సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వైద్యం పేద రోగులకు అందుబాటులోకి తెచ్చే ఛారిటీ ఆస్పత్రులు దారితప్పుతున్నాయి. సేవ పేరుతో వేల కోట్ల ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్న కొన్నిఛారిటీ సంస్థలు అసలు దాతృత్వానే చాటుకోవడం లేదని, వాటి ధ్యాసంతా దండుకోవడంపైనే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆస్పత్రులు, ట్రస్టుల నిర్వాకంతో కోట్లాదిరూపాయల ప్రజాదనం వృథా కావడం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని కాగ్ ఆక్షేపించింది. ఆస్పత్రులు, ట్రస్టులకు పన్నుమినహాయింపు ఇచ్చే క్రమంలో అనుసరిస్తున్న ప్రమాణాలపైనా కాగ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
ఛారిటీ ఆస్పత్రులు, ట్రస్ట్‌ల కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నపలు సంస్థలు రోగుల నుంచి పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ మరోవైపు సర్కార్ నుంచి పన్ను రాయితీలు పొందుతున్నాయి. పలు ఛారిటబుల్ సంస్థలు వసూలు చేసిన మొత్తాలు ఐటీ అధికారుల పరిశీలనకు రాలేదని కాగ్ నిగ్గుతేల్చింది. ఆదాయ పన్ను మినహాయింపునకు అనుసరించాల్సిన ప్రమాణాలు లేని సంస్థలనూ అనుమతిస్తున్నారని ఎత్తిచూపింది. దాదాపు 10 ఛారిటబుల్ ఆస్పత్రులకు ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని కాగ్ ఆడిట్‌లో వెల్లడైంది.
ఛారిటీ ఆస్పత్రుల నిర్వాకమిదే...
Published Mon, Aug 21 2017 12:07 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement
Advertisement