‘స్వైపింగ్’తో లబ్ధి కొంతే
సర్కార్ నగదు రహిత లావాదేవీలపై రిజిస్ట్రేషన్ల శాఖ అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్వైపింగ్ మెషిన్ల (డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు వీలు కల్పించే పరిక రాలు)ను ప్రవేశపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు స్వల్పమేనని ఉన్నతాధికారు లు భావిస్తున్నారు. నగదు రహిత లావా దేవీలను అమల్లోకి తెచ్చేందుకు స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అధికారులు మంగళ వారం కసరత్తు చేశారు. ఇటీవలే ప్రవేశపె ట్టిన ఈ-స్టాంప్స్, ఈ-చలాన్ల పనితీరు ప్రయోజనకరంగా ఉన్నందున ఇప్పటికి ప్పుడు స్వైపింగ్ మెషిన్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నా రు. పైగా స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులు చేయడం వల్ల సర్వీస్ చార్జి కింద వినియోగ దారులే ఎక్కువ సొమ్మును నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
నగదు చెల్లింపుల ద్వారా ఏటా రూ. 25 కోట్లకన్నా తక్కువ ఆదాయం వచ్చే లావాదేవీల కోసం స్వైపింగ్ యంత్రా లను భారీగా కొనుగోలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమో ఉన్నతాధి కారులు పరిశీలించాలని కోరుతున్నారు. ఏదేమైనా ‘స్వైపింగ్’ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆదేశాలు అందనందున తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా వచ్చే సుమారు రూ. 4 వేల కోట్ల వార్షికాదాయంలో అధిక భాగం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనే సమకూరుతుంది.
తగ్గుముఖం పట్టిన లావాదేవీలు..
పాత నోట్లతో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల చెల్లింపునకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 24తో ముగియడంతో గత 4 రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు తగ్గుముఖం పట్టారుు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24న 5,422 లావాదేవీలు జరగ్గా మంగళవారం నాటికి రోజువారీ లావాదేవీ లు 1,805 పడిపోయారుు. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ నెల 24న రూ. 25 కోట్లు రాగా మంగళవారం నాటికి రూ.7 కోట్లకు తగ్గింది.