ఆధార్‌తో నగదురహిత లావాదేవీలు
Published Sat, Jan 7 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
–ఈ నెల 10 నుంచి అమలు
– నాలుగు మండలాల డీలర్ల అవగాహన సదస్సులో ఎల్‌డీఎం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థలో స్వైపింగ్ మిషన్‌తో అవసరం లేకుండా ఆధార్‌కార్డుతోనే నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసకుంటున్నట్లు ఎల్‌డీఏం నరసింహారావు తెలిపారు. ఆధార్ ఎనబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఏఈపీడీఎస్)పై శుక్రవారం కలెక్టరేట్‌లోని సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో కర్నూలు అర్బన్, రూరల్, కల్లూరు రూరల్, ఓర్వకల్ మండలాలకు చెందిన డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్వైపింగ్ మిషన్‌లు లేకుండా నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ నెల 10 నుంచి ప్రజా పంపిణీని నగదు ప్రమేయం లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ విధానంలో ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాతో విధిగా అనుసంధానం అయి ఉండాలని అప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. జన్‌దన్ పీడీఎస్ ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేయు విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కర్నూలు అర్బన్ సహాయ సరఫరా అధికారి వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.... ప్రతి డీలరు ఈ విధానం ద్వారా ఈ నెల 10 నుంచి సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీలర్ల సందేహాలు, అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ రాజరఘువీర్, సీఎస్‌డీటీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement