Registration Department
-
పన్ను రాబడులపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: పన్నుల ఆదాయమే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌ను ప్రతిపాదించింది. మొత్తం రాబడుల్లో 58 శాతం పన్నుల రూపంలోనే అందుతాయని అంచనా వేసింది. పన్నుల రూపంలో మొత్తం రూ.1.75 లక్షల కోట్లు సమకూరుతాయని పేర్కొనగా.. అందులో రాష్ట్ర సొంత పన్నుల రాబడులే రూ.1.45 లక్షల కోట్ల మేర ఉంటాయని అంచనా వేసింది. ఈసారి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.51 వేల కోట్లు, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19 వేల కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.27 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.37 వేల కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ.8,535 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.1,38,181.26 కోట్లు పన్నుల రాబడి ఉంటుందని గత బడ్జెట్లో వస్తుందని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో రూ.1,29,406.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. అంటే బడ్జెట్ అంచనాల కంటే తగ్గినది రూ.8 వేల కోట్లు మాత్రమేకావడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం భారీగా పన్నుల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ల శాఖపై ఆశలు..వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,228 కోట్లు సమకూరుతాయని గత బడ్జెట్లో పేర్కొన్నా.. సవరించిన అంచనాల మేరకు ఇది రూ.14,692 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం ఈసారి రూ.19,087.26 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది. ఇది గత బడ్జెట్ ప్రతిపాదన కంటే రూ.1,000 కోట్లు, సవరించిన అంచనా కంటే రూ.5 వేల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. భూముల విలువల సవరణ తోపాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.పన్నేతర ఆదాయం ఎలా?బడ్జెట్లో పన్నేతర ఆదాయం అంచనాలు కూడా పెద్దగా తగ్గలేదు. ఈ పద్దు కింద 2024–25లో రూ.35వేల కోట్లు వస్తాయని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ.25,807 కోట్లు సమకూరుతోంది. అంటే రూ.10వేల కోట్లు తేడా ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పన్నేతర ఆదాయం అంచనాలను రూ.31,611.47 కోట్లుగా చూపింది. ఇందులో మైనింగ్ రాయల్టీ, సీవరేజీ ఫీజు, ఇసుక ద్వారా ఆదాయం కింద రూ.8 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. మరో రూ.21 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమకూర్చుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కూడా పెంచారు. 2024–25లో రూ.21,636.15 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరణలో రూ.19,836 కోట్లు వస్తున్నట్టు చూపెట్టారు. ఎక్సైజ్ ఆదాయమూ కీలకమే..2024–25 సవరణ అంచనాల మేరకు ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరుతుండగా.. 2025–26లో రూ. 27,623.36 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. ఇది సుమారు రూ.2 వేల కోట్లు అదనం. ఈ ఏడాదిలో వైన్ (ఏ4) షాపులకు లైసెన్సు గడువు ముగియనుండటంతో.. టెండర్లు పిలవనున్నారు. వైన్‌షాపుల కోసం వచ్చే దరఖాస్తుల ఫీజు రూపంలో ఈ మొత్తం సమకూర్చు కోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు.పట్టణాలకురూ. 17,677 కోట్లు» నిర్వహణ వ్యయంరూ.7,639.57 కోట్లు »ప్రగతి పద్దు రూ. 8,796.73 కోట్లు »గతేడాది కంటే ప్రగతి పద్దు రూ.3 వేల కోట్లు అధికం »మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు»2025–26 బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్లో పురపాలక శాఖకు రూ.17,677 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు రూ.7,639.96 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.8,796.73 కోట్లు ప్రతిపాదించింది. 2024–25 బడ్జెట్లో ఈ శాఖకు ప్రగతి పద్దు రూ.5,642.35 కోట్లు ఉండగా, ఈసారి రూ.3 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఇందులో పట్టణాభివృద్ధి కోసం రూ.2,957.58 కోట్లు, ప్రజారోగ్యం కోసం రూ.525.47 కోట్లు ప్రతిపాదించారు. గత సంవత్సరం సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.106.07 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,700 కోట్లు, వాటర్‌బోర్డుకు రూ.635 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పేదింటికి కొంతే.. కావాల్సింది రూ.22,500 కోట్లు.. ఇచ్చింది రూ.12,571 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 22,500 కోట్లు అవసరమన్నది గృహనిర్మాణ శాఖ లెక్కలు. కానీ, తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.12,571 కోట్లను ప్రతిపాదించింది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. గత బడ్జెట్లో రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాదని ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 72 వేల ఇళ్లకు సంబంధించి ముగ్గుపోసుకునే పనిని లబ్దిదారులు ప్రారంభించారు. ఈనెలాఖరుకు తొలివిడత రూ.లక్ష వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇప్పుడు నిధుల అవసరం చాలా ఉంది. దీంతో ప్రతిపాదించిన నిధులు, మంజూరు చేస్తున్న ఇళ్ల సంఖ్య ప్రకారం చూస్తే సరిపోదు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఆ ఇళ్లన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉండదన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. రెండుమూడు విడతల నిధుల విడుదలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఈ కేటాయింపులు సరిపోతాయన్న అంచనాతో ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇవ్వాల్సి ఉంది. అక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. -
ఎల్ఆర్ఎస్.. సర్కారు ఆశలు తుస్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ద్వారా సుమారు రూ.20 వేలకోట్ల ఆదాయం పొందాలని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతోంది. మార్చి నెలాఖరుకల్లా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత ఫీజు ద్వారా క్రమబద్ధీకరించాలని తీసుకున్న నిర్ణయం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పురపాలక శాఖలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన పోర్టల్‌ను రిజిస్ట్రార్ కార్యాలయాల సర్వర్లతో అనుసంధానం చేసి.. స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించారు. కానీ ఎల్ఆర్ఎస్కు కనీస స్పందన కూడా రావడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారు 336 మంది, వచ్చిన ఆదాయం రూ.1.16 కోట్లు మాత్రమే. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏలలో కలిపి సోమవారం ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించినవారు 42 మంది, సమకూరిన మొత్తం రూ.34.25 లక్షలు మాత్రమేకావడం గమనార్హం. 11 రోజుల ఆదాయం రూ.47 కోట్లే! రాష్ట్రంలో 2020లో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 25.67 లక్షలు.. అందులో 20లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. మరో 2.5 లక్షల దరఖాస్తులు చెరువులు, కుంటలకు 200 మీటర్ల పరిధిలో ఉన్నవికాగా, మిగతావాటిని ఇతర కారణాలతో తిరస్కరించారు. మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులు 14.45 లక్షలు. ఇందులో 13,322 దరఖాస్తులకు సంబంధించి రూ.103.13 కోట్లను గతంలోనే చెల్లించారు. వీటిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులను స్వీకరిస్తుండగా.. ఇప్పటివరకు 7,188 దరఖాస్తులకు సంబంధించి రూ.47 కోట్లు మాత్రమే సమకూరడం గమనార్హం. దీనితో జీహెచ్ఎంసీ మినహా మిగతా పురపాలికల్లో.. 20,510 దరఖాస్తుల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి రూ.151.31 కోట్లు అందాయి. ఇక హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీల నుంచి కలిపి గతంలో 600 మంది వరకు ఫీజులు చెల్లించగా.. ఇప్పుడా సంఖ్య సుమారు 2వేల వరకు ఉండొచ్చని, సమకూరిన మొత్తం రూ.10 కోట్ల వరకే ఉంటుందని అంచనా. భూముల విలువ, ఓపెన్ స్పేస్ చార్జీల్లో తేడాలతో.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో భూమి కొనుగోలు విలువ, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నప్పటి విలువతోపాటు ఓపెన్ స్పేస్ చార్జీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధరల్లో తేడాలు వస్తున్నాయని తెలిసింది. దీనితో దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించడం లేదని సమాచారం. అలాగే రెవెన్యూ గ్రామం పేరు, దరఖాస్తుదారు పేర్కొన్న కాలనీ, గ్రామం పేర్లు వేరుగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ దరఖాస్తులను తిరస్కరించడం లేదా ఫీజుల్లో తేడా చూపించడం జరుగుతోంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తేవడంతో.. ఆన్లైన్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గా సమస్యను పరిష్కరిస్తున్నట్టు డీటీసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఇకపై వేగం పుంజుకుంటుందని చెప్పారు. ఇంకా 20 రోజులే గడువు! ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని.. మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలికల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిష్కారానికి అర్హమైన దరఖాస్తులు 20 లక్షలకుపైనే ఉండగా.. ఇప్పటివరకు లక్ష దరఖాస్తులకు కూడా మోక్షం లభించలేదు. మరో 20 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో రోజుకు లక్ష దరఖాస్తులను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వం ఆశించిన రూ.20 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ లేఅవుట్లలోని స్థల యజమానులకు మంచి అవకాశం.. అక్రమ లేఅవుట్లలో కనీసం 10శాతం స్థలాల సేల్‌డీడ్స్ పూర్తయిన చోట్లలో మిగతా వారికి ఎల్ఆర్ఎస్ పథకం మంచి అవకాశం. వారు గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోకపోయినా, ఇప్పుడు నేరుగా ఫీజు చెల్లించి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వ్యక్తులు రెగ్యులరైజ్ చేసుకునేందుకు ముందుకు రావాలి. ఈ నెల 31లోపు క్రమబద్ధీకరించుకుంటే 25శాతం రాయితీ పొందవచ్చు. – కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చైర్మన్, సుడా (కరీంనగర్) -
ఎఫ్టీఎల్ సమీప సర్వే నంబర్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటల పూర్తి నీటిమట్టం స్థాయి (ఎఫ్టీఎల్) నుంచి 200 మీటర్ల లోపు ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతోపాటు ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు పంపాలని వివిధ శాఖలు, సంస్థల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వీసీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు, డీటీసీపీలు తమ పరిధిలోని నీటి వనరుల ఎఫ్టీఎల్ నుంచి 200 మీటర్ల లోపు ఉన్న సర్వే నంబర్లను పంపించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న భూముల సర్వే నంబర్లలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ శాఖల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీకి పంపుతారు. డీటీసీపీ ఈ ప్రక్రియను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదీ ప్రక్రియ.. ⇒ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫీజుల చెల్లింపు ప్రక్రియ జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేస్తోంది. ఈ అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీజీజీకి సర్వే నంబర్ల వివరాలను అందిస్తే, ఆన్లైన్లో వాటిని అందుబాటులో ఉంచనుంది. తదనుగుణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ రాజ్ , నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. ⇒ ఆ తర్వాత ఆన్లైన్లోనే ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ణయించబడుతుంది. ⇒ ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, గతంలో చెల్లించిన మొత్తం ఫీజు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ చార్జీలను మినహాయించుకుంటారు. ⇒ వెంచర్‌లోని 10 శాతం ప్లాట్లను 2020 ఆగస్టు 26కు ముందు విక్రయించి ఉంటే, మిగతా ప్లాట్ల క్రమబధ్ధీకరణ కోసం.. విక్రయించిన ప్లాట్ల వివరాలను ఈసీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ⇒ లేఅవుట్ క్రమబధ్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించిన తర్వాత తాత్కాలిక ఫీజు నిర్ణయమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ⇒ సబ్–రిజి్రస్టార్ సంబంధిత ప్లాట్‌ను నమోదు చేసి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వివరాలు, సేకరించిన చార్జీలను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌కు ప్రాసెసింగ్ కోసం పంపితే క్రమబధ్ధీకరణ చార్జీలు ఆన్లైన్లోనే నిర్ణయమవుతాయి. -
నేటి నుంచి ఎల్ఆర్ఎస్ షురూ
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ శాఖ పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ పోర్టల్‌ను ఫీజు చెల్లింపులకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు ఒకటీ, రెండురోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లింపులు ఆమోదం పొందిన వెంచర్లకు సంబంధించి ప్లాట్ల వారీగా ఫీజులను రిజిస్ట్రేషన్ల శాఖకు ఆన్లైన్లో నేరుగా చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల్లో.. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన 25.67 లక్షల దరఖాస్తుల సమాచారంతో కూడిన ఎల్ఆర్ఎస్ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌ను అనుసంధానిస్తున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్కు ఆమోదం పొందిన ప్లాట్ల వివరాలు సబ్ రిజి్రస్టార్ల వద్ద కనిపిస్తాయి. ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో క్రమబద్ధీకరించాల్సిన ప్లాట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దరఖాస్తుదారుడే నేరుగా ఇంటి నుంచే ఆన్లైన్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు ఫీజు చెల్లించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ సోమవారం రాత్రి కల్లా పూర్తి చేసి, మంగళవారం నుంచి ఫీజులు చెల్లించేలా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రూ.107.01 కోట్ల చెల్లింపులు 2020 ఆగస్టు 26కు ముందు ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న 25.67 లక్షల దరఖాస్తుల్లో 9.21 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. వీటిలో ఎలాంటి అభ్యంతరాలు లేని 1.74 లక్షల దరఖాస్తుదారులకు ఫీజుల చెల్లింపు కోసం పురపాలక శాఖ గతంలోనే సమాచారం ఇచ్చింది. వీరిలో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్ల చెల్లింపులు కూడా గతంలో జరిగాయి. 4 లక్షల దరఖాస్తులకు ‘నీటి వనరుల’ లింక్ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలోపు ఉన్న వెంచర్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నీటి వనరులను ఆనుకుని ఏర్పాటు చేసిన లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కూడా తిరస్కరించనున్నారు. వచ్చిన 25 లక్షల దరఖాస్తుల్లో ఇలాంటివి 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇక ఒక వెంచర్లో 100 ప్లాట్లు ఉంటే అందులో 10 ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకుని ఉంటే, మిగతా 90 ప్లాట్లకు దరఖాస్తు చేసుకోకపోయినా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఈ మేరకు విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. 14% ఓపెన్ స్పేస్ చార్జీలు – మార్చి 31వ తేదీ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించి అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మొత్తం స్థలం విలువలో 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. – వెంచర్‌తో సంబంధం లేని వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు అవసరం లేదు. వాటిలో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. – వారసత్వ ఆస్తిని పిల్లలకు పంచినప్పుడు భాగస్వామ్య ఒప్పంద పత్రాలను రిజిస్ట్రేషన్ చేయిస్తే, ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్‌తో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు కడితే, భవన నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది. – ఫాం లాండ్స్ పేరుతో ఎకరాల కొద్దీ భూమిని 150, 200 గజాలుగా విభజించి ప్లాట్లుగా విక్రయించారు. నాలా కన్వర్షన్ లేకుండా ఇందులో రోడ్లు వంటివి వేసినప్పటికీ, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయనప్పుడు..క్రమబద్ధీకరణ ప్రక్రియ వర్తించదు. 2020 ఆగస్టుకు ముందు లేఅవుట్ వేసి, 10 శాతం ప్లాట్లను విక్రయిస్తేనే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. -
ఇక రిజస్ట్రేషన్ల వంతు.. బాదుడే బాదుడు
కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా బావుంటుందేమోనని ఓట్లేసి గెలిపించినందుకు తమకు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ సహా ఒక్క హామీ నెరవేర్చకుండానే వరుస బాదుళ్లతో నడ్డి విరుస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడు చాలదన్నట్లు ఇప్పుడు రూ.13 వేల కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ల చార్జీల వడ్డింపే లక్ష్యంగా ముందుకెళ్తుండటం దారుణమంటున్నారు. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచడం.. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లనూ వదలకుండా ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. ఒక్క అమరావతి ప్రాంతంలో మినహా అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుపై తీవ్రంగా కసరత్తు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆస్తుల విలువ పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు జిల్లాల్లోని జేసీ కమిటీలు సైతం తాజాగా గురువారం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి రానున్నాయి. ఇప్పుడున్న దానికంటే 40–50 శాతంపైగానే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజలపై భారం మోపుతోంది. మరోవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపేసింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు, మద్యం దందాతో ప్రజల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు జన జీవితాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ప్రజలను బాదేందుకు సిద్ధమైంది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలను భారీగా పెంచేసింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను సైతం వదిలి పెట్టకుండా ఆదాయం కోసం వాటి విలువలను పెంచేసింది. పర్యవసానంగా నగరాల్లో అపార్టుమెంట్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారిపై ఏకంగా రూ.లక్షల్లో భారం పడనుంది. ప్రాంతాలను బట్టి భూముల క్లాసిఫికేషన్ చేసి రేట్లు నిర్ధారించింది. గతానికి భిన్నంగా ప్రాంతాన్ని బట్టి కాకుండా, స్థలాన్ని బట్టి రేటు నిర్ణయించడం గమనార్హం. ఇకపై ఒకే ప్రాంతంలో రోడ్డుకు పక్కన స్థలం ఒకరేటు.. దానికి పక్కనున్న స్థలానికి ఇంకో రేటు, కాస్త లోపల ఉన్న స్థలానికి మరో రేటు ఉంటుంది. రాత్రి వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లుఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రకటనతో ప్రజల నెత్తిన పిడుగు పడినట్టయింది. ఈ క్రమంలో గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ విక్రయదారులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగితే.. కొద్ది రోజులుగా ఆ సంఖ్య రోజుకు 15 వేల వరకు ఉన్నట్లు సమాచారం. గురు, శుక్రవారం చివరి రోజులు కావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లను చేసుకునేందుకు క్యూకట్టారు. ఉదయం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన క్రయ విక్రయదారులు గంటల కొద్దీ క్యూ లైన్లలోనే పడిగాపులు పడ్డారు. విజయవాడలోని పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతంలో రోజుకు 60–70 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు ఏకంగా 180కిపైగానే జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని మధురవాడలో ఒకప్పుడు 100–150 రిజిస్ట్రేషన్లు చేసే వారు. ఇప్పుడు 200కుపైగా ఉన్నాయి. రాజమహేంద్రవరంలో రోజుకు సగటున 50 వరకు రిజిస్ట్రేషన్లు అవ్వాల్సి ఉండగా.. సర్వీర్లు మొరాయించడంతో తీవ్ర జాప్యం జరిగింది. తిరుపతిలోని రేణిగుంట, కర్నూలు, గుంటూరు వంటి ప్రాధాన కేంద్రాల్లో ఎప్పుడూ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరిగిపోతాయనే భయంతో క్రయవిక్రయదారులు కార్యాలయాలకు ముందుగానే క్యూ కట్టారు. శుక్రవారం పాత చార్జీలకు చివరి రోజు కావడంతో ఎక్కువ మంది స్లాట్ బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాత్రి వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. అమరావతి రూటు సపరేటు!రాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్ర పూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్ తేవాలని యత్నిస్తున్నారు. దీన్ని మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది.రూ.13 వేల కోట్ల ఆదాయం లక్ష్యంకూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరించింది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచేసింది. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు నాలుగైదు రకాలుగా మార్చింది. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ రెండు మూడు రకాలుగా పెరగనుంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. తద్వారా అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి. -
ఏపీలో మరో బాదుడు.. ఆస్తి విలువలు 40–50% పెంపు
సాక్షి, అమరావతి: హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆస్తుల విలువలను సవరించింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది. ఈమేరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సవరించిన విలువలను ఇప్పటికే ఆమోదించాయి. అన్ని కార్యాలయాల్లో పెరిగిన విలువల అప్లోడ్ పనులను వేగంగా చేపట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50 శాతం వరకు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలు బాగా తక్కువగా ఉన్నాయనే నెపంతో అనేక ప్రాంతాల్లో ఇలా పెంచేశారు. విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండనుంది. మిగిలిన చోట్ల కూడా భారీగా పెంచేందుకు ఏర్పాట్లు చేశారు.రూ.13 వేల కోట్ల ఆదాయం లక్ష్యం.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా..భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం దొడ్డిదారిని ఎంచుకుంది. భూముల క్లాసిఫికేషన్లనే మార్చేసింది. ప్రతి ఏరియాలో భూమికి ప్రస్తుతం ఒకే విలువ అమలులో ఉంది. ఇప్పుడు దానికి రెండో విలువను జోడిస్తున్నారు. ఇందుకోసం లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తెచ్చారు. గతంలో వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగానూ.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న భూమిగా క్లాసిఫైడ్ చేశారు. ఇప్పుడు ఒక ప్రాంతంలోని మెట్ట, మాగాణి భూముల్లోనే రకరకాల క్లాసిఫికేషన్లు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్‌లో చేరుస్తున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలో రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకున్న భూమికి ఒక ధర, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు నాలుగైదు రకాలుగా మార్చారు. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ రెండు మూడు రకాలుగా పెరగనుంది. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు భారీగా పెరిగిపోనున్నాయి.అమరావతికి మినహాయింపురాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్ర పూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్ తేవాలని యత్నిస్తున్నారు. దీన్ని మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి అమరావతిలో మాత్రం వెన్నపూస రాయడం ఏమిటని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. -
పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు..
సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్, సెటిల్మెంట్ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్డీవో నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషగిరిబాబు మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.తల్లితండ్రుల నుంచి ఆస్తిని రాయించుకున్నాక వారి పిల్లలు పట్టించుకోకపోవడం, వారి రోజువారీ జీవనం, నిర్వహణ బాధ్యత కూడా తీసుకోకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అలాంటి వారికి రక్షణ ఇచ్చేందుకు 2007 సీనియర్ సిటిజన్ చట్టం వచ్చింది. దీని ప్రకారం తల్లితండ్రులు తమను పిల్లలు పట్టించుకోవడంలేదని సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్డీవోకు ఫిర్యాదు చేయొచ్చు. విచారణలో తల్లితండ్రులను వారి పిల్లలు చూడడం లేదని ఆర్డీవో నిర్ధారించి ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా ఆర్డర్ ఇస్తూ వారి ఆస్తిని వెనక్కి ఇవ్వాలని సూచించినా రిజిస్ట్రేషన్ల చట్టంలో ఉన్న అస్పష్టత కారణంగా అది అమలయ్యేది కాదు. ఇప్పుడు దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సర్క్యులర్‌లో స్పష్టత ఇచ్చారు. ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఆ ఆస్తిని గతంలో పిల్లలకు రాసిస్తూ తల్లితండ్రులు చేసిన సెటిల్మెంట్, గిఫ్ట్ డీడ్లను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ఆర్డర్‌ను నేరుగా తల్లితండ్రులు తీసుకువచ్చినా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లితండ్రులు ఆస్తిని వెనక్కి తీసుకునే నిమిత్తం ట్రిబ్యునల్ ఇచ్చిన ఎలాంటి ఆదేశాలనైనా రిజిస్ట్రేషన్ అధికారులు పాటించాలని ఆదేశించారు. -
AP: ‘రియల్’ రివర్స్! పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా ప్రతి నెలా సగటున వెయ్యి నుంచి 1,200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు 800 రిజిస్ట్రేషన్లు జరగడం కూడా గగనంగా ఉంది. గత మూడేళ్లూ స్థిరాస్తిలో దూసుకెళ్లిన విశాఖలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. తిరుపతిలోనూ భారీగా జరిగే రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా తగ్గిపోయాయి.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు చూస్తోంది. స్థిరాస్థులరిజిస్ట్రేషన్లు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలతో కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద అసలు సందడే కనిపించడంలేదు. ఈ ఏడాది జూన్ నుంచిరిజిస్ట్రేషన్లు తగ్గిపోవడంతో ఆ శాఖ ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత సంవత్సరం వచ్చినంత ఆదాయం ఈసారి వచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు గద్దెనెక్కితే రియల్ బూమ్ వస్తుందంటూ ప్రచారం చేసిన వారంతా ఈ పరిస్థితి చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.భారీగా తగ్గినరిజిస్ట్రేషన్లు.. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 21.91 లక్షల స్థిరాస్తులరిజిస్ట్రేషన్లు జరగగా అంతకుముందు రెండేళ్లు కూడారిజిస్ట్రేషన్ల సంఖ్య 26 లక్షలకుపైనే ఉంది. ఈ ఏడాది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగినరిజిస్ట్రేషన్లు సుమారు 12 లక్షలు మాత్రమే. ఆరి్థక సంవత్సరం ముగియడానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలింది. కనీసం గతేడాది తరహాలోరిజిస్ట్రేషన్లు జరగాలన్నా సుమారు మరో 10 లక్షలరిజిస్ట్రేషన్లు జరగాలి. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు గమనిస్తుంటే అది కష్టమేనని చెబుతున్నారు. సాధారణంగా ఏటారిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుంది. ఈదఫా అదనంగా పెరగకపోగా గతంలో ఉన్న సంఖ్యను కూడా చేరుకునే అవకాశం కనిపించడంలేదు. లక్ష్యంలో సగం కూడా చేరుకోలేదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలనిరిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు రూ.5,500 కోట్ల లోపే సమకూరింది. అలాంటప్పుడు మరో నాలుగు నెలల్లో రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని సాధించడం ఎలా సాధ్యమని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత సంవత్సరం (2023–24)లో రూ.9,546 కోట్ల ఆదాయం రాగా అంతకుముందు సంవత్సరం (2022–23)లో రూ.8,064 కోట్ల రాబడి వచ్చింది.రిజిస్ట్రేషన్ల ఆదాయం గతంలో టీడీపీ హయాంలో రూ.5 వేల కోట్ల లోపే ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా సుమారు రూ.10 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ప్రధాన జిల్లాల్లో నిరాశే.. ఈ ఆరి్థక సంవత్సరంలో విశాఖ జిల్లాలో లక్ష్యం రూ.1,526 కోట్లు కాగా దాని ప్రకారం అక్టోబర్ నాటికి రూ.862 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.561 కోట్లు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ నాటికి కాకినాడ జిల్లా రూ.347 కోట్ల ఆదాయాన్ని రాబట్టాల్సి ఉండగా రూ.196 కోట్లే సాధించగలిగారు. ఎనీ్టఆర్ జిల్లాలో అక్టోబర్ వరకు రూ.695 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.398 కోట్లే వచ్చాయి. గుంటూరు జిల్లాలో రూ.659 కోట్లకుగానూ రూ.483 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. తిరుపతి జిల్లాలో రూ.442 కోట్లకుగానూ రూ.252 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. నంద్యాలలో అయితే 50 శాతం తగ్గుదల నమోదు కాగా అనకాపల్లి, కర్నూలు, పుట్టపర్తి జిల్లాల్లో తగ్గుదల 40 శాతం కంటే అధికంగా ఉంది.త్వరలో మార్కెట్ విలువ పెంపు!ఆదాయ లక్ష్యాన్ని సాధించాలంటే భూముల మార్కెట్ విలువలు పెంచడం మినహా మరో మార్గం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో మార్కెట్ విలువను 50 శాతం వరకు పెంచి ఆదాయం పెరిగినట్లు చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కొనుగోలుదారులపై ఆ మేరకు భారం పడనుంది. -
‘పటమట’ పాట.. రూ.2 కోట్ల పైమాట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. లావాదేవీలు, ఆదాయం ఎక్కువగా వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పోస్టులపైన అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. ఆ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చేందుకు ధర నిర్ణయించి వేలం పాట పెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ పాటలో ఎవరెక్కువ మొత్తం చెల్లిస్తారో వారిని ఆయా పోస్టుల్లో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా.. నిబంధనలతో సంబంధం లేకుండా సబ్ రిజిస్ట్రార్లంతా బదిలీలకు ఆప్షన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనధికారిక ఆదేశాలు అందడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెసెంజరు ద్వారా ఉత్తర్వులు అందించి, రిక్వెస్ట్ ఫారాలను వాట్సప్‌లో పంపారు. బదిలీ అభ్యర్థనలను శుక్రవారం మధ్యాహ్నంలోపు పూర్తిచేసి పంపాలని షరతు విధించారు. వారు బదిలీ కోరుకుంటున్న స్థానాల ఆప్షన్లతోపాటు గతంలో వారు పనిచేసిన సెంటర్లు, వారిపై ఉన్న కేసులు, సర్వీసు తదితర వివరాలన్నింటినీ ఫామ్‌లో పూర్తిచేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బంది ఇది తప్పక పాటించాలని ఆదేశించారు. అయితే, ఇది ఎవరు జారీచేశారో ఆ ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్హం. అసలు బదిలీ స్థానాలు గుర్తించకుండా, ఎవరు బదిలీలకు అర్హులో తేల్చకుండా ఆప్షన్లు ఇవ్వాలని సూచించడం బలవంతపు బదిలీలకు ఒత్తిడి చేయడమేనని ఆ శాఖలో గగ్గోలు మొదలైంది. డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ..ఎక్కువ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు, అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ ఏర్పడింది. దీనిని అసరాగా చేసుకుని, చినబాబు కనుసన్నల్లోనే నడిచే టీం ఈ పోస్టులకు «ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది.» ఇందులో మొదటి స్థానంలో విజయవాడ పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు స్టాండర్డ్ ధర రూ.2 కోట్లుగా నిర్ణయించి, అంతకంటే ఎక్కువ ఇచ్చుకునే వారికే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఈ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పోస్టుకోసం గుణదల, కంకిపాడు, రావులపాలెం సబ్రిజిస్ట్రార్లతో పాటు, ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్, ఐజీకి సన్నిహితంగా ఉండే వారూ పోటీపడుతున్నట్లు సమాచారం. » ఇక రెండవ వరుసలో గాంధీనగర్, గన్నవరం, కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు రూ.కోటికి పైగా ధర పలుకుతున్నాయి. ఈ జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరి, నల్లపాడు, గుంటూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.» అలాగే, విజయవాడ పరిధిలోని నున్న, గుణదల, ఇబ్రహీంపట్నం, నందిగామ, బాపులపాడు సబ్ రిజిస్ట్రార్ పోస్టులూ రూ.70 లక్షల వరకు పలుకుతున్నాయి.» విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఇప్పటికే లోపాయకారీగా వేలం పాట జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది... ఇలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా ధరలు ఫిక్స్ చేసి బదిలీల బేరసారాలకు తెరలేపారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రిని కూడా డమ్మీచేసి, ఈ బదిలీల వ్యవహారాలను చినబాబే నేరుగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్గదర్శకాలకు భిన్నంగా ‘చిన్నబాబు’ పెద్ద స్కెచ్..నిజానికి.. ఉద్యోగుల సాధారణ బదిలీలకు వీలుగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకనుగుణంగా ఆయా శాఖలు మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శకాలిచ్చి బదిలీలు జరపాల్సి వుంది. కానీ, రిజస్ట్రేషన్ల శాఖలో ఈ మార్గదర్శకాలు ఇంకా జారీకాలేదు. అయినా, సబ్ రిజిస్ట్రార్లు తాము బదిలీ కోరుకునే స్థానాలకు సంబంధించిన ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. వీటిని అడ్డంపెట్టుకుని ‘చినబాబు’ టీం పెద్ద స్కెచ్ వేస్తోంది. డిమాండ్ ఉన్న పోస్టుల పేరుతో భారీగా దండుకునేందుకే అందరినీ దరఖాస్తు చేసుకోవాలని అనధికారికంగా ఆదేశాలిచ్చింది. తద్వారా తమకు కావల్సిన వారిని ఎంపిక చేసుకోవడం, కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఎవరు రేసులో ఉన్నారో తెలుసుకోవడానికే కౌన్సిలింగ్ ముందు ఈ సందేశాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ఆప్షన్లు అడగలేదని, కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిపేటప్పుడు ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు. -
భూములకు కొత్త విలువ
-
‘ధరణి’ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. శనివారం సర్వే సెటిల్మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. రంగారెడ్డి, నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్ వాస్తవ పరిస్థితిని తెలి యజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది. మీ శాఖల్లో ఏం జరుగుతోంది? సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయడం, భూభారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా తమ భూమిని సబ్‌డివిజన్ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమావేశంలో.. ఆ శాఖ ఆదీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిత్తల్, మధుసూదన్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల్లో తేడా.. భూములను జియోట్యాగింగ్ చేసుకోండి దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుతో చర్చల సందర్భంగా ‘ధరణి’ కమిటీ సభ్యులు పలు వివాదాస్పద అంశాలను గుర్తించారు. దేవాదాయ శాఖ గెజిట్‌లో, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములకు, ఆయా శాఖల పేరిట ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల విస్తీర్ణానికి వేల ఎకరాల్లో తేడా ఉందని తేల్చారు. ఆ భూములన్నీ ఎటు పోయాయని అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇక దేవాదాయశాఖ గెజిట్‌లో పేర్కొనని పట్టా భూములను కూడా ధరణి పోర్టల్‌లో నిషేధిత భూములుగా చేర్చారని.. వీటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భూముల విషయంలో పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. ముఖ్యంగా దేవాదాయ భూములన్నింటినీ జియోట్యాగింగ్ చేసుకోవాలని.. పట్టాదారులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే తరహాలోనే ఎప్పటికప్పుడు తమ భూముల స్థితిగతులను పరిశీలించుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు, బదలాయింపు లేనందునే సమస్యలు: ఎం.కోదండరెడ్డి శనివారం వివిధ వర్గాలతో సమావేశం తర్వాత ‘ధరణి’కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సమస్యలపై తమ అధ్యయనం నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడామన్నారు. అందరితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
భూముల సర్వేకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, సర్వేకు సంబంధించిన ప్ర తిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి. అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దాని పై నివేదిక తయారు చేయండి’అని నిర్దేశించా రు. బుధవారం సచివాలయంలో భూపరిపాల న, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. భూపరిపాలన, సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది. ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు జరుగుతున్నాయని, ఏపీలో జరుగుతున్న సర్వే మోడల్ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన పొంగులేటి.. ఏపీలో ఏం జరుగుతోందో పరిశీలించడంతోపాటు మంచి, చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. భూముల క్రమబద్దీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు. వీఆర్ఏలకు త్వరలోనే ఐడీ కార్డులు, వేతనాలివ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీసీఎల్ఏ, సర్వే–ల్యాండ్ సెటిల్మెంట్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయమెందుకు తగ్గింది? రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంతో పోలిస్తే సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవారమని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్‌లో పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు తెచ్చిన సవరణలు ఇబ్బందికరంగా మారాయని, ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు . దీనిపై స్పందించిన పొంగులేటి.. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతోనూ తాను మాట్లాడతానని, సుప్రీం తీర్పు ఉల్లంఘన జరగకుండా ఎల్ఆర్ఎస్ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. -
భూసమస్యలన్నీ పరిష్కారమయ్యేలా...
దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సర్వేలో భూమిని అనుభవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించారు. అయితే రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని (భూ యాజ మాన్య హక్కు చట్టం) తెచ్చింది. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూకమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భారతీయుల్లో భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంస్కృతులు భూ యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వల్ల అందరూ దాన్ని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ కుటుంబాల మొత్తం ఆస్తిలో భూమి 73 శాతం ఉండగా, పట్టణ గృహాల ఆస్తిలో భూమి, భవనాలు 90 శాతం ఉన్నట్లు 2013 ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో తేలింది. అందుకే పెట్టుబడిదారులు, రుణదాతలు, బ్యాంకర్లు స్పష్టమైన టైటిల్, స్పష్టమైన ల్యాండ్ మ్యాపింగ్, రికార్డుల నిర్వహణ, స్పష్టమైన హక్కులు ఉండాలని కోరుకుంటారు. కానీ మెకెన్సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో దేశంలోని ఎక్కువ భూముల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన వివాదాలున్నాయని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా భూముల వివాదాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు 70 శాతం సివిల్ వివాదాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్రాథమికంగా బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ ప్రభుత్వానికి భూముల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో రూపొందించినవి. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సాగు చేసేవారికి సురక్షితమైన హక్కులు ఉండేలా ప్రోత్సహించడానికి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ‘ఎస్టేట్లు – ఇనామ్ నిర్మూలన చట్టం’, ‘వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం’, ‘పీఓటీ’ చట్టం, ‘ఆర్ఓఎఫ్ఆర్’ వంటి చట్టా లను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సాగుదారులకు అనుకూలంగా తీసుకువచ్చాయి. భూముల యాజమాన్యంలో జరిగిన ఈ మార్పు లన్నీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కినా... కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల క్రమం తప్పకుండా నవీకరణ (అప్డేట్) అవలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో భూమిని అను భవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించినా... రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థి తులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ సమస్య లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఆ చట్టాన్ని సవరించడం ద్వారా గ్రామాల వారీగా ప్రతి వ్యక్తి అధీనంలో ఉన్న భూమి వివరాలను రికార్డుల్లో అప్డేట్ చేసింది. ఇలా హక్కుల రికార్డును ప్రవేశపెట్టిన తర్వాత కూడా భూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ఊహాజనిత హక్కును మాత్రమే కల్పిస్తాయి. కొన్ని కేసుల్లో రికార్డులు క్షేత్ర స్థాయి పరిస్థితికి విభిన్నంగా ఉంటాయి. కోర్టు కేసులు, వారసత్వాలు, తనఖా వంటి భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే ఎలాంటి ఒకే ఒక్క మూలాధారం ప్రస్తుత రికార్డుల్లో లేదు. దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూ కమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భూ యాజమాన్యంపై ఉన్న గందరగోళాన్ని తొలగించేలా రీ సర్వేలో ప్రతి భూభాగానికి జియో రిఫెరెన్స్ ఇస్తున్నారు. భూమి, దానికి సంబంధించిన రికార్డులను అనేక శాఖలు (రెవెన్యూ, పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు) నిర్వహిస్తుండడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే పౌరులు వాటికి సంబంధించిన అనుమతులు, సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే? భూమి యాజమాన్యం సార్వభౌమాధికారంతో ఉంటుందని దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నిశ్చయాత్మకమైన టైటిల్ విధా నానికి (కన్‌క్లూజివ్ టైటిల్ విధానం) మన దేశం వెళ్లలేదు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ టైటిల్ విధానం... యాజమాన్యాన్ని ధ్రువీకరించే నిశ్చ యాత్మక టైటిల్‌కు విరుద్ధంగా ‘అనుకూల టైటిల్ కాన్సెప్ట్’ (ప్రిజెమ్టివ్ టైటిల్) ఆధారంగా రూపొందించబడింది. అంటే భూమి అధీనంలో ఉన్న వ్యక్తి సదరు భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా భావించబడే అర్థంలో ఇచ్చిన టైటిల్ మాత్రమే. అది కూడా ‘1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన స్వాధీనమే. భూమిపై లావాదేవీ జరిగినప్పుడు కూడా టైటిల్ వెరిఫి కేషన్ అవసరం లేని వ్యవస్థ కారణంగా భూమి టైటిల్ విధానం పేల వంగా ఉంది. ‘1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కూడా పత్రాల నమోదుకు సంబంధించిన చట్టమే తప్ప భూమి లేదా టైటిల్ రిజి స్ట్రేషన్‌కి సంబంధించినది కాదు. 1982 ఆస్తి బదిలీ చట్టానికి యాజ మాన్యం యొక్క ధ్రువీకరణ అవసరం లేదు. భూమి లావాదేవీల విషయంలో ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే ఈ చట్టాలు పరిమి తమయ్యాయి. ఆ భూముల యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ప్రశ్న తలెత్తితే, అది తనదేనని నిరూపించుకోవాల్సి బాధ్యత యజమా నిపైనే ఉంటుంది. తక్షణ సంస్కరణలు అవసరం ఈ నేపథ్యంలో భూ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను నియమించింది. ఈ ‘టైటిల్ సర్టిఫికేషన్ టాస్క్‌ఫోర్స్’ ఒక సమగ్రమైన భూమి టైటిల్ వ్యవస్థను దేశంలో వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2011లో ఒక ముసాయిదా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తీసు కువచ్చింది. నిశ్చయాత్మకమైన ఆస్తి హక్కుల (కన్‌క్లూజివ్ ప్రాపర్టీ టైటిల్స్) వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాలన, నిర్వహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ‘టోరెన్స్’ వ్యవస్థ ఆధారంగా దీన్ని రూపొందించారు. టోరెన్స్ వ్యవస్థ 3 సూత్రాలతో ఉంటుంది. 1. మిర్రర్ సూత్రం. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్‌ను సూచిస్తుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత (గ్రౌండ్ రియాలిటీ)ను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. 2. కర్టెన్ సూత్రం. ఇది గతానికి అడ్డుగా ఒక తెర ఉన్నన్నట్లు సూచిస్తుంది. టైటిల్‌ను రిజిస్టర్లో టైటిల్ నమోదు కావడమే ప్రస్తుత టైటిల్ నిశ్చయాత్మక రుజువు అనీ, గతాన్ని పరిశోధించాల్సిన అవ సరం లేదనీ చెబుతోంది. 3. హామీ సూత్రం. ఇది టైటిల్‌ను రిజిస్టర్ చేసే క్రమంలోనూ, భూ యజమానులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలలోనూ దొర్లే తప్పు లకు నష్టపరిహారానికి ప్రభుత్వ సంస్థల హామీని ఇస్తుంది. ఇది కోర్టుల్లో కూడా చెల్లుబాటయ్యే పూర్తి అజేయమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ 2019లో ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టా’న్ని ఆమోదించి దాన్ని భారత రాష్ట్రపతి అంగీకారం కోసం పంపింది. దాన్ని అందుకున్న కేంద్రం భూమి వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ఎల్ఓఆర్, ఐటీ, న్యాయ తదితర శాఖల పరిశీలనకు పంపింది. ఆ యా శాఖలు కొంత సమయం తీసుకుని ఈ చట్టంపై అభిప్రా యాలు, వ్యాఖ్యలు పంపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకనుగుణంగా టైట్లింగ్ బిల్లుకు పలు సవరణలు చేసి శాసనసభకు పంపింది. దీనిని 2023లో సభ ఆమోదించింది. ఆ బిల్లును మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇటీవలే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నోటిఫై చేసి అమలు చేయడానికి కావల్సిన నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కానీ చర్చించకుండా హడావిడిగా చట్టం తెచ్చారని కొందరు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. రెండు సార్లు పూర్తిగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాతే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. మన దేశంలో చట్టాలు ఇదే విధానంలో రూపుదిద్దు కుంటాయి తప్ప వేరే విధానంలో కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రాజ్యాంగ సవరణలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లవు. దీన్ని సమగ్రంగా పరిశీ లించడానికి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పలు దఫాలుగా పంపిన వివరణలు చూసి ఆమోదించడానికి కేంద ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సమర్థతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పత్రికలకు ఎక్కడం కూడా దురదృష్టకరం. బహుశా ఈ దేశంలో భూ యాజమాన్య వ్యవస్థల పరిణామం గురించి వారికి తెలియకపోవచ్చు. బ్రిటిష్‌వారు మొదటిసారిగా రైత్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, రెవెన్యూ సిబ్బంది అయిన సెటిల్మెంట్ అధికారులే భూమిని అనుభవిస్తున్న ప్రజలకు హక్కులు ఇచ్చారు తప్ప వేరే వారు కాదు. ఆర్ఓఆర్, ఎస్టేట్ల రద్దు, ఇనాం రద్దు, ల్యాండ్ సీలింగ్ వంటి భూమికి సంబంధించిన ప్రతి చట్టంలోనూ హక్కుదారులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ సమస్యలను పరిష్కరించడంలో, పట్టా హక్కులు లేదా యాజమాన్య హక్కులు ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బందికి మించిన జ్ఞానం ఎవరికీ ఉండదు. రెవెన్యూ సిబ్బందికి భూ చట్టాలు/సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదని చెప్పడం సరికాదు. అదే సందర్భంలో ఏ సీనియారిటీ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభు త్వానికే వదిలేయాలి. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఖరారు చేస్తుంది. చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులుగా సర్వీసులో ఉన్న లేదా రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న వారే నియమితులవుతారు. అప్పీలేట్ అధికారులుగా ఎవరిని నియ మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఈ దశలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవడం సరికాదు. టైటిల్ రిజిస్టర్లో నమోదైన ఎంట్రీలపై అప్పీల్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం ఎలా సరిపోతుందని కొందరు ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. మ్యుటేషన్ చట్టం, ఆర్ఓఆర్ వంటి ఏ ఇతర చట్టాల ప్రకారమైనా రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి చరిత్రలో ఎన్నడూ కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఇస్తారు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండు సంవత్సరాల సమయం ఇచ్చారు. పైన చెప్పిన టోరెన్స్ వ్యవస్థ ప్రకారం పునఃసమీక్ష, పరిష్కారం తర్వాత, రికార్డింగ్ చేయబడుతుంది, ఇది తాత్కాలికంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియలో పట్టాదారులకు నోటీసులు ఇవ్వబడతాయి. ఈ తాత్కా లికాన్ని సవాలు చేయడానికి ప్రజలకు 2 సంవత్సరాల సమయం ఇస్తారు. 2 సంవత్సరాలలోపు ఎటువంటి ఛాలెంజ్ లేకపోతే, తాత్కా లికమే ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో పరిమితి చట్టంలోని నిబంధనలను కోట్ చేయడం అసంబద్ధం. అజేయ కల్లం వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు -
చిటికెలో ‘మ్యుటేషన్’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్‌తో పాటు ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. సరళంగా ప్రక్రియ ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా వెబ్‌ల్యాండ్‌లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయ్యేదాకా ఉత్కంఠే! స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్‌ల్యాండ్ అనుసంధానం నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్‌ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్‌తోపాటు ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్లైన్లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్‌తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. సులభతరం రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్వేర్లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే ఆన్లైన్లో.. మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్లైన్లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది. – నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం తిరిగే తిప్పలు లేవు.. నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది. – చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం. -
భూ చరిత్రలో కొత్త శకం
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్ట పరంగా కన్‌క్లూజివ్ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్‌క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ ► భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ► ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ► ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే ► టైటిల్ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ► ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరిదో ఉండదు. ► టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్‌గా మారనున్న ఆర్ఓఆర్ రికార్డు ► ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ► పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. గొప్ప ముందడుగు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్ అవసరం. ఇది ఆర్ఓఆర్ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. – ఎం సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆన్లైన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలను విస్తృతంగా అందించనున్నారు. అత్యాధునిక కార్డ్ ప్రైం సాఫ్ట్వేర్, ఈ–స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సేవలు అందుబాటులోకి తేనున్నారు. కార్డ్ ప్రైం ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్లైన్లో సమర్పించే వెసులుబాటు కల్పించారు. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు దస్తావేజులను వారే స్వయంగా రూపొందించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్లైన్లోనే చెల్లించే సదుపాయం కల్పించారు. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ–సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్‌కు మరింత భద్రత ఉంటుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లోనూ పేరు మార్పు జరుగుతుంది. ఆధునిక సాంకేతికత ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లను నిర్మూలించవచ్చు. ఈ–స్టాంపింగ్‌తో వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ–స్టాంపింగ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఈ స్టాంపింగ్‌తో స్టాంపుల కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడినట్లు అవుతుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఎల్) బ్రాంచ్‌లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)లో ఈ స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల ద్వారా ఈ– స్టాంపులను విక్రయిస్తారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సైతం పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా 1,680 సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. అనంతరం మిగిలిన సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. స్టాంప్ విక్రయ సేవలు, ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్), సీసీ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లూ మొదలవుతున్నాయి. ఐరిస్‌తో వేలిముద్రల సమస్యకు పరిష్కారం ఈ సిగ్నేచర్ కోసం వేలిముద్రలు పడటంలేదనే ఫిర్యాదులు రావడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఈ సమస్య పరిష్కారానికి ఐరిస్ యంత్రాలు కొనుగోలు చేసింది. అవసరమైతే మరికొన్ని కొనేలా ఆదేశాలు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో వేలిముద్రలు పడకపోయినా ఐరిస్ (కళ్లు) ద్వారా ఆ పక్రియను పూర్తి చేయవచ్చు. అపోహలు వద్దు – దుష్ప్రచారాలను నమ్మొద్దు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేటయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ యాక్ట్ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భ ద్రత ఉంటుంది. డిజిటల్ రిజిస్టర్డ్ డా క్యుమెంట్ అందుబాటులోకి వస్తుంది. ఫిజి కల్ డాక్యు మెంట్‌తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్‌కు గుర్తింపు ఉంటుంది. ఈ– సైన్ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ వెరిఫికేషన్‌తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే వెరిఫై చేసుకునే సదుపాయం ఉంది. నూతన విధానంలో∙భద్రతా ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందుతుంది. ఈ విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ అనేది ‘వాస్తవం’. నూతన విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది అవాస్తవం. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్‌పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులకు ‘జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్’ను వినియోగించుకోవచ్చు. -
‘రిజిస్ట్రేషన్ ’ వికేంద్రీకరణ వైఎస్ జగన్ ఘనతే
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాష్ట్ర చరిత్రలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను గ్రామ స్థాయి వరకు వికేంద్రీకరించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ జి.శ్రీరామ్‌కుమార్ చెప్పారు. సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో ‘రిజిస్ట్రేషన్–విధి విధానాలు’ అనే అంశంపై అవగాహన సదస్సు శనివారం జరిగింది. శ్రీరామ్‌కుమార్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనుగోలు, అమ్మకం దారుల ఇష్టం మేరకు గ్రామ సచివాలయాలు లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చేయించుకోవచ్చునని శ్రీరామ్‌కుమార్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించడంలో భాగంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసే విధానంలో 2.ఓ సాంకేతిక టెక్నాలజీని ప్రవేశ పెట్టిందన్నారు. ఇది నూటికి నూరు శాతం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేదిగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 తేదీ నుంచి అమలయ్యే ఈ పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఇక పై ఈ–స్టాంప్ విధానాన్ని అమలు చేయనున్నామని, ఈ విధానం వల్ల ముందు తేదీలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా వివాదాస్పద డాక్యుమెంట్లు సృష్టించడం సాధ్యం కాదని చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జర్నలిజం డిప్లొమో కోర్సు డైరెక్టర్ ఎల్వీకే.రెడ్డి, వర్కింగ్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
ఆస్తి ఒక్కటే.. రిజిస్ట్రేషన్ ఇద్దరికి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఇటీవల జిల్లా రిజిస్ట్రార్‌పై కేసు నమోదుకు కారణమైన ఆస్తి వివాదంలో రిజిస్ట్రే షన్ శాఖ అధికారులు చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కుటుంబ వివాదాల్లో ఉన్న ఆస్తికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు రిజిస్ట్రేషన్ చేయడం.. రద్దు చేయడం రోజుల వ్యవధిలోనే జరిగింది. చివరికి అదే ఆస్తికి ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేసి ధ్రువపత్రాలు ఇచ్చారు. దీంతో ఇరుపక్షాల వారు ఆస్తి మాదంటే మాది అంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించడం, పోలీసు కేసులు పెట్టుకోవడంతో జిల్లా రిజిస్ట్రార్‌పై కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివాదంలో ఉన్న ఆస్తి ఇదే.. కందుకూరు పట్టణంలోని అమలనాథునివారిపాళెంలో సర్వే నంబర్ 865/1ఎ/1ఎ2ఎ1లో శెట్టి పేరయ్య అనే వ్యక్తి పేరుపై మూడున్నర సెంట్ల నివాస స్థలం ఉంది. పేరయ్యకు ఐదుగురు కుమార్తెలతోపాటు కోటేశ్వరరావు(ప్రభుత్వ ఉద్యోగి) అనే కుమారుడు ఉన్నాడు. కుమార్తెల్లో శాంతికుమారి అలియాస్ కుమారి దివ్యాంగురాలు కావడంతో మిగిలిన కుటుంబసభ్యులు ఆ ఆస్తిని ఆమె పేరుపై రాశారు. 2016లో ఆమె కూడా మరణించింది. ఆ తరువాతే ఈ స్థలం కోసం కుటుంబసభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. ఇటు కోటేశ్వరరావు ఆ స్థలం నాదేనని వాదిస్తుండగా, ఆయన తల్లి నారాయణమ్మ ఆ స్థలం తన పేరుపై ఉందని చెబుతోంది. ఈ క్రమంలో తల్లీ, కొడుకు మధ్య వివాదం ఉండడంతో నారాయణమ్మ కావలిలో ఉంటున్న కుమార్తె వద్ద ఉంటూ మనవడు అయిన భానుకుమార్‌కు అదే ఆస్తిని రాసిచ్చింది. ఈ క్రమంలో రూ.కోటి విలువ చేసే ఆ ఆస్తి వివాదంగా మారింది. రిజిస్ట్రేషన్ చేయడం.. రద్దు చేయడం శాంతికుమారి చనిపోయే నాటికి ఆ ఆస్తి ఆమె పేరుపైనే రిజిస్ట్రేషనై ఉంది. కానీ కందుకూరు సబ్ రిజి స్ట్రార్ కార్యాలయ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అదే ఆస్తిని పలుమార్లు రిజిస్ట్రేషన్ చేశారు. అదెలా అంటే శాంతికుమారి సోదరుడు కోటేశ్వరరావు ఆ ఆస్తి తన ఆధీనంలో ఉన్నట్లు రెవెన్యూశాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్నాడు. భార్య కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించి కోటేశ్వరి పేరుపై మళ్లీ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్‌ను కూడా క్యాన్సిల్ చేశారు. ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగా కోటేశ్వరరావు తల్లి నారాయణమ్మ తన కూతురు ఆస్తి తనకు చెందుతుందని, హక్కుదారుగా తన మనువడు భానుకుమార్ పేరుపై సేల్ డీడ్ చేసింది. దాని ఆధారంగా కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సందర్భంలో మరోసారి కోటేశ్వరి పేరుపై అదే ఆస్తిని రిజిస్ట్రేషన్ కోసం కోటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు డాక్యుమెంట్లు రావడంతో అధికారులు వీటిని తిరస్కరించారు. అనంతరం కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శాంతికుమారి ఆ ఆస్తిని తనపై వీలునామా రాసినట్లు చూపి అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరోసారి తన భార్య కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై భానుకుమార్ పోలీస్ కేసు పెట్టడంతో ఆ రిజిస్ట్రేషన్‌ను కూడా క్యాన్సిల్ చేయించాడు. భానుకుమార్ నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా దాన్ని పరిశీలన కోసం కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. పోలీసుస్టేషన్లో ఆ ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నందున భానుకుమార్ పెట్టుకున్న డాక్యుమెంట్‌ను రెప్యూజ్ చేస్తున్నట్లు కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తెలిపారు. దీంతో భానుకుమార్ నేరుగా జిల్లా రిజిస్ట్రార్‌కు అప్పీల్ చేసుకున్నాడు. పరిశీలించిన డీఆర్ అన్ని సక్రమంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో భానుకుమార్ పేరుపై ఆస్తి నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయింది. ఆ తరువాత కోటేశ్వరరావు రిజిస్ట్రేషన్ అయిన అదే ఆస్తిని మళ్లీ మరోసారి కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. చివరకు భానుకుమార్ రిజిస్ట్రేషన్ నకిలీ అని కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో రిజి స్ట్రేషన్ ఆర్డర్ ఇచ్చిన జిల్లా రిజిస్ట్రార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును లోతుగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా ?
-
కచ్చితత్వం.. పారదర్శకం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ సేవల్లో కచ్చితత్వం, పారదర్శకతను రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవలను ఆన్లైన్ ద్వారా అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రాగా త్వరలో మరికొన్ని కీలక సేవలను ఆన్లైన్ చేయనుంది. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే వివాహ రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే నిర్దేశిత సమయంలో సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. హిందూ, ఇతర మతాల వివాహాలను ప్రత్యేకంగా రిజిస్టర్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ఫీజును ఆన్లైన్లో చెల్లించి ఫాం–ఏ పూర్తి చేసి దానితో పాటుగా వెడ్డింగ్ కార్డు, వివాహ ఫొటో, ఇంటి అడ్రస్ ప్రూఫ్, దంపతుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సాక్షులతో కలిసి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. స్పెషల్ వివాహాల చట్టం కింద ఇతర సాంప్రదాయాల్లో జరిగే వివాహాలను ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సొసైటీలు, సంస్థల (ఫర్మ్‌లు) రిజిస్ట్రేషన్లు సులభతరం చేసి ఆన్లైన్లో వాటిని చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ‘ఈ–చిట్స్’తో మోసాలకు చెక్ చిట్‌ఫండ్ సంస్థల పేరిట జరుగుతోన్న మోసాలకు చెక్ పెట్టడానికి గాను ‘ఈ–చిట్స్’ పేరుతో రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. చిట్‌ఫండ్ వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా, ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా ‘ఈ–చిట్స్’కు రూపకల్పన చేసింది. అలాగే చిట్ ఫండ్ సంస్థలు తమ రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఏ చిట్‌ఫండ్ సంస్థ అయినా తమ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఇప్పటికే ఉన్న చిట్‌ఫండ్ సంస్థలు కూడా తాము నిర్వహించే చిట్ గ్రూపుల సమాచారాన్ని త్వరలో ఇందులోనే అప్లోడ్ చేయనున్నారు. నోటరీల రిజిస్ట్రేషన్‌నూ ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వినతులకూ ఆప్షన్.. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ప్రజలు వినతులిచ్చేందుకు ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ విధానంలో ఎవరైనా తమ విన్నపాన్ని ఆన్లైన్లో ఉన్నతాధికారులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈ వినతులను సంబంధిత విభాగాలు నిర్దేశిత సమయంలో పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లను నేరుగా ఆన్లైన్లో చేసుకునే విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను తామే డేటా ఎంట్రీ ద్వారా తయారు చేసుకుని, ఆన్లైన్లో అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే ఆ సమయంలో ఒక్కసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ విధానం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు
-
‘రిజిస్ట్రేషన్’ అక్రమాలకు చెక్!
కైలాస్‌నగర్: రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్నాళ్లు మాన్యువల్‌గా సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో పాటు స్టాంపుల విక్రయాలకు పూర్తిగా స్వస్తి పలికింది. స్టాంపు వెండర్లు బహిరంగ మార్కెట్లో నేరుగా విక్రయించడాన్ని నియంత్రించిన సర్కారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశాకే వాటిని విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు కూడా ఏ రోజుకారోజు పూర్తయ్యేలా సబ్‌రిజిస్ట్రార్లకూ బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్‌పడటంతో పారదర్శకత పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అనుమతి పొందిన స్టాంప్ వెండర్లకు సబ్ రిజిస్ట్రార్ల మాదిరిగానే వారికి ప్రత్యేక లాగిన్ ఇవ్వడంతో పాటు యూజర్ ఐడీ, పాస్‌వర్డు కూడా కేటాయించారు. వారు ఆ లాగిన్ ద్వారా సబ్రిజిస్ట్రార్ల నుంచి స్టాంపుల విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. బాండ్ పేపర్లు కూడా ఇదే విధానంలో అమ్మనున్నారు. దీంతో రోజువారీగా ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్ని స్టాంపులు, బాండ్ పేపర్లు విక్రయించారనే లెక్క పక్కాగా తేలనుండటంతో పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్ రిజిస్ట్రార్లకూ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం సబ్రిజిస్ట్రార్లకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్లాట్లు, ఇండ్లు, భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు డాక్యుమెంట్స్‌ను అందజేసి, ఫొటో దిగిన తర్వాత ఇదివరకు సబ్ రిజిస్ట్రార్లు చెక్ స్లిప్‌లను తీరిగ్గా పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేవారు. కానీ.. ఇప్పుడలా కుదరదు. ఫొటో దిగిన వెంటనే సబ్‌రిజిస్ట్రార్ తనకు కేటాయించిన ఐడీ ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్లో డాక్యుమెంట్స్‌ను పరిశీలించి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఏ రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆ రోజే పూర్తయ్యే అవకాశం కలుగుతుంది. బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి రావడంతో సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్రంగా నిరీక్షించాల్సి వచ్చింది. తొలిరోజున అనుకున్న స్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగలేదు. సెల్‌ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు స్టాంప్‌లను కొనుగోలు చేయాలనుకునేవారు సెల్‌ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్లో టీయాప్ పోలియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోకి వెళ్లాలి. స్టాంప్స్‌పై క్లిక్ చేసి తమకు అవసరమైన వాటి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లించాలి. సంబంధిత స్టిప్తో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి స్టాంపులను కొనుగోలు చేయవచ్చు. పారదర్శకత పెరుగుతుంది రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ఆన్లైన్లో స్టాంపులు, బాండ్లను విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత తేదీల్లో విక్రయించేందుకు అవకాశముండదు. సబ్ రిజిస్ట్రార్లకు కూడా బయోమెట్రిక్ అమలు చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో పనులు త్వరగా పూర్తికావడంతో పాటు పారదర్శకత పెరగనుంది. – అశోక్, సబ్‌రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
రూ. 260 కోట్ల వక్ఫ్ భూమికి ఎసరు! చక్రం తిప్పిన రియల్ ఎస్టేట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్‌బోర్డు భూములు దర్జాగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. రెవెన్యూ శాఖ (ధరణి)తో పాటు స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో పొందుపర్చిన భూములకు కనీస పరిశీలన లేకుండానే లేఅవుట్ అవుట్ పర్మిషన్లు జారీ అవుతుండగా, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న కొంగర కుర్దు–ఏలో ఈ విధంగా ఓ భారీ రియల్ వెంచర్ వెలుగుచూసింది. సుమారు రూ.260 కోట్ల విలువైన 52.25 ఎకరాల వక్ఫ్ భూములకు సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా వక్ఫ్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోంది. ఇదీ కథ..: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఏలో సర్వే నంబర్ 2 నుంచి 400 వరకు దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేనీ ఖిబ్లా పేరిట సుమారు 500 ఎకరాలకు పైగా వక్ఫ్ భూమి ఉంది. 1954 నుంచి ఇప్పటివరకు పహాణీల్లో పట్టాదారు కాలంలో దర్గా పేరే నమోదై ఉంది. 2007లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులందరితో పాటు సర్వే నంబర్ 86, 87, 88, 89లోని సుమారు 52.25 ఎకరాల భూమి సాగు చేసే చెట్కూరి వంశీయులు కూడా గెజిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేయడంతో అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో సైతం ఆయా సర్వే నంబర్ల వివరాలు పొందుపర్చారు. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. పహాణీ, ధరణిలో కబ్జాదారుడు (పీటీ)ల కాలమ్‌లో చెట్కూరి కుటుంబ వంశీయుల పేర్లు, పట్టాదారుల కాలమ్‌లో దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేనీ ఖిబ్లా పేరు కొనసాగుతూ వస్తోంది. కాగా 2010లో రోడ్డు కోసం సేకరించిన భూమికి గాను ప్రభుత్వం చెట్కూరి కుటుంబాలకు పరిహారం అవార్డు ప్రకటించింది. అయితే కోర్టు వివాదం కారణంగా తుది తీర్పును బట్టి పరిహారం చెల్లింపు వర్తించే విధంగా నిబంధన చేర్చింది. సందట్లో సడేమియా.. హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రంగ ప్రవేశం చేసింది. గ్రామంలో లేని ఇద్దరు రైతుల పేరిట సుమారు 52.25 ఎకరాలకు సంబంధించి పాత తేదీలతో తప్పుడు పత్రాలు çసృష్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక రైతు పేరిట సర్వే నంబర్ 86, 87లోని 24.15 ఎకరాలు, మరొకరి పేరిట సర్వే నంబర్ 88, 89లోని 28.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారు. అప్పటి తూర్పు డివిజన్ (గోషామహల్) రెవెన్యూ అధికారి జారీ చేసినట్లుగా.. ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్) ప్రొసీడింగ్, తప్పుడు పట్టాదారు పాస్ బుక్, టైటిల్ నంబర్, ఖాతా నంబర్, వారసత్వం, భూ మార్పిడి పత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు మండల రెవెన్యూ శాఖ అధీనంలో ఉండే కచ్చా పహాణీలో రైతుల పేర్లు చేర్చారు. అయితే ధరణికి ముందు ల్యాండ్ రెవెన్యూ రికార్డుల్లో (ఆన్లైన్) కానీ, తాజా ధరణి రికార్డులో కానీ ఈ వివరాలు లేకపోవడం ఇవి తప్పుడు పత్రాలేనన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పాస్‌బుక్ ఖాతా నంబర్లను పరిశీలిస్తే సర్వే నంబర్ల వాస్తవ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తోంది. కాగా సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూమిపై జీపీఏ తీసుకుంది. దీని ఆధారంగా వెంచర్ వేసి భూమి రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించగా నిషేధిత జాబితాలో ఈ భూమి వివరాలు ఉండటంతో చుక్కెదురయ్యింది. దీంతో రిజిస్ట్రేషన్‌కు అనుమతి కోరుతూ రియల్ సంస్థ కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తాత్కాలిక ఆదేశాలు పొందింది. అయితే ఇది తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో సదరు రియల్ ఎస్టేట్ సంస్థ భూములను తమ అధీనంలోకి తీసుకుంది. విషయం తెలిసిన చెట్కూరి వంశీయులు ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. కోర్టు ఆదేశాల సాకుతో.. దర్గాకు సంబంధించి సర్వే నంబర్ 82లోని ఆరు ఎకరాలకు గతంలో లేఅవుట్ పర్మిషన్ (ఎల్పీ) జారీ చేసిన హెచ్ఎండీఏ..రియల్ సంస్థ దరఖాస్తు మేరకు తాజాగా ఈ 52.25 ఎకరాలకు ఎల్పీ జారీ చేసింది. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఎల్పీ కోసం దరఖాస్తు చేసుకున్న సమాచారం తెలిసి ధరణిలో పట్టాదారుగా నమోదైన రైతులు.. ఎల్పీ జారీ చేయవద్దని, ఆ భూములపై 12 కేసులు ఉన్నాయంటూ, హెచ్ఎండీఏ వద్ద పలు ఆధారాలతో సహా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భూములపై కోర్టు తుది తీర్పు షరతును సాకుగా తీసుకుని, భూముల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే హెచ్ఎండీఏ ఎల్పీ జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. కాగా వక్ఫ్ బోర్డు మౌనంగా ఉండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఒకవేళ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే ప్లాట్ల కొనుగోలుదారుల పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా హెచ్ఎండీఏ అధికారులు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ స్పందించక పోవడం గమనార్హం. ‘సర్వే నంబర్లు నిషేదిత జాబితాలో ఉన్నమాట వాస్తవమే. అయితే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం..’అని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ మహేందర్ స్పష్టం చేశారు. -
రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే ఇ–స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా రూపొందించిన ఇ–స్టాంపింగ్ విధానం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. www. shcilestamp. com వెబ్సైట్, ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఇ–స్టాంపులను పొందవచ్చు. నగదు, చెక్కు, ఆన్లైన్ (నెఫ్ట్, ఆ ర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచిలు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్ హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 పైగా కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వెయ్యికిపైగా కేంద్రాల వద్ద త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 పైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను చెల్లించవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో వినియోగదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని ఇ–స్టాంపింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇ–స్టాంపింగ్ ప్రయోజనాలు ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది www.shcilestamp.com వెబ్సైట్లో మరియు ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఇ–స్టాంపులు ఆన్లైన్లో దృవీకరించుకోవచ్చు నగదు,చెక్కు,ఆన్లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు ఎస్బీఐ,ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయి ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చు స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం -
26న పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆదివారం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఇతర చలానాలను ఆ రోజు రాష్ట్రంలోని 51 ఎస్బీఐ బ్రాంచిల్లో కట్టవచ్చని తెలిపారు. -
‘గోల్డెన్’డీల్.. ఒక్క డాక్యుమెంట్ రూ.15.96 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ‘గోల్డెన్’డీల్స్ వస్తున్నాయి. 2023 సంవత్సరం ప్రారంభంలోనే మంచి బోణీ అందింది. జనవరి తొలివారంలో ఒకే ఒక్క డాక్యుమెంట్ రిజి స్ట్రేషన్‌తో ఏకంగా రూ.15.96 కోట్ల ఆదాయం సమకూరింది. గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న 75,072 చదరపు గజాల భూమిని మైనార్టీ ట్రస్టు నుంచి మరో ఎడ్యుకేషనల్ ట్రస్టుకు బదలాయిస్తూ (కన్వేయన్స్) ఈ లావాదేవీ జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ భూమి మొత్తం మార్కెట్ విలువను రూ.210 కోట్లుగా లెక్కించి, రూ.15.96 కోట్ల ఫీజు వసూలు చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ ఆరేడు జాక్‌పాట్ లావాదేవీలు జరిగినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తాజాగా తెలిసింది. ఇంతకు ముందు ఇంకా పెద్ద డీల్ 2022 మేలో ఒకే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఏకంగా రూ.35.51 కోట్ల ఆదాయం సమకూరింది. కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వచ్చే మిస్కిపేటలో 1,54,880 చదరపు గజాల భూమిని ఓ ఆయిల్ కార్పొరేషన్, ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కలిసి మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాయి. ఈ భూమి మార్కెట్ విలువ రూ.466 కోట్లుగా నిర్ధారించిన రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు 35.51 కోట్ల ఫీజు వసూలు చేశారు. ఇక గండిపేట, రాజేంద్రనగర్, వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ పలు భారీ లావాదేవీలు జరిగాయని.. కేవలం 5 డాక్యుమెంట్ల ద్వారానే రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ సమకూరిందని అధికారవర్గాలు తెలిపాయి. రూ.14,500 కోట్లదాకా ఆదాయం! రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఫిబ్రవరి 13 నాటికి రూ.12,310 కోట్ల వరకు ఖజానాకు చేరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో.. ఇంకో రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల్లో పేర్కొన్న విధంగా రూ.16 వేల కోట్లు, 2023–24కు నిర్దేశించుకున్న రూ.18 వేల కోట్లు సమకూరే అవకాశం లేదని.. రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా భూ విలువలను సవరిస్తేనే లక్ష్యం చేరుకోవడం సాధ్యమని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూము లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ కలిపి రూ.14,500 కోట్ల మేరకు సమకూరవచ్చని అంటున్నారు. -
తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎన్ని వేల కోట్లో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన ఏడాదిలో..అంటే ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,707 కోట్లు. కానీ ఈ ఏడాది జనవరి వరకు..ఏకంగా రూ.12,000 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో రోజురోజుకూ విస్తృతమవుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాల నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. కరోనా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత బాగా ఊపందుకున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్ విలువలు, పెంచిన స్టాంప్ డ్యూటీ కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానా కళకళలాడుతోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 19.88 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి 31 నాటికి 16.03 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.11,928 కోట్ల ఆదా యం సమకూరినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,600 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య, ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది (2014–15)లో 8.26 లక్షల లావాదేవీలు జరిగి కేవలం రూ.2,707 కోట్ల ఆదాయం మాత్రమే ఖజానాకు రావడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టూనే.. భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు చాలావరకు హైదరాబాద్ చుట్టూనే జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మెజార్టీ లావాదేవీలు జరుగుతుండగా, హనుమకొండ, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేటల్లో కూడా భారీగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో 10 నెలల్లో 50 వేల వరకు లావాదేవీలు జరగ్గా, మిగిలిన జిల్లాల్లో 30 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయేతర భూముల విలువలను బట్టి ఆదాయం సమకూరుతోంది. ఇక రాష్ట్రంలో అతి తక్కువ రిజి్రస్టేషన్లు ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వరంగల్, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో నెలకు సగటున వెయ్యి లోపు లావాదేవీలే జరుగుతుండడం గమనార్హం . ధరణి పోర్టల్‌కు 10.23 కోట్ల హిట్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 2020 నవంబర్ 2 నుంచి అమల్లోకి వచి్చన ధరణి పోర్టల్‌కు ఇప్పటివరకు 10.23 కోట్ల హిట్లు వచి్చనట్టు (వీక్షించినట్లు) ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 29.67 కోట్ల భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ.4,741.65 కోట్ల ఆదాయం సమకూరిందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించింది. -
మార్గదర్శి కార్యాలయంలో 3వ రోజు ముగిసిన సోదాలు
-
రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలపై రెండో రోజు తనిఖీలు
-
ఏపీలో 18 చిట్ ఫండ్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు
-
చిట్‌ఫండ్ అక్రమాలు బట్టబయలు
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ కంపెనీల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, మోసాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రంలోని అనేక కంపెనీలు చిట్ల పేరుతో సామాన్యులు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్ కంపెనీలపై జిల్లాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల్లో తనిఖీలు చేసింది. జీఎస్టీ, పోలీసు అధికారులను కూడా తనిఖీ బృందాల్లో ఉంచి ఆ కంపెనీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో పలు కంపెనీల్లో అక్రమాలు, మోసాలు జరిగినట్లు గుర్తించారు. చాలా కంపెనీలు చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పలు కంపెనీలు చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్టు స్పష్టమైంది. కొన్ని కంపెనీలు వసూలు చేసిన చిట్స్ డబ్బును తమ అనుబంధ కంపెనీలకు మళ్లించి వ్యాపారం చేసుకుంటున్నట్లు తేలింది. చిట్ల రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని వెల్లడైంది. చిట్స్ పాడుకున్నవారికి వాటి కాలం తీరిన తర్వాత కూడా చెల్లించని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నట్లు తెలిసింది. అనుమతులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని కంపెనీలు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరేరకంగా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల ప్రత్యేక ఖాతాల్లో ఉంచిన డబ్బును అదేరోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టు తేలింది. నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు.. వోచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు గుర్తించారు. కొన్ని లావాదేవీలపై నేరుగా ఆదాయపన్ను శాఖ పెనాల్టీ పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జీఎస్టీ చట్టాన్ని కూడా చిట్‌ఫండ్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అక్రమాలు జరిగిన కంపెనీలు, వాటి వివరాలను అందులో పొందుపరిచారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. -
2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
కమలాపురం : అక్టోబర్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని 1,949 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ బి.శివరాం తెలిపారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలోని సబ్ రెజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేశామన్నారు. ఆయా సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు నెట్ వర్క్, స్కానింగ్, వెబ్‌క్యామ్‌లతో పాటు రిజిస్ట్రేషన్లు, సెటిల్ మెంట్లు, పార్టీషియన్లు ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో ఏ గ్రామానికి చెందిన వారు అదే గ్రామంలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పొందవచ్చన్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ జారీ, ఈసీల జారీ తదితర సేవలు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం సంబటూరు, జంభాపురం గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ చెన్నకేశవరెడ్డి, సబ్ రెజిస్ట్రార్ డీఎం బాషా పాల్గొన్నారు. -
జూన్ నాటికి రూ.109 కోట్లతో రిజిస్ట్రేషన్స్
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. గతంలో కరోనా వల్ల కొంత వెనుకబడినా ఈ ఏడాది మాత్రం రిజిస్ట్రేషన్స్ దూకుడు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకువస్తుండడంతో మొదటి మూడు నెలల త్రైమాసికంలో రూ.2 కోట్ల రాబడిని రిజిస్ట్రేషన్ శాఖ రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలకు చేయూతనిస్తుండడంతో రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించి క్రయవిక్రయాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాబడి పెరుగుతోంది. జిల్లాలోని కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరు, నెల్లూరు, నెల్లూరులోని స్టౌన్‌హౌస్‌పేట, బుజబుజనెల్లూరులలో మొత్తం 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్ నుంచి జూన్ నెల మొదటి త్రైమాసికంలో టార్గెట్‌ను ఆ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మూడు నెలలకు గాను 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రూ.107 కోట్లు టార్గెట్ రావాల్సి ఉంది. కాగా రూ.109 కోట్ల టార్గెట్‌ను పూర్తి చేయడం గమనార్హం. 37 వేల రిజిస్ట్రేషన్స్ జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధిచి గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరిశీలిస్తే 16 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ కాగా, కేవలం రూ.60 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. గతేడాది కరోనా ప్రభావంతో రాబడి తగ్గిందని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది 37,700 డాక్యుమెంట్స్ రిజి స్ట్రేషన్స్ కాగా, రూ.109 కోట్ల రాబడిని రిజి స్ట్రేషన్స్ శాఖ రాబట్టడం గమనార్హం. నెల్లూరు ముందజ.. రాపూరు వెనుకంజ రిజిస్ట్రేషన్స్ పరంగా జూన్ వరకు పరిశీలిస్తే 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నెల్లూరు ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయం రూ.40.79 కోట్లతో ముందంజలో ఉండగా రాపూరు కార్యాలయం రూ.53.58 లక్షలతో వెనుకంజలో ఉంది. మిగిలిన కార్యాలయాలు కూడా అన్నింటిలో రాబడిలో దూకుడుగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం చిన్నా, పెద్ద పరిశ్రమలతోపాటు ఇతర నిర్మాణ రంగానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తుండడంతో క్రయవిక్రయదారులు ముందుకువస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు క్రయవిక్రయాలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్స్ ద్వారా రాబడి పెరుగుతోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న నాన్ టీడీసీపీ లేఅవుట్లకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. రానున్న రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు – 15 మొదటి త్రైమాసికంలో రాబడి – రూ.109 కోట్లు అన్నివిధాలుగా సేవలు అందిస్తున్నాం జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంబంధించి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా, చిన్నచిన్న సాంకేతి సమస్యలు వస్తే తప్ప, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. – కిరణ్‌కుమార్, డీఐజీ, రిజిస్ట్రేషన్స్ -
శివార్లలో శరవేగంగా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విజయవాడ చుట్టపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా కానూరు, తాడిగడప, పోరంకి, కంకిపాడు, గన్నవరం, నున్న, ఇబ్రహీంపట్నం, భవానీపురం తదితర ప్రాంతాల్లో ‘రియల్’ జోరు సాగుతోంది. బైపాస్ రోడ్ల నిర్మాణం ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరాయి. దీంతో సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు విజయవాడ తూర్పు బైపాస్ పనులపై దృష్టిసారించారు. ఆయన విజ్ఞప్తి మేరకు, ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడంతో భూసేకరణ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ కారణాలతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక రాజధానితో సంబంధం లేకుండా, కరోనా కష్టకాలంలో సైతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. ఎంతలా అంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ ఏడాది 43 శాతం రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ‘తూర్పు’ వైపు ఆసక్తి.. మరోవైపు.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి నిర్మాణం పూర్తికావడం.. తూర్పు రింగు రోడ్డుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేయటం, చోడవరం వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించటంతో ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో సీఆర్డీఏ ప్లాన్లు ఇచ్చేది. దీంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. అయితే, వైఎస్సార్సీపీ సర్కారు తాడిగడపను మున్సిపాలిటీ చేయడంతో జీ+3 ప్లాన్ల మంజూరు అధికారం మున్సిపాలిటీకి వచ్చింది. దీంతో ఇళ్ల ప్లాన్ల మంజూరు ఇప్పుడు ఈ ప్రాంతంలో తేలికగా మంజూరవుతున్నాయి. ఇక నగరాలకే పరిమితమైన అపార్టుమెంట్లు నేడు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. రూ.30 లక్షల నుంచి రూ కోటి వరకు ధర పలుకుతున్నాయి. వీటికితోడు విల్లాల నిర్మాణం కూడా జోరుగా జరుగుతున్నాయి. అభివృద్ధి దిశగా శివార్లు.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ప్రభుత్వ విధానాలతో పట్టణ శివారు ప్రాంతాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు ఇంటి స్థలాలు కొనాలంటే పట్టణాల వైపు చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం శివారు ప్రాంతాల లక్ష్యంగా విస్తరిస్తోంది. – నర్రా రమేష్‌బాబు, నెప్పల్లి, కంకిపాడు మండలం అందుబాటులో ధరలు ఒకప్పుడు విజయవాడ నగర శివారు ప్రాంతమైన గట్టు వెనుక ప్రాంతంలోని భవానీపురం, విద్యాధరపురం ఇటీవల అభివృద్ధి బాట పట్టాయి. అదే విధంగా గొల్లపూడి కూడా విస్తృతంగా అభివృద్ధి చెందింది. ధరల విషయానికి వస్తే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు చిరు వ్యాపారులకు అందుబాటులో ఉంటున్నాయి. – కీసర సుబ్బారెడ్డి, భవానీపురం, విజయవాడ రియల్ వ్యాపారం పుంజుకుంది ఇటీవల కాలంలో రియల్ వ్యాపారం తిరిగి పుంజుకుంది. మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కట్టుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. అపార్టుమెంట్ల నిర్మాణం చాలా వేగంగా ఉంది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత చేయూతనిస్తే చాలామందికి సొంతింటి కల నెరవేరుతుంది. – బొర్రా శ్రీనివాసరావు, రియల్టర్, పోరంకి, విజయవాడ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది ఈ ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2020– 21లో రూ.644 కోట్ల ఆదాయం రాగా, మొన్న మార్చి నాటికి రూ.1,056 కోట్లు.. అంటే 40 శాతానికిపైగా ఆదాయం పెరిగింది. ఈ రిజిస్ట్రేషన్లు విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కంకిపాడు, గుణదల, పటమట, గాంధీనగర్, నున్న వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. – రవీంద్రనాథ్, డీఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, విజయవాడ -
సొంత ఆదాయంపై ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో పన్ను ఆదాయ ప్రతిపాదనలు తొలిసారి రూ. లక్ష కోట్లను మించాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 1,08,212 కోట్ల మేర సొంత పన్ను ఆదాయం వస్తుందనే అంచనాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను బట్టి చూస్తే రాష్ట్ర సొంత ఆదాయ వనరులపై సర్కారుకు పూర్తి ధీమా ఉన్నట్లు అర్థమవుతోంది. గతేడాది ప్రతిపాదించిన రూ. 92 వేల కోట్ల పన్ను రాబడుల్లో 100 శాతం రావడంతో ఈసారి అదనంగా రూ. 17 వేల కోట్లను అంచనా వేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. వాహనాలపై పన్ను పద్దు మినహా... ఈసారి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే పన్ను ఆదాయ పద్దులన్నింటిలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క వాహనాలపై పన్ను పద్దులో మాత్రమే కొంత తగ్గుదలను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమ్మకపు పన్ను అంచనాలు గతేడాది రూ. 26,500 కోట్లు చూపగా ఈసారి దాన్ని రూ.33,000 కోట్లకు పెంచారు. అలాగే జీఎస్టీ కింద రూ. 31 వేల కోట్లు వస్తాయని గతేడాది అంచనా వేయగా ఈసారి రూ. 36,203 కోట్లు ప్రతిపాదించారు. ఎక్సైజ్ శాఖ పద్దు కూడా రూ. 500 కోట్లు పెరిగింది. గతేడాది రూ. 17,000 కోట్ల అంచనాలు ఈసారి రూ. 17,500 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కింద గతేడాది రూ. 12,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా ఈసారి రూ. 15,600 వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. భూముల అమ్మకాలకు అదే స్థాయిలో... అయితే ఈసారి పన్నేతర ప్రతిపాదనలను తగ్గించి చూపారు. గతేడాది పన్నేతర ఆదాయం రూపంలో రూ. 30,557 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా కేవలం రూ. 20,557 కోట్లే వచ్చాయి. అయినా ఈసారి మరో రూ. 5 వేల కోట్లు కలిపి రూ. 25,422 కోట్లకు పెంచారు. అందులో మైనింగ్ శాఖ ద్వారా రూ. 6,399 కోట్లు, భూముల అమ్మకాల ద్వారా రూ. 15,500 కోట్లు చూపారు. ఇతర పన్నేతర ఆదాయ రూపంలో రూ. 3,500 కోట్లు అంచనాలను ప్రతిపాదించడం గమనార్హం. -
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు టిడ్కో ఎండీ ఆదేశాలు జారీచేశారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి, ఆ రోజుల్లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లయితే సర్వర్లపై భారం ఉండదని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను మినహాయిస్తూ గత నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓలు 27, 28, 29) జారీచేసింది. ఈ ఫీజుల మొత్తం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదట నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించడంతో పాటు, అవసరమైన మార్గదర్శకాలను టిడ్కో ఎండీ ఇచ్చారు. నెలకు 20 వేల ఇళ్ల చొప్పున రిజిస్ట్రేషన్ టిడ్కో ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 2,62,216 ఇళ్లను నిర్మించ తలపెట్టారు. వీటిలో 300 చ.అడుగుల విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లను నిర్మించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలోని గృహాలను గతంలోనే లబ్ధిదారులకు ఒక్క రూపాయికే అప్పగించినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయితే, ఇప్పుడు 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లలో బ్యాంకు లింకేజీ పూర్తయిన వాటిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ దశలో దాదాపు లక్ష ఇళ్లు నిర్మాణంతో పాటు బ్యాంకుల లింకేజీ పూర్తయ్యాయని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. నెలకు 20 వేల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. దీంతోపాటు బ్యాంకు లింకేజీ పూర్తయిన యూనిట్లను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత 300 చ.అ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎస్టీపీలతో పాటు అన్ని వసతులు కల్పించిన నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారన్నారు. మొత్తం అన్ని యూనిట్ల రిజిస్ట్రేషన్లకు అయ్యే సుమారు రూ.800 కోట్లకు పైగా ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ సీఎం వాస్తవానికి 2016లో చంద్రబాబు 300 చ.అ. యూనిట్‌కు రూ.2.65 లక్షల ధర నిర్ణయించినా.. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఒక్క రూపాయికే ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.5.50 లక్షలు ఖర్చవుతుంది. మౌలిక వసతుల కల్పనకు అదనంగా మరో రూ.లక్ష, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.60 వేల వరకు అవుతుంది. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుంది. మిగతా మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంటే సుమారు రూ.5 వేల కోట్లకు పైగా భారాన్ని ప్రభుత్వమే భరించి పేదలకు ఇళ్లు ఇస్తోంది, ఇది గొప్ప విషయం. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ను నెల్లూరు మున్సిపాలిటీలోని వెంకటాపురం నుంచి ప్రారంభిస్తాం. – జె. ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్ -
తెలంగాణలో ఆ 5,925 ప్రాంతాలు.. విలువల మధ్య భారీ వ్యత్యాసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలాచోట్ల భూముల ప్రభుత్వ విలువలకు, బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న ధరలకు పొంతనే లేదని తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరిపిన పరిశీలనలో ఐదు జిల్లాల్లోని 5,925 ప్రాంతాల్లో ఈ రెండు విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. ఆ శాఖ ఉన్నతాధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ రెండు విలువల మధ్య కనీసం మూడింతల నుంచి 13 రెట్ల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువల సవరణను భారీగానే ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అమ్మకపు విలువకు చాలా తక్కువగానే ప్రభుత్వ విలువను సవరించినా ప్రస్తుతమున్న విలువకు రెట్టింపు చేయాల్సి వచ్చింది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల విలువల్లో కూడా రెండింతల వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూలతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వ విలువలను ప్రతిపాదించామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’
Telangana Government: రాష్ట్రంలో వ్యవసాయానికి కీలకమైన సాగునీటి సౌకర్యం, రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. దీన్ని రాష్ట్ర ఖజనాకు కచ్చితమైన ఆదాయం తెచి్చపెట్టే వనరుగా ప్రభుత్వం మార్చుకుంటోంది. ఏడేళ్ల పాటు భూముల విలువల పెంపుపై దృషి?ట్పట్టని ప్రభుత్వం ఏడెనిమిది నెలల క్రితం భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. తాజాగా మరోసారి భూముల విలువలు పెంచేందుకు కసరత్తు దాదాపు పూర్తిచేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురవడంతో.. నల్లధనాన్ని కొద్దిగానైనా అరికట్టే అవకాశాలుంటాయని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలైలో సవరించిన విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో నెలకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుండగా, తాజాగా భూ విలువల పెంపుతో ప్రతినెలా మరో రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1,200 కోట్లుంటుందని, సాలీనా ఇది రూ.15 వేల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. గతేడాది వరకు రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా కేవలం రూ.5,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు రాబడులు వచ్చేవని గత నాలుగేళ్లలో జరిగిన లావాదేవీల గణాంకాలు స్పష్టం చే స్తుండగా, తాజా సవరణలు అమల్లోకి వస్తే అది ఏటా రూ.15 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభు త్వ సొంత పన్నుల ఆదాయం ఒక్క స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ఏడాదికి అదనంగా రూ.8,000 కోట్ల వరకు పెరగనుందన్నమాట. ఇప్పటికి రూ.9 వేల కోట్ల పైమాటే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజి్రస్టేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే జూలైలో ప్రభుత్వ విలువల సవరణకు ముందు మూడు నెలలు కలిపి వచి్చంది కేవలం రూ.1,500 కోట్లపైమాటే. అంటే నెలకు సగటున రూ.500 కోట్లకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా ఆదాయం వచి్చంది. కానీ జూలైలో భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు అప్పటివరకు 6 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెంచారు. అలాగే యూజర్ చార్జీలను కూడా భారీగా పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. జూలైలో ఏకంగా 2.2 లక్షల డాక్యుమెంట్ లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,201 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఆగస్టులో మినహా అన్ని నెలల్లోనూ ఆదాయం రూ.1,000 కోట్లకుపైనే వస్తోంది. ఇప్పుడు తాజాగా కేవలం భూముల విలువలను మాత్రమే సవరిస్తుండడంతో నెలకు అదనంగా రూ.200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘వ్యవసాయ’ఆదాయంలోనూ పెరుగుదల 2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే ఆదాయం క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.81.93 కోట్లు వచి్చన ఆదాయం జూలైలో అత్యధికంగా రూ.156.43 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మినహా అన్ని నెలల్లో రూ.150 కోట్లు దాటింది. మొత్తమ్మీద ధరణి పోర్టల్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6,00,443 లావాదేవీలు జరగ్గా రూ.1,220.54 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. -
మరోమారు భూముల విలువలు పెంపునకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల విలువల సవరణ విధానంలో ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ విలువలను రెండేళ్లకోసారి, వ్యవసాయేతర భూముల విలువల నుప్రతియేటా సవరించుకునే నిబంధనను మార్చింది. ఇక మీదట ఎప్పుడైనా భూముల ప్రభుత్వ విలువలను సవరించుకునే వెసులు బాటు కల్పిస్తూ పాత జీవోను సవరించింది. రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువలను సవరించేందుకు గాను స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి ప్రత్యేక అనుమతి ఇస్తూ ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో (నం.23) విడుదల చేశారు. ఈ సవరణ ఆధారంగా మరోమారు రాష్ట్రం లోని భూముల ప్రభుత్వ విలువలను పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై గత రెండు రోజులుగా అన్ని జిల్లాల రిజిస్ట్రార్లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి తెచ్చేం దుకు గాను ఈ కసరత్తు జరుగుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. సవరించి ఆరు నెలలే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే భూముల విలువలను సవరించారు. గత ఏడాది జూలైలో ఈ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. సాగుభూమి ఎకరం కనిష్టంగా రూ.75 వేలుగా నిర్ధారించింది. ఇక, ఖాళీ స్థలాలను గజానికి కనిష్టంగా రూ.200గా, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల విలువ చదరపు అడుగుకు రూ.1,000గా ఖరారు చేసింది. దీంతో పాటు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను కూడా పెంచింది. ఈ పెంపు, సవరణల కారణంగా ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.400 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తోంది. గతంలో ప్రతి యేటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల మధ్య ఆదాయం వస్తుండగా, ఈ పెంపు కారణంగా జనవరి 20 నాటికే ఈ ఆదాయం రూ.6,800 కోట్లు దాటింది. ఆర్ఆర్ఆర్ కూడా పరిగణనలోకి.. అంతకుముందు ఏడేళ్లుగా ప్రభుత్వం ఈ విలువలను సవరించకపోవడంతో గత ఏడాది చేపట్టిన ప్రక్రియపై ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ భూము ల విలువలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడం, మారుమూల గ్రామాల్లో కూడా ఎకరా కనిష్టంగా రూ.12–15 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుండడం తో మరోమారు భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజినల్ రింగు రోడ్డు లాంటి అభివృద్ధి కారణంగా భూముల విలువలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో తాజాగా విలువల సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. వ్యవసాయ భూముల విలువలు 50 శాతం పెంపు! రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భూములు, ఆస్తు ల విలువలు బహిరంగ మార్కెట్లో ఎలా ఉ న్నాయన్న దానిపై గురు, శుక్రవారాల్లో జిల్లా రిజిస్ట్రార్లతో ఆ శాఖ ఐజీ శేషాద్రి సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూముల విలువలను ఏ ప్రాంతంలో ఎంత సవరించాలి? వాణిజ్య, నివాస కేటగిరీల్లో ఫ్లాట్లు, అపా ర్ట్మెంట్ల ధరలు ఎంత నిర్ణయించాలి? ఖాళీ స్థలాలను ఏ మేరకు సవరించాలనే దానిపై ఆ యన జిల్లా రిజిస్ట్రార్లతో చర్చిస్తున్నారు. అయి తే వ్యవసాయ భూముల విలువలను 50 శాతం, ఖాళీ స్థలాలను 35 శాతం, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లను 25 శాతం పెంచాల నే అంచనాతో కసరత్తు జరుగుతోంది. సీఎం ఆమోదంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అంటున్నాయి. -
నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!
సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ చలాన్ల స్కాంలో స్వాహా చేసిన సొమ్మును వసూలు చేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వేగం పెంచారు. జిల్లాలోని గాంధీనగర్, గుణదల, పటమట, జిల్లాలోని కంకిపాడు, మండవల్లి, నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు 772 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.5.21 కోట్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ కట్టకుండా దస్తావేజు లేఖర్లు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు. కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులు లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఈ ఆరింటిలో ఒక్క మండవల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే 581 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.62 కోట్లు ఖజానాకు కన్నం పెట్టినట్టు తేల్చారు. ఇది రాష్ట్రంలో నకిలీ చలాన్ల ద్వారా జరిగిన అవినీతిలోకెల్లా ఇదే అధిక మొత్తం. అంతేకాదు.. ఈ సొమ్మునంతటినీ కాజేసింది అక్కడ ఉన్న బాలాజీ అనే ఒకే ఒక్క దస్తావేజు లేఖరి కావడం గమనార్హం! అలాగే విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 143 దస్తావేజులకు సంబంధించి రూ.1.82 కోట్ల స్వాహా జరిగినట్టు తనిఖీల్లో గుర్తించారు. బాధ్యులపై చర్యలు.. ఈ నకిలీ చలాన్ల వ్యవహారం వెలుగు చూసినప్పట్నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సొమ్ము రికవరీపై దృష్టి సారించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా మండవల్లి, పటమట సబ్ రిజిస్ట్రార్లతో పాటు పటమట రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్‌ను ఇటీవల సస్పెండ్ చేశారు. మండవల్లి దస్తావేజు లేఖరి బాలాజీపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తి యజమాని నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును వసూలు చేసి, తప్పుడు మార్గాల్లో మార్ఫింగ్ ద్వారా దస్తావేజు లేఖర్లు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో సంబంధిత యజమానులకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జరిగిన మోసంపై కంగుతిన్న సదరు యజమానులు ఆయా దస్తావేజు లేఖరులపై ఒత్తిడి పెంచడంతో వారు స్వాహా చేసిన సొమ్మును క్రమంగా రికవరీ చేయగలుగుతున్నారు. ఇలా ఇప్పటిదాకా విజయవాడ గాంధీనగర్, నందిగామ, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో సంబంధీకుల నుంచి పూర్తి స్థాయిలో సొమ్ము రికవరీ చేశారు. మరోవైపు మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.2.62 కోట్ల సొమ్మును దిగమింగిన దస్తావేజు లేఖరి బాలాజీ నుంచి ఇప్పటి దాకా దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశారు. మిగిలిన సొమ్మును త్వరలో రికవరీ చేస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాలాజీ కుమారుడు రామ్ధీరజ్ డాక్యుమెంట్ వెండర్‌గా ఉన్నాడు. ఆయన కూడా తండ్రి బాటలోనే పయనించాడు. దస్తావేజుల అమ్మకానికి వీలుగా చలాన్ల ద్వారా ప్రభుత్వానికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ధీరజ్ కూడా నకిలీ చలాన్ల ద్వారా రూ.1.53 లక్షలు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ధీరజ్ స్వాహా చేసిన రూ.1.53 లక్షలను అధికారులు వసూలు చేశారు. రూ.2.72 కోట్ల రికవరీ.. జిల్లాలో నకిలీ చలాన్ల ద్వారా కొల్లగొట్టిన రూ.5,21,27,931లో ఇప్పటివరకు రూ.2,72,22,719 లను (52.22 శాతం) అధికారులు రికవరీ చేశారు. మిగతా రూ.2,49,05,212 సొమ్ము వసూలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్ ‘సాక్షి’కి చెప్పారు. ఇవీ చదవండి: టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
చిట్ ఫండ్స్: లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే..
సాక్షి, అమరావతి: చిట్ ఫండ్ కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలన్నీ ఇకపై ఆన్లైన్లో కనిపించనున్నాయి. ప్రస్తుతం చిట్ ఫండ్ కంపెనీల గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఆ కంపెనీలు చెబితేనో, లేకపోతే చిట్స్ రిజిస్ట్రార్ ద్వారానో కొంత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కంపెనీలు తమ వివరాలను ప్రతి నెలా మాన్యువల్‌గా చిట్స్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సమర్పిస్తున్నాయి. ఫైళ్ల ద్వారానే ఇవన్నీ జరుగుతుండటంతో రోజువారీగా ఆ కంపెనీల పనితీరును పరిశీలించడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాన్యువల్ విధానంతోపాటు ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. సంబంధిత కంపెనీల పనితీరు ప్రజలందరికీ తెలిసేలా వాటి వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో దీనిని అనుసంధానం చేసింది. ఆయా జిల్లాల్లో రిజిస్టరైన చిట్‌ఫండ్ కంపెనీలు మాన్యువల్‌గా సమర్పించిన వివరాలను కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యాలయాల్లో దీనిని పరీక్షిస్తున్నారు. 15 నుంచి 20 రోజులపాటు టెస్టింగ్ పీరియడ్‌లో వచ్చిన సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఆన్లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తారు. 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రాష్ట్రంలో ప్రస్తుతం 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆ కంపెనీలు నడుపుతున్న చిట్లు, వాటి చందాదారులు, ప్రతి నెలా వాటిలో జరుగుతున్న వేలం, చిట్టీ ఎవరు పాడుకున్నారు, ఎంతకి పాడారు, చిట్స్ నుంచి బయటకు వెళుతున్న వారు, కొత్తగా చేరుతున్న వారు, ఆ కంపెనీల టర్నోవర్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. కొత్తగా ప్రవేశపెట్టే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చిట్ ఫండ్ కంపెనీలు ఎప్పటికప్పుడు వివరాలు సమర్పిస్తున్నాయా లేదా? ఏవైనా తేడాలున్నాయా? వంటి వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. తద్వారా కంపెనీల పనితీరును పర్యవేక్షించడం సులభమవుతుంది. ఆ కంపెనీల్లో చిట్లు కడుతున్న వారు, కొత్తగా కట్టాలనుకునే వారు వెబ్సైట్లో వాటి పనితీరును తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిట్ ఫండ్ కంపెనీలపై పూర్తిస్థాయి నిఘా ఉంటుంది. ఆ కంపెనీలు చేసే మోసాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. పారదర్శకత కోసం కొత్త వ్యవస్థ చిట్‌ఫండ్ కంపెనీల సమాచారం అంతా ఆన్లైన్లో ఉండేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీనివల్ల అంతా పారదర్శకంగా ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలు చేసే మోసాలు కూడా తగ్గుతాయి. నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
ఫేక్ చలానాలకు శాశ్వతంగా ఫుల్స్టాప్
-
రిజిస్ట్రేషన్ శాఖలో రూ.10 కోట్ల అవకతవకలు జరిగాయి: ధర్మాన
-
AP: సర్వర్ సమస్యలు క్లియర్
గుణదల (విజయవాడ తూర్పు): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ ఏర్పడుతున్న సర్వర్ కష్టాలకు చెక్ పెట్టేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ సంబంధిత సర్వర్‌ను నిలిపేసి డేటా బేస్‌ను మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సోమవారం నుంచి వేగవంతంగా సేవలందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడిగా సర్వర్ సేవలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సర్వర్ విధానం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సర్వర్లు ఇప్పటివరకు ఒకే కేంద్రంగా పని చేస్తున్నాయి. ఈ కారణంగా వందలాది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన సేవలు అందించడంలో సామర్థ్యం సరిపోవడం లేదు. సాంకేతిక సమస్యలు ఏర్పడి కక్షిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వర్ డేటాబేస్ విభజన చేస్తున్నారు. తొలగనున్న రిజిస్ట్రేషన్ కష్టాలు సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఏకంగా 20 రోజుల పాటు ఈసీలు, సీసీలు రాక ప్రజలు అవస్థలు పడ్డారు. సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగక అమ్మకందార్లు, కొనుగోలు దార్లు సంకట స్థితిలో పడ్డారు. ఈ ప్రభావం బ్యాంక్‌లపై పడటంతో లోన్లు రాక రుణ గ్రహీతలు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సర్వర్ సామర్థ్యం పెంచటం వల్ల ఈ కష్టాలన్నీ తీరుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్వర్ సామర్థ్యం పెంచేందుకు కృషి హైదరాబాద్ నుంచి మంగళగిరికి డేటాబేస్ సిస్టమ్‌ను మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి సర్వర్ అప్డేట్ చేస్తాం. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. సర్వర్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు భవిష్యత్‌లో నెట్వర్క్ విధానాన్ని అభివృద్ధి చేస్తాం. – నలమల రేవంత్, కార్డ్ సూపరింటెండెంట్ (విజయవాడ) మంగళగిరిలో ‘పై’ డేటా సెంటర్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘పై’డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సిస్ఫై సంస్థ నిర్వహణలో పై డేటా సెంటర్ ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉండే ఈ సంస్థ ద్వారా ఏపీకి సంబంధించిన డేటాబేస్‌ను మార్చారు. రాష్ట్రంలో ఉండే 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇకపై మంగళగిరి నుంచే సర్వర్ ఆపరేషన్స్ జరుగుతాయి. హైదరాబాద్ నుంచి మంగళగిరికి డేటాబేస్‌ను మార్చే ప్రక్రియలో సర్వర్ సామర్థ్యం పెరిగి సమస్యలు తొలగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. -
అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్!
గద్వాల క్రైం: కారు కొనాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వెనకడుగు వేయరు. అయితే ఇక్కడే పలువురు యజమానులు దళారుల వైపు.. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయినప్పటికీ దళారులకు తెలిసిన సిబ్బంది ద్వారా ఫ్యాన్సీ నంబర్‌ను పెద్ద మొత్తంలో చెల్లించే యజమానులకు ఎలాగైనా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సేవలు ఆన్లైన్ చేసి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టింది. తాజాగా ఫ్యాన్సీ నంబర్ విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్లోనే వాహనదారులకు ఉపయోగపడేలా కోరుకున్న నంబర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ విధానానికి ఈనెల 10న అనుమతులు జారీ చేయడంతో వాహన యజమానులు ఊరట చెందుతున్నారు. సేవలు ప్రారంభం.. ఫ్యాన్సీ నంబర్‌ను పొందేందుకు జిల్లా రవాణా శాఖలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ పూర్తయి మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అనంతరం కోరుకున్న నంబర్‌ను త్వరగా పొందవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా ఆన్లైన్ నంబర్‌ను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండటంతో వాహనదారులకు ఎంతో ఉపయోగపడనుంది. సద్వినియోగం చేసుకోవాలి వాహనాల రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్లు ఆన్లైన్లో రిజర్వు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధానం ద్వారా వాహన యజమానులు కోరుకున్న నంబరును సులువుగా పొందవచ్చు. అలాగే 15 రోజుల్లో వాహనాన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, డీటీఓ -
అచ్చెన్నా.. ఇదేందన్నా!
రాజకీయం అండగా అక్రమాలు.. కండబలంతో దౌర్జన్యాలు.. బెదిరించి అధికారుల్ని లోబరుచుకోవడం.. రికార్డులు మాయం చేయడం.. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం.. వాటిని చూపించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం.. ఆ భూముల్లో నిర్మించిన గోదాములను ప్రభుత్వ సంస్థకే లీజుకివ్వడం.. అక్రమంగా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం.. ఇవీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ వ్యవహారాలు. కాలువను, గోర్జి భూమిని కూడా ఆక్రమించేశారంటే వీరి తెగింపును అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్ని కూడా తమపేరుతో రిజిస్టర్ చేసేసుకున్నారు. పాత రికార్డులు కనిపించకుండా చేసేశారు. వీటిగురించి తెలిసినా ప్రస్తావించేందుకు కూడా ఎవరూ సాహసించరు. ఎవరైనా సాహసిస్తే.. బెదిరించో, దండించో నోరు మూయిస్తారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ అవినీతికి అంతే లేకుండాపోయింది. అచ్చెన్నాయుడు అన్నదమ్ములు వ్యూహాత్మకంగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎర్రన్నాయుడు ఉన్నంతకాలం ఆయన అండతో, ఆయన తర్వాత అచ్చెన్నాయుడు అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. నీరు చెట్టు పనుల్లో కోట్లు తినేశారు. రోడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తన స్వగ్రామమైన నిమ్మాడ సమీపంలోని పెద్దబమ్మిడి గ్రామంలో గోడౌన్ల ద్వారా గత 12 ఏళ్లలో రూ.47 కోట్లకుపైగా అక్రమార్జనకు పాల్పడ్డారు. అక్రమార్జనకు వేదికైన గోడౌన్లను ఏకంగా ప్రభుత్వ భూమిలోనే నిర్మించారు. సర్వే నంబరు 95, 96లో గోడౌన్, సర్వే నంబరు 106లో భవాని గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మించారు. ప్రభుత్వ భూమి, గోర్జి (పొలాలకు వెళ్లే దారి), సాగునీటి కాలువలు సుమారు 3.15 ఎకరాలు ఆక్రమించి ఈ నిర్మాణాలు చేశారు. ఆక్రమిత భూమిలో నిర్మించిన గోడౌన్లను చూపించి వివిధ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. ఆక్రమించిన భూములివే.. సర్వే నంబర్ 95–08లో 1.20 ఎకరాల నీటి కాలువ, సర్వే నంబర్ 95–11లో 51 సెంట్లు గోర్జి పోరంబోకు, సర్వే నంబర్ 96–6లో 11 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమి, సర్వే నంబర్ 96–10లో 58 సెంట్ల ప్రభుత్వ గోర్జి భూమి, సర్వే నంబర్ 95–3లో 15 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమి, సర్వే నంబర్ 96–3 లోగల 21 సెంట్లు ప్రభుత్వ గోర్జి భూమి, సర్వే నంబర్106–6పీలో 18 సెంట్లు, సర్వే నంబర్ 95–08పీలో 2 సెంట్లు, సర్వే నంబర్ 96–3పీలో గల 12 సెంట్లు, సర్వే నంబర్ 96–10పీలో 7 సెంట్లు.. మొత్తం 3.15 సెంట్లను కలిపేసుకుని గోడౌన్లను నిర్మించారు. ఈ భూములను ఆక్రమించడమే కాకుండా తన సోదరులు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌ల భాగస్వామ్యంతో కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూములు చూపించి 2009లో కోటబొమ్మాళి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి (పీఏసీఎస్‌కు) చైర్మన్‌గా ఉన్న కింజరాపు హరిప్రసాద్ కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ భూములనే చూపించి కొన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకున్నారు. రికార్డులు మాయం 1989 నుంచి 2006 వరకు కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన భూముల క్రయవిక్రయాల జాబితాల్లో లభించిన ఈసీల ప్రకారం పరిశీలిస్తే.. కింజరాపు హరిప్రసాద్ తన అన్నదమ్ముల సాయంతో సుమారు 7.86 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్లో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఈ ఆక్రమణల పర్వంలో రెవెన్యూ రికార్డుల్ని మాయం చేశారు. రెవెన్యూ శాఖలో అతి కీలకమైన ఎస్ఎల్ఆర్ రికార్డుల్ని కూడా కనిపించకుండా చేశారు. ఇరిగేషన్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, వివిధ బ్యాంకులను మోసం చేశారు. ఈ క్రమంలో అధికారులను కూడా భయపెట్టారు. గోడౌన్ల ముసుగులో అవినీతి హరిప్రసాద్ 2003లో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించారు. వీటిని 2004కి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, 2014కి 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి విస్తరించారు. 2007 నుంచి 2019 వరకు 12 ఏళ్లలో ఈ గోడౌన్ల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు. టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు జిల్లా పౌరసరఫరాల సంస్థ ఈ గోడౌన్లను లీజుకు తీసుకుని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వచేసేది. ఒక అక్నాలెడ్జ్మెంట్ (ఏసీకే.. అనగా 580 బియ్యం బస్తాలు)కి రెండు క్వింటాళ్ల వరకు మిల్లర్ల నుంచి అనధికారికంగా తరుగు కింద తీసుకునేవారు. వాస్తవంగా ప్రభుత్వమే 1.5 శాతం తరుగు అవకాశం ఇస్తుంది. ఈ లెక్కన మిల్లర్ల దగ్గర తీసుకున్నదంతా అదనమే. మిల్లర్లు తమ గోడౌన్లో ధాన్యం బస్తాలు నిల్వ చేయాలంటే అనధికారికంగా అడ్వాన్సు పేరిట రూ.ఐదువేలు వసూలు చేసేవారు. గోడౌన్ ఫార్మాలిటీ కింద ఒక బస్తాకి రూ.1.60 పైసలు తీసుకునేవారు. వాస్తవానికి ప్రభుత్వమే బస్తాకి రూ.3.50 పైసలు అద్దె చెల్లిస్తుంది. హ్యాండ్లింగ్ కోసం రెండేళ్లకొకసారి టెండర్లు పిలవాల్సి ఉన్నా.. ఎప్పుడూ ఏకపక్షంగానే టెండర్ కొట్టేసేవారు. హ్యాండ్లింగ్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ మిల్లర్ల దగ్గరి నుంచి అనధికారికంగా వసూలు చేసేవారు. ఇవికాకండా వే బ్రిడ్జి కోసమని ఒక ఏసీకేకి రూ.250 వసూలు చేసేవారు. ఇలా అన్ని రకాలుగా సంవత్సరానికి 3 కోట్ల 96 లక్షల 60 వేల రూపాయల మేర అక్రమంగా ఆర్జించారు. ఈ రకంగా 12 సంవత్సరాలకు కలిపి 47 కోట్ల 59 లక్షల 20 వేల రూపాయల మేర కింజరాపు కుటుంబం అడ్డగోలుగా వెనకేసుకుంది. 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోడౌన్లు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.5 వంతున ఎఫ్‌సీఐ లీజులో ఉన్నాయి. నా దగ్గర ఆధారాలున్నాయి 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన కింజరాపు కుటుంబసభ్యులకు అప్పట్లో కేవలం రెండెకరాల పొలం మాత్రమే ఉండేది. ఇప్పుడు వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. నిమ్మాడ గోడౌన్ నిర్మాణంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఆ భూమిని సొంతగా రిజిస్ట్రేషన్ చేసుకుని రెవెన్యూ రికార్డులను మాయం చేశారు. ప్రభుత్వ భూముల రికార్డులను మాయం చేసి వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు కాజేశారు. ప్రధాన కారకుడైన హరిప్రసాద్‌కు సోదరులు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభాకర్ అండగా ఉండటంతో కొన్ని దశాబ్దాలుగా లెక్కలేని అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డులు మాయం చేసి బ్యాంకుల్లో కోట్ల రూపాయలు దోచుకోవడం, గోడౌన్ నిర్వహణలో అక్రమ వసూళ్లకు సంబంధించి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో గోడౌన్ నిర్మాణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినట్లు ఫిర్యాదు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇదే గోడౌన్లో ఏడాది కిందట మండల సర్వేయర్లతో సర్వే చేయించాం. అప్పట్లో ప్రైవేట్ ల్యాండ్ అని నివేదిక ఇచ్చారు. – రమేష్‌బాబు, తహసీల్దారు, కోటబొమ్మాళి భౌతికంగా ఉన్న పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేస్తాం భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో భౌతికంగా ఉన్న పత్రాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తాం. కొన్ని సర్వే నంబర్లకు ఆనుకుని ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉన్నప్పుడు అవి కూడా ప్రైవేటు భూమి యజమాని పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. – జి.రాజు, సబ్‌రిజిస్ట్రార్, కోటబొమ్మాళి -
ఎక్కడి వినతులు అక్కడే
సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాలోని ఆస్తులు యజమానులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం అసైన్మెంట్ కింద పేదలకిచ్చిన భూములన్నీ ఈ జాబితాలోనే ఉంటాయి. వాటిని పట్టాదారులు లేదా వారి వారసులు అనుభవించడానికి తప్ప ఇతరులకు బదలాయించడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కులు ఉండవు. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు భూములు కూడా పీఓబీ జాబితాలో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో పదెకరాలు ఉండి అందులోని ఐదెకరాలు ప్రభుత్వ భూమి ఉందనుకుంటే.. అది మాత్రమే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ, మిగిలిన ఐదెకరాల ప్రైవేటు భూమి కూడా పీఓబీలో ఉంటోంది. దీంతో అత్యవసర సమయాల్లో యజమానులు వాటిని విక్రయించాలన్నా, ఎవరికైనా బహుమతి కింద రిజిస్టర్ చేయాలన్నా వీలుకావడంలేదు. అందువల్ల ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ (పీఓబీ) జాబితాలో ఉన్న భూములను అందులో నుంచి తొలగించాలంటూ భూ యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్‌లోనే దరఖాస్తులు ► నిజంగా అవి ప్రైవేటు భూములైతే వాటిని పీఓబీ జాబితా నుంచి తొలగించాలంటూ జిల్లా కలెక్టర్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు పంపించాలి. కలెక్టర్ల నుంచి వచ్చిన జాబితా ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన జిల్లా రిజిస్ట్రార్లు పీఓబీలోని జాబితాను సవరిస్తారు. ► గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి జనవరి నెలాఖరు వరకూ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పీఓబీ నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖకు 3,255 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా అందాయి. అయితే, అధికారులు వీటిలో తొమ్మిదింటిని మాత్రమే ఆమోదించి 42 తిరస్కరించారు. ► మిగిలిన 3,204 అర్జీలు పెండింగులో ఉండటం గమనార్హం. మీసేవ నుంచి వచ్చిన ఈ దరఖాస్తులు కాకుండా తమ భూములను పీఓబీ నుంచి తొలగించాలంటూ నేరుగా అధికారులకు సమర్పించిన వినతులకు లెక్కేలేదు. ► మొత్తం దరఖాస్తుల్లో 72 శాతానికి పైగా గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు. ► ఒక్కటంటే ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించని జిల్లాలు అధికంగా ఉన్నాయి. ఈ వినతుల పరిష్కారం విషయంపై అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. -
తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్ హాలిడే’ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జీవో ఎంఎస్ నంబర్ 102 జారీచేశారు. రిజి స్ట్రేషన్ చట్టం–1908 ప్రకారం.. అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు సులభతర మైన, పారదర్శక సేవలందించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, సాంకేతిక వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినందున ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. వీలునామాలు, వివాహ రిజిస్ట్రేషన్లు, ఇతర సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సోమవారం నుంచే రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ–చలాన్ల విక్రయాలను నిలిపి వేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆపేయాలన్న ప్రభుత్వ మౌఖిక ఉత్తర్వుల మేరకు గతంలో తీసుకున్న ఈ చలాన్ల ద్వారా మాత్రమే పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు చేశారు. ఇక, మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతు న్నాయన్న వార్తల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద క్రయవిక్రయదారుల రద్దీ కనిపించింది. (వీఆర్వో వ్యవస్థ రద్దు.. కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ సేవలు) ఏమో.. ఏం జరుగుతోందో! గతంలో ఎన్నడూ లేనివిధంగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడం రిజిస్ట్రేషన్ల శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అసలు శాఖలో ఏం జరుగుతుందోననే ఆందోళన ఆ శాఖ అధికారులు, సిబ్బందిలో వ్యక్తమవుతోంది. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇస్తూ కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నారన్న వార్తల నేపథ్యంలో తమకు ప్రభుత్వం ఎలాంటి విధులు కేటాయిస్తుందో, ఇప్పటికే ఉన్న విధుల్లో ఎన్నిటికి కోత పెడుతుందో అనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వరకే తహసీల్దార్లకు ఇస్తారని.. వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను ప్రస్తుత విధానంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే నిర్వహించనున్నారని, రాష్ట్రంలో ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొన్ని ఎత్తివేసి, మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 25 కార్యాలయాలను తీసేసి, అదే సంఖ్యలో పట్టణ ప్రాంతాల్లో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక సబ్రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు వీలునామాలు, పెళ్లిళ్లు, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్లకే పరిమితమవుతారని, చిట్‌ఫండ్ వ్యవస్థ కూడా రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. -
రిజిస్ట్రేషన్ శాఖలో వసూల్ రాజాలు
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలు, అవినీతిని వెలికి తీయాల్సిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ప్రతి నెలా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించాల్సిన అధికారులు జల్సాలు, మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి నెల్లూరు: జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో 9 కార్యాలయాలు, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన భూముల విలువలను తారుమారు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆ శాఖ తేల్చిన ఆడిట్ రిపోర్టులే అద్దం పడుతున్నాయి. కొంత కాలంగా రెండు జిల్లాల పరిధిలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అయితే ఆడిట్ శాఖ సైతం అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటుంది. ♦సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్ గేజ్, సవరణ లీజు అగ్రిమెంట్, వీలునామా, జీపీఏ కమ్ సేల్, జనరల్ పవర్, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలకు సక్రమంగా స్టాంప్ డ్యూటీ చెల్లించారా? లేదా? అనే విషయాలను ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం నిగ్గు తేల్చుతోంది. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు తేలితే వెంటనే పెనాల్టీ వేసి, సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసు పంపిస్తోంది. ♦అయితే మార్కెట్ విలువ ప్రకారమే స్టాంప్ డ్యూటీ సక్రమంగా చెల్లించి ఉంటే జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ వద్ద అప్పీల్ చేసుకుని సరిచేసుకోవచ్చు. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపులో నిజంగా తేడా ఉంటే సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఓనర్‌కు పెనాల్టీ చెల్లించాలని నోటీసు అందిస్తారు. ♦రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం అధికారులు డాక్యుమెంట్లపై అభ్యంతరాలు ఉన్నాయని సాకు చూపుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో నిషేధిత భూములు జాబితాలో ఉన్న ప్రభుత్వ, దేవదాయ భూములకు సైతం సబ్ రిజిస్ట్రార్లు కాసుల కోసం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ♦నెలవారీగా అధికారులు నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్లో ఆయా రిజిస్టేషన్లకు రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్‌లో జాప్యం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఆడిట్ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నల్ ఆడిటింగ్ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. చేయి తడిపిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిటింగ్ పూర్తి చేసి పెనాల్టీలు లేకుండా సరి చేసిన ఉదంతాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలయాల్లో మాత్రం ఆడిట్ చేయకుండా నెట్టుకొచ్చాడు. ఆ అధికారి తీరు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆర్ఓ నెల్లూరులో గతేడాది నవంబర్ నుంచి ఆడిట్ జరగలేదు. దాదాపు 318 డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీలో తేడాలున్నట్లు నిర్ధారణ చేశారు. ♦నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బుచ్చిరెడ్డిపాళెంలో గతేడాది డిసెంబర్ నుంచి ఆడిటింగ్ జరగలేదు. స్టౌన్‌హౌస్‌పేట రిజిస్ట్రార్ కార్యాలయంలో 136 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు నిర్ధారించారు. ♦ఉదయగిరి, వింజమూరు, అల్లూరు, ఆత్మకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆడిట్ నిర్వహించలేదు. ♦గూడూరు జిల్లా పరిధిలో గూడూరు ఆర్ఓ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా గతేడాది డిసెంబర్ నుంచి ఆడిట్ నిర్వహణ జరగలేదు. ఆ కార్యాలయంలో సుమారు 62 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ♦బుజబుజనెల్లూరు, ఇందుకూరుపేట, కోట, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జనవరి నుంచి ఆడిట్ నిర్వహణ చేయలేయకపోవడం గమనార్హం ♦ఆడిటింగ్ విభాగంలో ఉద్యోగ విరమణ చేసిన జిల్లా అధికారి ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను టీమ్‌గా ఏర్పాటు చేసి వారి ద్వారా ఆడిటింగ్ నిర్వహణ చేయించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి పాత తేదీలతో అధికారి సంతకాలు చేసేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆ ఎత్తుగడకు చెక్ పెట్టారు. రూ.3.23 కోట్ల రికవరీపై దృష్టి ఏదీ జిల్లాలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. ఇందులో అత్యధికంగా 648 డాక్యుమెంట్లకు సంబంధించి అవినీతి సొమ్మును రికవరీ చేసినట్లు చెబున్నా.. సగం కూడా లేకపోవడం గమనార్హం. 648 డాక్యుమెంట్లకు సుమారు రూ.2.51 కోట్లు ఉంటే.. మిగిలిన 285 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.3.23 కోట్ల రికవరీ చేయాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు కూడా చేపట్టాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి వసూళ్లు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆడిటింగ్ విభాగంపై చర్యలుంటాయి మా శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నట్లు నా దృష్టికి అయితే రాలేదు. వారు అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడిట్లో గుర్తించిన అక్రమాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్లు పైనే రికవరీ పెండింగ్ ఉంది. త్వరలోనే రికవరీ చేస్తాం. – అబ్రహం, డీఐజీ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
స్థిరాస్తులకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలు
సాక్షి, అమరావతి: పట్టణ, నగర ప్రాంతాల్లో భూములు, స్థలాలు, భవనాలు తదితర స్థిరాస్తులకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఖరారయ్యాయి. పట్టణాల పరిధిలోని స్థిరాస్తులకు జేసీల నేతృత్వంలోని మార్కెట్ విలువల సవరణ కమిటీలు రిజిస్ట్రేషన్ విలువలను హేతుబద్ధీకరించాయి. వాటిని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(కార్డ్) వెబ్సైట్లో పెట్టారు. సోమవారం నుంచి అమల్లోకొస్తాయి. ► కట్టడాలకు సంబంధించి పురపాలక సంస్థలు/నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలను ఒక కేటగిరిగా, మేజర్ గ్రామ పంచాయతీలను మరో కేటగిరిగా, మైనర్ గ్రామ పంచాయతీలను మరో విభాగంగా వర్గీకరించారు. చదరపు అడుగు ప్రాతిపదికన పక్కా ఇళ్లు, పెంకుటిళ్లు, రేకుల షెడ్డు తదితరాలకు వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. ► వ్యవసాయ భూములకు ఎకరా, నివాస స్థలాలకు చదరపు గజం ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ విలువలను నిర్ధారించారు. ► స్థలాలు, భూములను ఎవరైనా కొనుగోలు చేసి తమ పేరుతో కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మార్కెట్ విలువపై 5 శాతం స్టాంపు డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, ఒకటిన్నర శాతం బదిలీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ► రక్త సంబంధీకులు బహుమతి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. ఆస్తి విలువలో రెండు శాతం స్టాంపు డ్యూటీ రూ.1,000 నుంచి రూ.10,000 వరకూ ఫీజు, బదిలీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ► కుటుంబ సభ్యుల మధ్య సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే.. ఆస్తి విలువలో రెండు శాతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనికి బదిలీ సుంకం ఉండదు. -
ఉపాధికి లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సుదీర్ఘ లాక్డౌన్ ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగానే కనిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి ఉధృతి, వైరస్ విస్తరణ ఒకవైపు రోజురోజుకూ పెరుగుతుండగా, గత 68 రోజులుగా కొనసాగిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వాటిలో ఉద్యోగ, ఉపాధి రంగాలు ముందువరుసలో నిలుస్తున్నాయి. వలస, అసంఘటిత కార్మికులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న పేదలు, కూలీలు, ఇతర వర్గాలకు చెందిన చిరుద్యోగులు, ఇతరుల ఉపాధి అవకాశాలపై కోలుకోలేని దెబ్బ పడిందనే విషయం పలు అధ్యయనాలు, పరిశీలనలో వెల్లడైంది. తాజాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో అనేక విషయాలు ప్రస్తుత వాస్తవ పరిస్థితులను కళ్లెదుట నిలబెడుతున్నాయి. మే 24తో ముగిసిన వారాంతం నాటికి దేశ నిరుద్యోగ శాతం 24.3 శాతానికి చేరుకున్నట్టుగా ఇందులో వెల్లడైంది. లాక్డౌన్ విధింపునకు ముందు మార్చి చివరినాటికి 8.8 శాతమున్న నిరుద్యోగం, రెండునెలలకు పైగా లాక్డౌన్ కారణంగా అమాంతం మూడురెట్లు పెరిగిపోయింది. మే నెలలో కొంత వృద్ధి.. ఇదే సమయంలో దేశంలోని ‘ఎంప్లాయిమెంట్ రేట్’ ఏప్రిల్‌లో ఉన్న 27 శాతం నుంచి మేలో 29 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోగా, ఎంప్లాయిమెంట్ రేట్లో 2 శాతం వృద్ధి కారణంగా దాదాపు రెండుకోట్ల మందికి ఉపాధి లభించడంతో ఉపాధి కల్పనలో మంచి పురోగతి సాధించినట్టుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి సంఖ్య మేలో 10.2 కోట్ల మందికి చేరుకోగా, ఒక నెలలో 2 కోట్ల మందికి ఉపాధి లభించడం కొంత సానుకూల పరిణామమే అని తెలిపింది. అయితే దానికి ఐదింతలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి సంఖ్య (10.2 కోట్లు) ఉండడం సవాళ్లతో కూడుకున్నదేనని ఈ నివేదిక అభిప్రాయ పడింది. సాధారణ పరిస్థితుల్లో సీఎంఐఈ విభిన్నరూపాలు, పద్ధతుల్లో నెలకు 1.17 లక్షల మందిని స్వయంగా కలుసుకుని ఇంటర్వ్యూల ద్వారా నిరుద్యోగం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తుంటుంది. లాక్డౌన్ విధించాక మాత్రం 12 వేల మందిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఇతరుల నుంచి ఫోన్ సర్వే ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో పాటు లాక్డౌన్ కారణంగా ఏర్పడిన అనిశ్చితి, ప్రస్తుతముంటున్న ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కొరవడి సొంత ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికుల సంఖ్య భారీగా పెరిగినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌లో తీవ్ర ప్రభావం... లాక్డౌన్ కొనసాగింపు, తదితర కారణాలతో ఏప్రిల్‌లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టుగా సీఎంఐఈ అంచనా వేసింది. లాక్‌డౌన్‌కు ముందే నిరుద్యోగశాతం కొంచెం కొంచెంగా పెరుగుతున్నా, ప్రపంచస్థాయి సరళితో పోల్చి చూస్తే భారత్‌లో ఏప్రిల్ నెలలో ఇది ఒక్కసారిగా పెరిగినట్టు తన అధ్యయనంలో ఈ సంస్థ నిర్ధారించింది. జనవరిలో 3.6 శాతమున్న నిరుద్యోగం, ఏప్రిల్ నాటికి 14.7 శాతానికి పెరిగినట్టుగా జేఎన్‌యూ ప్రొఫెసర్ బిశ్వజిత్‌ధర్ తెలిపారు. వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల పరిశ్రమలకు నష్టం వాటిల్లడంతో పాటు గ్రామాల్లో వ్యవసాయ పనులకు పోటీ పెరిగి ఉపాధి తగ్గే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 2030 ఏళ్ల వారే ఎక్కువ... లాక్డౌన్ కారణంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే 20–30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2.7 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్టుగా ఇటీవల వెల్లడించిన నివేదికలో సీఎంఐఈ స్పష్టం చేసింది. కన్జూ్జమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్స్ సర్వేలో 20–24 ఏళ్ల మధ్యనున్న యువకులే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిలో 11 శాతమున్నట్టు, 2019–20లో మొత్తం ఉద్యోగాల్లో ఉన్న వారిలో ఈ యువకులే 8.5 శాతం ఉన్నట్టుగా వెల్లడైంది. 2019– 20లో 3.42 కోట్ల మంది యువతీ యువకులు పనిచేస్తుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో వారి సంఖ్య 2.09 కోట్లుగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. వీరితో పాటు 25–29 ఏళ్ల మధ్యలోనున్న 1.4 కోట్ల మంది అదనంగా ఉద్యోగాలు కోల్పోయినట్టుగా స్పష్టమైంది. ఇరవయ్యవ పడిలో ఉన్న 2.7 కోట్ల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఏర్పడే ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌లో 30వ పడిలో ఉన్న పురుషులు, స్త్రీలు 3.3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వారిలో 86 శాతం మంది పురుషులే ఉన్నట్టుగా సర్వే వెల్లడించింది. ఆరేళ్లు వెనక్కి! కరోనా ప్రభావంతో గత నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు తక్కువ ఆదాయం వచ్చింది. గత నెల 6న లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో దాదాపు 20 రోజుల పాటు జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో రూ.207 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడులను నెలలవారీగా పరిశీలిస్తే ఆరేళ్ల వెనక్కి ఆదాయం వెళ్లిపోయిందని అర్థమవుతోంది. 2014 అక్టోబర్‌లో రూ.179.93 కోట్ల ఆదాయం లభించింది. ఆ తర్వాత ఇంత తక్కువ ఆదాయం రావడం ఈ ఏడాది మేలోనే కావడం గమనార్హం. మొత్తం కలిపి రూ.220 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు నెలలు గడిచిపోగా, స్టాంపుల శాఖకు ఇప్పటివరకు రూ.220 కోట్ల ఆదాయమే వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమల్లో ఉండటంలో ఏప్రిల్‌లో రూ.12 కోట్ల ఆదాయమే వచ్చింది. సాధారణంగా ప్రతి నెలలో రూ.500 కోట్లకుపైగా ఆదాయం వస్తుండగా, ఏప్రిల్‌లో రూ.12 కోట్లకే పరిమితమైంది. రిజిస్ట్రేషన్ లావాదేవీలు కూడా అత్యల్పంగా జరిగాయి. ప్రతి నెలలో లక్షన్నర వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతుండగా, ఏప్రిల్‌లో 4,595 లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఇక, మేలో జరిగిన 75,129 లావాదేవీలకు గాను రూ.207.73 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 20 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగ్గా సగటున రోజుకు రూ.10 కోట్ల మేర వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు అందులో సగం వరకు ఆదాయం వచ్చిందని, లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఈ మేర ఆదాయం రావడం మంచి పరిణామమేనని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ లో పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని, జూలై చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
ఇళ్ల పట్టాల కోసం ప్రత్యేక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేసేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నివాస స్థల పట్టాలకు ఐదేళ్ల తర్వాత పూర్తి విక్రయ హక్కులు ఉంటాయి. ఇందుకోసమే దరఖాస్తు (డీకేటీ) పట్టా కాకుండా 25 లక్షల మందికి రూ.10 స్టాంపు పేపర్లపై కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ దస్తావేజు) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసే అధికారం జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఆఫీసులో ఒక్కొక్కరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 295 మంది జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. రాష్ట్రంలోని 670 మండలాల పరిధిలో 25 లక్షల మందికి ఒకేరోజు కన్వేయన్స్ డీడ్స్ నమోదు చేయడం ఈ 295 మంది జాయింట్ సబ్ రిజిస్ట్రార్లతో అయ్యే పనికాదు. అందుకే నవరత్నాల కింద 25 లక్షల మందికి నివాస స్థలాలకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్స్ జారీ అధికారాన్ని రాష్ట్రంలోని 670 మంది తహసీల్దార్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల పేరిట కన్వేయన్స్ డీడ్స్ ప్రత్యేక అవసరార్థం తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా, తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు బుధవారం జారీ చేసిన వేర్వేరు జీవోల్లో పేర్కొన్నారు. వీటి ప్రకారం తహసీల్దార్లే నివాస స్థలాలకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్స్ జారీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్టాంపుల ప్రింటింగ్ ప్రెస్‌కు (మింట్) లేఖ రాసి రూ.10 విలువ గల నాన్ జ్యుడిషియల్ స్టాంపులు 25 లక్షలు తెప్పించింది. వీటిపైనే లబ్ధిదారుల పేరుతో కన్వేయన్స్ డీడ్స్‌ను తహసీల్దార్లు తయారు చేస్తారు. లబ్ధిదారులకు స్థలం బదలాయింపు స్థలాన్ని ప్రభుత్వమే లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. దీన్నే కన్వేయన్స్ డీడ్ అంటారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సదరు ఆస్తి విలువలో 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పేదల నుంచి రిజిస్ట్రేషన్ రుసుములు వసూలు చేయడం ఇష్టం లేనందున రాష్ట్ర సర్కారు ఈ కన్వేయన్స్ డీడ్స్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ వేర్వేరు జీవోలు ఇచ్చింది. రూ.10 స్టాంపు పేపర్లపై కన్వేయన్స్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి వీలుగా రిజిస్ట్రేషన్ శాఖ అన్ని రకాల సేవలకు వాడుకునే కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(కార్డ్) డేటాను ఈ ప్రత్యేక అవసరార్థం (కన్వేయన్స్ డీడ్స్) రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు సమకూర్చనున్నారు. దీంతో తహసీల్దార్లే జాయింట్ సబ్ రిజిస్ట్రారు హోదాలో కన్వేయన్స్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రత్యేక పని కోసం మాత్రమే తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించారు. -
ఆర్డీవో నిర్ణయం సమంజసమే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ భూములపై బుధవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వే నెం.613లోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసేందుకు ఖానాపూర్ ఆర్డీవో నిరాకరించడం సమంజసమేనని పేర్కొంది. భూముల మార్పిడి దరఖాస్తును ఆర్డీవో తోసిపుచ్చడాన్ని, భూముల్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ లిమిటెడ్, ఆల్ఫా హోల్డింగ్స్ కంపెనీలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం తీర్పు చెప్పారు. సుమారు రూ.150 కోట్ల విలువైన తమ భూమి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితాలో సెక్షన్ 22ఏ కింద ఉన్నాయని, ఆ జాబితా నుంచి తొలగింపునకు ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. హక్కుదారుల నుంచి భూములు కొనుగోలు చేశామని, రెవెన్యూ రికార్డుల్లోనూ మా కంపెనీల పేర్లున్నాయని, సుప్రీంకోర్టుకు చేరిన ఈ వివాదంలో కంపెనీల హక్కుల నిర్ధారణ కూడా అయిందని కంపెనీలు వాదించాయి. వ్యవసాయేతర భూములుగా చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జాబితా అడ్డంకిగా ఉందన్న అధికారుల వాదనను కొట్టేయాలని కోరాయి. అయితే, ఈ వాదనను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. సర్వే నెంబర్ 613లో 373.22 ఎకరాలున్నాయని, ల్యాండ్ సీలింగ్ అంశంపై స్పష్టత లేదని, భూగరిష్ట చట్టం కింద క్రయవిక్రయదారుల నుంచి ఏవిధమైన డిక్లరేషన్ ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనల తర్వాత ప్రభుత్వ వాదనను ఆమోదిస్తూ ఈ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం మెరుపుదాడులు చేసింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో 13 జిల్లాల్లో ఎంపిక చేసుకున్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సోదాల్లో అనధికార డాక్యుమెంట్ రైటర్లను గుర్తించడంతోపాటు కార్యాలయాల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్ము రూ.10,34,256 స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు ఏసీబీ డీజీ తెలిపారు. బట్టబయలైన అక్రమాలు.. - ఆస్తుల క్రయవిక్రయాలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం వస్తే డబ్బులు వసూళ్లు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ఆస్తిని బట్టి రేటు పెట్టి మామూళ్లు దండుకుంటున్నారు. - ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అనధికార డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులను గుర్తించారు. - రిజిస్ట్రార్, సిబ్బంది వద్ద ఉన్న పుస్తకాలు, డాక్యుమెంట్లు, టేబుల్ సొరుగుల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్మును గుర్తించారు. - రిజిస్ట్రార్లకు ఇచ్చేందుకు అనధికార డాక్యుమెంట్ రైటర్లు తెచ్చిన మొత్తాలను స్వాధీనం చేసుకున్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఫలితం రాష్ట్రంలో అవినీతి ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన స్పందన 14400 టోల్ ఫ్రీ నంబర్ ఫలితాలిస్తోంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు 14400కు వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు. అత్యధిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ప్రభుత్వ శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పట్టిన అవినీతి మకిలిని వదిలించేందుకు ఏసీబీ డీజీ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏకకాలంలో అన్ని జిల్లాల్లోను సోదాలు నిర్వహించారు. -
స్టాంపులు దొరకట్లేదు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు కొరత ఏర్పడింది. రూ. 50, 100 విలువైన స్టాంపులు చాలా చోట్ల దొరకడంలేదు. దీనివల్ల స్థిరాస్తుల కొనుగోలు ఒప్పందాలు, ఎంవోయూలు, వివిధ ధ్రువీకరణ, అఫిడవిట్లు, నోటరీలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొరతవల్ల బైట ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ స్టాంపులు తెచ్చుకోవాలని, అయితే ఆ సంస్థకు గత సర్కారు రూ. 17 కోట్ల బకాయి పడినందున సమస్య ఏర్పడిందని సమాచారం. పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ సంస్థకు బకాయిలు విడుదల చేయడంతోపాటు రూ. 115 కోట్లకు స్టాంపులకు ఇండెంట్ పంపించారు. ప్రత్యామ్నాయ మార్గాలున్నా.... గతంలో స్థిరాస్తుల కొనుగోలు, తనఖా ఒప్పందాలకు ఎంత రుసుమైతే అంత చెల్లించి స్టాంపులు కొనుగోలు చేసి దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కాలక్రమంలో స్టాంపుల బదులు ఆన్‌లైన్‌లోనూ, బ్యాంకుల్లో చలానా రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించి రూ. 100ల స్టాంప్ పేపర్‌పై దస్తావేజు (మొదటి పేజీ) రాయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫీజు మొత్తం చెల్లించి తెల్లకాగితాలపై ఫ్రాంక్లిన్ మిషన్‌తో ముద్రలు కూడా వేయించుకోవచ్చు. అయితే స్టాంపు పేపర్లపై దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికే చట్టబద్ధత, భద్రత ఉంటుందనే అపోహ ప్రజల్లో ఉంది. దాంతో ఎక్కువ మంది రూ. 100ల స్టాంప్ పేపర్‌పైనే దస్తావేజులు రాయించుకుంటున్నారు. దాంతో వీటికి డిమాండ్ ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు : ఐజీ స్టాంపుల కొరత లేకపోయినా ఉన్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. ఎక్కడో కొన్ని సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కొరత ఉంటే జిల్లాలోని ఇతర ఆఫీసుల నుంచి పంపించే ఏర్పాటు చేశామని, ఎక్కడా కొరత లేకుండా సర్దుబాటు చేయాలని డీఐజీలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ’సాక్షి’కి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రకాల స్టాంపులు మొత్తం 2.08 కోట్లు ఉన్నాయని, వీటి విలువ రూ. 56.50 కోట్లని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఓటీపీ చెబితే డాక్యుమెంట్లు!
సాక్షి, షాద్‌నగర్ టౌన్: భూములు, ప్లాట్ల కొనుగోలు తర్వాత డాక్యుమెంట్లు చేతికి రావాలంటే ఇప్పటివరకు కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. దళారులను ఆశ్రయించి ఎంతోకొంత డబ్బు ఇస్తేనే అవి అందేవి. ఈ ఇబ్బందులు ఇక తప్పనున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్‌నంబర్‌కు ఓటీపీ వచ్చే విధంగా చర్యలు చేపట్టింది. వన్‌టైం పాస్వర్డ్ నంబర్ చెబితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్లను అందిస్తున్నారు. ఇక రశీదులు లేవ్.. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు పూర్తయిన తర్వాత డాక్యుమెంట్‌ను తీసుకునేందుకు గతంలో రశీదు ఇచ్చేవారు. అయితే, దళారులు కార్యాలయ సిబ్బందితో కుమ్మకైసదరు పత్రాలను నేరుగా కొనుగోలుదారులకు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించేవారు. అదేవిధంగా దళారులు, దస్తావేజు లేఖరులు కార్యాలయం నుంచి డాక్యుమెంట్లను తీసుకొని తమవద్ద ఉంచుకొని కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెట్టేవారు. దీంతో పత్రాలు చేతికి రావాలంటే కొనుగోలుదారులు వారి చేతులు తడపాల్సిందే. దీనిని గుర్తించిన రిజిస్ట్రేషన్ శాఖ రశీదు విధానానికి స్వస్తి పలికింది. రిజిస్ట్రేషన్ సేవలకు వర్తింపు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వివిధ రకాల సేవలను సబ్రిజిస్ట్రార్లు అందిస్తున్నారు. కొనుగోలు, అమ్మకం దస్తావేజులు, దాన సెటిల్మెంట్, ఆస్తిహక్కు విడుదల, జీపీఏ, ఏజీపీఏ, సవరణ, వీలునామా, భాగ పరిష్కారం, తనఖా, తనఖా ఆస్తిహక్కు విడుదల తదితరాలకు నూతన సంస్కరణలు అమలు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆస్తికి సంబంధించి కొనుగోలు, అమ్మకందారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు విధిగా కొనుగోలుదారు తమ సెల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. డాక్యుమెంట్ సిద్ధమైన తర్వాత కొనుగోలుదారుడి సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కొనుగోలుదారులకు ఆన్లైన్లో దస్తావేజులను డౌన్లోడ్ చేసుకునే వీలును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కల్పించింది. స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో సెల్నంబర్తోపాటు సెక్యూరిటీ కోడ్ నమోదు చేస్తే సర్టిఫై చేసిన డాక్యుమెంట్ పత్రాలను ఆన్లైన్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రైతుల్లో అవగాహన కరువు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేదు. రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన సంస్కరణలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి దస్తావేజు సిద్ధమైన తర్వాత వారి ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అయితే, ఫోన్‌నంబర్‌కు ఓటీపీ వస్తుందనే విషయం రైతుల్లో సరైన అవగాహన రాలేదు. దీంతో చాలామంది మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఓటీపీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సెల్‌ఫోన్‌కు ఓటీపీ నంబర్.. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లు పొందేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లు కార్యాలయంలో సిద్ధం కాగానే కొనుగోలుదారుడు పొందుపర్చిన సెల్‌ఫోన్ నంబర్‌కు ఓటీపీ (వన్ టైం పాస్ వర్డ్) వస్తుంది. ఆ తర్వాత కొనుగోలుదారులు సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఓటీపీ నంబర్ చెప్పి అధికారుల నుంచి నేరుగా డాక్యుమెంట్లను తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారం రోజుల లోపు కొనుగోలుదారులు ఓటీపీ నంబర్ చెప్పి పత్రాలు తీసుకోవచ్చు. ఈ విధానం ఇటీవలే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పారదర్శకంగా సేవలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనేక సంస్కరణలు చేపడుతోంది. డాక్యుమెంట్లను తీసుకునేందుకు ఓటీపీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కార్యాలయంలో దస్తావేజులు స్కానింగ్ పూర్తయిన తర్వాత స్థిరాస్థి కొనుగోలుదారుల ఫోన్‌నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ చెబితే నేరుగా వారికే పత్రాలను అందజేస్తున్నాం. రైతులు ఓటీపీపై అవగాహన పెంచుకోవాలి. – సతీష్‌కుమార్, సబ్‌రిజిస్ట్రార్, ఫరూఖ్‌నగర్ -
పారదర్శక పాలనలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు
-
పారదర్శక పాలనలో సీఎం జగన్ మరో అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలతో అస్తవ్యస్తంగా వున్న రిజిస్ట్రేషన్స్ శాఖలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకుని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందని రాష్ట్ర ప్రభుఏత్వం భావిస్తోంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆన్లైన్లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి పూర్తి స్థాయిలో స్వస్తి చెబుతున్నారు. ఆన్లైన్ లో తమకు సంబంధించి క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు, దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్లోడ్ చేయడం ద్వారా టైం స్లాట్‌ను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాష్ట్రంలో ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాసస్థలాలకు సంబంధించి సేల్‌డీడ్, సేల్‌అగ్రిమెంట్, తాకట్టు రిజిస్ర్టేషన్, బహుమతి రిజిస్ర్టేషన్లు, జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వివిధ అవసరాలకు తగినట్లు దాదాపు 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ డాక్యుమెంట్లలో క్రయ, విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్లోడ్ చేయాల్సి వుంటుంది. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్ రైటర్లు చేసేవారు. ఇప్పుడు వారితో అసవరం లేకుండానే క్రయ, విక్రయదారులే నేరుగా చేసుకునే వీలు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు ఉన్నా కూడా దీనిలో నమోదు చేసుకునే అవకాశం వుంది. సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దానితో రిజిస్ర్టేషన కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి, వాటిని సవరించారు. నవంబర్ ఒకటో తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ శాఖ కమిషనర్ సిద్దార్ధా జైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలను ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, రియాల్టర్లు, బిల్డర్లు, పురప్రముఖులు, సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి అవసరమైన సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. తిరస్కరించే డాక్యుమెంట్లపై అప్పీల్‌కు అవకాశం నూతన విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్లను ఏదైనా కారణం వల్ల తిరస్కరిస్తే, దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చ. ఏ కారణాల వల్ల డాక్యుమెంట్‌ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ అందిస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్‌లో రికార్డుల మోత
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో రికార్డుల మోత మోగుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయంమరింతగా పెరుగుతోంది. జనవరి నుండి మే వరకూ ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.80 కోట్ల నుండి రూ.90 కోట్ల మధ్య మాత్రమే ఉండగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నాలుగు నెలల్లో ఆదాయం రూ. 187కోట్లకు చేరింది. 2019 సంవత్సరానికి ప్రభుత్వం టార్గెట్ రూ. 136.66 కోట్లు కాగా గతనెలనాటికే రూ. 187 కోట్లకు రాబడి చేరుకుంది. ఇది డిసెంబర్ నాటికి రూ. 250 కోట్లకు చేరనుంది. సాక్షి ప్రతినిధి కడప : తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరగడంతో ప్రభుత్వ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది. దీనికి కారణం అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడం, కొత్త పరిశ్రమలు నెలకొల్పకపోవడం. ఫలితంగా భూములు, స్థలాల ధరలు పతనమయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రిజిస్ట్రేషన్లు దాదాపుగా పడిపోయాయి. 2016లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ రూ. 171.31 కోట్లు కాగా.. 61,608 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.115.44 కోట్ల ఆదాయం లభించింది. 2017లో రూ.140.43 కోట్ల టార్గెట్ . 62,577 రిజిస్ట్రేషన్లకు గాను రూ.138. 43 కోట్లు రాబడి వచ్చింది. గతేడాది రూ. 203.24 కోట్లు టార్గెట్. 83,838 రిజిస్ట్రే్టషన్లు జరిగాయి. రూ. 217 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ. 136.66 కోట్లు టార్గెట్ కాగా గత నెల చివరి నాటికి 72,866 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.187.51 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే నెలకు సగటున రూ.20.83 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ నాటికి మరో రూ.62.49 కోట్లు రానుందని అధికారుల అంచనా. ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది రాబడి రూ. 250 కోట్లకు చేరనుంది. ఈ ఏడాది ఆగస్టులో అర్బన్,రూరల్ పరిధిలోనూ 10 శాతం రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. జగన్ ప్రభుత్వం కొలువు దీరిన నాలుగు నెలల కాలంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ల గణాంకాల ప్రకారమైతే రాబడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఆదాయం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కడప పరిధిలోని చిట్వేలు,లక్కిరెడ్డిపల్లి,పుల్లంపేట,రాయచోటి,రాజంపేట,సిద్దవటం,సుండుపల్లి,కడప రూరల్,కడప అర్బన్ తో పాటు ప్రొద్దుటూరు పరిధిలోని బద్వేలు,జమ్మలమడుగు,ప్రొద్దుటూరు,కమలాపురం,మైదుకూరు,ముద్దనూరు,పులివెందుల,వేపంపల్లి,దువ్వూరు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పాలన వల్లే ఇది సాద్యమైందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం, జిల్లాలో పలు కొత్త పరిశ్రలు,ప్రాజెక్టులతో పాటు అన్నిరంగాలలో జిల్లాను సమగ్రాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగింది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో జిల్లా రాబోయే ఐదేళ్లలో మరింత అభివృద్ధి చెందనుంది. జిల్లాలో స్థలాలు, భూముల ధరలు మరింతగా పెరిగాయి. గత ప్రభుత్వంలో పతనావస్థకు చేరిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. గత ఐదేళ్లలోపడిపోయిన రిజిస్ట్రేషన్లు తాజాగా జోరందుకున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రాబడి పెరిగింది. -
అక్రమ బ్లో అవుట్లు!
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. రియల్ రంగం జోరు మీద ఉండటంతో కొందరు రియల్టర్లు, బ్రోకర్లు తక్కువ ధరకు ప్లాట్ల పేరిట ప్రజలను మోసగిస్తున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే హైదరాబాద్ శివార్లతోపాటు జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి అమ్మేస్తున్నారు. చిన్నపాటి లొసుగులను సాకుగా చూపుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిజి్రస్టేషన్ అవుతున్న ప్లాట్లలో దాదాపు 85 శాతం అక్రమ లేఅవుట్లే కావడం గమనార్హం. నిబంధనలివి... - సాధారణంగా లేఅవుట్ ఏర్పాటుకు డీటీసీపీ, హెచ్ఎండీఏ తదితర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. పంచాయతీలకు లేఅవుట్ జారీ అధికారం లేదు. - పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ప్లేగ్రౌండ్స్ తదితర వాటికి పక్కాగా స్థలాలను కేటాయించాలి. - తారు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు సౌకర్యాన్ని ప్రతి ప్లాటుకు కల్పించాలి. - ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చుట్టూరా 10 కి.మీ మేర నిర్మాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. - ఈ జలాశయాల పరిరక్షణకు 111 జీఓను తెచ్చి కాలుష్య పరిశ్రమలను నిషేధించింది. - గృహ, ఇతర అవసరాలకు మాత్రం భూ విస్తీర్ణంలో 10 శాతం మాత్రమే వినియోగించుకునేలా షరతు విధించింది. అనుసంధానానికి అడ్డు... కొత్తగా ఏర్పాటు చేసే లే–అవుట్ల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. అనుమతి పొందిన లేఅవుట్లలోని స్థలాలనే రిజిస్ట్రేషన్ చేసేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ సబ్ రిజి్రస్టార్లకు లేఖ రాసినా రిజిస్ట్రేషన్లశాఖ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. అలాగే 111 జీవో క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిన పంచాయతీరాజ్, హెచ్ఎండీఏ విభాగాలు చోద్యం చూస్తుండగా, వాటర్‌బోర్డు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలో రోడ్డు, ఓ భవన నిర్మాణం ఉన్న ప్రాంతం ఓ కుంట అంటే నమ్ముతారా! కానీ ఇది నిజం.. శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటలో అక్రమంగా వెలిసిన వెంచర్ ఇది. ఇక్కడ జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం ఎలాంటి లే–అవుట్లు, నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రియల్టర్లు ఏకంగా కుంటలోనే ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. కుంట సమీపంలో ఉన్న చారిత్రక ఫిరంగి కాలువ కూడా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కి కనుమరుగైంది. ఈ జీఓ పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లోనూ ఇలాంటి అక్రమాలే కనిపిస్తాయి. -
స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖలో అవినీతికి చెక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే నొక్కి చెబుతున్న అవినీతి రహిత, పారదర్శక పాలనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ చర్చించుకుని, రిజిస్ట్రార్ల పోస్టింగ్‌లు, బదిలీలకు కొత్త విధానాన్ని రూపొందించి తక్షణమే అమలు చేశారు. అవినీతి కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్లుగా కొత్త వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో అడుగుపెట్టేవారు ఉత్సాహంగా, నిజాయతీగా పనిచేస్తారని, అవినీతికి పాల్పడరనే ఉద్దేశంతో ఈ నియామకాలు జరిపారు. ఇందుకోసం రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పరిపాలనా సౌలభ్యం పేరుతో కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాఖలాల్లేవ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా గ్రూప్–2కు ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న 12 మందిని మెరిట్ (గ్రూప్ –2లో వచ్చిన మార్కులు) ఆధారంగా 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా బుధవారం ప్రభుత్వం నియమించింది. గ్రూప్–2 ద్వారా సబ్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు మారుమూల చివరి గ్రేడ్‌లో ఉన్న ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులు కావడం మొదటి నుంచి రివాజుగా వస్తోంది. అయితే ఈ పర్యాయం దీనికి పూర్తి భిన్నంగా రిజిస్ట్రేషన్ శాఖ వారికి కీలక స్థానాలను అప్పగించింది. జోన్–1లో విశాఖపట్నం, మధురవాడ, భీమిలి, జోన్–2లో గాంధీనగర్, విజయవాడ పటమట, గుణదల, రాజమండ్రి, జోన్–3లో మంగళగిరి, నెల్లూరు, నల్లపాడు, జోన్–4లో అనంతపురం, కర్నూలు ఆదాయపరంగా ముందున్నాయి. అందువల్ల వీటిని అత్యంత ఫోకల్ కేంద్రాలుగా ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్ శాఖ పరిపాలనా సౌలభ్యం పేరుతో (అవినీతి కట్టడి లక్ష్యంగా) ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లుగా కొత్తవారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 12 మంది కొత్తవారిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ ఇలా పోస్టింగ్‌లు ఇచ్చిన దాఖలాలు లేవని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘సాధారణంగా అధిక ఆదాయం ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీ అవుతుందని తెలియగానే పలుకుబడి గల అధికారులు సిఫార్సులు చేయించుకుని, అక్కడికి బదిలీ అయ్యేవారు. కీలకమైన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఖాళీలు ఉండేవి కావు. కొత్తగా సబ్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు అప్రధానమైన ప్రాంతాల్లోనే నియమితులయ్యేవారు. మొదటినుంచీ ఇదే విధానం అమలవుతోంది. ఈసారి అవినీతికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో కొత్త ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో నియమించాం’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఇన్స్పెక్టర్ జనరల్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. పకడ్బందీగా నిబంధనల అమలు కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చిన 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా మిగిలిన చోట్ల పోస్టింగులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ విధానం పాటించింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసుల్లో ఉన్న వారికి ప్రధానమైన చోట్ల (ఫోకల్) పోస్టింగులు ఇవ్వరాదని, ప్రధానమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన ప్రాంతాల్లో, అప్రధాన ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రధాన ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. ఈ మేరకు పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. ఎక్కడ ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్స్పెక్టర్ జనరల్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నోడల్ అధికారులుగా ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్/ జిల్లా రిజిస్ట్రార్లు పక్కాగా నిబంధనల ప్రకారమే బదిలీల కౌన్సెలింగ్‌ను బుధవారం నిర్వహించారు. కొత్త రక్తానికి ప్రాధాన్యం ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1కు ఎంపికై జిల్లా రిజిస్ట్రార్లుగా నియామకం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమించాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు రోజుల క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే జిల్లా రిజిస్ట్రార్ కేడర్‌లోని వారిని సబ్ రిజిస్ట్రార్లుగా నియమించడం సాంకేతికంగా తప్పవుతుంది. అందువల్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఐజీ వెంకట్రామిరెడ్డి వెళ్లి ఉప ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాన్ని వివరించారు. కొత్తగా ఎంపికైన 12 మంది సబ్ రిజిస్ట్రార్లను అధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తే బాగుంటుందని వారు విన్నవించారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–1కు ఎంపికైన ఆరుగురిని కూడా ఇదే తరహాలో అతి ముఖ్యమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జిల్లాల రిజిస్ట్రార్లుగా నియమిద్దామని తెలిపారు. దీనికి సమ్మతించిన ఉప ముఖ్యమంత్రి ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రూప్–2లో మెరిట్ ఆధారంగా 12 మంది కొత్త వారిని కీలక ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమించారు. ఆరు ముఖ్యమైన జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్లుగా త్వరలో కొత్త వారికి పోస్టింగులు ఇవ్వనున్నారు. -
‘ఆన్లైన్ స్లాట్’ అగచాట్లు!
సాక్షి, సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ స్లాట్ విధానం దస్తావేజుదారులకు చుక్కలు చూపుతోంది. సిబ్బంది కొరత, ఆన్‌లైన్‌పై అవగాహన లేకపోవడం, మంచి ముహూర్తాల కోసం వేచిచూడడం వంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ప్లాట్ లేదా భూమి కొనుగోలు చేసి వెసులుబాటుతో మంచి ముహూర్తం చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూశాం. కానీ ఆన్లైన్ పద్ధతి వల్ల ఇది సాధ్యం కావడం లేదు. ఎప్పుడు స్లాట్ దొరికితే అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోందని దస్తావేజుదారులు వాపోతున్నారు. స్థిరాస్తుల నమోదుకు అమావాస్య...పున్నమి, మంచి, చెడు రోజు అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ సంస్కరణలో భాగంగా దస్తావేజుల నమోదు కోసం ఆఫ్‌లైన్ విధానానికి స్వస్తి చెప్పి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా దస్తావేజుదారులు ఆన్లైన్ స్లాట్‌బుక్ చేసుకొని వస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేసేది లేదని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఖరాకండిగా చేప్పేస్తున్నారు. దీంతో ఆన్లైన్లో స్లాట్ లభించేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నగర పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నెలకొంది. రోజుకు 15 నుంచి 18 వరకు నగరంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు పడిపోయింది. ఇప్పటి వరకు ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి రోజు సుమారు 50 నుంచి 150 వరకు దస్తావేజులు నమోదు జరగగా, గత పక్షం రోజుల నుంచి పది శాతానికి మించి నమోదు కాని పరిస్ధితి నెలకొంది. ప్రతి రోజు ఒక్కో సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో 15 నుంచి 18 మించి స్లాట్ బుకింగ్ లభించడం లేదు. దీంతో ఆన్లైన్ స్టాట్ కోసం వారం, పది రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు ముహూర్తాలు పెట్టుకొని వచ్చిమరీ ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించుకొని వెళ్లేవారు. తాజాగా ఆ పరిస్ధితి కనిపించడం లేదు. సిబ్బంది కొరతేనా... రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించారు. రిజిస్ట్రేషన్ శాఖలో కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు, పదవీ విరమణ చేసిన పోస్టులు భర్తీ చేయక పోవడంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. దీంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాక ఔట్సోర్సింగ్ పద్ధతిపై సిబ్బంది సేవలు వినియోగించారు. కానీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం పెరగడంతో వారిని పెద్దఎత్తున తొలగించారు. అయితే సిబ్బంది కొరత ఏర్పడటంతో తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు ఇద్దరు ముగ్గురు చొప్పున తిరిగి కేటాయించింది. అయితే దస్తావేజుదారుల తాకిడి పెరిగి ప్రస్తుత సిబ్బంది ఏ మూలకు సరిపోవడం లేదు. తాజాగా టీఎన్జీవో రిజిస్ట్రేషన్ శాఖ విభాగం ప్రతినిధులు ఏకంగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ కమిషనర్‌ను కలిసి సిబ్బంది కొరత పై వినతిపత్రం సమర్పించారు. సిబ్బంది కొరత అధిగ మించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేయాలని, తక్షణమే ఆఫీసుకు 5 నుంచి 8 మంది చొప్పున తీసుకోవాలని విన్నవించారు. తగ్గుతున్న ఆదాయం మహానగరంలో స్థిరాస్తి భూమ్‌తో రికార్డులు సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కేవలం పక్షం రోజుల్లో పది శాతం పడిపోయింది. వాస్తవంగా నగర శివార్లలోని వరంగల్ హైవేలో యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, ఇన్ఫోసిస్ విస్తరణ, ఘట్కేసర్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, ఆదిభట్లలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండ, చిత్రనగరి తదితర నిర్మాణాల ప్రకటనతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి జీవం పోసినట్లయింది. మరోవైపు నగర శివారులోని రాయదుర్గం, కోకాపేట, మణికొండ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలు ప్రధాన కార్యాలయాల ఏర్పాటు, నివాస గృహాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను కొనుగోలు చేయడంతో ఒకేసారి స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరిగినట్లయింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది నగర నుంచే సుమారు 70 శాతం ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ స్లాట్లతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. -
భూమి విలువ పెరగనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువ సవరణ ఈ ఏడాదీ జరిగే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు జరగని ప్రక్రియకు ఈ ఏడాదైనా అనుమతి వస్తుందని భావించినా, ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రావాల్సిన సవరణ విలువలు వచ్చేలా లేవు. ఇప్పుడు అనుమతినిచ్చినా ప్రక్రియ పూర్తికి 3నెలలు పడుతుందని, అక్టోబర్ నాటికి సవరించిన విలువలు అందుబాటులోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నా.. భూముల మార్కెట్ విలువలను సవరించే ప్రక్రియపై సర్కారు ఏమీ తేల్చకపోవడంతో ఈ ఏడాదీ సవరణలు జరిగే అవకాశం లేదని వారు భావిస్తున్నారు. ఆరేళ్ల విలువల ఆధారంగానే.. భూముల క్రయ, విక్రయ లావాదేవీలతో పాటు నష్టపరిహారం చెల్లింపులోనూ మార్కెట్ విలువే కీలకం కానుంది. అయితే, ఉమ్మడి ఏపీలో ఆరేళ్ల క్రితం 2013లో మార్కెట్ విలువను సవరించగా అప్పటి నుంచి అవే ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, మార్పుల కారణంగా బహిరంగ మార్కెట్లో భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. ఆరేళ్ల నుంచి మార్కెట్ విలువలో హెచ్చుతగ్గులు లేకపోవడంతో కొన్ని భూములు, ఆస్తులకు రిజిస్ట్రేషన్ల విలువను రెండింతలు ఎక్కువగా వేసి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతో భూముల మార్కెట్ విలువలను సవరించి సహేతుక ధరలను నిర్ధారించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశలో నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ ఏడాదీ భూముల విలువలను సవరించే ప్రక్రియకు అనుమతినివ్వాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. 50 శాతం అదనపు ఆదాయం ఈ ఆరేళ్ల నుంచి కనీసం 2 సార్లు సవరణ జరగాల్సిన భూముల విలువలు ఆరేళ్ల క్రితం విలువలతోనే ఆగిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. మార్కెట్ విలువల సవరణలు జరిగితే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల ద్వారా 50శాతం ఆదాయం లభిస్తుందని అధికారులు చెపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.5,700 కోట్ల ఆదాయం రాగా, మార్కెట్ విలువలను సవరిస్తే అది రూ.8,500 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపి అక్టోబర్ నుంచి సవరించిన మార్కెట్ విలువలు వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని తెలుస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం భూముల విలువలను సవరించేందుకు ససేమిరా అంటుండడం గమనార్హం. సిద్ధమైనా.. పెద్ద కసరత్తే భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ, రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను నియమించుకోవాలి. వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, వ్యవసాయేతర భూములకు జాయింట్ కలెక్టర్లు కన్వీనర్లుగా కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల, గ్రామాల వారీగా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఆ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే, ప్రభుత్వ ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. అయితే, ఆనవాయితీ ప్రకారం భూముల మార్కెట్ విలువలు ఎప్పుడు సవరించినా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం అనుమతించినా ఆగస్టు1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. -
నకిలీ ఆధార్‌తో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇరవై మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఆయన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిపిన వైనం తాజాగా బయటపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ చిరంజీవులు చొరవతో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పట్టణంలోని హరినాథపురానికి చెందిన కె.ప్రకాశ్‌రావు 1996, మేలో చనిపోయారు. ఆయన మరణించినట్టు అదే ఏడాది జూన్‌లో మరణ ధ్రువీకరణ పత్రం కూడా రిజిస్టర్ అయింది. కానీ ఆయన బతికే ఉన్నట్టు ఆధార్ కార్డు సృష్టించిన అక్రమార్కులు దాని సాయంతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్‌డీడ్ నంబర్: 1953/2019 ద్వారా హైదరనగర్‌లోని 300 చదరపు గజాల ఫ్లాట్‌ను ఈ ఏడాది మార్చిలో రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 45 రోజుల వ్యవధిలో అవే దస్తావేజులను మరో రెండు సార్లు రిజిస్టర్ చేశారు. విషయం ఐజీ చిరంజీవులు దృష్టికి తీసుకెళ్లడంతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ జహంగీర్ చేత కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేయించారు. విచారణకు సహకరించేందుకు వీలుగా సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శామీర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ శేషగిరిచంద్‌ను ఇన్చార్జిగా నియమించారు. పరిశీలించుకోండి: ఐజీ చిరంజీవులు ఈ ఘటన నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు సంబంధించి క్రయ విక్రయ లావాదేవీలు జరిపినప్పుడు, ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని ఐజీ చిరంజీవులు సూచించారు. అమ్మినవారు సరైన వారా కాదా అనే విషయాన్ని చూసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పని ఈజీ.. ఆదాయం డబుల్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతికంగా మెరుగుపడింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నది. పనిని సులభతరం చేసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు, నెట్వర్క్ సమస్యలతో సతమతమయ్యే ఈ శాఖలో గత ఏడాది కాలంగా అవరోధాలు లేకుండా అమలవుతున్న సేవలు ఆదాయాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా 2017 చివర్లో రెయిల్‌టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధికి కారణమవుతున్నాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ సొంత నెట్వర్క్.. ఆ తర్వాత అప్‌గ్రేడ్ తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్తోనే కలసి రిజిస్ట్రేషన్ల నెట్వర్క్ ఉండేది. స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్(స్వాన్) పేరుతో ఉండే దీని ద్వారానే తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ లావాదేవీలు జరిగేవి. దీంతో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ బిజీ ఏర్పడి తరచూ సేవలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ ద్వారా 2 ఎంబీపీఎస్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని కోసం ఏటా రూ.1.2 కోట్లను ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తోంది. రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతోపాటు స్కానర్లు, ప్రింటర్లు, బయో మెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిస్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి 5 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త పరికరాలు, రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న 7 వేల టెరాబైట్ల సామర్థ్యం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నెట్వర్క్, సెంట్రల్ సర్వర్ల ఏర్పాటుతో లావాదేవీల్లో వేగం పెరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్లోడ్, డాటా ఎంట్రీ, ఫోటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీ సమయాన్ని పావుగంట వరకు తగ్గించగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘గతంలో సర్వర్లలలో సాంకేతికంగా అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఒక్కోసారి 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండటం లేదు.’అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది గణనీయంగా లావాదేవీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం లావాదేవీలు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో మొత్తం 11,36,372 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 15,12,468 లావాదేవీలు జరగడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2017–18 మార్చిలో1,16,928 క్రయవిక్రయ లావాదేవీలు జరిగితే 2018–19 మార్చిలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కన్నా 41 శాతం ఎక్కువని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 37% కన్నా ఎక్కువ సంఖ్యలో లావాదేవీల వృద్ధి కనిపించడం గమనార్హం. -
ప్లాన్ ఓకే అయితేనే ప్లాట్ల రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లలో స్థలాల క్రయ విక్రయాలకు ముకుతాడు వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ల శాఖను అప్రమత్తం చేస్తోంది. మొదట హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో ఈ పద్ధతిని అమలు చేసి తర్వాత.. డీటీసీపీ ఆధీనంలోని గ్రామీణ ప్రాంతాల్లోని లేఅవుట్లకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ అనుమతి పొందని లేఅవుట్లలో ప్లాట్లపై నిషేధం విధిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక లేఅవుట్లలో మాత్రమే రిజిస్ట్రేషన్లను అనుమతించాలని కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆయన లేఖ రాశారు. 7 జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను గుర్తించేందుకు గత నెల 29 నుంచి ఈ నెల 10 వరకు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు చౌకగా లభించే అనధికార లే అవుట్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుద్దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. లేఅవుట్ అభివృద్ధితో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధం లేకపోవడంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను యథేచ్ఛగా చేస్తోంది. దీంతో ఇకపై ఇలాంటి వ్యవహారానికి ఫుల్సాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ నుంచి తుది అనుమతి (ప్లాన్ అప్రూవ్డ్) అయిన వెంచర్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖను కోరింది. -
అమాత్యుని లయ.. అంతా మాయ!
చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించుకున్నట్టు చిరుదోగ్యులు తమ ఇళ్ల కోసం కొనుక్కున్న భూమిని ప్రభుత్వ పెద్దలు బినామీ పేర్లతో కబ్జా చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్డీఏ కబ్జాదారుల క్రయవిక్రయాలకు అనుమతిచ్చేసింది. ప్రజలకు సహకరించాల్సిన సహకార శాఖ అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఫలితంగా విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (వీఆర్‌టీఏ)కు చెందిన దాదాపు రూ.100 కోట్ల విలువైన తొమ్మిదెకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇలాకా అయిన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఈ భూ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. నిజమైన సభ్యులకు చెందాల్సిన ప్లాట్లతో కబ్జాకోరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. ఈ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వ శాఖల తీరును గమనిస్తే దీని వెనుక మంత్రి ఉమా అండ దండలున్నాయనేది స్పష్టమవుతోందని బాధిత సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి తప్పుదోవ పట్టించే నివేదికలు విజయవాడ కేంద్రంగా ప్రైవేటు లారీ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో 1970లో విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీఆర్‌టీఏ) ఏర్పడింది. విజయవాడ వన్‌టౌన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని దాదాపు 400 మంది చిరుద్యోగులు ఈ అసోసియేషన్‌లో చేరారు. సొంతింటి స్థలం పొందాలనే ఆశయంతో 1980లో ఇబ్రహీంపట్నంలో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు లారీ యజమానులు, సంఘ సభ్యులు విరాళాలు అందించారు. అప్పట్లో దాని విలువ రూ.3.50 లక్షలు. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ.వంద కోట్లు ఉంటుంది. వీఆర్టీఏలో సభ్యులకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించుకునేలా 1980 డిసెంబర్లో కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. సొసైటీ పేరుతో ఆ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. ఎంఐజీ, ఎల్ఐజీ పేరుతో 250, 150 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించాలని నిర్ణయించారు. 1981లో కొత్త కార్యవర్గం ఏర్పడటంతో సమస్యలు మొదలయ్యాయి. విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీఆర్‌టీఏ) పేరును 1997లో విజయవాడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీజీటీఏ)గా మార్పు చేశారు. మళ్లీ 2000లో దాన్ని ‘ది విజయవాడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్’గా పేరు మార్చారు. విలువైన భూమిపై కన్నేసిన కొందరు ఆ తర్వాత వీఆర్‌టీఏ హౌసింగ్ సొసైటీని కూడా మూసేస్తూ దాని పేరిట ఎలాంటి భూమి లేదని ప్రకటించారు. గతంలో సొసైటీ బాధ్యుడిగా ఉన్న వ్యక్తి దగ్గర పని చేసిన ఉద్యోగి ఇదే భూమిలో రెండంతస్తుల భవనం కట్టి, అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులు.. మంత్రి జోక్యంతో తప్పుదోవ పట్టించే నివేదికలతో నిజమైన సభ్యులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమాలకు ప్రభుత్వానికి చెందిన సీఆర్డీఏ, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాస్తవంగా వీఆర్‌టీఏ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన సభ్యులకు దక్కాల్సిన ప్లాట్లు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. దీంతో కబ్జాకోరులు ప్రభుత్వ శాఖల సహకారంతో ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ఈ ప్లాట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారు. సర్వే నంబర్లు 214/2ఏ, 3ఏలలో 2.13 ఎకరాలు, 207/2లో 4సెంట్లు, 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాలు, 214/2బీ,3బీలలో 4.48 ఎకరాలు చొప్పున సుమారు 9 ఎకరాలు ఉండాలి. కానీ అందులో 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని గతంలోనే ప్రకటించగా, మిగిలిన మూడు సర్వే నంబర్లలో 139 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతిపాదిత 318 ప్లాట్ల లేఔట్లో 179 ప్లాట్లు అన్యాక్రాంతమయ్యాయి. వాస్తవంగా సభ్యులైన 20 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించగా మిగిలినవి బినామీ పేర్లతో బయటి వ్యక్తులకు కట్టబెట్టారు. కబ్జాదారులు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తొలుత సేల్‌డీడ్‌గా జరిపించి ఆ దస్తావేజులను ఎవరికీ చూపొద్దని చెబుతున్నట్టు సమాచారం. స్థానిక సబ్ రిజిస్టార్ ఆఫీసును ప్రలోభపెట్టి కొన్నేళ్లుగా ప్లాట్ల వివరాలు బయటకు పొక్కకుండా చూశారు. హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని ఆనేక మందికి ఇష్టారాజ్యంగా ప్లాట్లను అమ్ముకున్నారు. దీంతో ఆ ప్లాట్లలో 27 పక్కా భవనాలు కూడా వెలిశాయి. మిగతావన్నీ ఖాళీ ప్లాట్లుగా ఉన్నప్పటికీ, ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురుకి విక్రయించారని సమాచారం. కొన్న వారు తమదంటే తమదని స్థలం వద్ద తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. ఈ 9 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను కూడా విజయవాడలోని ఒక బ్యాంకులో మార్ట్‌గేజ్‌లో పెట్టినట్టు తెలిసింది. న్యాయం జరిగే వరకు పోరాడతాం భూ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. రికార్డులు తారుమారు చేసి ప్లాట్లను అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాదారులకు కొన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్‌లో లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని లోకాయుక్త ఆదేశించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల అధికారులకు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశాం. ఆ భూమిని కబ్జా కోరల నుంచి కాపాడి నిజమైన సొసైటీ సభ్యులకు అందే వరకు పోరాటం సాగిస్తాం. – బొజ్జా రాఘవరావు,వీఆర్‌టీఏ మాజీ కార్యదర్శి -
రిజిస్ట్రేషన్స్ భళా.. ఖజానా కళకళ!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖతో రాష్ట్ర ఖజానా కు కాసుల పంట పండుతోంది. ఏటేటా ఈ శాఖ ఆదాయం పెరుగుతుండగా.. ఊహించని విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,357కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఇది వెయ్యికోట్లు అదనం. ఈ ఏడాది లక్ష్యానికీ అందనంత దూరంలో వచ్చిన ఆదాయం లెక్కలు ఆ శాఖ అధికారులనూ ఆశ్చర్య పరుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ప్రతి నెల ఆదాయంలో వృద్ధి కనిపించగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 5 నెలల పాటు మాత్రం ఈ వృద్ధిలో కొంత తరుగుదల కనిపించింది. మొత్తం మీద ఈ ఏడాది 27 శాతం పెరుగుదల నమోదైంది. ఇది రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దేశంలోనే అత్యధికమని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. శుభారంభం గతేడాది లెక్కలను పరిశీలిస్తే ఈ ఏడాది జనవరిలోనే రిజిస్ట్రేషన్ల శాఖ శుభారంభం చేసింది. 2017–18 ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.274.22 కోట్ల ఆదాయం రాగా, 2018–19 ఏప్రిల్‌లో ఏకంగా రూ.411.51 కోట్లు వచ్చింది. ఇది గతేడాదితో పోలిస్తే 50% కన్నా ఎక్కువ. ఇక, ఆ తర్వాత మే, జూన్, జూలై మాసాల్లో అంతకుముందు ఏడాది కన్నా 20–28% వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి కనిపించగా, ఆగస్టు నాటికి అది పతాకస్థాయికి చేరింది. సెప్టెంబర్‌లోనూ 59.19% వృద్ధి కనిపించి నా ఆ తర్వాత ఈ వేగం కాస్త తగ్గుముఖం పట్టింది. 2018 సెప్టెంబర్‌లో ప్రభుత్వ రద్దు, ముందస్తు ఎన్నికలకు సంబంధించిన వాతావరణం కనిపించడంతో కొంత మేర లావాదేవీలు తగ్గినా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం కొంత ఎక్కువ ఆదాయమే వచ్చింది. అక్టోబర్‌లో 18.11, నవంబర్‌లో 11.66% వృద్ధి రేటు నమోదు కాగా, ఎన్నికలు జరిగిన డిసెంబర్లో మాత్రం గతేడాది కన్నా 4.85% మాత్రమే ఆదాయం ఎక్కువగా సమకూరింది. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరిల్లోనూ కొంత వృద్ధి మందగించినా, మార్చిలో మళ్లీ 38.38% వృద్ధిరేటుతో ఘనంగా ఆర్థిక సంవత్సరం ముగిసిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెపుతున్నాయి. మొత్తం మీద క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈసారి 26.87% వృద్ధి రేటు నమోదయింది. ఇక, ఆదాయం విషయానికి వస్తే మొత్తం రూ.6,600 కోట్లు సమకూరాయి. అందులో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన 1.5% రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తే నికరంగా రాష్ట్ర ఖజానాకు రూ.5357.37 కోట్లు సమకూరడం గమనార్హం. లక్ష్యం ఒక నెల ముందే! వాస్తవానికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ4,700 కోట్ల ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేసుకుని.. ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యం కేవలం 11 నెలల్లోనే పూర్తయి 2019 ఫిబ్రవరి నాటికే రూ.4,745 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక, డాక్యుమెంట్ల విషయంలోనూ 41% మేర వృద్ధి కనిపించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,16,928 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా, 2018–19 సంవత్సరంలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఒక్క హైదరాబాద్ (దక్షిణ) జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మినహా మిగిలిన అన్ని చోట్లా లావాదేవీల్లో వృద్ధి రేటు కనిపించింది. కారణాలు అనేకం ఈ ఏడాది ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగేందుకు చాలా కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత లేకపోవడం రియల్ రంగానికి ఊపు తెచ్చిందని వారంటున్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు, రియల్ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల కారణంగా అటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇటు నిర్మాణ రంగంలోనూ పురోగతి కనిపించిందని అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా రియల్‌బూమ్ కనిపిస్తోందని, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తున్నా దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ పరిసరాల్లో ఆదాయం పెరిగిందని వారంటున్నారు. హైదరాబాద్ శివార్లలో, నగరాన్ని ఆనుకుని ఉన్న ఉమ్మడి జిల్లాల పరిధిలో భూమిపై పెట్టుబడి బంగారంగా మారిందని, ఈరోజు పెట్టిన పెట్టుబడి ఏడాది, రెండేళ్ల తర్వాత చూస్తే మూడు, నాలుగింతలు కావడంతో ఎక్కువ మంది భూమిపై పెట్టుబడి పెడుతున్నారని చెబుతున్నారు. దీనికి తోడు పెద్ద నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లపై వచ్చిన నిరాసక్తత అలాగే కొనసాగడం కూడా కారణంగా కనిపిస్తోంది. వీటితో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఐటీ రంగంతో అనుసంధానం కావడం, ఆ శాఖ పరిధి లోని కార్యాలయాల్లో సర్వర్లను అప్‌గ్రేడ్ చేయడం, గతంలోలా కాకుండా అవాంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేలా రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు నేతృత్వంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. రీజనల్ రింగ్‌రోడ్డుతో రయ్..రయ్! అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార దశను మార్చివేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదన హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరింపజేసిందని, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల పరిధిలో ట్రిపుల్ ఆర్ మాస్టర్‌ప్లాన్‌ను ఆనుకుని పెద్ద ఎత్తున క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదే అంశాన్ని రిజిస్ట్రేషన్ల ఆదాయ లెక్కలూ ధ్రువీకరిస్తున్నాయి. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా పరిధిలో 31.52%, నల్లగొండలో 71.91%, మెదక్ పరిధిలో 49.39%, మహబూబ్‌నగర్‌లో 70.79% డాక్యు మెంట్ల నమోదు పెరిగింది. ఆదాయం విషయానికి వస్తే మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పరిధిలో రూ.1121.44 కోట్లు, నల్లగొండలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఏడాదితో పోలిస్తేæ 50% ఎక్కువగా రూ.265.53 కోట్లు, మెదక్‌లో రూ.436.11 కోట్లు (55.05% వృద్ధి), మహబూబ్‌నగర్‌లో 40.90% వృద్ధితో 141.82 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వీటితో పాటు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్ రిజిస్ట్రార్ జిల్లాల పరిధిలో కూడా ఆదాయం పెరగడం గమనార్హం. -
రిజిస్ట్రేషన్ శాఖతో రెరా అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారులకు భరోసా కల్పించడమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రధాన లక్ష్యం. రెరాలో నమోదు చేయకుండా విక్రయించే ప్రాజెక్ట్‌లను, ప్రమోటర్లను, ఏజెంట్లను గుర్తించేందుకు అన్ని రకాల అస్త్రాలను వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏల నుంచి అనుమతి తీసుకోగానే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసిన టీ–రెరా.. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ మీద కన్నేసింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా సరే చివరికి రిజిస్ట్రేషన్ శాఖ వద్దకు రావాల్సిందే! ఇక్కడే టీ–రెరా వల వేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ వివరాలు టీ–రెరాకు అందుబాటులో ఉండేలా.. శాఖకు లేఖ రాయనుంది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ, టీ–రెరా, రిజిస్ట్రేషన్ శాఖ.. ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుమతులు, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత వస్తుంది. అంతిమంగా కొనుగోలుదారునికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ, తెలంగాణలో 20 శాతం మంది ప్రమోటర్లు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, పారదర్శకంగా ఉండాలని రెరాలో నమోదు చేశాకే విక్రయాలు జరుపుతుంటే.. 80 శాతం మంది మాత్రం కొనుగోలుదారులకు మాయమాటలు, రకరకాల ఆఫర్లతో మోసపూరితంగా అమ్మకాలు చేస్తున్నారని టీ–రెరా పరిశీలనలో తేలింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా, ఎవరు ఎవరితో క్రయ విక్రయాలు జరిపినా సరే అంతిమంగా రిజిస్ట్రేషన్ శాఖకు రావాల్సిందే కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ, టీ–రెరా సమన్వయంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్ వివరాలు తెలిసేలా రెండు విభాగాలను అనుసంధానించనున్నారు. ప్రతి డాక్యుమెంట్, ప్రాజెక్ట్‌ను రెరా అధికారులు భౌతికంగా పరిశీలించి, రెరాలో నమోదు అయిందా? లేదా? చెక్ చేస్తారు. ఒకవేళ టీ–రెరాలో నమోదు అర్హత ఉండి కూడా రిజిస్టర్ కాకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. సర్వం టీ–రెరా చేతిలో.. టీ–రెరా, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వంగా పనిచేస్తే.. ప్రమోటర్ ఫొటో, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, చిరునామా వంటి సమాచారంతో పాటూ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ప్లాటింగ్ ఏరియా, ప్రాజెక్ట్ వ్యయం, విక్రయ ధర వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పటికే టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రతి ప్రాజెక్ట్, ప్రమోటర్లను గుర్తించేందుకు మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ విభాగాలతో కలిసి పనిచేస్తుమన్నాని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఆయా విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్/ లే అవుట్ సమాచారాన్ని తెప్పించుకొని, భౌతికంగా పరిశీలన చేస్తుమన్నాని చెప్పారు. గడువులోగా రెరాలో నమోదు చేసుకుంటే ఓకే! లేకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. సాక్షి: రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి? రెరా: 4634 ప్రమోటర్లు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఇందులో 2039 మంది ఏజెంట్లు, 2595 ప్రాజెక్ట్ ప్రమోటర్లు ఉన్నారు. సాక్షి: స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే మీ సూచన? రెరా: ఏజెంట్లు, ప్రమోటర్లు ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి లేదా బ్రోచర్లు ఇచ్చి మా ప్రాజెక్ట్‌లో కొనండి అంటే ముందుగా వాళ్లని అడగాల్సిన మొదటి ప్రశ్న.. మీరు రెరాలో నమోదు అయిన ఏజెంటేనా అని! రెండో ప్రశ్న.. సంబంధిత ప్రాజెక్ట్‌లో రెరాలో నమోదు అయిందా అని! వీటికి సమాధానం అవునొస్తే ముందడుగు వేయవచ్చు. సాక్షి: ఒకవేళ రెరా ఏజెంట్ అని, నంబరు ఉందని తప్పుడు సమాచారం ఇస్తే? రెరా: రెరా వెబ్సైట్లో రెరా నంబరు, ఏజెంట్ల వివరాలను నిర్ధారించుకునే వీలుంది. ట్ఛట్చ.్ట్ఛ ్చnజ్చ n్చ.జౌఠి.జీn వెబ్సైట్లోకి వెళ్లగానే సెర్చ్ రిజిస్టర్ ప్రాజెక్ట్ అండ్ ఏజెంట్ అనే అప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ప్రత్యేకంగా లింక్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రాజెక్ట్, ప్రమోటర్ పేరు, ఏజెంట్ల నంబర్లు నమోదు చేస్తే చాలు వివరాలన్నీ క్షణాల్లో మీ ముందుంటాయి. సాక్షి: హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఉంది. కానీ, రెరా రిజిస్టర్ కాదు? ఆ ప్రాజెక్ట్‌లో కొనొచ్చా? రెరా: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, కార్పొరేషన్, పంచాయతీ ఏ విభాగం నుంచి అయినా అపార్ట్మెంట్ లేదా లే అవుట్ అనుమతి తీసుకున్నా సరే రెరాలో నమోదు చేయకుండా విక్రయాలు జరపకూడదు. ప్రకటనలు కూడా చేయకూడదు. అలా చేస్తే రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయి. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన, 9 ఫ్లాట్లు లేదా 501 చ.మీ. నుంచి ప్రారంభమయ్యే ప్రతి అపార్ట్మెంట్, లే అవుట్ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. సాక్షి: రెరా నమోదు గురించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా డెవలపర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటానికి కారణం? రెరా: టీ–రెరాలో ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని నమోదు చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ప్రమోటర్లు, డైరెక్టర్ల వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు, కంపెనీ అడ్రస్, ఏజెంట్ల వివరాలు ప్రతి ఒక్కటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే డెవలపర్లకు కష్టంగా ఉంది. ఈ వివరాలు రెరాకు ఇస్తే.. లాక్ అయిపోతామని భావిస్తున్నారు. అందుకే తప్పుడు ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నాం. రెరాలో తప్పుడు నంబర్లు ఇస్తే షోకాజ్ నోటీసులు పంపిస్తున్నాం. సరైన సమాచారం ఇవ్వని వాళ్ల మీద జరిమానాలతో పాటూ కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: రెరాలో ప్రాజెక్ట్‌లను నమోదు చేయడంతోనే డెవలపర్ల పని పూర్తయినట్టా? రెరా: అది తప్పు. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ నమోదు చేయడంతోనే డెవలపర్ల అసలు పని మొదలవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రెరాలో ప్రాజెక్ట్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 33 మంది డెవలపర్లకు ప్రాజెక్ట్‌ను అప్డేట్ చేయమని చెప్పాం. రెరా వెబ్సైట్లో స్క్రోల్ కూడా చేస్తున్నాం. అప్డేషన్ ఫీజు ఏడాదికి రూ.500. -
ఐఎంజీ కేసులో బాబుపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: మరోసారి ఐఎంజీ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టారని, ఈ వ్యవహారంలో చంద్రబాబు, కంపెనీపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి న్యాయవాది ఇమ్మనేని రామారావు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐఎంజీ పేరిట కాగితాలకే పరిమితమైన కంపెనీకి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములుసహా 850 ఎకరాలు కారుచౌకగా ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాలను ఐఎంజీ–భరత కంపెనీకి ఇవ్వడం వెనుక కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు కీలక పాత్రధారి అయిన అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ సీఎం, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు తనకు సన్నిహితుడైన అహోబిలరావు (బిల్లీరావు), ఆయన సోదరుడు ప్రభాకరరావు(ప్యాట్రో)లకు చెందిన ఐఎంజీబీ కంపెనీకి అప్పనంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లకు కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని, చంద్రబాబు బినామీ కంపెనీలకు భూములు ఇచ్చారని, ఇందుకు కారణమైన ఆ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. కేవలం 8 రోజుల కంపెనీకి, రూ.5 లక్షల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కోట్లాది రూపాయల హైదరాబాద్ భూముల్ని ఇచ్చేసే కుట్రకు కారణమైనవారిని వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. ఆ ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహితులు ఆగస్టు 5వ తేదీ 2003లో ఐఎంజీబీని రిజిస్ట్రేషన్ చేశారని, అప్పుడు షేర్ క్యాపిటల్ కేవలం రూ.5 లక్షలు మాత్రమేనని, ఈ కంపెనీ అధిపతులుగా చెప్పుకునే బిల్లీరావ్, ప్యాట్రోలు ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులని ఇమ్మనేని తెలిపారు. క్రీడలకు చెందిన అంతర్జాతీయ కంపెనీ ఐఎంజీకి అనుబంధ కంపెనీగా ఐఎంజీబీని పేర్కొన్నారని, నిజానికి ఐఎంజీకి ఐఎంజీబీలకు ఏమాత్రం సంబంధం లేదని, ఇదే విషయాన్ని ఫ్లోరిడాలో ఉండే ఐఎంజీ వెల్లడిం చిందని తెలిపారు. తప్పుడు పత్రాలు, ఫోర్జరీలతో మోసం చేసిన ఆ చంద్రబాబు, బిల్లీరావు, ప్యాట్రోలను విచారించాలని, వీరిపై ఐపీసీలోని 420, 406, 408, 468,471, 120 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చట్టంలోని 82, 83 సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందుకు అనుగుణంగా ఐఎంజీబీ పేరిట రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు చేసిన 850 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇమ్మనేని తన వినతిపత్రంలో పేర్కొన్నారు. -
ఇక రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: ఇకపై స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ (పలానా రోజు,సమయం)ను బుక్ చేసుకునే సదుపాయం అందుబా టులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి ఆన్లైన్ స్లాట్ విధానం అమలుకు స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమైంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో స్లాట్ విధానానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్లాట్ బుక్ చేసుకోని వారి దస్తావేజులను పరిశీలించి నమోదు చేయనున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారి దస్తావేజుల నమోదు రోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పూర్తిచేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత స్కాన్ అయిన డాక్యుమెంట్లను ఆ రోజే సంబంధిత దస్తావేజుదారుకు అందజేస్తారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజు 18 మందికి మాత్రమే స్లాట్ బుక్ చేసుకొని స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఇలా..:స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఆన్లైన్ ప్రీ–రిజి స్ట్రేషన్ డాటా ఎంట్రీకి అవకాశం ఇవ్వడంతో దస్తావేజుదారులు ఇంటి వద్దే ఆన్లైన్లో డాక్యుమెంట్‌ను తయారుచేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ చలానా నమూనాలతో పాటు ఫీజు రుసుం వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఉంటాయి. పబ్లిక్ డాటా ఎంట్రీ పూర్తిచేసి ఎలక్ట్రానిక్ చలానా జత పర్చాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డాక్యుమెంట్ ఎంట్రీ పూర్తి కాగానే పది అంకెల నంబర్ వస్తుంది. స్లాట్ సమయానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి ఈ పది అంకెల నంబర్‌ను సబ్ రిజిస్ట్రార్‌కు ఇస్తే వెంటనే దానిని ఆన్లైన్లో పరిశీలించి తప్పులుంటే సరిచేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసి సాయంత్రంలోగా స్కాన్ చేసిన దస్తావేజులను ఇస్తారు. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాటా ఎంట్రీకి స్వస్తి... స్లాట్ బుకింగ్ ఆన్లైన్ విధానం వల్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకు స్వస్తి పలకనున్నారు. ఆన్లైన్లోనే పూర్తి ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్ వద్ద దస్తావేజులు తయారు చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆఫ్‌లైన్‌లో సమర్పించేవారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు డాటా ఎంట్రీ చేసి రిజిస్ట్రేషన్ నమోదు పూర్తి చేసేవారు. ఇక మీదట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ ఉండదు. -
కొత్త పురపాలికల్లో బాదుడు షురూ!
సాక్షి, హైదరాబాద్: కొత్త మునిసిపాలిటీల్లో అప్పుడే బాదుడు ప్రారంభమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నులు మినహాయించి ఇతర పనులైన ఖాళీ స్థలాలపై పన్నులు, నల్లా చార్జీలు, మార్కెట్ ఫీజులు, పశు వధశాలల ఫీజులు, మునిసిపల్ భవనాలు/గదులు/ కార్యాలయ సముదాయాల అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, టౌన్ఫ్లానింగ్కు సంబంధించిన ఇతర ఫీజులు/చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఎంక్రోచ్మెంట్ ఫీజు, మ్యుటేషన్ ఫీజు, వినోద పన్ను, స్టాంపు డ్యూటీపై సర్‌చార్జీలను రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల మేరకు పెంచాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 25న సర్క్యులర్ జారీ చేశారు. 173 గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసి కొత్తగా 38 మునిసిపాలిటీల ఏర్పాటుతోపాటు పాత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మరో 131 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి చివరిలో పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1, 2వ తేదీల నుంచి 68 కొత్త మునిసిపాలిటీలు మనుగడలోకి రాగా, 131 గ్రామ పంచాయతీలు సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో విలీనమైపోయాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో వసూలు చేసిన పన్నులు, పన్నేతర చార్జీలు, ఫీజులను ఇకపై పురపాలక శాఖ చట్టాల ప్రకారం పెంచి వసూలు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నులను మాత్రం పెంచరాదని స్పష్టం చేశారు. మునిసిపాలిటీల చట్టం ప్రకారం కొత్త పురపాలికలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లోని ఖాళీ స్థలాలు/ప్లాట్లపై 0.22 శాతం మార్కెట్ విలువన ఖాళీస్థలం పన్నుగా వసూలు చేయాలని కోరారు. నల్లా చార్జీలకు రెక్కలు కొత్త మునిసిపాలిటీల్లో పాలక మండళ్ల తీర్మానంతో నల్లా చార్జీలను పెంచాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిబంధనల మేరకు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వేర్వేరు చార్జీలను నిర్ణయించాలని సూచించింది. చిన్న హోటళ్లు, వ్యాపార గృహా ల నుంచి కూడా వాణిజ్య కేటగిరీ కింద నీటి చార్జీలు వసూలు చేయనున్నారు. పైప్లైన్ల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యయాన్ని వాటర్ డొనేషన్ చార్జీల రూపంలో ఏకకాలం(వన్‌టైం)లో వసూలు చేస్తారు. కొత్త మునిసిపాలిటీల్లో నల్లా చార్జీలను పట్టికలో సూచించిన విధంగా నిర్ణయించి వసూలు చేయాలని పురపాలక శాఖ కోరింది. భవన నిర్మాణ అనుమతులు ఇక భారం.. కొత్త మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఇకపై భారం కానున్నాయి. ఇకపై మునిసిపల్ బిల్డింగ్ రూల్స్(జీవో 168) ప్రకారం భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం నామ మాత్రపు ఫీజులతో అనుమతులు జారీ చేస్తుండగా, ఇకపై మూడో శ్రేణి మునిసిపాలిటీలకు వర్తించే భవన అనుమతుల ఫీజులను కొత్త మునిసిపాలిటీల్లో దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన కౌన్సిల్ తీర్మానం చేయాలని పురపాలక శాఖ కోరింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సైతం.. కొత్త పురపాలికల్లో వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక, వినోద అవసరాలకు వినియోగించే భవనాలు, గృహాల నుంచి ఇక ముందు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయనున్నారు. కౌన్సిల్లో వివిధ రకాల ట్రేడ్లకు ఫీజులను నిర్ణయించాలని పురపాలక శాఖ ఆదేశించింది. మ్యుటేషన్ ఫీజులను సైతం కౌన్సిల్లో నిర్ణయించి వసూలు చేయాలని కోరింది. మునిసిపల్ చట్టాల ప్రకారం.. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వినోద పన్నులో 90శాతం వాటాతోపాటు ఆస్తుల క్రయ విక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేసే స్టాంపు డ్యూటీలో 2 శాతాన్ని సర్‌చార్జీగా మునిసిపాలిటీలు తిరిగి రాబట్టుకోవాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మార్కెట్, పశువధశాలల్లో ఫీజులు కొత్త మునిసిపాలిటీల్లోని మార్కెట్లో, పశువధశాలల్లో వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసే హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్‌కు ఫీజులు వసూలు చేసే హక్కులను అప్పగించాలని కోరింది. కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు కౌన్సిల్ తీర్మానంతో టెండర్ ప్రకటన జారీ చేయనున్నారు. మునిసిపాలిటీల స్వీయ నిర్వహణలో ఉన్న మార్కెట్లు, పశువధశాల ల్లో టికెట్ల ద్వారా ఫీజులు వసూలు చేయనున్నారు.మూడేళ్లకోసారి ఈ ఫీజులను పెంచనుంది. కొత్త మునిసిపాలిటీల యాజమాన్యంలోని ఖాళీ స్థలాలు, దుకాణాలు, గోదాములు, భవనాలను కౌన్సిల్ తీర్మానంతో కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలా నికి ఆయా మునిసిపాలిటీలు అద్దెకు ఇచ్చుకోవచ్చని పురపాలక శాఖ సూచించింది. మునిసిపాలిటీల చట్టం ప్రకారం అద్దెలు నిర్ణయించాలని తెలిపింది. -
భూముల ధరలకు రెక్కలు
కర్నూలు (టౌన్): పట్టణ ప్రాంతాల్లో భూములు కోనుగోలు చేయాలంటే ఇక మరింత భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. 5 శాతం మార్కెట్ ధరలను పెంచడంతో జిల్లాలోని పట్టణ ప్రజలపై రూ. 60 కోట్లు ప్రజలపై భారం పడనుంది. నివాస ప్రాంతా ల్లో 5 శాతం, వాణిజ్య ప్రాంతాల్లో 10 శాతం వరకు మార్కెట్ ధరలు పెరగనున్నాయి. జిల్లాలోని కర్నూలు నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, గుడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఈ ధరలు అమలులోకి రానున్నాయి. జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి రెండేళ్లుకోసారి భూముల ధరలను పెంచడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కట్టడాల విలువలు కూడ పెరగనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కట్టడాలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. చదరపు అడుగుకు రూ. 90, పూరిళ్లకు సంబంధించి చదరపు అడుగుకు రూ.160, మట్టి మిద్దెలకు రూ.340, మొదటి, రెండు అంతస్తులకు రూ.1030, మూడవ ఆంతస్తుకు రూ.1110 చొప్పున ప్రభుత్వం విలువలను నిర్ణయించింది. ఈ లెక్కన రూ. 60 కోట్లు ఆదనంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండగా.. ఆ మేరకు ప్రజలకు భారం పడనుంది. జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు రూ.340 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత మేర నిర్ణయించారంటే... జొహరాపురంలో చదరపు గజం రూ. 3,500 ఉంటే పెరిగిన ధరలతో రూ. 3, 800, అలాగే మామిదాలపాడులో రూ. 4 వేలు ఉంటే అదికాస్తా రూ.4, 300 ప్రకారం భూముల ధరలు పెరగనున్నాయి. పాతబస్తీ, పప్పుల బజార్, జమ్మిచెట్టు ప్రాంతాల్లో చదరపు గజం రూ. 7 వేలు ఉంటే రూ. 7, 400 ప్రకారం పెరగనుంది. గుత్తి పెట్రోలు బంకు వద్ద నివాస ప్రాంతాల్లో రూ. 15 వేలుగా నిర్ణయించారు. భూముల ధరలు సవరించడానికి జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, నగరపాలక కమిషనర్, జెడ్పీ సీఈఓ, స్థానిక సబ్ రిజిష్టర్లతో కూడిన కమిటీ ధరలపై నిర్ణయం తీసుకుంటుంది. -
‘సాఫ్ట్‌గా’ చిక్కిన సంతోష్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానంతో బయోమెట్రిక్ వ్యవస్థనే చాలెంజ్ చేస్తూ నకిలీ వేలి ముద్రలు సృష్టించిన పాత సంతోష్ కుమార్‌ను పట్టించింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నకిలీ ముద్రలే. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీ ఏఐ).. వేలిముద్రలతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు కలిగిన వారు తమ వేలిముద్రలు లాక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ద్వారా అవకాశం ఇచ్చింది. దీన్ని నగరానికి చెందిన, ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సద్వినియోగం చేసుకున్నారు. ఈయన గతంలో వరంగల్ సమీపంలో కొంత భూమి ఖరీదు చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి ఆ డాక్యుమెంట్ చేరింది. సిమ్‌కార్డుల టార్గెట్ కోసం పేరు, ఆధార్ వివరాలతో పాటు వేలిముద్రలు ఉండే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ శాఖ సైట్ నుంచి సంతోష్ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌వి కూడా ఉన్నాయి. వీటిని వినియోగించి తయారు చేసిన నకిలీ వేలిముద్రల ద్వారా సంతోష్ కొన్ని సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఫలానా సిమ్‌కార్డుల యాక్టివేషన్‌కు మీ బయోమెట్రిక్ వినియోగించే ప్రయత్నం జరిగిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఆధార్ సర్వర్ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చింది. తన వేలిముద్రలు పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఈ–కేవైసీ యంత్రంలో వేయడమేంటని ఆయనకు సందేహం వచ్చి ఢిల్లీలోని ఆధార్ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతుగా ఆరా తీయడంతో పాటు కేంద్ర నిఘావర్గాలకు సమాచారం ఇచ్చారు. కాగా, సంతోష్ కస్టడీ ముగియడంతో గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మరో 3 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. నకిలీ వేలిముద్రల తయారీపై విచారణ సాక్షి, పెద్దపల్లి/ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నకిలీ వేలిముద్రలు తయారు చేసిన కేసులో అరెస్టు అయిన సంతోష్‌కుమార్ ఇంట్లో, దుకాణంలో శుక్రవారం క్రైమ్ స్పెషల్ బ్రాంచి పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వొడాఫోన్‌కు సంబంధించిన సిమ్‌కార్డులు, నకిలీ వేలిముద్రలు తయారు చేసే రబ్బర్ స్టాంపులు, వోచర్ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటలకే ధర్మారంలోని సంతోష్‌కుమార్ ఇంటికి చేరుకుని, దాదాపు గంటసేపు సోదాలు నిర్వహించారు. ఇంట్లో దాచి ఉంచిన దాదాపు మూడు వేల సిమ్‌కార్డులు వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. నకిలీ వేలిముద్రలతో బియ్యం స్వాహా ధర్మారం: నకిలీ వేలిముద్రల కేసు పలు మలుపులు తిరుగుతోంది. నకిలీ వేలిముద్రలతో రేషన్‌బియ్యాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చిన అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ధర్మారం, వెల్గటూర్ మండలాల్లోని డీలర్లతో సంతోష్ కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని దారి మళ్లించినట్లు తెలిసింది. దీంతో నలుగురు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కుట్ర లేదు.. కుతంత్రం లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘కుట్ర లేదు.. కుతంత్రం లేదు.. సిమ్‌కార్డుల టార్గెట్ పూర్తి చేసుకో వడానికే నకిలీ వేలి ముద్రలు సృష్టించా. అలా యాక్టివేట్ చేసిన సిమ్‌కార్డుల్ని ధ్వంసం చేశా. ఇందులో మావోయిస్టులు, ఉగ్రవాదుల ప్రమే యమో లేదు. సెల్ఫోన్లో ఫోర్జీ సిమ్‌కార్డు ఉంది. దీంతో కంప్యూటర్‌తో పని లేకుండా సెర్చ్‌లు చేశా’ అని పాత సంతోష్‌కుమార్ పోలీసు, నిఘా వర్గాల దగ్గర ఏకరువు పెట్టాడు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి ఈ పని చేశానని, ఇంత పెద్ద నేరమనే విషయం కూడా తెలియదని చెప్పాడు. గత వారం అరెస్టు చేసిన సంతోష్‌ను ఎస్సార్‌నగర్ పోలీసులు విచారణ కోసం కోర్టు అనుమతితో గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అసాంఘిక శక్తుల కోణానికి సంబం ధించి పోలీసులు సంతోష్‌ను వివిధ కోణా ల్లో ప్రశ్నిస్తున్నారు. అయితే, రూ.51 టాక్‌టైమ్‌తో కూడిన సిమ్‌కార్డుల్ని ఉచితంగా ఇద్దామన్నా సాధ్యం కాలేదని, అందుకే నెలకు 600 సిమ్‌కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేయడానికి ప్రత్యా మ్నాయ మార్గాలు వెతికానన్నాడు. సిమ్‌కార్డు పొందాలంటే ఆధార్ వివరాలు, వేలిముద్ర తప్పనిసరి కావడంతో ఇబ్బందులు ఎదుర య్యాయని, కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఓ వ్యక్తి పేరుతో గరి ష్టంగా 9 సిమ్కార్డులే జారీ అయ్యేలా నిబం ధనలు అమల్లోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నాడు. టార్గెట్ పూర్తి చేయడం కోసం అనేక మార్గాలు అన్వేషించానన్నాడు. స్థిరాస్తుల క్రయ విక్రయాల సమయంలో పూర్తి పేరు, చిరు నామా, ఆధార్ నంబర్‌తోపాటు వేలిముద్రలు డాక్యుమెంట్లో పొందుపరు స్తారని గుర్తించానని చెప్పాడు. దాదాపు 8 నెలలుగా.. దాదాపు 8 నెలలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయడం ప్రారంభించానని సంతోష్‌కుమార్ అధికారులకు వెల్లడించాడు. పాలిమర్ ఆధారిత రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని ఇండి యా మార్ట్ వెబ్సైట్ నుంచి రూ.16 వేలకు ఖరీదు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించానని వివరించాడు. 3 వేలకు పైగా వేలిముద్రలు తయారు చేసి, 6 వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసినట్లు అంగీకరించాడు. యాక్టివేటైన కార్డుల ను, పని పూర్తయిన వేలిముద్రల్ని ధ్వంసం చేశానని, కొన్నింటిని టాక్‌టైమ్ పూర్తయ్యే వర కు వాడి పడేశానన్నాడు. అంతేతప్ప ఎలాంటి హ్యాకింగ్‌కు పాల్పడలేదని, ఆధార్ సహా ఏ వెబ్సైట్లోకి అక్రమంగా చొరబడలేదని సంతోష్‌కుమార్ వివరించాడు. తొలిరోజు విచారణ హైదరాబాద్‌లో పూర్తి చేసిన అధికారులు శుక్రవారం సంతోష్ స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధర్మారం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ అతనికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్లో సోదాలు చేయనున్నారు. ఇప్పటికే రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రంతో పాటు అతడి సెల్‌ఫోన్, డౌన్లోడ్ చేసిన 1,400 డాక్యుమెంట్లు, నకిలీ వేలిముద్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
వేలిముద్రలు : ఏపీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు
సాక్షి, అమరావతి: తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ వేలిముద్రల ఉదంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది. తెలంగాణలో సిమ్‌కార్డుల అమ్మకాల కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి కాపీల డౌన్‌లోడ్‌ను నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ సర్వర్‌ను నిలిపివేసింది. పెద్దపల్లి జిల్లాలో బయటపడిన నకిలీ వేలిముద్రల కుంభకోణంలో నిందితుడు సంతోష్‌కుమార్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడన్న సంగతి తెలిసిందే. వాటి ఆధారంగా నిందితుడు నకిలీ వేలిముద్రలు తయారు చేయడంతో ఆధార్ బయోమెట్రిక్ భద్రత సవాలుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 7.4 లక్షల సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ కాపీలు జారీ కాగా.. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనే 2.5 లక్షల డాక్యుమెంట్లు డౌన్లోడ్ అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్నింటిని నకిలీ ఆధార్, సిమ్ కార్డులు పొందడానికి వినియోగించినట్టు ఏపీ, కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వెలుగుచూసిన నకిలీ వేలిముద్రల స్కాం తరహాలో ఏపీలో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘రిజిస్ట్రేషన్ సమస్యలా వాట్సాప్ చేయండి’
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ జాయింట్ ఐజీ వేముల శ్రీనివాసులు తెలిపారు. దీనిలో భాగంగా వాట్సాప్‌తో సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్లు, వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ఏ సమస్యలు వచ్చినా.. నేరుగా సబ్ రిజిస్ట్రార్‌కు విషయాన్ని వివరించాలన్నారు. అయినా సమస్య పరిష్కారం కాని పక్షంలో 7093920206కు వాట్సాప్ ద్వారా సమస్యను తెలియజేయాలన్నారు. 24 గంటల్లో స్పందన రాకుంటే.. స్పందన రాలేదని మళ్లీ అదే నంబరుకు వాట్సాప్ చేసే అధికారం వినియోగదారులకు ఉంటుందని తెలిపారు. -
రూ.1,100 కోట్ల అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పనితీరును కాగ్ నివేదిక తూర్పారబట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో ఏదో ఒక తప్పును గుర్తించిన కాగ్.. మొత్తం రూ.1,100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. టర్నోవర్ లెక్కించడం నుంచి పన్ను వసూలు వరకు, పన్ను కట్టకపోతే జరిమానా విధింపు నుంచి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మంజూరు వరకు, టర్నోవర్ తేడాల నుంచి కొనుగోలు టర్నోవర్ ఎక్కువ చూపించడం వరకు.. ఇలా 1,055 కేసుల్లో తప్పులు జరిగాయని నిర్ధారించింది. పన్ను విధించక రూ.780 కోట్ల నష్టం 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 7 కేటగిరీల్లో అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా వస్తువులపై పన్ను విధించకుండా లేదా తక్కువ పన్ను వసూలు చేయడం ద్వారా రూ.780 కోట్ల అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. వర్క్ కాంట్రాక్టులకు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.19.57 కోట్లు, వడ్డీ జరిమానా విధించకపోవడం, తక్కువ విధించడం వల్ల రూ.26.02 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రూ.25.43 కోట్లు, కేంద్ర అమ్మకం పన్నులను విధించకపోవడం లేదా తగ్గించడం వల్ల రూ.79.98 కోట్లు, అమ్మకపు పన్ను వాయిదా వల్ల రూ.10.22 కోట్లు, ఇతర అవకతవకల వల్ల రూ.158.16 కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. అయితే విలువ ఆధారిత పన్నును వసూలు చేయని లేదా తక్కువ వసూలు చేసిన 312 కేసుల్లోనే రూ.780.91 కోట్ల తేడా వచ్చిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విషయానికొస్తే మొత్తం 359 కేసులకు రూ.42.06 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించింది. స్టాంపు డ్యూటీలు, ఫీజులు తక్కువగా విధించడం వల్ల రూ.36.99 కోట్లు, ఆస్తుల విలువ తక్కువ లెక్కించడం వల్ల రూ.4.29 కోట్లు, డాక్యుమెంట్లను తప్పుగా వర్గీకరించిన కారణంగా రూ.71 లక్షలు, ఇతర అవకతవకల వల్ల రూ.7 లక్షలు నష్టం జరిగిందని కాగ్ వెల్లడించింది. ఇందులో వ్యవసాయేతర భూముల (నాలా) రిజిస్ట్రేషన్‌కు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, భీమ్‌గల్, భైంసా, దేవరకొండ, ఘన్పూర్, జడ్చర్ల, జోగిపేట, జనగామ, కూసుమంచి, మధిర, మహబూబాబాద్, నర్సంపేట, నిర్మల్, వర్ధన్నపేటల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యా లయాలను పరిశీలించగా, అందులో 29 దస్తావేజులను వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని నాలా భూముల రిజిస్ట్రేషన్ చేశారని తేలిందని పేర్కొంది. ఇది రూ.2.04 కోట్ల తక్కువ డ్యూటీ, ఫీజు విధిం చడానికి కారణమైందని కాగ్ తెలిపింది. -
పనివ్వకుండా జీతమిస్తున్నారు
సాక్షి,సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ తీరు మారడం లేదు. పరిపాలనా పరమైన వ్యవహారాల్లో సైతం నిర్లక్ష్యం వీడటం లేదు. ఒక వైపు ఖాళీలు వెక్కిరిస్తున్నా... కీలక పోస్టులు కూడా భర్తీకి నోచుకోవడం లేదు. కింది స్థాయిలో కనీసం పదోన్నతులు ప్రక్రియ ఉసే లేకుండా పోగా, గెజిటెడ్ స్థాయిలో మాత్రం నామమాత్రంగా పదోన్నతులు కల్పిస్తున్నా.. పోస్టింగ్‌లు మాత్రం కేటాయించడం లేదు. ఫలితంగా వారిని నెలల తరబడి ఖాళీగానే కూర్చో బెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు పూర్తి స్థాయి పరిపాలనాదీశుడు లేక ఇంచార్జీలతో కొనసాగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో ఇద్దరు జిల్లా రిజిస్ట్రార్లకు డీఐజీలు గా, ఐదుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ గతేడాది 31న ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో హైదరాబాద్ సౌత్ జిల్లా రిజిస్ట్రార్, మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్లు డీఐజీలు గా పదోన్నతులు లభించడంతో వెంటనే రిలీవ్ అయి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతుల పొందిన ఐదుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లు సైతం రిలీవ్ అయి సంబంధిత శాఖలో రిపోర్టు చేశారు. వారికి ఇప్పటి వరకు పోస్టింగ్ కేటాయించక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. వెక్కిరిస్తున్న ఖాళీలు రిజిస్ట్రేషన్ శాఖలో రెండు డీఐజీ పోస్టులతోపాటు 12 రిజిస్ట్రార్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ డీఐజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్ నుంచి డీఐజీగా పదోన్నతుల పొందిన ఇద్దరికి ఆయా పోస్టుల్లో భర్తీ చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు కేటాయించలేదు. మరోవైపు ఇతర డీఐజీలకు అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సౌత్, మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్లతో మరో పది డీఆర్ పోస్టులు ఖాళీగా ఇంచార్జిలతో కొనసాగుతున్నాయి. గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన ఐదుగురితో ఖాళీగా గల డీఆర్ పోస్టింగ్‌లు భర్తీ చేయవచ్చు.. కానీ, ఇప్పటి వరకు ఆ దిశ చర్యలకు ఉపక్ర మించడంలేదు. ఎలాంటి సేవలు తీసుకోకుండానే జీతాలు ఇవ్వడం నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. ఇటీవల కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఇంచార్జి కమిషనర్ దృష్టికి పదోన్నతులు పొందిన వారు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. నాలుగేళ్ల నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో నాలుగేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేకుండా పోయా యి. సుమారు 50 వరకు గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నా ...వాటిని భర్తీ చేయడం లేదు. పదోన్నతుల జాబితాలో పెద్ద ఎత్తున సీనియర్ అసిస్టెంట్లు ఉన్నా ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖలో క్యాడర్ సంఖ్య 3,930 ఉండగా అందులో 590 పోస్టులు మినహా అన్ని పోస్టులు ఖాళీగా నే వెక్కిరిస్తున్నాయి. -
ఉక్కిరిబిక్కిరి..!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రిజిస్ట్రేషన్శాఖలోని అధికారులు, సిబ్బంది పరిస్థితి. ఎక్కడో గుంటూరు జిల్లా రేపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరిగితే, అదే విధంగా ఎక్కడైనా జరిగి ఉంటుందేమోనన్న అనుమానంతో అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యా ్చయాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రేపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)పై 33 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు రుజువు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు డీడీల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయిస్తున్నారు. ఆ మేరకు మన జిల్లాలోని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 14 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆయా కార్యాలయాల సిబ్బంది డీడీల సమగ్ర సమాచారం యుద్ధప్రాతిపదికన ఓ నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు. జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకు రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 67,271 డాక్యుమెంట్లు, గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 76,995 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో దాదాపు 25 శాతం డాక్యుమెంట్లకు డీడీల రూపంలో నగదు చెల్లింపులు జరిగాయి. మిగతా డాక్యుమెంట్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చలానా తీయడం ద్వారా జరిగాయి. పెద్దనోట్ల చెలామణి రద్దు చేసిన సమయంలో బ్యాంకులకు చలానా తీయబోమని కరాఖండిగా చెప్పి డీడీలు కట్టించుకున్నారు. ఈ సమయంలో ఎక్కువగా డీడీల ద్వారా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. డీడీల ద్వారా రిజిస్ట్రేషన్లు ఇలా.. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ప్రభుత్వానికి చలానా లేదా డీడీ రూపంలో పన్నును చెల్లిస్తారు. డీడీల ద్వారా జరిగే రిజిస్ట్రేషన్‌లో మొదట తాత్కాలిక నంబర్‌పై రిజిస్ట్రేషన్ చేసి, ఆ డీడీ బ్యాంకు వెళ్లి ప్రభుత్వ ఖజానాకు నగదు జమైనట్టు రసీదు వచ్చాక ఆ డాక్యుమెంటుకు ఒరిజనల్ రిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డీడీ, దాని తాలుకూ డాక్యుమెంట్, నగదు జమ ఎప్పుడైంది, దాని రసీదు నంబర్ తదితర సమాచారంతో స్థానిక సిబ్బందే నివేదిక తయారు చేస్తున్నారు. అనారోగ్యంతోనే విధుల నిర్వహణ ఈ నెల 2వ తేదీ నుంచి ఉన్నతాధికారుల నుంచి సబ్రిజిస్ట్రార్లు, సిబ్బంది అంతా డీడీలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాధారణ పనులతోపాటు డీడీల నివేదిక చేస్తుండడంతో అధికారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి సబ్‌రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు తీవ్ర అనారోగ్యానికి గురై ఇంటి వద్ద సృహ తప్పారు. అందరికీ సెలవులు రద్దు చేయడంతో చికిత్స తీసుకుని వెంటనే విధులకు హాజరయ్యారు. సబ్ రిజిస్ట్రార్లపైనే డీడీల తనిఖీ బాధ్యత పెట్టడంతో అనారోగ్యంగా ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కొంత మంది అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లా డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్లు కూడా వ్యక్తిగత కార్యక్రమాలు, శుభకార్యాలకు కూడా గౌర్హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. -
రిజిస్ట్రేషన్ ఉద్యోగుల ఉద్యమబాట
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. సబ్రిజిస్ట్రార్లు లేని చోట్ల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 141 కార్యాలయాల్లోని సబ్రిజిస్ట్రార్లు శనివారం మూకుమ్మడిగా సెలవు పెట్టి హైదరాబాద్‌లోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. అఫ్జల్‌గంజ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నాంపల్లి సీసీఎల్ఏ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సీసీఎల్ఏ డైరెక్టర్, ఇన్చార్జి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ శాఖలో రెవెన్యూ సిబ్బంది ప్రమేయాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. 12 నుంచి ప్రత్యక్షంగా.. ఇప్పటికే రెండు, మూడు సార్లు నివేదించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రత్యక్షంగా ఆందోళన చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు నిర్ణయించారు. మార్చి 12 వరకు ప్రభుత్వానికి సమయమివ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల వ్యవస్థను స్తంభింపజేసేలా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
ప్రస్తుతానికి వ్యవసాయ భూములే!
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలను దశల వారీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేయాలని.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లన్నీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చేయాలని భావిస్తోంది. కొంత సర్దుకున్న తర్వాత నాలా భూముల సేవలను తహసీల్ కార్యాలయాలకు అప్పగించాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే భూరికార్డుల నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్న ‘ధరణి’ వెబ్సైట్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ఫిబ్రవరిలో శిక్షణ తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ కార్యకలాపాల తీరుతెన్నులపై రెవెన్యూ సిబ్బందికి క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరిలో తహసీల్, రెవెన్యూ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో శిక్షణ ఇచ్చిన అనంతరం.. తహసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తారు. సాధ్యాసాధ్యాలపై విస్తృత చర్చ: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల సాధ్యాసాధ్యాలపై విస్తృత చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ సేవలను రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయడం సబబుకాదని, ప్రస్తుత విధానమే సరిపోతుందని ఆ శాఖ కమిషనర్‌గా పనిచేసిన నదీమ్ అహ్మద్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ వర్గాల్లో చర్చను లేవనెత్తింది. అయినా రిజిస్ట్రేషన్, రెవెన్యూ అనుసంధానంపై సర్కారు ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ రిజిస్ట్రేషన్ల శాఖతోపాటు రెవెన్యూ సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటికే ఉన్న తలకుమించిన బాధ్యతలకు తోడు కొత్త పనులు అప్పగిస్తున్నారని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది కూడా.. ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చేలా శాఖను తీసుకువచ్చామని.. కానీ ప్రభుత్వ చర్య ఆదాయంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. తహసీల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత, పని ఒత్తిడితో రిజిస్ట్రేషన్లలో జాప్యం జరిగే అవకాశముందని, దానివల్ల ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. -
శూన్య మాసంలోనూ సూపర్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. గత రెండు నెలలుగా లక్షల సంఖ్యలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఆ శాఖకు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. శూన్యమాసం అయినప్పటికీ డిసెంబర్, జనవరి నెలలమధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.430 కోట్లకు పైగా ఆదాయం రావడం గమనార్హం. రికార్డుస్థాయి ఆదాయం డిసెంబర్నెల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఎప్పు డూ ఒక్క నెలలో రూ.400 కోట్లకు మించి ఆదాయం రాలేదు. లక్షకు లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. కానీ, డిసెంబర్ నెలలో మాత్రం ఒక లక్షా 8వేలకు పైగా లావాదేవీల ద్వారా రూ.430 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. ఇదే ఊపు జనవరిలోనూ కొనసాగుతోంది. ఈనెలలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు 42,286 లావాదేవీలు జరగ్గా, రూ.151.16 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం కేవలం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారానే రాగా, ఆన్లైన్ ఈ–చలాన్ల ద్వారా మరో రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.4వేల కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటివరకు ఈ ఏడాది 8,50,148 లావాదేవీలు జరగ్గా, రూ. 3,440.58 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఈసారి లక్ష్యాన్ని మించుతుందని అంచనా వేస్తున్నారు. మంచిరోజులు కాకపోయినా.. డిసెంబర్ 16 నుంచి శూన్యమాసం ప్రారంభమైంది. సంక్రాంతి దాటేంతవరకు ఉండే ఈ మాసంలో శుభ కార్యాలకు మెజార్టీ ప్రజలు ఇష్టపడరు. అయినా, రిజిస్ట్రేషన్ లావాదేవీలు పోటెత్తుతుండడం గమనార్హం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుభ కార్యం కాదని, ఆషాఢమాసంలో బంగారం ఎక్కువగా కొన్నట్టు ఓ పనయిపోతుందిలే అనే భావనలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గతంలో మాదిరిగా శూన్యమాసం సెంటిమెంట్‌ను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పంట భూముల రిజిస్ట్రేషన్లు అంతగా లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని, ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సొంత సర్వర్‌తో వేగంగా లావాదేవీలు.. సాంకేతికంగా శాఖాపరమైన మార్పులు కూడా ఆదాయాభివృద్ధికి కారణమవుతున్నాయని అంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ నుంచి విడిపోయి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ, హైదరాబాద్ గచ్చిబౌలిలో అతి పెద్ద సర్వర్‌ను కూడా ఏర్పాటు చేసుకుని దానిని రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేసింది. దీంతో గతంలో మాదిరిగా సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో అంతరాయం కలగడం లేదని, చకచకా ప్రక్రియ ముగిసిపోతుండడంతో మరిన్ని లావాదేవీలు నమోదు చేస్తున్నామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
సూపర్‌ఫాస్ట్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులు సమకూర్చుకుంటోంది. ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు సమస్యతో రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో కలిగే అంతరాయాన్ని పూర్తిగా నివారించడంతో పాటు అత్యంత వేగంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా అదనపు సాంకేతిక సామగ్రిని ఏర్పాటు చేసుకుంటోంది.తద్వారా ఒక్కో రిజిస్ట్రేషన్ లావాదేవీకి కనీసం పావుగంట మేర సమయం కూడా ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. దాదాపు 7వేల టెరాబైట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకుంటున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సర్వర్లతో ఉన్న లింకును కూడా తొలగించుకుని పూర్తిగా స్వతంత్రం కానుంది. ఇక శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సేవలు సోమవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. గచ్చిబౌలిలో సెంట్రల్ సర్వర్ రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతోనే రిజిస్ట్రేషన్ల శాఖ తన లావాదేవీలను మరింత వేగవంతం చేసుకుంటోంది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్లో 7వేల టెరాబైట్ల సామర్థ్యం గల సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వర్‌తో పాటు స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా నాలుగింతలు పెంచేశారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్లోడ్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీలను ముప్పావుగంటలో పూర్తి చేయగలమని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ‘గతంలో అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియకు 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండదు’ అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం భవిష్యత్తు రిజిస్ట్రేషన్ లావాదేవీలపై భరోసా కలిగిస్తోంది. వీడియోకు కొంత సమయం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసి దానిని సీడీ రూపం లో కొనుగోలుదారుకు ఇచ్చే ప్రక్రియ ఆలస్యం కానుంది. డిసెంబర్1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, సర్వర్ల మార్పు ప్రక్రియలో అధికారులు బిజీగా ఉండటంతో ఆలస్యం కానుంది. ఈ నెలలోనే రికార్డింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే నెలలో రెయిల్‌టెల్ ద్వారా సమకూరుస్తున్న మల్టీపర్పస్ లింకింగ్ నెట్వర్క్ కూడా రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్ కార్యాలయా ల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 90 కార్యాలయాల్లో ఈ ఏర్పాటు పూర్తి కాగా, మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా పూర్తయితే సాంకేతికంగా తెలంగా ణ రిజిస్ట్రేషన్ల శాఖ బలోపేతం కానుంది. సోమవారం నుంచి యథాతథం ‘సర్వర్లు, స్టోరేజీ మార్పులో భాగంగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు నిలిపివేశాం. శని, ఆదివారాలు ఎలాగూ సెలవే కనుక సోమవారం నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా యథా తథంగా ప్రారంభమవుతాయి.’ –రిజిస్ట్రేషన్ల శాఖ ఏఐజీ వేముల శ్రీనివాసులు -
పట్టణ ఆస్తులకూ పాస్‌బుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు టైటిల్ డీడ్లతో కూడిన పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్టే పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కర్ణాటకలో అమలవుతున్న పట్టణ ఆస్తుల యాజమాన్య రికార్డుల (యూపీఓఆర్) ప్రక్రియను అధ్యయ నం చేస్తోంది. గ్రామాల్లోని భూములకు జనవరి లో అధునాతన డిజైన్‌తో రూపొందించిన పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరిలో పట్టణా ల్లోని భూముల రికార్డులను సరిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రెండు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇలా.. పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకు ప్రత్యేక కార్డులు జారీ చేసేందుకుగాను కర్ణాటక మూడు శాఖలను అనుసంధానం చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల రికార్డులుండే స్థానిక సంస్థలు, భూముల రికార్డులు నిర్వహించే రెవెన్యూ, భూముల పక్కా లెక్కను తేల్చే సర్వే సెటిల్మెంట్ శాఖల సహకారంతో 2014 నుంచే సమగ్రమైన కార్డులను జారీ చేస్తోంది. మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్ల అధీనంలో పనిచేసే ప్రత్యేక అథారిటీల ద్వారా ఈ కార్డులు ఇస్తోంది. వీటిల్లో ఆస్తి లేదా భూమి యజమాని పేరు, ఆ ఆస్తి స్వభావం, మ్యుటేషన్ జరిగిన తేదీ, రిజిస్టర్ నంబర్, ఆస్తి ఉన్న ప్రాంతం, దాని సరిహద్దులు, ఆస్తిలో యజమాని వాటా? వంటి వివరాలను పొందుపరిచింది. గ్రామీణ ప్రాంతాల్లోని వాటికిచ్చే తరహాలోనే ప్రత్యేక కార్డులను రూపొందించింది. ఈ కార్డులను పట్టణాల యజమానులకు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తోంది. ఈ కార్డు ఉంటేనే ఆస్తులు లేదా భూముల రిజిస్ట్రేషన్లు చేస్తోంది. లిటిగేషన్లను నిరోధించేందుకే.. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఆస్తులు, భూముల రికార్డులకు ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలే నిర్వహిస్తుంటాయి. ఆ భూములు, ఆస్తులకు పన్ను కట్టినా, కరెంటు బిల్లు, నల్లా బిల్లు కట్టినా పట్టణ స్థానిక సంస్థలే రికార్డు చేసుకుంటాయి. ఈ భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావా దేవీలు మాత్రం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా జరుగుతోంది. వీటిల్లో సబ్‌రిజిస్ట్రార్లకూ తక్కువ అధికారాలు ఉన్నందున అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ జరగాలంటే పాస్‌పుస్తకాల ఆధారంగా చేస్తుండగా.. పట్టణా ల్లో మాత్రం రిజిస్టర్డ్ డాక్యుమెంట్లే ఆధారం కావడంతో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఏమీ చేయలేకపోతోంది. దీంతో పై వివరాలన్నింటితో కూడిన ప్రత్యేక కార్డు ఉంటే ఆస్తుల లిటిగేషన్ కేసులు తగ్గుతాయని, డబుల్ రిజిస్ట్రేషన్ల లాంటి అక్రమాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక విధానాన్ని అమలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించగా.. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం. -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలకుగాను రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గింది. గత (2016– 17) ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,941.86 కోట్లు ఆదాయంరాగా.. ఈసారి సుమారు రూ.100 కోట్లు తక్కువగా రూ.1,841.58 కోట్లు సమకూరింది. ఇందులో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 4 రిజిస్ట్రేషన్ జిల్లాల నుంచే రూ.1,383 కోట్లు రావడం గమనార్హం. మిగతా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల బాగా తగ్గిపోయినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో ఏకంగా 35% తగ్గుదల నమోదైంది. మొత్తంగా మే, ఆగస్టుల్లో ఆదాయం బాగా తక్కువగా సమకూరింది. జూలై, సెప్టెంబర్ ల్లో ఎక్కువగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య బాగా తగ్గిపోయింది. గతేడాది తొలి 6 నెలల్లో 5,69,572 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా.. ఈసారి 5,07,697 లావాదేవీలే జరిగాయి. హైదరాబాద్‌లో లావాదేవీలు ఏకంగా మూ డొంతులు తగ్గిపోయినా.. ఆదాయం మాత్రం గతేడాది స్థాయిలో సమకూరడం గమనార్హం. -
కొను‘గోల్మాల్’!
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాయాలకు (ఎస్ఆర్ఓ) కొత్త కంప్యూటర్లు, ఇతర హార్డ్‌వేర్ పరికరాల కోసం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరుపుతున్న కొనుగోళ్లలో గోల్‌మాల్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ కంపెనీల హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేస్తామని చెప్పి టెండర్ దక్కించుకున్న సంస్థ ఇప్పుడు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధర గల వేరే కంపెనీల పరికరాలను సరఫరా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓ మంత్రి ద్వారా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తక్కువ ధర, తక్కువ నాణ్యత ఉన్న పరికరాలు అంటగట్టేందుకు పథక రచన చేసింది. ప్రధానంగా వచ్చే ఐదేళ్లలో సరఫరా చేయాల్సిన 35 వేల క్యాట్రిడ్జీల విషయంలో బ్రాండ్లు మార్చి రూ.కోట్లు మిగుల్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ఎస్ఆర్వోల్లో కొత్త కంప్యూటర్లు, హార్డ్‌వేర్ పరికరాలను అమర్చేందుకు విధించిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, బ్రాండ్ల విషయంలో తాత్సారం చేస్తోంది. ఈ సంస్థకు ఓ రాష్ట్ర మంత్రి అండదండలు ఉండటంతో అధికారులు కూడా గడువు పొడిగించడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ నాణ్యమైనవి పంపిణీ చేస్తామని చెప్పి.. రాష్ట్రంలోని 141 ఎస్ఆర్వోల కోసం కొత్త కంప్యూటర్లతో సహా 20 రకాల కంప్యూటర్ హార్డ్‌వేర్ పరికరాల కొనుగోళ్లు, నిర్వహణ సేవల కోసం గత మార్చిలో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. విస్సియన్ ఇన్ఫోటెక్ అనే సంస్థ రూ.76 కోట్ల వ్యయంతో టెండర్ దక్కించుకుంది. ఇంతకంటే తక్కువ వ్యయం రూ.75 కోట్లకు ఐఎల్ఎఫ్ఎస్ అనే సంస్థ బిడ్ దాఖలు చేసింది. అయితే విస్సియన్ ఇన్ఫోటెక్ సంస్థ బిడ్‌లో సూచించిన కంపెనీల పరికరాలు సాంకేతికంగా అధిక నాణ్యమైనవని భావించిన ప్రభుత్వం ఈ సంస్థకే టెండర్‌ను అప్పగించింది. ఈ మేరకు పరికరాలను 60 రోజుల గడువులో బిగించడం, 5 ఏళ్లపాటు వాటికి నిర్వహణ సేవలు అందించేందుకు గత ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వంతో విస్సియన్ ఇన్ఫోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 141 ఎస్‌ఆర్‌ఓలకు చెరో ఐదు కలిపి మొత్తం 1,200 డెస్క్‌టాప్ కంప్యూటర్లతోపాటు ప్రతి ఎస్ఆర్ఓలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 141 ప్రింటర్లు, స్కానర్లు, యూపీఎస్, బయో మెట్రిక్ పరికరాలు, సీసీటీవీ వ్యవస్థ, వర్క్ స్టేషన్ తదితర మొత్తం 20 రకాల పరికరాలను ఈనెల 23వ తేదీలోగా బిగించాల్సి ఉంది. క్యాట్రిడ్జీల అవసరాలను తక్కువగా అంచనా వేసి.. రాష్ట్రంలోని ఎస్ఆర్వోలకు కంప్యూటర్లు, ఇతర హార్డ్‌వేర్ పరికరాల సరఫరా కోసం ఐదేళ్ల కిందట జరిగిన టెండర్లను ఓ ప్రముఖ ఐటీ కంపెనీ దక్కించుకుంది. అయితే క్యాట్రిడ్జీల అవసరాలను అంచనా వేయడంలో విఫలమైన ఈ సంస్థ తక్కువ ధరకు టెండర్ వేసి తీవ్రంగా నష్టపోయింది. తాజాగా టెండర్లను దక్కించుకున్న విస్సియన్ సంస్థ కూడా క్యాట్రిడ్జీల అవసరాలను తక్కువగా అంచనా వేసినట్లు సమాచారం. ఐదేళ్లలో రూ.12 కోట్లు విలువైన క్యాట్రిడ్జీలు అవసరం కాగా, రూ.2 కోట్లతోనే సరఫరా చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీంతో టెండర్లను వదులుకోవడం ఇష్టం లేక నాసి రకం పరికరాలు అంటగట్టేందుకు యత్ని స్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వేరే కంపెనీల పరికరాలు అంటగట్టే యత్నం గడువు సమీపిస్తున్నా ఇంత వరకు పరికరాలు సరఫరా చేయని విస్సియన్ సంస్థ కొత్త మాయాజాలానికి తెర లేపింది. ఏసర్ డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లెక్స్మార్క్ బ్రాండ్ ప్రింటర్లు, క్యాట్రిడ్జీలు, అర్రే వ్యాన్ ఆప్టిమైజర్లు, జునిపర్ రూటర్లకు బదులు ఇతర కంపెనీలకు చెందిన పరికరాలను కొనుగోలు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ రూ.12 కోట్ల వ్యయంతో లెక్స్మార్క్ కంపెనీకి చెందిన 35 వేల క్యాట్రిడ్జీలను సరఫరా చేయాల్సి ఉండగా, వేరే బ్రాండ్‌ను అంటగట్టేం దుకు ప్రయత్నిస్తోంది. మిగతా పరికరా లను కూడా వేరే కంపెనీల పరికరాలను సరఫరా చేస్తామని మొండికేసింది. ఇలా రూ.15 కోట్ల వరకు మిగుల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ సంస్థకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 45 రోజులపాటు గడువు పొడిగించి మరో అవకాశం కల్పించినట్లు తెలిసింది. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు.. విస్సియన్ సంస్థ టెండర్లలో సూచించిన కంపెనీలు... తమ బ్రాండ్లకు బదులు ఇతర కంపెనీ పరికరా లను సరఫరా చేసేందుకు జరుగుతున్న ప్రయ త్నాలపై రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ కంపెనీల ప్రతినిధులు ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ సర్వీసెస్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
సదావర్తి: అన్నీ తెలిసినా.. ఏమీ తెలియనట్టు!
సాక్షి, అమరావతి: సదావర్తి భూములను కారుచౌకగా కొట్టేయాలని ఎత్తుగడ వేసిన ప్రభుత్వ పెద్దలకు సుప్రీంకోర్టులో ఊహించని పెద్ద దెబ్బే తగిలింది. రిజిస్ట్రేషన్ శాఖ ధర ప్రకారమే ఎకరా ఆరేడు కోట్ల రూపాయలు పలికే 83.11 ఎకరాల భూమిని రూ.22.44 కోట్లకో, లేదంటే రూ.60.30 కోట్లకో కొట్టేదామనుకున్న వారి ఎత్తులన్నింటికీ సుప్రీంకోర్టు అడ్డుకట్టవేసింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. తమిళనాడు లేఖలో స్పష్టంగా... అవి సదావర్తి సత్రం భూములేనని, కాకపోతే ఆ భూములకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు సత్రం పేరిట పట్టా ఇవ్వలేదని 2010లో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా ఆ భూములు మన రాష్ట్రానివే అని చెప్పే ఆధారాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇచ్చారు. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఆధారాల ద్వారా రాజకీయ దౌత్యం, లేదంటే న్యాయపరంగా పోరాడి ముందు ఆ భూములకు పట్టా సంపాదించి అమ్మకం ప్రక్రియకు పూనుకునేది. కానీ అలా జరగలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టీ చేపట్టగానే అధికార పార్టీకి చెందిన పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం, పట్టా కూడా లేని ఆ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అనుమతి తెలపడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడి నుంచే భూ దోపిడీ కథ మొదలైంది. కథ కంచికి.. మళ్లీ మొదటికి! భూములు అక్రమణలో ఉన్నాయని దాదాపు రూ.1000 కోట్ల ధర పలికే సత్రం భూములను మొదట విడత రూ.22.44 కోట్లకే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును కోర్టును ఆశ్రయించడంతో భూములకు రెండో విడత వేలం నిర్వహించాలని ఆదేశించింది. మొదట విడత వేలం సందర్భంగా పేర్కొన్న టెండరు నిబంధనలను మార్చారు. మొదటి టెండరు నోటిఫికేషన్లో భూములకు రిజిస్ట్రేషన్ చేస్తామన్న నిబంధనను రెండో టెండరు నోటిఫికేషన్లో ఎలాంటి రిజిసేŠట్రషన్ చేసేది లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. అయినా తొలి విడత వేలం జరిగినప్పుడు ఆ భూములకు పలికిన రూ. 22.44 కోట్ల ధర రెండో విడత వేలంలో ఏకంగా మూడింతలు అధికంగా రూ.60.30 కోట్లకు ఎగబాకడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆ భూములకు ఇప్పటి వరకు పట్టా కూడా ఇవ్వలేదన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ భూముల అమ్మకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో వేలం పాడాలని, దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించిన వారికి ఆ మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని, దీంతోపాటు అసలు ఈ భూములు ఎవరివో ముందు తేల్చాలని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. ఇలా సత్రం భూముల అమ్మకం మొదటికొచ్చింది. పట్టా తీసుకుని వేలం నిర్వహిస్తే.. చెన్నై నగర సమీపంలో తాళంబూరు గ్రామంలో ఉన్న భూములు సదావర్తి సత్రానివే అనడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. 1927 వరకు ఆ భూములకు అక్కడి రైతులు సదావర్తి సత్రానికి కౌలు చెల్లించిన రికార్డులు దేవాదాయ శాఖ అధికారుల వద్ద ఉన్నాయి. దీనికి తోడు ఆ భూములు సత్రానికి చెందుతాయన్న స్పష్టమైన ఆధారాలను 1924 జనవరి 31వ తేదీ తమిళనాడులోని చెంగలపట్టు కోర్టు డిక్రీ వెలవరించిన పత్రాలు మన రాష్ట్ర దేవాదాయశాఖ వద్ద ఉన్నాయి. ఆ భూములు సత్రానికే చెందుతాయని కాంచీపురం జిల్లా రెవెన్యూ అధికారి 2010 మే 31న ఆ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శికి రాసిన లేఖ మన రాషŠట్ర అధికారుల వద్ద ఉంది. ‘మన ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా న్యాయపోరాటం చేయవచ్చు. తద్వారా సదావర్తి సత్రం పేరిట అధికారికంగా రికార్డులను పొందవచ్చు. తద్వారా 471.76 ఎకరాల భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టా సంపాదించవచ్చు. అదే జరిగితే ఈ భూముల ద్వారా సత్రానికి ఏకంగా వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది’ అని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట: ఆళ్ల అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని పేద బ్రాహ్మణులకు చెందాల్సిన అత్యంత విలువైన భూమిని తమ పార్టీ అనుయాయుల ద్వారా నామమాత్రపు ధరకు కొట్టేయాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోపిడీని అడ్డుకోగలిగామని వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వాదనల సమయంలో న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందుకు సాక్షాత్కారాలని గుర్తుచేశారు. రాజా వాసిరెడ్డి వారసులు 1885లో రాసిన వీలునామా ప్రకారం చెన్నై నగరం సమీపంలోని తాళంబూరు, పరిసరాల్లో 471.76 ఎకరాలు సదావర్తి సత్రానికి చెందినవని అన్నారు. ఆక్రమణలకు గురయ్యాయని అంటూ 83.11 ఎకరాలను వేలం పేరిట అక్రమ మార్గాల్లో దక్కించుకునేందుకు చంద్రబాబు అనేక ఎత్తులు వేశారన్నారు. విధివిధానాల ప్రకారం కాకుండా చీకటి గదిలో వ్యవహారాల తరహాలో వేలం నిర్వహణ తీరును, ఇతర అంశాలన్నింటినీ న్యాయస్థానాల దృష్టికి సాక్ష్యాలతో సహా తీసుకెళ్లగలిగామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకే అక్కడ ఎకరం రూ.6.50 కోట్ల వరకు ధర ఉండగా 83.11 ఎకరాలను 22.44 కోట్లకు తన అనుయాయుల ద్వారా దక్కించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడలు పారలేదన్నారు. న్యాయస్థానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే విశ్వాసం ఉందని, అప్పటివరకు తమ పోరాటం కొనసాగుతుందని, పేద బ్రాహ్మణులకు సత్రం భూముల ఫలాలు అందాలనేది ఆకాంక్ష అన్నారు. -
సర్వర్ డౌన్.. రిజిస్ట్రేషన్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో పాత కష్టాలు తప్పడం లేదు. కొత్త నెట్వర్క్ ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో రెండు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలను సర్వర్ డౌన్ సమస్య వేధిస్తోంది. దీంతో ఈసీలు, రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత కనీసం ఫొటోలు కూడా అప్లోడ్ కావడం లేదని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. సర్వర్ డౌనా.. నెట్వర్క్ అంతరాయమా? రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రోజూ వేలాది రిజిస్ట్రేషన్ లావాదేవీలు నడుస్తాయి. ఇందుకోసం ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్లైన్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవసరమైన అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ నుంచి ఫొటోల అప్లోడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్కానింగ్ వరకు ఈ వ్యవస్థలోనే పనిచేయాలి. అయితే రెండు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయడం లేదు. రాష్ట్ర ఐటీ విభాగం ద్వారా నడుస్తున్న సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అన్ని జిల్లాలకు కలిపి హైదరాబాద్‌లో ఒకటే సర్వర్ ఉందని, సర్వర్‌పై లోడ్ ఎక్కువ కావడంతో సమస్య వస్తోందని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మాత్రం సర్వర్ డౌన్ కాలేదని, కేవలం నెట్వర్క్ సమస్య ఏర్పడిందని గురువారం మధ్యాహ్నానికే సమస్య పరిష్కారం అయిందని స్పస్టం చేస్తున్నారు. కానీ పలు జిల్లాల్లో శుక్రవారం కూడా ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. గురువారం యాదాద్రి జిల్లా పరిధిలోని భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండంటే రెండే రిజిస్ట్రేషన్లు జరిగాయని సమాచారం. కొత్త నెట్వర్క్ ఎప్పుడు? గతంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకే నెట్వర్క్ పరిధిలో ఉండేవి. అయితే తెలంగాణకు ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌లో తలెత్తే ట్రాఫిక్ బిజీని తగ్గించుకోవచ్చని, మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)తో పాటు ఇండియన్ రైల్వేకు చెందిన ఐటీ సంస్థ రెయిల్‌టెల్ ద్వారా కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. అయితే ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకునే మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు గతంలో ఉన్న విధంగా ఏ జిల్లా సర్వర్‌ను ఆ జిల్లాలోనే ఉంచకుండా అన్నింటిని కలిపేయడంతో ఈ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకుంటున్న కొత్త నెట్‌వర్క్‌ను వీలున్నంత త్వరగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. -
రిజిస్ట్రేషన్ల బాదుడు
♦ రేపటి నుంచి పెరగనున్న ఛార్జీలు ♦ ఆస్తుల కొనుగోలుదారులపై రూ.15 కోట్ల భారం కడప కోటిరెడ్డి సర్కిల్ : ఆస్తుల క్రయ విక్రయాల ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు అమలుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అబ్కారీ తర్వాత రిజిస్ట్రేషన్‌శాఖ కీలక ఆదాయ వనరుగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచడంలో భాగంగా చర్యలు చేపట్టి భూములు, భవనాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం వరకు ఆస్తి విలువలను పెంచింది. దీంతో జిల్లా కొనుగోలు దారులపై దాదాపు రూ. 15–20 కోట్ల భారం పడనుంది. రిజిస్ట్రేషన్ శాఖపరంగా జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అందులో కడప డివిజన్ పరిధిలో తొమ్మిది కార్యాలయాలు (కడప అర్బన్, రూరల్, సిద్దవటం, రాజంపేట, పుల్లంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిట్వేలి, సుండుపల్లె) ఉన్నాయి. ఈ కార్యాలయాల ద్వారా రూ. 10–13 కోట్ల ఆదాయం ఒనగూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్లో తొమ్మిది కార్యాలయాలు (ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, దువ్వూరు, కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, వేంపల్లె, పులివెందుల) ద్వారా దాదాపు రూ. 7 కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తి విలువలు పెంచడం జరుగుతోంది. భూముల విలువలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరు నుంచి పది శాతం, పట్టణప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం వరకు ముఖ్యంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో భారీగా పెరిగాయి. ఇందులో నిర్మాణాలకు నోచుకుంటున్న అపార్టుమెంట్లు, కొత్త భవనాల రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా పెరిగాయి. దీంతో జిల్లా ప్రజలకు రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా నిర్వహించే లావాదేవీలపై భారం పడనుంది. కడప డివిజన్లో గత సంవత్సరం రూ. 85 కోట్ల లక్ష్యం కాగా, ఈ సంవత్సరం ధరలు పెరగడంతో దాదాపు రూ. 13 కోట్ల ఆదాయం పెరగనుంది. మొత్తంగా రూ. 100 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో గత సంవత్సరం రూ. 50 కోట్లు లక్ష్యం కాగా, పెరిగిన ధరలతో మరో రూ. 7 కోట్లు మొత్తం కలిపి రూ. 57 కోట్ల ఆదాయం సమకూరనుంది. జిల్లా వ్యాప్తంగా రూ. 157 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆస్తుల విలువను పెంచడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ధరలు పెరుగుతున్నాయని తెలియడంతో గత వారం రోజులుగా కొనుగోలుదారులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. -
రిజిస్ట్రేషన్ల బాదుడు
♦ రేపటి నుంచి పెరగనున్న ఛార్జీలు ♦ ఆస్తుల కొనుగోలుదారులపై రూ.15 కోట్ల భారం కడప కోటిరెడ్డి సర్కిల్ : ఆస్తుల క్రయ విక్రయాల ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు అమలుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అబ్కారీ తర్వాత రిజిస్ట్రేషన్‌శాఖ కీలక ఆదాయ వనరుగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచడంలో భాగంగా చర్యలు చేపట్టి భూములు, భవనాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం వరకు ఆస్తి విలువలను పెంచింది. దీంతో జిల్లా కొనుగోలు దారులపై దాదాపు రూ. 15–20 కోట్ల భారం పడనుంది. రిజిస్ట్రేషన్ శాఖపరంగా జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అందులో కడప డివిజన్ పరిధిలో తొమ్మిది కార్యాలయాలు (కడప అర్బన్, రూరల్, సిద్దవటం, రాజంపేట, పుల్లంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిట్వేలి, సుండుపల్లె) ఉన్నాయి. ఈ కార్యాలయాల ద్వారా రూ. 10–13 కోట్ల ఆదాయం ఒనగూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్లో తొమ్మిది కార్యాలయాలు (ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, దువ్వూరు, కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, వేంపల్లె, పులివెందుల) ద్వారా దాదాపు రూ. 7 కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తి విలువలు పెంచడం జరుగుతోంది. భూముల విలువలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరు నుంచి పది శాతం, పట్టణప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం వరకు ముఖ్యంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో భారీగా పెరిగాయి. ఇందులో నిర్మాణాలకు నోచుకుంటున్న అపార్టుమెంట్లు, కొత్త భవనాల రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా పెరిగాయి. దీంతో జిల్లా ప్రజలకు రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా నిర్వహించే లావాదేవీలపై భారం పడనుంది. కడప డివిజన్లో గత సంవత్సరం రూ. 85 కోట్ల లక్ష్యం కాగా, ఈ సంవత్సరం ధరలు పెరగడంతో దాదాపు రూ. 13 కోట్ల ఆదాయం పెరగనుంది. మొత్తంగా రూ. 100 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో గత సంవత్సరం రూ. 50 కోట్లు లక్ష్యం కాగా, పెరిగిన ధరలతో మరో రూ. 7 కోట్లు మొత్తం కలిపి రూ. 57 కోట్ల ఆదాయం సమకూరనుంది. జిల్లా వ్యాప్తంగా రూ. 157 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆస్తుల విలువను పెంచడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ధరలు పెరుగుతున్నాయని తెలియడంతో గత వారం రోజులుగా కొనుగోలుదారులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. -
రిజిస్ట్రేషన్ల శాఖలో ‘కొత్త’ నెట్వర్క్
అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఏటా కోటిన్నర ఖర్చు సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులను సమకూర్చుకుంటోంది. రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తరచూ ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడం కోసం తన పోర్టల్‌ను స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్) నుంచి మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ (ఎంపీఎల్ఎస్)లోకి మార్చుకుం టోంది. రెయిల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఎంపీఎల్ఎస్ సేవలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం వన్‌టైమ్ చార్జీల కింద రూ.35.25 లక్షలు, ఏటా సర్వీసు చార్జీల కింద 1.58 కోట్లు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఈ ఉత్తర్వుల్లో కల్పించారు. వాస్తవానికి, ప్రస్తుతమున్న నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఎంపీఎల్ఎస్ వీపీఎన్ నెట్వర్క్ వైపు మొగ్గుచూపామని ఆ శాఖ డీఐజీ ఎం. శ్రీనివాసులు వెల్లడించారు. -
ఇంటి నుంచే రిజిస్ట్రేషన్..!
స్థిరాస్తి అమ్మకం, కొనుగోళ్లు సులభతరం - స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సన్నాహాలు - రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో డాక్యుమెంట్ ఫార్మాట్ - ఆన్లైన్ ద్వారానే 90 శాతం ప్రక్రియ - తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ల పూర్తి స్థిరాస్తి అమ్మకం, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇంటి నుంచే స్లాట్ బుకింగ్(పలానా రోజు, పలానా సమయం) చేసుకునే వెసులుబాటు కల్పించగా, తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో డాక్యుమెంట్ ఫార్మాట్లను అందుబాటులోకి తెచ్చింది. సేల్ డీడ్ ఫార్మాట్ అందుబాటులో రాగా, మార్ట్గేజ్, గిఫ్ట్, లీజ్ డాక్యుమెంట్ల ఫార్మెట్లను సైతం వెబ్సైట్లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వారం రోజుల్లో ఫార్మాట్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. – సాక్షి, హైదరాబాద్ ఆన్లైన్లోనే 90 శాతం పూర్తి ప్రజలు ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉంటే చాలు.. ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ 90 శాతం పూర్తి చేసుకోవచ్చు. ఆస్తుల కొనుగోలు, అమ్మకం దారులు దస్తావేజులను ఇంటి వద్దనే సిద్ధం చేసుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ ఈ–చలాన్ ప్రక్రియ కూడా ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకుని తమ వెసులుబాటు సమయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి ఎలాంటి నిరీక్షణ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇకపై స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆటోమెటిక్‌గా డాక్యుమెంట్.. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధానమై స్థిరాస్తి వివరాలు నమోదు చేస్తే చాలు డాక్యుమెంట్ ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతోంది. వెబ్‌సైట్‌లోని ఈ–సర్వీస్‌లోకి వెళ్లి ‘ఫ్రీ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేస్తే.. పబ్లిక్ డేటా ఎంట్రీ సైట్ ఓపెన్ అవుతుది. అందులో న్యూ ఎంట్రీని క్లిక్ చేస్తే డాక్యుమెంట్ స్వరూపం ఆప్షన్ వస్తుంది. అందులో సేల్‌డీడ్, మార్ట్గేజ్, గిఫ్ట్, లీజ్‌లో ఒకదానిపై క్లిక్ చేస్తే.. తర్వాత ఆప్షన్లో అడిగిన విధంగా వరుసగా అమ్మకం, కొనుగోలుదారుల వివరాలు, స్థిరాస్తి వివరాలు, హద్దులు, విలువ నమోదు చేసుకుంటూ వెళ్తే.. చివరకు స్టాంప్ డ్యూటీ, ఈ–చలాన్‌తోపాటు పూర్తిస్థాయి డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత.. అదనపు సమాచారం ఉంటే నమోదు చేసుకుని స్టాంప్ పేపర్‌పై ప్రింట్ చేసుకోవచ్చు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఫార్మాట్లో స్థిరాస్తి దస్తావేజు రూపకల్పన ప్రక్రియ పూర్తవుతుంది. చెక్ స్లిప్ కూడా.. ఈ–సర్వీసుల్లోని పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా స్థిరాస్తి పూర్తి వివరాలు నమోదు చేసి ఇంట్లోనే ‘చెక్ స్లిప్’తయారు చేసుకోచ్చు. వాస్తవంగా ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది తమ కంప్యూటర్లో కొనుగోలు, అమ్మకందారుల పేర్లు, చిరునామా, ఆస్తి వివరాలు, విలువ వంటివి పొందుపర్చడాన్ని చెక్ స్లిప్‌గా వ్యవహరిస్తారు. ఇవన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం బాగా పడుతోంది. చెక్ స్లిప్ ఇంటి నుంచే నమోదు చేసుకుంటే తప్పులు కూడా దొర్లే ఆస్కారం ఉండదు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. -
ఆధార్ ఉంటేనే ఆస్తుల రిజిస్ట్రేషన్
వచ్చే నెల నుంచి అమల్లోకి! సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇక నుంచి ‘ఆధార్’తప్పనిసరి కానుంది. క్రయ, విక్రయ లావాదేవీలకు గాను ఇరు పార్టీలూ ఆధార్ వివరాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. దీనిపై రిజిస్ట్రే షన్ల శాఖ ఇంతకుముందే అంతర్గత సర్క్యు లర్ జారీ చేసినా.. ఆచరణలోకి రాలేదు. ఇటీవల భారీగా రిజిస్ట్రేషన్ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ‘ఆధార్’లింకును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. రెండు మూడు వారాల్లో ఈ నిబంధనను అధికారికంగా అమల్లోకి తెస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొంత జాప్యం జరిగినా ఆగస్టు నుంచి కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పారదర్శకత కోసమే.. ప్రస్తుతానికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వ్యక్తిగత ధ్రువీకరణతో సరిపెడు తున్నారు. క్రయ, విక్రయాలు జరిపే ఇరు పార్టీల ధ్రువీకరణ కార్డులతో పాటు ఇద్దరు సాక్షులు సంతకాలు చేస్తే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కానీ ఆధార్ నిబంధన అమ ల్లోకి వస్తే ఇరు పార్టీలు కచ్చితంగా తమ ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి వేలిముద్రలు కూడా తీసుకుంటారు. సాక్షుల ఆధార్ వివరాలు కూడా తీసుకోవా లని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు యోచిస్తు న్నారు. తద్వారా సంబంధిత లావాదేవీ పూర్తి పారదర్శకతతో జరుగుతుందని, ఏదైనా అక్రమం జరిగినా కచ్చితంగా తేలు తుందనే భావిస్తున్నారు. సాక్షుల ఆధార్ విషయంగా ఇంకా తుది నిర్ణయం తీసుకో లేదు. క్రయ, విక్రయదారుల్లో ఎవరికైనా ఒకవేళ ఆధార్ లేనిపక్షంలో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలనే నిబంధన విధిస్తున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అధికారులు చెబుతున్నారు. కోర్టు కూడా అడ్డుకోదేమో..! వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేసే సంక్షేమ పథకాలకు మినహా ఇతరాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం ఏ మేరకు అమల్లోకి వస్తుందన్న దానిపై అస్పష్టత ఉంది. రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేస్తే.. కోర్టుపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నదిశగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులు ఆలోచన చేస్తున్నారు. అయితే పాన్‌కార్డును ఆధార్‌తో లింకు చేయడాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భూ అక్రమాల నియంత్రణ కోసం ఉపయోగపడే అవకాశం ఉన్నందున రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేయ డానికి న్యాయపరంగా ఇబ్బందులు రావని భావిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
‘ట్రాన్స్ఫర్’ చేయరూ
► టీడీ బకాయిలపై తకరారు ► నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగాయంటున్న సర్పంచులు సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ(టీడీ) బకాయిలు అందకుండా పోయాయి. ఫలితంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెలా భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ బకాయిలను రిజిస్ట్రేషన్ల శాఖ గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం లేదు. ఎవరి వాదన వారిది.. పంచాయతీరాజ్ శాఖ నుంచి తమకు ఆయా గ్రామ పంచాయతీల డీడీవో కోడ్లు, పీడీ అకౌంట్ల వివరాలు అందకపోవడమే ప్రధాన కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అంటుండగా, ట్రాన్స్ఫర్ డ్యూటీని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని తాము కోరినా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్పందన కరువైందని పంచాయతీరాజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. వడ్డీలు కట్టలేక సతమతం రెండేళ్లుగా పంచాయతీలకు అందాల్సిన టీడీ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వమే వాడుకుంటోంది. ఉపాధిహామీ పథకం కింద మూడు నెలల కిందట దాదాపు రూ.350కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తే, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని దుస్థితి. – అందోల్ కృష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఇప్పటి వరకు టీడీ బకాయిల మొత్తం సుమారు రూ.కోట్లు 600 16 నెలలుగా విడుదల చేయడం లేదు ఆస్తి విలువలో టీడీగా వసూలు చేసేది 1.5% 30 రోజులు ఈ మొత్తాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేయాల్సిన సమయం: 30 రోజులు(నెల) -
రిజిస్ట్రేషన్ల శాఖలో ‘ఎనీవేర్’ దందా!
♦ రూ.6వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పరం ♦ 615 ఎకరాల ప్రభుత్వ భూమిని బుక్ 4లో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ♦ కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు, క్రిమినల్ కేసు నమోదు ♦ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ♦ రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు రద్దు సాక్షి, హైదరాబాద్: ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సుమారు రూ.6 వేల కోట్ల విలువైన 615 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. రిజిస్ట్రేషన్ల శాఖలోని ‘ఎనీవేర్’ వెసులుబాటుతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ నిషేధిత ఆస్తుల జాబితాలోని ప్రభుత్వ భూములను సైతం ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. వాస్తవానికి ఈ భూమి రంగారెడ్డి ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోనిది. ఈ వ్యవహారం ఏడాది క్రితమే జరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మనకెందుకులే అని కళ్లు మూసుకుని కూర్చున్నారు. గురువారం ముఖ్యనేత ఒకరు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికçప్పుడు విచారణ జరిపించి కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలను అధికారులు బట్టబయలు చేశారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎనీవేర్ దందా య«థేచ్ఛగా కొనసాగుతున్నా, పర్యవేక్షణాధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ కిమ్మనడం లేదు. అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లు, తాము దోచుకున్న దాంట్లో పై అధికారులకు ఎంతో కొంత ముట్టజెబుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న సబ్ రిజిస్ట్రార్లకు రాజకీయ అండదండలు కూడా ఉంటుండడంతో, అక్రమార్కులపై ఏదైనా చర్యలు చేపట్టాలంటే జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు, ఆఖరుకు కమిషనర్ స్థాయి వ్యక్తులు కూడా జంకుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖలో ఇటీవల బయటపడిన బోధన్ స్కామ్ కంటే, రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న ఎనీవేర్ దందా ఎన్నో రెట్లు పెద్ద స్కామ్ అని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది చెబుతున్నారు. బోధన్ స్కామ్‌ను విచారించినట్లుగానే రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్లను సీఐడీతో విచారణ జరిపిస్తే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. సువిశాల్ పవర్ పేరిట బదిలీ... సదరు భూమిపై తమకు షన ద్ హక్కులున్నాయంటూ అమీరున్నిసా బేగం మరో ఏడుగురు వ్యక్తులు తమ హక్కులను సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ పేరిట ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏదేని స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను బుక్ 1లో నమోదు చేయాల్సి ఉండగా, ఈ అక్రమాలు ఎప్పటికీ బయట పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆ వివరాలను చరాస్తులను రిజిస్ట్రేషన్ చేసే బుక్ 4లో నమోదు చేశారు. సర్వే నంబరు 20లో 109 ఎకరాలు, 28లో145 ఎకరాలు, 44లో 25 ఎకరాలు, 45లో 98 ఎకరాలు,100లో 207 ఎకరాలు, 101లో 231 ఎకరాల ప్రభుత్వభూమి అన్యాక్రాంతమైనట్లు జిల్లా రిజిస్ట్రార్(ఆడిట్) ఉన్నతాధికారులకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయడమేకాకుండా ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన స్టాంప్‌డ్యూటీ మినహాయింపుతో రిజిస్ట్రేషన్ల శాఖకు దాదాపు రూ.415.70 కోట్ల మేరకు గండి పడేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. భూములను కొనుగోలు చేసిన సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీ తరఫున మేనేజర్ పీవీఎస్ శర్మ రిజిస్ట్రేషన్‌కు హాజరైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అక్రమంగా రిజిస్టర్ చేసిన ఆరు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చిన రిజిస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులు అప్పటికప్పుడు క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టారు. నిషేధిత ఆస్తుల జాబితాలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సెక్షన్ 22 ఏ రిజిస్ట్రేషన్ల చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ సబ్ రిజిస్ట్రార్ ఆర్. శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. అంతేకాకుండా శ్రీనివాసరావుపై కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టారు. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్(ఆడిట్) ఇచ్చిన నివేదిక ప్రకారం 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6 డాక్యుమెంట్ల ద్వారా 615 ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. -
అన్నిచోట్లా తగ్గినా.. మనం తగ్గలే!
- రిజిస్ట్రేషన్లలో దక్షిణాదిన మనమే టాప్ - 13.92% వృద్ధిరేటుతో రాష్ట్రం ముందంజ సాక్షి, హైదరాబాద్: వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో మూడేళ్లుగా కిందామీద పడుతున్న రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ 2016–17లో ఆదాయం పెరుగుదలలో దక్షిణాదిన టాప్‌గా నిలిచింది. 2015–16లో తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 3,100 కోట్లు కాగా, 2016–17లో రూ. 3,528 కోట్లు సాధించింది. మొత్తంగా 13.92 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. 2015–16తో పోలిస్తే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం 3.96 శాతం క్షీణించగా, కర్ణాటకలోనూ 5.61 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. తమిళనాడులో రిజిస్ట్రేషన్ల ఆదాయం 18.36 శాతం తగ్గగా, కేరళలో 4.86 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం చూపినా, భూములు, భవనాల మార్కెట్ విలువలను మూడేళ్లుగా ప్రభుత్వం పెంచకున్నా తెలంగాణ రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటును సాధించడం విశేషం. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో వివిధ స్థాయిల్లో ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే, అవకతవకలను నివారించడం ద్వారా రాబడి మరింత పెంచేందుకు వీలవుతుందని రిజిస్ట్రేషన్ల వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాదికి అంచనాలు సిద్ధం! రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ అంచనాలను రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేసింది. 2016–17లో మాదిరిగానే 2017–18లోనూ 14 శాతం ఆదాయ వృద్ధికి అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా 2017–18లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 3,600 కోట్లు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే, నోట్ల రద్దు అనంతర పరిణామాలు, నగదు లావాదేవీలపై కేంద్రం కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాలు రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చే రాబడి, ఇతర పరిణామాలను పరిశీలించిన తరువాతే సరైన అంచనాకు రావచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
రిజిస్ట్రేషన్లలో నోటరీలకు స్వస్తి!
మున్సిపాల్టీల్లో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఇచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ సాక్షి, హైదరాబాద్: పురపాలక సంఘాల్లో భూమి/భవ నాల తనఖాకు సంబంధించి నోటరీలు చెల్లవని రిజిస్ట్రే షన్ల శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2013 డిసెంబర్లోనే ఉత్తర్వులిచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయం తగ్గడానికి ఇది కూడా కారణమని గ్రహించిన ఉన్నతాధికారులు తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ నోటరీలను పరిగ ణలోకి తీసుకోవద్దని సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చారు. ఏదైనా భవన నిర్మాణానికి పురపాలక సంఘాల నుంచి అనుమతి తీసుకునేటప్పుడు నిబంధనల ప్రకారం 10 శాతం భూమి లేదా భవనాన్ని సదరు మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌డ్యూటీ రూ.5వేలతో పాటు మార్కెట్ వాల్యూలో 0.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 2013కు ముందు భవన నిర్మాణ అనుమతి కోసం పురపాలక సంఘాలకు దరఖా స్తు చేసుకునే యజమానులు 10 శాతం భూమి/భవనాన్ని తనఖా పెట్టినట్లుగా నోటరీ చేయించేవారు. 2013 తరువాత కూడా ఇది కొనసాగించడం వల్ల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. దీంతో శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. -
వాటికి రిజిస్ట్రేషన్ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే!
సర్కారు భూముల విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం - అక్రమాలకు పాల్పడితే తొలగిస్తామని సబ్ రిజిస్ట్రార్లకు హెచ్చరిక - ‘ఎనీవేర్’లో అవకతవకల నియంత్రణకు చర్యలు సాక్షి, హైదరాబాద్: సర్కారు భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను ఉద్యోగం నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులు నిర్ణయించారు. ఎనీవేర్‌లో లోపాలను సరిదిద్దడంతో పాటు, ఉల్లంఘనులపై చర్యల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. 6 నెలల అధ్యయనం తర్వాత కమిటీ పలు సిఫార్సులు చేయగా.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి అనంతరం మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. కమిటీ సిఫార్సులు.. ► రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి అందిన దస్తావేజుల వివరాలను ముందస్తుగా సబ్ రిజిస్ట్రార్లు తనిఖీ చేయాలి. ఆ ఆస్తి ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్నదో, అక్కడి నుంచి అనుమతి తీసుకోవాలి. ► సర్కారు సూచించిన నిషేధిత ఆస్తుల పుస్తకం (పీవోబీ)లో సదరు భూమి నమోదైనట్లు రుజువైతే దస్తావేజును తిరస్కరించాలి. పీవోబీలో లేని ఆస్తులనే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి. ► వేరొక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ధారించే విషయమై అక్కడి సబ్ రిజిస్ట్రార్‌కు ఈ మెయిల్ ద్వారా వివరాలు పంపాలి. ఈ–మెయిల్స్‌ను అందుకున్న సబ్ రిజిస్ట్రార్లు 48 గంటల్లోగా స్పందించాలి. ► దస్తావేజులో పేర్కొన్న మార్కెట్ విలువలో తేడా ఉన్నా, పీవోబీలో భూమి సర్వే నంబరు ఉన్నా, సంబంధిత పత్రాలను రిప్లయ్‌తో జత చేయాలి. మార్కెట్ విలువలో వ్యత్యాసం ఉంటే ఆ మొత్తం చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలి. ► అలా కాకుండా తప్పుడు మార్కెట్ విలువతో ఫీజు లెక్కిస్తే సదరు సబ్ రిజిస్ట్రార్‌పై ‘భారతీయ స్టాంపుల చట్టం 1899’ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ► ఏదేని గ్రామంలో సర్వే నెంబరు 10ని పీవోబీలో పేర్కొని.. 10బీ, 10సీ సర్వే నెంబర్లలోని భూములుగా దస్తావేజులో పేర్కొంటే సదరు గుర్తింపులను సబ్ రిజిస్ట్రార్ రూఢీ చేసుకోవాలి. ► తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో సరిచూసుకున్నాకే దస్తావేజును అనుమతించాలి. లేదంటే రెవెన్యూ అధికారులతో పరిశీలన చేయించుకోవాలని సూచిస్తూ దస్తావేజును తిరస్కరించాలి. ► సెక్షన్ 22ఎ ప్రకారం నిషేధించిన భూములను ఏదైనా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే, ప్రభుత్వ సొమ్మును అపహరించిన నేరంతో సమానంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన కేసులలో సదరు అధికారులను ఉద్యోగం నుంచి తొలగించా లని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. -
ఆదాయం ఢమాల్..
⇒ఆబ్కారీ శాఖ మినహా.. సర్కారీ విభాగాల కుదేలు ⇒పెద్ద నోట్ల రద్దుతో భారీ గండి ⇒లక్ష్య సాధనలో చతికిలబడ్డ శాఖలు సిటీబ్యూరో: ఆదాయార్జనలో నగరంలోని పలు ప్రభుత్వ విభాగాలు చతికిలపడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆబ్కారీ శాఖ మినహా.. రవాణా, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఈ శాఖలు ఆర్జించిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. పెద్దనోట్ల రద్దు దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సకల వ్యాపార, వాణిజ్య రంగాలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యానికి భారీగా గండిపడింది. ఆర్టీఏ ఆదాయానికి బ్రేకులు.. ఈ ఏడాది (2016–2017) రవాణాశాఖ ఆదాయానికి బ్రేకులు పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గడంతో పాటు.. జీవితకాల పన్నుపై భారీగా ప్రభావం చూపాయి. త్రైమాసిక పన్ను కూడా కొంతమేర తగ్గింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం లక్ష్యంలో 85 శాతమే సాధించగలిగారు. అంటే అనుకున్న లక్ష్యంలో 15 శాతం మేర కోత పడింది. తగ్గిన ‘వాణిజ్య పన్నుల’ రాబడి గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్య సాధనలో వెనుకబడింది. 2016–17లో సుమారు రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. కానీ మార్చి చివరి నాటికి కేవలం రూ.19 వేల కోట్లతో సరిపెటుకొంది. ఈ శాఖకు సమకూరే ఆదాయంలో మహానగర రాబడి అత్యంత కీలకం. ఈ శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, సిటీలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి నుంచే అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. కానీ, అధికారులు చేతివాటం, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంతో ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ తీరును కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. లక్ష్యం చేరని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సైతం ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడింది. 2016–17లో గ్రేటర్లో రూ.3 వేల కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. కానీ మార్చి చివరికి రూ.2400 కోట్లకు మించలేదు. పెద్దనోట్ల రద్దు, కరెన్సీ కట్టడితో స్థిరాస్తి లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఈ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు (డీఆర్) ఉండగా అందులో మహానగరంలో నాలుగు డీఆర్ పరిధులు ఉన్నాయి. వీటిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాటా 68.89 శాతం ఉంది. కానీ, ఈ ఏడాది వరుసగా ఐదు మాసాలుగా స్థిరాస్తి రంగం స్తబ్ధతగా మారడంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖపై పడినట్లయింది. -
మార్కెట్ విలువల పెంపునకు నో!
► రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను తిరస్కరించిన సర్కారు ► సవరిస్తే ఏటా రూ.400 కోట్ల ఆదాయం పెరుగుతుందన్న కమిషనర్ ► నోట్ల రద్దు నుంచి రియల్ఎస్టేట్ ఇంకా కోలుకోలేదన్న స్పెషల్ సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూము లు, భవనాల మార్కెట్ విలువల పెంపునకు సర్కారు విముఖత వ్యక్తం చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుత విలువలే కొనసాగనున్నాయి. వాస్తవానికి నాలుగేళ్లుగా మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించకపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆశించిన మేర రాబడి లభించడం లేదు. ఏటా ఈ శాఖ ఆదాయ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతున్నా.. మార్కెట్ విలువలను సవరించ కపోవడంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా రు. 2016–17లోనైనా మార్కెట్ విలువలను సవరించాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ గతేడాది ఏప్రిల్‌లోనే ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆలస్యంగా స్పందించిన సర్కారు.. అది సరైన సమయం కాదంటూ ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టిం ది.కొద్ది రోజుల్లో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. ఇక ప్రభుత్వ తాజా నిర్ణ యంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భూములు, భవనాల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండకపోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయానికి గండి: ఏపీ మార్కెట్ విలువ సవరణ నిబంధనలు, మార్గదర్శకాలు–1998 మేరకు ఏటా భూములు, భవనాల మార్కెట్ విలువలను రిజిస్ట్రేషన్ల శాఖ సవరించాల్సి ఉంది. ఒక ఏడాది పట్టణ ప్రాంతాల్లో, మరుసటి ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించాలి. ఏటా ఏప్రిల్‌లో మార్కెట్ విలువల పెంపు కసరత్తు ప్రారంభించి.. ఆగస్టు 1 నుంచి సవరణ ప్రతిపాదనలను అమలు చేయాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ధరలను అనుసరించి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షిస్తారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారిగా భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించారు. ఆ తర్వాతగానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాకగానీ సవరణ చేపట్టలేదు. గత మూడేళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖ విలువల సవరణ ప్రతిపాదనలను సమర్పిస్తున్నా.. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. సవరిస్తే రూ.400 కోట్ల ఆదాయం రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ క్రమేపీ పుంజుకుంటోందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించేందుకు అనుమతించాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ గత ఏప్రిల్‌లోనే ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సవరణ జరిపితే ఏటా రూ.400 కోట్లకు పైగా రాబడి పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో భూములు, భవనాల మార్కెట్ విలువలు పెంచేందుకు ఇది సరైన సమయం కాదని రెవెన్యూ (రిజిస్ట్రేషన్లు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014, 2015 సంవత్సరాల్లో మార్కెట్ విలువలను పెంచేందుకు సరైన కారణాలు లేవని.. ఇటీవల వృద్ధిరేటు తక్కువగా ఉండడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశముందని, ఈ పరిస్థితుల్లో మార్కెట్ విలువల సవరణ సరికాదని సూచించారు. -
‘రిజిస్ట్రేషన్ల’ ఎఫ్ఎం నియామకం ఎప్పుడు?
⇒ ఫెసిలిటీ మేనేజర్ ఏర్పాటుపై ఆర్నెల్లుగా తాత్సారం ⇒ తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఏటా రూ. 4 వేలకోట్ల ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఆరు నెలలుగా ఫెసిలిటీ మేనేజర్ (ఎఫ్ఎం) నియామకం అంతుచిక్కని ప్రశ్నగా తయారైంది. గతంలో ప్రభుత్వం ఎఫ్ఎంగా నియమించిన టీసీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టు 18న ముగిసింది. గత ఆరు నెలలుగా కొత్త ఫెసిలిటీ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించకపోవడంతో క్షేత్రస్థాయిలో సాంకేతిక వ్యవస్థలన్నీ బంద్ అయ్యాయి. కాంట్రాక్ట్ గడువు ముగిసినందున రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ సర్వీస్ ఇంజనీర్లను టీసీఎస్ వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆన్లైన్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కమిటీల ఏర్పాటుతోనే కాలయాపన: ఎఫ్ఎం నియామకానికి ఫైలును సిద్ధం చేసిన అధికారులు గత సెప్టెంబర్‌లో ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించారు. రిజిస్ట్రేసన్ల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, ఎఫ్ఎం నియామక ప్రక్రియ నిమిత్తం సెప్టెంబర్ 24న ఒక కమిటీని వేసి మిన్నకుండి పోయింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సబ్ రిజిస్ట్రార్ల నుంచి, రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే వినియోగదారుల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఎఫ్ఎం నియామక ప్రక్రియను త్వరితగతిన ముగించేందుకని గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన అంతర్ విభాగాల కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఐటీ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌ను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సర్వర్ సమస్యలతో ఎన్నో వెతలు: గత ఆరు నెలలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిరంతరం సర్వర్ డౌన్ అవుతుండటం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కేవలం పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్ డౌన్, నెట్వర్క్ సమస్యల కారణంగా గంటల కొద్దీ సమయం తీసుకుంటోంది. సమస్యలను పరిష్కరించేందుకు సర్వీస్ ఇంజనీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఫెసిలిటీ మేనేజర్ నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. -
పెరిగిన రిజిస్ట్రేషన్ల రాబడి
జనవరి కంటే ఫిబ్రవరి ఆదాయం రూ.100 కోట్లు అధికం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కోలుకుంటోంది. జనవరి ఆదాయం కంటే ఫిబ్రవరిలో దాదాపు రూ.100 కోట్లు ఎక్కువగా ఆదాయం లభించడం రిజిస్ట్రేషన్ వర్గాలకు ఊరట కలిగిస్తోంది. జనవరిలో రిజిస్ట్రేసన్ల శాఖకు రూ.175.04 కోట్ల ఆదాయం లభించగా, ఫిబ్రవరి ఆదాయం రూ.274.87 కోట్లకు చేరడం విశేషం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పంట సొమ్ము చేతికి రావడం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులకు నగదు విత్‌డ్రా పరిమితులను బ్యాంకులు సడలించడంతో అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాలను రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధం చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల వినియోగదారులు తమ స్థిరాస్తులను ఐటీ రిటర్నుల్లో తప్పనిసరిగా చూపించాల్సి ఉన్నందున, తమ ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇదే తీరు కొనసాగితే మార్చిలో మరింత రాబడి వచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సులువుగా సొసైటీ రిజిస్ట్రేషన్
⇒ ఆన్లైన్లోనే సొసైటీలు.. ఫర్మ్ రిజిస్ట్రేషన్లు ⇒ ఈవోడీబీలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఈ–స్టాంప్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, సర్టిఫైడ్ కాపీలు, పబ్లిక్ డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్, పెండింగ్ డాక్యుమెంట్ స్టేటస్.. తదితర సేవలను ఆన్లైన్ ద్వారానే వినియోగదారులు పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వీలు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను కూడా ఆన్లైన్ ద్వారానే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రోగ్రామ్ (ఈవోడీబీ)లో భాగంగా.. ఆన్లైన్ సేవలను అందించడంలో రిజిస్ట్రేషన్ల శాఖను అగ్రగామిగా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రిజిస్ట్రేషన్ల ఆన్లైన్ ప్రక్రియలపై కసరత్తు కొలిక్కి రావడంతో వచ్చే నెల (మార్చి) మొదటి వారంలో ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త ఆన్లైన్ ప్రక్రియల ద్వారా వినియోగదారులు తమ ఇల్లు లేదా కార్యాలయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్లు ఇలా.. సాధారణంగా వివిధ రంగాల్లో సమాజానికి సేవలందించాల నుకునే వ్యక్తులు ముందుగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుం టారు. తెలంగాణ రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఆయా సొసైటీలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఇందుకు సొసైటీలో సభ్యులు కనీసం ఏడుగురు, గరిష్టంగా ఎంతమందైనా ఉండవచ్చు. సొసైటీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ప్రస్తుతం మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. అదే ఆన్లైన్ ప్రక్రియ అమల్లోకి వస్తే , వినియోగదారులు ఇల్లు లేదా ఆఫీసు నుంచే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో దరఖాస్తును సమర్పించవచ్చు. సొసైటీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200లను నెట్‌బ్యాంకింగ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డులతో ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఫర్మ్ రిజిస్ట్రేషన్లు ఇలా... ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు (పార్ట్నర్స్) తమ పేరిట ముందుగా ఒక ఫర్మ్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ బిజినెస్‌లో భాగస్వాములు కనీసం ఇద్దరు, గరిష్టంగా 20కి మించకుండా ఉంటేనే ఫర్మ్ రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. 20 మందికి పైగా భాగస్వాములు ఉన్నట్లయితే.. సదరు సంస్థలు కంపెనీల యాక్ట్ కిందకు వస్తాయి. ఫర్మ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచే దరఖాస్తు సమర్పించి, ఫీజు రూ.100ను ఆన్లైన్ ద్వారానే చెల్లించవచ్చు. సంబంధిత పత్రాలు రిజిస్ట్రార్‌కు పంపాలి.. ఆయా రిజిస్ట్రేషన్ల నిమిత్తం చేసిన ఆన్లైన్ దరఖాస్తులలోని వివరాలకు సంబంధించిన పత్రాలను మాత్రం కొరియర్ లేదా పోస్ట్ ద్వారా సంబంధిత జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్లను అప్రూవ్ చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందుకున్న వినియోగదారులు, రిజిస్ట్రేషన్ సర్టిపికెట్లను అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచే పొందవచ్చు. -
రిజిస్ట్రేషన్లపై ‘పెద్ద నోట్ల’ ముద్ర..
♦ అక్టోబర్ వరకు రికార్డు స్థాయిలో 40 శాతం పెరుగుదల ♦ పెద్దనోట్ల రద్దు తర్వాత ఆదాయంలో క్షీణత సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రిజిస్ట్రేషన్ల, స్టాంపుల శాఖ కుదేలవుతోంది. రెండునెలలుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు తిరోగమన దిశలో కొనసాగుతోంది. గతేడాది కన్నా 30 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూ.4,291 కోట్ల టార్గెట్‌ను రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం విధించింది. అయితే.. అక్టోబర్ వరకు రికార్డుస్థాయిలో 40 శాతం ఆదాయ వృద్ధి కనిపించింది. నవంబర్ ప్రథమార్థంలో కొన్ని రోజులపాటు పాతనోట్లతో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించేందుకు కేంద్రం అనుమతించిన కారణంగా ఆ నెల ఆదాయంలో గతేడాది కన్నా 12 శాతం పెరుగుదల నమోదైంది. పాతనోట్లతో చెల్లింపులకు కేంద్రం స్వస్తి పలకడంతో డిసెంబర్లో ఆదాయం భారీగా తగ్గింది. మరో మూడు నెలలు ఇదే తీరు కొనసాగే అవకాశం ఉన్నందున వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. గత మూడేళ్లుగా భూముల మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించకపో వడం కూడా ఆస్తుల క్రయవిక్రయాలపై ప్రభావం చూపుతోం ది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రూ.కోటి విలువ ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ వాల్యూ గరిష్టంగా రూ.20 లక్షలకు మించి ఉండడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల ప్రకారం ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే కొనుగోలు చేసిన వ్యక్తి సదరు ఆస్తి విలువలో ఆరు శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. మరోవైపు రూ.20 వేలకు మించి చెల్లింపులన్నీ క్యాష్‌లెస్ లావాదేవీలతోనే చేయాలని కేంద్రం పేర్కొంటుండడంతో, ఇప్పటివరకు ఆదాయపు పన్ను పరిధి లోకి రానివారంతా తమ వద్ద ఉన్న అన్అకౌంటెడ్ సొమ్మును మార్చుకునేందుకు వీలుకావడం లేదు. మరోవైపు అన్అకౌం టెడ్ సొమ్ము తీసుకుంటే, దాన్ని వైట్‌మనీగా మార్చుకో వడంలో ఇబ్బందులు వస్తాయేమోనని విక్రయదారులు కూడా ఆస్తులను అమ్మేందుకు సందేహిస్తున్నారు. మార్కెట్ విలువను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును ప్రస్తుతం ఉన్న ఆరు శాతం నుంచి రెండు శాతానికి తగ్గిస్తే కొనుగోలుదారులకు ఉపశమనంతోపాటు రిజిస్ట్రేసన్ల శాఖకు ఆదాయం సమకూరుతుందని సూచిస్తున్నారు. త్వరలోనే భూముల మార్కెట్ విలువలను పెంచడం, రిజిస్ట్రేషన్ల ఫీజును తగ్గించడంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
రిజిస్ట్రేషన్లపై నిఘానేత్రం!
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు - ఏప్రిల్ 1 నుంచి అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖ మరో కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. క్షేత్రస్థాయిలో జరిగే అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ‘రికార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ పేరిట సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇటువంటి విధానాన్ని అవలంబిస్తున్న మహా రాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధి కారులు ఇటీవల అధ్యయనం కూడా చేశారు. రాష్ట్రంలోనూ అటువంటి విధానాన్ని అవలం బించడం ద్వారా కొంతమేరకైనా అవకతవక లకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. దీనిపై దాదాపు నెలరోజులుగా ఉన్నతాధికారులు చేస్తున్న కసరత్తు.. తాజాగా ఓ కొలిక్కి వచ్చి నట్లు తెలుస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట ప్రధానంగా రిజిస్ట్రేషన్ల సమయంలో ఆస్తుల విక్రయదారులకు బదులు ఇతరులు హాజరు కావడం, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ చేసినది తాను కాదని విక్రేతలు చెబుతుం డడం, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకు న్నారంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్ర యించడం.. వంటి సమస్యలకు, అక్రమాలకు కొత్త విధానంతో చెక్ పెట్టవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతే గాకుండా అవినీతిని నియంత్రించేం దుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు ఉపకరిస్తుందని అవినీతి నిరోధక శాఖ పలు ప్రభుత్వ శాఖ లకు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు అన్ని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖకు సాంకేతిక సేవలందించే ఫెసిలిటీ మేనేజర్ నియామక టెండర్లోనూ సీసీ కెమెరాల ప్రతిపాదనను పొందుపరిచినట్లు సమా చారం. రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే ఏప్రిల్ 1నుంచి అమల్లోకి తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాల యంలో మాదిరిగా క్షేత్రస్థాయిలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఉన్న తాధికారులు నిర్ణయిం చారు. కొందరు ఉద్యోగులు కార్యాల యానికి రాకుండానే తాత్కాలిక ఉద్యోగు లతో పనులు చేయిస్తు న్నారని, సబ్ రిజిస్ట్రార్లు సైతం సమయానికి విధులకు హాజరుకావడం లేదన్న ఫిర్యా దుల నేపథ్యంలో బయోమెట్రిక్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు సబ్ రిజిస్ట్రార్ బయోమెట్రిక్ ద్వారానే ఆమోదం తెలిపే విధంగా నూతన వ్యవస్థ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. మొదట ఇచ్చిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయ కుండా తరువాత వచ్చిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాదని చెబుతు న్నారు. అంటే ‘తొలుత వచ్చిన వారికి తొలుత (ఫస్ట్ కమ్ ఫస్ట్)’ ప్రాతిపదికన రిజి స్ట్రేషన్లు జరిగేందుకు వీలవుతుం దంటున్నారు. -
ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్లకు పోస్టింగ్‌లు
ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్లకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు లభించాయి. ఇందులో ముగ్గురిని మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్ డీఆర్లు గానూ, మరో ముగ్గురిని సాధారణ జిల్లా రిజిస్ట్రార్లుగానూ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ(రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి ఈ శాఖలో అర్హులైన ఆరుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) గత ఆగస్టులోనే ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీ గా ఉన్నప్పటికీ, గత 5 నెలలుగా ప్రభుత్వం పోస్టింగులను ఇవ్వకపో వడం పట్ల సబ్ రిజిస్ట్రార్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల జిల్లా రిజిస్ట్రార్లు, తాజా పోస్టింగ్‌లతో కిందిస్థాయి సిబ్బంది పదోన్నతులకు మార్గం సుగమమైందని పలువురు సబ్ రిజిస్ట్రార్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్లకు పోస్టింగ్‌లు ఇలా.. డీఆర్ పేరు పోస్టింగ్ దినేశ్ దత్తార్ హైదరాబాద్ జిల్లా కె.వి.రమేశ్‌రెడ్డి సంగారెడ్డి అండ్ మెదక్ జిల్లాలు వి.రమేశ్ నిజామాబాద్ జిల్లా ఎం.రవీందర్ రంగారెడ్డి(మార్కెట్‌వాల్యూ అండ్ ఆడిట్) డి.వి.ప్రసాద్ మేడ్చల్–మల్కాజిగిరి(మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) ఎం.ఆర్.ఎన్ .ఆచార్యులు హైదరాబాద్(మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) -
రిజిస్ట్రేషన్ల శాఖ ఇక నగదు రహితం!
- జనవరి 15లోగా ‘నగదు రహిత లావాదేవీల’కు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం - రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పీవోఎస్ల ఏర్పాటు - సిద్దిపేటలో నేటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీల(క్యాష్‌లెస్) దిశగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ–చలాన్ల ద్వారా అధిక మొత్తం లావాదేవీలను క్యాష్‌లెస్‌గా మార్చిన అధికారులు, తాజాగా సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో చిన్న మొత్తాల చెల్లింపుతో చేసే లావాదేవీలనూ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా(ఎస్సార్వో)ల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పూర్తి నగదు రహిత లావా దేవీల ప్రక్రియ అమలులో భాగంగా తొలుత సిద్దిపేట నియోజకవర్గంలోని అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో సమస్యలను పరిష్క రించే బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) కు రిజిస్ట్రేషన్ల శాఖ అప్పగించింది. సిద్దిపేటలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే జనవరి 15లోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ పీవోఎస్ మెషీన్లను ఏర్పాటు చేసేందుకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. నగదు రహిత లావాదేవీలు ఇలా.. ప్రస్తుతం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ), సర్టిఫైడ్ కాపీ, వీలునామా, వివాహ రిజిస్ట్రేషన్ల నిమిత్తం రిజిస్ట్రేషన్ల శాఖలో నగదు లావాదేవీలే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తాల్లో ఉండే ఆయా ఫీజులను సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలోనే వినియోగదారులు నేరుగా చెల్లిస్తున్నారు. ఈ తరహా లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా రూ.130కోట్ల నుంచి రూ.150కోట్ల దాకా ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్ల శాఖను సంపూర్ణంగా క్యాష్‌లెస్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇకపై ఎస్సార్వోలలో చెల్లించే చార్జీలను కూడా వినియోగదారులు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసీ కోసం రూ.200, సీసీ కోసం రూ.120, వివాహ రిజిస్ట్రేషన్‌కు రూ.100, వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.1000 మొత్తాలను ఇకపై నగదు తీసుకెళ్లకుండానే వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి సాంకేతిక సేవలందిం చేందుకు ఏర్పాటు చేసుకున్న ఫెసిలిటీ మేనేజర్ (టీసీఎస్) కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. ప్రభుత్వం వెంటనే ఫెసిలిటీ మేనేజర్‌ను నియమించి, మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. -
16 ఏళ్ల కిందటే జయ వీలునామా!
-
16 ఏళ్ల కిందటే జయ వీలునామా!
- రక్తసంబంధీకురాలి పేరిట రిజిస్ట్రేషన్? - మరో రెండు ట్రస్టులు కూడా.. - హైదరాబాద్ శివారులోని జేజే గార్డెన్స్ చిరునామాతోనే రిజిస్ట్రేషన్ - ప్రైవేటు అటెండెన్స్ ద్వారా ప్రక్రియ పూర్తి సాక్షి, హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే వీలునామా రాశారా? జయలలిత మరణం తర్వాత ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలివి! అయితే 16 ఏళ్ల కిందటే జయ తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్ చేశారు. వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్ హెయిర్)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు వీలు కాదని పేర్కొంటున్నారు. ఇక్కడి చిరునామాతోనే.. వీలునామాతోపాటు రెండు ట్రస్ట్‌లను కూడా జయలలిత 2000 జూలై 14న రిజిస్ట్రేషన్ చేశారని తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా హైదరాబాద్ నగర శివారులోని జేజే గార్డెన్స్‌లో జరిగింది. నాడు జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్(పేట్ బషీరాబాద్)లోని తన గార్డెన్స్ చిరునామాతో చేయించారు. ‘పురట్చి తలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్, నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్’లను (డాక్యుమెంట్ నంబర్లు బుక్ 4లో 31, 32) రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ట్రస్టుల నిర్వాహకులుగా జయలలిత తన పేరుతోపాటు తన నెచ్చెలి శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను చేర్చారు. ఆపై 2001లో ట్రస్ట్ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేశారు. ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలకు ముందుగానే ఆదాయపు పన్ను శాఖ అనుమతి తీసుకుంటామని, అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించమని సవరణ పత్రాల్లో పేర్కొన్నారు. ఆపై జయలలిత ఆస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ, న్యాయస్థానాలకు కూడా సదరు రిజిస్ట్రేష్లన్ల పత్రాలను సమర్పించినట్లు తెలిసింది. ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా.. సాధారణంగా ఏదైనా ఆస్తులు, ట్రస్టులను రిజిస్టర్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా తమ చిరునామాకు సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విధిగా హాజరు కావాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా సబ్ రిజిస్ట్రారే వినియోగదారుల వద్దకు వెళ్లి ఆ తంతును పూర్తి చేసే వెసులుబాటు ఉంది. ప్రజా జీవితంలో ఉన్న సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, మావోయిస్టుల నుంచి హాని ఉన్నవారు, నడవలేనివారు, ఆరోగ్యం బాగోలేని వారు ప్రైవేట్ అటెండెన్స్ సదుపాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు వ్యక్తులు తెలిపిన కారణాలను పరిశీలించిన సబ్ రిజిస్ట్రార్ సంతృప్తి చెందితే ఒక్కో రిజిస్ట్రేషన్‌కు అదనంగా రూ.500 ఫీజుతో ప్రైవేట్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్‌కు వెళ్లవచ్చు. నాడు మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకొని ఇలాగే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. సదరు సబ్ రిజిస్ట్రార్ పదవీ విరమణ చేసినప్పటికీ జయలలిత ఆస్తుల కేసు విచారణ సమయంలో పలుమార్లు సీబీఐ, న్యాయస్థానాల ఎదుట హాజరైనట్లు తెలిసింది. -
రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఏడాది స్థిరాస్తి లావాదేవీలు కాసుల పంట కురిపిస్తున్నాయి. గత మాసం నుంచి పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత మేరకు పడినప్పటికీ గతేడాదితో పోలిస్తే ఆదాయం బాగానే సమకూరినట్లు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఎనిమిది నెలల పరిస్థితిని పరిశీలిస్తే,, రాష్ట్రం మొత్తం మీద రూ.2534.01 కోట్లు ఆదాయం రాగా కేవలం గ్రేటర్ పరిధి నుంచే దాదాపు రూ.1828.6 కోట్లు సమకూరింది. అదేవిధంగా మొత్తం 7,53,373 స్థిరాస్తి లావాదేవీలు జరగగా అందులో 2,58,678 దస్తావేజులు గ్రేటర్ పరిధిలోనే నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రంగారెడ్డి 31.23 శాతం, మేడ్చల్ 38.43 శాతం, హైదాబాద్ (సౌత్) 18.90 శాతం, హైదరాబాద్ 40.08 శాతం ఆదాయం అదనంగా పెరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా గ్రేటర్లో గత రెండేళ్ల క్రితం వరకు స్థిరాస్తి రంగంపై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోయింది. తాజాగా కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు. కార్పొరేట్ సంస్థలు. కంపెనీలు. కార్యాలయాలు తరలి రావడం స్థిరాస్తి రంగానికి మరింత కలిసి వచ్చినట్లయింది. తాజాగా నగర శివారులో శంషాబాద్(రంగారెడ్డి), మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లా కేంద్రాల ఏర్పాటు కావడంతో ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్, కీసర, నాగారం, షామీర్పేట, మేడ్చల్, మహేశ్వరం, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. గ్రేటర్లో నాలుగు రిజిస్ట్రేషన్ జిల్లాలు. జిల్లాల పునర్విభజన అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు జిల్లాలుగా అవతరించింది. హైదరాబాద్ నగరంలోని రెండు రిజిస్ట్రేషన్ సర్కిళ్లు యథాతథంగా ఉండగా, రంగారెడ్డి ఈస్ట్ మేడ్చల్ కొత్తగా రూపుదిద్దుకున్నాయి. వాస్తవానికి గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్ రిజిస్ట్రేషన్ సర్కిళ్లుగా విభజించింది. తాజాగా రంగారెడ్డి రిజిస్ట్రేషన్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డి, వికారాబాద్ రెవెన్యూ జిల్లాలను చేర్చింది. ఈస్ట్‌ను మేడ్చల్ జిల్లాగా నామకరణం చేసింది. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ పరిధులలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. రంగారెడ్డి రిజిస్ట్రేషన్ పరిధిలోని కూకట్పల్లి, బాలనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, వల్లభానగర్ సబ్ రిజిస్ట్రార్లను మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోకి చేర్చారు. రంగారెడ్డి ఈస్ట్‌లోని అబుల్లాపూర్మెట్, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చంపాపేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్లలను రంగారెడ్డి రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోకి చేర్చారు. -
‘స్వైపింగ్’తో లబ్ధి కొంతే
సర్కార్ నగదు రహిత లావాదేవీలపై రిజిస్ట్రేషన్ల శాఖ అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్వైపింగ్ మెషిన్ల (డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు వీలు కల్పించే పరిక రాలు)ను ప్రవేశపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు స్వల్పమేనని ఉన్నతాధికారు లు భావిస్తున్నారు. నగదు రహిత లావా దేవీలను అమల్లోకి తెచ్చేందుకు స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అధికారులు మంగళ వారం కసరత్తు చేశారు. ఇటీవలే ప్రవేశపె ట్టిన ఈ-స్టాంప్స్, ఈ-చలాన్ల పనితీరు ప్రయోజనకరంగా ఉన్నందున ఇప్పటికి ప్పుడు స్వైపింగ్ మెషిన్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నా రు. పైగా స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులు చేయడం వల్ల సర్వీస్ చార్జి కింద వినియోగ దారులే ఎక్కువ సొమ్మును నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. నగదు చెల్లింపుల ద్వారా ఏటా రూ. 25 కోట్లకన్నా తక్కువ ఆదాయం వచ్చే లావాదేవీల కోసం స్వైపింగ్ యంత్రా లను భారీగా కొనుగోలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమో ఉన్నతాధి కారులు పరిశీలించాలని కోరుతున్నారు. ఏదేమైనా ‘స్వైపింగ్’ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆదేశాలు అందనందున తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా వచ్చే సుమారు రూ. 4 వేల కోట్ల వార్షికాదాయంలో అధిక భాగం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనే సమకూరుతుంది. తగ్గుముఖం పట్టిన లావాదేవీలు.. పాత నోట్లతో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల చెల్లింపునకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 24తో ముగియడంతో గత 4 రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు తగ్గుముఖం పట్టారుు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24న 5,422 లావాదేవీలు జరగ్గా మంగళవారం నాటికి రోజువారీ లావాదేవీ లు 1,805 పడిపోయారుు. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ నెల 24న రూ. 25 కోట్లు రాగా మంగళవారం నాటికి రూ.7 కోట్లకు తగ్గింది. -
రిజిస్ట్రేషన్ల శాఖకు పెరిగిన రాబడి
-
రిజిస్ట్రేషన్ల శాఖకు పెరిగిన రాబడి
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.వెరుు్య నోట్లతో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 24 వరకు వెసులుబాటు కల్పించిన ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి గణనీయంగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా తగ్గిపోయారుు. వినియోగదారులు అప్పటికే కొనుగోలు చేసిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవడం పైనా నోట్ల రద్దు ప్రభావం చూపింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పన్ను చెల్లింపు పరిధిలోకే వస్తున్నందున పాత నోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 వరకు వెసులుబాటు కల్పించింది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు పెరిగి రోజువారీ రాబడి పెరిగింది. కాగా, కొన్ని రకాల పన్నులను పాత నోట్లతోనే చెల్లించేందుకు కేంద్రం డిసెంబర్ 15 వరకు వెసులుబాటు కల్పించగా రిజిస్ట్రేషన్లకు వర్తింప జేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలే దని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు పంచాయ తీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
రిజిస్ట్రేషన్ల శాఖకు ఆధునిక సాంకేతికత
- కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకానికి సన్నాహాలు - విప్రో, టీసీఎస్, హెచ్‌పీ సంస్థలతో అధికారుల సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, సాంపుల శాఖ సరికొత్త హంగులను సంతరించుకోబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత కంప్యూటర్ వ్యవస్థకు బదులుగా ఆధునిక సాంకేతికత కలిగిన సిస్టమ్‌లు, ఇతర సామగ్రిన త్వరలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రాబోతున్నారుు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్, 12 జిల్లా రిజిస్ట్రార్, 12 ఆడిట్ రిజిస్ట్రార్, 14 చిట్ రిజిస్ట్రార్, 9 డీఐజీ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ కంప్యూటర్ వ్యవస్థలను సమూలంగా మార్చాలని, ఈ మేరకు కొత్త ఫెసిలిటేటర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్‌గా ప్రభుత్వం నియమించిన టీసీఎస్ సంస్థకు కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. దీంతో టీసీఎస్ తమ సిబ్బందిని, సాఫ్ట్వేర్ వ్యవస్థలను వెనక్కి తీసుకోవడంతో రెండు, మూడు నెలలుగా క్షేత్ర స్థారుులో సాంకేతిక సమస్యలు వెల్లువెత్తారుు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతుండడం, వినియోగదారుల నుంచి పెద్దెత్తున ఫిర్యాదులు రావడంతో కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకంపై సర్కారు దృష్టి సారించింది. కొత్త ఎఫ్ఎంతో ఆధునిక టెక్నాలజీ శాఖ సాంకేతిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన సాంకేతికత కలిగిన కొత్తఫెసిలిటీ మేనేజర్ ఎంపికకు అధికారులు కసరత్తు ప్రారం భించారు. ఇప్పటికే విప్రో, టీసీఎస్, హెచ్‌పీ వంటి సంస్థలతో సంప్రదింపులు పూర్తరుునట్లు తెలిసింది. ఐదేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలను కొత్త ఎఫ్ఎంకు అప్పగించేందుకు టెండర్ ప్రక్రియకు పోవాలని అధికారులు నిర్ణరుుంచారు. నెలాఖరు లోగా టెండర్ ప్రక్రియను పూర్తిచేసి వచ్చే డిసెంబరు లేదా జనవరి నుంచి కొత్త ఎఫ్ఎం సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నా రు. దీంతో పాటు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాలకు స్టేట్ డేటా సెంటర్లో సేవలందిస్తున్న సర్వర్ స్థానం లో తెలంగాణకు ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసు కోవాలని కూడా యోచిస్తున్నారు. ఈ నేపథ్యలో వచ్చే ఐదేళ్ల కాలానికి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వ్యయమతుందని శాఖ అంచనాలను సిద్ధం చేసింది. -
15 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సేవలు
► రిజిస్ట్రేషన్ల శాఖకు టీసీఎస్ స్పష్టీకరణ ► 100 మందికిపైగా ► ఇంజనీర్ల ఉపసంహరణ ఆన్లైన్ సేవలపై ప్రభావం సాక్షి, హైదరాబాద్: తమకు రావాల్సిన రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించే వరకు రిజిస్ట్రేషన్ల శాఖలో సాంకేతిక సేవలను కొనసాగించే ప్రసక్తే లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్ (ఎఫ్ఎం)గా కుదిరిన కాంట్రాక్టు ఆగస్టు 18నే ముగియడంతో అప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 100 మందికిపైగా సర్వీస్ ఇంజనీర్లను వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆన్లైన్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ టీసీఎస్ అధికారులను పిలిచి మాట్లాడినా బకాయిలు చెల్లించే వరకు సేవలను పునరుద్ధరించేది లేదని ఆ సంస్థ పేర్కొన్నట్లు తెలిసింది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ల శాఖలో రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించలేని దుస్థితి నెలకొనడంపై ఆ శాఖ సిబ్బంది కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఎం నియామకంలో ఐటీశాఖ జాప్యం! ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కాలానికి 2011లో అప్పటి ప్రభుత్వం టీసీఎస్‌ను రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్ (టెక్నికల్)గా నియమించింది. గడువుకు మూడు నెలల ముందుగానే కొత్త ఎఫ్ఎం నియామక ప్రక్రియను ఉన్నతాధికారులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ మేరకు ప్రయత్నాలేమీ జరిగినట్లు కనిపించడం లేదు. కొత్త ఎఫ్ఎం నియామకం కోసం టెండర్లు పిలవాలని ఐటీశాఖను రిజిస్ట్రేషన్ల శాఖ విన్నవించినా ఆ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని సమాచారం. సర్వర్ సమస్యలతో సతమతం ఎఫ్ఎం సాంకేతిక సేవలు నిలిచిపోవడంతో నెలరోజులుగా క్షేత్రస్థాయిలో నిరంతరం సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు రిజిస్ట్రేషన్ల శాఖను పట్టిపీడిస్తున్నాయి. పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ... సాంకేతిక సమస్యల కారణంగా గంటలకొద్దీ సమయం తీసుకుంటోంది. సాధారణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 30 నుంచి 50 డాక్యుమెంట్లు, నగరాల్లోనైతే రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్ల దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయని... సాంకేతిక సమస్యలతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు. -
త్వరలో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ!
- స్పెషల్ సీఎస్ నుంచి డిప్యూటీ సీఎంకు ఫైలు - నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలును ఉన్నతాధికారులు శుక్రవారం ఎట్టకేలకు కదిలించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకం చేయడంతో ఫైలు అక్కడ్నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఉప ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం శనివారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్‌ల కోసం వేచిచూస్తున్న జిల్లా రిజిస్ట్రార్లలో కొందరు తమకు నచ్చిన చోట పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటివరకు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కార్యాలయం పరిధిలోనే ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌లు దక్కించుకోవాలని ఒకరిద్దరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 23 డీఆర్ పోస్టులుండగా అందులో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు రెగ్యులర్ డీఆర్‌ల స్థానంలోనూ ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ జిల్లా రిజిస్ట్రార్ హోదా కలిగిన అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ పోస్టులను ప్రభుత్వం రెండేళ్లుగా భర్తీ చేయలేదు. -
రిజిస్ట్రేషన్ జిల్లాల విభజన కొలిక్కి
స్వల్ప మార్పులతో ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రెవెన్యూ జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ల జిల్లాల సంఖ్యను కూడా పెంచాలని సర్కారు తొలుత భావించినా.. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆ ప్రతిపాదనను విరమించుకుంది. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ల జిల్లాల సంఖ్య యథాతథంగా ఉం చినప్పటికీ.. ఆయా రిజిస్ట్రేషన్ల జిల్లాల పరి ధులు, పేర్లు, జిల్లా కేంద్రాల్లో కొద్దిపాటి మార్పులు చేసింది. ఈమేరకు రెవెన్యూ(రిజిస్ట్రేషన్ల) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఇవీ మార్పులు.. ప్రస్తుతం రంగారెడ్డి ఈస్ట్ పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్ జిల్లాను మేడ్చల్-మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాగా మార్చింది. గతంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆ జిల్లాలను రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్ జిల్లాలుగా విభజించింది. అయితే ప్రతిపాదిత శంషాబాద్ జిల్లా పేరును రంగారెడ్డి జిల్లాగా ప్రభుత్వం మార్చడంతో.. రంగారెడ్డి ఈస్ట్ జిల్లాను అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భావించారు. పాత రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ప్రత్యేక రిజిస్ట్రేషన్ జిల్లాగా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ రెవెన్యూ జిల్లాలను కలుపుతూ మరో రిజిస్ట్రేషన్ జిల్లా ఏర్పాటు చేయాలన్న కమిషనర్ అండ్ఐజీ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే పాత మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాగా ఏర్పడినప్పటికీ మెదక్ రిజిస్ట్రేషన్ జిల్లాను సంగారెడ్డి కేంద్రంగానే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం సొసైటీల రిజిస్ట్రేషన్లపై జిల్లా రిజిస్ట్రార్లకు అధికారాలు కల్పిస్తూ మరో ఉత్తర్వునిచ్చింది. కమిషనర్ ప్రతిపాదనల మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్,అదనపు రిజిస్ట్రార్,జాయింట్ రిజి స్ట్రార్,డిప్యూటీ రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ నియామకాలకు అంగీకారం తెలుపుతూ మరో ఉత్తర్వు ఇచ్చింది. -
రిజిస్ట్రేషన్ శాఖలో నోడల్ వ్యవస్థ
• జిల్లా పాలనలో సహకరించేందుకు ప్రత్యేక ఏర్పాటు • {పస్తుతమున్న 12 రిజిస్ట్రేషన్ జిల్లాలే కొనసాగింపు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో కొత్తగా నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణతో ఏర్పాటవుతున్న రెవెన్యూ జిల్లాల కంటే రిజిస్ట్రేషన్ జిల్లాల సంఖ్య తక్కువగా ఉన్నందున... జిల్లా పాలనా యంత్రాంగానికి శాఖాపరంగా సహకరించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెవెన్యూ జిల్లాలతో పాటు రిజిస్ట్రేషన్ జిల్లాలను కూడా పెంచాలని ప్రభుత్వం తొలుత భావించినా.. దానివల్ల వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం, గ్రూప్-1 అధికారుల సంఘం, టీఎన్జీవోల సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్ జిల్లాల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. అయితే జిల్లాల పాలనా యంత్రాంగానికి (జిల్లా కలెక్టర్‌కు) సహకరించేందుకు సదరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్‌ను నోడల్ అధికారిగా నియమించనున్నారు. రెండేళ్లకోసారి భూముల మార్కెట్ విలువ సవరణ, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ నోడల్ అధికారే జిల్లా రిజిస్ట్రార్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్కెట్ విలువ సవరణ సమయంలో తహసీల్దార్లు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లతో సమన్వయంగా వ్యవహరించేందుకు నోడల్ వ్యవస్థ తప్పనిసరని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జిల్లాలు 12గానే (హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్లతోపాటు ప్రస్తుతమున్న మిగతా 8 జిల్లాలు) ఉండనున్నాయి. రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ జిల్లాలు రిజిస్ట్రేషన్ జిల్లా ప్రతిపాదిత రెవెన్యూ జిల్లాలు రంగారెడ్డి శంషాబాద్ రంగారెడ్డి ఈస్ట్ వికారాబాద్, మేడ్చల్ నల్లగొండ సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ మెదక్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్,వనపర్తి, గద్వాల వరంగల్ వరంగల్, వరంగల్ రూరల్,భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్ ఖమ్మం కొత్తగూడెం (భద్రాద్రి), ఖమ్మం నిజామాబాద్ నిజామాబాద్, కామారెడ్డి ఆదిలాబాద్ ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ (కొమురం భీం), నిర్మల్ కరీంనగర్ కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి హైదరాబాద్ హైదరాబాద్ (పాక్షికం) హైదరాబాద్ సౌత్ హైదరాబాద్ (పాక్షికం) -
పుష్కలంగా రెవెన్యూ స్టాంపులు
* 8.28 కోట్ల స్టాంపులను సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ * పోస్టాఫీసులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ అమ్మకాలు * బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని స్టాం పుల ముద్రణాలయం నుంచి 8.28 కోట్ల రెవెన్యూ స్టాంపులను కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 4 కోట్ల మేర స్టాంపులను మంగళవారం పోస్టల్ శాఖకు అందజేయనున్నట్లు రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు తెలి పారు. వాస్తవానికి రెవెన్యూ స్టాంపులను విక్రయించే పోస్టల్ సిబ్బంది సకాలంలో రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం అందించకపోవడమే రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడడానికి కార ణంగా తెలుస్తోంది. రెండు నెలలుగా అన్ని జిల్లాల్లోనూ రెవెన్యూ స్టాంపులు లభించక వినియోగదారులు ఒక రూపాయి విలువైన స్టాంపును బ్లాక్ మార్కెట్లో రూ.5లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ స్టాంపుల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకోసం అన్ని జిల్లాల్లో వినియోగదారులకు స్టాంపులను పుష్కలంగా అందుబాట్లో ఉంచాలని రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోస్టల్‌శాఖ పరిధిలోని అన్ని పోస్టాఫీసులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రెవెన్యూ స్టాంపులను వినియోగదారులకు అందుబాట్లో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంతో పాటు స్టాంపులను బ్లాక్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రూ.5వేలకు పైగా విలువైన చెల్లింపు రశీదులకు, ప్రామిసరీ నోటులకు తప్పనిసరిగా ఒక రూపాయి రెవెన్యూ స్టాంపు అవసరమౌతోంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ చట్టం ప్రకారం ఆయా లావాదేవీలకు ఒక రూపాయి స్టాంప్‌డ్యూటీ చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రూపాయి రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చేసిన డాక్యుమెంట్లనే న్యాయస్థానం సరైన(వ్యాలిడ్) పత్రాలుగా భావిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు బ్యాంకుల నుంచి, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి అప్పులు పొందేందుకు కూడా రెవెన్యూ స్టాంపుల అవసరమేర్పడింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లశాఖ రెవెన్యూ స్టాంపులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తుండడంతో ఒకట్రెండు రోజుల్లోనే స్టాంపుల బ్లాక్ మార్కెట్‌కు తెరపడనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే రెవెన్యూ స్టాంపులతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపులను కూడా మార్కె ట్లో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ఎంత విలువైన స్టాంపులనైనా వినియోగదారులు బ్లాక్మార్కెట్లో కొనే అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ల శాఖలో ఆ జిల్లాలే కీలకం!
- లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు,రూ. వందల కోట్లలో ఆదాయం - హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరి జిల్లాలపైనే అందరి దృష్టి - ఆయా జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల కోసం జోరందుకున్న పైరవీలు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి మూడు జిల్లాలు కీలకం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖకు వచ్చే వార్షికాదాయంలో 75 శాతం ఈ మూడు జిల్లాల నుంచే వస్తుండటంతో ఆయా జిల్లాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిలాల్లోనే అత్యధికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఆయా జిల్లాల పరిధిలో విలువైన భూములు ఉండటం, క్రయ విక్రయాలు అధికంగా జరుగుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది. ఏటా సుమారు లక్షదాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ప్రభుత్వానికి రూ.వేల కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 27 రెవెన్యూ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి 27మంది జిల్లా రిజిస్ట్రార్లను నియమించాల్సి ఉండగా, కీలకమైన మూడు జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టులపైనే అందరి దృష్టి పడింది. పోస్టింగుల కోసం పైరవీల జోరు కొత్త జిల్లాల్లో పరిపాలనకు డెడ్‌లైన్ కూడా ఖరారు కావడంతో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న వారితో పాటు తాజాగా పదోన్నతుల జాబితాలో ఉన్న గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లు కూడా పోటీ పడుతున్నారు. అయితే.. ప్రతిపాదిత హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిల్లాల రిజిస్ట్రార్ కుర్చీలపై రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం కీలకంగా ఉన్న హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి వెస్ట్, రంగారెడ్డి ఈస్ట్ జిల్లాల్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు తమ కర్చిఫ్లు వేసేశారని, ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నతాధికారుల ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నందున వీరికి కాకుండా మరొకరికి పోస్టింగులు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రయత్నిస్తే పోయిదేముందిలేనని కొందరు గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లు కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చే పక్షంలో కనిష్టంగా రూ.50 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి ముట్టజెప్పేందుకు ఐదారుగురు అధికారులు తమకు అనుకూలురైన వ్యక్తుల వద్ద సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ రిజిస్ట్రేషన్ జిల్లాలకు మినహా మిగిలిన జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను పిలిచి ఊరికే ఇచ్చినా వెళ్లేందుకు అర్హులైన అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. 16 జిల్లాల ప్రతిపాదన అటకెక్కినట్లే! రెవెన్యూ జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ జిల్లాలను పెంచవద్దని, ఒకవేళ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ జిల్లాలను కూడా పెంచాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 12 జిల్లాలను 16 జిల్లాలుగా చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ చేసిన ప్రతిపాదనలు తాజాగా అటకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నతస్థాయిలో 27 జిల్లాల ఏర్పాటు నిర్ణయం జరిగిపోయాక కొత్తగా ప్రతిపాదనలను పరిశీలించే పరిస్థితి లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు జేఏసీ ప్రతినిధులకు నర్మగర్భంగా చెప్పారని కొందరు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
రిజిస్ట్రార్ కార్యాలయాల కుదింపునకు రంగం సిద్ధం..!
15 నుంచి 5కు తగ్గనున్న కార్యాలయాలు అగమ్యగోచరంలో 450 కుటుంబాలు ‘ప్రైవేటు’గా రిజిస్ట్రార్ కార్యాలయ పనులు! అయినవారికి కట్టబెట్టేందుకు టీడీపీ నేతల సన్నాహాలు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ శాఖపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ శాఖ పనులన్నీ తమకు అనుకూలమైన ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థకు కట్టబెట్టెందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ సంస్థ సూచనల మేరకు జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 5కు కుదించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కంప్యూటీరీకరణ చేస్తున్నామంటూ బయటకు ప్రచారం చేస్తూనే పనులన్నీ సంస్థకు అప్పగించి నెలనెలా ముడుపులు అందుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. నేతల ధన దాహానికి జిల్లాలోని వందలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్ల ఉన్నాయి. వీటిలో ఒక్కో డివిజన్లో ఐదేసి చొప్పున రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని కార్యాలయాల నుంచి ఆదాయం అధికంగానే వస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కరే డీఐజీగా పని చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. కొత్తగా రిజిస్ట్రార్ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కార్పొరేట్ సంస్థ సూచనల మేరకు కార్యాలయాలను ఐదుకు తగ్గించి శ్రీకాకుళం డివిజన్లో రెండు, టెక్కలిలో ఒకటి, పాలకొండలో ఒకటి, ఇచ్ఛాపురంలో ఒకటి పెట్టేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రైవేటు’ వ్యక్తుల ఆదాయార్జనకే కార్యాలయాలన్నీ ఒక చోటకు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు పరిస్థితి ప్రశ్నార్థకం.. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స»Œ æరిజిస్ట్రార్‌తో పాటు మరో 6 నుంచి 8 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అంతే కాకుండా జిల్లా కేంద్రం రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఎస్టాబ్లిస్‌మెంట్ సిబ్బంది, వీరితో ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 20 మందికి పైమాటే. కార్యాలయాలు కుదిస్తే ఉద్యోగులు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖను అప్పగించిన ప్రైవేటు కంపెనీకి సంబంధించిన వ్యక్తులను నియమిస్తారని బోగట్టా. అందోళనలో డాక్యుమెంట రైటర్లు గత కొన్నేళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటీకరణ, కార్యాలయాల కుదింపును వ్యతిరేకిస్తున్నారు. ఉపాధి కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 450 కుటుంబాలకు పైబడి ఈ వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామని, నోటికాడ కూడు తీసేయొద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. ఉసురు తీయొద్దు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలొకి వచ్చాక ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఉద్యోగులను ఊడదీయడం సరికాదు. నిరుద్యోగుల ఉసురు తీయొద్దు. ఏళ్ల తరబడి ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం. రిజిస్ట్రార్ కార్యాలయాలను కుదించి రైటర్ల బతుకులు రోడ్డున పడేయకండి. మాతో పాటు మా మీద ఆధారపడి బతుకుతున్న వారంతా నాశనమయిపోతారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇవ్వండి. అందరినీ తొలగించి ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు కట్టబెట్టడం సరికాదు. రైటర్ల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం విరమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. –బలగ పెంటయ్య, దస్తావేజు లేఖరుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదేశాలు రాలేదు... జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను బ్యాక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ విధానంలో కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారికంగా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే తప్ప స్పష్టత రాదు. – కె.నాగమణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ -
రిజిస్ట్రేషన్ల శాఖ షట్‌డౌన్!
గత నెల 18తో ముగిసిన టీసీఎస్ కాంట్రాక్ట్ సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో సాంకేతిక వ్యవస్థలన్నీ సంపూర్ణంగా బంద్ అయ్యాయి. సంస్థకు ఫెసిలిటీ మేనేజర్‌గా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడమే కారణంగా తెలుస్తోంది. గతనెల 18న గడువు ముగియనుందని తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆ శాఖ ఉన్నతాధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ దృష్టి సారించకపోవడం విచారకరం. కాంట్రాక్ట్ గడువు ముగిసినందున రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న తమ సర్వీస్ ఇంజనీర్లను టీసీఎస్ వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రంలో ఆన్లైన్ సేవలకు ఆటంకం ఏర్పడింది. కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకానికి టెండర్లు పిలవాలని రాష్ట్ర ఐటీ శాఖను రిజిస్ట్రేషన్ల శాఖ విన్నవించినా, వారు పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటికీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రత్యేక సర్వర్ లేదు. ఉమ్మడిగానే సర్వర్‌ను, ఇంటర్నెట్ కోసం స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్(స్వాన్)ను వినియోగిస్తున్నారు. సర్వర్లకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేయా లని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు నుంచి స్పందన లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. -
శాఖల స్వరూపం ఇలా..
- ప్రభుత్వానికి చేరిన తుది ప్రతిపాదనలు - ‘సంక్షేమం’పై కొనసాగుతున్న సందిగ్ధత కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది.. మరి ప్రభుత్వ శాఖల స్వరూపం ఎలా ఉండబోతోంది..? ఏయే మార్పులు చేయబోతున్నారు..? వేటిని విలీనం చేయబోతున్నారు..? వీటిపై ఆయా శాఖలు ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించాయి. ఆ వివరాలు శాఖల వారీగా ఓసారి చూద్దాం.. - సాక్షి, హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి..ఒకే కమిషనర్ కిందకు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విలీనమవుతుండడంతో ఇకపై ఈ సంస్థలన్నీ ఒకే కమిషనర్ కింద పనిచేస్తాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా స్థాయి హెడ్లుగా వ్యవహరిస్తారు. మిషన్ భగీరథ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆర్టీసీ.. 18 మంది డివిజినల్ మేనేజర్లు.. 27 జిల్లాలను 18 మంది డివిజినల్ మేనేజర్లు పర్యవేక్షిస్తారు. విస్తీర్ణం, డిపోల సంఖ్య ఆధారంగా పెద్ద జిల్లాలకు ఒక డివిజినల్ మేనేజర్, చిన్నవైతే రెండిటికి కలిపి ఒకరు చొప్పున ఉంటారు. ఆదిలాబాద్, నిర్మల్‌కు సంబంధించి నిర్మల్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లికి కలిపి కరీంనగర్లో, వరంగల్, భూపాలపల్లికి కలిపి వరంగల్‌లో, హన్మకొండ, మహబూబాబాద్‌కు కలిపి హన్మకొండలో, మహబూబ్‌నగర్, వనపర్తికి కలిపి మహబూబ్‌నగర్‌లో, నల్లగొండ, సూర్యాపేటకి కలిపి నల్లగొండలో, మెదక్, సంగారెడ్డికి కలిపి సంగారెడ్డిలో, హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరిలకు హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాలుంటాయి. రిజిస్ట్రేషన్ల శాఖ పనిభారం మేరకు ఉద్యోగుల కేటాయింపు ఉండనుంది. ప్రస్తుతం 12 మంది జిల్లా రిజిస్ట్రార్లు ఉండగా, మిగిలిన 15 పోస్టుల్లో సీనియర్ సబ్ రిజిస్ట్రార్లను డీఆర్లుగా నియమించనున్నారు. పంచాయతీరాజ్.. రాష్ట్రంలో కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటవుతున్నందున ప్రస్తుతం ఉన్న ఎంపీడీవోలనే కొత్త మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. వేర్వేరు మండలాల్లోని గ్రామాలతో ఏర్పాటవుతున్న 10 నుంచి 12 మండలాలకు ఒక ఓఎస్డీని నియమించనున్నారు. వాణిజ్య పన్నులు కొన్ని జిల్లాల సర్కిల్ పరిధిలో మార్పు చేర్పులు జరుగుతాయి. జనగామలోని కేంద్ర కార్యాలయాన్ని యాదాద్రి జిల్లా కేంద్రానికి మారుస్తారు. భూపాలపల్లి, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లలో సీటీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఉప్పల్‌లో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో ఇక డీఐఈవో.. ఇన్నాళ్లూ జిల్లా ఇంటర్మీడియట్ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవీఈవో), ఇంటర్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐవో) వ్యవస్థ ఉండేది. ఇకపై ఇది రద్దు కానుంది. కొత్త జిల్లాల్లో ఈ రెండింటిని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) పేరుతో కొత్త కేడర్‌ను సృష్టించి అమలు చేయనున్నారు. ఇక జిల్లాల్లో పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఇకపై జిల్లా విద్యాశాఖాధికారి వ్యవస్థ మాత్రమే ఉండనుంది. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ (డీపీవో) వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపాదించారు. విద్యుత్.. కొత్త జిల్లాల్లో డిస్కంల జిల్లాధికారులుగా డివిజ నల్ ఇంజనీర్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పరిధిలోని 12 సర్కిల్ కార్యాలయాల సూపరింటెండెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో కొత్త జిల్లాల డీఈలు పనిచేయనున్నారు. జెన్కో, ట్రాన్స్‌కో, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, నెడ్‌క్యాప్, సింగరేణి సంస్థలపై కొత్త జిల్లాల ప్రభావం ఏమీ లేదు. రెవెన్యూలో సెక్షన్ల కుదింపు కలెక్టరేట్లలో ఇప్పటి వరకు ఎనిమిది సెక్షన్లు ఉండగా వాటిని ఆరుకు కుదిస్తారు. గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు. రోడ్లు భవనాలు రెండు మూడు జిల్లాలను ఓ సర్కిల్‌గా చేసి ప్రతి సర్కిల్‌కు ఒక ఎస్ఈని కేటాయిస్తారు. ఉద్యాన, పట్టు పరిశ్రమల విలీనం జిల్లా స్థాయిలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారు. వీటన్నింటికీ కలిపి జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) నేతృత్వం వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల డిప్యూటీ డెరైక్టర్లు, పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల స్థాయి అధికారులు డీఏవోలుగా ఉంటారు. ‘సంక్షేమం’ ఏం చేస్తారో..? సంక్షేమ శాఖల విలీన ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ తుది ప్రతిపాదనలను అందజేయగా, సంక్షేమ శాఖల నుంచి మాత్రం మూడు ప్రతిపాదనలు అందాయి. అవేంటంటే.. 1. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన వివిధ విభాగాలను వాటి మాతృశాఖలో కలిపేయడం. 2. రెండు శాఖలు విలీనమైతే... ► బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విలీనం ► ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమాలు విలీనం ► ఇతర సంక్షేమ శాఖలన్నీ ఒకటవుతాయి 3. అన్ని శాఖలు విలీనమైతే... ► జిల్లా మొత్తానికి ఒకే సంక్షేమ అధికారి ఉంటారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో సహాయ సంక్షేమ అధికారులుగా ఉన్న వారే జిల్లా సంక్షేమ అధికారులుగా కొనసాగుతారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుత జిల్లాలకు డీఎం హెచ్వోలే అధిపతులుగా కొనసాగుతారు. కొత్తగా వచ్చే 17 జిల్లాలకు మాత్రం అడిషనల్ డీఎంహెచ్వోలు, ఏడీఎంహెచ్‌వో(పీహెచ్)లు డీఎంహెచ్‌వోలుగా నియమితులవుతారు. -
రిజిస్ట్రేషన్ల శాఖకు ‘కొత్త’ గందరగోళం!
- ఆదాయం లేకున్నా కొత్త జిల్లాలకు విభాగాలు ఎందుకంటున్న అధికారులు - ఆదాయం, పనిభారమే కొలమానమంటున్న రిజిస్ట్రేషన్ల చట్టం - ఆడిట్ రిజిస్ట్రార్లను తొలగించవద్దని సర్కారుకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ రిజిస్ట్రేషన్ల శాఖను గందరగోళంలో పడేసింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 10 జిల్లాలను 27 జిల్లాలుగా విభజిస్తున్న విషయం తెలిసిందే. ఇది పాలనాపరంగా, భౌగోళికంగా ప్రజలకు సౌలభ్యమే అయినా.. రిజిస్ట్రేషన్ జిల్లాల విభజన మాత్రం ఆదాయపరంగా ఆమోదయోగ్యం కాదని ఆ శాఖ యంత్రాంగం చెబుతోంది. కొత్తగా ప్రతిపాదించిన కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఆదాయం చాలా స్వల్పమని.. అటువంటి చోట ప్రత్యేకంగా జిల్లా శాఖను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం తలకు మించిన భారమని స్పష్టం చేస్తోంది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య, రిజిస్ట్రేషన్ల శాఖలను పాలనాపరమైన జిల్లాలతో ముడిపెట్టకుండా.. ప్రత్యేకంగా చూడాలని అధికారులు పేర్కొంటున్నారు. జీతాల వ్యయమూ రాదు! వాస్తవానికి పాలనాపరమైన జిల్లాలు, రిజిస్ట్రేషన్ల జిల్లాలు ఒకేలా ఉండాల్సిన పనిలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వస్తే... ఆయా జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం, పనిభారాన్నే (రిజిస్ట్రేషన్లు) కొలమానంగా తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల చట్టం చెబుతోంది. కానీ పాలనా సౌలభ్యం కోసం ప్రతిపాదించిన జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ల జిల్లాలను విభజించాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. ఆ శాఖ ఉన్నతాధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రతిపాదిత 27 జిల్లాల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిల్లాలు మినహా మిగతా జిల్లాలను రిజిస్ట్రేషన్ జిల్లాలుగా ఏర్పాటు చేయడం ఆమోద యోగ్యం కాదని ఇటీవలి సమీక్షలో జిల్లా రిజిస్ట్రార్లు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. ‘జయశంకర్’ ఆదాయం నెలకు 11 లక్షలే! జయశంకర్ జిల్లాలో ఏడాది మొత్తానికి కలిపి రిజిస్ట్రేషన్ల సంఖ్య 1,700కు మించదని రిజిస్ట్రేషన్ల శాఖ పరిశీలనలో తేలింది. ఈ కొత్త జిల్లా పరిధిలో ఒకే సబ్ రిజిస్ట్రార్(ములుగు) కార్యాలయం ఉంది. జిల్లా విభాగం ఏర్పాటు చేస్తే.. దీని నుంచి నెల నెలా వచ్చే ఆదాయం (సుమారు రూ.11లక్షలు) ఉద్యోగుల వేతనాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు. ఆడిట్ రిజిస్ట్రార్ లేకుంటే అంతే! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే సాధారణ, వివాహ రిజిస్ట్రేషన్లు, స్టాంపులు అమ్మకం, విదేశాల్లో ఉండే వారికి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ.. తదితర అంశాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఆడిట్ రిజిస్ట్రార్లు ఉన్నారు. అయితే జిల్లాల సంఖ్య పెరుగుతున్నందున ఆడిట్ రిజిస్ట్రార్ పోస్టులను తొలగించి.. వారిని జిల్లా రిజిస్ట్రార్లుగా పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే సరిగా ఆడిట్ జరగక అక్రమాలు పెరిగిపోయే అవకాశముంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెలంగాణ వచ్చినా అన్యాయమే: సబ్ రిజిస్ట్రార్ల సంఘం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రమేర్పడి రెండేళ్లయినా రిజిస్ట్రేషన్ల శాఖలో ఉద్యోగులకు, అధికారులకు పదోన్నతుల విషయమై ఇంకా అన్యాయమే జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం ఆరోపించింది. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 1,2 పోస్టుల్లో పదోన్నతి కోసం ఏటా ప్యానెల్స్‌ను రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేయాల్సి ఉండగా, అడిగితే తప్ప ఉన్నతాధికారులు ఏటా కనికరించడం లేదని సంఘం అధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2015-16 ప్యానెల్ గురించి చేసిన ప్రయత్నాలు ఫలించే సమయంలో విభాగాధిపతి సెలవుపై వెళ్లడంతో ఆశలు అడియాసలయ్యా యన్నారు. ఆగష్టు 31లోగా ప్యానెల్‌ను విడుదల చేయకుంటే, సెప్టెంబర్ 1నుంచి కొత్త ప్యానెల్ ఇయర్ ప్రారంభమై కొత్త జాబితా, పరిశీలన చేయాల్సి వస్తుందన్నారు. రెండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేక ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నా రు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వెంటనే చార్జిమెమోలు ఇస్తారని, ప్యానెల్ విడుదలలో నిర్లక్ష్యానికి ఎవరిపై చర్యలు తీసుకుంటారో ఉన్నతాధికారులు చెప్పాలన్నారు. -
భువనగిరిలో సిట్ విచారణ
-నయీమ్ అనుచరులు సన్నిహితులపై నజర్ -అదుపులోకి తీసుకుని విచారణ భువనగిరి గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సిట్ స్పందిస్తోంది. ఇందులో భాగంగా సిట్ అధికారుల బృందం గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్య వర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్‌లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్‌ను సిట్ అధికారులు విచారించారు. కాగా కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ కోసం తీసుకువచ్చిన వారిని కొందరిని విడిచిపెట్టగా మరికొందరిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. రిజిస్ట్రేషన్ అధికారిపై పెంచిన నిఘా భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నయీమ్‌కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ పరిశీలనలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ గుర్తించింది. -
జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యం రూ.750 కోట్లు
రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ సాయిప్రసాద్ రామచంద్రపురం : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యం రూ.750 కోట్లు అని ఆ శాఖ డీఐజీ ఎం.సాయిప్రసాద్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందరం్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గత ఏడాది ఆదాయ లక్ష్యం రూ.530 కోట్లు కాగా, అందులో 95 శాతం సాధించినట్టు వివరించారు. ఈ ఏడాది స్టాంప్ డ్యూటీ పెంచడం వల్ల 10 నుంచి 20 శాతం అధికంగా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేశామని చెప్పారు. గత ఏడాది ఆగస్టు నాటికి ఆదాయం లక్ష్యం రూ.115 కోట్లు కాగా, 87 శాతం రూ.103 కోట్లు వచ్చిందని, ఈ ఏడాదిలో ఆ లక్ష్యం రూ.255 కోట్లు కాగా, 77 శాతం రూ.197 కోట్లు లభించినట్టు వివరించారు. గత ఏడాది 40,500 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, ఈ ఏడాది 44 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. అర్బన్‌లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి స్టాంపు డ్యూటీలు పెంచుతున్నట్టు తెలిపారు. -
ఆ శాఖలో స్సందన కరువైతే ఏం చేశారో తెలుసా?
► రిజిస్ట్రేషన్ శాఖలో షిఫ్టు పద్ధతికి మంగళం! ► స్పందన లేకపోవడం వల్లే... త్వరలో నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో షిఫ్టు పద్దతికి త్వరలో మంగళం పాడేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సంస్కరణల్లో భాగంగా నగర పరిధిలో ప్రయోగాత్మకంగా రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో షిఫ్టు విధానం ప్రవేశపెట్టారు.అయితే ఊహించినంత స్పందన లేకుండా పోయింది. ఇప్పటికే ఇతర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు షిఫ్ట్ పద్ధతి విస్తరణ కార్యక్రమాన్ని విరమించుకోగా తాజాగా అమలవుతున్న ఆఫీసుల్లో సైతం నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహా నగరంలో స్థిరాస్తి రంగం ఊపందు కోవడంతో రిజిస్ట్రేషన్ శాఖకు పెరుగుతున్న దస్తావేజుల తాకిడిని అధిగమించేందుకు ఒకే జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని ఒకే ప్రాంతంలో దగ్గర దగ్గరగా గల రెండు వేర్వేరు కార్యాలయాలు వేర్వేరు సమయాల్లో రెండు షిఫ్టుల పద్ధతిలో పనిచేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయోగాత్మకంగా బోయిన్పల్లి–మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఎంపిక చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ఒక షిఫ్టులో ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మరొక షిఫ్టులో మరో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలు అందించే విధంగా నిర్ణయించారు. ఆయితే ఇతర రిజిస్ట్రార్ ఆఫీసులతో పోల్చితే పెద్దగా దస్తావేజుల నమోదుకు స్పందన కనిపించలేదు. అయినప్పటికీ ఉద్యోగులు, ఇతరత్రా పనుల్లో బీజీగా ఉండే వారికి వెసులుబాటుగా ఉంటుందని కొనసాగిస్తూ వచ్చారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. శివారు ప్రాంతంలో అధికంగా దస్తావేజులు నమోదవుతున్న చంపాపేట–సరూర్‌నగర్, కూకట్పల్లి–బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా షిఫ్టు పద్ధతి ప్రవేశపెట్టాలని పది నెలల క్రితం నిర్ణయించారు. కానీ ఆచరణలో ముందుకు వెళ్లలేదు. త్వరలో ప్రస్తుతం అమలవుతున్న రెండు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం నిర్ణయం తీసుకొని కొనసాగించాలా..? నిలిపివేయాలా? దానిపై నిర్ణయం తీసుకొనున్నారు. -
స్టాంప్‌డ్యూటీ హేతుబద్ధీకరణ!
సాక్షి, హైదరాబాద్ : రాబడి పెరుగుదలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వివిధ రకాల రిజిస్ట్రేషన్ల నిమిత్తం వసూలు చేసే స్టాంప్ డ్యూటీని హేతుబద్ధీకరిస్తేనే ఆదాయాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రధానంగా పార్టీషియన్ ఆఫ్ ప్రాపర్టీస్, మార్ట్గేజ్, హైపోథికేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, కంపెనీల ఇన్ కార్పొరేషన్ తదితర రిజిస్ట్రేషన్లకు స్టాంప్‌డ్యూటీ విలువపై 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.50 వేలు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. దీని వల్ల రూ.కోటి ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేలు చెల్లిస్తుండగా, రూ.100 కోట్ల ఆస్తికి కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తున్నారు. స్టాంప్‌డ్యూటీ గరిష్ట పరిమితి నిబంధన కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ నిబంధన వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే మేలు జరుగుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంటున్నారు. దీనికి బదులు ఆయా రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీని కొంతమేరకు తగ్గించి ఆస్తి విలువను బట్టి దాన్ని హేతుబద్ధీకరిస్తే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశముంద ని అభిప్రాయపడుతోంది. అలాగే, స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించి ప్రస్తుతం వసూలు చేస్తున్న స్టాంప్‌డ్యూటీ(6 శాతం)ని కూడా మరింత తగ్గించి, మార్కెట్ వ్యాల్యూని కొంత మేరకు పెంచినట్లయితే ఎక్కువమంది తమ ఆస్తులను అసలు విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. అసలు విలువకే రిజిస్ట్రేషన్లు జరిగిన పక్షంలో నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రెవెన్యూ లక్ష్యం రూ.4,291 కోట్లను చేరాలంటే స్టాంప్‌డ్యూటీ హేతుబద్ధీకరణ, మార్కెట్ విలువ పెంపు తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు లేనట్లే!
