ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తన హెల్త్ పాలసీదారులకు మంచి ఆఫర్‌ను ప్రకటించింది. పాలసీదారులు నగదు రహిత వైద్యాన్ని ఏ ఆస్పత్రి నుంచి అయినా పొందొచ్చని.. నాన్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమలో ఈ తరహా ఆఫర్ మొదటిదిగా పేర్కొంది.
ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు
వైద్యం కోసం కస్టమర్లు తమ పాకెట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఐఎల్ టేక్ కేర్’ యాప్ నుంచి ఈ నూతన సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. నగదు రహిత వైద్యాన్ని హాస్పిటళ్లు అందించడంపై ఆధారపడి ఉంటుందని, ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే పాలసీదారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తాము సూచించిన హాస్పిటల్ లేదంటే సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లొచ్చని సూచించింది.
ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment