రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు | Documentaries on registrations | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు

Published Wed, Oct 21 2015 2:50 AM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు - Sakshi

రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు

♦ అందుబాటులోకి తెచ్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
♦ వివిధ రకాల రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించే యత్నం
♦ సలహాలు, సూచనలతో నాలుగు డాక్యుమెంటరీలకు రూపకల్పన
 
 సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, స్థలాలు, ఆపార్ట్‌మెంట్ల కొనుగోళ్ల సమయంలో అన్నీ నేనే చూసుకుంటాననే బ్రోకర్ల మాయలో పడి అనసరమైన పాట్లు పడవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హెచ్చరిస్తోంది. ఆస్తుల కొనుగోళ్ల విషయంలోనే కాదు.. విద్యా సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన సొసైటీల రిజిస్ట్రేషన్, బిజినెస్, కంపెనీలు ప్రారంభించేందుకు అవసరమైన ఫర్మ్ రిజిస్ట్రేషన్లపైనా అవగాహన కలిగుంటే మేలని సూచిస్తోంది. వివాహం రిజిస్ట్రేషన్ జరగకుంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఇబ్బందులను కూడా తెలియజేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కొత్త పంథా ఎంచుకున్నారు.

ఆయా అంశాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, రిజిస్ట్రేషన్‌పై కల్పించేందుకు 4 లఘుచిత్రాలు రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రతిచోటా ఈ లఘు చిత్రాలను వీక్షించేలా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ registration.telangana.gov.in/videogallery.jsp ద్వారా అందుబాటులోకి తెచ్చారు. లఘు చిత్రాలు ఇవీ..

 సమస్యల్లేని ఆస్తినే ఎంచుకోండి
 ఆస్తుల కొనుగోలు సమయంలో వాటి గత చరిత్ర తెలుసుకోకుంటే వచ్చే చిక్కులపై ‘జాగ్రత్త’ లఘుచిత్రంలో కళ్లకుకట్టారు. తక్కువ రేటుకు వస్తుందని సమస్యలున్న ప్రాపర్టీ కొనుక్కోవడం కంటే ప్రాబ్లమ్ లేని ఆస్తిని ఎంచుకోవడమే మేలని ఇందులో చూపారు. కొనబోయే ఆస్తి గత చరిత్రను లింక్ డాక్యుమెంట్, ఈసీ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చని, ఆపార్ట్‌మెంట్ల విషయంలో మున్సిపల్ అప్రూవల్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే కార్ పార్కింగ్, అన్‌డివెడైడ్ స్పేస్ వివరాలను కూడా డాక్యుమెంట్లలో పొందుపరిచా రో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని చెబుతోందీ చిత్రం.

 సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
 స్కూల్, స్వచ్ఛంద సంస్థలు స్థాపించాలన్నా సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని మరో లఘుచిత్రంలో తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ వల్ల ఆదాయపు పన్ను మినహాయింపు, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, బ్యాంకుల నుంచి సాయం పొందే వీలుంటుందని వివరించారు. స్వచ్ఛంద సంస్థ లు నిర్వహించే సామాజిక సేవలు, క్రీడలు, కళలకు ప్రోత్సాహం, సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు.

 ఫర్మ్ రిజిస్ట్రేషన్ వివరాలివీ..
 ఏదైనా వ్యాపారం లేదా కంపెనీ ప్రారంభించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చే యించుకోవాలంటూ మరో లఘచిత్రంలో తెలిపారు. సంబంధిత వివరాలను వినియోగదారుల దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇన్‌కంట్యాక్స్ ఇబ్బందులు, సివిల్ కేసుల సమస్య తలెత్తకుండాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమమని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవసరమని పేర్కొన్నారు. వ్యాపారానికి సంబంధించి పార్టనర్‌షిప్ డీడ్, కార్యాలయ లీజు డీడ్.. తదితర పత్రాలతో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే రిజిస్ట్రేషన్ ఎంతో సులభ మని ఈ చిత్రంలో చూపించారు.

 పెళ్లిని నమోదు చేయించుకోండి
 వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఇంకో లఘుచిత్రంలో చూపించారు. విదేశాల్లో పని చేస్తున్న యువకులు స్వదేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి అక్కడికి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ అయ్యే సమయంలో అయినా వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే జరిగిన వివాహాలను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చే సుకోవచ్చు. కుల, మతాంత ర వివాహాలను స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కింద నమోదు చేసుకోవచ్చని లఘు చిత్రంలో చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement