Charitable activities
-
Manideep charitable trust : సామాజిక సేవలో మణిదీపం
చదువుతోనే సమాజ వికాసం జరుగుతుందన్న విశ్వాసం ఆయనది.. అందుకే ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే అతడి ఆకాంక్ష.. విద్యకు డబ్బు సమస్య కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పుల పేరిట తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ వారు చదువు కొనసాగించేలా దోహదపడుతున్నారు. ఆయనే మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మణిదీప్. బేగంపేట కుందన్‌బాగ్‌కు చెందిన మణిదీప్ విభిన్న సేవా కార్యక్రమాలను చేపడుతూ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. – సనత్నగర్మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్‌ను 2018లో ప్రారంభించిన మణిదీప్ సేవలను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతగా నిలవాలని తలంపుతో మహా యజ్ఞాన్ని ఆరంభించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 180 మందికి వారి ఆర్థిక స్థోమతను బట్టి సహకారం అందించి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క ఏడాదే 50 మందికి స్కాలర్‌షిప్పులను అందజేశారు. అలాగే చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గురుకుల్ ట్రస్ట్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వైశ్య వికాస వేదిక వారు 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో టాప్‌గా నిలిచిన వారికి ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. చదవండి : బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!పేద విద్యార్థులకు ఇప్పటి వరకు ఆయన 30 ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 10 మంది విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందించేందుకు ముందుకువచ్చారు. నిరుపేదలకు మెడిసిన్‌తో పాటు న్యూట్రిషన్, విటమిన్ ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యపరంగానూ సేవలుఅందిస్తున్నారు. కరోనా సమయంలో సంస్థ తరఫున ఎన్నో సేవలు అందించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వినర్‌గా కూడా మణిదీప్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు సంస్థలతో కలిసి రక్తదాన శిబిరాల నిర్వహణ చేపట్టడంతో పాటు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలబడుతున్నారు. మణిదీప్ సేవలను గుర్తించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవలే ప్రతిభా పురస్కారాన్ని కూడా అందించారు. ఇదీ చదవండి: ‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియోల్యాప్ట్యాప్లు అందిస్తున్నాం సమాజం మనకు ఏమి ఇచ్చింది అనే కంటే.. సమాజానికి మనం ఏం చేశామన్నది ముఖ్యం. చదువే అన్నింటికీ సమాధానం. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువును ఎవరూ ఆపకూడదు. అందుకోసం మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, అవసరమైన వారికి ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తున్నాం. రాజ్‌భవన్ వేదికగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాం. ఇండియన్ రెడ్‌క్రాస్‌సొసైటీ తరఫున సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. – మణిదీప్, మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ -
పిచ్చుకా క్షేమమా
మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి. అడవికి దాహం వేసింది! ‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి. కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు. పిచ్చుకలు వచ్చాయి! పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను. వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం. తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి. ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి. చుక్క నీరుంటే చాలు! గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది. వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక. – వాకా మంజులారెడ్డి -
Lanka Sita: బడుగు జీవుల దారిదీపం ఈ పెద్దక్క
లంక సీత వయసు 81. ఢిల్లీతో 61 ఏళ్ల అనుబంధం. ఢిల్లీలో ఉండనని ఏడ్చిన రోజులు... ఇంత నగరంలో ఎలా జీవించాలి... అనే ఆందోళన. జీవించడం ఎలాగో నేర్పిన గురువుది కూడా ఆ నగరమే. తెలుగుదనంతో ఢిల్లీలో అడుగుపెట్టిన నాటి తరం అమ్మాయి. తనలాగ ఎందరో... వాళ్లకు బతికే దారేది... అనుకుంది. అలాంటి అభాగ్యులకు అక్క అయింది... వారి జీవికకు దారి చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో పుట్టిన లంక సీత దేశ రాజధానితో ముడివడిన తన జీవిత గమనాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో తణుకులోనే, కానీ సొంతూరు నర్సాపురం. నాన్న ఉద్యోగరీత్యా నా చదువు కొంతకాలం నర్సాపురం, మరికొంత కాలం తణుకులో అమ్మమ్మగారింట్లో సాగింది. నాకు చదువంటే ఎంత ఇష్టమంటే ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి టేబుల్ అందకపోతే నిలబడి పరీక్ష రాశాను తప్ప పరీక్ష మానలేదు. ఎస్ఎస్ఎల్సీ తర్వాత అనుకోకుండా పెళ్లి సంబంధం రావడం, మంచి సంబంధం, అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని పెళ్లి చేసి మా వారితోపాటు నన్ను ఢిల్లీకి పంపించారు మా వాళ్లు. పంజాబీల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. ఇంగ్లిష్ అయితే నెగ్గుకొచ్చేదాన్ని, కానీ హిందీ అక్షరం కూడా మాట్లాడలేని పరిస్థితి. నాకు ఢిల్లీ అలవాటయ్యే లోపే భూకంపం వచ్చింది. మా ఓనర్ నన్ను గట్టిగా పిలుస్తూ పంజాబీలో, హిందీలో ఏదో చెప్తోంది. అర్థం చేసుకునేలోపు ఆవిడే వచ్చి బయటకు లాక్కువెళ్లింది. ఆ తర్వాత తెలిసింది నాకు అది భూకంపం అని. ఢిల్లీలో ఉండనని ఏడవడం అప్పుడు మొదలైంది. ఆ తర్వాత ఒక రోజు కడుపు నొప్పి కారణంగా మా వారిని హాస్పిటల్లో చేర్చారు. అది గుండెనొప్పి అని ఆయన దూరమైన తర్వాత తెలిసింది నాకు. కంపాషన్ గ్రౌండ్స్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇల్లు దాటి ఢిల్లీ వీథులు, సిటీ బస్సులతో నా జీవన యానం మొదలైంది. ఆఫీసులో ఉన్నా సరే నా కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలిమేఘాల్లా ఉండేవి. ఉద్యోగంలో పని నేర్చుకోవడం, ప్రైవేట్‌గా చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది. నా కళ్లు కన్నీళ్లను మరచిపోయాయి. ► మళ్లీ చదువు! ఇంటర్, బీఏ, ఎంఏ, ఆ తర్వత జర్నలిజం చేశాను. చైనా సామాజిక జీవనం పట్ల అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో చైనీస్ భాష నేర్చుకోవడానికి లింగ్విస్టిక్స్‌లో చేరాను. కానీ ఉద్యోగంలో ప్రమోషన్ తర్వాత పని భారం కారణంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేకపోయాను. ఆర్థిక, సామాజిక పరిశోధన రంగంలో పని చేశాను. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో అమ్మ కోసం నాలుగేళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఉద్యోగంలో నా పని సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం కావడంతో 2002లో సైరస్ (సీత ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీసెస్) స్థాపించి విశ్రాంత జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేశాను. ► మహిళ పరిస్థితి మారలేదు! ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా దేశ రాజధాని నగరంలో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. నాలాగ తన కాళ్ల మీద తాము నిలబడాల్సిన స్థితిలో ఉన్న మహిళల కోసం ఏదైనా చేయాలనిపించింది. మహిళలు, యువకులు, వృద్ధులకు కూడా ఉపయోగపడేవిధంగా సైరస్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. మహిళలకు ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయడం, ఉపాధి మార్గాలను తెలియచేసి సహకారం అందించడం, తాగుబోతు భర్తల కారణంగా బాధలు పడుతున్న వాళ్లకు ఆసరాగా నిలవడం, మగవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడుకు బానిసలు కాకుండా కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించే వరకు పర్యవేక్షిస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టాం. పిల్లలకు పోషకాహారం అందించడం, స్కూలుకి పంపేలా చూడడం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణతోపాటు వారిని సమాజంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయడం, యువతను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాలతో పని చేస్తోంది సైరస్. ► వర్తమానమే ప్రధానం! మా సైరస్ సంస్థలో పన్నెండు మందిమి ఉన్నాం. మేమందించే మా సేవలలో మాకు సహకరించే డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వాలంటీర్లున్నారు. మేము ఎవరి దగ్గరా ఆర్థిక సహకారం తీసుకోలేదు. మా కార్యక్రమాలకు వస్తురూపేణా సహకరించేవాళ్లున్నారు. నా పెన్షన్‌లో సగం ఈ సర్వీస్‌కే ఖర్చవుతుంది. నాకు పిల్లలు లేరు. పిల్లలతో కలిసి గడపడానికి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నా పిల్లలకే చేసినట్లు సంతోషపడుతుంటాను. సమాజానికి సేవ చేయడంతోపాటు తెలుగు కథలు, వ్యాసాలు రాయడం, అనేక ప్రదేశాల్లో పర్యటించడం, పరిశోధన వ్యాసాలు రాయడం నా హాబీలు. నేను నమ్మే తాత్వికత ఒక్కటే... ‘గతాన్ని మార్చలేం. అందుకే గతంలో జరిగిన చేదు సంఘటనల గుర్తు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. మనం వండుకున్న అన్నాన్ని తినే వరకు ఉంటామో లేదో మనకే తెలియదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండడం వృథా. ఇక వర్తమానమే ప్రధానం. వర్తమానంలో జీవించాలి’ ఇదే నన్ను నడిపిస్తున్న చోదక శక్తి’’ అన్నారు లంక సీత. లెప్రసీ ఆశ్రమం దత్తత వైజాగ్‌లో వొకేషనల్ సెంటర్ ప్రారంభించి చదువు మానేసిన వాళ్లకు కుట్లు, అల్లికలతోపాటు టైలరింగ్, వెదురుతో కళాకృతుల తయారీ, టీవీ మెకానిజం, ఏసీ రిపేర్లలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించాం. కరోనా వరకు నిరంతరాయంగా సాగాయి. ఇప్పుడు వాటిని తిరిగి గాడిలో పెట్టాలి. హైదరాబాద్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మెడికల్ క్యాంపులు పెట్టి అవసరమైన వారిని అనంతర చికిత్స కోసం ఉచితంగా వైద్యమందించే హాస్పిటల్స్‌తో అనుసంధానం చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే వంటి సందర్భాల్లో పిల్లలకు పోటీలు నిర్వహిస్తాం. ఢిల్లీలో అల్పాదాయ వర్గాలు నివసించే నాలుగు కాలనీలు, ఒక లెప్రసీ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నాం. దుస్తులు, పాత్రలు, బ్యాండేజ్ క్లాత్, మందులు పంపిణీ చేస్తాం. దత్తత తీసుకున్న కాలనీల పిల్లలకు స్కూలుకు వెళ్లడానికి అవసరమైన సమస్తం సమకూరుస్తున్నాం. – లంక సీత, ప్రెసిడెంట్, సైరస్ స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. -
ఆ హీరోలను చూస్తుంటే అబ్బో అనిపిస్తోంది
Happy Birthday Shivaji Raja: ‘‘కరోనా సమయంలో నా శక్తికి మించి చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. అందులో కలిగిన సంతృప్తి నాకు ఎక్కడా దక్కలేదు. ‘శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి, పేద కళాకారులకు సేవ చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు శివాజీ రాజా అన్నారు. నేడు (శనివారం) ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు శివాజీ రాజు.. కానీ ఒకరోజు ఏచూరిగారు ‘శివాజీ రాజా’ పేరు బాగుంటుందని చెప్పడంతో అప్పటి నుంచి మీడియాలో నా పేరు మారిపోయింది. 1985 ఫిబ్రవరి 24న చెన్నైలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎం.వి. రఘు దర్శకత్వం వహించిన ‘కళ్ళు’ నా తొలి సినిమా. ఆ మూవీ ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన 37 ఏళ్లలో దాదాపు 500 సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను. ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంత మంచి పేరొస్తుంది. పునీత్ రాజ్‌కుమార్‌గారు చనిపోయినప్పుడు నాలుగు రాష్ట్రాలు కదిలొచ్చాయి.. అంతకంటే మంచితనం ఇంకేముంది? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో ఇరవై ఏళ్లుగా రకరకాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాను (అధ్యక్షుడిగా కూడా). నేను హీరోగా చేసిన ఏ సినిమా నాకు సక్సెస్ ఇవ్వలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన చిత్రాలకు, సీరియల్స్‌కు నంది అవార్డులు వచ్చాయి. నా ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద కళాకారులను ప్రోత్సహిస్తా. నేను మొదటి నుంచి చిరంజీవిగారి అభిమానినే. ఈ తరం హీరోల్లో అల్లు అర్జున్, మహేశ్‌బాబు, ప్రభాస్‌లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. నాకు వ్యవసాయం చేయడం ఇష్టం. మణికొండలో ఉన్న స్థలంలో, మొయినాబాద్‌లోని పొలంలో వ్యవసాయం చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లో మా అబ్బాయి (విజయ్ రాజా)తో ‘కళ్ళు’ సినిమా రీమేక్ చేయాలని ఉంది. ప్రస్తుతం తను ఓ హిందీ, మూడు నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు బాగుంది. కొన్ని సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
Corona Warriors: డాక్టర్ల కన్నా ముందే..‘ఊపిరి’ పోస్తున్నారు
హిమాయత్‌నగర్: గాంధీ, కింగ్‌కోఠి (కేకేహెచ్), చెస్ట్ ఆసుపత్రులు నిత్యం కోవిడ్ పాజిటివ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బం ది కొరత కారణంగా అడ్మిషన్ సుమారు గంటవరకు ఆలస్యం అవుతుంది. ఎంతోమందికి అడ్మిషన్ దొరి కి బెడ్‌పైకి చేరేవరకూ ఆక్సిజన్ అందడం లేదు. ఈ ఆలస్యంతో ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ సమయంలో అత్యవసరంగా ఆక్సిజన్ అందించే విధానం లేదు. దీంతో ఇటు రోగులు, అటు రోగుల సహాయకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అడ్మిషన్ ఆలస్యంతో ఆక్సిజన్ అందక ఏ ఒక్కరి ప్రాణం పోకుండా ఉండేందుకు నడుం బిగించారు సోషల్ డేటా ఇన్‌షేటివ్స్ ఫోరం (ఎస్‌డీఐఎఫ్), యాక్సెస్ ఫౌండేషన్, సఫియా బైత్వాల్ మాల్ (ఎస్బీఎం) ఎన్జీఓలు. 15 రోజులుగా మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన రోగులకు ప్రాణవాయువును అందిస్తూ వందలాది ప్రాణాలను కాపాడుతున్నారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో.. గాంధీ, కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ఏర్పాటు.. 15 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో 47 కేజీల సామర్థ్యం కలిగిన 15 సిలిండర్లను ఈ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నిత్యం గాంధీకి వచ్చే వందలాది కరోనా రోగులకు ఈ ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా కింగ్‌కోఠి ఆసుపత్రి, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రుల్లో గత ఆదివారం 47 కేజీల సామర్థ్యం కలిగిన మూడు సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటున్నాయి. మూడు ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ సిలిండర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. గాంధీలో ప్రతిరోజూ వందకు పైగా రోగులు లబ్ధి పొందుతుండగా, కేకేహెచ్, చెస్ట్ ఆసుపత్రుల్లో ఒక్కో ఆసుపత్రిలో 30–40 మంది ఈ ఆక్సిజన్‌తో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కరోనా బాధితుల్లో ఆక్సిజన్ అవసరమైన రోగులు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని, అడ్మిషన్ సమయంలో ఆక్సిజన్ అందక ఎవరూ ఇబ్బంది పడకూడదన్నదే మా లక్ష్యం అంటున్నారు ఎస్‌డీఐఎఫ్ ఫౌండర్ ఆజంఖాన్, యాక్సెస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హఫ్స, ఎస్బీఎం వైస్ ప్రెసిడెంట్ అజర్. ప్రతి 24 గంటలకు 47 కేజీల ఆక్సిజన్ సిలిండర్స్ 15 చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు ఆజంఖాన్ తెలిపారు. కింగ్‌కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ప్రతి 24 గంటలకు 47 కేజీల ఆక్సిజన్ సిలిండర్స్ మూడు లేదా నాలుగు ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ హఫ్స తెలిపారు. మూడు ఆసుపత్రులకుగాను ప్రతి 24 గంటలకు వెయ్యి కేజీల ఆక్సిజన్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు అజర్ పేర్కొన్నారు. చదవండి: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్ ఊరట: దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కేసులు.. -
వైఎస్సార్‌పై అభిమానంతోనే ట్రస్టు ఏర్పాటు
తణుకు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానంతోనే వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశానని తణుకు పట్టణానికి చెందిన అంబడిపూడి వీరభద్రావతి తెలిపారు. 2012లో విజయమ్మ పేరుతో ట్రస్టు ప్రారంభించినప్పటి నుంచి తాను ట్రస్టీగా వ్యవహరిస్తున్నానని ఆమె చెప్పారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది 2018 జనవరిలో ట్రస్టు కార్యకలాపాలను నిలిపేశానన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో కుట్టుమిషన్ నేర్పించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, దుస్తులు తదితరాలు పంపిణీ చేశామని చెప్పారు. సొంత ఖర్చులతోనే సేవా కార్యక్రమాలు చేశామని వివరించారు. వైఎస్సార్ కుటుంబం నుంచి గానీ, ఇతరత్రా వేరే విధంగా గానీ ఎలాంటి నిధులూ రాలేదని వీరభద్రావతి స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2018 జనవరిలోనే ట్రస్టు మూసివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు. -
రౌండప్ 2018,2019
దేశంలో... ఆ గెలుపు వెలుగులు కొన్ని... బహిష్టు మీదున్న అపోహలు, అంధ విశ్వాసాలు ఆడవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మనదేశంలో. ప్రృకతిధర్మాల్లో అదీ ఒకటని.. ఆరోగ్యకరమైన ప్రక్రియని ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ఇందులో భాగంగానే శానిటరీ పాడ్స్ వాడకం మీద విస్తృత ప్రచారమూ జరుగుతోంది. అలాంటి సమయంలోనే జీఎస్టీ శరాఘాతమైంది. శానిటరీ నాప్కిన్స్మీద ప్రభుత్వం 12 శాతం పన్ను విధించింది. దీనిమీద దేశంలోని పలు మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావి వర్గం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. 2018, జనవరి ఒకటవ తేదీన గ్వాలియర్‌లోని ఓ పాఠశాల విద్యార్థినులు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. శానిటరీ నాప్కిన్స్ మీద మెస్సేజ్, నోట్ రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదికి పంపించారు. వీటన్నిటి ఫలితం.. ప్రభుత్వం వెనక్కి తగ్గి శానిటరీ నాప్కిన్స్ మీద జీఎస్టీ ఎత్తేయడం. జూలైలో జరిగిన 28వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మీ టూ ఉద్యమం పలు రంగాల్లోని పెద్దలు.. పది నిమిషాలకు ఒకసారి న్యూస్ వెబ్‌సైట్స్ చూసుకునే పరిస్థితి. ఇది మీ టూ మూవ్మెంట్ ఎఫెక్ట్ అండ్ పవర్. హాలీవుడ్ వయా బాలీవుడ్‌కి.. తద్వారా ఇతర రంగాల్లో స్త్రీల వేధింపులకూ బ్యానర్ కట్టింది. మహిళల పట్ల తన ప్రవర్తన విషయంలో ప్రతి పురుషుడినీ అలర్ట్ చేసింది. దీనికి చొరవ చూపి, ధైర్యం చేసిన స్త్రీ.. తనుశ్రీ దత్తా. బాలీవుడ్ నటి. ఇంట్లోంచి మొదలు పని ప్రదేశాల్లో, బహిరంగ స్థలాల్లో, కమ్యూనిటీస్‌లో.. ఇలా ఎక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా.. వాటి గురించి పెదవి విప్పేలా ప్రేరణనిచ్చింది. అలా దేశంలోని మీడియా, కళలు, క్రీడలు, అడ్వర్టయిజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఐటీ, కార్పోరేట్ సెక్టార్‌లోని మహిళలు పడుతున్న ఇబ్బందులు, వేధింపులను సమాజం దృష్టికి తెచ్చింది. ఇక ఇలాంటివన్నీ భరించేది లేదనే సందేశాన్నీ ఇచ్చింది. అయినా పురుషుల్లో మార్పు రాకపోతే ‘టైమ్స్ ఆప్’’ అనే హెచ్చరికతో మరో ఉద్యమానికీ సన్నద్ధమైంది. శబరిమల ప్రవేశం.. 2018లో మహిళలు తెచ్చిన ఇంకో విప్లవం.. శబరిమల ఆలయంలోకి వాళ్ల ప్రవేశం. ఇన్నాళ్లూ పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు, మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఈ నియమాన్ని సవాలు చేస్తూ దేవుడు దర్శనానికి అందరూ అర్హులే.. ఏ వయసు ఆడవాళ్లయినా శబరిమలకు వెళ్లొచ్చు అంటూ నిరుడు సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించింది. దీని పట్ల సంప్రదాయవాదుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దర్శనానికి వచ్చిన మహిళలను అడ్డుకోవడం వంటి చర్యలూ చేపట్టారు. అయినా మహిళలు వెనకడుగు వేయలేదు. నో అంటే నో అనే.. శబరిమల ఒక్కటే కాదు.. ఇలాంటి విప్లవాత్మక తీర్పులెన్నిటినో బల్ల గుద్ది చెప్పింది గడచిన సంవత్సరం. అందులో అత్యంత ప్రధానమైనది సుప్రీంకోర్ట్ ఆల్ విమెన్ బెంచ్ ఇచ్చిన ‘‘నో మీన్స్ నో’’ తీర్పు. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగింక చర్యకు పాల్పడడం నేరం. కుల, వర్గ, ఆర్థిక భేదాలకు అతీతంగా .. ఆ మహిళ సెక్స్ వర్కర్ అయినా సరే.. ఆమె నో అంటే నో అనే. వద్దు అన్న ఆమె మాటను గౌరవించాల్సిందే అనేది ఆ తీర్పు సారాంశం. 1997లో న్యూఢిల్లీలోని కత్వారియా సారై అనే ప్రాంతంలో నలుగురు పురుషులు చేతిలో గ్యాంగ్ రేప్‌కి గురైనా మహిళకు సంబంధించిన కేసులో ఈ తీర్పును ఇచ్చింది జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన సుప్రీంకోర్ట్లోని ఆల్ విమెన్ బెంచ్. పై కేసులో బాధితురాలిని శీలంలేని మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితుల తరపు లాయర్. ఆ సందర్భంలో ఈ తీర్పు వచ్చింది. నేరాలు కావు... అడల్ట్రీ నేరం కాదు అని తీర్పునిచ్చింది సుప్రీంకోర్ట్. అంటే పెళ్లయిన స్త్రీతో ఆమె భర్త అనుమతిలేకుండా లైంగిక సంబంధం కలిగి ఉండడం నేరం కాదు అని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. అయితే విడాకులకు ఈ వివాహేతర సంబంధాన్ని ఒక కారణంగా చూపించవచ్చు. ఇంకో విషయం.. ఒకవేళ ఆత్మహత్యకు ఈ వివాహేతర సంబంధం కారణమైతే అప్పుడు దీన్ని నేరంగా చూడొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్ట్. 377.. స్వలింగ సంపర్కం నేరం కాదు అనే తీర్పునూ వెల్లడించింది సుప్రీంకోర్టులోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. ఈ తీర్పులన్నిటి వెనకా మహిళా న్యాయవాదులు, మహిళా న్యాయమూర్తుల కృషి ఉండడం గుర్తించాల్సిన, గుర్తుంచుకోవల్సిన విషయం. -
తిరిగిచ్చేయాలి
‘‘మనం ధనిక కుటుంబం నుంచి వచ్చామా లేదా సెలబ్రిటీలమా అన్నది కాదు ముఖ్యం. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. కెరీర్ బిగినింగ్ నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారామె. ప్రస్తుతం ఓ ఛారిటీలో భాగం అవుతున్నారీ బ్యూటీ. ఆ విషయం గురించి శ్రద్ధా మాట్లాడుతూ – ‘‘ఈసారి బోలెడన్ని బట్టలు డొనేట్ చేయనున్నాను. యాక్టర్‌గా మాకు చాలా కంపెనీల నుంచి బట్టలు వస్తుంటాయి. అందులో మిగిలినవన్నీ నా వంతు సాయంగా డొనేట్ చేయనున్నాను. మనందరికీ తిండీ, బట్టా, గూడు వంటి కనీస వసతులున్నాయి అని ఆనందించాలి. అలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో ఎంతో కొంత ప్రేమను పంచాలి’’ అని పేర్కొన్నారామె. శ్రద్ధా ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సాహో’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. -
గానస్పర్శ
-
చారిటీలో సెక్స్ స్కాండల్.. నటి గుడ్‌బై!
లండన్: ప్రముఖ చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్ రాయబారిగా తప్పుకుంటున్నట్టు తాజాగా బ్రిటిష్ నటి మిన్నీ డ్రైవర్ వెల్లడించారు. తాజాగా ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సెక్స్ స్కాండల్‌లో ప్రమేయమున్నట్టు తాజాగా వెలుగుచూడటం దుమారం రేపుతోంది. 2010లో హైతీలో భూకంపం వచ్చిన నేపథ్యంలో అక్కడ బాధితులకు సహాయం చేసేందుకు వెళ్లిన ఆక్స్‌ఫామ్ సీనియర్ సిబ్బంది.. విరాళాల సొమ్మును వ్యభిచారిణులపై తగిలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. దీనిపై సంస్థ రాయబారిగా ఉన్న మిన్నీ తీవ్రంగా స్పందించారు. ఈ సెక్స్ స్కాండల్ ఆరోపణలు తనను కకావికలం చేశాయని, తనకు తొమ్మిదేళ్ల వయస్సు నుంచి ఈ స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నానని, సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తులే మహిళలను వాడుకున్నారని తెలియడం కలిచివేస్తోందని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రతినిధి తెలిపారు. హైతీలో భూకంప బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన సీనియర్ ఎయిడ్ వర్కర్స్ వేశ్యలతో గడిపారని, ఈ విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రయత్నించిందని తాజాగా వెలుగుచూసింది. అంతేకాకుండా సౌత్ సూడాన్‌లోనూ లైంగిక దాడుల విషయంలో సంస్థ సరిగ్గా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. -
అమ్మ.. ఓ సేవా శిఖరం
నగరంలోని నల్లపాడు రోడ్డులో మూడంతస్తుల భవనం..అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నడుపుతున్న ఓ ఆశ్రమం. ఇక్కడ ఒక్కో అంతస్తు ఎక్కే కొద్దీ సమాజంలో పాతాళానికి చేరిన మానవత్వపు ఛాయలు అమృతమంటి ఊటలా ఉబికివస్తుంటాయి. ఆరు పదులు దాటిన వయసులో నా అనే వాళ్లు విసిరేసిన బతుకులు అమ్మ ప్రేమలో ఆదరువు పొందుతుంటాయి. విధి రాతకు వాడిన పసిమొగ్గలు విద్యా కుసుమాలై వికసిస్తుంటాయి. అనాథ శవాల ఆత్మఘోషలు అనంతలోకాల నుంచి ట్రస్ట్‌ను ఆశీర్వదిస్తూ ఉంటాయి. ఈ ఆశ్రమంలోనే ఓ మూలన నిరాడంబర రూపం, నిర్మలమైన మనసుతో ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న మౌనమునిగా సమాజ జీవచ్ఛవానికి సేవ అనే ఊపిరిపోస్తూ ఉంటారు. గుంటూరు(పట్నంబజారు): ఎక్కడో విశాఖ నుంచి భార్యాబిడ్డలతో గుంటూరు వచ్చిన 24 ఏళ్ల చంద్రశేఖర్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక రోజు అనాథ మృతదేహాం రోడ్డుపై పడి ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు.. మనసు వికలమైపోయింది..వెంటనే ఆ శవాన్ని భుజాన వేసుకుని వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. ఇది జరిగి సరిగ్గా 28 ఏళ్లు. అప్పుడే అనుకున్నాడు ఏ ఒక్క శవం అనాథగా మిగిలిపోకూడదని. అంతే అమ్మ చారిటీబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానప్రసన్నగా మారారు. దాతల సహకారంతో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 35 వేలకుపైగా అనాథ శవాలకు పెద్ద కొడుకయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమనుషులం కదా>్పటు చేసి స్వయంగా అనాథ శవాలను తానే తీసుకొస్తారు. అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కాశీ నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో మృతదేహాన్ని శుభ్రపరుస్తారు. చితాభస్మాన్ని కాశీలో కలుపుతారు. అనాథ శవాలే కాదు..అద్దె ఇళ్లలో వారైనా.. అద్దె నివాసాల్లో శవాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోరు. ఇలాంటి వారి కోసం ఒక భవంతి ఏర్పాటు చేశారు. ఉచితంగా వారికి మృతదేహాన్ని భధ్రపరిచే బాక్సులను ఇస్తారు. 11 రోజులపాటు జరిగే కార్యక్రమాలు అక్కడే నిర్వహించి సంబంధిత ఖర్చులు ఆయనే భరిస్తారు. నిత్యం నగరంలోని ఒక ఆలయంలో పేదలకు అన్నదానం చేయటంతో పాటు, ట్రస్ట్ ఆటోల్లో రైల్వేస్టేషన్, జీజీహెచ్, అరండల్ ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో 500 మందికిపైగానే అనార్తుల ఆకలి తీరుస్తున్నారు. అమ్మలకు...అమ్మై.. ఆరుపదులు దాటిన పండుటాకులు.. ఉన్న వారు ఉండి పట్టించుకోని అభాగ్యులు కొంత మంది..ఏ దిక్కు లేకుండా దీనస్థితిలో ఉన్న వారు మరికొందరు. ఒక్కొక్కరిదీ..ఒక్కో గాధ. వీరందరికీ అమ్మ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమం ద్వారా 15 మంది అనాథలను అక్కున చేర్చుకుంది. చిన్నారులకు పెద్దదిక్కులా... విధి చిన్నచూపు చూసి కొంత మంది అనాథలైతే..పేదరికంలో మగ్గుతున్న మరి కొందరు చిన్నారులు.. వీరందికీ అమ్మ ట్రస్ట్ ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రస్తుతం 30 మంది వరకు చిన్నారుల ట్రస్ట్ భవనంలో ఉంటూ కాన్వెంట్ చదువులకు వెళుతున్నారు. మనుషులం కదా మనుషులం కదా అందరికీ సేవ చేయాలి. ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలి. అనాథ రోడ్డుపై పడి ఉంటే మా ఆశ్రమం మనసు అంగీకరించదు. అందుకే ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాం. అనాథ శవాలను ఆశ్రమంలోని వారు అన్నదమ్ముల్లా సాగనంపుతాం. ఆశ్రమ ఆస్తులన్నీ ట్రస్ట్ పేరుతోనే ఉంటాయి. అనాథలైన..అనాథ మృతదేహాలైనా ఉంటే 9848792228, 8341314440 నంబర్లకు ఫోన్ చేయండి.: స్వామి జ్ఞానప్రసన్న, ఆశ్రమ నిర్వాహకులు -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు వేలం
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ తన పాపులర్ బైక్స్‌ను వేలం వేస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్‌లో ప్రారంభించిన 'ఫైట్ ఎగైనెస్ట్ టెర్రర్' లో భాగంగా తన పాపులర్ మోడల్ స్టీల్త్ బ్లాక్ క్లాసిక్ 500 వాహనాలకు ఆన్లైన్ లో వేలం నిర్వహిస్తోంది. కొన్ని వారాల క్రితం, టెర్రరిజంపై అవగాహన కల్పిస్తూ పదిహేనుమంది ఎన్ఎస్జీ కమాండోలు 13 రాష్ట్రాల్లో 8వేల కి.మీటర్ల రోడ్ ట్రిప్ నిర్వహించిన ఈ 15 బైకులను వేలం ద్వారా విక్రయించనుంది. ఇలా వచ్చిన నిధును ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళమివ్వనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ముఖ్య కమాండోలు ఉపయోగించిన 15 కంపెనీల వాహనాలను ఆన్లైన్ వేలం నేటి ప్రారంభం కానుందని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. ట్రిబ్యూట్ టు బ్రేవ్‌హార్ట్ పేరుతో ఈ సేల్ నిర్వహిస్తోంది. వేలం తేదీకి ముందే కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ నమోదు చేసుకున్నవారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన స్పెషల్ కోడ్ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కో బైకు ధరను రూ.1.9 లక్షలుగా నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును స్వచ్చంద సంస్థకు ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఎన్ఎస్జీ మద్దతు ఇస్తున్న వికలాంగ బాలల కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ప్రేరణకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తామని చెప్పింది. -
ఛారిటీ ఆస్పత్రుల నిర్వాకమిదే...
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వైద్యం పేద రోగులకు అందుబాటులోకి తెచ్చే ఛారిటీ ఆస్పత్రులు దారితప్పుతున్నాయి. సేవ పేరుతో వేల కోట్ల ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్న కొన్నిఛారిటీ సంస్థలు అసలు దాతృత్వానే చాటుకోవడం లేదని, వాటి ధ్యాసంతా దండుకోవడంపైనే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆస్పత్రులు, ట్రస్టుల నిర్వాకంతో కోట్లాదిరూపాయల ప్రజాదనం వృథా కావడం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని కాగ్ ఆక్షేపించింది. ఆస్పత్రులు, ట్రస్టులకు పన్నుమినహాయింపు ఇచ్చే క్రమంలో అనుసరిస్తున్న ప్రమాణాలపైనా కాగ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఛారిటీ ఆస్పత్రులు, ట్రస్ట్‌ల కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నపలు సంస్థలు రోగుల నుంచి పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ మరోవైపు సర్కార్ నుంచి పన్ను రాయితీలు పొందుతున్నాయి. పలు ఛారిటబుల్ సంస్థలు వసూలు చేసిన మొత్తాలు ఐటీ అధికారుల పరిశీలనకు రాలేదని కాగ్ నిగ్గుతేల్చింది. ఆదాయ పన్ను మినహాయింపునకు అనుసరించాల్సిన ప్రమాణాలు లేని సంస్థలనూ అనుమతిస్తున్నారని ఎత్తిచూపింది. దాదాపు 10 ఛారిటబుల్ ఆస్పత్రులకు ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని కాగ్ ఆడిట్లో వెల్లడైంది. -
‘ఆత్మ’బంధువులు
– అనా«థ మృతదేహాలకు స్వచ్చందంగా అంత్యక్రియలు – నిస్వార్థంగా కొనసాగుతున్న సేవ అనాథలకు సేవ చేయడం ఏన్నో యజ్ఞాలకు సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఎంత బతుకు బతికినా నలుగురితో మంచిగా ఉండాలని పెద్దలంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరు రాకపోయినా ఆ నలుగురైనా మృతదేహాన్ని శ్మశానం వరకు మోసుకుపోతారని చెబుతుంటారు. ఎవరూ లేకుండా భిక్షాటన చేసే వారికి.. ఎవరో తెలియక అర్ధాంతరంగా చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి? అలాంటి వారికి మేమున్నామంటూ ఆత్మబంధువుల్లా ముందుకు వచ్చి కులమత ప్రాంత భేదాలు లేకుండా సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు. - హిందూపురం అర్బన్ హిందూపురంలోని లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్ ఉయద్, ముస్లిం నగర అధ్యక్షుడు ఉమర్ ఫరూక్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, టైలర్ గంగాధర్ తదితరులు బృందంగా ఏర్పడి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాన్ని వారు ఏళ్ల తరబడిగా కొనసాగిస్తూ వస్తున్నారు. అనాథ శవం అని సమాచారం అందితే చాలు ఎవరు ఎక్కడున్నా అరగంటలో ఒకచోటికి చేరుకుంటారు. చనిపోయిన వ్యక్తి ఏ మతానికి చెందిన వాడో తెలుసుకుని సంప్రదాయ రీతిలో దాత చలపతి ఆర్థిక సహకారంతో అంత్యక్రియలు చేస్తారు. అంతకన్నా పుణ్య కార్యమేముంది అనాథ శవాలకు సంప్రదాయంగా అంత్యక్రియలు చేయడం చిన్న విషయం కాదు. ఎన్ని పనులున్నా వదులుకుని సేవా భావంతో ఈ బృందం చేస్తున్న కార్యం చాలా మంచింది. కొత్తబట్టలు కట్టి ఖననం చేసి ఆ మతాచారం ప్రకారం ప్రార్థనలు చేసి వారి ఆత్మశాంతిని కోరుకోవడం కన్నా పుణ్యం మరొకటిలేదని నా అభిప్రాయం. - ఈదూర్‌బాషా, సీఐ, హిందూపురం సహకారం అందించాలి వీరిని అనాథల ఆత్మ బంధువులుగా చెప్పవచ్చు. వారి వ్యక్తిగత కార్యక్రమాలు ఏమున్నా చేస్తున్న సామాజిక సేవాకార్యక్రమం చాలా గొప్పది. సామాన్యంగా ఎవరైనా చనిపోయారని తెలిస్తే ఆ వీధిలో కూడా పోకుండా పక్కకు వెళ్లిపోతుంటారు. అలాంటిది ఎవరు ఏమిటో తెలియకున్నా శవపరీక్షలు చేయించి దగ్గరుండి అంత్యక్రియలు చేయడం ఎంతో ఉత్తమమైన కార్యం. వీరికి అందరూ సహకారం అందించాలి. - రామచంద్రారెడ్డి, బార్ అసిసోసియేషన్ అధ్యక్షుడు, హిందూపురం. రక్తదానం కూడా చేస్తుంటారు ఈ బృంద సభ్యులు అనాథ« శవాలకు అంత్యక్రియలు చేయడంతోపాటు అత్యవసరమైన సమయంలో చాలామందికి రక్తదానం కూడా చేస్తుంటారు. వీరి సేవా గుణాన్ని ప్రశంసించాల్సిందే. ఎక్కడైనా అనాథలు అనారోగ్యంతో ఉన్నా తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తుంటారు. అవసరమైన సదుపాయలు సమకూర్చుతారు. చనిపోతే దగ్గరుండి బంధువులా అంత్యక్రియలు చేస్తుంటారు. - డాక్టర్ కేశవులు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, హిందూపురం -
అహింసా పరమోధర్మః
ఆత్మీయం ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిలోను అహింస సర్వోత్తమమైన ధర్మం. హింసను మించిన పాపం లేదు. కరుణను మించిన పుణ్యం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస అంటే మరో జీవిని చంపడం లేదా గాయపరచడం ఒక్కటే కాదు... ఒకరికి అయిష్టమైన పనులను వారితో బలవంతంగా చేయించడం కూడా హింస కిందికే వస్తుంది. అలాగే ఇతరుల మనసుకు బాధ కలిగించే మాటలను వాడటం కూడా హింసే. ఎవరికీ, ఎప్పుడూ ఏ రకమైన బాధని కలిగించకుండా ఉండగలగటమే అహింస. త్రికరణశుద్ధిగా అహింసను పాటించేవారి దగ్గర ప్రతి ఒక్కరు శత్రుత్వాన్ని వదిలి ప్రశాంతంగా ఉంటారని యోగసూత్రం చెబుతోంది. అంటే అహింసాచరణుల సన్నిధిలో కూడా ప్రశాంతంగా ఉండటమే కాదు – పులి, జింక కూడా కలసిమెలసి ఉంటాయి వారి ఆశ్రమంలో. యోగాంగాలలో ఒకటి అహింస. ఆయుధాలను వదిలేయడమే అహింస అనుకోవచ్చు. కానీ, అహింసే ఒక పదునైన ఆయుధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, గాంధీజీ ఆ విషయాన్ని రుజువు చేశారు. కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఎంతో ధైర్యం అవసరం. కానీ, అహింసను ఆయుధంగా స్వీకరించడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం అవసరమని గాంధీ మహాత్ముడు చెబుతాడు. -
సహృదయులైన ట్రంప్.. జీతం చారిటీకి
వాషింగ్టన్ : కఠినమైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సునామి సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహృదయులయ్యారు. తన వార్షిక వేతనాన్నంతటిన్నీ చారిటీకి డొనేట్ చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన వార్షిక అధ్యక్ష జీతం 400,000 డాలర్ల(రూ.2,64,82,000)ను ఈ ఏడాది చివర్లో చారిటీకి విరాళంగా ఇవ్వబోతున్నట్టు అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. సోమవారం ఈ విషయాన్ని స్పైసర్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో తన వేతనాన్నంతటిన్నీ చారిటీకి ఇవ్వాలనేది అధ్యక్షుడి ఉద్దేశ్యమని స్పైసర్ తెలిపారు. అమెరికన్ ప్రజలకు కూడా ఆయన వాగ్దానం చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటనలలో ఇదే అనూహ్య ప్రకటనని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ ట్రంప్ తాను వేతనం తీసుకోబోనని పలుమార్లు తెలిపారు. కేవలం ఒక్క డాలర్ ను మాత్రమే వేతనంగా తీసుకోబోతున్నట్టు తెలిపారు. అంతకముందు కూడా హెర్బర్ట్ హూవేర్, జాన్ ఎఫ్ కెన్నడీలు కూడా తమ ప్రెసిడెన్షియల్ శాలరీలను చారిటీకి డొనేట్ చేశారు. -
ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో, ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుందామని ప్రతిజ్ఞ చేయించారు. ఇక్కడ జరిగిన వేడుకల్లో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, లక్ష్మీపార్వతీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ప్రతి పేదవాడి కళ్లల్లో సంతోషం చూసే తరుణం మరెంతో దూరంలో లేదని, ఏడాదిలో అందరం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గర్వంగా, ఆత్మసంతృప్తితో అందరం పనిచేసుకుంటూ ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని అభిలషించారు. వైఎస్ఆర్ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం కేక్ కట్ చేశారు. రైల్వేకోడూరులోని పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే కొరముట్ల నివాసులు పార్టీ జెండా ఎగురవేసి కార్యకర్తలతో కలిసి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. బద్వేల్ మండలం బయనపల్లె క్రాస్ వద్ద పార్టీనేత వెంకటసుబ్బయ్య, శింగనమల వెంకటేశ్వర్లు, జయసుబ్బారెడ్డిలు వైఎస్ఆర్ సీపీ జెండా ఆవిష్కరించి పలు కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో నేతలు ఆదిములం, సుదర్శన్ రెడ్డిలు పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తిరుపతి ఎస్వీయూలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరిగాయి. అనంతపురం పట్టణంలో పార్టీ నేత శంకర్ నారాయణ, మైనార్టీ నేత నదీమ్ అహ్మద్, రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, కల్యాణదుర్గంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్.ఎం.మోహన్‌రెడ్డిలు జెండా ఎగురవేసి, వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతమ్‌రెడ్డిలు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పార్టీ ఆఫీసులో బాలినేని నివాస్ రెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కేవీ రమణారెడ్డి, చుండురి రవి, సింగరాజు వెంకట్రావులు, చీరాలలో డా.అమృతపాణిలు పార్టీ వేడుకలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాలెంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. నెల్లూరులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో, గోపాలపురం నియోజకవర్గాల్లో అన్ని మండలాల కన్వినర్ల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. శ్రీకాకుళంలోని పార్టీ ఆఫీసులో ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండలో ఎమ్మెల్యే వి.కళావతి, ఆముదాలవలసలోని పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ వైఎస్ఆర్ సీపీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద తెలంగాణ వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి కొల్లు వెంకటరెడ్డి, జిల్లా నేతలు పురుషోత్తం, అహ్మద్ హుస్సేన్, ఉప్పల్ రెడ్డిలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
⇒ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు.. ⇒ ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. జిల్లా, మండల కేంద్రాల్లో.... పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున భాగస్వాములై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
రేపు జిల్లా అంతటా జగన్ జన్మదిన వేడుకలు
ఆలయాలు, చర్చిలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు వృద్ధులకు రగ్గుల పంపిణీ, సేవా కార్యక్రమాలు వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత బాబు కాకినాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి 43వ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ రోజూ ఆలయాలు, చర్చిలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా సూచన మేరకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన ఆలయాల్లో యువజన విభాగం తరఫున పూజలు చేస్తామన్నారు. అన్నవరం సత్యనారాయణస్వామి, అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రజల తరఫున పోరాడేందుకు జగన్‌కు మరింత శక్తి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని యువజన విభాగం నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సేవ కార్యక్రమాలు ప్రస్తుతం చలికి పేద వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాని అనంత బాబు చెప్పారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రాల్లో వారికి రగ్గులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లోని యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పేదలు, వృద్ధులు, వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. -
వినడం చేతకావాలి...
మానవీయం మనుష్యుడిగా పుట్టిన రాముడు కూడా ఎన్నో చోట్ల తప్పులు చేయబోయాడు. ఒకానొకప్పుడు సీతమ్మ కనబడనప్పుడు రాముడికి చాలా కోపం వచ్చేసింది. ‘ఈ లోకాలన్నింటినీ లయం చేసేస్తాను, దేవతలు కూడా సంచరించలేరు, బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణా!’ అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేసి ఉంటే... విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలవంచుకుని ఉండేవారు. తన భార్య కనబడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా! లక్ష్మణస్వామి వచ్చి, కాళ్ళ మీద పడ్డాడు. ‘‘అన్నయ్యా ! చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో - రాముడు మంచివాడు, ధర్మం తప్పడని నీ నడవడి చేత నీకు కీర్తి అలా ఉంది. మచ్చ వస్తుందన్నయ్యా! వద్దన్నయ్యా! ధర్మం తప్ప వద్దన్నయ్యా! నీవు ఇలా చేస్తే - ‘రాముడు ఒకసారి ధర్మం తప్పి బాణాలు వేయలేదా’ అన్న మాట శాశ్వతంగా నిలిచిపోతుంది. ధర్మాన్ని వదిలిపెట్టవద్దన్నయ్యా !’’ అంటాడు. ‘‘తమ్ముడా! నీవు చెప్పినది కూడా నిజమే’’ అని తన కోపాన్ని నిగ్రహించుకుంటాడు రాముడు. నీకు తెలియకపోవచ్చు. వినడం చేత కావాలి. తెలియకపోవడం తప్పు కాదు. ఒకరు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే... ఇక ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు వాణ్ణి! రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే. మంచి మాట వినకపోవడమే. చివరకు పది తలలు తెగి పడిపోయాడు. దుర్యోధనుడిదీ అదే పరిస్థితి. ఇంకాస్త ముందుకుపోయి ‘జానామి ధర్మం న చ మే ప్రవృత్తి, జానామ్య ధర్మం న చ మే నివృత్తి’ అన్నాడు. ‘ధర్మం నాకు తెలియదా? తెలుసు! కానీ అలా చేయాలనిపించడం లేదు. ధర్మం ఏమిటో నేను చదువుకోలేదా? చదువుకున్నాను! కానీ నా కిష్టం ఉండదు - అలా చేయడం! అయినా నాలోని ఈశ్వరుడే నా చేత చేయిస్తున్నప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతారు?’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇలా మెట్టవేదాంతం చెప్పబట్టే, తొడలు విరిగిపడిపోయాడు కురుక్షేత్రంలో. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. మంచిమాట విన్నప్పుడు దానికి అనుగుణంగా నీ నడవడిక మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. ధర్మాచరణ చేత తృప్తి పొందాలి. ‘‘చూడు నాయనా! ‘నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలన్నారమ్మా’- అని ఇప్పటివరకు ‘ధర్మం...ధర్మం’ అంటూ దానికి కట్టుబడి వెళ్ళిపోతానంటున్నావు. అది అంత సులభం కాదు. రేపు మీ ఆవిడను తీసుకుని అడవుల గుండా వెళుతున్నప్పుడు క్రూరమృగాలు అరిస్తే, నీ భార్య ఉలిక్కిపడి నిన్ను పట్టుకుంటే... ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద పవ్వళించవలసిన నా భార్య ఇంత కష్టపడడమేమిటని అప్పుడు తిరిగి వచ్చి నాన్న గారి మీద తిరగబడకూడదు. ధర్మం తప్పకుండా ఉండాలి. అలా ఉండగలవా? ఏ ధర్మం కోసమని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో, ఆ ధర్మానికి కట్టుబడి వచ్చే కష్టనష్టాలు తట్టుకోగలవా? ‘తట్టుకోగలను’ అని అనుకుంటే ఆ ధర్మమే నిన్ను సదా రక్షించుగాక !’’ అని కౌసల్య అంటుంది. ‘‘యం పలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ, స వై రాఘవా శార్దూల ధర్మస్త్వామభిరక్షతు’’ అని తల్లిగా కైకేయి చెప్పిన శ్లోకం రామాయణంలో బంగారు పాత్రలో పోసిన అమృతం లాంటిది. రాముడు ఎంతగా తట్టుకుని నిలబడ్డాడంటే... చివరకు ఒక రాక్షసుడు కూడా ఆయన గురించి చెబుతూ, ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అనక తప్పలేదు. ‘అయ్యా! నాకీ సుఖం అనుభవించాలనుంది. నేనిది అనుభవించవచ్చా?’ అని కొందరికి సందేహం. అంతరాత్మ చెప్పింది ప్రమాణం చేసుకో! ‘ధర్మమే, అనుభవించేయ్’ అన్నప్పుడు అనుభవించు. ‘వద్దు! అది ధర్మచట్రంలో ఇమడదు’ అన్నప్పుడు దాని జోలికి వెళ్లకు. ‘పంచదార పరమాన్నం తెల్లగా, బెల్లం పరమాన్నం నల్లగా ఉంది. నాకు తెల్లగా ఉన్నది తినాలనిపిస్తోంది. తిననా?’ సన్న్యాసివి కాదు కదా! గృహస్థువు. తప్పేమీ లేదు. దేవుడికి నైవేద్యం పెట్టి, కొద్దిగా ఇతరులకు పెట్టి, మిగిలినది నీవు తినేసెయ్. ఏ తప్పూలేదు. ‘అయ్యా ! నా పక్కనున్నావిడ నల్లగా, ఎదురుగా ఉన్న ఆవిడ తెల్లగా కనిపిస్తోంది.’ అది ధర్మ చట్రంలో ఇమడదు. అధర్మం. అలాంటి ఆలోచనలు రానీయకు అన్నప్పుడు వదిలేసెయ్. అదొక్కటే తీర్పు. ఎందుకంటారా! ఇది మర్త్య లోకం. ఇందులో నువ్వు శాశ్వతంగా ఉండవు. ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలడుగుతాడు. ఈ జన్మలో ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకో. మిగిలిన జీవరాశులేవీ ఇలా విముక్తి పొందలేవు. అలా పొందగలిగినదీ, శాస్త్రాన్ని పట్టుకోగలిగినదీ, గురువును సేవించగలిగినదీ- భగవన్నామం పలుకగలిగినదీ, మంచిమాట చెప్పగలిగినదీ, తాను తరించగలిగినదీ, దేవత కాగలిగినదీ, ఉత్తరోత్తర జన్మలలో మనుష్య జన్మలోకి వచ్చి మళ్లీ ఇంకా ఎదగగలిగిన స్థితి పొందగలిగినదీ, ధర్మాన్ని విడిచిపెట్టి కిందకు వెళ్ళి కొన్ని కోట్ల జన్మల వెనక్కి పడిపోయి స్థావర జంగమమైపోగలిగినదీ కూడా మనుష్యుడే! నువ్వు ఏమవుతావన్నది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రోగాలెందుకు వచ్చాయని వైద్యుడు అడగడు. ‘ఇక చేయకు అలాంటి పనులు. నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపిస్తా’ అంటాడు. భగవంతుడు కూడా అంతే! ఒకసారి తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడిపోయావు. నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఈశ్వరుడి అనుగ్రహాన్ని, గురువు యొక్క సౌలభ్యాన్ని , శాస్త్ర పరమార్థాన్ని, ధర్మం వైశిష్ట్యాన్ని సమన్వయం చేసుకుని తరించగల స్థితి మానవుడికి ఒక్కడికే ఉంది. ఇతరాలకు లేదు. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని, ఈశ్వరానుగ్రహాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత అవసరమో గుర్తించిననాడు దాని వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణ ద్వారా తరించగల అవకాశాన్ని పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
దేవుడికి సమర్పించాల్సిన... ఆ ఎనిమిది పూలు
మానవీయం ధర్మం అన్న మాటకు పర్యాయపదమే భక్తి. గోనెసంచుల్లో మారేడు దళాలు తీసుకొచ్చి, పూలదండలు మోసుకొచ్చి పూజ చేయడాన్ని భక్తి అనరు. కూర్చొని, ఊరికే స్తోత్రాలు చేసి, పూలు వేసేస్తే - పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్య నిష్ఠతో ధర్మపాలన చేసినవాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసినవాడే ధర్మాన్ని అనుసరిస్తునట్లు! భగవంతుడు విహిత కర్మ చెప్పాడు!! విశుద్ధ కర్మ చెప్పాడు!! ‘‘ఒరేయ్ ! నీకు అయిదు ఇంద్రియాలిచ్చాను. సుఖం అనుభవించు... నేను వద్దనడం లేదు. వీణావాదన వినాలని ఉందా, పాట వినాలని ఉందా? ‘సాంబశివాయని అనరే..’ అని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటారు. విను! భగవంతుడి దగ్గర కూర్చొని నీ కూతురే ‘కంజ దళాయతాక్షీ’ అంటూ కీర్తన చేస్తుంటే మురిసిపో! కానీ, లౌల్యానికి కట్టుబడకు. భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దన్నదాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు! విశుద్ధకర్మ విడిచిపెట్టకు! ఇతరుల ద్రవ్యాన్ని కోరవద్దు. నిత్య తృప్తితో ఈశ్వరుడు నీకు ఇచ్చినదేదో అదే పరమానందదాయకం అన్న భావనతో జీవితాన్ని అనుభవించు. అలా బతికినవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు! పరమ భక్తితత్పరుడు అన్నదానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపఃశిల్పం సకలమపి ముద్రా విరచనా...’’ నేను మాట్లాడుతున్నానంటే ఇది నేను మాట్లాడుతున్నది కాదు. మనుష్యుడిగా నాకు జన్మనిచ్చి, పరమేశ్వరుడు 83 లక్షల 99 వేల 999 జీవులకు ఇవ్వని చక్కటి స్వరపేటికను ఇచ్చి, ఇన్ని మాటలు నా చేత పలికించగలుగుతున్నాడు. ఆయన పలకించిన ఆ ఒక మంచి మాటతో ఎంత కష్టంలో ఉన్న వాళ్ళనైనా శాంతి పొందేలా చేయగలుగుతున్నాను. ‘‘అయ్యా. బెంగ పెట్టుకోకండి. ‘భయకృత్ భయనాశనః’ - ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీసేస్తాడు. చింతించకండి’’ అని ఒక్క మంచి మాట అన్నాననుకోండి. అంత కష్టాన్నీ మర్చిపోయి వెళ్ళగలుగుతున్నారు. ‘‘మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు’’. మాట అంత గొప్పది. ‘‘జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం’’ అన్నారు. ఆ మాటచేత ఏదైనా పొందవచ్చు. శత్రుత్వాన్ని, చివరకు మరణాన్ని కూడా తెచ్చుకోవచ్చు. ‘‘ఈశ్వరా! నాకు ‘మాట’ ప్రసాదించావు. నీవిచ్చిన ‘మాట’ను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టేది కాకుండా నేను చూసుకుంటా’’ అని దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మాట్లాడే ముందు జాగ్రత్తపడేవాడెవడో... వాడు పరదేవత పట్ల భక్తితో ఉన్న వాడు. అంతేకానీ నాలుగుపూలు వేసి పూజ చేసి, బయట రావణుడిలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే భక్తుడెలాఅవుతాడు? ‘‘ధార్మికమైతే నేను మాట్లాడతా. కాకపోతే మాట్లాడను’’ అన్నాడనుకోండి. ఇప్పుడది భక్తి. ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘‘సకలమపి ముద్రా విరచనా’’ - నా చేతులు, కాళ్ళు ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది అవయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే! ఇలా ఏది చేస్తున్నా భగవంతుని అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతున్నవాడు నిత్యం భగవంతుడికి ఉత్సవం చేస్తున్నవాడితో సమానం. కేవలం ‘అష్టదళ పాదపద్మారాధన’ టికెట్ కొనుక్కుని ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకున్నవాడు ఆ పద్మారాధన సేవ చేసినవాడు కాడు. ‘అష్టదళ పాదప ద్మారాధన’ ప్రతిరోజూ ప్రతిక్షణం చేసేలా అనుగ్రహించమని వేడుకోవాలి. ఆ పూజెలా ఉండాలి? 8 రకాల పూలతో పూజ. ఏమిటా పూలు? ‘అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియనిగ్రహః, సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తతై ్తవచ సత్యం అష్టవిధం పుష్పమ్ విష్ణోః ప్రీతికరమ్ భవత్’ అన్నారు. అహింస (ప్రేమ), ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, ధ్యానం, సత్యమనే 8 రకాల పుష్పాలతో నీ మనస్సుని ఈశ్వరుని పాదాల వద్ద పెట్టు. భక్తిమార్గంలో పయనించడమంటే అదీ! ఈశ్వరుడు వద్దన్నదాన్ని చేయకుండా ఉండడం- బ్రేకు. చేయమన్నదాన్ని చేయడం -యాక్సిలరేటర్. లోపల నీ ప్రయాణం క్షేమం. గమ్యం ఈశ్వరానుగ్రహం. ఇది ఎవడికి సాధ్యపడుతుందో వాడు ఉద్రేకపడడు, ప్రలోభాలకు లొంగడు. రామాయణంలో రాముడు ఒక మాట అంటాడు... ‘ఒకడు మంచివాడా, చెడ్డవాడా అని దేన్నిబట్టి నిర్ణయించాలి’ అని. ‘ఎవడో సంతోషంతో పొగిడాడనో, లేదా అక్కసుకొద్దీ తిట్టాడనో కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి దాన్ని నిర్ణయించాలి.’ చాలామంది రాముడికి సీతమ్మ ఇష్టమనుకుంటారు. కానీ ఆయనకు ఏది ఇష్టమో తెలుసా? తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టమొచ్చినా రాముడు నిత్య తృప్తుడు. నవమి (9వతిథి)నాడు పుట్టాడు. తొమ్మిదిని ఏ అంకెతో హెచ్చవేసినా మళ్ళీ తొమ్మిదే వస్తుంది. రాముడికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎందుకు సంతోషంగా ఉంటాడో తెలుసా! ‘నా ధర్మం నేను నెరవేర్చా’ అన్న తృప్తి ఒక్కటే అందుకు కారణం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ మనుష్యుడిగా పుట్టిన రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే ప్రతివాడూ ‘నేనీ రోజు భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ! ఆయన వద్దన్నది చేయలేదు కదూ!’ అని మననం చేసుకోవాలి. ఇక జీవితంలో ఎదురయ్యే ఉత్థాన పతనాలంటారా... ‘ఈశ్వరుడున్నాడు, ధర్మముంది. నా ధర్మానుష్ఠానం నన్ను రక్షిస్తుంది’ అని భావన చేయాలి. ధర్మంతో మనిషి తరిస్తాడు. ధర్మం మనకు నిగ్రహశక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నైతికబలాన్నిస్తుంది. అదే భక్తి. అదే మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి హితకారిణి. ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది. పరమ భక్తితత్పరుడు అన్న దానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపః శిల్పం సకలమపి ముద్రా విరచనా.’’ ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘సకలమపి ముద్రా విరచనా’ - నా చేతులు, కాళ్ళు... ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది శరీరావయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధ ముద్రలే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బిల్ గేట్స్ సంచలన నిర్ణయం
-
ఆయన తలచుకుంటే.. ఇవన్నీ చేయగలరు
బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత ్యధిక ధనవంతుడు. ఆయన పుట్టిన రోజు నాడు ప్రపంచంలోని ఒక్కొక్కరికీ రూ. 650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా, విలాసవంతమైన జీవితం గడపగలరట! ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 80 బిలియన్ డాలర్స్ అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 5,34,600 కోట్లకు పైమాటే. సెకనుకు ఆయన ఆర్జించే సంపాదన రూ. 10 వేల రూపాయలు. అయితే బిల్‌గేట్స్ తన ఆస్తులతో భారతీయులకు ఏమేం చేయగలరని పలు అంచనాలు వెలువడుతున్నాయి. బిల్‌గేట్స్ తన ఆస్తులతో బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ. 18-22 లక్షల వరకు ఉంటుంది. 30 లక్షల ఫ్లాట్స్‌ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 0-9 ఏళ్ల మధ్య పిల్లలకు 10 నెలల వరకు క్యాండీస్‌ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట. భారత జనాభా మొత్తానికి ఆహారం, టీ స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు ఒక్కొక్కరికీ రూ. 6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిఫ్ట్‌గా ఆయన ఇవ్వగలరట. మైక్రోసాఫ్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన బిల్‌గేట్స్.. ఇప్పటికే ఎన్నో దానధర్మాలు చేస్తున్నారు. బిల్‌గేట్స్ తన భార్యతో కలసి ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడో ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి ఉచిత విద్య వంటి వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
అవిశ్వాసుల ఆగడాలు
ప్రవక్త జీవితం సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ధర్మం విస్తరిస్తున్నకొద్దీ అవిశ్వాసుల ఆగడాలు కూడా అధికమయ్యాయి. ప్రవక్తను, ఆయన అనుచరులను రకరకాల మాటలనడం, అపనిందలు వేయడం, వారిపైకి రౌడీమూకలను ఉసిగొల్పడం లాంటి వేధింపులు పెరిగిపోయాయి. అయినా సమాజంలోని సద్వర్తనులు, ఆలోచనాపరులు ధర్మపరివర్తన చెందుతూనే ఉన్నారు. ప్రవ క్త అనుచరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఒకరోజు అవిశ్వాస ప్రముఖులు కాబా గృహంలో కూర్చొని ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ‘మనమంతా చచ్చిన తరువాత మళ్ళీ బ్రతికి లేస్తామట. ఇక్కడ చేసిన పనుల్ని గురించి అక్కడ సమాధానం చెప్పుకోవాలట. మంచిపనులు చేస్తే సత్ఫలితమట, చెడ్డపనులు చేస్తే దుష్ఫలితమట.. వింత వింతగా ఉన్నాయి కదా ఈ మాటలు.. ఎప్పుడైనా విన్నామా ఇలాంటి ప్రేలాపనలు’ అన్నాడు అందులోని ఒక వ్యక్తి. ‘అంతే కాదు, స్వర్గనరకాలు కూడానట... బుద్ధిలేకపోతే సరి’ అన్నాడు మరోప్రబుద్ధుడు. ‘ఇదంతా కాదుగాని, అతన్నొకసారి ఇక్కడికి పిలిచి మాట్లాడదాం. నువ్వు చెప్పే మాటలకు రుజువులు, ఆధారాలు చూపించమని నిలదీద్దాం. ఈ విధంగా అతన్ని హింసించడానికి, వేధించడానికి మనకొక సాకు దొరుకుతుంది. ఎవరూ పల్లెత్తుమాట అనడానికి కూడా అవకాశం ఉండదు’ అన్నాడు మరొకడు. (వచ్చేవారం మరికొంత) - ఎండీ ఉస్మాన్‌ఖాన్ -
ప్రేమ్‌జీ బాటలో ఝన్‌ఝన్‌వాలా
2021లో 25% సంపద విరాళం ముంబై: ఇండియన్ వారెన్ బఫెట్‌గా సుపరిచితుడు, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా దాతృత్వం వైపు తొలి అడుగు వేశారు. 2021 జూలై 5 నాటికి తన పెట్టుబడుల పోర్ట్ ఫోలియో విలువలో 25% లేదా రూ.5 వేల కోట్లు... ఈ రెండింటిలో వేటి విలువ తక్కువ అయితే ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తానని ఝన్‌ఝన్‌వాలా ప్రకటించారు. ‘సేవా కార్యక్రమాలకు ఎంత ఇచ్చావు? అని ఏటా నన్ను మా నాన్న అడిగేవారు. నీ నుంచి ఏమీ ఆశించనని, సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని కోరేవారు. 2008లో ఆయన మరణించారు. దాతృత్వమే నాన్నకు ఇచ్చే ఘన నివాళి అని ఆ తర్వాత అనుకున్నా. అప్పటి నుంచి డివిడెండ్ ఆదాయంలో 25% సేవా కార్యక్రమాలకు ఇస్తున్నాను’ అని ఝన్‌ఝన్‌వాలా చెప్పారు. విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ తన సంపదలో 80% విరాళంగా ప్రకటించడం తెలిసిందే. -
సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
వెల్లంకి (రామన్నపేట) : యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సర్పంచ్ నకిరేకంటి స్వప్న, ఎంపీటీసీ కూరెళ్ల నర్సింహాచారి కోరారు. ఆదివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో శివాజీయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం వల్ల ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని తెలిపారు. శిబిరంలో 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో వైద్యులు సుబ్బారావు, నిర్మల, అనిత, వల్లందాసు కృష్ణ, వివిధ పార్టీల నాయకులు తాటిపాముల శివకృష్ణ, నకిరేకంటి అశోక్, నిర్వాహకులు కొయ్యలకొండ రాజు, దేశబోయిన శ్రీధర్, ఎర్రంబెల్లి రాజు, కందాల శివశంకర్ పాల్గొన్నారు. -
బంధుజనులకు విందు
‘బాబూ ముహమ్మద్ ! నాకు కూడా ఈ ధర్మాన్ని అవలంబించాలని ఉంది, కాని నేను మనతాతముత్తాతల ధర్మాన్ని విడిచి పెట్టలేనయ్యా. అయితే ఒకమాట. నువ్వు నిరభ్యంతరంగా ఈధర్మాన్ని అనుసరించవచ్చు. నిన్నెవరూ అడ్డుకోలేరు. నా బొందిలో ప్రాణమున్నంతవరకూ నేను నీకు అండగా ఉంటాను’. అన్నారు అబూతాలిబ్ తరువాత, తనయుడు అలీ నుద్దేశించి, ‘‘ముహమ్మద్ చాలా మంచి విషయాలు చెబుతున్నాడు. ఆయన అవలంబిస్తున్న ధర్మం చాలా బాగుంది. నువ్వు కూడా దాన్ని అనుసరించు. దాని పైనే స్థిరంగా ఉండు. ముహమ్మద్ చెప్పినట్లు నడుచుకో. ఆయన్ని ఎప్పటికీ విడువబాకు’ అని హితవు చేశారు. తరువాత జాఫర్‌తో, ‘బాబూ! నువ్వుకూడా నీసోదరునితో కలిసి ఈ ధర్మాన్ని అనుసరించు’ అన్నారు. అబూతాలిబ్ అయితే ధర్మాన్ని స్వీకరించలేదు కాని, కొడుకులకు మాత్రం స్వీకరించమని హితవుచేశారు. బాబాయి అబూతాలిబ్ మాటలతో ముహమ్మద్ ప్రవక్త (స)కు కొండంత ధైర్యం కలిగింది. ఆయన చాలా సంతోషించారు చూస్తూ చూస్తూనే మూడేళ్ళు గడిచి పొయ్యాయి. ఈమధ్యకాలమంతా ధర్మప్రచారం రహస్యంగానే కొనసాగింది. సఫా కొండ దిగువ భాగంలో ఉన్న హజ్రత్ అర్ఖమ్ గారి ఇల్లు సామూహిక నమాజులకు నెలవుగా మారింది. కాని తరువాత బహిరంగంగా ధర్మప్రచారం కొనసాగించాలన్న దైవాదేశం మేరకు ముహమ్మద్ ప్రవక్త తన కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బంధుజనులందరినీ విందుకు ఆహ్వానించారు. విందుముగిసిన తరువాత నాలుగు మంచిమాటలు చెబుదామని, దైవసందేశం అందజేద్దామని అనుకున్నారు ప్రవక్తమహనీయులు. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న అబూలహబ్ వెంటనే అందుకొని, ‘చూడు ముహమ్మద్! ఇక్కడ నీ బాబాయిలు, సోదరులు, ఇతర కుటుంబీకులు, బంధుజనమంతా ఉన్నారు. వీళ్ళంతా నీ మేలు కోరేవారే. వారంతా ఏ రాగమాలాపిస్తే, నువ్వు కూడా అదేరాగం అందుకో. అంతేగాని, నువ్వేదో కొత్తకొత్తగా మాట్లాడితే కుదరదు. తాతల కాలం నుండి వస్తున్న మతాన్ని కాదని, ఈరోజేదో కొత్తమతం అంటే ఊరుకునేది లేదు. ఇలాంటి పిచ్చి పనులన్నీ వెంటనేమానేయి. అరేబియా అంతా ఒకటైతే నువ్వొక్కడివి ఏంచేస్తావు? నీ సోదరులందరిపై ఆపద తెచ్చి పెడదామనుకుంటున్నావా?’ అంటూ విందుకొచ్చిన బంధువులందరినీ రెచ్చగొడుతూ..,’ తప్పో ఒప్పో తరువాత సంగతి గాని, ముందుమీరంతా కలిసి ముహమ్మద్‌ను నిలువరించండి. వేరే ఎవరో వచ్చి మీదపడకముందే మీ అంత మీరే మేలుకోండి. ఇక పదండి, ఇంకా ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు’. అంటూ లేచాడు అబూలహబ్ . దాంతో అందరూ ఒక్కొక్కరుగా అక్కడినుండి నిష్ర్కమించారు. దైవప్రవక్త ముహమ్మద్ (స) ఉద్దేశ్యం నెరవేరలేదు. మనసులో మాట మనసులోనే ఉండిపోయింది. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
వైఎస్సార్.. మీకు జోహార్
- ఏడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు - వైఎస్‌కు నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, ప్రజలు మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌కు నివాళిగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో, మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దివంగత నేతకు ప్రజలు ఘన నివాళులర్పించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, ఎం.వెంకట్రామిరెడ్డి, ఎ.సుధాకర్, అబ్బిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. భద్రాచలంలో పొల్లు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి పండ్లు పంపిణీ చేశారు. అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శి బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. చేవెళ్లలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి విజయప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నగరంలోని రామంతపూర్‌లో సుధాకర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పాతబస్తీలో చార్మినార్ వద్ద వైఎస్సార్ వర్థంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం. భగవ ంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో అన్నదానం, పండ ్ల పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడలో రక్తదాన శిబిరం, పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. -
సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు
సాక్షి, సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న వాడవాడలా సేవా కార్యక్రమాలు, సభలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈమేరకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17 మంది సీఎంలు మారినా ప్రజల హృదయాల్లో ఒక్క వైఎస్సార్ మాత్రమే గూడుకట్టుకొని ఉండి పోయారన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు వైఎస్సార్ ఎనలేని సేవ చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, 108, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆరోగ్య శ్రీ, పక్కాఇళ్లు లాంటి ప్రజా ప్రయోజనాలు కల్పించే పథకాలతో అవసరం వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చేది వైఎస్సార్ అని చెప్పారు. అటువంటి సంక్షేమ పథకాల ప్రదాత పేరు సెప్టెంబర్ 2న వాడవాడలా అందరి హృదయాల్లో మార్మోగేలా...విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి వేల్పుల విజయ ప్రసాద్, యాదయ్య, సేవాదళ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి అన్నదానానికి కూరగాయల వితరణ
లబ్బీపేట : స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నామని, వాటికి అవసరమైన కూరగాయలను దాతలు ఉచితంగా అందించడం శుభసూచికమని రాష్ట్ర సమాచార ఫౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునా«థరెడ్డి అన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో అరవపల్లి శేషసాయివర్మ, కావ్య, అరవపల్లి ఆధిత్య, మండవ సస్య, మండవ కాళీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో రూ. 3లక్షల విలువైన కూరగాయలను గురువారం సరఫరా చేశాారు. ఈ లారీని బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో తీతీదే∙ఆలయ నమూనా ఏర్పాటు చేసామని, ఆ ఆలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. అన్నదానానికి దాతలు కూరగాయలు ఉచితంగా అందచేయడం అభినందనీయమని, దీనిని మిగిలిన వారు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. అధికారులకు కూరగాయలు అందచేతః దాతలు అందించిన కూరగాయలను తితిదే కల్యాణ మండపంలోని అన్నప్రసాదం ట్రస్ట్ ప్రత్యేక అధికారిణి పి.చెంచులక్ష్మికి మండవ కుటుంబరావు అందించారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి మాట్లాడుతూ స్వామివారి ప్రసాదంలో భాగంగా టమాటా రైస్, పులిహోర అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ క్యాటరింగ్ ఆఫీసర్ జీఎల్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. ఫొటో 11 విఐఇ 41– తితిదే అన్నదానానికి కూరగాయల లారీని జెండా ఊపి ప్రారంభిస్తున్న పల్లె రఘునాథరెడ్డి , మండవ కుటుంబరావు తదితరులు -
శరత్ బాబు, చంద్రబోస్‌లకు జాలాది పురస్కారాలు
విశాఖ :సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ జాలాది పేరిట జాలాది చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నంలో నెలకొల్పిన జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 9 సాయంత్రం ఇక్కడి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆంధ్ర విశ్వకళా పరిషత్ రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వర రావు వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక హోటల్లో విలేకర్లతో మాట్లాడారు. జాలాది 85వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి కొత్తగా జాతీయ స్థాయి ప్రతిభకు కొలమానంగా ఏర్పాటు చేసిన ‘జాలాది జీవన సాఫల్య పురస్కారం–2016’కు విలక్షణ నటుడు శరత్ బాబును తమ నిపుణుల కమిటీ ఎంపిక చేసిందన్నారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను జాలాది ఆత్మీయ పురస్కారానికి ఎంపిక చేశామని చెప్పారు. ఆ రోజు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథ రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు అతిథులుగా హాజరై పురస్కార ప్రదానం చేయనున్నట్టు రిజిస్ట్రార్ వివరించారు. జాలాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ కవి జాలాది వంశాంకురాలైన తామ తోబుట్టువుంతా కలసి ఏర్పాటు చేసుకున్న ఈ ట్రస్ట్ ద్వారా 2012 నుంచి తెలుగు రాష్ట్రాల పరిధిలో పురస్కార ప్రదానోత్సవాలతోపాటు, విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి జాతీయ పురస్కారం కింద రూ. 50వేల నగదు, సన్మానం ఉంటుందని వివరించారు. లోగడ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలందుకున్నవారిలో దర్శకులు పీసీ రెడ్డి, కళ్లు రఘు, స్టార్ మేకర్ లంక సత్యానంద్, గేయ రచయితలు భువనచంద్ర, రసరాజు, అదష్ట దీపక్, గురు చరణ్, సంభాషణ రచయితలు ఎంవీఎస్ హరనాథ రావు, కాశీ విశ్వనాథ్. నిరాత పోకూరి బాబూరావు, నటి అర్చన వంటి ప్రముఖులున్నారని వివరించారు. తమ తండ్రి ఆశయ సిద్ధి కోసం కంకణబద్ధులమై జాలాది ట్రస్ట్ ద్వారా బహుముఖ సేవలందించడంతోపాటు జాలాది విరచిత గీతాలతో సినీ సంగీత విభావరి నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. తాము ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కళాప్రియులంతా ఉచితంగా ఆస్వాదింవచ్చని ఆమె సూచించారు. -
ఒక్క డిబేట్‌కు 67 కోట్లు కోరిన ట్రంప్!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాంచి బిజినెస్ మెన్ అనిపించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ పోటీలో నిలిచేందుకు సరిపడా డెలిగేట్ల మద్దతు లభించిన సందర్భంగా నార్త్ డకోటాలోని బిస్మార్క్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పిన మాటలు విన్నవారు.. ఎక్కడ డబ్బు రాబట్టగలమో బహుశా ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు అనుకుంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడుతున్న బెర్నీ సాండర్స్తో డిబేట్లో పాల్గొంటారా అని ట్రంప్‌ను పాత్రికేయులు అడగ్గా.. పాల్గొంటాను గానీ నాకు 10 మిలియన్ డాలర్లు ఇస్తారా అని ఆయన ప్రశ్నించడంతో వారు బిత్తరపోయారు. డిబేట్ నిర్వహించే మీడియా సంస్థ ఇచ్చే ఆ డబ్బుతో చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తానని ట్రంప్ వెల్లడించారు. మీడియా సంస్థల బిజినెస్ గురించి తనకు బాగా తెలుసునని చెప్పిన ట్రంప్.. సాండర్స్తో డిబేట్‌కు మంచి రేటింగ్ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సాండర్స్ తనకు లవబుల్ పర్సన్ అని, ఆయనతో డిబేట్ తనకు ఇష్టమన్నారు. మరోవైపు సాండర్స్ కూడా ఈ డిబేట్‌కు ఓకే అంటూ సంకేతాలిచ్చారు. చూడాలి మరి ట్రంప్ చారిటీ బిజినెస్ డీల్‌కు ఏ మీడియా సంస్థ ముందుకొస్తుందో. -
విరాట్.. మనసున్నమారాజు
మైదానంలో భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగే కాదు ప్రవర్తన కూడా దూకుడుగా ఉంటుంది. బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే విరాట్.. ప్రత్యర్థులు నోరు జారితే అంతే దీటుగా స్పందిస్తాడు. మాటల యుద్దానికైనా, గొడవకైనా సై అంటాడు. దీంతో అతను కొన్నిసార్లు విమర్శలపాలయ్యాడు కూడా. అయితే కోహ్లీలో చాలామందికి తెలియని మరో పార్శ్యం కూడా ఉంది. విరాట్ మనసు వెన్న. వ్యక్తిగత జీవితంలో నిబ్బరంగా, సేవాభావంతో ప్రవర్తిస్తాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ ఇటీవల పుణెలో ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ పెద్దలతో ఎంతో అప్యాయంగా మాట్లాడి వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. పుణెలో ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లో తనకు వచ్చే ఫీజులో 50 శాతాన్ని ఆ సంస్థకు విరాళంగా ప్రకటించాడు. అంతేగాక విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తరపున ఆ సంస్థకు మరింత సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా కోహ్లీ ఉద్వేగంగా చెప్పాడు. పెద్దవాళ్ల బాగోగులు చూడకుండా వదిలివేయడం తప్పని అన్నాడు. లవర్ బాయ్‌గా, యాంగ్రీ యంగ్‌మన్‌గా, దూకుడైన క్రికెటర్‌గా కనిపించే కోహ్లీ.. ఓ ఆదర్శమైన యువకుడు కూడా.. -
జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్
ముంబై: భారత్‌లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పట్ల ఓ జర్నలిస్టు ప్రవర్తనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ పర్యటనలో భాగంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ ఐష్‌ని విష్ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్ హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్ ఐష్ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు. -
ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటాం
దత్తతకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు నవాబుపేట: ఆ ఇద్దరు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటామని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. సార్.. మమ్మల్ని చదివించండి’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన నందిని, శృతి గురువారం నిర్వహించిన రెవెన్యూ దర్బార్‌లో తహసీల్దార్ చెన్నకిష్టప్పకు మొరపెట్టుకున్నారు. దీనిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి హైదరాబాద్‌కు చెందిన సర్వ్‌నీడి, మెటాస్కాన్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ విషయంలో తహసీల్దార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి అందరి అనుమతితో దత్తత తీసుకుని చదివిస్తామని వెల్లడించాయి. కాగా, గురుకుంటకు చెందిన నందిని, శృతిల మేనత్త, గ్రామస్తులతో చర్చించి వారి దత్తత విషయం ప్రకటిస్తామని, చిన్నారులదే తుది నిర్ణయమని తహసీల్దార్ చెన్నకిష్టప్ప వివరించారు. -
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
► రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ► 35 డివిజన్ యువకులు వైఎస్సార్ సీపీలో చేరిక నెల్లూరు(అగ్రికల్చర్) : వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక 35వ డివిజన్ పొదలకూరు రోడ్డు సెంటర్‌కు చెందిన పలువురు యువకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు కోటంరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరు రోడ్డుకు చెందిన పలువురు యువకులు వైఎస్సార్సీపీ 35వ డివిజన్ జాయింట్ సెక్రటరి చిన్నమస్తాన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అంగడా ఉంటుందని, వారికి తగిన గుర్తింపునిస్తుందన్నారు. కార్యకర్తలు పార్టీ జెండాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నారు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలని, పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా అలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా కార్యకర్తల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వెల్లంటి ఎంపీటీసీ పాదర్తి సుధాకర్, జాఫర్, వెంకటేశ్వర్లు, హసీనా, షమీఉల్లా, షాహుల్, ఇర్ఫాన్, ఖలీల్, పట్రంగి అజయ్, యూత్ జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్ హరికుమార్ పాల్గొన్నారు. -
యెమెన్‌లో ఉగ్రదాడులు నలుగురు భారత నర్సులు మృతి
* వృద్ధాశ్రమంలో16 మందిని కాల్చి చంపిన ముష్కరులు * కోల్‌కతాకు చెందిన మిషనరీల ఆధ్వర్యంలోని ఆశ్రమం అడెన్, న్యూఢిల్లీ: యెమెన్ తాత్కాలిక రాజధాని అదెన్‌లోని ఓ వృద్ధాశ్రమంపై ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు తెగబడ్డారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి.. నలుగురు భారతీయ నర్సులు సహా 16 మందిని బలిగొన్నారు. కోల్‌కతాలో మదర్ థెరీసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అడెన్ నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి ఆరుగురు సాయుధ దుండగులు వచ్చారు. తమ తల్లిని చూడడానికి వచ్చామని, గేటు తెరవాలని సెక్యూరిటీ గార్డును కోరారు. గేటు తీయగానే మొదట ఆ గార్డును కాల్చి చంపారు. దుండగుల్లో ఇద్దరు బయట కాపలాగా ఉండగా... మిగతా నలుగురు లోపలికి వెళ్లారు. గదుల్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి చేతులు కట్టేసి తలపై తుపాకీతో కాల్చారు. ఆశ్రమంతా తిరిగి 16 మందిని చంపేశారు. ఉగ్రవాదులు ఆశ్రమంలోకి చొరబడిన సందర్భంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు హెచ్చరించడంతో ఓ నర్సు స్టోర్‌రూమ్‌లోని ఫ్రిజ్‌లోకి వెళ్లి దాక్కుంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ఆశ్రమంలోకి వెళ్లిన ఖలీద్ హైదర్ అనే స్థానికుడు ఆమెను గుర్తించి రక్షించారు. అందరినీ చేతులు కట్టేసి, తలపై కాల్చి చంపారని తెలిపారు. తన సోదరుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లామన్నారు. -
ఎజైల్ సంస్థపై వేటు!
శ్రీకాకుళం సిటీ : రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లో పని చేస్తున్న ఎజైల్ ఏజెన్సీపై వేటుకు రంగం సిద్ధమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు రిమ్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రిల్లో సేవలందిస్తున్న ఎజైల్ కంపెనీలపై వేటుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓ చారిటబుల్ ట్రస్ట్ పరిధిలోకి ఆస్పత్రిలో పారిశుధ్యం, సెక్యూరిటీ సేవలు తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఏజెన్సీని ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో రిమ్స్‌లో సేవలందిస్తున్న ఎజైల్ ఏజెన్సీకి ఇప్పటికే మెయిల్ చేసినట్లు రిమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిమ్స్‌లో సుదీర్ఘ కాలంగా, ఈ ఏజెన్సీ పరిధిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రిమ్స్‌లో ఎజైల్ పరిధిలో 130 మంది ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, సెక్యూరిటీ సేవలు విస్తరించేందుకుగాను 2014 అక్టోబర్ నెల నుంచి మూడేళ్ల కాలపరిమితితో ఎజైల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి పైగా కాల పరిమితి ఉంటుండగా మార్చి 1వ తేదీ నుంచి తొలగించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఏజెన్సీ స్థానిక ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రి, కళాశాలల్లో మొత్తంగా సెక్యూరిటీ 42 మంది, 88 మంది పారిశుధ్య సిబ్బంది ఇప్పటివరకు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెన్సీకి ప్రభుత్వం ప్రతీ నెలా రూ.24 లక్షల వరకు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ పరిధిలో పని చేస్తున్న వారికి పీఎఫ్, ఈఎస్ఐతో పాటు పలు సౌకర్యాలు కలిపి రూ.8,500 వేతనం చెల్లిస్తున్నారు. అసలు కథ ఇదీ... రాష్ట్ర స్థారుులో కీలక బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి సంబంధించినదిగా చెప్పుకొనే ఓ చారిటబుట్ ట్రస్ట్‌కు ఆస్పత్రుల పారిశుధ్యం, సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రిమ్స్‌లో రెండురోజులుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా డీఎంఈ పరిధిలో ఉండే వైద్య కళాశాలల్లో వీటిని అమలు చేసి క్రమంగా జిల్లాలో సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అమలుకు నిర్ణయించారు. ఇప్పటికే రిమ్స్‌కు డీఎంఈ నుంచి దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఏజెన్సీ ప్రతినిధులకు రిమ్స్ యంత్రాంగం కూడా మార్చి నెల నుంచే ప్రత్నామ్నాయాలు చూసుకోవల్సిందిగా ఆదేశిస్తూనే ఆ సంస్థ (హైదరాబాదు) ప్రతినిధులకు ఓ మెయిల్ కూడా చేశారు. ఒక్క రిమ్స్‌లోనే కాకుండా జిల్లాలో ఏరియా ఆస్పత్రులైన టెక్కలిలో 60 మంది, పాలకొండలో 48 మంది, రాజాంలో 30 మంది వరకు ఎజైల్ పరిధిలో పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. కాగా సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా తొలగించి వారి స్థానంలో ఎక్స్సర్వీస్మెన్లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వాసుపత్రుల్లో తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తాజాగా తెలిసింది. నోటీసులు ఇచ్చాం... ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో డెరైక్టర్ ఎజైల్ కంపెనీ ప్రతినిధులకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఏజెన్సీ బదులుగా ప్రభుత్వం సూచించిన కొత్త ఏజెన్సీకి అవకాశం ఇవ్వనున్నారు. డీఎంఈ నుంచి రిమ్స్‌కు ఆదేశాలు వచ్చాయి. -డా. సునీల్‌నాయక్, రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కాంట్రాక్టు పూర్తి కాలేదు... ప్రభుత్వాస్పత్రుల్లో తమ సేవలకు సంబంధించి 2017వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి నెల నుంచి కొత్త ఏజెన్సీకి అవకాశం ఇవ్వనున్నట్లు రిమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తమ ఉన్నతాధికారులకు రిమ్స్ యంత్రాంగం మెయిల్స్ కూడా చేసింది. కొత్త ఏజెన్సీ పేరుతో తమకు వేటు వేస్తే ఎలా.. దువ్వ శేషు, రిమ్స్ ఎజైల్ సంస్థ పీఆర్వో, -
లామకాన్ బచ్‌గయా..
హైదరాబాద్: రోడ్డెక్కి ప్రదర్శనల్లేవు. హోరెత్తిన ధర్నాలూ నిరసనలూ లేవు. వేడుకోల్లేవు. వినతి పత్రాల్లేవు. దిక్కులు పిక్కటిల్లే నినాదాల్లేవు. దిష్టిబొమ్మల దహనాల్లేవు. అయినా నగర మునిసిపల్ అధికారులు తాము తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఇచ్చిన నోటీసులను చాపచుట్టారు. ఇదెలా సాధ్యమైంది? లామకాన్ ఎలా ‘సేవ్’ అయింది? సోషల్ మీడియా కారణంగా నగరంలో అధికారులు వెనుకడుగు వేసిన తొలి ఉదంతంగా ఎలా నిలిచింది? ‘‘ఐదేళ్లుగా ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాం. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు చవిచూశాం. అందులో ఇదొకటి’’అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు బంజారాహిల్స్‌లోని లామకాన్ నిర్వాహకులు. అయితే లామకాన్‌ను వేదికగా చేసుకుని ఎదిగిన ఎందరో కళాకారులు, మరెందరో సృజనశీలురు, అభిమానులు మాత్రం ఊరుకోలేదు. ఆన్లైన్ వేదికగా చేసుకుని ప్రచార శంఖం పూరించారు. సేవ్ క్రియేటివిటీ, సేవ్ లామకాన్ అంటూ కొన్ని రోజుల పాటు సాగిన ప్రచారానికి అనూహ్యమైన మద్దతు లభించింది. నేతలు, అధికారులను కదలించింది. లామకాన్ మూసివేత నిర్ణయాన్ని అటకెక్కించింది. వేదిక ఒకటే... వెలుగులెన్నో... ఐదేళ్ల చిరు ప్రాయంలోనే... ఎందరో థియేటర్ ఆర్టిస్టులు, గాయకుల కళల సాకారానికి వేదికగా, పుస్తకావిష్కరణలు, షార్ట్ ఫిలిం రూపకల్పనల వంటి ఎన్నో చక్కని కార్యక్రమాల నిలయంగా, చిరు వ్యాపారులు, హస్తకళాకారులకు ఊతంగా... ఎదిగింది బంజారాహిల్స్‌లోని లామకాన్. దీనిని సహేతుకమైన కారణం లేకుండా మూసివేయాలన్న నిర్ణయం ఎందరినో తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది. దీంతో ఆన్లైన్ వేదికగా పోరు ప్రారంభమైంది. సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించారు. కేవలం కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మాత్రమే కాకుండా వారికి వందల సంఖ్యలో ఆడియన్స్‌ను కూడా అందిస్తోందని ఈ ప్రచారకర్తలు గుర్తు చేశారు. సూత్రధార, రంగధార, ఉడాన్, నిషుంబిత, డ్రమ్మనాన్ వంటి అనేక థియేటర్ సంస్థలు లామకాన్ నీడనే ఎదిగాయని ఉదహరించారు. ముంబయికి చబిల్దాస్ ఎలానో హైదరాబాద్‌కి లామకాన్ అలా రూపుదిద్దుకోనుందంటూ పేర్కొన్నారు. ఒక స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సృజనాత్మక వేదికను పార్కింగ్, స్మోకింగ్ వంటి చిన్న చిన్న కారణాలతో మూసివేయడం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు. అ‘సైన్డ్’ వార్... ఆన్లైన్లో ఏదైనా ఒక క్యాంపెయిన్ సక్సెస్ కావాలంటే కనీసం 500 సంతకాలు కావాలి. అప్పుడే దాన్ని సోషల్ మీడియా నుంచి ప్రభుత్వానికి చేరదగ్గదిగా పరిగణిస్తారు. లామకాన్ కోసం ఇలాంటి క్యాంపెయిన్లు రకరకాల రూపాల్లో నడిచాయి. దాదాపు 10వేల సంతకాలకు పైగా వీటికి మద్దతిచ్చాయి. ఈ ఆన్లైన్ ఉద్యమం మంత్రి కెటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వంటివారి చెవిన పడింది. ఫలితం... లామకాన్‌కు కొత్త ఊపిరొచ్చింది. అంటే మరెందరో ప్రతిభావంతులు ప్రకాశించే అవకాశం వచ్చింది. లామకాన్‌కు వచ్చే కొందరు అత్యుత్సాహవంతుల కారణంగా స్థానికులకు కలుగుతున్న అసౌకర్యాలకు నిర్వాహకులు తగిన పరిష్కారం చూపించాలని, లాంగ్ లివ్ లామకాన్ అంటున్న వేలాది ఆశీర్వచనాలే ఆసరాగా ఈ వేదిక నిరంతరం వర్ధిల్లి మరెందరో యువ ప్రతిభావంతుల వెలుగులకు దారి చూపాలని కళాభిమానుల ఆశ. -
రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు
♦ అందుబాటులోకి తెచ్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ♦ వివిధ రకాల రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించే యత్నం ♦ సలహాలు, సూచనలతో నాలుగు డాక్యుమెంటరీలకు రూపకల్పన సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, స్థలాలు, ఆపార్ట్మెంట్ల కొనుగోళ్ల సమయంలో అన్నీ నేనే చూసుకుంటాననే బ్రోకర్ల మాయలో పడి అనసరమైన పాట్లు పడవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హెచ్చరిస్తోంది. ఆస్తుల కొనుగోళ్ల విషయంలోనే కాదు.. విద్యా సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన సొసైటీల రిజిస్ట్రేషన్, బిజినెస్, కంపెనీలు ప్రారంభించేందుకు అవసరమైన ఫర్మ్ రిజిస్ట్రేషన్లపైనా అవగాహన కలిగుంటే మేలని సూచిస్తోంది. వివాహం రిజిస్ట్రేషన్ జరగకుంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఇబ్బందులను కూడా తెలియజేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కొత్త పంథా ఎంచుకున్నారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, రిజిస్ట్రేషన్‌పై కల్పించేందుకు 4 లఘుచిత్రాలు రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రతిచోటా ఈ లఘు చిత్రాలను వీక్షించేలా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ registration.telangana.gov.in/videogallery.jsp ద్వారా అందుబాటులోకి తెచ్చారు. లఘు చిత్రాలు ఇవీ.. సమస్యల్లేని ఆస్తినే ఎంచుకోండి ఆస్తుల కొనుగోలు సమయంలో వాటి గత చరిత్ర తెలుసుకోకుంటే వచ్చే చిక్కులపై ‘జాగ్రత్త’ లఘుచిత్రంలో కళ్లకుకట్టారు. తక్కువ రేటుకు వస్తుందని సమస్యలున్న ప్రాపర్టీ కొనుక్కోవడం కంటే ప్రాబ్లమ్ లేని ఆస్తిని ఎంచుకోవడమే మేలని ఇందులో చూపారు. కొనబోయే ఆస్తి గత చరిత్రను లింక్ డాక్యుమెంట్, ఈసీ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చని, ఆపార్ట్మెంట్ల విషయంలో మున్సిపల్ అప్రూవల్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే కార్ పార్కింగ్, అన్డివెడైడ్ స్పేస్ వివరాలను కూడా డాక్యుమెంట్లలో పొందుపరిచా రో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని చెబుతోందీ చిత్రం. సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. స్కూల్, స్వచ్ఛంద సంస్థలు స్థాపించాలన్నా సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని మరో లఘుచిత్రంలో తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ వల్ల ఆదాయపు పన్ను మినహాయింపు, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, బ్యాంకుల నుంచి సాయం పొందే వీలుంటుందని వివరించారు. స్వచ్ఛంద సంస్థ లు నిర్వహించే సామాజిక సేవలు, క్రీడలు, కళలకు ప్రోత్సాహం, సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్ వివరాలివీ.. ఏదైనా వ్యాపారం లేదా కంపెనీ ప్రారంభించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చే యించుకోవాలంటూ మరో లఘచిత్రంలో తెలిపారు. సంబంధిత వివరాలను వినియోగదారుల దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇన్‌కంట్యాక్స్ ఇబ్బందులు, సివిల్ కేసుల సమస్య తలెత్తకుండాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమమని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవసరమని పేర్కొన్నారు. వ్యాపారానికి సంబంధించి పార్టనర్షిప్ డీడ్, కార్యాలయ లీజు డీడ్.. తదితర పత్రాలతో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే రిజిస్ట్రేషన్ ఎంతో సులభ మని ఈ చిత్రంలో చూపించారు. పెళ్లిని నమోదు చేయించుకోండి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఇంకో లఘుచిత్రంలో చూపించారు. విదేశాల్లో పని చేస్తున్న యువకులు స్వదేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి అక్కడికి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ అయ్యే సమయంలో అయినా వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే జరిగిన వివాహాలను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చే సుకోవచ్చు. కుల, మతాంత ర వివాహాలను స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కింద నమోదు చేసుకోవచ్చని లఘు చిత్రంలో చూపారు. -
ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు!
‘‘ఆ దేవుడు నన్నెప్పుడూ చిన్న చూపు చూడలేదు. హీరోయిన్గా మంచి హోదాలో నిలబెట్టాడు. ఎంతోమంది అభిమానులు నా సొంతం అయ్యేలా చేశాడు. ఇక, ఈ ఏడాదైతే ఫుల్‌గా ఆశీర్వదించేశాడు. అలా ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం నా చేతిలో ఉన్నవన్నీ మంచి సినిమాలే. ఈ సినిమాల తాలూకు ఫలితం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాను. అందుకే, విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సమంత అంటున్నారు. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. విడిగా బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారామె. అలా చేయడానికి ప్రేరణగా నిలిచింది మా అమ్మగారే అని సమంత చెబుతూ - ‘‘ఒకప్పుడు మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అయినప్పటికీ మా అమ్మగారు ఇతరులకు సహాయం చేసేవారు. నా కలలో కూడా నాకు దేవుడు బోల్డంత డబ్బులిస్తాడనుకోలేదు. కానీ, ఇచ్చాడు. అందుకే, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే.!
-
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!
-
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!
* ఖమ్మం జిల్లాకు చెందిన కృష్ణయ్య, గోపమ్మ దంపతులు * 2006లో మా చిన్న కూతురు గుంటూరులో తప్పిపోయింది * అప్పుడు ఆమె వయసు పదేళ్లు * గీత మమ్మల్ని చూస్తే గుర్తుపడుతుంది * ప్రభుత్వం ఆమె వద్దకు చేర్చేందుకు సహకరించాలి జూలూరుపాడు: పాకిస్తాన్లో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తుపడుతుందని వారంటున్నారు. ఇటీవల టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాలలో గీత అంశం విస్తృతంగా ప్రచారమవుతుండటంతో వాటిని ఈ దంపతులు చూశారు. 2006లో తప్పిపోయిన తమ కూతురు రాణియే ఆ బాలిక అని వారు ఆదివారం విలేకరులకు తెలిపారు. గత 13 ఏళ్లుగా పాక్‌లోని ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో గీత ఉంటుందన్న సంగతి తెలిసిందే. పదేళ్ల వయసులో ఆమెను పంజాబ్ రేంజర్స్ తీసుకువచ్చి తమకు అప్పగించారని ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘2006 జనవరి 27న ఏసు సువార్త సభలకు గుంటూరు జిల్లాకు నలుగురు కూతుళ్లను తీసుకొని వెళ్లాను. మరుసటి రోజు చిన్నకూతురు రాణి తప్పిపోయింది. అప్పటికి రాణికి పదేళ్లు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ వెతికినా రాణి ఆచూకీ దొరకలేదు. మాకు నలుగురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి రాజమ్మకు మతిస్థిమితం లేదు. రెండో కూతురు జ్యోతికి వివాహం అయింది. మూడో కూతురు పద్మ బీఎస్సీ చదువుతోంది. చిన్న కూతురు రాణి పుట్టుకతోనే మూగ. ఏమీ చదువుకోలేదు’’ అని గోపమ్మ తెలిపారు. రాణి నుదుటిపై పుట్టమచ్చ ఉందని, చేతులకు పులిపిర్లు ఉన్నాయని, మెల్ల కన్ను ఉందని వివరించారు. ఇటీవల టీవీలు, పేపర్లల్లో చూసిన గీతకు రాణి పోలికలే ఉన్నాయని చెప్పారు. గీత తమ కూతురే అని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భగా దంపతులు రాణి ఎనిమిదేళ్ల నాటి ఫొటోను చూపించారు. తమను చూస్తే గీత గుర్తుపడుతుందని, ప్రభుత్వం ఆమె వద్దకు చేర్చే ప్రయత్నం చేయాలని కోరారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమన్నారు. ఈ దంపతులకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
163 మంది భారత జాలర్ల విడుదల
కరాచి: పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 163 మంది భారత జాలర్లకు ఆదివారం విముక్తి లభించింది. ఇటీవల రష్యాలో ఇరు దేశ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్‌ల మధ్య జరిగిన ఒప్పందం మేరకు లంధి, మలిర్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జాలర్లను పాక్ విడుదల చేసింది. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. లాహోర్ మీదుగా వాఘా సరిహద్దులో సోమవారం భారత అధికారులకు అప్పగించనున్నారు. జాలర్లు తిరిగి భారత్‌కు వచ్చే సందర్భంగా అక్కడి స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్రాలు బహుమతులతో పాటు దారి ఖర్చుల కోసం కొత్త మొత్తాన్ని ఇచ్చాయి. ఇరు దేశ ప్రధానుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా దేశాల్లో బందీలుగా ఉన్న జాలర్లను 15 రోజుల్లోగా వారి బోట్లతో సహా విడుదల చేయాలి. దీని ప్రకారం పాక్ జైళ్లలోని 355 మంది భారత జాలర్లు, భారత జైళ్లలోని 27 మంది పాక్ జాలర్లకు విముక్తి లభించనుంది. -
మానవ సేవే.. మాధవ సేవ
మాజీ మంత్రి వైఎస్ వివేకా పులివెందుల : మాధవ సేవే.. మాధవ సేవ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విద్యాధరి హైస్కూలులో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందులలో 200 మంది సభ్యులతో ఈ సంస్థ ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఏళ్లలోపల 500 మంది సభ్యులు చేరేలా మనమందరం కృషి చేయాలన్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అంతకమునుపు సంస్థ కార్యాలయాన్ని లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అమల్‌రాజ్ ప్రారంభించారు. పులివెందుల మానవత సంస్థ డెరైక్టర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ 2004లో తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా 108 మంది సభ్యులతో స్థాపించారన్నారు. అనంతరం డెరైక్టర్లుగా సాంబశివారెడ్డి, వరప్రసాద్, రామచంద్రారెడ్డి, వెంకటస్వామిరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, థామస్‌రెడ్డి, కొండారెడ్డి, శంకర్‌నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, సలహా సంఘం కమిటీ సభ్యులుగా సుబ్బారెడ్డి, సుధాకర్‌రెడ్డి, చిన్నప్ప, మల్లేశ్వరరెడ్డి, చలమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వెంకటనాథరెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డిలు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ పాల్ అంకిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్ వరప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రేమ.. క్షమ.. దాతృత్వం
►పవిత్ర ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త పేర్కొన్నది ఇవే.. ►నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం మతం ఏదైనా చెప్పే నీతి ఒక్కటే. మనిషిగా పుట్టినవారు సన్మార్గంలో నడవాలని. ముస్లింల పవిత్ర ఖురాన్లో మహ్మద్ ప్రవక్త దీన్నే ప్రస్తావించారు. రుజు మార్గాలను చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఖురాన్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించింది. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారంతో ఉంటారు.శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లింలు ఉపవాసాలకు సిద్ధమవుతున్నారు. - కనిగిరి రోజా(ఉపవాస దీక్ష) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానీయాలు ముట్టకుండా(కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. లాలాజలంకూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని(రోజా) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహార్ అని, సూర్యాస్తమయం తర్వత ఇఫ్తార్ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైనా ఫలాహారం తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలపాటు ఉమ్మి కూడా మింగకుండా కఠోర దీక్ష చేస్తారు. రోజా పాటించేవారు మనసును భగవంతునిపై లగ్నంచేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. తద్వారా భగవంతునిపై భక్తి, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానం అనే భావన పెంపొందుతుంది. పేద, ధనిక, స్త్రీ, పురుష అనే తారతమ్యం లేకుండా ముస్లింలంతా రోజాను ఆచరిస్తారు. అంతేగాక రంజాన్ నెలలో మరికొన్ని ముఖ్య నియమాలను కూడా ముస్లింలు నిబద్ధతతో పాటిస్తారు. జకాత్ ముస్లింలలో మరీ ముఖ్యమైన సంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దాన, ధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్ ప్రధాన ఉద్దేశం. జకాత్ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలో గానీ, నగదు రూపంలో గానీ దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్ నెలలోనే జకాత్ ఇస్తారు. ఫిత్ర్ రంజాన్ మాసం చివరి రోజున జరుపుకునే పర్వదినం ఈద్-ఉల్-ఫిత్.్ర దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్(్రదానం) ఇస్తారు. ప్రతిఒక్కరూ కనీసం రెండు కిలోల గోదుమలు లేదా దానికి సమాన మైన ఇతర ఆహార ధాన్యాలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటు లేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దాన, ధర్మాలను ఇస్లాం మతం ఉద్బోధిస్తుంది. ఎహ్ తే కాఫ్ ముస్లిం సోదరులు రోజూ ఐదుసార్లు నమాజ్(ఉదయం ఫజర్, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం 5 గంటలకు అసర్, రాత్రి 6.30 గంటలకు మగ్రీబ్, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్) చేస్తారు. అయితే రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత, ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్లు తరావీహ్ నమాజ్ చేస్తారు. ఈ నెలలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు ఎ్హ తే కాఫ్(తపోనిష్ట) పాటిస్తారు. మసీద్‌లోనే పూర్తి సమయాన్ని గడపుతూ.. ప్రార్థనల్లో దివ్య ఖురాన్(దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే మసీద్ నుంచి బయటకు అడుగుపెడతారు. షబ్ ఎ ఖద్ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు షబ్ ఎ ఖద్.్ర ఈ నెలలో 27వ రోజున దివ్వ ఖురాన్ ఆవిర్భవించిందని ప్రతీతి. ఆ రోజును షబ్ ఎ ఖదర్‌గా పిలుస్తారు. షబ్ ఎ ఖద్ ్రరాత్రంతా నమాజ్‌తో జాగారం చేస్తారు. ఈ ఒక్కరాత్రి కఠోర దీక్షతో చేసిన ప్రార్థన వల్ల లభించే ఫలితం మనిషి జీవితంలో 83 ఏళ్లపాటు చేసిన ఉపవాస దీక్షతో సమానమని, షబ్ ఎ ఖద్ ్రరోజున దైవ ద్యానంలో గడిపితే జీవితంలో తెలియక చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడనేది ముస్లింల నమ్మకం. ఇఫ్తార్ ప్రత్యేకత రంజాన్ మాసంలో ముస్లీంసోదరులు ఉపవాసదీక్షను విరమింప చేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్ అంటారు. ఈ ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్ విందును.. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తుంటారు. -
మోసాలు ఆన్.. లైన్లో
రకరకాలుగా మోసగాళ్ల వల అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ పేరిట శ్రీనివాస్‌కు ఫోనొచ్చింది. ‘‘ఓ పసిపాప తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. వైద్యం కోసం మేం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నాం. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నాం. మీరూ సహకరించండి’’ అనేది ఆ కాల్ సారాంశం. అంతేకాదు! ఆ పాప చేత కూడా ఫోన్ చేయించారు సదరు ప్రతినిధులు. ‘‘నీ వివరాలు మెయిల్ చేస్తే నేనేం చేయగలనో ఆలోచిస్తా’’ అన్నాడు శ్రీనివాస్. కాసేపటికి ఆన్లైన్లో సదరు స్వచ్ఛంద సంస్థ కోసం గాలించాడు. బోలెడంత మంది తాము మోసపోయామంటూ పెట్టిన పోస్ట్‌లు కనిపించాయి. దీంతో అదెంత పెద్ద మోసమో అర్థమైంది శ్రీనివాస్‌కి. ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజానికి దేశ వ్యాప్తంగా ఇపుడు జరుగుతున్న మోసాలకు లెక్కలేదు. ఆన్లైన్ ప్రపంచం గురించి పెద్దగా తెలియని వారంతా ఈ మోసగాళ్ల వలలో ఈజీగా పడిపోతున్నారు. నిజానికిది అబద్ధాలు చెప్పి అమ్మటంకన్నా దారుణం. ఎందుకంటే అబద్ధాలు నమ్మి ఒక ఉత్పత్తి కొంటే మన డబ్బు ఇరుక్కుపోవటమో, తగిన లాభాలు రాకపోవటమో మాత్రమే జరుగుతుంది. కానీ ఇలాంటి మోసాలకు గురైతే ఇక డబ్బు తిరిగిరాదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతాయి? వాటి బారిన పడకుండా అనుసరించాల్సిన మార్గాలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ కథనం... నకిలీ ఉద్యోగాల ఆఫర్లు... దేశంలో లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఇదే ఈ నకిలీ ఉద్యోగాల పుట్టుకకు మూలం. వీళ్లు మోసం చేసే పద్ధతేంటంటే... మొదట మీకో ప్రముఖ కంపెనీ పేరిట ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తూ ఈ-మెయిల్ వస్తుంది. అందులో ఇంటర్వ్యూ స్థలం, తేదీ, ఫోన్ నంబర్లు అన్నీ ఉంటాయి. చివర్లో... మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గానో, బేసిక్ ఫీజుగానో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, దాన్ని తరవాత తిరిగి ఇచ్చేస్తామని ఉంటుంది. మన దేశంలో ఉన్న నిరుద్యోగం దృష్ట్యా చాలా మంది తేలిగ్గా ఈ వలలో పడిపోతుంటారు. కంపెనీ లోగో వంటివన్నీ ఉండి, చదువుతున్నపుడు ఈ మెయిల్లు చాలా నిజమైనవిగా కనిపిస్తాయి. ఇటీవలే బెంగళూరులో నర్సు ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన ఓ నైజీరియన్ ముఠాను సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బ్రిటన్‌లో ఉద్యోగాల పేరిట ఈమెయిళ్లు పంపించింది ఈ ముఠా. దీనికి స్పందించిన ఓ నర్సు... యూకేలోని ఈలంగ్ ఆసుపత్రిలో ఉద్యో గం ఉందంటే తన రెజ్యుమె పంపింది. దాంతో ఆమె నంబరుకు ఫోన్ చేసిన ముఠా... యాంటీ టైస్ట్, డ్రగ్ ట్రాఫికింగ్ సర్టిఫికెట్ల కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, స్కిల్డ్ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్ల కోసం రూ.11,03,500 డిపాజిట్ చేయాలని కోరింది. అలానే చేసిన ఆమె... ఆ తరవాత తెలుసుకుంది తాను మోసపోయానని. స్వచ్ఛంద సంస్థల పేరిట... ఇంటర్నెట్లో ‘రిలీఫ్ ఇండియా ట్రస్ట్ స్కామ్’ అని కొట్టి చూడండి. ఈ స్వచ్ఛంద సంస్థ పేరిట ఎంతమందికి ఫోన్లొచ్చాయో అర్థమవుతుంది. వైద్య సాయం అవసరమైన పలువురు పిల్లల కోసం నిధులు సేకరిస్తున్నామనే పేరిట ఈ సంస్థ ఫోన్లు చేస్తోంది. నిజానికది రిజిస్టరయిన స్వచ్ఛంద సంస్థే. కానీ దాని ఉద్దేశాలు మాత్రం వేరు. పసిపాప వెంటిలేటర్‌పై ఉందని, మరోపాప చదువుకోసమని, మరో అర్ధగంటలో సర్జరీ చేయాలని... ఇలా రకరకాల కారణాలు. అయితే అన్ని స్వచ్ఛంద సంస్థలూ ఇలా చేస్తాయని కాదు. ఒకటి రెండు చేసినా... ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మాత్రం తప్పనిసరి. ఐఆర్డీఏ నుంచి కాల్ చేస్తున్నామంటూ... ప్రస్తుతం ఇది సహజమైపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఇన్వెస్టర్‌కూ ఏదో ఒక బీమా తప్పనిసరిగా ఉంటుంది. ప్రత్యేకించి ఎల్ఐసీ నుంచి. దీన్ని అదనుగా తీసుకున్న మోసగాళ్లు... తాము ఐఆర్డీఏ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ, చాలా ఏళ్లుగా బీమా మొత్తం కడుతున్నందుకు మీ బీమా పాలసీ బోనస్‌కు ఎంపికైందని, ఇది క్లెయిమ్ చేయాలంటే మీరు కొంత మొత్తం చెల్లించాలని చెబుతారు. లేదంటే కొత్త పాలసీ తీసుకోవాలని చెబుతారు. చాలా సందర్భాల్లో వారు మీ గురించి పలు వివరాలు చెబుతారు. దీంతో అదంతా నిజమైన సంభాషణలానే అనిపిస్తుంది. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు వీటి వలలో పడిపోతారు. సెబీ లాంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లు ఇలాంటి వాటి వలలో పడొద్దని ప్రకటనలిస్తున్నాయి. వెరిఫికేషన్ పేరిట బ్యాంకుల ఫోన్లు... చాలామంది ఇన్వెస్టర్లకు ఇది కొత్త రకం మోసమే. పెద్దగా అవగాహన లేని ఇన్వెస్టర్లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అప్పుడే వాడుతున్న వారిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు వస్తుంటాయి. మోసగాళ్లు తమను తాము బ్యాంకు వెరిఫికేషన్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. మీ డెబిట్/ క్రెడిట్ కార్డు నంబరు, చెల్లుబడి గడువు, సీవీవీ నంబరు... ఇలాంటివన్నీ అడుగుతారు. మీరు చెబుతున్నపుడే వారొక లావాదేవీ జరుపుతుంటారు. ‘‘మీ ఫోన్‌కు ఇపుడు ఒక పాస్వర్డ్ (ఓటీపీ) వచ్చింది... అది కాస్త చెబుతారా’’ అని అడుగుతారు. అమాయకంగా అదికూడా చెబితే... అంతే సంగతులు. లావాదేవీ పూర్తయి బిల్లు మీ చేతికొస్తుంది. చేయాల్సిందేమంటే... మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎప్పుడూ, ఎవ్వరికీ చెప్పొద్దు. సీవీవీ నంబరు, ఓటీపీ వంటివి అసలే చెప్పొద్దు. చాలాసార్లు పెట్రోలు పంపులు, రెస్టారెంట్లలో కార్డు ఇచ్చి నంబరు వాళ్లకు చెప్పటం జరుగుతుంటుంది. 99.9 సందర్భాల్లో ఏమీ జరగదు. కానీ ఎక్కడో 0.1% మాత్రం ఇలాంటివి జరుగుతుంటాయి. మన టైమ్ బాగాలేక ఆ 0.1%లోనే మనముంటే..!! అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. బ్యాంకు వివరాల తనిఖీ పేరిట ఫిషింగ్... ఫిషింగ్ అనేది ఆన్లైన్ ప్రపంచంలో అత్యంత సహజమైన మోసం. దీన్లో మోసగాళ్లు చేసేదేమంటే... వెరిఫికేషన్ పేరిట మీ బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతూ మీకొక మెయిల్ వస్తుంది. దాన్ని పూర్తి చేసి పంపించని పక్షంలో మీ ఖాతా క్లోజ్ అయిపోతుందనే హెచ్చరిక కూడా అందులో ఉంటుంది. ఆ దిగువనే... మీ బ్యాంకు లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ లింక్‌ను క్లిక్ చేసినట్లయితే... అప్పుడు అచ్చం మీ బ్యాంకు వెబ్సైట్ పేజీని పోలి ఉండే మరో వెబ్సైట్ కనిపిస్తుంది. అచ్చం మీ బ్యాంకు వెబ్‌సైట్‌లానే ఉండటంతో అనుమానం రాదు. అక్కడ మీ వివరాలన్నీ నమోదు చేశాక... ఆ వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. నిజానికి అదంతా మీ వివరాలు తెలుసుకోవటానికి పన్నిన పన్నాగం. అలా సేకరించిన వివరాలతో తదనంతరం వారే నేరుగా లావాదేవీలు నిర్వహిస్తారు. చేయాల్సిందిదీ... ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ బ్యాంకూ మీ పిన్ నంబరు అడగదు. ఏ బ్యాంకూ ఎప్పుడూ మీ పాస్‌వర్డ్‌ల వంటివి తమకు ఇవ్వాలని అడగదు. అవన్నీ లావాదేవీ జరిపేటపుడు మీకు మీరుగా నమోదు చేయాల్సినవే తప్ప వేరొకరికి ఇచ్చేవి కావు. తెలుసుకునేదిలా... అయితే ఇక్కడో విషయం గమనించాలి. మీకు వచ్చిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది చూసినా...వాళ్లిచ్చిన వెబ్సైట్ లింక్ చూసినా విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే అది నిజంగా సదరు కంపెనీ అధికారిక మెయిల్ నుంచి వచ్చిందయి ఉండదు. పెపైచ్చు ఇంటర్వ్యూకి పిలిచిన ఏ కంపెనీ కూడా డబ్బులు డిపాజిట్ చేయమని అడగదు. -
దొంగ ‘దాతృత్వ’ సంస్థలపై ఐటీ కన్ను
న్యూఢిల్లీ: దాతృత్వం(చారిటీ) ముసుగులో ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అక్రమ సంస్థలను గుర్తించాలని ఐటీ శాఖను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి పటిష్ట ఆధారాలను సంపాదించాలని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇలాంటి అక్రమ చారిటీ సంస్థల వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ నష్టం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి అక్రమ చారిటీ సంస్థలు ఏవి? సక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చారిటీల ఏవి? అన్న విషయాన్ని నిర్థారించుకోవడం కష్టమే అయినా... దీనికి ఒక సవాలుగా పన్ను అధికారులు స్వీకరించాలని సీబీడీటీ సూచించింది. వ్యత్యాసాన్ని గుర్తించడంలో అధికారులందరూ తమ అనుభవాలను వినియోగించుకోవాలని తెలిపింది. -
8 పాయింట్స్
నందనా సేన్ నమ్మకం మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎవరికి మాత్రం ఉంటుంది? అందుకే ఏ పని చేయాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. చెప్పొచ్చేదేమిటంటే నమ్మకం అనేది పదం కాదు...విజయానికి అవసరమైన పెట్టుబడి. కాలం ‘నా కెరీర్లో నిండా కూరుకుపోయాను’ అంటుంటారు. ఇది మంచిదా కాదా అనే విషయం పక్కనపెడితే ఎప్పుడూ ఒకే దిక్కు కాకుండా ఇతర దిక్కులపై కూడా దృష్టి సారించాలి. అప్పుడే సమాజానికి ఉపయోగపడే స్వచ్ఛందసేవా కార్యక్రమాలు చేయగలము. ఎజెండా అమలుపరిచే విధానం, సాధనం కంటే ‘ఎజెండా’ ముఖ్యమైనది. నాన్నగారు (అమర్త్యసేన్) తన భావాలను పంచుకోవడానికి ఆర్థికశాస్త్రం ఉకరణంగా ఉన్నట్లే, నా భావాలను పంచుకోవడానికి ‘కళ’ అనేది ఉపకరణం. పరిమితి మనకు మనమే పరిమితులు విధించుకుంటాం. బాంబేలో ‘బ్లాక్’ సినిమాలో నటిస్తున్నప్పుడు ‘మీరు హార్వర్డ్ టాపర్ కదా! సినిమాల్లో నటించడమేమిటి?’ అని ఆశ్చర్యంగా అడిగేవారు. నేను రచయితను, యాక్టివిస్ట్‌ను కూడా. ‘మీరు నటి కదా రాయడం ఎందుకు?’ అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే... ఒక ప్రతిభ మరో ప్రతిభను నియంత్రించకూడదు అనుకుంటాను. సహజం ‘నా ప్రతిభను గట్టిగా చాటుకోవాలి’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకుంటే ప్రతిభ మాట ఎలా ఉన్నా ఒత్తిడి అనేది రెక్కలు విరుచుకుంటుంది. ఏదైనా సహజంగానే జరగాలి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా ప్రతిభ చూపగలుగుతాము. సంతృప్తి పిల్లల హక్కుల కోసం పనిచేయడం, పిల్లల్ని వినోదపరచడం కోసం రచనలు చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చే పని. ‘లవ్ బుక్’ అనే పిల్లల పుస్తకం ఒకటి రాశాను. వ్యూహం ‘నా కెరీర్ ఇలా ఉండాలి అలా ఉండాలి’ అని ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన స్ట్రాటజీ ఏర్పర్చుకోలేదు. మూసదారిలో వెళ్లిపోకుండా కొత్తదనం కోసం ప్రయత్నించడమే నా నిజమైన స్ట్రాటజీ. హ్యాపీలైఫ్ నా దృష్టిలో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం అంటే... నమ్ముకున్న విలువల కోసం నచ్చినట్లు బతకడం, సమాజం కోసం మనవంతుగా ఏదో ఒకటి చేయడం. -
ఈ అమ్మాయిలు చైతన్యదీపికలు!
బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియని చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ‘వాయిస్ 4’ చలువ వల్ల కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. సరికొత్తగా తమను తాము పునర్నిర్మించు కుంటున్నారు. ‘వాయిస్ 4 గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థ(హైదరాబాద్) ప్రతి యేటా చలికాలం, వేసవి కాలాల్లో బాలికల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో క్యాంపులు నిర్వహిస్తుంది. క్యాంపులో నృత్యం, గానంతో పాటు గుర్రపు స్వారీ, స్పోకెన్ ఇంగ్లీష్, ఉపన్యాస మెలకువలు, నాయకత్వ లక్షణాలు.. మొదలైనవి నేర్పిస్తారు. వ్యక్తిత్వవికాసానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. రెండు వారాల నుంచి నాలుగు వారాల పాటు కొనసాగే ఈ క్యాంపులలో కాలేజి విద్యార్థులు, ఉపాధ్యాయలు, కౌన్సెలర్లు పిల్లలకు పాఠాలు చెబుతారు. ‘‘ఒక అమ్మాయిని చైతన్యవంతం చేయగలితే ఆ అమ్మాయి తన కుటుంబాన్ని, సమాజాన్ని చైతన్యవంతం చేయగలదు’’ అని నమ్ముతుంది వాయిస్ 4 గర్ల్స్. -
సంబరాల సంస్కృతి
బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఈస్ట్‌మన్ కలర్ పిక్చర్స్ వరకూ.. లేడీస్ క్లబ్ సీన్లు చాలానే చూశాం. సినీఫక్కీలో చెప్పాలంటే లేడీస్ క్లబ్ అంటే.. చారడేసి కళ్లు కనిపించకుండా బారడేసి గాగుల్స్.. ఖరీదైన రిస్ట్ వాచ్..ఆపై హ్యాండ్‌బ్యాగ్ వేసుకున్న అతివలే కళ్లముందు కదలాడతారు. ‘ఓ పదివేలు కావాలి.. మా క్లబ్ తరఫున ఈవెంట్ చేస్తున్నాం’ అని పతిదేవుడ్ని పట్టుపట్టి చెక్కుపట్టే క్యారెక్టర్లు మనకు ఎప్పుడో పరిచయం. కానీ సంస్కృతి లేడీస్ క్లబ్ మాత్రం ఇందుకు భిన్నం. సుమారు మూడు దశాబ్దాల కిందట పురుడుపోసుకున్న ఈ క్లబ్.. సంస్కృతి, సంప్రదాయాలకు కేరాఫ్‌గా నిలుస్తూ, చారిటీకి వెన్యూగా మారుతోంది. ..:: ఎస్.సత్యబాబు ఏడుగురితో(కుముద్, సరోజ్ రోహిత్(లేటు), రేణుజీవన్, లతాకపాడియా, లీలమ్ కపాడియా, కోకిలా కడాకియా, వీణాదేశాయ్) 1987లో మొదలైంది సంస్కృతి. దాదాపు 3 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ లేడీస్ క్లబ్ పలు ఈవెంట్లతో సిటీలో సందడి చేస్తోంది. సార్ధక నామం.. పోష్ లైఫ్ స్టయిల్, పబ్ ఈవెంట్లు, స్టార్ హోటల్స్ ఎక్స్‌పోలు వీటిలో ఏది లేకపోయినా అది లేడీస్ క్లబ్ కానేకాదనే పరిస్థితిలో.. సంస్కృతి మాత్రం పేరుకు తగ్గట్టే ఈ శైలికి భిన్నం. ‘ఇండియన్ కల్చర్‌ని ప్రమోట్ చేయడంలో మహిళల బాధ్యత సుస్పష్టం. అందుకు మా క్లబ్ కట్టుబడి ఉంది’ అని చెప్తారు డాక్టర్ కుముద్దారియా. మన సంస్కృతిని మనం కాపాడుకుంటూనే మోడ్రన్ వరల్డ్‌లో మమేకం కావాలనేది తమ లక్ష్యమంటున్నారు. సెలక్టివ్ మెంబర్స్.. క్లబ్ స్థాపించిన తొలి ఏడాది 40 మంది సభ్యులు చేరారు. ప్రస్తుత సంఖ్య 152 మాత్రమే. ‘ కుల మతాలకు అతీతంగా మంచి ఆలోచనలు, వ్యక్తిత్వం, సోషలైజింగ్పై ఆసక్తి, వ్యక్తిగత పేరు ప్రతిష్టలు.. ఇలాంటి వాటికి ప్రాధాన్యమిస్తూ మెంబర్షిప్స్ ఇస్తున్నాం. మా క్లబ్లో మార్వాడీలు, గుజరాతీలు, మరాఠీలు, పంజాబీలు, జైన్లు, తెలుగువాళ్లు.. ఇలా భిన్న సంస్కృతులకు చెందిన వాళ్లున్నారు’ అని చెప్పారు కుముద్. నెలవారీగా ఏర్పాటు చేసే 10 సమావేశాల్లో కుకరీ క్లాసెస్, ఫ్యాషన్ షోల వంటి సరదా ఈవెంట్లుంటాయి. దేశ విదేశాల్లోని భిన్న రంగాలకు చెందిన విజయవంతమైన వ్యక్తుల్నిఆహ్వానించి వారి సక్సెస్ స్టోరీలను, ఎదుర్కున్న ఆటుపోట్లను తమ సభ్యులకు వివరించి, ఆ సమావేశాలను స్ఫూర్తిదాయకంగా మలుస్తున్నామని వివరించారు. సానియామీర్జా, రేణుకాచౌదరి, స్మృతి ఇరానీ, స్వామి చిన్మయానంద, సోను నిగమ్, తేజ్‌దీప్‌కౌర్, కిరణ్‌బేడీ తదితర ప్రముఖులెందరో తమ క్లబ్‌కు అతిథులుగా విచ్చేసి.. తమ అనుభవాలను పంచుకున్నారని ఆమె చెప్పారు. సేవా‘శిఖర’మ్.. క్లబ్ ఆధ్వర్యంలో విభిన్న చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మానసిక వికలాంగ బాల బాలికల కోసం బేగంపేట, ప్రకాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘సంస్కృతి శిఖర’ స్కూల్ గురించి. ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల సంఖ్య సిటీలో గణనీయంగా పెరుగుతున్నా, తగిన సంఖ్యలో స్కూల్స్ లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2000 సంవత్సరంలో ఈ స్కూల్ నెలకొల్పాం. ఇప్పుడు ఇందులో 75 మంది విద్యార్థులున్నారు. అన్ని స్కూల్స్లాగానే సిలబస్, ఎగ్జామ్స్ వంటివన్నీ నిర్వహిస్తున్నాం’ అని కుముద్ తెలిపారు. స్పీచ్ థెరీపీ, ఫిజియోథెరపీలతో పాటు ఈ చిన్నారులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తోడ్పడే విధంగా పేపర్బ్యాగ్స్ వంటి వినియోగ వస్తువుల తయారీని నేర్పిస్తున్నారు. అన్ని రకాల వసతులతో, మామూలు స్కూళ్లకంటే ఎంతో మెరుగ్గా దీన్ని వీరు నిర్వహించడం చూస్తే అబ్బురమనిపిస్తుంది. క్లబ్ సభ్యుల్లో పలువురు టీచర్లుగా సైతం అవతారమెత్తి చిన్నారులకు బోధనా సేవలు అందిస్తున్నారు. ‘సంగీతం వచ్చినవారు సంగీతం, డ్యాన్స్ వచ్చిన వారు డ్యాన్స్.. నేర్పుతున్నారు. కొందరు సభ్యులు ఒక్కో చిన్నారి చొప్పున దత్తత తీసుకుని బాగోగులు చూసుకుంటున్నారు’ అంటూ వివరించారు సంస్కృతి క్లబ్‌కు చెందిన వందన షెట్టి. తమ నెలవారీ మీటింగ్స్‌లో ఒకటి తప్పకుండా స్కూల్లో ఏర్పాటు చేస్తామని, ఈ సందర్భంగా పిల్లల కోసం పిల్లల చేత కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తామని చెప్పారామె. తమ పాఠశాల పిల్లలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పలు పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ వందనాగౌడ్ వివరించారు. భవిష్యత్తు లక్ష్యాలివే.. తమ కార్యక్రమాలు నిర్విరామంగా జరిపేందుకు మూడేళ్లకు ఒకసారి ఫండ్‌రైజింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తామంటున్న కుముద్.. ఆధునిక యువతుల్లో సంస్కృతి సంప్రదాయాల పట్ల చైతన్యం పెంచడం, అదే సమయంలో ప్రపంచవ్యాప్త అవకాశాలు అందుకునేందుకు చేయూతనివ్వడం.. మానసిక వికలాంగ చిన్నారులకు అందిస్తున్న సేవలను విస్తృతం చేయడం వంటివి తమ భవిష్యత్ లక్ష్యాలుగా వివరించారు. -
సాహియరింగ్ ఈజీ
వినికిడి సమస్య చాలా విచిత్రమైంది. చక్కటి చుక్కల్లా ఉండే చిన్నారులు వినికిడి, మూగ... సమస్యల బారిన పడి వికలాంగులవుతారు. ఇలాంటి సమస్య ఆడపిల్లలకు వస్తే అది మరింత వేదనకు కారణమవుతుంది. కారణం... మన సమాజంలోని వివక్ష. ఆడపిల్లలంటే చిన్నచూపు. వైద్యంలోగానీ, విద్యావకాశాల్లోగానీ... ముందుగా మగపిల్లలకే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆడపిల్లలకు మూగ, చెవుడు సమస్యలు వస్తే వారు మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితి. ఇకపై అలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టింది ‘సాహీ’. ‘సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్’ అనే స్వచ్ఛంద సంస్థకు సంక్షిప్త రూపమే ఈ ‘సాహి’. ఇది చేపట్టిన సరికొత్త కార్యక్రమమే ‘హియరింగ్ ఇంపెయిర్డ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్’. ఈ కార్యక్రమ వివరాలు ఇవి... - యాసీన్ పదేళ్ల కిందట 2004 నవంబర్‌లో సాహి సంస్థ ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈ.సీ. వినయకుమార్ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. కొంతమంది ఈఎన్టీ సర్జన్లు, ఆడియాలజిస్టులు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యం, సేవా దృక్పథం గల కొందరు ప్రముఖులతో ఈ సేవా సంస్థ ఆవిర్భవించింది. వినికిడి, మూగ సమస్యలను పరిష్కరిస్తూ... వారికి ఉచిత వైద్యసహాయం అందిస్తోందీ సంస్థ. అనేక సహాయ కార్యక్రమాల్లో ‘సాహి’ ‘సాహి’ ఆవిర్భవించిన నాటి నుంచి సమాజంలో... మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో వినికిడి శక్తి లేని వారిని గుర్తించి, వారికి వైద్య సహాయం అందించడంలో తోడ్పడుతూ వస్తోంది. కాక్లియర్ ఇంప్లాట్స్ అమర్చి శస్త్రచికిత్స చేయడం, చెవికి సంబంధించిన మైక్రో సర్జరీలను నిర్వహించడం, వినికిడి మిషన్లు ఉచితంగా ఇవ్వడం, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్ (బాహా) వంటి శస్త్రచికిత్సలను చేయడం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు కూడా వినికిడి సమస్య ఉందో లేదో తెలుసుకునే స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇప్పటికే ఇరురాష్ట్రాల్లోనే గాక... పాకిస్థాన్ వంటి ఇరుగుపొరుగు దేశాల నుంచి కూడా దాదాపు 2,500కు పైగా పిల్లలకు వినికిడి సమస్యను శాశ్వతంగా దూరం చేశారు ‘సాహీ’ నిర్వాహకులు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సహకారంతో అత్యంత వ్యయభరితమైన (దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల విలువైన) కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో చేర్చేలా చొరవతీసుకుంది సాహి. ‘‘మొదటిసారిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సంయుక్తరాష్ట్రంలో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీలో భాగం చేశాక... ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలూ... అప్పటి మన సంయుక్తరాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని... తమ తమ రాష్ట్రాల్లోనూ ఈ శస్త్రచికిత్సను వారి వైద్య సహాయ కార్యక్రమాల జాబితాలో చేర్చారు. మేం శస్త్రచికిత్స నిర్వహించి... వినికిడి, మాట శక్తిని ప్రసాదించిన ఒక అమ్మాయి... యువతిగా ఎదిగి, ఎన్నో విజయాలను నమోదు చేస్తూ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెయిన్స్ పాసయ్యింది’’ అని సంతోషంగా వివరించారు ‘సాహి’ కార్యదర్శి, ఈఎన్టీ శస్త్రచికిత్సా నిపుణులు, అపోలో ఆసుపత్రుల ఈఎన్టీ విభాగాధిపతి అయిన ఈ.సీ. వినయకుమార్. సాహీ సేవల వల్ల ప్రయోజనం పొందుతున్న వారు సాధిస్తున్న విజయాలకు ఇదొక తార్కాణం. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం... ప్రస్తుతం ‘సాహి’ని స్థాపించి దశాబ్దం గడిచిన సందర్భంగా మరో కొత్త ప్రాజెక్టును చేపట్టిందీ సంస్థ. ‘హియరింగ్ ఇంపెయిర్డ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్’ అనే పేరుతో చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్టు కింద 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు వినికిడి సమస్యలుంటే వారికి కాక్లియార్ ఇంప్లాంట్ పరికరాలు అమర్చడం వంటి ఉపకరణాలతో కూడిన శస్త్రచికిత్సలు చేయడం, అత్యంత సంక్లిష్టమైన మైక్రో ఇయర్ సర్జరీలు నిర్వహించడం వంటి వైద్య సహాయాలను పల్లెల్లోని ఆడపిల్లలకు అందిస్తారు. ‘‘వినికిడి లోపాలు అనేక రకాలు. అది ఏరకమైన వినికిడి సమస్య అయినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునికమైన వైద్య పురోగతితో అన్నిరకాల వినికిడి సమస్యలకూ పరిష్కారాలున్నాయి. అయితే లోపించిందల్లా... ఈ సమస్యలకు వైద్యపరమైన పరిష్కారాలు ఉన్నాయనే విషయంపై అవగాహన మాత్రమే. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువ. అందుకే మేం ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును చేపట్టాం’’ అని వివరించారు డాక్టర్ ఈ.సీ. వినయకుమార్. పైగా వినికిడి సమస్యను పిల్లల్లో ఎంత త్వరగా గుర్తించి, అది ఏరకానికి చెందినదన్న అంశాన్ని తెలుసుకుని, ఎంత త్వరగా చికిత్స అందిస్తే, అంతే త్వరగా వారికి వినికిడి సమస్య తీరుతుందీ... అందరిలాగే మాటలూ బాగా వస్తాయి. కొన్ని ఇతర దేశాల ఎన్జీవోలతో సంయుక్తంగా... సాహి చేపట్టిన ఈ ‘‘హియరింగ్ ఇంపెయిర్డ్ గర్ల్ ఛైల్డ్ ప్రాజెక్టుకు చెక్ దేశానికి (గతంలోని చెకొస్మోవేకియాలో ఒకటైన చెక్ రిపబ్లిక్) చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ‘‘పింక్ క్రోకడైల్’’ కూడా తనవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. మన దేశపు రాక్బ్యాండ్స్లో ప్రముఖమైన ‘‘ఇండియన్ ఓషియన్’’ రాక్‌బ్యాండ్ గ్రూపు వారు ‘సాహి’ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలకు సహాయం చేయడానికి కారణాలివే... మన సమాజంలో ఆడపిల్లలంటే ముందునుంచే కాస్త వివక్ష ఉంది. విద్యావకాశాలను కల్పించడంలో, వైద్యసహాయాలను అందించడంలో మొదటి ప్రాధాన్యాలను మగపిల్లలకే ఇస్తారు. దాంతో వినికిడి సమస్యలున్న వారు, మాటలు రాని మూగ అమ్మాయిలు వివక్ష తాలూకు వేదనను మౌనంగా అనుభవించాల్సిన పరిస్థితి. పైగా వారి వైకల్యాన్ని వెక్కిరిస్తూ సమాజపు సూటిపోటి మాటలను ఎదుర్కొనాల్సిన దుస్థితి. ఇక యుక్తవయసుకు వచ్చాక వాళ్లకు ఉపాధి కల్పనలోనూ, ఉద్యోగ విషయాల్లోనూ సమాజం వివక్ష చూపుతుంది. ఇలాంటి పిల్లల పెళ్లిళ్లు కావడం కూడా చాలా కష్టం. ఈ వైకల్యంతో పిల్లలను కన్నందుకు వాళ్ల తల్లిదండ్రులపైనా సమాజం వివక్ష చూపుతుంది. ఇలాంటి పిల్లలను పెళ్లి చేసుకోడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా... వైకల్యం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటున్నందుకు వారి తల్లిదండ్రులనుంచి పెద్ద ఎత్తున కట్నాన్ని ఆశిస్తారు. దాంతో ఆర్థికంగా కూడా ఈ పిల్లలు తల్లిదండ్రులకు భారమయ్యే అవకాశాలున్నాయి. వినికిడి సమస్యలున్న అమ్మాయిలు ఈ వెతలను అనుభవించే అవసరం లేకుండా చూసేందుకే ఈ బృహత్తరమైన ప్రాజెక్ట్‌ను చేపట్టింది సాహి. సహాయం పొందండి ఇలా... వినికిడి సమస్యలతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంతపు ఆడపిల్లలలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేందుకు ‘సాహి’ నిశ్చయించుకుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న పదిహేనేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు సాహీని సంప్రదించవచ్చు. ‘సాహీ’ ఫోన్ నెంబర్లు 040-23607777 ఎక్స్టెన్షన్ 3737/ 5805. మొబైల్ నెం. 9949044276. ఈ ఫోన్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఇక ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలంటే sahiearcare2004 @gmail.com కు తమ విజ్ఞాపనలు పంపవచ్చు. సాహి వెబ్సైట్ చిరునామా: www.sahiearcare.org. -
‘స్వచ్ఛంద’ మోసం
ఉద్యోగాల పేరుతో టోకరా పోలీసులను ఆశ్రయించిన బాధితులు సుమారు రూ.10 లక్షల మేరకు వసూలు చేశారని ఆరోపణ ఐదు జిల్లాల్లో మోసపోయిన నిరుద్యోగులు చౌడేపల్లె: స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. నగదు వసూలుచేసి మోసం చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. బాధితులు శుక్రవారం చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం చారాలకు చెందిన కొందరు యువకులు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. కుప్పంలో బ్రాంచ్ని ఏర్పాటుచేసి 40 మంది నిరుద్యోగులను గుర్తించి ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. వారికి పశువులకు సోకే వ్యాధుల నివారణపై సుమారు 40 రోజులపాటు కుప్పంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన యువకులు వచ్చారు. ఆ సమయంలో నిరుద్యోగులు సొంత ఖర్చులతోనే గడిపారు. ఆ తర్వాత శిక్షణ పూర్తయ్యిందని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.5 వేలు వసూలు చేశారు. నాబార్డు పథకం ద్వారా తమ సంస్థకు నిధులు వస్తాయని, ఎవరి గ్రామాల్లో పశువుల వ్యాధులు నయం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి పంపారు. టెక్నీషియన్ పోస్టులోఉన్నవారికి రూ.7,500, సూపర్వైజర్కు రూ.13 వేలు జీతం చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగం ఇచ్చామని చెప్పి గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా మొబైల్ సర్వీసుకోసం అందరూ ఫైనాన్స్‌లో మోటా ర్ సైకిళ్లు కొన్నారు. ఆ తర్వాత మూడు నెలలైనా స్టయిఫండు లేదు. జీతమూ రాలేదు. చివరకు శుక్రవారం చౌడేపల్లె పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూపర్వైజర్ పోస్టు కోసం రూ:35 వేలు తీసుకొన్నారు నాకు సూపర్ వైజర్ పోస్టు కేటాయిస్తున్నామని చెప్పి రూ:35 వేలు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులు డిమాండు చేయడంతో చెల్లించాను. ఉద్యోగం లేదు.. చివరికి అప్పులే మిగిలాయి.. ఎలాగైనా న్యాయం చేయాలి -రెడ్డెప్ప, పాలింపల్లె, చౌడేపల్లె మండలం. నమ్మితే నిలువునా ముంచేశారు పేదకుటుంబంలో పుట్టిన మాకు మాసొంత గ్రామాల్లోనే ఉద్యోగాలిచ్చి జీతాలిస్తామంటే వారిని నమ్మి నిలువునా మోసపోయాం. బమా ప్రాంతంలో ఎనిమిది మందికి ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు చేశారు. మాలాగా మోసపోయిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. -సునీల్‌కుమార్, ప్రొద్దుటూరు, వైఎస్సార్‌జిల్లా. 06పిజిఆర్33జెపిజి: చౌడేపల్లెలో పోలీసులకు ఫిర్యాధుచేస్తున్న బాధితులు. 06పిజిఆర్34జెపిజి: చౌడేపల్లెలో మోసపోయిన బాధితులు 06పిజిఆర్35జెపిజి: డబ్బులు తీసుకొన్నతరువాత సంస్థవారు ఇచ్చిన రశీదు 06పిజిఆర్36జెపిజి: జారీ చేసిన గుర్తింపు కార్డులు 06పిజిఆర్37జెపిజి: రెడ్డెప్ప, పాలింపల్లె, చౌడేపల్లె మండలం. 06పిజిఆర్38జెపిజి: సునీల్‌కుమార్, పొద్ద్రుటూరు, వైఎస్సార్‌జిల్లా. -
‘మిస్ సౌత్ ఏసియా-2014’
గ్లామర్‌కి సోషల్ రెస్పాన్సిబిలిటీ తోడైతే వరల్డ్ మరింత కలర్‌ఫుల్ అవుతుందని అంటోంది త్రిష గూడూరు. రంగుల లోకంలో విహరించడమే కాదు.. హంగులన్నీ పక్కన పెట్టి.. పేదరికంతో బాధపడే చిన్నారుల కన్నీళ్లూ తుడవాలనేది ఈ అమ్మడి మాట. ఇటీవలే అమెరికాలోని అట్లాంటాలో ‘మిస్ సౌత్ ఏసియా-2014’గా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తన ఆశలు.. ఆశయాల్ని ‘సాక్షి సిటీప్లస్’తో ఇలా పంచుకుంది. ..:: శిరీష చల్లపల్లి మాది కరీంనగర్. అక్కడే పుట్టాను. పన్నెండో ఏట వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి చారిటీ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్. డాక్టర్నై గ్రామీణ ప్రాంత పేదల కోసం ఏమైనా చేయాలని ఆశయం. ప్రస్తుతం అమెరికాలో వైద్యవృత్తిని అభ్యసిస్తున్నాను. చదువు.. చిన్నారులు నాన్న బ్యాంకు ఎంప్లాయ్. తరచూ బదిలీలు కావడంతో పలు ప్రాంతాలకు మారే వాళ్లం. ఈ సమయంలోనే పల్లెలకు-పట్నాలకు మధ్య తేడాలను గమనించే దానిని. నన్ను అప్పుడు ఇప్పుడూ బాగా కలవరపరిచే విషయం.. పల్లెల్లోని చిన్నారులు చదువుకు దూరమైపోవడం. వారికి చదువు ప్రాముఖ్యాన్ని వివరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్మి.. ఆ దిశగా నా వాలంటీర్‌షిప్ ప్రారంభించాను. క్రమశిక్షణతోనే.. నేను అందాల టైటిల్ గెల్చుకున్నానంటే.. దాని వెనుక హార్డ్‌వర్క్ ఉందని చెప్పను. క్రమశిక్షణ, ప్లానింగ్‌తోనే ఈ కిరీటాన్ని గెల్చుకున్నా. లైఫ్‌లో డిసిప్లెయిన్ ముఖ్యమని నాన్న చెప్పిన మాటల్ని అనుసరించాను. నన్ను నేను మెరుగు పరుచుకున్నా. నా రోల్‌మోడల్ ఐశ్వర్యరాయ్. నా పేరెంట్స్‌కి నన్ను నేను గిఫ్ట్‌గా ఇచ్చుకోవాలనున్నా. చారిటీలో నిమగ్నమయ్యా. రోజూ రెండు గంటల చొప్పున పల్లెల్లో పనిచేశాను. నీటి కాలుష్యం, దాని దుష్పరిణామాలపై ప్రచారం చేశా. పిల్లలకు చదువు ఇంపార్టెన్స్ గురించి వివరించాను. న్యూయార్క్‌లా ఉంది.. హైదరాబాద్‌ను వదిలి పదేళ్లయింది. రింగ్‌రోడ్, ఫ్లైఓవర్స్, మాల్స్.. ఇవన్నీ అప్పుడు లేవు. ఇప్పుడెంతో మారిపోయింది. ఈ డెవలప్మెంట్ మంచిదే. హైదరాబాద్‌కి న్యూయార్క్‌తో చాలా పోలికలున్నాయి. మెట్రో రైల్ వస్తే సిటీ ఇంకా మారిపోతుంది. ఎంత మారినా.. ఈ నగరం తన సంస్కృతిని, సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకుంటోంది. అదిరేటి డ్రెస్ మనదే.. నేను అమెరికాలో ఉన్నా, మన సౌతిండియన్ సంప్రదాయ వస్త్రధారణనే ఇష్టపడతాను. ముఖ్యంగా లంగా-ఓణీ, చీరలో మన తెలుగుదనం ఉట్టిపడుతుంది. అక్కడ జరిగే ఏ పార్టీకైనా నేను ఈ డ్రెస్‌లో అటెండ్ అవుతా. స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించే యోచనలో ఉన్నాను. అదే పనిపై ప్రస్తుతం నేను సిటీకి వచ్చాను. -
జోష్‌లో జాగ్రత్త
* ఏటా పెరుగుతున్న ‘డ్రింక్ అండ్ డ్రైవ్’ కేసుల సంఖ్య * తాగినడిపిన వారితో పాటు అమాయకుల ప్రాణాలు బలి * ‘న్యూ ఇయర్ పార్టీ’లో డ్రింక్ అండ్ డ్రైవ్‌కి కాస్తంత దూరంగా * ఉండాలంటున్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్‌ను సరికొత్త జోష్‌తో స్వాగతించేందుకు ఉద్యాననగరి వాసులు సన్నద్ధమవుతున్నారు. మరి ఈ జోష్‌లో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండాలంటే మాత్రం ‘డ్రింక్ అండ్ డ్రైవ్’కి దూరంగా ఉండమని సూచిస్తున్నారు పోలీసు అధికారులు. మద్యం మత్తులో వాహనాలను నడుపడం వల్ల రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ప్రతి రోజూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా తాగి వాహనాలను నడపడం వల్ల వారి కుటుంబాలతో పాటు అమాయకులైన మరికొంత మంది ప్రాణాలను సైతం హరించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అందుకే ఈ కొత్త ఏడాది సంబరాల్లో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా ఉండేందుకు గాను ఁడ్రింక్ అండ్ డ్రైవ్*కి తప్పని సరిగా దూరంగా ఉండమని పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలను కోరుతున్నారు. ఏడాది కేడాదికి పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య... డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల సంఖ్య రాష్ట్రంలో ఏడాదికేడాదికి పెరుగుతోంది. ఈ తరహా సంఘటనల్లోను ద్విచక్రవాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమైన సంఘటనలే ఎక్కువని కూడా ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తుంది. 2010లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య 76,232, కాగా అందులో ద్విచక్రవాహన దారుల సంఖ్య 46,156, ఇక 2011లో నమోదైన కేసుల సంఖ్య 76,833కాగా ద్విచక్రవాహన దారుల సంఖ్య 47,006, ఇక 2012లో మొత్తం 78,371కేసులు నమోదు కాగా వాటిలో 51,998 కేసులు ద్విచక్ర వాహనాలపై నమోదైనవే. ఇలా ఏడాదికేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్యా పెరుగుతోంది రాష్ట్రంలో ఏడాదికేడాదికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 2010లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 20గా నమోదుకాగా, 2011కు అది 22కు పెరిగింది. ఇక 2012 నాటికి ఈ సంఖ్య 28కి చేరుకుం దని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే అనేక సందర్భాల్లో ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడి, కొన్ని రోజుల తర్వాత మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం లెక్కించదు కాబట్టి ప్రభుత్వ గణాంకాల కన్నా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చనేది విశ్లేషకుల వాదన. ఇలా చేయవచ్చుగా... - డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడానికి నిపుణులు కొన్ని సూచనలను ఇస్తున్నారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే... - ఈ న్యూయర్ పార్టీ వేడుకలో స్నేహితుల బృందంతో పార్టీల్లో పాల్గొంటే స్నేహితుల బృందంలో ఎవరో ఒకరు మద్యానికి దూరంగా ఉండి మిగతా వారిని క్షేమంగా ఇంటికి చేర్చవచ్చు. - మద్యం సేవించిన సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్‌కు బై బై చెప్పి ఏ ఆటోలోనో, క్యాబ్‌లోనో ఇంటికి చేరితే ప్రమాదాలను నివారించవచ్చు. -
మదర్ మధు
తల్లిదండ్రులే వద్దనుకున్నవారు కొందరైతే... విధి ఆడిన నాటకంలో అనాథలైన వారు మరికొందరు. వారికి ఇపుడొక అమ్మ ఆసరా దొరికింది. అమ్మ కాని ఆ అమ్మ మధు టుగ్నైడ్! బుద్ధిమాంద్యం, శారీరకవైకల్యం ఉన్న పదకొండు మంది చిన్నారులను దత్తత తీసుకొని కంటిపాపలా చూసుకుంటున్నారామె. వారికోసం నగర రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవకు ఆనుకొని ‘ఇచ్ఛ’ ఆశ్రమం నిర్మించారు. ఈ ప్రస్థానంలో ఆమె ప్రారంభపుటడుగులు, ఎదురైన అనుభవాలు ఆమె మాటల్లోనే... ‘‘మా స్వస్థలం ఢిల్లీ. నాన్న మిలట్రీ ఉద్యోగి. నేను పెరిగిందంతా ముంబైలోనే. నా భర్త టుగ్నైడ్ నేవీలో కమాండర్. ఆయనకు 1987లో ముంబై నుంచి కోచికి, అక్కడి నుంచి 1989లో వైజాగ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. బీచ్‌రోడ్డులోనే మా ఫ్లాట్. మా అబ్బాయి రోహిత్ ఎంటీవీలో ఉద్యోగి. పెళ్లి చేసుకొని ఢిల్లీలోనే ఉంటున్నాడు. టుగ్నైడ్ కూడా రిటైర్ అయ్యాక డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో కన్సెల్టెంట్‌గా హాల్దియాలో పనిచేస్తున్నారు. ఆ నవ్వే నడిపించింది... ఓ ఇద్దరు అనాథలనైనా దత్తత తీసుకోవాలని ఇరవై ఏళ్ల క్రితమే అనుకున్నా. కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా అపుడు వెనక్కుత గ్గవలసి వచ్చింది. తర్వాత కొంతకాలం ఫ్యాషన్ డిజైనర్‌గా వైజాగ్ సిరిపురం జంక్షన్లో బొటిక్ నడిపాను. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత 2012లో పిల్లలను దత్తత తీసుకోవడానికి ‘శిశుగృహ’ అనాథ శరణాలయానికి వెళ్లాను. అయితే వైకల్యంతో ఉన్న అక్కడి పిల్లలను తీసుకోవడానికి మొదట కొద్దిగా సంశయించాను. కానీ అక్కడున్న రెండేళ్ల మహేశ్ నా వేలు పట్టుకున్నాడు. ఊయలలో ఉన్న సాయి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. వారిద్దర్నీ చూశాక నా సంశయం పటాపంచలైపోయింది. వారిద్దరితో పాటు అల్కాను దత్తత తీసుకున్నాను. ఇంట్లోనే ఏడాది పాటు వారి సంరక్షణను, బాగోగులను చూసుకున్నాను. కానీ ఏదో వెలితి. ఇంకా ఇలాంటి వారి కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. బ్యాంకు లాకర్లోని నగలు అమ్మేస్తే వచ్చిన రూ. 11 లక్షలతో స్థలం కొన్నాను. ఆశ్రమం నిర్మించడానికి పుణెలో మాకు ఉన్న ఫ్లాట్ అమ్మేశాను. గతంలో కొండకర్ల ఆవకు మా కుటుంబం అంతా చాలాసార్లు పిక్నిక్కు వచ్చాం. ఇక్కడి వాతావరణం నాకెంతో నచ్చింది. అందుకే ఇక్కడ స్థలం కొని 2013లో ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఈ ఆశ్రమానికి, స్వచ్ఛంద సంస్థకూ ‘ఇచ్ఛ-’ అని పేరు పెట్టుకున్నాను. ఇచ్చ అంటే కోరిక. పిల్లలకు అమ్మానాన్న, ఇల్లు కావాలనే కోరిక సహజం కదా! ఇపుడు ఆశ్రమంలో పిల్లల సంఖ్య పదకొండుకు చేరింది. మిగతా పిల్లలతోపోల్చితే వీరి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పూ నేర్పూ ఉండాలి. నాతో పాటు ఒక ఫిజియోథెరఫిస్ట్, ముగ్గురు కేర్‌టేకర్స్ వారినీ నిరంతరం కనిపెట్టుకొని ఉంటాం. నెలవారీ డొనేషన్ ఉండాలి... ఆశ్రమం దినసరి నిర్వహణతో పాటు వైద్యచికిత్సలకూ ఖర్చు పెరుగుతోంది. అయినప్పటికీ ఇక్కడే ఒక పూర్తిస్థాయి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్, ఫిజియోథెరఫీ సెక్షన్, వాటర్ థెరఫీ కోసం హైడ్రోప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. దాతలు ఒకేసారి డొనేషన్ మొత్తం ఇచ్చే కంటే నెలనెలా కొంత కచ్చితంగా వచ్చేలా ఏర్పాటు చేస్తే మా ప్లానింగ్ సులువవుతుంది’’. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య మహేశ్ (4ఏళ్లు): చెవుడు లేదు. మూగ మాత్రమే ఉంది. వారానికి రెండ్రోజుల పాటు స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అల్కా (3): రెండ్రోజుల శిశువుగా ఉన్నపుడు విశాఖ రైల్వేస్టేషన్లో వదిలేశారు. ఆమె మెదడు ద్రవస్థితిలో ఉండటంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. సాయి (3): అవాంఛిత గర్భం వల్ల ఓ అవివాహిత ఈ బిడ్డను ఓ న్యాయవాది ఇంటి వద్ద వదిలివెళ్లిపోయింది. అతను రెండు నెలల తర్వాత శిశుకేంద్రానికి అప్పగించారు. దత్తత తీసుకున్నపుడు ఆర్నెల్ల వయసు. నరాల సమస్య వల్ల నడవలేడు, కూర్చోలేడు, ఏమీ తినలేడు. ఫిజియోథెరఫీ చేయడం వల్ల ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. రాణి (2): పెద్ద తల, చిన్న శరీరం, తక్కువ బరువుతో అనకాపల్లి ఆసుపత్రిలో పుట్టిన ఈ పాపను తల్లిదండ్రులు అక్కడే వదిలేశారు. రాణికి ఒక చేయి లేదు. మరో చేతి వేళ్లు అంటుకుపోయాయి. పెదవి కూడా గ్రహణం మొర్రు ఉండటంతో ఇటీవలే శస్త్రచికిత్సతో సరిచేశారు. తేజ (7): బుద్ధిమాంద్యం, హెపటైటిస్-బితో బాధపడుతోన్న ఈమెను తల్లిదండ్రులు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై వదిలేశారు. తేజశ్రీ (4): కొండకర్ల గ్రామానికి చెందిన తేజశ్రీ తల్లి ఆత్మహత్య చేసుకుంది. తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు బుద్ధిమాంద్యంతో పాటు ప్రమాదకరమైన మయోపిట్స్ సమస్య ఉంది. బషీరా (8): మెదడులో సమస్య ఉండటంతో ఏదీ రిజిస్టర్ కాదు. క్షణ క్షణానికి ఆమె ప్రవర్తన మారిపోతుంటుంది. తండ్రి ఎటో వెళ్లిపోవడంతో వైజాగ్‌లో ఉంటోన్న తల్లి ఆమెను తనవద్ద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. తనూశ్రీ (7 నెలలు): గత జూలై 18న రెండు నెలల పాపగా ఆశ్రమానికి వచ్చింది. ఈమెకు జననేంద్రియాలు రెండూ కలిసిపోయి ఉన్నాయి. వైద్యులతో పరీక్ష చేయిస్తే బాలిక లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని తేలింది. శ్యామ్ (5): అనకాపల్లి రైల్వేస్టేషన్లో తల్లిదండ్రులు చాపలో చుట్టి వదిలేశారు. నరాల సమస్య వల్ల కూర్చోలేదు, నడవలేదు, గొంతులో సమస్యతో ద్రవ పదార్థమే ఆహారం. గిరిజ (8) : ఆశ్రమంలో చేరేటపుడు చాలా సన్నంగా, పెద్ద పొట్టతో ఉండేది. లివర్ సమస్య ఉంది. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. తార (3): కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎవరో వదిలివెళ్లిపోయిన ఆమెను చైల్డ్‌లైన్ అధికారులు గత నెలలోనే ఆశ్రమంలో చేర్పించారు. మెదడు బాగానే ఉన్నా కాళ్లూచేతుల్లో సత్తువ లేదు. నరాల సమస్యతో బాధపడుతోంది. - అల్లు సూరిబాబు -
ఆనందం
వందమందికి పైగా ట్రావెల్ అండ్ టూరిజమ్ ప్రొఫెషనల్స్ నిరుపేద చిన్నారుల కోసం తమ పనులను పక్కనబెట్టారు. ఆశాకిరణ్, వాల్మీకీ హృదయ్‌లకు చెందిన వంద మంది పిల్లలతో కలసి ఉల్లాసంగా గడిపారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వారికి జత కలసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. స్కాల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ శనివారం బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్కులో నిర్వహించిన ‘చారిటీ డే అవుట్’లో చిన్నారులు తమనుతాము మరచి ఆడిపాడారు. ఆ తరువాత బహుమతులూ అందుకున్నారు. -
పింఛన్ రాలేదని.. మతిస్థిమితం కోల్పోయాడు
జోగిపేట: పింఛన్ రాలేదన్న బెంగతో మెదక్ జిల్లా ఆందోలు మండలం చింతకుంటలో ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామానికి చెందిన నీరుడి దుర్గయ్య వికలాంగుడు. 2 నెలల కిందటి వరకు ప్రభుత్వమిచ్చే వికలాంగ పింఛన్ రూ.500 పొందేవాడు. తాజా పింఛన్ జాబితాలో దుర్గయ్య పేరు లేకపోవడంతో కలత చెంది మతిస్థిమితం కోల్పో యాడు. స్వారూప్స్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు బుధవారం దుర్గయ్యను హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానకసిక వికలాంగుల ఆస్పత్రిలో చేర్పించారు. పింఛన్ రాదేమోనన్న బెంగతో ముగ్గురి మృతి పింఛన్ రాదేమోనన్న బెంగతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఏన్కతలకు చెందిన కౌడి కిష్టమ్మ(70), మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లికి చెందిన దూదేకుల లాల్‌బీ(71), కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెరందిన పొన్నాల గాలవ్వ (80) పింఛన్ రాలేదని మనస్తాపం చెంది మరణించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగాయపల్లితండాకు చెందిన బానోతు రవి (28) అప్పుల బాధతో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకర పొలంతో పాటు మరో 4 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావంతో పంట దెబ్బతినింది. దీంతో బోర్ల కోసం చేసిన రూ.2 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించక తీవ్ర ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
టెక్నాలజీతోనే నవ భారతం
‘టెక్ ఫర్ సేవా’ జాతీయ సదస్సులో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నవభారతాన్ని నిర్మించేందుకు కార్పొరేట్లు, టెక్నోక్రాట్లు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశ నైపుణ్యానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోడైతే ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ ఇట్టే సాధ్యమవుతుందన్నారు. శనివారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్)లో సేవా భారతి, యూత్ ఫర్ సేవ సంస్థలు నిర్వహించిన ‘టెక్ ఫర్ సేవా’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసేందుకు త్రీ-ఎస్ (స్పీడ్, స్కేల్, స్కిల్స్), త్రీ-డీ (డెమోక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్), త్రీ-ఈ (ఎడ్యుకేషన్, ఈ-కామర్స్, ఈ-హెల్త్) విధానాలను అవలంబిస్తున్నామన్నారు. వివిధ భాషల అనువాద ప్రక్రియను సులువు చేసేందుకు దేశంలోని అన్ని భాషలను డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో పరిచయాలను పెంచే ఉద్దేశంతోనే ‘టెక్ ఫర్ సేవా’ సదస్సు నిర్వహిస్తున్నట్లు సేవా భారతి సంస్థ తెలంగాణ యూనిట్ ప్రధాన కార్యదర్శి వీరవెల్లి రఘునాథ్ అన్నారు. డీఆర్డీవో చైర్మన్ సారస్వత్ మాట్లాడుతూ.. మనిషి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. తెలంగాణ, ఏపీల్లో 6 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ‘‘ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దేశంలో 20 క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెరో క్లస్టర్ మంజూరు చేశాం. అదనంగా ఒక్కో క్లస్టర్ మంజూరు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇద్దరు సీఎంల కోరిక మేరకు తెలంగాణలో మూడు, ఏపీలో మూడు చొప్పున మొత్తం 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం’’ అని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ప్రసాద్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల భాగంగా కూకట్పల్లి జేఎన్టీయూ కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావుతో కలసి ఆయన పాల్గొన్నారు. ‘నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్’(ఎన్ఓఎఫ్ఎన్) కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామన్నారు. దీనితో ఎలక్ట్రానిక్ ఆధారిత విద్య, వైద్యం, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్ఓఎఫ్ఎన్ ఏర్పాటులో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
దయతో..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న తొమ్మిదవ కథనమిది... దయగల హృదయం.. ఉదాత్తమైన ఆశయం కలగలిసి మూగజీవులకు ఆపన్నహస్తం అందిస్తోంది. వీధికుక్కలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేలు..లక్షలు ఖరీదు చేసే శునకాల వైభోగం అంతాఇంతా కాదు. కానీ, గుప్పెడు మెతుకులకు గంపెడు విశ్వాసం చూపించే వీధి కుక్కల్ని పట్టించుకునే వారెవరు?. ఒకరోజు అన్నంపెడితే మనింటి కాంపౌండ్ వాల్ చుట్టూ చక్కర్లు కొడుతూ...కనిపించగానే తోక ఊపుతూ ప్రేమను పంచే ఆ మూగజీవులే ప్రియకు ప్రాణం. వాటి కోసమే ‘దయ’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన ఆ పెట్స్ ప్రేమికురాలి సేవా కార్యక్రమాల పరిచయం.. మూడేళ్ల క్రితం.. ‘ఒకరోజు ఉదయం వనస్థలిపురం రైతుబజార్కి వెళ్లాను. దారిలో ఓ వీధికుక్కను మిగతా కుక్కలు కరుస్తున్నాయి. వెంటనే బండి ఆపి, వాటిని చెదరగొట్టాను. అప్పటికే అది బాగా గాయపడింది. తెలుపురంగులో ఉన్న ఆ కుక్కని తీసుకొచ్చి మా ఇంటికి దగ్గరగా ఉన్న వెటర్నరీ ఆసుపత్రిలో చూపించాను. కాలికి బలమైన గాయం కావడంతో చిన్నపాటి ఆపరేషన్ చేసి పంపించారు. దాన్ని ఇంట్లో పెట్టుకుని కొన్నాళ్లు జాగ్రత్తగా చూసుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నా స్నేహితులు శ్రావణి, స్వాతి, సందీప్, కుషన్శర్మ.. కలసి మూగజీవుల గురించి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందన్నారు. నేను వెంటనే 2011లో ‘దయ’ అనే ఆర్గనైజేషన్‌ని స్థాపించాను’ అంటూ నాటి నేపథ్యాన్ని వివరించారు ప్రియ. గాయపడ్డ వాటిని... గాయపడ్డ కుక్కలను చేరదీసి వాటికి వైద్యం చేయించి కావాల్సిన వారికి దత్తత ఇవ్వడంపై దృష్టిపెట్టిన ‘దయ’ సభ్యులు.. ఆ విషయంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. గత మూడేళ్లలో గాయపడ్డ 70 వీధికుక్కలను చేరదీసి వైద్యం చేయించారు. వాటిలో కొన్నింటిని బ్లూక్రాస్‌కి, ఇంకొన్నిటిని దగ్గర్లోని పెట్‌కేర్ సెంటర్లకు, మరికొన్నింటిని దత్తతకు ఇచ్చారు. మిగిలిన వాటిని ఇంట్లో ఉంచి చూసుకుంటున్నారు. ‘ఒక్క గాయపడ్డ కుక్కలనే కాదు.. ఖరీదైన ప్రాంతాల్లో కొందరు జబ్బులొచ్చిన పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేసిపోతున్నారు. ఈ మధ్యనే కేన్సర్ జబ్బుపడ్డ జర్మన్ షెపర్డ్ కుక్క బంజారాహిల్స్ వీధిలో దొరికింది. దానికి వైద్యం చేయించి ఇంట్లో పెట్టుకున్నాం. కొన్ని పెట్‌కేర్ సెంటర్లు ‘దయ’తో వీధికుక్కలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇక వాటికయ్యే వైద్యం గురించి చెప్పాలంటే ముందుగా మా వెటర్నరీ డాక్టర్ సురేష్‌కుమార్ గురించి చెప్పాలి. ఆయన కూడా జంతు ప్రేమికుడే. ఇప్పటివరకూ కుక్కలన్నింటికి ఆయన ఉచితంగా వైద్యసేవలందించారు’ అని వివరించారు ప్రియ. వైద్యం ఖర్చుల సంగతి పక్కన పెడితే వాటి ఆశ్రయం, పోషణకయ్యే ఖర్చూ ఎక్కువే. దాని కోసం ‘దయ’ సంస్థ సిబ్బంది వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. పాతన్యూస్ పేపర్ల డబ్బుతో.. ‘మాకు తెలిసినవారి దగ్గరి నుంచి పాత న్యూస్‌పేపర్లు సేకరించి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుకు మేమంతా కొంత మొత్తం కలిపి మూగజీవుల పోషణ చేపడుతున్నాం. దీనికి తోడు చాలామంది మూగజీవుల ప్రేమికులు చాలా సందర్భాల్లో స్పందిస్తున్నారు. కేవలం శునకసేవే కాకుండా దయ సంస్థ గో సంరక్షణ కార్యక్రమాలూ చేపడుతోంది. గోవుల అక్రమ రవాణా సమాచారం తెలిసినపుడు మా టీమ్ వెంటనే స్పందించి వాటిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి వందకు పైగా ఆవుల్ని రక్షించాం. ఇక వేసవిలో పక్షుల రక్షణకు మా ప్రాంతంలోని అన్ని కాలనీల్లో ప్రతి ఇంటి దగ్గరా చిన్న గిన్నె పెట్టి వాటిలో నీళ్లు పోయాలని చెబుతాం’ అని చెప్పారు దయ సభ్యురాలు శ్రావణి. యోగా శిక్షకురాలు కూడా అయిన ప్రియ ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తూ అక్కడ మూగజీవుల సంరక్షణకోసం డ్రాప్‌బాక్సులు పెట్టి సాయం కోరుతున్నారు. నోరులేని మూగజీవుల్ని ప్రేమగా పలకరిస్తూ, ‘దయ’ గల హృదయాలను వెతుక్కుంటూ ముందుకుసాగుతున్న ఈ సంస్థ సేవలకు హ్యాట్సాఫ్. సదా మీ సేవలో.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి చేసిన చేతల వివరాలు వూకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఒక్క సవుంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@gmail.com ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com ఫొటోలు: సృజన్ పున్నా -
బాల సంస్కార్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఎనిమిదవ కథనమిది... మురికివాడలకు వెళ్లినపుడు మొదట మన చూపు పడేది అక్కడి పిల్లలపైనే. అక్కడి జీవన విధానం వారి భవిష్యత్తుపై ఏ స్థాయి ప్రభావం చూపుతుందో కనిపిస్తుంటుంది. అక్కడి వాతావరణం, మనుషులు, పరిసరాలు, వారి అలవాట్లు... వీటిని మార్చడం అంత సులువు కాదు. కానీ... ఆ మురికివాడల్లోని పిల్లలు, ఆలోచనలు... తద్వారా వారి జీవన విధానాన్ని మార్చగలం. ఇదే సంకల్పంతో గౌరుగారి గంగాధరరెడ్డి ఆ వాడల్లో అడుగుపెట్టారు. ‘శ్రీ శారదాధామం’ ఆధ్వర్యంలో ‘బాల సంస్కార కేంద్రాలు’ స్థాపించి రేపటి పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. రాజేంద్రనగర్ మండలం పరిధిలో 21 పాఠశాలల్లో ‘బాల సంస్కార కేంద్రాలు’ ఉన్నాయి. శ్రీశారదాధామం హైస్కూలు పరిధిలో నిర్వహించే ఈ కేంద్రాల్లో ప్రతిరోజూ యోగా, మెడిటేషన్, కరాటే వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘శ్రీశారదాధామం పాఠశాల నెలకొల్పి ఇరవై ఏళ్లు దాటింది. బాల సంస్కార కేంద్రాలు నెలకొల్పి నాలుగేళ్లయింది. వెనకపడ్డ గ్రామాల్లోని పాఠశాలల్లో మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఏదో పాఠశాలకు వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టు కాకుండా... పిల్లల మనస్తత్వం, పాఠశాలకు పంపితే పనైపోతుందనుకునే తల్లిదండ్రుల ఆలోచనా తీరుని మార్చడాన్నే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదిలాం. తొలుత పాఠశాలలకు వెళ్లి మా సేవా కార్యక్రమాల గురించి చెప్పి, కొంత సమయం తీసుకున్నాం. ఆ సమయాల్లో మా టీం వెళ్లి వివిధ అంశాలను బోధిస్తుంది’ అని చెప్పారు గంగాధరరెడ్డి. విద్యార్థుల సాయంతో... 21 సెంటర్లలో పేద విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు, దేశభక్తి గీతాలు, కథలు నేర్పడానికి కాలేజీ విద్యార్థులు ముందుకొస్తున్నారు. కొందరు గృహిణులు కూడా బోధకులుగా చేరారు. ‘మా లక్ష్యాలు ఎంత గొప్పవైనా... వాటిని అమలు చేసేవారు ఉండాలి కదా. దాని కోసం మా ప్రాంతంలో ఉండే కాలేజీ విద్యార్థులు, కొందరు చదువుకున్న గృహిణులు ముందుకొచ్చారు. దాంతో మా పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఉదయం పిల్లలకు యోగా, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. సాయంత్రం డ్రిల్, కరాటే వంటి శిక్షణా తరగతులు ఉంటున్నాయి’ అని చెప్పారు గంగాధర్‌రెడ్డి. వీటితో పాటు బాల సంస్కార కేంద్రాల నిర్వాహకులు నెలరోజులకోసారి మురికివాడల్లోని పిల్లలకు పాజిటివ్ హోమియోకేర్ ద్వారా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా... చాలీచాలని సంపాదన వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే జీవితాలను చూస్తూనే ఉంటాం. వీరి పరిస్థితే ఇలా ఉంటే సంపాదించిన నాలుగు డబ్బులను వ్యసనాలకు ఖర్చు పెట్టే పేద తల్లిదండ్రుల కడుపున పుట్టిన చిన్నారుల సంగతి ఎలా ఉంటుందో ఊహించగలం. దీని కోసం బాల సంస్కార కేంద్రం నిర్వాహకులు ఏడాదికి రెండుసార్లు మురికివాడల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. చదువుకున్న పిల్లల భవిష్యత్తును వారి ముందుంచుతూ వారి భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి.. ఏ విధంగా నడుచుకోవాలో బోధిస్తోంది. ‘ఈ కార్యక్రమం వల్ల చాలామంది తల్లిదండ్రుల్లో మార్పుని చూశాం. ముఖ్యంగా ఆడపిల్లల చదువును అర్ధంతరంగా ఆపేయడం తగ్గింది. అలాగే పదో తరగతి తర్వాత పిల్లల్ని కాలేజీకి పంపేవారి శాతం కూడా పెరిగింది’ అంటారు గంగాధర్. ఆర్థిక సాయంకన్నా అక్షర సాయం గొప్పదని నమ్మిన శ్రీ శారదాధామం పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్న బాల సంస్కార కేంద్రాల ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం. ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
అక్షర సేన..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఆరో కథనమిది. కాలేజ్ డేస్ అంటే ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్ అనుకుంటారు. కానీ ఈ టీనేజర్లు మాత్రం.. చదువుకొంటూనే పలు గ్రామాలను దత్తత తీసుకుని అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు. ఇప్పుడు బెనోవెలెంట్ కాజ్ సంస్థగా మారి మురికివాడలు, గ్రామాల్లో పర్యటిస్తూ.. సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ‘వసుధైక కుటుంబం’ దిశగా అడుగులేస్తున్నారు. కాలేజ్ డేస్‌లో కుర్రాళ్లు టూ టైప్స్ ఉంటారు. ఎంజాయ్మెంట్ తప్ప మరొకటి ఆలోచించని వాళ్లు ఓ రకమైతే.. కెరీర్ తప్ప మరో ధ్యాస పట్టని వాళ్లు ఇంకో రకం. కానీ.. బెనోవెలెంట్ కాజ్ కుర్రాళ్లు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీని భుజానికెత్తుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. చదువుసంధ్యలతో పాటు సేవబాటలోనూ ముందుంటున్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన వీరిని అందరివాళ్లను చేసింది. చిన్ననాటి నుంచి సేవాభావం కలిగిన గుంటూరు జిల్లా అమరావతి మండలం నరుకుల్లపాడుకి చెందిన కర్రా దుర్గారావు ఎంబీఏ చదువు కోసం సీబీఐటీ కళాశాలలో చేరడంతోనే ‘స్టూడెంట్ సోషల్ సర్వీస్ సంస్థ’కు బీజం పడింది. ఇంటర్ రోజుల్లోనే తోటి విద్యార్థుల సహకారంతో పలు గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించిన దుర్గారావు.. ఇక్కడి మిత్రులతో కలసి స్టూడెంట్ సోషల్ సర్వీస్ సంస్థకు రూపకల్పన చేశాడు. అక్షర సేద్యం.. తమ సేవా కార్యక్రమాలను క్రమంగా విస్తరించిన ఎస్ఎస్ఎస్ సభ్యులు.. అక్షర సేద్యానికి ఖానాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నారు. 2012లో రాత్రి పాఠశాలను ప్రారంభించారు. అయితే రాత్రి వేళల్లో పనులు, ఇతరత్రా కారణాలతో మహిళలు, పెద్దలు ఇలా అందరూ ఒకేచోటికి రావడం సమస్యగా మారింది. దీంతో ఇంటి వద్దకే చదువు అన్న కాన్సెప్ట్‌తో ఎక్కువ మంది వాలంటీర్లతో నిరక్షరాస్యుల ఇళ్లకు వెళ్లి అక్షరాలు దిద్దించడం మొదలుపెట్టారు. చదువుతో కలిగే ప్రయోజనాన్ని వివరించి ఎందరినో అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. అంతేకాదు వారాంతాల్లో ప్రభుత్వ పాఠశాల లకు వెళ్తున్నారు. ఆంగ్లం, గణితం, కంప్యూటర్ సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఖానాపూర్, గండిపేట, కోకాపేట, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామంతాపూర్, ఘట్కేసర్లోని ప్రభు త్వ పాఠశాలల్లో వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు పరిష్కారం.. తమ సేవలను మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాలని భావించిన ఎస్ఎస్ఎస్.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో బెనోవెలెంట్ కాజ్ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో ప్రతి శని, ఆదివారాల్లో గ్రామాలు, మురికివాడల్లో ‘వసుధైక కుటుంబం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. మొదట్లో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా గ్రామాలు, మురికివాడల్లోని ప్రజలతో మమేకం అవుతున్నారు బెనోవెలెంట్ కాజ్ సభ్యులు. ఆ తర్వాత ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఓ రోజు ప్రజలందరినీ ఒకే చోటికి తీసుకువచ్చి.. అక్కడికే అధికారులను తీసుకువచ్చి వారి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నాం. ఇలా ఎన్నో సమస్యలకు స్పాట్లో పరిష్కారం చూపి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారు. త్వరలోనే ఎస్ఎస్ఎస్, బెనోవెలెంట్ కాజ్‌ను యూత్ ఫర్ ద యునెటైడ్ నేషన్స్ కిందకు తీసుకొస్తామంటున్నారు ఈ కుర్రాళ్లు. విద్యార్థుల్లోనూ వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామంటున్నారు. ఇలా సభ్యత్వం తీసుకోవచ్చు.. ఎస్.ఎస్.ఎస్.లో వాలంటీర్‌గా చేరాలంటే http://studentsocialservice.org/ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రోజుకు రూ.1 తో... సేవే లక్ష్యంగా ఎస్ఎస్ఎస్ ఏర్పాటు చేశాం. అందుకోసం పలు ఇంజనీరింగ్ కాలేజీలను వేదికగా మలుచుకున్నాం. ప్రతి తరగతిలోని విద్యార్థి రోజుకు ఒక్క రూపాయి చొప్పున వారానికి రూ.5 జమ చేసి తమ క్లాస్ లీడర్లకు అందిస్తారు. ఇలా జమ చేసిన మొత్తంతో దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేసి అనాథ పిల్లలకు అందజేస్తున్నాం. ఇలా మా ల క్ష్యసాధనలో కాలేజీ విద్యార్థులను భాగస్వాములను చేశాం. ఈ రూపాయి ఉద్యమంలో సీబీఐటీ, ఎంజీఐటీ, వాసవి, ఇక్ఫాయ్, ఎంజీఐటీ, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌వీజేఐటీ, జేబీఐటీ, జేబీఆర్‌ఈసీ కళాశాలలు చేరాయి. - దుర్గాప్రసాద్, వ్యవస్థాపకుడు -
వెలుగుబాట
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఐదో కథనమిది. పొద్దంతా స్వేదం చిందిస్తే తప్ప పూట గడవని నేపథ్యం.. అడుగు ముందుకు వేయాలంటే అడ్డం పడే పేదరికం.. బతుకుల్ని వెక్కిరించే నిరక్షరాస్యత.. అయినా ప్రతికూల పరిస్థితులకు వారు తలవంచలేదు. తాము పడిన కష్టం మరెవరూ పడకూడదనే తలంపుతో ఒక మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. బస్తీలకు ‘కంటిచూపు’గా మారి వెలుగుబాట చూపుతున్నారు. rakshana161@gmail.com రసూల్‌పురా మురికివాడ. ఆ బస్తీలో తెల్లవారుతూనే అందరినీ పలకరించేది పేదరికమే. పొద్దంతా పని చేస్తేనే అందరికీ పూట గడిచేది. జి.జ్యోతి, రజని, సరిత, శివరంజని, కె.పుష్పలత. పి.పుష్ప, రజిత, సురేఖ.. ఈ పరిస్థితులకు వీరూ మినహాయింపు కాదు. అంతంత మాత్రం చదువులు.. నిరుపేద బతుకులు.. పొద్దునే ఇల్లు విడిచి వెళ్లిన అమ్మానాన్నలు పనిచేసి మళ్లీ ఏ రాత్రికో ఇంటికి రావడం ఏళ్ల తరబడి చూశారు. చదువుకోవాలన్న ఆశను ఆర్థిక దుస్థితి చిదిమేసింది. కన్నీళ్లతో పాటు ఆశలు, ఆశయాల్ని దిగమింగుకుని పెరిగిన వీరిలో.. తమలాగే తమ పిల్లలు, ఇతరులు కష్టాలు పడకూడదని తలిచారు. ఏదైనా చేయాలనే వీరి ఆశయానికి.. ‘ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్’ సంస్థ సేవా కార్యక్రమాలు ప్రేరణనిచ్చాయి. వెంటనే అందులో హెల్త్ కో-ఆర్డినేటర్లుగా చేరారు. తమకు వచ్చిన, నేర్చిన విద్యతోనే బస్తీవాసుల్ని ఆరోగ్యంపై చైతన్యం చేసేవారు. రోజూ తమలాంటి ఎన్నో కుటుంబాలను కలిసే వారు. పిల్లలకు విద్య ప్రాధాన్యాన్ని వివరిస్తూనే కంటి సంరక్షణ చర్యలను వివరించే వారు. కొన్నాళ్లకు ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్ ప్రాజెక్టు వర్క్ పూర్తికావడంతో వీరంతా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సొంతంగా బస్తీవాసుల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 2011 మార్చిలో ‘ర క్షణ వెల్ఫేర్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్థానికుల సహకారం అందింది. దీంతో పూర్తి స్థాయి సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ‘డబ్బులున్న వారు ఇంకా డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమైపోతున్నారు. మరి పేదల గురించి ఎవరు పట్టించుకుంటారు?’.. ఈ ప్రశ్నే తమ సేవకు పునాది అని ఈ ఎనిమిది మంది చెబుతారు. పేద బతుకుల్లో వెలుగులు రసూల్‌పుర మురికివాడలోని శ్రీలంకబస్తీ, ఇందిరమ్మనగర్, రసూల్‌పుర, సీబీఎన్ నగర్, అన్నానగర్, అర్జున్‌నగర్, అంబేద్కర్ నగర్, కృష్ణానగర్, సిల్వర్ కంపెనీ, 105 గల్లీ, బీరప్పగుడి, రావిచెట్టు గల్లీ.. ఈ బస్తీల్లోని ఇంటింటికీ ‘రక్షణ’ సభ్యులు తిరిగి విద్య, వైద్యంపై ప్రజలను జాగృతం చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తిస్తారు. వారి కోసం వారానికి ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకించి కంటి లోపాలున్న వారిని గుర్తించే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. వీరి కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆపరేషన్ ఐసైట్ వారి సహకారంతో వైద్యం అందిస్తున్నారు. బస్తీవాసుల్లో కంటి శుక్లాలు గుర్తించడం, చూపు అవశ్యకత, పోషకాహారంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు సంస్థ అధ్యక్షురాలు సరిత. బస్తీలకు ‘కంటిచూపు’ చాలా వర కు కంటి సమస్యలు పౌష్టికాహార లోపంతోనే తలెత్తుతున్నాయని గుర్తించిన వీరు.. బాల్యం నుంచే పోషక విలువలు గల ఆహారం అందజేస్తే సమస్య పరిష్కారమైనట్టేనని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రసూల్‌పురా పరిసర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సహకరించడంతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల రోజువారీ మెనూలో అధిక పోషక పదార్థాలు లభించే ఆహారం తీసుకునేలా వారిని చైతన్య పరుస్తూ ముందుకెళుతున్నారు. ‘రక్షణ’ సభ్యులు తలా చేయి వేసుకొని పిల్లలకు పౌష్టికాహరం అందిస్తున్నారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చదువు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ‘మా కృషిని గుర్తించిన ఒకటి, రెండు ఎన్జీవోలు ఆసరానిస్తుండటంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామ’ని చెప్పారు సంస్థ కార్యదర్శి జ్యోతి. ‘ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా.. అనుకున్న దారిలో ముందుకెళ్తున్నాం. వందలాది మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు, మెరుగైన చూపు కోసం కళ్లజోళ్లు పంపిణీ చేశాం. పేదరికం వెక్కిరిస్తున్నా.. కుటుంబసభ్యుల సహకారంతో నలుగురికీ సేవ చేయగలుగుతున్నామంటున్నారు ‘రక్షణ’ సభ్యులు. -
మేక్ ఎ స్మైల్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న నాలుగో కథనమిది. మార్పు మంచిదైతే.. అది ఎక్కడ మొదలైనా అంతటికీ పాకుతుంది. అందుకే కేరళలో మొదలైన ఓ మంచి మార్పు.. సిటీకి చేరింది. ‘మేక్ ఎ డిఫరెన్స్’ (మ్యాడ్)గా వచ్చి మనసున్న హైదరాబాదీలను కదిలించి.. మారాజులను చేసింది. తోటివారికి తోచిన సాయం చేయడానికి తీరిక చూసుకునేలా చేసింది. ఆ సాయం చదువైతే.. అంతకు మించిన మార్పు ఇంకే ం కావాలి చెప్పండి. తొమ్మిదేళ్ల కిందట కేరళలో కొందరు స్నేహితులు ఓ బాయ్స్ హాస్టల్‌కు వెళ్లారు. అక్కడున్న కుర్రాళ్లు.. లెక్కల్లో ఏవో డౌట్లుంటే వీరిని అడిగారు. పిల్లల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఆ మిత్ర బృందం వెనుదిరిగే సమయంలో.. ఓ బాలుడు ‘అన్నా.. మళ్లీ ఎప్పుడొస్తారు..?’ అని అడిగాడు. ‘వచ్చే వారం’ అన్నారు. ఆ సంఘటనే ‘మేక్ ఎ డిఫరెన్స్’కు బీజం వేసింది. ఈ సేవాభావానికి అది మొదటి నెలవైంది. ఆ మిత్రులు మొదటి వాలంటీర్లయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 మ్యాడ్ సెంటర్లున్నాయి. ఇందులో రెండు వేల మంది వాలంటీర్లున్నారు. ఐదు వేల మంది అనాథ పిల్లలకు మ్యాడ్ తరఫున ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంకరేజ్మెంట్.. ఇలా రకరకాల సేవలందుతున్నాయి. నగరంలో మార్పు.. హైదరాబాద్‌లో ఏడు మ్యాడ్ సెంటర్లున్నాయి. అమీర్‌పేట్, బోయిన్పల్లి, సీతాఫల్మండి, కోఠి, మలక్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్‌లోని అనాథాశ్రమాల్లో మ్యాడ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ అనాథాశ్రమాల్లో మూడు వందలకు పైగా చిన్నారులు ఉన్నారు. వారాంతాల్లో వాలంటీర్లు ఈ హోమ్స్‌కి వెళ్లి చిన్నారులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ట్యూషన్ చెప్తారు. నగరంలో వాలంటీర్ల సంఖ్య వెయ్యికి పైమాటే. వీరిలో టీచర్లు మొదలు విద్యార్థుల వరకూ అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు. ‘మాకు తోచినట్టు నాలుగక్షరాలు చెప్పి వచ్చేస్తే సరిపోదు.. ఏ టీచర్ (వాలంటీర్) ఎలా చెబుతున్నారో.. విద్యార్థుల నుంచి మ్యాడ్ సెంటర్ హెడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దాన్ని బట్టి మా బోధనలో లోటుపాట్లు తెలుసుకుని మార్చుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్‌గా చేస్తున్న సేవే కదా అన్న చిన్న చూపు ఇక్కడ ఉండదు. అంతా ప్రొఫెషనల్‌గా ఉంటుంది’ అని చెప్పారు అలేఖ్య. అన్నీ వారే.. మ్యాడ్ సభ్యులు అక్షర జ్ఞానం వెలిగించడమే కాదు.. పిల్లలకు ఆనంద జ్యోతులు పంచుతున్నారు. ఆలనాపాలనా కరువైన చిన్నారులకు అన్నీ వీళ్లే అవుతారు. పండుగల వేళ అన్ని సెంటర్లకు సందడి మోసుకొస్తారు. మ్యాడ్ సభ్యుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు.. ఇలా ఏ వేడుకైనా ఆ సెంటర్లలోనే చేసుకుని వాళ్ల ఆనందం పిల్లలతో పంచుకుంటారు. అంతేకాదు పిల్లల్లోని కళలను వెలికితీసే కార ్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కొన్ని వేడుకలకు సెలబ్రిటీలను తీసుకొస్తారు కూడా. మొన్నామధ్య ముషీరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్‌కి సానియా మీర్జాని తీసుకొచ్చి చిన్నారుల ముఖాల్లో సంతోషం నింపారు. అలాగే నగరానికి వచ్చే విదేశీయులను కూడా ఈ సెంటర్లకు తీసుకొచ్చి పిల్లలకు కొత్త పరిచయాలు చేస్తుంది మ్యాడ్. ‘చదువు, ఉద్యోగం, కుటుంబం.. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. వీకెండ్లో కొన్ని గంటలు ఈ పిల్లల దగ్గరకు వెళ్లి వారికి పాఠాలు చెప్పడం మంచి అనుభూతినిస్తుంది’ అని చెప్పారు సిద్ధి. చిన్నారులతో అనుబంధం పెరగటానికి వారి దగ్గరికి వెళ్లినపుడు ఒట్టి చేతుల్తో కాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకెళ్తుంటారు. మెంబర్ కావాలంటే.. వీలున్నప్పుడు ఈ సెంటర్లకు వెళ్లి తెలిసిన నాలుగు అక్షరం ముక్కలు చెప్పేస్తే మనం కూడా మ్యాడ్ సభ్యులం అయిపోవచ్చు అనుకుంటే పొరపాటు. ఇందులో సభ్యులుగా చేరితే కనీసం ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. ముందుగా మ్యాడ్ వెబ్సైట్(ఠీఠీఠీ.ఝ్చజ్ఛ్చుఛీజీజజ.జీ)లో లాగిన్ కావాలి. అందులో జాయిల్ లింక్‌లోకి వెళ్లి మీ వివరాలన్నీ అప్డేట్ చేస్తే మీకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. సదరు వ్యక్తి మ్యాడ్ సభ్యుడిగా పనికొస్తారో లేదో అందులో తేల్చేస్తారు. ‘మ్యాడ్ చదువు, సర్టిఫికెట్ చూడదు. పిల్లలతో కలసిపోయే మనస్తత్వాన్ని చూస్తుంది’ అని చెబుతారు స్వాతి. ప్రతి సభ్యుడి నుంచి రూ.700 డిపాజిట్ కట్టించుకుంటారు. ఏడాది తర్వాత సభ్యుడు తన డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు. ఏడాదిలోపు మానే సే వారికి అవి తిరిగి ఇవ్వరు. ఆ పైకాన్ని విద్యార్థుల అవసరాలకు మళ్లిస్తారు. ఒక సభ్యుడిని ఎన్నుకునే విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో.. నా అన్నవారు లేని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడంలోనూ అంతే పట్టుదలగా ఉంది. మ్యాడ్ సేవలు మరింత వేగంగా విస్తరించాలని కోరుకుందాం. -
విరాళం సేకరించలేదని..
విద్యార్థిని దండించిన టీచర్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు నల్లగొండ క్రైం : చారిటబుల్ ట్రస్ట్ నిర్వహనకు విరాళం సేకరించలేదని ఓ టీచర్ విద్యార్థిని దండించింది. ఈ ఘటన జిల్లా కేంద్రం శివారు ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బోస్కో పాఠశాలలో సోమవారం వెలుగుచూసింది. వన్‌టౌన్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చారిటబుల్ ట్రస్టు నిర్వహణకు ఫస్ట్‌క్లాస్ చదువుతున్న విద్యార్థి కేతావత్ భార్గవ్‌ను విరాళం సేకరించాలని ఆ పాఠశాల టీచర్ ఆదేశించింది. భార్గవ్ విరాళం సేకరించకపోవడంతో ఆగ్రహించిన టీచర్ అతడి చెంపపై కొట్టడంతో చేతి ఐదు వేళ్ల అచ్చులు పడ్డాయి. దీంతో విద్యార్థి తండ్రి రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ‘డాన్‌బోస్కో’ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నల్లగొండ అర్బన్ : జిల్లా కేంద్రం ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బోస్కో విద్యాసంస్థ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆదిశేషు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.సంతోష్ మాట్లాడుతూ చారిటీపేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వని వారిని వేధించడం, కొట్టడం చేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో వేణు, సిద్ధు, లింగరాజు, రాహుల్, శ్రీరామ్, సంతోష్ పాల్గొన్నారు. -
చారిటీ..పార్టీ
స్వచ్ఛంద సంస్థ అడ్వకేట్స్ ఫర్ బేబీస్ ఇన్ క్రైసిస్ సొసైటీ (ఏబీసీ) ఆధ్వర్యంలో జరిగిన చారిటీ డిన్నర్... విందు వినోదాల మేలు కలయికగా అలరించింది. గచ్చిబౌలి హయత్ హైదరాబాద్ హోటల్లో శనివారం నిర్వహించిన ఈ ఆసక్తికర ఈవెంట్లో హీరో సుమంత్ సహా పలువురు నగర వ్యాపార, కార్పొరేట్ ప్రముఖులు పాల్గొన్నారు. అమితాబ్‌బచ్చన్ సంతకం చేసిన ‘టూ బీ ఆర్ నాట్ టూ బీ’ కాఫీ టేబుల్ బుక్ నుంచి సల్మాన్‌ఖాన్ సైన్ చేసిన టీషర్ట్ దాకా... విభిన్న రకాల ఉత్పత్తులను సెలైంట్ ఆక్షన్ శైలిలో విక్రయించారు. పలువురు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, ఆభరణాలు సైతం ఈ ఆక్షన్‌లో ఆహూతుల కోసం కొలువుదీరాయి. ఎంట్రీ టిక్కెట్‌తో పాటు వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సిటీలో ఉన్న పలు అనాథ శరణాలయాలకు అందిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. -
దివ్యవాహినికి..దివ్వెల నీరాజనం
నీటి నుంచి వెలుగుల సృష్టి.. విద్యుదుత్పత్తితో మాత్రమే కాదు.. ఆ నీరే నేరుగా పొలాల్లోకి చేరి, పంటలకు జీవమై, జీవనంలో సౌభాగ్యం నింపడం వల్ల కూడా జరుగుతుంది.తరతరాలుగా గోదారమ్మ ఈ సీమ జీవితంలో సిరుల కాంతిని ప్రసరిస్తోంది. మరి,ఆ తల్లి రుణం ‘కిరణమంతైనా’ తీర్చుకోవాలని శ్రీకారం చుట్టిందే పున్నమిహారతి.నింగిలో వెలుగుతున్న కార్తిక పున్నమి జాబిలితో పాటు గురువారం రాత్రి పుష్కరాలరేవులో వెలిగిన జ్యోతులూ ప్రతిఫలించగా గోదావరి దివ్యధామంగా భాసిల్లింది. సాక్షి, రాజమండ్రి :తరతరాలుగా ఇహానికి సిరులను ప్రసాదిస్తూ, పరానికి వారధిగా నిలుస్తున్న పావన గోదావరికి .. పున్నమి రాతిరి హారతి ఇచ్చే అపురూపమైన వేడుకకు జనం వేలాదిగా పోటెత్తారు. అసలే.. నిండుజాబిలి వెండి వెలుగులు అలలకు బంగారు లేపనాన్ని వేసినట్టు మెరిపించగా.. ఆ పై రేవు నుంచి ఇచ్చే హారతి కాంతులు అదనపు నగిషీలుగా జిలుగులద్దాయి. కార్తిక పౌర్ణమి పర్వదినాన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టు నిర్వహించిన పున్నమి హారతి ఉత్సవం సందర్భంగా రాజమండ్రి పుష్కరాలరేవు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. వచ్చే ఏడు రావలసిన పుష్కరాలు ఇప్పుడే వచ్చాయా అనిపించేంతగా రేవు కిటకిటలాడింది. గోదావరి ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పడంతో పాటు గంగానదికి వారణాసిలో ఇస్తున్న విధంగానే గోదారమ్మకు కూడా హారతులివ్వాలనే సంకల్పంతో ప్రతినెలా పున్నమికి హారతి ఇచ్చే కార్యక్రమానికి ట్రస్టు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం కార్తిక పౌర్ణమి సందర్భంగా 50వ హారతి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. గోదావరి మాత ఘనతను చాటి చెపుతూ, హారతుల వైశిష్ట్యాన్ని వివరిస్తూ వేదపండితులు ఈ క్రతువును నిర్వర్తించారు. ఉట్టిపడిన భక్తిభావం పుష్కరాలరేవు వద్ద గోదావరిలో పంటుపై ప్రత్యేకంగా నిర్మిం చిన వేదికపై సాయంత్రం 6.00 గంటలకు హిందూ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7.15 గంటలకు శ్రీరామదూత స్వామి నిర్వహించిన ప్రత్యేక పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అయిదుగురు ప్రముఖులకు గోదావరి పురస్కారాలను అందజేశారు. పలువురు ప్రముఖులను సత్కరించారు. 8.30 గంటలకు ప్రముఖుల ప్రసంగాలు పూర్తయిన అనంతరం గోదారమ్మకు హారతులిచ్చారు. వైదిక సాంప్రదాయం ప్రకారం షోడశోపచారాలతో, వేదమంత్రోచ్ఛారణల ఈ కార్యక్రమం భక్తిభావపూరితంగా జరిగింది. ‘స్వచ్ఛ గోదావరి’కి సంకల్పం కేవలం గోదావరి హారతి కార్యక్రమంతో ఆధ్యాత్మిక చింతనను ఉద్దీప్తం చేయడమే కాక నది పవిత్రతను కూడా కాపాడుకోవాలనే సందేశాన్నిచ్చేందుకు ఈసారి ‘స్వచ్ఛ గోదావరి’ అనే కార్యక్రమానికి కూడా ట్రస్టు శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ గోదావరి పరిరక్షణ, కాలుష్య నివారణ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో గోదావరి పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం 10.00 గంటలకు గోదావరి అందాలను, చారిత్రక ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటే ఫొటో ఎగ్జిబిషన్‌ను దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు. ‘స్వచ్ఛ గోదావరి’ అనే అంశంపై చర్చా కార్యక్రమం చేపట్టారు. గురువారం నాటి పున్నమి హారతి గోదావరి పరిరక్షణ దిశగా వేస్తున్న కీలక అడుగుగా బుద్ధవరపు ట్రస్టు పేర్కొంటోంది. కాలుష్యాన్ని నివారించడం కూడా గోదావరి మాతను ఆరాధించడంతోనే సమానమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50వ హారతి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంది. పాపికొండల నుంచి అంతర్వేది వరకూ గోదావరిలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రజలు స్వచ్ఛందంగా అమలు చేసేలా బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్నట్టు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు బి.ఎస్.ఎన్.కుమార్ పేర్కొన్నారు. ఈ దిశగానే ఈ పున్నమి హారతిని మరింత విలక్షణంగా నిర్వహించామన్నారు. -
కోటలో తోట
తాజ్‌మహల్‌ను చూశారా.. పాలరాతి అద్భుతం రెప్పవాల్చనీయదు. ఆ నిర్మాణ కౌశలం అంత గొప్పది మరి. కానీ దాని అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది మాత్రం ఆ కట్టడం ముందు పరుచుకున్న మొఘల్ గార్డెనే. పచ్చిక బయళ్లు... తాజ్‌మహల్ అంత ఎత్తుకు ఎదగాలని తాపత్రయపడుతున్నట్టుండే వృక్షాలు.. మధ్యలో నీటి హొయలు.. దానిక సొగసులద్దే ఫౌంటెయిన్లు.. ఆ పూదోటను చూస్తుంటే మనల్ని మొఘల్ చరిత్ర వాకిట నిలబెడుతుంది. - గౌరీభట్ల నరసింహమూర్తి మరి అలాంటి అద్భుత ఉద్యానవనం మన భాగ్యనగరంలో కూడా ఉండేదంటే నమ్ముతారా..? అద్భుత నిర్మాణ శైలితో ప్రపంచ ఖ్యాతినార్జించిన చారిత్రక గోల్కొండ కోట వద్దే అది ఉంది. అదేంటి గోల్కొండకు ఇన్నిసార్లు వెళ్లినా ఆ సుందరవనం కనిపించలేదంటారా..? నాలుగు వందల అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని చుంబించేలా అలరారుతున్న గోల్కొండ కోట సాక్షిగా ఆ ఉద్యానవనం కాలగర్భంలో కలసిపోయింది. మొఘలాయీ గార్డెన్స్‌కు పతిబింబంగా రూపుదిద్దుకున్న ఉద్యానవనం.. సాగుభూమిగా మారిపోవడంతో ఆ పూవనాన్ని చూసే భాగ్యం మనకు లేకుండా పోయింది. చరిత్ర గమనంలో వాడిపోయిన ఉద్యానవనం ఇప్పుడు వెలుగు చూసింది. ఆనాటి సుందర నిర్మాణ శిథిలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజాం జమానాలో పురావస్తు నిపుణిడిగా ఖ్యాతిపొందిన గులామ్ యాజ్దానీ రాసిన ఓ పుస్తకంలోని కథనాలు ఇక్కడి పూర్వవైభవాన్ని తెలియజేశాయి. వాటి ఆధారంగా కేంద్ర పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల్లో ఆనాటి అపురూప ఉద్యానవనం ఆనవాళ్లు బయటపడ్డాయి. చరిత్రలో వర్ణించిన తీరు వెలుగు చూస్తుండటంతో.. ఈ ఉద్యానవనానికి పూర్వవైభవం కల్పించాలంటూ అధికారులు కేంద్రానికి నివేదించారు. అనాటి అపురూపం కాకతీయుల కాలంలో నిర్మితమైన గోల్కొండ కోటలో అడుగడుగూ అద్భుతమే. రాచరికాలు మారే కొద్దీ కోటలో మార్పులు, చేర్పులు ఎన్నో జరిగాయి. బహమనీల తర్వాత కోటలో పాగా వేసిన కుతుబ్‌షాహీలు.. గోల్కొండ ఖిల్లాకు కొత్త సొబగులు అద్దారు. కోట అంటే పరిపాలన కేంద్రంగా మాత్రమే కాదు అది చూడముచ్చటగా ఉండాలని భావించారు. అందుకే మొఘల్ గార్డెన్ తరహాలో ఇక్కడ కూడా ఓ అందమైన తోటను తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రస్తుతం నయాఖిల్లా ప్రాంతంలోని ఖాళీ భూముల్లో పర్షియా నమూనాలో అందమైన వనం 28 నుంచి 32 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. చుట్టూ పచ్చిక.. మధ్యలో జలధార.. అందులో ఫౌంటైన్లు.. మళ్లీ పచ్చిక.. నీళ్లు.. ఫౌంటైన్లు.. ఇలా దొంతరలుగా దీన్ని నిర్మించారు. గోల్కొండ కోట చుట్టూ విస్తరించి ఉన్న మూడు చెరువులతో వీటిని అనుసంధానించారు. ఇందుకోసం ప్రత్యేక నీటి మార్గాలు, టైట పైపులైన్లు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం నిరంతరం ఉండేలా డిజైన్ చేశారు. వీటి నిర్మాణానికి అప్పట్లోనే విదేశీ నిపుణులను పిలిపించారు. తాజ్‌మహల్‌తోపాటు ఔరంగాబాద్‌లోని ప్రఖ్యాత బీబీకా మఖ్బారా తరహాలో వీటిని రూపొందించారని చెబుతారు. దీన్ని కుతుబ్‌షాహీ గార్డెన్ అని, డెక్కనీ గార్డెన్ అని పిలిచేవారు. కాలగర్భంలోకి.. కుతుబ్‌షాహీల హయాంలో 1590 వరకు ఈ అద్భుతవనం పరిమళాలతో విరాజిల్లింది. అసఫ్‌జాహీల జమానాలో కొంతకాలం ఉద్యానవనం కళకళలాడినా.. తర్వాత నిర్వహణ లోపంతో పతనమవుతూ.. చివరకు కాలగర్భంలో కలసిపోయింది. నిజాం ప్రభుత్వంలోని కొందరు ఈ భూములను ఇతరులకు ధారాదత్తం చేయడంతో విరుల తోట కాస్తా.. సాగుభూమిగా మారింది. కాలక్రమంలో పూర్తిగా వ్యవసాయ క్షేత్రంగా మారిపోయింది. పాత రికార్డుల్లో అది సర్కార్ జమీన్‌గా ఉండటం.. అది కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందా.. రాష్ట్ర ప్రభుత్వానిదా అన్న స్పష్టత లేకపోవడంతో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ల కిందట భూమిని స్వాధీనం చేసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థకు కేటాయించింది. అప్పటి నుంచి అక్కడ సాగు నిలిచిపోయింది. స్వచ్ఛంద సంస్థల పోరాటం.. హైదరాబాద్ స్టేట్‌లో పురావస్తు విభాగానికి మూలవ్యక్తిగా నిలిచిన గులామ్ యాజ్దానీ పరిశోధించి నయాఖిల్లా ప్రాంతంలో గొప్ప ఉద్యానవనం ఉండేదని వెలుగులోకి తెచ్చారు. తాను రాసిన పుస్తకంలో కూడా దాన్ని గొప్పగా ప్రస్తావించారు. ఇప్పట్లో మనకున్న చారిత్రక ఆధారం అదే. దాని ఆధారంగా ఆ వనాన్ని మళ్లీ వెలుగులోకి తేవాలంటూ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థలెన్నో పోరాటం చేసినా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్య విషయాన్ని ఢిల్లీలోని ఉన్నతాధికారులకు వివరించి అక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించారు. దీనికి ఇటీవలే అనుమతి రావటంతో వారం క్రితం పనులు మొదలుపెట్టారు. అద్భుత వనమది.. మొఘల్ గార్డెన్స్ తరహాలోనే ఈ కుతుబ్‌షాహీ గార్డెన్‌ను నిర్మించినట్టు తాజా ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి 10 ఎకరాల విస్తీర్ణంలో శాస్త్రీయ పరిశోధన జరుపుతున్నాం. మరింత లోతుగా పరిశోధన జరుపుతాం. ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారమిచ్చి అక్కడి ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం వందమంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ గార్డెన్‌ను పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి మూడు నెలల కాలాన్ని గడువుగా పెట్టుకుని పని చేస్తున్నాం. కొద్దిరోజుల్లోనే అపురూప కట్టడం పూర్తిగా బయటపడుతుంది. - కృష్ణయ్య, ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఆనవాళ్లు ఇలా.. * దాదాపు 28 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ వనంలోకి వెళ్లేందుకు విశాలమైన మెట్ల వరస నిర్మించారు. ఇందులో పై రెండు రాళ్లు మాత్రమే కనిపించేవి. తాజా తవ్వకాల్లో ఆ వరస బయటపడింది. * వనం మధ్యలో నీటితో నిండి అలరించిన విశాలమైన భారీ రాతి ట్యాంకులు బయటపడ్డాయి. ఇందులో 100 మీటర్ల పొడవు, వెడల్పున్న భారీ ట్యాంకుతో పాటు 37 మీటర్ల వైశాల్యంతో ఉన్న మరొకటి వెలుగు చూసింది. * వీటిల్లోకి నీటిని తరలించే కొన్ని కాలువల ఆనవాళ్లు కూడా వెలుగు చూశాయి. -
సమానత్వం కోసం వినూత్న యత్నం
హి ఫర్ షి స్త్రీ, పురుష సమానత్వం కోసం ప్రపంచ దేశాలలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) చాలాకాలంగా కృషిచేస్తున్నాయి. కొన్ని దేశాల్లోనైతే లైంగిక సమానత్వం కోసం ప్రభుత్వమే ప్రణాళికలను చేపడుతోంది. సమానత్వం ఉన్న చోట సమాజంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉంటుంది. అందుకే ఈ ప్రయత్నాలు. ఈ క్రమంలో ఇప్పుడు ఐరాస మహిళా విభాగం ఇటీవల న్యూఢిల్లీలో స్త్రీ, పురుష సమానత్వ ప్రచారోద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఆ ఉద్యమం పేరు ‘హి ఫర్ షి’. పేరులోనే కాదు, ఉద్దేశంలోనూ నవ్యత ఉన్న కార్యక్రమం ఇది. 2030ని ఒక గడువుగా పెట్టుకుని ఆనాటికల్లా స్త్రీ, పురుష సమానత్వం సాధించడం కోసం అంతర్జాతీయంగా బాలురు, పురుషుల సహాయంతో ముందుకెళ్లాలని 'హ ఫర్ షి’ ద్వారా సమితి సంకల్పించింది. ‘హి ఫర్ షి’ అంటే.. ఆమె కోసం అతడు అని. ఈ నినాదంతో మహిళా సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పురుషుల సేవలను, సహకారాన్ని తీసుకుని తద్వారా లైంగిక సమానత్వం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమితి మహిళా ప్రతినిధి రెబెక్కా టవేర్స్’ ప్రకటించారు. ఇందుకోసం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘మెన్ఎంగేజ్’ అనే సంస్థ నేతృత్వంలో బాలురు, పురుషుల సహాయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. తొలుత ఈ ఏడాది సెప్టెంబరు 20న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రారంభమైన ‘హి ఫర్ షి’ ప్రచారోద్యమాన్ని, మనదేశంలో అక్టోబర్ 18న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది బాలురు, పురుషుల నుంచి ప్రతిజ్ఞా సంతకాన్ని సమితి సేకరించింది. అందులో 4000 మంది భారతీయులు ఉన్నారు. ఇలా ప్రతిజ్ఞ చేసినవారు స్త్రీల హక్కుల కోసం తమ వంతుగా పాటు పడవలసి ఉంటుంది. స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలలో తమ గళం వినిపించవలసి ఉంటుంది. స్త్రీల సమస్యలపై మగవాళ్లలో సహానుభూతి కల్పించి, లైంగిక సమానత్వం సాధించడం కోసం గత నాలుగు మాసాలుగా భారత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని చెబుతూ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం కూడా లైంగిక సమానత్వానికి మరింతగా తోడ్పడుతుందని మనేకా గాంధీ అన్నారు. బాలురు, పురుషులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ‘హి ఫర్ షి’ లో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు ‘మెన్ ఎంగేజ్’ సంస్థ నవంబర్ 10 నుంచి 13 వరకు నాలుగురోజుల పాటు తన రెండవ అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించబోతోంది. ‘లైంగిక సమానత్వం కోసం బాలురు, యువకులు’ అనే ప్రధానాంశంగా ఈ సదస్సు జరగనుంది. దీనిపై ‘సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్’ ప్రతినిధి అభిజిత్ మాట్లాడుతూ... ‘‘స్త్రీల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడమే అసలైన పురుషత్వం అనే భావనను బాలురు, పురుషులలో కలిగించ డమే ‘మెన్ ఎంగేజ్’ లక్ష్యం అని అన్నారు. ఇంత ఉన్నతమైన లక్ష్యానికి దేశంలోని బాలురు, పురుషులంతా సహకరిస్తే, తమ మద్దతు ప్రకటిస్తే స్త్రీ పురుష సమానత్వాన్ని గడువులోపలే సాధించవచ్చు. మగవాళ్లకు అవగాహన కల్పించాలి స్త్రీ, పురుష సమానత్వ సాధనలో పురుషుల భాగస్వామ్యమే కీలకం. స్త్రీలు ఎదుర్కొంటున్న సామాజిక ఆంక్షలు, కుటుంబ అవరోధాలపై గనుక బాలురకు, పురుషులకు అవగాహన కలిగించగలిగితే లైంగిక అసమానతలు త్వరలోనే రూపుమాసిపోతాయి. - మనేకాగాంధీ, కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి -
దీపం వెలిగించాడు!
సొంత విజయంతోనే సంతృప్తి పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. కార్తికేయన్ విజయకుమార్ చెన్నైలో స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో సీనియర్లు బిట్స్ పిలాని గురించి గొప్పగా మాట్లాడుతుండేవారు. అక్కడ చదవాలనే కోరిక అలా మొదటిసారిగా కలిగింది. కేవలం కల కనడానికే పరిమితం కాకుండా దాన్ని నిజం చేసుకున్నాడు కార్తికేయన్. అక్కడ తనకొక విశాల ప్రపంచం పరిచయం అయింది. సీనియర్లు ఎందరో తనకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పేవాళ్లు. ‘‘భవిష్యత్‌లో నేను విజయవంతమైన వ్యాపారిని కావాలి’’ అనుకోవడానికి ఈ మాటలు తోడ్పడ్డాయి. చదువు పూర్తయిన తరువాత తన మిత్రుడితో కలిసి అరవైవేల రూపాయలతో ‘ఎక్సెడోస్’ పేరుతో బిజినెస్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. సంవత్సర కాలంలోనే లాభాలు చేతికందాయి. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఆఫీసు ఉండేది కాదు. రెండు ల్యాప్‌టాప్‌లతో తమ గది నుంచే వ్యాపారాన్ని కొనసాగించేవారు. సంవత్సరం తరువాత మాత్రం వివిధ ప్రాజెక్ట్‌లలో తమ దగ్గర వందమంది ఉద్యోగులు పనిచేశారు. తన విజయంతోనే సంతృప్తిని పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. ‘‘కొందరికి ప్రతిభ ఉన్నా సౌకర్యాలు ఉండవు. వాటిని అందేలా చేస్తే గొప్ప విజయాలు సాధించగలరు’’ అంటాడు కార్తికేయన్. పేద విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్లలో తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. తన తీరిక సమాయాన్ని వినోదానికో, విహారానికో వెచ్చించకుండా పేద విద్యార్థులతో గడపడానికి వెచ్చించేవాడు. ‘దీపం’కు సంబంధించి మరెన్నో కార్యక్రమాల రూపకల్పనలో తలమునకలై ఉన్నాడు ముప్పైరెండు సంవత్సరాల కార్తికేయన్ విజయకుమార్. -
పక్కకి వెళ్లి ఏడ్చేవాడిని!
పుణే: డకౌట్ అయినా... సెంచరీ చేజార్చుకున్నా... బౌలర్లు రెచ్చగొట్టినా... అంతగా స్పందించని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నారుల మాటలకు మాత్రం చలించిపోయేవాడట. పుణేలో ఒక చారిటీ సంస్థ కోసం ఆదివారం జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమం సందర్భంగా స్వయంగా సచిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘జీవిత చరమాంకంలో ఉన్న చిన్నారుల ఆకాంక్ష తీర్చేందుకు పనిచేసే ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’ సంస్థ ద్వారా చిన్నారులను నా ఇంట్లో కలిసేవాణ్ని. వాళ్లతో మాట్లాడాక... వారి బాధలు విన్నాక చాలా భావోద్వేగానికి లోనయ్యేవాణ్ని. కన్నీళ్లు ఆపుకోలేకపోయేవాడిని. ఒక్కోసారి వేరే గదిలోకి వెళ్లి ఏడ్చేవాడిని’ అని సచిన్ వివరించాడు. ఈ చారిటీ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌కు చెందిన మూడు వస్తువులను వేలం వేశారు. ఈ వేలం ద్వారా మొత్తం రూ. 58 లక్షలు వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో సచిన్ ధరించిన ‘టై’కు రూ. 3 లక్షలు... 2010 దక్షిణాఫ్రికా పర్యటనలో వేసుకున్న జెర్సీకి రూ. 5 లక్షలు... కెరీర్లో వాడిన బ్యాట్‌కు అత్యధికంగా రూ. 50 లక్షల ధర పలికింది. -
ధర్మం చెయ్యొద్దు బాబూ!
త్వరలో ‘యాచకులు లేని నగరం’ అమలుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహనకు ముమ్మర ప్రచారం ‘గౌరవ సదన్’ల ఏర్పాటుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: ‘యాచకులకు మీరు ధర్మం చేయవద్దు. వారు ఆ వృత్తిని వదిలి... సాధారణ ప్రజల్లాగా జీవించాలంటే ఇంతకంటే మరో మార్గం లేద’టూ జీహెచ్ఎంసీ ప్రచారం చేయనుంది. గ్రేటర్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు.. రహదారుల పొడవునా వీరి వల్ల ప్రజలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారంతో పాటు నగరంలో యాచ క వృత్తిని నిరోధించేందుకు జీహెచ్ఎం సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ కోసం సన్నాహాలు ప్రారంభిం చింది. యా చకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ ‘దారి’ నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విస్తృత ప్రచారం చేపట్టనుంది. బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా ‘భిక్షాటనను ప్రోత్సహించవద్దు’ అంటూ ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఇలాంటి స్లోగన్లు, డిజైన్లు తయారు చేశారు. త్వరలోనే వీటితో ప్రచారం చేయనున్నారు. ఈ అంశం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏదైనా రంగంలో ప్రసిద్ధి చెందిన వారిని (లెజెండ్‌ను) ఈ కార్యక్రమానికి అంబాసిడర్(ప్రచారకర్త)గా నియమించాలని భావిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి అంబాసిడర్‌ను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా బలవంతంగా యాచన చేయిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ (నెంబరు 040- 21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయనున్నారు. స్థితిగతులపై సర్వే నగరంలో దాదాపు 20 వేల మంది యాచకులు ఉన్నట్టు జీహెచ్ఎంసీ సర్వేలో తేలింది. వీరిలో రాత్రి బస చేసేందుకు కనీసం నీడ కరువైన వారు దాదాపు వెయ్యి మంది ఉన్నారు. భిక్షాటన ద్వారా వారికి రోజుకు లభిస్తున్న సగటు ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ, ఎలాంటి ఆశ్రయం పొందుతున్నారు..? వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు.. తదితర అంశాలను సేకరించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు? వీరి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న వంద జంక్షన్ల వివరాలు సేకరించారు. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకుస్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా యాచకుల్లోని వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ తరఫున తొలిదశలో జోన్‌కు ఒకకేంద్రం చొప్పున ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించనున్నారు. వాటికి ‘గౌరవసదన్’లుగా నామకరణం చేయనున్నారు. వాటిలో ఉండే వారికి ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెల వంటి వాటికి కొంత నగదు ఇస్తారు. పని చేయగలిగిన శక్తి ఉన్న వారికి పనులు చూపిస్తారు. -
కోరికలను అదుపులో పెట్టుకోవాలి
తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యతలు నేర్పించాలి మహా సహస్రావధాని గరికపాటి నర్సింహారావు మహబూబాబాద్ టౌన్ : మనల్ని అభివృద్ధి చేసేది, నాశ నం చేసేది కోరికలేనని, ఆ కోరికలను ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకోవాలని మహాసహస్రావధాని, అవధాన శార ద గరికపాటి నర్సింహారావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కామధేను గోశాల శ్రీ బం డ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో సోమవా రం రాత్రి ‘పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత’ అనే అంశం పై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి నర్సింహారావు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, నాగరికతను అంది పుచ్చుకోవడంలో ఇతర భాషల వారి కంటే భారతీయులు ముందంజలో ఉన్నారన్నారు. ఇంగ్లీష్ వాఖ్యాలు వచ్చాక సంస్కృతి, ఆచారాలు, నాగరికత మారిపోయాయన్నారు. మార్పును మంచి కోసమే వినియోగించాలి తప్ప నాశనానికి వినియోగించవద్దన్నారు. తెలుగు విద్యా విధానం అమల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అంటే ఏమిటో తెలియదన్నా రు. ఎల్కేజీ చదవాలంటే ప్రస్తుత రోజుల్లో మోతలు, లగేజీలు, ప్యాకే జీలు, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నారు. గతాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని, కళలను ప్రోత్సహించాలన్నారు. నాటి రోజుల్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే పదాలు మొదటి పేజీల్లో ఉంటే నేడు ఏబీసీడీలు మొదటికి చేరుకుని తెలుగుపై పెత్తనం చేయాలని చూస్తున్నాయన్నారు. భాషపై ద్వేషం ఏమి లేదంటూ ఏబీసీడీలు కాదు, అ,ఆ,ఇ,ఈలు కూడా ముఖ్యమేనన్నారు. విద్యార్థుల ధర్మం చదువుకోవటమేనని తెల్పుతూ తల్లిదండ్రులు కూడా అందుకు తగ్గట్టుగా వారి అలవాట్లపై శ్రద్ధ కనపరచాలన్నారు. మనం ఏ పని చేస్తున్నామో దానిపైనే దృష్టి పెట్టాలని, అప్పుడే ఆ పనిపై విజయం సాధించగలుగుతామన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు మానసికోల్లాసాన్ని కల్గిస్తూ విద్యా భోదన చేయాలని తెలిపారు. విద్యార్దులను భాగు చేసే అవకాశం వచ్చిందని అనుకోవాలన్నా రు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు గర్రెపెల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ భువనగిరి అనిల్‌గుప్త, ఇమ్మడి వెంకటేశ్వర్లు, భార్గవి, తమ్మి ఉపేందర్‌రావు, కొత్త సోమన్న, నాళ్ళ ప్రకా శ్, రాంకిషన్ ఝవర్, ప్రతాపని విశ్వనాధం, డాక్టర్ అశోక్, మహ్మ ద్ సుభాని, దైద వెంక న్న పాల్గొన్నారు. -
ఇన్ఫోసిస్ శిబులాల్ భూరి విరాళం
కొచ్చి: సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్ డీ శిబులాల్ భూరి విరాళం ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాల కోసం తమ ఫౌండేషన్లకు రూ.36 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు శిబురాల్, ఆయన సతీమణి కుమారి శిబురాల్ తెలిపారు. ఈ మొత్తాన్ని అనాధ పిల్లలకు సేవలందిస్తున్న సరోజిని దామోదరన్ ఫౌండేషన్(ఎస్ డీఎఫ్), అద్వైత ఫౌండేషన్ లకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తమ ఫౌండేషన్ల ద్వారా గత 15 ఏళ్లుగా శిబులాల్ దంపతులు దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. అనాధ పిల్లలకు విద్యనందించేందుకు 1995లో ఎస్ డీఎ స్థాపించారు. దీనిద్వారా ఇప్పటివరకు 3,306 విద్యార్థులకు చేయూతనందించారు. -
నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి,బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011లో గెజిటెడ్ పోస్టుల నియామకాలను రద్ధు చేస్తూ మంత్రిమండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో అదమ్యచేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్వీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోస్టుల రద్దు విషయంలో ప్రభుత్వ నిర్ణయం సబబుగా లేదన్నారు. తప్పు జరిగినట్లు ఇప్పటికే తేటతెల్లమయ్యిందని, ఇందుకు కారణమైనవారిని కూడా సీఐడీ గుర్తించిందని అన్నారు. వారిని శిక్షిస్తే సరిపోతుందన్నారు. అయితే నియామకాలను రద్దు చేస్తూ ఎంపికైన అభ్యర్థులందరినీ బాధపెట్టడం సరికాదన్నారు. కర్ణాటకలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసు సిబ్బందిని ముఖ్యంగా మహిళలను ఎక్కువగా నియమించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కాగా, అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ తారాతో సహా పలువురు బీజేపీ మహిళా విభాగం నాయకులు అనంతకుమార్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఒంటరి బతుకుల్లో రాఖీ వసంతం
బృందావనంలో తొలిసారి వితంతువుల వేడుకలు బృందావనం: భర్తను కోల్పోయి ఇంటికే పరిమితమైన వితంతువులను సమాజంలో భాగం చేయడానికి ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ప్రయత్నం ఫలించింది. శనివారం దాదాపు 800 మంది వితంతువులు అన్ని కట్టుబాట్లను విడనాడి తొలిసారిగా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తమకు దక్కిన భాగ్యానికి మురిసిపోతూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. శ్రీకృష్ణుడి రంగ స్థలమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బృందావనం ఇందుకు వేదికైంది. ఢిల్లీలోని వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన పిల్లలకు, బృందావనంలో తిరుగాడే సాధువులకు వితంతువులు రాఖీలు కట్టారు. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఇక్కడి మీరా సహభాగినీ ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ ఇక్కడి ఐదు ఆశ్రమాల్లో ఉంటున్న దాదాపు వెయ్యి మంది వితంతువుల బాగోగులు చూసుకుంటోంది. వీరంతా గతంలో హోలీ, దీపావళి వేడుకల్లో కూడా ఇలాగే పాల్గొన్నారు. ఇప్పుడు రక్షా బంధన్ పండుగనూ ఉత్సాహంగా జరుపుకొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వీరు కట్టిన రంగురంగుల రాఖీలను కూడా వితంతువులే తయారు చేయడం విశేషం. దాదాపు వంద మంది వృద్ధ మహిళలు వీటిని రూపొందిం చారు. వితంతువుల పట్ల సమాజ దృక్పథంలో మార్పు తేవడానికే ఈ ప్రయత్నమని సులభ్ సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ తెలిపారు. ఇక తమ సంక్షేమానికి కృషి చేయాలని కోరుతూ బృందావన్‌లోని వితంతువుల తరఫున దాదాపు 2 వేల రాఖీలతో ఓ బృందం ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
అర్బన్ హెల్త్‌సెంటర్లకు హంగులు
సాక్షి, కరీంనగర్ : పట్టణ ఆరోగ్యకేంద్రాలకు మహర్దశ పట్టనుంది. ఏళ్లనుంచి స్వచ్ఛంద సంస్థల చేతిలో కొనసాగుతూ లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్న ఈ కేంద్రాలను జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) కిందకు చేర్చి మెరుగైన వైద్యం అందించనున్నారు. నిర్వహణను ఆయా మున్సిపాలిటీలకే అప్పగించనున్నారు.పట్టణ ప్రజలకు వైద్యసేవలందించేందుకు 2000లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేం ద్రాలు లక్ష్యం చేరలేదు. గోదావరిఖనిలో ఆరు, కరీంనగర్, జగిత్యాలలో మూడు, సిరిసిల్లలో రెండు, కోరుట్ల, మెట్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున జిల్లాలో మొత్తం 16 అర్బన్ హెల్త్సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఓ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్‌వాచ్‌మన్, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించుకోవాలని సూచించింది. అవసరమయ్యే మందులు ప్రభుత్వమే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తుంది. ఒక్కో కేంద్రం నిర్వహణ కోసం ప్రతినెల రూ.66,700 కేటాయిస్తుంది. ఎన్జీవోలు ఒక్కొక్కరికి ఒక్కోలా వేతనాలు చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం సమయానికి కూడా తెరుచుకోవడం లేదు. ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్లు సాధించిన ప్రగతిని తెలుసుకుంటూ లక్ష్యాలు సాధించని నిర్వాహకుల నుంచి కేంద్రాలు స్వాధీనం చేసుకుని నిర్వహణను సమీప కేంద్రాలు, వైద్యారోగ్యశాఖకు అప్పగిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో మెట్పల్లి, గోదావరిఖని లోని అల్లూరు, జగిత్యాలలో ఓ కేంద్రాన్ని రద్దు చేసి.. వాటి నిర్వహణను వైద్యశాఖకు అప్పగించింది. మరోపక్క.. స్వీపర్లు, వాచ్మెన్లు, అవసరం మేరకు వైద్య సిబ్బందిని నియమించక ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సంఘటనలు పలు కేంద్రాల్లో చోటు చేసుకున్నాయి. ఇవి అధికారుల దృష్టికి రావడంతో నిధులు ఆపేశారు. మెరుగైన వైద్యం పట్టణాలు, నగరాల్లోనూ మెరుగైన సేవల కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అర్బన్హెల్త్సెంటర్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థల నుంచి తప్పించి ఎన్యూహెచ్ం కిందను తీసుకువచ్చి మున్సిపాలటీలకే అప్పగించాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించనున్నారు. ఇప్పటివరకు 15 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన ప్రభుత్వం త్వరలో 50 వేల జనాభాకు ఒక కేంద్రం కేటాయించనున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అర్బన్‌హెల్త్ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉండగా ఇకపై కనీసం ముగ్గురు వైద్యులుండేలా చర్యలు తీసుకుంటోంది. అదనంగా ముగ్గురు ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్‌వైజర్‌తోపాటు జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. అద్దె భవనాల్లో కొనసాగుతోన్న కోరుట్ల, మెట్పల్లి, ఫైవింక్లయిన్కాలనీ, కట్టరాంపూర్ కేంద్రాలకు సొంత భవనాలు రానున్నాయి. ఇప్పటి కే రాష్ట్ర వైద్యాధికారులు మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులకు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కావాల్సిన వసతులపై అధికారులు కసరత్తు పూర్తి చేసి తాజాగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. -
మావోలకు సహకరిస్తే కఠిన చర్యలు: కేంద్రం
న్యూఢిల్లీ: మావోయిస్టులకు సహకరించే స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు చేపట్టనున్నామని కేంద్రం హెచ్చరించింది. ఆయా సంస్థలు చట్టపరంగా విరాళాలు సేకరించి మావోకు అందించడం ద్వారా.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు బుధవారం తెలిపారు. దేశంలోని కొందరు నక్సల్స్ ఫిలిప్పీన్స్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి శిక్షణ పొందినట్లు ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ముంబై దాడుల తర్వాత తీరప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రిజిజు తెలిపారు. తూర్పు, పశ్చిమ తీరాల వెంట పెట్రోలింగ్‌ను పెంచామని రాజ్యసభకు చెప్పారు. వివిధ విభాగాలతో సమాచారం పంచుకునేందుకు నావికాదళం ముంబై, విశాఖపట్నం, కొచ్చి, పోర్ట్బ్లెయిర్లో కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన తీవ్రవాద కేసుల్లో విడుదలవుతున్న వారందరినీ నిర్దోషులని చెప్పలేమని రిజిజు అన్నారు. అనేక కేసుల్లో సాక్ష్యాలు లేకనే నిందితులు విడుదలవుతున్నారన్నారు.