- రెవెన్యూ లక్ష్యాన్ని చేరాలంటే పెంచక తప్పదన్న రిజిస్ట్రేషన్ల శాఖ - రూ.400 కోట్ల పెంపు ప్రతిపాదనలను తోసిపుచ్చిన సర్కారు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఈ ఏడాదికి పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భూముల ధరలను సమీక్షించడం తప్పనిసరని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. అయితే, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చిన ధరల పెంపు ప్రతిపాదనలను సర్కారు తాజాగా తోసిపుచ్చిందని, ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరల పెంపు అంశం ప్రస్తుతానికి వాయిదా పడినట్లేనని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి రెండేళ్లకోసారి భూముల ధరలను రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షించాలి. 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం భూముల ధరలను సవరించింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడటం, మూడేళ్లుగా భూముల ధరల పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుండటం, వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తుండటం జరుగుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడం, మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా మార్కెట్ వాల్యూ మరింత తగ్గడం.. తదితర అంశాలు రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతియేటా రెవెన్యూ వసూళ్లకు సంబంధించి లక్ష్యాలను పెంచుతున్న సర్కారు ఆ మేరకు భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచకపోతే లక్ష్యాలను చేరుకోవడం ఎలాగంటూ.. ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ ఏడాది లక్ష్యం రూ. 4,291 కోట్లు రిజిస్ట్రేషన్ శాఖకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.4,291 కోట్ల రెవెన్యూ వసూలు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, వివిధ కారణాలతో నాలుగేళ్లుగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేక ఆ శాఖ ప్రతియేటా చతికిల పడుతోంది. ప్రతియేటా అంతకుముందు సంవత్సరం కంటే ఎంతోకొంత ఆదాయం పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది రూ.3,700 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,100 కోట్ల(83.78 శాతం) రెవెన్యూ రాబట్టిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు..అంతకుముందు ఏడాది ఆదాయం కన్నా 22.59 శాతం పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచిన పక్షంలో మరో రూ.400 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని, గతేడాది మాదిరిగా వార్షికాదాయంలో 23 శాతం పెరుగుదల కనిపించిన పక్షంలో మరో రూ.713 కోట్లు రావచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. మొత్తంగా రూ. 1,113 కోట్ల ఆదాయం అదనంగా లభించినట్లయితే ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావించారు. అయితే..రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సమర్పించిన ధరల పెంపు ప్రతిపాదనను సర్కారు తాజాగా తోసిపుచ్చడంతో ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడమెలాగని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెవెన్యూ ప్రాంగణాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు
- రాజస్థాన్ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం - అనువైన స్థలాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం - భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన పోలీస్ హౌసింగ్ బోర్డు సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల ప్రాంగణాల్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. వివిధ ఆస్తుల విక్రయాలకు సంబంధించి జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉన్నందున, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అవలంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే, సంబంధిత మండల తహశీల్దార్లతో చర్చించి ఆయా డాక్యుమెంట్లను, పాస్‌బుక్, టైటిల్డీడ్లను వెనువెంటనే తనిఖీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగనుందని చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తహశీల్దారు కార్యాలయాల ప్రాంగణాల్లో నిర్మించాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో స్థల సేకరణ నిమిత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేసన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ తాజాగా లేఖరాశారు. ఒకవేళ తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో స్థలం దొరకనట్లయితే, పరిసర ప్రాంతాల్లోనైనా అనువైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రెవెన్యూ ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసేలా స్థానికంగా ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్న తరుణంలో సదరు సమాచారాన్ని ఆన్లైన్లోనే తనిఖీ చేసే వీలున్నందున కార్యాలయాలు పక్కపక్కనే ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 460 రెవెన్యూ మండలాలు ఉండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 144 మాత్రమే ఉండడాన్ని మరో అడ్డంకిగా చూపుతున్నారు. పోలీస్ హౌసింగ్ బోర్డుకు నిర్మాణ బాధ్యతలు! రాష్ట్రవ్యాప్తంగా 87 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు విడతలుగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయించింది. తొలిదశలో 22 భవనాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టగా, అందులో ఇప్పటికి 5 భవనాలు పూర్తయ్యాయి. అయితే.. తరచుగా భవనాల డిజైన్లను ఉన్నతాధికారులు మార్చుతుండడం, మార్చిన డిజైన్లను సకాలంలో ప్రభుత్వం ఆమోదించకపోతుండడం ఫలితంగా.. ఇకపై భవన నిర్మాణాలను తాము చేయలేమంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఈ నే పథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) పిలవగా ఈడబ్ల్యుఐడీసీ, పోలీస్ హౌసింగ్ బోర్డు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో పోలీస్‌హౌసింగ్ బోర్డుకు నూతన భవనాల నిర్మాణ పనులను అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే.. నిర్మాణ వ్యయంలో 10 శాతం సొమ్మును ముందుగానే తమఖాతాలో జమ చేయాలంటూ సదరు నిర్మాణ సంస్థ షరతు పెట్టడం రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు మింగుడు పడని అంశంగా తయారైంది. ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. -
‘రిజిస్ట్రేషన్’ భవ నాలకు‘డిజైన్ల’ గండం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణ పనులకు డిజైన్ల గండం పట్టుకుంది. ఇప్పటికే టెండర్లు పూర్తయినా, పలు చోట్ల భవనాల నిర్మాణం ప్రారంభమైనా.. డిజైన్లు మార్చాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖే పనులు నిలిపివేసింది. డిజైన్లు మార్చినా ఆమోదించకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు మళ్లీ మరిన్ని మార్పులంటూ జాప్యం చేస్తోంది. అయితే ఈ ‘డిజైన్ల’ తంతు వెనుక తమ వారికే పనులు అప్పగించాలన్న ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాల నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఐడీసీ) ఈ తీరుతో విసుగెత్తిపోయింది. పనులను చేయలేమంటూ చేతులెత్తేసింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను సాగనివ్వనందున తమ ద్వారా టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారని, వెంటనే తిరిగి చెల్లించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. అసలేం జరిగింది..? రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సుమారు రూ.120కోట్లతో సొంత భవనాలను నిర్మించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వీటి నిర్మాణ బాధ్యతలను టీఎస్ఎంఐడీసీకి అప్పగించారు. తొలిదశలో ఇప్పటికే 7 భవనాల పనులు పూర్తికాగా, 10 భవనాల నిర్మాణం కొనసాగుతోంది. మరో ఐదు భవనాలకు స్థలం కేటాయింపు జరగక పనులు పెండింగ్‌లో పెట్టారు. రెండో దశలోని 39 భవనాలకు, మూడో దశలోని 26 భవనాల కోసం రూ.44.63కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. తేలని డిజైన్ల లొల్లి! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాల ‘పైకప్పు వాలుగా ఉండే’ డిజైన్లను గతేడాది సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం ఆమోదించగా... ఆ మేర కు టీఎస్ఎంఐడీసీ నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే పైకప్పు సమానంగా ఉండేలా డిజైన్లను మార్చాలని ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ మెలికపెట్టింది. దీంతో పైకప్పు వాలు డిజైన్‌కు బదులుగా చదరం (ఫ్లాట్) డిజైన్లను రూపొందించిన టీఎస్ఎంఐడీసీ వాటిని గత మార్చి 5న రిజి స్ట్రేషన్ల శాఖకు సమర్పించింది. దాదాపు రెండున్నర నెలల పాటు వాటిని పక్కన పెట్టి న రిజిస్ట్రేషన్ల శాఖ... వాటికి మరిన్ని మార్పులు చేయాలని తాజాగా సూచించింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పనులు చేసే వాతావరణం లేదని, తాము చెల్లించిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నారు. -
రెవెన్యూ పరిధిలోకి రిజిస్ట్రేషన్ల శాఖ
బీఆర్ మీనాకు బాధ్యతలు అప్పగింత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలూ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ముఖ్య కార్యదర్శిగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్.మీనా వ్యవహరించనున్నారు. 2010 వరకు రెండు శాఖలు ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉండగా, దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం గమనార్హం. ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉండకపోవడంతో గందరగోళంగా తయారైన రిజిస్ట్రేషన్ల శాఖను, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కమిషనర్ కావలెను
పెద్దదిక్కు లేని రిజిస్ట్రేషన్ల శాఖ ♦ వారం రోజులుగా కమిషనర్ పోస్టు ఖాళీ ♦ ఇన్చార్జి నియామక ఫైలు సీఎం వద్ద పెండింగ్ సాక్షి, హైదరాబాద్: కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదు. గత రెండేళ్లుగా ఇన్చార్జి అధికారుల పాలనలోనే రిజిస్ట్రేషన్ల విభాగం కొనసాగుతోంది. అయితే వారం రోజులుగా ఇన్చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేసే నాథుడు కరువయ్యారు. కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న అహ్మద్ నదీమ్ కొంతకాలంగా రిజిస్ట్రేషన్ల విభాగానికి ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకునిగా ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం అక్కడకు పంపింది. దీంతో కార్మిక శాఖ ఇన్చార్జి బాధ్యతలను వేరొకరికి అప్పగించిన సర్కారు.. రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలను మాత్రం గాలికి వదిలేసింది. నదీమ్ స్థానంలో కార్మిక శాఖ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన అధికారికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించాలని ఆ శాఖ ఇన్చార్జి ముఖ్య కార్యదర్శి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వారం రోజులుగా ముఖ్యమంత్రి వద్ద ఈ ఫైలు పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించే సంగతి అటుంచితే, ఇన్చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో ఫైళ్లు పేరుకుపోయాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించేందుకు వీలు లేకుండా పోయింది. బడ్జెట్ లేక మార్చి నెల వేతనాలు, కమిషనర్ లేక ఏప్రిల్ నెల వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. -
ఈ-చలాన్లతో రిజిస్ట్రేషన్ ఇబ్బందులకు చెక్
ఈ-స్టాంప్స్ మాడ్యూల్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే పనిలేకుండా ఈ-చలాన్లతో విని యోగదారులు ఎంచక్కా తమ రిజిస్ట్రేషన్లను పూర్తిచేసుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ అన్నారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ నూతనంగా రూపొందించిన ఈ-స్టాంప్స్ (ఈ-స్టాంప్ డ్యూటీ ఇన్ తెలంగాణ తెలంగాణ అసెస్మెంట్, మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్)మాడ్యూల్‌ను సోమవారం సచివాల యంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2014-15లో కన్నా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24% పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్లైన్ సేవలతో పాటు త్వరలోనే ప్రభుత్వ భూములు, లిటిగేషన్లో ఉన్న భూముల వివరాలనూ ఆన్లైన్లో పెడతామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు వీలుగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో షిఫ్ట్ పద్ధతిని అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, రెండు వారాల్లోగా అర్హులైన సిబ్బందికి పదోన్నతులు, ఉన్నత స్థాయిలో పూర్తిస్థాయి అధికారులను నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పట్టేదని, రిజిస్ట్రేషన్ల శాఖలో పూర్తిస్థాయి కంప్యూటరైజేషన్ ఫలితంగా ఆయా దశలన్నీ రెండు గంటల్లో పూర్తిచేసేందుకు వీలు కానుందని రిజిస్ట్రేషన్ల విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ చెప్పారు. ఆన్లైన్లోనే వినియోగదారుడు స్వయంగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు స్టాంప్ డ్యూటీ అసెస్మెంట్నూ చేసుకోవచ్చన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాక, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ-చలాన్ల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)తో ఎంవోయూ కుదుర్చుకున్నామని, రిజిస్ట్రేషన్ కోరుకునే విని యోగదారుడు ఆన్లైన్(ఇంటర్నెట్ బ్యాంకిం గ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా)తో పాటు ఆఫ్లైన్లోనూ ఏ ఎస్బీహెచ్ శాఖ నుంచైనా స్టాంప్‌డ్యూటీ చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ సీజేఎం విశ్వనాథన్, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతులు
హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురికి పదోన్నతులు లభించాయి. కొందరు జిల్లా రిజిస్ట్రార్లకు డిప్యూటీ ఇన్స్పెక్టరు జనరల్ (డీఐజీ)గాను, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగాను నోషనల్ ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రారుగా పనిచేస్తున్న లక్ష్మీకుమారికి ప్రభుత్వం డీఐజీగా నోషనల్ ప్రమోషన్ కల్పించింది. అయితే ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పలువురు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా నోషనల్ ప్రమోషన్ కల్పించింది. పదోన్నతులు, పోస్టింగులకు సంబంధించి పూర్తి సమాచారం పెట్టకుండా వెబ్సైట్లో జీవో నంబర్లు మాత్రమే అధికారులు అప్ డేట్ చేయడం గమనార్హం. -
అనుమతులున్న వాటి కే రిజిస్ట్రేషన్లు
► లేఅవుట్లపై ప్రభుత్వానికి ► సిఫార్సు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ► తమిళనాడు తరహా విధానం ► అమలుకు సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలను నియంత్రించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల అనుమతి లేని లేఅవుట్లకు ఇక నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల చట్టానికి తెచ్చిన సవరణలను పరిశీలించి, అందులోని ఆమోదయోగ్యమైన అంశాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ల చట్టంలో కొత్తగా సవరణలు తేవడం కంటే, పురపాలక చట్టంలో సవరణలు చేయడం మేలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ అభిప్రాయాలను పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్ లేకుండా రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) యాక్ట్‌లో అప్పటి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిన అంశాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అదే విధానాన్ని అనుసరిస్తూ సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీ(మున్సిపాల్టీ, కార్పొరేషన్)లు అనుమతించిన లే అవుట్లనే రిజిస్ట్రేషన్ చేసేవిధంగా పురపాలక చట్టంలో సవరణలు తేవాలని ప్రభుత్వానికి విన్నవించింది. అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను సంబంధి ఏజెన్సీ వెబ్ సైట్లో పొందుపరిచితే, రిజిస్ట్రేషన్ల సమయంలో తనిఖీ చేసుకునేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు. అనుమతించిన లేఅవుట్ల వివరాలతో పాటు అనుమతి లేని లేఅవుట్ల వివరాలను కూడా వెబ్సైట్లో ఉంచితే, ఆయా లేఅవుట్లలోని ప్లాట్లను కొనుక్కోవాలనుకున్న ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో పేర్కొంది. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు, అన ధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చట ్టంలోని సెక్షన్ 22ను తమిళనాడు ప్రభుత్వం 2011లోనే సవరించినా, న్యాయపరమైన చిక్కుల కారణంగా చట్ట సవరణ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే విషయమై తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం గమనార్హం. -
రిజిస్ట్రేషన్లకూ ఎలక్ట్రానిక్ సంతకం
దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యానికి ఇకపై చెక్ సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఏర్పడుతోన్న జాప్యాన్ని నివారించేందుకు స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల విభాగం కొత్త ఆలోచన చేస్తోంది. రిజిస్ట్రేషన్ సందర్భంగా క్రయ, విక్రయదారుల పొటోలను తీసుకునే సమయంలోనే వారితో ఎలక్ట్రానిక్ పాడ్‌పై సంతకాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కో రిజిస్ట్రేషన్‌కు పట్టే సమయంలో కనీసంగా 20 నుంచి 30 నిమిషాల జాప్యాన్ని నివారించొచ్చు. ముఖ్యంగా నగర పరిధిలో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పద్ధతిని అవలంభిస్తే వినియోగదారులకు వేగంగా పనవుతుందని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొన్న ఇంటర్నెట్ సమస్యల కారణంగా ప్రస్తుతం ఒక్కో దస్తావేజును స్కాన్ చేసి అప్లోడ్ చేసేందుకు అరగంట నుంచి గంటకుపైగా సమయం పడుతోందని.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే దస్తావేజుల వెనుకవైపు క్రయ విక్రయదారులు సంతకం చేయాల్సి ఉన్నందున వారికి నిరీక్షణ తప్పడం లేదంటున్నారు. ప్రస్తుతం రవాణా శాఖలో డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్ నిమిత్తం వినియోగదారుల నుంచి ఎలక్ట్రానిక్ పాడ్లపై సంతకాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్నే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఎలక్ట్రానిక్ సంతకాలకు చట్టబద్ధత లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. కోర్టు కేసుల్లో దస్తావేజులపై ఉన్న ఎలక్ట్రానిక్ సంతకాలను న్యాయమూర్తులు ఏ మేరకు అంగీకరిస్తారన్నదానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. సబ్ రిజిస్ట్రార్లకు బయోమెట్రిక్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ లేకున్నా సిబ్బంది రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు తీరిగ్గా ఆఫీసులకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న దస్తావేజులపై చూసీ చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలోనే.. దస్తావేజులపై సబ్ రిజిస్ట్రార్ సంతకం చేసే సమయంలో బయోమెట్రిక్ యంత్రంపై వేలుముద్ర వేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ బయోమెట్రిక్ విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వినియోగదారుల గుర్తింపులో ఆధార్‌ను వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. -
ఫైనాన్స్‌ల పంగనామాలు
సాక్షి,హైదరాబాద్: వివిధ రకాల ఆర్థిక లావాదే వీలు, అగ్రిమెంట్లపై స్టాంప్‌డ్యూటీ చెల్లించ కుండా ప్రైవేటు ఆర్థిక సంస్థ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)లు రిజిస్ట్రేషన్ల శాఖకు పంగనామాలు పెడుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వరంగల్ జిల్లాలో ఇటీవల కొన్ని ఫైనాన్స్‌లపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ చేసిన దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. రుణం, తాకట్టుపై కొనుగోలు చేసిన వాహనాల అగ్రిమెంట్ల కు సంబంధించి వాటి విలువలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. కానీ పలు ఫైనాన్స్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలేదని అధికారుల పరిశీలనలో తేలింది. ఎల్అండ్టీ ఫైనాన్స్ లిమిటెడ్, మాగ్మ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థలు గత నాలుగేళ్లుగా (2010-11నుంచి 2013-14 వరకు) లోన్కమ్ హైపోథికేషన్ అగ్రిమెంట్లకు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా రూ.46. 97 లక్షలు ఎగవేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, చర్యలు చేపట్టాలని రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖలకు ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు త దుపరి చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి సుశీల్‌కుమార్ జోషి, రిజిస్ట్రేషన్ల విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్‌ను ఆదేశించారు. ఫారం-34 తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వాహనాల తాకట్టు అగ్రిమెంట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ల సమయంలో ఓనర్లుగానీ, ఆర్థిక సంస్థలు గానీ రవాణా శాఖకు ఫారం-34 ద్వారా సమాచారం అందించాలని రవాణాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇండియన్ స్టాంప్స్ చట్టం ప్రకారం 2005 నుంచే ఈ నిబంధన అమల్లో ఉన్నప్పటికీ.. పలు ఆర్థిక సంస్థలు స్టాంప్ డ్యూటీని చెల్లించడం లేదు. ఆర్బీఐ నిబంధనల మేరకు వాహనాల కొనుగోలుకు రుణాలిస్తున్న బ్యాంకులు మాత్రం 0.5 శాతం స్టాంప్‌డ్యూటీని తు.చ. తప్పకుండా చెల్లిస్తుండగా, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు స్టాంప్ డ్యూటీని ఎగవేస్తూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఈ స్టాంప్ డ్యూటీ వసూలు విషయమై రిజిస్ట్రేషన్, రవాణాశాఖల మధ్య సమన్వయం కొరవడ్డాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అవకాశంగా తీసుకున్నట్లు తేలింది. తాజాగా సర్కారు ఆదేశాలతో రవాణా, రిజిష్ట్రేషన్ల శాఖలు స్టాంప్ డ్యూటీ వసూళ్లపై దృష్టిపెట్టాయి. రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసిన తేదీ (నవంబరు 26) నుంచి ఫారం-34 లేకుండా రుణంపై తీసుకున్న వాహనాల రిజిస్ట్రేషన్లను అనుమతించడం లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫైనాన్స్ కంపెనీ చెల్లించకుంటే వాహన యజమాని నుంచి స్టాంప్‌డ్యూటీ వసూలు చేస్తున్నామని వారు తెలిపారు. మరోవైపు ఏళ్లుగా స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిన ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ సన్నద్ధమౌతోంది. -
‘ఊరూరా రిజిస్ట్రేషన్ స్టాంపులు’ సక్సెస్
♦ పోస్టాఫీసుల్లో స్టాంపుల విక్రయాలకు మంచి స్పందన ♦ రెండు నెలల్లో రూ.4 కోట్ల విలువైన స్టాంపుల విక్రయం ♦ త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఊరూరా రిజిస్ట్రేషన్ స్టాంపులు’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించింది. ప్రస్తుతం 80 మున్సిపాల్టీల్లోని పోస్టాఫీసుల ద్వారా రెండు నెలల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన స్టాంపులను విక్రయించినట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా స్టాంపుల విక్ర యాన్ని సెప్టెంబర్ 1న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని తొలిదశలో పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసిన అధికారులు త్వరలోనే మండల కేంద్రాల్లోని పోస్టాఫీసుల్లోనూ ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. ఆపైన ప్రతి గ్రామంలోనూ స్టాంపుల విక్రయాలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించిన కొన్ని సేవలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. ఆయా సేవలను సమర్థవంతంగా అందించేందుకు క్షేత్రస్థాయిలో సరైన సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, విస్తృత ప్రచారం నిర్వహించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో వినియోగదారులకు ఉపకరించని కొన్ని సేవల వివరాలు ఇలా ఉన్నాయి. నిరుపయోగంగా ఇంటరాక్షన్ సేవలు.. నవీకరించిన వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇంటరాక్ట్ కావచ్చని గతంలో అధికారులు ప్రకటించారు. అయితే.. వినియోగదారులు ఆన్లైన్లో నమోదు చేసిన సందేహాలను నివ ృత్తి చేసే వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయలేదు. సందేహాలను నమోదు చేయడంపై వినియోగదారులకు గానీ, వాటిని పరిష్కరించాల్సిన అధికారులకు గానీ ఏ విధమైన అవగాహనా కల్పించలేదు. పని చేయని ఎస్ఎంఎస్ వ్యవస్థ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) రూపంలో వినియోగదారుని మొబైల్‌కు అందాల్సి ఉంది. అయితే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఈ పక్రియ అమలుకు నోచుకోవడం లేదు. స్లాట్ బుకింగ్‌కు ఆదరణ కరవు ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరీక్షించాల్సిన పనిలేకుండా.. వెబ్‌పోర్టల్ ద్వారానే ముందుగా స్లాట్(పలానారోజు, సమయం)ను బుక్ చేసుకునే సదుపాయానికి కూడా వినియోగదారుల నుంచి ఆదరణ లభించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఒకట్రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు అంతగా లేవు. దీంతో వినియోగదారులు ఎప్పుడు కుదిరితే అప్పడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చే యించుకుంటున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తుల వివరాలను వెబ్ పోర్టల్‌లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ముందుగానే డేటాను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తి అవుతుందని అధికారులు చెప్పారు. అయితే డేటా ఎంట్రీ ముందుగా చే స్తే, రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు ఉన్నాయంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇబ్బంది పెడతారేమోనని వినియోగదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు
♦ అందుబాటులోకి తెచ్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ♦ వివిధ రకాల రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించే యత్నం ♦ సలహాలు, సూచనలతో నాలుగు డాక్యుమెంటరీలకు రూపకల్పన సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, స్థలాలు, ఆపార్ట్మెంట్ల కొనుగోళ్ల సమయంలో అన్నీ నేనే చూసుకుంటాననే బ్రోకర్ల మాయలో పడి అనసరమైన పాట్లు పడవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హెచ్చరిస్తోంది. ఆస్తుల కొనుగోళ్ల విషయంలోనే కాదు.. విద్యా సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన సొసైటీల రిజిస్ట్రేషన్, బిజినెస్, కంపెనీలు ప్రారంభించేందుకు అవసరమైన ఫర్మ్ రిజిస్ట్రేషన్లపైనా అవగాహన కలిగుంటే మేలని సూచిస్తోంది. వివాహం రిజిస్ట్రేషన్ జరగకుంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఇబ్బందులను కూడా తెలియజేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కొత్త పంథా ఎంచుకున్నారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, రిజిస్ట్రేషన్‌పై కల్పించేందుకు 4 లఘుచిత్రాలు రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రతిచోటా ఈ లఘు చిత్రాలను వీక్షించేలా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ registration.telangana.gov.in/videogallery.jsp ద్వారా అందుబాటులోకి తెచ్చారు. లఘు చిత్రాలు ఇవీ.. సమస్యల్లేని ఆస్తినే ఎంచుకోండి ఆస్తుల కొనుగోలు సమయంలో వాటి గత చరిత్ర తెలుసుకోకుంటే వచ్చే చిక్కులపై ‘జాగ్రత్త’ లఘుచిత్రంలో కళ్లకుకట్టారు. తక్కువ రేటుకు వస్తుందని సమస్యలున్న ప్రాపర్టీ కొనుక్కోవడం కంటే ప్రాబ్లమ్ లేని ఆస్తిని ఎంచుకోవడమే మేలని ఇందులో చూపారు. కొనబోయే ఆస్తి గత చరిత్రను లింక్ డాక్యుమెంట్, ఈసీ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చని, ఆపార్ట్మెంట్ల విషయంలో మున్సిపల్ అప్రూవల్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే కార్ పార్కింగ్, అన్డివెడైడ్ స్పేస్ వివరాలను కూడా డాక్యుమెంట్లలో పొందుపరిచా రో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని చెబుతోందీ చిత్రం. సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. స్కూల్, స్వచ్ఛంద సంస్థలు స్థాపించాలన్నా సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని మరో లఘుచిత్రంలో తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ వల్ల ఆదాయపు పన్ను మినహాయింపు, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, బ్యాంకుల నుంచి సాయం పొందే వీలుంటుందని వివరించారు. స్వచ్ఛంద సంస్థ లు నిర్వహించే సామాజిక సేవలు, క్రీడలు, కళలకు ప్రోత్సాహం, సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్ వివరాలివీ.. ఏదైనా వ్యాపారం లేదా కంపెనీ ప్రారంభించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చే యించుకోవాలంటూ మరో లఘచిత్రంలో తెలిపారు. సంబంధిత వివరాలను వినియోగదారుల దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇన్‌కంట్యాక్స్ ఇబ్బందులు, సివిల్ కేసుల సమస్య తలెత్తకుండాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమమని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవసరమని పేర్కొన్నారు. వ్యాపారానికి సంబంధించి పార్టనర్షిప్ డీడ్, కార్యాలయ లీజు డీడ్.. తదితర పత్రాలతో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే రిజిస్ట్రేషన్ ఎంతో సులభ మని ఈ చిత్రంలో చూపించారు. పెళ్లిని నమోదు చేయించుకోండి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఇంకో లఘుచిత్రంలో చూపించారు. విదేశాల్లో పని చేస్తున్న యువకులు స్వదేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి అక్కడికి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ అయ్యే సమయంలో అయినా వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే జరిగిన వివాహాలను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చే సుకోవచ్చు. కుల, మతాంత ర వివాహాలను స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కింద నమోదు చేసుకోవచ్చని లఘు చిత్రంలో చూపారు. -
చలానాలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లుచీటీ
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా కొనసాగుతున్న మూస పద్ధతులకు రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే చెల్లుచీటి ఇవ్వబోతోంది. వివిధ క్రయ విక్రయాలకు సంబంధించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపునకు ప్రస్తుతం అమ ల్లో ఉన్న బ్యాంకు చలానాలకు బదులుగా, ఆన్లైన్ చెల్లింపు విధానాలను అవలంభిస్తే మేలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినియోగదారుల ఆకాంక్షల మేరకు క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.. వంటి మోడరన్ బ్యాంకింగ్ సేవలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ బ్యాంకు శాఖలున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజా నిర్ణయానికి సంబంధించి సర్కారు అనుమతి కోసం శాఖ నుంచి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే ఆన్లైన్ చెల్లింపులను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే బ్యాంకు ఖాతా.. వినియోగదారుల నుంచి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు స్వీకరించేందుకు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ స్థానికంగా అం దుబాట్లో ఉన్న బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నాయి. దీనివల్ల ఏదైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వినియోగదారులు అక్కడే ఉన్న బ్యాంకులో చ లానా ద్వారా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. అలాగే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం వల్ల వచ్చిన సొమ్మును రాష్ట్ర ఖాతాకు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రెవెన్యూ వసూళ్లకు సం బంధించిన లెక్కలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులకు వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఒకే బ్యాంకు ఖాతాను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా వినియోగదారులు ఏ ప్రాంతంలో సొమ్ము చెల్లించినా సదరు వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుందని, రెవెన్యూ వసూళ్లలో పారదర్శకతకు దోహదపడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆధార్‌తో అక్రమాలకు చెక్.. అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వినియోగదారుల ఆధార్ నంబరును సేకరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆధార్ నంబరు ఇవ్వడం తప్పనిసరి కాకున్నా, అక్రమాలను నివారించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులను ఒప్పించి వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే ఆధార్ వివరాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. -
పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
♦ రాష్ట్రంలో పుంజుకున్న భూముల రిజిస్ట్రేషన్లు ♦ ఆర్నెల్లలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.1,636.17 కోట్లు ♦ గతేడాది కన్నా 31.33 శాతం అధికంగా రాబడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యాన్ని చేరలేక చతికిలపడిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఈ ఏడా ది తొలి ఆర్నెల్లలో దూకుడు బాగానే పెంచింది. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,636.17 కోట్ల రాబడి సాధించింది. గతేడాదితో పోల్చితే 31.83 శాతం (రూ.395.10 కోట్లు) ఆదాయం పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే దాదాపు అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పెరగడం ఆ శాఖ ఉన్నతాధికారులకు ఊరట కలిగిస్తోంది. జిల్లాల వారీగా సెప్టెంబర్ నెల వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆర్నెల్ల ఆదాయాన్ని పరిశీలి స్తే.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో గతేడాది (రూ.604.25 కోట్లు) కన్నా రూ.246.03 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది. ఆ తర్వాత గతేడాది(రూ.234.05కోట్లు) కన్నా రూ.40 కోట్ల అదనపు ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. పెరుగుదల విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లాలో గతేడాది(రూ.58.78కోట్లు) కన్నా 56.14 శాతం, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో గతేడాది (రూ.33.71కోట్లు) కన్నా 11.16 శాతం అధికంగా ఆదాయం నమోదైంది. రెండేళ్లకోమారు రిజిస్ట్రేషన్ ధరలను సమీక్షించడం సాధారణ విషయమే అయినప్పటికీ ఈ ఏడాది ప్రభుత్వం భూముల విలువను పెంచలేదు. గతంలో మాదిరిగానే ఈసారీ ప్రభుత్వం భూముల విలువను పెంచితే రిజిస్ట్రేషన్ల ఆదాయం మరింత పెరిగుండేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీకన్నా తెలంగాణే బెటర్! రాష్ట్ర పునర్విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటడం కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏపీలో రాష్ట్ర అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించకపోతుండడంతో.. భూములపై పెట్టుబడులు పెట్టేందుకు కొద్దినెలలు వేచి చూసిన జనం తమ పెట్టుబడులకు తెలంగాణనే అనువైనదిగా భావించారు. తెలంగాణలో ఉంటున్నవారి కొనుగోలు శక్తి పెరగ డంతో పాటు భూముల ధరలు అన్నివర్గాలకు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. విభజన అనంతరం తెలంగాణలో భూముల ధరలు తగ్గకున్నా, ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తక్కువగా ఉండడం కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎలాగుంటుందోనన్న సందేహంతో కూడా కొన్నాళ్లు వేచిచూసిన ప్రజలు, ప్రభుత్వం స్థిరమైనదిగా అనిపించడంతో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రతినెలలోనూ బాగానే పెరుగుతుండగా, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం పెరుగుదల ఓ మోస్తరుగా ఉంది. వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గతేడాది సెప్టెంబరు కన్నా, ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. -
అంతా టూ లేట్... ఇదేనా స్మార్ట్
భూములు, ఆస్తులకు పాత మార్కెట్ ధరలే కొనసాగింపు ధరలు అప్డేట్ చేయని రిజిస్ట్రేషన్ల శాఖ అయోమయంలో రియల్ వ్యాపారులు స్మార్ట్ వార్డు, స్మార్ట్ సిటీ.. స్మార్ట్ పాలన.. అంతా స్మార్ట్. పాలకులు ఏమి మాట్లాడినా స్మార్ట్ గురించే. ఈ-ఆఫీస్, ఈ-పోస్, ట్యాబ్లెట్ల వాడకం ఇలా పాలన అంతా ఆన్లైన్లోనే. మరి ఎంతో ముఖ్యమైన సమాచారం మాత్రం సంబంధిత వెబ్సైట్లలో అప్డేట్ కావడం లేదు. ఇదీ మన స్మార్ట్ సార్ల తీరు. గాంధీనగర్: ప్రభుత్వం స్మార్ట్పాలనకు తెరతీసింది. ఈ- ఆఫీస్ పేరుతో ఓ వైపు పేపర్ వాడకానికి స్వస్తి పలుకుతున్నారు. వీఆర్వో స్థాయినుంచి ఉన్నతాధికారుల వరకు ట్యాబ్‌లు అందిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేసి మొబైల్లోనే భూముల వివరాలు తెలుసుకునే విధంగా ‘మీ భూమి పోర్టల్‌ను రూపొందించింది. చివరికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్ రైటర్స్‌పై ఆధారపడకుండా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దనుంచే ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేదని ప్రజలు సంబరపడ్డారు. కాని కొన్ని వెబ్సైట్లలో సమాచారం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. నిరంతరం మార్పులు జరుగుతున్నప్పటికీ పాత డేటా ఆప్డేట్ చేయకుండా అలానే కొనసాగిస్తున్నారు. ఆ కోవకు చెందిందే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం భూములు, ఆస్తుల మార్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. రాజధాని నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అరవై నుంచి వంద శాతం వరకూ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ధరలను పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం అధికారక వెబ్సైట్లో మాత్రం పాత మార్కెట్ ధరలను కొనసాగిస్తోంది. వెబ్సైట్లో భూ ముల మార్కెట్ ధరలు అప్డేట్ చేయలేదు. 1 ఏప్రిల్, 2013న పెంచిన ధరలే ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, డాక్యుమెంట్ రైటర్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. భూముల కొనుగోలుదారులు మండలాలు,గ్రామాల వారి మార్కెట్ ధరలు, సర్వే నంబర్వారీ మార్కెట్ ధర ఎంత? అనే వివరాలను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌పై ఆధారపడతారు. ఉదాహరణకు వీరులుపాడు మండలంలోని జయంతి గ్రామంలో గతంలో ఎకరం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగా ఉంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్కెట్ ధర రూ. 5లక్షలు అయింది. వైబ్సైట్లో మాత్రం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగానే ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, స్టాంప్‌డ్యూటీ ఎంత చెల్లించాలో వెబ్‌సైట్‌లోని మార్కెట్ ధరల క్యాలిక్యులేటర్ వినియోగిస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు వస్తాయి. ధరలు మార్చకపోవడం క్యాలిక్యులేటర్ వినియోగించిన వారికి పాత ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వైబ్‌సైట్‌ను నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్ వారు డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ధరలు పెరిగి పదిరోజులు కావస్తున్నా కొత్త ధరలు అందుబాటులోకి రాలేదు. పట్టణాల్లో సమస్య తీవ్రం పట్టణ ప్రాంత వ్యాపారులు వైబ్‌సైట్ అప్డేట్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాల్లో వీధి వీధికి మార్కెట్ ధరలలో వ్యత్యాసం ఉం టుంది. ఒకే వీధిలో డోర్ నంబర్ల వారీగా ధరల్లో తేడాలున్నాయి. పెరిగిన మార్కెట్ ధరల వివరాలను సకాలంలో అప్డేట్ చేయకపోవడంతో వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసి సమాచారం అందించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
‘ఫిట్మెంట్’ దం‘దాదా’గిరీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పోరాడి సాధించుకున్న ఫిట్మెంట్ అమలుకు ప్రభుత్వోద్యోగులు తమ శాఖల్లోని దం‘దాదా’ల చేతులు తడపాల్సి వస్తోంది. నాలుగింట మూడొంతుల ప్రభుత్వ శాఖల్లో ఫిట్మెంట్ కోసం మామూళ్లు వసూలు చేస్తున్న వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ సర్కార్ ఇచ్చిన ఫిట్మెంట్ మాదిరి ఇక్కడి ఉద్యోగులు కూడా పోరాడి సాధించుకున్నారు. కానీ ఖజానా(ట్రెజరీస్) శాఖకు ‘ఫార్మాలిటీస్’ వంకతో పై నుంచి కిందిస్థాయి వరకు ముడుపులు ముట్టచెప్పందే ఫిట్మెంట్ రాదని వసూల్ రాజాలు బెదిరిస్తున్నారు. జిల్లాలో ఏ శాఖ ఉద్యోగులను కదిలించినా ఈ వసూళ్ల దందానే చెబుతున్నారు. సంతోషం కొద్దీ తాము ఇస్తే తీసుకోవాలే కాని డిమాండ్ చేసి మరీ వసూళ్లకు తెగబడుతున్నారని పలుశాఖల్లో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, రవాణా, ఎక్సైజ్..ఇలా మూడొంతుల శాఖల్లో ఫిట్మెంట్ వసూళ్ల దందా గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఆయా శాఖల్లోని పలు విభాగాల పర్యవేక్షకుల్లో ఒకరిద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఇందులో ఏ ఒక్కరినీ విడిచిపెట్టడం లేదని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు. అలాగని బయటపడి పెదవి విప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు. కొరివితో తల గోక్కున్నట్టవుతుందేమోనని మిన్నకుంటున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాలకు చెందిన అరడజన్ మంది ఉద్యోగులు ఒకో కేడర్‌కు ఒకో రేటు నిర్ణయించి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు. ఉద్యోగుల వివరాలతో కూడిన నివేదికలు ఖజానా శాఖకు అందచేసేందుకు వారికి ఎంతో కొంత ముట్టచెప్పాలంటూ స్థాయిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో ముందే మొదలు.. వైద్య ఆరోగ్యశాఖలో ఈ దందా ముందే మొదలైపోయింది. ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టులు, లేబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగుల నుంచి రూ.1,000, స్టాఫ్‌నర్సుల నుంచి రూ.2,000 పై గా వసూలు చేస్తున్నారు. చివరకు వైద్యుల నుంచి కూడా వారి హోదాకు తగ్గట్టు రూ.3,000 వంతున వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అన్ని శాఖల్లోనూ వసూళ్లు రెవెన్యూశాఖలో రూ.1,000 తక్కువ కాకుండా, అధిక ఆదాయం వస్తుందంటూ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖలో దిగువ కేడర్‌కు చెందిన కానిస్టేబుళ్లు తమ నుంచి రెండు వేలు తక్కువైతే తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇదే పరిస్థితి మిగిలిన అన్ని శాఖల్లో ఉంది. ఫిట్మెంట్ పేరుతో సాగుతున్న వసూళ్ల దందా దిగువ కేడర్ ఉద్యోగులు, మినిస్టీరియల్ సిబ్బందికి భారంగా మారింది. ట్రెజరీ వంకతో సాగిస్తున్న ఈ వసూళ్ల దందాకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఉంది. పోరాడి సాధించుకుంటే లంచమా.. ఫిట్మెంట్ అనేది పోరాడి సాధించుకోగా లంచాలు డిమాండ్ చేయడం భావ్యం కాదు. తోటి ఉద్యోగుల నుంచి ట్రెజరీకి ఇవ్వాలంటూ వసూళ్లకు పాల్పడటం సమంజసం కాదు. - పలివెల శ్రీనివాస్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు వసూళ్లపై ఫిర్యాదులొస్తే తీవ్రచర్యలు మా శాఖ పేరు చెప్పి లంచాలు వసూలుచేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. మా శాఖ సిబ్బందికి ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదు. - జి.లలిత, డిప్యూటీ డెరైక్టర్, ట్రెజరీస్, కాకినాడ -
ఇకపై భూ భారం
ఇక స్థలాల రిజిస్ట్రేషన్లూ భారమే మార్కెట్ విలువ పెంపుతో అవస్థలు ఇరవై నుంచి నూరు శాతం వరకూ పెంపు ఒంగోలు సబర్బన్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలపై ప్రతి ఏడాదికి రూ.20 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు వల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు రెట్టింపు ఆదాయం సమకూరనుంది. గతంలో ఉన్న మార్కెట్ విలువలకంటే కొన్ని ప్రాంతాల్లో నూరు శాతం పెరగగా మరికొన్ని చోట్ల 50 శాతం పెరగనున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉన్న సమయంలో భూముల విలువలు విపరీతంగా దళారులు పెంచిన విషయం తెలిసిందే. గత ఐదారు సంవత్సరాలుగా ఈ వ్యాపారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా తయారైంది. చివరకు అప్పుల్లోళ్ళకు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ఐపీలు కూడా పెట్టారు. ఈ పరిస్థితుల్లో స్థలాల, భూములు, నిర్మాణాల మార్కెట్ విలువలు పెంచటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఒంగోలు, మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదాయ లక్ష్యం రూ.18.10 కోట్లుంటే ప్రస్తుతం పెంచిన ధరలతో ఒకేసారి రూ.38 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
సొంతింటి కల.. మరింత భారం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకుసొంతింటి కల ఇక మరింత భారం కానుంది. రైతులు అష్టకష్టాలు పడి పొదుపు చేసిన సొమ్ముతో ఎకరానో అరెకరానో పొలం కొనాలన్నా గగన కుసుమమే. ఇంటి జాగా కొనడమూ పెనుభారంగా మారనుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్థిరాస్తుల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. భూములు, ఇళ్లు, స్థలాల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేపట్టింది. ‘‘మార్కెట్ విలువలు పెంచడం ఖాయం. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. గ్రామాలు, పట్టణాలవారీగా భూములు, స్థలాల వాస్తవ విలువల ప్రాతిపదికన మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రెవెన్యూ డివిజనల్ అధికారులు/జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని మార్కెట్ రివిజన్ కమిటీల అనుమతి తీసుకోవాలి. ఈ దిశగా జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లను సన్నద్ధం చేయండి’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ విలువల పెంపునకు మంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేసి, సీఎం ఆమోదం నిమిత్తం పంపించారని, సీఎం దీనిని ఆమోదించడం లాంఛనప్రాయమేనని ఉన్నతాధికారులు వివరించారు. సీఎం ఆమోదిస్తే సవరించిన విలువలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. భారీ ఆర్జనకు సర్కారు యత్నాలు భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంవల్ల కొనుగోలుదారులపై స్టాంపు డ్యూటీ భారం పెరుగుతుంది. మార్కెట్ విలువపై నాలుగు శాతం ఉన్న స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఇటీవలే ఐదు శాతానికి పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజును అర శాతం నుంచి ఒక శాతానికి పెంచింది. వివిధ రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టేబుల్ ఫీజులను కూడా పెంచింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ విలువలను సవరించడం ద్వారా భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘ఇక మార్కెట్ రివిజన్ కమిటీలు ఆమోదించిన రిజిస్ట్రేషన్ విలువలే అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువలతో పోల్చితే 20 నుంచి 30 శాతం వరకూ పెరుగుదల ఉండే అవకాశం ఉంది’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
మోదం..ఖేదం
* ఆదాయ లక్ష్య సాధనలో ఆబ్కారీ శాఖ పాస్ * వాణిజ్య పన్నుల శాఖకు కాసుల పంట * రిజిస్ట్రేషన్ల శాఖకు పెరుగుతున్న రాబడి * రవాణా శాఖ వెనుకబాటు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రాష్ట్ర సర్కారుకు కాసుల పంట కురిపించే వివిధ ప్రభుత్వ విభాగాల ఆదాయ పరిస్థితి చూస్తే ఈ ఏడాది కొంతమోదం.. కొంత ఖేదం అన్నట్టుగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావ (జూన్ 2) అనంతర పరిణామాలు రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయ లక్ష్యాన్ని స్వల్పంగా దెబ్బతీసినా.. వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రియల్ భూమ్ తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కొన్ని విభాగాలకు నష్టం కలిగించినా.. ఆదాయ సముపార్జనలో ఇటీవల ఆ శాఖలు క్రమంగా పుంజుకుంటుండడం విశేషం. వివిధ శాఖల ఆదాయ లక్ష్యాలు, సాధించిన పురోగతిని పరిశీలిస్తే... వాణిజ్య పన్నుల శాఖకు పండగ మహా నగరంలో వాణిజ్య పన్నుల శాఖకు కాసుల పంట పండుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం వాణిజ్య పన్నుల శాఖ నుంచి సమకూరుతోంది. ఈమొత్తంలో హైదరాబాద్ నగర రాబడి అత్యంత కీలకం. ఈ శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా... మహా నగరంలో ఏడు ఉన్నాయి. అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజ గుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధిలోనే అత్యధిక ఆదాయం సమకూరుతోంది. గత జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు (పది నెలల్లో) కేవలం ఏడు డివిజన్ల ద్వారా కనీసం రూ.19 వేల కోట్లు పన్నుల రూపంలో సమకూర్చుకోవాలనేది వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యం. జనవరి 31 నాటికి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతం, మిగతా పన్నులతో మరో 15 శాతం ఆదాయం సమకూరుతుండడం విశేషం. రిజిస్ట్రేషన్ శాఖలో ఆశాజనకం ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం అధికంగానే ఉంటోంది. ఈ శాఖ పరిధిలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో మహా నగర పరిధిలోనే నాలుగు కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహా నగర వాటా 68.89 శాతం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో రూ. 923.27 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా... జనవరి నాటికి రూ.396.58 కోట్లు ఆదాయం లభించింది. రంగారెడ్డిజిల్లా పరిధిలోని రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో రూ.1361.69 కోట్లు లక్ష్యం నిర్ణయించగా... ఇప్పటి వరకు రూ.1195.22 కోట్లు సమకూరింది. రియల్ బూమ్ ఊపందుకుంటుండడంతో రాబడి మరింత పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ భావిస్తోంది. రవాణా శాఖ జోరుకు బ్రేకులు రవాణా శాఖ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 70 శాతమే టార్గెట్ సాధించారు. సాధారణంగా నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి... ఆదాయాన్ని సముపార్జించే రవాణా శాఖలో రాష్ట్ర విభజన, రియల్ బూమ్ అంతంతమాత్రంగానే ఉండడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోకపోవడం వంటి పరిణామాలు, తనిఖీలు బాగా తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అనుకున్న స్థాయిలో ఆదాయాన్ని సాధించలేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. జూన్ నుంచి జనవరి వరకు హైదరాబాద్ జిల్లా 68 శాతం, రంగారెడ్డి జిల్లా 70 శాతం లక్ష్యాలు సాధించాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు కొద్దిసమయమే ఉన్నందున లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్దేశించిన టార్గెట్ రూ.499 కోట్లు కాగా.. సాధించినది రూ.340 కోట్లు. రంగారెడ్డి జిల్లాలో లక్ష్యం రూ.629 కోట్లు కాగా.. సాధించిన మొత్తం రూ.439 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆబ్కారీ శాఖలో 10 శాతం వృద్ధి గ్రేటర్ పరిధిలో ఆబ్కారీ శాఖకు కాసుల పంట పండుతోంది. గత ఏడాది జూన్ నుంచి జనవరి వరకు మద్యం అమ్మకాల్లో ప్రతి నెలా సుమారు పది శాతం వృద్ధి నమోదవుతున్నట్లు ఆబ్కారీ శాఖ అంచనా. గ్రేటర్ పరిధిలో నెలకు సుమారు రూ.200 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జనవరిలోనూ ఇదే ఒరవడి కొనసాగడం విశేషం. గత నెలలో సుమారు 200 మద్యం దుకాణాలు, 225 బార్లలో సుమారు రూ.200 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్టు ఆ శాఖ అధికారుల అంచనా. గ త ఏడాది జనవరిలో అమ్మకాలు రూ.180 కోట్లు మాత్రమే. మార్చి నెల నాటికి ఇదే రీతిన మద్యం అమ్మకాలు సాగుతాయని ఆ శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిపన్నుదే సింహభాగం జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నుదే. అంతకుముందెన్నడూ లేని విధంగా గత సంవత్సరం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈసారి మరింత ఆదాయం పెంచుకునేందుకు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ఆస్తిపన్ను వసూళ్లపై శ్రద్ధ చూపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరిట ప్రజలకు ఇబ్బందులుంటే తొలగించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న వారిపై దృషి ్టసారించి వసూళ్లను పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజుకు దాదాపు రూ.620 కోట్లు ఆస్తిపన్ను రాగా, ప్రస్తుతం సుమారు రూ.635 కోట్లకు చేరుకుంది. మార్చి నెలాఖరులోగా గత ఏడాదికంటే అదనంగా రూ.500 కోట్లయినా వసూలు కాగలదని భావిస్తున్నారు. ఇక టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది. భవన నిర్మాణాలు గణనీయంగా తగ్గిపోవడమే దీనికి కారణం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ ఆదాయం కూడా పెరుగుతుందని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ట్రేడ్లెసైన్సులు, ఇతరత్రా మార్గాల ద్వారా గతంలో కంటే పెరిగే అవకాశాలే ఉన్నాయంటున్నారు.