cash less
-
నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?
ప్రస్తుతం దేశంలో నగదు రహిత చెల్లింపుల హవా పెద్ద ఎత్తున నడుస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ నుంచి రోడ్లపై ఉండే చిన్నా చితక దుకాణాల వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లే. ఇప్పటి వరకు మనం ఫోన్ లేదా క్యూర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం చేశాం. వాటన్నింటిని తలదన్నేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మరో చెల్లింపు విధానం వచ్చేసింది. దీన్నిచూస్తే అంతకు మించి..!..అని అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా చెల్లింపు విధానం అంటే..సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఈ సరికొత్త చెల్లింపు విధానం కనిపిస్తుంది. సాంకేతికతకు సంబంధించిన విషయంలో చైనా సాధించిన పురోగతి ప్రపంచ దేశాలను బాగా ఆకర్షిస్తాయి. అందుకు ఉదాహారణే ఈ సరికొత్త డిజిటల్ చెల్లింపు విధానం. ఔను..! చైనాలోని ఓ దుకాణంలో 'పామ్ పేమెంట్ పద్ధతి'లో చెల్లింపులు చెయ్యొచ్చు.ఇదేంటీ ఫోన్ లేదా క్యూర్ కాకుండా ఏంటీ పామ్ అంటే..? . ఏం లేదు జస్ట్ మన చేతిని స్కాన్ చేసి చెల్లించేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలా చేస్తారంటే..ఏం లేదు.. జస్ట్ పామ్ పామ్ ప్రింట్ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్నికి లింక్ అప్ చేస్తే చాలు. అంటే ఇక్కడ..ఒట్టి చేతులను స్కాన్ చేసి చెల్లింపులు చేసేయొచ్చు అన్నమాట. ఇది కాస్త భద్రతతో కూడిన సాంకేతికత. పైగా ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని చూస్తే కచ్చితంగా వాటే టెక్నాలజీ గురూ..! అనాలనిపిస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Rana Hamza Saif ( RHS ) (@ranahamzasaif) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
ఇకపై చిన్న ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్యం
ముంబై: ఆరోగ్య బీమా పాలసీదారులు త్వరలోనే అన్ని రకాల ఆస్పత్రుల్లోనూ నగదు రహిత వైద్యం పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఇందుకు సంబంధించి ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. జాబితాలో లేని హాస్పిటళ్లలోనూ పాలసీదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపింది. కనీసం 15 పడకలు ఉండి, ఆయా రాష్ట్రాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి నగదు రహిత వైద్యాన్ని ఆఫర్ చేయవచ్చు. దీంతో పాలసీదారులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే తమ పాకెట్ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయక్కర్లేదు. చికిత్సల వ్యయాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. క్లెయిమ్ అనుమతించడంపై చెల్లింపులు ఆధారపడి ఉంటాయని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. కొన్ని షరతులకు లోబడి పాలసీదారులు నగదు రహిత వైద్యం కోసం ఏ ఆస్పత్రిని అయినా ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. నాన్ ఎంపానెల్డ్ (బీమా సంస్థ జాబితాలో లేని) హాస్పిటల్లో చేరడానికి 48 గంటల ముందు లేదా, చేరిన 48 గంటల్లోపు బీమా సంస్థకు తెలిజేయాల్సి ఉంటుందని పేర్కొంది. బీమా సంస్థ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పుడు పాలసీదారులపై భారం పడకుండా చూడడమే దీని ఉద్దేశ్యమని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40వేల ఆస్పత్రుల్లోనే నగదు రహిత వైద్యం పాలసీదారులకు అందుబాటులో ఉండడం గమనార్హం. -
ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తన హెల్త్ పాలసీదారులకు మంచి ఆఫర్‌ను ప్రకటించింది. పాలసీదారులు నగదు రహిత వైద్యాన్ని ఏ ఆస్పత్రి నుంచి అయినా పొందొచ్చని.. నాన్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమలో ఈ తరహా ఆఫర్ మొదటిదిగా పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు వైద్యం కోసం కస్టమర్లు తమ పాకెట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఐఎల్ టేక్ కేర్’ యాప్ నుంచి ఈ నూతన సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. నగదు రహిత వైద్యాన్ని హాస్పిటళ్లు అందించడంపై ఆధారపడి ఉంటుందని, ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే పాలసీదారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తాము సూచించిన హాస్పిటల్ లేదంటే సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లొచ్చని సూచించింది. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! -
నగదు రహిత ఎకానమీకి చాలా దూరంలో: నీలేకని
న్యూఢిల్లీ: నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మనం చాలా దూరంలోనే ఉన్నామని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ కమిటీ చైర్మన్ అయిన నందన్ నీలేకని అన్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత ఆమోదనీయంగా మార్చేందుకు ఈ వ్యవస్థ చుట్టూ ఉన్న భద్రతా సంబంధిత అంశాలను పరిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 2019 ఇండియా ఫోరం ఫర్ పీసీఐ సెక్యూరిటీ స్టాండర్స్ కౌన్సిల్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీలేకని ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాల్లో కార్డులు, పీవోఎస్ రూపంలో డిజిటల్ చెల్లింపులు పెరిగినట్టు చెప్పారు. ‘‘నగదు తక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మనం చాలా దూరంలోనే ఉన్నాం. నగదు చాలా సౌకర్యం కావడమే దీనికి కారణం. ఎవరైనా నగదు స్వీకరిస్తారు. పైగా దీనికి ఎటువంటి లావాదేవీ చార్జీ ఉండదు. లావాదేవీల సంఖ్యలో సెక్యులర్ పెరుగుదలనే మనం చూస్తున్నాం. కార్డుల చెల్లింపుల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చాలి. లావాదేవీల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో తక్కువ సెక్యూరిటీ సమస్యలు, తక్కువ మోసాలు, తక్కువ వివాదాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని వివరించారు. ఉన్న సదుపాయాల నడుమ వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించడంతోపాటు, మరింత మందిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించడమనేది వాస్తవిక సవాలుగా నీలేకని పేర్కొన్నారు. -
ఆర్టీసీలో నగదు రహితం!
బస్‌స్టేషన్ (విజయవాడ సెంట్రల్) : ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్‌కు, ప్రయాణికులకు మధ్య తలెత్తుతున్న చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయోగాత్మకంగా బస్సుల్లో క్యాష్‌లెస్ విధానం అమలు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. సిటీ క్యాష్ సంస్థ ద్వారా క్యాష్ లెస్ విధానాన్ని ఆర్టీసీ బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు ఇటీవల ట్రయిల్‌రన్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు ప్రయాణికుడు ఆర్టీసీ నుంచి రూ.30కి కార్డు కొనుగోలు చేస్తాడు. దీన్ని తమ ప్రయాణాలకు అవసరమైన మేర నగదుతో రీచార్జ్ చేయించుకుంటారు. కార్డుతో బస్సు ఎక్కిన ప్రయాణికుడు కండక్టర్‌కు అందించగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్వైప్ మిషన్ ద్వారా టికెట్టుకు తగిన నగదు కోట్ చేస్తాడు. తద్వారా టికెట్టును ప్రయాణికుడికి ఇస్తారు. ఈ ప్రకారం అమలు జరిగితే బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు కొనసాగుతాయి. ఆ కార్డు తిరిగి ఆర్టీసీకి అప్పగిస్తే కార్డు కొనుగోలు చేసిన నగదు తిరిగి ఇస్తారు. ఐదు రోజులుగా ట్రయిల్‌రన్.. తొలిసారిగా కృష్ణా రీజియన్‌లో ఈ క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఆర్టీసీ అధికారులు గవర్నర్‌పేట–2, విద్యాధరపురం డిపోల్లో పరిశీలన చేశారు. విజయవాడ–పామర్రు రూట్లో సిటీక్యాష్ సిబ్బంది, కండక్టర్, డ్రైవర్లతో బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకోగా, ఈ విధానం సానుకూలంగా ఉందని తెలిసింది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే అమలు క్యాష్‌లెస్ విధానంపై ప్రయాణికుల నుంచి అనుకూల స్పందన వస్తే అమలు చేస్తాం. ప్రస్తుతం నిర్వహించిన రూట్ సర్వేలో స్పందన బాగుంది. ఈ విధానం నగరంలో అమలు చేయాలంటే సాహసమనే చెప్పాలి. సిటీక్యాష్ సంస్థ నుంచి ఆర్టీసీ కార్డులు కొనుగోలు చేసి ప్రయాణికులకు విక్రయిస్తుంది. – పీవీ రామారావు, ఆర్ఏం, కృష్ణా రీజియన్ -
పోస్టాఫీసుల్లో నగదు రహిత లావాదేవీలు
– స్వైప్ మిషన్ సేవలు ప్రారంభించిన పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగదు రహిత లావాదేవీలను డివిజన్లోని అన్ని ప్రధాన తపాలా కేంద్రాలకు విస్తరింపజేస్తామని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో స్వైప్ మిషన్ సేవలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనీయార్డర్, రిజిష్టర్డ్ పోస్టు, ఫారిన్ పార్సిల్స్ వంటి వాటితో పాటు ఇతరత్రా లావాదేవీలకు వినియోగదారులు డబ్బును ఏటీఎం కార్డుల ద్వారా చెల్లించొచ్చన్నారు. 15 స్వైపింగ్ మిషన్లకు ప్రతిపాదన పంపామని, త్వరలో ఆదోని హెడ్ పోస్టాఫీసుతో పాటు డివిజన్ పరిధిలోని సెలెక్షన్ గ్రేడ్ పోస్టాఫీసుల్లో స్వైపింగ్ మిషన్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కలెక్టరేట్ పక్కన త్వరలో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్వైప్ మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పోస్టుమాస్టర్ ఎద్దుల డేవిడ్, ఏపీఎం బషీరుద్దీన్, ఫిలాటలీ ఇన్చార్జి నాగవెంకటేశ్వర్లు, ఏఓ లలిత తదితరులు పాల్గొన్నారు. -
పుల్లమ్మకు రూ.లక్ష బహుమతి
- నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రోత్సాహకం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీలో నగదు రహిత లవాదేవీలు నిర్వహించిన మహిళకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి లభించింది. ప్రజాపంపిణీలో నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రతి నెలా ప్రోత్సాహక బహుమతులను ప్రకటిస్తోంది. డిప్ ద్వారా కార్డుదారులను ఎంపిక చేస్తోంది. మార్చి నెలలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారిలో లాటరీ ద్వారా విజయవాడలో శనివారం కార్డుదారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చందమాల పుల్లమ్మ( కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 130802000313)కు రూ.లక్ష నగదు బహుమతి లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రం మొత్తం మీద 5వేల మంది కార్డుదారులు స్మార్ట్ఫోన్లకు ఎంపిక కాగా ఇందులో జిల్లాకు సంబంధించి 330 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. నగదు రహితంలో కర్నూలు జిల్లా ఫస్ట్ ప్రజాపంపణీలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రానికి 19,046వేల కార్డులకు సరుకులు ఇవ్వగా నగదు రహితంపై 4,797 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. -
ఖాతాదారులందరికీ రూపేకార్డులు
- కేడీసీసీబీ ద్వారా 1.05 లక్షల కార్డులు పంపిణీ లక్ష్యం - 1997కు ముందు రుణ బకాయిదారులకు వన్‌లైమ్ సెటిల్మెంట్ - జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): నగదురహిత లావాదేవీల నిర్వహణకు వీలుగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఖాతాదారులకు రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. జిల్లాలో 1.05 లక్షల రూపే కార్డులు పంపిణీ చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10వేల కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... రూపే కార్డులు పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. రైతులు, ఇతర ఖాతాదారులు సంబంధిత బ్రాంచీల ద్వారా వీటిని పొందవచ్చన్నారు. 2016-17లో రూ.20 కోట్ల కొత్త పంట రుణాలు, రూ. 120 కోట్ల దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేసినట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల రికవరీ 50శాతం పైగా ఉందని చెప్పిన చైర్మన్ నెలాఖరులోగా 70శాతానికి చేరుతుందన్నారు. నెలాఖరులోగా రుణాలు చెల్లిస్తే అపరాద వడ్డీ ఏమీ ఉండదని చెప్పిన చైర్మన్ గడువులోగా రుణాలు చెల్లించాలని రైతులకు సూచించారు. 1997వ సంవత్సరానికి ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు చెల్లించని వారికోసం వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు నిరర్థక ఆస్తులను గణనీయంగా తగ్గించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. -
నగదు రహితానికే ప్రాధాన్యం
- సమస్యలుంటే తప్ప నగదు లావాదేవీలు వద్దు - ప్రజా పంపిణీపై జేసీ హరికిరణ్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): చౌక ధరల దుకాణాల్లో నగదు రహితంపై మాత్రమే సరుకుల పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సి.హరికరణ్ తెలిపారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు, సరుకుల పంపిణీ నిలిచిపోయిన కార్డుదారులు ఇక్కట్లు పడుతున్న సందర్బాల్లో మాత్రమే నగదుపై సరుకులు ఇవ్వాలని జేసీ ఆదివారం ఒక ప్రకటనలో డీలర్లకు సూచించారు. ముందుగా నగదు రహిత లావాదేవీలకే ప్రయత్నించాలన్నారు. ఈ పాస్ మిషన్‌పై సాంకేతిక సమస్యలు (ఎర్రర్కోడ్) కనిపించినపుడు మాత్రమే నగదుపై సరుకులు పంపిణీ చేయవచ్చన్నారు. -
కష్టాలు ’డబ్బు’ల్
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం తొలిరోజే బెడిసి కొట్టిన ప్రయోగం 2.40 శాతం మందికే సరుకుల పంపిణీ లక్షలాది మందికి బ్యాంకు ఖాతాలు లేకున్నా ఖాతరు చేయని ప్రభుత్వం కొవ్వూరు : నగదు రహిత విధానమంటూ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్ సరుకులపై ఆధారపడి జీవించే బడుగు జీవులపై బలవంతంగా క్యాష్‌లెస్ విధానాన్ని ప్రయోగిస్తోంది. మార్చిలో నూరుశాతం నగదు రహిత విధానంలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో తొలిరోజైన బుధవారం డబ్బు తీసుకుని రేషన్ షాపులకు వెళ్లిన వారిని డీలర్లు సరుకులు ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ఇదిలా ఉంటే బ్యాంకుల సర్వర్లు పని చేయకపోవడంతో ఉదయం 10.30 గంటల నుంచి నగదు రహిత విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా 11,96,775 రేషన్ కార్డులు, 2,163 చౌక ధరల దుకాణలున్నాయి. మొత్తం రేషన్ కార్డుల్లో 32,49,664 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. తొలిరోజు 28,545 కార్డుదారులకు మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. ప్రతి నెలా ఐదో తేదీ నాటికే 90 శాతం సరుకుల పంపిణీ పూర్తి చేసేవారు. అంటే రోజుకు సగటున 23 శాతం రేషన్ పంపిణీ పూర్తయ్యేది. అటువంటిది ఈనెల మొదటి రోజు నగదు రహిత విధానం పుణ్యమా అని జిల్లాలో 2.40 శాతం కార్డుదారులకు మాత్రమే సరుకులు ఇవ్వగలిగారు బ్యాంక్ ఖాతాలు లేకపోయినా.. కార్డుదారుల్లో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ పరిస్ధితుల్లో క్యాష్ లెస్ విధానం అమలు సాధ్యం కాదని అధికారులకు తెలిసినా బలవంతపు ప్రయోగాలతో జనాన్ని అవస్థల పాల్జేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా పేదలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నగదు రహిత విధానంలో రేషన్ సరుకులు పొందాలంటే బ్యాంకు ఖాతాలో కనీసం రూ.100 నగదు ఉండాలి. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునే కూలీలకు ఈ విధానం ఎంతవరకు ఉపకరిస్తుందనేది ప్రశ్న. బ్యాంక్ ఖాతాలు ఉన్నా ఆధార్ అనుసంధానమైతేనే వారి పేర్లు డేటా మ్యాపింగ్‌లోకి వెళతాయి. అలా వెళ్లిన వారి ఖాతాలో సొమ్ములుంటే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే నగదు రహిత విధానం నూరుశాతం అమలు చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
- డీలర్ల అవగాహన సదస్సులో ఎల్డీఎం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో వందశాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలని ఎల్డీఎం నరసింహారావు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై చౌకధరల దుకాణాల డీలర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పినో కంపెనీ, ఐజీఎస్ ఇంటిగ్రాస్ కంపెనీలు ప్రజాపంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు సాంకేతిక సహకారం ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు ఎల్డీఎం తెలిపారు. నగదు ప్రమేయం లేని లావాదేవీలు వంద శాతం అమలు కావాలంటే కార్డుదారుల బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబరుతో అనుసంధానించాలన్నారు. బ్యాంక్ సర్వర్‌ను ఎన్ఐసీ సర్వర్‌తో లింకప్ చేయడం ద్వారా ఈ-పాస్ మిషన్ ద్వారానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. కార్డుదారులు ఈ-పాస్ మిషన్‌లో వేలిముద్ర వేస్తే బ్యాంకు ఖాతా వివరాలు వస్తాయని తెలిపారు. సరుకులు, వాటి ధరలను బట్టి వెంటనే బిల్లు జనరేట్ అవుతుందని, దాని ప్రకారం అమౌంటు కార్డుదారుని ఖాతా నుంచి డీలరు ఖాతాకు జమ అవుతుందని వివరించారు. జిల్లాలో 1556 మంది డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించినట్లు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ ఎఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, పినో కంపెనీ ప్రతినిధి చంద్రమోహన్ నాయుడు, ఐజీఎస్, ఇంటిగ్రాస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్వైపింగ్ బాదుడు.. చార్జీల కుమ్ముడు
ఏలూరు (మెట్రో)/తణుకు : నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రభుత్వం, అధికారులు ఊదరగొడుతుండటంతో తాడేపల్లిగూడెంకు చెందిన యోహాన్ అనే యువకుడు కరెంటు బిల్లు చెల్లించేందుకు డెబిట్ కార్డు తీసుకెళ్లాడు. ఆ కార్డు సాయంతో మీ సేవ కేంద్రంలో కరెంటు బిల్లు నిమిత్తం రూ.460 చెల్లించాడు. సర్వీస్ చార్జీల రూపంలో రూ.5, డెబిట్ కార్డు వినియోగించినందుకు ట్యాక్స్ రూపంలో రూ.5 అతడి ఖాతా నుంచి ఎగిరిపోయాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన అరవింద్‌కుమార్ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఏడుసార్లు ఏటీఎం కార్డును ఉపయోగించి నగదు డ్రా చేశాడు. తీసుకున్న సొమ్ము పోగా తన పొదుపు ఖాతాలో ఉండాల్సిన నిల్వ మొత్తంలో రూ.200 తగ్గాయి. బ్యాంక్‌కు వెళ్లి ఇదేమిటని అడిగితే.. ఏటీఎం కార్డును ఐదు పర్యాయలకంటే ఎక్కువసార్లు వినియోగిస్తే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. తణుకు పట్టణానికి చెందిన పి.పోసిబాబు మోటార్ సైకిల్ కొనుక్కుందామని షోరూమ్‌కు వెళ్లా డు. అతనికి చెక్కు బుక్ లేకపోవడంతో డెబిట్ కార్డు ద్వారా స్వైపింగ్ విధానంలో సొమ్ము చెల్లిస్తానన్నాడు. అలాగైతే 2 శాతం పన్ను కింద రూ.1,300 అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పడంతో వెనుదిరిగి వచ్చేశాడు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమçలు ఇవి. పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ఇబ్బందులు పడిన జనం ప్రభుత్వ సూచనల మేరకు నగదు రహిత లావాదేవీల వైపు క్రమంగా మళ్లుతున్నారు. అయితే, సేవా రుసుములు, పన్నుల పేరిట భారీ దోపిడీకి గురవుతున్నారు. మీ డబ్బు మీరు తీసుకున్నా.. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో రూ.2 వేలు, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. చిల్లర సమ స్య నేపథ్యంలో ప్రజలు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఏటీఎం నుంచి ఒకసారి రూ.1,500 తీసుకుంటే మాత్రమే రూ.500 నోట్లు వస్తున్నాయి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే రూ.2 వేల నోట్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.10 వేలు కావాలంటే రూ.2 వేల నోట్లు 5 వస్తున్నాయి. దీంతో.. ఏటీఎంల నుంచి రూ.1,500 చొప్పున 7 పర్యాయాలు సొమ్ము తీసుకోవాల్సి వస్తోంది. ఐతే, నెలలో 5పర్యాయాలకు మించి ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ప్రతి లావాదేవీపై రూ.20 రుసుం, ఆపై 15 శాతం పన్నును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. దీంతో, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగదు రహిత లావాదేవీలపైనా బాదుడే వివిధ వస్తువుల కొనుగోళ్లు కోసం వినియోగించే డెబిట్, క్రిడెట్ కార్డు లావాదేవీలకు సేవా రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఇలాంటి లావాదేవీలపై సంబంధిత వ్యాపార సంస్థలు 2శాతం చొప్పున సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు స్వైపింగ్ యం త్రాలు ఇచ్చినందుకు ప్రతి లావాదేవీపైనా ఇలా వసూలు చేస్తున్నాయని, ఈ విషయంలో తామేమీ చేయ లేమని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. పన్ను ఎందుకు కట్టాలి పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు అదనంగా పన్ను వసూలు చేస్తున్నారు. స్వైపింగ్ విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అమలు సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదనపు పన్నులు మేమెందుకు చెల్లించాలి. – ఇ.రాజేష్, వినియోగదారుడు, తణుకు 7సార్లు ఏటీఎం వాడితే రూ.200 పోయింది జీతాన్ని డ్రా చేసుకునేందుకు ఈనెలలో 7సార్లు ఏటీఎం కార్డు ఉపయోగించాను. నేను డ్రా చేసిన దానికంటే అదనంగా రూ.200 పోయాయి. బ్యాంక్ అధికారులను అడిగితే సేవా రుసుంగా వసూలు చేశామని చెప్పారు. – బట్టు అరవింద్‌కుమార్, జంగారెడ్డిగూడెం నగదు రహిత లావాదేవీలపైనా మినహాయింపు లేదు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ఎటువంటి చార్జీలు ఉండవని చెప్పిన బ్యాంకులు ప్రస్తుతం సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. నేను చేపల వ్యాపారం చేస్తుంటాను. స్వైపింగ్ మెషిన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపైనా బ్యాంకులు భారీగా పన్ను వసూలు చేస్తున్నాయి. – చింతపూడి పెద్దిరాజు, ఏలూరు -
నగదు రహితంతో అవినీతి అంతం
కర్నూలు(అర్బన్): అవినీతి నిర్మూలనకు నగదు రహిత లావాదేవీలు సహకరిస్తాయని 28 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ బీవీ మధుసూదనన్ అన్నారు. శనివారం స్థానిక ఉస్మానియా కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ ఈ – లావాదేవీలు – నగదు రహిత కొనుగోళ్లు’ అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రధానమైనదని, అభివృద్ధి అంశాల్లో ఎస్సీసీ విద్యార్థులు పాలుపంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ మేనేజర్ ఎంఏఎస్ హరిబాబు, బ్రాంచ్ మేనేజర్ డి.లక్ష్మినరసింహులు, అసిస్టెంట్ మేనేజర్ ఏ విజయకుమార్ సెల్‌ఫోన్ ద్వారా లావాదేవీలను ఏ విధంగా చేయవచ్చో, బ్యాంకు సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పించారు. ఈ- చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి కొనుగోలుకు జవాబుదారితనం పెరుగుతుందని, దేశ ఆదాయం పెరగడమే గాకుండా దేశాభివృద్ధికి తోడ్పడిన వారమవుతామన్నారు. సమావేశంలో ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరసిలార్ మహమ్మద్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ సయ్యద్ సమీఉద్దీన్, ఎన్సీసీ అధికారి మండీ అన్వర్‌హుసేన్ పాల్గొన్నారు. -
ఆధార్‌తో నగదురహిత లావాదేవీలు
–ఈ నెల 10 నుంచి అమలు – నాలుగు మండలాల డీలర్ల అవగాహన సదస్సులో ఎల్డీఎం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థలో స్వైపింగ్ మిషన్‌తో అవసరం లేకుండా ఆధార్‌కార్డుతోనే నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసకుంటున్నట్లు ఎల్‌డీఏం నరసింహారావు తెలిపారు. ఆధార్ ఎనబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఏఈపీడీఎస్)పై శుక్రవారం కలెక్టరేట్లోని సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో కర్నూలు అర్బన్, రూరల్, కల్లూరు రూరల్, ఓర్వకల్ మండలాలకు చెందిన డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్వైపింగ్ మిషన్లు లేకుండా నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ నెల 10 నుంచి ప్రజా పంపిణీని నగదు ప్రమేయం లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ విధానంలో ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాతో విధిగా అనుసంధానం అయి ఉండాలని అప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. జన్‌దన్ పీడీఎస్ ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేయు విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కర్నూలు అర్బన్ సహాయ సరఫరా అధికారి వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.... ప్రతి డీలరు ఈ విధానం ద్వారా ఈ నెల 10 నుంచి సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీలర్ల సందేహాలు, అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఓ రాజరఘువీర్, సీఎస్డీటీలు పాల్గొన్నారు. -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
నగదు రహిత లావాదేవీలకు ఎం పాస్ మిషన్లు
– ఆంధ్రాబ్యాంకు డీజీఎం వెల్లడి కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రాబ్యాంకులో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఎం పాస్ మిషన్లు వినియోగిస్తున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని వ్యాపారులకు ఎం పాస్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రీజియన్‌కు ఎం.పాస్ మిషన్లు 80 వచ్చాయన్నారు. ఒక మిషన్‌కు ఒక కరంట్ ఖాతాతోనే లావాదేవీలు నిర్వహించవచ్చని, అయితే మొబైల్ ఫోన్లను మాత్రం ఒకటి కంటే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో 4.70 లక్షల మంది పొదుపు మహిళలు ఉన్నారని, వీరందరినీ నగదు రహిత లావాదేవీల వైపు మళ్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏజీఎం, మేనేజర్లు బిజిలీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్వైపింగ్‌తో తంటా!
–ఆన్లైన్ లావాదేవీలపై అనుమానాలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు సత్యనారాయణ చౌదరి. ఒక ప్రభుత్వ అధికారి. నగదు కొరత నేపథ్యంలో ఈయన ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. కర్నూలులోని ఓ షాపింగ్ మాల్లో రూ.1000 సరుకులు కొన్నారు. స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు బదిలీకి తన ఏటీఎం కార్డును మూడు సార్లు స్వైపింగ్ చేశారు. తన ఖాతాలో డబ్బులు కట్ అయినప్పటికీ షాపింగ్ మాల్ ఖాతాకు జమ కాలేదు. ఈ అధికారికి ఒక్క షాపింగ్ మాల్లోనే కాదు. మరో చోట కూడా ఇలాగే జరిగింది. ...ఇతను ఒక్కరే కాదు జిల్లాలో పలువురికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు కొరత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు తదితరులు ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. అయితే ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రధానంగా స్వైపింగ్ మిషన్ల ద్వారా నగదు బదిలీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు తదితర ప్రధాన వ్యాపార సంస్థల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వైపింగ్ వల్ల వినియోగదారుడి ఖాతా నుంచి డబ్బు కట్ అవుతున్నా... వ్యాపార సంస్థల ఖాతాల్లో క్రెడిట్ కాకపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. నగదు రహిత లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వైపింగ్ మిషన్లపై వత్తిడి పెరగడంతో అనేక సందర్భాల్లో పనిచేయడం లేదు. జేబులో ఏటీఎం కార్డు పెటుకొని షాపింగ్ మాల్స్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసిన వారు తమ ఏటీఎంలు స్వైపింగ్ మిషన్లలో పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లావాదేవీల నేపథ్యంలో హ్యాకర్స్ బెడద కూడా ఉంటోంది. ఫోన్ల ద్వారా ఇతరుల ఖాతాల వివరాలు తెలుసుకొని సాంకేతికత ద్వారా అక్రమాలకు పాల్పడే వారు ఇటీవల పెరగారు. -
పనితీరులో మార్పు రాదా?
ఏలూరు సిటీ : నెల రోజుల్లో ఏడుగురికి మాత్రమే మొబైల్ బ్యాంకింగ్ చేయిస్తారా? 14 సార్లు స్వయంగా చెప్పినా పనితీరులో మార్పులేదు. మండలంలో ఒక్కరికే రూపే కార్డు ఇప్పించారు.. ఇలా అయితే ఎలా? పనిచేయమంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారే తప్ప నేను చెప్పిన పనిచేయకపోతే నాకు మనోభావాలు ఉండవా? అంటూ చింతలపూడి ఎంపీడీవో రాజశేఖర్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని ఎంపీడీవోల సమావేశంలో నగదురహిత లావాదేవీలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర మండలాల్లో ఎంసీసీఐ మ్యాపింగ్ వందల సంఖ్యలో జరుగుతుంటే ఒక్క చింతలపూడిలోనే కేవలం సింగిల్ డిజిట్‌తో ఉండటం చూస్తే ఎంపీడీవో పనితీరుకు అద్ధం పడుతోందని కలెక్టర్ చెప్పారు. ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఒక మహిళ ఫోన్ చేసి చింతలపూడి ఎంపీడీవో అసలు ఆఫీసుకే రారని వచ్చినా సరైన సమాధానం చెప్పరని ఫిర్యాదు చేసిందన్నారు. 18 వేల ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం, తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలో ఫీల్డ్ చానల్స్ తవ్వకం, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే రాబోయే రెండు నెలల్లో రూ.60 లక్షల పనిదినాలు కల్పించడం కష్టం కాదన్నారు. ఇది నా జిల్లానే : కలెక్టర్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని చెబుతున్నారే తప్ప మరోవిధంగా తాము భావించడం లేదని, అయితే ఎంపీడీవోలంతా ఒకే స్థాయిలో పనిచేయాలని చెప్పడం వల్ల కొన్నిచోట్ల వీక్నెస్ వల్ల ఆశించిన మేరకు పనులు జరగడం లేదని, మా జిల్లా అభివృద్ధికి మేము కష్టపడతామని ఎంపీడీవో పరదేశికుమార్ చెప్పగా కలెక్టర్ స్పందిస్తూ ఇది నా జిల్లానే.. నేను కలెక్టర్‌గా పనిచేసే అవకాశం పశ్చిమలో కలిగిందని, తన స్వస్థలం పక్క జిల్లా అయినప్పటికీ యాధృచ్చికంగా పశ్చిమలో పనిచేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 315 కిలోమీటర్లు మాత్రమే సీసీ రోడ్లు వేసుకున్నామని, మరో 400 కిలోమీటర్లు పొడవునా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసుకోవడానికి కష్టపడమంటే బాధపడితే ఎలా? అని కలెక్టర్ ప్రశ్నించారు. జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్.అమరేశ్వరరావు పాల్గొన్నారు. -
సహకారం.. నగదు రహితం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకుతో సహా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నగదు రహిత సేవలు అందించడానికి చర్యలు ఊపందుకున్నాయి. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగదు రహిత సేవలు అందించేందుకు వీలుగా ఎంపాస్ మిషన్లను మంత్రుల చేతుల మీదుగా కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఇఓ రామాంజనేయులు అందకున్నారు. త్వరలోనే జిల్లాలోని 95 సహకార సంఘాలకు ఎంపాస్ మిషన్లను పంపిణీ చేయనున్నారు. అదే విధంగా డీసీసీబీ బ్రాంచీల్లోను నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు -
ఈ-పోస్..తుస్!
- జిల్లాకురాని యంత్రాలు - దరఖాస్తులకు లభించని మోక్షం - అవసరం 10 వేలు..వచ్చింది శూన్యం - నత్తనడకన.. ‘నగదు రహితం’ - ప్రజలకు తప్పని నోటు కష్టాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలుకు చెందిన రమేష్ నెలవారీ సరుకుల కోసం పాత బజారుకు వెళ్లాడు. అక్కడ సరుకులు మొత్తం తీసుకున్న తర్వాత బిల్లు చూస్తే రూ.2,300 అయ్యింది. బిల్లు చెల్లించేందుకు కార్డు తీసి స్వైప్ చేయమన్నాడు. అయితే, తమ వద్ద ఈ–పోస్ యంత్రం లేదని.... నగదు అదీ కొత్త నోట్లు ఇవ్వాలని షాపు యజమాని చెప్పారు. రోజంతా క్యూలో నిలబడి సంపాదించి రూ.2 వేల నోటుతో పాటు నూరు రూపాయల వంద నోట్లు కలిపి బిల్లు చెల్లించాడు రమేష్. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దుస్తులు కొనుగోలు చేసిన విజయ్‌దీ ఇదే పరిస్థితే.... జిల్లాలో సామాన్య వినియోగదారులు ఎదుర్కొంటున్న రోజువారీ కరెన్సీ కష్టాలకు ఇవి ఉదాహరణ. నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను పెంచాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ–పోస్ యంత్రాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని వ్యాపార, వాణిజ్య వర్గాలకు ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు ఉండటం లేదు. నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు తాము సిద్ధమని... ఇందుకోసం ఈ–పోస్ యంత్రాలు ఇవ్వాలని పలు వ్యాపార, వాణిజ్యవర్గాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు వారికి యంత్రాలను మాత్రం సరఫరా చేయలేకపోయారు. ఫలితంగా రోజంతా ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే వచ్చిన రూ.2 వేల నోటును ఈ విధంగా ఖర్చు చేయాల్సి వస్తోందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. అవసరం 10 వేలు...ఇచ్చింది సున్నా! వాస్తవానికి జిల్లావ్యాప్తంగా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు వారితో జిల్లా యంత్రాంగం గత నెలలోనే సమావేశాన్ని నిర్వహించింది. ఈ–పోస్ యంత్రాలను ప్రతీ వ్యాపారి ఏర్పాటు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఇందుకు ఆయా వర్గాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇందుకు అనుగుణంగా గత నెల 20వ తేదీనే అనేక మంది ఈ–పోస్ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 22 రోజులు గడిచినప్పటికీ ఒక్క యంత్రం కూడా వీరికి చేరలేదు. ఎప్పుడు వస్తాయనే విషయాన్ని కూడా ఏ ఒక్కరూ నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితులల్లో నగదు.. అదీ కొత్త నోట్లు ఇస్తేనే సరుకులు ఇస్తున్నామని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. పనిచేయని ఏటీఎంలు..! జిల్లావ్యాప్తంగా 475 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో సోమవారం పనిచేసిన ఏటీఎంలు కేవలం నాలుగంటే నాలుగే. ఇందులోనూ ఒక ఏటీఎం కేవలం రెండు గంటలపాటు మాత్రమే పనిచేసింది. అనంతరం నగదు అయిపోవడంతో గంటలకొద్దీ ఏటీఎంల ముందు నిలుచుకున్న ప్రజలు ఊసురోమని మరో ఏటీఎం వద్దకు పోవాల్సి వచ్చింది. ఇక కర్నూలు నగరంలో కేవలం రెండు ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ రెండింటి ద్వారానే నగర ప్రజలందరూ నగదు తీసుకోవాల్సి వస్తుండటంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఇక క్యూలో గంటలకొలదీ నిల్చోలేని వృద్ధులు.... యువతను పిలిచి రూ.200 ఇస్తామంటూ ఏటీఎం కార్డును అప్పగించి ఒక పక్కన కూర్చోని వేచిచూశారు. ఈ విధంగా అనేక మంది యువకులు క్యూలో నిలబడి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే, తమకు వచ్చే రూ.2 వేల లోనూ ఈ విధంగా రూ.200 పోగొట్టుకోవాల్సి వస్తోందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నగదు కష్టాలు జిల్లాలో రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రమూ తగ్గడం లేదు. -
సంక్షోభ నివారణకే నగదు రహితం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ’సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కరెన్సీని పూర్తిగా రద్దు చేయలేదని, ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను అధిగమించేందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రైతులకు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు ఉంచడం, చిన్ననోట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏటీఎంల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం ఉందని, బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు ఉపసంహరణ పరిమితి నిర్దేశించినప్పటికీ సక్రమంగా అమలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టిందన్నారు. దీనివల్ల ధరల స్థిరీకరణకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ఈ–బ్యాంకింగ్ అందుబాటులోకి రావడం ద్వారా లావాదేవీలు మరింత సులభతరమవుతాయని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బినామీలు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు మున్సిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధారాణి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కేఎస్వీ సత్యన్నారాయణ, ఎంపీడీవో ఎ.రాము, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మ¯ŒS పరిమి హరిచరణ్, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, స్పెషల్ గ్రేడ్ ఏఎంసీ కార్యదర్శి ఏఆర్కే ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS దుద్దుపూడి రాజారమేష్, మున్సిపల్ టీపీవో పి స్వరూపారాణి, అసిస్టెంట్ ఏసీటీవో ఎంఎస్ ప్రకాశరావు, ఏపీఎం ఇ.మహాలక్ష్మి, సీడీపీవో వైబీటీ సుందరి, ఈవోపీఆర్డీ కె. జా¯ŒSలింకన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధి వీరభద్రస్వామి(భద్రం), సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడు పులపా సత్యన్నారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు చిలంకుర్తి వెంకట సుబ్బారావు(బాబి), రైస్ అండ్ కిరాణా మర్చంట్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఎంబీఎస్ ప్రసాద్(దత్తుడు), సీఐటీయూ నాయకులు ఎంఎం సుందరబాబు, దగ్గు రాధాకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మ¯ŒS మట్టే నారాయణమూర్తి, పాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహితంపై చైతన్యం
నగరంలో భారీ ర్యాలీలు కర్నూలు సిటీ: నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగహన కల్పించేందుకు మంగళవారం ఆర్యూ అనుబంధ డిగ్రీ కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విభాగం, ఎన్సీసీ విభాగాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. నగదు లావాదేవీలను పోత్సహిద్దాం...అవినీతిని అరికడదామని నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేశారు. ఆయా కాలేజీల నుంచి బయలుదేరిన విద్యార్థులు కలెక్టర్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో జేసీ హరికిరణ్, ఆర్యూ వీసీ వై.నరసింహూలు, రిజిస్ట్రార్ బి.అమర్నాథ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, ఇందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను తెరవాలన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని, ధరలు నియంత్రణలో ఉంటాయన్నారు. దీనిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, చూట్టు పక్కల వారికి అవగహన కల్పించాలని కోరారు. – స్థానిక రామచంద్రనగర్లోని శ్రీసాయి క్రిష్ణ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, శ్రీసాయి క్రిష్ణ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థులు నిర్వహించిన ర్యాలీని జిల్లా ఏస్పీ ఆకే రవికృష్ణ ప్రారాంభించారు. ఈ సందర్భంగా ఏస్పీ మాట్లాడుతూ అవినీతి నిర్మూన భారత దేశాన్ని నిర్మించాలంటే ప్రతి ఒక్కరు నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. ఈ ర్యాలీలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రోషిరెడ్డి, అకడామిక్ అడ్వజర్ గోవర్ధన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, 3వ పట్టణ సీఐ మధుసూదన్‌రావులు ల్గొన్నారు. – కేవిఆర్ మహిళ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థులు ఆ కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ డా.రాజేశ్వరి ఆధ్వర్యంలో కాలేజీ దగ్గర నుంచి ఆర్ఎస్ రోడ్డు, రాజ్‌విహార్ మీదుగా ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. – బిక్యాంపులోని సిల్వర్‌జూబ్లీ కాలేజి చెందిన విద్యార్థులు ర్యాలీగా అవినీతి రహిత భారత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని నినాదాలు చేసుకుంటు ర్యాలీ నిర్వహించారు. – ఉస్మానియా కాలేజీకి చెందిన ఎన్సీసీ విద్యార్థులు నగదు రహిత లావాదేవీలపై ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఆ కాలేజీ ఎన్సీసీ అధికారి మండి హూసేన్, ప్రిన్సిపాల్ డా.సిలార్ మహమ్మద్ పాల్గొన్నారు. – రాయల సీమ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇందులో ఆర్యూ వీసీ, రిజిస్ట్రార్, విద్యార్థులు పాల్గొన్నారు. – ఎస్టీబీసీ కాలేజీకి చెందిన విద్యార్థులు ఆర్ఎస్ రోడ్డు, రాజ్‌విహార్, మెడికల్ కాలేజీ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. -
ఆన్లైన్ లావాదేవీలు సులభతరం
- జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): ఆన్లైన్ లావాదేవీలు సులభతరమని, నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. బుధవారం ఎంఈఓలు, బ్యాంకర్లు, డిగ్రీ, జూనియర్ కళాశాల అధ్యాపకులు, వివిధ వర్గాల వారికి ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యాక్సిస్ పే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ద్వారా సులభంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చేపట్టవచ్చని వివరించారు. నగదు బదిలీ కూడా సెల్‌ఫోన్ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. ఆధార్ యనబుల్టీ పేమెంటు సిస్టమ్ ద్వారా ఒక ఆధార్ నుంచి మరో ఆధార్‌కు నగదు, విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్, నగదు బదిలీ వంటి వాటిని చేపట్టవచ్చని వివరించారు. మైక్రో ఏటీఎంల ద్వారా సులభంగా లావాదేవీలు నిర్వహించవచ్చని సూచించారు. ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారాలపై హైస్కూళ్లలో 8,9, 10 తరగతుల విద్యార్థులకు, జూనియర్, డిగ్రీ విద్యార్థులందరికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహరావు, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలతో మెరుగైన ఆర్థిక వ్యవస్థ
కర్నూలు : నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం నగదు రహిత లావాదేవీలపై పోలీసు కుటుంబాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ, రాయలసీమ ఐజీ ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు. లావాదేవీలపై అపోహలు తొలగించడం పోలీసుల బాధ్యత అన్నారు. కార్డులు స్వైప్ చేసేటప్పుడు పక్కనున్నవారు పిన్ నెంబర్లు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు సీనియర్ ఆఫీసర్లు హరిబాబు, కిరణ్‌కుమార్, జానీ బాషా తదితరులు మాట్లాడుతూ ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే కాకుండా ఇతర ఫోన్లతో కూడా ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా డిసెంబర్ 31వ తేదీ వరకు మొబైల్ బ్యాంకింగ్‌ను వాడవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, రామచంద్ర, సీఐలు కృష్ణయ్య, మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, మధుసూదన్‌రావు, నాగరాజు యాదవ్, పోలీసు కుటుంబాలు, సిబ్బంది పాల్గొన్నారు.