కరాచి: పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 163 మంది భారత జాలర్లకు ఆదివారం విముక్తి లభించింది. ఇటీవల రష్యాలో ఇరు దేశ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్‌ల మధ్య జరిగిన ఒప్పందం మేరకు లంధి, మలిర్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జాలర్లను పాక్ విడుదల చేసింది. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. లాహోర్ మీదుగా వాఘా సరిహద్దులో సోమవారం భారత అధికారులకు అప్పగించనున్నారు. జాలర్లు తిరిగి భారత్‌కు వచ్చే సందర్భంగా అక్కడి స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్రాలు బహుమతులతో పాటు దారి ఖర్చుల కోసం కొత్త మొత్తాన్ని ఇచ్చాయి.
ఇరు దేశ ప్రధానుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా దేశాల్లో బందీలుగా ఉన్న జాలర్లను 15 రోజుల్లోగా వారి బోట్లతో సహా విడుదల చేయాలి. దీని ప్రకారం పాక్ జైళ్లలోని 355 మంది భారత జాలర్లు, భారత జైళ్లలోని 27 మంది పాక్ జాలర్లకు విముక్తి లభించనుంది.
163 మంది భారత జాలర్ల విడుదల
Published Mon, Aug 3 2015 2:22 AM | Last Updated on Thu, May 24 2018 1:33 PM
Advertisement
Advertisement