఉంది.ఇక సామాజిక సేవలపై రాష్ట్రాల సగటు వ్యయం 38.31 శాతం ఉండగా ఏపీలో 42.45 శాతం ఉంది. -
రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు
సాక్షి, అమరావతి : గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2021–22లో ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం మేర వృద్ధి సాధించినట్లు కాగ్ వెల్లడించింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా తెలిపింది. 2020–21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు తగ్గడానికి కోవిడ్ మహమ్మారివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, దేశ జీడీపీతో పోలిస్తే ఆ ఏడాది రాష్ట్రంలో జీఎస్డీపీ 5 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. అలాగే, ఆ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 1.36 శాతం క్షీణించిందని కాగ్ తెలిపింది. ఈ రంగాల్లో అత్యధిక వృద్ధి.. ఇక 2021–22 విషయానికొస్తే.. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో అత్యధిక వృద్ధి నమోదైనట్లు కాగ్ పేర్కొంది. ♦ అంతకుముందు ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పారిశ్రామిక రంగంలో 25.58 శాతం వృద్ధిని సాధించినట్లు కాగ్ తెలిపింది. అలాగే.. ♦ కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం, తయారీ రంగం కోలుకున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగం 27%, తయారీ రంగం 25 శాతం పెరిగింది. ♦ వ్యవసాయ రంగంలో ప్రధానంగా చేపలు, ఆక్వాకల్చర్, పంటలు, పశు సంపద కార్యకలాపాలు పెరగడంతో వ్యవసాయ రంగం వృద్ధి సాధించింది. ♦ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ 26%, పంటలు, పశుసంపదలో 11 శాతం పెరుగుదల ఉంది. ♦ ప్రధానంగా వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 23 శాతం, రవాణా, నిల్వల, ప్రసార, సమాచార సేవలు 21 శాతం, స్థిరాస్తి రంగం 15 శాతం పెరగడంతో సేవలం రంగంలో భారీ వృద్ధి నమోదైంది. -
ద్రవ్యలోటు తగ్గింది
సాక్షి, అమరావతి: గత ఆర్థికసంవత్సరం (2021–22)లో.. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం 1.46 శాతం తగ్గిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31తో ముగిసిస సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. రాష్ట్ర బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ బయట అప్పుల వివరాలను కాగ్ నివేదికలో విశ్లేషించింది. 2021–22 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికన్నా ద్రవ్యలోటు గణనీయంగా తగ్గిందని, దీంతో తీసుకున్న రుణాలు కూడా తగ్గినట్లు పేర్కొంది. 2021–22 నాటికి రాష్ట్ర మొత్తం రుణబకాయిలు జీఎస్డీపీ లక్ష్యంలోపలే ఉన్నాయని తెలిపింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు 2021–22 నాటికి రాష్ట్ర రుణబకాయిలు జీఎస్డీపీలో 35.60 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువగా 31 శాతమే ఉన్నాయని పేర్కొంది. అప్పటికి రాష్ట్ర రుణాలు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయి. ఇక 2020–21లో జీఎస్డీపీలో రుణాలు 34.35 శాతం ఉండగా 2021–22లో రుణాలు జీఎస్డీపీలో 31 శాతానికి తగ్గినట్లు కాగ్ తెలిపింది. 2021–22లో బడ్టెట్ ప్రతిపాదించిన అంచనాలకన్నా వాస్తవ పరిస్థితులు వచ్చేనాటికి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గినట్లు కాగ్ పేర్కొంది. ద్రవ్యలోటు రూ.38,224 కోట్లు ఉంటుందని అంచనా వేయగా దానిని రూ.25,013 కోట్ల్లకే పరిమితం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇలా ద్రవ్యలోటు 2.08 శాతానికే పరిమితమైంది. బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.19,546 కోట్లు ఉంటుందని ప్రతిపాదించగా వాస్తవంగా రెవెన్యూ లోటు రూ 8,611 కోట్లకు పరిమితం చేశారు. ఇక 2021–22లో రెవెన్యూ రాబడులు 28.53 శాతం పెరిగాయని, దీని ఫలితంగా 2021–22లో రెవెన్యూ, ద్రవ్యలోటు గణనీయంగా మెరుగుపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని కాగ్ వివరించింది. మరోవైపు.. 2021–22 నాటికి బడ్జె్జటేతర రుణాలు రూ.1,18,393.81 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర మొత్తం రుణాలు జీఎస్డీపీలో 40.85 శాతంగా ఉంటుందని పేర్కొంది. అశాస్త్రీయ రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక లోటును ఎదుర్కొంటోందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు కాగ్ తెలిపింది. భౌగోళిక ప్రాతిపదికన ఏపీ తెలంగాణకు ఆస్తులను కోల్పోయిందని, కానీ.. జనాభా ప్రాతిపదికన చెల్లింపుల బాధ్యతను పొందిందని, బకాయిలు తీర్చడానికి ఏపీకి వనరులు కూడా లేవని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి హోదా, 2014–15 రెవెన్యూ లోటుగ్రాంట్ వంటి విభజన హామీల అమలుకు కేంద్రంతో నిరంతరాయంగా ప్రయత్నిస్తోందని.. కోవిడ్ మహమ్మారి ఆర్థికపరమైన ఒత్తిడిని మరింత పెంచిందని తెలిపింది. ఈ కారణంగా రుణంగా తీసుకున్న నిధులలో కొంతభాగాన్ని లోటు ఫైనాన్సింగ్ కోసం, బాకీలను తీర్చేందుకు ఉపయోగించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కాగ్ వెల్లడించింది. -
పన్నులు భళా.. ఖజానా గలగల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు పన్నుల కళ వచ్చింది. కరోనా అనంతరం గత రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థికవృద్ధిలో పన్ను వసూళ్లే కీలకపాత్ర పోషిస్తున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో(2022 మార్చి నుంచి నవంబర్ వరకు) రూ.80 వేల కోట్ల వరకు పన్ను ఆదాయం సమకూరింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను పన్నుల ఆదాయం కింద రూ.1.26 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 64 శాతం మేర ఇప్పటికే సమకూరింది. ఒక్క వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పద్దు కిందనే రూ.27 వేల కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఈ ఏడాది జీఎస్టీ పద్దు కింద రూ.42 వేల కోట్ల అంచనా కాగా, అందులో 65 శాతం ఖజానాకు చేరింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీఎస్టీ వసూళ్లు పెద్దఎత్తున ఉండనున్న నేపథ్యంలో మరో రూ.15 వేల కోట్లు రావచ్చని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం 60 శాతం మించగా, ఎక్సైజ్ రాబడులు 66 శాతం వరకు వచ్చాయి. ఈ పద్దులన్నింటి కింద మార్చినాటికి 100 శాతం అంచనాలు కార్యరూపం దాల్చే అవకాశముందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అత్యధికంగా ఇతర పన్నులు బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే 93 శాతానికి చేరుకున్నాయి. అయితే, అమ్మకపు పన్ను మాత్రమే 60 శాతం కన్నా దిగువన ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం కింద ప్రతిపాదించిన రూ.1.26 లక్షల కోట్లు సమకూరుతాయనే ధీమా ఆర్థికశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీటికితోడు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులు ఆశించిన మేరకు వస్తే బాగుండేదని, వీటితోపాటు అప్పుల రూపంలో రూ.15 వేల కోట్ల వరకు బడ్జెట్లో కోత పడిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవి కూడా సమకూరితే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలే ఉండవని, కొత్త పథకాల అమలు కూడా పెద్ద కష్టమేమీకాబోదని వెల్లడిస్తుండటం గమనార్హం. పన్ను ఆశల మీదనే బడ్జెట్ ఊసులు.. ప్రతి ఏటా పన్నుల వసూళ్లలో పెరుగుదల కనిపిస్తుండడంతో ఈసారి బడ్జెట్‌ను కూడా ఆశావహ దృక్పథంతోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 2022–23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రూ. 2,56,858 కోట్ల బడ్జెట్‌కు 15 శాతం పెంచి 2023–24 బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశముందనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. కాగా, గతేడాది సెప్టెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగి నందున ఈ ఏడాది మార్చి మొదటి వారంలోపు మరోమారు సమావేశాలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది. -
కష్టకాలంలో కంటికి రెప్పలా!
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చాలా స్పష్టంగా కనిపిస్తోందని, లాక్డౌన్ కాలంలో వ్యవసాయం మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. అయితే కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను ఆదుకుందని తెలిపింది. 2020 – 21 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్‌లో 6.60 శాతం, మే నెలలో 17.85 శాతం మేర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినప్పటికీ అదే సమయంలో మచ్చుకు 8 పథకాల ద్వారా రూ.16,410.12 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సాయం అందించిందని పేర్కొంది. 2020–21లో జాతీయ వృద్ధి తిరోగమనంలో ఉండగా ఏపీ మాత్రం 1.58 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక తెలిపింది. 2020–21లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనా«థ్ బుధవారం శాసన సభకు సమర్పించారు. కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... ► కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న 2020–21లో ఆంధ్రప్రదేశ్ రూ.9,86,611 కోట్ల జీఎస్డీపీని నమోదు చేసింది. గతంలో రాష్ట్రం ఏటా పది శాతానికి పైగా వృద్ధి రేటు సాధించగా కోవిడ్ కారణంగా 2020–21లో మాత్రం 1.58 శాతం వృద్ధి రేటు నమోదైంది. ► కోవిడ్‌తో ఆర్థిక సంక్షోభం వల్ల వ్యవసాయం మినహా మిగిలిన రంగాలు దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే 2020–21లో నెలవారీ రెవెన్యూ రాబడులు తగ్గిపోయి వ్యయం పెరిగింది. ► రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2020 ఏప్రిల్‌లో 6.60 శాతం, మే నెలలో 17.85 శాతం తగ్గాయి. పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉన్న జూన్, జూలై, అక్టోబర్‌లో మాత్రం పన్ను బదిలీలతో రాబడులు పెరిగాయి. కోవిడ్‌తో పోరాడేందుకు కేంద్రం నుంచి రూ.580.25 కోట్ల గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పద్దుల కింద కోవిడ్ సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.337.25 కోట్ల రెవెన్యూ వ్యయం చూపించింది. 2020 ఏప్రిల్, మే ఆదాయ వ్యయాలను విశ్లేషించగా ఆ రెండు నెలల్లోనే కోవిడ్ మహమ్మారి సమయంలో లబ్ధిదారులకు సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టినట్లు స్పష్టం అవుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర విపత్తుల నిధి నుంచి రెండు నెలల్లోనే రూ.1,343.28 కోట్లు ఖర్చు చేసింది. ► కోవిడ్‌తో 2020–21లో జాతీయ జీడీపీ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో వృద్ధి సాధించింది. దేశ జీడీపీ –2.97 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి రేటు 1.58 శాతంగా ఉంది. వృద్ధి రేటు తగ్గుదలకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో పరిశ్రమలు, సేవా రంగాలు కుదేలు కావడమే కారణం. ఉద్యాన పంటల వృద్ధితో 2020–21లో వ్యవసాయ రంగం 8.80 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అనంతరం పశుగణన, మత్స్య శాఖల్లో గణనీయమైన వృద్ది జరిగింది. వ్యవసాయ మినహా మిగతా రంగాల్లో వృద్ది రేటు తక్కువగా నమోదైంది. -
‘సామాజిక’ దృక్పథం
సాక్షి, అమరావతి: రాష్ట్రప్రభుత్వ వ్యయం ప్రధానంగా సామాజిక సేవల కోణంలో ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవల్లో భాగమైన విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2020–21 ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. 2020 – 21లో రాష్ట్రం మొత్తం వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు 17 శాతం ఉండగా విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిపై వ్యయం 14 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వివిధ ప్రధాన పద్దుల్లో రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరగ డానికి వైఎస్సార్–పీఎం ఫసల్ బీమా యోజన, వైఎస్సార్ వడ్డీలేని రుణాల ప«థకాల ద్వారా రైతుల కు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడమే కారణ మని తెలిపింది. సచివాలయాలు, వలంటీర్లు, ఉపాధి హామీ వ్యయం పెరగడం, ఆర్టీసీ ఉద్యోగు లను రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్ తెలిపింది. విపత్తు నిర్వహణ వ్యయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖర్చులు, రైతుసాధికార సంస్థకు గ్రాంట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలపై ఖర్చు పెరగడం కూడా రెవెన్యూ వ్యయం పెరగటా నికి కారణాలని పేర్కొంది. మరోపక్క తప్పనిసరి ఖర్చుల్లో భాగంగా వడ్డీ చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు, రాయితీలపై వ్యయం పెరుగుతూనే ఉందని, దీంతో అభివృద్ధి వ్యయానికి వెసులుబాటు తక్కువగా ఉందని తెలిపింది. 2020–21లో జీతాలు, వేతనాల వ్యయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 9.88 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం రెవెన్యూ వ్యయంలో 48.25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. సామాజిక, ఆర్థికాభివృద్ధికే ఏపీఎస్డీసీ సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపా లకు ప్రణాళిక, నిధులు, ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. భవిష్యత్‌లో ఏపీఎస్డీసీ ద్వారా సేకరించే రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలకోట్ల గ్యారెంటీని అందించిం దని తెలిపింది. 2020–21లో బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.17,472 కోట్లను అప్పుగా తీసు కుంది. ఇందులో 63 సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలైన (నవరత్నాలు) వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత అమలు కోసం రూ.16,899 కోట్లు పంపిణీ చేసిందని పేర్కొంది. 63 కార్పొరేషన్లలో 56 వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లు ఉన్నాయని కాగ్ తెలిపింది. ప్రత్యక్ష నగదుబదిలీ పథకాలైన వైఎస్సార్ చేయూత, ఆసరా కోసం 2020–21లో రూ.10,895.67 కోట్లను కేటాయించినట్లు తెలిపింది. పథకాల అమలును సులభతరం చేసేందుకు రాష్ట్ర సంఘటితనిధి నుంచి 8 కార్పొరేషన్ల వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు బడ్జెట్‌ను బదిలీచేసినట్లు పే ర్కొంది. అయితే ఈ పథకాల బడ్జెట్ ద్వారా కాకుం డా మార్కెట్ రుణాల ద్వారా నిధులు సమకూ ర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు డీబీటీ పథకాలతో సహా ఆరుసంక్షేమ పథకాలను ఏపీఎస్డీసీకి అప్పగించినట్లు కాగ్ తెలిపింది. -
కాగ్ లెక్కలు.. కాకి లెక్కలా? ఈనాడు, ఆంధ్రజ్యోతిపై బుగ్గన మండిపాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయం అందకూడదనే దురుద్దేశంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వక్రీకరణ లెక్కలతో కథనాలు ప్రచురిస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ కూలంకషంగా బడ్జెట్ ప్రతులు, కాగ్, కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలతో వాస్తవ గణాంకాలను వివరిస్తే కాకి లెక్కలంటూ తప్పుడు కథనాలు ప్రచురించారని మండిపడ్డారు. ఏపీకి ఆర్థిక సాయం అందించవద్దంటూ మూడేళ్లుగా ప్రతిపక్ష నాయకులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకులకు పలుదఫాలు లేఖలు రాశారన్నారు. పారదర్శక ప్రభుత్వంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని బుధవారం ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆ వివరాలివీ.. ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొన్నట్లు ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. క్రిసిల్ జూలై, ఆగస్టు నివేదికలు పరిశీలిస్తే అందులో ఎక్కడా రాష్ట్రం గురించి ప్రత్యేకంగా ఏమీ రాయలేదు. ఆగస్టు నివేదికలో ఏపీ గురించి ఒక్క ముక్క లేదు. జూలై నివేదికలో కోవిడ్ ప్రభావం గురించి వివరిస్తూ అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించారు. బిహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఏపీ, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందులో ఉంది. ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం ఏపీ పరిస్థితి దిగజారిందంటూ రాసేశారు. రాష్ట్రం 15వ ఆర్థిక సంఘం నిబంధనలకు లోబడే అప్పులు చేస్తోందని ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ నిపుణులు స్పష్టం చేశారు. ► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అతి తక్కువ రేటుకు అప్పు చేస్తోంది. రెవెన్యూ ఖర్చులో 70 శాతం ఏదో ఒక రూపంలో అభివృద్ధిపైనే వెచ్చిస్తోంది. అప్పు చేసినా దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంది. 2018–19లో టీడీపీ దిగిపోయే నాటికి ద్రవ్యలోటు 4.06 శాతంగా ఉంటే మేం 2.1 శాతానికి తగ్గించాం. దేశంలో చాలా రాష్ట్రాల ద్రవ్యలోటు పెరిగితే మన రాష్ట్రంలో తగ్గింది. 2018–19లో రాష్ట్ర ద్రవ్యలోటు రూ.35,466గా ఉంటే దాన్ని రూ.25,195 కోట్లు తగ్గించాం. కాగ్ ముందస్తు అంచనాలకు, తుది అంచనాలకు చాలా మార్పులు జరుగుతాయి. 2018–19 ఫిబ్రవరిలో రూ.47,650 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు మార్చి నాటికి రూ.33,700 కోట్లకు తగ్గగా ఇప్పుడు మరింత తగ్గింది. ► సీఎం జగన్ 2019 మే నాటికి రూ.2,69,462 కోట్లు అప్పు ఉందని స్పష్టంగా చెబితే ఈనాడు మాత్రం మార్చి నాటికి ఉన్న అప్పు రూ.2,57,509 కోట్లు తీసుకొని సీఎంవి తప్పుడు గణాంకాలు అంటూ అసత్య కథనాన్ని రాసింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా రూ.7,346 కోట్లు అప్పులు చేసిన సంగతి దాచేసింది. ఎన్నికల ముందు పసుపు కుంకుమ కోసం ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పు తీసుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు దిగిపోతూ 2019 మార్చి చివరి నాటికి రూ.40,172 కోట్లు బిల్లులు పెండింగ్ పెడితే ఆ మొత్తాన్ని రూ.21,673 కోట్లకు మా ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా బిల్లులు పెండింగ్ పెట్టిపోతే వాటిలో మా ప్రభుత్వం రూ.20,000 కోట్లు చెల్లిస్తే ఎల్లో మీడియా మాత్రం వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో అంటూ తప్పుడు కథనాలు రాస్తోంది. ► గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడంతోపాటు అనేక ప్రాజెక్టులు, గ్రాంట్లను తెస్తుంటే అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ఆర్థిక మంత్రి అంటూ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా రాతలు రాస్తున్నారు. గత ప్రభుత్వం అనుమతికి మించి రూ.16,418 కోట్ల అప్పుచేస్తే వాటిని ఇప్పుడు సరిదిద్దుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రూ.6,400 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలన్న ఆదేశాలతోపాటు 900 కి.మీ జాతీయ రహదారులు, రెండు ఐడీటీఆర్‌లు, రూ.33,500 కోట్ల గ్రాంట్లు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను సాధించాం. గత సర్కారు నిర్ణయంతో రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథార్టీ రూ.1200 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని లండన్ కోర్టులో గెలిచాం. రాష్ట్రం ఇచ్చిన గణాంకాలే తీసుకుంటున్నారంటూ సభను, కాగ్ లాంటి సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాస్తున్నాయి. సభా గౌరవాన్ని కించపరిచే ఇలాంటి కథనాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలపై సభ ఒక నిర్ణయం తీసుకోవాలి. -
ఆ ఐదేళ్లూ ఉన్నత విద్య పతనం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఐదేళ్లు ఉన్నత విద్యారంగం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక విశ్లేషించింది. గత సర్కారు ఉన్నత విద్యకు నిధులివ్వకుండా నీరుగార్చినట్లు తేల్చింది. గరిష్ట చేరికల నిష్పత్తి (జీఈఆర్)లో రాష్ట్రం 7వ స్థానం నుంచి ఏకంగా 11వ స్థానానికి పతనమైంది. 2014–19 మధ్య ఉన్నత విద్యారంగం పరిస్థితిపై కాగ్ రూపొందించిన నివేదికను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ మిషన్ పేరిట 2022 నాటికి ఉన్నత విద్యలో పెట్టుబడిని జీఎస్డీపీలో 1.5 శాతం, 2029 నాటికి 2.5 శాతానికి పెంచనున్నట్లు గత సర్కారు పేర్కొంది. అయితే ఉన్నత విద్యపై ఖర్చు 2014 – 15లో జీఎస్డీపీలో 0.47 శాతం కాగా 2018–19లో 0.25 శాతానికి దిగజారినట్లు కాగ్ తెలిపింది. రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యామండలి వార్షిక ప్రణాళికలను కూడా సిద్ధం చేయలేదని పేర్కొంది. కాగ్ నివేదికలో ఇతర ముఖ్యాంశాలు ఇవీ.. ► రాష్ట్ర స్థాయి నాణ్యతా హామీ కమిటీ నిబంధనల ప్రకారం వంద శాతం కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందాల్సి ఉండగా 2018–19 నాటికి కేవలం 7 శాతం కాలేజీలు మాత్రమే సాధించాయి. చాలా కాలేజీల్లో నిబంధనల ప్రకారం భవనాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఆటస్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. అధ్యాపకుల్లో మాస్టర్ స్థాయిలో 55 శాతం మార్కులు సాధించిన వారే ఉన్నారు. పీహెచ్డీ, నెట్, స్లెట్ అర్హతలకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి తేలేదు. ► తనిఖీలు చేసిన కాలేజీల్లో కమ్యూనికేషన్ టెక్నాలజీ సౌకర్యాలు లేవు. కొన్నిచోట్ల విద్యాబోధనకు తగిన భవనాలు లేవు. చాలా ప్రైవేట్ కాలేజీలు మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. అధ్యాపకులకు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించలేదు. ► కొన్ని వర్సిటీల పరిధిలో సంప్రదాయ కోర్సులు మినహా కొత్త కోర్సులు లేకపోవడంతో విద్యార్ధులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఏయూ కొత్తగా పీజీ, యూజీ కోర్సులను, ఎస్వీయూ యూజీ కోర్సులను ప్రవేశపెట్టలేదు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ► పలు కాలేజీలు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలకు విరుద్ధంగా పదేళ్లకుపైగా తాత్కాలిక అనుబంధంతో కొనసాగుతున్నాయి. కేవలం 12 శాతం మాత్రమే శాశ్వత అఫిలియేషన్ కలిగి ఉన్నాయి. ► నిబంధనల ప్రకారం ప్రతి త్రైమాసికంంలో కనీసం ఒక్కసారైనా ఉన్నత విద్యామండలి పాలకవర్గం సమావేశం కావాల్సి ఉండగా 2016 జూలై నుంచి 2018 మధ్య కేవలం ఐదుసార్లు మాత్రమే సమావేశమైంది. యూనివర్సిటీల్లో తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి జరిగింది. రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే ఏయూలో 26 శాతం, ఎస్వీయూలో 55 శాతం, నన్నయలో 83 శాతం తాత్కాలిక ఉద్యోగుల నియామకం చేపట్టారు. ► డిగ్రీ కాలేజీల ఏర్పాటులో కూడా జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. అవసరమైన చోట విద్యార్ధులకు డిగ్రీ కాలేజీలు అందుబాటులో లేవు. ► ఆంధ్ర, నన్నయ తదితర వర్సిటీల పరిధిలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధుల సంఖ్య ఆశాజనకంగా లేదు. 2014–15లో పోలిస్తే 2018లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. సమాధాన పత్రాల మూల్యాంకన విధానం కూడా విశ్వసనీయంగా లేదు. తొలుత పరీక్షల్లో తప్పినట్లు ప్రకటించిన చాలా మంది పునర్ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించారు. ఎస్వీయూ పరిధిలోని ఏడు కాలేజీల్లో ఒక కళాశాల డేటా పరిశీలించగా 655 మంది విద్యార్ధులలో కేవలం 9 మంది మాత్రమే పై చదువులకు వెళ్లగలిగారు. ఐసీటీ వినియోగం 28 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆధునిక పరి/ê్ఙనం విద్యార్థులకు అందడం లేదు. -
కాగ్ నివేదికలో నిజం లేదా?
తాడేపల్లిగూడెం రూరల్: ‘రాజధాని పేరిట అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు వేలాది ఎకరాల భూములను దోచుకుని ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చాలని ప్రయత్నించడం నిజం కాదా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేసిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో నిజం లేదా? టీడీపీ నాయకులకు దమ్ముంటే తప్పని చెప్పాలి...’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. గత టీడీపీ ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్నారని, అది ఎన్నాళ్లో సాగదని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం కొట్టు సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల శాతం కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల శాతం తక్కువేనని స్పష్టంచేశారు. చంద్రబాబు పాలనాకాలంలో చేసిన అప్పుల కంటే కూడా ఇప్పుడు తక్కువగానే అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు గాలికొదిలేసిన విద్యుత్ డిస్కంల బకాయిలు రూ.22 వేల కోట్లను సీఎం జగన్ చెల్లిస్తూ వస్తున్నారన్నారు. నాడు చంద్రబాబు నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్లను సైతం నేడు నిర్మిస్తున్నారని తెలిపారు. టీడీపీ సిగ్గుమాలిన పార్టీ అని, ఆ పార్టీ నాయకులు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచితే, రాష్ట్ర ప్రభుత్వంపై బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.200 ఇస్తే గానీ టీడీపీ కార్యక్రమాలకు మనుషులు రాని దుస్థితి నెలకొందన్నారు. -
వేల కోట్ల టాక్స్ మినహాయింపులు: కాగ్ కీలక నివేదిక
సాక్షి ముంబై: ఛారిటబుల్ ట్రస్టులు 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 18,800 కోట్ల రూపాయల పన్ను మినహాయింపులను పొందాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక వెల్లడించింది.ఇందులో రిజిస్టర్ కాని ట్రస్ట్‌లు 21వేలకుపైగా ఉన్నాయని తెలిపింది. అలాగే 347 ట్రస్టులు, విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నమోదు కానప్పటికీ, విదేశీ విరాళాలు పొందాయని సోమవారం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?) మొత్తం రూ.18,800 కోట్ల మినహాయింపులో, అత్యధికంగా రూ.4,245 కోట్ల మినహాయింపులు ఢిల్లీకి చెందిన 1345 ట్రస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,745 ట్రస్టులు 2వేల 500 కోట్ల మినహాయింపును పొదవాయి.ఉత్తరప్రదేశ్‌లో 2,100 ట్రస్ట్‌లు రూ. 1,800 కోట్ల పన్ను రహిత ఆదాయాన్ని పొందగా, రూ.1,600 కోట్ల మేర చండీగఢ్‌లో 299 ట్రస్టులు పొందాయి. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి 770 కంటే ఎక్కువ ట్రస్ట్‌లు రూ. 1,595 కోట్లకు పైగా మినహాయింపును పొందాయి మరియు గుజరాత్, ఆంధ్ర మరియు కర్ణాటకలలోని ట్రస్ట్‌ల ద్వారా క్లెయిమ్ చేయబడిన ఒక్కొక్కటి రూ. 1,000 కోట్లకు పైగా మినహాయింపులు ఉన్నాయి. కనీసం 347 ట్రస్ట్‌లు ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ని లేనప్పటికీ విదేశీ విరాళాలను పొందినట్లు నివేదించింది. సెక్షన్ 11 కింద తమ ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్‌లు ఐటీ చట్టంలోని సెక్షన్ 12AA కింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. “2014-15 నుండి 2017-18 వరకు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్‌లకు సంబంధించి I-T (సిస్టమ్స్) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అందించిన డేటా ప్రకారం 21,381 కేసులలో సెక్షన్ 11 కింద మినహాయింపు క్లెయిమ్ చేసినట్లు ఆడిట్ గుర్తించింది. అయితే, సెక్షన్ 12AA ప్రకారం నమోదు అందుబాటులో లేదనని నివేదిక పేర్కొంది. ఈ ట్రస్ట్‌లు విదేశీ విరాళాలను స్వీకరించడానికి ఎఫ్సీఆర్ఏ క్రింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది.ఎఫ్సీఆర్ఏ చట్టం కింద నమోదు చేయకుండానే అత్యధికంగా విదేశీ విరాళాలు పొందిన రాష్ట్రాల్లో కర్ణాటక, టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని ఆడిట్లో తేలింది. -
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు. ఒక పక్క కోవిడ్ సంక్షోభం వల్ల ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినప్పటికీ బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట పరిమితులకు లోబడే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో పక్క ద్రవ్య లోటును తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రం చేసిన అప్పుల కంటే పలు ఇతర రాష్ట్రాలు చేసిన అప్పులే ఎక్కువ అని తేలింది. వాస్తవం ఇలా ఉండగా, ఈ మాత్రం అప్పులు చేయడం కూడా మహా ఘోరం అన్నట్లు ప్రతిపక్షం, ఎల్లో మీడియా ప్రజల్లో విషం నింపుతున్నాయి. ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. ► కర్ణాటక కూడా రూ.59,244.99 కోట్ల అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో పాటు ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభంతో కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు గణనీయంగా తగ్గిపోగా, మరో పక్క ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్పుల పరిమితి పెంపునకు అనుమతించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక ఏడాది అంటే 2021–22 బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన మేరకు కూడా అప్పులు చేయలేదు. అందులో కేవలం 68.04 శాతం మేర మాత్రమే అప్పు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక ఏడాది మొత్తం ఆదాయ, వ్యయాలను ఆర్థిక ఏడాది చివరి నెల మార్చిలో సర్దుబాటు చేసి, కాగ్ ఈ నివేదిక రూపొందిస్తుంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్స్ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా ద్రవ్య లోటు ఉన్నట్లు తేలింది. ఆర్థిక ఏడాది ద్రవ్య లోటు అంటే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పుగా పేర్కొంటారు. 15వ ఆర్థిక సంఘం జీఎస్డీపీలో 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా 2021–22 ఆర్థిక ఏడాదిలో దానిని 2.10 శాతానికే పరిమితం చేసిందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. అలాగే రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లకే పరిమితం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం ► టీడీపీ ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3% పరిమితికి మించి ఉండేది. అలాంటి ద్రవ్యలోటును గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం 2021–22లో 2.10 శాతానికి పరిమితం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విచక్షణతో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాలకు నిదర్శనం. ► బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన మేరకు అప్పు చేసేందుకు వీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కూడా అప్పు చేయలేదు. అంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారనే టీడీపీ నేతల ఆరోపణలు, ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. ► వివిధ రాష్ట్రాల కాగ్ ప్రాథమిక అకౌంట్స్‌ను పరిశీలిస్తే మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ 2021–22లో అతి తక్కువగా అప్పు చేసినట్లు తేలింది. బడ్జెట్ అంచనాల్లో రూ.37,029.79 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొని, వాస్తవంగా రూ.25,194.62 కోట్లు మాత్రమే (68.04 శాతం) అప్పు చేసింది. అంటే ఇంకా 31.96 శాతం మేర అప్పు చేయడానికి అవకాశం ఉన్నా చేయలేదు. ► ఈ లెక్కన వాస్తవాలను పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకే టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ మీడియా.. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ ఆరా, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు తాఖీదులంటూ దుష్ప్రచారం చేస్తోందని ఇట్టే తెలుస్తోంది. ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడు ► బాబు హయాంలో ఐదేళ్లు అస్తవ్యస్థ ఆర్థిక నిర్వహణ, పాలన కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడయ్యాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.39,000 కోట్లు బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది. ► మరో పక్క ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడంతో పాటు విద్యుత్ సంస్థల అప్పులను రూ.29,703 కోట్ల నుంచి రూ.68,596 కోట్లకు పెంచేసింది. ఇదే సమయంలో డిస్కమ్స్ బకాయిలను రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెంచింది. ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి ► ప్రస్తుత ప్రభుత్వం ఇవన్నీ తీరుస్తూనే మరో పక్క కోవిడ్ కారణంగా 2019–20లో రాష్ట్ర ఆదాయంలో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేసింది. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో అంతకు ముందు రెండేళ్ల కంటే కొంత మేర రాష్ట్ర ఆదాయం మెరుగు పడింది. 2020–21లో బడ్జెట్ అంచనాల రెవెన్యూ రాబడిలో 72.32 శాతమే రాగా, 2021–22లో 84.96% మేర వచ్చిందని కాగ్ పేర్కొంది. ► ఎక్కడా అవినీతి, దుర్వినియోగం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వీలుగా నవరత్నాలకు వినియోగించిందని, కోవిడ్ సంక్షోభంలో రాష్ట్రంలో పేద, సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కోకుండా ప్రభుత్వం ఆదుకున్నట్లయిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వైద్య, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను చేపట్టింది. బాబు హయాంలోనే పరిమితికి మించి అప్పులు ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పరిమితికి మించి జీఎస్డీపీలో 3 శాతానికన్నా ఎక్కువగా అప్పులు చేశారని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేస్తున్నాయి. 2014–15 ఆర్థిక ఏడాదిలో జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.95 శాతం ఉంది. 4 బాబు దిగిపోయే సమయానికి అంటే 2018–19 జీఎస్డీపీలో ద్రవ్యలోటు (అప్పులు) 4.06%కి పెరిగింది. అలాంటిది 2021–22 ఆర్థిక ఏడాదిలో జీఎస్డీపీలో అప్పులను 2.10%కు ఈ ప్రభుత్వం తగ్గించింది. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ అప్పు తక్కువే ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. ► కర్ణాటక రాష్ట్రం 2021–22 ఆర్థిక ఏడాదిలో రూ.59,244.99 కోట్లు అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసింది. ► బడ్జెట్ అంచనాల్లో కేరళ ప్రభుత్వం 81.58% మేర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 82.27% మేర అప్పు చేశాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బయట వివిధ సంస్థల కోసం అప్పులు చేయడం మామూలే. ఆ అప్పులకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తాయి. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థల ద్వారా అప్పులు చేస్తోంది. ► బడ్జెట్ బయట అప్పులు ఎంత చేశారనేది ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ విధాన పత్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో దాపరికం ఏమీ లేదు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనతో సగటు వార్షిక అప్పు వృద్ధి రేటు 19.46 శాతం ఉండగా, ఈ మూడేళ్లలో సగటు వార్షిక అప్పు 15.77 శాతమే ఉంది. -
కాగ్ వినోద్‌రాయ్.. ఇప్పుడు కళ్యాణ్ జ్యూయల్లర్స్లో
కాగ్ (కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) మాజీ అధికారి వినోద్రాయ్కి కీలక బాధ్యలు అప్పగించింది కళ్యాణ్ జ్యూయల్లర్స్ యాజమాన్యం. కంపెనీ బోర్డులో చైర్మన్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కాగ్ ఆడిటర్ జనరల్ పని చేయడంతో పాటు యూనెటైడ్ నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్‌కి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో తదితర సంస్థలకు కూడా గతంలో చైర్మన్‌గా వినోద్‌రాయ్ వ్యవహరించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. కాగా మార్కెట్లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్ జ్యూయల్లర్స్.. తాజాగా వినోద్‌రాయ్ వంటి సమర్థుడికి అనుభవజ్ఞుడికి బోర్డులో చోటు కల్పించింది. -
బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా?
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రభుత్వం చేస్తే ఒప్పు.. అప్పుడు కాగ్ ఎత్తి చూపినా తప్పులు కనిపించవు.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తే అంతా తప్పు’.. ఇదా రామోజీ గురివింద నీతి అంటూ ఆర్థికశాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏటా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారని, కేటాయింపుల్లేకుండానే ఖర్చుచేశారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు ఎత్తి చూపినా ఆ ఐదేళ్లలో ఈనాడుకు అసలు కనిపించనే లేదు. ఐదేళ్లలో ఒక్కరోజు కూడా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారని ఈనాడు ఒక్క ముక్కా రాయలేదు. ఇప్పుడే ఏదో ఘోరం జరిగిపోతోందంటూ.. ఇప్పుడే కొత్తగా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారంటూ ఈనాడు రాసిన కథనాన్ని చూసి ఆర్థికశాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అస్మదీయుడైన చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలాగ.. తస్మదీయులైన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉంటే మరోలా ఈనాడు కథనాలు రాయడం చూస్తుంటే.. ఎంత వివక్ష, పక్షపాతంతో ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏటా బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై కాగ్ నివేదికలు రూపొందించే ముందు ఆర్థికశాఖను వివరణ కోరుతూ లేఖలు రాయడం సాధారణమేనని, ఇది ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడే కొత్తగా కాగ్ ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు, గతంలో ఎప్పుడూ లేఖ రాయనట్లు ఈనాడు కథనం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బాబు ప్రభుత్వ హయాంలో ఈనాడు ఇలాంటి వార్త ఒక్కటి కూడా రాయలేదని, ఇప్పుడే ఎందుకు రాసిందో అందరికీ అర్థమవుతోందని పేర్కొన్నారు. బాబు హయాంలో దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్న కాగ్ ► చంద్రబాబు ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు బడ్జెట్ కేటాయింపులకు మించి రూ.1,62,828.70 కోట్లు వ్యయం చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ వ్యయంపై కాగ్ ఏమందంటే.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కేటాయింపులకు మించి అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృత మవుతున్నాయి. ఇది శాసనసభ అభీష్టానికి విరుద్ధం కనుక దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఊహించిన పరిమితులను దాటి వేస్ అండ్ అడ్వాన్స్‌లు తీసుకోవడం వలన గత ఐదేళ్లలో కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు అవుతూనే ఉంది. అదనపు నిధులు అవసరమని భావిస్తే శాసనసభ నుంచి ముందస్తు ఆమోదం తీసుకోవాలి. ఈ అంశాన్ని గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నివేదికలోనూ ప్రస్తావిస్తున్నప్పటికీ తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపుల్లేకుండానే వరుసగా రూ.1,592.76 కోట్లు, రూ.1,053.08 కోట్లు, రూ.2,790.08 కోట్లు వ్యయం చేశారని కాగ్ నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై కాగ్ ఏమందంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్ ప్రకారం నిధుల కేటాయింపు జరగకుండా ఏదైనా పథకం, సేవపై ఖర్చు చేయకూడదు. ఈ చర్య బడ్జెట్ ప్రక్రియ, శాసన సంబంధిత నియంత్రణల గౌరవాన్ని భంగపరచింది. ► చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా పెద్ద ఎత్తున మిగులును చూపెడుతోందని కాగ్ నివేదిక ఎత్తి చూపింది. ఈ మిగుళ్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో కచ్చితత్వం, విశ్వసనీయతలపై సందేహాలను రేకిత్తిస్తున్నాయని కాగ్ స్పష్టం చేసింది. ఉదాహరణకు 2018–19లో సాంఘిక, బీసీ సంక్షేమం, వ్యవసాయం, పాఠశాల విద్య, రహదారులు తదితర 11 అంశాల్లో కేటాయింపుల్లో రూ.2 వేల కోట్లకు మించి వ్యయం చేయకపోగా.. రూ.47,670.66 కోట్లు మిగిలి ఉన్నాయని కాగ్ ఎత్తి చూపింది. -
CAG Report: అయ్యయ్యో ఐఐటీ.. సమస్యలు తిష్ట
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. చదవండి: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. ఐఐటీ హైదరాబాద్ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23% అధ్యాపకుల కొరత ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్‌టేక్ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది. హైదరాబాద్ ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ 63 శాతమే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్మెంట్ అనేది ర్యాంకింగ్ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్మెంట్ శాతం కేవలం 63గానే ఉందని కాగ్ వివరించింది. 95 శాతం ప్లేస్‌మెంట్స్ ఇండోర్, 84 శాతం ప్లేస్‌మెంట్స్‌తో భువనేశ్వర్ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది. పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీ టాప్ ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్‌పూర్ 4, ఐఐటీ రోపార్ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. కాగ్ ఏం సూచించిందంటే.. ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ఊహించినట్టుగానే ద్రవ్యలోటు.. కాగ్ నివేదికలో కీలక అంశాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) లక్ష్యం మేరకు నమోదవుతున్నట్లు కనబడుతోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం వెలువరించిన గణాంకాల ప్రకారం నవంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.6,95,614 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (2021–22 స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాల్లో 6.8 శాతం) లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. అంటే లక్ష్యంలో నవంబర్ నాటికి ద్రవ్యలోటు 46.2 శాతంగా ఉందన్నమాట. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే సమయానికి ద్రవ్యలోటు లక్ష్యానికి మించి ఏకంగా 135.1 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ విలువలో 9.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గణాంకాలు మెరుగ్గా ఉండడానికి ఆదాయ వసూళ్లలో పెరుగుదల, వివిధ మంత్రిత్వశాఖల తక్కువ వ్యయాలు కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - నవంబర్ ముగింపునకు ప్రభుత్వ ఆదాయాలు రూ.13.78 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో (బీఈ) ఈ మొత్తం 69.8 శాతానికి చేరింది. 2020–21 ఇదే సమయానికి బడ్జెట్ అంచనాల్లో ఈ పరిమాణం కేవలం 37 శాతంగా ఉంది. - ఒక్క పన్ను (నికర) ఆదాయాలు చూస్తే, బడ్జెట్ అంచనాల్లో 73. 5 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే కాలానికి ఈ పరిమాణం కేవలం 42.1 శాతంగా ఉంది. - ఇక ప్రభుత్వ వ్యయాలు రూ.20.74 లక్షల కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతానికి చేరింది. 2025–26 నాటికి 4.5 శాతానికి..! ద్రవ్యలోటు 2021–22 లక్ష్యం కన్నా తక్కువగా 6.6 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాన్ని ఇటీవలే ఇండియా రేటింగ్స్ నివేదిక వ్యక్తం చేసింది. ఆర్బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు 6.8 శాతం వద్ద ద్రవ్యలోటు కట్టడి కష్టమని విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ అభిప్రాయానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
టెలికాం లెక్కల్లో గోల్మాల్..రూ.890కోట్లు అవినీతి..కాగ్ నివేదిక
సమాచార సాంకేతికత (ఐటీ), టెలికం మంత్రిత్వశాఖల కింద పనిచేసే విభాగాల అకౌంట్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఒకటి పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఐసీఎస్ఐ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటల్ సర్వీస్) ద్వారా రూ. 890 కోట్ల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొనుగోళ్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నివేదికలను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, సీ–డాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , ఐటీఐ లిమిటెడ్, సీడీఏసీ తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఆర్థిక పరిణామాలకు దారితీసేవిగా ఉన్నాయని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) ద్వారా ప్రింట్ మీడియా ప్రకటన విడుదలకు సంబంధించిన ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) విఫలమైందని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీని ఫలితం రూ.1.21 కోట్ల అనవసర చెల్లింపులు జరిగాయని అంచనాలకు వచ్చింది. -
AP: రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గుదల
సాక్షి, అమరావతి: ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రాబడి తగ్గిపోవడం, మరోపక్క కొత్త సంక్షేమ పథకాల అమలుతో 2019–20లో రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. తప్పనిసరి ఖర్చులైన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, వడ్డీ చెల్లింపుల వ్యయం అంతకు ముందు ఆర్ధిక ఏడాదితో పోలిస్తే పెరిగాయి. 2019–20 ఆర్ధిక ఏడాదికి సంబంధించి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమానికి భారీగా వ్యయం అమ్మఒడి, వైఎస్సార్ ఉచిత విద్యుత్, వైఎస్సార్ భరోసా పథకాల అమలుతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్ నివేదిక పేర్కొంది. పంచాయతీలను పరిపుష్టం చేయడం, పారదర్శకంగా ఇంటివద్దే ప్రభుత్వ సేవలను అందించడంలో భాగంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని తెలిపింది. అయితే అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2019–20లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమ వ్యయం భారీగా పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. సాధారణ విద్య, విద్యుత్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు కూడా భారీ వ్యయం చేసినట్లు తెలిపింది. బడ్జెట్ బయట అప్పులు 2014–15 నుంచి తెస్తున్నా బడ్జెట్లో చూపడం లేదని, దీన్ని సరి చేయాలని అప్పట్లోనే సూచించినా పట్టించుకోలేదని పేర్కొంది. కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... ►2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.80 శాతం ఉండగా 2019–20లో 12.73 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ వృద్ధి రేటు 7.21 శాతం కన్నా ఇది బాగా ఎక్కువ. ►2018–19లో 149.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2019–20లో 171.37 లక్షల టన్నులకు పెరగడంతో వ్యవసాయ రంగంలో 16.03 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఉద్యాన, పశు, మత్స్యశాఖల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. ►రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రూ.97,123.93 కోట్ల మేర రుణభారం ఉంది. 2020 మార్చి నాటికి ఆ రుణం పెరిగి రూ.2,15,617 కోట్లకు చేరింది. ►అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2019–20లో రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర సొంత రాబడులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా బదిలీ రాబడులు తగ్గడం. ►కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో 2019–20లో రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం మేర పెరిగాయి. రెవెన్యూ లోటు 90.24 శాతం పెరిగింది. ►సాధారణ కేటగిరీ రాష్ట్రాల సగటుతో పోలిస్తే తప్పనిసరి ఖర్చులైన వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, పరిపాలన ఖర్చులు ఏపీలో ఎక్కువ. ►రాష్ట్ర సొంత పన్నుల రాబడి 0.74 శాతం తగ్గింది. సొంత పన్నేతర రాబడి 24.59 శాతం తగ్గింది ►కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటా 13.86 శాతం తగ్గింది ►కేంద్రం నుంచి పొందే గ్రాంట్లు 12.43 శాతం పెరిగాయి. -
పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విరాళాల వరదతో నిండుతున్న పీఎం కేర్స్ ఫండ్.. రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కార్యకలాపాలు నిర్వహించదని పీఎం కేర్స్ ఫండ్ ఉన్నతాధికారి స్పష్టంచేశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉప కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గౌరవ హోదాలో పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు అత్యున్నత నిర్ణయక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో సమ్యక్ గంగ్వాల్ ఒక పిటిషన్ వేశారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగేలా ఆదేశాలు జారీచేయాలంటూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఉమ్మడి విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టింది. దీనిపై స్పందనగా ప్రదీప్ శ్రీవాస్తవ కోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించారు. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్యానెల్ నేతృత్వంలో ఎంపిక చేసిన చార్టెడ్ అకౌంటెంట్‌తో ట్రస్టు ఆడిటింగ్ పూర్తయిందని అఫిడవిట్లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ‘థర్డ్‌పార్టీ’ వివరాలు ఇవ్వలేమన్నారు. తర్వాత పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. ట్రస్టు కేంద్ర ప్రభుత్వానిది కానపుడు ట్రస్టు వెబ్సైట్ చిరునామాలో జౌఠి అనే ప్రభుత్వ డొమైన్‌ను, ప్రధాని మోదీ అధికారిక ఫొటోను, జాతీయ చిహ్నాన్ని వాడకుండా నిరోధించాలని కోర్టును కోరారు. -
ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్‌గా జీసీ ముర్ము
న్యూఢిల్లీ: సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం (ఐఎన్‌టీఓఎస్‌ఏఐ) ప్రాంతీయ గ్రూప్‌లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్ ది ఆసియన్ ఆర్గనైజేషన్ (ఏఎస్ఓ ఆఫ్ ఎస్ఏఐ) చైర్మన్‌గా భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీసీ ముర్ము ఎంపికయ్యారు. ఆయన ఎంపిక విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఒక ప్రకటనలో తెలిపింది. 2024 నుంచి 2027 వరకూ ఆయన ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్ బాధ్యతల్లో ఉంటారు. 56వ గవర్నింగ్ బోర్డు కాగ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన ఏఎస్‌ఓఎస్‌ఏఐ 56వ గవర్నింగ్ బోర్డ్ జీసీ ముర్మును చైర్మన్‌గా ఎంచుకుంది. ఈ ఎంపికకు మంగళవారం ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఏఎస్‌ఓఎస్‌ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్ నిర్వహిస్తున్నట్లు కూడా కాగ్ వెల్లడించింది. సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం 1979లో ఏర్పాటయ్యింది. ప్రారంభంలో 11 సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంఘంలో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం సభ్యులందరూ పాల్గొంటారు. మూడేళ్లకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది. చదవండి: ఇండియా వర్సెస్ కెయిర్న్,.. కుదిరిన డీల్ ? -
ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఆదాయం...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను రాబడులు ప్రభుత్వ అంచనాలకు తగినట్టుగా వస్తున్నాయి. బడ్జెట్లో అంచనా వేసుకున్న మొత్తం సేల్స్ ట్యాక్స్ లక్ష్యంలో.. తొలి మూడు నెలల్లోనే 22.18 శాతం మేర ఖజానాకు చేరింది. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో వెల్లడైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను అమ్మకపు పన్ను కింద రూ.26,500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి రూ.5,878.77 కోట్లు సమకూరినట్టు కాగ్ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడుల కింద రూ.1,06,900 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో 19 శాతం అంటే రూ.20,225 కోట్లు తొలి త్రైమాసికంలో సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాíసికంలో 11.66 శాతమే ఆదాయం రావడం గమనార్హం. ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడులు పెరిగే అవకాశముందని, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే.. నిధుల కటకట నుంచి గట్టెక్కినట్టేనని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర ఆదాయం కూడా.. ► జీఎస్టీ రాబడులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఆ ఏడాది జీఎస్టీ అంచనాల్లో మొదటి మూడు నెలల్లో 12.11 శాతమే సమకూరగా.. ఈసారి మొత్తం అంచనా (రూ.35,520 కోట్లు)లో 18.70 శాతం అంటే రూ.6,640.81 కోట్లు వచ్చాయి. ► ఈసారి ఎక్సైజ్ రాబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది ఈ సమయానికి 15.82 శాతమే రాగా.. ఈసారి 20.74 శాతం వసూళ్లు జరిగాయి. అంటే ఈసారి మొత్తంగా రూ.17 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకోగా.. తొలి మూడునెలల్లో రూ.3,526 కోట్లు వచ్చాయి. ► ఇక ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,668 కోట్లకుపైగా వచ్చింది. ► కేంద్రపన్నుల్లో వాటా, ఇతర పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో రూ.6 వేల కోట్ల వరకు సమకూరాయి. ► బడ్జెట్లో అంచనా వేసుకున్న అన్నిరకాల ఆదాయం కలిపి చూస్తే.. తొలి మూడు నెలల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొ త్తం ప్రభుత్వ అం చనాల్లో 17 శాతం అంటే.. రూ.37, 533 కోట్లు అందా యని పేర్కొంటున్నాయి. -
చంద్రన్న మార్కు మద్యం దందా: కాగ్ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో మద్యం దందా ఇష్టారాజ్యంగా సాగిందని.. లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. ధరలు పెంచి మద్యం విక్రయాలు సాగించినా.. విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా అలాంటి అక్రమాలను ప్రోత్సహించేలా వ్యవహరించిందని కాగ్ ఎత్తి చూపింది. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను, అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్సుదారులు అపరాధ రుసుం చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేనదని, చాలా కేసుల్లో పన్నులు, సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్టయిందని కాగ్ వ్యాఖ్యానించింది. కాగ్ వెల్లడించిన అక్రమాల్లో కొన్ని ఇలా.. మద్యం కోటా దస్త్రాలను పరిశీలించగా.. కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు. ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీవీఎస్ డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్, శ్రావణి ఆల్కో బ్రూవరీస్ నుంచి రూ.22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది. దీనివల్ల రుసుముల రూపేణా రూ.13.24 కోట్లు, వడ్డీ రూపేణా రూ.6.02 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో 20,475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను నేర చిట్టాల నివేదికలో పొందుపరచలేదు. -
తెలంగాణకు వనరుల రూపంలో రూ.1.45 లక్షల కోట్లు.. 150 శాతం అప్పులు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కకావికలం చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్ లెక్కలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. 2020–21లో మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వనరుల రూపంలో రూ.1,45,599.95 కోట్లు సమకూరినట్లు లెక్కకట్టింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీ ముందు ఉంచిన 2020–21 బడ్జెట్ సవరణ ప్రతిపాదనల్లో మొత్తం ఆదాయం రూ.1,66,728.91 కోట్లు వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనా కంటే రూ. 21వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిందని కాగ్ వెల్లడించింది. ముఖ్యంగా పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటాలో తగ్గుదల కారణంగా ప్రభుత్వ అంచనాల్లో కూడా తగ్గుదల కనిపించిందని, ప్రభుత్వం అంచనావేసిన దాంట్లో అప్పులు పెరగ్గా, పన్ను ఆదాయం దాదాపు అదే విధంగా వచ్చిందని తేల్చింది. అయితే, బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే రూ. 45 వేల కోట్ల వరకు నష్టం వస్తుందన్న ప్రభుత్వ లెక్కకు కొంచెం అటూఇటుగానే కాగ్ లెక్కలు కూడా ఉండటం గమనార్హం. 150 శాతం అప్పులు.. 2020–21లో రూ.34 వేల కోట్లకు పైగా రుణాల ద్వారా సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. కానీ, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనివార్యమైన అప్పుల కారణంగా ఈ ప్రతిపాదనలను సవరించి గత ఏడాది మొత్తం రూ. 43,784 కోట్ల అప్పులు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే వాస్తవ బడ్జెట్ ప్రతిపాదనలు, సవరణల బడ్జెట్ అంచనాలను మించి 2020–21లో ఏకంగా రూ.45,638.79 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చిందని కాగ్ తేల్చింది. అప్పులు పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటాలో బాగా నిధుల రాబడి తగ్గిందని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా ఈ లోటు కొంత పూడినా ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయం రాలేదని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. అయితే, పన్ను ఆదాయం విషయంలో మాత్రం ప్రభుత్వం అంచనాలకు, కాగ్ గణాంకాలకు పొంతన కుదిరింది. 2020–21కి గాను రూ. 85,300 కోట్ల మేర పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం మొదట అంచనా వేసినా కరోనా దెబ్బకు ఆ మొత్తాన్ని రూ.76,195.65 కోట్లకు సవరించింది. కాగ్ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వం అంచనాలకు కొంచెం ఎక్కువగా రూ. 79,339.92 కోట్లు పన్ను ఆదాయం రూపంలో రావడం గమనార్హం. మూలధన వ్యయం ‘సూపర్’ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు దిక్సూచిగా నిలిచే మూలధన వ్యయం మాత్రం గత ఏడాది బాగా జరిగిందని కాగ్ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సవరణల బడ్జెట్ ప్రకారం.. 2020–21లో రూ.10,561.18 కోట్ల మూల ధన వ్యయం జరగాల్సి ఉండగా, 2021, మార్చి 31 నాటికి రూ.16,181.30 కోట్ల వ్యయం జరిగిందని తేల్చింది. అలాగే ద్రవ్యలోటు కూడా కాగ్ లెక్కల ప్రకారం ప్రభుత్వ అంచనాలకు మించి ఉంది. ప్రభుత్వం గత ఏడాది రూ.42,399 కోట్ల మేర ద్రవ్యలోటు అంచనా వేయగా, అది రూ.45వేల కోట్లు దాటిందని కాగ్ వెల్లడించింది. -
ఆ కొనుగోళ్లే కొంప ముంచాయ్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం సరైన నియంత్రణ పాటించని కారణంగా విద్యుత్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది. ఈ కారణంగానే రాష్ట్ర విభజన కాలం నుంచి ఇప్పటివరకూ విద్యుత్ సంస్థలు కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. 2014–15 నుంచి 2018–19 వరకూ విద్యుత్ రంగం పరిస్థితిపై కాగ్ నివేదిక వెలువరించింది. మిగులు విద్యుత్ పేరుతో గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలను అత్యధిక ధరలకు చేసుకోవడం వల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోయాయి. ముఖ్యంగా పవన, సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో గాడి తప్పడం వల్ల ఊహించని విధంగా నష్టాలు వచ్చాయి. ప్రైవేటుతో ఢమాల్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2014–15లో రూ.7,069.25 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2018–19 నాటికి ఆ నష్టాలు రూ. 27,239.60 కోట్లకు వెళ్లాయి. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యధికంగా ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం తారస్థాయిలో ఉండటం (యూనిట్ రూ.5 పైన), ఆదాయం అంతకన్నా తక్కువ ఉండటంతో నష్టాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) ఐదేళ్లలో రూ.6,608.90 కోట్ల నుంచి రూ.21,173.01 కోట్ల నష్టాలకు వెళ్లింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) రూ.2,416.68 కోట్ల నుంచి రూ.7,974 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఎక్కువగా ప్రైవేట్ సోలార్, విండ్ పవర్ విద్యుత్ ధరలు రానురాను తగ్గుతున్నా.. అప్పటి ప్రభుత్వం మాత్రం అత్యధిక రేట్లకు కొనుగోలు చేసింది. ఆర్పీవో ఆబ్లిగేషన్ కింద 2016–17లో 2,433 ఎంయూల (5 శాతం) సౌర, పవన విద్యుత్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటే.. 4,173 ఎంయూలు (8 శాతం) అనుమతించింది. 2017–18లో 4,612 ఎంయూలకు (9 శాతం), 9714 (19 శాతం) ఇచ్చింది. 2018–19లో 6,190 ఎంయూలు (11 శాతం) అనుమతించాల్సి ఉంటే... 13,142 ఎంయూలు (23.4 శాతం) అనుమతించింది. విండ్, సోలార్ విద్యుత్ తీసుకుని చౌకగా లభించే ఏపీ జెన్కో విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో జెన్కోకు యూనిట్‌కు రూ.1.50 వరకూ ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో 2015–16లో సంస్థలపై రూ.157.1 కోట్లు, 2016–17లో రూ.339.3 కోట్లు, 2017–18లో రూ.2,141.1 కోట్లు, 2018–19లో రూ.3,142.7 కోట్ల అదనపు భారం పడింది. సోలార్ విద్యుత్ ప్రస్తుతం యూనిట్ రూ.2.49కే లభిస్తోంది. కానీ.. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏ కారణంగా కొన్నింటికి యూనిట్‌కు రూ.6.25 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీ నిర్ణయాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. -
మునిసిపాలిటీల్లోనూ అడ్డగోలు వ్యవహారాలే
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి పెద్దల సన్నిహితులకు అడ్డగోలుగా మునిసిపల్ స్థలాలను కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా మునిసిపల్ ఆస్తుల శాశ్వత బదలాయింపు, లీజుల పేరిట అస్మదీయులకు ధారాదత్తం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి మొబలైజేషన్ అడ్వాన్సులు వసూలు చేయలేదు. 2019 మార్చి 31తో ముగిసిన కాలానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీయే)కి చెందిన 313.79 చదరపు గజాల స్థలాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం తమ సన్నిహితుల సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అత్యంత తక్కువ రేటుకు కట్టబెట్టేసింది. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ గజం రూ.48 వేలుగా ఉందని వీఎంఆర్డీయే ప్రభుత్వానికి నివేదించింది. కానీ.. టీడీపీ పెద్దల ఒత్తిడితో అప్పటి కేబినెట్ చదరపు గజం కేవలం రూ.16 వేల చొప్పున ఆ సంస్థకు అప్పగించింది. నిబంధనల ప్రకారం భూ కేటాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర భూ నిర్వహణ అథారిటీ ద్వారా రాష్ట్ర మంత్రివర్గానికి వెళ్లాలి. కానీ ఆ అథారిటీ పరిశీలించకుండానే, సిఫార్సు లేకుండానే అప్పటి మంత్రివర్గం ఆమోదించేసింది. దాంతో ప్రభుత్వానికి రూ.కోటి నష్టం వాటిల్లింది. అంతేకాదు చదరపు గజానికి రూ.16 వేల చొప్పున ఆ సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.50.21 లక్షలకు గాను కేవలం రూ.40.21 లక్షలే చెల్లించింది. మిగలిన రూ.10 లక్షలు చెల్లించకపోయినా వీఎంఆర్డీయే పట్టించుకోలేదు. లీజుల్లోనూ ఇష్టారాజ్యం విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన వివేకానంద కల్యాణ మండపాన్ని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతల సన్నిహితులకు 2015లో మూడేళ్లకు లీజుకు ఇచ్చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారంతో విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.92.67 లక్షల నష్టం వాటిల్లింది. విశాఖపట్నం కార్పొరేషన్లో 24 గంటల తాగునీటి సరఫరా కోసం ప్యాకేజీ–1 కింద రూ.86.90 కోట్ల పనులను ఎస్ఎంసీ–సీసీఎస్పీల్–ఈసీఎల్ అనే జాయింట్ వెంచర్ సంస్థకు అప్పగించారు. పనులు త్వరగా పూర్తి చేయాలనే షరతుపై జీవీఎంసీ కాంట్రాక్టరుకు రూ.8.69 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ చెల్లించింది. కానీ కాంట్రాక్ట్ సంస్థ కేవలం 30 శాతం పనులు మాత్రమే చేసి 2016 జూలై అర్ధంతరంగా పనులు వదిలేసి వెళ్లిపోయింది. ఆ సంస్థ నుంచి మొబలైజేషన్ అడ్వాన్స్‌ను మునిసిపల్ కార్పొరేషన్ వసూలు చేయలేకపోవడంతో ప్రజాధనం రూ.8.69 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం మునిసిపల్ మార్కెట్ లీజు, అద్దె మొత్తాలను వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి 2011–12 నుంచి 2015–16 వరకు అద్దెలు వసూలు చేయకపోవడంతో రూ.1.57 కోట్ల నష్టం వాటిల్లింది. నిరుపయోగమైన ఆర్జీయూకేటీ పరికరాలు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థుల ప్రయోజనాల కోసం రూ.1.95 కోట్లతో 2013–2014లో ఏర్పాటుచేసిన విలువైన పరికరాలను నిరుపయోగంగా ఉంచారని కాగ్ నివేదిక తప్పుబట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరికరాలను వినియోగించడంలో నిర్లిప్తంగా ఉండడాన్ని ఎండగట్టింది. ఆర్జీయూకేటీలో ఇన్స్ట్రుమెంటెడ్ పెండ్యులం ఇంపాక్ట్ టెస్టర్, 100 కెఎన్ హై టెంపరేచర్ యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ సరఫరాకు ఒక సంస్థకు 2013–2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. 2014 ఆగస్టులో ఈ పరికరాలను ఆర్జీయూకేటీ ఇడుపులపాయ క్యాంపస్‌కు అందించారు. పరికరాలు సరఫరా చేసిన సంస్థకు 90 శాతం అంటే రూ.1.75 కోట్లను ఆర్జీయూకేటీ చెల్లించింది. మిగిలిన 10 శాతాన్ని పరికరాలు అమర్చి వాటి వినియోగం ప్రారంభం అయిన తరువాత చెల్లించాల్సి ఉంది. ఈ పరికరాలను అమర్చి తమకు ఉపయోగపడేలా చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, అధ్యాపకులు విన్నవించినా ఐదేళ్లు పట్టించుకోలేదు. మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ భవన నిర్మాణం పూర్తికాకపోవడం, విద్యుత్ లేకపోవడంతో పరికరాలు అమర్చలేదని ఆర్జీయూకేటీ సమాధానం ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. అమర్చడానికి స్థలం నిర్ధారించకుండా పరికరాలు సేకరణను తప్పుబట్టింది. పాఠశాలల్లో పనులు చేయలేదు ఉపాధి హామీ పథకం కింద 3 వేల పాఠశాల మైదానాలను ఆటస్థలాలుగా అభివృద్ధి చేయాలని 2017 ఫిబ్రవరిలో పాఠశాల విద్యాశాఖ సూచనలిచ్చింది. రూ.58.28 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 2019 సెప్టెంబర్ నాటికి రూ.15.59 కోట్లతో 1,046 పనులు పూర్తయ్యాయి. రూ.42.69 కోట్లతో చేయాల్సిన పనులు పూర్తికాలేదని కాగ్ ఎత్తిచూపింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని అధికారులకు సూచించామని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందని 2020 నవంబర్‌లో ప్రభుత్వం తెలిపిందని కాగ్ నివేదికలో పేర్కొంది. వాణిజ్య పన్నుల శాఖకు రూ.84.11 కోట్లు నష్టం వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది. 180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్ ప్రభుత్వానికి సూచించింది. రుణ భారంలో పీఎస్‌యూలు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది. -
కేంద్ర సాయం ‘లెక్కేంటి’?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విషయంలో సరైన సహకారం అందడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, జాతీయ ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచే వివక్ష చూపుతోందని ‘కాగ్’గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వివిధ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రం ఆశించిన దాంట్లో సగం మేరకు మాత్రమే నిధులు రావడం గమనార్హం. గత ఏడేళ్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 1.20 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఇస్తుందని రాష్ట్రం అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనల్లో పెడితే అందులో ఏటా కోతలు విధించి ఇప్పటివరకు సుమారు రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. కేంద్ర పన్నుల్లో వాటాలోనూ ఇదే తరహా కోతలు కనిపిస్తుండగా అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 38 వేల కోట్లకుపైగా వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. (2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రూ. 38,669.46 కోట్లు, పన్నుల్లో వాటా కింద రూ. 13,990.13 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశలు పెట్టుకొని బడ్జెట్ అంచనాల్లో పొందుపరచడం గమనార్హం) ఏటేటా... అంతంతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయానికి వస్తే రాష్ట్రానికి ఏ యేడాదిలోనూ ఈ పద్దు కింద రూ. 15 వేల కోట్లు దాటలేదు. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో ఈ పద్దు కింద రూ. 21 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేస్తే అందులో నాలుగో వంతుకన్నా కొంచెం ఎక్కువగా అంటే... కేవలం రూ. 6 వేల కోట్లకుపైగా మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆ తర్వాతి ఏడాది రూ. 7,500 కోట్లు, ఆ తర్వాత రూ. 9 వేల కోట్లు, అనంతరం వరుసగా రెండేళ్లు రూ. 8 వేల కోట్ల చొప్పున నామమాత్రపు సాయం చేసింది. అయితే ప్రతి ఏడాదిలోనూ కేంద్రం మీద రూ. 20 వేల కోట్లకుపైగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రానికి ఓ రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో మొండిచేయి ఎదురైందనే చెప్పాలి. ఇక గత రెండేళ్లుగా వైఖరి మార్చిన కేంద్రం... గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను కొంత పెంచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి (2019–20)లో రూ. 11 వేల కోట్లకుపైగా 2020–21లో రూ. 12 వేల కోట్లకుపైగా నిధులిచ్చింది. అయితే అంతా కలిపినా రాష్ట్రం ఆశించిన దాంట్లో కేవలం సగం మాత్రమే కావడం గమనార్హం. వాటా నిధుల్లోనూ మార్పు లేదు... పన్నుల్లో వాటాకు సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,514 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా ఆ ఏడాది అంతకుమించి రూ. 13,613.09 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది రూ. 14,348.90 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించగా అందులో కోత పెట్టి కేవలం రూ. 11,450.85 కోట్లనే కేంద్రం ఇచ్చింది. గతేడాది (2020–21) కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 10,906.51 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా ఫిబ్రవరి నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,483.08 కోట్లేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. అంటే గత మూడేళ్లలో రూ. 37,729 కోట్లకుపైగా నిధులను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని అంచనా వేయగా రూ. 6 వేల కోట్ల వరకు తక్కువగా రూ. 31,547 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా శాతం తగ్గడంతో రానున్న నాలుగేళ్లపాటు ఈ మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గనున్నాయి. -
జీహెచ్ఎంసీకి కాగ్ ఆక్షింతలు
గ్రేటర్ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల పనితీరు ఏమాత్రం బాగోలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. వ్యయ నిర్వహణ, సేవల తీరు, ఆర్థిక క్రమశిక్షణ, నిర్లక్ష్యం, నష్టాలకు కారణాలను కూలంకుశంగా పేర్కొన్న కాగ్..జలమండలి, ప్రభుత్వ ఆస్పత్రులు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలను కడిగిపారేసింది. అధికారులు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రూ.కోట్ల నష్టాలు మిగిలాయని పేర్కొంది. ప్రజలకుసక్రమమైన సేవలు అందలేదని స్పష్టం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: నాలాల్లో డీసిల్టింగ్ (పూడికతీత)కు సంబంధించి అవకతవకలు జరిగినా అధికారులు కళ్లు మూసుకున్నారని, తత్ఫలితంగా జీహెచ్ఎంసీ నుంచి రూ.53.56 లక్షల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని కాగ్ నివేదిక కడిగి పారేసింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచింది. 2015–17 మధ్యకాలంలో జీహెచ్ఎంసీ చేసిన 766 డీసిల్టింగ్ పనుల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు 207 ఉన్నాయని, వాటిల్లో మచ్చుకు 21 పనుల్ని ఆడిట్ తనిఖీ చేయగా అక్రమాలు వెలుగు చూశాయని తెలిపింది. మొత్తం తనిఖీ చేస్తే ఇంకెంతమేర అక్రమాలుంటాయోనని అభిప్రాయపడింది. ప్రయాణికుల వాహనాల్లో పూడికను తరలించినట్లు కాంట్రాక్టర్లు పేర్కొన్నా అధికారులు గుర్తించకపోవడం అశ్రద్ధకు పరాకాష్టగా విమర్శించింది. రవాణాశాఖ వద్ద నమోదైన వాహనాల నెంబర్లతో పోల్చిచూడగా ఈవిషయం వెలుగు చూసింది. అంతేకాదు వివిధ వాహనాలను రవాణాశాఖ అనుమతించిన గరిష్ట బరువు కంటే ఎక్కువ బరువైన పూడికను తరలించేందుకు వినియోగించినట్లు మెజర్మెంట్స్ రికార్డుల్లో ఉందని పేర్కొంది. 20 పనులకు సంబంధించి 133 వాహనాల ద్వారా 1326 ట్రిప్పుల్లో తరలించిన పూడిక బరువు, సదరు వాహనాలను అనుమతించిన గరిష్ట బరువుకంటే ఎక్కువగా ఉందని తెలిపింది. చెరువుల నిర్వహణపైనా... నగరంలో చెరువుల్ని నిర్లక్ష్యం చేయడంపై కాగ్ తప్పుపట్టింది. ప్రభుత్వం 2014–18 మధ్యకాలంలో చెరువుల కోసం రూ.287.33 కోట్లు కేటాయించినప్పటికీ, కేవలం రూ. 42.14 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని తెలిపింది. ఈ నిధులతో పరిరక్షణ, సుందరీకరణ పనులకు, వినాయక చవితి సందర్భంగా విగ్రహాల నిమజ్జనాలకు కుంటలు, బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్లకే ఖర్చు చేసిందని పేర్కొంది. మిషన్ కాకతీయ నాలుగో ఫేజ్ కింద 2018–19 మధ్య జీహెచ్ఎంసీ పరిధిలోని 19 చెరువుల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికోసం రూ. 282.63 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చిందని పేర్కొంది. ఈ పనులు చేసేందుకు చెరువుల్లో నీటి నాణ్యతపై దృష్టి సారించలేదని తప్పుబట్టింది. మిషన్ కాకతీయ మార్గదర్శకాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన చెరువుల్ని ఎంపిక చేయడం వల్ల గ్రేటర్ పరిధిలోని చెరువుల సహజత్వానికే భంగం వాటిల్లిందని అభిప్రాయపడింది. అంతేకాదు.. గ్రేటర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలను అడ్డుకునేవారు లేక చెరువుల ఉనికే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. దుర్గంచెరువు చుట్టూ నిర్మాణాల వల్ల ఎఫ్టీఎల్ విస్తీర్ణం తగ్గిందని స్పష్టం చేసింది. సైకిల్‌ట్రాక్‌ను తొలగించాలని లేక్‌ప్రొటెక్షన్ కమిటీ ఆదేశించినా అమలు చేయలేదని తప్పుపట్టింది. దుర్గం చెరువు సుందరీకరణను సీఎస్సార్ కింద కే.రహేజా ఐటీపార్క్‌కు అప్పజెప్పడం తగని చర్యగా పేర్కొంది. 2016లో నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, 18 చెరువులకు సంబంధించి నిర్వహించిన సర్వేలో 8 చెరువుల ఎఫ్టీఎల్లో రోడ్లు, 11 చెరువుల ఎఫ్టీఎల్లో భవనాలు, 17 చెరువుల బఫర్జోన్లలో భవనాలున్నా యని వెల్లడించింది. చెరువులకు సంబంధించి ఇంకా వివిధ అంశాల్లో ఆయా ప్రభుత్వశాఖల బాధ్యతారాహిత్యాన్ని కాగ్ తప్పుబట్టింది. రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్వాకాన్ని కాగ్ ఎత్తి చూపింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ ఫీజుల వసూళ్లలో చేతివాటంపై అభ్యంతరాలు వ్యక్తం చేసి రెండేళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంపై కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో తాకట్టు లావాదేవీలను సాధారణ దస్తావేజుల డిపాజిట్‌గా పరిగణించడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగా గండి పడింది. వాస్తవంగా దస్తావేజుల ద్వారా తీసుకున్న రుణాలపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయాల్సి ఉండగా హైదరాబాద్ (దక్షిణం) డీఆర్, షాద్‌నగర్, కూకట్పల్లి, చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్లు ఒక్కో దస్తావేజుపై రూ.10 వేల చొప్పున మాత్రమే వసూలు చేసి చేతివాటం ప్రదర్శించినట్లు కాగ్ వెల్లడించింది. ఫలితంగా సుమారు రూ.4.44 కోట్ల ఆదాయానికి గండి పడిందని పేర్కొంది. దీనిపై రెండేళ్ల క్రితమే అభ్యంతరాలు వ్యక్తం చేసినా..ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కాగ్ పేర్కొంది. రిజిస్టర్ అయిన దస్తావేజులపై తక్కువగా సుంకాలు విధించడంతో సుమారు రూ.20 కోట్ల ఆదాయానికి గండి పడిందని హైదరాబాద్ సౌత్, మేడ్చల్ డీఆర్, బాలానగర్, దూద్‌బౌలి, గోల్కొండ, కాప్రా, కూకట్పల్లి, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్లపై కాగ్ అభియోగాలు మోపింది. అభ్యంతరాలపై lసరైన సమాధానాలు ఇవ్వక పోవడాన్ని తప్పుపట్టింది. ఆర్థికంగా బలహీనమే.. జలమండలి పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అక్షింతలు వేసింది. తాజాగా శాసనసభకు సమర్పించిన నివేదికలో..వాటర్ బోర్డు 2013–17 మధ్యకాలానికి సంబంధించి వార్షిక పద్దులను ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించలేదని ఆక్షేపించింది. ఇక 2010–13 మధ్యకాలానికి సంబంధించిన వార్షిక పద్దులను సమర్పించినా.. ప్రభుత్వం ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఇక జలమండలికి జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ.761.96 కోట్ల బకాయిలు రాకపోవడంతో వాటర్‌బోర్డు ఆర్థికంగా బలహీనమైందని పేర్కొంది. జలమండలి తన పరిధిలో ప్రతి వ్యక్తికీ నిత్యం 150 లీటర్ల నీటిని సరఫరా చేయలేకపోతుందని..వాస్తవంగా సరఫరా చేస్తున్న నీరు 66–71 లీటర్ల మధ్యన ఉందని తెలిపింది. ‘ఈ– ఆస్పత్రుల’ నిర్వహణలో విఫలం ‘ఈ– ఆస్పత్రుల’ నిర్వహణకు ఎంపిక చేసిన ఆస్పత్రులు ఘోరంగా విఫలమైనట్లు కాగ్ స్పష్టం చేసింది. ఆస్పత్రులకు వచ్చే ఇన్‌పేషంట్లు, అవుట్ పేషంట్ల వివరాలను ఎలక్ట్రానిక్ రికార్డులో పొందుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈహెచ్ఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని గాంధీ, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఇందుకు రూ.10.49 కోట్లు కేటాయించి, ఇందులో రూ.10.20 లక్షలు రెండు విడతల్లో చెల్లించింది. కానీ అధికారులు మాత్రం ఈ పథకం అమలులో పూర్తిగా నిర్లక్ష్యం చూపినట్లు కాగ్ పేర్కొంది. గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లును మంజూరు చేసింది. పరిశోధనల కోసం రెండు ఎంఆర్ఐ మిషన్లను అందించింది. అయితే వాటికి అవసరమైన స్థల కేటాయింపు, సిబ్బంది నియామకం, నిర్వహణ అంశాల్లో రెండు కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సహా కీలక వైద్య పరికరాలు రాకుండా పోయినట్లు కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. -
కేటాయింపులు ఘనం.. వ్యయం అంతంతే
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు సంవత్సరం వ్యవసాయం, సంక్షేమం, నీటిపారుదల తదితర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసిన చంద్రబాబు సర్కారు ఆ సొమ్మును ఖర్చు చేయడంలో విఫలమైంది. కేటాయింపులు, వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బహిర్గతం చేసింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సహాయం, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, పరిశ్రమల రంగాలకు భారీగా కేటాయింపులు చేసినా వ్యయం అంతంత మాత్రంగానే చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొన్ని రంగాల్లో మిగుళ్లకు నిర్దిష్టమైన కారణాలను ప్రభుత్వం తెలియజేయలేదని కూడా వ్యాఖ్యానించింది. సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ రంగాల కేటాయింపుల్లో సగం కూడా వ్యయం చేయలేదని తెలిపింది. బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవరూపం దాల్చలేదని కాగ్ స్పష్టం చేసింది. కేటాయింపులు చేసినా ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. కేటాయింపులకు వ్యయానికి పొంతన లేకపోవడంతో బడ్జెట్ ప్రక్రియకు అర్థం లేకుండా పోయిందని కాగ్ నివేదిక పేర్కొంది. పౌరసరఫరాల కేటాయింపుల్లో ఏకంగా 81 శాతం మేర వ్యయం చేయలేదు. అలాగే రహదారులు, భవనాలశాఖకు కేటాయించినదాన్లో 75 శాతం మేర ఖర్చుచేయలేదు. మొత్తం 11 రంగాలకు కలిపి రూ.1,05,579.16 కోట్లు కేటాయించగా రూ.57,908.50 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. రూ.47,670.66 కోట్ల రూపాయలను వ్యయం చేయలేదు. 11 రంగాలకు కేటాయింపులు, ఖర్చుచేసిన, చేయని సొమ్ము వివరాలు.. రంగం కేటాయింపు (రూ.కోట్లలో) ఖర్చుచేసిన సొమ్ము(రూ.కోట్లలో) ఖర్చు చేయని మొత్తం 1.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సహాయం 6,942.26 3886.61 3,055.65 2. పాఠశాల విద్య 23,192.58 17,479.29 5,713.33 3. పురపాలక, పట్టణాభివృద్ధి 8,629.99 5,243.03 3,386.96 4. సాంఘిక సంక్షేమం 4,221.64 2,121.06 2,100.58 5. బీసీ సంక్షేమం 6,278.36 2,804.39 3,473.97 6. వ్యవసాయం 15,569.41 8,020.53 7,548.88 7. పంచాయతీరాజ్ 7,367.03 4,880.90 2,486.13 8. పరిశ్రమలు, వాణిజ్యం 4,696.67 1,010.12 3,686.55 9. పౌరసరఫరాలు 3,673.00 697.69 2,975.31 10. రోడ్లు, భవనాలు 4,369.72 1,087.60 3,282.12 11. నీటిపారుదల 20,638.50 10,677.32 9,961.18 మొత్తం 1,05,579.16 57,908.54 47,670.66 -
బాబు హయాంలో మద్యం సిండికేట్లకు సలాం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తూర్పారబట్టింది. లోపభూయిష్టంగా జరిగిన పన్నుల వసూళ్లు, నమోదైన కేసుల్లో అవకతవకలను ఎత్తి చూపింది. మద్యం సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు కాగ్ తేల్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఆడిట్ చేయాల్సిన కార్యాలయాలు 103 ఉండగా.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కాగ్ 14 కార్యాలయాలను మచ్చుకు తనిఖీ చేసింది. మొత్తం 41 కేసుల్లో రూ.6.71 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించింది. అంటే మిగిలిన కార్యాలయాల్లో ఎంత మేర అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని కాగ్ పేర్కొంది. కాగ్ ఎత్తి చూపిన తప్పులను ఎక్సైజ్ శాఖ కూడా అంగీకరించడం గమనార్హం. ఇష్టానుసారంగా అనుమతులు..: రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప నగర పాలక/పురపాలక సంస్థల్లో విలీనం చేశారు. ఇక్కడి మద్యం షాపులకు అదనపు లైసెన్సు ఫీజులు వసూలు చేయాలి. కానీ ఎక్సైజ్ శాఖ దీన్ని పట్టించుకోలేదు. కాగ్ తనిఖీ చేసిన సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన రూ.2.01 కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. పర్మిట్ రూంలకు ఫీజులు వసూలు చేయకుండా మద్యం సిండికేట్లతో కుమ్మక్కై రూ.3.16 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అలాగే బార్లను అనుమతించిన విస్తీర్ణంలో కాకుండా.. బ్లూ ప్రింట్‌ను మించి వ్యాపారం నడిపినా పట్టించుకోలేదు. వీటికి అదనపు రుసుం వసూలు చేయలేదు. కాకినాడ, ఒంగోలు, రాజమండ్రిలో 13 మంది లైసెన్సుదారులకు రూ.94.11 లక్షల అదనపు ఫీజు విధించలేదు. ఇక కల్లు చెట్లకు వర్తించే రేట్లను తక్కువగా చేసి చూపడంతో రూ.28.89 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో కల్లు చెట్లకు అద్దెలను తక్కువగా విధించినట్లు కాగ్ తేల్చింది. -
దేవుళ్లకే ‘బాబు’ శఠగోపం!
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం దేవుళ్ల డబ్బులనూ ఇతర అవసరాలకు మళ్లించినట్టు కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన 2014–2018 కాలంలో వివిధ ఆలయాలకు చెందిన దేవుళ్ల నిధులను ప్రభుత్వ అధికారులు ఉపయోగించే కార్లకు ప్రెటోలు ఖర్చుకు.. తమకు నచ్చిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు గ్రాంట్ రూపంలో ఆర్ధిక సహాయం చేసేందుకు మళ్లించినట్టు స్పష్టం చేసింది. రూ.34.07 కోట్ల మేర ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన నిధులకు సంబంధించి రికార్డుల్లో ఎటువంటి వివరాలు లేవని తప్పు పట్టింది. వందల కోట్ల రూపాయల ఆలయ నిధుల అక్రమాలకు సంబంధించి కాగ్ తన నివేదికలో మొత్తం 16 పేజీలలో వివరించింది. 2014–15 ఆర్ధిక ఏడాది నుంచి 2017–18 ఆర్ధిక ఏడాది మధ్య నాలుగేళ్ల లావాదేవీలకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయ రికార్డులతో పాటు రాష్ట్రంలోని 6 (ఏ) కేటగిరికి చెందిన 13 ప్రముఖ ఆలయాల రికార్డులను కాగ్ అధికారులు తనిఖీ చేసి, ఓ నివేదిక రూపొందించారు. 2018 ఏప్రిల్, జూలై మధ్య కాగ్ ఈ తనిఖీలు నిర్వహించింది. ఈ నివేదికను కాగ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల నిధులను వేద, సంస్కృత సంస్థల ఏర్పాటుకు, సనాతన ధర్మ ప్రచారానికి, అవసరం ఉన్న ఏ ఇతర ఆలయాల కోసమే వినియోగించాలి. అయితే గత ప్రభుత్వం అలా కాకుండా చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ► తనిఖీలు చేసిన 13 ఆలయాల్లోని ఎనిమిదింటిలో మిగులు నిధులను అధికారులు ఉపయోగించే కార్ల అద్దెలకు, పెట్రోలు ఖర్చుకు, ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులకు ఉపయోగించారు. ► చిన్న ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నప్పుడు వాటి పునరుద్ధరణ, సంరక్షణ, నిర్వహణ కోసం పెద్ద ఆలయాల నుంచి దేవదాయ శాఖ సేకరించిన కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల్లోంచి రూ.12.41 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవన (కమిషనర్ కార్యాలయ) నిర్మాణానికి వెచి్చంచారు. ఓ ట్రస్టుకు రూ.10.60 కోట్లు ► భక్తులు వివిధ ఆలయాలకు సమర్పించిన కానుకలను, సీజీఎఫ్ రూపంలో దేవదాయ శాఖ సేకరించిన నిధులతో పాటు మరో రూ.10.60 కోట్లను దేవదాయ శాఖ పర్యవేక్షణలో లేని ఒక ట్రస్టుకు కేటాయించారు. ► ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే ఇలా ఇవ్వకూడదు. పైగా ఆ డబ్బులను ఆ ట్రస్టు దేని కోసం ఖర్చు పెట్టిందన్న వివరాలను అప్పటి ప్రభుత్వం తెలుసుకోలేదు. ఇలా ఆయా ఆలయాల్లో రూ.వందల కోట్లలో నిధులు పక్కదారి పట్టాయి. భూ అక్రమణలను పట్టించుకోలేదు.. ► రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పేరిట 4,53,459 ఎకరాల వ్యవసాయ భూమి, 9,05,374 చదరపు గజాల వ్యవసాయేతర భూమి ఉంది. అందులో 70,091 ఎకరాల (మొత్తంలో 15.46 శాతం) వ్యవసాయ భూమి, 11,131 చదరపు గజాల (మ్తొతం 1.23 శాతం) వ్యవసాయేతర భూమి ఆక్రమణలకు గురైంది. ► కాగ్ తనిఖీ చేసిన ఆలయాల పరిధిలోని ఐదు ఆలయాలకు సంబంధించి 716.10 ఎకరాల వ్యవసాయ భూమి ఆక్రమణలో ఉంది. వాటి పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక చోట 4.88 ఎకరాల భూమిని విడిపించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా, చర్యలు తీసుకోలేదు. డిపాజిట్ చేయని బంగారం 68.468 కిలోలు ► ఆలయాల వద్ద దేవుడి అభరణాల రూపంలో ఉన్నవి కాకుండా ఉపయోగించకుండా ఒక్క గ్రాము బంగారం ఉన్నా, బంగారం డిపాజిట్ స్కీంలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే నాలుగు ఆలయాల పరిధిలో 68.468 కిలోల బంగారం డిపాజిట్ చేయకుండా లాకర్లో ఉంచారు. ► ఆయా ఆలయాల పరిధిలోని దుకాణాలకు సంబంధించి రూ.18.48 కోట్ల లీజు బకాయిలు వసూలు చేయలేదు. -
చేబదుళ్ల వడ్డీ రూ.108 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్ధిక నిర్వహణను గత సర్కారు పూర్తిగా దిగజార్చింది. రెండేళ్లలో చేబదుళ్లకు భారీగా వడ్డీ చెల్లించింది. ఇది టీడీపీ సర్కారు అస్తవ్యస్థ ఆర్ధిక నిర్వహణ విధానాలను రుజువు చేస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 250 రోజులు చేబదుళ్లతోనే కాలం వెళ్లబుచ్చింది. వరుసగా 2017–18లో కూడా చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్)సకాలంలో చెల్లించకపోవడంతో రూ.44 కోట్ల మేర వడ్డీ కట్టాల్సి వచ్చింది. 2018–19 ఆర్థిక ఏడాదిలో కూడా చేబదుళ్లు సకాలంలో చెల్లించకపోవడంతో రూ.64 కోట్ల మేర వడ్డీ భారం ఖజానాపై పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా వరుసగా రెండేళ్లలో చేబదుళ్లకే రూ.108 కోట్ల మేర వడ్డీ చెల్లించారు. 2018–19 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. కాగ్ నివేదికలో ముఖ్యాంశాలివీ.. ► 2018–19లో రెవెన్యూ వ్యయం భారీగా పెరిగింది. 2017–18లో రెవెన్యూ వ్యయం రూ.1,21,214 కోట్లు ఉండగా 2018–19లో రూ.1,28,570 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది కన్నా 6.07 శాతం పెరిగింది. జీఎస్డీపీలో రెవెన్యూ వ్యయం 13.77 శాతంగా ఉంది. ► 2018–19లో రెవెన్యూ లోటు 13,899 కోట్లుగా ఉంది. 14వ ఆర్ధిక సంఘం రెవెన్యూ లోటు గ్రాంటు విడుదల చేసినప్పటికీ గత మూడేళ్లలో రాష్ట్ర రెవెన్యూ లోటు నిర్దేశించిన పరిమితికి మించి ఉంది. ► 2019 మార్చి 31 నాటికి సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ సొమ్ము రూ.663.63 కోట్లను గత ప్రభుత్వం జాతీయ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా తరువాత సంవత్సరాలకు వాయిదా వేసింది. దీనివల్ల ఆ సొమ్ముపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సి ఉంది. ఉద్యోగులకు చెందిన నిధులను గత సర్కారు సమంజసం కాని రీతిలో వినియోగించింది. దీంతో ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి నెలకొనడంతోపాటు ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడింది. ఫలితంగా ఈ పథకమే విఫలమయ్యే ప్రమాదం నెలకొంది. ► ఏటా రుణాలు పెరుగుతుండటంతో 2018– 19కి రుణ బకాయిలు రూ.2,57,510 కోట్లకు చేరుకున్నాయి. 2018–19లో రుణాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.33,804 కోట్లు ఎక్కువగా పెరిగాయి. 2019 మార్చి 31 నాటికి రాష్ట్ర రుణాల పరిపక్వత సమయాలను పరిశీలిస్తే రాబోయే ఏడు సంవత్సరాల్లో 54 శాతం అంటే రూ.1,03,550 కోట్ల రుణాలను రాష్ట్రం తీర్చాల్సి ఉంటుంది. ఈ రుణ భారాన్ని అధిగమించేందుకు అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవడంతోపాటు వివేచనాత్మక వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. రుణాలు చెల్లించేందుకు నిర్దిష్ట ప్రణాళిక లేకుంటే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. అస్తవ్యస్త నిర్వహణతో ఖజానాకు నష్టం అంతర్ రాష్ట్ర పర్మిట్లు లేకుండా వాహనాలు తిరిగినా పట్టించుకోలేదు చంద్రబాబు హయాంలో రవాణా శాఖ చెక్ పోస్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తూర్పారబట్టింది. ఇతర రాష్ట్రాల వాహనాలు అంతర్ రాష్ట్ర పర్మిట్లు లేకుండా ఏపీలో తిరిగినా రవాణా శాఖ పట్టించుకోలేదని ఎత్తి చూపింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికల్ని ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగ్ ఎత్తి చూపిన లోపాల్లో ముఖ్యాంశాలిలా ఉన్నాయి. 2018–19 మధ్య ఇతర రాష్ట్రాలకు చెందిన 71,011 రవాణా వాహనాలు ఏపీలో ప్రవేశించాయి. ఇందులో 57,047 వాహనాలకు చెల్లుబాటయ్యే అంతర్ రాష్ట్ర పర్మిట్లు లేవు. అయినా ఆ వాహనాలు ఏపీలో తిరిగాయి. సరైన ప్రదేశంలో చెక్ పోస్ట్‌లు లేకపోవడం వల్ల కనీసం?రూ.1.60 కోట్లు రెవెన్యూ నష్టపోవడమే కాకుండా నిర్దేశిత తనిఖీలు చేపట్టలేదు. ఏడాది వ్యవధిలో జరిగిన 1,79,278 నేరాల్లో 1,39,315 నేరాలు పునరావృతమైన నేరానికి సంబంధించినవి. రెండు, అంతకుమించి నేరాలతో పట్టుబడిన వాహనాలకు రూ.2 వేలు జరిమానా విధించాల్సి ఉండగా, రూ.వెయ్యి మాత్రమే విధించారు. దీనివల్ల కాంపౌండింగ్ రుసుం రూ.10.45 కోట్లు తక్కువగా వసూలైంది. చింతూరు చెక్‌పోస్ట్ వద్ద లావాదేవీలను మాన్యువల్‌గా నిర్వహించారు. రెవెన్యూ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించలేదు. వసూలైన సొమ్మును ట్రెజరీలో సరిగా జమ చేయలేదు. 2015–18 మధ్య కాలానికి సంబంధించి చింతూరు చెక్‌పోస్టు వద్ద వసూలైన రాబడిని పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని పాల్వంచ వద్ద చెక్ పోస్ట్‌లో వసూలైన రాబడితో పోల్చిచూడగా, చింతూరు వద్ద వసూలైన రాబడిలో రూ.3.09 కోట్లు వ్యత్యాసాన్ని గుర్తించారు. ఏపీలోని మూడు చెక్ పోస్ట్‌లలో 2016 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య కాలంలో వసూలైన రాబడి ట్రెజరీ జమలతో సరి పోల్చలేదు. దీనివల్ల రూ.1.49 కోట్లు ట్రెజరీలో జమ కాలేదు. అంచనాలు 147 % పెంపు టీడీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో వివిధ ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచేశారని ‘సాక్షి’ ఆది నుంచీ తెలియజేస్తూనే ఉంది. అది అక్షర సత్యమని కాగ్ నివేదిక ద్వారా మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు పాలనలో తొలుత రహదారులు, వంతెనలు, భవనాలు, ఇతర పనుల అంచనాలను రూ.35,780 కోట్లుగా పేర్కొని 2018–19 నాటికి రూ.88,254 కోట్లకు పెంచేసినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఏకంగా 147 శాతం పెంచారని కాగ్ పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.31,180 కోట్లను వ్యయం చేయగా రూ.1,585 కోట్ల మేర బిల్లులను పెండింగ్‌లో పెట్టినట్లు కాగ్ నివేదిక తెలిపింది. -
పదహారేళ్లుగా ‘సా..గు’తున్న దేవ.. దేవా!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల వినియోగమే లక్ష్యంగా పదహారేళ్ల కిందట చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ఈ పథకం పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. పూర్తికాని భూసేకరణ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, భారీ సొరంగాల నుంచి ఊరుతున్న నీటి ఊటలు పనులకు పరీక్ష పెడుతున్నాయి. ప్రాజెక్టు పనులను వేగిరం చేసేందుకు కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూరుస్తున్నా.. పనుల్లో జాప్యం జరుగుతుండటం ప్రభుత్వ పెద్దలనూ అసహనానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ నాటికైనా ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాలను విధించింది. ఈ ఎత్తిపోతల పథకాన్ని 2003–04లో రూ.6 వేల కోట్లతో ప్రారంభించారు. అంచనా వ్యయం ప్రస్తుతం రూ.13,445 కోట్లకు పెరిగింది. దీని కింద ఆయకట్టును 6.53 లక్షల ఎకరాలుగా నిర్ణయించగా, ఇంతవరకు 2.34 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. మూడు దశల పనుల్లో మొదటి రెండు దశలు పూర్తయ్యాయి. అయితే ఇంకా కొంత ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. మూడో దశ పనులు మాత్రం మొత్తంగా చిక్కుల్లో పడ్డాయి. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు భారీ టన్నెళ్లలో ఊరుతున్న నీటి ఊటలు, భూసేకరణ సమస్యతో పనులు మందగించాయి. దీనిపై అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్ స్వయంగా సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను రంగంలోకి దింపినా పనుల్లో పురోగతి లేదు. ముక్కుతూ, మూలుగుతూ ‘మూడో దశ’ ప్రాజెక్టు కోసం మొత్తంగా 31,383 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 28,793 ఎకరాలు సేకరించారు. మరో 2,590 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూసేకరణకు రూ.985 కోట్లు ఖర్చుచేశారు. ఫేజ్–3లో మొత్తంగా 12,368 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 9,778 ఎకరాలనే సేకరించారు. కోర్టు కేసులు, రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం వంటివి భూసేకరణకు అడ్డం పడుతున్నాయి. ఇక, ఫేజ్Œ›–3లోని ప్యాకేజీ–1, 2 పనులు ఇప్పటికే పూర్తికాగా, ప్యాకేజీ–3 నుంచి ప్యాకేజీ–8 వరకు పనులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్యాకేజీ–3లో రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు నీటిని తరలించేందుకు తవ్వాల్సిన 49 కిలోమీటర్ల టన్నెల్లో.. 1.46 కి.మీ. మేర టన్నెల్ నిర్మాణం సలివాగు కింది నుంచి వెళ్లాల్సి ఉంది. 853 మీటర్ల టన్నెల్ తవ్వకానికే ఏళ్లుపట్టింది. ఇక్కడ 2012లో ఎదురైన ప్రమాదం నుంచి కోలుకొని దీన్ని తిరిగి పూర్తిచేయడానికి ఏకంగా ఎనిమిదేళ్లు పట్టింది. ప్రస్తుతం సలివాగు కింద టన్నెల్ పూర్తిచేసినా, ఊట కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొన్నటి వర్షాలతో సమస్య ఇంకా పెరిగింది. డీవాటరింగ్ చేసేందుకు నెలకు డీజిల్ ఖర్చే కోటి రూపాయల వరకు ఉంటోంది. ప్యాకేజీ–4 కింద పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పనుల్ని ప్రస్తుత ఏజెన్సీ నుంచి తొలగించి మరో ఏజెన్సీకి ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్యాకేజీ–5లో 386 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, నల్లబెల్లి మండలం రుద్రగూడెం వద్ద జాతీయ రహదారి క్రాసింగ్‌తో సమస్యలున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితేనే ఫేజ్–3 కింద 2.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. పనుల తీరును ‘కాగ్’తప్పుబట్టినా.. దేవాదుల పనుల్లో జాప్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2018లోనే తప్పుపట్టింది. ప్రాజెక్టు పనుల గడువు ఇప్పటికే 8సార్లు పొడిగించినా పూర్తి చేయలేకపోయారని, దీనివల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందని ఎత్తిచూపింది. నిర్మాణ సమయంలో ప్రాజెక్టు వ్యయం రూ.6వేల కోట్లు కాగా, దాన్ని ఒకమారు రూ.9,427 కోట్లకు, తర్వాత మళ్లీ సవరించి రూ.13,445 కోట్లకు చేర్చారని ఆక్షేపించింది. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఆయకట్టుకు మాత్రం నీరందించలేకపోయారంది. ముఖ్యంగా భూసేకరణ, రహదారుల క్రాసింగ్ విషయంలో జరుగుతున్న జాప్యంతో ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో పనులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని ఇరిగేషన్ శాఖకు లక్ష్యంగా పెట్టింది. వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తాం దేవాదుల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. భూసేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులున్నాయి. సీఎం కేసీఆర్ సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తూ పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రచించాం. వచ్చే ఏడాది జూన్ నాటికి 1,200కుపైగా చెరువులకు నీళ్లిచ్చేలా పనులు ముగిస్తాం. భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మిగతా పనులకు రుణాల ద్వారా నిధుల లభ్యత ఉంది. – రజత్‌కుమార్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. -
కాగ్ ద్వారా టీటీడీ ఆడిటింగ్..!
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బడ్జెట్‌ను ఇకపై కాగ్ ద్వారా ఆడిట్ చేయాలని పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శక పాలన అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలకమండలి ఆగస్ట్ 28న నిర్ణయం తీసుకోగా, తాజాగా ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది. టీటీడీలో ప్రతి సంవత్సరం అంతర్గత ఆడిటింగ్‌తో పాటు ప్రభుత్వం ద్వారా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ నిర్వహించే విధానం కొనసాగుతోంది. టీటీడీ ఆదాయ, వ్యయాలపై తరచూ ఆరోపణలు వస్తుండటం, సామాజిక మాధ్యమాల్లో కొంతమంది దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేస్తుండటంతో, ఇలాంటి దుష్ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఇది వరకే టీటీడీలో కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో పాలకమండలి కూడా ఈ అంశంపై తాజాగా జరిగిన సమావేశంలో చర్చించింది. శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు, విరాళాలు అందించే దాతలకు భరోసా కల్పించేలా కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. 2020–21 సంవత్సరం నుంచే ఈ ప్రక్రియని ప్రారంభించాలని, సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కోరిన మేరకు 2014–15 నుంచి 2019–20 వరకు కాగ్ ద్వారా ప్రత్యేకంగా ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ పాలక మండలి తీర్మానం చేసింది. ఇదే అంశాన్ని హైకోర్టుకి తెలియపర్చాలని అధికారులనూ ఆదేశించింది. అయితే, ఇది వరకే ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్న కారణంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీటీడీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ -
వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ
సాక్షి, అమరావతి: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్ చేయించడంతోపాటు, ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్‌తో కలసి సుబ్రహ్మణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ అంశంపై స్వచ్ఛందంగానే సానుకూలంగా స్పందించింది. టీటీడీ నిధులను కాగ్‌తో ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పారు. తద్వారా టీటీడీకి భక్తులు, దాతలు విరాళాల రూపంలో ఇస్తున్న నిధుల నిర్వహణ సక్రమంగా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించింది. హైకోర్టుకు కూడా తెలియజేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. తన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పారదర్శకత, అవినీతిరహిత పాలన పట్ల సీఎం నిబద్ధతతో ఉన్నారంటూ ట్వీట్ చేశారు. చదవండి: రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా -
కాగ్‌గా బాధ్యతలు చేపట్టిన గిరీశ్ చంద్ర ముర్ము
సాక్షి,ఢిల్లీ : గిరీశ్ చంద్ర ముర్ము ఇవాళ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని కాగ్ ఆఫీసులో శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాగ్ ఆఫీసులో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన నివాళి అర్పించారు. గత వారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముర్ము జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా కశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 14వ కాగ్‌గా ముర్ము బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఒడిశాలోని మయూర్బంజ్ జిల్లా బెట్నోటి గ్రామానికి చెందిన గిరీశ్ చంద్ర 1959, నవంబర్ 21న ముర్ము జన్మించారు. గుజరాత్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన గిరీశ్ చంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు. -
విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని దేశం నుంచి పారద్రోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం, ప్రజలు సంయుక్తంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ‘రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగం కలిగి ఉండటం భారతదేశ ప్రత్యేకత. దీని రూపకల్పనతోపాటు క్లిష్టమైన సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం‘ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే దిశగా చైనా చర్యలు) భారత రాజ్యాంగం నేటికీ దేశానికి ఓ మార్గదర్శిగా దారిచూపిస్తోందన్న విషయాన్ని ఉప రాష్ట్రపతి గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాక్టర్ అంబేడ్కర్.. తన జీవితంలో చివరి క్షణం వరకు సామాజిక అసమానత, కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సాధికారతకోసం కృషిచేశారన్నారు. ‘ఇలాంటి మహనీయుల జీవితాన్ని, వారు చూపిన ఆదర్శాలను గుర్తుచేసుకుని.. వాటినుంచి మనతోపాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడమే.. వీరి విగ్రహాలను ఏర్పాటుచేయడం వెనక ఉద్దేశం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఆయన గుర్తుచేశారు. ‘2022 కల్లా కాగితరహిత కార్యలాపాలు నిర్వహించాలన్న కాగ్ నిర్ణయం ముదావహం’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, డిప్యూటీ కాగ్ అనితా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. (కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర) -
ఉద్యోగుల కష్టార్జితాన్ని కాజేసింది!
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల పెన్షన్‌కు గత సర్కారు కన్నం వేసింది. టీడీపీ సర్కారు 2017–18లో ఆర్థిక ఏడాది ముగింపు నాటికి రూ.730.94 కోట్ల సీపీఎస్ సొమ్మును నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. సీపీఎస్ సొమ్మును సక్రమంగా వినియోగించకపోవడంతో ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం, వడ్డీ రేటులో అనిశ్చితి ఏర్పడిందని కాగ్ తెలిపింది. ఈ డబ్బులను బ్యాంకుకు జమ చేయనందున ఉద్యోగులకు రావాల్సిన వడ్డీ రాదని, దీన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇతర అవసరాలకు వాడకం.. సీపీఎస్ ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెల పది శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం మినహాయిస్తుంది. మరో పది శాతం సొమ్మును కలిపి నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్‌కు జమ చేయాలి. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగుల వాటా సొమ్ముతో పాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన పది శాతం సొమ్మును ఇతర అవసరాలకు వాడేసింది. సీపీఎస్‌లో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, దీన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దీనిపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
గత సర్కారు నిర్వాకం.. 29,616.29 కోట్ల భారం
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ ప్రణాళికా రాహిత్యం, అవగాహన లేమి, చిత్తశుద్ధి లోపించడం సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా పరిణమించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తేల్చి చెప్పింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను ప్రాజెక్టులకు ఖర్చు చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటని తప్పుబట్టింది. పనుల్లో తీవ్ర జాప్యం చేయడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగి రాష్ట్ర ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడిందని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వాటి ఫలాలు రైతులకు అందలేదని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీసిందని స్పష్టం చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు నిధులను ఖర్చు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని పేర్కొంది. 2017–18కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన ‘కాగ్’ గత సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ బుధవారం శాసనసభకు నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ కాగితాల్లోనే కేపిటల్ వ్యయం... ► రాష్ట్రంలో 2014–15 నుంచి 2017–18 వరకు బడ్జెట్లో కేపిటల్ వ్యయం కింద కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో టీడీపీ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ఈ వ్యవధిలో గత సర్కార్ 27 సాగునీటి ప్రాజెక్టులపై రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. ► కేటాయించిన మేరకు వ్యయం చేసి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. పనుల్లో జాప్యం వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.28,423.64 కోట్ల నుంచి రూ.58,039.93 కోట్లకు పెరిగింది. దీనివల్ల ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడింది. రైతులకు అందని ఫలాలు.. ► గత సర్కారు నాలుగేళ్లలో 27 సాగునీటి ప్రాజెక్టులకు రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లందించిన దాఖలాలు లేవు. అంటే ప్రాజెక్టుల ఫలాలు రైతులకు దక్కలేదన్నది స్పష్టమవుతోంది. ► 2017–18లో చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయలేదు. చింతలపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.311.60 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.113.28 కోట్లను ఖర్చు చేయకపోవడంతో నిష్ఫలమయ్యాయి. దీంతో పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ► సకాలంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం వల్ల రైతులకు వాటి ఫలాలు అందకపోకగా పనుల అంచనా వ్యయం రూ.582.41 కోట్లకు పెరిగింది. ► బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి ఉంటే అధిక శాతం ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలు అందేవని, తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేదని కాగ్ తేల్చింది. -
నిధులు కేటాయించి చేతులెత్తేశారు
సాక్షి, అమరావతి: పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత చందంగా సాగిన తెలుగుదేశం పార్టీ గత పాలనను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సైతం కడిగేసింది. చంద్రబాబు హయాంలో బడ్జెట్ కేటాయింపులు భారీగా చేసి.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి ఖర్చు చేయకుండా చేతులెత్తేసిన వైనాన్ని తేటతెల్లం చేసింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి విద్యారంగంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులను భారీగా చూపించి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపింది. అప్పటి బడ్జెట్లో కేటాయించిన మొత్తం 34,602.10 కోట్లు ఖర్చు చేయలేదు. ప్రతి కేటాయింపులో 21 విభాగాల గ్రాంట్లకు సంబంధించిన మొత్తం 24,357.29 కోట్లు మిగిలిపోవడంపై కాగ్ కడిగి పారేసింది. 8 విభాగాల్లో 20 శాతానికి మించి మిగిలిపోయిన మొత్తం 21,079.14 కోట్లుగా ఉండటం విశేషం. మొత్తం గ్రాంట్లలో రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేయకుండా ఉంచేసిన విభాగాలు రెండు ఉన్నాయి. ఆర్థిక పాలన, ప్రణాళిక, సర్వే, గణాంకాలు, పాఠశాల విద్య విభాగాల్లో బడ్జెట్లో భారీగా నిధులు చూపి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపారు. అంతకు ముందూ అంతే.. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా అంతకు ముందు మూడేళ్లలోనూ తెలుగుదేశం ప్రభుత్వ ఘనకార్యం ఇదేనని కాగ్ ఆక్షేపించింది. బడ్జెట్లో కేటాయింపులు, వాస్తవానికి చూస్తే ఎలాంటి ఖర్చు చేయకుండా మిగులుగా చూపించడం అప్పటి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ఆర్థిక పాలన, ప్రణాళిక, సర్వే, గణాంకాలు, పాఠశాల విద్య విభాగాల్లో బడ్జెట్లో భారీగా నిధులు చూపి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపారు. అప్పులు చేసి దుబారా అప్పులు తెచ్చి దుబారా చేయడం వల్ల టీడీపీ సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థికంగా చావుదెబ్బ తీసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తేల్చింది. 2018 మార్చి నాటికి అప్పులు రూ.2,23,706 కోట్లకు పెరిగాయని.. ఆ మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. చేసిన అప్పులు చాలక.. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి 231 రోజులు చేబదులుగా (వేజ్ అండ్ మీన్స్), ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో రూ.45,860.75 కోట్లను తీసుకుని.. వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల రూ.44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందంటూ ఎత్తిచూపింది. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కారు వైఫల్యానికి ఇదో తార్కాణమని కాగ్ పేర్కొంది. 2017–18 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై అధ్యయనం చేసిన కాగ్.. టీడీపీ సర్కార్ దుబారాను ఏకిపారేస్తూ బుధవారం శాసనసభకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ప్రధాన అంశాలివీ.. ► 2015–16 నుంచి 2017–18 మధ్య కాలంలో ద్రవ్యలోటును అదుపు చేయడంలో విఫలం. ► అప్పులు చేసి ఆస్తులు కల్పించాల్సిన సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. దుబారా ఖర్చులు చేసి.. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేసింది. దీనివల్ల మార్చి, 2018 నాటికి అప్పుల భారం రూ.2,23,706 కోట్లకు పెరిగింది. ► తీసుకున్న రుణాలతో పోలిస్తే తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్పత్తి 2016–17లో 18.27 శాతం నుంచి 2017–18లో 33.51 శాతానికి పెరిగింది. ► కొత్తగా చేసిన అప్పులను పాత అప్పులు తీర్చడం కోసం మళ్లించారు. దీని వల్ల రాబోయే ఏడేళ్లలో తీర్చాలిన రుణం రూ.91,599.32 కోట్లకు పెరిగింది. రోడ్లలోనూ లూటీ! టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలను ‘కాగ్’ తప్పుబట్టింది. 2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించి పలు అంశాలపై కాగ్ నివేదిక బుధవారం విడుదలైంది. కాగ్ నివేదికలో ఏముందంటే.. ► గత సర్కారు హయాంలో రూ.180.32 కోట్లు ఖర్చు పెట్టి 352 కి.మీ మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించి కేటాయించిన నిధులలో 99.50 శాతం (రూ.179.41 కోట్లు) వెచ్చించి కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని కాగ్ తప్పుబట్టింది. వైఫల్యానికి కారణాలు కూడా వెల్లడించలేదని నివేదికలో పేర్కొంది. ► ఏపీ గ్రామీణాభివృద్ధి చట్టం–1996 సెక్షన్ 7 ప్రకారం గత ఏడాదిలో వసూలు చేసిన గ్రామీణాభివృద్ధి సెస్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి నిధికి బదలాయించాలి. 2016–17 ఆర్థిక ఏడాదిలో రూ.552.41 కోట్లు సెస్ రూపంలో వసూలైనప్పటికీ గ్రామీణాభివృద్ధి నిధికి కేవలం రూ.322.36 కోట్లు మాత్రమే బదలాయించారు. రూ.230.05 కోట్ల మేర నిధులను తక్కువగా బదలాయించారు. -
రైతు సంతకంతోనే రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రైతులు తమ సంతకంతో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే రుణమాఫీ అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాంకుల వద్ద ఉన్న రైతు రుణాలు, వడ్డీ సమాచారంతో ఆ ధ్రువీకరణ పత్రం ఉండాలని అధికారులు అంటున్నారు. ఒకవేళ అలా లేకుంటే ఆయా రైతులకు రుణమాఫీ అమలు చేయడం కుదరదని చెబుతున్నారు. గతంలో రుణమాఫీ అమలు చేసినప్పుడు పారదర్శకతపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ఈసారి రైతు స్వీయ ధ్రువీకరణ చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లేకుంటే గ్రామ సభలు పెట్టి అర్హులైన రైతుల సంఖ్య తేల్చాలన్న నిబంధనను కూడా తెరపైకి తెస్తున్నారు. 2014లో రుణమాఫీ అమలు సమయంలో అర్హులైన రైతుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించినా కొందరు అర్హులకు రుణమాఫీ జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రుణమాఫీ అందని కొందరు రైతులు ఉన్నతస్థాయి వరకు వెళ్లి పోరాడారు. అలాగే ఆడిట్ అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. రుణమాఫీ పొందిన వారంతా రైతులనే గ్యారంటీ ఏంటంటూ కాగ్ ప్రశ్నించింది. గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించామని వ్యవసాయశాఖ ఇచ్చిన వివరణతో కాగ్ ఏమాత్రం సంతృప్తి చెందలేదని అధికారులు అంటున్నారు. గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదని, రుణమాఫీ లబ్ధిదారులంతా రైతులేనని ఎవరు ధ్రువీకరించారని కాగ్ నిలదీసింది. ఈ నేపథ్యంలోనే రైతుల స్వీయ ధ్రువీకరణ అంశాన్ని వ్యవసాయశాఖ తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల ఎక్కడైనా అక్రమాలు జరిగితే అప్పుడు రైతునే బాధ్యుడిని చేసే అవకాశముందని అంటున్నారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. మాఫీ సొమ్ము నేరుగా మాకే బదిలీ చేయాలి రుణమాఫీపై బ్యాంకర్లు, అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేయాలి? ఎంత చేయాలి? వడ్డీ వివరాలు ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. అధికార టీఆర్ఎస్ రూ. లక్షలోపు రైతు రుణమాఫీ అమలుకు గతేడాది డిసెంబర్ 11ను కట్ ఆఫ్ తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే అప్పటి వరకు రైతులు తీసుకున్న సొమ్ములో రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సర్కారు ప్రకటించింది. అంటే ఏడాదిగా అనేక మంది రైతుల బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసింది. అప్పుడు 35.29 లక్షల మంది రైతులకు రూ. 16,138 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. ఈసారి రుణమాఫీ సొమ్ము మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. వ్యవసాయ వర్గాల సమాచారం ప్రకారం రూ. 26 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా బ్యాంకర్లు మాత్రం అలా చేయవద్దని, గతంలోలాగా తమకే అందజేయాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ కార్డుల పద్ధతి లేదా రైతుబంధు నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి వేసినట్లుగా ఏదో ఒక పద్ధతిలో రుణమాఫీ సొమ్మును జమ చేస్తామని అధికారులు చెబుతుండగా అలా చేస్తే రైతులు బకాయిలు చెల్లించరని బ్యాంకర్లు అంటున్నారు. రైతులు ఇతర బ్యాంకు ఖాతాలు చూపించి వాటిల్లో జమ చేసుకునే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలపై తర్జనభర్జన రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీపై తర్జనభర్జన జరుగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి బంగారంపై తీసుకున్న రుణాలను పంట రుణాలుగా పరిగణించబోమని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తింపజేయాలా వద్దా? అనే చర్చ జరుగుతోంది. దీనిపై బ్యాంకర్ల మధ్యే భిన్నాభిప్రాయాలున్నాయి. ఆర్బీఐ నిబంధన ప్రకారం మాఫీ చేయొద్దని కొందరు అంటుంటే మాఫీ చేయాలని మరికొందరు అంటున్నారు. ఆ ప్రకారం బ్యాంకర్లు వేర్వేరుగా జాబితాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 5.56 లక్షల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ. 5,253 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ బకాయిలు మాఫీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2014లో రుణమాఫీ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి పట్టణాల్లో గోల్డు లోన్లు తీసుకున్న రైతులకు మాఫీ చేయలేదు. కుటుంబమే యూనిట్‌గా...? 2014లో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని రుణమాఫీ చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో కలిపి ఒక కుటుంబంగా పరిగణించారు. అంతకుమించి వయసుంటే మరో కుటుంబంగా గుర్తించారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత లేదు. ఈసారీ కుటుంబం యూనిట్‌గానే రుణమాఫీ చేస్తారని అంటున్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే సర్కారు ఆర్థిక భారం తగ్గుతుంది. దీనిపై పెద్దగా అభ్యంతరాలు లేవు. కుటుంబమే యూనిట్‌గా రుణమాఫీ జరగవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
రైల్వేల పనితీరు దారుణం
న్యూఢిల్లీ: రైల్వే శాఖ పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. 2017–18 సంవత్సరంలో రైల్వేల నిర్వహణ రేషియో 98.44 శాతం అంతకుముందు పదేళ్ల కంటే అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈమేరకు సోమవారం పార్లమెంట్‌కు ఓ నివేదికను సమర్పించింది. రైల్వే శాఖ ఆదాయ, వ్యయాల రేషియోను బట్టి నిర్వహణలో సమర్థత, ఆర్థిక బాగోగులను అంచనా వేస్తారు. ‘ఎన్టీపీసీ, ఇర్కాన్ సంస్థల నుంచి అడ్వాన్సులు అందడంతో 2017–18 సంవత్సరాల కాలంలో రూ.1665.61 కోట్ల మిగులుంది. అదే లేకుంటే రూ.5,676.29 కోట్లు లోటు మిగిలేది. ఆ శాఖ ప్రతి రూ.100 ఆదాయంలో రూ.98.44 ఖర్చు పెట్టింది. ఈ రేషియో గత పదేళ్ల కంటే అధ్వానం. అడ్వాన్సులను మినహాయిస్తే నిర్వహణ రేషియో 102.66కు పెరిగి ఉండేది’అని పేర్కొంది. ‘ప్రయాణికులు, కోచ్ సర్వీసుల నిర్వహణ వ్యయాలను కూడా రైల్వేలు నియంత్రించుకోలేదు’అని తెలిపింది. -
రూ. 45,770 కోట్లు తప్పనిసరి ఖర్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తప్పనిస రి ఖర్చు గుదిబండగా మారుతోంది. రెవెన్యూ వ్యయంలో సగం ఉద్యోగుల జీతభత్యా లు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్ కోసమే ఖర్చవుతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయంలో 54% తప్పనిసరి ఖర్చులకే వెచ్చించిందని కాగ్ తెలిపింది. రెవెన్యూ వ్యయం రూ.88,824 కోట్లలో రూ.45,770 కోట్లు జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకు ఖర్చు చేసినట్లు తేల్చింది. ఆర్థిక ఇబ్బందులు(ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వం ఇక్కట్లు) సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వం 2017–18 ఆర్థిక సంవత్సరంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొందని కాగ్ నివేదిక తెలిపింది. దీని ప్రకారం ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఆర్థిక నియంత్రణ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడు రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి నిధులు సమకూర్చుకున్నట్టు తెలిపింది. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం ద్వారా రూ.765 కోట్లు ప్రభుత్వం సమకూర్చుకుందని చెప్పింది. 127 రోజులపాటు వేస్ అండ్ మీన్స్ (రోజు వారీ ఖర్చుల కోసం)కు వెళ్లిందని, దీని ద్వారా రూ.10,789 కోట్ల సమకూర్చు కుందని తేల్చింది. మరో 204 రోజుల పాటు రిజర్వ్ బ్యాం క్ ఇచ్చే స్పెషల్ విత్‌డ్రాయల్ సౌకర్యా న్ని వాడుకుని రూ.11,278 కోట్లు తెచ్చుకుందని చెప్పింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఓడీ, వేస్ అండ్ మీన్స్, స్పెషల్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని దాదాపు రూ.22 వేల కోట్లు రాబట్టుకుని ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టినట్టు వెల్లడించింది. కాగ్ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అవకతవకలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో భాగంగా జరిగే కొన్ని తప్పనిసరి సర్దుబాట్లు, పద్దుల మార్పులు లాంటి అంశాలను ఆర్థిక అవకతవకల కింద కాగ్ తప్పుపడుతుంది. అలాంటి వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద రూ.1,500 కోట్లు ఉన్నాయంది. కాళేశ్వ రం ప్రాజెక్టు భూసేకరణకు వాడిన ఈ నిధుల వినియో గం విషయంలో నిబంధనల ప్రకారం ఉపయోగించిన పద్దులను మార్చారని ఆక్షేపించింది. రుణమాఫీ కింద అంతకు ముందు ఏడాది మిగిలిన రూ.2 కోట్లకు పైగా నిధులను సరిగా జమ చేయలేదని తెలిపింది. -
9... నెమ్మది!
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై కాగ్ పెదవి విరిచింది. బడ్జెట్ కేటాయింపులకు తగినట్లుగా నిధు లు వాడుకోకపోవడాన్ని తప్పుబట్టింది. 2017–18 ఆర్థిక సం వత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్ ఆదివారం శాసనసభ ముందుంచింది. ఆర్ అండ్ బీ, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య, పురపాలన, గృహనిర్మాణ, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, భారీ, మధ్య తరహా నీటిపారుదల, వాణిజ్య, పరి శ్రమల శాఖలు నిధులు వాడుకోకపోవడంతో మురిగిపోయాయని తేల్చింది. నిధులు ఖర్చు పెట్టని శాఖల్లో మున్సిపల్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. నిధులను సద్వినియోగం చేసుకోని ఈ శాఖలను నిధులు పొదుపు చేశారంటూ కాగ్ ఎద్దేవా చేసింది. నిధులు వాడుకోకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యసాధనలో వెనుకబడ్డాయని పేర్కొంది. -
సంక్షేమం స్లో...
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలకు ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో అర్హులకు లబ్ధి చేకూరలేదని కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. ఇందులో పలు సంక్షేమ పథకాల అమలు తీరును ప్రస్తావిస్తూ నిధులివ్వని కారణంతో లబ్ధిదారులకు సాయం అందించలేకపోవడాన్ని ప్రస్తావించింది. కేసీఆర్ కిట్ పథకానికి రూ.605 కోట్ల బడ్జెట్ నిర్ధారిస్తే రూ.271.07 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. దీని కింద 6 లక్షల మంది లబ్ధిదారులు నమోదవుతారని భావించినా 6.57 లక్షల మంది నమోదయ్యారు. దీంతో బడ్జెట్ కేటాయింపులకు తగినట్లు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దాదాపు రూ.274.23 కోట్లకు సంబంధించిన బిల్లులు ఆర్థిక శాఖ ఆమోదించకపోవడంతో పథకం వెనుకబడిపోయిందని కాగ్ తెలిపింది. ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు రూ.429 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే రూ.176.32 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.ప్రభుత్వం నిధులను స్తంభింపజేయడంతో కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయి లో ఉపయోగించుకోనట్లు కాగ్ తెలిపింది. కల్యాణలక్ష్మి పరిస్థితి కూడా అంతే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉన్నట్లు కాగ్ గుర్తించింది. కల్యాణలక్ష్మి కింద బీసీ సంక్షేమ శాఖకు రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే రూ.382.42 కోట్లు ఖర్చు చేసింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తే కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా రూ. 276.87 కోట్లు అవసరమని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆ నిధులివ్వలేదు. నిధుల సమస్య కారణంగా పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని క్యారీఫార్వర్డ్ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కాగ్‌కు వివరించింది. బీసీలను గుర్తించలేదు.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమంకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ లక్ష్య సాధన ప్రశ్నార్థకంగా మిగిలినట్లు కాగ్ అభిప్రాయపడింది. ఈ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తే చైర్మన్, ఉద్యోగుల వేతనాల కింద రూ.4.06 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అత్యంత వెనుకబడిన కులాలను ప్రభుత్వం గుర్తించకపోవడం, ఎంబీసీ కార్పొరేషన్ తయారీకి రూపొందించి న కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో నిధులు వినియోగం కాలేదని కాగ్ పేర్కొంది. చేనేత కార్మికులకు సాయం కింద కేటాయించిన రూ.1,200 కోట్ల లో రూ.444.98 కోట్లు విడుదల చేసింది. 30 వేల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా 20 వేల మందికి మాత్రమే పథకాలను వర్తింపజేశారు. పరిశ్రమల శాఖ ద్వారా కేవలం రూ.313.60 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, మిగతా రూ.131.38 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు కాగ్ గుర్తించింది. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టాల్సిన మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం 0.32 శాతమే సాధించినట్లు కాగ్ పేర్కొంది. భూపంపిణీ పథకానికి సంబంధిం చి పురోగతి సంతృప్తికరంగా లేదని తెలిపింది. సాధించింది శూన్యం.. పట్టణ పేదలకు గృహ నిర్మాణాల విషయంలో 2017–18 సంవత్సరానికి గాను రూ.1,000 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసిం ది రూ.75 కోట్లు మాత్రమేనని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఆ సంవత్సరంలో 2.8 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండ గా, సాధించింది శూన్యమని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టలేకపోయామని గృహనిర్మాణ సంస్థకు వెల్లడించినట్టు కాగ్ తెలిపింది. dissatisfaction with -
రూ.91,727 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్ :రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. నిర్మాణాలు పూర్తిచేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించింది. రెండేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టులు పదేళ్లు దాటినా పూర్తికాలేదని, దీంతో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగాయని తెలి పింది. 19 ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న జాప్యం వల్ల ప్రభుత్వంపై రూ.91,727 కోట్ల భారం పడిందని పేర్కొం ది. ఆదివారం శాసనసభలో 2017– 18 ఏడా దికి సంబంధించి సమర్పించిన కాగ్ నివేదికలో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించింది. 2018 మార్చి నాటికి రాష్ట్రంలో నిర్మాణ దశలో ప్రాజెక్టులు 36 ఉన్నాయని తెలిపిన కాగ్.. ఇందులో 19 ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల మేర జాప్యం జరిగిందని తెలిపింది. దీంతో ఈ 19 ప్రాజెక్టుల అంచనావ్యయం రూ.41,201 కోట్లుకాగా, ఇప్పుడు రూ.1,32,928 కోట్లకు పెరిగిందని, దీంతో రూ.91,727 కోట్ల భారం పడిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా అవి ఇంకా పూర్తికాలేదని తెలిపింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంతో జాప్యం, ఖర్చుల మీద ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఆశించిన ప్రయోజనాలను, ఆర్థిక వృద్ధిని రాష్ట్రానికి రాకుండా చేసిందని తెలిపింది. ఏఐబీపీ ప్రాజెక్టులూ అంతే.. కేంద్ర పథకం సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల పూర్తిలోనూ జాప్యం జరుగుతోందని కాగ్ తెలిపింది. దేవాదుల, ఎస్సారెస్పీ–2, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టులు చేపట్టి దశాబ్దాలు గడిచినా అవి పూర్తి కాలే దని చెప్పింది. నీటిలభ్యతలో కొరత కారణంగా వాటి పనుల స్వరూపాలు, అంచనాలు మారిపోయాయని, ఈ ప్రాజెక్టుల కింద రూ.16,135 కోట్లు ఖర్చు చేసినా, సాగునీటి వసతుల కల్పన, నీటివినియోగంలో అంతంతమాత్రమే ప్రగతి సాధించిందని పేర్కొంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి కారణాలతో ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం ఏర్పడిందని తెలిపింది. ఈ దృష్ట్యా సాగునీటి రంగం మీద పెడుతున్న భారీ ఖర్చుకు అనుగుణంగా ఏర్పడుతున్న ప్రయోజనాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం వాటి ఫలితాలను సంకలనం చేయాలని, ఈ ఫలితాలు సాగునీటి రంగంలో భవిష్యత్తు పెట్టుబడులకు మార్గసూచిక కావాలని పేర్కొంది. -
మిగులు కాదు.. లోటే !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మిగులు ఆదాయం గల రాష్ట్రం కాదని, వాస్తవానికి ఆదాయలోటు ఉందని కాగ్ కుండబద్దలు కొట్టింది.వాస్తవానికి రూ.284.74 కోట్ల రెవెన్యూలోటు ఉండగా, రూ.3743.47 కోట్ల రెవెన్యూ మిగులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా చూపిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. పద్దులను తప్పుగా వర్గీకరించడం, తప్పనిసరిగా జమ చేయాల్సిన చట్టబద్ధ నిధులకు కోతలు పెట్టడం, రాయితీలు, సహాయక గ్రాంట్లను రుణాలుగా చూపడం వంటి కారణాలతో రెవెన్యూ మిగులును రూ.3743.47 కోట్ల మేర ఎక్కువగా, ద్రవ్యలోటును రూ.954.60 కోట్ల మేర తక్కువగా చూపెట్టిందని మొట్టికాయలు వేసింది. వాస్తవానికి తెలంగాణ రూ.284.74 కోట్ల ఆదాయలోటు, రూ.27,654.60 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉందని స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి 3.50 శాతానికి మించి 3.55 శాతం ద్రవ్యలోటు ఉందని తేల్చింది. 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ రూపొందించిన ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు.. రూ.1,42,918 కోట్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 31 నాటికి రూ.1,42,918 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం అప్పులు పెరిగిపోయాయి. వడ్డీ చెల్లింపులు క్రమంగా పెరిగి ఆదాయ రాబడులను మింగేస్తున్నాయి. రెవెన్యూరాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19 శాతానికి పెరిగిపోయాయి. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.31 శాతం పరిమితి కన్నా రాష్ట్రం అధికశాతం వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. వచ్చే ఏడేళ్లలో రూ.65,740 కోట్ల అప్పులను తీర్చాల్సి ఉంటుంది. బడ్జెట్ అంచనాలు తలకిందులు.. వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు రూ.24,259 కోట్లు తగ్గాయి. 2017–18లో రూ.88,824 కోట్ల రాబడి రాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.6,006 కోట్లు అధికం. రూ.85,365 కోట్ల రెవెన్యూ వ్యయం జరగగా, బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రూ.23,147 కోట్లు తక్కువే. ఈ నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు, వాస్తవాలకు మధ్య అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. 2015–16 మధ్యకాలంలో రెవెన్యూరాబడి, రెవెన్యూ వ్యయం పెరిగాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)తో పోలిస్తే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం రెండూ తగ్గాయి. 2016–17తో పోలిస్తే 2017–18లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం వృద్ధిరేటు తగ్గింది. పన్నుల వసూళ్లలో సమర్థత మూడేళ్లగా రాష్ట్రం పన్నుల వసూళ్లకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం పన్నుల వసూళ్లలో సమర్థతకు నిదర్శనమని కాగ్ ప్రశంసించింది. రూ.84,006 కోట అభివృద్ధి వ్యయం, రూ.23,902 కోట్ల పెట్టుబడి వ్యయంతో సాధారణ హోదా గల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపింది. విద్యారంగంలో మాత్రం వెనుకబడిందని అభిప్రాయపడింది. ఇలా అయితే సీపీఎస్ దివాలా కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్) కింద 2017–18లో ఉద్యోగులు తమ వాటాగా రూ.481.61 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం రూ.431.74 కోట్లను జమ చేసింది. ప్రభుత్వం రూ.49.87 కోట్లు తక్కువగా జమ చేసింది. 2016–17లో రూ.71.91 కోట్లు, 2014–15లో రూ.20.01 కోట్లను ఇలానే తక్కువగా చెల్లించింది. ప్రభుత్వవాటా తక్కువగా జమ చేయడం, పింఛను నిధిలోని నిల్వలపై వడ్డీలు చెల్లించకపోవడం వంటి చర్యలను సరిదిద్దకపోతే జాతీయ పింఛను వ్యవస్థ మూలనిధి దివాలాతీసే ప్రమాదముందని, దీనితో ఉద్యోగులు నష్టపోతారని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. జాప్యంతో తడిసి మోపెడైన ప్రాజెక్టుల వ్యయం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల వరక జరిగిన జాప్యం కారణంగా 19 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.41,201 కోట్ల నుంచి రూ.1,32,928 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా ఇంకా పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టుల వల్ల కలిగిన ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంలేదని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కాగ్ పేర్కొంది. 2014–18 మధ్యకాలంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.79,236 కోట్లు ఖర్చు చేసింది. 2016–17 మినహాయిస్తే 50 శాతానికిపైగా పెట్టుబడిని సాగునీటి ప్రాజెక్టులపైనే పెట్టింది. సంక్షోభంలో డిస్కంలు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై రాష్ట్ర ప్రభుత్వచర్యలు ప్రతికూల ప్రభావం చూపాయి. 2017–18లో ప్రభుత్వరంగ సంస్థలకు వచ్చిన నష్టాల్లో 94 శాతం విద్యుత్ రంగానికి చెందినవే. రూ.6,202 కోట్ల నష్టాల్లో డిస్కంలు కూరుకుపోయాయి. డిస్కంలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలం టే ప్రభుత్వ బకాయిలను విడుదల చేయడంతోపాటు విధానపర నిర్ణయాల అమలుతో కలిగే నష్టపరిహారాన్ని చెల్లించాలని సిఫారసు చేసింది. పూర్తికాని పంపకాలు రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్లు పూర్తి అవుతున్నా రూ.1,51,349.67 కోట్ల ఆస్తులు, రూ.28,099.68 కోట్ల రుణాల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. షెడ్యూల్ 9లోని 91 సంస్థల విభజన జరగాల్సి ఉండగా, నిపుణుల కమిటీ 86 సంస్థల విభజనకు సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థల విభజనకు మాత్రమే సమ్మతించింది. ఖర్చుల లెక్కలేవి... అత్యవసర ఖర్చుల బిల్లులను నిర్దేశిత గడువులోగా సమర్పించడం లేదని కాగ్ అభ్యంతరం తెలిపింది. ఇలా చేయడం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, ఇలాంటి అవాంఛనీయ ధోరణలతో ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. 2,164 అత్యవసర బిల్లుల ద్వారా రూ.280.45 కోట్లను డ్రా చేశారని, వీటికి సంబంధించిన బిల్లులను సమర్పించలేదని తెలిపింది. రూ.81.64 కోట్లు విలువ చేసే అత్యవసర బిల్లులు రాష్ట్ర విభజనకు ముందు నాటివని పేర్కొంది. -
అప్పు.. సంపదకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తెచ్చిన అప్పులను మూలధన వ్యయం కింద సంపద సృష్టి కోసం ఖర్చు చేస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కితాబు ఇచ్చింది. సమీకరించిన రుణాలేగాకుండా.. కొంత రెవెన్యూ ఆదాయాన్ని కూడా పెట్టుబడి వ్యయం కింద వెచ్చించిందని తేల్చింది. ఈ మేరకు 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం శాసనసభ ముందుంచిన కాగ్ నివేదికలో ప్రభుత్వ అప్పులను ఖర్చు చేసే విధానం ఉపయుక్తంగానే ఉందని అభిప్రాయపడింది. అప్పులను సంపద సృష్టి కోసం వెచ్చించడ వివేకంతో కూడిన ఆర్థిక నిర్వహణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కింద రూ.26,231 కోట్లు తీసుకొచ్చిందని కాగ్ తన లెక్కల్లో తేల్చింది. ఈ అప్పుల కింద తెచ్చినవాటికి అదనంగా మరో రూ.3,880 కోట్లు కలిపి మొత్తం రూ.30,111 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరమేగాక అంతకుముందు మూడేళ్లు కూడా రుణాలను ఇదేరీతిలో ఖర్చు పెట్టినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. -
ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక లోటును తీర్చే క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 2017లో జాతీయ స్థాయిలో వినియోగ పన్నును ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని భావించారు, కానీ పన్ను ఎగవేతల కారణంగా లక్ష్యాలు నెరవేరలేదని కాగ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా పన్ను లక్ష్యాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. అయితే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా పన్ను ఎగవేతదారులు పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించకపోవడం ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో వినియోగ వస్తువుల కారణంగానే 60శాతం వృద్ది రేటు నమోదవుతుంది. కానీ బ్యాంకింగ్ రంగంలో నిధుల లేమి కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినియాగ పన్ను వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావించినా నకిలీ బిల్లులు, ఆడిటింగ్ మాయాజాలంతో ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితాలు సాధించడంలేదని పీడబ్లూసీ అనే సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రతిక్ జైన్ తెలిపారు. జీడీపీ వృద్ది రేటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద సవాల్ అని నిపుణులు విశ్లేషించారు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల వృద్ధితో భారత్‌ను పోల్చడం సరికాదని, త్వరలోనే ఆర్థిక వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పబ్లిక్ ఫైనాన్స్ ప్రొఫెసర్ సచ్చిదానందా ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాజధానిలో ‘కమీషన్ల’ నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దోచేశారని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. ఈ మేరకు నివేదిక సమర్పించింది. అయినా ప్రభుత్వ పెద్దలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దోపిడీలో మరింత దూకుడు ప్రదర్శించారు. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణ వ్యయాన్ని కూడా భారీగా పెంచేశారు. తమ కోటరీలోని మూడు కాంట్రాక్టు సంస్థలకే పనులు అప్పగించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకున్నారు. నాలుగున్నరేళ్లుగా రాజధానిలో శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల గురించి పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు ‘శాశ్వత ప్రభుత్వ భవనాల సముదాయం’ నిర్మాణానికి హడావుడిగా టెండర్లు ఆహ్వానించింది. ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 మించి కాదని నిపుణులు అంటున్నారు. కానీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.19,707.24కు పెంచేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, మొబిలైజేషన్లు అడ్వాన్స్‌లు ఇచ్చి, కమీషన్లు నొక్కేశారు. భూమి, ఇసుక, కంకర ఉచితం.. అయినా అంత వ్యయమెందుకు? రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు(ఎక్సెస్) కాంట్రాక్టర్లకు అప్పగించారని ‘కాగ్’ స్పష్టం చేసింది. చిన్నపాటి వర్షం కురిసినా లోపల నీరు కారే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థలకే శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణ టెండర్లను అప్పగించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం కంటే శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం అధికంగా ఉండడం గమనార్హం. శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల పేరుతో ఐదు టవర్ల నిర్మాణాన్ని 30 లక్షల చదరపు అడుగుల్లో చేపట్టాలని తొలుత నిర్ణయించారు. టెండర్ల దగ్గరకు వచ్చేసరికి అది 69 లక్షల చదరపు అడుగులకు పెరిగిపోయింది. 69 లక్షల చదరపు అడుగుల్లో ఐదు టవర్ల నిర్మాణానికి రూ.13,598 కోట్ల వ్యయం అవుతుందని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంటే చదరపు అడుగుకు రూ.19,707.24 చొప్పున ఖర్చవుతుంది. ఆ అంచనా వ్యయాన్ని చూసి అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. భూమి ఉచితమే, ఇసుక, కంకరను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.19,707.24 ఎలా అవుతుందని అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల ఖర్చును కలిపినా ఇంత పెద్ద ఎత్తున వ్యయం కాదని, ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి. కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లిస్తారట! ఐదో టవర్ నిర్మాణాన్ని సాధారణ పరిపాలన శాఖ ‘ఎన్సీసీ’ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. మూడు, నాలుగో టవర్ల పనులను ఎల్అండ్టీకి అప్పగించారు. ఒకటి, రెండో టవర్ల పనులను షాపూర్జీ పల్లోంజీకి కట్టబెట్టారు. ఈ ఐదు టవర్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఫీజుతోపాటు జీఎస్టీ కలిపి కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. రహదారుల నిర్మాణంలోనూ చిలక్కొట్టుడే.. రాజధానిలో ఏ పనులకైనా ముందుగానే అంచనా వ్యయాలను భారీగా పెంచేస్తున్నారని సీఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. రాజధానిలో రహదారుల నిర్మాణం విషయంలోనూ ముందుగానే అంచనా వ్యయాలను పెంచేసి, టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కిలోమీటర్ రహదారి నిర్మాణ వ్యయాన్ని రూ.27.92 కోట్ల నుంచి రూ.34 కోట్లకు పెంచేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారు. రాజధానిలో 36.68 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ వ్యయాన్ని రూ.1,024.33 కోట్లుగా నిర్ధారించారు. అంటే కిలోమీటర్‌కు రూ.27.92 కోట్లు అవుతుంది. రాజధానిలోనే మరో 30.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ వ్యయాన్ని రూ.1,028.21 కోట్లుగా నిర్ధారించారు. అంటే కిలోమీటర్‌కు రూ.34 కోట్ల వ్యయం అవుతుంది. సాధారణంగా నాలుగు లేన్ల జాతీయ రహదారుల నిర్మాణంలో కిలోమీటర్ వ్యయం రూ.15 కోట్లకు మించడం లేదు. రాజధాని అమరావతిలో ఆ వ్యయం అంతకు రెండింతలు కావడం విశేషం. ఖర్చు ఎక్కువ..నాణ్యత తక్కువ 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టారు. తరువాత మరమ్మతుల పేరుతో చదరపు అడుగుకు రూ.11,000కు పైగా వ్యయం చేశారు. అయినా తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. తాత్కాలిక సచివాలయం పేరిట రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వినియోగ పత్రాలను పంపించింది. కొత్త ప్రభుత్వం సమీక్షించాలి టీడీపీ ప్రభుత్వ పెద్దలు రాజధానిలో తాత్కాలిక, శాశ్వత భవనాలు, రహదారుల నిర్మాణాల అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, పనులను అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు కొల్లగొట్టారని సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజధాని పేరుతో చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా బిజినెస్ రూల్స్ మేరకు జరగలేదని, అంతా ముఖ్యమంత్రి, సీఆర్డీఏ ఉన్నతాధికారుల స్థాయిలోనే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంటున్నారు. రాజధానిలో దాదాపు అన్ని పనులు ముఖ్యమంత్రికి బాగా కావాల్సిన నాలుగు కాంట్రాక్టు సంస్థలకే దక్కాయని గుర్తుచేస్తున్నారు. రాజధాని నిర్మాణం ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనులను త్వరలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం క్షుణ్నంగా సమీక్షించాలని, కమీషన్లు మింగిన అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని సచివాలయ సిబ్బంది, సీఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు కోరుతున్నారు. -
‘సాక్షి’కి ప్రకటనల జారీలో ప్రభుత్వ వివక్ష...
సాక్షి, అమరావతి: సాక్షి దినపత్రికకు ప్రచార ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడడాన్ని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. ఆ రెండు పత్రికలకు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) అత్యధిక బిజినెస్‌ను కల్పించారని, అయితే భారీ సర్క్యులేషన్ గల సాక్షి పత్రికకు మాత్రం అతి తక్కువ బిజినెస్‌ను కల్పించారని, ఇందులోనే వివక్ష కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, ఒక విధానం లేకుండా ప్రచార ప్రకటనలు ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాల్సిందిగా సమాచార శాఖను కాగ్ కోరింది. దీనిపై సమాచార శాఖ కమిషనర్ కాగ్‌కు లిఖిత పూర్వక సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే ఆ రెండు పత్రికలకు ఎక్కువ బిజినెస్ కల్పించామని, సాక్షికి తక్కువ కల్పించడానికి కూడా వారి ఆదేశాలే కారణమని స్పష్టం చేశారు. దీనిపై సంతృప్తి చెందని కాగ్.. సరైన సమాధానం చెప్పాల్సిందిగా మరోసారి కోరింది. దీనిపై కూడా సమాచార శాఖ కమిషనర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ సీఎం, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే పనిచేశామని, అంత పెద్దస్థాయిలో ఆదేశాలను అమలు చేయడం తప్ప చేసేదేమీ ఉండదని పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు సమాచార శాఖ జారీ చేసిన ప్రచార ప్రకటనలపై కాగ్ నివేదికను రూపొందించింది. మూడేళ్లలో సమాచార శాఖ ప్రచార ప్రకటనలకు 125.42 కోట్ల రూపాయలను వ్యయం చేసిందని, ఇందులో 44 శాతం అంటే 54.04 కోట్ల రూపాయల మేర ఆ రెండు పత్రికలకే (ఈనాడు, ఆంధ్రజ్యోతి) ప్రయోజనం కలిగించిందని కాగ్ ఎత్తి చూపింది. అత్యధిక సర్క్యులేషన్ గల సాక్షి పత్రికకు కేవలం 8.99 కోట్ల రూపాయల బిజినెస్‌ను మాత్రమే ఇచ్చారని, తక్కువ సర్క్యులేషన్ గల ఆంధ్రజ్యోతికి భారీ బిజినెస్ ఎలా కల్పించారని ప్రశ్నించింది. ప్రకటనల జారీలో సహజ న్యాయాన్ని, పారదర్శకతను పాటించలేదని కాగ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని తేటతెల్లమైందని పేర్కొంది. -
‘రక్షణ’లో రాజీనా?
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కాగ్ నివేదిక ఉన్నప్పటికీ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు భారత రక్షణ ఒప్పందాల్లో అనుసరించిన విధానాలను మాత్రం ఘాటుగానే విమర్శించింది. అధికారంలో ఎవరున్నా.. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నాణ్యత లేని ఆయుధాలు భారత్‌కు వస్తున్నాయా? అన్న అనుమానం ప్రజల్లో ఎదురవుతోందని కాగ్ పేర్కొంది. సర్వసాధారణంగా రక్షణ ఒప్పందాల్లో నెలకొంటున్న లొసుగులను కాగ్ నివేదిక వివరించింది. వాయుసేన విధానాల్లో లోపాలు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలంటే భారత వాయుసేన తమ నిబంధనలు, వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి ఆయుధాలు ఉండాలో, ఎంత ధర ఉండాలో.. ఎంతమేరకు సైనిక అవసరాలున్నాయో ముందే స్పష్టంగా చెప్పాలి. కానీ వాయుసేనకి ఈ అంశాలపై స్పష్టత కొరవడింది. ఎయిర్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (ఏఎస్‌క్యూఆర్) సూత్రీకరణ విధానాలను మెరుగుపరచుకోకపోవడం వల్ల భారత్ పలు ఆయుధాల ఒప్పందాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అపాచి అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి 2015లో మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటికి బదులుగా రష్యాకు చెందిన మిల్ ఎంఐ–26 హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఉంటే భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదనే చర్చ జరుగుతోంది. యుద్ధ ప్రాంతాలకు సైనికుల్ని, ఆయుధాల్ని చేరవేయడంలో చినూక్ కంటే మిల్ ఎంఐ–26కున్న సామర్థ్యం రెట్టింపని కొందరి వాదన. వాయుసేన తన అవసరాలను తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం బోయింగ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రామాణిక ధరల్లో మార్పు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో సర్వసాధారణంగా ప్రభు త్వం ఒక ప్రామాణిక ధరను నిర్ణయించాలి. దానికి అనుగుణంగా వచ్చిన టెండర్లనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లని విప్పిచూసిన తర్వాత కూడా ఆ ధరల్ని మార్చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. డాప్లర్ వెదర్ రాడార్స్, అపాచి అటాక్ హెలికాఫ్టర్ల కొనుగోలులో అత్యంత కీలకమైన వాయుసేన ప్రమాణాలను (ఏఎస్‌క్యూఆర్) అమ్మకందారులు పాటించకపోయినప్పటికీ కాంట్రాక్టుల్ని అప్పగించారనే విమర్శలున్నాయి. బిడ్లు మార్చుకునే అవకాశం ఆయుధాల కొనుగోలుకు టెండర్లను పిలిచాక విక్రేతలు బిడ్ వేస్తే దాన్ని మార్చే చాన్స్ ఇవ్వకూడదు. కానీ యూపీఏ ప్రభుత్వం యథేచ్ఛగా ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే విమర్శలున్నాయి. 2012లో యూపీఏ హయాంలో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ కంపెనీకి బిడ్ మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని విపక్షాలు ఆరోపించాయి. అప్పుడప్పుడే విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన అతి చిన్న కంపెనీకి అలాంటి అవకాశం ఇవ్వడం వల్ల భారత్‌కు నాసిరకమైన విమానాలే వచ్చాయి. నిర్వహణ వ్యయంపై అవగాహన లేదు గతంలో.. ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని సంస్థ స్థాయిని చూడకుండా కొనుగోలు జరిగింది. వాటి నిర్వహణ వ్యయంపై ప్రభుత్వాలకు కనీస అంచనాలు ఉండకపోవడంతో భారీగా నష్టాలొచ్చాయి. స్విస్ పిలాటస్ విమానాల నిర్వహణ భారాన్ని మోయలేక.. వాటి వాడకాన్ని 2017లో మోదీ సర్కార్ నిలిపివేసింది. అదే ఆ విమానాల కొనుగోలుకు ముందే ఆలోచించి ఉంటే ఆర్థికంగా చాలా మేలు జరిగేది. ఒప్పందాల్లో జాప్యాలు.. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాలు కూడా మరో ప్రతికూల అంశమే. నాలుగు ఒప్పందాలకు మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, ఏడు ఒప్పందాలు కుదరడానికి అయిదేళ్ల కంటే ఎక్కువ పట్టింది. వివిధ స్థాయిల్లో అనుమతులు కావాల్సి ఉండడం, అధికారుల్లో నెలకొన్న అలసత్వం వల్లే ఈ జాప్యాలు జరుగుతున్నాయని కాగ్ నివేదిక విమర్శించింది. జాప్యాలతో ధరల భారం.. ఇలా సంవత్సరాల తరబడి జాప్యం జరగడం వల్ల ఆయుధాల ధరలు పెరిగిపోవడంతో.. దేశ ఖజానాపై అదనపు భారం పడుతోంది. రష్యా లేదా కామన్వెల్త్ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలులో ప్రతీ ఏడాది జాప్యానికి 5% ధర పెంచడానికి మన ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చింది. అదే యూరోపియన్ దేశాలకు 3.5% పెంచుకునేలా నిర్ణయించింది. కానీ మార్కెట్ ధరల్ని పరిశీలించి చూస్తే మన దేశం అనుమతించిన దానికి సగానికి సగం తక్కువగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ భారత్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రఫేల్ ఆడిట్ నుంచి తప్పుకోండి
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పంద ఆడిట్ నుంచి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రాజీవ్ మహర్షి తప్పుకోవాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో ఆయన ఫ్రాన్స్‌తో జరిగిన చర్చల్లో పాల్గొన్నారని, ఆడిటింగ్‌లోనూ పాలుపంచుకుంటే పరస్పర విరుద్ధ ప్రయోజనమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. రఫేల్ ఒప్పందంపై కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రఫేల్ విమానాల కొనుగోలులో కేంద్రం జాతీయ ప్రయోజనాలపై రాజీ పడిందని, కానీ రాజ్యంగబద్ధ సంస్థ అయిన కాగ్ అన్ని రక్షణ ఒప్పందాలను నిష్పక్షపాతంగా ఆడిట్ చేయాలని రాజీవ్ మహర్షికి రాసిన లేఖలో పేర్కొంది. కాగ్‌కు తెలిసో తెలియకో రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వాటికి ఆయన కూడా బాధ్యుడేనని తెలిపింది. అసలు నిజాలు తెలిసి కూడా ఆయన ఆడిటింగ్‌లో పాల్గొనడం షాకింగ్‌కు గురిచేస్తోందని పేర్కొంది. రాజీవ్ మహర్షి 2014 అక్టోబర్ 24 నుంచి 2015 ఆగస్టు 30 మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ మధ్యకాలంలోనే(2015, ఏప్రిల్ 10న) ప్రధాని మోదీ పారిస్ వెళ్లి రఫేల్ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. -
అక్షయ పాత్ర ఆధిపత్యం సబబేనా?
బడి పిల్లలకు బడిలోనే మధ్యాహ్నం భోజనం పెట్టే సదుపాయం చాలా దేశాల్లో అమల్లో వుంది. ఈ పథకం భారతదేశంలో భారీ స్థాయిలో ఉన్నట్లు యునెస్కో ప్రశంసించింది. ఈ విద్యా సంవత్సరంలో 12.65 లక్షల పాఠశాలల్లోని పన్నెండు కోట్ల మంది పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది. పాఠశాలల్లో డ్రాపవుట్సును నివారించి, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించటం ప్రధాన లక్ష్యం. అన్ని సంక్షేమ పథకాల్లో ప్రవేశిస్తున్నట్లే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవోలు) ముసుగులో ప్రైవేట్ సంస్థలు ఇందులోనూ వ్యాపిస్తున్నవి. వాటిలో అక్షయ పాత్ర ఫౌండేషన్, ఏక్తా శక్తి ఫౌండేషన్, నాంది ఫౌండేషన్, జయ్ గీ హ్యుమానిటేరియన్ సొసైటీ, పీపుల్స్ ఫోరమ్ అనేవి కొన్ని. అన్నిటి కంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ పెద్దది. అది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) అనుబంధ సంస్థ. పన్నెండు రాష్ట్రాల్లో 14,702 ప్రభుత్వ పాఠశాలల్లోని 17.60 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు అక్షయ పాత్ర చెబుతోంది. గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ సరఫరా చేసే భోజనంపైన అభ్యంతరాలు వ్యక్తమైనవి. మధ్యాహ్న భోజన పథకంలో అక్షయ పాత్ర భాగస్వామ్యాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్తలు కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకంగా1995 ఆగస్టు15 నుండి దేశమంతటా అమల్లోకి వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలి. ప్రొటీన్లు గల ఆహారం అందివ్వాలి. అందుకు అవసరమైన బియ్యం/గోధుమలు, పప్పులు, కూరగాయలు/ ఆకుకూరలు, నూనె/ఫ్యాట్, ఉప్పు, పోపు దినుసులతో వండిన భోజనం పెట్టాలి. వారంలో కనీసం మూడు రోజులు ఉడకబెట్టిన కోడిగుడ్లు వడ్డించాలి. కోడిగుడ్డుకు బదులు పాలు లేదా అరటి పండు ఇవ్వడాన్ని కూడా జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అంగీకరించలేదు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాలు, జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పులోని ఆదేశాలకు విరుద్ధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రవర్తిస్తోంది. అధునాతన యంత్రాలతో కేంద్రీకృత వంటశాలలు నెలకొల్పి బడికి అందుబాటులో ఉండే బడుగు బలహీన వర్గాల మహిళలకు అవకాశం లేకుండా చేశారు. తెల్లవారుజామున వండి, కంటెయినర్లలో పెట్టి, మైళ్లకొద్దీ వాహనాల్లో రవాణా చేసి, మధ్యాహ్నంకి చల్లారిన భోజనం పెడుతున్నారు. రోజూ ఒకే రకమైన ఆహార పదార్ధాలతో రుచి లేకపోవడం వలన విద్యార్థులు యిష్టంగా తినలేక పోతున్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2005 లోనే 187 శాంపిల్సును పరిశీలించి వాటిలో నిర్దేశిత పోషకాలు లేవని, పదార్థాల పరిమాణం కూడా తక్కువగా ఉంటుందని తేల్చింది. పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు వడ్డించటం లేదు. అంతేకాదు ఆ వంట కంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేయటం లేదు. విద్యార్థులకు యిష్టమైన భోజనం కాకుండా సాత్వికాహారం పేరుతో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మతాచార ఆహారాన్నే నిర్బంధంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వుండే విద్యార్థుల్లో 95 శాతం మంది మాంసాహారులు. వంట చేసే వారు మాత్రం మాంసాహార వ్యతిరేకులు. భోజనం చేసేవారు దళితులు, గిరిజనులు, బహుజనులు కాగా వండి వార్చేదేమో అగ్రవర్ణ సంస్థ. పాఠశాలల్లోనే వంట చేయకుండా అస్పృశ్యత పాటిస్తున్న ఫౌండేషన్ పట్ల 2013 లోనే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు వెల్లువెత్తడంతో ఫౌండేషన్ కూడా కొంత దిగొచ్చి స్కూల్ మేనేజిమెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల ద్వారా కోడిగుడ్లను విద్యార్థులకు అందించుకోవచ్చని, అందుకు చెల్లించాల్సిన సొమ్మును తనకిచ్చే బిల్లు నుండి మినహాయించుకోవచ్చని అంగీకరించింది. అంతేకానీ తాను మాత్రం కోడిగుడ్లు వడ్డించేది లేదని తెగేసి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోడిగుడ్లు వేరే ఏజెన్సీల ద్వారా పెట్టిస్తున్నారు. తెలంగాణలో అది కూడా లేదు. పైగా స్థానిక సంస్కృతీ, ఆహార అలవాట్లను అణిచివేసి సాత్వికాహారం పేరుతో రుచిలేని చప్పటి తిండి పెట్టి విద్యార్థుల కడుపు కాలుస్తున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ భాగస్వామ్యంలోని అనర్ధాలను ఎవరూ పట్టించుకోక పోవడం అన్యాయం. ఇది బాలల హక్కుల సమస్య, భావి భారత పౌరుల పౌష్టికాహార సమస్య. దేశ ప్రయోజనాల పేరుతో వేలాది స్వచ్ఛంద (ఎన్జీవో) సంస్థలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం భోజనం పేరుతో ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ విరాళాలు పోగేసుకుంటూ విద్యార్థుల జీవి తాలతో ఆడుకుంటున్న సంస్థను కొనసాగనివ్వడం నేరం కాదా? వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు, మొబైల్ : 94903 00577 -
‘మొన్న మోదీ, నిన్న రాహుల్ కాళ్లు పట్టుకున్నావ్’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతీ మాట అబద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓవైపు రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడిపోతుంటే.. పట్టిసీమ వల్ల రాయలసీమ బాగుందంటూ బాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం లోటస్‌పాండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదిక నిజం కాదా అని ప్రశ్నించారు. ‘2014లో అధికారంలోకి రాగానే 17 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని మంత్రి దేవినేని చెబుతున్నారు. అంటే దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర టీడీపీ అవినీతికి పాల్పడింది’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనుసంధానం వల్ల ఏం లాభం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన పాలనా కాలంలోనే 80 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయలేక చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. గోదావరి- పెన్నా లింకేజీ అంటూ టెండర్లను పిలిచేది మరోసారి దోపిడీ చేయడానికే బాబు సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతంలో కంటే సాగు విస్తరణ 2లక్షల హెక్టార్లలో తగ్గిందన్న శ్రీకాంత్ రెడ్డి.. మరి నదుల అనుసంధానం చేసి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలోనే ఏమి చేయలేని వాడివి. కేంద్రంలో ఏం సాధిస్తావ్. మొన్న మోదీ, నిన్న రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నావ్. పదవి కోసం ఇన్ని కుట్రలు, మోసాలు చేయాలా’ అని చంద్రబాబును విమర్శించారు. -
లోగుట్టును రట్టుచేసేందుకు కాగ్ సన్నద్ధం
-
కట్టు కథలపై ‘కాగ్’ కన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాగునీటి పనులకు రూ.58,064 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడం, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించలేకపోవడం వెనుక గుట్టును రట్టు చేసేందుకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులవారీగా ఎంత ఖర్చు చేశారు? ఇప్పటివరకూ చేసిన పనులు ఎన్ని? మిగిలిపోయినవి ఎన్ని? అదనంగా ఆయకట్టుకు నీళ్లందించారా? తదితర అంశాలపై వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సాగునీటి పనులపై సర్కారు సమర్పించే వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాటికి పూర్తి స్థాయి నివేదికను సభకు సమర్పించాలని కాగ్ నిర్ణయించింది. మరోవైపు 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సాగునీటి పనులపై శాసనసభకు కాగ్ సమర్పించిన నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలని లేఖలో కోరారు. ప్రాజెక్టులవారీగా సమగ్ర విచారణకు సిద్ధం.. నాలుగున్నరేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు, పనుల పురోగతిపై సమర్పించిన వివరాలను అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని కాగ్ నిర్ణయించింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం పేరుతో పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి టెండర్లు లేదా నామినేషన్ పద్ధతిలో కొంత మంది కాంట్రాక్టర్లకు అప్పగించడం, కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించినా ప్రాజెక్టులు పూర్తికాకపోవడాన్ని గుర్తించిన కాగ్ ఈ వ్యవహారం వెనుక మతలబును శోధించాలని నిర్ణయించింది. ప్రాజెక్టులవారీగా ఆడిట్ నివేదిక రూపొందించి శీతాకాల సమావేశాలనాటికి శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రెట్టింపు నిధులు ఖర్చయినా.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక 2014 జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామంటూ శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. అయితే నాలుగున్నరేళ్లలో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులకు రూ.44 వేల కోట్లను ఖర్చు చేసినా ఇప్పటివరకూ ఒక్కటి కూడా పూర్తయిన దాఖలాలు లేవు. అదనంగా ఆయకట్టుకు నీళ్లందించిన ఉదంతాలు లేవు. నిధులు భారీగా ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో కాగ్ వివరాల సేకరణకు సిద్ధమైంది. ఆ నివేదికలపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పరేం? సాగునీటి ప్రాజెక్టులపై కాగ్ ఇప్పటికే రెండుసార్లు శాసననభకు నివేదికలు సమర్పించింది. 2016–17లో జరిపిన ఆడిటింగ్‌లో పట్టిసీమ ఎత్తపోతలలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ధ్రువీకరించింది. 2017–18 ఆడిటింగ్‌లో ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెంచేయడాన్ని తప్పుబట్టింది. ఈ రెండు నివేదికల్లో కాగ్ ప్రస్తావించిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పలదఫాలు రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరులశాఖకు, ఆర్థికశాఖకు లేఖలు రాశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. తాజాగా ఇదే అంశంపై సెప్టెంబరు 15న ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మరోసారి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర కాగ్ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై తక్షణమే వివరణ ఇవ్వాలని జలవనరుల శాఖను కోరారు. -
‘హెరిటేజ్‌పై ఉన్న శ్రద్ద ప్రాజెక్టులపై లేదు’
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం పనుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది వరకు పూర్తి కావడం కష్టమని కాగ్ తేల్చిచెప్పిందని.. అయినప్పటికీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ కాంట్రాక్టర్లకు 22 శాతం అదనంగా ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి 31కి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిబంధన ఎందుకు పెట్టుకున్నారు. కాగ్ కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించిందన్నారు. థర్డ్ పార్టీతో పోలవరం పనుల క్వాలిటీ ఎందుకు చెక్ చేయించడం లేదని అడిగారు. హెరిటేజ్ పనుల మీద పెట్టిన శ్రద్ద పోలవరం పనుల మీద పెట్టాలని చురకలు అంటించారు. ప్రతీ పథకంలోనూ అవినీతే టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్లలో అడుగడుగునా అవినీతి జరిగిందని అరోపించారు. ఆదరణ పథకం కూడా అవినీతి మయమేనని తెలిపారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు అంగీకరిస్తే పోలవరం, ఆదరణ, అన్న క్యాంటీన్లపై చర్చకు సిద్దమని సవాలు విసిరారు. చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయంలో కుటుంబరావు పాత్ర ఉంటుందన్నారు. గోదావరి పుష్కర మరణాల గురించి సమగ్ర విచారణకు ఆదేశిస్తూ సోమయాజులు కమిషన్‌ను ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కానీ సోమయాజులు రిపోర్టు మీద సంతకం మాత్రమే పెట్టారని, మిగతా స్కిప్టు వేరేవారు రాశారన్నారు. -
వెనుకబడిన జిల్లాల నిధులు పక్కదారి
సాక్షి, అమరావతి: వెనుకబడిన జిల్లాలకు కేంద్రం అరకొరగా ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో ఆయా జిల్లాలకు తీరని అన్యాయం జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) గుర్తించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను కూడా రూపొందించలేదని వ్యాఖ్యానించింది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాజధాని అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. ఒకపక్క రాజధాని పూర్తికాలేదు. మరోపక్క ఆ నిధులు ఇవ్వకుండా వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరిగడం గమనార్హం. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాలను(యూసీలు) సమర్పించడంలోనూ రాష్ట్ర సర్కార్ విఫలమైందని తేల్చింది. 2014–15లో రాజధాని నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన రూ.500 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు వినియోగించకుండా ఖజానాలోనే ఉంచేసిందని కాగ్ తెలిపింది. కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు ఈ ప్యాకేజీని రప్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. 2015–16లో రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక సాయం కింద కేంద్రం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు విడుదల చేసినట్లు కాగ్ ఆడిట్లో వెల్లడైంది. గతంలో కేంద్రం ఆగ్రహం.. 2017–18కి సంబంధించి కాగ్ ఆడిట్ నిర్వహించింది. ఆ ఆడిట్ పేరాలను సీఆర్డీఏ సమర్పించింది. సవివరమైన ఆధారాలతో కూడిన వివరణను సీఆర్డీఏ ఇస్తే, ఆడిట్ నుంచి ఆ పేరాలను కాగ్ తొలగిస్తుంది. లేదంటే ఆడిట్ నివేదికలో యథాతథంగా పొందుపరుస్తుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక సాయంగా ఇచ్చిన నిధులను నిబంధనల మేరకు వెచ్చించకుండా, ఇతర పనులకు ఖర్చు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధుల వినియోగంలో జాప్యమెందుకు? 2014–15లో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.500 కోట్లు విడుదల చేసిందని.. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఏడాదిపాటు ఖజానాలోనే ఉంచిందని ‘కాగ్’ అడిట్ నివేదికలో పేర్కొంది. కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించకుండా జాప్యం చేసిందని తప్పుబట్టింది. దీనిపై సీఆర్డీఏను వివరణ కోరగా.. ఇది తమకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొనడం గమనార్హం. రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర సర్కారు దారి మళ్లించిందని కాగ్ తేల్చిచెప్పింది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, మండలి నిర్మాణాలతోపాటు భూములిచ్చిన రైతులకు వార్షిక వాయిదాలకు, పింఛన్లు ఇచ్చేందుకు ఈ నిధులను వినియోగించిందని పేర్కొంది. కేంద్ర నిధులను తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మించిన షాపూర్జీ పల్లోంజీ, ఎల్అండ్టీ సంస్థలకు చెల్లించిందని తెలిపింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 వరకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.769.34 కోట్లు అందుబాటులో ఉండగా, కేవలం రూ.392.98 కోట్లే వ్యయం చేశారని కాగ్ ఆడిట్లో వెల్లడించింది. నిధుల ఖర్చుపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని వ్యాఖ్యానించింది. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను తాత్కాలిక భవనాలు కట్టడానికి వెచ్చించినట్లు రాష్ట్ర సర్కారు వినియోగ పత్రాలు పంపినప్పటికీ నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాయని కాగ్ పేర్కొంది. -
దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయం
సాక్షి, విజయవాడ : పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై కాగ్ నివేదిక నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన... ప్రతీ విషయానికి స్పందించే ఉమా కాగ్ నివేదికపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో హరీశ్ రావు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఉమా మాత్రం హడావుడి చేస్తూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రతీ సోమవారం పోలవరం వెళ్లి కమీషన్లు తీసుకోవడమే ఉమా లక్ష్యమని ఆరోపించారు. అసమర్థ సాగునీటి మంత్రి ఉమా అని.. కమీషన్ల కోసం తాపత్రయపడటమే ఆయన పని అంటూ కృష్ణ ప్రసాద్ విమర్శించారు. రమేశ్‌బాబుకు ఎలా ఇచ్చారు? పోలవరం సీఈ రమేశ్ బాబు తెలంగాణ వ్యక్తి అని, ఏమాత్రం అనుభవం లేని అటువంటి వ్యక్తికి ఇంతపెద్ద ప్రాజెక్టు ఎలా అప్పజెప్పారని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. రమేశ్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం అవినీతిపై వచ్చే వారం లీగల్ ఒపీనియన్ తీసుకుని సోమవారం లేదా మంగళవారం ఉమా అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలున్నాయని, అవన్నీ సీబీఐకి అప్పగిస్తానని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం తీరును కడిగిపారేసిన కాగ్
-
‘సత్వర కమీషన్ల పథకం’
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేందుకు కేంద్రం చేపట్టిన ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ఆయకట్టుకు వేగంగా నీళ్లందించడాన్ని పక్కనబెట్టి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చటంపైనే ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపారని పేర్కొంది. ఏఐబీపీ ప్రాజెక్టుల్లో అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు అక్షర సత్యమని తేలుస్తూ కాగ్ నివేదిక ఇచ్చింది. రూ.79.04 కోట్లు నిరుపయోగం దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేందుకు కేంద్రం ఏఐబీపీని చేపట్టింది. ఏఐబీపీ కింద రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు కేంద్రం తన వాటాగా కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరి కొన్ని చోట్ల 30 శాతం, గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు 90 శాతం నిధులను సమకూర్చుతుంది. రాష్ట్రంలో 12 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు ఈ పథకం కింద కేంద్రం నిధులను కేటాయించింది. అయితే ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అంచనా వ్యయాన్ని పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించి కమీషన్లు వసూలు చేసుకోవడంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు సఫలమయ్యారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఖర్చు చేయకపోవడం వల్ల రూ.79.04 కోట్లు నిష్ఫలమయ్యాయని కాగ్ తేల్చింది. తాడిపూడిపై తాత్సారంతో రూ.191 కోట్ల భారం తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని 2004లో రూ.376.96 కోట్లతో చేపట్టారు. ఈ పథకం కింద 2,06,600 ఎకరాలకు నీళ్లందించాల్సి ఉండగా 2009 నాటికే 1.54 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి మిగిలిన 52 వేల ఎకరాలకు నీళ్లు అందించడంపై టీడీపీ సర్కారు మీనమేషాలు లెక్కించింది. అంచనా వ్యయాన్ని రూ.885.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్దేశించిన మొత్తం కన్నా రూ.191.04 కోట్ల అధికంగా ఖర్చు అయ్యాయని కాగ్ తూర్పారబట్టింది. గుండ్లకమ్మలో గుండె గుభేల్.. గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 80,060 ఎకరాలకు నీళ్లందించాలి. గతంలోనే రూ.535.01 కోట్లు ఖర్చు చేసి 68,948 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. భూసేకరణలో జాప్యం వల్ల 11,500 ఎకరాలకు నీళ్లందించలేకపోయారు. మిగిలిన భూసేకరణను చేసి ఆయకట్టుకు నీళ్లందించాల్సిన సర్కార్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.753.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని కాగ్ తప్పుబట్టింది. ఇక డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు ధరలను తప్పుగా లెక్కించడం వల్ల కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం రూ.1.49 కోట్ల లబ్ధి కలిగించిందని స్పష్టం చేసింది. తారకరామతీర్థ సాగర్‌పై తీవ్ర జాప్యం.. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టును 2003లో రూ.220.11 కోట్లతో చేపట్టారు. 5.80 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 24,710 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు రూ.144.28 కోట్లను ఖర్చు చేశారు. భూసేకరణ, అటవీ అనుమతుల్లో సర్కార్ జాప్యం చేయడంతో 2015లో అంచనా వ్యయం రూ.471.31 కోట్లకు పెంచేశారు. సర్కారు నిర్లక్ష్యంతో ఖజానాపై రూ.271.20 కోట్ల భారం పడింది. ఆయకట్టుకు నీళ్లందించడంలో జాప్యం వల్ల రైతులు నష్టపోయారని కాగ్ తేల్చింది. వెలిగల్లులో భారం ఖజానాపైనే.. వెలిగల్లు రిజర్వాయర్ పూర్తి కాకుండానే పూర్తయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వల్ల మరమ్మతులకు అయ్యే రూ.16 కోట్ల భారం కాంట్రాక్టర్‌పై కాకుండా సర్కార్‌పై పడిందని కాగ్ పేర్కొంది. భూసేకరణ జాప్యంతో నిధులు నీటి పాలు... ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో భవవాసి చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చే పనుల్లో భూసేకరణ జాప్యం వల్ల రూ.25.88 కోట్లు నిష్ఫలమయ్యాయని కాగ్ తేల్చింది. ప్రకాశం బ్యారేజీ పనుల్లో కాంట్రాక్టర్‌కు లబ్ధి ప్రకాశం బ్యారేజీ హెడ్‌వర్క్స్ ఆధునికీకరణ పనులను ఈపీసీ విధానంలో రూ.204.67 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందుల వల్ల విజయవాడ పరిధిలో రిటైనింగ్ గోడల నిర్మాణం, కాలువలకు సిమెంటు లైనింగ్ పనులను ఒప్పందం నుంచి తప్పించారు. ఈ పనుల విలువ రూ.86.41 కోట్లు కాగా జలవనరుల శాఖ రూ.64.45 కోట్లుగా లెక్క కట్టిందని కాగ్ గుర్తించింది. తొలగించిన పనుల స్థానంలో రూ.63.81 కోట్లతో కొత్తగా పనులు చేపట్టడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.22.60 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారని కాగ్ తప్పుబట్టింది. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలని సూచించింది. -
కాగ్ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : కాగ్ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయిందని పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని నేరుగా కాగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే అవినీతి ఆరోపణలు చేసిందని అన్నారు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మాట్లాడారు. పోలవరం, పట్టిసీమ అవినీతిని కాగ్ తప్పుపట్టిందని, పట్టిసీమ అవసరం లేదని కాగ్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. పోలవరం పనులపై థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ లేదని, క్వాలిటీ ఆడిట్ కూడా జరగలేదని ఆరోపించారు. ఇంతవరకు అంబుడ్స్‌మెన్‌ను నియమించలేదన్నారు. పోలవరం కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని, పోలవరం డిజైన్లు, డ్రాయింగ్ ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని బుగ్గన ప్రశ్నించారు. పోలవరం భూ సేకరణ సక్రమంగా జరగలేదని కాగ్ తేల్చిందని, 96 శాతం పునరావాసం ఇవ్వలేదని చెప్పిందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి, దీని నిర్మాణం కూడా కేంద్రమే చూసుకుంటే బాగుంటుందని బుగ్గన సూచించారు. ప్రత్యేక హోదా వస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని తెలిపారు. ప్రస్తుతం 40 ప్రాజెక్ట్‌ల నిర్మాణం నడుస్తున్నాయని, పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతుందని, కానీ ఎలా పూర్తి చేస్తుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల మేలు కోసమే అన్ని ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయాలను ఏపీ ప్రభుత్వం వందశాతం పెంచేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు స్టీల్, సిమెంట్ ప్రభుత్వమే ఎందుకు ఇస్తుందని.. టెండర్ విధానం ఎందుకు పెట్టారని బుగ్గన ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువగా రూ.1800 కోట్లు అదనంగా ఇచ్చారని పేర్కొన్నారు. పోలవర నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎందుకు స్పష్టత తీసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరంపై అసలు మానిటరింగ్ లేదని, 24 సార్లు సమావేశం కావాల్సిన మానిటరీ కమిటీ, రెండు సార్లు మాత్రమే సమావేశమైందని బుగ్గన ఆరోపించారు. సామాన్యులు కట్టిన, కడుతున్న పన్నులను దుర్వినియోగం చేస్తున్నారని, మీ అవినీతికి నిదర్శనం పోలవరంపై చేసిన ఖర్చేనని అన్నారు. బాబు హయాంలో లక్షా 50వేల కోట్ల అప్పు చేశారని బుగ్గన తెలిపారు. -
పోలవరం..కమీషన్ల పరం!
-
అంతులేని దోపిడీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అక్రమాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో తీవ్రస్థాయిలో ఎండగట్టింది. హెడ్‌వర్క్స్ కాంట్రాక్టర్‌కు భారీ ప్రయోజనం కల్పించారని, పనుల్లో మాత్రం పురోగతి లేదని పేర్కొంది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో కాగ్ ప్రస్తావించిన అక్రమాలు ‘సాక్షి’ గత నాలుగేళ్లుగా ప్రచురించిన కథనాలకు అద్దం పట్టాయి. సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటిరీయల్ రీసెర్చ్ స్టేషన్)తో ఒప్పందం చేసుకునే వరకూ అంటే 2017 జూలై వరకూ ప్రాజెక్టు పనుల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అవతవకలను కడిగేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని 2014 మే నెలలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దీనితో ఒప్పందం చేసుకోవాలని పదేపదే కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కాగ్ పేర్కొంది. జరిమానాకు బదులు నజరానా పోలవరం హెడ్‌వర్క్స్ పనులను దక్కించుకున్న టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్(జేవీ) సంస్థకు వాటిని పూర్తి చేసే సామర్థ్యం లేదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు తేల్చి చెప్పాయి. 2016 సెప్టెంబరు వరకూ హెడ్‌వర్క్స్‌లో ఎలాంటి పురోగతి లేదు. కాంట్రాక్టర్‌పై జరిమానా విధించి వసూలు చేయాల్సిన సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఒప్పందం గడువు ముగియడానికి రెండేళ్ల ముందే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ లేని తరహాలో 2016 సెప్టెంబరు 8న అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చిందని కాగ్ తప్పుబట్టింది. ఈ నివేదికలో కాగ్ ప్రస్తావించిన ఇతర అంశాలు ఇవీ.. డంపింగ్ యార్డుకూ సర్కారు డబ్బులే.. ‘అంచనా వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో రూ.66.59 కోట్లను ఫెర్పార్మెన్స్ సెక్యూరిటీ కింద కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాల్సిన సర్కార్ మినహాయింపు ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘించి రూ.25.37 కోట్ల విలువైన స్టీలును కొనుగోలు చేసి హెడ్‌వర్క్స్ కాంట్రాక్టర్‌కు సరఫరా చేసింది. యంత్రాల దిగుమతిపై సుంకాన్ని కాంట్రాక్టర్‌కు బదులుగా ప్రభుత్వమే రూ.5.72 కోట్లు చెల్లించింది. మట్టి నిల్వకు డంపింగ్ యార్డ్ భూమిని కాంట్రాక్టరే సేకరించాల్సి ఉండగా సర్కారే రూ.32.66 కోట్లను ఖర్చు చేసి 203.74 ఎకరాలను సేకరించింది. అడ్వాన్సులపై అడ్వాన్సులు.. కాంట్రాక్టర్‌కు మొదట రూ.404.86 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ప్రభుత్వం ఇచ్చింది. 21వ బిల్లు నుంచి 11 శాతం వడ్డీతో మొబిలైజేషన్ అడ్వాన్స్ వసూలు చేయాలి. అయితే దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. రూ.422.20 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించిన సమయంలో నిబంధనలను ఉల్లంఘించి రూ.95 కోట్లను మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చింది. 2017 జూన్ నాటికి 76 శాతం పని పూర్తి కావాల్సి ఉండగా కేవలం 31 శాతం పనులు మాత్రమే పురోగతిలో ఉంది. కాలువల్లో అక్రమాల ప్రవాహం పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పీపీఏ అనుమతి తీసుకోకుండానే అంచనా వ్యయాన్ని రూ.8,021 కోట్లకు పెంచేస్తూ 2016 డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గడువులోగా పనులు చేయని కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సింది పోయి అంచనా వ్యయాన్ని పెంచేసి అనుచిత లబ్ధి చేకూర్చారు. కాలువల పనుల్లో పైపు లైన్లు, విద్యుత్ స్తంభాల తరలింపు వ్యయాన్ని కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారే భరించడం ద్వారా రూ.38.12 కోట్ల లబ్ధి కలిగించారు. 3.28 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సిన సర్కార్ మీనవేషాలు లెక్కిస్తోంది. భూసేకరణ, పునరావాస ప్యాకేజీలో అక్రమాలు కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో డీపీఆర్ రూపొందించాల్సి ఉండగా పోలవరంలో జీఎస్ఐ చిత్రాల ఆధారంగా రూపొందించారు. తొలుత 54,448.69 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 44,574 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు లెక్కగట్టారు. తాజాగా ముంపు భూమి 1,03,585.21 ఎకరాలకు, నిర్వాసితు కుటుంబాల సంఖ్య 1,05,601కి పెరగడం విస్మయం కలిగిస్తోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వివాదాల పరిష్కారానికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా దీన్ని పట్టించుకోవడం లేదు. సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు అంబుడ్స్‌మెన్‌ను నియమించకపోవడంతో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ కింద వెచ్చించిన రూ.1,407.64 కోట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పీపీఏకి సమర్పించలేదు.’ - విభజన చట్టం హామీ మేరకు పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒప్పందం చేసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి? - పోలవరం హెడ్‌వర్క్స్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ–ఈసీ–యూఈఎస్(జేవీ) మూడేళ్ల దాకా పనులే ప్రారంభించలేదు. కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం గడువు ముగియక ముందే అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసింది. ఇది అనుచిత లబ్ధి కాదా? - భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనుల్లో రూ.1,407.64 కోట్ల వ్యయానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకూ అందచేయలేదు. -
పోలవరంపై కాగ్ కీలక రిపోర్ట్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) కీలక రిపోర్ట్ ఇచ్చింది. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మందకొడిగా పనులు జరుగుతున్నా.. కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్ పేర్కొంది. కాంట్రాక్టర్లలకు రూ.1853కోట్లు రాయితీలిచ్చినా హెడ్‌వర్క్స్ పూర్తి చేయలేదని తెలిపింది. అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన నిబంధనలు అమలు కాలేదని చెప్పింది. భూసేకరణ, పునరావాసంపై పెట్టిన ఖర్చు వివరాలు ప్రభుత్వం సమర్పించలేదని పేర్కొంది. 12ఏళ్లలో నాలుగు శాతం మాత్రమే పునరావాసం కల్పించారని తెల్చేసింది. థర్ట్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్, నాణ్యత ఆడిట్లను ఏర్పాటు చేయలేదని, పోలవరంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదని కాగ్ వెల్లడించింది. ముంపు గ్రామాల గుర్తింపులో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. నాలుగేళ్లైనా డ్యాం పనుల డిజైన్లు ఇంకా ఖరారు చేయలేదంటూ ప్రభుత్వాన్ని కడిగేసింది. కాంట్రక్టర్లకు ఇచ్చిన రాయితీలను రికవరీ చేయాలని చెప్పింది. డీపీఆర్ తయారి సమయంలో అంతా కచ్చితంగా లేదని కాగ్ వెల్లడించింది. -
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు
-
తాత్కాలిక సచివాలయంలో దోచేశారు..
6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారు. – కాగ్ సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణాల్లో భారీగా దోపిడీ జరిగినట్లు సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తేల్చిచెప్పింది. కాంట్రాక్టర్లకు అంతులేని ప్రయోజనం కలిగించారని, తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ‘కాగ్’ ఆడిట్లో స్పష్టం చేసింది. సర్వే, ఇన్వెస్టిగేషన్ లేకుండానే సాంకేతిక అనుమ తులు ఇచ్చారని తప్పుపట్టింది. తాత్కాలిక సచివాలయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తోందన్న ఆరోపణలు మొదటినుంచే వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం కలిగించడంతోపాటు టెండర్ నిబంధనలన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని, ఇంజనీరింగ్– ప్రొక్యూర్మెంట్– కనస్ట్రక్షన్(ఈపీసీ) విధానానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ‘కాగ్’ స్పష్టం చేయడం గమనార్హం. ఈపీసీ నిబంధనలకు తిలోదకాలు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వ్యవహారాలపై ‘కాగ్’ తొలిసారిగా 2017–18లో ఆడిట్ నిర్వహించింది. సర్కారు సాగించిన ఆక్రమాలను కడిగిపారేసింది. ‘కాగ్’ బహిర్గతం చేసిన అక్రమాలకు, సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం నోరెల్లబెట్టింది. ప్రధానంగా తాత్కాలిక సచివాలయం పేరుతో 6 భవనాల నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలను, కాంట్రాక్టు సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కల్పించిన తీరును ఆడిట్ నివేదికలో ‘కాగ్’ సోదాహరణంగా వివరించింది. 6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. భారీగా అధిక ధరలకు(ఎక్సెస్) టెండర్లను ఖరారు చేయడంపై ‘కాగ్’ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ–ప్రొక్యూర్మెంట్లో తొలుత అప్లోడ్ చేసిన అంతర్గత అంచనా వ్యయాన్ని(ఐబీఎం) ఆ తరువాత పెంచేయడాన్ని తప్పుపట్టింది. ఈపీసీ విధానంలో టెండర్లను 5 శాతం కంటే ఎక్సెస్‌కు ఖరారు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. 5 శాతం ఎక్సెస్‌కు టెండర్లు వస్తే వాటిని రద్దుచేసి రెండోసారి టెండర్లను ఆహ్వానించాలనే ఈపీసీలోని ప్రాథమిక నిబంధనలకే తిలోదకాలు ఇచ్చారని కాగ్ వెల్లడించింది. తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణాల అంచనా వ్యయాలను కాంట్రాక్టర్లకు 14 శాతం మేర లాభం వచ్చేలా రూపొందించారని కాగ్ తెలిపింది. కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలకు విరుద్ధంగా 5 శాతానికి మించి ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలతో సంప్రదింపులను జరిపారని పేర్కొంది. రద్దు చేయాల్సింది పోయి చర్చలా? తాత్కాలిక సచివాలయంలోని 6 బ్లాకులను రెండేసి బ్లాకులుగా కలిపి 3 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించారు. ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థలు అంతర్గత అంచనా వ్యయంపై ఏకంగా 62 శాతం నుంచి 85 శాతం వరకు ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి. టెండర్లను రద్దు చేయాల్సింది పోయి ఆ రెండు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపుల జరపడాన్ని కాగ్ తప్పుపట్టింది. సంప్రదింపుల తరువాత కూడా ఈ రెండు సంస్థలకు 16.24 శాతం నుంచి 24.75 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు బిల్లుల చెల్లింపులోనూ నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరించలేదని కాగ్ వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ శాతం మేర బిల్లులు చెల్లించారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ కమిషనర్ కాంట్రాక్టర్లకు రూ.40.80 కోట్ల అదనపు ప్రయోజనం కలిగేలా టెండర్లను ఖరారు చేసినట్లు కాగ్ తేటతెల్లం చేసింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది. -
వరద నివారణకు మన సంసిద్ధత ఎంత?
దేశంలో దాదాపు 15 శాతం భూభాగం ప్రతి సంవత్సరమూ వరద ప్రభావాలకు లోనవుతోంది. సగటున 2000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2 కోట్ల ఎకరాల్లో పంట నష్టం (రూ.1800 కోట్లు) వాటిల్లుతోంది. ప్రభుత్వాలు వరద నియంత్రణ విధానాల్ని కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా ఈ నష్టాన్ని చాలామటుకు నివారించవచ్చునంటున్నారు నిపుణులు. డ్యాముల నిర్వహణ లోపాల వల్లే కేరళకు భారీ నష్టం వచ్చిందని వారు విశ్లేషిస్తున్నారు. డ్యాములు భద్రత / వరద నిర్వహణ విషయాల్లో ప్రభుత్వాలకు శ్రద్ధ లోపించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విపత్తుల తాలూకూ నష్టం పెరుగుతోందని గత ఏడాది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. కాగ్ నివేదిక ప్రకారం – వరదల తాలూకూ సమాచారం అందివ్వగల టెలిమెట్రీ స్టేషన్ల నిర్వహణలో తీవ్ర వైఫల్యం కనిపిస్తోంది. దేశంలో 40.8శాతం టెలీమెట్రీ స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో పనిచేయించేందుకు నిర్ణీత వ్యవధిలోగా ఓ కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలన్న కాగ్ సిఫారసును సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పట్టించుకోవడం లేదు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (కేరళ, పంజాబ్, రాజస్తాన్, అండమాన్ – నికోబార్, చండీఘర్, డామన్ డయ్యూ, గోవా, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం) సీడబ్ల్యూసీ ఎలాంటి ముందస్తు వరద హెచ్చరిక కేంద్రాలనూ ఏర్పాటు చేయలేదు. కేంద్రం పదకొండో ప్రణాళిక కాలంలో ‘డ్యామ్ సేఫ్టీ స్టడీస్ అండ్ ప్లానింగ్’ పేరిట రు .10 కోట్లతో ఓ పథకాన్ని ప్రారంభించింది. ఆ మొత్తాన్ని సవరించి, రూ. 6 కోట్లకు కుదించింది. అందులో ఖర్చు చేసింది రూ. 4.22 కోట్ల మాత్రమే. ఈ పథకాన్ని తర్వాత కాలంలో డ్యామ్ రీహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్)లో కలిపేసింది. పదకొండో ప్రణాళికలో – రూ. 279.74 కోట్ల ఖర్చయ్యే నాలుగు వరద నిర్వహణ కార్యక్రమాలు చేపట్టేందుకు కేరళకు ఆమోదం లభించింది. కానీ, 63.68 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. 55.22 కోట్లు 12వ ప్రణాళికలో మంజూరయ్యాయి. మొత్తంగా ఈ కార్యక్రమాలకు గాను కేరళకు దక్కింది రూ. 118.90 కోట్లు మాత్రమే. వరద నిర్వహణకు నిధులేవీ? వరద నిర్వహణ సంబంధిత మౌలిక సదుపాయాలకు కేంద్రం కేటాయిస్తున్నది చాలా తక్కువే. ఈ యేడాది బడ్జెట్లో ముందస్తు వరద సమాచారం / నిర్వహణకు సంబంధించి ఎలాంటి కేటాయింపులూ జరగలేదని పరిశీలకులు చెబుతున్నారు. (నీటి వనరుల అభివృద్ధికి (వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్) 2016 –17లో రూ. 4710 కోట్లు, 2017 –18లో రూ.7660 కోట్లు, 2018 –19లో రూ.8860 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది) పెద్ద డ్యాముల నిర్వహణకు సంబంధించి – ప్రతి రాష్ట్రం అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వలసిన ప్రణాళిక రూపొందించి, కేంద్రానికి సమర్పించాల్సివుంది. దేశంలో దాదాపు 5000 డ్యాములు ఉండగా, కేవలం ఏడు శాతం డ్యాములకే ఇలాంటి కార్యాచరణ ప్రణాళికలున్నాయి. కేరళలోని 61 డ్యాముల విషయంలో ఇలాంటి ప్రణాళికలేమీ లేవు. వర్షాకాలానికి ముందు, తర్వాత డ్యాములను తనిఖీ చేయించాల్సి వున్నప్పటికీ ప్రభుత్వాలు సంబంధిత నిబంధనను ఖాతరు చేయడం లేదు. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో మాత్రమే అలాంటి తనిఖీలు జరిగాయి. తనిఖీలకు కేటాయిస్తున్న మొత్తాలే అతి తక్కువ కాగా, వాటిని కూడా ఉపయోగించకపోవడమో లేదా అనధికారిక ప్రాజెక్టులకు మళ్లించడమో జరుగుతోంది. -
పీడీ ఖాతాలపై నోరు విప్పని యనమల
-
రైళ్లు ఆలస్యం.. కారణం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైళ్లు ఆలస్యంగా నడవడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో ఈ మేరకు రైల్వే శాఖను ఉతికి ఆరేసింది. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను అభివృద్ధి చేయడంపై రైల్వే శాఖ దృష్టి సారిస్తోంది తప్ప రైళ్ల రాకపోకలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 15 రైల్వే స్టేషన్లను ప్రామాణికంగా తీసుకున్న కాగ్ నివేదికను రూపొందించింది. ఆయా స్టేషన్లలో రైళ్ల రాకపోకలు భారీగా పెరిగిపోయాయని చెప్పిన కాగ్, ఆ స్థాయిలో ప్లాట్ ఫాంలు, వాషింగ్ పిట్లను అందుబాటులో ఉంచలేదని ఫైర్ అయింది. ఆ 15 స్టేషన్లలో మార్చి 2017 నాటికి 2,436 రైళ్లు నడుస్తున్నాయని, అందులో 638 రైళ్లు 24 అంతకంటే ఎక్కువ కోచ్‌లతో నడుస్తున్నాయని తెలిపింది. అయితే, ఆ స్థాయిలో ప్లాట్ ఫాంలు మాత్రం లేవని చెప్పింది. ప్లాట్ ఫాంల కొరత కారణంగానే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తేల్చి చెప్పింది. ముందు స్టేషన్లలో ప్లాట్ ఫాంలు ఖాళీ అయ్యేంత వరకూ ఔటర్ సిగ్నల్స్ వద్ద రైళ్లను ఆపేస్తున్నారని కాగ్ స్పష్టం చేసింది. అన్ని రైల్వే జోన్లు స్టేషన్ల అభివృద్ధికి ఓ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించింది. -
పీడీ అకౌంట్ల వివాదం
ఈమధ్య పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నర సింహారావు పీడీ అకౌం ట్లలో 50 వేల కోట్ల రూపాయల దాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చ యిందని ఇది 2జీ స్కామ్ అంత పెద్ద కుంభకోణం అని పేర్కొంటూ ఒక తేనె తుట్టెను కదిపారు. రాష్ట్ర మంతా గత మూడు నాలుగు రోజులుగా ఈ అంశంపై చర్చతోనే మారుమోగుతున్నది. పీడీ అకౌంట్లు పేరుకు వ్యక్తిగత ఖాతాలుగా పేర్కొన్నా వాస్తవానికి ఇవి అధికారిక ఖాతాలే. వివిధ ప్రభుత్వ సంస్థల కార్యనిర్వహణాధికారులు వివిధ ప్రభుత్వ శాఖాధిపతులు ఈ అకౌంట్లను నిర్వహిస్తుంటారు. మార్చి నెల చివర కొత్త ఆర్థిక సంవత్సరానికి శాసన సభ బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. దీంతో ద్రవ్య విని యోగ బిల్లును కూడా శాసనసభ ఆమోదించడం జరుగుతుంది. ఈ రెండూ జరిగిన తరువాతనే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖాతాలలో పరిపాలనా యంత్రాంగం ఖర్చు చేయడానికి వీలవుతుంది. ప్రభుత్వ వ్యయం ప్రధానంగా ఆర్థిక శాఖలోని రెండు శాఖాధిపతుల ద్వారా జరుగుతుంది. నీటి పారుదల, భవనాలు, రోడ్లు వంటి మూలధన ప్రాజె క్టుల ఖర్చు పనులు ఖాతాల శాఖాధిపతి ద్వారా జరు గుతుంది. ఇక సాధారణ పరిపాలన ఖర్చు జీతాలు వగైరా ఖజానా ఖాతాల శాఖాధిపతి ద్వారా జరుగు తుంది. ఈ సాధారణ పద్ధతిలో ప్రభుత్వ పద్దులలో ఖర్చు జరిగే విధానంలో నిధులు విడుదల చేసే ముందు బిల్లులను తనిఖీ చేసే విధానం ఉంటుంది. అన్నివిధాలా సరిగా ఉంటే చెల్లింపులు చేయడం లేనిచో లోపాలను ఎత్తిచూపుతూ బిల్లును తిరిగి పంపుతారు. ఈ విధానాన్ని ఆచరించకుండా బిల్లు లకు చెల్లింపు చేయటానికి ఏర్పరచిన వెసులుబాటు పీడీ అకౌంట్ విధానం. దీనిలో ఆమోదించిన మొత్తాన్ని ఏకీకృత నిధిలో ఖర్చు చూపి పీడీ అకౌంట్లో జమ చేస్తారు. ఆపైన అవసరాన్ని బట్టి శాఖాధిపతి ఈ ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు. ఇక 2016–17 సంవత్సరం కాగ్ రిపోర్ట్ పరి శీలిస్తే పీడీ అకౌంట్ల విషయంలో రెండు మూడు ప్రధాన అంశాలను లేవనెత్తారు. దాదాపు సంవత్సర కాలంలో పీడీ అకౌంట్లకు 51 వేల కోట్లు తరలించడం జరిగిందని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పద్దుల కింద 22 వేల కోట్ల నిధులు ఉండగా సంవత్స రాంతానికి 26 కోట్ల మిగులు ఉందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన విషయం. రాష్ట్ర బడ్జెట్ రూ. 1,32,000 కోట్లయితే అందులో ఎటు వంటి వెసులుబాటు లేని ఖర్చు 65వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని జీతా లమీద, పెన్షన్లమీద వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేస్తారు. ఇక మిగిలిన ఖర్చు 67 వేల కోట్లు. అందులో పీడీ అకౌంట్ల ద్వారా ఖర్చయిన మొత్తం 47 వేల కోట్లు. అంటే వెసులుబాటు ఉన్న ఖర్చులో 70 శాతం ఖర్చు పీడీ అకౌంట్ల ద్వారానే జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను బిల్లుల తనిఖీకి అవకాశమున్న సాధన విధానం ద్వారా కాకుండా పీడీ అకౌంట్ విధానం ద్వారా ఖర్చు పెట్టడం తప్పకుండా అను మానాలకు దారి తీసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాడాల్సిన పీడీ అకౌంట్ విధా నాన్ని సింహభాగం చెల్లింపుల కోసం వాడటం సరైన విధానం కాదు. ఇక కాగ్ రిపోర్ట్‌లో పేర్కొన్న రెండో ప్రధాన అంశం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు వేల సంఖ్యలో ఉన్నాయని. మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు 58 వేల దాకా ఉండగా మిగి లిన రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో ఉన్నాయి. దీనికి చాలా వరకు కారణం మన రాష్ట్రంలో స్థానిక సంస్థలను వ్యవసాయ మార్కెటింగ్ సంస్థలను పీడీ అకౌంట్ల పరిధిలోకి తీసుకురావడమే. ఇది సరైన విధానం కాదు. ఆ సంస్థల నిధులను వారి సాధారణ ఖాతాలకు జమచేసి పీడీ అకౌంట్లను మూసివేయా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా చేసినా ఇంకా మన రాష్ట్రంలో పీడీ అకౌంట్ల సంఖ్య పదివేల దాకా ఉండే అవకాశముంది. కాగ్ రిపోర్టులో పేర్కొన్న మరొక ప్రధాన అంశం పీడీ అకౌంట్లలోనే కాకుండా సాధారణ బ్యాంకు ఖాతాలలో కూడా 19 వేల కోట్ల రూపా యల ప్రభుత్వ ధనం ఉన్నదని, దానిని రాబట్టుకుంటే ఆర్బీఐ నుంచి ఆ సంవత్సరం తీసుకున్న రుణానికి సమానం అవుతుందని పేర్కొన్నారు. బయట బ్యాంక్ అకౌంట్లలో ఎక్కువకాలం నిధులు ఉంటే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ. వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఆర్థిక శాఖ ఒక పెద్ద చొరవ తీసుకోవడం జరిగింది. కానీ అది ఏ కారణాల వల్లనో ఆగిపోయింది.స్థూలంగా పీడీ అకౌంట్లు శాఖాధిపతులకు కొంత వెసులుబాటు కల్పిస్తాయి. కానీ ఎప్పుడో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పరిమితంగా వాడవలసిన ఈ పీడీ అకౌంట్ విధానాన్ని పరిపాటిగా అన్ని రకాల నిధుల వినియోగానికి ఉపయోగిస్తే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) భారీ షాక్ ఇచ్చింది. యూపీఏ-2 ప్రభుత్వం(2009లో) నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి గస్తీ విమానాలను కోనుగోలు చేసిందని వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. పొసేడియన్ పీ-8ఐ సముద్ర గస్తీ విమానాలకు ఆహ్వానించిన టెండర్లను ఖరారు చేయడంలో యూపీఏ ప్రభుత్వం, రక్షణ శాఖ పొరపాటు చేశాయని కాగ్ తెలిపింది. 8 నిఘా విమానాల కోసం బోయింగ్ సంస్థ రూ.8,700 కోట్లు బిడ్డింగ్ వేయగా, యూరప్ కు చెందిన ఈఏడీఎస్ సంస్థ కేవలం రూ.7,776 కోట్లకే ఎనిమిది ఏ-139 విమానాలను సరఫరా చేస్తామని ముందుకు వచ్చిందని వెల్లడించింది. రాబోయే 20 ఏళ్లకు ఈ విమానాలకు అందించాల్సిన సర్వీసింగ్ ఖర్చుల్ని ఈఏడీఎస్ బిడ్డింగ్ కు కలిపేసిన రక్షణ శాఖ.. బోయింగ్ కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చిందని ఆక్షేపించింది. తద్వారా ఈఏడీఎస్ బిడ్డింగ్ ఖర్చు రూ.8,712 కోట్లకు చేరుకుంది. దీంతో బోయింగ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుందని వెల్లడించింది. బోయింగ్ నుంచి కొనుగోలు చేసిన పీ-8 నిఘా విమానాలకు మూడేళ్ల పాటు సర్వీసింగ్ కు ప్రత్యేకంగా మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని పేర్కొంది. సముద్రంపై నిఘాతో పాటు శత్రు దేశాల సబ్ మెరైన్లను వేటాడేందుకు మరో నాలుగు లాంగ్ రేంజ్ పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు 2013-15లో భారత నేవీ బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకుందని కాగ్ వివరించింది. -
పట్టిపీడిస్తున్న పాత ‘పాపం’ ?!
ఆంధ్రప్రదేశ్‌లో పర్సనల్ అకౌంట్ల పేరిట వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్ తాజా సర్వే(2015–16) నివేదిక వెల్లడించడంతో ఇది పెద్ద సంచలన సంక్షోభంగా మారింది. ఈ డిపాజిట్లలోని నిధులు ఖర్చుకాకపోతే అవి తిరిగి ప్రభుత్వ పద్దులకే జమ పడాలి. అంతేగాని, ఈ సొమ్ము పాలకుల ఇష్టానుసార స్వార్థ ప్రయోజనాలకు మళ్లించడానికి వీలులేదని కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. నాలుగేళ్లు గడుస్తున్నా అకౌంట్ల వివరాలకు అతీగతీ లేదని విమర్శించింది. ఒకవేళ ఖర్చుకాక మురిగిపోయే స్థితిలో ఉంటే అలాంటి పద్దులు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమపడాలి కదా అని కాగ్ ప్రభుత్వాన్ని గుంజినా ఉలుకూ పలుకూ లేదు. ఈ బాగోతం బాబు పాలనలోనే మొదలైంది. ఏ ప్రభుత్వానికైనా తన ద్రవ్య (ఆర్థిక) లావాదేవీలకు సంబంధించిన సవ్యమైన, విశ్వ సించదగిన, ఆరోగ్యకరమైన నివేదికను ప్రజలకు తెలియజేయాలి. ఏ విషయం దాచిపెట్టకుండా ఆ పని చేస్తేనే ఆ ప్రభుత్వం సామర్థ్యంగల, పకడ్బందీగా వ్యవహరించగల పాలనావ్యవస్థగా పరిగణ నలోకి వస్తుంది. ద్రవ్య నిబంధనలను, వాటిని పాటించడానికి అవసర మైన క్రమ పద్ధతులను, ఆదేశాలను సకాలంలో నిర్వహించగలిగితేనే అది సుపరిపాలనా లక్షణాల్లో ఒకటిగా (గుడ్ గవర్నెన్స్) భావించాలి. – ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై 2015–16 సంవత్సరానికి కాగ్ నివేదిక ఈ సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత డిపాజిట్ అకౌంట్ల (పీడీ అకౌంట్లు) ద్వారా రూ.53,039 కోట్లు దారిమళ్లాయి. వాటి గురించి వివరణ కోరితే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అమాంబాపతు (మిస్లీనియస్) పద్దు పేరిట ఉన్న ఈ సొమ్ముకు లెక్కలు చూపాల్సిన పని ఉండదన్న సాకుతో ఈ మొత్తాలు గల్లంతవుతున్నాయి. ఇలాంటి అకౌంట్లు గుజరాత్లో 475, పశ్చిమ బెంగాల్లో 153 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏకంగా 58,418 అకౌంట్లు తెరచి, వాటి ద్వారా ఏకంగా రూ.53,039 కోట్లను మళ్లించింది. – అదే ‘కాగ్’ నివేదిక తెగువ అనేది దేవేంద్ర పదవి అని పెద్దలు ఎందుకన్నారోగాని ముఖ్యమంత్రి పదవిని అలా భావించుకునే పాలకులు ఎందుకైనా తెగిస్తారని కడచిన వారంలో సంభవించిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రజాధనం దుర్వినియోగంలో కొందరు పాలకులకు వెరపు ఉండదు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో కోర్టు తీర్పులను సైతం ధిక్కరించే ధైర్యసాహసాలు వీరికున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ద్రవ్య వ్యవహారాల నిర్వహణలోనూ కేంద్రీయ ‘కాగ్’ నిఘా అంచనాలను, హెచ్చరికలను ఈ నాయకులు ఖాతరు చేయడం లేదు. రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల దృష్ట్యా వారు అనుసరి స్తున్న లోపాయికారీ ఎత్తుగడలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ప్రతిపక్షాలను ఎదుర్కునే తీరులో సైతం అన్ని ప్రమాణాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాతంత్ర విలువలను విస్మరిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లో తాజా ఉదాహరణ– ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని సుమారు ఐదారు జిల్లాల్లో రేపటి ఎన్నికల్లో ప్రతి పక్షాల ఓట్లను ఏ పద్ధతుల్లో తారుమారు చేయొచ్చో రోజుకో తీరున పాలకులు ‘పన్ను గడ’కు దిగుతున్నారు. మరోవైపు నుంచి పాలనా నిర్వ హణలో పాలకులు అనుసరిస్తున్న చౌకబారు ఎత్తుగడలనూ ప్రజలు గమ నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంస్థలు ఇంతకాలం ఓటింగ్ సమ యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పెట్టినా అవి తరచూ మొరాయి స్తున్నాయి. దీనికి కారణం వాటిని ఆపరేట్ చేసే సిబ్బందికి సరైన శిక్షణ లోపించిందనే సాకులు చెప్పడం మినహా సమస్యను పరిష్కరించడం లేదు. సాంకేతిక లోపాల వల్ల ఎన్నిక ప్రక్రియ ఓ పక్క ఇలా కుంటి నడ కన ముందుకు సాగుతుంటే– ముందస్తుగానే ప్రతిపక్షాల అభిమాను లుగా భావించే ప్రజల ఓటు హక్కుపై వేటు వేయడానికి కొన్ని పాలకప క్షాలు ప్రయత్నిస్తున్నాయి. అధికారపక్షం నేతలు ఎన్నికల కమిషన్ అధి కారులు, స్థానిక అధికారుల తోడ్పాటుతో గత నాలుగు ఎన్నికల్లోనూ అన్ని ఆధారాలతో నమోదైన కుటుంబ సభ్యుల ఓట్లను వేలు, లక్షల సంఖ్యలో తొలగించే ప్రక్రియకు తెర లేపడం విశేషం. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న ప్రధాన కేంద్రా లన్నింటిలోనూ గత కొద్ది రోజులుగా ఈ ఓట్ల తొలగింపు పని మొద లుబెట్టారు. ఇది ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లాకే పరిమితంగాకుండా కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సాగుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ జిల్లాల్లో నాలుగేళ్ల లోపే లక్షలాది మంది ఓటు హక్కును కత్తిరించారు. ఓట్లు కోల్పోయిన వారిలో మేయర్లు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు పదుల సంఖ్యలో ఉండడం విశేషమేగాక విచిత్రం కూడా. ఆంధ్రప్రదేశ్‌లో పర్సనల్ అకౌంట్ల పేరిట వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్ తాజా సర్వే (2015–16) నివేదిక వెల్లడించ డంతో ఇది పెద్ద సంచలన సంక్షోభంగా మారింది. ఈ డిపాజిట్లలోని నిధులు ఖర్చుకాకపోతే అవి (మురిగిపోయినట్టుగా పరిగణించి) తిరిగి ప్రభుత్వ పద్దులకే జమపడాలి. అంతేగాని, ఈ సొమ్ము పాలకుల ఇష్టా నుసార స్వార్థ ప్రయోజనాలకు మళ్లించడానికి వీలులేదని నివేదికలో కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే, ట్రెజరీస్–అకౌంట్స్ డైరెక్టర్ నిర్వహించే మొత్తం 181 రకాల ప్రధాన పద్దులకు సంబంధించి 58,418 ఖాతాలు తెరచి, అధికారుల కళ్లు మూసి అన్ని వేలకోట్ల రూపాయలు ఎలా దారి మళ్లించిందనే ప్రశ్న కాగ్‌కు ఎదురైంది. ఈ విషయం మరింత చక్కగా వివరిస్తూ, ‘‘పర్సనల్ డిపాజిట్ పద్దులకు చేరిన చెల్లింపుల వివరాల్లో చెక్ నంబరు, డిపాజిట్ అయిన మొత్తం, చెక్కు విడుదల చేసిన తేదీ ఉండి తీరాలి. కాని, చెక్కు ద్వారా డబ్బు ఎవరికి చెల్లించారో వారి పేరుగాని, ఆ చెక్కును మార్చి సొమ్ము చేసుకున్నవారి పేరుగాని అందులో లేవు’’ అని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. నాలుగేళ్లు గడు స్తున్నా అకౌంట్ల వివరాలకు అతీగతీ లేదని విమర్శించింది. ఒకవేళ ఖర్చు కాక మురిగిపోయే స్థితిలో ఉంటే ఆ మొత్తాలు తిరిగి సంచిత నిధికి (కన్సాలిడేటెడ్ ఫండ్) చేరాలి. అంటే, కాలం చెల్లి, మురిగిపోయిన పద్దు లేమైనా ఉంటే తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమపడాలి కదా అని కాగ్ ప్రభుత్వాన్ని గుంజినా ఉలుకూ పలుకూ లేదు. ఈ బాగోతం బాబు పాలనలోనే మొదలైంది. ఈ పోకడలను పద్నాలుగేళ్ల క్రితమే ప్రపంచ బ్యాంక్ పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు రుణాల రూపంలో తామిచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఖర్చుచేసిందో తెలుసుకోవాలని ఈ బ్యాంక్ భావిం చింది. ఈ నిధులతో క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాల తీరుతెన్ను లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని డీఎఫ్ఐడీ (డిపార్ట్మెంట్ ఫర్ ఇంట ర్నేషనల్ డెవలప్మెంట్) నియమించిన ప్రొ.జేమ్స్ మేనర్‌ను ఆంధ్ర ప్రదేశ్‌కు పంపించారు. మేనర్ తన సర్వే నివేదిక (2002–2004)లో, ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భారత దేశంలోనే అత్యంత కేంద్రీకృత, ఆధిపత్య విధానాలు అమలు చేస్తోంది. నిర్ణయాధికారంలో ఆయనది నిరంకుశ ధోరణి. తాను పెత్తనం చెలా యించలేని సంస్థలకు వనరులు, అధికారాలు అందకుండా చేస్తారా యన. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థలు ఆయా ప్రభుత్వ శాఖాధిపతులతోనే ప్రధానంగా చర్చలు జరుపుతాయి. కాని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మా డీఎఫ్ఐడీ రుణ సంస్థ కేవలం ఒక్క వ్యక్తితోనే అంటే ముఖ్యమంత్రితోనే సంప్రదించాలి. ఈ ప్రభుత్వం సమ ర్పించే లెక్కలు నమ్మదగినవిగా ఉండవు. ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి సమర్పించే లెక్కల విషయంలో గోరంతలు కొండంతలు చేసి చూపిం చడం జరుగుతోంది. వీటికి విధిగా సోషల్ ఆడిట్ జరపడం అవసరం. ప్రజాధనాన్ని నిర్లక్ష్యంగా ఖర్చుపెట్టేస్తున్నారు. పైగా, తన ప్రభుత్వం ప్రజాధనాన్ని చాలా పొదుపుగా ఖర్చు పెడుతున్నదని ముఖ్యమంత్రి చెబుతుంటారు. ప్రజలపట్ల ఆయనకు పారదర్శకత పూజ్యం. ఇక ఈయన హయాంలో అవినీతి మూడు స్థాయిల్లో (అధికార కేంద్రంలో/ మధ్య స్థాయిలో/జిల్లా స్థాయిలో) చెలరేగిపోయింది. ప్రభుత్వ కాంట్రాక్టులను ముంజూరు చేయడానికి భారీగా లంచాలు గుంజుతున్నారు. రూ.10 లక్షల విలువ కలిగిన పనులకు కాంట్రాక్టు ఇవ్వడానికి ముడుపులు (కిక్ బాక్స్) చెల్లించాల్సిందే. మధ్యస్థాయిలోని ఉన్నతాధికారులు ఆయా సంస్థలు లాభాలు గుంజడానికి అనుమతిస్తున్నారు. ఫండింగ్ ఏజెన్సీగా డీఎఫ్ఐడీ సమకూరుస్తున్న నిధుల్లో మూడింట ఒక వంతు నిధుల్ని లెజిస్లేటర్లు పక్క వాటుగా మరల్చుకుంటున్నారు. పనులు చేసి పెట్టే పేరిట అనేక క్రిమినల్ ముఠాలకు ముడుపులు అందుతున్నాయి. ఇక జిల్లా స్థాయిలోనూ, అంతకు కింది స్థాయిలోనూ ముఖ్యమైన పనులు చేసి పెట్టడానికి, లైసెన్సులు, పర్మిట్లు, ఇతర సేవలు అందించడానికి పౌరుల్ని అధికారులు వేధిస్తున్నారు. ఈ ప్రక్రియ మూలంగా ముడు పులు, లంచాలు చెల్లించుకోలేని పేదసాదలకు ఈ దోపిడీ భారంగా మారింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చు కోవడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు చేయని ప్రయ త్నమంటూ లేదు. తామనుకున్న విధంగా పాలన సాగించడానికి చేయా ల్సినదంతా చేస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలు గాలికి వదిలి పరిపా లన సాగిస్తున్నారు. అలాగే, ఏళ్లూ పూళ్లుగా పడి ఉన్న కేసుల పరిష్కారం కోసం గానీ, జిల్లా కోర్టుల్ని వేధిస్తున్న అవినీతి నిర్మూలనకు ప్రయత్నాలు జరగలేదు. న్యాయం కోసం అంగలారుస్తున్న పేదసాదలకు న్యాయం చేయడానికి తలపెట్టిన సంస్కరణలు ఏవీ కనిపించలేదు’’ అని వెల్లడిం చారు. ఈ నివేదిక వివరాలను నాడు ఇంగ్లిష్ దినపత్రిక ‘హిందూ’ కూడా (2004 జనవరి 9) ప్రచురించింది. ఇంక ముంజేతి కంకణానికి అద్దమెందుకు? ఆనాటి బాబు కథే తిరిగి మరొక రూపంలో కొనసాగు తుందని చెప్పడానికి!! ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
టీడీపీ హయంలో మరో అతి పెద్ద కుంభకోణం!
-
టీడీపీ హయంలో మరో అతి పెద్ద కుంభకోణం!
-
యాదాద్రిలో ‘కాగ్’ తనిఖీలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాగ్ సంస్థ అధికారులు తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఇదే సమయంలో దేవస్థానం ఆడిట్ కార్యాలయానికి తాళం వేసి ఉండడం ప లు అనుమానాలకు తావి స్తోంది. కాగ్ అధికారులు నివేదికలు అడుగుతారని, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే తాళం వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాదగిరికొండ(ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో రెండు రోజులుగా కాగ్ సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం నివేదికను ఆడిట్ జనరల్, దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపనున్నట్లు కాగ్ అధికారులు తెలిపారు. అన్నదానం, ప్రసాద విక్రయశాల, గోదాం, ఆలయం, గోశాల, శానిటేషన్తో పాటు మిగతా అన్ని విభాగాల్లో సుమారు 200 పైళ్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని కాగ్ అధికారులు తెలిపారు. దేవస్థానం ఆడిట్ కార్యాలయానికి తాళం దేవస్థానం ఆడిట్ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు. కారణాలు తెలియరాలేదు. కాగ్ అధికారులు తనిఖీలు చేపడుతున్న కారణంగా ఆడిట్ కార్యాలయంలోని నివేదికలు అడుగుతారని, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే తాళం వేశారని విశ్వసనీయ సమాచారం. సహాయ ఆడిట్ కార్యాలయాన్ని ఆడిట్ కార్యాలయంగా ప్రకటించిన వారం రోజుల్లో రెండుమార్లు తాళం వేయడం అనేక అనుమానాలు, విమర్శలకు తావిస్తోంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగబోమని చెప్పిన అధికారులే.. ఆడిట్ కార్యాలయానికి తాళం వేయడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.ముందస్తు సమాచారం లేకుండా ఆడిట్ కార్యాలయానికి తాళం వేయడంతో పనుల నిమిత్తం పైళ్లతో వచ్చిన వివిధ విభాగాల అధికారులు వెనుదిరిగారు. -
16 ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్నవి ఐదే
న్యూఢిల్లీ: దేశంలో 16 సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దం తర్వాత ఐదు మాత్రం నిర్మాణంలో ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక తూర్పారబట్టింది. నిర్మాణం నత్తనడకన సాగుతుండగా వాటి అంచనా వ్యయం విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్ పలు సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. వాటిల్లో ప్రస్తుతం పనులు నడుస్తున్నవి గోసిర్‌కుండ్, తీత్సా, సరయూ, ఇందిరాసాగర్ పోలవరం, షాపూర్–కాండి ప్రాజెక్టులు. కాగా, 2017 వరకు వీటి నిర్మాణానికి వెచ్చించిన మొత్తం రూ.13,299 కోట్లుగా కాగ్ తేల్చింది. ఈ ఐదు ప్రాజెక్టులు 8 శాతం నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్నాయి. వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ నిర్వహణ లోపాలున్నాయని తెలిపింది. -
అక్రమార్కుల పరం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వరదాయని పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ నేతల అక్రమాల పర్వాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయడం పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడింది. ఒప్పందం చేసుకున్నాక మూడేళ్ల వరకూ పనులే ప్రారంభించని హెడ్ వర్క్స్(జలాశయం) కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. రూ.1,389.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారంటూ సర్కార్ తీరును తూర్పరబట్టింది. హెడ్ వర్క్స్ పనుల్లో పురోగతి లేకున్నా జూన్, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని తేల్చిపారేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 16,010.45 కోట్ల నుంచి రూ. 55,132.92 కోట్లకు (ఆ తర్వాత రూ.57,940.86 కోట్లకు పెంచారు) సవరిస్తూ రూపొందించిన ప్రతిపాదనంతా తప్పులతడక అని అభివర్ణించింది. 2017–18లో జాతీయ సాగునీటి ప్రాజెక్టు పనులపై రూపొందించిన కాగ్ నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టు పనుల తీరును నిశితంగా పరిశీలించిన కాగ్.. పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అవతవకలకు పాల్పడినట్లు తేల్చింది. దేశంలో 16 జాతీయ సాగునీటి ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్లోనే పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్(ఏపీడీఎస్‌ఎస్) ప్రకారం పనులు చేయని కాంట్రాక్టర్లపై అపరాధ రుసుం విధించాల్సిందిపోయి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. వాటిని అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తుండటాన్ని కాగ్ తప్పుబట్టింది. ఇంతలోనే అంత తేడానా? వచ్చే సంవత్సరం జూన్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తికావడం అసాధ్యమని కాగ్ స్పష్టం చేసింది. హెడ్ వర్క్స్‌లో హెడ్ రెగ్యులేటర్ పనులు 93 శాతం, కనెక్టివ్స్ పనులు 46 శాతం, ప్రధాన డ్యామ్ పనులు 41.19 శాతం, ఇతర పనులు 94 శాతం మిగిలిపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జలాశయంలో పూర్తి స్థాయి అంటే 45.72 మీటర్ల కాంటూర్‌లో కాకుండా కనీస స్థాయిలో అంటే 41.12 మీటర్ల కాంటూర్‌లో నీటిని నిల్వ చేయాలంటే 11,552 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కానీ.. తాము పరిశీలించే నాటికి ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించకపోవడాన్ని కాగ్ ప్రస్తావించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ తయారు చేసిన ప్రతిపాదనల (డీపీఆర్–2)ను తప్పులతడకగా కాగ్ పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2009 నాటికి రూ.10,151.04 కోట్లు ఉంటే.. దాన్ని 2011 నాటికి రూ.16,010.45 కోట్లకు పెంచారని, 2013–14 ధరల ప్రకారం 2017లో అంచనా వ్యయాన్ని మళ్లీ సవరించి రూ. 55,132.92 కోట్లకు పెంచేస్తూ రూపొందించిన ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించని విషయాన్ని గుర్తుచేసింది. 2009, 2011 నాటికి పోలవరం జలాశయంలో 276 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అప్పటి డీపీఆర్‌లో పేర్కొందని, 2017లో రూపొందించిన డీపీఆర్–2 ప్రకారం ముంపు గ్రామాలు 371కి పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంపునకు గురయ్యే కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,05,601కు పెరగడంపైనా సందేహాలు వెలిబుచ్చింది. సర్వేలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల కుడి, ఎడమ కాలువల అలైన్మెంట్లు మారిపోయాయని, దీని వల్ల అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చి ఖజానాపై భారీగా భారం పడిందని కాగ్ నివేదికలో పేర్కొంది. హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్‌కు భారీ ప్రయోజనం మార్చి, 2013లో పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ. 4,054 కోట్లకు కాంట్రాక్టర్ (ప్రస్తుత టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ జాయింట్ వెంచర్)కు సర్కార్ అప్పగించింది. ఆగస్టు, 2015 వరకూ కాంట్రాక్టర్ ఎలాంటి పనులు చేయలేదు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌పై ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ (ఏపీడీఎస్‌ఎస్) నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఎదురు ప్రయోజనం చేకూర్చిందని తెలిపింది. హెడ్ వర్క్స్ పనుల్లో ధరలు పెరిగాయనే సాకు చూపి అంననా వ్యయాన్ని రూ. 5,385.91 కోట్లు పెంచేశారని.. దీని వల్ల కాంట్రాక్టర్‌కు రూ. 1,331.91 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారంటూ ప్రభుత్వ పెద్దల అక్రమాలను ఎత్తిచూపింది. ఒప్పందం ప్రకారం హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్ సమకూర్చుకోవాల్సిన స్టీల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చి దాని కోసం ఖర్చు చేసిన రూ. 25.37 కోట్లను ఆ కాంట్రాక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయలేదంటూ కాగ్ వెల్లడించింది. అలాగే తవ్విన మట్టిన పోసేందుకు అవసరమైన భూమి (డంపింగ్ యార్డ్) కాంట్రాక్టరే సేకరించుకోవాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వమే దానిని రూ. 32.66 కోట్లతో సేకరించి ఇచ్చి ఆ నిధులను ఇప్పటి వరకూ వసూలు చేయకపోవడాన్ని కాగ్ ఎత్తిచూపింది. అడ్డగోలుగా నామినేషన్ దందా పోలవరం ఎడమ కాలువలో మూడు ప్యాకేజీల పనుల్లోనే రూ. 256.7 కోట్లు భారం ఖజానాపై పడిందని కాగ్ తేల్చింది. ఆ మేరకు అస్మదీయ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొంది. – ఒకటో ప్యాకేజీ (0 కి.మీ. నుంచి 25.60 కి.మీ.వరకూ ) పనులను రూ. 254.88 కోట్లకు మార్చి, 2005లో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో పనులు పూర్తి కావాలి. కానీ జూన్, 2017 వరకూ ఆ పనులు పూర్తి కాలేదు. ఏపీడీఎస్‌ఎస్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. ఒప్పంద విలువలో ఐదు శాతం అంటే రూ. 12.74 కోట్లు అపరాధ రుసుం కింద వసూలు చేయాలి. ఐతే కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిగిలిపోయిన రూ. 38.78 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి, ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.171.39 కోట్లకు పెంచేసి, నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కొత్త కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. అంచనా వ్యయం పెంచడం వల్ల రూ. 132.61 కోట్లు, పాత కాంట్రాక్టర్ నుంచి అపరాధ రుసుం కింద రూ.12.74 కోట్లను వసూలు చేయకపోవడం వల్ల ఖజానాపై రూ.145.35 కోట్ల భారం పడిందని కాగ్ పేర్కొంది. – నాలుగో ప్యాకేజీ (69.145 కి.మీ. నుంచి 93.70 కి.మీ. వరకూ) పనులను మార్చి, 2005లో రూ. 206.80 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 24 నెలల్లోగా పనులు పూర్తి కావాలి. కానీ.. జూన్, 2017 వరకూ పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ నుంచి రూ.10.34 కోట్లు అపరాధ రుసుంగా వసూలు చేయాలి. మిగిలిపోయిన రూ. 66.07 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని రూ. 108.86 కోట్లకు పెంచేసి.. నామినేషన్ పద్ధతిపై కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అంచనా వ్యయాన్ని పెంచడం వల్ల రూ. 42.79 కోట్లు, అపరాధ రుసం రూ.10.34 కోట్లు వసూలు చేయకపోవడం వల్ల సర్కార్ ఖజానాకు రూ.53.13 కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ ఎత్తిచూపింది. – ఐదో ప్యాకేజీ(93.70 కి.మీ. నుంచి 111 కి.మీ. వరకూ) పనులను మార్చి, 2005లో రూ.181.60 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 24 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలి. కానీ.. జూన్, 2017 వరకూ పనులు పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ నుంచి రూ. 9.08 కోట్లు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిగిలిన రూ.93.74 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ. 142.88 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అంచనా వ్యయం పెంచడం వల్ల రూ. 49.14 కోట్లు, అపరాధ రుసుం వసూలు చేయకపోవడం వల్ల రూ.9.08 కోట్లు వెరసి రూ.58.22 కోట్ల మేర ఖజానాపై భారం పడిందని కాగ్ వెల్లడించింది. కుడి కాలువలోనూ అదేతీరు.. పోలవరం కుడి కాలువ రెండో ప్యాకేజీ పనుల్లో 19 కి.మీ. వద్ద, 19.75 కి.మీ. వద్ద హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఏఐఎల్) పైపు లైన్లు క్రాస్ అవుతాయి. ఈ క్రాసింగ్‌ల్లో పైపు లైన్లు మార్చే పనుల వ్యయాన్ని కాంట్రాక్టరే భరించాలి. ఈ మేరకు మే, 2012లో రూ. 2.72 కోట్లు డిపాజిట్ చేయాలని హెచ్‌పీసీఎల్, రూ. 4.47 కోట్లు డిపాజిట్ చేయాలని జీఏఐఎల్ కాంట్రాక్టర్‌ను కోరాయి. కానీ.. మే, 2015 వరకూ కాంట్రాక్టర్ ఆ డబ్బు డిపాజిట్ చేయలేదు. పనులు వేగవంతంగా జరగాలనే సాకు చూపి రాష్ట్ర ప్రభుత్వమే జీఏఐఎల్కు రూ. 6.89 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.7.21 కోట్లు డిపాజిట్ చేసింది. వాటిని ఇప్పటివరకూ కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. -
‘రాఫెల్’పై కాగ్ విచారణ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో భారత్ కుదుర్చుకున్న రూ.58,000 కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్‌సభకు తెలిపారు. 2019, సెప్టెంబర్ నుంచి భారత్‌కు ఈ యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు. రక్షణ రంగానికి సంబంధించి 2015 నుంచి ఇప్పటివరకూ సీబీఐ 4 కేసుల్ని నమోదు చేసిందన్నారు. రైల్వేశాఖపై నయాపైసా భారం లేకుండా దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ పార్లమెంటుకు రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 707 రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ది ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(సవరణ) బిల్లు–2018ను పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రద్దీ ఉండే విమానాశ్రయాలనే మేజర్ ఎయిర్‌పోర్టులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 లక్షలుగా ఉంది. అలాగే వేర్వేరు విమానాశ్రయాలు, ఎయిర్‌డ్రోమ్‌లకు మార్కెట్ ధరల ఆధారంగా వేర్వేరు టారీఫ్‌లు ఉండేలా ఈ చట్టంలో సవరణలు చేశారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మిగిలిన పట్టణాలతో అనుసంధానించేందుకు మరో వెర్షన్ ‘ఉడాన్’ పథకాన్ని తీసుకురానున్నట్లు పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు. ఏ సందర్భంలో దేశ ద్రోహ చట్టాన్ని ప్రయోగించవచ్చన్న విషయమై సలహాలు అందించేందుకు జాతీయ న్యాయ కమిషన్ భారతీయ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 124(ఏ)ను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వర్షపాతంపై మరింత కచ్చితత్వంతో అంచనాలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సింగ్ లోక్‌సభకు తెలిపారు. పనితీరును మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఐఎండీ దేశీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.వివాదాస్పద ఎఫ్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) బిల్లు–2017ను కేంద్రం పార్లమెంటు నుంచి వెనక్కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులోని ‘బెయిల్ ఇన్’ నిబంధనపై విమర్శలు రావడంతో బిల్లును వెనక్కు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఆదాయ వృద్ధిలో తెలంగాణ నం.1
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. ఆదాయాభివృద్ధి రేటులో అరుదైన ఘనత సాధించింది. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ)లో 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు కాగ్ వెబ్సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నుంచి 2018 మే వరకు ఆదాయాభివృద్ధి వివరాలను కాగ్ వెల్లడించింది. మొత్తం నాలుగేళ్ల కాలంలో తెలంగాణ సగటున 17.2 శాతం వృద్ధి రేటు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ 2015–16లో 13.7 శాతం, 2016–17లో 21.1 శాతం, 2017–18లో 16.8 శాతం వృద్ధిరేటు సాధించింది. 14.2 శాతంతో హరియాణా, 13.9 శాతంతో మహారాష్ట్ర, 12.4 శాతంతో ఒడిశా, 10.3 శాతంతో పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ 10 శాతంలోపు వృద్ధిరేటు సాధించాయి. ఆర్థిక విధానాలు.. క్రమశిక్షణ వల్లే : కేసీఆర్ రాష్ట్రంలో అవలంభిస్తున్న ప్రగతికాముక ఆర్థిక విధానాలు, పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లనే ఆదాయాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడానికి కారణాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) లాంటి నిర్ణయాల తర్వాత కూడా తెలంగాణ సుస్థిరమైన ఆదాయాభివృద్ధితో ఆర్థిక ప్రగతి సాధించడం శుభసూచకమన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత బాగా అమలు చేసుకోవడానికి ఆదాయాభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
ధర్మ పోరాటం కాదు.. సీట్ల ఆరాటం: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దీక్షలో ధర్మపోరాటం కంటే సీట్లు కావాలన్న ఆరాటమే ఎక్కువగా కనిపించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేవలం సీట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం, మంత్రులు పనిచేయడం మానేసి..గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తూ కాలం చెల్లిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వద్దు స్పెషల్ ప్యాకేజీయే కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ చూస్తే ఏపీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందన్నారు. పట్టిసీమలో వందల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ నివేదించినా..రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక సాధికారిక సంస్థ(ఎస్పీవీ) కింద కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని జీవీఎల్ పేర్కొన్నారు. నిధులు తీసుకోకపోవడానికి సాకులు చెప్తూ..ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీవీ కింద వచ్చే నిధులను వినియోగించాలని, వాటిని ఎలా ఖర్చు చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదివరకు ఇచ్చిన నిధులకు వివరాలు ఇవ్వలేనందునే రాష్ట్రానికి రావాల్సిన 350 కోట్లు నిలిపివేశారన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేస్తే తామే ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. బీజేపీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తోందన్నారు. కేంద్రం చేపట్టిన పంట భీమా పథకం రైతులకు చాలా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతోందని, చాటు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటు వెయ్యొద్దని బాబు పిలుపునివ్వడం ఆయన భ్రమ అని..ఇక్కడి ప్రజలనే ప్రభావితం చేయనివారు అక్కడేం చేస్తారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కంటే 50 శాతం గిట్టుబాటు ధరను అందించేలా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
‘ఎన్టీఆర్ పేరు పెడతానంటే ఉలుకెందుకు?’
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అవినీతి కుటుంబ పాలనగా నడుస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిన అవినీతి ఎక్కడ బయట బయటపడుతుందో అని తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటే టీడీపీకి ఉలుకెందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు కానీ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ ఎందుకు పెట్టలేదన్నారు. ఏపీలో 560 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ఇస్తే చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు అనుభవం దీనికే పనికొచ్చింది’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుభవముందని ప్రజలు ఓట్లు వేస్తే ఆ అనుభవాన్ని దోచుకోవడానికి, దాచుకోవడానికే ఉపయోగించారని కాంగ్రెస్ మాజీ మంత్రి సి. రామచంద్రయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, దీనికి నిదర్శనం కాగ్ రిపోర్టేనని ఆరోపించారు. అసెంబ్లీ ఆఖరి రోజున కాగ్ రిపోర్ట్ రావడం వల్ల కొన్ని విషయాలు చర్చకు రాలేదని, మొదట్లో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెడితే చర్చకు తావు ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు ప్రపంచం అంతా తిరిగి అప్పులు తీసుకువచ్చారని, ఆ భారం అంతా ప్రజలపైనే పడుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 32 శాతం అప్పులే కట్టాలన్నారు. డబ్బును దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల 2018-19 చివరినాటికి రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. -
ఆర్థిక క్రమశిక్షణ లేదు.. అడిగినా వివరణ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని పీఏసీకి కాగ్ నివేదించింది. సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, దీనిపై అధికారులకు లేఖ రాసినా వివరణ ఇవ్వలేదని పేర్కొంది. సోమవారం శాసనసభ కమిటీహాలులో పీఏసీ సమావేశమైంది. పీఏసీ చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, రాములునాయక్ హాజరయ్యారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఏసీకి కాగ్ అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుని, నిధులు మళ్లించి ప్రభుత్వం ఆదాయంగా చూపించిందన్నారు. హడ్కో ద్వారా తీసుకున్న అప్పును ఆర్థిక శాఖ ఆదాయంగా చూపించిందని వివరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకున్న రుణాన్ని ఆదాయంగా చూపించారన్నారు. విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపులు, ఖర్చులు ఏటేటా తగ్గించార, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదన్నారు. దీంతో సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిచి సమాచారం తీసుకోవాలని పీఏసీ నిర్ణయించింది. -
కాగ్ నివేదికపై కాంగ్రెస్ రాద్ధాంతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాగ్ రిపోర్టుపై గతంలో కాంగ్రెస్ నేత లు, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ఎస్.జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీని వాస్‌గౌడ్‌తో కలసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కాగ్ నివేదికపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కాగ్ తన నివేదికలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. సాంకేతిక అంశాలను ప్రస్తావిం చిందే తప్ప.. అక్రమాలు జరిగినట్లు చెప్పలేదన్నారు. ప్రాజెక్టులతో పాటు ప్రతీ అంశంలో కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా గొల్ల, కురుమల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ఈ నెల 29న పరేడ్‌గ్రౌండ్‌లో గొల్ల, కురుమల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఏపీని అప్పుల కుప్పగా మార్చారు
-
ఆర్థికరంగ నివేదిక ఏమైంది!?
సాక్షి, హైదరాబాద్ : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల్లో అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగం రిపోర్టును అసెంబ్లీకి సమర్పించకుండా దాచడంలో మతలబు ఏమిటో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచుకుని దండుకున్న మొత్తం, విద్యుదుత్పత్తికి బొగ్గు కొనుగోళ్లలో గోల్మాల్ వ్యవహారాలు బయటకు పొక్కుతాయనే భయంతోనే ఈ రిపోర్టును దాచినట్లుందన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ బాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర నిధులను, అప్పు చేసిన మొత్తాలను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. కాగ్ నివేదికల్లో ఆర్థిక విభాగం (ఎకనమిక్ సెక్టార్) రిపోర్టు చాలా ముఖ్యమైందని.. ఈ నివేదికను రిపోర్టు–4 అంటారన్నారు. మిగిలిన నివేదికల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం రిపోర్టు–4ను మాత్రం బహిర్గతం చేయలేదని విమర్శించారు. నివేదికలోని అంశాలకు భయపడే బాబు టీడీపీ ఎంపీలను రాజీనామా చేయించకుండా ఆపించారా? అని ఆయన ప్రశ్నించారు. 2015 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి హోదా అంశం ప్రస్తావన లేకపోవడాన్ని మా నేత వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావిస్తే.. ‘‘మీకు అనుభవం లేదు. విషయ పరిజ్ఞానంలేదు. ట్యూషన్ పెట్టించుకోండి..’’ అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే, ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని మేం చెబితే ‘‘ప్రతిపక్ష నేతకు, విపక్ష ఎమ్మెల్యేలకూ ఏమీ తెలియదు’’ అంటూ మమ్మల్ని దబాయించారు. ఇప్పుడు జరిగిన నష్టానికి బాధ్యత సీఎం చంద్రబాబుదేనన్నారు. -
‘కాగ్’ బాణాలపై ప్రత్యేక సమావేశాలు?
సాక్షి, హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) లేవనెత్తిన అంశాలపై ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రమని 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వేలెత్తి చూపింది. పద్దుల తీరును సైతం తప్పుబట్టింది. ఏకంగా అప్పుగా తెచ్చిన నిధులను ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని ఆక్షేపించింది. కాగ్ ప్రస్తావించిన అంశాలను ఆధారంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలకు దిగింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అప్పుల తీరు, ఆర్థిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఎండగట్టారు. ఈ పరిస్థితులన్నీ అధికార పార్టీని కలవరపాటుకు గురి చేశాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముగిసే ఆఖరి రోజున ప్రభుత్వం కాగ్ నివేదికలను సభ ముందుంచింది. దీంతో కాగ్ నివేదికల్లో వెల్లడించిన అంశాలపై ప్రభుత్వం తరఫున తమ వంతు వివరణను బహిరంగంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కాగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సీఎం వాస్తవానికి కాగ్ తమ ఆడిట్లో గుర్తించిన లోటుపాట్లు, ఆడిట్ లొసుగులేమన్నా ఉంటే ముందుగానే ఆర్థిక శాఖకు సమాచారం అందిస్తుంది. ప్రభుత్వం నుంచి తగిన వివరణను కోరుతుంది. ఇది ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే అడిటింగ్ ప్రక్రియగానే అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారీగా అవినీతి అవకతవకలు జరిగినట్లు కాగ్ వేలెత్తి చూపితే తప్ప ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని ప్రభుత్వం పదే పదే చెప్పిన అంశాన్ని నీరుగార్చేలా కాగ్ వ్యాఖ్యలు చేయడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి ఒక రోజంతా కాగ్ ప్రస్తావించిన అంశాలపైనే సమీక్షించారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ ఆర్థిక నిర్వహణ పకడ్బందీగా ఉందని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికలు.. అక్కడ జరిగిన లోటుపాట్లు.. కొన్నింటిని కాగ్ దాచిపెట్టిన తీరును సైతం ఈ సందర్భంగా సీఎం అధికారులతో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి యోచన దేశంలో గుణాత్మక మార్పు రావాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఇటీవలే పిలుపునిచ్చారు. ఈ సమయంలో కాగ్ తమ నివేదికలో వెల్లడించిన అంశాల వెనుక రాజకీయంగా తమను ఇరుకున పెట్టే ఉద్దేశమేదైనా ఉందా.. అనే కోణంలోనూ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యులు, అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఒక దశలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాగ్ నివేదిక.. ప్రతిపక్షాల విమర్శలన్నింటినీ తిప్పి కొట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడ్డారు. చివరి నిమిషంలో మీడియా సమావేవానికి బదులు ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందులోనే కాగ్‌పై సమగ్రంగా చర్చించే ఏర్పాట్లు చేయాలని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది. కానీ కాగ్‌పై చర్చిస్తే ఈ విషయాన్ని మరింత పెద్దగా చేసినట్లుగా ఉంటుందని, ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు సమాచారం. మరోవైపు కొత్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసే అంశంపై సీఎం ఇదే సందర్భంగా అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సీపీఎస్, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి మినహాయించాలని కేంద్రాన్ని కోరాలని, అందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానం చేస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. -
‘కాగ్’ నివేదిక చెంపపెట్టు లాంటిది
స్టేషన్ మహబూబ్‌నగర్ : ఇతర రాష్ట్రాల కంటే తనపాలనే మెరుగు అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కాగ్‌నివేదిక చెంపపెట్టులాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన, స్థానిక పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో 10శాతం పెట్టుబడి వ్యయం ఎక్కు వ అని కాగ్ తెలిపిందన్నారు. కేటాయించిన రూ. 10వేల కోట్లు ఖర్చులేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభు త్వం ఉందన్నారు. మిషన్ కాకతీయ పథకం పూర్తి గా అక్రమాల పుట్ట అని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రైతురుణమాఫీని ఒకేసారి చేశారని, కాని ఈ ప్రభుత్వం నాలుగుసార్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులపై వడ్డీభా రం పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజ లు తగిన బుద్ధిచెబుతారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, నేత శశిధర్ పాల్గొన్నారు. -
అ అంటే అవినీతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో ఏకి పారేసింది. అంచనా వ్యయాలను పెంచేస్తూ కాంట్రాక్టర్లకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చడాన్ని తూర్పారబట్టింది. అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ నిధులను దారి మళ్లిస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడిందని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు, సీబీఐ తేల్చిన కాంట్రాక్టు సంస్థకే అధిక ధరలకు కాంట్రాక్టును అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనసమీకరణ కోసం పాల కేంద్రానికి చెందిన రూ.22 లక్షలను వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖజానా శాఖ చెబుతోన్న లెక్కలకూ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకూ పొంతనే లేదని కాగ్ తేల్చిచెప్పింది. ఆర్థిక క్రమశిక్షణలో అడుగడుగునా ఉల్లంఘనలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికతో అక్రమాలు బట్టబయలవడంతో సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నియమావళి సెక్షన్ 3 ప్రకారం వ్యక్తిగత చెక్కుల రూపంలో ఎలాంటి నిధులను విడుదల చేయకూడదు. కానీ.. నిధులు మురిగిపోవడాన్ని తప్పించుకునే ముసుగులో భారీగా నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారించింది. 2016–17లో జిల్లాల ఖజానా అధికారులు రూ.257.89 కోట్లను వ్యక్తిగత చెక్కుల రూపంలో జారీ చేశారని.. వివిధ బ్యాంకుల మేనేజర్ల పేరుతో రూ.1,325.88 కోట్ల విలువైన 353 చెక్‌లను జారీ చేసినట్లు గుర్తించింది. మొత్తం రూ.1,583.77 కోట్ల నిధులను ఏ పనుల కోసం చెల్లించారన్నది చెక్కుల్లో పేర్కొనలేదని స్పష్టం చేసింది. ఆ నిధులు మొత్తం దారిమళ్లినట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే మార్చి నెలలో భారీ ఎత్తున నిధులు ఖర్చు అయినట్లు సర్కార్ లెక్కలు చూపడంపై కాగ్ నివ్వెరపోయింది. సచివాలయంలో ఆర్థిక సేవలు పేరుతో ఏడాది మొత్తం రూ.868.81 కోట్లు ఖర్చు చేస్తే.. ఒక్క మార్చి నెలలోనే రూ.426.23 కోట్లు ఖర్చు చేసినట్లు చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు, సీబీఐ అక్రమార్కుడని తేల్చినా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ఫలకాల (హెచ్ఎస్ఆర్పీ)ప్రాజెక్టులో లింక్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(ఎల్ఐపీఎల్) అక్రమాలకు పాల్పడినట్లు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే ప్రాజెక్టు అమలులో అక్రమాలకు పాల్పడటంతో ఉత్సవ్ సేఫ్టీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (యూఎస్ఎస్ఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమాలకు పాల్పడిన ఈ సంస్థలు ఏర్పాటు చేసిన కన్సార్టియంకు అధిక ధరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎస్ఆర్పీ ప్రాజెక్టును అప్పగించడంపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కన్సార్టియంకు పనులు అప్పగించవద్దంటూ ఏపీఎస్ఆర్టీసీ న్యాయ సలహాదారు ఇచ్చిన న్యాయ అభిప్రాయాన్ని కూడా తోసిపుచ్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో ఫలకం సగటున రూ.119 నుంచి రూ.146కు ఇదే సంస్థ అమర్చితే.. రాష్ట్రంలో మాత్రం ఒక్కో ఫలకం అమర్చడానికి ఆ సంస్థకు రూ.220.34 చెల్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చింది. కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి రాష్ట్రంలో నిర్మాణంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.27,403.74 కోట్లు పెంచేసినా ఒక్క ప్రాజెక్టునూ ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు. వివిధ కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుందని.. వాటిని మార్చి 31, 2017 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన సర్కార్ అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచేసింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చినట్లు కాగ్ ఎత్తిచూపింది. 2016–17లో ‘నీరు–చెట్టు’ పథకానికి బడ్జెట్లో రూ.135 కోట్లు కేటాయించి.. చివరికి రూ.1,242 కోట్లు ఖర్చు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ శాఖలో 143.46 కోట్ల లూటీ ఎక్సైజ్ శాఖ్లో అస్మదీయులకు రూ.143.46 కోట్లు దోచిపెట్టడంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 2 వేల లక్షల ప్రూఫ్ లీటర్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తామని అంగీకార లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఇచ్చారు. ఇందుకు ఫీజు కింద రూ.129 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ డిస్టిలరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని వెయ్యి లక్షల ప్రూఫ్ లీటర్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం ఓకే చెప్పడాన్ని కాగ్ ఆక్షేపించింది. దీని వల్ల ఎస్పీవై రెడ్డి సంస్థకు రూ.60 కోట్లకుపైగా లబ్ధి చేకూర్చినట్లు గుర్తించింది. అటు విత్తనాభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న అవకతవకలను తూర్పా రబట్టింది. 2015–16 రబీలో జేజీ–11 అనే శనగ సర్టిఫైడ్ విత్తనాల సేకరణలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు 3సార్లు విత్తన ధరను పెంచారు. దాంతో.. రూ.38.24 కోట్లు దుర్విని యోగమయ్యాయని కాగ్ తేల్చింది. విత్తన పంపిణీ ఏజెన్సీల నుంచి 12.26 కోట్ల బకాయిలు వసూలు చేయకపోవడాన్ని ఎత్తి చూపింది. అస్మదీయ కాంట్రాక్టర్ కోసం.. ఏపీ జెన్కోలో కాంట్రాక్టర్లకు అడుగులకు అధికారులు మడుగులొత్తడం వల్ల భారీ ఎత్తున నిధులు దారిమళ్లినట్లు కాగ్ గుర్తించింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో బూడిద చెరువు–2ను పటిష్ఠం చేసే పనులను రూ.30.21 కోట్లకు కేసీఎల్– ఆర్వీఆర్(జేవీ) సంస్థకు అప్పగించారు. ఒప్పందం ప్రకారం మట్టి ఎంత దూరం నుంచి తెచ్చినా ఏపీ జెన్కోకు సంబంధం ఉండదు. అదనపు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మట్టిని 42 కి.మీల దూరం నుంచి తెచ్చానని.. అదనపు బిల్లులు ఇవ్వాలన్న కాంట్రాక్టర్ ప్రతిపాదనను అంగీకరించడంతో రూ.7.10 కోట్లు దుర్వినియోగమయ్యాయని కాగ్ తేల్చింది. సీఎం సభ జనసమీకరణ కోసం గ్రామీణ నీటి సరఫరా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ), గిరిజన ప్రాంత అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో రూ.42.92 కోట్లను దుర్వినియోగం చేసినట్లు కాగ్ ఎత్తి చూపింది. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనసమీకరణ కోసం పాల కేంద్రానికి చెందిన రూ.22 లక్షలను దుర్వినియోగం చేసినట్లు తేల్చింది. -
‘కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని అమ్మొద్దు’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీకి చెందిన ఓ తోకపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడికి పోయిందో చెప్పాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీకి సిద్ధాంతాల గురించి ఏ మాత్రం తెలియదన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ వ్యాపారి అని.. ఆయనకు అమ్మడం, కొనడం మాత్రమే తెలుసునని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు. ఎన్నికలు వచ్చే వరకు మోదీకి మిత్రపక్షంగా కేసీఆర్ ఉంటారని, కానీ టీఆర్ఎస్ పార్టీని మాత్రం బీజేపీకి అమ్మవద్దని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇచ్చిన హామీలతో పాటు తెలంగాణకి సమానంగా ఐటీఐఆర్, ఉక్కు ఫ్యాక్టరీలను నెలకొల్పాలని.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిధులు కేంద్రాన్ని అడగాలని కేసీఆర్‌ను సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని కాగ్ రిపోర్ట్ ద్వారా తేలిందన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ ప్రకారం ఆర్థిక, ద్రవ్య భద్రత కోసం లోన్ తీసుకోవచ్చన్నారు. ద్రవ్యోల్బణంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నవని, ద్రవ్యలోటు 4.7 శాతం పెరిగిందని తెలిపారు. 60 వేల కోట్ల రూపాయల అప్పును 2.21 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని చురకలు అంటించారు. 70 ఏళ్లలో చేసిన అప్పుల కంటే 4 ఏళ్లలోనే రెండింతల అప్పులు ఎక్కువ చేశారంటూ మండిపడ్డారు. మన వ్యవస్థలో కాగ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. టీఆర్ఎస్ నేతలకు అవి కాకి లెక్కల్లా కనిపిస్తున్నవని, అయినా వారికి ఇంత పెద్ద విషయాలు అర్థం కావని అభిప్రాయపడ్డారు. ముందు తరాలను నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని కేసీఆర్‌ను కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
అప్పులు చేసి పప్పు బెల్లాలకు వ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైందని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రోజు వారీ ఖర్చులతో పాటు రెవెన్యూ రంగాలకు వ్యయం చేయడంతో ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోయే ప్రమాదం ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. మార్చితో ముగిసిన 2016– 17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. రూ.17,231 కోట్ల అప్పులు చేసి రెవెన్యూ వ్యయానికి వెచ్చించిందని కాగ్ పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వ్యయం రూ.1,14,168 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రెవెన్యూ వ్యయం అంచనాలకు మించి రూ.1,16,215 కోట్లకు చేరిందని నివేదికలో స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యయంలో 85.17 శాతాన్ని రెవెన్యూ రాబడుల నుంచి ఖర్చు చేయగా, మిగిలిన ఖర్చును రుణాల ద్వారా సేకరించిన నిధుల నుంచి చేశారని కాగ్ ఎత్తిచూపింది. రుణాలు ఎక్కువగా చేస్తున్నారని, ఇది ప్రజా రుణంలో పెరుగుదలను సూచిస్తోందని, రానున్న సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ రుణ బాధ్యతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 2016–17లో రెవెన్యూ ఖర్చు అంతకు ముందు ఆర్థిక ఏడాది కంటే రూ.20,265 కోట్లు పెరిగిందని ఎత్తిచూపింది. రుణాల ద్వారా సమకూర్చుకున్న నిధులను రెవెన్యూ ఖర్చు కోసం వినియోగిస్తే వీటి నుంచి ఎలాంటి ఆస్తులూ ఏర్పాటు కాకుండానే రానున్న సంవత్సరాల్లో తీర్చాల్సిన రుణ భారం పెరిగేందుకు దారితీస్తుందని కాగ్ పేర్కొంది. సామాజిక రంగాలకు అన్యాయం! సామాజిక రంగంలోని విద్య, ఆరోగ్యం, సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం రంగాలపై చేసిన కేపిటల్ వ్యయం మొత్తం ఖర్చులో 4.62 శాతమే ఉందని, దీంతో సామాజిక రంగానికి తక్కువ నిధులు కేటాయించినట్లు కాగ్ పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రుణ బాధ్యతల విలువ రూ.2,01,314 కోట్లు అని, ఇది రెవెన్యూ రాబడులకు 2.03 రెట్లు, జీఎస్డీపీలో 28.79 శాతంగా ఉందని కాగ్ పేర్కొంది. అప్పులను తక్కువగా చూపించేం దుకు రాష్ట్రం ప్రయత్నిస్తోందని కాగ్ తప్పుప ట్టింది. బడ్జెట్లో వెల్లడించని రుణాలు రూ.11,867 కోట్లు, గ్యారెంటీ ఇచ్చిన రుణ బకాయిలు రూ.9,665 కోట్లు కలుపుకుని చూస్తే రుణ చెల్లింపుల బాధ్యతలు రూ.2,22,845 కోట్లు అని స్పష్టం చేసింది. 2016–17 సంవత్సరానికి జీఎస్డీపీతో ఈ చెల్లింపు బాధ్యతల నిష్పత్తి 31.87 శాతంగా ఉందని వెల్లడించింది. కాగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. - సొంత రెవెన్యూ వనరుల కంటే రుణాల రాబడుల మీదే ప్రభుత్వం అధికంగా ఆధారపడిందని సూచికలన్నీ స్పష్టం చేస్తున్నాయి. - సమృద్ధమైన ఆర్థిక పరిస్థితికి దోహదపడేలా, వనరుల సమీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం పెంపొదించుకోవాలి. - రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు మూల ధన ఆస్తుల ఏర్పాటు కంటే రోజువారీ కార్యకలాపాలపై పెరిగింది. - 2016–17లో కేపిటల్ వ్యయం 11.48 శాతం. ఇది సాధారణ వర్గం రాష్ట్రాల సమష్టి సగటు 19.70 శాతం కన్నా చాలా తక్కువ. - 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి 2016–17లో రూ.4,370 కోట్ల మేర ఎక్కువ నిధులు సమకూరినప్పటికీ, ఈ నిధులను మూలధన ఆస్తుల ఏర్పాటుకు ఉపయోగించలేదు. - రానున్న ఏడు సంవత్సరాల్లో 50 శాతానికి మించి రూ.76,888 కోట్ల రుణాలను తీర్చాల్సి ఉండటం ఆయా సంవత్సరాల్లో బడ్జెట్‌పై భారం మోపనుంది. -
ఏపీ ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దారుణంగా ఉందో కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) నివేదికతో బట్టబయలైంది. ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని కాగ్ తమ నివేదికలో తప్పుపట్టింది. 2014-16 మధ్య కాలంలో బడ్జెట్ కేటాయింపులకు మించి చేసిన 53, 673 కోట్ల రూపాయాల అధిక వ్యయాన్ని ఇప్పటివరకూ క్రమబద్ధీకరించలేదని తేలిపోయింది. గ్రాంట్లకు మంచి ఖర్చు చేయడం నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందని కాగ్ స్పష్టం చేసింది. 'చాలా పద్దుల యూసీలు అసంపూర్తిగా ఉన్నాయి. నిర్ధిష్ట కాలపరిమితిలో చాలా పద్దులకు చంద్రబాబు సర్కార్ యూసీలు చెల్లించలేదు. 2017 మార్చి 31 నాటికి 76 వేల రూపాయల రుణ బకాయిలు తీర్చాల్సి ఉంది. ఈ బకాయిలు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2017 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఆ తేదీ నాటికి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టులకు సంబంధించి తొలి అంచనాల విలువను 28, 036 కోట్ల రూపాయలు (52.06 శాతం) సవరించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఖర్చులు పెరిగాయని కాగ్ తమ నివేదికలో వెల్లడించింది. డీపీఆర్‌ల తయారీ, ప్రాథమిక పనులు ఆరంభించక పోవడంతో 455 కోట్ల రూపాయల కేంద్రం సాయాన్ని రాష్ట్రం వినియోగించుకోలేక పోయింది. ప్రభుత్వ హడావుడి ఖర్చులు 27 నుంచి 50 శాతానికి పెరిగిపోయాయి. బోధనా వ్యవస్థపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ఆరో తరగతి పిల్లలు కూడా చదవలేక పోతున్నారని, రాయలేక పోతున్నారని కాగ్ తాజా నివేదకలో ఏపీ తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించింది. -
‘తెలంగాణలో ఒక్కొక్కరికి రూ. 63 వేల అప్పు’
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులకుప్ప చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 61 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇప్పుడు అది 1.80 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఆయన గురువారం వరంగల్‌లో కాగ్ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. గత ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చని, అవి పరిపాలనలో జరిగిన తప్పిదాలు మాత్రమే అన్నారు. కానీ ఇపుడు కేసీఆర్ ప్రభుత్వం కావాలని తప్పిదాలు చేసిందని విమర్శించారు. కాగ్ అనేది వాచ్ డాగ్ అని, సుప్ర్రీం కోర్టు జడ్జితో సమాన హోదా కలిగిన సంస్థ కేసీఆర్ పాలనలో అనేక తప్పులను ఎత్తి చూపిందని తెలిపారు. తెలంగాణ అప్పు 2.21 లక్షల కోట్లు అయిందని, దీంతో సగటున ఒక్కో గ్రామానికి 21 కోట్ల రూపాయలు కాగా, ఒక్కో కుటుంబానికి 2.65 లక్షలు.. ఒక్కొక్క పౌరుడిపై 63 వేల రూపాయల భారం పడుతుందని వివరించారు. ఇదంతా కేసీఆర్ చేసిన ఘనతని ఆరోపించారు. అప్పును ఆదాయంగా, లోటును మిగులుగా చూపిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉందని ముఖ్యమంత్రి చెబుతుంటే.. 5,392 కోట్ల లోటు బడ్జెట్ ఉందని కాగ్ వెల్లడించిందని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి 3.5 శాతం ఉండగా.. ఇపుడు 4.7 శాతానికి పెరిగి రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలోకి పోతున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో బడ్జెట్ లోని కేటాయింపులకు, ప్రభుత్వం చెబుతున్న వాస్తవ ఖర్చులకు పొంతన లేదన్నారు. డబ్బులన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెడుతూ కమీషన్లు దండుకుంటున్నారన్నారు. మరోవైపు మిషన్ కాకతీయకు లెక్కాపత్రం లేదని తెలిపారు. -
‘కాగ్ నివేదిక భగవద్గీత కాదు’
సాక్షి, హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికపై కాంగ్రెస్ అతిగా వ్యవహరిస్తోందని, కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా అనవసర ఆరోపణలు చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాగ్ నివేదికను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడూ కాగ్ నివేదికలను అప్పటి ప్రభుత్వాలు తప్పుపట్టిన సంగతిని గుర్తు చేశారు. ‘కాగ్’నివేదిక ఏమైనా భగవద్గీత, బైబిల్ లేదా ఖురానా కాదు కదా అని హరీశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో పని చేసిన సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకసారి ఆ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆత్మావలోకనం చేసుకుంటే బాగుండేదన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో వివరణలు వెళ్లకపోవడం వల్ల కాగ్ కొన్ని చర్యలను తప్పుపడుతుందే కానీ అదే నిజం కాదన్నారు. కాగ్ లేవనెత్తిన సందేహాలను నివృతి చేస్తే ఆ సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారంలో ఉన్నపుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహనే చెప్పారు. కాగ్ నివేదికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారని హరీశ్ గుర్తుచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో రూ.23 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ చెప్పిందని, అయితే కాగ్ నివేదికను పట్టించుకోవద్దని అప్పట్లోనే మోదీ అన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు లోపాలను కాగ్ ఎత్తిచూపిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, తమ రాష్ట్రాల్లో మరో రకంగా కాగ్ నివేదికలు ఇచ్చిందని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నారని చెప్పారు. అప్పులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడిగా చూపించి, తెలంగాణలో మాత్రం అప్పులుగా కాగ్ చూపుతోందని హరీశ్ అన్నారు. తెలంగాణలో అవినీతి జరుగుతోందని కాగ్ ఎక్కడా చెప్పలేదని, సాంకేతిక అంశాలపై మాత్రమే ప్రభుత్వాన్ని కాగ్ తప్పుపట్టిందన్నారు. అప్పులను, పెట్టుబడులను లెక్కిస్తున్నపుడు పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలపై సీఎం కేసీఆర్ గతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జెట్లీకి లేఖను రాశారని హరీశ్ గుర్తుచేశారు. అనేక అంశాల్లో కాగ్ మెచ్చుకుంది.. ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో కాగ్ మెచ్చుకుందని, అవి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదని హరీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల విమర్శలు గురివింద గింజ సామెతలా ఉన్నాయన్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు అధికార దాహంతో హామీలు గుప్పిస్తున్నారని, ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఇస్తున్న హామీలను ఇప్పటికే ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీవి ఆపద మొక్కులేనని, కాంగ్రెస్ నేతలు చేస్తున్నది బస్సుయాత్ర కాదని, అధికార యావ యాత్ర అని విమర్శించారు. బస్సు యాత్ర వేదికపై నాయకులు ఎక్కువ, సభలో జనాలు తక్కువగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసముందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను బస్సు యాత్రలో ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు హరీష్ పిలుపునిచ్చారు. -
సీఎం కుటుంబమే బంగారమైంది
గోదావరిఖని (రామగుండం): రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే బంగారంగా మారుతోందని, ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఏర్పాటవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పు ల మయంగా మార్చిన కేసీఆర్‌కు సీఎం పదవి లో కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో అంకెల గారడి బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అప్పు లను ఆదాయంగా చూపిస్తూ బ్యాంకులు, ఆర్థిక సంఘాలను మోసం చేసిందని కాగ్ ఇచ్చిన నివేదికతో సీఎం పనితీరేంటో తెలిసిందనిదు య్యబట్టారు. దళితులు, గిరిజనులకు సంబంధించిన రూ.10 వేల కోట్లను దారి మళ్లించారని, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల స్థలం విషయంలో నూ కాగ్ తప్పుబట్టిందని నిప్పులు చెరిగారు. రెండో విడత ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్ పాల్గొ ని మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లోకి దించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని విమర్శించారు. రూ.లక్షా 74 వేల కోట్ల అభివృద్ధిపై శాసనసభలో ప్రతిపక్షాలు మాట్లాడితే గొంతునొక్కి ఇద్దరు శాసనసభ్యుల్ని గెంటేశారని, ప్రజాస్వామ్యంలో ఇది మా యని మచ్చగా మారిందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని, ప్రీమియం భారం రైతులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని, పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు. వరి, జొన్న, మొక్కజొన్న రూ.2 వేలకు తక్కువ కాకుండా.. మిర్చి, పసుపు రూ.10 వేలు, ఎర్రజొన్నలు రూ.3 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మహిళా సంఘాలున్నాయని, ప్రతి సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్‌ను తిరిగి చెల్లించకుండా ఇప్పిస్తామని, రూ.10 లక్షల బ్యాంకు రుణం ఇప్పిం చి వడ్డీ భారమూ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రూ.1,000కి తగ్గకుండా అభయహస్తం పింఛన్ పునరుద్ధరిస్తామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని, లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అప్పుడలా.. ఇప్పుడిలానా..?: కుంతియా అవినీతిమయంగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి 2019 ఎన్నికల్లో సింగరేణి కార్మికులు, ప్రజలు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు కుర్చీలు లేపారని, పేపర్లు చించేశారని.. కానీ నేడు విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలపడాన్ని తప్పుగా చూపిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖను మోసం చేసిన విషయంలో కోర్టుకు వెళతాం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ‘‘సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. అప్పులను ఆదాయంగా చూపించి మరిన్ని అప్పులు తీసుకొచ్చేందుకు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునేందుకు అంకెల గారడీతో ఆర్థిక శాఖను మోసం చేసిన కేసీఆర్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నాం..’’అని ఉత్తమ్ తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రెండో విడత బస్సుయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రతిరోజు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని సీనియర్ నేత షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. ఫేస్బుక్ లైవ్‌లో ఉత్తమ్! ఉత్తమ్ ఆదివారం ఫేస్బుక్ లైవ్‌లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తీర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ నాలుగేళ్లుగా రైతులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత 60 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు 60 వేల కోట్ల అప్పు చేస్తే.. కేసీఆర్ నాలుగేళ్లలో రెండు లక్షల కోట్లకు చేర్చారని ధ్వజమెత్తారు. -
ఈటలను తప్పించేందుకు స్కెచ్
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపై సీఎం కేసీఆర్‌కు పట్టులేదని, ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకు నిబద్ధత లేదనేందుకు కాగ్ నివేదికలే నిదర్శనమని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమర్థ పాలనను అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, కమీషన్ల కక్కుర్తితో ఎడాపెడా అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడానికి సీఎం కేసీఆర్ కారణమైతే, ఆర్థిక మంత్రి రాజేందర్‌ను కారణంగా చూపించి ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోందని రేవంత్ అన్నారు. కాగ్ నివేదికను అడ్డుపెట్టుకుని ఈటలను తొలగించేందుకు సీఎం స్కెచ్ వేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. తన వైఫల్యాలకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. -
‘ఆ థర్డ్ గ్రేడ్ పార్టీ వల్లే స్వాతంత్ర్యం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిగులు రాష్ట్రాన్నిఅప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుపై కాగ్ ప్రకటించిన రిపోర్టును ప్రజల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదనపు ఖర్చుతో అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్లు జరిపారని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హడ్కో నుంచి తెచ్చిన అప్పును ఆదాయంగా చూపారని, ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందనే తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టకముందే సభ్యులపై వేటు వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. ప్రమాదకరమైన ఆనవాయితీ తెలంగాణ సర్కార్ తెరలేపిందని, దీనిపై ప్రజాస్వామ్య వాదులంతా చర్చించాలన్నారు. కాంగ్రెస్‌తో పోలికా..? కాంగ్రెస్ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్ఎస్ అంటున్న ఆ థర్డ్ గ్రేడ్ పార్టీనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది.. తెలంగాణ ఇచ్చిందన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీ గురించి తెలియని కేటీఆర్ లేకి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ‘నెహ్రు క్యాబినెట్లో ఇందిరా లేరు.. నెహ్రూ 16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఇందిరా క్యాబినెట్లో రాజీవ్ లేరు. రాజీవ్ క్యాబినెట్లో కూడా ఇతర కుటుంబసభ్యులు లేరు.. ప్రధాని అవకాశం వచ్చినా మన్మోహన్ ను ప్రధాని చేసిన ఘనత సోనియాది. మన్మోహన్ క్యాబినెట్‌లోను రాహుల్‌కు అవకాశం ఉన్నా చేరలేదు. 10 ఏళ్ళు అవకాశం ఉన్నా ప్రధాని కాలేదు’ అన్నారు. కేటీఆర్‌కు కాంగ్రెస్‌తో పోల్చుకునే అర్హత లేదని, కేసీఆర్ పాలన కుటుంబ సభ్యులతో నిండిపోయిందన్నారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఇవ్వాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. నా వారసులు వస్తున్నారని తప్పుడు వార్తలు రాయవద్దని సూచించారు. పార్టీ తరఫునే పాదయాత్ర చేస్తున్నా.. వ్యక్తిగతంగా కాదని స్పష్టం చేశారు. పాదయాత్ర పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. సభ్యుల సభ్యత్వం రద్దు విషయంలో అడ్వకేట్ జనరల ఎందుకు రాజీనామా చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. -
‘కాగ్’ నివేదికపై చర్చకు సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: ‘కాగ్’నివేదికతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ బండా రం బయటపడిందని, దీనిపై టీఆర్ఎస్ నాయ కులకు దమ్ముంటే అమరవీరుల స్మారకస్థూపం వద్ద బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చెప్పిన అంశాలు కాగ్ నివేదికతో నిజమని తేలిందన్నారు. దేశంలోనే అప్పులను ఆదాయంగా చూపిన సన్నాసి ప్రభుత్వం కేసీఆర్‌దేని మండిపడ్డారు. లెక్కల్లో తప్పులు, అవకతవకలు కారణంగా చాలామంది జైళ్లలో ఉన్నారని, సీఎం కేసీఆర్‌కూ ఇదే వర్తిస్తుందని శ్రవణ్ హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ 409 ప్రకారం కేసీఆర్‌కు జీవిత ఖైదు శిక్ష పడుతుందన్నారు. ఎవరైనా అభివృద్ధి కోసం అప్పులు చేస్తారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం చేసిందని విమర్శించారు. దీనిపై త్వరలోనే నీతిæఆయోగ్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
కేసీఆర్‌వన్నీ కాకి లెక్కలే..
సాక్షి, హైదరాబాద్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినవన్నీ కాకి లెక్కలని తేలిపోయింది. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు ..పేద రాష్ట్రం’ అని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగ్ నివేదిక కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ లేదని కాగ్ స్పష్టం చేసిందని, తప్పుడు లెక్కలతో తెలంగాణను ధనిక రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులేటి మండిపడ్డారు. గారడీ లెక్కలతో ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రంగంలోను టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందించలేదని విమర్శించారు. విద్య, వైద్యంలో ఎంతో పురోగతి సాధిస్తున్నామని గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ నేతలు సర్కార్ వైద్యం డొల్లగా మారిందనీ, విద్యా వ్యవస్థ కుంటుపడిందన్న కాగ్ రిపోర్టుపై ఎందుకు నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ రాజ్ చట్టానికి మార్పులు చేసి గ్రామ సభలకు కోరలు పీకారని ధ్వజమెత్తారు. ప్రయివేట్ యూనివర్సిటీలు తీసుకురావడమంటే కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. -
నిర్లక్ష్యం..వైఫల్యం!
జీహెచ్ఎంసీలో భవన నిర్మాణాల్లో అక్రమాల నుంచి చెరువుల పరిరక్షణ, ఆస్తిపన్ను వసూళ్లు, ఘనవ్యర్థాల నిర్వహణల్లో జీహెచ్ంఎసీ విఫలమైందని ‘కాగ్’ కడిగి పారేసింది. ఈ అంశాల్లో వేటిల్లోనూ సమర్థంగా పనిచేయలేదని విమర్శించింది. అడ్డగోలు నిర్మాణాలను అడ్డుకోనందున విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని తూర్పారబట్టింది. క్షేత్రస్థాయి తనిఖీలు లేవని తప్పుబట్టింది. తడి పొడి చెత్త గురించి జీహెచ్ంఎసీ ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఘనవ్యర్థాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. స్వచ్ఛ కార్యక్రమాల్లో ప్రచార ఆర్భాటమే ఎక్కువగా ఉందని విమర్శించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2012 నుంచి 2017 వరకు జరిగిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక మై జీహెచ్ఎంసీ యాప్, ప్రజావాణి, ఎమర్జెన్సీ డయల్ 1100 తదితర కార్యక్రమాలను కాగ్ ప్రశంసించింది. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలపై భారం వేకుండా ట్రాన్సాక్షన్ రుసుంను మినహాయించడాన్ని కూడా కాగ్ అభినందించింది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో గత ఐదేళ్ల ఆస్తిపన్ను విధింపులో వ్యత్యాసాలున్నాయని కాగ్ తేటతెల్లం చేసింది. 75,387 ఆస్తులను తనిఖీ చేయగా, 41 శాతం (30,864) భవనాల్లో వ్యత్యాసం ఉందని వెల్లడించింది. వీటిలో 10,460 భవనాలు అక్రమ నిర్మాణాలేనని తప్పుబట్టింది. 2016–17లో భవన నిర్మాణాలకు 4,042 దరఖాస్తులు రాగా వాటిలో 33 శాతం(1,323) మందికి మాత్రమే ఓసీలు జారీ చేయగా, మిగతా వారి రికార్డులే లేవంది. ఓసీలు నిరాకరించినప్పుడు, అక్రమ కట్టడాలను గుర్తించినప్పుడు నోటీసులిస్తున్నామని పేర్కొంటూ 2016, 2017ల్లో మొత్తం 868 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపినప్పటికీ, పెండింగ్ కేసుల వివరాలు మాత్రం ఇవ్వలేదని బల్దియా తీరును తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాలున్నాయని ఒప్పుకున్న జీహెచ్ఎంసీ.. కోర్టు కేసుల వల్ల, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల తగిన చర్యలు చేపట్టడంలో అశక్తతను వెల్లడించారని కుండబద్దలు కొట్టింది. పర్యావరణ ప్రభావ రుసుమును వసూలు చేయలేకపోయారని పేర్కొంది. నివాసగృహాలను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటాన్నీ ప్రస్తావించింది. ఆస్తిపన్ను వసూళ్లపై.. ఆస్తిపన్ను వసూళ్లు, పెనాల్టీల వసూళ్లలో తగిన విధంగా వ్యవహరించలేదని కాగ్ పేర్కొంది. 2017 మార్చి వరకు రావాల్సిన బకాయిలు రూ.1403.43 కోట్లలో.. రూ.900.33 కోట్లు మూడేళ్లుగా వసూలు చేయలేదని, ఇలాంటి భవనాలు 1,78,701 ఉన్నాయని వెల్లడించింది. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించింది. తద్వారా ఆరు సర్కిళ్లలో జరిపిన తనిఖీల్లో 708 భవనాలకు వెరసి రూ.5.25 కోట్లు ఆస్తిపన్ను తక్కువగా అసెస్ చేశారంది. ♦ విభాగం ఎప్పటికప్పుడు నిర్మాణ అనుమతుల వివరాలను రెవెన్యూ విభాగానికి అందజేయలేదని వెల్లడించింది. తనిఖీ చేసిన ఆరు సర్కిళ్లలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల డేటాబేస్‌లో ఉండాల్సిన పన్ను చెల్లించేవారి వివరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ♦ జీఐఎస్ ఆధారంగా ఆస్తిపన్ను మదింపు కోసం సర్వే వంటి వాటి కోసం రూ.20.81 లక్షలు ఖర్చు చేయగా, క్షేత్రస్థాయిలో జీహెచ్ంఎసీ పరిశీలించిన వివరాలకు పొంతనలేదని విరమించుకున్నప్పటికీ, రెండు రకాల సమాచారాన్ని పోల్చి సమన్వయపరిచే ప్రయత్నం చేయలేదంది. ♦ ఇక పన్ను పరిధిలోని నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్ ఏర్పాట్లలో 72 స్థానిక సంస్థల సాఫల్యతను జీహెచ్ఎంసీ సమీక్షించాలని సూచించింది. అనుమతి పొందిన ప్లాన్ కంటే అదనంగా నిర్మించిన వాటికి విధించాల్సిన జరిమానాల్లోనూ తక్కువ జరిమానా విధించినట్లు గుర్తించింది. ♦ టౌన్‌ప్లానింగ్ సమాచారంతో జియో ట్యాగింగ్ వంటి సాంకేతిక పద్ధతుల్ని వినియోగించుకొని అన్ని నిర్మాణాలనూ పన్ను పరిధిలోకి తేవాల్సి ఉందని సూచించింది. ♦ నివాసేతర భవనాల వయసును బట్టి వార్షిక అద్దె మీద ఇవ్వాల్సిన రిబేటు 10–30 శాతం కాగా, కొన్ని చోట్లా 40 శాతం ఇచ్చినట్లు పేర్కొంది. ♦ వసూలయ్యే ఆస్తిపన్నులో గ్రంథాలయ సెస్సును జిల్లా గ్రంథాలయ సంస్థకు సకాలంలో ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఇంటి నెంబర్లు ఇంకా పజిలే.. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఇంటి నెంబర్ల నమోదు కొలిక్కి రాకపోవడాన్ని, లోటుపాట్లను బట్టబయలు చేసింది. ఏర్పాటు చేసిన చోటా డూప్లికేషన్ జరగడాన్ని ఎత్తిచూపింది. అంతా ప్రచార ఆర్భాటమే.. తడి– పొడి చెత్త గురించి జీహెచ్ంఎసీ ఎంతగా ప్రచారం చేస్తున్నా ఘనవ్యర్థాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. చెత్త ఉత్పత్తి స్థానంలో తడి–పొడి వేరవుతున్నది 27 శాతమేనంది. వ్యర్థాల నుంచి ఇంధన తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయలేకపోయారని, అందుబాటులోని డంపింగ్ ప్రాంతాలను పునరుద్ధరించలేదని పేర్కొంది. ఐదేళ్ల వ్యవధిలో రోజువారీ వ్యర్థాలు రెట్టింపు అయినట్లు పేర్కొన్నప్పటికీ, వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేసే యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది. ముంపు సమస్యలు తప్పేదెప్పుడు..? వరదనీటి కాలువల ఆధునికీకరణకు రూపొందించిన ప్రణాళిక ఏడేళ్లయినా అమలు చేయలేకపోయారని విమర్శించింది. వరదొస్తే నగరం చెరువుగా మారే దుస్థితి తప్పలేదని ప్రస్తావించింది. వరదనీరు నిలిచిపోయే 461 ప్రాంతాల్లో 52 ప్రదేశాలు అత్యంత ప్రమాదకరమైనవని, మరో 67 కూడళ్లలో జనసమ్మర్ధం ఎక్కువని హెచ్చరించింది. ♦ వర్షం వస్తే ఇవి ముంపుబారిన పడతాయని హెచ్చరించింది. వరదకాలువల విస్తరణకు 26 నాలాలపై రూ.350.13 కోట్లతో 71 పనులు చేపట్టినా ఆక్రమణలను తొలగించడంలో వైఫల్యం వల్ల 16 పనులు ఆగిపోయాయని కాగ్ పేర్కొంది. ♦ 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల కాలంలో వరదకాలువల ఆధునికీకరణకు రూ.1306 కోట్లు బడ్జెట్లో కేటాయించినా, రూ.707 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంది. సకాలంలో పనులు చేయనందున కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థికసాయం రాలేదని ప్రస్తావించింది. ♦ నాలాల విస్తరణకు సంబంధించి పరిశీలించిన 24 పనుల్లో (అంచనా వ్యయం రూ.227.82 కోట్లు)13 పనులు అర్ధాతరంగా ఆగిపోయాయని గుర్తించింది. ఐదేళ్లలో మొత్తం రూ.78.34 కోట్లతో డీసిల్టింగ్ పనులు చేసినట్లు పేర్కొన్నప్పటికీ, చెత్తను కాలువల్లో వేయడాన్ని నిలువరించలేకపోయారని ఎత్తిచూపింది. చెరువులు మాయమవుతున్నా పట్టదా..? చెరువుల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టం చేసింది. చెరువులు, నాలాల వెంబడి 12,182 ఆక్రమణలకు గతేడాది జూలై వరకు కేవలం 7 శాతం(847) మాత్రమే తొలగించారని, 17 సరస్సులు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేకపోయారని తప్పు పట్టింది. 9 సరస్సులు పూర్తిగా దురాక్రమణ పాలయ్యాయని నిగ్గు తేల్చింది. కొన్ని పద్ధతులకు ప్రశంసలు వివిధ అంశాల్లో జీహెచ్ఎంసీని తప్పుపట్టిన కాగ్.. కొన్ని అంశాల్లో మంచి పద్ధతులు ప్రవేశపెట్టారని కితాబిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ‘మై జీహెచ్ఎంసీ’ యాప్, ‘ప్రజావాణి’ కాల్‌సెంటర్, ఎమర్జెన్సీ డయల్ 1100, ఆన్లైన్ సేవల(జీహెచ్ఎంసీ ఆన్లైన్, ట్విట్టర్)ను ప్రస్తావించింది. ఐదేళ్లలో వివిధ వేదికల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.3.14 లక్షల ఫిర్యాదులు అందగా, 3.11 పరిష్కరించినట్లు పేర్కొంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలపై ట్రాన్సాక్షన్ ఫీజు పడకుండా చేయడాన్ని అభినందించింది. -
41 శాతం అతిక్రమణలే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పెచ్చరిల్లిన అవినీతి అవినీతి అధికారుల జేబులు నింపుతోందని కాగ్ నివేదిక సాక్షిగా తేలింది. 2012–2017 కాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో మచ్చుకు 75,387 ఇళ్లను తనిఖీ చేసిన కాగ్, అతిక్రమణల స్థాయి చూసి అవాక్కైంది. ఏకంగా 30,864 ఇళ్ల నిర్మాణంలో అతిక్రమణలు బయటపడ్డాయి. అంతేకాదు, వీటిలో 10,460 అక్రమ నిర్మాణాలేనని కూడా తేలింది! అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందిలో కొందరు ఆస్తి పన్ను మదింపులో చేతివాటం ప్రదర్శించి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలకూ కాగ్ నివేదిక బలం చేకూర్చింది. 708 కట్టడాలను పరిశీలించగా, రూ.5.24 కోట్ల మేర ఆస్తి పన్ను తక్కువగా మదింపు చేసినట్టు కాగ్ గుర్తించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ సమయంలో పన్ను చెల్లించేప్పుడు కూడా ఇలాంటి మతలబులే చోటుచేసుకుంటున్నట్టు తేలింది. ఆయా భవనాల విస్తీర్ణం టౌన్ ప్లానింగ్‌లోని వివరాలకు, ఆస్తి పన్ను మదింపులోని వివరాలకు చాలా తేడా ఉంది. ఆరు సర్కిళ్ల పరిధిలో కేవలం 287 నిర్మాణాలను పరిశీలించగా రూ.1.25 కోట్ల మేర పన్ను తక్కువగా చెల్లించినట్టు తేలింది. పదేళ్లలో 26 చెరువుల్ని మింగారు జీహెచ్ఎంసీ ఆవిర్భవించే నాటికి (2007) దాని పరిధిలో 185 చెరువులుండగా వాటిలో 26 చెరువులు ఇప్పుడు ‘కనపడుట లేదు’. మిగతా వాటిలోనూ 17 చెరువులు ఎక్కడుండాలో కూడా జాడ కనుక్కోలేని దుస్థితి ఉందని కాగ్ తేల్చింది! మరో 9 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని జీహెచ్ఎంసీ నివేదిక ఆధారంగా కాగ్ గుర్తించింది. -
అక్కర్లేని చెరువులకూ తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ అమలులో లోపాలున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఎత్తిచూపింది. తొలి రెండుదశల్లో ప్రాధాన్యంలేని చెరువులను కూడా చేపట్టారని ఆక్షేపించింది. ప్రాధాన్య చెరువుల జాబితాలో మినీ ట్యాంక్బండ్లు లేకున్నా వాటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.31 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. మినీ ట్యాంక్‌బండ్‌లను ఆహ్లాదం కోసం చేపట్టినందున వాటిని ప్రాధాన్యం గల పనులుగా పరిగణించలేమని పేర్కొంది. గురువారం ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికల్లో మిషన్ కాకతీయ తప్పిదాలు వెలుగు చూశాయి. గతంలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద 186 చెరువులు, ట్రిపుల్ కింద మరో 116 చెరువులను చేపట్టగా, వాటినే తిరిగి మిషన్ కాకతీయలోనూ రూ.120.41 కోట్లతో చేపట్టారని పేర్కొంది. గత పథకాల్లో పూడికతీయనంత మాత్రాన ఈ పనులు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని, గత పథకాల్లో కొన్ని అంశాలు లేనందున మళ్లీ చేపట్టేందుకు మార్గదర్శకాలు అనుమతించవని తెలిపింది. 27 చెరువుల పూడికతీత పనులు తనిఖీ చేయగా, అంచనా వేసిన పరిమాణం కన్నా తక్కువగా పనులు జరిగాయని వెల్లడించింది. 27 చెరువుల పనుల్లో 12.01 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాలని అంచనా వేసి కేవలం 8.08 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీశారని పేర్కొంది. పూడికతీత తగ్గుదల కారణంగా ఆశించిన విధంగా చెరువుల నిల్వ సామర్థ్యం పునరుద్ధరించబడినట్లు ధ్రువీకరించలేమని స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు పనికి రానందునే పూడికమట్టిని తీసుకెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపలేదన్న ప్రభుత్వ సమాధానం అంగీకారం కాదని స్పష్టం చేసింది. మిషన్ కాకతీయలో 10 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టును తిరిగి సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే పనుల అంచనాల్లో ఎక్కడా గ్యాప్ ఆయకట్టు వివరాలు లేవని తెలిపింది. మెదక్, వికారాబాద్‌లో రెండో దశలో 100 % ఆయకట్టును సాధించామని ప్రకటించారని, అయితే అక్కడ 936 చెరువులకుగానూ 446 చెరువుల పనులు మాత్రమే పూర్తి అయ్యాయని కాగ్ నివేదిక తెలిపింది. -
టీఎస్–ఐ‘పాస్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్–ఐపాస్) ద్వారా ‘సింగిల్ విండో’లక్ష్యం నెరవేరడం లేదని కాగ్ విమర్శించింది. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులకు కాకుండా.. వ్యాపారవేత్తలు కోరిన కొన్నింటికే ప్రభుత్వం అనుమతి పత్రాలు జారీ చేస్తోందని తప్పుబట్టింది. మరోవైపు అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలియజేసే కచ్చితమైన వ్యవస్థ కూడా లేదని పేర్కొంది. 2017 మార్చి–జూన్ మధ్య టీఎస్–ఐపాస్ పనితీరుపై పరిశీలన జరిపిన కాగ్.. అందులోని లోపాలు ఎత్తిచూపింది. ‘అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించుకునేలా సాఫ్ట్‌వేర్‌లో వ్యవస్థ లేదు. నుమతులకు తరువాత దరఖాస్తు చేసుకునేందుకు ‘అప్లై లేటర్’ఆప్షనూ లేదు. 2016–17లో 1,941 దరఖాస్తులొస్తే 177 మంది దరఖాస్తుదారులే అన్ని రకాల అనుమతులు కోరారు. మిగిలిన వారు పాక్షిక అనుమతులే పొందారు. పాక్షికంగా అనుమతులు తీసుకున్న పరిశ్రమలు యూనిట్లు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాయని నిర్ధారించుకునే వ్యవస్థ కూడా లేదు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి రెడ్ కేటిగిరీ పరిశ్రమల ఏర్పాటుకు 148 పరిశ్రమలు అనుమతి పొందాల్సి ఉండగా, 85 పరిశ్రమలే దరఖాస్తు చేసుకున్నాయి. ఆరెంజ్ కేటగిరీ కింద 441 పరిశ్రమలకు గాను 175.. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ కోసం 106 పరిశ్రమలకు గాను 9 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. పంచాయతీల నుంచి ఎన్ఓసీ కోసం 1,425 పరిశ్రమలకు గాను 147 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి’అని కాగ్ పేర్కొంది. -
అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) విధించిన పరిమితికి మించిన ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మండిపడింది. 2012–17 మధ్య స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ఏకంగా రూ.5,820.90 కోట్లు అధిక వ్యయం జరిగిందని తేల్చింది. జల విద్యుత్ కొరత, విద్యుదుత్పత్తి ప్లాంట్ల ప్రారంభంలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌లో పెరుగుదల కారణంగా అధిక ధరతో విద్యుత్ కొనాల్సి వచ్చిందని ఎస్పీడీసీఎల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఎస్పీడీసీఎల్ పనితీరుపై కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. - కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఫైవ్‌స్టార్ రేటింగ్ కలిగిన త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ సరఫరా చేయాలి. కానీ టీఎస్ఎస్పీడీసీఎల్ త్రీస్టార్ రేటింగ్ గల ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. అధిక నాణ్యత గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తే.. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ద్వారా 701 నుంచి 20,586 యూనిట్ల వరకు విద్యుత్ పొదుపు జరిగేది. దీంతో 25 ఏళ్లలో రూ.2,220.49 కోట్లు ఆదా అయ్యేవి. - 2012–17 మధ్య వ్యవసాయ విద్యుత్ సరఫరా అనుమతించిన పరిమితులను మించిపోవడంతో సంస్థపై రూ.1,744.56 కోట్ల భారం పడింది. 2012–17 మధ్య విద్యుత్ నష్టాల విలువ రూ.1,306.76 కోట్లు ఉంటుంది. 2016–17 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను సకాలంలో ఈఆర్సీకి సమర్పించకుండా.. పాత టారిఫ్‌ను కొనసాగించడం వల్ల సంస్థకు రూ.323.89 కోట్ల నష్టం జరిగింది. - మౌలిక సదుపాయాల వృద్ధి కోసం 2012–17 మధ్య ఈఆర్సీ ఆమోదించిన వ్యయం రూ.5,843.43 కోట్లు. కానీ సంస్థ రూ.6,632.62 కోట్లు ఖర్చు చేసింది. ఈ అధిక వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించకపోవడంతో.. రూ.789.19 కోట్లను భరించాల్సి వచ్చింది. హా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం సంస్థ ముందుగానే నిధులు సమీకరించుకోలేదు. దాంతో రూ.585.91 కోట్లను సొంత వనరుల నుంచి ఖర్చు చేసింది. హా 2012–14 మధ్య చేపట్టిన వివిధ పనుల కోసం తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలో 3 నుంచి 5 శాతం వరకు రాయితీని జాతీయ విద్యుత్ నిధి (వడ్డీ రాయితీ) పథకం సమకూర్చింది. ఈ పథకం కింద 2013–17 మధ్య రూ.216.91 కోట్లు రాబట్టుకునేందుకు అవకాశమున్నా.. సంస్థ కేవలం 2013–14కి సంబంధించిన రూ.4.01 కోట్ల రాయితీని మాత్రమే రాబట్టుకుంది. - డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఈఆర్సీ నుంచి ఆమోదం పొందలేదు. దీంతో ఆ పథకం కింద రీషెడ్యూల్ చేసిన రుణాలకు సంబంధించిన వడ్డీలను 2015–16లో విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతించలేదు. దీనివల్ల సంస్థ రూ.1400.74 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది. -
రూ.1,100 కోట్ల అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పనితీరును కాగ్ నివేదిక తూర్పారబట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో ఏదో ఒక తప్పును గుర్తించిన కాగ్.. మొత్తం రూ.1,100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. టర్నోవర్ లెక్కించడం నుంచి పన్ను వసూలు వరకు, పన్ను కట్టకపోతే జరిమానా విధింపు నుంచి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మంజూరు వరకు, టర్నోవర్ తేడాల నుంచి కొనుగోలు టర్నోవర్ ఎక్కువ చూపించడం వరకు.. ఇలా 1,055 కేసుల్లో తప్పులు జరిగాయని నిర్ధారించింది. పన్ను విధించక రూ.780 కోట్ల నష్టం 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 7 కేటగిరీల్లో అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా వస్తువులపై పన్ను విధించకుండా లేదా తక్కువ పన్ను వసూలు చేయడం ద్వారా రూ.780 కోట్ల అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. వర్క్ కాంట్రాక్టులకు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.19.57 కోట్లు, వడ్డీ జరిమానా విధించకపోవడం, తక్కువ విధించడం వల్ల రూ.26.02 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రూ.25.43 కోట్లు, కేంద్ర అమ్మకం పన్నులను విధించకపోవడం లేదా తగ్గించడం వల్ల రూ.79.98 కోట్లు, అమ్మకపు పన్ను వాయిదా వల్ల రూ.10.22 కోట్లు, ఇతర అవకతవకల వల్ల రూ.158.16 కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. అయితే విలువ ఆధారిత పన్నును వసూలు చేయని లేదా తక్కువ వసూలు చేసిన 312 కేసుల్లోనే రూ.780.91 కోట్ల తేడా వచ్చిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విషయానికొస్తే మొత్తం 359 కేసులకు రూ.42.06 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించింది. స్టాంపు డ్యూటీలు, ఫీజులు తక్కువగా విధించడం వల్ల రూ.36.99 కోట్లు, ఆస్తుల విలువ తక్కువ లెక్కించడం వల్ల రూ.4.29 కోట్లు, డాక్యుమెంట్లను తప్పుగా వర్గీకరించిన కారణంగా రూ.71 లక్షలు, ఇతర అవకతవకల వల్ల రూ.7 లక్షలు నష్టం జరిగిందని కాగ్ వెల్లడించింది. ఇందులో వ్యవసాయేతర భూముల (నాలా) రిజిస్ట్రేషన్‌కు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, భీమ్‌గల్, భైంసా, దేవరకొండ, ఘన్పూర్, జడ్చర్ల, జోగిపేట, జనగామ, కూసుమంచి, మధిర, మహబూబాబాద్, నర్సంపేట, నిర్మల్, వర్ధన్నపేటల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యా లయాలను పరిశీలించగా, అందులో 29 దస్తావేజులను వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని నాలా భూముల రిజిస్ట్రేషన్ చేశారని తేలిందని పేర్కొంది. ఇది రూ.2.04 కోట్ల తక్కువ డ్యూటీ, ఫీజు విధిం చడానికి కారణమైందని కాగ్ తెలిపింది. -
మిగులు కాదు.. లోటురాష్ట్రమే
సాక్షి, హైదరాబాద్:‘తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,386 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. రెవెన్యూ మిగులును రూ.6,778 కోట్లు ఎక్కువ చేసి చూపించింది. అంటే రాష్ట్రం రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటులో ఉంది’భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పద్దులు నమోదు చేయటంలోనే ఈ తప్పులు చేసిందని అంశాల వారీగా కాగ్ వేలెత్తి చూపింది. ‘ఉదయ్ పద్దులో రూ.3,750 కోట్లను గ్రాంటుకు బదులు ఈక్విటీగా చూపించింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు అప్పుగా తెచ్చుకున్న రూ.1,500 కోట్లు రాబడిలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.528 కోట్ల రెవెన్యూ వ్యయం రుణంగా చూపించి ఖర్చు తక్కువ కనబడేలా చేసింది’అని జమా ఖర్చుల పద్దులో ప్రభుత్వం చేసిన గిమ్మిక్కులను కాగ్ బయటపెట్టింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అజాయబ్సింగ్ ఈ నివేదికలను మీడియాకు విడుదల చేశారు. ఆదాయ వ్యయాల పరిశీలనతో పాటు వివిధ రంగాల వారీగా తమ ఆడిట్లో వెల్లడైన అంశాలను పొందుపరిచినట్లు విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు స్థానిక సంస్థలు, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, సామాన్య, సామాజిక రంగాలపై విడుదల చేసిన నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది. రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని వేలెత్తి చూపింది. హద్దు మీరిన ద్రవ్యలోటు.. ద్రవ్యలోటు ఆందోళనకరంగా పెరిగిపోయిందని కాగ్ స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం నిర్దేశించిన 3.5 శాతం దాటిపోయిందని గుర్తించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉందని, ఉదయ్ పథకం కింద విద్యుత్తు సంస్థలకు బదిలీ చేసిన డబ్బును మినహాయిస్తే 4.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. అప్పుగా తెచ్చిన నిధులను రెవెన్యూ రాబడుల్లో జమ చేసి, ద్రవ్య లోటును రూ.2,500 కోట్ల మేరకు తక్కువ చేసి చూపించిందని రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. ఉదయ్ బాండ్ల ద్వారా రూ.8,931 కోట్లు అప్పు తెచ్చుకుంటే, కేవలం రూ.7,500 కోట్లు డిస్కంలకు విడుదల చేసిందని పేర్కొంది. డిస్కంల మిగతా రుణాలకు కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదయ్ పథకం నిర్దేశించినప్పటికీ.. వాటిని జారీ చేయలేదని తప్పుబట్టింది. ఖర్చెక్కువ.. అభివృద్ధి తక్కువ.. రెవెన్యూ రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని కాగ్ వేలెత్తి చూపింది. ‘రాష్ట్రం మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం 69 శాతంగా నమోదైంది. దీంతో మౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతమే మిగిలి ఉంది’అని కాగ్ ప్రస్తావించింది. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.6,184 కోట్లు అధికంగా ఖర్చయితే క్రమబద్ధీకరించలేదని తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులకు పొంతన లేకపోవటంతో కొన్ని శాఖల్లో భారీగా మిగులు, కొన్నింటిలో కేటాయింపులకు మించి ఖర్చులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. గ్రాంట్లకు మించి ఖర్చు చేసిన కేసులు తీవ్ర ఉల్లంఘనలేనని, ఇవి శాసనసభ అభీష్టానికి విఘాతం కలిగిస్తాయని, వెంటనే బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 2016–17లో బడ్జెట్ కేటాయింపులను మించి చేసిన అధిక ఖర్చు రూ.21,161 కోట్లుగా గుర్తించింది. 16 గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్లలో చేసిన అధిక వ్యయం రాజ్యాంగం ప్రకారం క్రమబద్ధీకరించాలని సూచించింది. కేటాయింపులే.. ఖర్చుల్లేవు.. ఎస్సీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో 60 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 58 శాతం వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందని కాగ్ వెల్లడించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐటీడీఏ జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు, రాష్ట్రంలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాలేదని గుర్తించింది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలకు నిర్దేశించిన రూ.265 కోట్లు ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులు పాటించకపోవటం, ఆర్థిక నియంత్రణ లోపించిందని పలు ఉదాహరణలను కాగ్ ప్రస్తావించింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన వెబ్సైట్లో ఉన్న నిల్వలకు, లెడ్జర్లో ఉన్న నిల్వలకు వ్యత్యాసముంది. 28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల్లో రూ.19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాల్లో భారీ మొత్తాలు ఉంచి రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ, ఆర్థిక నిర్వహణలు సరిగా లేవని స్పష్టంచేస్తోందని కాగ్ అభిప్రాయపడింది. పథకాల అమలుకు డ్రా చేసిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు(యూసీలు) సమర్పించలేదని, కొన్ని శాఖలు నిధులు వినియోగించకుండానే యూసీలు సమర్పించాయని గుర్తించింది. అప్పుల కుప్పలపై ఆందోళన ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులను తీర్చేందుకే వినియోగిస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–22 సంవత్సరాల మధ్య రూ.14,896 కోట్లు, 2022–24 మధ్య రూ.22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉందని, ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. మరిన్ని అప్పులు చేయకుండా ఉండేందుకు సముచితమైన చెల్లింపుల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే.. వచ్చే ఏడేళ్లలో 49 శాతం రుణాలు.. అంటే రూ.56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015–16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా, 2016–17లో ఇది 32.16 శాతానికి పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22 శాతంగా ఉండాలి. కానీ ఇవి 10.40 శాతానికి పెరిగాయని కాగ్ గుర్తించింది. -
తెలంగాణలో అర్థిక క్రమశిక్షణ తప్పింది: కాగ్
-
షాకింగ్ : పెరగనున్న రైలు చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు పెరుగుతున్న ఖర్చులకు దీటుగా ప్రయాణీకులపై చార్జీల భారం మోపనున్నాయి. నష్టాలను తగ్గించుకునే క్రమంలో నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలను సమీక్షించాలని పార్లమెంట్లో సమర్పించిన కాగ్ నివేదిక సూచించింది. రైల్వేలు నిర్వహణా వ్యయాన్ని అధిగమించలేకపోతున్నాయని 2016, మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సమర్పించిన ఈ నివేదిక పేర్కొంది. 2015-16లో రైల్వేలకు ప్రయాణీకులు, ఇతర కోచింగ్ సేవలపై రూ 36,283 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. 2015-16లో రైల్వేల మొత్తం ఆదాయం కేవలం 4.57 శాతం మాత్రమే పెరిగిందని ఇది 2011-15 వరకూ సాధించిన 14.86 శాతం వృద్ధి కంటే చాలా తక్కువని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘రైల్వేలు నష్టాలను తగ్గించుకునే క్రమంలో ప్రయాణీకుల చార్జీలను దశలవారీగా సవరించాల్సిన అవసరం ఉంద’ ని నివేదిక స్పష్టం చేసింది. రైల్వేల ఆర్థిక పరిస్థితి..ప్రస్తుత మార్కెట్ తీరుతెన్నులతో పాటు నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను నిర్ణయించాలని పేర్కొంది. ప్రయాణీకుల సేవలపై నష్టాలను కేవలం ఏసీ ఫస్ట్‌క్లాస్, ఫస్ట్‌క్లాస్, ఏసీ 2-టయర్‌పైనే రికవరీ చేయాలనుకోవడం సరైంది కాదని తెలిపింది. -
పట్టిసీమపై కట్టుకథలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల విషయంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో తన వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే గోదావరి డెల్టాకే కాదు, కృష్ణా డెల్టాలోనూ రెండో పంట సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, పోలవరం నిర్మాణం విషయంలో తాత్సారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన పోలవరం కుడికాలువ మీదుగా కృష్ణా డెల్టాకు నీళ్లందించే ముసుగులో కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. పట్టిసీమ పేరుతో రూ.372.07 కోట్లు దోచేశారని సాక్షాత్తూ కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో బహిర్గతం చేసింది. దీంతో జనం కళ్లు గప్పేందుకు చంద్ర బాబు నిత్యం అబద్ధాల దండోరా వేస్తున్నారు. ముఖ్య మంత్రి మాటలు విని కృష్ణా డెల్టా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు అప్పుడే ఇచ్చి ఉంటే.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలు ఆలస్యంగా సాగు చేయడం వల్ల కోతల సమయంలో తుఫాన్ల దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. జూన్‌లోనే ఖరీఫ్ సాగుకు నీళ్లం దించడంతోపాటు రబీ పంటలకూ నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యం తో.. తెలంగాణ ప్రాంతం నేతలు అడ్డుపడినా ఖాతరు చేయకుండా పులిచింతల ప్రాజెక్టును దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆగమేఘాలపై ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కేవలం రూ.193.14 కోట్లు పరిహారం చెల్లిస్తే.. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం 2015 సెప్టెంబరు 24న రూ.78.12 కోట్లు తెలంగాణ సర్కార్‌కు ఇచ్చింది. గతేడాది ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద జలాలు వచ్చాయి. పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో 2016 ఆగస్టు 31న ఏపీ ప్రభుత్వం రూ.66.02 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.49 కోట్లు విడుదల చేయకపోవడంతో పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయడానికి తెలంగాణ సర్కార్ అంగీకరించలేదు. దీంతో గతేడాది 55.21 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. తెలంగాణ సర్కార్ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఏడాది మార్చి 17న మిగతా రూ.49 కోట్ల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను గత ఏడాదే విడుదల చేసి ఉంటే పులిచింతలలో 45.77 టీఎంసీలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. నిధుల ఎత్తిపోతల పథకాలు ఏటా కృష్ణా, గోదావరి నదులకు ఇంచుమించుగా జూలై నుంచి అక్టోబర్ వరకూ దాదాపు 90 రోజులపాటు ఒకేసారి వరద వస్తుంది. గోదావరి నీటిని నిల్వ చేసే జలాశయం లేకపోవడం, పులిచింతలకు దిగువన కృష్ణా నదిపై నీటిని నిల్వ చేసే జలాశయం కూడా లేకపోవడం వల్ల ఏటా వందలాది టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. వరదను ఒడిసి పట్టి గోదావరి డెల్టాలో రెండో పంటకు పుష్కలంగా నీటిని అందించడం.. కొత్తగా 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీరు, విశాఖపట్నం ప్రజల తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడం, కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించడం, తద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. పోలవరం రిజర్వాయర్‌లో 194.1 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. వైఎస్ హయాంలో పోలవరం కుడి కాలువ దాదాపుగా పూర్తయ్యింది. ఎడమ కాలువ 161 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. జలాశయం పనులను పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాతోపాటు విశాఖకూ గోదావరి జలాలను తరలింవచ్చు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్ హయాంలో పూర్తయిన పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తరలించి.. నదుల అనుసంధానం చేశానంటూ గొప్పలు పోయారు. ఇందుకోసం రూ.1,647 కోట్లు వ్యయం చేశారు. ఇదే ఊపులో పోలవరం ఎడమ కాలువ మీదుగా ‘ఏలేరు’కు గోదావరి జలాలను తరలించడానికి రూ.1,660 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలతో అవసరమే ఉండదు. 2018 నాటికి పాక్షికంగా, 2019 నాటికి పూర్తిగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టడంలో ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. రైతులపై పెనుభారం కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డెల్టా తూర్పు, పశ్చిమ కాలువల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 16,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయాలి. కానీ, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 8,500 క్యూసెక్కులను ఎత్తిపోసినా.. ప్రకాశం బ్యారేజీకి 7,000 క్యూసెక్కులు చేరుతాయి. దీనివల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయని దుస్థితి నెలకొంది. దాంతో పులిచింతలలో నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేసి.. కాలువలకు 8,000 నుంచి 8,500 క్యూసెక్కులు విడుదల చేశారు. పొట్ట దశలో ఉన్నప్పుడు పంటలకు అధికంగా నీళ్లు అవసరం. కాలువల్లో నీళ్లందకపోవడంతో రైతులు వేలాది రూపాయలు వెచ్చించి డీజిల్ మోటార్ల ద్వారా పొలాలకు నీటిని తోడుకోవాల్సి వచ్చింది. ఇక పట్టిసీమ ఫలాలను రాయలసీమకూ అందించామని చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు వాస్తవం లేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఆరు తడి పంటలకే నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచే పనులు రూ.45 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతాయి. కానీ, ఆ పనులను పూర్తి చేయకపోవడం వల్ల గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించలేకపోతున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులు చేయకుండా రూ.1,100 కోట్లతో ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టి సీఎం రమేశ్ వంటి కోటరీలోని కాంట్రాక్టర్లకు వాటిని అప్పగించి చంద్రబాబు కమీషన్లు జేబులో వేసుకున్నారు. -
కాగ్ నివేదికపై మీ సమాధానమేంటి?
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేయడంపై సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నంబర్‌వన్‌గా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి విచ్చల విడిగా జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల జేబులు నింపడానికే రూ.3,500 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపట్టారని.. ఈ పనుల్లో 41 శాతం ప్రాధాన్యత లేని పనులేనని కాగ్ వెల్లడించిందన్నారు. కాగ్ నివేదికలో పేర్కొన్నట్టుగా అవినీతి భారీగా జరిగిందని, దీనికి హరీశ్‌రావు బాధ్యత వహించాలన్నారు. కుంభకోణాలకు టీఆర్ఎస్ నేతల అవినీతే కారణమని.. దీనిపై విచారణ జరిపించాలన్నారు. అవినీతికి పాల్పడితే చెప్పుతో కొట్టాలన్న సీఎం.. ఇప్పుడు ఎవరిని కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. -
ఆ నివేదికపై నిర్మలా సీతారామన్ నో కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల వద్ద తగినంత సాయుధ సంపత్తి లేదని, యుద్ధం వస్తే 20 రోజుల వరకే ఇవి సరిపోతాయన్న కాగ్ నివేదికపై వ్యాఖ్యానించేందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా తనకు వాటిని ఆపాదించడం మానుకోవాలని మీడియాను కోరారు. కాగ్ నివేదికలో పొందుపరిచిన అంశాలు సత్యదూరమని తాను వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సాయుధ దళాలకు ఆయుధ సామాగ్రి కొనుగోలు నిరంతర ప్రక్రియ అన్నారు. ఇటీవల తాను కొందరు విలేకరులతో మాట్లాడుతూ ఇవే విషయాలు ప్రస్తావించానని, కాగ్ నివేదిక గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా తప్పుగా రిపోర్ట్ చేశారని చెప్పారు. -
ఛారిటీ ఆస్పత్రుల నిర్వాకమిదే...
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వైద్యం పేద రోగులకు అందుబాటులోకి తెచ్చే ఛారిటీ ఆస్పత్రులు దారితప్పుతున్నాయి. సేవ పేరుతో వేల కోట్ల ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్న కొన్నిఛారిటీ సంస్థలు అసలు దాతృత్వానే చాటుకోవడం లేదని, వాటి ధ్యాసంతా దండుకోవడంపైనే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆస్పత్రులు, ట్రస్టుల నిర్వాకంతో కోట్లాదిరూపాయల ప్రజాదనం వృథా కావడం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని కాగ్ ఆక్షేపించింది. ఆస్పత్రులు, ట్రస్టులకు పన్నుమినహాయింపు ఇచ్చే క్రమంలో అనుసరిస్తున్న ప్రమాణాలపైనా కాగ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఛారిటీ ఆస్పత్రులు, ట్రస్ట్‌ల కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నపలు సంస్థలు రోగుల నుంచి పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ మరోవైపు సర్కార్ నుంచి పన్ను రాయితీలు పొందుతున్నాయి. పలు ఛారిటబుల్ సంస్థలు వసూలు చేసిన మొత్తాలు ఐటీ అధికారుల పరిశీలనకు రాలేదని కాగ్ నిగ్గుతేల్చింది. ఆదాయ పన్ను మినహాయింపునకు అనుసరించాల్సిన ప్రమాణాలు లేని సంస్థలనూ అనుమతిస్తున్నారని ఎత్తిచూపింది. దాదాపు 10 ఛారిటబుల్ ఆస్పత్రులకు ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని కాగ్ ఆడిట్లో వెల్లడైంది. -
రూ. 35 వేల కోట్లు వృధా!
న్యూఢిల్లీ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క దిక్కులేని స్థితిలో రైతులు రొడ్డెక్కుతున్న దేశంలో, కూలిలేక నాలిలేక పిడుచగట్టిన నాలికలతో మూడోవంతు జనాభా పస్తులుంటున్న భారత దేశంలో... ఒక్క గోధుమలే ఐదు లక్షల టన్నులు కుళ్లిపోవడం, 35,701 కోట్ల రూపాయల డబ్బు వృధా అవడం ఎంత కష్టం, ఎంత నష్టం? ఇవి ఎవరో చెప్పిన లెక్కలుగావు. సాక్షాత్తు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చూపిన లెక్కలు. 2011 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు దేశంలోని కేంద్ర ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం, నిస్సహాయం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్లిప్తత, నీతిబాహ్యానికి దేశం ఇంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని కాగ్ శుక్రవారం విడుదల చేసిన తన నివేదికలో విమర్శించింది. దేశంలోని రైతుల నుంచి కనీస మద్దతు ధర కింద గోధుమలు, బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏటా భారత ఆహార సంస్థ ప్రతిపాదిస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 67 శాతం నిధులను మాత్రమే విడుదల చేస్తూ వస్తోంది. 2015–2016 ఆర్థిక సంవత్సరానికి 1.03 లక్షల కోట్ల రూపాయల నిధులను కోరగా కేంద్ర ప్రభుత్వం 67 శాతం నిధులను మాత్రమే విడుదల చేసింది. దేశంలోని రైతుల నుంచి గోధుమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు కొని పౌర పంపిణీ పథకం ద్వారా వాటిని పేద ప్రజలకు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1964లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను ఏర్పాటు చేసింది. దేశంలో ఏటా గోధుమలు, బియ్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని రైతుల నుంచి వీటి సేకరణకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేసి ఆ మేరకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. వాటిని పరిశీలించిన కేంద్రం తప్పనిసరిగా ప్రతిపాదనల్లో 95 శాతం నిధులను విడుదల చేయాలి. అయితే 2011–2012 నుంచి 2015–2016 ఆర్థిక సంవత్సరం వరకు ఎఫ్‌సీఐ ప్రతిపాదనల్లో 67 శాతం నిధులను మాత్రమే కేంద్రం విడుదల చేస్తూ వచ్చింది. ప్రభుత్వ గ్యారంటీపై ప్రభుత్వ బ్యాంకుల నుంచి వడ్డీలు తీసుకునేందుకు, బాండులు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అనుమతించలేదు. కేంద్రానికి భారత ఆహార సంస్థ 11 లేఖలు రాయగా మొదటి పది లేఖలకు అసలు స్పందించలేదు. 11వ లేఖకు స్పందించినప్పటికీ విజ్ఞప్తులను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చుతూ ప్రైవేటు వర్గాల నుంచి రుణాలు తీసుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చి ఊరుకుంది. భారత ఆహార సంస్థ బ్యాంకుల ఆశ్రయించగా తక్కువ వడ్డీపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రాలేదు. పర్యవసానంగా ఈ ఐదేళ్ల కాలానికి ఆహార సంస్థ 11 నుంచి 12 శాతం వడ్డీపై రుణాలు తీసుకొంది. ఆ రుణాల మొత్తంపై వడ్డీ 2016 ఆర్థిక సంవత్సరం నాటికి 35,701 కోట్ల రూపాయలకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి ఉన్నట్లయితే కనీసం 1617 కోట్ల రూపాయలు కలసి వచ్చేవని కాగ్ కేంద్రంపై అక్షింతలు వేసింది. భారత ఆహార సంస్థ పనితీరు కూడా సవ్యంగా లేదని, గోధుమలు అధికంగా పండే పంజాబ్ రాష్ట్రంలో ఈ ఐదేళ్లకాలంలో ఐదు లక్షల టన్నుల గోధుమలు ఎందుకు పనికి రాకుండా కుళ్లిపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆహార సంస్థ చిట్టా పద్ధులు కూడా చిత్తు లెక్కల్లా ఉన్నాయని ఆక్షేపించింది. మార్గదర్శకాల ప్రకారం రైలు మార్గాలకు దగ్గరలో శీతల గిడ్డంగులను నిర్మించక పోవడం, వాటిని నిర్మాణాల్లో కూడా ఆలస్యం జరగడం, పూర్తయిన గిడ్డంగులను కూడా సకాలంలో స్వాధీనం చేసుకోక పోవడం పట్ల కూడా కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆహార సంస్థ ప్రతిఏటా రైతుల నుంచి గోధమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు వాటిని నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగులు ఏటేటా నిర్మిస్తూ పోవాలి. 2011–2012 సంవత్సరానికి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసే సామర్థ్యంగల శీతల గిడ్డంగులను భారత ఆహార సంస్థ అదనంగా నిర్మించాల్సి ఉండగా, 43 లక్షల టన్నుల సామర్థ్యంగల గడ్డంగులను మాత్రమే నిర్మించగలిగింది. అదే సంవత్సరానికి 192 గిడ్డంగుల్లో 165 గిడ్డంగుల నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ మరుసటి సంవత్సరానికిగాను వాటిని స్వాధీనం చేసుకోలేక పోయింది. పంజాబ్‌లో గోధమలను ఆరుబయట ఆరబోయటం వల్లనే ఐదు లక్షల టన్నులు కుళ్లిపోయాయి. -
కాగ్ కనుసన్నల్లో బాలీవుడ్ స్టార్స్
న్యూఢిల్లీ : సేవాపన్ను సరిగ్గా కట్టని బాలీవుడ్ స్టార్స్ అందరూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కనుసన్నల్లోకి వచ్చేశారు. రూ.50 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూలు ఆర్జిస్తున్నప్పటికీ తక్కువ సేవాపన్ను కట్టడం, నిబంధనలను అతిక్రమించడం వంటి వాటికి పాల్పడిన 150 కేసులను కాగ్ గుర్తించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారందరిపై విచారణ సాగిస్తున్నట్టు కాగ్ శుక్రవారం పార్లమెంట్‌కు నివేదించింది. ఈ బాలీవుడ్ దిగ్గజాల్లో సల్మాన్‌ఖాన్, రణబీర్ కపూర్, అజయ్ దేవ్గన్, రితీష్ దేశ్‌ముఖ్, అర్జున్ రాంపాల్ ఉన్నారు. అజయ్ దేవ్గన్, రితీష్ దేశ్‌ముఖ్, రాంపాళ్లకు షోకాజ్ నోటీసు జారీచేస్తున్నామని కాగ్‌కు, సేవాపన్ను అధికారులు చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు తక్కువ పన్ను చెల్లింపులకు ఎందుకు చర్యలు తీసుకోలేదో పన్ను డిపార్ట్మెంట్ స్పష్టంచేయలేకపోయింది. సల్మాన్ ఖాన్, రాంపాల్, రితీష్ దేశ్‌ముఖ్, అజయ్ దేవ్‌గన్‌ల రికార్డులను పరిశీలించినప్పుడు, నిర్మాతలకు, నటులకు మధ్యనున్న ఒప్పందాలను గమనించామని కాగ్ పేర్కొంది. దానిలో ప్రయాణ ఖర్చులు, లాడ్జింగ్, బోర్డింగ్, మేకప్ ఆర్టిస్టు, హై స్టయిలిస్ట్, స్పాట్ బాయ్ వంటి ఖర్చులన్నీ నిర్మాతనే భరిస్తారని రిపోర్టు చెప్పింది. అయితే ఇవన్నీ సర్వీసెస్ కింద అసెసీకి అదనంగా సమకూరుతున్నాయని రిపోర్టులో పేర్కొంది. కానీ అసెసీలు మాత్రం తమ పన్ను విలువలో ఈ అదనపు విలువలను చూపించడం లేదని కాగ్ తేల్చింది. రణబీర్ కపూర్‌నే తీసుకుంటే.. యే దిల్ హై ముస్కిల్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిందని, దీన్ని కొంత భాగం భారత్‌లో, కొంత భాగం న్యూయార్క్‌లో తీసినట్టు కాగ్ చెప్పింది. ఈ షూటింగ్లో భాగంగా లండన్‌కు చెందిన ఫారిన్ కంపెనీ ఏడీహెచ్‌ఎం ఫిల్మ్స్ లిమిటెడ్ నుంచి రణబీర్‌కు రూ.6.75 కోట్లు లభించాయని, కానీ వాటికి చెల్లించాల్సిన సర్వీసెస్ పన్ను రూ.83.43 లక్షలను ఎక్స్‌పోర్టు సర్వీసుల లాగా ట్రీట్ చేసి, వాటిని చెల్లించలేదని ఆడిటర్ పేర్కొంది. -
నోటీసులపై స్పందించిన ఎన్టీఆర్
నాన్నకు ప్రేమతో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు అందుకున్న ఎన్టీఆర్ వాటిపై స్పందించారు. తమ సినిమా పూర్తిగా లండన్ లో నిర్మించామని, లండన్ లో తీసిన సినిమాకు భారత్ లో టాక్స్ వర్తించదన్నారు. ఇప్పటికే కాగ్ నోటీసులకుతన ఆడిటర్ రిప్లై ఇచ్చినట్టుగా తెలిపారు. ఆదాయపు పన్నుతో పాటు సర్వీన్ టాక్స్ ను కూడా క్రమం తప్పకుండాచెల్లిస్తున్నాని తెలిపిన ఎన్టీఆర్, భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఎప్పుడూ మరవలేదన్నారు. చెల్లించాల్సిన పన్ను ఏదైనా ఉన్నట్టుగా తేలితే అణా పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగ్ సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి ఎన్టీఆర్ 1.10 కోట్ల టాక్స్ మినహాయింపు పొందారని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్, రణబీర్లకు కాగ్ నోటీసులు..!
సినిమా పారితోషకానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, రణబీర్ కపూర్ లు పొందిన పన్ను మినహాయింపుపై నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాగ్ తప్పు పట్టగా.. ఈ వ్యవహారంలో ఈ హీరోకి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన పారితోషకం వ్యవహారంలో ఎన్టీఆర్ అనుచిత రీతిలో పన్ను మినహాయింపు పొందినట్టుగా తెలుస్తోంది. ఆ సినిమాకు గానూ ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడట. లెక్క ప్రకారం అందులో కోటీ పది లక్షల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద తారక్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఎక్కువగా భాగం లండన్ లో షూట్ చేయటంతో సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి 1.10 కోట్ల ట్యాక్స్ మినహాయింపు పొందారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా విషయంలో ఈ తరహా మినహాయింపు పొందటంతో అతనికి కూడా నోటీసులు అందాయి. వీరికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాగ్ భావించింది. దీంతో ఇద్దరు నటులకు షోకాజ్ కం డిమాండ్ నోటీసులు ఇవ్వటంతో పాటు అలాంటి అవకతవకలు ఇంకా ఉన్నాయా పరిశీలించమని సంబంధిత అధికారులను కోరింది. -
చైనాను 'ఆకాశ్'తో అడ్డుకుందామంటే..
న్యూఢిల్లీ: చైనా నుంచి ఎప్పుడైనా రక్షణ పరంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈశాన్య రాష్ట్రాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణులను మోహరించాలని భారత ప్రభుత్వం గతంలోనే భావించింది. అవును. తాజా కాగ్ రిపోర్టు ఈ విషయాన్నే వెల్లడించింది. ఇందుకోసం 2010లో కేబినేట్ ఆమోదాన్ని కూడా తెలిపింది. అయితే, ఇప్పటివరకూ ఈ దిశగా ముందడుగు పడకపోవడానికి కారణాలు తెలుసుకుంటే షాక్‌కు గురి కావాల్సిందే. ఆకాశ్ క్షిపణుల తయారీ నెలకొన్న లోపాల గురించి కాగ్ శుక్రవారం పార్లమెంటులో రిపోర్టు ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో ఆన్లైన్లో కూడా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆకాశ్ క్షిపణులను డీఆర్డీవో డిజైన్ చేసింది. ప్రభుత్వ సంస్ధలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) తదితరులు వీటిని ఉత్పత్తి చేశాయి. స్వదేశీ సాంకేతికతతో ఉత్పత్తైన ఆకాశ్ క్షిపణుల్లో మూడిండ ఒక వంతు ప్రయోగ దశలో విఫలమయ్యాయి. దీంతో అత్యవసర సమయాల్లో 'ఆకాశ్' ఆదుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తినట్లు కాగ్ పేర్కొంది. 2013 జూన్ నుంచి 2015 డిసెంబర్ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు ప్రదేశాల్లో చైనా వైపుగా ఆకాశ్ క్షిపణుల స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాల్సివుందని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,619 కోట్లు కేటాయించిందని వెల్లడించింది. అయితే, ఇప్పటివరకూ ఒక్క స్క్వాడ్రన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంది. బేస్‌ల నిర్మాణంలో జాప్యమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఆకాశ్ క్షిపణుల బేస్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే చైనా కొంచెం వెనక్కు తగ్గేదని సీనియర్ మిలటరీ అధికారులు చెబుతున్నారు. -
బేజారెత్తిస్తున్న రైళ్లు!
రైళ్లలో సరఫరా చేస్తున్న తిండి ఉత్త పనికిమాలినదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక కడిగి పడేసి అయిదారు రోజులు కాకుండానే ఒక ప్రయాణికుడికి సరఫరా చేసిన వెజ్ బిర్యానీలో చచ్చిన బల్లి పడి ఉన్నదంటే అది ఆ శాఖ పనితీరును వెల్లడిస్తుంది. అది తెలుసుకుని వచ్చిన రైల్వే సిబ్బంది చాలా శ్రద్ధగా ఆ బిర్యానీ ప్యాకెట్‌ను వెంటనే బయటకు విసిరేశారు. ప్రయాణికుడికి అవసరమైన వైద్యసాయం మాత్రం నాలుగు గంటల తర్వాత అందింది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న పూర్వ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ ఘటనపై యధాప్రకారం దర్యాప్తు చేస్తామన్న హామీ మాత్రం వినబడింది. నిజానికి ఇప్పటికే కాగ్ లోతైన దర్యాప్తు జరిపింది. మొత్తంగా 74 స్టేషన్లలో, 80 రైళ్లలో, వివిధ కేటరింగ్ కేంద్రాల్లో తనిఖీ చేసి అపరిశుభ్రత, నిర్లక్ష్యం అక్కడ రాజ్యమేలుతున్నాయని తేల్చింది. పాచిపోయిన ఆహారపదార్ధాలను ఆ మర్నాడు వంటకాల్లో కలగలిపి ప్రయాణికులకు అంటగడుతున్నారని చెప్పింది. కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకె ట్లను, ఇతర పదార్ధాలను యధేచ్ఛగా అమ్ముతున్నారని పేర్కొంది. ఇంకా దారు ణమేమంటే పాలు, పండ్ల రసాలు,టీ, కాఫీ వగైరాలన్నిటికీ కలుషిత నీటిని వాడుతున్నారని వివరించింది. పాంట్రీ కారుల్లో, వంట గదుల్లో దేనిపైనా మూతలు లేకపోవడం వల్ల ఎలుకలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపింది. ఇవన్నీ గమనించాక పంపిణీ చేసిన తిండిలో చచ్చిన బల్లి కనబడటం అసాధారణమేమీ కాదని అర్ధమవుతుంది. మరి రైల్వే శాఖ ఏం చేస్తున్నట్టు? ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు ప్రక టించింది. వచ్చే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి ఆ శాఖకు జవసత్వాలు కల్పించబోతున్నట్టు చెప్పింది. ప్రయాణికుల సంఖ్యను, సరుకు రవాణాను భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం ఈ ప్రణాళికలో భాగం. ఇవన్నీ చేస్తే రైల్వే ఆదాయం అనేక రెట్లు పెరుగుతుందన్నది అంచనా. గత రెండున్నరేళ్లలో అందులో దాదాపు నాలుగోవంతు... అంటే రూ. 2 లక్షల కోట్ల వరకూ ఖర్చు చేశారని కూడా చెబుతున్నారు. కానీ దానివల్ల ప్రయా ణికులకు ఒరిగిందేమీ లేదు. నిరుడు రూ. 20,000 కోట్ల మేర ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా అది నెరవేరలేదని గణాంకాలు చెబుతున్నాయి. పెట్టు బడులు పెట్టగానే దాని ఫలితాలు కనబడకపోవచ్చు. అందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ ఆహార పదార్థాలను అందించడంలోనే, బోగీల నిర్వహణ లోనే ఇంత ఘోరంగా విఫలమవుతుంటే ఆ శాఖ ఇంకేదో సాధిస్తుందని విశ్వ సించేదెలా? వాస్తవానికి ఆహారపదార్ధాల విషయమై ఎన్నో విషయాలు చెప్పిన కాగ్ అందుకు దోహదపడుతున్న కారణాలను కూడా ప్రస్తావించింది. కేటరింగ్ విధానంలో నిలకడ లేకపోవడం, కేటరింగ్ యూనిట్ల నిర్వహణ బా«ధ్యతలను వెంటవెంటనే మారుస్తుండటం ఈ దుస్థితికి దారితీసి ఉండొచ్చునని అభిప్రాయ పడింది. రైల్వే శాఖ ఒకప్పుడు తానే కేటరింగ్ సేవలను నిర్వహించేది. అయితే ప్రయాణికులనుంచి వస్తున్న ఫిర్యాదుల పర్యవసానంగా దీన్ని ప్రైవేటు రంగానికి అప్పగించడం ఉత్తమమని భావించింది. కానీ అందువల్ల వీసమెత్తు ఉపయోగం కలగలేదని తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయంలో తన వంతుగా తీసుకుంటున్న చర్యలను రైల్వే శాఖ ఏకరువు పెట్టింది. నిరుడు 16 కాంట్రాక్టు సంస్థల్ని బ్లాక్‌లిస్టులో పెట్టామని, మరికొందరిపై లక్షల రూపాయల చొప్పున జరిమానా వేశామని వివరించింది. అయితే మౌలికంగా కేటరింగ్ సంస్థల ఎంపిక ప్రక్రియలోనే లోపముందన్న సంగతి ఆ శాఖ తెలుసుకోవడం లేదు. ఆ విష యంలో పాటిస్తున్న గోప్యతే ఈ అస్తవ్యస్థ స్థితికి దారితీస్తోంది. ఏ సంస్థకు ఏ ప్రాతిపదికన కాంట్రాక్టు ఇస్తున్నారో, దేన్ని ఆధారంగా కొందరిని అనర్హులుగా నిర్ణయిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇందుకోసం వారు ఏర్పరుచుకున్న నిబం ధనలన్నీ పరమ రహస్యం. ఆహార పదార్ధాల ధరల నిర్ణయం కూడా ఇలాగే ఉంటోంది. కాంట్రాక్టుల వ్యవహారం పారదర్శకంగా ఉండి, ప్రయాణికులకు అందించే పదార్ధాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే... బయటి తనిఖీలకు కూడా వీలు కల్పిస్తే ఈ పరిస్థితి కాస్తయినా చక్క బడుతుంది. ప్రయాణికులకు సమకూర్చే దుప్పట్లు, రైళ్లలో వాడే తెరలు వగై రాలన్నీ నెలల తరబడి పరిశుభ్రం చేయడం లేదని కూడా కాగ్ బయటపెట్టింది. ఒకసారి ఉపయోగించిన వస్త్రాన్ని ఉతికించాకే తిరిగి ఉపయోగించాలన్న నిబం ధన ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సూపర్‌ఫాస్ట్ రైళ్ల ముచ్చట కూడా అంతే. ఆ పేరు చెప్పి ప్రయాణికుల దగ్గరనుంచి అదనంగా రూ. 11.17 కోట్ల మేర వసూలు చేస్తున్నా ఆ రైళ్లు ఎప్పటి మాదిరి నత్తనడకనే తల పిస్తున్నాయి. కాగ్ నివేదిక వివిధ రైల్వే స్టేషన్లలో ఆ రైళ్లు బయల్దేరుతున్న సమయాన్ని, గమ్యాన్ని చేరుకుంటున్న సమయాన్ని పరిశీలించి అందులో 95 శాతం రైళ్లు పాత పద్ధతిలోనే సాగుతున్నాయని బయటపెట్టింది. ఇక రైల్వే విద్యుదీకరణ స్థితి కూడా అలాగే ఉంటున్నది. అనేక ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం, మొదలుపెట్టిన పనులు కూడా ఈసురోమని నడుస్తుండటం వల్ల ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలన్న ఆ శాఖ లక్ష్యం ఇప్పట్లో నెరవేరే అవ కాశమే కనబడటం లేదు. ఇన్ని లోపాలు సరిదిద్దుకోకుండా విఫలమవుతూ పెద్ద పెద్ద ప్రణాళికలను రచించుకోవడం ఎవరిని వంచించడానికి? బాహాటంగా కనబడుతున్న లోపా లనూ సరిదిద్దుకోక, ఫిర్యాదులొచ్చినప్పుడూ పట్టించుకోలేక రైల్వే యంత్రాంగం ఒరగబెడుతున్నదేమిటి? తాజా ఉదంతంతోనైనా రైళ్ల శాఖ కళ్లు తెరవాలి. రకరకాల పేర్లు చెప్పి ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడంలో చూపుతున్న ఉత్సాహాన్ని వారికి సౌకర్యాలను కల్పించడంలో, వారిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చడంలో ప్రదర్శిస్తే మంచిదని తెలుసుకోవాలి. -
డోక్లామ్‌పై దొంగాట !
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు డ్రాగన్ కుయుక్తులు డోక్లామ్... భారత్, చైనా, భూటాన్ సరిహద్దులు కలిసే పీఠభూమి! 38 రోజుల క్రితం ఈ ప్రాంతంలో రగిలిన వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. భారత్–చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కూడా దీనిపై దృష్టి సారించింది. రెండు దేశాలూ ప్రత్యక్ష చర్చలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గారి రాస్ సూచించారు. ఈ వివాదంపై మొదట్నించీ చర్చలకు, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా చైనా సానుకూలంగా స్పందించడం లేదు. డోక్లామ్ పీఠభూమి తమదేనంటూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోంది. పైపెచ్చు రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు భూటాన్ సేనలకు మద్దతుగా ఆ ప్రాంతానికి వచ్చిన భారత దళాలే భూటాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయంటూ బుకాయిస్తోంది. డోక్లామ్‌పై చైనాతో సంప్రదింపులకు సిద్ధమేనని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ 11న ప్రతిపాదించినా ఆ దేశం ఆసక్తి ప్రదర్శించలేదు. డోక్లామ్‌పై చైనా ఆడుతున్న దొంగాటపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ భారత్, చైనా మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం డోక్లామ్ ప్రాంతం నుంచి ఉభయ పక్షాలూ మొదట తమ సేనలను ఉపసంహరించుకుంటే వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గురువారం పార్లమెంటులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాల్సిన చైనా ఉద్రిక్తతలు మరింత పెంచేలా జవాబిచ్చింది. సుష్మ అబద్ధమాడారంటూ తన తెంపరితనాన్ని చాటుకుంది. చైనాకు నిజంగా ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇలా స్పందించేది కాదనీ, సిక్కిం సెక్టార్లో ఉద్రిక్తతలు కొనసాగాలనే కోరుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉభయ దేశాల దళాలూ ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని సుష్మ ప్రతిపాదిస్తుండగా.. భారత దళాలు ఉపసంహరిస్తేనే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా చెబుతోంది. అంతేగాక భారత్‌ను పలుచన చేసి మాట్లాడటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’తో హెచ్చరికలు చేయిస్తోంది. 1962 యుద్ధంలోనే భారత్ వెనకబడిపోయిందనీ, అప్పటితో పోల్చితే చైనా రక్షణపరంగా బాగా బలోపేతమైందనీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఈ పత్రిక పదేపదే ‘భయపెట్టే’ ప్రయత్నాలు చేస్తోంది. మంచుకొండల్లో ఎప్పటిదాకా ఈ వేడి? 1986లో భారత్, చైనా మధ్య అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతంలోని సుమ్‌దొరాంగ్ చూలో రాజుకున్న వివాదం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌కు ఎంతో కీలకమైన సిలిగురి కారిడార్(కోడిమెడ) దగ్గరలో రాజుకున్న నిప్పురవ్వలు మంటలుగా మారకుండా ఎప్పుడు మామూలు పరిస్థితులు ఏర్పడతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నవంబర్‌లో జరిగే చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ(కాంగ్రెస్) ముగిసే వరకూ డోక్లామ్ వివాదం రగులుతూనే ఉంటుందని భారత మాజీ జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శివశంకర్ మీనన్ అభిప్రాయపడుతున్నారు. ‘‘చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్.. పార్టీ 19వ జాతీయ కాంగ్రెస్ నాటికి బలమైన నేతగా నిలబడటమేగాక పొరుగుదేశాల విషయంలో కరకుగా వ్యవహరించే పాలకునిగా కనిపించాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే.. సీపీసీ కాంగ్రెస్ వరకూ డోక్లామ్ ఉద్రిక్తతలు కొనసాగుతాయి’’ అని మీనన్ చెప్పారు. అయితే ఈ నెలాఖరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా ఉన్నతాధికారులతో భేటీ సందర్భంగా డోక్లామ్‌పై చర్చించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పుడు అరుణాచల్ సరిహద్దులో.. 1986లో ఇలాగే భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం కనిపించింది. అరుణాచల్‌ప్రదేశ్ సమీపంలోని సుమ్‌దొరాంగ్ వద్ద జరిగిన ఓ సంఘటన కారణంగా ఈ ప్రాంతంలోని సరిహద్దులో భారత్, చైనాలు వేల సంఖ్యలో తమ సేనలను ఏడాదిపాటు సమీకరించారు. తర్వాత ఉభయ దేశాల మధ్య చర్చలు జరిగి ఉద్రిక్తతలు చల్లారడానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీని ఫలితంగా అప్పట్నుంచి ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకూ 3,844 కిలోమీటర్ల సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగింది. తాజాగా డోక్లామ్‌తో సిక్కిం సెక్టార్ మళ్లీ వేడెక్కింది. వాచ్ టవర్‌తో వివాదం! 2014లో డోక్లామ్‌లో నిర్మించిన సైనిక వాచ్ టవర్‌కు రోడ్డు నిర్మించాలన్న చైనా సర్కారు నిర్ణయమే ఈ వివాదానికి దారితీసి ఉండొచ్చని చైనాలోని ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్లాగ్ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అంతంతమాత్రంగా ఉన్న భూటాన్ సేనలను గమనించిన చైనా 2007 తర్వాతే డోక్లామ్ పీఠభూమిని తన అధీనంలోకి తెచ్చుకుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘‘డోక్లామ్ ఎప్పుడూ చైనా అంతర్భాగమేగానీ 2007 దాకా భూటాన్ అధీనంలో ఉండేది. ఆ తర్వాతే పూర్తిగా చైనా చేతికి చిక్కింది. 1890 బ్రిటన్–చైనా ఒప్పందం ప్రకారం ఈ పీఠభూమి చైనాకే చెందినా కొన్నేళ్ల క్రితం ఇక్కడ భూటాన్ రెండు వాచ్ టవర్లు నిర్మించి తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో చైనా 2007లో వాటిని ధ్వంసం చేసి అదే చోట కొత్త టవర్లు నిర్మించింది’’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వాచ్ టవర్లకు రోడ్లు వేస్తున్న క్రమంలోనే ఈ వివాదం రాజుకుంది. మన ఆయుధ సామగ్రి పదిరోజులకే కాగ్ నివేదిక డోక్లామ్ వద్ద భారత్–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఆయుధ సామగ్రిపై కాగ్ ఇచ్చిన తాజా నివేదిక చర్చనీయాంశమైంది. యుద్ధం వస్తే మన ఆర్మీ వద్దనున్న ఆయుధ సామగ్రి పది రోజుల్లోనే ఖర్చయిపోతుందని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని 2013లోనే గుర్తించి వెలుగులోకి తెచ్చినా గత నాలుగేళ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదని కాగ్ పేర్కొంది. మరోవైపు చైనా తన ఆయుధ సామగ్రిని గణనీయంగా పెంచుకుంటోంది. రక్షణ మంత్రిత్వశాఖ అధీనంలోని 41 ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల ద్వారా భద్రతా దళాలకు ఆయుధ సామగ్రి అందుతోంది. ఈ ఫ్యాక్టరీలకు రక్షణ ఉత్పత్తుల తయారీలో 200 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెబుతున్నా.. 2013 నుంచి ఆర్మీకి సరఫరా చేసిన ఆయుధ సామగ్రి నాణ్యత నాసిరకంగా ఉందని కాగ్ స్పష్టంచేసింది. 127 ఏళ్ల వివాదం డోక్లామ్‌తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్‌ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్ ) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు గతనెల 16న చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు జూన్ 18న భారత్ సేనలు అక్కడకు చేరుకున్నాయి. ఇది కొనసాగుతుండగానే గతనెల 28న సిక్కిం సెక్టార్‌లోకి చైనా ప్రవేశించినట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రదేశం కూడా ట్రై జంక్షన్‌కు సమీపంలోనే ఉండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. ఈ ప్రాంతమే ఈశాన్య రాష్ట్రాలతో దేశాన్ని కలుపుతుండటం గమనార్హం. నాథూలాలోనూ వివాదమే.. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ను, పశ్చిమబెంగాల్లోని కళింపాంగ్, చైనా అ«ధీనంలోని టిబెట్ యాతుంగ్ను కలిపేదే నాథూలా మార్గం. టిబెట్ భాషలో నాథూలా అంటే వింటున్న చెవి అని అర్థం. చైనాతో 1962 యుద్ధం తర్వాత భారత్ దీన్ని మూసేసింది. ఆనాటి నుంచి సరిహద్దుల్లో అతిక్రమణలు కొనసాగుతూనే వచ్చాయి. అయితే 1967లో నాథూలా సమీపంలోని భూభాగాన్ని చైనా ఆక్రమించే ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ పోరులో 400 మంది చైనా సైనికులు చనిపోగా.. భారత్ 70 మంది జవాన్లను కోల్పోయింది. ఈ మార్గాన్ని 2006లో భారత్ తెరిచింది. డోక్లామ్ వద్ద ఇరుదేశాల ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి మానససరోవర్ యాత్రికులు వెళ్లకుండా నాథూలా మార్గాన్ని చైనా మూసేసింది. భూటాన్–చైనాలు 470 కి.మీ. సరిహద్దును కలిగి ఉన్నాయి. 1972–1984 మధ్యలో భారత్ సహకారంతో భూటాన్ చైనాతో సరిహద్దు చర్చలు జరిపింది. ఈ ప్రాంతంలో శాంతిని, యథాతథ స్థితిని కొనసాగించేందుకు 1988, 1998లలో ఈ దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. -
బడి బయట బాలలు 1,00,000
2015–16 లెక్కలు వెల్లడించిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014–15 విద్యాసంవత్సరంలో 36,519 మంది, 2015–16 విద్యా సంవత్సరంలో 46,391 మంది బాలలు బడి బయట ఉన్నారని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడీఐఎస్ఈ) లెక్కల ప్రకారం 2014–15లో 2,50,581 మంది, 2015–16లో 1,12,991 మంది బాలలు బడి బయట ఉన్నారని తెలిపింది. జాతీయ స్థాయిలో విద్యా హక్కు చట్టం–2009 అమలుపై తాజాగా కాగ్ బహిర్గతం చేసిన నివేదికలో రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు, లోపాలను పొందుపరిచింది. అంశాల వారీగా పరిశీలిస్తే.. ► తెలంగాణలో రూ.5.73 కోట్ల సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిధులను 2012–13 నుంచి 2015–16 మధ్యకాలంలో ఇతర శాఖలకు దారిమళ్లించడంతో దుర్వినియోగమయ్యాయని కాగ్ తప్పుపట్టింది. ► 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేసిన 21 పాఠశాలలకు 2014 మార్చి–డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిసులు జారీ చేయగా, అందులోని 9 పాఠశాలలకు రూ.15.29 కోట్ల జరిమానాలు విధించింది. ఈ జరిమానాలను ఇంత వరకు వసూలు చేయలేదు. ► రాష్ట్రంలో తనిఖీలు జరిపిన రెండు జిల్లాల్లో 67 మంది ఉపాధ్యాయులను బోధనేతర పనుల కోసం వినియోగించుకుంటున్నారు. ► 2012–13 మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలోని 666 పాఠశాలల విద్యుదీకరణ కోసం రూ.1.03 కోట్లు విడుదల చేయగా, 2016 మార్చి వరకు ఈ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ► విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సలహా కమిటీని ఏర్పాటు చేయలేదు. -
గుడ్ న్యూస్.. యుద్ధానికి సరిపడా ఆర్మీకి సామగ్రి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్థాయీసేన(స్టాండింగ్ ఆర్మీ) కలిగిఉన్న భారత్.. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే శత్రువుతో పది రోజులకు మించి పోరాడలేదు! ఎందుకంటే అవసరమైనంత మందుగుండు సామగ్రి భారత్ వద్ద లేదు!! శుక్రవారం పార్లమెంట్ ముందుంచిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలివి. కాగ్ రిపోర్టు నేపథ్యంలో రక్షణ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్‌లు కయ్యానికి కాలుదువ్వుతున్నవేళ ఇండియన్ ఆర్మీని వేధిస్తున్న మందుగుండు కొరతను తీర్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీలైనన్ని మార్గాల్లో.. సాధ్యమైనంత తొందరగా మందుగుండు నిల్వను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆగస్టు ఒకటో వారంలోగా యుద్ధ ట్యాంకులకు, తుపాకులకు అవసరమైన మందుగుండు భారీగా అందనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భారత బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రిలో ప్రస్తుతం కేవలం 40 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని నూటికి నూరు శాతం పెంచేలా రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది చివరినాటికి.. సుదీర్ఘ యుద్ధం చేయడానికి సైతం అవసరమైన మందుగుండు సామగ్రి సైన్యానికి అందబోతున్నట్లు సమాచారం. గత ఏడాది ఉరీ ఉగ్రదాడి అనంతరం రక్షణశాఖ రూ.12,000 కోట్లతో మందుగుండు కొనుగోలుకు ఆర్డర్లు జారీచేసింది. మరోవైపు 46 రకాల యుద్ధ సామగ్రి కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాధికారాలను ఆర్మీ వైస్ చీఫ్‌కు కట్టబెట్టింది. తద్వారా సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని రక్షణశాఖ భావిస్తోంది. ఇండియన్ ఆర్మీకి అవసరమైన మందుగుండు సామగ్రిలో 90 శాతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ) నుంచే సరఫరా అవతున్న సంగతి తెలిసిందే. అయితే, 2013 నుంచి పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఓఎఫ్‌బీ విఫలమైందని కాగ్ రిపోర్టులో వెల్లడైంది. (భారత్‌ను సులభంగా ఓడించేస్తాం: చైనా) -
యుద్ధం వస్తే 10రోజుల కన్నా పోరాడలేం: కాగ్
న్యూఢిల్లీ: భారత్ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన రిపోర్టులో పేర్కొంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)కి సంబంధించిన వివరాలను శుక్రవారం పార్లమెంట్లో కాగ్ ప్రవేశపెట్టింది. దేశ రక్షణకు ఎంతో అవసరమైన యుద్ధ సామగ్రిని పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుకోలేకపోతున్నామని చెప్పింది. 2013 నుంచి 2016 సెప్టెంబర్ వరకూ మన వద్ద ఉన్న యుద్ధ సామగ్రి నిల్వల్లో పెద్ద మార్పులేవి లేవని తెలిపింది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే అత్యవసరమయ్యే 55 శాతం సామగ్రి అందుబాటులో లేదని చెప్పింది. అందుబాటులో ఉన్న 40 శాతం యుద్ధ సామగ్రి కూడా పది రోజుల పాటు యుద్ధం జరిగితే అయిపోతుందని తెలిపింది. ముఖ్యంగా ఆర్టిలరీ గన్స్, ట్యాంక్‌లకు అవసరమయ్యే యుద్ధ సామగ్రి కొరత తీవ్రంగా ఉందని చెప్పింది. 2013లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఓఎఫ్‌బీ విఫలమైందని విమర్శించింది. పేలుళ్లు, మిస్సైల్స్‌లలో ఉపయోగించే ఫ్యూజ్‌ల కొరత ఎక్కువగా ఉందని ఆర్టిలరీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది ఓ జాతీయ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఫ్యూజ్‌లు లేకపోవడం వల్ల యుద్ధంలో మిస్సైల్స్, మోర్టార్స్, ఆర్టిలరీ ఎక్స్‌ప్లోజివ్స్‌లను వినియోగించలేమని చెప్పారు. -
ఐఎఫ్సీఐ నిబంధనల ఉల్లంఘన
♦ సగం పైగా రుణాల్లో రూల్స్ అతిక్రమణ ♦ కాగ్ నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఐఎఫ్సీఐ దాదాపు 50 శాతం పైగా రుణాల మంజూరీ విషయంలో నిబంధనలను పాటించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. చట్టాలను ఉల్లంఘిస్తూ పలు కంపెనీలకు ఐఎఫ్సీఐ భారీ స్థాయిలో రుణాలిచ్చిందని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. భూషణ్ స్టీల్‌కు రుణాలివ్వడంలో సంస్థలకు నీళ్లొదిలిందని తెలిపింది. ఇందుకు భూషణ్ స్టీల్ తదితర సంస్థలకి రుణాలివ్వడమే నిదర్శనమని పేర్కొంది. రుణభారం పెరిగిపోవడంతో పాటు 2014–15, 2015–16లో భారీ నష్టాలూ చవిచూడటం వల్ల ఆ సంస్థకి ఇచ్చిన రూ. 403 కోట్ల రుణాల రికవరీ సందేహాస్పదమేనని తెలిపింది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా నిబంధనలకు విరుద్ధంగా రూ. 500 కోట్లు ఐఎఫ్సీఐ మంజూరు చేసిందని పేర్కొంది. అలాగే మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ, పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ కంపెనీ, పిపావవ్ మెరీన్ అండ్ ఆఫ్షోర్కి రుణాలివ్వడంలోనూ ఐఎఫ్సీఐ నిబంధనలను తుంగలో తొక్కిందని వివరించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ముద్రపడిన ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉన్న 3 సంస్థలకు కూడా ఐఎఫ్సీఐ రుణాలిచ్చిందని ఆక్షేపించింది. ఆరు టెల్కోలు రూ. 61వేల కోట్ల ఆదాయాన్ని చూపించలేదు .. గడిచిన అయిదేళ్లుగా ఆరు టెలికం కంపెనీలు రూ. 61,000 కోట్ల పైగా ఆదాయాలను వెల్లడించకుండా తొక్కిపెట్టి ఉంచాయని కాగ్ వ్యాఖ్యానించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 7,700 కోట్ల మేర గండిపడిందని పేర్కొంది. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, సిస్టెమా శ్యామ్ ఇందులో ఉన్నాయి. కాగ్ లెక్కల ప్రకారం 2010–11 నుంచి 2014–15 మధ్య కాలంలో ప్రభుత్వానికి ఎయిర్టెల్ రూ. 2,602 కోట్ల మేర లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్‌యూసీ) బకాయిపడింది. వడ్డీ కింద మరో రూ. 1,246 కోట్లు కట్టాల్సి ఉంది. ఇక వొడాఫోన్ రూ. 1,179 కోట్ల వడ్డీతో సహా రూ. 3,332 కోట్లు, ఐడియా రూ. 1,136 కోట్లు (రూ. 658 కోట్ల వడ్డీ కలిపి), రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 1,911 కోట్లు (రూ. 839 కోట్ల వడ్డీ), ఎయిర్‌సెల్ రూ. 1,227 కోట్లు, సిస్టెమా శ్యామ్ రూ. 117 కోట్లు కట్టాల్సి ఉంటుందని కాగ్ పేర్కొంది. కమీషన్లు, డిస్కౌంట్లు మొదలైన వాటిని ఖాతాల్లో సర్దుబాటు చేసేయడం ద్వారా టెల్కోలు తమ వాస్తవ ఆదాయాలను తొక్కి పెట్టి ఉంచాయని వివరించింది. -
పంటబీమా అమలు దారుణం: కాగ్ అక్షింతలు
న్యూఢిల్లీ: 2011–16 మధ్య పంటబీమా పథకం అమలు దారుణంగా ఉందని కాగ్ దుయ్యబట్టింది. ఎలాంటి పరిశీలన లేకుండానే ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలకు రూ.36,222.79 కోట్లు విడుదల చేశారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.32,606.65 కోట్లను పంటబీమా ప్రీమియం సబ్సిడీగా చెల్లించినట్లు పేర్కొన్నాయి. ఈ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) ద్వారా 10 ప్రైవేటు కంపెనీలకు చేరింది. ఎలాంటి అనుమతి, మార్గదర్శకాల్లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయి’ అని కాగ్ నివేదిక పేర్కొంది. 2011–12 నుంచి 2015–16 మధ్య కాలంలో ఎన్ఏఐఎస్, ఎమ్ఎన్ఏఐఎస్, వాతావరణ ఆధారిత పంటబీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను కాగ్ సమీక్షించింది. కేంద్రం సరైన సమయంలోనే తన వాటా మొత్తాన్ని అందజేసినా రాష్ట్రాల వాటా రావటంలోనే ఆలస్యం జరిగిందని.. దీంతో రైతులకు సరైన సమయంలో పరిహారం అందలేదని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. -
జరం గోలీకీ దిక్కులేదు
► తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులపై కాగ్ అసంతృప్తి ► ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులు లేవు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య రంగం పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం అత్యవసర మందులూ అందుబాటులో లేవని, సాధా రణ మందుల విషయం గురించి చెప్పాల్సిన అవస రం లేదని పేర్కొంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, వసతులు న్నచోట సిబ్బంది లేరని వివరించింది. వివిధ విభాగాల పనితీరుపై కాగ్ ఇచ్చిన నివేది కలను పార్లమెంటుకు కేంద్రం సమర్పించింది . 2011–12 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో వైద్య రంగానికి రూ. లక్ష కోట్లను కేంద్రం కేటాయించ గా..మౌలిక వసతులు, సిబ్బంది కొరత, నిధు ల వ్యయం, మళ్లింపు, మందుల సర ఫరా, ఆస్పత్రుల దురవస్థ అంశాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిశీలించి కాగ్ నివేదిక ఇచ్చింది. 2011 –12లో ఖర్చు చేయని నిధులు రూ. 7,375 కోట్లుండగా.. 2015–16 లో ఆ మొత్తం రూ. 9,509 కోట్లకు చేరిందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో వేరే పథకాలకు నిధులు మళ్లించారని తెలి పింది. ఎక్స్పైరీ తేదీలూ చూడరా?.. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్స్పైరీ తేదీలనూ చూడకుండా రోగుల కు మందులు ఇచ్చారని కాగ్ పేర్కొం ది. ఆశా వర్కర్ల వద్ద నవజాత శిశువుల బరువు కొలిచే, గర్భిణులకు బీపీ చూసే పరికరాలు, డెలివరీ, ప్రెగ్నెన్సీ కిట్లు, పారాసెటమల్, ఐరన్ మాత్ర లు వంటివేవీ లేవంది. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో పలు పీహెచ్‌సీలు వైద్యులు లేకుం డానే పనిచేస్తున్నాయంది. 28 రాష్ట్రాల్లో కనీ సం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లూ లేవని తెలి పింది. దేశవ్యాప్తంగా అంబులెన్స్‌ల కోసం రూ. 175. 26 కోట్లు విడుదల చేస్తే రూ. 155. 93 కోట్లను వినియోగించనేలేదని పేర్కొంది. పరికరాలున్నా.. సిబ్బంది లేరు.. తెలంగాణ జనాభాకు అనుగుణంగా 768 పీహెచ్‌సీలకు గాను 668 మాత్రమే ఉన్నాయని.. మరో 78 సీహెచ్‌సీలు అవసరమని కాగ్ తెలిపింది. ఏపీలో మరో 25 పీహెచ్‌సీలు, 104 సీహెచ్‌సీలు అవసర మని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులు లేవని తెలిపింది. అనేక హెల్త్ సెంటర్లకు ప్రజా రవాణా, విద్యుత్, తాగునీరు వసతి లేదని, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా వినియోగంలోకి రాలేదని వాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరికరాలున్నా.. సిబ్బంది లేక నిరుపయోగంగా ఉన్నాయంది. ఈ రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులూ లేవని.. పారాసిటమల్, విటమిన్–ఏ, బీ–కాంప్లెక్స్, అల్బెండజోల్, గర్భ నిరోధక మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గైనకా లజీకి సంబంధించిన కిట్లు వంటివేవీ లేవని తెలిపింది. -
టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల గట్టును కాగ్ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్‌లో సమర్పించింది. కాగ్ తన ఆడిట్లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్ గ్రాస్ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్ రిపోర్టులో ఇవి బయటపడగా.. సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్ రిపోర్టు తేల్చింది. -
రైళ్లలో ఆహారం పనికిరాదు
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రజలకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వ్యాఖ్యానించింది. పాడైపోయిన ఆహారం, రీ-సైక్లిడ్ ఫుడ్, ప్యాక్లెట్లలో ఉంచిన ఆహారం, గుర్తింపు లేని కంపెనీల వాటర్ బాటిల్స్ తదితరాలు ప్రయాణీకలకు రైల్వే అందిస్తోందని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టును శుక్రవారం పార్లమెంటులో కాగ్ సమర్పించనుంది. రైల్వే ఆహారపు పాలసీని తరచూ మారుస్తూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. కాగ్, భారతీయ రైల్వేకు చెందిన అధికారులు సంయుక్తంగా 74 స్టేషన్లు, 80 రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో ఆహారం తయారుచేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం లేదని తెలిసిందని కాగ్ చెప్పింది. ఆహారం కొనుగోలు చేసిన ప్రయాణీకులు బిల్లులు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది. ట్యాప్‌ల నుంచి నీటిని పట్టి అమ్మేస్తున్నారని రిపోర్టులో పేర్కొంది. బెవరేజెస్, చెత్త కుండీలకు మూతలు ఉండటం లేదని చెప్పింది. -
మరో లక్షన్నర మంది రైతులకు రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోసం విన్నపాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. ఈ పథకం పరిధిలోకి మరో లక్షన్నర మంది రైతులు వచ్చే అవకాశముందని అధి కారికవర్గాలు పేర్కొంటున్నాయి. రుణ మాఫీని ప్రభుత్వం ప్రకటించినప్పుడు తమ పేర్లు నమోదు చేయలేదని, అందువల్ల తమకు అవకాశం కల్పించాలని పలువురు రైతులు విన్నవించుకుంటున్నారు. రైతుల విన్నపాలను స్థానిక ఎమ్మెల్యేలు జిల్లాల్లో వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకొస్తు న్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మందికిపైగా కొత్తగా రుణమాఫీ కోసం అభ్య ర్థిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకోసం రూ. 500 కోట్లు అవసరమవుతాయని అధికారులు భావిస్తు న్నారు. ఇటీవల దాదాపు 25 వేల మందిని అర్హులుగా గుర్తించిన వ్యవసాయశాఖ అందుకోసం రూ.160 కోట్లు అవసరమని ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై ప్రభు త్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయినా రైతుల విన్నపాలు పెరుగుతుండటంతో ఏం చేయాలో అర్థంగాక ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అధికారుల తప్పిదం... ప్రభుత్వం రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి మూడేళ్లుగా ఆ సొమ్మును విడతలవారీగా ఇస్తూ వచ్చింది. రూ.లక్ష లోపు రుణాలున్న రైతులను పథకం ప్రారంభంలో బ్యాంకు, వ్యవసాయ అధికా రులు గుర్తించారు. వారి పేర్లతో జాబితా తయారు చేశారు. అర్హులైన చాలామంది రైతుల పేర్లను చాలా జిల్లాల్లో సాంకేతిక కార ణాలు చూపించి వదిలేశారు. అర్హతలుండి రుణమాఫీకి నోచుకోని రైతులు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ రైతుల, ఎమ్మెల్యేల విన్నపాలను పరిశీలించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని యోచిస్తోంది. రుణమాఫీ పథకానికి అర్హులను వదిలేశారంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ‘కాగ్’కూడా కడిగేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, బ్యాంకు అధికారుల తీరు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాగ్ పేర్కొంది. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2014 నుంచి 2016 వరకు రెండు విడతలుగా ప్రభుత్వం రూ.1,355.37 కోట్లు విడుదల చేసింది. అయితే, మొదటి విడతలో రూ.673.91 కోట్లు ఖర్చు చేసిన అధికారులు రెండో విడతలో అంతే మొత్తంలో ప్రభుత్వం విడుదల చేసినా ఖర్చు చేయలేకపోయారు. దాదాపు రూ. 28.83 కోట్లను బ్యాంకులే దాచిపెట్టుకున్నాయని కాగ్ దుయ్యబట్టింది. ఇలా అనేకచోట్ల రైతు రుణమాఫీ సొమ్ము చెల్లింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థకు మలుపు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై ఒకటి నుంచి జీఎస్టీ అమలు నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని సోమవారం సమీక్ష నిర్వహించారు. దేశ చరిత్రలో ఇది ఓ అపూర్వ ఘట్టమని.. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానంతో సామాన్యుడికి ప్రయోజనం కలగనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జీఎస్టీకి సంబంధించిన సైబర్ భద్రతపై ముఖ్యంగా దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. సమాచార భద్రతా వ్యవస్థలపై కూడా ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. జీఎస్టీపై ప్రశ్నలకు వెనువెంటనే సమాధానాలిచ్చేందుకు ప్రారంభించిన @ askGst_GOI ట్వీటర్ హ్యాండిల్, టోల్ ఫ్రీ నంబర్ 1800–1200–232లపై ప్రధాని సమీక్ష చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, కేబినెట్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కొన్ని ధరలపై జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 11న మరో దఫా సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీఎన్పై కాగ్ ఆడిట్: జైట్లీ వస్తుసేవల పన్ను నెట్వర్క్ (జీఎస్టీఎన్)పై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఓ టీవీ చానల్‌కు ఇంటర్వూ్య ఇస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జీఎస్టీఎన్లో కేవలం 49 శాతం ప్రభుత్వం చేతిలో, 51 శాతం ప్రైవేటు వారి చేతిలో ఉండటంపై బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామితో పాటు పలువురి నుంచి వచ్చిన విమర్శలపై జైట్లీ స్పందించారు. ఇందులో తప్పేం లేదని అన్నారు. ‘జీఎస్టీఎన్ నిర్మాణం తీరుతెన్నులను యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించారు. దీన్ని నేను స్వయంగా పరిశీలించాను. ఆయనతో విభేదించడానికి ఏ కారణమూ కనబడలేదు’ అని అన్నారు. అందరి దృష్టి మన పైనే.. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోం దని ప్రధాని మోదీ అన్నారు. భారత సంగీతం, సంస్కృతి ప్రోత్సాహక సొసైటీ 5వ అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పు పెద్ద సవాల్‌గా మారిందని.. ఈ విషయంపై యువత మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. మూడేళ్లలో పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని దీంతో ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు చూస్తోందని ఆయన అన్నారు. సామాజిక అడ్డుగోడలు తొలగించటం ద్వారా దేశాన్ని ఏకం చేయటంలో భారత సంగీతం క్రియాశీలకమని మోదీ తెలిపారు. -
ఆ 20వేల కోట్లు ఏం చేశారు?
కార్మిక సంక్షేమ నిధుల వినియోగంపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ: ‘కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన రూ. 20 వేల కోట్లు ఏం చేశారు? సెలవుపై వెళ్లిన అధికారుల టీ పార్టీలకు, విందు వినోదాలకు ఖర్చు చేశారా? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు కూడా ఈ డబ్బులేమయ్యాయో తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వసూలు చేసిన పన్నును సరిగా ఉపయోగించలేదని ‘నేషనల్ క్యాంపెయిన్ ఫర్ సెంట్రల్ లెజిస్లేషన్ ఆన్ కన్స్ట్రక్షన్ లేబర్’ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ భారీ మొత్తం ఏమైపోయిందో కనుగొనాలని కాగ్‌ను ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు వచ్చిన మొత్తం ఎంతో కాగ్ కార్యాలయానికి తెలపాలని సూచించింది. -
సంస్కరణల సంకల్పముంది
► పరివర్తన తేవటంలో అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి ► ధైర్యంగా, నిజాయితీగా పనిచేయండి.. సమస్యలొస్తే నేనున్నా ► సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దేశంలో సంస్కరణలను కొనసాగించేందుకు బలమైన రాజకీయ సంకల్పం తనకుందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో అధికారులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. అధికారులు విశాల దృక్పథంతో.. దేశాన్ని పరివర్తనం చేయటంలో ఒక జట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఎవరికీ భయపడొద్దని నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ‘రాజకీయ సంకల్పం సంస్కరణలు (రిఫామ్) తీసుకొస్తుంది. కానీ, బ్యూరోక్రసీ దాన్ని అమలు (పెర్ఫామ్)చేస్తుంది. ప్రజల భాగస్వామ్యం పరివర్తనం (ట్రాన్స్ఫామ్) తీసుకొస్తుంది. నిజాయితీగా నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులొస్తే నా మద్దతుంటుంది’ అని అన్నారు. నిర్ణయాలు తీసుకున్నాక.. విధానపరమైన సమస్యలొస్తే కాగ్, సీబీఐ, సీవీసీ (త్రీ సీస్)తో ఇబ్బందులపై పలువురు అధికారులు మాట్లాడిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లెక్కల ద్వారా ఏమైనా మార్పొస్తుందా? ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కాగ్‌కు ఫలితమే కావాలి. కాగ్ లెక్కల ప్రకారమే ముందుకెళ్లాలంటే దేశంలో మార్పు తీసుకురాలేం? మనం కూడా ఎలాంటి మార్పునూ గమనించలేం’ అని తెలిపారు. సీనియర్ అధికారులు తమకంతా తెలుసనే సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చి జూనియర్ల ఆలోచనలకు సరైన మార్గదర్శనం చేయాలన్నారు. అధికారుల గురించి ప్రజలు ఆలోచించే తీరు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘అధికారులు చెడ్డోళ్లు కానప్పుడు వారు దురాలోచనలతో పనిచేయరు. అలాంటప్పుడు సామాన్యుడు ఒక అభిప్రాయాన్ని పెంచుకునే బదులు ఫిర్యాదు చేస్తాడు? కారణమేంటో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది జరిగినపుడు ప్రజల అభిప్రాయాన్ని మార్చటం కష్టమేం కాదనుకుంటున్నా’ అని అన్నారు. కశ్మీర్ వరదలప్పుడు ఆర్మీ చేసిన సాయానికి ప్రజలు చప్పట్లు కొట్టారని.. అదే ప్రజలు తర్వాత ఆర్మీపై రాళ్లు రువ్వారన్నారు. కానీ ఒక్క క్షణం ఆర్మీ చేసిన పని ప్రజలను హత్తుకుందన్నారు. అధికారులు జట్టుగా ముందుకెళ్తేనే మంచి ఫలితాలొస్తాయన్నారు. అందుకే ఫోన్లు వద్దంటా! అధికారులతో తనెప్పుడు సమావేశమైనా మొబైల్ ఫోన్లు లేకుండానే వారిని రమ్మంటానని ప్రధాని తెలిపారు. సమావేశం జరుగుతుండగానే అధికారులు మొబైల్లో సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటుంటారన్నారు. ‘ఈ మధ్య జిల్లాస్థాయి అధికారులు కూడా సోషల్ మీడియాలో చాలా బిజీ అయిపోతున్నారు. అందుకే నా సమావేశాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాను. సోషల్ మీడియా ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. సొంత డబ్బా కొట్టుకునేందుకు కాదు’ అని ప్రధాని చురకలంటించారు. ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్‌కు మారిపోతోందని అలాంటప్పుడు మొబైల్‌ను ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలన్నారు. ‘నేను కోచింగ్‌కు వెళ్లలేదు. అందుకే అధికారిని కాలేకపోయాను. అధికారినే అయివుంటే ఈ 16 ఏళ్లలో డైరెక్టర్ స్థాయిలో ఉండేవాడినేమో. నా అదృష్టం కొద్ది ప్రజా సేవలో ఉన్నాను’ అని మోదీ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పథకాల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులకు ప్రధాని అవార్డులు అందజేశారు. ఆదివారం ‘నీతి’ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ విజన్ 2030 రోడ్ మ్యాప్‌తో 15 ఏళ్లపాటు అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో మూడేళ్లు, ఏడేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి వ్యూహాలు రూపొందిస్తారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం దినమంతా ఈ సమావేశం జరగనుంది.