swiping
-
నెంబర్ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు
సాక్షి, హైదరాబాద్: చీటికి మాటికీ మీ సిమ్ కార్డ్‌కు నెట్వర్క్ సమస్య వస్తోందా? ఫోన్ కాల్, మెసేజ్‌లు అస్సలు చేయలేకపోతున్నారా? ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీ సిమ్ బ్లాక్ అయ్యిందా?.. అయితే మీరు సైబర్ నేరస్తుల వలలో పడినట్టే ! ఆలస్యం చేయకుండా వెంటనే మీ టెలికం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. ఎందుకంటే ఈమధ్య కాలంలో సైబర్ నేరస్తులు నకిలీ గుర్తింపు పత్రాలు సమర్పించి.. మీ నంబర్‌తో కొత్త సిమ్ కార్డ్‌లను పొందుతున్నారు. ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘నకిలీ వేలి ముద్రలు’ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల ముఠా సిమ్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలు సమీకరించింది ఇలాగే ! ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల కస్టమర్ల ఫోన్ నెంబర్లను సైబర్ నేరస్తులు టార్గెట్ చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయని బాధితులు సర్వీస్ ప్రొవైడర్లకు ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోయాయి. నకిలీ గుర్తింపు కార్డ్‌లను సమర్పించడంతో సర్వీస్ ప్రొవైడర్ కొత్త సిమ్ కార్డ్ జారీ చేస్తున్నారు. దీంతో అసలు యజమాని మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. కొన్ని గంటల్లోనే నేరస్తుడి సెల్ఫోన్లో ఉన్న కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. ఎలా చేస్తారంటే? కస్టమర్లు స్టోర్‌ను సందర్శించినప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్ డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ద్వారా సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తాడు. కానీ, డిజిటల్ కేవైసీ ఫెయిలయిందని కస్టమర్‌కు చెప్తాడు. తర్వాత ఈ–కేవైపీ పద్ధతి ద్వారా కస్టమర్ పేరు మీద మరొక సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తాడు. ఇలా ఒక్క కస్టమర్ పేరు మీదనే రెండు సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేస్తారు. డిజిటల్ కేవైసీ ద్వారా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్ కస్టమర్‌కు, ఈ–కేవైసీ ద్వారా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్‌ను నేరస్తులకు చేరవేస్తుంటారు. నకిలీ వేలి ముద్రల కేసులో ఒంగోలుకు చెందిన విశ్వనాథుల అనిల్ కుమార్ ఇలాగే కస్టమర్ల పేర్ల మీద 121 సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేసి.. ఈ కేసులో ఏ–4 ఒంగోలుకు చెందిన దర్శనం సామేలు చేరవేశాడు. ఇతడు కమీషన్ రూపంలో ఈ సిమ్ కార్డ్‌లను ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుకు సరఫరా చేశాడు. అకౌంట్లోని నగదు లూటీ.. ఒరిజినల్ సిమ్ కార్డ్‌ను నేరస్తులు స్వాపింగ్, క్లోన్ చేస్తున్నారు. దీంతో అప్పటికే మీ సిమ్ కార్డ్‌లో సేవ్ అయి ఉన్న కాంటాక్ట్, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం నేరస్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. బ్యాంక్ ఖాతాలను కూడా ఆపరేట్ చేస్తున్నారు. బాధితుడు ఆ సమయంలో మొబైల్ సేవలను వినియోగించలేడు కాబట్టి బ్యాంక్ వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) కూడా కొత్త సిమ్ కార్డ్ వినియోగిస్తున్న నేరస్తుడికే వెళ్లిపోతుంది. దీంతో అకౌంట్లోని నగదును నిందితుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకుంటారు. ఈ వ్యవహారంలో నిందితులు సమర్పించే గుర్తింపు కార్డ్‌లు, నగదు బదిలీ జరిగే బ్యాంక్ ఖాతాలు అన్నీ నకిలీవే ఉంటున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకే రోజు రెండు సిమ్‌లు జారీ చేయొద్దు సిమ్ కార్డ్‌ల జారీలో టెలికం విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఒకే రోజు వేర్వేరు కేవైసీ పద్ధతులతో రెండు సిమ్ కార్డ్‌లను యాక్టివేషన్ చేయకూడదు. అలాగే సిమ్ కార్డ్‌లు తీసుకునే సమయంలో కస్టమర్లు వాటిని దృవీకరించుకోవాలి. – స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్, సైబరాబాద్ (చదవండి: తల్లి మృతిని తట్టుకోలేక.. ) -
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ⇔ ముంబయ్‌లోని మీరా రోడ్‌కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు. ⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్‌ను మీరా రోడ్‌కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్లోనూ ఓ ముఠా పని చేస్తోంది. ⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది. ⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్‌ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్‌కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ ⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్‌కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్‌కు పంపేవాడు. ⇔ గతంలో కోల్‌కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్‌కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్‌కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్‌ను చంద్రకాంత్‌కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్‌కు పంపిస్తారు. ⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్‌కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్నెట్ బ్యాకింగ్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్‌లో పాస్వర్డ్ మార్చి.. ⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్‌కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇలా పాస్వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్‌కు ఇస్తారు. ⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్కాయిన్ల ద్వారా జేమ్స్‌కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్‌ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్ (ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. ⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. -
ఏటీఎం షట్‌డౌన్..
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఏటీఎంలు ఒక్కొక్కటిగా షట్‌డౌన్ అవుతున్నాయి. ప్రజలు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ వైపు మళ్లుతుండటంతో వీటి అవసరం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు కరోనా భయం వెంటాడుతుండటంతో ఆదరణ కూడా తగ్గింది. ఒకవైపు ఆన్లైన్ పేమెంట్లు, మరోవైపు కరోనా ప్రభావంతో ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏటీఎంలను తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటు పడటంతో వీటి అవసరం చాలా వరకు తగ్గుతోంది. దీంతో దినసరి 200 స్వైపింగ్ లేని ప్రాంతాలను గుర్తించి ఏటీఎంలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరంలో వివిధ బ్యాంకులకు సంబంధించి సుమారు 4 వేల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 20 శాతానికి పైగా ఏటీఎంలను మూసివేసినట్టు సమాచారం. నగదు రహిత లావాదేవీలు... ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ భయంతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నాయి. పాలు బిల్లు నుంచి ఇంటి అద్దె వరకు డిజిటల్ రూపంలో చెల్లిస్తుండటంతో పెద్దగా నగదు అవసరం లేకుండా పోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఏటీఎంలు బోసిపోతున్నాయి. కరోనా భయంతో ఏటీఎంలకు వెళ్లి నగదు డ్రా చేసేందుకు నగర వాసులు వెనుకాడుతున్నారు. ఇంటి గుమ్మం ముందే బ్యాంకు ఖతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంది. ఇప్పటికే తపాలా శాఖ వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఇంటి ముంగిటకే నగదు సేవలు అందిస్తోంది. ఎస్బీఐ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. (చదవండి: ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి) -
స్వైపింగ్’లో అదనపు రుసుం వసూలు చేయొద్దు
► రాష్ట్ర వినియోగదారుల సంఘాల రీజినల్ కార్యదర్శి సంపత్‌కుమార్ నస్పూర్: దుకాణదారులు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన మొత్తానికే స్వైపింగ్ ద్వారా డబ్బు తీసుకోవాలని అదనంగా వసూలు చేయొద్దని రాష్ట్ర వినియోగదారుల సంఘాల రీజినల్ కార్యదర్శి, సంఘమిత్ర వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి పి.సంపత్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలో కొందరు వ్యాపారులు డిజిటల్ బ్యాంక్ కార్డు ఉపయోగించుకొని వినియోగదారుడు కొనుగోలు చేసినప్పుడు బిల్లుపై అదనంగా కొంత రుసుము వసూళ్లు చేస్తున్నారన్నారు. వినియోగదారుడి నుంచి అదనపు రుసుం వసూళు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. బిల్లుపై అదనంగా వసూళు చేయడాన్ని నిలిపేయాలని లేని పక్షంలో వినియోగదారుల చట్టాన్ని ఆశ్రయిస్తామన్నారు. దీనిపై కలెక్టర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి గోసిక మల్లేశ్, మంచిర్యాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కమల్, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. -
స్వైపింగ్ బాదుడు.. చార్జీల కుమ్ముడు
ఏలూరు (మెట్రో)/తణుకు : నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రభుత్వం, అధికారులు ఊదరగొడుతుండటంతో తాడేపల్లిగూడెంకు చెందిన యోహాన్ అనే యువకుడు కరెంటు బిల్లు చెల్లించేందుకు డెబిట్ కార్డు తీసుకెళ్లాడు. ఆ కార్డు సాయంతో మీ సేవ కేంద్రంలో కరెంటు బిల్లు నిమిత్తం రూ.460 చెల్లించాడు. సర్వీస్ చార్జీల రూపంలో రూ.5, డెబిట్ కార్డు వినియోగించినందుకు ట్యాక్స్ రూపంలో రూ.5 అతడి ఖాతా నుంచి ఎగిరిపోయాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన అరవింద్‌కుమార్ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఏడుసార్లు ఏటీఎం కార్డును ఉపయోగించి నగదు డ్రా చేశాడు. తీసుకున్న సొమ్ము పోగా తన పొదుపు ఖాతాలో ఉండాల్సిన నిల్వ మొత్తంలో రూ.200 తగ్గాయి. బ్యాంక్‌కు వెళ్లి ఇదేమిటని అడిగితే.. ఏటీఎం కార్డును ఐదు పర్యాయలకంటే ఎక్కువసార్లు వినియోగిస్తే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. తణుకు పట్టణానికి చెందిన పి.పోసిబాబు మోటార్ సైకిల్ కొనుక్కుందామని షోరూమ్‌కు వెళ్లా డు. అతనికి చెక్కు బుక్ లేకపోవడంతో డెబిట్ కార్డు ద్వారా స్వైపింగ్ విధానంలో సొమ్ము చెల్లిస్తానన్నాడు. అలాగైతే 2 శాతం పన్ను కింద రూ.1,300 అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పడంతో వెనుదిరిగి వచ్చేశాడు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమçలు ఇవి. పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ఇబ్బందులు పడిన జనం ప్రభుత్వ సూచనల మేరకు నగదు రహిత లావాదేవీల వైపు క్రమంగా మళ్లుతున్నారు. అయితే, సేవా రుసుములు, పన్నుల పేరిట భారీ దోపిడీకి గురవుతున్నారు. మీ డబ్బు మీరు తీసుకున్నా.. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో రూ.2 వేలు, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. చిల్లర సమ స్య నేపథ్యంలో ప్రజలు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఏటీఎం నుంచి ఒకసారి రూ.1,500 తీసుకుంటే మాత్రమే రూ.500 నోట్లు వస్తున్నాయి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే రూ.2 వేల నోట్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.10 వేలు కావాలంటే రూ.2 వేల నోట్లు 5 వస్తున్నాయి. దీంతో.. ఏటీఎంల నుంచి రూ.1,500 చొప్పున 7 పర్యాయాలు సొమ్ము తీసుకోవాల్సి వస్తోంది. ఐతే, నెలలో 5పర్యాయాలకు మించి ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ప్రతి లావాదేవీపై రూ.20 రుసుం, ఆపై 15 శాతం పన్నును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. దీంతో, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగదు రహిత లావాదేవీలపైనా బాదుడే వివిధ వస్తువుల కొనుగోళ్లు కోసం వినియోగించే డెబిట్, క్రిడెట్ కార్డు లావాదేవీలకు సేవా రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఇలాంటి లావాదేవీలపై సంబంధిత వ్యాపార సంస్థలు 2శాతం చొప్పున సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు స్వైపింగ్ యం త్రాలు ఇచ్చినందుకు ప్రతి లావాదేవీపైనా ఇలా వసూలు చేస్తున్నాయని, ఈ విషయంలో తామేమీ చేయ లేమని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. పన్ను ఎందుకు కట్టాలి పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు అదనంగా పన్ను వసూలు చేస్తున్నారు. స్వైపింగ్ విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అమలు సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదనపు పన్నులు మేమెందుకు చెల్లించాలి. – ఇ.రాజేష్, వినియోగదారుడు, తణుకు 7సార్లు ఏటీఎం వాడితే రూ.200 పోయింది జీతాన్ని డ్రా చేసుకునేందుకు ఈనెలలో 7సార్లు ఏటీఎం కార్డు ఉపయోగించాను. నేను డ్రా చేసిన దానికంటే అదనంగా రూ.200 పోయాయి. బ్యాంక్ అధికారులను అడిగితే సేవా రుసుంగా వసూలు చేశామని చెప్పారు. – బట్టు అరవింద్‌కుమార్, జంగారెడ్డిగూడెం నగదు రహిత లావాదేవీలపైనా మినహాయింపు లేదు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ఎటువంటి చార్జీలు ఉండవని చెప్పిన బ్యాంకులు ప్రస్తుతం సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. నేను చేపల వ్యాపారం చేస్తుంటాను. స్వైపింగ్ మెషిన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపైనా బ్యాంకులు భారీగా పన్ను వసూలు చేస్తున్నాయి. – చింతపూడి పెద్దిరాజు, ఏలూరు -
స్వైపింగ్ మెషీన్లు అలంకారప్రాయమే
రిజస్ట్రేషన్ శాఖకు 32 మెషీన్ల అందజేత దాదాపు అన్నిచోట్లా వినియోగించని సిబ్బంది పట్టించుకోని డిఐజీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : నగదు రహిత లావాదేవీల కోసమంటూ స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖలో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసినా, వాటి వినియోగించింది లేదు. స్థిరాస్థి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఈసీలు, నకళ్లు తీసుకునేందుకు, ఇతర సేవలు పొందేందుకు జిల్లాలోని 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ లక్ష్మీకుమారి ఈ నెల 3న ఈ స్వైపింగ్ మెషీన్లు అందజేశారు.ఈసీలు, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి తీసుకున్న నగదుకు రసీదు ఇవ్వాలి.అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు వాటిని ఇవ్వడం లేదు. దీనివల్ల ఈసీ, నకలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజులపాటు ఈ కార్యాలయం చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వైపింగ్ మిషన్ వినియోగంలో ఉంటే లాభమేమిటి? స్వైపింగ్ మెషీన్ రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగంలో ఉంటే నగదు లావాదేవీలు జరిపే సమయం బిల్లులో వస్తుంది. సిటిజన్ చార్ట్ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న కక్షిదారుడికి కంప్యూటర్ ఈసీ గానీ, నకలు గానీ గంటలోగా ఇవ్వాలి. అదే మాన్యూల్ ఈసీగానీ, నకలు కానీ 24 గంటల్లో అందజేయాలి. ఈ కారణంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు స్వైపింగ్ మెషీన్‌ను పక్కన పెట్టి నగదు రూపంలో సొమ్ము తీసుకుంటున్నారు. నిర్ధేశిత సమయానికి ఇవ్వకపోతే పరిహారం సిటిజన్ చార్ట్ ప్రకారం నకళ్లు, ఈసీలు ఇవ్వాల్సిన సమయాన్ని ఖరారు చేస్తూ 2013లో జీవో నంబర్ 1054ను ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవో ప్రకారం కక్షిదారుడు కంప్యూటర్ ఈసీగానీ, నకలుకుగానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే ఆ ఉద్యోగి ప్రతి గంటకు రూ.10 చొప్పున కక్షిదారుడికి చెల్లించాలి. అలాగే మాన్యూల్ ఈసీగానీ, నకలు గానీ 24 గంటల్లో తిరిగి ఇవ్వకపోతే రూ.50 ఇవ్వాలి. స్వైపింగ్‌ను ఎందుకు ఉపయోగించడం లేదంటే... జిల్లాలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇవ్వడం లేదు. కారణం ఏమిటని కక్షిదారులు ప్రశ్నిస్తుంటే.... స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇస్తుంటే డైరెక్టుగా కక్షిదారులు ఇచ్చే సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆడిట్ జరిగినపుడు ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్ము జమ అయినట్టు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఖాతాకు వెళ్లక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. దీంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది స్వైపింగ్ మెషీన్లను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు ఇలా చిల్లు... 30 ఏళ్ల పైబడినవారు ఈసీ తీసుకుంటే రూ.520 రిజిస్ట్రేషన్‌శాఖకు చెల్లించాలి. 30 ఏళ్ల లోపు వారు ఈసీ తీసుకుంటే రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అయితే నగదు రూపంలో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారుల వద్ద నుంచి రూ.520 ఈసీకు తీసుకుని ప్రభుత్వ ఖాతాకు 30 ఏళ్ల లోపు వ్యక్తి తీసుకున్నట్టు చూపించి రూ.220 మాత్రమే జమ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కక్షిదారుడికి ఈసీ కానీ, నకలు కానీ ఇస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి తీసుకున్న నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. స్వైపింగ్ మెషీన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే కక్షిదారుడికి నష్టం ఉండదు. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడదు. జిల్లాలో అందజేసిన 32 స్వైపింగ్ మెషీన్లను ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని డీఐజీ పట్టించుకుంటే ఈ అక్రమాలను అరికట్టవచ్చు. -
ఇక ఆర్టీసీలోనూ క్యాష్‌లెస్!
మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: దేశంలోనే తొలిసారిగా ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలతో ప్రయాణికులకు సేవలందించేందుకు ఓ కొత్త ఒరవడికి సిద్దిపేట నాందిగా నిలిచిం దని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట డిపో పరిధిలోని 139 మంది కండ క్టర్లకు ఆదివారం ఆయన స్వైపింగ్ మిషన్లను అందజేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురయ్యాయ న్నారు. దీంతో పరోక్షంగా సిద్దిపేట డిపో రూ.80 లక్షల ఆదాయం కోల్పోయిందన్నా రు. ప్రయాణికులకు చిల్లర సమస్య ఉత్ప న్నం కాకుండా ఉండేందుకు సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజకవర్గంగా మార్చుతున్నామన్నారు. ఆర్టీసీలో స్వైపింగ్ ద్వారా టికెట్ల ప్రక్రియ పారదర్శకతకు దోహదపడుతుందన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణకు చైతన్యగడ్డగా పేరుపొందిన సిద్దిపేటను సీఎం కేసీఆర్ ఎంచుకుని.. ఈ ప్రాంత ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పించారన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణకు రూ.55 లక్షలను వెచ్చించామని, దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయలన్నారు. మంత్రి, చైర్మన్ క్యాష్‌లెస్ ప్రయాణం స్థానిక పాత బస్టాండ్ వద్ద సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ సంస్థ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మరో 10 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించారు. సిద్దిపేట నుంచి దుబ్బాకకు ఒక్కొక్కరికి రూ.16 చొప్పున 8 మంది టిక్కెట్లను మంత్రి హరీశ్‌రావు స్వైపింగ్ ద్వారా క్యాష్‌లెస్ పద్ధతిలో కండెక్ట ర్ బాలాజీరావుకు అందించి టికెట్లు తీసుకు న్నారు. మంత్రి దుబ్బాకలోని అభివృద్ధి కార్యక్రమానికి బస్సులోనే వెళ్లారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హన్మం తరావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఎంయూ జిల్లా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌ను రోల్‌మోడల్‌గా నిలుపుదాం దూరదృష్టితో సీఎం కేసీఆర్ సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు క్యాష్‌లెస్ విధానానికి సహకరించి హరీశ్‌ను రోల్ మోడల్‌గా నిలపాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. హరీశ్‌రావు మాట అంటే అది రూలేనన్నారు. -
ఆధార్‌తో నగదురహిత లావాదేవీలు
–ఈ నెల 10 నుంచి అమలు – నాలుగు మండలాల డీలర్ల అవగాహన సదస్సులో ఎల్డీఎం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థలో స్వైపింగ్ మిషన్‌తో అవసరం లేకుండా ఆధార్‌కార్డుతోనే నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసకుంటున్నట్లు ఎల్‌డీఏం నరసింహారావు తెలిపారు. ఆధార్ ఎనబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఏఈపీడీఎస్)పై శుక్రవారం కలెక్టరేట్లోని సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో కర్నూలు అర్బన్, రూరల్, కల్లూరు రూరల్, ఓర్వకల్ మండలాలకు చెందిన డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్వైపింగ్ మిషన్లు లేకుండా నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ నెల 10 నుంచి ప్రజా పంపిణీని నగదు ప్రమేయం లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ విధానంలో ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాతో విధిగా అనుసంధానం అయి ఉండాలని అప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. జన్‌దన్ పీడీఎస్ ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేయు విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కర్నూలు అర్బన్ సహాయ సరఫరా అధికారి వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.... ప్రతి డీలరు ఈ విధానం ద్వారా ఈ నెల 10 నుంచి సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీలర్ల సందేహాలు, అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఓ రాజరఘువీర్, సీఎస్డీటీలు పాల్గొన్నారు. -
స్వైపింగ్‌తో తంటా!
–ఆన్లైన్ లావాదేవీలపై అనుమానాలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు సత్యనారాయణ చౌదరి. ఒక ప్రభుత్వ అధికారి. నగదు కొరత నేపథ్యంలో ఈయన ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. కర్నూలులోని ఓ షాపింగ్ మాల్లో రూ.1000 సరుకులు కొన్నారు. స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు బదిలీకి తన ఏటీఎం కార్డును మూడు సార్లు స్వైపింగ్ చేశారు. తన ఖాతాలో డబ్బులు కట్ అయినప్పటికీ షాపింగ్ మాల్ ఖాతాకు జమ కాలేదు. ఈ అధికారికి ఒక్క షాపింగ్ మాల్లోనే కాదు. మరో చోట కూడా ఇలాగే జరిగింది. ...ఇతను ఒక్కరే కాదు జిల్లాలో పలువురికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు కొరత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు తదితరులు ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. అయితే ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రధానంగా స్వైపింగ్ మిషన్ల ద్వారా నగదు బదిలీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు తదితర ప్రధాన వ్యాపార సంస్థల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వైపింగ్ వల్ల వినియోగదారుడి ఖాతా నుంచి డబ్బు కట్ అవుతున్నా... వ్యాపార సంస్థల ఖాతాల్లో క్రెడిట్ కాకపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. నగదు రహిత లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వైపింగ్ మిషన్లపై వత్తిడి పెరగడంతో అనేక సందర్భాల్లో పనిచేయడం లేదు. జేబులో ఏటీఎం కార్డు పెటుకొని షాపింగ్ మాల్స్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసిన వారు తమ ఏటీఎంలు స్వైపింగ్ మిషన్లలో పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లావాదేవీల నేపథ్యంలో హ్యాకర్స్ బెడద కూడా ఉంటోంది. ఫోన్ల ద్వారా ఇతరుల ఖాతాల వివరాలు తెలుసుకొని సాంకేతికత ద్వారా అక్రమాలకు పాల్పడే వారు ఇటీవల పెరగారు. -
‘స్వైపింగ్’తో లబ్ధి కొంతే
సర్కార్ నగదు రహిత లావాదేవీలపై రిజిస్ట్రేషన్ల శాఖ అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్వైపింగ్ మెషిన్ల (డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు వీలు కల్పించే పరిక రాలు)ను ప్రవేశపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు స్వల్పమేనని ఉన్నతాధికారు లు భావిస్తున్నారు. నగదు రహిత లావా దేవీలను అమల్లోకి తెచ్చేందుకు స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అధికారులు మంగళ వారం కసరత్తు చేశారు. ఇటీవలే ప్రవేశపె ట్టిన ఈ-స్టాంప్స్, ఈ-చలాన్ల పనితీరు ప్రయోజనకరంగా ఉన్నందున ఇప్పటికి ప్పుడు స్వైపింగ్ మెషిన్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నా రు. పైగా స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులు చేయడం వల్ల సర్వీస్ చార్జి కింద వినియోగ దారులే ఎక్కువ సొమ్మును నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. నగదు చెల్లింపుల ద్వారా ఏటా రూ. 25 కోట్లకన్నా తక్కువ ఆదాయం వచ్చే లావాదేవీల కోసం స్వైపింగ్ యంత్రా లను భారీగా కొనుగోలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమో ఉన్నతాధి కారులు పరిశీలించాలని కోరుతున్నారు. ఏదేమైనా ‘స్వైపింగ్’ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆదేశాలు అందనందున తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా వచ్చే సుమారు రూ. 4 వేల కోట్ల వార్షికాదాయంలో అధిక భాగం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనే సమకూరుతుంది. తగ్గుముఖం పట్టిన లావాదేవీలు.. పాత నోట్లతో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల చెల్లింపునకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 24తో ముగియడంతో గత 4 రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు తగ్గుముఖం పట్టారుు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24న 5,422 లావాదేవీలు జరగ్గా మంగళవారం నాటికి రోజువారీ లావాదేవీ లు 1,805 పడిపోయారుు. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ నెల 24న రూ. 25 కోట్లు రాగా మంగళవారం నాటికి రూ.7 కోట్లకు తగ్గింది. -
స్వైప్ మిషన్ల ద్వారా ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్లు
– ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య కర్నూలు(రాజ్‌విహార్): అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు స్వైప్ మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేయాలని రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య అన్నారు. శనివారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా టికెట్లు కూడా నగదు రహితంగానే జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా రిజర్వేషన్ కౌంటర్లతో పాటు ఏటీబీ(అథరైజ్డ్ టికెట్ బుకింగ్) ఏజెంట్ల వద్ద కూడా స్వైప్ మిషన్లు ఉండేలా చూడాలన్నారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందుగా అంచనా వేసుకొని అందుక తగ్గట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో రీజినల్ మేనేజర్ గిడుగు వెంకటేశ్వరరావుతో పాటు డీసీటీఎంలు పాల్గొన్నారు.