ICICI Lombard
-
తెలుగు రాష్ట్రాల పాలసీదార్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్ప్‌డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో నష్టపోయిన పాలసీదారులకు సత్వరం సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్‌్కను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది ప్రతి రోజూ, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. పాలసీదారులు టోల్ ఫ్రీ నంబరు 1800–2666 ద్వారా లేదా customersupport@icicilombard. com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్‌తో బ్యాండ్ బాజా బారాత్, షాన్‌దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్‌తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
చిన్న సంస్థలకు బీమాతో భరోసా - లాంబార్డ్ ఈడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద సంస్థలతో పోలిస్తే లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొనే సవాళ్లు విభిన్నంగా ఉంటాయని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. ప్రకృతిపరమైన లేదా వ్యాపారపరమైన విపత్తులు ఎలాంటి వాటినైనా ఎదుర్కొనేందుకు పెద్ద సంస్థలకు తగిన ఆర్థిక వనరులు ఉంటాయని.. కానీ స్వల్ప మార్జిన్లతో పని చేసే చిన్న సంస్థలకు వాటిని ఎదుర్కొనేంత ఆర్థిక సామర్థ్యాలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వాటికి బీమా ఉపయోగపడుతుందన్నారు. ఒక్కో ఎంఎస్ఎంఈ రిస్కులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి తమకు అనువైన, తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దీన్ని వ్యయంగా గాకుండా భరోసాగా పరిగణించాలని పేర్కొన్నారు. దేశీయంగా 6.2 కోట్ల పైచిలుకు వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ ఎస్ఎంఈ బీమా తీసుకున్న వాటి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. బీమా ప్రయోజనాలపై అవగాహన తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని మంత్రి వివరించారు. దీనితో ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మొదలుకుని కారు, ఫోన్ల వరకూ అన్నింటినీ ఇన్సూర్ చేయించుకోవచ్చని అర్థమైతే చిన్న సంస్థలు.. బీమాను ఒక వ్యయంగా కాకుండా రిస్కులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాధనంగా చూడటం మొదలుపెడతాయని మంత్రి చెప్పారు. టెక్నాలజీతో సెటిల్మెంట్ వేగవంతం.. ఇక, ఎస్ఎంఈల విశిష్ట అవసరాలను గుర్తించి తాము కృత్రిమ మేథ, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి ఉపయోగించి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 5 లక్షల వరకు ప్రాపర్టీ, మెరైన్ క్లెయిమ్‌లను పది రోజుల్లోపే ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈల బీమా అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ హెల్త్, లయబిలిటీ, ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ వంటి పలు పాలసీలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య బీమా ప్రయోజనాలు: అదేంటో తెలుసా?
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ‘ఐషీల్డ్’ పేరిట కొత్త బీమా పాలసీని ప్రవేశపెట్టాయి. ఇటు ఆరోగ్య బీమా, అటు జీవిత బీమా ప్రయోజనాలు ఉండేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దాయి. వైద్య చికిత్సల వ్యయాలకు కవరేజీ ఇస్తూనే పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో కుటుంబానికి పెద్ద మొత్తంలో సమ్ అష్యూర్డ్‌ను అందించేలా ఈ పాలసీ ఉంటుందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) చికిత్స వ్యయాల భారం పడినా, ఇంటిపెద్దకు ఏదైనా జరిగినా కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ సమగ్రమైన బీమా పథకం తోడ్పడగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా వివరించారు. హాస్పిటలైజేషన్, డే–కేర్ ట్రీట్మెంట్ మొదలైన వాటికి ఆరోగ్య బీమా భాగం ఉపయోగపడనుండగా, జీవిత బీమా భాగంతో.. 85 ఏళ్ల వయస్సు వరకూ లైఫ్ కవరేజీ ఉంటుంది. (792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ ) -
చిన్న సంస్థల కోసం వినూత్న బీమా పథకాలు
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు. -
ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తన హెల్త్ పాలసీదారులకు మంచి ఆఫర్‌ను ప్రకటించింది. పాలసీదారులు నగదు రహిత వైద్యాన్ని ఏ ఆస్పత్రి నుంచి అయినా పొందొచ్చని.. నాన్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమలో ఈ తరహా ఆఫర్ మొదటిదిగా పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు వైద్యం కోసం కస్టమర్లు తమ పాకెట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఐఎల్ టేక్ కేర్’ యాప్ నుంచి ఈ నూతన సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. నగదు రహిత వైద్యాన్ని హాస్పిటళ్లు అందించడంపై ఆధారపడి ఉంటుందని, ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే పాలసీదారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తాము సూచించిన హాస్పిటల్ లేదంటే సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లొచ్చని సూచించింది. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! -
ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి 14 పాలసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఐసీఐసీఐ లాంబార్డ్ 14 పాలసీలను ఆవిష్కరించింది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని అప్‌గ్రేడ్ చేసినవి ఉన్నాయి. అయిదు హెల్త్ పాలసీలు, 4 వాహన బీమా, మిగతావి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పాలసీలు ఉన్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో కస్టమర్ల ఆలోచనా ధోరణులు, అవసరాలు మారాయని తదనుగుణంగా తాజా పాలసీలను రూపొందించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య బీమాకు సంబంధించి హెల్త్ బూస్టర్, బీఫిట్, సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ షీల్డ్ తదితర పాలసీలు ప్రవేశపెట్టినట్లు సంస్థ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్లు అమిత్ ఆనంద్, సుబ్రతో బెనర్జీ, సుధీర్ నాయుడు వివరించారు. డ్రోన్లకు, సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించేలా రిటైల్ సైబర్ లయబిలిటీ పాలసీలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ లాంబార్డ్ ‘నడిపిన మేరకు’ బీమా
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ.. ‘పే యాజ్ యూ డ్రైవ్’ పాలసీని కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్న పాలసీదారు తన వాహనాన్ని నడిపినంత దూరం మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పైగా పాలసీదారుకు ఒకటికి మించిన వాహనాలు ఉంటే వాటన్నింటికీ ఈ ఒక్క ఫ్లోటర్ ప్లాన్ కవరేజీ ఆఫర్ చేస్తుంది. సంప్రదాయ మోటారు బీమా పాలసీలో ఉండే అన్ని కవరేజీలు.. ప్రమాద కవరేజీ, మూడో పక్షానికి నష్టం వాటిల్లితే పరిహారం, వాహనదారుకి వ్యక్తిగత ప్రమాద కవరేజీ ఇందులోనూ ఉంటాయి. ఈ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్లో పాలసీదారు వాహనాన్ని నడిపిన మేరకు కవరేజీ లభిస్తుంది. రెండో ఆప్షన్లో వాహనాన్ని ఏ విధంగా నడుపుతున్నారనే దాని ఆధారంగా ప్రీమియం ఉంటుంది. మంచి డ్రైవింగ్ చేసే వారికి ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ఇండింపెడెంట్ పాలసీలు కలిగి ఉన్న వారు ఈ ఫ్లోటర్ ప్లాన్‌లోకి మారిపోయే అవకాశాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది. -
ఇకపై ‘టెలిగ్రామ్’ లో ఇన్సూరెన్స్ సేవల గురించి తెలుసుకోండి
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది. టెలిగ్రామ్‌పై చాట్‌బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్‌పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు గుడ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 16 శాతం ఎగసి రూ. 8,434 కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా రుణ విడుదల, వడ్డీ ఆదాయం సహకరించింది. అంతక్రితం ఏడాది(2019–20) క్యూ4లో రూ. 7,280 కోట్లు మాత్రమే ఆర్జించింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 12.6 శాతం అధికమై రూ. 17,120 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) స్వల్ప వెనకడుగుతో 4.2 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.32 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.36 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ఇక మొండి రుణాలకు కేటాయింపులు రూ. 3784 కోట్ల నుంచి రూ. 4694 కోట్లకు పెరిగాయి. అయితే రుణ మంజూరీ 14 శాతం పుంజుకోగా.. ఇతర ఆదాయం 26 శాతం జంప్‌చేసి రూ. 7,594 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 38,287 కోట్ల నుంచి రూ. 40,909 కోట్లకు బలపడింది. కాగా.. నిర్వహణ వ్యయాలు 11% పెరిగి రూ. 9,181 కోట్లను అధిగమించాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 31,833 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 1,47,068 కోట్ల నుంచి రూ. 1,55,885 కోట్లకు బలపడింది. మొత్తం డిపాజిట్లు 16.3 శాతం వృద్ధితో రూ. 13.35 లక్షల కోట్లకు చేరగా.. కరెంట్, సేవింగ్స్ విభాగాలు 27 శాతం ఎగసి రూ. 6.15 లక్షల కోట్లను అధిగమించాయి. రుణ విడుదల 14 శాతం పెరిగి రూ. 11,32,837 కోట్లకు చేరింది. అనుబంధ సంస్థలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నికర లాభం 157 కోట్ల నుంచి రూ. 253 కోట్లను దూసుకెళ్లగా.. ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 342 కోట్ల నుంచి రూ. 285 కోట్లకు వెనకడుగు వేసింది. కోవిడ్–19 నేపథ్యంలో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాదికి తుది డివిడెండ్‌ను ప్రకటించడంలేదని బ్యాంక్ పేర్కొంది. సెకండ్‌వేవ్‌లో కోవిడ్–19 మరింత తీవ్రతను చూపుతుండటంతో భవిష్యత్‌లో బ్యాంక్ పనితీరు ప్రభావితమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.8 శాతంగా నమోదైంది. ఫలితాల ప్రభావం షేరుపై సోమ వారం(19న) ప్రతిఫలించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారాంతాన ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 1,431 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ లంబార్డ్ లాభం జూమ్ ప్రయివేట్ రంగ సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 346 కోట్లను తాకింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం 23 శాతంపైగా పుంజుకుని రూ. 1,473 కోట్లయ్యింది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. శుక్రవారం నిఫ్టీలో ఐసీఐసీఐ లంబార్డ్ షేరు 2.7% జంప్‌చేసి రూ. 1,423 వద్ద ముగిసింది. చదవండి: 24.44 బిలియన్ డాలర్లకు దేశీయ ఫార్మా ఎగుమతులు -
ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా విక్రయం
దేశీయ ప్రైవేట్ రంగఐసీఐసీఐ బ్యాంక్ తన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో 3.96శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయం మొత్తం రూ.2250 కోట్లుగా ఉంది. వీలు చిక్కిన ప్రతిసారీ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడాన్ని పరిశీస్తామని త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కోంది. అందులో భాగంగా తన ఇన్సూరెన్స్ సంస్థలో 3.96 వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ‘‘ఇందుకు ముందు బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానానికి అనుగుణంగా నేడు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మొత్తంలో వాటాలో 3.96శాతానికి సమానమైన 1.8కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడమైంది. ఈ వాటా అమ్మకం ద్వారా మొత్తం రూ.2250 కోట్లను సమీకరణ చేస్తున్నాము.’’ అని ఎక్చ్సేంజ్‌లకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ అమ్మకంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ హోల్డరింగ్ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51.9శాతానికి దిగివస్తుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం మార్చి 31నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్యాంక్ 55.86శాతం వాటాను కలిగి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కోవిడ్-19 ప్రభావంతో ఈ మార్చి క్వార్టర్లో ప్రోవిజన్లకు రూ.2,725 కోట్లను కేటాయించింది. ఆర్బీఐ ఏప్రిల్ 17 నాడు ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ చేసిన కేటాయింపు అవసరం కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం గం.2:30ని.లకు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 2శాతం లాభంతో రూ.359 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఐసీఐసీఐ లాంబార్డ్ షేరు మునుపటి ముగింపు(రూ.1276.50)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో రూ.1,259.00 వద్ద ట్రేడ్ అవుతోంది. -
డిజిటల్ పాలసీ ఎంతో చౌక
వాహనానికి బీమా తీసుకోవడం నిబంధనల రీత్యా తప్పనిసరి. ఏటేటా వాహన ప్రీమియం ఖరీదయిపోతోంది. ఈ క్రమంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు డిజిటల్ పాలసీలపై దృష్టి సారించొచ్చు. ఆన్లైన్లోనే సేవలతో దూసుకుపోతున్న అకో, గో డిజిట్ సంస్థలు పోటా పోటీగా మంచి ఫీచర్లతో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో యువతలో ఈ బీమా సంస్థలకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరిగింది. కొనుగోలు ఎంతో సులభం కావడం, ప్రీమియం తక్కువగా ఉండడం వారికి ఎంతో సౌకర్యాన్నిస్తున్నాయి. అకో, గో డిజిట్ సంస్థలు నూరు శాతం ఆన్లైన్ కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. భౌతికంగా వీటికి శాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వీటికి పరిపాలన, నిర్వహణ చార్జీలు ఇతర ప్రధాన బీమా సంస్థలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కనుక ఈ సంస్థలు 20–30 శాతం తక్కువ ప్రీమియానికే మోటార్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు మోటారు ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రస్తుతానికి 3–4 శాతం వాటా ఉంది. కానీ, ఇతర సంస్థలతో పోలిస్తే ఇవి ఎంతో వేగంగా తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాయి. పాలసీ రెన్యువల్ చేసుకునే సమయం వస్తే, ఈ సంస్థలను ఆశ్రయించొచ్చా..? ఈ ప్రశ్న మీకు ఎదురైతే.. సమాధానం వెతుక్కునేందుకు ఇక్కడున్న వివరాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే. మోటారు ఇన్సూరెన్స్‌లో అతిపెద్ద సంస్థగా ఉన్న ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, అకో, గో డిజిట్ సంస్థల మధ్య కొన్ని సేవల పరంగా అంతరాన్ని పరిశీలించొచ్చు.. అకో జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా వ్యాపార కంపెనీ అయిన అకో జనరల్ ఇన్సూరెన్స్ 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. మోటార్, హెల్త్, మొబైల్, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఈ సంస్థ అందిస్తోంది. అమెజాన్, కేటమరాన్ వెంచర్స్, సైఫ్ పార్ట్నర్స్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ అందించే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో.. రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, ప్రకృతి విపత్తుల కారణంగా సొంత వాహనానికి, మూడో పార్టీ వాహనానికి నష్టం జరిగితే కవరేజీ ఉంటుంది. వాహనం చోరీకి గురైనా బీమా లభిస్తుంది. అలాగే, వాహనదారుడికి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ను యాడాన్ కవర్‌గా తీసుకోవచ్చు. అంటే వాహనంలోని రబ్బర్, ప్లాస్టిక్ తదితర కొన్ని విడిభాగాలకు నష్టం జరిగితే బీమా సంస్థ వాస్తవ విలువలో నిర్ణీత శాతమే పరిహారం చెల్లిస్తుంది. జీరో డిప్రీషియేషన్ కవర్ తీసుకుంటే 100 శాతం విలువను పరిహారంగా చెల్లిస్తుంది. వీటికి పరిహారం రాదు... ఈ పాలసీలో నిబంధనలు ఇతర మోటారు పాలసీల్లో మాదిరే ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే లేదా కారణమైతే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదం బారిన పడితే అందుకు జరిగే నష్టానికి కంపెనీ రూపాయి కూడా చెల్లించదు. అలాగే, ప్రమాదం వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల వాహనానికి నష్టం జరిగినా పరిహారం రాదు. కొనుగోలు ఇలా... ఆన్లైన్ పోర్టల్ అకో డాట్ కామ్‌కు వెళ్లి మీ కారు నంబర్ లేదా బ్రాండ్‌ను ఎంపిక చేసుకుని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ)ను ఎంచుకోవాలి. తర్వాత ప్రీమియం చెల్లించిన నిమి షాల వ్యవధిలోనే పాలసీ ఈ మెయిల్‌కు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ఐదారు నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోతుంది. క్లెయిమ్ ప్రక్రియ సులభం... ప్రమాదం కారణంగా వాహనానికి నష్టం జరిగితే దేశవ్యాప్తంగా 1,000కుపైగా గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు పొందొచ్చు. క్లెయిమ్ కోసం కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా కంపెనీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఉన్న వారికి రిపేర్ కోసం వాహనాన్ని 60 నిమిషాల వ్యవధిలోనే పిక్ చేసుకుంటారు. కంపెనీ సర్వేయర్ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. ఇతర పట్టణాల్లోని వారు తామే స్వయంగా వాహనాన్ని కంపెనీ నిర్దేశించిన గ్యారేజ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కారు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బీమా పాలసీ జిరాక్స్ కాపీ అవసరపడతాయి. క్లెయిమ్‌ను కంపెనీ ఆమోదిస్తే నగదు రహితంగా గ్యారేజ్‌లో రిపేర్ చేసి డెలివరీ చేస్తారు. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం క్లెయిమ్‌లలో 72.4 శాతం 15 రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. 90 రోజుల వ్యవధిలో ఇది 99.5 శాతంగా ఉంది. వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటల పాటు కస్టమర్ సపోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. గో డిజిట్ ఇన్సూరెన్స్ ఈ సంస్థ కూడా 2017లోనే ఆరంభమైంది. కార్లు, బైక్‌లు, సైకిళ్లు, ట్రావెల్, హోమ్, మొబైల్ ఫోన్లకు ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తోంది. జీరో డిప్రీసియేషన్ కవర్, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ కవరేజీలు ఇందులో ఉన్నాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్‌ను కూడా విడిగా తీసుకోవచ్చు. అకో జనరల్ ఇన్సూరెన్స్ మాదిరిగానే సాధారణ మినహాయింపులు ఇందులోనూ ఉన్నాయి. కొనుగోలు... కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి కారు లేదా బైక్ వీటిల్లో వాహనం ఏద న్నది ఎంచుకుని,బ్రాండ్, మోడల్‌ను సెలక్ట్ చేసిన తర్వాత, పూర్వపు బీమా సంస్థ వివరాలను ఇవ్వాలి. దాంతో ప్రీమియం ఎంతన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి.ప్రీమియం చెల్లించిన అనంతరం మెయిల్‌కు పాలసీ జారీ అయిపోతుంది. క్లెయిమ్ ప్రక్రియ... దేశవ్యాప్తంగా 1,400 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి క్లెయిమ్ వివరాలను రికార్డ్ చేసుకోవాలి. దాంతో మీ మొబైల్‌కు స్వీయ తనిఖీ పత్రం లింక్ ద్వారా వస్తుంది. వాహనానికి నష్టం జరిగితే మొబైల్ ద్వారా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్‌లను గో డిజిట్ టీమ్ పరిశీలించిన అనంతరం ఎంత మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చన్న సమాచారాన్ని అందిస్తుంది. అవసరమైతే సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అనంతరం నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్న గ్యారేజ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వాహనం మీ నుంచి పిక్ చేసుకుని, రీపెయిర్ తర్వాత తిరిగి అందించే సేవలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పరిహారం చెల్లింపుల రేషియో 94.84 శాతం. ద్విచక్ర వాహన క్లెయిమ్‌కు సగటున 11 రోజుల సమయం తీసుకుంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ మోటారు వాహన పాలసీల విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ చాలా పెద్ద సంస్థ. కేవలం మోటారు పాలసీల నుంచే 2018–19లో ఈ సంస్థ రూ.6,400 కోట్ల ప్రీమియం రాబట్టింది. అకో జనరల్ రూ.75 కోట్ల ప్రీమియం పొందగా, గో డిజిట్ రూ.854 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించాయి. ఇతర సంస్థల మాదిరే ఐసీఐసీఐ లాంబార్డ్ మోటారు బీమాలోనూ అన్ని రకాల ఫీచర్లు, యాడాన్ కవరేజీలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు... కారు నంబర్ లేదా బ్రాండ్ పేరు, ఏ సంవత్సరం మోడల్ తదితర వివరాలను ఇవ్వడం ద్వారా ఐసీఐసీఐ లాంబర్డ్ ఆన్లైన్ పోర్టల్ నుంచి మోటారు పాలసీ తీసుకోవచ్చు. అన్ని రకాల వాహన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాహనం వివరాలను పేర్కొన్న తర్వాత ప్రీమియం వివరాలు కనిపిస్తాయి. భిన్న ఫీచర్లతో తీసుకుంటే ప్రీమియం ఏ మేరకు అన్న వివరాలు కూడా కనిపిస్తాయి. నచ్చిన దానిని ఎంపిక చేసుకుని ప్రీమియం చెల్లించాలి. ఆ సమయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, కీ ప్రొటెక్ట్, కన్జ్యూమబుల్స్ కవరేజీలను ప్రధాన పాలసీకి జత చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాకుండా కంపెనీకి దేశవ్యాప్తంగా విస్తృత సంఖ్యలో శాఖలు కూడా ఉన్నాయి. సమీపంలోని శాఖకు వెళ్లి కూడా పాలసీ తీసుకోవచ్చు. క్లెయిమ్ ప్రక్రియ... దేశవ్యాప్తంగా 8,300 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో లేదా సమీపంలోని శాఖకు వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అయితే ‘ఇన్సూర్యాప్’ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. లైవ్ వీడియో స్ట్రీమింగ్ సదుపాయం ‘ఇన్స్టాస్పెక్ట్’ ఈ యాప్‌లో ఉంటుంది. దీని ద్వారా క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడం ద్వారా సర్వేయర్ నుంచి వేగంగా క్లెయిమ్‌కు అనుమతి పొందొచ్చు. అవసరమైన పత్రాలను కూడా యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉచితంగా మీ నుంచి వాహనాన్ని స్వీకరించి గ్యారేజీకి తీసుకెళ్లే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. సమీపంలో ఉన్న కంపెనీ నెట్వర్క్ గ్యారేజ్‌కు తీసుకెళ్లి రీపెయిర్ చేసి వాహనదారుడికి తిరిగి అందిస్తారు. 2018–19 సంవత్సరంలో క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి 98.8 శాతంగా ఉందని కంపెనీ సమాచారం తెలియజేస్తోంది. 24 గంటల పాటు కస్టమర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎంపిక ఏది..? ► ఆన్లైన్లో డిజిటల్ పాలసీలు తీసుకోవడం ద్వారా ప్రీమియం రూపంలో భారీ ఆదా చేసుకోవచ్చు. అమేజాన్ కస్టమర్లు అకో నుంచి ఇంకా చౌకకే పాలసీ పొందే అవకాశం ఉంది. ► గో డిజిట్లో యాడాన్ కవరేజీలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. థర్డ్ పార్టీ స్టాండలోన్ కవరేజీ కూడా ఉంది. కానీ, అకో వద్ద ఇవి లేవు. ► అకో, గో డిజిట్ చెల్లింపుల రేషియో 99 శాతం దగ్గరగానే ఉండడం గమనార్హం. ► ముఖ్యంగా పాలసీ కొనుగోలు చేసే ముందు, ఆయా సంస్థ ఆఫర్ చేస్తున్న నెట్వర్క్ గ్యారేజీలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయా..? అన్నది గమనించాలి. ► అదే ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి అయితే ప్రీమియం ఎక్కువ. కానీ, నెట్వర్క్ గ్యారేజీలు విస్తృతంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్లైన్లోనూ పాలసీ, క్లెయిమ్‌లకు అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ సౌకర్యంగా అనిపించని వారికి అనుకూలం. ► ఒక నిర్ణయానికి ముందు నిపుణుల సలహా మంచిది. ప్రీమియం అంతరాన్ని పరిశీలిస్తే... రెండు సంవత్సరాల వయసున్న మారుతి సుజుకీ బాలెనో, ఐడీవీ విలువ రూ.5.03 లక్షలకు సమగ్ర కవరేజీతో (వ్యక్తిగత ప్రమాద బీమాతో కూడిన) ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,604. ఇందులో రోడ్డు సైడ్ అసిస్టెన్స్కు రూ.199 కూడా కలిసి ఉంది. అదే గో డిజిట్లో అయితే ఇదే వాహనానికి ప్రీమియం రూ.11,015, అకోలో రూ.9,276గా ఉన్నాయి. -
సైబర్ పాలసీలకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైబర్ దాడుల ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో సైబర్ లయబిలిటీ బీమా పాలసీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలోక్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ మార్కెట్ సుమారు రూ. 30 కోట్లుగా ఉందని.. వచ్చే ఏడాది వ్యవధిలో రూ. 75 కోట్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. తాము త్వరలోనే వ్యక్తిగత సైబర్ పాలసీని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు అగర్వాల్ శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు. దీనికి ఇటీవలే బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతులు లభించాయన్నారు. మరోవైపు, వాహన విక్రయాలు మందగించడం .. మోటార్ పాలసీల విభాగంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అగర్వాల్ తెలిపారు. అయితే, బీమా పాలసీ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల చట్టంలో తెచ్చిన సవరణలు కాస్త ఊతమిచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి టెక్నాలజీలను ఉపయోగించి, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని అగర్వాల్ వివరించారు. -
ఎఫ్‌పీఐల డార్లింగ్.. బీమా!
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ లిస్టయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్రభుత్వరంగ సంస్థ. సెబీ నిబంధనలు అనుకూలం... ‘‘గత 4–6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్స్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ పరిశోధన విభాగం అధిపతి దీపక్ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది. దీర్ఘకాలంలో భారీ అవకాశాలు ‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్బీఐ లైఫ్ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్ – సెప్టెంబర్ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. -
బీమా ‘పంట’ పండటంలేదు!
న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండటం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎం ఎఫ్బీవై కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్‌ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీఆర్ఈ) సైతం తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది. పెరిగిన స్థూల ప్రీమియం పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్‌గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర క్రాప్ ఇన్సూరెన్స్‌లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఎలాంటి క్రాప్ బీమా వ్యాపారాన్ని నమో దు చేయబోవడంలేదని రీ ఇన్సూరెన్స్ చార్జీలు దిగిరావాల్సి ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పరిస్థితులు ఇలా.. ► ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిధిలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారం నుంచి తప్పుకుంది. ► చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. ► అధిక నష్టాలు, పరిహారం కోరుతూ భారీగా వస్తున్న క్లెయిమ్‌లు. ► ప్రభుత్వరంగ రీఇన్సూరెన్స్ సంస్థ జీఐసీఆర్ఈ సైతం తన క్రాప్ పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుంది. ► ప్రభుత్వరంగ నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మాత్రం ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా చూస్తే... అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద పంటల బీమా మార్కెట్ మనదే కావడం గమనార్హం. -
ఐసీఐసీఐ లంబార్డ్ లాభం 289 కోట్లు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.289 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.214 కోట్లు నికర లాభం సాధించామని, దీంతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్ వసూళ్లు రూ.3,394 కోట్ల నుంచి 14 శాతం వృద్దితో రూ.3,856 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.2.50 తుది డివిడెండ్‌గా చెల్లించడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని వివరించింది. గత క్యూ1లో 22.4 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ యావరేజ్ ఈక్విటీ(ఆర్‌ఓఏఈ) ఈ క్యూ1లో 24.7 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలతాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్ 3.5 శాతం లాభంతో రూ.736 వద్ద ముగిసింది. -
ఇల్ టేక్ కేర్
ప్రైవేట్ రంగ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఐసీఐసీఐ లంబార్డ్ జీఐసీ’ తాజాగా ‘ఇల్ టేక్ కేర్’ అనే మొబైల్ హెల్త్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ దగ్గరిలో ఉన్న డాక్టర్లు, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ వివరాలు పొందొచ్చు. ♦ రియల్ టైమ్‌లో డాక్టర్ల అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్‌తో ఫోన్లో మాట్లాడే వెసులుబాటు ఉంది. ♦ దగ్గరిలోని డయాగ్నస్టిక్ సెంటర్లలో టెస్ట్‌లు చేయించుకోవచ్చు. ♦ స్టోర్‌లో మెడిసిన్స్‌ను డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. హోమ్ డెలివరీ కూడా పొందొచ్చు. ♦ షెడ్యూల్ హె ల్త్ చెకప్‌లు చేయించుకునే అవకాశముంది. ♦ ఐసీఐసీఐ లంబార్డ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి రియల్ టైమ్ క్యాష్‌లెస్ అప్రూవల్ పొందొచ్చు. ♦ పాలసీ అర్హత, ప్రయోజనాలు, లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు. ♦ మెడిసిన్ రిమైండర్స్ సెట్ చేసుకోవచ్చు. మెడికల్ రికార్డ్లను యాప్‌లో భద్రంగా ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. సేవలపై సంబంధిత సంస్థలకు రేటింగ్ ఇవ్వొచ్చు. -
ఐసీఐసీఐ లాంబార్డ్ లాభం రూ.232 కోట్లు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.232 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో వచ్చిన నికర ఆదాయం రూ.220 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,843 కోట్ల నుంచి రూ.2,020 కోట్లకు పెరిగినట్లు కంపెనీ సీఈఓ భార్గవ్ దాస్‌గుప్తా తెలిపారు. స్థూల ప్రీమియం రూ.2,542 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని, పంటల బీమా ఆదాయం రూ.91 కోట్ల నుంచి రూ.87 కోట్లకు తగ్గిందని చెప్పారాయన. గత క్యూ3లో 2.01 రెట్లుగా ఉన్న సాల్వెన్సీ రేషియో ఈ క్యూ3లో 2.21 రెట్లకు మెరుగుపడిందని తెలియజేశారు. పన్ను కేటాయింపులు రూ.5 కోట్ల నుంచి రూ.91 కోట్లకు పెరిగాయన్నారు. అంతకు ముందటి సంవత్సరాలకు సంబంధించిన పన్నులకు ఈ క్వార్టర్లోనూ, ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలోనూ అధిక కేటాయింపులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్ ఇంట్రాడేలో 6 శాతం లాభపడింది. చివరకు 4 శాతం లాభంతో రూ.812 వద్ద ముగిసింది. -
15 నుంచి ఐసీఐసీఐ లాంబార్డ్ ఐపీఓ
► నాన్‌లైఫ్ ప్రైవేట్ బీమా సంస్థల్లో మేమే టాప్ ► సంస్థ సీఎఫ్ఓ గోపాల్ బాలచంద్రన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ సంస్థలు భారతీయ బీమా కంపెనీల్లో వాటాలను 10 శాతానికే పరిమితం చేసుకోవాలన్న ఐఆర్డీఎ నిబంధనల్ని అమలు పరచటంలో భాగంగా ఐపీఓకు వస్తున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గోపాల్ బాలచంద్రన్ చెప్పారు. దేశీయంగా అతిపెద్ద నాన్‌లైఫ్ ప్రైవేట్ బీమా కంపెనీ తమదేనంటూ ఈ రంగంలో మొదట ఐపీఓకి వస్తున్నది కూడా తామేనని తెలియజేశారు. ఐపీఓ వివరాలను వెల్లడించటానికి మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘తాజా ఆఫర్లో కంపెనీలోని విదేశీ భాగస్వామి ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్స్ 5.45 కోట్ల ఈక్విటీ షేర్లను, దేశీయ భాగస్వామి ఐసీఐసీఐ బ్యాంక్ 3.17 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. ఐపీఓలో ఫెయిర్‌ఫాక్స్ వాటాలో 12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలో 7 శాతం అమ్మకానికి పెడుతున్నాం. ఐపీఓ అనంతరం కంపెనీలో ఫెయిర్‌ఫాక్స్ వాటా 9.91 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 56 శాతానికి తగ్గుతుంది’’ అని వివరించారు. ఐపీఓలో 50 శాతం క్యుఐబీలకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైలర్లకు (ఇందులోనే 5 శాతం ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఉన్నవారికి) రిజర్వ్ చేశామన్నారు. ఐపీఓ ధర శ్రేణిని రూ.651– 661గా నిర్ణయించామన్నారు. ఐపీఓ ఈనెల 15న ప్రారంభం అయి 19న ముగుస్తుంది. మోటార్ బీమాలే అధికం దేశీ నాన్‌లైఫ్ బీమా విభాగంలో సింహభాగం మోటార్ బీమాదేనని గోపాల్ చెప్పారు. ‘‘వాహన బీమాది 40 శాతం వాటా. 27 శాతం హెల్త్ది. ఇప్పుడిప్పుడే పంటల బీమా వాటా పెరుగుతోంది. మొత్తం నాన్‌లైఫ్ బీమా పరిశ్రమలో మా వాటా 8 శాతం. ప్రైవేట్ విభాగంలో ఇది 18 శాతం’’ అని వివరించారు. కార్యక్రమంలో కంపెనీ అండర్రైటింగ్స్ చీఫ్ సంజయ్ దత్తా పాల్గొన్నారు. ఎస్బీఐ లైఫ్ ఐపీవో 20 నుంచి న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీవో సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22న ముగియనున్న ఈ ఐపీవోలో భాగంగా సంస్థ రూ.8,400 కోట్లను సమీకరించనుంది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత మార్కెట్లో లిస్ట్ కాబోతోన్న రెండో జీవిత బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్. మార్కెట్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఎస్బీఐ లైఫ్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.685–రూ.700 శ్రేణిలో ఉండొచ్చని తెలుస్తోంది. -
ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి రూ.6,000 కోట్ల ఐపీఓ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో తొలి సాధారణ బీమా కంపెనీ త్వరలో లిస్ట్‌కానుంది. బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ జాయింట్ వెంచర్ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు తలపెట్టిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) సెప్టెంబర్ 15న మొదలుకానుంది. ఆఫర్ సెప్టెంబర్ 19న ముగుస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. ఇష్యూ ప్రారంభానికి ఐదు రోజుల ముందుగా ఇష్యూ ప్రైస్‌బ్యాండ్‌ను ప్రకటించనున్నట్లు బ్యాంక్ వివరించింది. ఐసీఐసీఐ బ్యాంక్, కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్ ఐపీఓలో 8.62 కోట్ల షేర్లను విక్రయించనున్నది. ఈ ఆఫర్‌కు గతవారమే సెబీ అనుమతి లభించగా, ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూఇండియా అష్యూరెన్స్, జీవితబీమా కంపెనీలైన హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, ఎస్బీఐ లైఫ్‌లు ఐపీఓల జారీకి సిద్ధంగా వున్నాయి. -
మార్కెట్లకు ఫెడ్ బూస్ట్, ఐసీఐసీఐ జంప్
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే నిర్ణయించడంతో దేశీయంగా ఇన్వెస్టర్లకు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 174 పాయింట్లు జంప్‌చేసి 30,069వద్ద 30వేల మైలురాయిని అధిగమించింది. అటు నిఫ్టీకూడా 40 పాయింట్లుఎగిసి 9350ని తాకింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.8 శాతం జంప్‌చేసి 22,624 వద్ద కొత్త గరిష్టాన్ని తాకడం విశేషం. నిన్న మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ 4 ఫలితాలను ప్రకటించిన ఐసీఐసీఐ 5 శాతానికిపైగా ఎగిసింది. రెరా కిక్‌తో రియల్ ఎస్టేట్ పాజిటివ్‌గా ఉంది. అలాగే మెటల్ సెక్టార్‌కూడా లాభాల్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రాసిం, భారతి ఎయిర్ టెల్ తదితర షేర్లు లాభపడుతున్నాయి. అటు పుత్తడి ధరలు మరింత బలహీనతనుకొనసాగిస్తున్నాయి. -
ఐసీఐసీఐ లంబార్డ్ ప్రీమియం ఆదాయం 32% జంప్
ముంబై: ప్రైవేట్ రంగ అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్ గత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబర్చింది. కంపెనీ స్థూల దేశీ ప్రీమియం ఆదాయం 32.6 శాతం వృద్ధితో రూ.10,725 కోట్లకు పెరిగింది. దీంతో రూ.10,000కు పైగా స్థూల దేశీ ప్రీమియం ఆదాయం సాధించిన తొలి కంపెనీగా ఐసీఐసీఐ లంబార్డ్ చరిత్ర సృష్టించింది. ఇక కంపెనీ నికర లాభం 38.3 శాతం వృద్ధితో రూ.701 కోట్లకు పెరిగింది. ‘2016–17 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరును ప్రదర్శించాం. ఇక రానున్న రోజుల్లో కూడా మా ఇన్సూరెన్స్ సేవలను మరింత విస్తరిస్తాం. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఎప్పుడూ ముందుంటాం’ అని ఐసీఐసీఐ లంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్‌గుప్తా తెలిపారు. -
ఏ ఆస్పత్రిలో.. చికిత్స ఖర్చులు ఎంత?
పోల్చి చూపే ఐసీఐసీఐ లంబార్డ్ హెల్త్ అడ్వైజర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సమీపంలోని ఆస్పత్రులు, చికిత్స నాణ్యత, మౌలిక సదుపాయాలు, వ్యయాలు తదితర వాటిని పోల్చి చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. హైదరాబాద్, చెన్నైతో పాటు పది నగరాల్లోని సుమారు 1,000 పైగా ఆస్పత్రుల వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని ఐసీఐసీఐ లంబార్డ్ హెడ్ (హెల్త్ అండర్‌రైటింగ్ అండ్ క్లెయిమ్స్ విభాగం) అమిత్ భండారీ బుధవారమిక్కడ వెల్లడించారు. హైదరాబాద్‌లో 140 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. -
సొంత ఆరోగ్య బీమా పాలసీ అవసరం
‘ఆరోగ్య బీమా పాలసీని మనకు అవసరం పడకముందే తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా అవసరమైనప్పుడు మనం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు’ అనేది ఒక నానుడి. నిజంగానే తీవ్ర అనారోగ్య సమస్యలు ఒకోసారి చెప్పా పెట్టకుండా మూకుమ్మడిగా దాడి చేస్తుంటాయి. అలాంటప్పుడు కొండలా పెరిగిపోయే వైద్యం ఖర్చులు చూస్తుంటే మానసికంగా కూడా ఆవేదన తప్పదు. అదే ఆరోగ్య బీమా పాలసీ ఉందంటే..ఇటు ఆర్థికంగాను, అటు మానసికంగానూ భరోసాగా నిలుస్తుంది. తగినంత కవరేజీ ఉంటే వైద్య ఖర్చులు ఎంతైనా సరే ఆర్థికంగా ఆందోళన చెందనక్కర్లేదు. కాబట్టే ఈ విషయంలో కాస్త వివేకంతో వ్యవహరించకపోతే కూడబెట్టినదంతా వైద్యానికే హరించుకుపోయే ప్రమాదముంది అంటున్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌కి చెందిన అమిత్ భండారీ. ఇలాంటప్పుడు కంపెనీలిచ్చేవే కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఆవశ్యకతను తెలియజేస్తున్నారాయన. గ్రూప్ హెల్త్ కవరేజీతో పోలిస్తే మన అవసరాలకు తగినట్లుగా ఎంచుకోగలిగే వ్యక్తిగత, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో మరింత మెరుగైన కవరేజీ లభిస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. కంపెనీ ఇచ్చే గ్రూప్ పాలసీ ఉంది కదా.. మరొకటి తీసుకోవడం దండగ అనే భావన కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ధోరణి సరికాదు. ఎందుకంటే.. ఒక్క కవరేజీ సరిపోదు వైద్య అవసరాలకు కంపెనీ అందించే బీమా పాలసీ సరిపోతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ పాలసీలకు కొన్ని పరిమితులు, షరతులు, నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు చాలా మటుకు గ్రూప్ పాలసీల్లో రూ. 2-4 లక్షల కవరేజీ పరిమితి ఉంటుంది. ఏదైనా కీలకమైన సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఇది ఒకోసారి సరిపోకపోవచ్చు. కొన్ని కంపెనీలు సబ్-లిమిట్స్ లేదా కో-పే వంటి నిబంధనలతో కూడా పాలసీలు తీసుకుని ఉండొచ్చు. ఇలాంటి వాటి వల్ల ఎంతో కొంత మీ జేబు నుంచి కూడా కట్టాల్సి రావొచ్చు. ఇక, రిటైర్మెంట్ తర్వాత కంపెనీ అందించే హెల్త్ కవరేజీ ప్రయోజనాలు ఉండవు. ఆ వయస్సులో మధుమేహం, హైబీపీ వంటి వాటితో సతమతమవుతూ ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామంటే అంత సులువుగా కుదరకపోవచ్చు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే జీవితకాలం రెన్యువల్ చేసుకునే వీలుంటుంది. స్వల్పకాలికంగానే వర్తింపు కంపెనీలు ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీల కవరేజీ ..ఆయా సంస్థల్లో పనిచేసినంత కాలం మాత్రమే మనకు వర్తిస్తుంది. ఆ సంస్థలో మానేసినా లేదా రిటైరైనా కవరేజీ పోతుంది. సరైన వ్యక్తిగత ఆరోగ్య బీమా దన్ను లేకపోతే వైద్య ఖర్చులు పెరిగిపోయి.. కుటుంబ బడ్జెట్ తల్లకిందులు కావొచ్చు. కొంగొత్త ఆరోగ్య సమస్యలు జీవన విధానాలు, పర్యావరణంలో మార్పులు తదితర అంశాల కారణంగా స్వైన్ ఫ్లూ, చికున్ గున్యా, సార్స్ లాంటి కొంగొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. హృద్రోగాలు, క్యాన్సర్ మొదలైన సమస్యలు వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయి. ప్రస్తుతం హాస్పిటలైజేషన్‌తో పాటు అవుట్ పేషంట్ చికిత్స వ్యయాలు, రొటీన్ వైద్య పరీక్షలు మొదలైన వాటన్నింటికి కూడా కవరేజీనిచ్చేలా సమగ్రమైన పాలసీలు లభిస్తున్నాయి. ఒకవేళ ఏ ఏడాదిలోనైనా మీరు క్లెయిమ్ దాఖలు చేయనిపక్షంలో కవరేజీపరంగా మరికాస్త బోనస్ లభిస్తుంది. చూశారు కదా.. సొంతానికి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ వల్ల ఒనగూరే ప్రయోజనాలు. చివరిగా ఒక మాట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందుగా తగినంత అధ్యయనం చేయాలి. వివిధ బీమా సంస్థల నుంచి కొటేషన్లు తెప్పించుకుని పరిశీలించాలి. అయితే ప్రీమియం ఒక్కటే ప్రాతిపదిక కాదు.. సదరు సంస్థ అందించే సర్వీసుల నాణ్యత కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని, అర్థం చేసుకున్న తర్వాతే పాలసీని తీసుకోవాలి. ఆర్థిక ప్రయోజనాలు... హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల ఒనగూరే ఆర్థిక ప్రయోజనాల్లో పన్నులపరమైనవి కూడా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 60 ఏళ్ల వయస్సు దాకా సొంతానికి గానీ, జీవిత భాగస్వామి, పిల్లల కోసం గానీ తీసుకునే పాలసీలకు సంబంధించి కట్టే రూ. 25,000 దాకా ప్రీమియంకు డిడక్షన్ లభిస్తుంది. ఒకవేళ 60 ఏళ్లు పైబడిన మీ తల్లిదండ్రులకు కూడా పాలసీ తీసుకున్న పక్షంలో మరో రూ. 30,000 దాకా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. - అమిత్ భండారీ హెడ్ (హెల్త్ ఇన్సూరెన్స్) ఐసీఐసీఐ లాంబార్డ్ -
ఐసీఐసీఐ లాభం రయ్..
క్యూ2లో రూ. 3,419 కోట్లు; 12 శాతం అప్ * ఆదాయం 13.5 శాతం వృద్ధి; రూ.25,137 కోట్లు * రిటైల్ రుణాలు, విదేశీ మార్జిన్ల ఆసరా.. * మరింత పెరిగిన మొండిబకాయిలు... * ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా విక్రయానికి ఓకే ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్.. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) రూ.3,419 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,065 కోట్లతో పోలిస్తే 12% వృద్ధి నమోదైంది. ప్రధానంగా రిటైల్ రుణాలు పుంజుకోవడం, విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మార్జిన్లు మెరుగుపడటం లాభాల జోరుకు దోహదం చేసింది. అయితే, మొండిబకాయిలు మాత్రం మరింత పెరగడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 13.5 శాతం వృద్ధితో రూ.22,150 కోట్ల నుంచి రూ.25,138 కోట్లకు దూసుకెళ్లింది. స్టాండెలోన్‌గానూ జోష్... బ్యాంకింగ్ బిజినెస్(సాండెలోన్) ప్రాతిపదికన కూడా ఐసీఐసీఐ ఆకర్షణీయమైన పనితీరును నమోదుచేసింది. సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 12% ఎగసి రూ.3,030 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,709 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.14,889 కోట్ల నుంచి రూ.16,106 కోట్లకు పెరిగింది. 8.2% వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 13% వృద్ధితో రూ.4,657 కోట్ల నుంచి రూ.5,251 కోట్లకు ఎగసింది. వడ్డీయేతర ఆదాయం కూడా 10% ఎగసి రూ.3,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఈ మొత్తం రూ.2,738 కోట్లు. విదేశీ కార్యకలాపాలపై మార్జిన్లు 1.58 శాతం నుంచి 2 శాతానికి పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) క్యూ2లో 0.1 శాతం పెరిగి 3.52 శాతానికి చేరాయి. మొండిబకాయిల సెగ... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ2లో 3.77 శాతానికి(రూ.15,858 కోట్లు) ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.12 శాతంగా(రూ.11.547 కోట్లు), ఈ ఏడాది క్యూ1లో 3.68 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 1.09 శాతం(రూ.3,942 కోట్లు) నుంచి 1.65 శాతానికి(రూ.6,759 కోట్లు) పేరుకుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో నికర ఎన్పీఏలు 1.58 శాతంగా నమోదయ్యాయి. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో మొండిబకాయిలకు ప్రొవిజన్స్ రూపంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.942 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.850 కోట్లు. ఇక క్యూ2లో కొత్తగా రూ.2,242 కోట్లు మొండిబకాయిలుగా మారాయి. పునర్వవస్థీకరణ రుణాల్లో రూ.931 కోట్ల ఎన్పీఏలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 17 శాతంగా నమోదైంది. మొత్తం రుణాల్లో రిటైల్ విభాగ రుణాలు 40 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 2 శాతం లాభపడి రూ.277 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్లను ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించగలమన్న నమ్మకం ఉంది. ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా ఖాతాదారులకు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదలాయిస్తున్నాం. డిమాండ్ మందగమనం కారణంగానే కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 7%కే పరిమితమైంది. పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 18-20 శాతం స్థాయిలో ఉండొచ్చు. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా సాధారణ బీమా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.1,550 కోట్లు. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఫెయిర్‌ఫాక్స్ వాటా 35 శాతానికి చేరనుంది. ప్రవాస భారతీయుడైన ప్రేమ్ వత్స నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు జాయింట్ వెంచర్‌గా దీన్ని ఏర్పాటు చేశాయి. దేశీ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో తాజా ఒప్పందం చోటుచేసుకుంది. ఈ డీల్ ప్రకారం ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీ విలువ రూ.17,225 కోట్లుగా లెక్కతేలినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ అనుబంధ సంస్థ ఐపీఓకు సంబంధించి తక్షణ ప్రణాళికలేవీ లేవని ఐసీఐసీఐ చీఫ్ చందాకొచర్ స్పష్టం చేశారు.