సంక్షోభ నివారణకే నగదు రహితం
సంక్షోభ నివారణకే నగదు రహితం
Published Fri, Dec 9 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ’సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కరెన్సీని పూర్తిగా రద్దు చేయలేదని, ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను అధిగమించేందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రైతులకు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు ఉంచడం, చిన్ననోట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏటీఎంల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం ఉందని, బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు ఉపసంహరణ పరిమితి నిర్దేశించినప్పటికీ సక్రమంగా అమలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టిందన్నారు. దీనివల్ల ధరల స్థిరీకరణకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ఈ–బ్యాంకింగ్ అందుబాటులోకి రావడం ద్వారా లావాదేవీలు మరింత సులభతరమవుతాయని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బినామీలు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు మున్సిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధారాణి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కేఎస్‌వీ సత్యన్నారాయణ, ఎంపీడీవో ఎ.రాము, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మ¯ŒS పరిమి హరిచరణ్, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, స్పెషల్ గ్రేడ్ ఏఎంసీ కార్యదర్శి ఏఆర్‌కే ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS దుద్దుపూడి రాజారమేష్, మున్సిపల్ టీపీవో పి స్వరూపారాణి, అసిస్టెంట్ ఏసీటీవో ఎంఎస్ ప్రకాశరావు, ఏపీఎం ఇ.మహాలక్ష్మి, సీడీపీవో వైబీటీ సుందరి, ఈవోపీఆర్‌డీ కె. జా¯ŒSలింకన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధి వీరభద్రస్వామి(భద్రం), సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడు పులపా సత్యన్నారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు చిలంకుర్తి వెంకట సుబ్బారావు(బాబి), రైస్ అండ్ కిరాణా మర్చంట్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఎంబీఎస్ ప్రసాద్(దత్తుడు), సీఐటీయూ నాయకులు ఎంఎం సుందరబాబు, దగ్గు రాధాకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మ¯ŒS మట్టే నారాయణమూర్తి, పాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement