పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు.. | Government has the opportunity to take back the property | Sakshi
Sakshi News home page

పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు..

Published Wed, Jan 8 2025 5:28 AM | Last Updated on Wed, Jan 8 2025 5:28 AM

Government has the opportunity to take back the property

తల్లిదండ్రులు పిల్లలకు చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకునే అవకాశం 

ట్రిబ్యునల్‌ ఆదేశాలను పాటించాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశం

సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్, సెటిల్‌మెంట్‌ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. 

నిబంధనల ప్రకా­రం ట్రిబ్యునల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవో నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ శేషగిరిబాబు మంగళవారం ఒక సర్క్యులర్‌ జారీ చేశారు.

తల్లితండ్రుల నుంచి ఆస్తిని రాయించుకున్నాక వారి పిల్లలు పట్టించుకోకపోవడం, వారి రోజువారీ జీవనం, నిర్వహణ బాధ్యత కూడా తీసుకోకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడు­తున్న ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అలాంటి వారికి రక్షణ ఇచ్చేందుకు 2007 సీనియర్‌ సిటిజన్‌ చ­ట్టం వచ్చింది. 

దీని ప్రకారం తల్లితండ్రులు తమను పి­ల్లలు పట్టించుకోవడంలేదని సీనియర్‌ సిటిజన్‌ ట్రి­బ్యు­నల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవోకు ఫిర్యాదు చే­యొచ్చు. విచారణలో తల్లితండ్రులను వారి పిల్లలు చూ­డడం లేదని ఆర్డీవో నిర్ధారించి ఆర్డర్‌ ఇవ్వడానికి అ­వకాశం ఉంది. అలా ఆర్డర్‌ ఇస్తూ వారి ఆస్తిని వెనక్కి ఇ­వ్వాలని సూచించినా రిజిస్ట్రేషన్ల చట్టంలో ఉన్న అ­స్పష్టత కారణంగా అది అమలయ్యేది కాదు. 

ఇ­ప్పుడు దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సర్క్యులర్‌లో స్ప­ష్టత ఇచ్చారు. ట్రిబ్యునల్‌ ఆర్డర్‌ ప్రకారం ఆ ఆస్తిని గ­తంలో పిల్లలకు రాసిస్తూ తల్లితండ్రులు చేసిన సెటిల్‌మెంట్, గిఫ్ట్‌ డీడ్‌లను రద్దు చేయాలని స్పష్టం చే­శా­రు. ఒకవేళ అలాంటి ఆర్డర్‌ను నేరుగా తల్లితండ్రు­లు తీసు­కువచ్చి­నా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకో­వాలని సూచించారు. తల్లితండ్రులు ఆస్తిని వెనక్కి తీసుకునే నిమిత్తం ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఎలాంటి ఆదేశా­లనైనా రిజిస్ట్రేషన్‌ అధికారులు పాటించాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement